చచ్చీచెడీ సంపాదించాననే మాట వినే ఉంటారు. కానీ నిజంగానే చనిపోయినా వందల కోట్ల రూపాయల్లో సంపాదిస్తున్నవారు ఎందరో ఉన్నారు? సాధారణంగా మ్యుజీషియన్లు, సింగర్లు, రైటర్లకు వారి పాటలను, రచనలను వాడుతున్నవారు రాయల్టీగా కొంత సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది. సృష్టించినవారు చనిపోయినా.. వారి పేరిట రాయల్టీ వసూలై వారసులకు అందుతూనే ఉంటుంది. మరి ఇలా ‘చనిపోయినా’ అత్యధి కంగా సంపాదిస్తున్నవారు ఎవరో తెలుసా?
టాప్ మైఖేల్ జాక్సన్
ఫోర్బ్స్ '2024లో అత్యధిక పారితోషికం పొందిన డెడ్ సెలబ్రిటీల' జాబితా ప్రకారం.. మైఖేల్ జాక్సన్ గత ఏడాది రాయల్టీల ద్వారా 600 మిలియన్ డాలర్లు (సుమారు రూ.5,044 కోట్లు) సంపాదించాడు. రూ.2,102 కోట్లతో సింగర్, రైటర్ ఫ్రడ్డీ మెర్క్యూరీ, రూ.630 కోట్లతో రైటర్ డాక్టర్ సియస్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment