Dead
-
ఎంజాయ్ చేద్దామని గోవా వెళ్లి.. శవమై తిరిగొచ్చిన ఏపీ యువకుడు
గోవా: న్యూఇయర్‌లో విషాదం చోటు చేసుకుంది. గోవాలో ఏపీ టూరిస్ట్ హత్యకు గురి కావడం సంచలనంగా మారింది. మంగళవారం అర్థరాత్రి ఒంటిగంట సమయంలో ఫుడ్ ఆర్డర్ విషయంలో టూరిస్ట్‌లకు గోవా బీచ్‌లోని ఓ రెస్టారెంట్ సిబ్బందికి వాగ్వాదం జరిగింది. ఈ ఘర్షణలో ఏపీకి చెందిన బొల్లా రవితేజ హత్యకు గురయ్యాడు. మృతుడు పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లికి చెందిన బొల్లా రవితేజగా గోవా పోలీసులు గుర్తించారు. ఈ దుర్ఘటనలో నలుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు గోవా డీఐజీ వర్షా శర్మ తెలిపారు.బీచ్ షాక్ యజమాని బీచ్ షాక్ యజమాని అగ్నెల్ సిల్వేరా,అతడి కుమారుడు షుబర్ట్ సిల్వేరియాతో పాటు సిబ్బంది అనిల్ బిస్టా, సమల్ సునర్‌లను అరెస్ట్ చేసినట్లు డీఐజీ వెల్లడించారు. గోవాలోని ప్రముఖ కలంగుట్ బీచ్‌లో మరీనా బీచ్ షాక్ అనే రెస్టారెంట్ ఉంది. నిన్న రాత్రి ఒంటి గంటకు ఆ రెస్టారెంట్‌కు అర్థరాత్రి వచ్చిన రవితేజ, అతని స్నేహితుడు హైదరాబాద్‌కు చెందిన స్పందన్ బొల్లు ఫుడ్ ఆర్డర్ ఇచ్చారు. అయితే బీచ్ షాక్ రెస్టారెంట్ యజమాని సిల్వేరా.. రవితేజ, అతని స్నేహితుడి నుంచి ఉన్న ధర కంటే ఎక్కువ మొత్తం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఉన్న బిల్లుపై ఎక్కువ మొత్తం ఇవ్వాలంటే సాధ్యం కాదని చెప్పే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో రెస్టారెంట్లో పనిచేస్తున్న ఓ వ్యక్తి రవితేజపై దాడి చేశాడు. అలా ఫుడ్ ఆర్డర్ ఇవ్వడంలో చోటు చేసుకున్న వివాదం హింసాత్మకంగా మారింది. నిందితులు టూరిస్ట్ తేజపై వెదురు కర్రలతో తలపై మోదారు. ఆపై శరీర భాగాలపై దాడి చేశారు. తీవ్ర గాయాలతో, నిందితులు కొట్టిన దెబ్బలకు తాళలేక బాధితుడు తేజ మరణించినట్లు పేర్కొన్నారు.కాగా, గోవాలో గత కొద్ది రోజుల్లో ముగ్గురు టూరిస్ట్‌లు మరణించారు. అంతకుముందు నవంబర్‌లో ఢిల్లీ టూరిస్ట్ డ్యాన్స్ మ్యూజిక్ ఫెస్టివల్లో మరణించాడు. క్రిస్మస్ రోజు మహరాష్ట్రకు చెందిన టూరిస్ట్ బోట్ బోల్తా పడి మరణించాడు. -
అంతర్జాతీయ మోడల్ హఠాన్మరణం..
అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ మోడల్ డేల్ హడన్(Dayle Haddon(76)) అనూహ్యంగా మృతి చెందారు. తన ఇంటిలోని మొదటి అంతస్తులో అచేతనంగా కనిపించారు. సమాచారం అందుకున్న పోలీసుల హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలిని ఆస్పత్రి తరలించారు. కానీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు దృవీకరించారు. అయితే మోడల్ మరణం అనుమానాస్పదం లేక హత్యా అనే అనుమానం రేకెత్తించింది. అయితే పోలీసుల విచారణలో విషపూరిత కార్బన్ మోనాక్స్డ్ని పీల్చడం వల్లే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిందని భావిస్తున్నారు. ఎందుకంటే ఆమె ఇంటిలోని బాయిలర్ హీటింగ్ యూనిట్లో లోపాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ హీటింగ్ యూనిట్ కార్బన్ మోనాక్సైడ్ వాయువు(Carbon Monoxide)కి మూలం. కావున ఈ యూనిట్ లీకేజ్ లోపం కారణంగానే ఈ కెనడా మోడల్(Canadian Model) మరణించినట్లుగా భావిస్తున్నారు పోలీసులు. అలాగే అగ్నిమాపక కంపెనీ నమోదు చేసిన రీడింగ్‌లో ఆ ఇంటిలో కార్బన్ మోనాక్స్డ్ వాయువు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. మాంట్రియల్లో పుట్టి పెరిగిన డేల్ హడన్కి ఇంగ్లిష్, ఫ్రెంచ్ భాషల్లో మంచి నిష్ణాతురాలు.తొలుత బ్యాలెట్(డ్యాన్సర్‌గా) ఈ వృత్తిని కొనసాగించింది. ఆ తర్వాత రెవ్లాన్, ఎస్టీ లాడర్, క్లైరోల్ మరియు మాక్స్ ఫ్యాక్టర్ వంటి ప్రతిష్టాత్మకమైన కంపెనీలకు మోడల్‌గా పనిచేసింది. అంతేగాదు వోగ్ మేగజైన్ కవర్పేజ్లో ఆమె ముఖం చిత్రం ప్రచురితమైంది. అలా ఆమె సూపర్ మోడల్ అనే పేరుని సుస్థిర పరుచుకుంది. అంతేగాదు 15 ఏళ్లకు పైగా లోరియల్(L'Or'eal) అనే కాస్మెటిక్ కంపెనీకి ప్రతినిధిగా పనిచేసింది. అలాగే యూనిసెఫ్‌కు అంబాసిడర్‌గా బాలికలు, మహిళల విద్య కోసం కృషి చేశారు. అందుకోసం స్వచ్ఛంద సంస్థ విమెన్వన్ని స్థాపించి మహిళలకు మంచి విద్య అందేలా చూశారామె. కేవలం అందంతోనే గాక దయ, మానవత్వం వంటి సేవా కార్యక్రమాలతో మరింత మంది అభిమానులను సంపాదించుకుంది డేల్. తన తల్లి జ్ఞాపకాలను తలుచుకుంటూ కుమార్తె ర్యాన్ నివాళులర్పించారు. కాగా కుమార్తె కుమార్తె ర్యాన్ హాడన్ జర్నలిస్ట్, అల్లుడు పెన్సిల్వేనియా ఇల్లు బ్లూకాస్ హాల్‌మార్క్ నటుడు.(చదవండి: వనితదే చరిత) -
గురువులకు నిర్బంధ శిక్షణా?
సాక్షి, అమరావతి/నూజివీడు/నూజివీడు, ఆగిరిపల్లి: నాయకత్వ లక్షణాల అభివృద్ధిపై ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు నిర్వహిస్తున్న శిక్షణ తరగతుల్లో హెచ్ఎం టి.వి.రత్నకుమార్ (55) గుండెపోటుతో మృతి చెందిన ఘటన ఏలూరు జిల్లా, ఆగిరిపల్లి మండలం, తోటపలి్లలోని హీల్ ప్యారడైజ్ స్కూల్లో బుధవారం చోటుచేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా, ఉండి మండలం, ఉణుదుర్రు హైసూ్కల్ ఇన్చార్జి హెచ్ఎంగా పనిచేస్తున్న రత్నకుమార్ ఈనెల 4వ తేదీ నుంచి ఇక్కడ శిక్షణ తరగతుల్లో పాల్గొంటున్నారు.బుధవారం వేకువజామున రత్నకుమార్‌కు గుండెపోటు రాగా, తోటి ఉపాధ్యాయులు గన్నవరంలోని ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలోనే మృతి చెందారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. భార్య ఇంగ్లిష్ టీచర్‌గా పనిచేస్తున్నారు. మృతుడి స్వగ్రామం గణపవరం మండలం, కేశవరం కాగా భౌతికకాయాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లారు. రత్నకుమార్ ఆకస్మిక మృతితో సమగ్ర శిక్ష, అదనపు స్పెషల్ ప్రాజెక్టు డైరెక్టర్ (ఏఎస్పీడీ) కేవీ శ్రీనివాసులరెడ్డి, సీమ్యాట్ డైరెక్టర్ మస్తానయ్య, హెచ్ఎంలు, ఉపాధ్యాయ సంఘాల నాయకులతో చర్చించి శిక్షణ తరగతులను రద్దు చేశారు. కాగా ఈనెల 4న ప్రారంభమైన ఈ శిక్షణ తరగతులు 9వ తేదీతో ముగియనున్నాయి. ఆగిరిపల్లిలో ప్రధానోపాధ్యాయుల ఆందోళనటీవీ రత్నకుమార్ మృతికి నిరసనగా హెచ్ఎంలు బుధవారం ఉదయం హీల్ ప్యారడైజ్ స్కూల్ వద్ద ఆందోళనకు దిగారు. ఈ ఆందోళన మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగింది. తీవ్రమైన ఒత్తిడి, భయం, ఆందోళన, సమయానికి అందని వైద్యసాయం వల్లే రత్నకుమార్ మృతి చెందారని హెచ్ఎంలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు రోజులుగా ఉదయం 5.30 నుంచి రాత్రి 7 గంటల వరకూ నిర్విరామంగా, నిర్బంధంగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారని వాపోయారు. 200 మందికి పైగా హెచ్ఎంలు శిక్షణ పొందుతుంటే కనీసం వైద్య సదుపాయాలు కూడా కల్పించకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్ఎం మృతికి కారణమైన అధికారులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం కంటే టీడీపీ కూటమి ప్రభుత్వంలో మరిన్ని యాప్‌లు ఎక్కువయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. నిర్బంధ శిక్షణ నిలిపివేయాలి: ఉపాధ్యాయ సంఘాల డిమాండ్కనీస మౌలిక వసతులు లేకుండా శిక్షణల పేరిట ఉపాధ్యాయుల ప్రాణాలతో చెలగాటమాడొద్దని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వానికి హితవు పలికాయి. హెచ్ఎం రత్నకుమార్ మృతిపై ఉపాధ్యాయ సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి. నిర్బంధ శిక్షణలతో ఉపాధ్యాయులను ప్రభుత్వం శిక్షిస్తోందని షెడ్యూల్డ్ ట్రైబ్స్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జి.సుధాకర్, కార్యదర్శి కె. కుమార్ ఒక ప్రకటనలో మండిపడ్డారు. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేస్తామని, జీవో 117 రద్దు చేస్తామని ఉపాధ్యాయులను నమ్మించి, మోసగించారని బహుజన టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బి. మనోజ్‌కుమార్ తెలిపారు. రత్నకుమార్ మృతిని తమను కలచి వేసిందని ఏపీ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ (ఆప్టా) రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ రావు వెల్లడించారు. కుంటి సాకులతో నిర్లక్ష్యపూరితంగా శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారని ఏపీ ఉపాధ్యాయ సంఘం (ఆపస్) విమర్శించింది. విశ్రాంతి లేని పని ఒత్తిడి కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుందని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసాద్ స్పష్టం చేశారు. ఆగిరిపల్లి శిక్షణ కేంద్రంలో కనీస వైద్య సౌకర్యం కూడా లేదని ఫ్యాప్టో చైర్మన్ ఎల్. సాయి శ్రీనివాస్ తెలిపారు. -
బ్యాటరీలు, బ్లేడ్లు సహా పొట్టలో 56 వస్తువులు
హథ్రాస్(యూపీ): వాచీ బ్యాటరీలు, బ్లేడ్లు, మేకులు ఇలా ఇంట్లో కనిపించే చిన్నపాటి వస్తువులన్నీ 15 ఏళ్ల బాలుడి కడుపులో కనిపించేసరికి ఢిల్లీ సఫ్దర్‌జంగ్ ఆస్పత్రి వైద్యులు అవాక్కయ్యారు. వెంటనే పెద్ద శస్త్రచికిత్స చేసి అన్నింటినీ బయటకు తీశారు. అయితే ఆ తర్వాతి రోజు బాలుడి గుండెవేగం విపరీతంగా పెరిగి, రక్తపోటు తగ్గి అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయారు. వివరాలను బాలుడి తండ్రి సంచిత్ శర్మ మీడియాతో చెబుతూ వాపోయారు. ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రాస్ పట్టణంలోని రత్నగర్భ కాలనీలో సంచిత్ కుటుంబం ఉంటోంది. అతనికి 9వ తరగతి చదివే 15 ఏళ్ల కుమారుడు ఆదిత్య శర్మ ఉన్నాడు. గత కొద్ది రోజులుగా కడుపు నొప్పితో బాధపడుతుండటంతో హాథ్రాస్ ఆస్పత్రిలో చూపించారు. తర్వాత జైపూర్ ఆస్పత్రిలో చూపించారు. కొద్దిరోజుల ట్రీట్మెంట్ తర్వాత ఇంటికొచి్చనా రోగం మళ్లీ తిరగబెట్టింది. తర్వాత అలీగఢ్‌లో శ్వాససంబంధ సర్జరీ తర్వాత కూడా ఎలాంటి మార్పు రాలేదు. తర్వాత అక్టోబర్ 26న అలీగఢ్‌లో అ్రల్టాసౌండ్ పరీక్ష చేయగా 19 చిన్నపాటి వస్తువులు కడుపులో ఉన్నట్లు గుర్తించారు. నోయిడాలో చికిత్స చేయించుకోవాలని వైద్యులు సూచించారు. నోయిడా వైద్యుల పరీక్షలో 56 వస్తువులు ఉన్నట్లు బయటపడింది. తర్వాత ఢిల్లీలోని సఫ్డర్‌జంగ్ ఆస్పత్రిలో అక్టోబర్ 27న టీనేజర్‌కు శస్త్రచికిత్స చేసి అన్నింటినీ బయటకుతీశారు. ఇన్ని వస్తువులు తెలీసో తెలీకో మింగినా నోటికిగానీ, గొంతుకుగానీ ఎలాంటి గాయలు లేకపోవడం చూసి వైద్యులు ఆశ్చర్యం వ్యక్తంచేశారు. సర్జరీ చేసిన ఒక రోజు తర్వాత టీనేజర్ మరణంపై ఆస్పత్రి వర్గాలు ఎలాంటి వివరణ ఇవ్వలేదు. -
చనిపోయినా.. చచ్చేంత సంపాదన
చచ్చీచెడీ సంపాదించాననే మాట వినే ఉంటారు. కానీ నిజంగానే చనిపోయినా వందల కోట్ల రూపాయల్లో సంపాదిస్తున్నవారు ఎందరో ఉన్నారు? సాధారణంగా మ్యుజీషియన్లు, సింగర్లు, రైటర్లకు వారి పాటలను, రచనలను వాడుతున్నవారు రాయల్టీగా కొంత సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది. సృష్టించినవారు చనిపోయినా.. వారి పేరిట రాయల్టీ వసూలై వారసులకు అందుతూనే ఉంటుంది. మరి ఇలా ‘చనిపోయినా’ అత్యధి కంగా సంపాదిస్తున్నవారు ఎవరో తెలుసా?టాప్ మైఖేల్ జాక్సన్ఫోర్బ్స్ '2024లో అత్యధిక పారితోషికం పొందిన డెడ్ సెలబ్రిటీల' జాబితా ప్రకారం.. మైఖేల్ జాక్సన్ గత ఏడాది రాయల్టీల ద్వారా 600 మిలియన్ డాలర్లు (సుమారు రూ.5,044 కోట్లు) సంపాదించాడు. రూ.2,102 కోట్లతో సింగర్, రైటర్ ఫ్రడ్డీ మెర్క్యూరీ, రూ.630 కోట్లతో రైటర్ డాక్టర్ సియస్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. -
కంటతడి పెట్టిస్తున్న అమ్మ ప్రేమ.. తెగిపడిన కుమారుడి తలను ఒడిలో పెట్టుకుని లాలిస్తూ.. రోదిస్తూ
లక్నో: అయ్యో బిడ్డా.. అప్పుడే నీకు నూరేళ్లు నిండాయా! ఉన్నతంగా చదువుకుని నన్ను, మీ నాయనను మంచిగా చూసుకుంటావని చెబితవిగా ..అప్పుడే ఇంత పనైందేంది బిడ్డా అంటూ.. అల్లంతా దూరాన మొండం.. పక్కనే తెగి పడిన కుమారుడి తలను ఒడిలోకి తీసుకుని లాలిస్తూ.. రోదిస్తున్న తీరు చూసి చూపరులు కన్నీటి పర్యంతమయ్యారు.ఉత్తరప్రదేశ్‌లో భూ తగాదా ఓ 17 ఏళ్ల అనురాగ్‌ను బలి తీసుకున్నాయి. రెండు వర్గాల మధ్య జరిగిన భూ తగాదాలో ఓ వర్గం ప్రత్యర్థి వర్గానికి చెందిన బాలుడిని తలను నరకడంతో భయానక వాతావరణం నెలకొంది.గౌరబాద్‌షాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కబీరుద్దీన్ గ్రామంలో రెండు వర్గాల మధ్య భూతగాదా కొన్నేళ్లుగా కొనసాగుతూ వస్తుంది. తాజాగా, బుధవారం రోజు ఘర్షణ హింసాత్మకంగా మారింది. భూ తగాదాలో రామ్ జీత్ యాదవ్ కుటుంబం సభ్యులపై ప్రత్యర్థి వర్గం దాడులకు తెగబడింది. ఈ దాడులు జరిగే సమయంలో ప్రత్యర్థులు మారణాయుధాలతో రామ్ జీత్ కుమారుడు అనురాగ్ వెంటబడ్డారు.నిందితుల్లో ఓ వ్యక్తి అనురాగ్ తలను పదునైన కత్తి నరికాడు. దీంతో అతడి తల, మొండెం వేరయ్యాయి. అనంతరం నిందితుడు పరారయ్యాడు. అయితే కుమారుడి మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. కొన్ని గంటల పాటు కుమారుడి తలను ఒడిలోకి తీసుకొని గుండెలవిసేలా రోదిస్తున్న తల్లిని చూసేవారి కళ్ళు కూడా చెమర్చాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దారుణానికి ఒడిగట్టిన నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. -
కంగువ ఎడిటర్ నిషాద్ హఠాన్మరణం
సూర్య హీరోగా నటించిన తాజా చిత్రం ‘కంగువ’కి ఎడిటర్‌గా చేసిన నిషాద్ యూసుఫ్ (43) ఆకస్మిక మృతి చెందారు. నిషాద్ స్వస్థలం కేరళలోని చంగనస్సేరి. తన భార్య, పిల్లలతో కలిసి కొచ్చిలోని పనంపిల్లి నగర్లో నివాసం ఉంటున్నారు. స్వగృహంలో బుధవారం తెల్లవారుజామున ఆయన విగత జీవిగా కనిపించారు.ఇక నిషాద్ ఆత్మహత్యకు పాల్పడ్డారా? ఆర్థిక సమస్యలా? కుటుంబ కలహాలా? ఎవరైనా గిట్టని వారు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ‘చావెర్, ఉండా, తల్లుమాలా, సౌదీ వెళ్లాక, వన్, ఆపరేషన్ జావా’ వంటి పలు సినిమాలకు ఎడిటర్‌గా చేశారు నిషాద్. ఆయన పని చేసిన చివరి చిత్రాలు ముమ్మట్టి నటించిన ‘బజూక’, సూర్య నటించిన ‘కంగువ’ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. -
Russia-Ukraine war: రష్యా నిర్బంధంలో ఉన్న ఉక్రెయిన్ జర్నలిస్టు మృతి
కీవ్: రష్యాలో నిర్బంధంలో ఉన్న ఉక్రెయిన్ జర్నలిస్ట్ 27 ఏళ్ల విక్టోరియా రోషినా మృతి చెందారు. సెప్టెంబర్ 19న రోషినా మరణించినట్లు రష్యా గురువారం ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. రష్యా ఆక్రమిత ఉక్రెయిన్‌లో జీవితం గురించి ప్రత్యక్ష కథనాలు రాసిన విక్టోరియా.. గత ఏడాది ఆగస్టులో ఉక్రెయిన్‌లోని రష్యా ఆక్రమిత ప్రాంతాలకు రిపోర్టింగ్‌కు వెళ్లారు. ఆ తరువాత ఆమె కనిపించకుండా పోయింది. ఆమె కుటుంబం, ఉక్రెయిన్ అధికారులు, జర్నలిస్టుల హక్కుల సంస్థ ఆర్ఎస్ఎఫ్ పదేపదే అభ్యర్థించినా రష్యా అధికారులు ఆమె నిర్బంధం గురించి ఎటువంటి సమాచారాన్ని అందించలేదు. చివరకు విక్టోరియా తమ కస్టడీలో ఉందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ మే నెలలో ఆమె తండ్రికి రాసిన లేఖలో అంగీకరించింది. విక్టోరియా మరణానికి సంబంధించిన సమాచారం ధృవీకరించినట్లు ఉక్రెయిన్ యుద్ధ ఖైదీల సమన్వయ ప్రధాన కార్యాలయం ప్రతినిధి పెట్రో యాట్సెంకో చెప్పారు. ఆమె ఎలా చనిపోయిందనే దానిపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు. 2014లో ఉక్రెయిన్ నుండి రష్యా స్వాధీనం చేసుకున్న క్రిమియాలో, అలాగే రష్యా నిధులతో వేర్పాటువాదులు స్వాధీనం చేసుకున్న తూర్పు ఉక్రెయిన్ ప్రాంతాల్లో జీవితం గురించి విక్టోరియా అనేక కథనాలను రాశారు. 2022 ఫిబ్రవరిలో మాస్కో పూర్తి స్థాయి ఆక్రమణను ప్రారంభించిన తరువాత ఆమె పలు కథనాలు డాక్యుమెంట్ చేశారు. దేశం యుద్ధం ప్రారంభించిన కొద్దికాలానికే రష్యన్లు ఆమెను మొదట 10 రోజుల పాటు నిర్బంధించారు. ఆ తరువాత వదిలిపెట్టారు. 2022లో ఆమెకు ఇంటర్నేషనల్ ఉమెన్స్ మీడియా ఫౌండేషన్ ‘కరేజ్ ఇన్ జర్నలిజం’ అవార్డు ఇచ్చి సత్కరించింది. -
చనిపోయిన భార్యపై ప్రేమతో..
బ్రహ్మపూర్: భార్యాభర్తల బంధం విడదీయరానిదని అంటారు. ఆలుమగలులో ఏ ఒక్కరు దూరమైనా మరొకరు విలవిలలాడిపోతారు. ఒంటరితనానికి లోనవుతుంటారు. అయితే ఒడిశాలోని బ్రహ్మపూర్‌కు చెందిన ఓ భర్త తన భార్య చనిపోయాక, ఆమెను మరచిపోలేక చేసిన పనిని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.దక్షిణ ఒడిశాలోని బ్రహ్మపూర్‌లో ప్రశాంత్ నాయక్(52) అనే వ్యాపారవేత్త భార్య కిరణ్ కరోనా కాలంలో మరణించారు. వారిద్దరికీ 1997లో వివాహం జరిగింది. వారికి ముగ్గురు సంతానం. ప్రశాంత్ తన భార్య దూరమవడాన్ని జీర్ణించుకోలేక పోయాడు. దీంతో ఆయన సిలికాన్ మెటీరియల్‌తో భార్య విగ్రహాన్ని తయారు చేయించాడు. దానిని తన డ్రాయింగ్ రూమ్‌లో ఉంచాడు. ప్రశాంత్ తన పెద్ద కూతురు వివాహం సందర్భంగా ఆ సిలికాన్ విగ్రహానికి చీర, నగలు ధరింపజేశాడు.ప్రశాంత్ కుమార్తె మెహక్ తన తల్లి విగ్రహాన్ని ఎంతో అపురూపంగా చూసుకుంటుంది. ప్రతీరోజూ ఆ విగ్రహానికి చీరలు, నగలు మారుస్తుంటుంది. మెహక్ ప్రస్తుతం ఎంబీఏ చదువుతోంది. ఈ విగ్రహాన్ని చూసినప్పుడల్లా తన భార్య తనతోనే ఉన్నట్లు అనిపిస్తుందని ప్రశాంత్ తెలిపారు. ఇంట్లో అమ్మ విగ్రహం ఏర్పాటు చేయాలని తన పిల్లలు కోరారని ప్రశాంత్ పేర్కొన్నారు.బెంగళూరుకు చెందిన శిల్పి ఫైబర్, రబ్బరు, సిలికాన్ ఉపయోగించి ఏడాదిపాటు శ్రమించి ఈ విగ్రహాన్ని రూపొందించారు. ఇందుకోసం ప్రశాంత్ కుమార్ ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చు చేశారు. ఈ విగ్రహాన్ని ప్రశాంత్ తన పెద్ద కుమార్తె పెళ్లికి ముందు ఇంటికి తీసుకువచ్చారు. ఆ విగ్రహాన్ని చూసినప్పుడల్లా తమ తల్లి తమతోనే ఉన్నదనిపిస్తుందని ప్రశాంత్ పిల్లలు చెబుతుంటారు.ఇది కూడా చదవండి: Weekly Horoscope: ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే.. -
ఏఐ సాంకేతికతో అలా స్వాంతన పొందడం మంచిదేనా..?
ఏఐ సామర్థ్యం ఊహకందని విధంగా పలు రంగాల్లో తన హవా చాటుతూ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ముఖ్యంగా మనకెంతో ఇష్టమైన వారు ప్రమాదవశాత్తు దూరమయ్యితే ఆ బాధను దిగమింగడం అంత ఈజీ కాదు. అలాంటి వాటిలో చక్కటి ఉపశమనం కలిగిస్తోంది ఏఐ సాంకేతికత. అలాంటి వాటికి సంబంధించిన ఇటీవల్ల కొన్ని భావోద్వేగ కథలను విన్నాం. అయితే ఇలా సాంకేతికతో స్వాంతన, ఉపశమనం పొందడం ఎంతవరు సరైనది. ఎన్నటికీ వాస్తవాన్ని అంగీకరించక తప్పదు గదా..!. దీని కారణంగా వాస్తవికతకు దూరమయ్యే పరిస్థితి ఎదురవ్వుతుందా..? నిపుణులు ఏమంటున్నారంటే..జస్టిన్ హారిసన్ అనే టెక్ వ్యవస్థాపకుడు తన తల్లి ఇంకొద్ది రోజుల్లో దూరమైపోతుందని తెలిసి తల్లిడిల్లిపోతాడు. దీంతో ఆమె గుర్తులు, జ్ఞాపకాలు తనను వీడిపోకుండా ఉండేలా ఏఐ సాంకేతికతో అమ్మ వాయిస్‌ని క్రియేట్ చేసుకున్నాడు. అతడు ఆమె బతికున్న రోజుల్లోనే ఈ పనికి ఉపక్రమించాడు. ఆ తర్వాత ఆమె కొన్నాళ్లకే కానరాని లోకాలకు వెళ్లిపోవడం అన్ని చకచక జరిగిపోయాయి. అయితే జస్టిన్ మాత్రం తన ఏఐ సామర్థ్యంతో రూపొందించిన తన తల్లి వాయిస్‌తో స్వాంతన పొందుతుంటాడు. తనతోనే తల్లి ఉందన్న భరోసాతో జీవితాన్ని గడుపుతున్నాడు. వ్యాపకం వచ్చినప్పుడల్లా ఆమె వాయిస్ రికార్డుతో కూడిన ఏఐ సాంకేతికతో తల్లితో మాట్లాడిన అనుభూతిని పొందుతుంటాడు. అంతేగాదు సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని షేర్ చేసుకున్నాడు కూడా. ఇది నిజంగా ప్రియమైన వారిని కోల్పోయిన బాధలో ఉన్నవారికి ఓ వరం అంటూ ఆ సాంకేతికతపై పొగడ్తల వర్షం కురిపించాడు. అయితే మానసిక నిపుణుడు రుచి రుహ్ మాత్రం ప్రారంభ దశలో ఈ సాంకేతికత ఉపశమనంగా అనిపించినా రాను రాను వాస్తవికతలో ఉండేందుకు మెదడు అంగీకరించకపోవచ్చు లేదా ఇష్టపడకపోయే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు. నిజానికి దుఃఖం మనిషిని బలవంతుడిగా మారిస్తే..ఈ సాంకేతికతో లభించిన భరోసా..వాస్తవికతకు దూరం చేస్తుంది, ధైర్యాన్ని కోల్పోయేలా చేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ సాంకేతిక డిప్రెషన్లోకి వెళ్లిపోయిన వాళ్లను మాములు మనుషులు చేసేందుకు వినియోగించి ఓ వ్యక్తి జీవితాన్ని మెరుగ్గా ఉండేలా చెయ్యొచ్చు. కానీ దీనిమీదే ఆధారపడిపోయేలా మాత్రం తయారు కాకూడదని చెబుతున్నారు. చెప్పాలంటే.. ఇష్టమైన వారిని కోల్పోయిన బాధ కొన్నాళ్లకి తగ్గి సాధారణ మనుషులుగా సహజసిద్దంగానే మారిపోవాలి. ఇది ప్రకృతి ధర్మం.ఏనాటికైనా అందరూ చనిపోవాల్సిన వాళ్లే అనే సత్యాన్నికి కట్టుబడి ఉండేలా సహజసిద్ధంగా మనసు సిద్ధమవుతుంది. అందువల్లే పూర్వం వాళ్లు ముక్కుపచ్చలారని పసివాళ్లు దూరమైనా..బాధను దిగమింగి మరీ ధైర్యంగా బతుకును సాగించేవారు. సాంకేతికత పుణ్యమా అని ప్రాణాలు అల్పమైపోయాయి. చిన్న బాధను కూడా తట్టుకోలేని సున్నిత మనస్కులుగా, అల్పమైన జీవులుగా మారిపోతున్నాం. సెన్సిటివిటీ కంటే మానసికంగా స్ట్రాంగ్‌గా ఉండేలా మనిషి మారితేనా అన్ని విధాల శ్రేయస్కరమని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.(చదవండి: గుండెకు ముప్పు రాకూడదంటే ఈ పరీక్షలు తప్పనిసరి..) -
నేపాల్‌లో వరద బీభత్సం.. 112 మంది మృతి
ఖాట్మాండు: నేపాల్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేని భారీ వర్షాల కారణంగా వరదలకు ఇప్పటివరకు 112 మంది మృతి చెందినట్లు నేపాల్ ప్రభుత్వం తెలిపింది. ఇదే సమయంలో వందల సంఖ్యలో ప్రజలు గాయపడగా దాదాపు 68 గల్లంతు అయినట్టు సమాచారం.నేపాల్‌లో గత కొన్ని రోజులుగా వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా చాలా ప్రాంతాల్లో ఇళ్లు నీట మునిగిపోయాయి. దీంతో అక్కడి జనజీవనం స్తంభించింది. వరద బాధితులను సహాయక దళాలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరోవైపు.. నేపాల్ వరదల ప్రభావం బీహార్‌పై పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడ నుంచి కొన్ని నదులు బీహార్‌లోకి ప్రవహిస్తాయి. ఆ నదులకు వచ్చే ఆకస్మిక వరదలు రాష్ట్రంలోని పలు ప్రాంతాలను ముంచెత్తే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో అధికారులు సన్నద్ధమవుతున్నారు. September 27, 2024Kathmandu, NepalFloods and landslides in Nepal continue to claim lives, 66 dead and dozens missing have been reported so far. Heavy rains caused catastrophic consequences in the Kathmandu Valley and other regions of the country, destroying roads pic.twitter.com/M3xgvgwQ97— Creative Society India (@CreativeSoIndia) September 29, 2024 #BREAKING: Nepal has reported 112 deaths due to flooding, landslides, and road closures due to persistent downpours, with 69 missing and 60 injured.#NepalFloods #Kathmandu #Flood #Nepal pic.twitter.com/fvm6nWiCei— JUST IN | World (@justinbroadcast) September 29, 2024 Happening now at Medicity hospital, Be safe. pic.twitter.com/o22qMm4B3A— संजय तिमिल्सिना (@sanjayabkt) September 28, 2024ఇక, నేపాల్‌లో శనివారం రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. 54 సంవత్సరాల తర్వాత కేవలం 24 గంటల సమయంలోనే 323 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షం కారణంగా కొండచరియలు విరిగిపడటంతో పలువురు మృతిచెందారు. వరద నీటిలో చిక్కుకున్న వారిని హెలికాప్టర్లు, బోట్ల సాయంలో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. #BREAKING #NEPAL #KATHMANDU🔴 NEPAL : 📹 SEVERE FLOODING IN NEPAL DUE TO INCESSANT MONSOON RAINS Nepal floods and landslides killed at least 66 people, 69 missing. Capital City of Kathmandu is mostly affected.-Reuters#Ultimahora #Flooding #Inundación #Inondation pic.twitter.com/YHLMtYGWbM— LW World News 🌍 (@LoveWorld_Peopl) September 28, 2024ఇది కూడా చదవండి: నస్రల్లా మృతిపై జో బైడెన్ సంచలన కామెంట్స్ -
Uttar Pradesh: మెట్రో స్టేషన్ వద్ద కాల్పులు.. యువకుని మృతి
నోయిడా: యూపీలోని నోయిడాలో దారుణం చోటుచేసుకుంది. సెక్టార్ 137 మెట్రో స్టేషన్ దిగువన ఒక యువకునిపై కాల్పులు జరిగాయి. ఈ ఘటనతో ఈ ప్రాంతంలో కలకలం చెలరేగింది. నిందితులను పట్టుకునేందుకు ఆరు పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.మీడియాకు అందిన వివరాల ప్రకారం నోయిడా సెక్టార్ 137 మెట్రో స్టేషన్ దిగువన ఉన్న ఫుడ్ కోర్టులో ఒక యువకునిపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన యువకుడిని ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు అతనిని పరీక్షించి, అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. మృతుడిని నవేంద్ర కుమార్ ఝాగా పోలీసులు గుర్తించారు.ఆస్తి తగాదాలే ఈ హత్యకు కారణమై ఉండవచ్చని పోలీసు అధికారులు చెబుతున్నారు. నిందితులను పట్టుకునేందుకు ఆరు బృందాలను ఏర్పాటు చేశామని, వారిని త్వరలోనే పట్టుకుంటామన్నారు. ఈ ఘటన గురించి అదనపు సీపీ శివ హరి మీనా మాట్లాడుతూ ఆస్తి విషయంలో ఇరువర్గాల మధ్య వివాదం నడుస్తోందని, ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు ఇరువర్గాలు మెట్రో స్టేషన్ 137 కింద సమావేశమయ్యాయన్నారు. అయితే ఇంతలోనే ఒక వర్గానికి చెందిన వారు నవేంద్ర కుమార్ ఝాపై కాల్పులు జరిపారన్నారు.బుల్లెట్ నవేంద్ర తలకు తగిలిందని, ఆసుపత్రిలో చేర్పించాక అక్కడ మృతి చెందాడన్నారు. నవేంద్ర మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కాల్పులు జరిపినవారిని గుర్తించామని, ఇరువర్గాలు వారు ఘజియాబాద్‌కు చెందినవారని పోలీసులు తెలిపారు. సెక్టార్ 82లోని ఆస్తి విషయంలో వీరి మధ్య వివాదం నడుస్తోందన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: విదేశీయుల్లా ఉన్నారంటూ బాలికలకు వేధింపులు -
నైజీరియాలో పడవ బోల్తా.. 41 మంది మృతి
అబుజా: నైజీరియాలోని జంఫారాలో పడవ బోల్తా పడిన ఘటనలో 41 మంది మృతిచెందారు. మరో 12 మందిని రెస్క్యూ సిబ్బంది రక్షించారు. నైజీరియాలోని ఫెడరల్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లోని గుమ్మి-బుక్కుయుమ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న జాతీయ శాసనసభ్యుడు సులేమాన్ గుమ్మి ఈ విషయాన్నితెలియజేశారు. ప్రమాదం జరిగిన సమయంలో పడవలో 50 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారన్నారు. జాంఫారాలోని గుమ్మి పట్టణ సమీపంలోని నదిలో పడవ బోల్తా పడిందని ఆయన తెలిపారు.ప్రయాణికులు రోజూ పడవను తీసుకుని సమీప ప్రాంతంలోని తమ పొలాలకు వెళ్లేవారని గుమ్మి చెప్పారు. వార్తా సంస్థ జిన్హువా తెలిపిన వివరాల ప్రకారం సమాచారం అందిన వెంటనే అధికారులు రెస్క్యూ సిబ్బందిని సంఘటనా స్థలానికి పంపారు. వారు 12 మంది సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. జంఫారా స్టేట్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ ప్రతినిధి హసన్ దౌరా మీడియాతో మాట్లాడుతూ బాధితుల్లో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు ఉన్నారన్నారు.జంఫారా ప్రావిన్స్‌లో రైతులు తమ భూముల దగ్గరకు పడవలో వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని అధ్యక్షుడు బోలా టినుబు తెలిపారు. బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రమాదాన్ని అంచనా వేయడానికి అత్యవసర ఏజెన్సీలను ఆదేశించారు. కాగా పశ్చిమ ఆఫ్రికా దేశంలో పడవ బోల్తా ప్రమాదాలు తరచుగా జరుగుతుంటాయి. ఓవర్లోడింగ్, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, ఇతర లోపాలు మొదలైనవి ప్రమాదాలకు కారణాలవుతుంటాయని తెలుస్తోంది.ఇది కూడా చదవండి: జలమార్గాన ప్రపంచయానం -
పాలలో విషమిచ్చి.. 13 మంది హత్య
కరాచీ: పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో దారుణం చోటుచేసుకుంది. భూవివాదాల కారణంగా ఒకే కుటుంబానికి చెందిన 13 మందికి పాలలో విషమిచ్చి హత్య చేసిన ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఉదంతానికి సంబంధించిన వివరాలను పోలీసులు మీడియాకు తెలియజేశారు. ఖైర్పూర్ సమీపంలోని హైబత్ ఖాన్ బ్రోహి గ్రామంలో ఆగస్టు 19న ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.మృతులను గుల్ బేగ్ బ్రోహి, అతని భార్య, ఐదుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు, మరో ముగ్గురు బంధువులుగా పోలీసులు గుర్తించారు. కుటుంబ పెద్దకు కొందరితో భూవివాదం ఉన్నదని పోలీసుల దర్యాప్తులో తేలింది. సకూర్‌లోని కెమికల్ లేబొరేటరీలో నిర్వహించిన పరీక్షల్లో కుటుంబ సభ్యులు మృతిచెందిన రోజు తాగిన పాలలో విషపూరిత పదార్థాలు ఉన్నట్లు వెల్లడయ్యిందని పోలీసులు తెలిపారు. వారి మృతదేహాల్లో విషపదార్థాలు ఉన్నట్లు కూడా నివేదికలో నిర్ధారణ అయ్యిందన్నారు.ఖైర్పూర్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్ఎస్పి) డాక్టర్ సమీవుల్లా సూమ్రో మాట్లాడుతూ పోలీసులు ఈ కేసును అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఘటనకు బాధ్యులైనవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టేది లేదని సమీవుల్లా సూమ్రో తెలిపారు.ఇది కూడా చదవండి: Ghaziabad: పండ్ల రసాల్లో మూత్రం కలిపిన వ్యాపారి అరెస్ట్ -
బీహార్‌లో వెయ్యి దాటిన డెంగ్యూ కేసులు
పట్నా: బీహార్‌లో డెంగ్యూ వ్యాధి విస్తరిస్తూ, అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. పట్నా జిల్లాలో గత 10 రోజుల్లో డెంగ్యూ కారణంగా మొత్తం ఏడుగురు మృతిచెందారు. మీడియాకు అందిన వివరాల ప్రకారం తాజాగా మృతి చెందిన యువకుని వివరాలిలా ఉన్నాయి.పాలిగంజ్‌లోని సిగౌరి పోలీస్ స్టేషన్ పరిధిలోని 17 ఏళ్ల సంజీత్ కుమార్ కొన్ని రోజుల క్రితం డెంగ్యూ బారిన పడ్డాడు. దీంతో పీఎంసీహెచ్‌లోని డెంగ్యూ వార్డులో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా గత 24 గంటల్లో ఒక్క పట్నా జిల్లాలోనే కొత్తగా 18 మంది డెంగ్యూ వ్యాధిగ్రస్తులను గుర్తించారు. పట్నా జిల్లాలో ఇప్పటివరకు 538 మంది డెంగ్యూతో బాధపడుతున్న రోగులను గురించారు. రాష్ట్రం మొత్తం మీద చూసుకుంటే ఈ సంఖ్య వెయ్యి దాటింది. బీహార్‌లోని 11 జిల్లాలు డెంగ్యూ బారిన పడ్డాయి. డెంగ్యూ బాధితులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పట్నా తర్వాత గయలో అత్యధికంగా 70 డెంగ్యూ కేసులు నమోదయ్యయి. -
పొరపాటు తీసిన ప్రాణం.. ఇంటర్ విద్యార్ధి మృతి
హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. మూగజీవాల్ని కబేళాలకు తరలిస్తున్నారనే నెపంతో గోసంరక్షకులు ఇంటర్ విద్యార్థి అర్యన్ మిశ్రాను కాల్చి చంపారు. ఈ ఘటనలో విద్యార్ధి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితులు అనిల్ కౌశిక్, వరుణ్, కృష్ణ, ఆదేశ్, సౌరబ్‌లను అదుపులోకి తీసుకున్నారు.మూగజీవాల్ని కళేబరాలకు తరలిస్తున్న స్మగ్లర్లు రెనాల్ట్ డస్టర్, టయోటా ఫార్చూనర్ కార్లలో తిరుగుతున్నారంటూ నిందితులకు సమాచారరం అందింది. దీంతో వెంటనే అనిల్ కౌశిక్, అతని స్నేహితులు స్మగ్లర్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.సరిగ్గా అదే సమయంలో బాధితుడు ఆర్యన్ మిశ్రా,అతని స్నేహితులు శాంకీ,హర్షిత్‌లు ప్రయాణిస్తున్న డస్టర్ కారు పటేల్ చౌక్ వద్ద కనిపించింది. ఆ కారును 30కిలోమీటర్లు వెంబడించిన నిందితులు విద్యార్థిని కారు ఆపాలని బెదిరించారు. కారు ఆపకపోవడంతో నిందితులు కాల్పులు జరపగా బాధితుడు మృతి చెందాడు. అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. -
ఆ ‘రష్యన్ స్పై వేల్’ ఇక లేదు!
రష్యా గూఢచారిగా 2019 నుంచి ప్రపంచం దృష్టిని ఆకర్షించిన తెల్లని బెలుగా తిమింగలం చనిపోయింది. హవాల్దిమిర్‌గా పేరున్న ఈ తిమింగలం కళేబరం దక్షిణ నార్వేలోని రిజావికా బే వద్ద నీటిపై తేలియాడుతూ శనివారం స్థానికుల కంటబడింది. 14 అడుగుల పొడవు, 1,225 కిలోల బరువున్న హవాల్దిమిర్ కళేబరాన్ని క్రేన్‌తో బయటకు తీశారు. బెలుగా కళేబరంపై ఎటువంటి గాయాలు లేవని, మృతికి కారణాలను కనుగొనేందుకు పోస్టుమార్టం చేపట్టినట్లు అధికారులు చెప్పారు. ఒంటిపై కెమెరాను అమర్చేందుకు వీలుగా బెల్టు లాంటి ఒక పరికరం అమర్చి ఉండటం, దానిపై ‘ఎక్విప్మెంట్ సెయింట్ పీటర్స్బర్గ్’అని రాసి ఉండటంతో నార్వే ప్రజలకు అనుమానం మొదలైంది. రష్యాయే నిఘా కోసం ఈ తిమింగలాన్ని పంపి ఉంటుందని, నార్వే–రష్యా భాషలను కలిపి ‘హవాల్దిమిర్’గా పిలవనారంభించారు. సాధారణంగా తిమింగలాలు గుంపులుగా సంచరిస్తుంటాయి. అందుకు విరుద్ధంగా హవాల్దిమిర్ ప్రజలకు మచ్చికయ్యింది. ఇంతకీ, ఇది రష్యా పంపిందేనా అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకలేదు. బహుశా, రష్యా నిర్బంధంలో ఉంటూ అనుకోకుండా తప్పించుకుని వచ్చి ఉంటుందని, అందుకే ప్రజల సంజ్ఞలకు స్పందించే లక్షణం అబ్బి ఉంటుందని కొందరు వాదిస్తున్నారు. – హెల్సింకీ -
ఆస్పత్రి దూరమై.. రహదారి నరకమై..
చింతూరు: సకాలంలో వైద్యం అందకపోవడంతో అప్పుడే పుట్టిన మగబిడ్డ మృత్యువాత పడిన విషాద ఘటన చింతూరు మండలం కలిగుండంలో శుక్రవారం చోటు చేసుకుంది. కలిగుండం గ్రామానికి చెందిన కుంజా జయమ్మ స్థానిక మినీ అంగన్వాడీ కేంద్రంలో వర్కర్‌గా పనిచేస్తున్నది. గర్భిణీ అయిన జయమ్మకు ఇటీవల పరీక్షలు నిర్వహించగా వచ్చేనెల 18న కాన్పు అయ్యే అవకాశముందని వైద్యులు చెప్పినట్లు ఆమె భర్త సీతారాం తెలిపాడు. అయితే శుక్రవారం తెల్లవారుజామున జయమ్మకు అకస్మాత్తుగా పురిటినొప్పులు రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు భర్త సీతారాం సిద్ధమయ్యాడు. తమ గ్రామం నుంచి వాహన సౌకర్యం లేకపోవడంతో ఆమెను రెండు కిలోమీటర్ల దూరంలోని పేగకు కాలినడకన తీసుకెళ్లేందుకు గ్రామస్తుల సాయం కోరాడు. మార్గమధ్యంలో ఉధృతంగా ప్రవహిస్తున్న చంద్రవంక వాగును ప్రాణాలకు తెగించి దాటించి పేగకు చేరుకున్నారు. అప్పటికే పురిటి నొప్పులతో అల్లాడిన జయమ్మకు వ్యయప్రయాసతో గుండెల్లోతు నీళ్లలో వాగు దాటడంతోపాటు, రెండు కిలోమీటర్లు కాలినడకన రావడంతో నొప్పులు అధికమయ్యాయి. దీంతో ఆమెకు తోడుగా వచ్చిన ఆశా కార్యకర్త వెంటనే పేగలోనే ఓ ఇంటిలో కాన్పు చేయడంతో జయమ్మ మగబిడ్డకు జన్మనిచ్చి0ది. బిడ్డను కాపాడుకునేందుకు.. పుట్టిన బిడ్డకు అస్వస్థతగా ఉండడంతో ఆ బిడ్డను కాపాడుకునేందుకు పేగ నుంచి ఆటోలో ఏడు కిలోమీటర్ల దూరంలోని ఏడుగురాళ్లపల్లి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు పరీక్షించి బిడ్డ పరిస్థితి విషమంగా ఉందని, చింతూరు ఏరియా ఆస్పత్రిలోని చిన్నపిల్లల వైద్యుని వద్దకు తీసుకెళ్లాలని సూచించారు. అంబులెన్సులో చింతూరు ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడి వైద్యులు పరీక్షించి మార్గమధ్యంలోనే బిడ్డ మృతి చెందిందని చెప్పారు. దీంతో బిడ్డను కోల్పోయిన దంపతులు గుండెలవిసేలా రోదించడం అక్కడి వారిని కంటతడి పెట్టించింది. -
గాజాలో 20 మంది పాలస్తీనియన్లు మృతి
జెరూసలేం: గాజాపై మంగళవారం ఇజ్రాయెల్ దాడిల్లో కనీసం 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఖాన్‌యూనిస్, డెయిల్ అల్ బలాహ్‌పై జరిగిన ఈ దాడుల్లో పలు భవనాలు నేలమట్టమయ్యాయని అధికారులు తెలిపారు. మృతుల్లో సగం మంది మహిళలు, చిన్నారులున్నట్లు చెప్పారు. టుల్కారెమ్‌లోని నూర్‌షామ్స్ శరణార్థి శిబిరంపై దాడుల్లో ఐదుగురు చనిపోయారు. ఇజ్రాయెల్ ఆంక్షలతో గాజాలో 10 లక్షల మందికి నెల రోజులుగా కనీస సాయం కూడా అందడం లేదని ఐరాస తెలిపింది.హమాస్ చెర నుంచి బందీని కాపాడిన ఆర్మీహమాస్ చెరలో ఉన్న తమ పౌరుడిని మంగళవారం ఇజ్రాయెల్ ఆర్మీ కాపాడింది. గతేడాది అక్టోబర్ ఏడున గాజా సరిహద్దుల సమీపంలోని ఇజ్రాయెల్ భూభాగంపై హమాస్ మిలిటెంట్లు దాడి చేసి 1,200 మందిని చంపడం, 250 మందిని బందీలుగా పట్టుకోవడం తెలిసిందే. వారిలో క్వాయిద్ ఫర్హాన్ అల్‌కాదీ(52) అనే వ్యక్తిని గాజా కాపాడినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ తెలిపింది. హమాస్ చెర నుంచి ఇజ్రాయెల్ ఇప్పటి వరకు 8 మందిని కాపాడింది. ఇంకా 110 మంది బందీలుగా ఉన్నట్లు భావిస్తున్నారు. -
కేంద్ర మంత్రి జుయల్ ఓరం భార్య మృతి
భువనేశ్వర్: కేంద్ర గిరిజన శాఖ మంత్రి జుయల్ ఓరం భార్య జింగియా ఓరం మృతి చెందారు. డెంగ్యూతో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో శనివారం రాత్రి తుది శ్వాస విడిచారు. జుయల్ ఓరం సైతం డెంగ్యూ బారిన పడి అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జింగియా ఓరం మృతి పట్ల ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శనివారం రాత్రి ఆయన ఆస్పత్రిని సందర్శించారు. సీఎంతో పాటు ఒడిశా న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్, ఆరోగ్య శాఖ మంత్రి ముఖేష్ మహాలింగ్, స్పీకర్ సూరమా పాడి, ఇతర బీజేపీ నేతలు కూడా జింగియా ఓరం భౌతికకాయానికి నివాళులు అర్పించారు. -
అమెరికాలో తెలుగు విద్యార్థి రాజేష్ మృతి
సాక్షి, హన్మకొండ: అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతిచెందాడు. హన్మకొండ జిల్లాకు చెందిన రాజేష్.. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి అక్కడ మృతి చెందడంతో స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అతడి పేరెంట్స్.. కుమారుడి మృతదేహం కోసం ఎదురు చూస్తున్నారు.వివరాల ప్రకారం.. హన్మకొండ జిల్లా ఆత్మకూరులో విషాదం నెలకొంది. ఆత్మకూరుకు చెందిన ఏరుకొండ రాజేష్ ఉన్నత చదువుల కోసం తొమ్మిదేళ్ల క్రితం అమెరికాకు వెళ్లాడు. 2015లో ఎమ్మెస్ ట్రైనింగ్ చేసేందుకు వెళ్లిన రాజేష్.. మూడు రోజుల క్రితం మృతి చెందినట్టు కుటుంబ సభ్యులకు అతని స్నేహితులు సమాచారం ఇచ్చారు. దీంతో, కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు.అయితే, రాజేష్ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కాగా, రాజేష్ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు సాయం చేయాలని ప్రభుత్వానికి కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు. కన్నీరు పెట్టుకుంటూ కుమారుడి మృతదేహం కోసం ఎదురు చూస్తున్నారు. ఇక, తొమ్మిది నెలల క్రితమే రాజేష్ తండ్రి మరణించారు. -
చొరబాటుదారుణ్ణి మట్టుబెట్టిన బీఎస్ఎఫ్
రాబోయే స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సరిహద్దుల్లో భారత సైన్యం మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. తాజాగా పంజాబ్ సరిహద్దుల్లో ఓ పాకిస్తానీ చొరబాటుదారుడు భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తుండగా భద్రతా బలగాలు అతనిని మట్టుబెట్టాయి. ఈ విషయాన్ని స్వయంగా బీఎస్ఎఫ్ వెల్లడించింది.ప్రస్తుతం సరిహద్దుల్లో హై అలర్ట్ అమలులో ఉందని బీఎస్ఎఫ్ అధికారి ఒకరు తెలిపారు. సోమవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో తరన్‌తారన్ జిల్లాలోని దాల్ గ్రామం వద్ద అంతర్జాతీయ సరిహద్దును దాటి కంచె సమీపంలోకి వస్తున్న వ్యక్తి కనిపించాడని ఆయన తెలిపారు. అప్పుడు విధుల్లో ఉన్న బీఎస్ఎఫ్ సిబ్బంది చొరబాటుదారునితో తిరిగి వెళ్లిపోవాలని సూచించారు. అయితే అతను అధికారుల సూచనలు వినకుండా సరిహద్దు భద్రతా కంచె వైపు వస్తూనే ఉన్నాడు.ప్రమాదాన్ని పసిగట్టిన డ్యూటీలోని సైనికులు ఆ చొరబాటుదారునిపై కాల్పులు జరిపారు. అతను అక్కడికక్కడే మృతి చెందాడు. భారత ఆర్మీ మరోమారు చొరబాటుదారుడియత్నాన్ని విజయవంతంగా తిప్పికొట్టిందని ఆయన పేర్కొన్నారు. కాగా పంజాబ్‌లోని 553 కి.మీ. పొడవైన భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో హై అలర్ట్ కొనసాగుతోంది. -
టీడీపీ నేత క్వారీలో జేసీబీ డ్రైవర్ మృతి!
సాక్షి టాస్క్‌ఫోర్స్: టీడీపీ నేత నడుపుతున్న క్వారీలో ఆదివారం జేసీబీ డ్రైవర్ మృతిచెందాడు. పోలీసులకు సమాచారం ఇవ్వకుండా బైక్‌పైనే మృతదేహాన్ని ఆస్పత్రికి తీసుకురావడంతో అది ప్రమాదమా! లేక హత్యా! అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం మాదిగబండలోని అక్రమ క్వారీ కథ ఇది..స్థానికుల కథనం ప్రకారం.. మాదిగబండ సమీపంలోని సర్వే నంబర్లు 1367,1345, 1376లో 4.43 హెక్టార్లలో రోడ్ మెటల్, బిల్డింగ్ స్టోన్ కోసం శరత్‌కుమార్ గనులశాఖ అనుమతులతో క్వారీ నడుపుతున్నారు. ఈక్రమంలో నిబంధనలు పాటించడంలేదని అధికారులు క్వారీకి అనుమతులు రద్దుచేస్తూ ఈ నెల 1న నోటీసులిచ్చారు. కూటమి అధికారంలోకి రాగానే ఆ క్వారీని టీడీపీ నేత జనార్థన్‌నాయుడు స్వాధీనం చేసుకుని నడుపుతున్నారు. దీని కరెంటు బిల్లులు రూ.20.09 లక్షలు కట్టాలని నోటీసులు ఇచ్చిన విద్యుత్ అధికారులు.. బకాయిలు చెల్లించకపోయినా స్పందించలేదు. అనర్హత వేటుపడిన ఈ క్వారీని మైనింగ్ అధికారులు సీజ్ చేయకుండా వదిలేశారు. ఇన్ని ఉల్లంఘనల మధ్య యథేచ్ఛగా నడుస్తున్న ఈ క్వారీలో ఇప్పుడు జేసీబీ డ్రైవర్ మృతి చెందాడు. ప్రమాదమా? చంపేశారా?ఈ క్వారీలో ఎర్రగొండేపల్లికి చెందిన చిన్నస్వామి (38) జేసీబీ ఆపరేటర్‌గా చేస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం జేసీబీ ముందు భాగంలో తొట్టి వద్ద చిన్నస్వామి గ్రీజు వేస్తుండగా సెల్వ అనే వ్యక్తి జేసీబీ క్యాబిన్లో కూర్చొన్నాడు. సెల్వి సెల్‌ఫోన్ చూస్తూ గేర్ వేయడంతో జేసీబీ తొట్టె కిందికెళ్లిపోయి, గ్రీజు వేస్తున్న చిన్నస్వామిపై పడిందని, దాని కింద నలిగి అతను మృతి చెందినట్టు చెబుతున్నారు. పోలీసులను పిలవకుండానే మృతదేహాన్ని బైక్‌పై ఆస్పత్రికి తెచ్చారు. క్వారీలో ఉన్న జేసీబీని మాయం చేశారు. దీంతో ఇది ప్రమాదమా లేక ఉద్దేశపూర్వకంగా చిన్నస్వామిని జేసీబీతో కొట్టి చంపేశారా అన్న అనుమాలు వ్యక్తమవుతున్నాయి. మృతుడి కుటుంబ సభ్యులు కూడా ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. క్వారీ యజమాని ఆదేశాలతో ఆ ప్రాంతానికి చెందిన పలువురు అధికార పార్టీ నాయకులు మృతుడి కుటుంబానికి ఎంతోకొంత పరిహారం చెల్లించి కేసు లేకుండా చేసేందుకు ప్రయత్నాలు చేశారు. మృతుల బంధువులు మీడియాతో మాట్లాడకుండా అడ్డుకున్నారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా ఏం జరి గిందనేది తెలుస్తుందని పలమనేరు టౌన్ సీఐ చంద్రశేఖర్ చెప్పారు. -
మరణాంతరం భద్రపర్చడానికి ఏకంగా రూ. 1.8 కోట్లు..!
అమరత్వం కోసం పరిశోధకులు పలు ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. ఇటీవలో ఒక సిలికాన్ వ్యాలీ కంపెనీ సీఈవో 46 ఏళ్ల బ్రయాన్ జాన్సన్ తన జీవ సంబంధ వయసును ఐదేళ్లకు పైగా తగ్గించుకున్నాడు, వృద్ధాప్య లక్షణాలను తిప్పి కొట్టాడు. అందుకోసం నిత్య వైద్యలు పర్యవేక్షణలో ఉంటూ ఎన్నెన్ని ఇంజెక్షన్లు, ఎలాంటి ఫుడ్ తీసుకునేవాడో విన్నాం. ఇప్పుడూ ఏకంగా ఓ జర్మన్ స్టార్ట్ప్ కంపెనీ ఓ అడుగు ముందుకేసి మరణాంతరం బాడీని స్థభింపచేసి ఎక్కువ కాలం బతికేలా చేస్తానంటోంది. చెప్పాలంటే ఎక్కువకాలం జీవించాలనుకుంటున్న వారు తమ కంపెనీని ఆశ్రయించమని చెబుతోంది కూడా. ఇంతకీ అసలు అదెలా సాధ్యమో సవివరంగా చూద్దామా..!జర్మన్ స్టార్టప్ కంపెనీ టుమారో బయో అనే కంపెనీ ఈ వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చింది. మరణాన్ని రివర్స్ చేయాలనే లక్ష్యంతో ఈ సరికొత్త ఆలోచనకు తెరతీసింది. మరణాంతరం శరీరం పాడవకుండా సజీవంగా ఉండేలా స్థభింపచేస్తుంది. భవిష్యత్తులో ఏ వ్యాధి కారణంతో చనిపోయారో, దానికి చికిత్స పొంది మరీ ఆ బాడీని పునరుద్ధరించవచ్చిని టుమారో బయో కంపెనీ చెబుతోంది. సదరు కంపెనీ క్రియోప్రెజర్వేషన్ ద్వారా 198 మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద శరీరాన్ని బయోస్టాసిస్లో ఉంచుతుంది. ఈ స్థితిలో జీవప్రక్రియలన్నీ నిరవధికంగా నిలిచిపోయి శరీరం చెక్కు చెదరకుండా ఉంటుంది. భవిష్యత్తులో వినియోగించేలా ఉంటుంది. అంతేగాదు ప్రజలు తాము ఎంతకాలం జీవించాలనుకుంటున్నారో, ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో వివరాలు తెలియజేసి వారి ఆర్థిక వనరుల దృష్ట్యా ఆ ప్యాకేజీని ఎన్నుకోవాలని పేర్కొంది టుమారో బయో కంపెనీ. ఇప్పటికే ఆరుగురు వ్యక్తులు, ఐదు పెంపుడు జంతువులను క్రియోప్రెజర్వేషన్ కింద ఉంచామని కంపెనీ తెలిపింది. అలాగే సర్వీస్ చెల్లించిన సుమారు 650 మంది వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నట్లు వెల్లడించింది. ఒక వ్యక్తి చనిపోయిన వెంటనే తమ పని మొదలుపెడతామని చెప్పుకొచ్చింది. అందుకోసం యూరోపియన్ నగరాల్లో ప్రత్యేక అంబులెన్స్ మృతదేహాలను స్విట్జర్లాండ్ తీసుకువెళ్లేలా బెర్లైన్, ఆమ్స్టర్డామ్, జ్యూరిచ్లలో ఉద్యోగులను కూడా నియమించింది. అలాగే ఇక్కడ బాడీని మైనస్ 198 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద ఉంచేలా ద్రవ నైట్రోజన్‌తో నింపిన ప్రత్యేక స్టీల్ కంటైనర్‌లో ఉంచుతారు. కాగా, మరణాంతరం ఇలా భద్రపర్చడానికి సదరు కంపెనీ ఏకంగా రూ. 1.8 కోట్లు వసూలు చేస్తోంది. కేవలం మెదడుని స్థభింపచేయాలనకుంటే దగ్గర దగ్గర రూ. 67.2 లక్షలు డిమాండ్ చేస్తోంది. అయితే కంపెనీ చనిపోయిన వ్యక్తి తిరిగి ఎలా పునరుద్ధరిస్తారు(బతికిస్తారు) అనేది క్లియర్‌గా వివరించలేదు. క్రయోప్రెజర్వేషన్ అంటే..ఇది జీవ పదార్ధం - కణాలు, కణజాలాలు లేదా అవయవాలని ఎక్కువ కాలం పాటు భద్రపరచడానికి స్తంభింపజేసే ప్రక్రియ. అయినప్పటికీ, క్రియోప్రెజర్వేషన్లో గడ్డకట్టడం భిన్నంగా ఉంటుంది. ఇది శరీరంపై మంచు స్ఫటికాలను నిరోధించడానికి ప్రత్యేక క్రయోప్రొటెక్టెంట్ సొల్యూషన్స్ (లిక్విడ్ నైట్రోజన్) కలిగి ఉంటుంది.(చదవండి: 'రియల్ ఐరన్ మ్యాన్': కృత్రిమ గుండెను పొందిన తొలి వ్యక్తి!) -
సూడాన్‌లో భారీ వర్షాలు.. 32మంది మృతి
ఈశాన్య ఆఫ్రికాలోని సూడాన్‌లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ కారణంగా పలుచోట్ల వరదల సంభవిస్తున్నాయి. ఈ పరిస్థితుల నేపధ్యంలో 32 మంది మృతిచెందారని, 107 మంది గాయపడ్డారని సూడాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ మీడియాకు తెలిపింది.దేశంలో కురుస్తున్న వర్షాలు, ముంచెత్తుతున్న వరదలు ఏడు రాష్ట్రాలను ప్రభావితం చేశాయి. 5,575 ఇళ్ళు దెబ్బతిన్నాయని ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. జిన్హువా వార్తా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం భారీ వర్షాలు, వరదల కారణంగా డయేరియా కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. ఇదిలావుండగా కస్సాలా నగరం గుండా ప్రవహించే గాష్ నది నీటి మట్టం పెరుగుతోంది.దీంతో పౌరులు అప్రమత్తంగా ఉండాలని, నదీ తీరాలకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు. సూడాన్‌లో సాధారణంగా జూన్, అక్టోబర్ మధ్య వరదలు సంభవిస్తుంటాయి. గత మూడేళ్లుగా కురుస్తున్న భారీ వర్షాలకు వందలాది మంది మృతి చెందగా, లెక్కలేనన్ని వ్యవసాయ భూములు ధ్వంసమయ్యాయి.