inappropriate comments
-
అసెంబ్లీలో మంత్రి అనిత అనుచిత వ్యాఖ్యలు
అమరావతి, సాక్షి: ఐదు సంవత్సరాల వైఎస్సార్సీపీ పాలనలో కంటే.. తమ హయాంలోని గత ఐదు నెలల కాలంలోనే క్రైమ్ రేటు విపరీతంగా తగ్గిందని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. శాంతి భద్రతల అంశంపై చర్చ సందర్భంగా.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల ప్రశ్నలకు ఆమె వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆమె అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై వైఎస్సార్సీపీ ఆందోళనకుదిగగా.. మరోవైపు చైర్మన్ సైతం ఆమె తీరును తప్పుబట్టారు.ఏపీ శాసన మండలిలో శాంతి భద్రతలపై వాడీ వేడి చర్చ నడిచింది. తొలుత.. రాష్ట్రంలో అత్యాచార ఘటనలు పెరిగిపోవడంపై వరదు కళ్యాణి మాట్లాడారు. దిశ యాప్, చట్టాన్ని నిర్వీర్యం చేయడంపై ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ప్రభుత్వం నుంచి వివరణ కోరారు. దీనిపై అనిత మాట్లాడుతూ.. అత్యాచార ఘటనను రాజకీయం చేయొద్దన్నారు. అలాగే.. మహిళల భద్రత పేరిట వైఎస్సార్సీపీ ప్రభుత్వం దిశ చట్టం తెచ్చిందని, దిశ పోలీస్ స్టేషన్లు గతంలో ఏర్పాటు చేశారని.. తాము అధికారంలోకి వచ్చాక వాటిని తొలగించామని ఆమె అన్నారామె. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఘోరంగా విఫలం అయ్యిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పిన వ్యాఖ్యలను మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ గుర్తు చేశారు. అసహనానికి లోనైన ఆమె.. దమ్ము, ధైర్యం అంటూ ఆమె తీవ్ర పదజాలంతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. అదే సమయంలో కొయ్యే మోషేన్‌రాజు, మంత్రి వ్యాఖ్యలను తప్పుబట్టారు. బాధ్యత గల మంత్రిగా ఉండి.. దమ్ము ధైర్యం గురించి మాట్లాడం సరైనది కాదు అని అన్నారాయన. దీంతో ఆమె క్షమాపణలు చెప్పి కూర్చున్నారు. అయితే అనిత వ్యాఖ్యలపై నిరసనగా.. శాంతి భద్రతల పరిరక్షణలో కూటమి ప్రభుత్వం విఫలమైనందున మండలి నుంచి వైఎస్సార్సీపీ వాకౌట్ చేసింది. అంతకు ముందు..‘‘ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల పై నేరాలు, వేధింపులు పెరిగాయి. రాష్ట్రంలో రోజుకు 59 నేరాలు మహిళల పై జరుగుతున్నాయి. రాష్ట్రంలో ప్రతి గంట కి ఇద్దరు, ముగ్గురు మహిళలు పై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం, పోలీసులు వైఫల్యం వలన మహిళలు, చిన్నారుల పై నేరాలు జరుగుతున్నాయి. ముచుమర్రి లో 9 ఏళ్ల బాలిక పై అత్యాచారం చేసి చంపేస్తే ఈరోజు కి మృతదేహం దొరకలేదు. హిందూపురం లో అత్తా కోడళ్ల పై గ్యాంగ్ రేప్ చేశారు. ఏ ఆర్ పురంలో చిన్నారిని అత్యాచారం చేసి చంపేశారు. దిశ యాప్ ని కొనసాగిస్తున్నారా..? లేదా..?. దిశ పోలీసు స్టేషన్ల ను కొనసాగిస్తున్నారా లేదా?. మహిళల పై నేరాల పై నియంత్రణ కు ఏదైనా కొత్త వ్యవస్థ తెచ్చారా..? అని మండలిలో ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి కూటమి ప్రభుత్వానికి ప్రశ్నలు గుప్పించారు. -
ఓటమి భయంతో వసంత బూతు పురాణం
జి.కొండూరు: ఎన్నికలు దగ్గరపడే కొద్దీ టీడీపీ మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వసంత వెంకటకృష్ణప్రసాద్ సహనం కోల్పోతున్నారు. పైన పటారం.. లోన లొటారం అన్నట్లు పైకి సౌమ్యుడిగా కలరింగ్ ఇచ్చే వసంత, తన అసలు నైజాన్ని బయటకు ప్రదర్శిస్తున్నాడు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అతి సామాన్యుడు సర్నాల తిరుపతిరావుకి వస్తున్న ప్రజాదరణ చూసి ఓటమి భయంతో వసంత తన ఎన్నికల ప్రచారాల్లో బూతు పురాణం అందుకుంటున్నారు. గత ఐదేళ్ల పాటు తన ప్రత్యర్థి దేవినేని ఉమామహేశ్వరరావు, ఆయన కుటుంబ సభ్యులపై సగటు మనిషి వినలేని భాషలో బూతు పురాణాన్ని వండివార్చిన వసంత, నేడు మరలా అదే తీరును కొనసాగిస్తున్నారు. ఎన్నికల ప్రచారాల్లో వసంత మాట్లాడుతున్న తీరు చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.బ్లేడు బ్యాచ్ అంటూ... వసంత వెంకటకృష్ణప్రసాద్ తన ఎన్నికల ప్రచారంలో భాగంగా గత కొన్ని రోజులుగా వైఎస్సార్ సీపీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ప్రారంభించారు. సామాన్యుడు సర్నాల తిరుపతిరావుకి నైతికంగా మద్దతిచ్చేందుకు వచ్చిన నాయకులను బ్లేడు బ్యాచ్, లుంగీ బ్యాచ్, కడప రౌడీలు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల సర్నాల తిరుపతిరావుని ఉద్దేశించి గంగిరెద్దు, కుక్కిన పేను అంటూ వసంత చేసిన అవమానకర వ్యాఖ్యలు నియోజకవర్గంలో రాజకీయ దుమారాన్నే రేపాయి. ఇటీవల ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన ర్యాలీలో రంగులు మార్చే ఊసరవెల్లిలా మీరు పారీ్టలు మారుస్తున్నట్ల బయట చర్చ జరుగుతోందని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు వసంత మాట్లాడిన బూతు పురాణం విని పక్కనే ఉన్న ఆయన అనుచరులే విస్తుపోయారు. ఎన్నికల దగ్గర పడే కొద్దీ తిరుపతిరావుకి పెరుగుతున్న గ్రాఫ్‌తో పాటు సొంత పార్టీలో ఉన్న వర్గపోరు, ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు డంపు చేసిన మద్యం, నగదు పట్టబడడంతో ఓటమి ఖాయమని భావించి సహనం కోల్పోతున్నాడు. ఏం చేస్తాడో స్పష్టత లేదు... మైలవరం నియోజకవర్గం నుంచి 2019లో ఎమ్మెల్యేగా గెలుపొందిన వసంత వెంకటకృష్ణప్రసాద్ ప్రజలకు ఏనాడూ అందుబాటులో లేరు. ఐదేళ్లపాటు ప్రజా సమస్యలను గాలికొదిలేసిన వసంత, నేడు మరలా పార్టీ మార్చి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతూ నియోజకవర్గానికి తానేమి చేస్తాడో కూడా స్పష్టంగా చెప్పలేని పరిస్థితిలో తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. నిత్యం వైఎస్సార్ సీపీ నాయకులు, సర్నాల తిరుపతిరావు, ముఖ్యమంత్రిపై బూతులు మాట్లాడటం మినహా ఎటువంటి హామీలను ఇవ్వలేకపోవడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో వసంత మాట్లాడుతున్న బూతు పురాణం వింటున్న స్థానిక ప్రజలే కాకుండా ఆయన పక్కన ఉంటున్న సొంత పార్టీ నేతలు సైతం ముక్కున వేలేసుకుంటున్న పరిస్థితి నెలకొంది. -
మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
గుడిపాల/చిత్తూరు అర్బన్: చిత్తూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ నాయుడు ఎస్సీ, ఎస్టీ మహిళలపై దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. అందరి ఎదుటే దళిత మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యల వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి వెంటనే అతడిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని.. ఎన్నికల్లో పోటీ చేయకుండా చేయాలని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. చిత్తూరు నియోజకవర్గంలోని గుడిపాల మండలం కనకనేరి ఆది అంధ్రవాడలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.టీడీపీ చిత్తూరు అసెంబ్లీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ నాయుడు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు బాలాజీ నాయుడు తదితరులు మందీ మార్బలంతో శనివారం కనకనేరి గ్రామానికి ఎన్నికల ప్రచారం కోసం వెళ్లారు. ఇక్కడున్న ఆది ఆంధ్రవాడకు చెందిన మహిళలు యానాదులకు చెందిన మహిళలను ఓం శక్తి గుడి వద్దకు జగన్మోహన్ నాయుడు పిలిపించాడు. మీకు గ్రామంలో ఏం సమస్య ఉందో చెప్పాలని మహిళలను అడగగా.. నీటి సమస్య ఎక్కువగా ఉందని పారిశుద్ధ్యం సరిగా లేదని మహిళలు సమాధానమిచ్చారు. దీంతో టీడీపీ అభ్యర్థి జగన్మోహన్ నాయుడు ‘నేను ఐదేళ్ల ముందే వచ్చినప్పుడు మీకు చెప్పినాను కదా ఫ్యాన్‌కు ఓటేయవద్దు అని. నా మాట వినలేదు. ఇప్పుడు అనుభవిస్తున్నారు, అనుభవించండి. ఓటు ఫ్యాన్ గుర్తుకు వేస్తారు, సమస్యలు మాకు చెబుతారా? ఎగేసుకొని పోయి ఓటు వేసినారు కదా ఫ్యానుకు.. అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఇంకా ఆయన మాట్లాడుతూ ఈసారి మాకే ఓటేస్తామని మహిళలంతా వచ్చి దేవుని ఎదుట ప్రమాణం చేయాలని హుకుం జారీ చేశాడు. అంతటితో ఆగకుండా.. ‘ఏమిరా మీ ఊరులో పెళ్లిళ్లు చేసుకుని మొగుళ్లని వదిలేస్తారంట కదా.. ఆమేమో మొగుడ్ని వదిలేసాను అంటది ఈమేమో మొగుడు ఉండాడు యాడికో పోయినాడు అంటాది. మీ ఊరంతా ఇట్లాంటోల్లేనా ఉండేది’ అంటూ దళితుల మనోభావాలు కించపరిచేలా మాట్లాడాడు. ఇలాంటి వ్యక్తికి ఓట్లేసి గెలిపిస్తే దళితులపై ఇంకా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అయినా సరే తగ్గకుండా చివర్లో తాము ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తామంటూ మహిళలంతా తేల్చి చెప్పడంతో జగన్మోహన్ నాయుడు అక్కడ నుంచి వెళ్లిపోయాడు. మరోవైపు కులాహంకారాన్ని వ్యక్తపరిచేలా జగన్మోహన్ నాయుడు చేసిన ఈ వ్యాఖ్యల పట్ల దళిత సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. చిత్తూరుకు చెందిన మేయర్ అముద, మాజీ చైర్మన్ తదితరులు జగన్మోహన్ నాయుడు వ్యాఖ్యలను ఖండిస్తూ అతనిపై వెంటనే అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. గుడిపాల మండలంలోని దళిత నాయకులు మాట్లాడుతూ గురజాల జగన్మోహన్ నాయుడును ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హుడిగా ప్రకటించాలని ఎన్నికల సంఘాన్ని కోరనున్నట్లు తెలిపారు. -
కేటీఆర్‌పై వ్యాఖ్యలు.. మంత్రి కొండా సురేఖకు ఈసీ వార్నింగ్..
సాక్షి, హైదరాబాద్: మంత్రి కొండా సురేఖపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడింట్ కేటీఆర్‌పై ఇటీవల చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ఆమెను ఈసీ హెచ్చరించింది. ఎన్నికల వేళ జాగ్రత్తగా మాట్లాడాలని సూచించింది. ఆరోపణలు చేసే సమయంలో బాద్యతగా వ్యవహరించాలని, స్టార్ క్యాంపెయినర్‌గా, మంత్రిగా మరింత బాధ్యతగా ఉండాలని హితవు పలికింది.కాగా ఈనెల ఒకటవ తేదీన వరంగల్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ విమర్శలు గుప్పించారు. ఫోన్ టాపింగ్ వ్యవహారంలో కేసీఆర్, కేటీఆర్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఫోన్ ట్యాపింగ్‌తో ఎంతోమంది హీరోయిన్లను బ్లాక్ మెయిల్ చేశారని, అధికారులను బదిలీ చేశారని, అనేకమందిని ఉద్యోగాలు కోల్పోయి జైలుకు వెళ్లేలా చేశారన్నారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లింది. బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఈసీకి ఫిర్యాదు చేసిన క్రమంలో నేడు మంత్రి వ్యాఖ్యలను తప్పుబట్టింది ఎన్నికల సంఘం.చదవండి: చూస్తూ ఊరుకోం.. యుద్ధం చేస్తాం: కేసీఆర్ -
ఎన్నికల ముందు ఎందర్ని జైల్లో వేస్తారు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: తమిళనాడు సీఎం స్టాలిన్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో సత్తై దురై మురుగన్ అనే యూట్యూబర్‌కు బెయిల్‌ను సుప్రీంకోర్టు పునరుద్ధరించింది. ‘‘యూట్యూబ్‌లో ఆరోపణలు చేశారంటూ ఎన్నికల వేళ ప్రతి ఒక్కరినీ జైళ్లలో వేయడం ప్రారంభిస్తే ఎందరు కటకటాల పాలవుతారో ఊహించండి’’ అని జస్టిస్ ఏఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. నిరసన తెలపడం, అభిప్రాయాల వ్యక్తీకరణ ద్వారా స్వేచ్ఛను దుర్వినియోగపరిచినట్లుగా భావించరాదని పేర్కొంది. స్టాలిన్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు ఆపడం లేదన్న ఫిర్యాదుపై మద్రాస్ హైకోర్టు బెయిల్ రద్దు చేయడంతో మురుగన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
లక్షద్వీప్ వైపు లక్షల మంది చూపు!
ప్రధానమంత్రి నరేంద్రమోదీ జనవరి మొదటి వారంలో లక్షద్వీప్‌లో పర్యటించారు.కవరత్తిలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. కొన్ని గంటల పాటు ఆ సముద్ర తీరంలో సేద తీరారు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇంకోవైపు,మాల్దీవుల మంత్రులు లక్షద్వీప్ పరిశుభ్రత గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. వారిపై ఆ ప్రభుత్వం వేటు కూడా వేసింది. వీటన్నిటి ప్రభావంతో నేడు ప్రపంచ పర్యాటకులంతా లక్షద్వీప్ వైపు చూస్తున్నారు. ఇప్పటికే లక్షలమంది గూగుల్, మేక్ మై ట్రిప్ బాట పట్టారు. ఈ 20 ఏళ్ళలో ఎప్పుడూ లేనంత గరిష్ఠ స్థాయిలో ఆన్ లైన్ అన్వేషణ పెరిగిందని కేంద్ర సమాచార శాఖ విభాగాలు వెల్లడించాయి. తమ వెబ్ సైట్ లో లక్షద్వీప్ కోసం వెతుకుతున్న వారి సంఖ్య అనూహ్య రీతిలో పెరిగిందని ఆన్ లైన్ ట్రావెల్ సంస్థ మేక్ మై ట్రిప్ కూడా ప్రకటించింది. ప్రధాని మోదీ ఈ ద్వీపంలో గడపడమే కాక సాహసమైన ప్రయాణం కూడా చేశారు. సముద్ర గర్భంలో తిరుగుతూ మిగిలిన జీవరాసుల జీవనాన్ని కూడా దర్శించుకున్నారు. అంత పెద్ద ద్వీపంలో ఇంతటి సాహసం చేయడం మోదీకే చెల్లిందనే ప్రశంసలు,ఇటువంటి సాహసకృత్యాలు ఎందుకనే విమర్శలు రెండూ వెల్లువెత్తాయి. లక్షద్వీప్ లో అద్భుతమైన బీచ్ లు ఉండడమే కాక,భోజనం, ఆహారపదార్ధాలు,ఆతిధ్యం అద్భుతంగా వున్నాయని సాక్షాత్తు దేశ ప్రధాని చెప్పడంతో భారతీయులలో ఈ ద్వీపాలను దర్శించాలనే ఆరాటం పెరిగింది. మిగిలిన దేశాల వారికీ అంతే ఆసక్తి పెరిగింది. మాల్దీవ్ ప్రభుత్వానికి మాత్రం అసూయ,భయం పెరిగాయి. భారత్ లోని బీచ్ లను,ద్వీపాలను అన్వేషించాలనే ఆరాటం ప్రపంచ పర్యాటకులలో మరింత ఎక్కువైంది. ఒక్క సంఘటన ఇంత ప్రభావం చూపిందన్నమాట! లక్షద్వీప్ పై మాల్దీవులు అక్కసు వెళ్ళ గక్కుతూ,కువిమర్శలు చేస్తున్న వేళ,మాల్దీవులకు బుకింగ్స్ నిలిపివేయాలని నెటిజన్లు మేక్ మై ట్రిప్ వారికి సూచనలు పంపుతున్నారు. ఈ వేడి రగులుతున్న సందర్భంలో దిద్దుబాటు చర్యలకు మాల్దీవ్ ప్రభుత్వం సిద్ధమైంది. భారత్ తో సయోధ్య కోసం అర్రులు జాస్తోంది. మన దేశ సినిమా,క్రీడారంగ ప్రముఖులు సైతం మాల్దీవులకు ప్రత్యామ్నాయంగా భారత ద్వీపాలను దర్శించాలని పిలుపునివ్వడం గమనార్హం! భారత్ లో పర్యాటక రంగం అభివృద్ధి చెందడానికి కేంద్ర ప్రభుత్వం అనేక ప్రణాళికలు చేస్తోంది.ప్రధాని చేసిన లక్షద్వీప్ పర్యటన,ప్రచారం కూడా అందులో భాగమేనని అర్థం చేసుకోవాలి. లక్షద్వీప్ లో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు పెరగాల్సివుంది. పర్యాటక విధానంలో యువతకు ఉద్యోగాల కల్పన కూడా ముఖ్యమైన అంశం. ఇప్పుడు ఇంతగా చర్చకు,శోధనకు కేంద్రంగా మారిన ఈ ద్వీపం గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఇది దేశంలోనే అత్యల్ప సంఖ్యలో జనాభా కలిగిన అతి చిన్న కేంద్ర పాలిత ప్రాంతం. అరేబియా సముద్రంలో కేరళ తీరం నుంచి 200-300 కిలోమీటర్ల దూరంలో ఈ ద్వీపాలు వున్నాయి. ఈ ప్రాంత రాజధాని కవరత్తి నగరం.లక్షద్వీప్ పేరుతో ఒక జిల్లా కేంద్రం కూడా వుంది. లెక్కల్లోలేని అనేక ద్వీపాలు ఈ సముద్రంలో ఉన్నాయి.అందుకే లక్షద్వీప్ అనే పేరు వచ్చింది. ప్రస్తుతం దొరికే అంకెల ప్రకారం 10 దీవుల్లో మాత్రమే జనాభా వున్నారు. మిగిలిన 17 దీవులలో జనాభా శూన్యం. సముద్రగర్భంలో మాత్రం అనేక జీవరాసులు వున్నాయి. ఆగట్టిలో ఎయిర్ పోర్ట్ వుంది. కొచ్చిన్ నుంచి ఇక్కడికి విమానాల రాకపోకలు వున్నాయి. ఇక్కడ వున్నదంతా ముస్లిం జనాభానే. కాకపోతే,వీళ్లంతా మలయాళం యాసలో మాట్లాడుతారు. లక్షద్వీప్ గురించిన ప్రస్తావన తమిళ సాహిత్యంలో మొట్టమొదటగా వచ్చినట్లు చెబుతారు.ఒకప్పుడు పల్లవుల ఏలుబడిలో ఈ ప్రాంతం ఉన్నట్లు చరిత్ర చెబుతోంది. ప్రస్తుతం ఇక్కడ జనాభా మొత్తం కలిసి 70వేలు లోపే. మలయాళం,జెసేరీ ( ద్వీపంలోని స్థానిక భాష ),తమిళం,మలయాళ యాసతో అరబిక్,మహ్ల్ భాషలు ఇక్కడ వాడుకలో ఉన్నాయి. ప్రధానంగా మలయాళం -అరబిక్ సంస్కృతి ఇక్కడ రాజ్యమేలుతోంది. ఈ దీవులు మాల్దీవులలోని చాగోస్ దీవులను పోలివుంటాయి. "మీరు సాహసాలు చెయ్యాలనుకుంటున్నారా? అయితే,లక్షద్వీప్ లో 'స్మార్కెలింగ్ చేయండి. మీ సాహసాల జాబితాలో దీనిని కూడా చేర్చుకోండి "అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సూచిస్తున్నారు.ఇది అద్భుతమైన అనుభవమని కితాబు ఇస్తున్నారు. స్మార్కెలింగ్ అంటే?సముద్రంలో చేసే ఒక తరహా డ్రైవింగ్.స్మార్కెల్ అనే ట్యూబ్, డ్రైవింగ్ మాస్క్ వేసుకొని సముద్రగర్భంలో ఈత కొట్టడం అన్నమాట! దీని ద్వారా సాగర గర్భంలోని జీవరాశులను, పర్యావరణాన్ని తెలుసుకొనవచ్చు. మన ప్రధాని ఆ పని చేశారు. మొత్తంగా చూస్తుంటే, మాల్దీవులు -లక్షద్వీప్ మధ్య భవిష్యత్తులో పెద్ద పోటీ జరుగనుంది. వెరసి,మన పర్యాటకం ఊపందుకోనుంది. 👉: #Lakshadweep : ప్రకృతి చెక్కిన ‘అందాలు’.. లక్షదీప్ చూసొద్దామా.. (ఫొటోలు) రచయిత : మా శర్మ, సీనియర్ జర్నలిస్టు -
ఎన్నికల గుర్తు కన్నా.. నువ్వే బాగున్నావ్!
కామారెడ్డిటౌన్: ‘ఎన్నికల గుర్తు కన్నా.. ఈ ఫొటోలో ఉన్న నువ్వే చాలా బాగున్నావ్’అంటూ రిటర్నింగ్ అధికారి తనను ఉద్దేశించి అసభ్యంగా మాట్లాడినట్లు కామారెడ్డి నియోజకవర్గ స్వతంత్ర మహిళా అభ్యర్థి మంగిలిపల్లి భార్గవి ఆరోపించారు. శుక్రవారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మాక్ పోలింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తనకు కేటాయించిన బేబీవాకర్ గుర్తు ఈవీఎంలో సరిగా కనబడటంలేదని భార్గవి రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో శ్రీనివాస్‌రెడ్డి దృష్టికి తెచ్చారు. ఆ అధికారి వెంటనే ‘ఈ ఎన్నికల గుర్తు కన్నా నువ్వే చాలా బాగున్నావ్’అంటూ అసభ్యంగా మాట్లాడారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. స్వతంత్ర అభ్యర్థులతో కలిసి ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. నిరుద్యోగంతో బాధపడుతున్న తాను సీఎం కేసీఆర్‌పై పోటీ చేస్తున్నానని పేర్కొన్నారు. తనకు జరిగిన అవమానంపై ఆమె కంటతడి పెట్టారు. ఎన్నికల్లో ప్రధాన పార్టీల మహిళాఅభ్యర్థులు ఉంటే ఇలానే ప్రవర్తిస్తారా అని ప్రశ్నించారు. దీనిపై ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తానన్నారు. ఈ విషయమై శ్రీనివాస్‌రెడ్డిని వివరణ కోరగా తాను అసభ్యపదజాలం వాడలేదని చెప్పారు. -
‘ప్రతిపక్ష నేతలపై అనుచిత పోస్టులు పెట్టినా చర్యలు తప్పవు’
సాక్షి, విజయవాడ: సోషల్ మీడియాలో అనుచిత పోస్టుల వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది నేర దర్యాప్తు సంస్థ(Crime Investigation Department..సీఐడీ). ఈ క్రమంలో ఎవరి మీద పోస్టులు చేసినా వదలబోమని తాజాగా హెచ్చరించింది. సోషల్ మీడియాలో అనుచిత పోస్టుల అంశంపై దృష్టి సారించామని, నిబంధనల్ని ఎవరు ఉల్లంఘించినా చర్యలు తప్పవని ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ హెచ్చరించారు. ‘‘సీఎంపై, వారి కుటుంబసభ్యులపైనా అనుచిత పోస్టులు పెడుతున్నారు. మారుపేర్లతో పెడితే ఎవరికీ తెలీదని అనుకోవడం పొరపాటు. ఫేక్ అకౌంట్స్‌ను పట్టుకోలేమని అనుకోవడం సరికాదు. ఫేక్ అకౌంట్స్‌ను నడిపే వారిని పట్టుకుని చర్యలు తీసుకుంటాం. ఇలాంటి వారిని ప్రోత్సహించే వారిపైనా కఠిన చర్యలుంటాయి. హైకోర్టు జడ్జిలపైనా అనుచిత పోస్టులు పెడుతున్నారు. ఇటీవల మహిళా జడ్జిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంశంపైనా దృష్టిపెట్టాం’’ అని ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ పేర్కొన్నారు. బుధవారం ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈ మధ్య కాలంలో మంత్రులపైనా అనుచిత పోస్టులు పెడుతున్నారు. మహిళా నేతలపైనా అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారు. ఇలాంటి అనుచిత పోస్టులు పెట్టినవారిపై కచ్చితంగా చర్యలుంటాయి. అలాగే ప్రతిపక్ష నేతలపైనా సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులను పరిశీలిస్తున్నాం. ఎవరి మీద అయినా సరే సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు చేస్తే చూస్తూ ఊరుకోం. కఠిన చర్యలు మాత్రం తప్పవు అని స్పష్టం చేశారాయన. సోషల్ మీడియాను చాలా మంది దుర్వినియోగం చేస్తున్నారు. సోషల్ మీడియాను పాజిటివ్‌గా ఉపయోగించుకోవాలి. దీనిపై మరింత అవగాహన కల్పించాలని భావిస్తున్నాం అని సంజయ్ తెలిపారు. చదవండి: తుస్సుమనిపించిన పవన్.. ఎందుకంత వణుకు? గత ఏడాది 1450 పోస్టులు.. ఈ ఏడాది 2164 సోషల్ మీడియాలో వచ్చిన అభ్యంతర మెసేజ్‌లను తొలగించాం. న్యాయ వ్యవస్ధపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. అవసరమైతే వీరి ఆస్తులు సీజ్ చేయడానికి వెనకాడం. ప్రతిపక్షాలపై అసభ్యకర పోస్టులపై కూడా కఠినంగా వ్యవహరిస్తున్నాం. ఈ విధంగా 45 తప్పుడు పోస్టులని గుర్తించాం. ఇతర దేశాలలో ఉండి అశ్లీల, అసభ్యకర పోస్టులు పెట్టేవారిపై కేసులు నమోదు చేస్తాం. ఆయా దేశాల ఎంబసీతో సంప్రదింపులకు సీఐడీ ప్రత్యేక బృందాలు పంపించాం. యూకే, అమెరికా దేశాలకు సీఐడీ బృందాలు పంపాం. ఇప్పటికే 45 కేసుల్లో ఐదుగురిపై ఎల్వోసీ ప్రోసీడింగ్స్ చేపట్టాం. రాజకీయ పార్టీలపై ఉన్న అభిమానంతో అసభ్యకరపోస్టులు పెట్టి భవిష్యత్‌ను అంధకారం చేసుకోవద్దు’’ అని సీఐడీ సూచించింది. సోషల్ మీడియా అకౌంట్స్‌ను వ్యక్తిగత దూషణలకు వినియోగించొద్దు. హైకోర్టు న్యాయమూర్తిపై అనుచిత పోస్టింగ్‌లు 19 మందికి నోటీసులు ఇచ్చాం. ఇందులో బుద్దా వెంకన్న కూడా ఉన్నారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేరు మీద గోరంట్ల రామ్ అకౌంట్ నడుపుతున్నారు. ఆయనకు నోటీసులు ఇచ్చాం. సోషల్ మీడియాలో అసభ్యకర మెసేజ్‌లు పెట్టే 2,972 మందిపై సైబర్ బుల్లియింగ్ షీట్స్ ఓపెన్ చేశాం. సీఎం, ఆయన కుటుంబ సభ్యులని ఉద్దేశించి అసభ్యకర పోస్టులు పెడుతున్న అకౌంట్లని గుర్తించాం. సోషల్ మీడియా పేరుతో పరిధి దాటి అసభ్యకరమెసేజ్‌లు పెడితే కఠినంగా వ్యవహరిస్తాం’’ ఏపీ సీఐడీ స్పష్టం చేసింది. -
‘జాహ్నవి’ మృతిపై అనుచిత వ్యాఖ్యలు..విధుల నుంచి అధికారి తొలగింపు
సియాటెల్: అమెరికాలో రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన తెలుగు విద్యార్థిని కందుల జాహ్నవి(23)పై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలున్న పోలీసు అధికారిపై వేటు పడింది. పోలీస్ అధికారి డేనియల్ ఆడెరర్‌ను గస్తీ విధుల నుంచి తొలగించినట్లు సియాటెల్ పోలీస్ విభాగం గురువారం ధ్రువీకరించింది. అతడికి ఎలాంటి బాధ్యతలను అప్పగించలేదని కూడా తెలిపింది. అయితే, అడెరర్పై చర్యలు ఎప్పుడు తీసుకున్నదీ వెల్లడించలేదు. జనవరి 23వ తేదీన సియాటెల్‌లో కెవిన్ డేవ్ పోలీసు అధికారి నడుపుతున్న వాహనం ఢీకొని రోడ్డు దాటుతున్న కందుల జాహ్నవి ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న మరో అధికారి డేనియల్ అడెరర్ చులకన చేస్తూ మాట్లాడటంపై తీవ్ర దుమారం చెలరేగింది. అడెరర్ బారీ కెమెరా రికార్డింగ్ ఆధారంగా ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు సియాటెల్ పోలీస్ విభాగం పేర్కొంది. -
‘చంద్రబాబు అన్నమే తింటున్నారా?’ : ఎంపీ మాధవ్
సాక్షి, అనంతపురం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్సీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, బాబు వ్యాఖ్యలపై మండిపడ్డారు. చంద్రబాబును మహిళా లోకం క్షమించదని.. సదరు వ్యాఖ్యలపై చంద్రబాబును కలిసి నిలదీస్తానని ఎంపీ మాధవ్ చెప్పారు. చంద్రబాబు వైఎస్ విజయమ్మను కించపరిచారు. చంద్రబాబు కడుపుకు అన్నం తింటున్నారా? లేదంటే ఇంకేమైనా తింటున్నారా?. చంద్రబాబును మహిళా లోకం క్షమించదు. ముక్కు నేలకు రాసి చంద్రబాబు.. వెంటనే క్షమాపణ చెప్పాలి. లేదంటే చంద్రబాబు పర్యటనను అడ్డుకుని తీరతామని అని హెచ్చరించారు గోరంట్ల. అలాగే.. అనుచిత వ్యాఖ్యలపై చంద్రబాబు ను నిలదీస్తానని, అందుకోసం ఆయన శిబిరం వద్దకు వెళ్తానని ఎంపీ గోరంట్ల తెలిపారు. బుధవారం అనంత రాయదుర్గం బహిరంగ సభలో ప్రభుత్వాన్ని విమర్శించే క్రమంలో పూనకం వచ్చినట్లు ఊగిపోయిన చంద్రబాబు.. ‘‘జగన్.. నీ పుట్టుకే తప్పుడు పుట్టుక..’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ అనుచిత వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని వైఎస్సార్సీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. -
టీడీపీ కొత్త డ్రామా.. అర్జంటుగా బీసీ కార్డు గుర్తుకొచ్చిందా?
సాక్షి, విశాఖపట్నం: బీసీ నేత అయ్యన్నను అరెస్టు చేశారంటూ టీడీపీ కొత్త డ్రామాకు తెరతీసింది. అర్జంటుగా టీడీపీకి బీసీ కార్డు గుర్తుకొచ్చింది. నానా బూతులు తిడుతున్నప్పుడు అయ్యన్నకు గుర్తుకు రాని బీసీ కార్డు.. అయ్యన్నను అదుపు చేయనప్పుడు గుర్తుకు రాని బీసీ కార్డు.. అరెస్ట్ అనగానే టీడీపీకి గుర్తుకువచ్చిందా? అంటూ ఆ పార్టీ వైఖరీపై పలువురు దుమ్మెత్తిపోస్తున్నారు. కాగా, అనుచిత వ్యాఖ్యల కేసులో టీడీపీ నేత అయ్యన్న పాత్రుడిని అదుపులోకి తీసుకున్న కృష్ణా జిల్లా పోలీసులు.. ఆయనకు 41ఏ నోటీసులు ఇచ్చి.. అనకాపల్లి జిల్లా వెంపడు టోల్గేట్ వద్ద వదిలేశారు. ఇటీవల గన్నవరం యువగళం మీటింగ్‌లో సీఎంతో పాటు ఇతర మంత్రులను అయ్యన్న దూషించిన సంగతి తెలిసిందే. పత్రికల్లో రాయలేనంత దారుణంగా అయ్యన్న రెచ్చిపోయారు. మాజీ మంత్రి పేర్ని నాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయ్యన్నపై 153 A, 354 A1(4), 504, 505(2), 509 ఐపీఎస్ సెక్షన్ల కింద కేసు నమోదైంది. చదవండి: బాబు ‘బ్లాక్‌మనీ యవ్వారం’.. బిగ్ ట్విస్ట్ -
రెచ్చిపోయిన జేసీ ప్రభాకర్‌రెడ్డి.. పోలీసులను అరేయ్.. ఓరేయ్ అంటూ..
సాక్షి, అనంతపురం: తరచూ తన వ్యవహారశైలితో వివాదాలకు కేంద్ర బిందువుగా ఉండే తాడిపత్రి టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి మరోసారి నోరు పారేసుకున్నారు. తాడిపత్రి మున్సిపల్ అధికారులు, పోలీసులపై జేసీ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అరుపులు, కేకలతో దౌర్జన్యపూరితంగా వ్యవహరించారు. అరేయ్.. ఓరేయ్ అంటూ మీడియా సమావేశంలో ఊగిపోయారు. ఒక్కొక్కరి అంతుచూస్తానంటూ జేసీ బెదిరింపులకు దిగారు. ఇటు నియోజకవర్గంలోను, అటు టీడీపీ క్యాడర్లోను ఉనికి కోల్పోయిన జేసీ ప్రభాకర్‌రెడ్డి.. ఎలాగైనా ఉనికిని చాటుకునేందుకు చవకబారు రాజకీయాలు చేస్తున్నారు. గత నెల ఇసుక రవాణా వాహనాలను తగలబెడతానంటూ జేసీ తన వర్గీయులతో వీరంగం సృష్టించేందుకు యత్నించిన సంగతి తెలిసిందే. గత ఏడాది జేసీ ప్రభాకర్‌రెడ్డి ఏకంగా కలెక్టర్‌పైనే దౌర్జన్యం చేసిన సంగతి తెలిసిందే. కనీస మర్యాద కూడా లేకుండా కలెక్టర్‌ను ఏకవచనంతో సంబోధించడంతో పాటు ఆమె ముందే పేపర్లు విసిరేశారు. అడ్డుకోబోయిన కలెక్టర్ గన్‌మెన్‌ను తోసేసి నానా రభస సృష్టించారు. చదవండి: టీడీపీ అంటే తెలుగు ద్రోహుల పార్టీ: ఎంపీ విజయసాయిరెడ్డి -
టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: నాగర్ కర్నూల్ పీఎస్‌లో కాంగ్రెస్ ఎంపీ, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై కేసు నమోదు అయ్యింది. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే అభియోగంపై ఈ కేసు నమోదైనట్లు తెలుస్తోంది. జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు గుణవర్ధన్ జిల్లా ఎస్సీకి ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదు అయ్యింది. రేవంత్ రెడ్డితో పాటు ఏఐసీసీ కార్యదర్శి, వంశీ చంద్ రెడ్డి, మరోనేత సంపత్ కుమార్ లపై కేసు నమోదు చేశారు. ఐపీసీలోని సెక్షన్ 153.. రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడంతో పాటు సెక్షన్ 504 శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం, సెక్షన్ 506 బెదిరింపులకు పాల్పడడం కింద కేసు నమోదు చేశారు ఎస్పీ మనోహర్. మరోవైపు మహబూబ్ నగర్-- జడ్చర్ల, భూత్పూర్ పోలీసు స్టేషన్లలోనూ రేవంత్ రెడ్డిపై కేసులు నమోదయ్యాయి. -
అయ్యన్న పాత్రుడు ఇంటికి మరోసారి పోలీసులు..
సాక్షి, విశాఖపట్నం: మాజీ ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడిపై త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇటీవల ఆంధ్ర యూనివర్సిటీపై ట్విట్టర్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన అయ్యన్న పాత్రుడిపై ఏయూ జేఏసీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. జేఏసీ ఫిర్యాదు మేరకు అయ్యన్నపై కేసు నమోదు చేశారు. అయ్యన్నకు 41 కింద నోటీసులు ఇవ్వడానికి త్రీటౌన్ పోలీసులు నర్సీపట్నం వెళ్లారు. పోలీసులు వెళ్లిన సమయంలో ఇంటిదగ్గర అయ్యన్న లేకపోవడంతో అయ్యన్న కుటుంబసభ్యులకు నోటీస్ విషయాన్ని పోలీసులు తెలియపర్చారు. చదవండి: పంట కాలువను కబ్జా చేసిన అయ్యన్న -
మహిళలకు అసభ్యకర సందేశాలు.. మాజీ ఫుట్‌బాలర్ నిర్వాకం
అజాక్స్ ఫుట్‌బాల్ క్లబ్‌కు డైరెక్టర్ హోదాలో ఉన్న మాజీ ఫుట్‌బాలర్ మార్క్ ఓవర్‌మార్స్ బాగోతం వెలుగులోకి వచ్చింది. ఉన్నతస్థానంలో ఉంటూ మహిళలకు అసభ్యకర సందేశాలు పంపాడనే ఆరోపణలు వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన డచ్క్లబ్ ఓవర్మార్స్ను డైరెక్టర్ పదవి నుంచి తొలగించడమే గాక తాత్కాలిక నిషేధం విధించింది. కాగా నెదర్లాండ్స్‌కు చెందిన మార్క్ ఓవర్‌మార్స్ 11 ఏళ్ల పాటు జాతీయ జట్టుకు ఆడడంతో పాటు 1992-97 మధ్య కాలంలో అజాక్స్ ఫుట్‌బాల్ క్లబ్ తరపున ప్రాతినిధ్యం వహించాడు. చదవండి: Cristiano Ronaldo: రొనాల్డో అరుదైన ఘనత.. సోషల్ మీడియాను వదల్లేదు గత కొద్దిరోజులుగా మార్క్.. తనతో ఏకాంతంగా గడపాలంటూ తనతో పాటు పనిచేస్తున్న మహిళలకు అసభ్యరీతిలో సందేశాలు పంపాడు. మొదట ఇందులో నిజం లేదని కొట్టిసారేసినప్పటికి.. మెసేజ్‌లు వచ్చిన మహిళలు వాటిని బయటపెట్టడంతో మార్క్ బాగోతం బయటపడింది. కాగా 2012లో తొలిసారి అజాక్స్‌కు తొలిసారి డైరెక్టర్ అయ్యాడు. ఇటీవలే మరోసారి అజాక్స్ ఫుట్‌బాల్ డైరెక్టర్‌గా తిరిగి ఎంపికయిన మార్క్.. 2026, జూన్ 30 వరకు పదవిలో కొనసాగాల్సింది. తనపై వచ్చిన ఆరోపణలపై మార్క్ ఓవర్‌మార్స్ స్పందించాడు. ''నా ప్రవర్తనకు సిగ్గుపడుతున్నా. మహిళలకు అసభ్య సందేశాలు పంపినప్పుడు ఇలా జరుగుతుందని భావించలేదు. ఏది ఏమైనా నేను చేసింది తప్పు. నాపై యాక్షన్ తీసుకోవడం సరైనదే.. ఏ శిక్షకైనా సిద్ధం'' అంటూ క్షమాపణ కోరాడు. చదవండి: Beijing Winter Olympics: 'నరకంలా అనిపిస్తుంది.. పెట్టిందే పెట్టి మమ్మల్ని చంపుతున్నారు' Ajax statement on Marc Overmars 🔴⤵️ #Ajax “Overmars made this decision after discussions in recent days - a series of inappropriate messages sent to several female colleagues over an extended period of time underlies his decision to leave the club”. #Overmars pic.twitter.com/P3x4pisd1x — Fabrizio Romano (@FabrizioRomano) February 6, 2022 -
నువ్వు మంచిగున్నవ్!..సీఐ అనుచిత వ్యాఖ్యలు
కారేపల్లి: పొలం గట్టు తగాదాపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన ఓ మహిళతో సీఐ పెడార్థం వచ్చేలా మాట్లాడారన్న ఆరోపణ ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో కలకలం రేపింది. ‘నీవు మంచిగనే ఉన్నావ్ కదా! నువ్వు నాకు నచ్చినవ్!!’అంటూ సీఐ అనుచితంగా మాట్లాడాడని బాధితురాలు ఆరోపించడం స్థానికంగా సంచలనం సృష్టించింది. అయితే ఈ విషయాన్ని పాత్రికేయులకు వెల్లడించిన కొన్ని గంటల వ్యవధిలోనే ఆ మహిళ వారికి ఫోన్ చేసి ‘సమస్య పరిష్కారానికి అధికారులు హామీ ఇచ్చారు. నేను చెప్పినవేవీ పేపర్లలో రాయకండి’అని కోరడం గమనార్హం. బాధితురాలి కథనం ప్రకారం... కారేపల్లి మండలం రేలకాయలపల్లి గ్రామానికి చెందిన భూక్యా కాంతమ్మ, భూక్యా మమత తల్లీకుమార్తెలు. పెళ్లయిన మమత భర్తతో గొడవ కారణంగా తల్లి ఇంట్లోనే ఉంటోంది. మమత బాబాయి భూక్యా లక్ష్మణ్ ఇటీవల తమ చేను గట్టు ఆక్రమించి దున్నుతుండగా ప్రశ్నించడంతో కొట్టాడని మమత పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ లక్ష్మణ్ మరోసారి పత్తి చేను గట్టు దాటి వచ్చి అర ఎకరం వరకు ఆక్రమించి దున్నుతుండగా శనివారం రాత్రి 7 గంటలకు కారేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు మమత వెళ్లింది. అప్పుడే సీఐ అనుచితంగా మాట్లాడినట్లు మమత సోమవారం విలేకరులకు వెల్లడించింది. అంతేకాకుండా రాత్రి 11.30 వరకు ఒక్కదాన్నే పోలీసు స్టేషన్లో కూర్చోబెట్టారని, పెద్దవాళ్లతో గొడవలు ఎందుకు అని చెప్పారని ఆరోపించింది. అయితే సోమవారం సాయంత్రం మాత్రం ఈ విషయాలేవీ పత్రికల్లో రాయొద్దని కోరింది. ‘అనుకోకుండా జరిగింది. ఏదీ మనసులో పెట్టుకోకు. నీ సమస్య మొత్తం పరిష్కరిస్తాం. మీ బాబాయ్‌ను పిలిపించి నీ భూమి హద్దులు పెట్టిస్తాం’అని పోలీసులు చెప్పారని తెలిపింది. మమత ఆరోపణలపై కారేపల్లి సీఐ బి. శ్రీనివాసులును వివరణ కోరగా మమత ఫిర్యాదు పత్రం ఇష్టారీతిన ఉండడంతో మార్చి రాయాలని దబాయించిన మాట వాస్తవమేనని, కానీ అనుచితంగా మాట్లాడలేదన్నారు. -
కోరిక తీరిస్తే ఎంత డబ్బైనా ఇస్తానంటూ నటికి లెక్చరర్ వేధింపులు
సోషల్ మీడియాలో హీరోయిన్లకు వేధింపులు తప్పడం లేదు. ఎన్ని సార్లు బ్లాక్ చేసినా ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి మరీ తమ సైకోయిజాన్ని ప్రదర్శిస్తుంటారు. బాడీ షేమింగ్ చేస్తూ అసభ్య పదజాలంతో ఇష్టం వచ్చినట్లు దూషిస్తారు. ఇలాంటి వాటిని కనీసం పట్టించుకోకుండా లైట్ తీసుకునేవాళ్లు కొందరైతే, మరికొందరు మాత్రం వాళ్లకు బుద్ది వచ్చేలా గట్టి సమాధానమే ఇస్తారు. తాజాగా కోలీవుడ్ నటి సౌందర్య నందకుమార్‌కు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. తనను తాను లెక్చరర్‌గా పరిచయం చేసుకున్న ఓ వ్యక్తి ఆమెకు అసభ్యంగా మెసేజ్‌లు పెట్టాడు. తనతో ఓ రాత్రి గడపాలని ఇందుకోసం ఎంత డబ్బు అడిగినా ఇస్తానంటూ తన నీచత్వాన్ని బయటపెట్టాడు. ఇది చూసిన సౌందర్య అతడికి స్ర్టాంగ్ కౌంటర్ ఇచ్చింది. సదరు ఇన్స్టాగ్రామ్ ఖాతాను నెట్టింట రివీల్ చేసింది. అతడిపై చట్టరీత్యా కేసు నమోదు చేసి కటకటాల పాటు చేస్తానని గట్టి కౌంటర్ ఇచ్చింది. ఎలా అయినా అతడికి బుద్ది చెబుతానని పేర్కొంది. ఈ సందర్భంగా కాలేజీలో విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని, ఇలాంటి నీచమైన వ్యక్తులు కూడా లెక్చరర్ రూపంలో ఉంటారని హెచ్చరించింది. ఇక సింగర్‌గా కెరీర్ మొదలు పెట్టిన సౌందర్య ఆ తర్వాత పలు షార్ట్ ఫిల్మ్స్, టీవీ సీరియల్స్‌లో నటించింది. ఆ తర్వాత సినిమాల్లోనూ తన అదృష్టాన్ని ప్రదర్శించుకుంది. తాజాగా విజయ్ నటించిన మాస్టర్ సినిమాలోనూ ప్రముఖ పాత్ర పోషించింది. చదవండి : అనుమానాస్పద స్థితిలో ప్రముఖ నటుడి భార్య మృతి.. బాల్యం నుంచి వేధింపులు, మీ స్ఫూర్తితో ధైర్యం చేశా: నెటిజన్ -
సీఎంపై అనుచిత వ్యాఖ్యలు, డీఈ సస్పెన్షన్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎంవీ విద్యాసాగర్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ముఖ్యమంత్రిపై అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆయనను విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ, సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ సోమవారం సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. దుష్ప్రవర్తన, క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు సస్పెండ్ చేసినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ మాట్లాడుతూ... ‘డీఈ విద్యాసాగర్ తన మొబైల్ వాట్సాప్ గ్రూప్‌ల్లో కొన్ని ప్రభుత్వ వ్యతిరేక విషయాలను పోస్ట్ చేశారు. ముఖ్యమంత్రిని అసభ్య పదజాలంతో దూషిస్తూ, రాష్ట్ర ప్రభుత్వ విధానాలను తన వాట్సాప్ గ్రూప్‌లలో విమర్శించారు. మా విచారణలో ఆధారాలతో సహా అవన్ని వాస్తవమని తేలాయి. ఉద్యోగులు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో లేదా బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదు. అతిక్రమిస్తే రాష్ట్ర ప్రభుత్వ ప్రవర్తనా నియమావళి ప్రకారం క్రమశిక్షణా చర్యలు తీసుకుంటాం’ అని స్పష్టం చేశారు. చదవండి: ‘మా అమ్మ మంచి తల్లి, కానీ నేనే బ్యాడ్’ -
నీ సంగతి తేలుస్తా..
‘యూజ్లెస్ ఫెలో.. నువ్వు చీఫ్ మార్షల్ పోస్ట్‌కి అన్‌ఫిట్... నీ సంగతి తేలుస్తా..’ – అసెంబ్లీ గేటు వద్ద చీఫ్ మార్షల్ థియోఫిలస్‌పై ప్రతిపక్ష చంద్రబాబు తిట్ల దండకం. ‘మమ్మల్ని ఆపుతావా..! ఏం చేస్తున్నార్రా మీరు..?’ – చీఫ్ మార్షల్, మార్షల్స్‌పై నారా లోకేష్ అనుచిత వ్యాఖ్యలు. ‘ప్రతిపక్ష నేతను ఆపుతారా? ఎవడిచ్చాడ్రా మీకు ఉద్యోగం..? ఎవరు చెప్పాడ్రా ఆపమని..? చెప్పిన వాణ్ణి రమ్మను.. అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా..? మనుషులా జంతువులా..?’ – టీడీపీ సభ్యుల దూషణ. సాక్షి, అమరావతి: ప్లకార్డులు లేకుండా లోపలకు రావాలని కోరిన భద్రతా సిబ్బందిని బెదిరిస్తూ, దూషిస్తూ టీడీపీ శాసనసభ్యులు గురువారం అసెంబ్లీ సాక్షిగా దౌర్జన్యానికి దిగారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుతోపాటు ఆయన కుమారుడు నారా లోకేష్, ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడు, ఎమ్మెల్సీలు దీపక్‌రెడ్డి, ఏఎస్ రామకృష్ణ తదితరులు అసెంబ్లీ నాలుగో నంబర్ గేటు వద్ద మార్షల్స్, పోలీసులను తీవ్ర పదజాలంతో దూషించారు. మార్షల్స్‌ను గెంటేసి.. గేట్లు తెరచి... ప్రతిపక్ష నేత చంద్రబాబు తన స్థాయిని మరచిపోయి చీఫ్ మార్షల్, మార్షల్స్‌పై గల్లీలో గొడవకు దిగినట్లుగా దుర్భాషలాడారు. మూడు టీవీ చానళ్లపై నిషేధం ఎత్తివేయాలంటూ ఉదయం చంద్రబాబుతోపాటు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ నాలుగో గేటు వరకు ఫ్లకార్డులతో ప్రదర్శనగా చేరుకున్నారు. ఫ్లకార్డులతో లోపలకు వెళ్లకూడదని, వాటిని తీసేసి రావాలని కోరిన మార్షల్స్‌తో టీడీపీ సభ్యులు ఘర్షణకు దిగారు. చీఫ్ మార్షల్ థియోఫిలస్ అక్కడకు చేరుకుని వారికి వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించినా టీడీపీ సభ్యులు వినలేదు. ‘యూజ్లెస్ ఫెలో.. అన్నం తింటున్నారా.. గడ్డి తింటున్నారా.. జంతువుల్లా ప్రవర్తిస్తారా..?’ అంటూ మార్షల్స్‌పై తిట్లతో విరుచుకుపడ్డారు. మరోవైపు చంద్రబాబు ముందుకెళ్లి గేటు తీయాలని తమ ఎమ్మెల్యేలకు సూచిస్తూ మార్షల్స్, పోలీసులను దుర్భాషలాడారు. మార్షల్స్‌ను నెట్టేసి బలవంతంగా గేటు తెరిచిన చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ తదితరులు లోపలకు ప్రవేశించి కొద్దిసేపు హల్చల్ చేశారు. మార్షల్స్‌పైనే ఫిర్యాదు అసెంబ్లీ ప్రాంగణంలోకి వెళ్లిన అనంతరం కూడా లోకేష్, నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడు తదితరులు ‘ఏయ్.. నువ్వు కొత్తగా వచ్చావ్. ఏం చేయాలో తెలుసుకుని పని చెయ్..’ అంటూ చీఫ్ మార్షల్‌ని బెదిరిస్తూ తోపులాటకు దిగారు. టీడీపీ శాసనసభాపక్ష కార్యాలయంలోకి వెళ్లే వరకూ చంద్రబాబు, లోకేష్, ఇతర టీడీపీ నేతలు మార్షల్స్‌ని దూషిస్తూనే ఉన్నారు. అయితే మార్షల్సే తమను అడ్డుకుని దాడి చేసినట్లు చంద్రబాబు, అచ్చెన్నాయుడు తదితరులు సభలోకి చేరుకుని ఫిర్యాదు చేయడం కొసమెరుపు. గవర్నర్‌కు వినతిపత్రం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను వెంటబెట్టుకుని రాజ్‌భవన్‌లో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసిన ప్రతిపక్ష నేత చంద్రబాబు మీడియాపై ఆంక్షలు ఎత్తివేయాలని వినతిపత్రం ఇచ్చారు. అసెంబ్లీలో మూడు చానళ్లపై నిషేధం విధించారన్నారు. ‘ఉన్మాది’ అన్‌పార్లమెంటరీ పదం కాదు: చంద్రబాబు తాను ముఖ్యమంత్రిని ఉన్మాది అన్నానని గొడవ చేస్తున్నారని, అయితే అది అన్‌పార్లమెంటరీ పదం కాదని ప్రతిపక్ష నేత చంద్రబాబు పేర్కొన్నారు. టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సభా గౌరవం కాపాడాలని తాను కోరుతుంటే రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. కొవ్వెక్కితే ఎలా ఉంటారో వైఎస్సార్సీపీ నాయకుల్లో కనబడుతోందని వ్యాఖ్యానించారు. అసెంబ్లీలోకి కాగితాలు తీసుకెళ్లవద్దని తమను ఇప్పుడు ఆపుతున్నారని, గతంలో ఆ పార్టీ నాయకులు లిక్కర్ బాటిల్స్ కూడా తెచ్చారని ఆరోపించారు. అసెంబ్లీ మార్షల్స్‌పై లోకేష్ దౌర్జన్యం మార్షల్స్‌ను దూషిస్తున్న టీడీపీ నేతలు -
గాంధీజీపై ఐఏఎస్ అధికారిణి వివాదాస్పద వ్యాఖ్య
ముంబై: జాతిపిత మహాత్మాగాంధీపై అనుచిత వ్యాఖ్యలు కొనసాగుతూనే ఉన్నాయి. గాంధీని హత్య చేసిన గాడ్సేనే నిజమైన దేశ భక్తుడని ఎన్నికల సమయంలో బీజేపీ నేత, ప్రస్తుత భోపాల్ ఎంపీ ప్రజ్ఞాసింగ్ వ్యాఖ్యలు మరిచిపోకముందే.. ముంబైలో పనిచేస్తున్న ఓ ఐఏఎస్ అధికారిణి గాంధీపై అనుచితంగా ట్వీట్ చేశారు. వివరాలు.. బీఎంసీ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్న నిధి చౌదరి.. ‘మహాత్మాగాంధీ ముఖచిత్రాన్ని భారత కరెన్సీపై తొలగించాలి. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గాంధీ విగ్రహాలను, పలు సంస్థలు, రోడ్లకు పెట్టిన గాంధీ పేరును మార్పు చేయాలి. థ్యాంక్యూ గాడ్సే’అంటూ వివాదాస్పద ట్వీట్ చేశారు. అయితే దీనిపై పెద్ద ఎత్తున వివాదం చెలరేగడంతో గాంధీపై చేసిన ట్వీట్‌ను ఆమె డిలీట్ చేశారు. గాంధీపై వివాదాస్పద ట్వీట్ చేసిన నిధి చౌదరీని వెంటనే సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ చవాన్, ఎన్సీపీ నేత జితేంద్ర డిమాండ్ చేశారు. తీవ్ర విమర్శల నేపథ్యంలో ఆమె తన ట్వీటును తొలగించారు. ‘గాంధీని నేను అవమానించ లేదు. గాంధీ జాతిపిత. నేను వ్యంగ్యంగా చేసిన ట్వీటును తప్పుగా అర్థం చేసుకున్నారు’ అని మరో ట్వీటులో ఆమె చెప్పుకొచ్చారు. ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ‘నేను ఎప్పుడూ గాంధీజీని అవమానించలేదు. వ్యంగ్యంగా రాసిన పోస్టును అపార్థం చేసుకున్నారు. సోషల్ మీడియాలో గాంధీపై వ్యతిరేక, తప్పుడు వ్యాఖ్యానాలు అనేకమంది చేస్తున్నారు. ఈ వ్యతిరేక వ్యాఖ్యలను గాంధీ చూడకపోవడమే మంచిదని భావించి గాడ్సేకు ధన్యవాదాలు చెప్పానని నిధి తెలిపారు. -
ప్రజ్ఞాకు ఈసీ నోటీసులు
భోపాల్: మాలేగావ్ పేలుళ్ల కేసులో నిందితురాలు, భోపాల్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్‌కు ఎలక్షన్ కమిషన్ శనివారం నోటీసులు జారీ చేసింది. 26/11 ముంబై ఉగ్రదాడిలో అమరుడైన ఐపీఎస్ అధికారి హేమంత్ కర్కరేపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఈ నోటీసులిచ్చింది. ప్రజ్ఞాతో పాటు బీజేపీ భోపాల్ యూనిట్ అధ్యక్షుడు వికాస్ విరానీకి నోటీసులు ఇచ్చినట్లు భోపాల్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సుదామ్ చెప్పారు. 24 గంటల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించారు. ప్రజ్ఞా వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించామని, దీనికి సంబంధించి నివేదిక ఇవ్వాల్సిందిగా అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ (ఏఆర్వో) ను కోరామన్నారు. శనివారం ఉదయం ఆయన ఈ నివేదికను అందించారని.. దీనిపై ప్రజ్ఞా, వికాస్‌లకు నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. ఏఆర్వో ఇచ్చిన నివేదికను ఎలక్షన్ కమిషన్‌కు పంపనున్నామని వెల్లడించారు. కాగా, గురువారం భోపాల్‌లో బీజేపీ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ప్రజ్ఞామాట్లాడుతూ.. తన శాపం వల్లనే హేమంత్ చనిపోయారని వ్యాఖ్యానించారు. -
ఓటమి భయంతో అనుచిత వ్యాఖ్యలు
సాక్షి, చిలకలూరిపేట : ఓటమి భయంతో మతి భ్రమించి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతున్నారని వైఎస్సార్ సీపీ అసెంబ్లీ అభ్యర్థి విడదల రజని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. పట్టణంలో శనివారం రాత్రి నిర్వహించిన సీఎం చంద్రబాబు నాయుడు సభ విఫలం కావడంతో సహనం కోల్పోయి అనుచిత వ్యాఖ్యలకు దిగజారారని విమర్శించారు. తనను మహానటి అని పుల్లారావు విమర్శించటాన్ని తప్పు పట్టారు. తనకు తాను మహానాయకుడని చెప్పుకొనే ఆయన ఆ సినిమా ఎంత ప్లాప్ అయ్యిందో గుర్తించాలన్నారు. అలాగే ఈ ఎన్నికల్లో పుల్లారావు మట్టికరవటం ఖాయమని జోస్యం చెప్పారు. ప్రజలందరినీ మోసగించే కపటనటుడు మంత్రి ప్రత్తిపాటి అని నియోజకవరంలో అందరికీ తెలుసన్నారు. అసలు మీ గురించి, మీ జీవితం గురించి, మీరు రాజకీయాల్లోకి వచ్చిన నేపథ్యం గురించి ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోవాలని హితవు పలికారు. మీరు చేసిన మోసాలు, కుట్రలు, కుతంత్రాలు, వంచనలు, హత్యలు తప్ప మీ జీవితంలో చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్క మంచి పని లేదని ధ్వజమెత్తారు. రేషన్ డీలర్‌గా జీవితాన్ని ప్రారంభించిన పుల్లారావు.. ప్రకాశం జిల్లా నుంచి చిలకలూరిపేటకు వచ్చి, వ్యాపారం పేరుతో ఆర్యవైశ్యుల దగ్గర కోట్లాది రూపాయలు అప్పు చేసి వారికి ఎగనామం పెట్టారని ఆరోపించారు. కన్న తండ్రికి తలకొరివి పెట్టాల్సి వస్తుందని, మీరు ఊరు విడిచి పారిపోతే వేరొకరు మీ తండ్రి చితికి నిప్పు పెట్టిన విషయం బహుశా ఈ నియోజకవర్గ ప్రజలకు తెలియక పోవచ్చన్నారు. కన్న తల్లికి మీరు ఇప్పటికీ అన్నం పెట్టకపోతే, ఆమె ఒంటరిగానే జీవిస్తున్న సంగతి మీ నిజనైజానికి అద్దం పడుతుందన్నారు. వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలకు వెళ్లి అన్నదానం చేసేటప్పుడు, ఆ ఫొటోలకు ఫోజులిచ్చేటప్పడు మీ అమ్మానాన్నలు ఎప్పుడైనా గుర్తుకొచ్చారా అని ప్రశ్నించారు. అలాంటి ప్రత్తిపాటి పుల్లారావుకు తన కుటుంబాన్ని విమర్శించే అర్హత లేదన్నారు. ఆరోపణలకు ఆధారం ఉందా? తన భర్త విడదల కుమారస్వామిని తానే అమెరికా పంపినట్లు మంత్రి ప్రచారం చేసుకోవటం సిగ్గుచేటు వ్యవహారమన్నారు. తన భర్త 20 ఏళ్ల నాడు అమెరికా వెళ్లినప్పుడు ప్రత్తిపాటి పుల్లారావు గుడ్డి పత్తి వ్యాపారం చేసుకుంటూ, రైతులకు డబ్బులు చెల్లించకుండా దాక్కొనే పరిస్థితులు నియోజకవర్గ ప్రజలకు తెలుసన్నారు. వీఆర్ ఫౌండేషన్ పేరుతో విదేశాల్లో విరాళాలు వసూలు చేస్తున్నారని నీతి లేని ఆరోపణలకు దిగారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అమెరికా నుంచి ఇక్కడకు వచ్చాక పౌండేషన్ స్థాపించామని, దాని రిజిస్ట్రేషన్ ఇక్కడే ఉందని, దీనికి విరుద్ధంగా ఒక్క ఆధారం ఉన్నా పుల్లారావు నిరూపించాలని సవాలు విసిరారు. మా మామయ్య విడదల లక్ష్మీనారాయణకు మార్కెట్ యార్డు చైర్మన్ పదవి ఇప్పించానని చెబుతున్న మంత్రి పుల్లారావు, ఆ పదవి కోసం ఎంత డబ్బులు తీసుకుంది, మీ లోకేష్ బాబుకు ఎన్ని కోట్లు ఇప్పించింది ఆధారాలతో సహా తన కుటుంబ సభ్యులు నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. మల్లెల రాజేష్ నాయుడు డబ్బులు ఇస్తే గాని ప్రత్తిపాటి చారిటబుల్ ట్రస్ట్ తరఫున వైద్యశిబిరాలు నిర్వహించలేని మీరు కూడా కాకమ్మ కబుర్లు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఎడ్ల పందాలు కూడా రాజేష్ నాయుడు డబ్బులతోనే నిర్వహించింది వాస్తవం కదా అని ప్రశ్నించారు. వీఆర్ ఫౌండేషన్ పేరుతో మేము పేదలకు సాయం చేయాలని వచ్చామని తెలిపారు. కాని మీరు స్వర్ణాంధ్ర ఫౌండేషన్ పేరుతో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని నిరుద్యోగులను దారుణంగా మోసగించింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. వ్యాపారులకు అండగా ఉంటాం ఇప్పటికీ మీ భార్య పేరున వెంకాయమ్మ ట్యాక్స్ వసూలు చేస్తున్న మీరు, ఇతరులు గెలిస్తే పన్ను వసూలు చేస్తారని అవాస్తవాలు ప్రచారం చేయటం సిగ్గుచేటన్నారు. మీలాగా రాజకీయాల్లో పెట్టుబడి పెట్టి దానికి పదింతలు సంపాదించాలన్న దుర్భుద్ధితో రాజకీయాల్లోకి రాలేదని, మాకు ఉన్నదాంట్లో సేవ చేద్దామనే వచ్చామని చెప్పారు. తాము వ్యాపారులకు అండగా ఉంటామని వివరించారు. -
శరద్ యాదవ్ మాటలు సిగ్గుచేటు
జైపూర్: ఎన్నికల ప్రచారంలో తన శరీరాకృతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన లోక్తాంత్రిక్ జనతాదళ్ అధినేత శరద్ యాదవ్‌పై చర్యలు తీసుకోవాలని రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధరరాజే ఎన్నికల సంఘాన్ని కోరారు. రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి రోజు అయిన బుధవారం శరద్‌యాదవ్ మాట్లాడుతూ ‘రాజే చాలా లావై పోయారు, ప్రజలు ఆమెకు విశ్రాంతి ఇవ్వాల్సిన అవసరం ఉంది’ అని వ్యాఖ్యానించారు. ‘ఇది నాకు అవమానంగా అనిపించింది. నిజానికి ఇది మహిళా జాతికే అవమానం, ఆయన మాటలతో నేను నిశ్చేష్టురాలినయ్యాను. ఒక అనుభవమున్న సీనియర్ నేత నుంచి ఇలాంటి విమర్శలు ఎంతమాత్రం ఊహించలేదు’ అని ఆమె ఝలావర్‌లో విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. ఎన్నికల సంఘం దీనిపై దృష్టిసారించాలి. ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని ఆమె కోరారు. శరద్ యాదవ్ మాట్లాడినట్లుగా చెబుతున్న ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ప్రసారం కావడంతో ప్రజల నుంచి కూడా ఆయన మాటలపట్ల వ్యతిరేకత వ్యక్తమైంది. ‘మొదట్లో ఆమె నాజూకుగా ఉంది. ఇప్పుడు విపరీతంగా లావైపోయింది. ప్రజలు ఆమెకు విశ్రాంతినిస్తే బావుంటుంది’’ అని అన్నట్లుగా ఆ వీడియోలో ఉంది. ఈ వీడియో ఓటింగ్‌పై గణనీయమైన ప్రభావం చూపించే అవకాశం ఉంది. డిసెంబర్ 11న జరిగే ఓట్ల లెక్కింపులో ఈ ప్రభావం ఎంతన్నది తేలనుంది. -
ఢిల్లీ అసెంబ్లీలో ఎమ్మెల్యే ‘ఉగ్ర’ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేపై బీజేపీ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు ఢిల్లీ అసెంబ్లీలో కలకలం రేపాయి. సోమవారం అసెంబ్లీలో మంచినీటి సమస్యపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే ఓపీ శర్మ మాట్లాడుతూ..తన నియోజకవర్గంలో నీటి సమస్యకు అధికారులే కారణమని ఆరోపించారు. దీనిపై ఆప్ సభ్యుడు అమానతుల్లా ఖాన్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఓపీ శర్మ అనుచితంగా మాట్లాడారు. ‘తప్పు చేస్తే ఉగ్రవాదుల మాదిరిగా నువ్వూ జైలుకు పోతావ్. ఉగ్రవాదిలా ఎందుకు మాట్లాడుతున్నావ్? ఉగ్రవాదిలా ఎందుకు ప్రవర్తిస్తున్నావ్? నాతో పెట్టుకోకు. ఫన్నీఖాన్‌లాగా ఉండకు. కూర్చో’ అంటూ దూషించారు. ఈ వ్యాఖ్యలు శాసనసభ ప్రతిష్టకు భంగకరమంటూ ఆప్ సభ్యులు ఆందోళనకు దిగారు. మత విద్వేషాలను రెచ్చగొట్టి దేశాన్ని ముక్కలు చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యత్నిస్తోందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆరోపించారు. -
కేసీఆర్ బహిరంగ క్షమాపణలు చెప్పాలి
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీపై ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ప్రజల్లోకి చేరనివ్వకుండా ఆయన కుటుంబ సభ్యులు దాని స్థాయిని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ శాసన సభా పక్ష నేత కిషన్‌రెడ్డి ఆక్షేపించారు. నోరు జారి మాట్లాడారన్న ఎంపీ కవిత వ్యాఖ్యలను స్వాగతిస్తూనే.. కేసీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్ నాంపల్లిలోని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ వ్యాఖ్యలు సీఎం స్థాయిని దిగజార్చేలా, ప్రధాని పదవిని అవమానించేలా ఉన్నాయన్నారు. రాష్ట్రానికి కేంద్ర సాయం లభిస్తోందంటూ శాసన సభలో పొగిడిన కేసీఆర్ ఇప్పుడు మాట మార్చడం సరికాదన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన మహనీయులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, దీన్‌దయాళ్ ఉపాధ్యాయలను వాడు, వీడు అంటూ వ్యాఖ్యానించడం కేసీఆర్ నీచ రాజకీయాలకు నిదర్శనమన్నారు. కేంద్రం ఇచ్చే నిధులతో లబ్ధిపొందుతూ రాష్ట్ర పథకాలుగా మార్చి వాటికి కేసీఆర్ కిట్ అంటూ నామకరణం చేసుకున్న చరిత్ర కేసీఆర్‌దని నిప్పులు చెరిగారు. రైతాంగానికి బీజేపీ ఏమి చేసిందో బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. రాష్ట్రంలో 11 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి కేంద్రం చేయూతను ఇచ్చినట్లు వివరించారు. నాలుగేళ్లలో రాష్ట్రానికి ఏమి చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. మీ చేతగాని తనాన్ని కేంద్రంపై రుద్దే ప్రయత్నం చేయవద్దని హితవు పలికారు. రైతుల రుణమాఫీ ఎందుకు పూర్తిగా చేయలేదో సమాధానం చెప్పాలన్నారు. బీజేపీని ఒవైసీ అంతం చేస్తాడట! దేశ వ్యాప్తంగా బీజేపీ హవా నడుస్తోందని దాన్ని అంతం చేయడం ఎంఐఎం నేత అసదుద్దీన్ తరం కాదన్నారు. ఏనుగులు వెళ్తుంటే కుక్కలు మొరిగినట్లుగా ఒవైసీ ప్రవర్తన ఉందన్నారు. సికింద్రాబాద్‌లో పాగా వేస్తాం.. అంబర్‌పేటలో గెలుస్తామంటూ గతంలో అసదుద్దీన్ అనేకమార్లు సవాల్ విసిరారని, ఎక్కడా గెలువలేకపోయారన్నారు. ఒవైసీకి దమ్మూ ధైర్యం ఉంటే రాబోయే ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానంలో పోటీ చేసి గెలిచి చూపించాలని సవాల్ విసిరారు. హైదరాబాద్ ఎంపీ సెగ్మెంట్లోనూ బీజేపీనే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఒవైసీ సోదరులు ఎలా చెప్తే కేసీఆర్ అలా నడుచుకుంటున్నారన్నారు. ఒవైసీ, కేసీఆర్ ఎన్ని రాజకీయాలు చేసినా బీజేపీ గెలుపును ఆపలేరని కిషన్‌రెడ్డి విమర్శించారు.