Celebrities
-
‘మైన్ అండ్ యువర్స్’ వెడ్డింగ్ షో తళుక్కుమన్న తారలు (ఫోటోలు)
-
రెండో ఆదాయంపై కన్నేసిన సినీతారలు: అందరి చూపు అటువైపే..
దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అనే చందాన.. సినీతారలు చాలా మంది రియల్ ఎస్టేట్, కమర్షియల్ రెసిడెన్షియల్స్ వంటి రంగాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఈ జాబితాలో అమితాబ్ బచ్చన్, మనోజ్ బాజ్‌పేయి, సారా అలీ ఖాన్, కార్తీక్ ఆర్యన్, అజయ్ దేవగన్ మొదలైనవారు ఉన్నారు.ఆర్ధిక నిపుణులు ప్రకారం.. మనిషి కేవలం ఒక ఆదాయ వనరుమీద మాత్రమే ఆధారపడకూడదు. ఆదాయం వచ్చే మరికొన్ని మార్గాలను ఎప్పటికప్పుడు అన్వేషించాలి. అవే కష్ట సమయాల్లో ఆదుకుంటాయి. ఈ సూత్రాన్ని సెలబ్రిటీలు మాత్రమే చాలామంది పాటిస్తున్నారు. వీరంతా కేవలం సినిమాల మీద మాత్రమే కాకుండా.. ఇతర ఆదాయాల మీద కూడా పెట్టుబడులు పెట్టి ఆర్జిస్తున్నారు.2020 - 2024 మధ్య బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ రియల్ ఎస్టేట్‌లో సుమారు రూ. 194 కోట్ల పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. దీంతో రియల్ ఎస్టేట్‌లో అధిక పెట్టుబడిన వ్యక్తిగా అమితాబ్ అగ్రస్థానంలో నిలిచారు. ఈ తరువాత జాన్వీ కపూర్ (రూ. 169 కోట్లు), రణవీర్ సింగ్, దీపికా పదుకొనే ఫ్యామిలీ (రూ. 156 కోట్లు), అజయ్ దేవగన్ & కాజోల్ (రూ. 110 కోట్లు), షాహిద్ కపూర్ (రూ. 59 కోట్లు) కూడా రియల్ ఎస్టేట్‌లో భారీ పెట్టుబడులను పెట్టినట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి.రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టడానికి కారణం ఏంటంటే?డబ్బు చేతిలో ఉన్నా.. బ్యాంకులో ఉన్న పెద్దగా ప్రయోజనం ఉండదు. అభివృద్ధి చెందుతున్న రంగాల్లో పెట్టుబడుటలుగా ఇన్వెస్ట్ చేస్తే.. రెండింతలు, మూడింతల లాభాలు కూడా వస్తాయి. అయితే ఇన్వెస్ట్ చేసేముందు తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆదమరిస్తే మోసపోవడం ఖాయం.ఇదీ చదవండి: మూడేళ్ళలో 15 రెట్లు.. అక్కడ దూసుకెళ్తున్న రియల్ ఎస్టేట్ మార్కెట్2021లో ఒక ఎకరా భూమిని రూ. 25 లక్షల నుంచి రూ. 50 లక్షల మధ్య ధరతో కొనుగోలు చేసిన భూమి, మూడేళ్ళ తరువాత 15 రేట్లు పెరిగిందని.. దాని విలువ రూ. 5 కోట్లకు చేరిందని 'హౌస్ ఆఫ్ అభినందన్ లోధా' (HoABL) చైర్మన్ 'అభినందన్ లోధా' ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ధరల పెరుగుదల అనేది ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి. అన్ని చోట్లా 15 రేట్లు లాభాలు వస్తాయనుకోవడం పొరపాటే. కానీ రియల్ ఎస్టేట్‌లో తప్పకుండా లాభాలు వస్తాయని మాత్రం నిపుణులు చెబుతున్నారు. -
తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ ప్రముఖులు
-
చనిపోయినా.. చచ్చేంత సంపాదన
చచ్చీచెడీ సంపాదించాననే మాట వినే ఉంటారు. కానీ నిజంగానే చనిపోయినా వందల కోట్ల రూపాయల్లో సంపాదిస్తున్నవారు ఎందరో ఉన్నారు? సాధారణంగా మ్యుజీషియన్లు, సింగర్లు, రైటర్లకు వారి పాటలను, రచనలను వాడుతున్నవారు రాయల్టీగా కొంత సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది. సృష్టించినవారు చనిపోయినా.. వారి పేరిట రాయల్టీ వసూలై వారసులకు అందుతూనే ఉంటుంది. మరి ఇలా ‘చనిపోయినా’ అత్యధి కంగా సంపాదిస్తున్నవారు ఎవరో తెలుసా?టాప్ మైఖేల్ జాక్సన్ఫోర్బ్స్ '2024లో అత్యధిక పారితోషికం పొందిన డెడ్ సెలబ్రిటీల' జాబితా ప్రకారం.. మైఖేల్ జాక్సన్ గత ఏడాది రాయల్టీల ద్వారా 600 మిలియన్ డాలర్లు (సుమారు రూ.5,044 కోట్లు) సంపాదించాడు. రూ.2,102 కోట్లతో సింగర్, రైటర్ ఫ్రడ్డీ మెర్క్యూరీ, రూ.630 కోట్లతో రైటర్ డాక్టర్ సియస్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. -
దీపావళి వేడుకల్లో టాలీవుడ్ సెలబ్రిటీలు... రష్మిక, విజయ్ దేవరకొండ సహా! (ఫొటోలు)
-
టాటా అంటే పేరు కాదు.. బ్రాండ్.. రతన్ టాటాకు ప్రముఖుల నివాళి
-
హీరోగా టాలీవుడ్ రచయిత మనవడు.. ఆసక్తిగా ట్రైలర్!
ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు మనవడు సుదర్శన్ పరుచూరి హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ఆయన నటించిన తాజా చిత్రం మిస్టర్ సెలెబ్రిటీ. ఈ సినిమాకు రవి కిశోర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్పీ సినిమాస్ బ్యానర్‌పై ఎన్ పాండురంగారావు, చిన్నా రెడ్డి నిర్మించారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.(ఇది చదవండి: అతనంటే చిరాకు.. ఆ షో అంతా ఓ చెత్త: సినీయర్ నటుడు ఆగ్రహం)ట్రైలర్ చూస్తే ఒక సెలబ్రిటీగా మారాలనుకునే యువకుడి కథనే సినిమాగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో హనుమాన్ నటి వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలో కనిపించనుంది. అంతేకాకుండా సీనియర్ నటి ఆమని,శ్రీ దీక్ష, నాజర్, రఘుబాబు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. Wishing best wishes to #ParuchuriSudarshan and the entire team of #MrCelebrity!The trailer looks very promising 👍🏻https://t.co/wxnwA3YIQCIn theatres from October 4th@varusarath5 #ChandinaRaviKishore #NPandurangarao— Rana Daggubati (@RanaDaggubati) October 2, 2024 -
కూతుళ్లే అందం..ప్రముఖుల బ్యూటిఫుల్ డాటర్స్..!(ఫొటోలు)
-
దసరా ఉత్సవాల కోసం దాండియా సన్నాహక ఈవెంట్లో సినీ తారలు, మోడల్స్(ఫొటోలు)
-
హీరోయిన్ మీనా బర్త్ డే వేడుకల్లో శరత్‌కుమార్.. ఫోటోలు వైరల్
-
Onam Festival: మలయాళ సెలబ్రిటీలు ఎంత బాగా ముస్తాబయ్యారో! (ఫోటోలు)
-
విఘ్నేశ్వరుడి పూజలో బాలీవుడ్ స్టార్స్.. ఫోటోలు వైరల్
-
సెలబ్రిటీల రూపంలో గణనాథులు.. పుష్ప వినాయకుడిని చూశారా? (ఫోటోలు)
-
ముకేశ్ అంబానీ ఇంట వినాయక చవితి వేడుకలు.. హాజరైన సినీతారలు
-
మెటర్నిటీ ఫోటో షూట్ : అందమైన అనుభవం
-
సినిమా స్టార్స్ ఇంట్లో రాఖీ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
Varalakshmi Vratham: లక్ష్మీ కళ ఉట్టిపడుతున్న నేటి వర మహాలక్ష్ములు (ఫొటోలు)
-
నార్సింగి కేసులో కీలక మలుపు.. 50 మంది సెలబ్రిటీల గుర్తింపు!
హైదరాబాద్, సాక్షి: నార్సింగి డ్రగ్స్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో మరికొందరు ప్రముఖులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వాళ్లందరికీ నోటీసులు ఇచ్చి ప్రశ్నించాలని భావిస్తున్నారు. ఈ కేసులో ప్రముఖ నటి రకుల్ ప్రీత్‌సింగ్ సోదరుడు అమన్ సైతం అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. నార్సింగి డ్రగ్స్ కేసులో అమన్ సహా పలువురిని జులై 15వ తేదీన జాయింట్ ఆపరేషన్‌తో అరెస్ట్ చేశారు. వాళ్లు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆ టైంలో 19 మంది ప్రముఖులకు పోలీసులు నోటీసులు పంపించారు. తాజాగా.. నిందితులు మరో 30 మంది సెలబ్రిటీల పేర్లు వెల్లడించారు. ఇందులో ప్రముఖ కంపెనీల యాజమానులు సైతం ఉన్నట్లు సమాచారం. దీంతో ఈ కేసులో సెలబ్రిటీల సంఖ్య 50కి చేరినట్లయ్యింది. -
అనంత్ - రాధిక రిసెప్షన్: జిగేలుమన్న సెలబ్రిటీలు (ఫోటోలు)
-
అనంత్ అంబానీ & రాధిక మర్చంట్ వివాహ వేడుకలో ప్రముఖుల డాన్స్
-
తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖ సెలబ్రిటీలు (ఫొటోలు)
-
అనంత్-రాధిక హల్దీ.. సుందరంగా ముస్తాబైన సెలబ్రిటీలు (ఫోటోలు)
-
కళామందిర్ ఫౌండేషన్ డే వేడుకలో ప్రముఖుల సందడి.. (ఫోటోలు)
-
అనంత్-రాధిక సంగీత్‌లో అదరగొట్టిన అందాల తారలు (ఫోటోలు)
-
రియల్ ఎస్టేట్‌లో భారీగా డబ్బులు పెట్టిన సెలబ్రిటీలు వీళ్లే..
సినిమాలలో అమితాబ్ బచ్చన్ వంటి స్టార్ సెలబ్రిటీలు భారీ మొత్తంలో సంపాదిస్తారు. వీరిలో చాలా మంది మంచి వ్యాపారవేత్తలు కూడా. తమ నట జీవితంతో పాటు సమాంతర వ్యాపారాలను ప్రారంభించడం మనం చూశాం. కొందరు రెస్టారెంట్లు, ఫ్యాషన్ బ్రాండ్లు లేదా విలాసవంతమైన పబ్బులు, క్లబ్బులు నడుపుతుండగా మరికొందరు రియల్ ఎస్టేట్‌లో భారీగా డబ్బులు పెడుతున్నారు. ఇలా ఇటీవల రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టిన కొందరు సెలబ్రిటీల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం..అమితాబ్ బచ్చన్బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఇటీవల ముంబైలోని వీర్ సావర్కర్ సిగ్నేచర్ బిల్డింగ్ లో మూడు ఆఫీస్ స్పేస్ లను రూ.60 కోట్లకు కొనుగోలు చేశారు. కమర్షియల్ రియల్ ఎస్టేట్ అనలిటిక్స్ సైట్ FloorTap.com కు లభించిన డాక్యుమెంట్ల ప్రకారం.. ఈ కార్యాలయ స్థలాలు ముంబైలోని అంధేరి వెస్ట్ పరిసరాల్లో, వీర దేశాయ్ రోడ్ సమీపంలో ఉన్నాయి.మొత్తం 8,429 చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడు కార్యాలయ భవనాలను రూ.59.58 కోట్లకు బిగ్ బీ కొనుగోలు చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఈ లావాదేవీకి అమితాబ్ బచ్చన్ రూ.3.57 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లించడంతో 2024 జూన్ 20న సేల్ డీడ్ ఖరారైంది. వ్యాపార ప్రాంగణం మూడు పార్కింగ్ స్థలాలతో వచ్చినట్లు డాక్యుమెంట్లు సూచిస్తున్నాయి. వీర్ సావర్కర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కమర్షియల్ ప్రాపర్టీ అమ్మకందారుగా గుర్తించారు.గత ఏడాది ఆగస్టులో అమితాబ్ బచ్చన్ కొనుగోలు చేసిన భవనంలో ఇప్పటికే నాలుగు ఆఫీస్ సూట్లు ఉన్నాయి. 2023 డిసెంబర్లో ముంబైలోని ఓషివారా ప్రాంతంలో సుమారు 10,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న నాలుగు వాణిజ్య స్థలాలను రూ.2.07 కోట్లకు లీజుకు తీసుకుని రూ.1.03 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్ చేశారు.ఇతర సెలబ్రిటీలు కూడా ఇదే భవనంలో పెట్టుబడులు పెట్టారు. తాజా అప్డేట్ ప్రకారం.. బిగ్ బీకి ఇప్పుడు సిగ్నేచర్ బిల్డింగ్ 7 ఆఫీస్ స్పేస్‌లు ఉన్నాయి. ఆయన ఒక్కరే కాదు, సిగ్నేచర్ బిల్డింగ్ ఇతర సెలబ్రిటీలకు కూడా హాట్ స్పాట్. సీనియర్ బచ్చన్ తో పాటు మనోజ్ బాజ్‌పాయ్, కాజోల్, అజయ్ దేవగణ్, కార్తీక్ ఆర్యన్, సారా అలీఖాన్ వంటి సెలబ్రిటీలకు కూడా ఈ భవనంలో కమర్షియల్ యూనిట్లు ఉన్నాయి.అజయ్ దేవగణ్, కాజోల్ఈ భవనంలో 194 చదరపు మీటర్ల కమర్షియల్ యూనిట్‌ను కాజోల్ గత ఏడాది ఆగస్టులో రూ .7.64 కోట్లకు కొనుగోలు చేశారు. సిగ్నేచర్ బిల్డింగ్ లోని 16, 17 అంతస్తుల్లో ఉన్న ఐదు కమర్షియల్ ప్రాపర్టీలను అజయ్ దేవగణ్ రూ.45.9 కోట్లకు కొనుగోలు చేశారు. ఇందుకోసం ఆయన రూ.2.70 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లించినట్లు హిందుస్థాన్ టైమ్స్ తెలిపింది.అభిషేక్ బచ్చన్కొన్ని వారాల క్రితం అభిషేక్ బచ్చన్ బోరివాలిలో ఉన్న ఒబెరాయ్ రియల్టీ ప్రీమియం రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ఒబెరాయ్ స్కై సిటీలో ఆరు కొత్త రెసిడెన్షియల్ ప్రాపర్టీలను కొనుగోలు చేశారు. 57వ అంతస్తులో మొత్తం 4,894 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ అపార్ట్మెంట్లను రూ.15.42 కోట్లు చెల్లించి కొనుగోలు చేసినట్లు హిందుస్థాన్ టైమ్స్ కథనం పేర్కొంది.మనోజ్ బాజ్పాయ్మనోజ్ బాజ్‌పాయ్, ఆయన భార్య షబానా రజా గత ఏడాది అక్టోబర్‌లో సిగ్నేచర్ బిల్డింగ్‌లోని నాలుగు యూనిట్లలో రూ.31 కోట్లు పెట్టుబడి పెట్టారు. ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల ప్రకారం ఒక్కో యూనిట్ ధర రూ.7.77 కోట్లు కాగా, యూనిట్ కు రూ.46.62 లక్షల స్టాంప్ డ్యూటీ ఉంది.కార్తిక్ ఆర్యన్, సారా అలీఖాన్కార్తీక్ ఆర్యన్, సారా అలీఖాన్‌లు సిగ్నేచర్ బిల్డింగ్‌లో 2,099 చదరపు అడుగుల యూనిట్‌ను కలిగి ఉన్నారు. సారా అలీఖాన్, అమృతా సింగ్ 2023 జూలైలో రూ.9 కోట్లకు ఫ్లాట్‌ను కొనుగోలు చేయగా, కార్తీక్ ఆర్యన్ 2023 సెప్టెంబర్‌లో రూ.10 కోట్లకు అపార్ట్మెంట్ కొనుగోలు చేశారు. ఐశ్వర్య ప్రాపర్టీ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ రెండు ప్రాపర్టీల అమ్మకానికి వెసులుబాటు కల్పించింది.