![Ayesha Khan Lashes Out At Paparazzi For Harassing Her](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/9/Ayesha.jpg.webp?itok=0IiSIV_H)
న్యూ పాపరాజీ
సెలబ్రిటీల కదలికలు, వ్యక్తిగత జీవిత విషయాలను సొమ్ము చేసుకునే ఎల్లో మీడియా పాపరాజీ దారిలో రాజీ పడకుండా నడుస్తుంటుంది. ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌ల పుణ్యమా అని మీడియాతో సంబంధం లేని వారు కూడా సెలబ్రిటీలు కనిపిస్తే చాలు పాపింగ్ చేస్తున్నారు. సెలబ్రిటీల పాలిట పెను భూతం పాపరాజీ. ఇల్లు దాటి బయటికి వస్తే ఎవరు ఎక్కడ కెమెరాతో క్లిక్ అనిపిస్తారో తెలియదు.
బిగ్ బాస్ సీజన్ 17 ద్వారా సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించుకున్న నటి ఆయేషా ఖాన్ పాపరాజీపై మండిపడింది. తన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ అనవసర కామెంట్స్ చేస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘మీడియా పట్ల నాకు గౌరవం ఉంది. అయితే పాపరాజీ మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంది. నా కారు వరకు నన్ను అనుసరించడం, నన్ను ముందుకు నడవనివ్వక పోవడం...ఇలా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను.
చేతిలో మొబైల్ ఉంటే చాలు పాపింగ్ పేరుతో వెంటబడుతున్నారు’ అని ఆవేదన వ్యక్తం చేసింది. ఆయేషా విషయానికి వస్తే అభిమానులతో పాటు, నెటిజనులు ఆమెకు సపోర్ట్ చేస్తూ పాపరాజీ తీరుపై మండిపడుతున్నారు. ‘చౌకబారు మనసున్న వ్యక్తులకు వ్యతిరేకంగా మీరు గళం విప్పినందుకు సంతోషంగా ఉంది. పాపరాజీ పేరుతో మిమ్మల్ని అసౌక్యరానికి గురి చేసే హక్కు వారికి లేదు’ అని ఒక నెటిజనుడు స్పందించాడు.
Comments
Please login to add a commentAdd a comment