
సాక్షి, వరంగల్: విద్యుదాఘాతంతో యువకుడు మృతిచెందిన సంఘటన జనగామ జిల్లా నర్మెట మండలంలోని గండిరామారంలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నీల రాజు కుమారుడు నీల అజయ్ (17) హనుమకొండ కృష్ణవేణి కళాశాలలో ఇంటర్ మీడియట్ చదువుతున్నాడు. పండుగ సెలవులు కావడంతో గురువారం గ్రామానికి చేరుకున్నాడు. ఈక్రమంలో తమ వ్యవసాయ బావివద్ద పంటచేనులోకి వచ్చిన కోతులను వెళ్లగొట్టే క్రమంలో పక్కపొలంలోని రైతు అడవిపందుల నుంచి రక్షణకు ఏర్పాటు చేసిన విద్యుత్ తీగ తగలడంతో విద్యుదాఘాతానికిగురై మృతిచెందాడు. కాగా ఈ విషయమై ఎస్సై కన్నెబోయిన శ్రీకాంత్‌ను వివరణ కోరగా ఫిర్యాదు అందలేదని ఆయన తెలిపారు.