సాక్షి, హైదరాబాద్: నాగర్ కర్నూల్ పీఎస్‌లో కాంగ్రెస్ ఎంపీ, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై కేసు నమోదు అయ్యింది. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే అభియోగంపై ఈ కేసు నమోదైనట్లు తెలుస్తోంది. జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు గుణవర్ధన్ జిల్లా ఎస్సీకి ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదు అయ్యింది.
రేవంత్ రెడ్డితో పాటు ఏఐసీసీ కార్యదర్శి, వంశీ చంద్ రెడ్డి, మరోనేత సంపత్ కుమార్ లపై కేసు నమోదు చేశారు. ఐపీసీలోని సెక్షన్ 153.. రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడంతో పాటు సెక్షన్ 504 శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం, సెక్షన్ 506 బెదిరింపులకు పాల్పడడం కింద కేసు నమోదు చేశారు ఎస్పీ మనోహర్. మరోవైపు మహబూబ్ నగర్-- జడ్చర్ల, భూత్పూర్ పోలీసు స్టేషన్లలోనూ రేవంత్ రెడ్డిపై కేసులు నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment