దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అనే చందాన.. సినీతారలు చాలా మంది రియల్ ఎస్టేట్, కమర్షియల్ రెసిడెన్షియల్స్ వంటి రంగాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఈ జాబితాలో అమితాబ్ బచ్చన్, మనోజ్ బాజ్‌పేయి, సారా అలీ ఖాన్, కార్తీక్ ఆర్యన్, అజయ్ దేవగన్ మొదలైనవారు ఉన్నారు.
ఆర్ధిక నిపుణులు ప్రకారం.. మనిషి కేవలం ఒక ఆదాయ వనరుమీద మాత్రమే ఆధారపడకూడదు. ఆదాయం వచ్చే మరికొన్ని మార్గాలను ఎప్పటికప్పుడు అన్వేషించాలి. అవే కష్ట సమయాల్లో ఆదుకుంటాయి. ఈ సూత్రాన్ని సెలబ్రిటీలు మాత్రమే చాలామంది పాటిస్తున్నారు. వీరంతా కేవలం సినిమాల మీద మాత్రమే కాకుండా.. ఇతర ఆదాయాల మీద కూడా పెట్టుబడులు పెట్టి ఆర్జిస్తున్నారు.
2020 - 2024 మధ్య బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ రియల్ ఎస్టేట్‌లో సుమారు రూ. 194 కోట్ల పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. దీంతో రియల్ ఎస్టేట్‌లో అధిక పెట్టుబడిన వ్యక్తిగా అమితాబ్ అగ్రస్థానంలో నిలిచారు. ఈ తరువాత జాన్వీ కపూర్ (రూ. 169 కోట్లు), రణవీర్ సింగ్, దీపికా పదుకొనే ఫ్యామిలీ (రూ. 156 కోట్లు), అజయ్ దేవగన్ & కాజోల్ (రూ. 110 కోట్లు), షాహిద్ కపూర్ (రూ. 59 కోట్లు) కూడా రియల్ ఎస్టేట్‌లో భారీ పెట్టుబడులను పెట్టినట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి.
రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టడానికి కారణం ఏంటంటే?
డబ్బు చేతిలో ఉన్నా.. బ్యాంకులో ఉన్న పెద్దగా ప్రయోజనం ఉండదు. అభివృద్ధి చెందుతున్న రంగాల్లో పెట్టుబడుటలుగా ఇన్వెస్ట్ చేస్తే.. రెండింతలు, మూడింతల లాభాలు కూడా వస్తాయి. అయితే ఇన్వెస్ట్ చేసేముందు తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆదమరిస్తే మోసపోవడం ఖాయం.
ఇదీ చదవండి: మూడేళ్ళలో 15 రెట్లు.. అక్కడ దూసుకెళ్తున్న రియల్ ఎస్టేట్ మార్కెట్
2021లో ఒక ఎకరా భూమిని రూ. 25 లక్షల నుంచి రూ. 50 లక్షల మధ్య ధరతో కొనుగోలు చేసిన భూమి, మూడేళ్ళ తరువాత 15 రేట్లు పెరిగిందని.. దాని విలువ రూ. 5 కోట్లకు చేరిందని 'హౌస్ ఆఫ్ అభినందన్ లోధా' (HoABL) చైర్మన్ 'అభినందన్ లోధా' ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ధరల పెరుగుదల అనేది ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి. అన్ని చోట్లా 15 రేట్లు లాభాలు వస్తాయనుకోవడం పొరపాటే. కానీ రియల్ ఎస్టేట్‌లో తప్పకుండా లాభాలు వస్తాయని మాత్రం నిపుణులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment