Nagarkurnool
-
72 గంటలు గడిచినా ఇంకా దొరకని 8 మంది ఆచూకీ
-
నాగర్ కర్నూల్ జిల్లా మైలారంలో ఉద్రిక్తత
-
మహా ‘ఘన’పతిం..
సాక్షి, నాగర్‌కర్నూల్: దేశంలోనే ఎత్తయిన ఏకశిలా వినాయకుని విగ్రహం నాగర్‌కర్నూల్ జిల్లాలోని తిమ్మాజిపేట మండలం ఆవంచ గ్రామంలో ఉంది. దుందుభీ వాగు తీరంలో వెలసిన ఈ వినాయకుడికి ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. కర్ణాటకలోని శ్రావణ బెళగోళలోని గోమటేశ్వరుడు, చాముండి కొండపై నందీశ్వరుడితోపాటు.. ఆవంచలోని గణపతి సైతం అతిపెద్ద ఏకశిలా విగ్రహాలుగా ప్రసిద్ధి. హైదరాబాద్ నుంచి వంద కిలోమీటర్ల దూరంలో.. జడ్చర్ల పట్టణానికి చేరువలో ఆవంచ గ్రామంలో ఈ మహా గణనాథుని విగ్రహం ఉంది. ఏటా వినాయక చవితి సందర్భంగా వందలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి మహా గణపతిని దర్శించుకుంటారు. స్థానికులు ఐశ్వర్య గణపతిగా పిలిచే గణనాథునికి ఇప్పటికీ ఆలయం లేకపోవడంతో నిత్య పూజలకు నోచుకోవడం లేదు. పశ్చిమ చాళుక్యుల కాలంలో.. పశ్చిమ చాళుక్యుల కాలంలో ప్రముఖులైన జగదేకమల్లుడు, భువనైకమల్లుడు, తైలోక్యమల్లుడు ఆవుల మంచాపురాన్ని రాజధానిగా చేసుకుని పాలించారు. నాటి ఆవుల మంచాపురాన్నే కాలక్రమంలో ఆవంచగా పిలుస్తున్నారు. తెలుగు నేలను పాలించిన ఇక్షాు్వ్కలు.. గణపతి భక్తులు కావడంతో ఇక్కడ 26 అడుగుల ఎత్తయిన ఏకశిలా గణపతిని నెలకొల్పినట్లు చరిత్ర పరిశోధకులు చెబుతున్నారు. పశ్చిమ చాళుక్యుల కాలంలో వెలుగొందిన ఆవంచ గ్రామంలో లభించిన విగ్రహాలు, శిల్పాలను మహబూబ్‌నగర్ జిల్లాలోని పిల్లలమర్రి మ్యూజియంలో భద్రపరిచారు. పశ్చిమ చాళుక్యుల కాలంలోనే గ్రామ శివారులోని భైరవాలయంలోని ప్రతిమలు, మరో స్తంభంపై శివపంచాయతనం చెక్కినట్లు స్పష్టమవుతోంది. ఆదరణ లేక.. ఆవంచలోని భారీ ఏకశిలా గణనాథునికి ఆలయాన్ని నిర్మించేందుకు ఒక చారిటబుల్ ట్రస్టు ఏడేళ్ల కిందట ముందుకొచి్చంది. ఆలయం కోసం ఆరు ఎకరాల స్థలాన్ని సైతం కొనుగోలు చేసింది. అయితే ఆలయ నిర్మాణ పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. ఏళ్ల తరబడి ఆలయ నిర్మాణానికి నోచుకోకపోవడంతో వినాయకునికి నిలువ నీడ లేకుండా పోయింది. ప్రభుత్వం స్పందించి ఆలయ నిర్మాణం చేపట్టి.. పర్యాటకంగానూ అభివృద్ధి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.ప్రభుత్వం దృష్టి సారించాలి పురాతన కాలం నాటి వినాయకుని ఏకశిలా విగ్రహానికి ఆలయ నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి సారించాలి. ఏళ్లపాటు గణనాథుడు నిరాదరణకు గురవుతున్నాడు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి ఆవంచ వినాయకుని పర్యాటకంగా అభివృద్ధి చేయాలి. – కిరణ్, ఆవంచ, తిమ్మాజిపేట మండలం, నాగర్‌కర్నూల్ జిల్లా -
నాగర్ కర్నూల్ పోలీసులు చేసిన పనికి అందరూ షాక్
-
మీ సొంత ఖర్చులతో షెడ్ నిర్మించండి
సాక్షి, హైదరాబాద్: చట్టవిరుద్ధంగా, స్టే ఆదేశాలను బేఖాతర్ చేస్తూ చిన్నషెడ్ కూల్చివేసినందుకు బాధ్యత వహిస్తూ సొంత ఖర్చుతో పున:నిర్మించాలని నాగర్‌కర్నూల్ జిల్లా పంచాయతీ అధికారిని హైకోర్టు ఆదేశించింది. నిలిపివేత ఉత్తర్వులున్నా పాటించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నిరుపేద దంపతులు కట్టుకున్న చిన్నషెడ్ను బుల్డోజర్తో కూల్చివేసి అధికారులు తమ ఆధిపత్యాన్ని చూపే ప్రయత్నం చేశారని మండిపడింది.ఇదే తీరులో పలుకుబడి వర్గానికి చెందిన వారి నిర్మాణాలకు కూల్చగలరా అని ప్రశ్నించింది. నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంటలో చాలా ఏళ్ల క్రితం ఇల్లు (చిన్నషెడ్) నిర్మించుకున్నామని, సంబంధిత డాక్యుమెంట్లు సమర్పించినా కూల్చివేతకు నోటీసులు జారీ చేశారంటూ కటకం మహేశ్, నాగలక్ష్మి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చిన్న బడ్డీషాపు నిర్వహణకు ట్రేడ్ లైసెన్స్ తీసుకోవడంతోపాటు ఆస్తి పన్ను చెల్లిస్తున్న విషయాన్ని కూడా కనీసం పరిగణనలోకి తీసుకోలేదన్నారు.ఎలాంటి కారణం లేకుండానే నిర్మాణాల తొలగింపునకు పంచాయతీరాజ్ అధికారులు నోటీసులు జారీ చేశారన్నారు. ఈ నేపథ్యంలో తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని అధికారులను ఆదేశిస్తూ మధ్యంతర స్టే ఉత్తర్వులను కోర్టు మంజూరు చేసింది. మరోవైపు తమ వాదనలను దాఖలు చేయాలని పంచాయతీరాజ్ శాఖను కోర్టు ఆదేశించింది.కౌంటర్ దాఖలు చేయకుండా, మధ్యంతర స్టే ఉత్తర్వులు కొనసాగుతుండగానే మహేష్, నాగలక్ష్మిల ఇంటిని అధికారులు కూల్చివేశారు. పిటిషన్‌పై జస్టిస్ టి.మాధవీదేవి విచారణ చేపట్టారు. సోమవారం విచారణ సందర్భంగా డీపీఓను నేరుగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించడంతో మంగళవారం ఆయన కోర్టుకు హాజరయ్యారు. కోర్టు ధిక్కారానికి పాల్పడినందుకు సొంత ఖర్చుతో నిర్మాణం చేపట్టాలని న్యాయమూర్తి ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
పురిటి నొప్పులు భరిస్తూ.. పరీక్ష రాసి..
నాగర్‌కర్నూల్ క్రైం: ఉద్యోగం సాధించాలన్న తపనతో ఓ నిండు గర్భిణి గ్రూప్–2 పరీక్షకు హాజరైంది. పరీక్ష రాస్తుండగానే పురిటినొప్పులు వచ్చి నా ఆమె చలించలేదు.. పట్టుబట్టి పరీక్ష రాసిన తర్వాతే కాన్పు కోసం ఆస్పత్రికి వెళ్లింది. నాగర్‌కర్నూల్ జిల్లాకేంద్రంలో జరిగిన ఈ సంఘటన వివరాలివి. జిల్లాకేంద్రంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రానికి బల్మూరు మండలం బాణాల గ్రామానికి చెందిన రేవతి (25) నిండు గర్భిణి. అయితే ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న లక్ష్యంతో చాలా కష్టపడి చదివి గ్రూప్–2 పరీక్షల కోసం వేచి చూసింది. ఈ మేరకు సోమ వారం పరీక్ష రాస్తుండగా అకస్మాత్తుగా పురిటి నొప్పులు వచ్చాయి. విష యం తెలుసుకున్న అధికారులు కలెక్టర్ బదావత్ సంతోశ్‌కు సమాచారం అందించగా.. ప్రత్యేక అంబులెన్స్ ఏర్పాటు చేశారు. అయితే అందుకు నిరాకరించిన గర్భిణి.. పరీక్ష పూర్తయిన తర్వాతే కాన్పు కోసం వెళ్తానని పట్టుబట్టింది. తీవ్రమైన పురిటి నొప్పులను భరిస్తూనే పరీక్ష రాసిన అనంతరం ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆంధ్రా రియల్ ఎస్టేట్.. టీడీపీ విజన్ డాక్యుమెంట్ -
తెలంగాణాలో మరోసారి ఫుడ్ పాయిజన్ కలకలం
సాక్షి,నాగర్ కర్నూల్ జిల్లా : తెలంగాణాలో మరోసారి ఫుడ్ పాయిజన్ కలకలం రేపుతుంది. నాగర్ కర్నూల్ జిల్లా,నాగర్ కర్నూల్ మండలం నాగనూలు కస్తూరిబా పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయ్యింది. కస్తూరిబా పాఠశాలలో ఆహారం తిని విద్యార్థులు వాంతులు, విరోచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది విద్యార్థుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో నాణ్యత కొరవడింది. ఫలితంగా ఇటీవల కాలంలో పాఠశాలలో భోజనం తిని అస్వస్థతకు గురవుతున్న ఘటనలు నిత్యకృత్యమవుతున్నాయి. అందుకు నవంబర్ 27న నారాయణపేట జిల్లా మాగనూర్ జడ్పీ హైస్కూల్లో ఫుడ్ పాయిజన్ ఘటనపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలే నిదర్శనం.మాగనూర్ హైస్కూల్లో మధ్యాహ్న భోజనం వికటించి 50 మంది అస్వస్థతకు గురై వారం రోజులు కాకుండానే.. అదే పాఠశాలలో మళ్లీ 29 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ చేపట్టింది.విచారణ సందర్భంగా వారంలో మూడుసార్లు భోజనం వికటిస్తే అధికారులు ఏం చేస్తున్నారు? పిల్లలు చనిపోతే తప్ప స్పందించరా?అధికారుల నిర్లక్ష్యానికి ఇది నిదర్శనం.హైకోర్టు ఆదేశాలు ఇస్తేనే అధికారులు పనిచేస్తారా? వారికి కూడా పిల్లలున్నారు కదా! మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తే 5 నిమిషాల్లో హాజరవుతారు ' అని హైకోర్టు వ్యాఖ్యానించింది.ఈ క్రమంలో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలకు ఉపక్రమించింది. ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతున్న ఫుడ్ పాయిన్ కేసులకు సంబంధించి కారణాలు తేల్చేందుకు ఫుడ్ సేప్టీ కమిషనర్, అదనపు డైరెక్టర్, జిల్లా స్థాయి అధికారితో టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఫుడ్ సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. -
ఇప్పటికి ఈ స్మారక శిల వయసు 3,500 ఏళ్లు
సాక్షి, హైదరాబాద్: మూడున్నర వేల ఏళ్ల క్రితం నాటి స్మారక శిల (మెన్హిర్) వెలుగు చూసింది. నాగర్‌కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలం కంసానిపల్లె గ్రామ శివారులో డిండి నదీ తీరంలో దీన్ని గుర్తించారు. వారసత్వ ప్రాంతాలను పరిరక్షించాలంటూ ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాల్లో భాగంగా ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో, పురావస్తు పరిశోధకుడు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి గురువారం డిండి నదీ తీరాన్ని సందర్శించారు. కొండారెడ్డి పల్లి– ఉప్పునుంతల మధ్యలో నదీ తీరంలో ఈ నిలువురాయిని గుర్తించారు. భూ ఉపరితలంలో ఎనిమిది అడుగుల ఎత్తు, రెండడుగుల వెడల్పు, ఒకటిన్నర అడుగు మందంతో ఉన్న ఈ స్మారక శిల కొంతమేర పక్కకు ఒరిగి ఉంది. గ్రానైట్ శిలతో చేసిన ఈ స్మారకం 3,500 ఏళ్ల క్రితం ఇనుపయుగం నాటిదిగా ఆయన పేర్కొన్నారు. అప్పట్లో స్థానిక మానవసమూహంలో చనిపోయిన ప్రముఖుడికి గుర్తుగా దీన్ని పాతారని, గతంలో ఈ ప్రాంతంలో ఆదిమానవుల కాలం నాటి బంతిరాళ్ల సమాధులు ఉండేవని, వ్యవసాయ పనుల్లో భాగంగా అవి కనుమరుగయ్యాయని స్థానికులు తిప్పర్తి జగన్మోహన్రెడ్డి, అభిలాశ్రెడ్డి, సాయికిరణ్‌రెడ్డి తదితరులు ఆయన దృష్టికి తెచ్చారు. మన చరిత్రకు సజీవ సాక్ష్యంగా ఉన్న ఈ నిలువు రాయినైనా కాపాడుకోవాలని ఆయన స్థానికులకు సూచించారు. -
తెలంగాణలో మినీ మాల్దీవులు...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)
-
ప్రభుత్వ భూముల్లో ఈత వనాల పెంపకం
సాక్షి, నాగర్‌కర్నూల్: అన్ని వర్గాల ప్రజలను ఏకం చేసి రాజ్యాధికారాన్ని సాధించిన యోధుడు సర్దార్ సర్వాయిపాపన్న గౌడ్ అని రాష్ట్ర ఎక్సైజ్ శాఖమంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం నాగర్‌కర్నూల్ జిల్లాకేంద్రంలో పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలోని కల్లుగీత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. ఈత వనాల పెంపకం కోసం గౌడ సొసైటీలకు ప్రభుత్వ భూములు కేటాయిస్తామని తెలిపారు. ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో విరివిగా ఈత వనాలను పెంచనున్నట్టు చెప్పారు. అలాగే సాగునీటి కాల్వల గట్లపై కూడా ఈత వనాలను పెంచుతామన్నారు. వైన్‌షాపుల కేటాయింపులో ప్రస్తుతం అమలులో ఉన్న 15 శాతం రిజర్వేషన్‌ను సొసైటీ సభ్యులకు వర్తింపజేసేలా కృషి చేస్తామని చెప్పారు. ఏళ్లుగా దాగి ఉన్న సర్వాయి పాపన్నగౌడ్ చరిత్రను బయటకి తెచ్చామని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. గీత కార్మికులకు అండగా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. గౌడ కార్మికులకు రక్షణ కిట్లను అందిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డికి శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ కృతజ్ఞతలు తెలి పారు. ఈ కార్యక్రమంలో టీపీ సీసీ సీనియర్ నేత మధు యాష్కిగౌడ్, బీసీ సంఘాల నేత జాజాల శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీలు గోరటి వెంకన్న, దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, రాజేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
TG: మట్టిమిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురి మృతి
సాక్షి, నాగర్‌కర్నూల్: మట్టిమిద్ కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడిన ఘటన జిల్లాలోని వనపట్లలో చోటు చేసుకుంది. వర్షం కారణంగా తడిచిన మట్టి ఇంటి మిద్దె, గోడ ఒక్కసారిగా కూలిపోయాయి. నిద్రిస్తున్న ఆ కుటుంబం మీద పడ్డాయి. ఘటనలో గొడుగు పద్మ (26), ఆమె ఇద్దరు కూతుర్లు పప్పి(6) , వసంత (6) , కొడుకు (10) నెలలు విక్కీ కన్నుమూశారు. తండ్రి భాస్కర్(28)కు గాయాలు కావడంతో చికిత్స కోసం జిల్లాస్పత్రికి తరలించారు. ముగ్గురు బిడ్డలతో తల్లి ఊహించిన ప్రమాదంలో చనిపోవడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. -
‘కల్కి 2898 ఏడీ’ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ‘ఐతోలు’ బిడ్డె!
‘కల్కి 2898 ఏడీ’ అద్భుతమైన సైన్స్ విజువల్ సినిమాతో ప్రపంచ ప్రేక్షకుల మన్ననలు అందుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ఈ చిత్ర దర్శకుడు మన పాలమూరు బిడ్డే. బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, రెబల్‌స్టార్ ప్రభాస్, కమల్‌హాసన్, దీపికా పదుకొణే, విజయ్ దేవరకొండ, దిశా పటానీ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, మాళవిక నాయర్ వంటి టాప్‌స్టార్లతో రూపొందించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదలై.. భారీ హిట్‌గా దూసుకెళుతోంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ స్వస్థలం నాగర్‌కర్నూల్ జిల్లా ఐతోలులో పండుగ వాతావరణం నెలకొంది. సాక్షి, నాగర్‌కర్నూల్/తాడూరు: దర్శకుడిగా మూడో సినిమానే హాలీవుడ్ తరహా చిత్రీకరణతో ప్రపంచవ్యాప్తంగా ప్రసంశలు అందుకుంటున్న నేపథ్యంలో అందరి దృష్టి నాగ్ అశి్వన్పై పడింది. దీంతో సినిమా డైరెక్టర్ గురించి తెలుసుకునేందుకు నెటిజన్లలో ఆసక్తి పెరుగుతోంది. తాడూరు మండలం ఐతోలు గ్రామానికి చెందిన నాగ్ అశ్విన్ తల్లిదండ్రులు ఇద్దరూ డాక్టర్లే. ఆయన తండ్రి డాక్టర్ సింగిరెడ్డి జయరాంరెడ్డి హైదరాబాద్‌లో యూరాలజిస్ట్‌గా, తల్లి జయంతిరెడ్డి గైనకాలజిస్ట్‌గా సేవలందిస్తున్నారు. వృత్తిరీత్యా వారు హైదరాబాద్‌కు వెళ్లినా.. గ్రామంలో సొంతిల్లు, దగ్గరి బంధువులు చాలా మందే ఉన్నారు. కుటుంబ, ఇతర శుభకార్యాలు ఉన్నప్పుడు అందరూ ఐతోలుకు వచ్చి వెళుతుంటారు. ⇒ హైదరాబాద్ పబ్లిక్ స్కూలులో చదువుకున్న నాగ్ అశ్విన్‌కు చిన్నప్పటి నుంచి పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నిర్మూలనపై ఆసక్తి ఎక్కువగా ఉండేది. మాస్ కమ్యూనికేషన్స్, జర్నలిజంలో బ్యాచిలర్స్ పూర్తి చేశాడు. ఆ తర్వాత న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో డైరెక్షన్ కోర్సు చేశాడు. సినిమాలకు దర్వకత్వం వహించాలనే లక్ష్యంగా ‘నేను మీకు తెలుసా?’ చిత్రానికి తొలిసారిగా అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేసిన అశ్విన్.. ఆ తర్వాత శేఖర్ కమ్ముల దగ్గర లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తూనే.. ఆ చిత్రాల్లో చిన్నపాత్రలు సైతం వేశారు. అయితే 2013లో రచయిత, దర్శకుడిగా తీసిన ఇంగ్లిష్ లఘు చిత్రం ‘యాదోం కీ బరాత్’ కేన్స్ షార్ట్ ఫిల్మ్ కార్నర్‌కు ఎంపికైంది. అనంతరం 2015లో ‘ఎవడే సుబ్రమణ్యం’ దర్శకుడిగా పరిచయమై సూపర్ హిట్‌తో తొలి చిత్రానికే నంది అవార్డు అందుకున్నారు. అదే ఏడాది వైజయంతి మూవీస్ అధినేత, నిర్మాణ అశ్వినిదత్ కుమార్తె ప్రియాంకను వివాహం చేసుకున్నారు. 2018లో అలనాటి హీరోయిన్ సావిత్రి బయోపిక్‌గా తీసిన ‘మహానటి’ సినిమా దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు నిచ్చింది. ‘బయోపిక్’లో కొత్త ఒరవడి సృష్టించిన ఈ చిత్రం 66వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఉత్తమ తెలుగు సినిమాగా ఎంపికైంది. వీటితో పాటు 2021లో వచ్చిన పిట్టకథలు వెబ్ సిరీస్‌లో ‘ఎక్స్‌లైఫ్’ సిగ్మెంట్‌కు దర్శకత్వం వహించారు. అలాగే అదేఏడాది తెలుగులో సూపర్ హిట్ అయిన జాతిరత్నాలు సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. తాజాగా ఇండియాలోనే భారీ బడ్జెట్ రూ.600 కోట్లతో తీసిన పురాణ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం రికార్డులు కొల్లగొడుతోంది. స్వగ్రామంలో హర్షాతిరేకాలుదర్శకుడు నాగ్ అశి్వన్ తెరకెక్కించిన సినిమా ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆకర్షిస్తుండటం, ఘన విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఆయన స్వగ్రామం తా డూరు మండలం ఐతోలులో పండుగ వాతావరణం నెలకొంది. గ్రామంతో పాటు జిల్లాకేంద్రంలోనూ ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి తమ సంతోషాన్ని చాటుకుంటున్నారు. నాగ్ అశి్వన్ కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడినా సొంత ఊరిపైనున్న మమకారాన్ని వదులుకోలేదు. గ్రామంలో సాయిబాబా ఆలయాన్ని నిర్మించి, నిర్వహణ బాధ్యతలను కూడా వారే చూసుకుంటుండటం గమనార్హం. ఏళ్ల నాటి కల నెరవేర్చుకున్నాడు.. మంచి దర్శకుడిగా ఎదగాలన్న తన ఏళ్ల నాటి కలను నాగ్ అశ్విన్ నెరవేర్చుకున్నాడు. కల్కి సినిమా పార్ట్–1 విజయవంతమై అందరి ప్రసంశలు అందుకుంది. భవిష్యత్‌లోనూ ఈ విజయాల పరంపర కొనసాగాలి. సినిమా గొప్ప విజయం సాధిస్తున్నందుకు సంతోషంగా ఉంది. – డాక్టర్ జయంతిరెడ్డి, నాగ్ అశ్విన్ తల్లిఇంకా గొప్ప విజయాలు సాధించాలి.. ఐతోలు గ్రామానికి చెందిన నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన కల్కి సినిమా భారీ విజయాన్ని అందుకోవడం సంతోషంగా ఉంది. ఆయన విజయం మాకు అందరికీ గర్వకారణం. భవిష్యత్‌లోనూ గొప్ప సినిమాలు చేయాలని, దర్శకుడిగా మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాం. – హరికృష్ణ శర్మ, ఐతోలు, తాడూరు మండలం -
నల్లమల నాయకుడెవరు?
సాక్షి, నాగర్‌కర్నూల్: ఓవైపు నల్లమల అభయారణ్యం, మరోవైపు కృష్ణానది పరీవాహక ప్రాంతాన్ని పెనవేసుకొని ఉన్న నాగర్‌కర్నూల్ ఎంపీ సెగ్మెంట్లో ఈసారి త్రిముఖ పోటీ నెలకొంది. ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గమైన నాగర్‌కర్నూల్‌పై పట్టు సాధించేందుకు మూడు ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ బలమైన అభ్యర్థులను బరిలో నిలిపాయి. కాంగ్రెస్ నుంచి మల్లురవి, బీజేపీ నుంచి పోతుగంటి భరత్‌ప్రసాద్, బీఆర్ఎస్ తరఫున ఆర్ఎస్.ప్రవీణ్‌కుమార్ పోటీలో ఉన్నారు. . 1952, 1957లలో ద్విసభ్య నియోజకవర్గంగా ఉండగా, 1962లో నాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గంగా ఏర్పడింది. 8 సార్లు కాంగ్రెస్, ఐదుసార్లు టీడీపీ, ఒక్కోసారి తెలంగాణ ప్రజాసమితి, బీఆర్ఎస్ గెలిచాయి. 4.5 లక్షలకు పైగా ఉన్న ఎస్సీ సామాజికవర్గానికి చెందిన ఓటర్లు ఈ స్థానంలో గెలుపోటములపై ప్రభావం చూపనున్నారు. వీరిలో అగ్రభాగం మాదిగ సామాజికవర్గానికి చెందినవారే. ఈ ఎన్నికల్లో వారి ఓట్లే కీలకం కానున్నాయి. ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ బీఆర్ఎస్సిట్టింగ్ స్థానంపై బీఆర్ఎస్ పట్టు సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకునేందుకు బీఆర్ఎస్ శ్రమిస్తోంది. ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌ను రంగంలోకి దింపి తమ అభ్యర్థి గెలుపునకు వ్యూ హాత్మకంగా అడుగులు వేస్తోంది. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని అలంపూర్‌కే చెందిన తాను విద్యావంతుడిగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని, ఒకసారి తనకు అవకాశం కల్పించాలని ఆర్ఎస్.ప్రవీణ్ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలకుగానూ 12స్థానాల్లో కాంగ్రెస్ గెలి చింది. అలంపూర్, గద్వాలను బీఆర్ఎస్ కైవసం చేసుకోగా, ఈ రెండు నియోజకవర్గాలు నాగర్‌కర్నూల్ ఎంపీ పరిధిలోనే ఉన్నాయి. గత లోక్‌సభ ఎన్నికల ఫలితాలను పునరావృతం చేసి పట్టు నిలుపుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. పోతుగంటి భరత్‌ప్రసాద్ బీజేపీబలం పెంచుకున్న బీజేపీ.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఈ స్థానంలో 13.03 శాతం ఓట్లను మాత్రమే సాధించింది. బీజేపీ అభ్యర్థి బంగారు శ్రుతికి 1,29,021 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్కు చెందిన సిట్టింగ్ ఎంపీ పోతుగంటి రాములును తమ పార్టీలోకి చేర్చుకున్న బీజేపీ, ఆయన కొడుకుభరత్ప్రసాద్కు పార్టీ అభ్యర్థిత్వాన్ని కేటాయించింది. నియోజకవర్గంలోని కల్వకుర్తి, నాగర్క ర్నూల్, కొల్లాపూర్ మీదుగా ఏపీలోని నంద్యాల వరకు జాతీయ రహదారి నిర్మా ణం పనులు ఇప్పటికే మొదలయ్యాయి. రహదారి నిర్మాణ పను లు తమ పార్టీకి అనుకూలంగా మారుతుందని బీజేపీ ఆశిస్తోంది. ఇతర పార్టీల నేతలను చేర్చుకొని బ లాన్ని పెంచుకున్న బీజేపీ మోదీ చరిష్మాతోపాటు కేంద్ర ప్రభుత్వ పథకాలపై విస్తృతంగా ప్రచా రం నిర్వహించి ఈ స్థానంలో పాగా వేసేందుకు పట్టుదలతో ఉంది. మల్లు రవి కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ఈ సెగ్మెంట్లో కాంగ్రెస్ ఇప్పటివరకు ఎనిమిదిసార్లు గెలిచింది. ప్రస్తుత ఎంపీ అభ్యర్థి మల్లు రవి 1991, 1998 ఎన్నికల్లో ఇక్కడి నుంచే రెండుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. చివరిసారిగా 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున నంది ఎల్లయ్య ఇక్కడి నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. ఈసారి ఎన్నికల్లో తమ అభ్యర్థిగా మల్లు రవిని మరోసారి బరిలోకి దింపిన కాంగ్రెస్ గెలుపుపై ఆశలు పెట్టుకుంది. సీఎం రేవంత్‌రెడ్డి స్వస్థలం నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి కాగా, నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం ఆయన సొంత నియోజకవర్గం కావడంతో ఈ స్థానంలో కాంగ్రెస్ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇవీ ప్రభావితం చూపే అంశాలుసాగునీటి కోసం చేపట్టిన పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు ఇంకా పూర్తి కాలేదు. ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేసి నీరందించాలన్న డిమాండ్ ఉంది. పరిశ్రమలు స్థాపించి స్థానికంగా ఉన్న వారికి ఉపాధి కల్పించాలి.గద్వాల నుంచి ఏపీలోని మాచర్ల వరకు నూతన రైల్వేలేన్ ప్రతిపాదనలకు 20 ఏళ్లుగా మోక్షం కలగడం లేదు. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గవ్యాప్తంగా ఇప్పటికీ విద్యారంగంలో వెనుకబాటే కన్పిస్తోంది. కేంద్రీయ, నవోదయ విద్యాలయాలు, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ కళాశాలల ఏర్పాటు ఇప్పటికీ కలగానే మారింది. నల్లమలలోని చెంచులు, గిరిజనులకు ఉపాధి అవకాశాలు లేవు. వీరి జీవనోపాధికి పరిశ్రమలు స్థాపించాలన్న డిమాండ్ నెరవేరడం లేదు.నల్లమల అటవీప్రాంతం, కృష్ణాతీర ప్రాంతాలు ఉన్నా పర్యా టకంగా అభివృద్ధి లేదు. పర్యాటకాభివృద్ధి ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చాలన్న డిమాండ్ ఉంది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులకు వచ్చిన ఓట్లుటీఆర్ఎస్: పోతుగంటి రాములుఓట్లు: 4,99,672 – 50.48 శాతంకాంగ్రెస్: మల్లు రవిఓట్లు: 3,09,924 – 31.31 శాతంబీజేపీ: బంగారు శ్రుతిఓట్లు: 1,29,021 – 13.03 శాతం -
తెలంగాణలో బీజేపీ గాలి వీస్తోంది: ప్రధాని మోదీ
Live Updates.. బీజేపీ విజయసంకల్ప సభలో పాల్గొన్న మోదీ ప్రసంగం... తెలంగాణలో బీజేపీ గాలి వీస్తోంది: మోదీ గత పదేళ్ల తెలంగాణ అభివృద్దికి ఎన్డీయే ప్రభుత్వం కృషి చేసింది తెలంగాణ ప్రజల కలలను బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ధ్వంసం చేశాయి మల్కాజ్‌గిరిలో ప్రజల అద్భుత స్పందన చూశాను వేగవంతమైన అభివృద్ధి కూడా తెలంగాణలో తీసుకురావాలి కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు తెలంగాణ అభివృద్దికి అడ్డుగా మారాయి బీఆర్ఎస్ ప్రభుత్వం భారీ అవినీతి పాల్పడింది తెలంగాణను గేట్‌వే ఆఫ్ సౌత్ అంటారు ఏడు దశాబ్దాల పాటు దేశాన్ని దోచుకోవటం మినహా కాంగ్రెస్ ఏం చేయలేదు తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలిపించాలి 140 కోట్ల మంది భారతీయులు నా కుటుంబం ఈసారి 400 సీట్లు ఎన్డీయేకు రాబోతున్నాయి గరీబీ హఠావో నినాదం కాంగ్రెస్‌వాళ్లు ఇచ్చారు. కానీ, పేదల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదు. 87 లక్షల మంది ఆయుష్మాన్ భారత్ కింద లబ్ది పొందారు అన్ని వర్గాలకు సామాజిక న్యాయం చేసింది బీజేపీనే దళిత బంధు పేరుతో బీఆర్ఎస్ దళితులను మోసం చేసింది కేంద్ర పథకాలతో అట్టడుగు వర్గాలకు ఎంతో మేలు జరిగింది ఆదివాసి మహిళను రాష్ట్రపతి చేశాం రాజ్యాంగాన్ని మారుస్తామని అంబేద్కర్‌ను కేసీఆర్ అవమానించారు బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ అడుగు జాడల్లోనే నడుస్తోంది కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఢిల్లి లిక్కర్ కేసులో అవినీతికి పాల్పడ్డ చరిత్ర కేసీఆర్ కుటుంబానిది. కేసీఆర్ కుటుంబం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అన్యాయం చేస్తోంది. గ్యారెంటీల పేరతో కాంగ్రెస్ గారడీలు చేస్తోంది. నేడు యువత, ప్రజలు, మహిళలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. దొంగలు పోవాలనుకుంటే గజ దొంగలు అధికారంలోకి వచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాయి. తెలంగాణలో దోచుకుంది సరిపోక ఢిల్లీలో లిక్కర్ వ్యాపారం చేసి దోచుకున్నారు. ►నాగర్ కర్నూల్ చేరుకున్న ప్రధాని మోదీ. కాసేపట్లో బీజేపీ విజయసంకల్ప సభలో పాల్గొననున్న మోదీ. ►బేగంపేట్‌కు బయలుదేరిన ప్రధాని మోదీ.. ►ప్రధాని మోదీ నేడు నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా బీజేపీ విజయసంకల్ప సభలో మోదీ పాల్గొననున్నారు. ►కాగా, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో భాగంగా జిల్లాలో రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న బహిరంగ సభలో మోదీ పాల్గొని ప్రసంగిస్తారు. ►శుక్రవారం సాయంత్రమే హైదరాబాద్‌కు చేరుకున్న ప్రధాని మోదీ.. మల్కాజిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని భారీ రోడ్డుషోలో పాల్గొన్నారు. రాత్రి వరకు ఈరోడ్డు షో కొనసాగింది. ►అనంతరం రాజ్‌భవన్‌కు చేరుకొని మోదీ అక్కడే బస చేశారు. శనివారం ఉదయం 10.30 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో నాగర్ కర్నూల్‌కు మోదీ వెళ్లనున్నారు. అక్కడ వెలమ సంఘం కల్యాణ మండపం పక్కన ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని మోదీ ప్రసంగిస్తారు. ►ఈ బహిరంగ సభలో కృష్ణా క్లస్టర్ పరిధిలోని మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ లోక్ సభ స్థానాల్లో పోటీచేసే బీజేపీ అభ్యర్థులతోపాటు, బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గోనున్నారు. -
బీఎస్పీకి రెండు లోక్‌సభ సీట్లు
సాక్షి, హైదరాబాద్: పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 స్థానాలకు గాను రెండు లోక్‌సభ సీట్లను పొత్తులో భాగంగా బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ)కి ఇవ్వాలని భారత రాష్ట్ర సమితి నిర్ణయించింది. ఈ మేరకు హైదరాబాద్, నాగర్‌కర్నూలు లోకసభ స్థానాలను ఇచ్చేందుకు బీఆర్ఎస్ అంగీకరించింది. బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావుతో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఇటీవల రెండు పర్యాయాలు చర్చలు జరిపిన విషయం తెలిసిందే. ఈ చర్చల్లో నాగర్‌కర్నూలుతో పాటు మరో రెండు స్థానాలను బీఎస్పీ కోరినప్పటికీ రెండు సీట్లు మాత్రమే ఇచ్చేందుకు బీఆర్ఎస్ సుముఖత వ్యక్తం చేసింది. బీఎస్పీకి కేటాయించిన రెండు స్థానాల్లో అభ్యర్థుల ఎంపికను ఆ పార్టీ చేసుకుంటుందని బీఆర్ఎస్ ప్రకటించింది. కేసీఆర్‌తో జరిగిన చర్చల సారాంశాన్ని తమ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతికి వివరించిన అనంతరం బీఆర్ఎస్ ప్రతిపాదనకు అంగీకరిస్తున్నట్లు బీఎస్పీ ప్రకటించింది. కాగా, 15 ఎంపీ సీట్లలో బీఆర్ఎస్ పోటీ చేయనుంది. ఇప్పటికే 11 స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఖరారయ్యారు. భువనగిరి, నల్లగొండ, మెదక్, సికింద్రాబాద్ లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. ఆయా స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారు అయిన తర్వాతే బీఆర్ఎస్ జాబితా వెల్లడయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. -
బీజేపీలో చేరిన నాగర్‌కర్నూల్ ఎంపీ రాములు
ఢిల్లీ, సాక్షి: తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్కు బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీని వీడిన ఎంపీ రాములు బీజేపీలో చేరారు. గురువారం ఢిల్లీ పెద్దల సమక్షంలో కాషాయం కండువా కప్పుకున్నారాయన. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి చంద్రశేఖర్, బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్ చుగ్, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పాల్గొన్నారు. కాగా, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, రాములుకు మధ్య విభేదాలు ముదిరాయి. తానే ఎంపీ అభ్యర్థిని అంటూ బాలరాజు ప్రచారం చేసుకుంటుండటంతో రాములు బీఆర్ఎస్ను వీడినట్లు తెలుస్తుంది. ఇక రాములు చేరికను స్వాగతించిన రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్.. తెలంగాణలో బీజేపీ తిరుగులేని శక్తిగా మారుతోందన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ మునిగిపోయిన నావ.. కారు రిపేర్ అయ్యే పరిస్థితి లేదు. మార్పులో భాగంగా కాంగ్రెస్ లాభపడింది. కానీ, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో కాంగ్రెస్ పరిస్థితి చూస్తున్నాం. తెలంగాణలో బీజేపీ బలపడుతోంది. చాలామంది మా పార్టీలోకి వచ్చేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. .. షెడ్యూల్ వచ్చే లోపు దాదాపు అభ్యర్థుల ఎంపిక పూర్తవుతుంది. పార్లమెంట్ఎన్నికల్లో బీజేపీదే గెలుపు. మొత్తం 17 స్థానాలు మేమే గెలుస్తాం. బీజేపీ అన్ని పార్టీల కంటే ప్రచారంలో ముందుగా దూసుకుపోతోంది. ప్రధాని మోదీ కూడా రెండ్రోజులు తెలంగాణలో పర్యటిస్తారు. తెలంగాణ అన్ని లోక్‌సభ స్థానాల్లో బీజేపీ గెలుపు ఖాయం అని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. -
ప్రత్యేక ప్రతినిధి పదవికి రాజీనామా
జడ్చర్ల టౌన్: వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్‌కర్నూలు స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీకి సిద్ధంగా ఉన్నానని, నాయకులు, కార్యకర్తలు ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా తన గెలుపు కోసం రెండు నెలలు శ్రమించాలని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లురవి స్పష్టం చేశారు. ఉదయ్‌పూర్ డిక్లరేషన్ ప్రకారం పార్టీలో ఒక వ్యక్తికి ఒకే పదవి అనే నిబంధన మేరకు తనకు లోక్‌సభ టికెట్ కేటాయింపులో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవి అడ్డుగా ఉంటుందని ఆ పదవికి రాజీనామా చేసినట్లు వెల్లడించారు. వారం రోజుల క్రితమే సీఎం రేవంత్‌రెడ్డికి తన రాజీనామాను సమర్పించానని, సమయం, సందర్భం రానందున బహిర్గత పరచలేదని తెలిపారు. శుక్రవారం జడ్చర్లలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తనకు ప్రత్యేక ప్రతినిధిగా పదవి ఇచ్చినపుడే సీఎం రేవంత్‌తో చర్చించానని, ఎంపీ టికెట్‌కు అడ్డు రాకుండా ఉంటేనే బాధ్యతలు స్వీకరిస్తానని చెప్పానన్నారు. పదేళ్లుగా అనేక ఫైళ్లు ఢిల్లీలో పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని పరిష్కరించేందుకు కృషి చేయాలని చెప్పటంతో ఈ బాధ్యతలు స్వీకరించి అనేక శాఖల్లో ఫైళ్లలో కదలిక తీసుకువచ్చానన్నారు. తన రాజీనామాను ఆమోదించే వరకు ఢిల్లీలో బాధ్యతలు నిర్వహిస్తానని చెప్పారు. అయితే తనకు టికెట్ రావడంలేదని ప్రచారం జరుగుతున్నందున కార్యకర్తలు, నాయకులు, ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన సమయం వచ్చిందన్నారు. నాగర్‌కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం ఇన్చార్జిగా ఉన్న మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలందరూ తనకు మద్దతుగా ఉన్నారని తెలిపారు. పార్టీ టికెట్ ఆశిస్తున్న మంద జగన్నాథం, సంపత్‌కుమార్‌లకు తాను వ్యతిరేకం కాదని, వారికి టికెట్ అడిగే హక్కు ఉందని అన్నారు. పార్టీ సర్వేలన్నీ తనకు అనుకూలంగా ఉన్నాయని, టికెట్ ఇవ్వకూడదని ఏ ఒక్క కారణం చెప్పినా.. సర్వేలు అనుకూలంగా లేవని తేలినా తాను స్వీకరిస్తానని పేర్కొన్నారు. -
ఉద్రిక్తత.. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్‌ను లాక్కెళ్లిన రైతులు
సాక్షి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ కార్యాలయంపై వేరుశెనగ రైతులు దాడి చేశారు. దీంతో అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసమయ్యాయి. మార్కెట్ కమిటి ఛైర్మన్ ఛాంబర్లోకి దూసుకెళ్లిన రైతులు.. ఛైర్మన్‌ను కార్యాలయం నుంచి లాక్కెళ్లారు. -
చెట్ల మందు తాగించి..బండరాళ్లతో చంపుతాడు
సాక్షి, నాగర్‌కర్నూల్: మాయలు, మంత్రాలు తెలుసునని నమ్మిస్తూ, మంత్ర శక్తితో గుప్తనిధులు వెలికితీస్తానంటూ ఆస్తులు కాజేసి, ప్రాణాలు తీస్తున్న సైకో కిల్లర్ రామెట్టి సత్యనారాయణను నాగర్‌కర్నూల్ పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో జోగుళాంబ గద్వాల జోన్ డీఐజీ ఎల్ఎస్ చౌహాన్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ నిందితుడిని అరెస్ట్ చూపుతూ, మీడియాకు వివరాలను వెల్లడించారు. నాగర్‌కర్నూల్ జిల్లాకేంద్రానికి చెందిన రామెట్టి సత్యనారాయణ ఇప్పటివరకు 11 మందిని హత్యచేసినట్టు వెల్లడించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోనూ హత్యలకు పాల్పడ్డాడని వెల్లడించారు. నిర్మానుష్య ప్రాంతాల్లో హత్యలు.. ‘‘నిందితుడు సత్యనారాయణ యాదవ్ తన మంత్రశక్తితో గుప్తనిధులను వెలికితీస్తానని అమాయకులను నమ్మిస్తూ వారి పేరిట ఉన్న ప్లాట్లు, వ్యవసాయ భూములను తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు గుర్తించాం. గుప్తనిధులు వెలికితీస్తానని ఒంటరిగా నిర్మానుష్య ప్రాంతాలకు రప్పించి వారికి జిల్లేడు పాలు, ఇతర చెట్ల మందులను తాగిస్తాడు. వారు అపస్మారక స్థితిలోకి చేరుకోగానే బండ రాళ్లతో మోది హత్యకు పాల్పడ్డాడ’’ని డీఐజీ చౌహాన్ వివరించారు. మొత్తం 11 మందిని హత్య చేయగా, ముగ్గురి మృతదేహాలు ఇప్పటివరకు దొరకలేదని చెప్పారు. 11 మంది అమాయకులు బలి.. 2020 ఆగస్టు 14న వనపర్తి జిల్లా నాగాపూర్‌లో గుప్తనిధు ల కోసం పూజల పేరుతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని హత్య చేశాడు. వీరిలో హజిరాబీ(60), ఆష్మాబేగం(32), ఖాజా(35), ఆశ్రీన్(10) ఉన్నారు. 2021లో నాగర్‌కర్నూల్ జిల్లా ఎండబెట్లకు చెందిన సలీం పాషా(38), కొల్లాపూర్ మండలం ముక్కిడిగుండం గ్రామానికి చెందిన ఆరెపల్లి శ్రీనివాసులు(52), 2022లో నాగర్‌కర్నూల్ మండలం గన్యాగులకు చెందిన వాసర్ల లింగస్వామి(50), 2023లో కల్వకుర్తి మండలం తిమ్మరాసిపల్లికి చెందిన సంపతి శ్రీధర్‌రెడ్డి(43), కోడేరు మండలం తీగలపల్లికి చెందిన రాంరెడ్డి(70), తిరుపతమ్మ(42), వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం బొల్లారం గ్రామానికి చెందిన గోవుల వెంకటేశ్(32)ను హత్య చేసినట్లుగా పోలీసులు తెలిపారు. నిందితుడు సత్యనారాయణకు పోలీస్ అధికారులతో సంబంధాలు? మూడేళ్ల నుంచి తరచుగా హత్యలు, మోసాలకు పాల్పడుతూ ఇప్పటివరకు 11 మంది అమాయకులను పొట్టనబెట్టుకున్న మాంత్రికుడు సత్యనారాయణ యాదవ్.. కొంతమంది ప్రజాప్రతినిధులు, పోలీస్ అధికారుల అండదండలతోనే ఇన్నాళ్లు తప్పించుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా హైదరాబాద్‌లో నివసిస్తున్న ఓ మహిళ తమ కుటుంబ సమస్య పరిష్కారం కోసం సత్య నారాయణను ఆశ్రయించగా, ఆమె భూమిని కూడా తన అనుచరుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. దీనిపై సదరు మహిళ ఈ ఏడాది ఏప్రిల్‌లోనే నాగర్‌కర్నూల్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. అయితే అప్పటి దర్యాప్తు అధికారి నిందితుడు సత్యనారాయణ యాద వ్ నుంచి రెండు ప్లాట్లను.. తన మామ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకుని కేసును నీరుగార్చేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది. తాజాగా వీపనగండ్ల మండలం బొల్లారానికి చెందిన వెంకటేశ్ భార్య ఫిర్యాదు మేరకు ఉన్నతాధికారులు విచారణ చేపట్టడంతో విషయం బయటపడింది. అప్పుడే పట్టుకుంటే నలుగురు బతికేవారు.. వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగాపూర్‌లో 2020 ఆగస్టు 14న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దారుణహత్యకు గురికాగా, మూడేళ్లుగా పోలీసులు నిందితుడిని గుర్తించలేదన్న విమర్శలు ఉన్నాయి. మాయలు, మంత్రాల పేరుతో భూ రిజిస్ట్రేషన్లు, ఆ తర్వాత హత్యలకు పాల్పడుతున్న సత్యనారాయణ బాగోతాలను వెలుగులోకి తెస్తూ గత ఏప్రిల్ 5న ‘మాయగాళ్లు’శీర్షికన ‘సాక్షి’కథనాన్ని ప్రచురించింది. ఆ సమయంలోనూ పోలీసులు సత్యనారాయణ కేసులో నిర్లక్ష్యం ప్రదర్శించారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆ తర్వాత 2023 జూలైలో నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం తిమ్మరాసిపల్లికి చెందిన సంపతి శ్రీధర్‌రెడ్డి, కోడేరు మండలం తీగలపల్లికి చెందిన తండ్రీకూతుళ్లు బీంరెడ్డి రాంరెడ్డి, తిరుపతమ్మ, వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం బొల్లారం గ్రామానికి చెందిన గోవుల వెంకటేశ్ హత్యకు గురయ్యారు. ఆరు నెలల ముందే పోలీసులు సత్యనారాయణను అదుపులోకి తీసుకుని ఉంటే ఆ నలుగురు ప్రాణాలతో బయటపడేవారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
నాగర్‌కర్నూల్ జిల్లాలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ
-
‘చెంచు’ చిచ్చరపిడుగు
పది లక్షల మందిలో ప్రథముడు ఊహ తెలియకముందే అమ్మ ప్రేమకు దూరమయ్యాడు.. నాలుగేళ్లకే మంటలంటుకొని కాళ్లు, చేతులు, శరీరం కాలిపోయింది.. 60 శాతం గాయాలతో ఆస్పత్రికి తీసుకెళితే..బతకడమే కష్టమని డాక్టర్లు అన్నారు.. ఆరేళ్ల ప్రాయంలోనే 3 మేజర్ సర్జరీలు జరిగాయి. ఇంకా పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌లోకి రాలేదు... ఈ పరిచయమంతా ఓ నల్లమల కుర్రాడి గురించి... లోకం పోకడనే తెలియని.. ఇప్పటికీ నాగరికతకు దూరంగా ఉండే చెంచుల నుంచి ఓ చిచ్చర పిడుగు జాతీయస్థాయిలో ప్రతిభ చాటాడు. పదిలక్షల మంది విద్యార్థులు పోటీ పడగా, అందరికంటే ముందువరుసలో నిలిచాడు.. అతడే ’మిలియనీర్ ’దినేశ్. సాక్షి, ప్రత్యేకప్రతినిధి/నాగర్‌కర్నూల్ : వ్యక్తిగత పరిశుభ్రతపై దేశవ్యాప్తంగా నిర్వహించిన పరీక్షలో నల్లమలకు చెందిన విద్యార్థి ప్రతిభ చాటాడు. అపోలో హాస్పిటల్, డెటాల్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహించిన టోటల్ హెల్త్ కార్యక్రమంలో భాగంగా వ్యక్తిగత పరిశుభ్రతపై పరీక్ష జరగ్గా, ఇందులో నాగర్‌కర్నూల్ జిల్లా మన్ననూర్ గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న దినేష్ దేశంలోనే మొదటిస్థానంలో నిలిచాడు. దినేష్ బతకడమే కష్టమన్నారు... నాగర్‌కర్నూల్ జిల్లా మన్ననూరుకు చెందిన దినేష్ తండ్రి కరమ్‌చంద్ కొన్నాళ్లు కాంట్రాక్ట్ టీచర్‌గా పనిచేశాడు. ఈయన భార్య మహేశ్వరి దినేష్‌కు ఊహ తెలియకముందే కన్నుమూసింది. తల్లి ప్రేమకు దూరమై పెరిగిన దినేష్ నాలుగేళ్ల వయసులో ఇంట్లో స్టవ్ దగ్గర ఆడుకుంటుండగా ప్రమాదం జరిగింది. ముఖం, కాళ్లు, చేతులు 60 శాతం కాలిపోయాయి. చికిత్స చేసే ముందే డాక్టర్లు దినేష్ బతకడమే కష్టమన్నారు. ఐదేళ్లకు ఒక ఆపరేషన్, ఆరేళ్ల వయసులో దినేష్‌కు రెండు మేజర్ ఆపరేషన్లు జరిగాయి. తర్వాత కొంతవరకు శరీరం సాధారణ స్థితికి వచ్చింది. ఇప్పటికీ ముఖం, చేతులు మామూలు స్థితికి చేరుకోలేదు. కాళ్లు పూర్తి స్థాయిలో పనిచేయడానికి మరో శస్త్రచికిత్స చేయాలని డాక్డర్లు చెప్పారు. ఐదో తరగతి నుంచి ‘ట్రైబల్ వేల్ఫేర్’లోకి మన్ననూర్ గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో దినేష్ ఐదోతరగతిలో చేరాడు. ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నాడు. క్లాస్‌లో తనే టాపర్. ఆంగ్లంపై ఉన్న మక్కువ, పట్టు గుర్తించిన టీచర్లు ఉదయ్‌కుమార్, ఆంజనేయులు దినేష్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ అతడి పరిజ్ఞానాన్ని పెంచుతున్నారు. ఫలితంగా ట్రైబల్ సొసైటీ సారథ్యంలో జరిగిన పలు డిబేట్లు, ఇగ్నైట్ ఫెస్ల్లో అనేక బహుమతులు పొందాడు. 2500 పాఠశాలలు...పదిలక్షల మంది విద్యార్థులు డెటాల్ సంస్థ అపోలో ఫౌండేషన్‌తో కలిసి బాలబాలికల్లో స్వీయ, పరిసరాల పరిశుభ్రతతో పాటు కాలుష్య నియంత్రణపై అవగాహనకు ప్రతి ఏటా హైజిన్ ఒలింపియాడ్ నిర్వహిస్తుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 4–15 తేదీల మధ్య దేశవ్యాప్తంగా ఈ పరీక్ష జరిగింది. ఒకటి నుంచి పదోతరగతి వరకు ప్రతి రెండు తరగతులను ఒక కేటగిరిగా చేసి మొత్తంగా ఐదు కేటగరిలో పరీక్ష నిర్వహిస్తారు. 9–10 తరగతుల కేటగిరిలో దేశ వ్యాప్తంగా 2500 పాఠశాలల నుంచి పది లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. 50 మార్కులకు ఆబ్జెక్టివ్ తరహాలో పరీక్ష జరిగింది. దినేష్ పూర్తి మార్కులతో పాటు చేతిరాత, పరీక్ష రాసిన విధానం ఆధారంగా అదనపు మార్కులతో కలిపి 51 మార్కులు సాధించాడు. దీంతో జాతీయస్థాయిలో దినేష్‌కు ప్రథమస్థానం వచ్చినట్లు డెటాల్ సంస్థ ప్రకటించింది. అక్టోబర్ 2న ముంబైలో జరిగే కార్యక్రమంలో దినేష్ రూ. లక్ష నగదుతోపాటు పురస్కారం అందుకోనున్నాడు. శుక్రవారం కలెక్టరేట్లో విద్యార్థి దినేష్‌ను నాగర్‌కర్నూల్ కలెక్టర్ ఉదయ్‌కుమార్ అభినందించారు. ఈ కార్యక్రమంలో మన్ననూర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ పద్మావతి, ఉపాధ్యాయులు ఆంజనేయులు, చంద్రశేఖర్, గణేష్, విద్యార్థి తండ్రి కరంచంద్ పాల్గొన్నారు. నిక్ వుజిసిక్ నాకు స్ఫూర్తి తన అంగవైకల్యాన్ని అధిగమించి ప్రపంచ ప్రఖ్యాత మోటివేషనల్ స్పీకర్‌గా మారిన నిక్ వుజిసిక్ నాలో స్ఫూర్తి నింపారు. అవకాశాలు అనేవి అందరికీ సమానమే. వాటిని అందిపుచ్చుకోవడమే మనవంతు అని నేర్చుకున్నా. అదే స్ఫూర్తితో ముందుకు వెళుతున్నా. చదువుతోపాటు క్రికెట్ నా హాబీ. బెస్ట్ కీపర్‌గా నా మార్కు చూపిస్తున్నా. సివిల్స్ రాసి ఐఏఎస్ సాధించాలని అనుకుంటున్నా. – దినేష్ -
టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: నాగర్ కర్నూల్ పీఎస్‌లో కాంగ్రెస్ ఎంపీ, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై కేసు నమోదు అయ్యింది. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే అభియోగంపై ఈ కేసు నమోదైనట్లు తెలుస్తోంది. జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు గుణవర్ధన్ జిల్లా ఎస్సీకి ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదు అయ్యింది. రేవంత్ రెడ్డితో పాటు ఏఐసీసీ కార్యదర్శి, వంశీ చంద్ రెడ్డి, మరోనేత సంపత్ కుమార్ లపై కేసు నమోదు చేశారు. ఐపీసీలోని సెక్షన్ 153.. రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడంతో పాటు సెక్షన్ 504 శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం, సెక్షన్ 506 బెదిరింపులకు పాల్పడడం కింద కేసు నమోదు చేశారు ఎస్పీ మనోహర్. మరోవైపు మహబూబ్ నగర్-- జడ్చర్ల, భూత్పూర్ పోలీసు స్టేషన్లలోనూ రేవంత్ రెడ్డిపై కేసులు నమోదయ్యాయి. -
నాగర్ కర్నూల్ బహిరంగ సభలో ఏం జరిగింది!,కాషాయం పార్టీలో కొత్త జోష్
కర్నాటక ఫలితాలతో డీలాపడ్డ కమలం పార్టీకి నాగర్ కర్నూల్ సభ ఊపిరి పోసిందా? తెలంగాణలో అధికారం సాధించాలన్న సంకల్పానికి జేపీ నడ్డా సభ బలం చేకూర్చిందా? చేరికలు లేక, రాష్ట్ర నాయకత్వంలో విభేదాలతో గందరగోళంగా ఉన్న బీజేపీకి పార్టీ చీఫ్ రాకతో జోష్ పెరిగిందా? టీ.బీజేపీకి నాగర్ కర్నూల్ బహిరంగసభ ఇచ్చిన సందేశం ఏంటి? సీనియర్ నేతలున్న ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి ఎక్కువ సీట్లు గెలవాలని కమలం పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు అనుగుణంగా కార్యాచరణ కూడా చేపట్టారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామయాత్ర కూడా కేడర్‌లో ఊపు తెచ్చింది. పాలమూరు జిల్లా తమకు అత్యంత ముఖ్యమైనదని బీజేపీ పెద్దలు చాటారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మీద బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. పార్టీ నేతలు డీకే అరుణ, జితేందర్‌రెడ్డి నిత్యం ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ పార్టీకి హైప్ తీసుకురావడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. అయితే కర్నాటక ఎన్నికల ఫలితాలతో తెలంగాణ కేడర్‌లో నిరాశ అలుముకుంది. బీఆర్ఎస్ నుంచి సస్పెండైన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును బీజేపీలోకి తీసుకురావడానికి పార్టీ పెద్దలు సీరియస్‌గానే ప్రయత్నించారు. కాని ఆయన పాతగూటికే చేరాలని నిర్ణయించుకున్నారు. కర్నాటక ఎన్నికల్లో బీజేపీ ఓటమి తెలంగాణలో పార్టీ నేతలు, కేడర్ మీద ప్రభావం చూపించింది. పార్టీ శ్రేణుల్లో నిరాశ ఆవరించింది. కేడర్ నిస్సత్తువకు గురైంది. మరోవైపు కర్నాటకలో సాధించిన విజయంతో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పుంజుకునే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. కర్నాటక సరిహద్దులోనే ఉన్న పాలమూరు జిల్లాలో కచ్చితంగా కాంగ్రెస్ ఎఫెక్ట్ ఉంటుందని భావించారు. అయితే ఇన్ని ప్రతికూల పరిస్థితులున్నప్పటికీ నాగర్‌కర్నూల్‌లో బీజేపీ నవసంకల్ప్ యాత్ర పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సభకు రావడం, ప్రజలు కూడా భారీగా తరలిరావడంతో బీజేపీ కేడర్‌లో ఉత్సాహం ఉప్పొంగింది. తెలంగాణలో పార్టీని తిరిగి గాడిలో పెట్టడానికి బీజేపీ జాతీయ నాయకత్వం చేసిన ప్రయత్నం పాలమూరు జిల్లాలో మంచి ఫలితాన్నే ఇచ్చిందని చెబుతున్నారు. ఇందులో భాగంగా ప్రధాని మోదీ ప్రభుత్వం తొమ్మిదేళ్ళ విజయాలపై కూడా ప్రచార కార్యక్రమాలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేడర్ మొత్తం ఉత్సాహంగా పాల్గొనాలని కేంద్ర నాయకత్వం సూచించింది. జిల్లా కేడర్‌లో ఉత్సాహం నింపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మీద నిప్పులు చెరిగారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందనే ధీమాను వ్యక్తం చేశారు నడ్డా. పార్టీ కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. మొత్తం మీద నిరాశలో కూరుకుపోయిన కమలం కేడర్‌కు నడ్డా బహిరంగసభ కొత్త ఉత్తేజాన్ని ఇచ్చిందని చెప్పుకుంటున్నారు. చదవండి: కాంగ్రెస్‌కు ఆ జిల్లాలో అభ్యర్థుల కరువు.. సొంత పార్టీలో లేకపోతేనేం.. పక్క పార్టీల నాయకులకు గాలం -
తెలంగాణలో కేసీఆర్ కుటుంబం మాత్రమే లాభపడింది: జేపీ నడ్డా
Updates.. మోదీ నేతృత్వంలో దేశం అభివృద్ది దిశగా సాగుతోందని, తెలంగాణ అభివృద్ధిలో మోదీ చేయాల్సింది అంతా చేస్తున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ఆదివారం ఆయన నాగర్ కర్నూల్లోని నవ సంకల్పసభలో మాట్లాడుతూ, తెలంగాణలో కేసీఆర్ కుటుంబం మాత్రమే లాభపడింది. తెలంగాణ కోసం ఎంతో మంది ఆత్మబలిదానాలు ఇచ్చారు. తెలంగాణ సామర్థ్యాన్ని కేసీఆర్ నాశనం చేశారు’’ అంటూ జేపీ నడ్డా మండిపడ్డారు. ‘‘తెలంగాణ వికాసం కోసం ప్రధాని మోదీ ఎంతో చేశారు. తెలంగాణకు మోదీ భారీ ఎత్తున నిధులు ఇచ్చారు. 80 కోట్ల ప్రజలకు మోదీ ప్రభుత్వం రేషన్ ఇస్తోంది. కిసాన్ సమ్మాన్ నిధితో రైతులను కేంద్రం ఆదుకుంటోంది. మొత్తం ఐరోపా ఖండం కన్నా ఐదు రెట్ల మందికి రేషన్ అందుతోంది. దేశంలో పేదరికం 10 శాతం కన్నా తక్కువకు పడిపోయింది. ఉజ్వల, ఉజాలా పథకాలతో గ్యాస్ అందిస్తున్నాం. ఆయుస్మాన్ పథకంతో ఎంతోమందికి బీమా కల్పించాం. మోదీ నేతృత్వంలో 9 ఏళ్లలో భారత్ ఎంతో అభివృద్ధి సాధించింది’’ అని జేపీ నడ్డా పేర్కొన్నారు. ♦సాయంత్రం 5 గంటలకు నాగర్ కర్నూల్‌కు వెళ్లనున్న జేపీ నడ్డా.. అక్కడ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ♦ సంపర్క్ సే సమర్థన్ ప్రచారంలో భాగంగా ఫిల్మ్‌నగర్‌లో క్లాసికల్ డ్యాన్సర్, పద్మశ్రీ గ్రహీత ఆనంద శంకర జయంత్‌తో జేపీ నడ్డా, కిషన్‌రెడ్డి భేటీ అయ్యారు. మోదీ పాలనలో అభివృద్ధిపై రూపొందించిన పుస్తకాలను ఆనంద శంకరకు అందించారు. నా అభిప్రాయాలను జేపీ నడ్డాతో పంచుకున్నా: ప్రొ.నాగేశ్వర్ జేపీ నడ్డాతో భేటీ అనంతరం ప్రొఫెసర్ నాగేశ్వర్ మీడియాతో మాట్లాడుతూ, మోదీ ప్రభుత్వ పాలన గురించి నడ్డా వివరించారని తెలిపారు. ‘‘వివిధ అంశాలపై సమావేశంలో చర్చించాం. దేశవ్యాప్తంగా అనేకమందిని కలుస్తున్నారు. అందులో భాగంగానే నన్ను కలిశారు. నా అభిప్రాయాలను జేపీ నడ్డాతో పంచుకున్నా. ప్రజాస్వామ్యంలో ఇలా కలుసుకోవడం శుభపరిణామం. సిద్ధాంతాలు వేరైనా అభిప్రాయాలు పంచుకోవడం మంచిది’’ అని నాగేశ్వర్ పేర్కొన్నారు. ♦ప్రొఫెసర్ నాగేశ్వర్‌తో జేపీ నడ్డా సమావేశమయ్యారు. బీజేపీ 9 ఏళ్ల పాలనపై రూపొందించిన పుస్తకానికి నాగేశ్వర్‌కు ఆయన అందించారు. నడ్డా వెంట తెలంగాణ బీజేపీ ముఖ్య నాయకులు ఉన్నారు. ♦ నోవాటెల్‌లో రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలతో జేపీ నడ్డా సమావేశమయ్యారు. ♦ ఈ సమావేశంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, బండి సంజయ్, రఘునందరావు, విజయశాంతి, వివేక్ తదితరులు ఉన్నారు. ♦ శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న జేపీ నడ్డా. ♦బీజేపీ అధిష్టానం తెలంగాణ రాజకీయాలపై ఫోకస్ పెంచింది. ఈ నేపథ్యంలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు మరోసారి తెలంగాణకు వస్తున్నారు. ఈ క్రమంలో నాగర్ కర్నూలులో బీజేపీ తలపెట్టిన సభకు జేపీ నడ్డా హాజరుకానున్నారు. ♦ అయితే, కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయంగా, రాష్ట్రంలో పార్టీ పరంగా నాయకుల్లో ఏర్పడిన గందరగోళాన్ని తొలగించి దిశానిర్దేశం చేసే విషయంలో ఈ పర్యటనకు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. పార్టీలో ముఖ్యనేతల మధ్య సమన్వయం కొరవడి బీజేపీ డీలాపడిందనే ప్రచారం మధ్య నడ్డా పర్యటన రాష్ట్రంలో పార్టీకి కొత్త ఊపును ఇస్తుందని భావిస్తున్నారు. ♦ జేపీ నడ్డా.. మధ్యాహ్నం ‘సంపర్క్ సే సమర్థన్’లో భాగంగా ఆర్థిక, రాజకీయ విశ్లేషకుడు ప్రొ. కె.నాగేశ్వర్, పద్మశ్రీ అవార్డు గ్రహీత ఆనంద్ శంకర్ జయంత్‌ల ఇళ్లకు వెళ్లి నడ్డా వారిని కలుసుకోనున్నారు. నడ్డా పూర్తి షెడ్యూల్ ఇదే.. ♦ ఆదివారం మధ్యాహ్నం 12.30 నిమిషాలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దిగుతారు. ♦ మధ్యాహ్నం 12.55 నుంచి 1.45 గంటల దాకా నోవాటెల్ హోటల్లో రిజర్వ్ టైమ్. ♦ 2.30 గంటలకు టోలిచౌకిలోని ప్రొ.నాగేశ్వర్ నివాసానికి వెళ్లి 15 నిమిషాలు సమావేశమవుతారు. ♦ 2.55 నిమిషాలకు ఫిల్మ్‌నగర్‌లో పద్మశ్రీ ఆనంద శంకర్ జయంత్‌ను కలుసుకుంటారు. ♦ 3.50కి నోవాటెల్‌కు చేరుకుంటారు. ♦ 4.20 గంటలకు శంషాబాద్ నుంచి హెలికాప్టర్లో నాగర్‌కర్నూ ల్కు బయలుదేరి 4.50కు అక్కడికి చేరుకుంటా రు. ♦ సాయంత్రం 5–6గంటల మధ్య నాగర్‌కర్నూల్ జెడ్పీ హైసూ్కల్ మైదానంలో బహిరంగసభలో పాల్గొంటారు. ♦ 6.15కు హెలి కాప్టర్లో తిరుగు ప్రయాణమై 6.40కి శంషాబాద్‌కు చేరుకుంటారు. ♦ 6.45 గంటలకు ప్రత్యేక విమా నంలో కేరళలోని తిరువనంతపురం వెళతారు. -
10,783 కనెక్షన్లకు ‘జీరో’ బిల్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అసలే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లను కొందరు అధికారులు, సిబ్బంది మరింతగా ముంచుతున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. నాగర్‌కర్నూల్ డివిజన్ పరిధిలో ఏకంగా 10,783 విద్యుత్ కనెక్షన్లకు జీరో యూనిట్ల వినియోగంతో బిల్లులు జారీ చేస్తున్నట్లు సంస్థ విజిలెన్స్ విభాగం విచారణలో తేలింది. దీంతో సంస్థ ప్రతి నెలా రూ. లక్షల్లో ఆదాయాన్ని నష్టపోయినట్లు వెల్లడైంది. అయితే ఆయా బిల్లుల వాస్తవ మొత్తాలను వినియోగదారుల నుంచి కొందరు అధికారులు, సిబ్బంది వసూలు చేసుకొని జేబులో వేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) చైర్మన్ తన్నీరు శ్రీరంగారావుకు జి.సత్యనారాయణ అనే న్యాయవాది చేసిన ఫిర్యాదుతో ఈ అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. సాధారణంగా ప్రతి విద్యుత్ కనెక్షన్‌కు ఒక మీటర్, ఆ మీటర్‌కు ఒక విశిష్ట సంఖ్య ఉంటుంది. కానీ ఒకే మీటర్ నంబర్‌తో 10,783 సర్విసు కనెక్షన్లు ఉన్నట్లు విజిలెన్స్ తేల్చినట్లు సమాచారం. 2,788 కనెక్షన్లపైనే విచారణ.. ఈఆర్సీ సూచనలతో టీఎస్ఎస్పీడీసీఎల్ విజిలెన్స్ విభాగంతో విచారణ జరిపించింది. 10,783 సర్వీసు కనెక్షన్లలో 2,788 కనెక్షన్లను మాత్రమే విజిలెన్స్ విభాగం తనఖీ చేయగలిగింది. సిబ్బంది కొరతతో మిగిలిన కనెక్షన్లను తనిఖీ చేయలేకపోయింది. తనఖీ చేసిన 2,788 కనెక్షన్లలో కేవలం 687 కనెక్షన్లకే మీటర్లున్నాయని, మిగిలిన 2101 కనెక్షన్లకు మీటర్లు లేవని గుర్తించింది. తనిఖీ చేసిన కనెక్షన్లకు సంబంధించి తప్పుడు మీటర్ రీడింగ్‌ను నమోదు చేసి బిల్లులు జారీ చేయడంతో సంస్థ రూ. 9.32 లక్షల ఆదాయాన్ని నష్టపోయినట్టు నిర్ధారించింది. 10,783 కనెక్షన్లలో ఏకంగా 4,842 కనెక్షన్లకు మీటర్లే లేవని నాగర్‌కర్నూల్ డీఈ మరో నివేదికలో టీఎస్ఎస్పీడీసీఎల్కు తెలియజేశారు. ఒక్క నాగర్‌కర్నూల్ డివిజన్ పరిధిలోనే ఈ పరిస్థితి బయటపడగా రాష్ట్రవ్యాప్తంగా ఈ తరహా అవకతవకతలతో డిస్కంలు రూ. వందల కోట్ల మేర ఆదాయాన్ని నష్టపోతున్నాయని ఆరోపణలున్నాయి. 41 మందిపై చర్యలకు ఆదేశం.. నాగర్‌కర్నూల్ డివిజన్లో వెలుగు చూసిన భారీ అక్రమాల్లో స్థానికంగా పనిచేసే 41 మంది ఓఅండ్ఎం విభాగం అధికారులు, సిబ్బంది, మరో ముగ్గురు అకౌంట్స్ విభాగం అధికారులను బాధ్యులుగా విజిలెన్స్ విభాగం తేల్చింది. ఈ నివేదిక ఆధారంగా 14 మంది ఏఈలు, నలుగురు ఏడీఈలు, మరొక డీఈపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సీఎండీ జి.రఘుమారెడ్డి ఆదేశించారు. వారి బాధ్యతారాహిత్యం, విధుల్లో నిర్లక్ష్యంతోనే మీటర్ రీడర్లు అక్రమాలకు పాల్పడ్డారని, వారితోపాటు ప్రైవేటు మీటర్ రీడింగ్ ఏజెన్సీపైనా చర్యలు తీసుకోవాలన్నారు. అయితే ఈ వ్యవహారంలో ఇంకా ఎవరినీ సస్పెండ్ చేయలేదని అధికార వర్గాలు తెలిపాయి. -
ఏకకాలంలో ఒక్కటైన 220 జంటలు
సాక్షి, నాగర్‌కర్నూల్: ఒకేసారి 220 జంటలు ఒక్కటైన అపురూప దృశ్యం ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో ఆవిష్కృతమైంది. ఎంజేఆర్ ట్రస్ట్, ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, ఆయన సతీమణి జమున ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక వివాహాల మహోత్సవం కన్నులపండువగా సాగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, ఎంపీ కె.కేశవరావు, పార్లమెంటరీ పక్షనేత, ఎంపీ నామా నాగేశ్వరరావు హాజరయ్యారు. ప్రధాన వేదికపై యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి, అమ్మవార్లకు ప్రధాన అర్చకులు కల్యాణం నిర్వహించగా.. ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ముత్యాల పందిరి, పురోహితుల ఆధ్వర్యంలో 220 కొత్త జంటలు ఒకే వేదిక ద్వారా ఒక్కటయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వధూవరులకు కంకణాలను అందజేశారు. కొత్తజంటలకు అవసరమైన సామగ్రిని అందజేశారు. సామూహిక వివాహాలకు హాజరైన వారందరికీ భోజనాలు ఏర్పాటుచేశారు. సంపాదనలో సగం పేదలకే.. ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి సంపాదించిన దాంట్లో సగం పేదల కోసం ఖర్చు చేయాలనుకోవడం గొప్ప నిర్ణయం అని ఎంపీ కె.కేశవరావు అన్నారు. ఎమ్మెల్యే సొంతంగా రూ.3 కోట్లు వెచ్చించి కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలను నిర్మించడం అభినందనీయమని ప్రశంసించారు. ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ, తనకు అవకాశం వస్తే అనాథలు, బడుగు, బలహీనులకు వివాహాలు జరిపిస్తానని పేర్కొన్నారు. తాను గెలిచినా, ఓడినా వివాహ కార్యక్రమాలు కొనసాగిస్తానని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్, కలెక్టర్ ఉదయ్‌కుమార్, ఎస్పీ మనోహర్ తదితరులు పాల్గొన్నారు. -
ఒక్కటికానున్న 220 జంటలు
సాక్షి, నాగర్‌కర్నూల్: ఒకేసారి 220 జంటలు వివాహ వేడుకతో ఒక్కటయ్యే దృశ్యం నాగర్‌కర్నూల్ జిల్లాకేంద్రంలో ఆదివారం ఆవిష్కృతం కానుంది. ఎంజేఆర్ చారిటబుల్ ట్రస్ట్, ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, ఆయన సతీమణి జమున ఆధ్వర్యంలో ఐదోసారి సామూహిక వివాహ మహోత్సవాన్ని ఆదివారం ఉదయం 10.05 గంటలకు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తికాగా, శుక్రవారం కాబోయే జంటలకు మెహందీ, హల్దీ ఫంక్షన్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన వస్త్రాలు ధరించి కాబోయే వధువరులు మురిసిపోయారు. సామూహిక వివాహ వేడుకల్లో మొత్తం 220 జంటలకు ఏకకాలంలో వివాహం నిర్వహించనున్నారు. ప్రధాన వేదికపై యాదాద్రి లక్షీనరసింహస్వామి ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో లక్ష్మీనరసింహస్వామి వారికి కల్యాణం నిర్వహించనుండగా, ప్రతి జంటకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ముత్యాల పందిరిలో వివాహాలు జరిపించనున్నారు. పెళ్లయ్యే జంటల తరపున బంధువులందరికీ విందు భోజనాలు కూడా పెడుతున్నారు. కార్యక్రమానికి అతిథులుగా ఎమ్మెల్సీ కవితతో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. కార్యకర్తల బలంతోనే..: జనార్దన్‌రెడ్డి కార్యకర్తలు, ప్రజల తోడ్పాటుతోనే ఐదోసారి సామూహిక వివాహాలు చేయగలుగుతున్నాం. ఎంతోమంది నిరుపేదలకు వారి పిల్లల పెళ్లిళ్లు చేయడమనేది కలగానే ఉంటుంది. పెద్దసంఖ్యలో జంటలకు వివాహం జరిపించడం అదృష్టంగా భావిస్తున్నా. -
ప్లాస్టిక్ ఫ్రీ జోన్‌గా నల్లమల
సాక్షి, నాగర్‌కర్నూల్: అడవులు, వన్యప్రాణుల సంరక్షణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిందని, అందులో భాగంగా ప్లాస్టిక్ ఫ్రీ జోన్‌గా నల్లమల అటవీ ప్రాంతాన్ని తీర్చిదిద్దనున్నట్టు రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. అటవీ శాఖ చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాలతో రాష్ట్రంలో పులుల సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పారు. శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో మంత్రి పర్యటించారు. రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ ఒంటేరు ప్రతాప్‌రెడ్డి, పీసీసీఎఫ్ రాకేశ్ మోహన్ డోబ్రియాల్తో కలసి మన్ననూరులో కొత్తగా నిర్మించిన ట్రీహౌస్, అదనపు కాటేజీలతోపాటు 8 సఫారీ వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వ్‌ల్లోని పులుల సంరక్షణపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో 2018లో 12గా ఉన్న పులుల సంఖ్య 2021లో 21కి పెరిగినట్టు తెలిపారు. వన్యప్రాణులను వేటాడే వారిపై పీడీ యాక్ట్ నమో దు చేస్తున్నామని, సమాచారం తెలిపిన వారికి బహుమతులు ఇస్తున్నామని చెప్పారు. పోడు భూముల విషయంలో సీఎం కేసీఆర్ త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారని చెప్పారు. ఎకో టూరిజంలో భాగంగా ప్యాకేజీలు.. టైగర్ స్టే ప్యాకేజీలో భాగంగా రెండ్రోజులు అడవిలో ఉండి టైగర్ సఫారీతోపాటు ట్రెక్కింగ్, కాటేజీల్లో బస చేసే అవకాశం కల్పిస్తున్నామని మంత్రి వివరించారు. ఇప్పటికే ఉన్న కాటేజీలకు మరో ఆరు కాటేజీలతోపాటు ఇటీవల నిర్మించిన ట్రీహౌస్æ కాటేజీ ప్రత్యేకంగా నిలుస్తుందని చెప్పారు. ఈనెల 26 నుంచి టైగర్ స్టే ప్యాకేజీ అమల్లోకి రానుంది. ఇందుకు సంబంధించిన వెబ్సైట్లో బుకింగ్‌ను మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. సాధారణ కాటేజీలో ఇద్దరికి రూ.4,600, మడ్ హౌస్‌లో రూ. 6 వేలు, ట్రీ హౌస్‌లో రూ. 8 వేలతో ప్యాకేజీని ఖరారు చేశామన్నారు. బుకింగ్‌ల కోసం www.amrabadtigerreserve.com సంప్రదించొచ్చన్నారు. పులుల అభయారణ్యాల్లోని మారుమూల ప్రాంతాల్లో ఉన్న వారికి పునరావాసం కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని పీసీసీఎఫ్ రాకేశ్ మోహన్ డోబ్రీయాల్ చెప్పారు. కార్యక్రమంలో అటవీ అభివృద్ధి సంస్థ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి, ఎంపీ రాములు, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు కలెక్టర్ ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. -
పాత ప్రియుడితో కలిసి మహిళ ఘాతుకం.. అనుమానంతో వేధిస్తున్నాడని
సాక్షి, నాగర్‌కర్నూల్: తాగి వేధిస్తున్న ప్రియుడిని మరో ప్రియుడితో కలిసి మహిళ హత్య చేసిన సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. వట్టెం గ్రామానికి చెందిన కృష్ణమ్మకు 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లయిన కొన్నాళ్లకే ఆమెను భర్త వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో ఆమె బతుకుదెరువు కోసం ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు వలస వెళ్లింది. అక్కడే ఉంటున్న రవికుమార్ (38)తో పరిచయం ఏర్పడింది. ఈక్రమంలో వారు ఐదేళ్ల క్రితం అక్కడి నుంచి వచ్చి వట్టెంలో సహజీవనం చేస్తున్నారు. కాగా, కృష్ణమ్మకు గతంలో జడ్చర్లకు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తితో సన్నిహితంగా ఉండేది. దీంతో వీరిద్దరి మధ్య సంబంధం ఉందనే అనుమానంతో రవి రోజూ తాగి వచ్చి ఆమెను వేధించేవాడు. ఆ వేధింపులు తీవ్రం కావడంతో తట్టుకోలేక మాజీ ప్రియుడు శ్రీనివాస్‌కు విషయం చెప్పింది. వారిద్దరూ కలిసి ఆదివారం అర్ధరాత్రి తర్వాత నిద్రలో ఉన్న రవికుమార్‌ను రాయితో తలపై కొట్టి హత్య చేశారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ హన్మంత, ఎస్ఐ కృష్ణా ఓబుల్‌రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. నిందితులు పరారీలో ఉన్నారని, వెంటనే విచారణ చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలిస్తామని పోలీసులు చెప్పారు. -
నాగర్‌కర్నూల్‌లో ఉద్రిక్తత.. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ
సాక్షి, నాగర్‌కర్నూల్: జిల్లాలోని మార్కండేయ రిజర్వాయర్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ జరిగింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. అయితే, మార్కండేయ లిఫ్ట్ పనులను పరిశీలించేందుకు మాజీ మంత్రి నాగం జనార్థన్ రెడ్డి అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. అనంతరం.. నాగం జనార్థన్ రెడ్డితో పాటుగా కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకున్నారు. కాంగ్రెస్ నేతలకు ఇక్కడకి వచ్చేందుకు వీలులేదంటూ వాగ్వాదానికి దిగారు. దీంతో, ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురికి గాయాలు అయినట్టు తెలుస్తోంది. మరోవైపు.. బీఆర్ఎస్ పార్టీ నేతల దాడులపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ప్రభుత్వం సక్రమంగా పనులు చేస్తున్నప్పుడు తమను అడ్డుకోవాల్సి అవసరం ఏముందని ప్రశ్నించారు. దాడి ఘటన తర్వాత కాంగ్రెస్ నేతలు, నాగం అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
కల్తీ మద్యం కలకలం?
నాగర్‌కర్నూల్ క్రైం: ఒకే షాపు నుంచి మద్యం కొనుగోలు చేసి తాగిన ఇద్దరు వ్యక్తులు అను మానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. మృతులు కుటుంబసభ్యుల కథనం మేరకు... నాగర్‌కర్నూల్ మండలం నల్లవెల్లికి చెందిన నర్సింహ(45) సోమవారం సాయంత్రం నాగర్‌కర్నూల్ బస్టాండ్ సమీపంలోని ఓ మద్యం దుకాణం ఎదుట అనుమానాస్పద స్థితిలో మృతిచెందగా అర్ధరాత్రి పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు గమనించి మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. మరో ఘట నలో మండలంలోని కుమ్మెరకు చెందిన ఊషన్న(50) బ్యాంకులో నగదును తీసుకునేందుకు మంగళవారం ఉదయం జిల్లాకేంద్రానికి వచ్చా డు. డబ్బులు తీసుకున్న తర్వాత మద్యం తాగి తిరిగి వెళ్తూ జెడ్పీహెచ్ఎస్ పాఠశాల ప్రహరీ వద్ద కిందపడి మృతిచెందాడు. పోలీసులకు సమాచారం అందడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనరల్ ఆస్పత్రికి తరలించారు. కాగా ఊషన్న జేబులో మద్యం సీసా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. నర్సింహ, ఊషన్న ఇద్దరూ కల్తీ మద్యం తాగి మృతి చెందినట్లు వారి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విజయ్‌కుమార్ తెలిపారు. శాంపిల్స్ సేకరించిన ఎక్సైజ్ అధికారులు జిల్లా కేంద్రంలో ఇద్దరు కల్తీ మద్యం తాగి మృతి చెందినట్లు ఆరోపణలు రావడంతో ఎక్సైజ్ డీటీఎఫ్ సీఐ పరమేశ్వర్‌గౌడ్ ఆధ్వర్యంలో మంగళవారం మధ్యాహ్నం బస్టాండ్ సమీపంలోని మోతీ వైన్స్‌లో తనిఖీలు నిర్వహించి పలు బ్రాండ్లకు సంబంధించి శాంపిల్స్ సేకరించారు. కాగా మృతులు ఇద్దరూ మద్యం కొనుగోలు చేసింది ఒకే వైన్స్ నుంచే కావడం కల్తీ మద్యం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఈ విషయమై ఎక్సైజ్ ఈఎస్ ఫయాజుద్దీన్‌ను వివరణ కోరగా మోతీ వైన్స్ నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపనున్నట్లు తెలిపారు. -
ఉద్యమకారులపై కేసులా?
సాక్షి, నాగర్‌కర్నూల్: రాష్ట్రంలో ఉద్యమకారులపై కుట్రలతో కేసులు పెడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలతో పాటు ఆత్మగౌరవ నినాదంతో తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామని, అయితే రాష్ట్రంలో ఉద్యమకారులకు గౌరవం దక్కడం లేదని విమర్శించారు. తిండి లేకున్నా ఉంటాం కానీ, ఆత్మగౌరవం లేకుండా ఉండలేమని వ్యాఖ్యానించారు. తాను రెండు దశాబ్దాల పాటు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నానని చెప్పారు. బుధవారం నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో ‘జూపల్లి మరో ప్రస్థానం’పేరుతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. -
హైదరాబాద్– శ్రీశైలం రహదారిపై పెద్దపులి
అచ్చంపేట: నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం వట్టువర్లపల్లి సమీపంలో హైదరాబాద్–శ్రీశైలం జాతీయ రహదారిపై గురువారం ఉదయం పెద్ద పులి రోడ్డు దాటుతూ కనిపించింది. ఒక్కసారిగా పులి రో డ్డుపైకి రావడంతో అటు వెళ్తున్న ప్ర యాణికులు వాహనాలను నిలిపివేశారు. పులి ఫొటోలను కెమెరాల్లో చిత్రీకరించారు. దీనిపై డీఎఫ్‌వో రోహిత్ గోపిడి స్పందిస్తూ అమ్రాబా ద్ టైగర్ రిజర్వ్‌లో పులుల సంఖ్య పెరిగిందని స్పష్టం చేశారు. అందుకే మన్ననూర్ నుంచి శ్రీశైలం వరకు అక్కడక్కడ రోడ్డుపై పులుల సంచారం కనిపిస్తోందని పేర్కొన్నారు. -
బీజేపీ, టీఆర్ఎస్ రెండూ దొంగ పార్టీలే: ఆర్ఎస్పీ
కొల్లాపూర్ రూరల్: బీజేపీ, టీఆర్ఎస్ రెండూ దొంగ పార్టీలేనని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని కుడికిల్లలో ఇటీవల పోడు భూముల సమస్యలతో నార్లాపూర్, కుడికిల్ల గ్రామాల రైతుల ఘర్షణలో గాయపడిన దళిత రైతులను పరామర్శించారు. అనంతరం ప్రవీణ్ విలేకరులతో మాట్లాడుతూ అంగట్లో సరుకుల మాదిరిగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. రెండు పార్టీలు ముందుగా మాట్లాడుకునే ఈ తతంగాన్ని నడిపాయని ఆరోపించారు. కొనుగోలుకు గురైన ఎమ్మెల్యేలను దించి.. బీఎస్పీ పార్టీ వారిని ఎమ్మెల్యేలుగా గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. -
నాగర్‌కర్నూల్: ర్యాగింగ్ భూతానికి మైనా బలి!
సాక్షి, నాగర్‌కర్నూల్: జిల్లాలో ఓ ప్రభుత్వకాలేజీలో ర్యాగింగ్ భూతం.. ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ర్యాగింగ్ చేశారనే మనస్థాపంతో మైనా అనే ఓ డిగ్రీ విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. హనుమాన్ తండాకి చెందిన మైనా(19).. జడ్చర్ల డాక్టర్ బీఆర్ఆర్ ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ చదవుతోంది. బుధవారం ఉదయం పొలానికి వెళ్లి పురుగుల మందు తాగింది. ఆపై ఇంటికి వచ్చి బాధపడుతుండగా.. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ సాయంత్రానికి కన్నుమూసింది. తొలుత సూసైడ్‌కి గల కారణాలు తెలియరాలేదు. అయితే ర్యాంగింగ్కు సంబంధించిన వీడియోగా ఒకటి వైరల్ కావడంతో.. తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేశారు. ర్యాగింగ్ ఘటనపై విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఇక వీడియోలో ఒకరు.. మైనాను కొడుతున్నట్లుగా ప్రచారం అవుతోంది. కౌన్సెలింగ్.. బెదిరింపులు? మైనాపై జరిగిన ర్యాగింగ్ బయటకు రాకుండా కాలేజీ యాజమాన్యం జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది. ఐదుగురు లెక్చరర్లు ఆమెకు కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు విషయం బయట చెప్పొద్దని ప్రిన్సిపాల్ సైతం బెదిరింపులకు పాల్పడ్డట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలపై యాజమాన్యం స్పందించాల్సి ఉంది. -
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలో భారీ వర్షాలు
-
ఎలుక మూతి.. సౌండ్ వింటే గుండె ఆగి చస్తాయ్!!
సాక్షి, నాగర్ కర్నూల్: జానెడు పొడవు.. 2,3 కిలోల బరువు.. ఎలుకలాంటి ముఖం.. జాతి మాత్రం జింక. మన దేశంలో అరుదైన మూషిక జింకలు అవి. జింకల జాతిలో అతి చిన్నవి అయిన ఈ మూషిక జింకలకు నల్లమల అభయారణ్యం కేంద్రంగా మారుతోంది. అంతరించిపోయే దశలో ఉన్న మూషిక జింకలను సంరక్షించేందుకు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో ప్రత్యేకంగా ‘మౌస్ డీర్ సాఫ్ట్ రిలీజ్’కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. బరువు తక్కువ.. భయం ఎక్కువ! భారత ఉప ఖండంలో మాత్రమే విరివిగా కనిపించే మూషిక జింకలు నల్లమల అటవీ ప్రాంతంలో 20 ఏళ్ల కిందే అంతరించిపోయినట్టు అంచనా. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ జింకలను అంతరించిపోతున్న జాతిగా గుర్తించి వన్యప్రాణి సంరక్షణ చట్టంలోని షెడ్యూల్ 1లో చేర్చింది. మూషిక జింకలకు భయం ఎక్కువ. పెద్ద శబ్దాలు, జంతువులు దాడి చేసినప్పుడు వాటి గుండె ఆగి మరణిస్తాయని జంతుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మూషిక జింకలు రాత్రివేళల్లో ఎక్కువగా సంచరిస్తాయి. అడవిలో నేలరాలిన పండ్లు, పూలు, ఆకులను తింటాయి. మారేడు, ఉసిరి, పరక, గొట్టి, మంగకాయలు, పుట్టగొడుగులు, చిన్నచిన్న పొదల లేత ఆకులను ఇష్టంగా తింటాయి. మూషిక జింక గర్భాధారణ కాలం ఆరునెలలు. ఒక ఈతలో ఒకట్రెండు పిల్లలను మాత్రమే కంటుంది. అయితే వెంటనే మళ్లీ సంతానోత్పత్తికి సిద్ధం కావడం వీటి ప్రత్యేకత. వీటిని చిరుత పులులు, అడవి కుక్కలు, గద్దలు, అడవి పిల్లులు వేటాడుతాయి. వీటికితోడు వేట, అడవుల నరికివేత, కార్చిచ్చుల వంటివి మూషిక జింకల ఉనికికి ముప్పుగా మారుతున్నాయి. మంచి ఫలితాలు కన్పిస్తున్నాయి అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో 2017 నుంచి మౌస్‌డీర్ సాఫ్ట్ రిలీజ్ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. నల్లమలలో అంతరించిపోయిన మూషిక జింకల జాతిని తిరిగి పెంచేందుకు అటవీ శాఖ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. క్రమంగా మూషిక జింకల సంఖ్య పెరుగుతోంది. నిత్యం 50 ట్రాప్ కెమెరాలతో వాటి కదలికలను గమనిస్తున్నాం. ::: రోహిత్ గోపిడి, జిల్లా అటవీశాఖ అధికారి, నాగర్‌కర్నూల్ 3 దశల్లో.. ప్రత్యేక జాగ్రత్తల మధ్య.. అటవీశాఖ హైదరాబాద్‌లోని జూపార్క్, సీసీఎంబీ సంస్థలతో కలసి మూషిక జింకల సంతతిని పెంచేందుకు చర్యలు తీసుకుంటోంది. మొదట 2008లో శేషాచలం అడవుల నుంచి నాలుగు ఆడ, రెండు మగ మూషిక జింకలను తీసుకొచ్చి హైదరాబాద్ జూపార్క్‌లోని బ్రీడింగ్ కేంద్రంలో ఉంచారు. వాటి సంఖ్య పెరిగిన తర్వాత 2017 సెప్టెంబర్ 12 నుంచి ‘మౌస్ డీర్ సాఫ్ట్ రిలీజ్’ప్రోగ్రాం కింద అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో విడతల వారీగా విడుదల చేస్తున్నారు. ► ఒక్కో బ్యాచ్‌లో ఆరు ఆడ, రెండు మగ మూషిక జింకలను వదులుతున్నారు. ఇది మూడు దశలుగా జరుగుతుంది. ఇందుకోసం నల్లమల అటవీ ప్రాంతంలోని ఫర్హాబాద్ సమీపంలో మూడు కంపార్ట్మెంట్లను అధికారులు ఏర్పాటు చేశారు. ► తొలిదశలో క్యారెట్, దానిమ్మ, అరటి వంటి బయటి ఆహారాన్ని అందించి పరిరక్షిస్తారు. ► రెండో దశలో బయటి ఆహారాన్ని తగ్గిస్తూ.. అడవిలో సహజంగా లభించే ఆహారాన్ని అందజేస్తారు. ► మూడో దశలో అడవిలోకి వదిలి బయటి నుంచి నీరు, ఆహారం ఇవ్వకుండా సహజ వాతావరణంలో అవే వెతుక్కుని తీసుకునేలా అలవాటు చేస్తారు. ► మొత్తంగా 30 రోజుల పరిశీలన అనంతరం పూర్తిగా అడవిలో వదిలేస్తారు. అయితే వాటి పరిస్థితిని పర్యవేక్షించేందుకు అడవిలో అక్కడక్కడా 50 వరకు ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు మొత్తంగా 144 మూషిక జింకలను విడుదల చేశారు. -
రైలు కిందపడి చావాలనుకున్నా.. బతికి సాధించా: నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే
సాక్షి, నాగర్‌కర్నూల్: ‘వ్యాపారం, రాజకీయాల్లోకి రాకముందు నేను కూడా ఒక సందర్భంలో ఆత్మహత్య చేసుకుందామనుకున్నా. రైలు కిందపడి చనిపోయేందుకు కాచిగూడ రైల్వేస్టేషన్‌కు వెళ్లా. కానీ, చివరి నిమిషంలో నిర్ణయం మార్చుకున్నా. జీవితంలో పైకి ఎదగాలనే పట్టుదలతో ఎమ్మెల్యే అయ్యాను. ఒకప్పుడు పనిలేని స్థాయి నుంచి.. ఇప్పుడు 7 వేల మందికి ఉపాధి కల్పించే స్థాయికి చేరాను’.. అని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి తన గతాన్ని గుర్తు చేసుకున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీసీ స్టడీ సర్కిల్ ప్రారంభోత్సవంలో ఆయన ఈ విధంగా మాట్లాడారు. ఒకప్పుడు నాన్నతో గొడవపడి కేవలం రూ.30తో హైదరాబాద్ వెళ్లి ఎన్నో కష్టాలు పడ్డానని ఆయన వివరించారు. యువత ఉద్యోగం రాలేదని నిరాశ చెందకుండా ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని హితవు పలికారు. నిరుపేద విద్యార్థుల కోసం ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్టడీ సెంటర్లను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. చదవండి: ఉప్పల్ స్టేడియంలో ఇండియా– ఆస్ట్రేలియా మ్యాచ్.. అభిమానులతో ఆటలా! -
పిల్లలను చంపాడని భర్త గొంతుకోసిన భార్య
కొల్లాపూర్ రూరల్: పిల్లలను హత్య చేశాడని కోపంతో రగలిపోయిన ఓ మహిళ తన భర్త గొంతుకోసి హత మార్చింది. తల్లితో కలిసి ఆమె ఈ హత్యకు పా ల్పడిన ఘటన వివరా లిలా ఉన్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం కుడికిళ్లకు చెందిన ఓంకార్(40), మహేశ్వరి భార్యా భర్తలు. వీరికి కూతురు, కుమా రుడు ఉన్నారు. ఇటీవల భార్యకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో గత నెల 17న భార్య, తన ఇద్దరు చిన్నారులతో కలిసి ద్విచక్రవాహనంపై ఆస్పత్రికి బయల్దేరాడు. మార్గ మధ్యంలో పెద్దకొత్తపల్లి మండలం గంట్రావు పల్లి సమీపంలో భా ర్యను బైక్‌పై నుంచి తోసేసి ఇద్దరు చిన్నారులను తీసుకొని వెళ్లిపోయాడు. కోడేరు మండలం నాగుపల్లి సమీపంలోని అడ్డగట్టు పైకి పిల్లలను తీసుకెళ్లి గొంతుకోసి, తాను కూడా కోసుకున్నాడు. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతిచెందగా ఓంకార్ ప్రాణాలతో బయటపడ్డాడు. హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొంది ఇంటికి వచ్చాడు. అప్ప టికే కోపంతో ఉన్న మహేశ్వరి ఆదివారం ఉదయం తన తల్లి జోగమ్మతో కలిసి ఓంకార్ గొంతును కోసి హత్య చేసింది. -
కుటుంబ పాలనకు అంతం పలకాలి
నాగర్‌కర్నూల్ రూరల్: రాష్ట్రంలో ఒక కుటుంబంతో అరాచక వ్యవస్థ కొనసాగుతోందని, ఈ పాలనకు అంతం పలకాలని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ఆమె చేపట్టిన ప్రజాప్రస్థాన యాత్ర గురువారం నాగర్‌కర్నూల్ జిల్లాలో ముగిసి వనపర్తి జిల్లా గోపాల్పేటలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వెనుకబడిన నాగర్‌కర్నూల్ ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అని గుర్తు చేశారు. వైఎస్సార్ చనిపోయి 13 ఏళ్లు గడుస్తున్నా.. ఈ ప్రాంత ప్రజలు ఇంకా ఆయనను గుర్తు పెట్టుకున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రజల అభ్యున్నతికి తన తండ్రి జీవితాన్ని అంకితం చేశారని తెలిపారు. -
కమీషన్ల కోసమే కాళేశ్వరం: వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల
అచ్చంపేట: ‘కాళేశ్వరం ప్రాజెక్టు మహా అద్భుతం అన్నారు.. మూడేళ్లకే ఎలా మునిగింది. కాంక్రీట్‌తో కట్టాల్సిన ప్రాజెక్టును మట్టితో నిర్మిస్తారా’.. అని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల ప్రశ్నించారు. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని ఆర్టీసీ బస్టాండు ఎదుట నిర్వహించిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. ప్రజల కోసం రచ్చబండ కార్యక్రమానికి వెళుతూ ఇదే నల్లమలలో మరణించిన మహానేత వైఎస్సార్‌కు మరణం లేదని, ప్రజల గుండెల్లో ఆయన ఇంకా బతికే ఉన్నారని అన్నారు. సీఎం కేసీఆర్ ఎనిమిదేళ్లలో ప్రజలకు చేసింది శూన్యమని, ప్రతీ పథకం మోసమని, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదని విమర్శించారు. పాలమూరు జిల్లాపై వైఎస్సార్‌కు అమితమైన ప్రేమ ఉందని.. ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు పలు ప్రాజెక్టులు చేపట్టారని షర్మిల పేర్కొన్నారు. పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు కోసం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా దాటే వరకు నల్లబ్యాడ్జీలతో పాదయాత్ర కొనసాగిస్తానని చెప్పారు. -
Ganesh Chaturthi 2022: ఏకశిలలో భారీ ఏకదంతుడు
సాక్షి, నాగర్‌కర్నూల్: ఇది దేశంలోనే ఎత్తైన ఏకశిలా వినాయకుడి విగ్రహం. ఇది నాగర్‌కర్నూల్ జిల్లాలోని తిమ్మాజిపేట మండలం ఆవంచలో ఉంది. దుందుభి వాగు తీరంలో వెలసిన ఈ వినాయకుడికి ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. కర్ణాటకలోని శ్రావణబెళగోళలో ఉన్న గోమఠేశ్వరుడు, చాముండీ కొండపై నందీశ్వరుడితోపాటు ఆవంచలోని గణపతి ఏకశిలా విగ్రహాలుగా అతిపెద్దవిగా ప్రసిద్ధి. ఏటా వినాయక చవితి సందర్భంగా వేలాదిమంది భక్తులు ఇక్కడికి వచ్చి దర్శించుకుంటారు. స్థానికులు ఐశ్వర్య గణపతిగా పిలిచే ఈ గణనాథుడికి ఆలయం లేదు. నాటి ఆవుల మంచాపురమే.. నేటి ఆవంచ.. పశ్చిమ చాళుక్యుల కాలంలో ప్రముఖులైన జగదేక మల్లుడు, భువనైక మల్లుడు, తైలోక్య మల్లుడు ఆవుల మంచాపురాన్ని రాజధానిగా చేసుకుని పాలించారు. నాటి ఆవుల మంచాపురాన్నే కాలక్రమంలో ఆవంచగా పిలుస్తున్నారు. తెలుగు నేలను పాలించిన ఇక్ష్యాకులు గణపతి భక్తులు కావడంతో క్రీ.శ.12వ శతాబ్దంలో 26 అడుగుల ఎత్తైన ఏకశిలా గణపతిని ఏర్పాటు చేసినట్లు చరిత్ర పరిశోధకులు చెబుతున్నారు. పశ్చిమ చాళుక్యుల కాలంలో వెలుగొందిన ఆవంచ గ్రామంలో లభించిన విగ్రహాలు, శిల్పాలను మహబూబ్‌నగర్ జిల్లాలోని పిల్లలమర్రి మ్యూజియం వద్ద భద్రపర్చారు. వీరి కాలంలోనే గ్రామశివారులోని భైరవ ఆలయంలోని ప్రతిమలు, మరో స్తంభంపై శివ పంచాయతనం చెక్కినట్లు స్పష్టమవుతోంది. ఆదరణ లేక పూజలందుకోని గణనాథుడు దేశంలోనే అతిపెద్ద వినాయక ఏకశిలా విగ్రహంగా ప్రసిద్ధి చెందిన ఐశ్వర్య గణపతికి నీడ లేకుండాపోయింది. ఆలయం నిర్మాణం జరగకపోవడంతో ఈ విగ్రహం వందల ఏళ్లుగా ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తోంది. ఏడేళ్ల క్రితం ఓ చారిటబుల్ ట్రస్టు ఆలయం నిర్మించేందుకు ముందుకు వచ్చింది. ఆలయం కోసం ఆరు ఎకరాల స్థలాన్ని సైతం కొనుగోలు చేశారు. అయితే ఆలయ నిర్మాణపనులు ముందుకుసాగడం లేదు. ప్రభుత్వం స్పందించి ఆలయ నిర్మాణం చేపట్టి పర్యాటకంగానూ అభివృద్ధి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ప్రభుత్వం దృష్టిసారించాలి.. పురాతన కాలం నాటి ఏకశిలా వినాయక విగ్రహానికి ఆలయాన్ని నిర్మించాలి. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలి. ఏళ్లపాటు ఆలయం లేక గణనాథుడు నిరాదరణకు గురవుతున్నాడు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి ఆవంచ వినాయకుడిని పర్యాటకంగా అభివృద్ధి చేయాలి. – వస్పతి శివలింగం, ఆవంచ, నాగర్‌కర్నూల్ జిల్లా -
భర్త వేధింపులతో ఒకరు.. పెళ్లికి యువకుడు నిరాకరించాడని మరొకరు
సాక్షి, మహబూబ్‌నగర్: మండలంలోని తాళ్లనర్సింహాపురం గ్రామానికి చెందిన దుబ్బల సుజాత(30) భర్త వేధింపులు భరించలేక నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ బాలవెంకటరమణ కథనం ప్రకారం.. ఈ నెల 13న రాత్రి భర్త క్రాంతికుమార్ సుజాతను కొట్టడంతో ఆమె తన తల్లి అలివేలమ్మకు ఫోన్ చేసి చెప్పింది. దీంతో ఆమె వచ్చి అల్లుడికి నచ్చజెప్పి వెళ్లింది. మళ్లీ 16న రాత్రి భర్త మరోసారి కొట్టడంతో మనస్తాపానికి గురై నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే తల్లి, బంధువులు నాగర్‌కర్నూల్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందింది. సుజాత కొల్లాపూర్‌లోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో కాంట్రాక్టు లెక్చరర్‌గా పనిచేస్తుండగా.. క్రాంతికుమార్ పెంట్లవెల్లిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నాడు. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. ఈ ఘటనపై సుజాత అన్న సురేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. చదవండి: భర్త ఆగడాలు తట్టుకోలేక.. సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య వెల్దండ: ప్రేమ విఫలమైందని పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన ఓ యువతి చికిత్స పొందుతూ మృతిచెందింది. ఎస్ఐ నర్సింహులు కతనం ప్రకారం.. వెల్దండలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్న నాగరత్నమ్మ(24) ఆమనగల్ మండలానికి చెందిన ఓ యువకుడిని ప్రేమించింది. యువకుడు పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపానికి గురైన ఆమె ఈ నెల 20న పురుగు మందు తాగింది. వెంటనే కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం మహబూబ్‌నగర్‌కు తరలించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందినట్లు ఎస్ఐ తెలిపారు. ఈ ఘటనపై నాగరత్నమ్మ అన్న నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
భార్యతో గొడవపడి పిల్లల గొంతు కోసేశాడు
కోడేరు: భార్యతో గొడవ పడి.. క్షణికావేశంలో చిన్నారులను గొంతు కోసి హత్యచేసిన ఓ తండ్రి..ఆపై తాను ఆత్మహత్యాయత్నం చేశాడు. నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరు మండలంలో బుధవారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. కొల్లాపూర్ మండలం కుడికిల్ల గ్రామానికి చెందిన ఓంకార్ భార్య చనిపోవడంతో జావాయిపల్లి గ్రామానికి చెందిన మరో మహిళను రెండో వివాహం చేసుకున్నా డు. అయితే తాగి జులాయిగా తిరుగుతుండటంతో ఆమె ఓంకార్‌ను వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది. కొన్నాళ్ల తర్వాత సొంతూరిలో మల్లేశ్వరిని మూడో పెళ్లి చేసుకున్నాడు. వీరికి విశ్వనాథం (7), చందన (3) పిల్లలున్నారు. కొల్లాపూర్‌కు మకాం మార్చి..సెంట్రింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. 4 రోజుల క్రితం కుడికిల్లకు వచ్చాడు. బుధవారం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయిస్తాన ని చెప్పి ద్విచక్రవాహనంపై భార్య, పిల్లలను ఎక్కించుకుని నాగర్‌కర్నూల్‌కు బయల్దేరాడు. మార్గమధ్యలో భార్యాభర్తలు గొడవపడ్డారు. దీంతో భార్యను పెద్దకొత్తపల్లి మండలం గంట్రావుపల్లి వద్ద బైక్ నుంచి తోసేసి పిల్లల్ని తీసుకుని వచ్చాడు. ఆ తర్వాత కోడేరు మండలం ఎత్తం శివారులో నాగులపల్లి వెళ్లే రోడ్డు పక్కన బైక్‌ను ఆపి.. ఇద్దరి పిల్లల్ని గట్టుపైకి తీసుకెళ్లి పొదల్లో వారి గొంతు కోసి చంపి తర్వాత తానూ గొంతు కోసుకున్నాడు. అయితే.. నొప్పి భరించలేక రోడ్డుపైకి వచ్చి పడిపోయాడు. అటుగా వెళుతున్నవారు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు అక్కడి వచ్చి వివరాలు సేకరించారు. పిల్లలనూ చంపేశానని చెప్పాడు. ఓంకార్‌ను నాగర్‌కర్నూల్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు, కుటుంబసభ్యులు గుట్టపైకి వెళ్లిచూడగా చనిపోయి ఉన్న పిల్లల మృతదేహాలు కనిపించాయి. కేసు దర్యాప్తు ప్రారంభించారు. -
Telangana: కూచుకుళ్ళ, నాగం ఏకమైతే మర్రికి ఇబ్బందే!
నాగర్ కర్నూల్ వచ్చే ఎన్నికల్లో కీలకం కాబోతోంది. ఇక్కడి ఎమ్మెల్యే మర్రి జనార్థనరెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ మరోసారి పోటీ చేస్తారని వినిపిస్తోంది. అచ్చంపేట నియోజకవర్గంలో పోడు భూముల సమస్య అధికార పార్టీకి ఇబ్బందికరంగా మారింది. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం వచ్చే ఎన్నికల్లో అత్యంత కీలకం కాబోతోంది. ఉమ్మడి జిల్లాలో సీనియర్ నాయకుల్లో ఒకరైన నాగం జనార్థనరెడ్డికి నియోజకవర్గంలో గట్టి పట్టుంది. తెలుగుదేశం అంతర్థానం తర్వాత బీజేపీలో చేరారు. అక్కడ గుర్తింపు దక్కకపోవడంతో ప్రస్తుతం హస్తం పార్టీలో కాలం వెళ్ళదీస్తున్నారు. గత రెండు ఎన్నికల్లో మర్రి జనార్థనరెడ్డి కారు గుర్తు మీద ఇక్కడి నుంచి విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లో కూడా మర్రి పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు జిల్లా పర్యటకు వచ్చినపుడు బహిరంగంగానే మర్రి పోటీ గురించి ప్రకటించారు. మరోవైపు అధికార పార్టీలో ఎమ్మెల్సీగా ఉన్న కూచుకుళ్ళ దామోదరరెడ్డితో మర్రి జనార్థనరెడ్డికి అసలు పడదనే ప్రచారం జిల్లాలో కొనసాగుతోంది. నియోజకవర్గంలో తన కేడర్‌పై కేసులు పెట్టించి వేధిస్తున్నారంటూ.. ఎమ్మెల్సీ కూచుకుళ్ళ దామోదరరెడ్డి ఎమ్మెల్యే మర్రి జనార్థనరెడ్డిపై మీడియా ముందే తీవ్ర ఆరోపణలు చేశారు. కూచుకుళ్ళ రెండోసారి కూడా ఎమ్మెల్సీగా విజయం సాధించారు. ఎమ్మెల్సీ కుమారుడు డాక్టర్ రాజేశ్‌రెడ్డి ఈసారి నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే టిక్కెట్ ఆశిస్తున్నారు. నాగం జనార్థనరెడ్డి వయస్సు మీదపడటం, కాంగ్రెస్ కేడర్‌లో చాలామంది టీఆర్ఎస్ గూటికి చేరడంతో ఆయనకు సమస్యగా మారింది. ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి, ఆయన కుమారుడు రాజేశ్‌రెడ్డి టీఆర్ఎస్లో సీటు రాకపోతే కాంగ్రెస్‌లో చేరతారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే నాగం, కూచుకుళ్ళ మధ్య సయోధ్య కుదిరితే, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నాగంకు సముచిత స్థానం ఇస్తామని పెద్దల నుంచి హామీ వస్తే నియోజకవర్గంలో పరిస్థితులు కాంగ్రెస్‌కు అనుకూలంగా మారవచ్చు. కూచుకుళ్ళ, నాగం ఏకమైతే మర్రికి ఇబ్బందికర పరిస్తితులు ఎదురవుతాయని చెబుతున్నారు. నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో బీజేపీ గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. అచ్చంపేట నియోజకవర్గం ఎస్సీ సీటుగా కొనసాగుతోంది. ఇక్కడి నుంచి రెండుసార్లు విజయం సాధించిన గువ్వల బాలరాజ్ మూడోసారి కూడా పోటీ చేస్తారని తెలుస్తోంది. బాలరాజ్ వ్యవహారశైలి కారణంగా కేడర్‌లో, ప్రజల్లో క్రమంగా వ్యతిరేకత పెరుగుతోంది. ఎమ్మెల్యే నియోజకవర్గానికి చేస్తున్నదేమీ లేదని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతమైన ఆమ్రాబాద్‌లో మంచినీటి సమస్య, పోడు భూముల సమస్య ఏమాత్రం పరిష్కారం కాకపోవడంతో గిరిజనులు కూడా ఎమ్మెల్యే పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల ప్రశాంత్ కిషోర్ నిర్వహించిన సర్వేలో కూడా బాలరాజ్‌కు నెగిటివ్ నివేదికే వచ్చినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ తరపున మరోసారి పోటీ చేయాలనుకుంటున్న డాక్టర్ వంశీకృష్ణ నియోజకవర్గంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ భూ కబ్జాలు, ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ విమర్శిస్తోంది. గతంలో కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయిన కేడర్ తిరిగి వస్తుండటంతో తమ విజయం తథ్యమని హస్తం పార్టీ భావిస్తోంది. డాక్టర్ వంశీకృష్ణ భార్య ఆమ్రాబాద్ జడ్పీటీసీ సభ్యురాలు డాక్టర్ అనూరాధను రంగంలోకి దింపితే గెలుపు మరింత సులభమవుతుందని కాంగ్రెస్ కార్యకర్తలు భావిస్తున్నారు. ఈసారి బీజేపీ కూడా అచ్చంపేటలో గెలుపే ధ్యేయంగా పనిచేస్తోంది. ఇటీవల కర్నాటక డీజీపీగా స్వచ్ఛంద పదవీ విరమణ పొందిన ఐపీఎస్ అధికారి రవీంద్రనాథ్‌తో బీజేపీ టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో మంచి పేరున్న మాజీ మంత్రి మహేంద్రనాథ్ కుమారుడైన రవీంద్రనాథ్ అయితే మాదిగ సామాజిక వర్గం ఓట్లన్నీ కమలం గుర్తుకే పడతాయని ఆ పార్టీ భావిస్తోంది. కల్వకుర్తిలో అధికార పార్టీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి మధ్య అంతర్గత పోరు సాగుతోంది. పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా వీరిద్దరి మధ్య రెండు వర్గాలుగా చీలిపోయారు. గత ఎన్నికల్లో జైపాల్‌కు కసిరెడ్డి సహకరించకపోయినా విజయం సాధించారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్యా గ్యాప్ కొనసాగుతోంది. ఇద్దరి మధ్యా సయోధ్యకు పార్టీ నాయకత్వం కూడా ప్రయత్నించలేదు. వంశీచందర్‌రెడ్డి 2014లో కాంగ్రెస్ తరపున స్వల్ప ఆధిక్యతతో విజయం సాధించి..ఏఐసీసీ కార్యదర్శిగా నియమితులయ్యారు. తర్వాతి ఎన్నికల్లో ఓటమి చెందారు. రెండున్నరేళ్ళుగా వంశీచందర్ పార్టీ కార్యక్రమాలను పెద్దగా పట్టించుకోవడంలేదని చెబుతున్నారు. మరోవైపు తలకొండపల్లి జడ్పీటీసీ సభ్యుడు ఉప్పల వెంకటేశ్ కాంగ్రెస్‌లోకి చేరేందుకు చర్చలు జరిగినట్లు సమాచారం. కాని సీటు గ్యారెంటీ లేదని చెప్పినట్లు తెలిసింది. బీజేపీ ఈ నియోజకవర్గంలో బలంగా ఉండటంతో ఈసారి ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో పనిచేస్తోంది. గత రెండుసార్లు స్వల్ప తేడాతో ఓడిన తల్లోజు ఆచారినే ఈసారి కూడా బరిలోకి దింపాలని బీజేపీ నాయకత్వం నిర్ణయించినట్లుగా తెలిసింది. కొల్లాపూర్ నియోజకవర్గంలో అధికార టీఆర్ఎస్లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే హర్షవర్థన్‌రెడ్డి మధ్య ఆధిపత్యపోరు సాగుతోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి హర్షవర్థన్‌రెడ్డి చేతిలో టీఆర్ఎస్ అభ్యర్థి జూపల్లి ఓటమి చెందారు. తర్వాత హర్షవర్థన్ కారు పార్టీలోకి జంప్ చేశారు. ఇక అప్పటినుంచీ ఇద్దరి మధ్యా వార్ నడుస్తోంది. ఇద్దరి వర్గీయులు ఎవరికి వారు ఈసారి సీటు తమదే అని ప్రచారం చేసుకుంటున్నారు. ఇదిలాఉంటే జూపల్లి పార్టీ మారతాడంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. ఒకవేళ మారితే పాతగూడు కాంగ్రెస్‌లో చేరతారా? లేక కాషాయ జెండా పట్టుకుంటారా అనే చర్చ జరుగుతోంది. ఇక కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు జగదీశ్వరరావు ఆసక్తి చూపిస్తున్నారు. హర్షవర్థన్‌రెడ్డి పార్టీ వీడాక కాంగ్రెస్‌లో బలమైన నాయకత్వం కరువైంది. -
టన్నెల్ పనుల్లో ప్రమాదం
సాక్షి, నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరు గ్రామ శివారులోని రేగుమాన్గడ్డ వద్ద జరుగుతున్న టన్నెల్ పనుల్లో ప్రమాదం జరిగింది. గురువారం అర్ధరాత్రి జరిగిన ఈ దుర్ఘటనలో ఐదుగురు కూలీలు మృతిచెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. టన్నెల్‌లోని పంప్‌హౌస్ వద్ద క్రేన్ వైర్ తెగిపడటంతో ఈ ప్రమాదం సంభవించింది. పంప్‌హౌస్‌లో అడుగున జరుగుతున్న పనుల కోసం క్రేన్ సహాయంతో కాంక్రీట్ బకెట్‌ను కిందకు దింపుతుండగా క్రేన్‌వైర్ తెగడంతో అది టన్నెల్లో ఉన్న కార్మికులపై పడినట్లు తెలిసింది. ఆ సమయంలో అక్కడ ఆరుగురు కార్మికులు ఉండగా ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదస్థలం వద్ద ఇరుక్కుపోయిన మృతదేహాలను ఎయిర్‌ప్రెషర్ సహాయంతో బయటకు తీశారు. ఇందుకోసం సుమారు 3 గంటల సమయం పట్టినట్లు అక్కడివారు తెలిపారు. శుక్రవారం తెల్లవారుజామున ఐదుగురి మృతదేహాలను అంబులెన్స్‌లో హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో ఆంధ్రప్రదేశ్‌లోని నిడదవోలుకు చెందిన దయ్యాల శ్రీను (42), జార్ఖండ్‌కు చెందిన బోలేనాథ్ (45), ప్రవీనేజ్ (38), కమ్లేశ్ (36), బిహార్‌కు చెందిన సోను కుమార్(36) ఉన్నట్లు గుర్తించామని ఆసుపత్రివద్ద పోలీసులు తెలిపారు. మధ్యప్రదేశ్‌కు చెందిన లాల్ బల్విందర్ సింగ్ ఈ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అతని కుడిచేతికి తీవ్రగాయం అయినట్లు చెప్పారు. ఇదిలా ఉండగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) స్టే నేపథ్యంలో ప్రాజెక్టు పనులు ప్రస్తుతం నిలిచిపోయాయని, నిర్వహణ పనుల్లో భాగంగా ఈ ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాజెక్టు ఈఈ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఈ ఘటనపై విచారణ చేపట్టామని వెల్లడించారు. భవన, నిర్మాణరంగ కార్మికుల కేంద్ర బోర్డు చైర్మన్ శ్రీనివాసులు నాయుడు ఘటనాస్థలాన్ని సందర్శించారు. ప్రమాదంపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను సొంతూళ్లకు తరలించారు. -
కుటుంబ పాలనపై ప్రజలకు విసుగు: లక్ష్మణ్
సాక్షి, నాగర్‌కర్నూల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎనిమిదేళ్లలో చేసిన అభివృద్ధిపై సీఎం కేసీఆర్ చర్చకు రావాలని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ కె.లక్ష్మణ్ అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి 8 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం నాగర్‌కర్నూల్‌లో నిర్వహించిన ప్రజా సంక్షేమ సదస్సులో ఆయన మాట్లాడారు. తెలంగాణలో కుటుంబ పాలనకు ప్రజలు విసుగు చెందారని చెప్పారు. కేంద్రంలో ప్రధాని మోదీ, రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధిపై చర్చకు వచ్చేందుకు సీఎం కేసీఆర్ సిద్ధంగా ఉన్నారా? అని ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ అంటే బార్ అండ్ రెస్టారెంట్ సమితి పార్టీ అని వ్యాఖ్యానించారు. -
మంచినీళ్లు అడిగితే పురుగుల మందు ఇచ్చారు!
నాగర్‌కర్నూల్ రూరల్/తెలకపల్లి: ప్రియురాలి కోసం వచ్చిన యువకుడిని పట్టుకుని ఎందుకొచ్చావంటూ నిలదీసి దాడి చేశారు. దీంతో అక్కడ్నుంచి దెబ్బలతో వచ్చిన యువకుడిని కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్చగా పరిస్థితి విషమించడంతో నిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆ యువకుడు మరణించగా.. ప్రణాళిక ప్రకారమే తమ కొడుకును చంపేశారని తలిదండ్రులు ఆరోపిస్తున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో ఈనెల 5న జరిగి ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లా తెలకపల్లిలోని దాదామోని శివ(18) కొంతకాలంగా అచ్చంపేట మండలం చవుట పల్లికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. కాగా, ఈనెల 5న తెలకపల్లి మండలం కమ్మారెడ్డిపల్లిలోని చిన్నమ్మ ఇంటికి ప్రియురాలు వెళ్లింది. ప్రియురాలి కోసం శివ అదే రాత్రి ఇంటికి వెళ్లాడు.దీంతో యువతి కుటుంబ సభ్యులు, బంధువులు ‘మా అమ్మాయి వద్దకు మళ్లీ ఎందుకొచ్చా వు..’ అంటూ దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయ పడి శివ అక్కడ్నుంచి ఇంటికి రాగా అతడి కుటుంబ సభ్యులు నాగర్‌కర్నూల్ లోని జనరల్ ఆస్పత్రికి తరలిం చారు. అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తీసు కెళ్లారు. అక్కడే చికిత్స పొందు తూ ఈనెల 9న మృతి చెందాడు. ఈ ఘటనపై శనివారం అతని తల్లి పద్మ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు దర్యాప్తు జరుపుతున్నారు. ఎస్ఐపై చర్య తీసుకోవాలని ఎస్పీకి ఫిర్యాదు శివను పథకం ప్రకారమే ప్రియురాలి బంధువులు హత్య చేశారని యువకుడి తల్లిదండ్రులు, బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు అంతటి నాగన్న, ఉపాధ్యక్షుడు కొత్తపల్లి కుమార్ ఆరోపించారు. న్యాయం చేయాలని తెలకపల్లి పోలీసులను ఆశ్రయించిన యువకుడి తల్లిదండ్రులను అక్కడి ఎస్ఐ బెదిరించారని, అతడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శనివారం ఎస్పీ మనోహర్‌కు ఫిర్యాదు చేశారు. దాడి చేశారని కేసు పెట్టేందుకు వెళ్లిన శివపైనే కేసు నమోదు చేసి జైలుకు పంపిస్తానని ఎస్ఐ బెదిరించినట్టు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దాడిలో దెబ్బలకు తాళలేక మంచినీళ్లు ఇవ్వాలని కోరిన శివకు ప్రియురాలి బంధువులు పురుగుమందు తాగించారని ఆరోపించారు. కార్యక్రమంలో బీఎస్పీ నాయకుడు పృథ్వీరాజ్, జనసేన యూత్ రాష్ట్ర అధ్యక్షుడు వంగా లక్ష్మణ్‌గౌడ్, శివ కుటుంబ సభ్యులు, తెలకపల్లి గ్రామస్తులు పాల్గొన్నారు. -
కారులో ఇరుక్కుపోయి, డోర్ తీయలేక!
సాక్షి, నాగర్‌కర్నూల్: సరదాగా కారులోకి వెళ్లిన తర్వాత డోర్‌లాక్ పడటంతో ఓ బాలిక ఊపిరాడక మరణించింది. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో శుక్రవారంరాత్రి ఆలస్యంగా వెలుగు చూసింది. జిల్లా కేంద్రంలోని బీసీ కాలనీకి చెందిన కడమంచి అంజమ్మ తన భర్త దూరం కావడంతో కూలిపనులు చేస్తూ కూతురు సుగుణ(9)తో కలసి జీవిస్తోంది. నాలుగో తరగతి చదువుతున్న సుగుణ చెత్త సేకరణ నిమిత్తం ఈ నెల 2న మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకువెళ్లింది. మధురానగర్ సమీపంలో ఓ ఇంటి వెనకాల రోడ్డు పక్కన నిలిపి ఉంచిన కారు వద్దకు చేరుకుంది. కారు డోర్లను తీసేందుకు ప్రయత్నించగా ఎడమ వైపు ఉన్న ముందు డోరు తెరచుకుంది. బాలిక కారులోకి వెళ్లి కూర్చొని డోర్ వేయగానే డోర్ లాక్ అయింది. డోర్ తీసేందుకు బాలిక ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఇళ్లకు దూరంగా కారును పార్క్ చేసి ఉంచడం, జన సంచారం లేకపోవడంతో కారులో బాలిక ఉన్నట్లు ఎవరూ గమనించలేదు. దీంతో ఊపిరాడక కారులో సొమ్మసిల్లి పడిపోయింది. శుక్రవారం రాత్రి 11 గంటలకు కారు యజమానికి చెందిన బంధువు కారు తీసేందుకు రాగా.. లోపల బాలిక మరణించిన విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. కాగా, కూతురు కోసం తల్లి పలుచోట్ల వెతికినా ఆచూకీ దొరకలేదు. బంధువుల ఇంటికి వెళ్లిందేమోనని భావించి ఎదురుచూసింది. ఈలోగా కారులో ఇరుక్కున్న బాలిక 32 గంటల తర్వాత శవమై కనిపించడం కలకలం రేపింది. మృతదేహాన్ని జిల్లాస్పత్రికి తరలించారు. అద్దాలు పగలకొట్టేందుకు ప్రయత్నించినా.. బాలిక కుటుంబసభ్యులు, బంధువులు శనివారం ఉదయం జిల్లా ఆస్పత్రికి చేరుకొని ఆందోళన చేపట్టారు. సీఐ హన్మంతు వచ్చి వారికి సర్దిచెప్పారు. అనంతరం పోలీసులు సంఘటనాస్థలంలోని సీసీ కెమెరాను పరిశీలించగా బాలిక చెత్త ఏరుకుంటూ అక్కడున్న కారులోకి సరదాగా వెళ్లినట్లు గుర్తించారు. అయితే కారులో ఉన్న జాకీరాడ్‌తో కారు అద్దాలను పగలకొట్టేందుకు బాలిక విఫలయత్నం చేసింది. ఈ దృశ్యాలు కూడా సీసీ ఫుటేజీలో కనిపించాయి. -
దైవ దర్శనానికి వెళ్లొస్తూ..
చారకొండ: దైవ దర్శనానికి వెళ్లి కారులో తిరిగి వస్తుండగా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు రోడ్డు ప్రమాదానికిగురై దుర్మరణం చెందారు. ఈ ఘటనలో గాయపడ్డ మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. నాగర్‌కర్నూల్ జిల్లా చారకొండ మండలం తుర్కపల్లి సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసు కుంది. సూర్యాపేట జిల్లా నేరేడుచర్లకు చెందిన దం పతులు గౌస్‌ఖాన్ (50), ఫర్హానా (42), కుమారు డు ఇంతియాజ్‌తో పాటు నల్లగొండ జిల్లా కొండ మల్లేపల్లికి చెందిన గౌస్‌ఖాన్ సోదరి సాదిక (51), ఆమె కుమారుడు రోషన్ (31) కలసి కారులో శుక్రవారం మధ్యాహ్నం ఏపీలోని వైఎస్సార్ కడప జిల్లా లో ఉన్న హజ్రత్ అమినా పీరాన్ దర్గాకు వెళ్లారు. దర్శనం చేసుకున్నాక అర్ధరాత్రి తిరుగు ప్రయాణమ య్యారు. శనివారం ఉదయం 7.30 గంటలకు వారు ప్రయాణిస్తున్న కారు తుర్కపల్లి సమీపంలోకి చేరుకోగానే జడ్చర్ల–కోదాడ ప్రధాన రహదారిపై అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న కాంక్రీట్ దిమ్మెను బలంగా ఢీకొంది. దీంతో ఇంతియాజ్‌కు తీవ్ర గాయాలు కాగా మిగతా నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఇది గమనించిన స్థానికులు వెంటనే ఇంతియాజ్‌ను అంబులెన్స్‌లో కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు మృతదేహాలను కల్వకుర్తి ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. చారకొండ ఎస్ఐ శ్రీనివాస్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన స్థలాన్ని ఎస్పీ మనోహర్, కల్వకుర్తి డీఎస్పీ గిరిబాబు, సీఐ రామకృష్ణ పరిశీలించారు. కారు నడిపిన రోషన్ నిద్రమత్తులో ఉండడంతోపాటు పాటు అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. కాగా, ఏడాది క్రితం తుర్కపల్లి సమీపంలో రోడ్డు విస్తరణ చేపట్టారు. పాతరోడ్డుకు ఉన్న కల్వర్టును కూల్చివేసి కొత్తది నిర్మించారు. అయితే రోడ్డు పక్కన కాంక్రీట్ దిమ్మని అలాగే వదిలేశారని గ్రామస్తులు తెలిపారు. చదవండి: కలిసి బతకలేమని.. ప్రియుడి మృతి, చున్నీ తెగిపడి.. -
‘పాలమూరు’ సొరంగంలో ప్రమాదం
కందనూలు (నాగర్‌కర్నూల్): పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల సొరంగం పనుల్లో రాయి కూలి ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందాడు. నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని ఉయ్యాలవాడ సమీపంలో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సొరంగం పనులు కొంతకాలంగా జరుగుతున్నాయి. ఉయ్యాలవాడకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ గొంది శ్రీనివాస్‌రెడ్డి ఎప్పటిలాగే నీళ్ల ట్రాక్టర్ తీసుకుని, మరో నలుగురు కూలీలతో కలిసి బుధవారం ఉదయం లోపలికి వెళ్లాడు. సొరంగంలో 400మీటర్ల మేర చేరుకోగానే పైకప్పు నుంచి రాళ్లు విరిగి పడటంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. వెంట ఉన్నవారు వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. మిగిలిన నలుగురు కూలీలు సురక్షితంగా ఉన్నారు. డ్రైవర్ హెల్మెట్ లేకుండానే ట్రాక్టర్‌తో లోపలికి వెళ్లినట్టు తెలిసింది. -
నాగర్‌కర్నూలు: అచ్చంపేటలో టీఆర్ఎస్ Vs కాంగ్రెస్
-
డాక్టర్ల దారుణం.. కరోనా ఉందని కాన్పు చేయలేదు
‘కరోనా వేళ రాష్ట్ర వైద్య సిబ్బంది అద్భుత సేవలు అందిస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన గర్భిణికి కరోనా సోకినా నిర్మల్ జిల్లా భైంసా ప్రభుత్వ ఆస్పత్రిలో సాధారణ ప్రసవం చేశారు. జనగామ ఎంసీహెచ్ ఆస్పత్రిలో కూడా కరోనా సోకి క్లిష్ట పరిస్థితిలో ఉన్న గర్భిణికి సురక్షితంగా డెలివరీ చేశారు.’’ – ఈ నెల 23న ట్విట్టర్లో వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు నిజమే రాష్ట్రవ్యాప్తంగా వైద్య సిబ్బంది కరోనా పరిస్థితుల్లో సైతం వెనుకంజ వేయకుండా నిర్విరామ సేవలందిస్తున్నారు. కానీ కొన్నిచోట్ల మాత్రం వారు ఈ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. మంత్రి మెచ్చుకున్న రెండ్రోజులకే ఒక నిండు గర్భిణిని ఆస్పత్రి ఆరుబయటే వదిలేశారు. కరోనా సాకుతో ఆమెకు డెలివరీ చేసేందుకు నిరాకరించారు. దీంతో ఆమె ఆస్పత్రి ఆవరణలోనే ప్రసవించింది. సాక్షి, నాగర్‌కర్నూల్/అచ్చంపేట రూరల్: పురిటి నొప్పులతో ప్రభుత్వాస్పత్రికి వచ్చిన ఓ నిండు గర్భిణికి కరోనా పాజిటివ్ ఉందనే సాకుతో డెలివరీ చేసేందుకు వైద్యులు నిరాకరించిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో చోటుచేసుకుంది. బల్మూర్ మండలం బాణాలకు చెందిన చెంచు మహిళ నిమ్మల లాలమ్మ మూడో కాన్పు కోసం సోదరి అలివేలతో కలసి మంగళవారం ఉదయం అచ్చంపేట సివిల్ ఆస్పత్రికి వచ్చింది. ముందు జాగ్రత్తగా వైద్యులు ఆమెకు కరోనా ర్యాపిడ్ టెస్టు చేయగా పాజిటివ్ అని తేలింది. దీంతో ఇక్కడ డెలివరీ చేయడం కుదరదని, నాగర్‌కర్నూల్ జిల్లా ఆస్పత్రికి రెఫర్ చేస్తూ చీటీని రాసిచ్చి చేతులు దులిపేసుకున్నారు. కనీసం అంబులెన్సు కూడా ఏర్పాటు చేయలేదు. దాదాపు 40 నిమిషాలు గడిచిపోయాయి. ఈలోగా లాలమ్మకు పురిటి నొప్పులు ఎక్కువైనా వైద్యులెవరూ స్పందించలేదు. చివరికి ఆస్పత్రి ఆవరణలోనే ఆమె ఆడశిశువుకు జన్మి నిచ్చింది. దీంతో సిబ్బంది హడావుడిగా లాలమ్మను ఆస్పత్రిలోకి తీసుకెళ్లారు. బిడ్డకు, తల్లికి ప్రత్యేక గదిని కేటాయించి చికిత్స అందించారు. గతంలోనూ ఇదే తీరు.. గతంలోనూ అచ్చంపేట సివిల్ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వెలుగుచూసింది. 2016 సెప్టెంబర్ 28న నల్లగొండ జిల్లా చందంపేటకు చెందిన ఈదమ్మ కాన్పుకు రాగా.. ఆస్పత్రి వైద్యులు సకాలంలో స్పందించకపోవడంతో ఆçస్పత్రి బయటే ప్రసవించింది. 2019 డిసెంబర్ 18న అచ్చంపేట మండలం నడింపల్లికి చెందిన గర్భిణికి డెలివరీ సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి తల, మొండెం వేరు అయ్యేలా చేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. రానియ్యలేదు: అలివేలు, లాలమ్మ సోదరి పురిటినొప్పులు వస్తున్నాయని చెల్లెలు లాలమ్మను ఆస్పత్రికి తీసుకొచ్చినం. డాక్టర్లు టెస్టు చేసి కరోనా ఉందని చెప్పారు. పురిటినొప్పులు వస్తున్నా ఎవరూ దగ్గరకు రాలేదు. మేం చెంచులం, పైసలు ఉండవనే మమ్మల్ని ఆస్పత్రి నుంచి పంపించారు. అందరూ చూస్తుండగానే కాన్పు అయింది. నిబంధనల ప్రకారమే రెఫర్ చేశాం: డా.కృష్ణ, సూపరింటెండెంట్ ఆసుపత్రికి వచ్చిన గర్భిణీకి పరీక్ష చేయగా కరోనా పాజిటివ్ అని తేలింది. డ్యూటీ డాక్టర్ పరిశీలించి నిబంధనల ప్రకారమే జిల్లా ఆస్పత్రికి రెఫర్ చేశారు. వారు బయటకుపోయిన చాలాసేపటి తర్వాత ఆరుబయట ఆమె ప్రసవించడంతో వెం టనే బాలింత, శిశువుకు ఆస్పత్రిలోని ఓ ప్రత్యేక గదిలో చికిత్స అందిస్తున్నాం. డ్యూటీ డాక్టర్‌పై చర్యలు తీసుకోండి: మంత్రి హరీశ్ అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన గర్భిణిని కోవిడ్ వచ్చిందని చేర్చుకోకుండా బయటికి పంపిన డ్యూటీ డాక్టర్ హరిబాబుపై చ ర్యలు తీసుకోవాలని మంత్రి హరీశ్‌రావు కలెక్టర్ ఉదయకుమార్‌ను ఆదేశించారు. కోవిడ్‌తో వచ్చి న గర్భిణులకు ఆస్పత్రుల్లోనే ప్రసవాలు చేయా లని జిల్లా వైద్యాధికారులను ఆదేశించారు. -
పాపం గణపయ్య
-
కిడ్నాప్ కు దారితీసిన ఇద్దరు వ్యక్తుల ఆర్థిక లావాదేవీల వివాదం
-
భయంభయంగా.. వాగు దాటి..
సాక్షి, కొల్లాపూర్ రూరల్ : ఎడతెరిపి లేని వర్షాలతో నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం ముక్కిడిగుండం సమీపంలోని ఉడుములవాగులో బుధవారం సాయంత్రం ఒక్కసారిగా నీటి ఉధృతి పెరిగింది. ఉదయం వ్యవసాయ పనుల నిమిత్తం అవతలివైపు వెళ్లిన దాదాపు 25 మంది రైతులు సాయంత్రం తిరిగి వచ్చేందుకు వీలు లేకపోవడంతో భయాందోళనకు గురయ్యారు. చివరికి కొంతమంది తాళ్లు వదలడంతో వాటి సాయంతో మహిళలు, వృద్ధులు భయం భయంగా వాగు దాటారు. ఆరేళ్ల క్రితం ఈ వాగుపై హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి పనులు ప్రారంభించినా పూర్తి చేయకపోవడంతో వరద వచ్చినప్పుడల్లా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వెళ్లాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమశిల సమీపంలోని కృష్ణానదికి ఆవలి ఒడ్డున ఏపీలోని కర్నూలు జిల్లా సరిహద్దులో గల సంగమేశ్వరాలయం నీట మునిగింది. జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వదులుతుండడంతో నది నీళ్లు గుడిని తాకాయి. మంగళవారం రాత్రి నుంచి నదిలో వరద ఉధృతి పెరగడంతో బుధవారం సాయంత్రం దాదాపు 4 అడుగుల మేర గుడి నీటిలో మునిగింది. సోమశిల, మంచాలకట్ట, అమరగిరి ప్రాంతాల్లో నీటిమట్టం పెరగడంతో మత్స్యకారులు చేపల వేటను నిలిపివేశారు. – కొల్లాపూర్ (నాగర్‌కర్నూల్ జిల్లా) నిజామాబాద్ జిల్లా కందకుర్తిలోని గోదావరి నదిలో గల పురాతన శివాలయం వరదనీటిలో పూర్తిగా మునిగింది. నిజామాబాద్ జిల్లాతో పాటు ఎగువన మహారాష్ట్రలో విస్తారంగా వర్షాలు కురవడంతో కందకుర్తి త్రివేణి సంగమ ప్రాంతం గోదావరి, మంజీర, హరిద్ర నదుల వరద నీటితో జలకళను సంతరించుకుంది. – రెంజల్(బోధన్) -
హమాలీ పనికి మించిన ఉపాధి ఏముంది?: మంత్రి నిరంజన్‌రెడ్డి
నాగర్‌కర్నూల్: ‘కొనుగోలు కేంద్రాల కాడ సగటున 100 మందికి పనివస్తుంది. వానాకాలం, యాసంగిలో రెండున్నర నెలలు ఎవరి పనులు వారు చేసుకుంటూ కొనుగోలు కేంద్రాల్లో హమాలీ పనులు చేసుకునే వెసులుబాటు తెలంగాణలో గ్రామగ్రామాన వచి్చంది. ఇంతకు మించిన ఉపాధి ఏముంది? ఉపాధి అంటే ఇది. సదువుకుంటే సర్కారీ నౌకరి వస్తది.. అయితే, సదువుకున్న అందరికీ సర్కారీ నౌకరి రాదు’అని నిరుద్యోగులను ఉద్దేశించి రాష్ట్ర వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గురువారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో జరిగిన ‘దిశ’సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగాల కల్పన విషయంలో ప్రతిపక్షాల ఆరోపణలను తప్పుబట్టారు. ఇతర రాష్ట్రాల్లో, కేంద్రంలో అధికారంలో ఉండి ఉద్యోగాలను తొలగించి, ప్రైవేట్‌పరం చేస్తున్న పారీ్టలు ఇక్కడ ఉద్యోగాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారని విమర్శించారు. అసలు చర్చ చేయకుండా చదువుకున్న ప్రతి ఒక్కరికీ ఉద్యోగం ఇవ్వాలంటే వీలుపడుతుందా అని ప్రశ్నించారు. మీడియా వక్రీకరించింది: నిరంజన్‌రెడ్డి నాగర్‌కర్నూల్‌లో తాను మాట్లాడిన మాటలను మీడియా సంస్థలు వక్రీకరించి ప్రసారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఉపాధి అవకాశాలు పెంచింది. ఉద్యోగం అంటేనే ఉపాధి. అది కలి్పంచడం ప్రభుత్వ విధి’ అని తానన్న వ్యాఖ్యలను పలు మీడియా సంస్థలు వక్రీకరించి నిరుద్యోగులను హమాలీ పని చేసుకోమన్నానన్నట్టుగా ప్రచారం చేయడంపై విచారం వ్యక్తం చేస్తున్నానని మంత్రి తెలిపారు. -
హరితహారం: ఎమ్మెల్యే నాటిన మొక్కలు తినేసిందని..
సాక్షి, కొల్లాపూర్: హరితహారంలో భాగంగా గురువారం నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని 7వ వార్డులో మొక్కలు నాటారు. కాసేపటికే కొన్ని మొక్కలను ఓ మేక తినేసింది. దీంతో మున్సిపల్ సిబ్బంది దాన్ని పట్టుకొని కొత్త గ్రంథాలయ భవనం వద్ద ఇనుప జాలీలో బంధించారు. జరిమానా చెల్లించి తీసుకెళ్లాలని యజమాని రంగస్వామికి కబురంపారు. శుక్రవారంమేకను విడిపించుకునేందుకు రంగస్వామి రాగా అధికారులు లేరు. ఈలోగా విషయం సోషల్‌మీడియాకు ఎక్కడంతో శుక్రవారం సాయంత్రం అధికారులు మేకను విడిచిపెట్టారు. -
ఆర్టీసీ బస్సుకు విద్యుదాఘాతం.. మహిళ మృతి
కల్వకుర్తి టౌన్: ఆర్టీసీ బస్సు విద్యుదాఘాతానికి గురవడంతో ఓ మహిళ మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో డ్రైవర్, కండక్టర్ సహా 24 మంది ప్రయాణికులు ఉన్నారు. ఓ మేస్త్రీ సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్ల పెను ప్రమాదం తప్పింది. ఈ సంఘటన బుధవారం నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. అచ్చంపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కల్వకుర్తి బస్టాండ్‌లో ప్రయాణికులను ఎక్కించుకుని అచ్చంపేటకు బయల్దేరింది. పట్టణంలోని హనుమాన్‌నగర్ కాలనీలో మురుగుకాల్వ నిర్మాణం చేపడుతుండటంతో బస్సును డ్రైవర్ వెంకటయ్య ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్ద డైవర్షన్ తీసుకున్నాడు. అయితే అక్కడ కిందకు వేలాడుతున్న విద్యుత్ తీగను గమనించక ముం దుకు వెళ్లాడు. దీంతో బస్సు టాప్‌పై ఉండే క్యారియర్‌కు తీగ తగిలి ఎర్తింగ్ రావడంతో ప్రయాణికులంతా హాహాకారాలు చేశారు. అక్కడే పనిచేస్తున్న తాపీమేస్త్రీ శ్రీశైలం పరిస్థితిని గమనించి వెంటనే తాను పని చేసే స్థలం వద్ద ఉన్న పెద్ద కర్రను తీసుకొచ్చి విద్యుత్ తీగను పక్కకు నెట్టాడు. ప్రమాద తీవ్రతను పసిగట్టిన డ్రైవర్.. ఎవరూ బస్సు దిగవద్దని, కిందకు దిగితే ఎర్తింగ్ వల్ల కరెంట్ షాక్‌కు గురయ్యే ప్రమాదం ఉందని ప్రయాణికులను అప్రమత్తం చేశాడు. అప్పటికే ప్రాణభయంతో డోరు వద్ద ఉన్న వంగూరు మండలం రంగాపూర్‌కు చెందిన నర్సమ్మ (50) తన ఇంటికి అవసరమైన ఇనుప వెంటిలేటర్లను తీసుకుని, బస్సులోని ఐరన్ రాడ్డు సహాయంతో కిందకు దిగిన వెంటనే విద్యుదాఘాతానికి గురై ఆమె మృతి చెందింది. మరో ప్రయాణికుడు వృద్ధుడైన రెడ్యా భయంతో కిటికిలోంచి దూకడంతో తీవ్రంగా గాయపడ్డాడు. బస్సు దగ్ధమయ్యేది.. బస్సుకు విద్యుత్ తీగలు తగల డం గమనించాను. వెంటనే పెద్దకర్రను తీసుకుని పక్కకు జరిపి బస్సును ముందుకు వెళ్లనివ్వమని డ్రైవర్‌కు చెప్పాను. అప్పటికే బస్సుకు ఎర్తింగ్ ఉండటం, 11కేవీ విద్యుత్ లైన్ కావటంతో పూర్తిగా దగ్ధమై ఉండేది. ఈ ప్రమాదం గురించి తలుచుకుంటేనే భయమేస్తుంది. – శ్రీశైలం, ప్రమాదం నుంచి కాపాడిన వ్యక్తి -
కరోనాతో కొడుకు మృతి.. ఆగిన తల్లి గుండె!
కల్వకుర్తి టౌన్: కరోనాతో కొడుకు మృతి చెందిన కొన్ని గంటల్లోనే తల్లి హఠాన్మరణం చెందింది. నాగర్‌కర్నూల్ జిల్లా చారకొండ మండలంలోని ఎర్రవల్లితండాకు చెందిన జైపాల్‌నాయక్(55) ప్రస్తుతం జూపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. కొన్నాళ్లుగా కల్వకుర్తి పట్టణంలోని విద్యానగర్‌కాలనీలో నివాసం ఉంటున్నారు. ఆయనకు భార్యతో పాటు ఇద్దరు సంతానం ఉన్నారు. గత నెల 28న జైపాల్‌నాయక్‌కు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో శనివారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరగా చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన తల్లి మునావత్ నాన్కు(80) కొంతసేపటికే గుండె పోటుతో చనిపోయింది. కాగా ఆమె దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతుండేదని తండావాసులు తెలిపారు. ఈ సంఘటనతో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
మృతదేహంతో మూడ్రోజులు సహవాసం
నాగర్‌కర్నూల్ : అనారోగ్యంతో చనిపోయిన మహిళ మృతదేహంతో ఓ వ్యక్తి మూడు రోజుల పాటు సహవాసం చేశాడు. అయితే.. మృతదేహాన్ని పూడ్చిపెట్టే ప్రయత్నం చేస్తుండగా విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం అవుసలికుంటలో చోటు చేసుకుంది. తెలకపల్లి మండలం గౌరారం గ్రామానికి చెందిన కృష్ణయ్య తన కూతురు కళమ్మను ఇరవై ఏళ్ల క్రితం అవుసలికుంటకు చెందిన శేఖర్‌తో వివాహం జరిపించారు. పది నెలలకే భర్త చనిపోవడంతో కళమ్మకు నాగనూలుకు చెందిన బాలపీరుతో రెండో వివాహం చేశారు. వీరికి ముగ్గురు పిల్లలు సంతానం. కొన్నేళ్ల తర్వాత రెండో భర్త కూడా చనిపోవడంతో ఆమె తల్లిదండ్రుల వద్దే ఉంటుంది. అయితే.. తండ్రి కృష్ణయ్య ఇటీవల కూతురిని మందలించడంతో అవుసలికుంటలో ఒంటరిగా ఉంటున్న మొదటి భర్త తమ్ముడు లింగస్వామి ఇంటికి వచ్చింది. అప్పటికే అనారోగ్యం పాలైన ఆమె గురువారం మధ్యాహ్నం అకస్మాత్తుగా మృతి చెందింది. దీంతో ఎక్కడ తనపైకి వస్తుందనే భయంతో లింగస్వామి విషయం బయటికి పొక్కకుండా జాగ్రత్త పడ్డాడు. శనివారం గుడిసె ముందు గుంతను తీసి శవాన్ని పూడ్చి పెట్టేందుకు గ్రామంలో మరో వ్యక్తి సాయం కోరడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మృతురాలి కుమారుడు మహేశ్ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
పెళ్లి బృందంతో వెళ్తున్న డీసీఎం బోల్తా
-
తల్లి గొంతు కోసి తల తీసుకొని పరారీ
సాక్షి, నాగర్‌కర్నూల్: మద్యానికి బానిసైన కొడుకు కన్నతల్లిని అతిదారుణంగా చంపిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. కొల్లాపూర్ మండలం సింగోటంలో సంగణమోని చంద్రమ్మ (65) తన కొడుకు రాముడు (40) ఒకే ఇంట్లో ఉంటున్నారు. మద్యానికి బానిసైన కొడుకు తల్లితో రోజూ డబ్బుల కోసం గొడవ పడుతుండేవాడు. శుక్రవారం రాత్రి కూడా మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వాలని తల్లితో గొడవకు దిగాడు. (గుంటూరు జిల్లాలో దారుణ హత్య) అనంతరం తల్లి నిద్రిస్తున్న సమయంలో కొడవలితో విచక్షణ రహితంగా ఆమె గొంతు కోసి తలను తీసుకొని పరారయ్యాడు. కాగా.. నిందితుడికి ఇద్దరు భార్యలు ఉండగా, పది సంవత్సరాల కిందనే వారు భర్తని వదిలేశారని బంధువులు తెలిపారు. ప్రతి రోజు అర్థరాత్రి వరకు గొడవ పెట్టుకొని తల్లితో డబ్బులు తీసుకునేవాడని తెలిపారు. నిందితుడు గ్రామస్తులతో ఎప్పుడూ గొడవ పడుతూ.. అర్ధరాత్రి సమయంలో తలుపులు కొడుతూ భయబ్రాంతులకు గురిచేసే వాడని స్థానికులు చెబుతున్నారు. అయితే ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. నపరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు ముమ్మరం చేశారు. -
ప్రమాదమా.. మాక్ డ్రిల్లా?
సాక్షి, నాగర్‌కర్నూల్: శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో అధికారులు, ఉద్యోగులు మరోసారి ఆందోళనకు గురయ్యారు. గత నెల 20న జరిగిన అగ్ని ప్రమాదంలో 9 మంది ఉద్యోగులు మృత్యువాతపడ్డారు. ఈ ప్రమాదంతో రూ.వందల కోట్లలో నష్టం వాటిల్లింది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ ఘటన మరవక ముందే బుధవారం షార్ట్‌సర్క్యూట్‌తో మరోసారి మంటలు చెలరేగడం ఉద్యోగులను భయాందోళనకు గురి చేసింది. అయితే అది మాక్‌డ్రిల్‌గా జెన్కో ఉన్నతాధికారులు ప్రకటించడంతో.. అది ప్రమాదమా.. మాక్ డ్రిల్లా అనే చర్చ మొదలైంది. ఉద్యోగులు, సిబ్బంది పరుగులు శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో పునరుద్ధరణ పనుల్లో భాగంగా బుధవారం మొదటి యూనిట్లో నీటిని తోడిపోసి మరమ్మతు పనులు చేపడుతున్నారు. ఈ క్రమంలో మోటారు, ఇతర సామగ్రిని విద్యుత్ కేంద్రంలోకి తీసుకొస్తున్న డీసీఎం వాహనం కేంద్రంలో తాత్కాలికంగా లైటింగ్ కోసం దోమలపెంట సబ్‌స్టేషన్ నుంచి కనెక్షన్ తీసుకున్న విద్యుత్ కేబుళ్లపై వెళ్లింది. అధిక లోడ్‌తో కూడిన డీసీఎం వాహనం విద్యుత్ కేబుళ్లపై వెళ్లడంతో వైర్లలో స్పార్క్ వచ్చి షార్ట్‌సర్క్యూట్ జరిగి పెద్ద శబ్దాలతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇటీవల జరిగిన ప్రమాదం నుంచి తేరుకోని ఉద్యోగులు, సిబ్బంది ఒక్కసారిగా భయాందోళనకు గురై పరుగులు తీశారు. పొగ కమ్ముకోవడంతో అక్కడే ఉన్న అధికారులు, ఫైర్ సిబ్బంది అప్రమత్తమై అగ్నిమాపక యంత్రాలతో మంటలు ఆర్పేశారు. విద్యుత్ సరఫరా కూడా వెంటనే నిలిపివేడయంతో పెను ప్రమాదం తప్పింది. షార్ట్‌సర్క్యూట్‌తో నీటిని తోడి పోస్తున్న మూడు మోటార్లకు సంబంధించిన పైపులు కూడా కాలిపోయినట్లు సమాచారం. ప్రమాదంలో విద్యుత్ వైర్ కాలిపోవడంతో వెంటనే మరో కేబుల్ వేసుకొని అక్కడి విద్యుత్ లైట్లను పునరుద్ధరించుకొని పనులు చేపట్టినట్లు తెలిసింది. ఘటన బయటికి తెలియడంతో మళ్లీ ప్రమాదం జరిగినట్లు ప్రచారం జరిగింది. అప్రమత్తతను గుర్తించేందుకే.. శ్రీశైలం భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో బుధవారం జరిగిన ఘటన ప్రమాదంగా భావిస్తున్న తరుణంలో జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు, సీఈ సురేష్ రహస్య మాక్‌డ్రిల్‌గా ప్రకటించారు. పనులు చేస్తున్న క్రమంలో ఉద్యోగుల అప్రమత్తతను గుర్తించేందుకు మాక్ డ్రిల్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా పునరుద్ధరణ పనులు చేపడుతున్న క్రమంలో అక్కడ కేవలం జెన్కో ఉద్యోగులే కాకుండా పారిశుద్ధ్య పనులు చేసేవారు, ఇతర కార్మికులు కూడా ఉన్నారు. పునరుద్ధరణ పనులు పూర్తికాక ముందే మాక్ డ్రిల్ ఎలా నిర్వహిస్తారు. ఒకవేళ మాక్‌డ్రిల్ నిర్వహిస్తే బయటి సబ్‌స్టేషన్ నుంచి లైటింగ్ కోసం కనెక్షన్ తీసుకున్నప్పుడు స్థానిక విద్యుత్ అధికారులకు ఎలాంటి సమాచారం లేకుండా, అప్రమత్తం చేయకుండా, అసలు విద్యుదుత్పత్తి ప్రారంభం కానప్పుడు మాక్‌డ్రిల్ ఎలా నిర్వహిస్తారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రమాదాన్ని కప్పిపుచ్చుకునేందుకే మాక్ డ్రిల్‌గా అధికారులు ప్రకటించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యక్షంగా అక్కడ ఉన్న ఉద్యోగులు, సిబ్బంది మాత్రం అది అనుకోకుండా జరిగిన ఘటనగానే చెబుతున్నారు. -
శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో ఉత్కంఠ!
సమయం: బుధవారం సాయంత్రం 5:30 గంటలు ప్రదేశం: నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద శ్రీశైలం జల విద్యుత్ కేంద్రం (గత నెల 20న విద్యుత్ ప్రమాదం జరిగిన ప్రాంతం). సందర్భం: విద్యుత్ కేంద్రం బయట వర్షం. కేంద్రం ప్రవేశద్వారం వద్ద ఒక్కసారిగా ఎగిసిన మంటలు.. భయంతో అధికారులు, ఉద్యోగుల పరుగులు. సాక్షి, నాగర్‌కర్నూల్: అసలేం జరుగుతుందో తెలి యదు. ఒక్కసారిగా చెలరేగిన మంటలతో శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో క్షణాల వ్యవధిలోనే విద్యుత్ నిలిచిపోయింది. విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటికి పరుగులు తీశారు. అప్పటికే బయట కురుస్తున్న వర్షానికి తడిసి ముద్దయ్యారు. వెంటనే రంగంలో దిగిన అగ్నిమాపక వాహనం మంటల్ని ఆర్పింది. సుమారు గంటసేపు తీవ్ర ఉత్కంఠతో ఉన్న ఉద్యోగులు, అధికారులకు అదంతా మాక్‌డ్రిల్ అంటూ ఉన్నతాధికారుల నుంచి అందిన వార్త ప్రాణం పోసినట్టుయింది. గత నెల 20న అగ్నిప్రమాదం జరిగిన శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలోని నాలుగో యూనిట్లో పునరుద్ధరణ పనులు సాగుతున్నాయి. వంద మందికిపైగా ఉద్యోగులు, అధికారులు, కార్మికులు తమ పనుల్లో నిమగ్నమయ్యారు. అదే సమయంలో విద్యుత్ కేంద్రం ప్రవేశద్వారం నుంచి నీళ్ల మోటార్ల లోడుతో వెళ్తున్న డీసీఎం.. నేల మీద ఉన్న విద్యుత్ తీగలపై నుంచి వెళ్లింది. దీంతో షార్ట్‌సర్క్యూట్ అయి ఒక్కసారిగా పెద్ద శబ్దాలతో మంటలు చెలరేగాయి. క్షణాల వ్యవధిలోనే విద్యుత్ నిలిచిపోయింది. ఆ సమయంలో పునరుద్ధరణ పనులు చేస్తున్న సిబ్బంది అంతా అయోమయానికి గురై బయటికి పరుగుతీశారు. అక్కడికి చేరుకున్న అగ్నిమాపక యంత్రం (ఫైర్ ఎక్స్టెన్షన్)తో మంటలను ఆర్పారు. విద్యుత్ కేంద్రంలో రెండోసారి జరిగిన ప్రమాదం వార్త వెంటనే సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేసింది. ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులందరూ ఉలికిపడ్డారు. అసలు ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై అనేక చర్చలు మొదలయ్యాయి. ఇలా సాయంత్రం 5.30 నుంచి 6.30 గంటల వరకు (గంట పాటు) ఉత్కంఠ నెలకొంది. తర్వాత ఇది మాక్‌డ్రిల్ అని తేలడంతో ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు. మాక్‌డ్రిల్‌పై భిన్నాభిప్రాయాలు అధికారులు నిర్వహించిన ఈ మాక్‌డ్రిల్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత నెల 20న అగ్నిప్రమాదం జరిగిన తర్వాత అందులో పనిచేస్తున్న తమకు ప్రమాదం నుంచి ఎలా బయటపడాలో ఎలాంటి శిక్షణ ఇవ్వలేదని అందులో పనిచేసే ఓ ఉద్యోగి తెలిపారు. 15 రోజుల క్రితం జరిగిన ప్రమాదం నుంచి ఇంకా తేరుకోని తమను మాక్‌డ్రిల్ పేరిట భయపెట్టే యత్నం చేయడం ఆవేదన కలిగించిందన్నారు. మరోవైపు బయట వర్షం కురుస్తున్న సమయంలో విద్యుత్ కేంద్రంలో మాక్‌డ్రిల్ ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడమే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా 15రోజుల నుంచి ఆ కేంద్రంలో విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. దీంతో దోమలపెంట సబ్‌స్టేషన్ నుంచి విద్యుత్ కేంద్రానికి కేబుళ్లు వేసిన అధికారులు వాటి ద్వారా లైట్లు, మోటార్లు నడిపిస్తున్నారు. మాక్‌డ్రిల్‌తో ఆ కేబుళ్లు కాలిపోయాయి. తర్వాత రంగంలో దిగిన అధికారులు కేబుళ్లు మార్చి విద్యుదుత్పత్తిని పునరుద్ధరించారు. (ఇక్కడ ప్రమాదం జరిగింది.. నేను చనిపోవచ్చు.. ) ప్రమాదం కాదు.. మాక్‌డ్రిల్ శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. సిబ్బంది అప్రమత్తతను పరిశీలించేందుకే రహస్యంగా మాక్‌డ్రిల్ నిర్వహించాం. ఈ కేంద్రాన్ని పరిశీలించేందుకు విశ్రాంత అధికారి అజయ్‌తో కలిసి వెళ్లా. ప్రమాదం జరిగినప్పుడు ఎలా స్పందించాలో తెలిపేందుకు ఈ కార్యక్రమం చేపట్టాం. – ప్రభాకర్‌రావు, సీఎండీ, టీఎస్ ట్రాన్ ్సకో, జెన్ కో -
శ్రీశైలం పవర్ ప్లాంట్‌లో మళ్లీ పేలుడు?
సాక్షి, శ్రీశైలం: మరోసారి శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో మళ్లీ పేలుడు కలకలం రేపింది. బుధవారం సాయంత్రం భారీ శబ్ధాలతో మంటలు ఎగసిపడటంతో భయంతో పవర్ ప్లాంట్ సిబ్బంది బయటకు పరుగులు తీశారు. కరెంట్ కేబుల్ పైనుంచి డీసీఎం వ్యాన్ వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే శ్రీశైలం విద్యుత్ ప్రాజెక్టు లో ఎటువంటి అగ్నిప్రమాదం జరగలేదని, ఎవ్వరూ ఆందోళన చెందొద్దని ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ప్రభాకరరావు ప్రభాకరరావు స్పష్టం చేశారు. గత నెల 20వ తేదీన శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుని 9 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మళ్ళీ అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో జెన్కో సివిల్ డైరెక్టర్ అజయ్ బృందంతో మాక్ డ్రిల్ నిర్వహించమని సీఎండీ ప్రభాకరరావు ఆదేశించారు. సిఎండి అదేశాలతోనే మాక్ డ్రిల్ నిర్వహించామని అధికారులు స్పష్టం చేశారు. కాగా గత నెల 20వ తేదీన శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో సంభవించిన భారీ అగ్ని ప్రమాదం సంభవించి తొమ్మిది మంది సిబ్బంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అగ్ని ప్రమాదంపై సీఐడీ విచారణ కొనసాగుతోంది. -
15 రోజుల్లో విద్యుదుత్పత్తి పునరుద్ధరణ
సాక్షి, నాగర్‌కర్నూల్: శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో దురదృష్టవశాత్తు ప్రాణనష్టం జరిగింది కానీ, ఆస్తి నష్టం అంతగా జరగలేదని ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు స్పష్టం చేశారు. ప్రమాదంలో వేల కోట్ల రూపా యల నష్టం జరిగిందనే ప్రచారంలో వాస్త వం లేదని చెప్పారు. బుధవారం శ్రీశైలం భూగర్భ జల విద్యుత్ కేంద్రంలోని ఆరు యూనిట్ల జనరేటర్లు, కంట్రోల్ ప్యానెల్స్, ట్రాన్స్ఫార్మర్లు, ఇండోర్ గ్యాస్ సబ్‌స్టేషన్, మెయిన్ కంట్రోల్ రూంలను ఆయన పరిశీలించారు. శాఖాపరమైన విచారణ జరుపుతున్న ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి నాయకత్వంలోని బృందంతో చర్చించారు. ఈ సందర్భంగా సీఎండీ ప్రభాకర్‌రావు మాట్లాడుతూ.. జపాన్ నుంచి నిపుణుల బృందం త్వరలో ప్లాంట్‌ను సందర్శిస్తుందని, 15 రోజుల్లో విద్యుదుత్పత్తి పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. నాలుగో యూనిట్ బాగా దెబ్బతిన్నదని, ఒకటి, రెండు, ఐదు యూనిట్లలో కొంత నష్టం జరిగిందని, ఆరో యూనిట్లో ప్యానల్ దెబ్బతిందని వివరించారు. త్వరలో వీటి పునరుద్ధరణ జరుగుతుందని చెప్పారు. విద్యుత్ ఉద్యోగల భద్రతే ముఖ్యం విద్యుత్ ఉద్యోగుల భద్రతకు మరిన్ని చర్యలు తీసుకుంటామని ప్రభాకర్‌రావు అన్నారు. జల విద్యుత్ కేంద్రంలో విధులు నిర్వహించే 200 మంది సిబ్బందితో సమావేశమయ్యారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు. ఇలాంటి సమయంలోనే మరింత పట్టుదలతో, గుండె నిబ్బరంతో పనిచేయాలన్నారు. కొనసాగుతున్న పునరుద్ధరణ పనులు జల విద్యుత్ కేంద్రంలో పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. నాలుగంత స్తుల్లో నిండిన నీటిని మోటార్ల ద్వారా తొలగిస్తున్నారు. అగ్నిప్రమాదం వల్ల పేలిన ట్రాన్స్ఫార్మర్, ప్యానల్ బోర్డు, ఇతర పరికరాలను సీఎండీ పరిశీలించారు. త్వరలో 2 విద్యుత్ యూనిట్లలో విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఆరో యూనిట్ సీజ్ శ్రీశైలం భూగర్భజల విద్యుత్ కేంద్రం పనులను సీఎండీ ప్రభాకర్‌రావు క్షుణ్నంగా పరిశీలించారు. దోమలపెంట నుంచి ట్రాన్స్‌కో సబ్‌స్టేషన్ ద్వారా కేంద్రంలో లైట్లను వేయించారు. నాలుగు ఫ్లోర్లలో నీళ్లు నిండటంతో మోటార్లు ఏర్పాటు చేసి ఎత్తిపోస్తున్నారు. సీఐడీ విచారణలో భాగంగా ప్రమాదం సంభవించిన ఆరో యూనిట్‌ను సీజ్ చేశారు. విద్యుత్ ఎక్కడి నుంచి ప్రసారమైందనే కోణంలో ఆరా తీస్తున్నట్టు సమాచారం. పుట్టెడు దుఃఖంలోనూ.. ఇదిలాఉండగా తన సోదరుడు శ్రీనివాసరావు మరణించిన దుఃఖాన్ని దిగమింగుకుని సీఎండీ ప్రభాకర్‌రావు బుధవారం శ్రీశైలం భూగర్భజల విద్యుత్ కేంద్రంలో పర్యటించారు. అగ్ని ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యుల ఇళ్లకు వెళ్లి పరా మర్శించి వారికి ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో జెన్కో డైరెక్టర్లు వెంకటరాజం, అజయ్, సీఈలు ప్రభాకర్‌రావు, సురేష్, టెక్ని కల్ ఎస్ఈ హనుమాన్ పాల్గొన్నారు. -
పవర్ హౌస్‌లోకి నీళ్లు.. విచారణకు ఆటంకం
సాక్షి, నాగర్‌కర్నూల్: శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో సంభవించిన భారీ అగ్నిప్రమాదంపై సీఐడీ విచారణ కొనసాగుతోంది. సీఐడీ చీఫ్ గోవింద్ సింగ్, డీఐజీ సుమతి నేతృత్వంలో సోమవారం విచారణ జరుగుతోంది. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందా? ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అన్న కోణంలో సీఐడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద స్థలంలో చీకటి, వేడి ఎక్కువగా ఉండడంతో పూర్తి అండర్ గ్రౌండ్‌కు దర్యాప్తు బృందం వెళ్లలేకపోయింది. కొన్ని చోట్ల కాలిన పదార్థాల నుండి సీఐడీ బృందం షాంపిల్స్ సేకరించారు. మానవ తప్పిదమా? లేదా సాంకేతిక లోపమా? అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. (శ్రీశైలం ప్రమాదం: మృతుల చివరి సంభాషణ) ఇప్పటికే అధికారుల నుంచి స్టేట్మెంట్లను రికార్డ్ చేసిన విషయం తెలిసిందే. మరికొన్ని సాక్ష్యాల కోసం సీఐడీ అధికారులు నేడు విచారణ చేట్టారు. అదే విధంగా పవర్ హౌస్‌లోకి భారీగా నీరు చేరడంతో చేస్తున్న మరమ్మతుల వల్ల దర్యాప్తుకు కొంత ఆటంకం ఏర్పడింది. పవర్ హౌస్‌లోకి విద్యుత్ సరఫరా లేకపోవడంతో సిబ్బంది బయటి నుంచి లోపలికి విద్యుత్ వైర్లను తీసుకెళ్లారు. ఊట నీరును మోటార్ల ద్వారా ఎత్తిపోస్తున్నారు. మళ్లీ విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించాలంటే మరింత సమయం పట్టే అవకాశం ఉందని విద్యుత్ అధికారులు పేర్కొన్నారు. (శ్రీశైలం పవర్ హౌస్ ప్రమాదంపై మరో కమిటీ) -
శ్రీశైలం ప్రమాదం: సీఐడీ విచారణ
-
శ్రీశైలం ప్రమాదం: వివరాలు సేకరిస్తున్న సీఐడీ
సాక్షి, నాగర్‌కర్నూల్: శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో సంభవించిన భారీ అగ్నిప్రమాదంపై సీఐడీ విచారణ కొనసాగుతోంది. సీఐడీ చీఫ్ గోవింద్ సింగ్, డీఐజీ సుమతి నేతృత్వంలో ఈ విచారణ జరుగుతోంది. షార్ట్ సర్క్యూట్‌తో ప్రమాదం సంభవించినట్లు అధికారులు ప్రాథమిక అంచనాకొచ్చారు. ఇక షార్ట్ సర్క్యూట్‌కు గల కారణాలను సీఐడీ దర్యాప్తు బృందం విశ్లేషించనున్నది. ప్రమాదం జరిగిన స్థలంలో ప్రాథమిక సాక్ష్యాలను దర్యాప్తు బృందం సేకరించింది. కాలిపోయిన వైర్లతో పాటు పవర్ సప్లైకి ఉపయోగించిన వైర్లకు సంబంధించిన కాలిన పదార్థాలను ఫోరెన్సిక్ బృందం సీజ్ చేసింది. పవర్ జనరేషన్, సప్లై ఎలా జరిగిందని టెక్నికల్ బృందాలు వీడియో తీశారు. (కాంగ్రెస్ నేతల శ్రీశైలం పర్యటనలో ఉద్రిక్తత) పవర్ సప్లై ఎలా ఇచ్చారనే వివరాలు సీఐడీ రాబడుతోంది. పలువురు అధికారుల నుంచి సీఐడీ స్టేట్మెంట్లను రికార్డ్ చేసింది. మొదట ఫైర్ యాక్సిడెంట్ జరిగిన చోట ఫ్లోర్ పగిలి ఉన్న స్థలంలోని పదార్థాలను అధికారులు సేకరించారు. అక్కడ కాలిన పదార్థాలలో వాటర్ ఉందా? లేదా? అన్న దానిపై సీఐడీ టెక్నికల్ బృందం విశ్లేషించనుంది. గతంలో జరిగిన ప్రమాదాలతో ఈ ప్రమాదాన్ని పోల్చలేమని సీఐడీ అధికారులు పేర్కొన్నారు. మరికొన్ని సాక్ష్యాల కోసం అధికారులు విచారణ చేపట్టారు. మానవ తప్పిదం ఉందా లేదా అనేది సీఐడీ అధికారులు తేల్చనున్నారు. (శ్రీశైలం ప్రమాదం: సీఐడీకి కేసు బదిలీ) చదవండి: (‘ఫాతిమా చిన్నప్పటి నుంచీ ధైర్యశాలి’) -
శ్రీశైలం ప్రమాదం: సీఐడీకి కేసు బదిలీ
-
కాంగ్రెస్ నేతల శ్రీశైలం పర్యటనలో ఉద్రిక్తత
-
శ్రీశైలం ప్రమాదం: సీఐడీకి కేసు బదిలీ
సాక్షి, నాగర్‌కర్నూల్: శ్రీశైలం పవర్‌హౌజ్ ప్రమాదంపై సీఐడీ చీఫ్ గోవింద్‌సింగ్ విచారణ కొనసాగుతోంది. శ్రీశైలం పవర్‌హౌజ్ ప్రమాదంపై విచారణకు నాలుగు బృందాలు ఎలక్ట్రికల్, ఫోరెన్సిక్ సైన్స్, సీఐడీ, లోకల్ పోలీసుల టీమ్‌లు ఏర్పాటు చేశారు. కాగా, ప్రమాద ఘటనపై ఈగలపెంట పోలీస్ స్టేషన్లో 174 సెక్షన్ కింద కేసు నమోదైంది. ఈ కేసు సీఐడీకి బదిలీ అయింది. శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో గురువారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకోగా 9 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. మరో 8 మంది గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సీఐడీ విచారణకు ఆదేశించారు. దుర్ఘటనకు దారి తీసిన పరిస్థితులు, ప్రమాదానికి గల కారణాలను వెలికితీయాలని స్పష్టంచేశారు. సీఎం ఆదేశాల మేరకు సీఐడీ అదనపు డీజీపీ గోవింద్ సింగ్‌ను విచారణ అధికారిగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. (చదవండి: కాంగ్రెస్ నేతల శ్రీశైలం పర్యటనలో ఉద్రిక్తత) (చదవండి: మృత్యుసొరంగం) -
కాంగ్రెస్ నేతల శ్రీశైలం పర్యటనలో ఉద్రిక్తత
సాక్షి, నాగర్‌కర్నూల్: తెలంగాణ కాంగ్రెస్ నేతల శ్రీశైలం పర్యటనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. శ్రీశైలం పర్యటనకు వెళ్తున్న కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాద స్థలాన్ని పరిశీలించేందుకు వెళ్తున్న కాంగ్రెస్ నేతలు రేవంత్‌రెడ్డి, మల్లు రవిని పోలీసులు అడ్డగించారు. ఉప్పునుంతల మండలం వెల్టూరు గేట్ సమీపంలో అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. అగ్నిప్రమాదంపై సీఐడీ దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో పర్యటనకు అనుమతి లేదంటూ పోలీసులు నిరాకరించారు. (చదవండి: పర్యవేక్షణ లోపంతోనే ప్రమాదాలు!) పోలీసులతో కాంగ్రెస్ నేతలు వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు-కాంగ్రెస్ నేతల మధ్య స్వల్ప ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కాగా, శ్రీశైలం పవర్‌ప్లాంట్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 9 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం నుంచి మరో 8 మందికి గాయాలు కాగా ప్రాణాలతో బయటపడ్డారు. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించింది. డీఈ శ్రీనివాస్ కుటుంబానికి రూ.50 లక్షలు, ఏఈలతో పాటు సిబ్బందికి రూ.25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాషియా ప్రకటించింది. అంతేకాకుండా మృతుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని ప్రభుత్వం తెలిపింది. (చదవండి: మృత్యుసొరంగం) ఆ స్వేచ్ఛ కూడా లేదా: ఎంపీ రేవంత్ ఇదిలా ఉంటే శ్రీశైలం పర్యటనను పోలీసులు అడ్డుకోవడంతో ప్రభుత్వంపై ఎంపీ రేవంత్‌రెడ్డి నిప్పులు చెరిగారు. ‘శ్రీశైలం దుర్ఘటన బాధిత కుటుంబాలను పరామర్శించే స్వేచ్ఛ కూడా ప్రతిపక్ష నేతలకు లేదా? సంఘటన వెనుక వాస్తవాలను తెలుసుకునేందుకు వెళుతుంటే కేసీఆర్‌కు అంత భయమెందుకు? దిండి వద్ద ఖాకీల పహారా పెట్టి అడ్డుకోవాల్సిన అవసరం ఏంటి?’ అని ఆయన సర్కార్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. -
ఇదే తొలి ప్రమాదం
సాక్షి, నాగర్‌కర్నూల్: శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో 20 ఏళ్లుగా విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. నిర్మాణం పనులు 1988– 89లో ప్రారంభయ్యాయి. కేంద్రంలో తొలిసారిగా 2001 ఫిబ్రవరిలో ఒక యూనిట్లో విద్యుదుత్పత్తి ప్రారంభించారు. ఆ తర్వాత ప్రతి ఆరు నెలలకోసారి ఒక్కో యూనిట్ నిర్మాణ పనులు పూర్తి కాగా, మొత్తం 6 యూనిట్లను మూడేళ్లలో పూర్తి చేశారు. ఒక్క యూనిట్‌కు 150 మెగావాట్ల చొప్పు న విద్యుత్ కేంద్రం మొత్తం 900 మెగావాట్ల విద్యు త్ ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంది. విద్యుదుత్పత్తి ప్రారంభమైనప్పటి నుంచి ఇక్కడ ప్రమాదం జరగడం ఇదే తొలిసారి. గత నెల 17వ తేదీ నుంచి భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. మొత్తం ఆరు యూనిట్ల ద్వారా 24 గంటల వ్యవధిలో 21 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. జెన్కో యాజమాన్యం భూగర్భ కేంద్రానికి ఈ ఏడాది విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం 1,400 మిలియన్ యూని ట్లు ఇవ్వగా.. కేవలం 31 రోజుల్లోనే 600 మిలి యన్ యూనిట్లు ఉత్పత్తి చేసినట్లు సమాచారం. భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం నాలుగు యూనిట్లకు మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. ప్రమాద నష్టం రూ.వేల కోట్లలో ఉండొచ్చని సమాచారం. ఘటనపై ప్రభుత్వం సీనియర్ ఇంజనీరింగ్ అధికారులతో కూడిన నిపుణుల కమిటీని నియమించింది. విద్యుత్ ఉత్పత్తి కేంద్రం పునరుద్ధరణకు ఎన్ని రోజులు పడతాయనే విషయాన్ని అధికారులు వెల్లడించడంలేదు. నిపుణుల బృందం పరిశీలించిన అనంతరం ప్రమాదానికి గల కారణాలు, నష్టంపై ఓ అంచనాకు రావచ్చని చెబుతున్నారు. (మృత్యుసొరంగం) విద్యుత్ సరఫరాలో అంతరాయం.. శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం 870 అడుగులకు తగ్గకుండా ఉన్నంత వరకే కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. దాదాపు వచ్చే ఏడాది ఫిబ్ర వరి వరకు నీరు ఉండే అవకాశం ఉంది. ఆరు నెలల పాటు విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. ఈ ప్రమాదం జరగడం వల్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. జలాశయంలో నీరు సమృద్ధిగా ఉంటే రోజుకు 21 మిలియన్ యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుంది. అయితే ప్రమాదం కారణంగా 1,400 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి లక్ష్యా న్ని చేరుకోలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఉత్పత్తి కోల్పోవడం వల్ల పవర్‌గ్రిడ్‌కు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. మరో మార్గంలో గ్రిడ్ సమకూర్చుకోవాల్సిందే. తెలంగాణ రాష్ట్రా నికి జల విద్యుత్ కేంద్రం ద్వారా అందించే 900 మెగావాట్ల విద్యుత్ కోల్పోయింది. రాష్ట్రపతి, ప్రధాని సంతాపం న్యూఢిల్లీ: శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రం లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 9 మంది ఉద్యోగులు మరణించడంపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వెలిబుచ్చారు. ఈ మరణాలు తమను ఎంతగానో బాధించాయని వేర్వేరుగా ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ‘శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో చోటుచేసుకున్న భారీ అగ్నిప్రమాదంలో సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం ఎంతో బాధించింది. ఈ కష్ట సమయంలో మృతుల కుటుంబాల గురించే ఆలోచిస్తున్నా. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా’అని రాష్ట్రపతి ట్వీట్ చేశారు. ప్రధాని స్పందిస్తూ ‘అగ్నిప్రమాదం అత్యంత దురదృష్టకరం. నా మనసంతా మృతుల కుటుంబాల చుట్టూనే తిరుగుతోంది. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా’అని ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం మరణించిన వారి కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం: కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆర్థిక సాయంతో పాటు ఇతర సహాయాన్ని అందిస్తామని ప్రకటించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన డీఈ శ్రీనివాస్ కుటుంబానికి రూ.50 లక్షలు, ఇతర ఉద్యోగుల కుటుంబాలకు రూ.25 లక్షలు చొప్పున ఆర్థిక సాయం అందిస్తామన్నారు. మరణించిన వారి కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వడంతో పాటు బాధిత కుటుంబాలకు శాఖాపరమైన ప్రయోజనాలు అందిస్తామని ప్రకటించారు. -
మృత్యుసొరంగం
సాక్షి, నాగర్‌కర్నూల్: తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ వెలుగులు పంచుతున్న భారీ జలవిద్యుత్ కేంద్రం కొందరు ఉద్యోగుల జీవితాలను చీకటిమయం చేసింది. శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో గురువారం రాత్రి షార్ట్ సర్క్యూట్ వల్ల సంభవించిన భారీ అగ్నిప్రమాదం తొమ్మిది మందిని పొట్టన పెట్టుకుంది. రూ. వందల కోట్ల ఆస్తి నష్టాన్ని మిగిలిచ్చింది. జలవిద్యుత్ కేంద్రంలోని 4వ యూనిట్ ప్యానల్ బోర్డులో మంటలు చెలరేగడం, ఆ తర్వాత ట్రాన్స్ఫార్మర్ పేలుడుతో భారీ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో 17 మంది ఉద్యోగులు ఉండగా.. తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. వారిలో ఏడుగురు జెన్కో ఉద్యోగులుకాగా, మిగిలిన ఇద్దరు అమరాన్ బ్యాటరీ కంపెనీకి చెందిన వారు. మరో ఎనిమిది మంది ఉద్యోగులు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకొని బయటపడ్డారు. షార్ట్ సర్క్యూట్‌తో మంటలు... గురువారం రాత్రి 10:30 నుంచి 11:00 గంటల సమయంలో 900 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యంగల శ్రీశైలం జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో ఉన్న 4వ యూనిట్‌లోని ప్యానల్ బోర్డులో షార్ట్ సర్క్యూట్‌తో తొలుత మంటలు రేగాయి. ఆ వెంటనే ఆగ్జిలరీ వోల్టేజీ ట్రాన్స్ఫార్మర్ పేలడంతో భారీగా మంటలు వ్యాపించాయి. దీంతో విధుల్లో ఉన్న డీఈ పవన్, ఇతర ఉద్యోగులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. మంటలు అదుపులోకి రాకపోవడమే కాకుండా కేవలం 3 నిమిషాల్లోనే పవర్‌హౌస్‌లో పొగలు కమ్ముకున్నాయి. అప్రమత్తమైన ఆరుగురు ఉద్యోగులు వెంటనే కారులో బయటకు వచ్చారు. ఎలక్ట్రికల్ డీఈ అంకినీడు, మరో ఉద్యోగి అతికష్టం మీద డీజిల్ సెట్ వెళ్లే సొరంగ మార్గంలో పరుగులు పెడుతూ బయటికి వచ్చి సొమ్మసిల్లిపడిపోయారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ట్రాన్స్ఫార్మర్ పేలుడుకు కారణం అదేనా? శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో ఒక్కో యూనిట్ 150 మెగావాట్ల సామర్థ్యంగల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. కృష్ణా నదిలో హెడ్ (నీటి ఇన్‌టేక్, నీటి డిశ్చార్జ్ పాయింట్ మధ్య హెచ్చుతగ్గులు) ఎక్కువగా ఉండటం వల్ల సహజంగానే 150 మెగావాట్ల సామర్థ్యంగల యూనిట్లు అధికంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఇదే కారణంతో ఒక్కో యూనిట్ 180 మెగావాట్ల వరకు విద్యుత్‌ను ఉత్పత్తి చేసినట్లు తెలిసింది. అయితే పేలుడు సంభవించిన నాలుగో యూనిట్‌కు చెందిన ఆక్సిలరీ వోల్జేజీ ట్రాన్స్ఫార్మర్, ప్యానల్ బోర్డు మాత్రం ఒక్కసారిగా 200 మెగావాట్ల ఉత్పత్తికి వెళ్లిపోయింది. ఆగ్జిలరీ వోల్టేజీ ట్రాన్స్ఫార్మర్ పేలడానికి ఇదే ప్రధాన కారణం అయి ఉండొచ్చని ఓ అధికారి చెప్పారు. డ్యూటీలో ఉన్న ఇంజనీర్లు నాలుగో యూనిట్ విద్యుత్ ఉత్పత్తిని ఆపేందుకు ప్రయత్నించినప్పటికీ ఆగిపోలేదని సమాచారం. ఈ క్రమంలో పేలుళ్లు, మంటలు సంభవించి విద్యుత్ కేంద్రం మొత్తం చీకటిగా మారింది. అడుగు దూరంలో ఉన్న మనిషిని సైతం చూడలేని పరిస్థితి ఏర్పడిందని, ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది కలిగిందని బయటకు వచ్చిన ఇంజనీర్లు, ఇతర అధికారులు పేర్కొన్నారు. హుటాహుటిన ఘటనాస్థలికి మంత్రి జగదీశ్‌రెడ్డి, సీఎండీ ప్రమాద వార్త తెలిసిన వెంటనే ఉన్నతాధికారులు, ఎస్పీఈ సిబ్బంది, అధికారులు, కార్మికులు, నాన్ ఇంజనీర్లు ఆక్సిజన్ ధరించి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ దట్టమైన పొగల వల్ల సాధ్యం కాలేదు. కారు లైట్లు వేసుకొని వెళ్లినా దారి కనిపించలేదు. విషయం తెలుసుకున్న నాగర్‌కర్నూల్ కలెక్టర్ ఎల్. శర్మన్, ఎస్పీ సాయిశేఖర్ విద్యుత్ కేంద్రం వద్దకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. అర్ధరాత్రి 2:15 గంటలకు విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, సీఎండీ ప్రభాకర్‌రావు, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు భూగర్భ జలవిద్యుత్ కేంద్రం వద్దకు చేరుకున్నారు. వారు కూడా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించి పొగ కమ్ముకోవడంతో వెనుదిరిగారు. అనంతరం జగదీశ్‌రెడ్డి ప్రమాద ఘటనపై జెన్కో అధికారులతో సమీక్షించారు. ఫైర్ ఇంజన్లు, అంబులెన్సులను అతికష్టం మీద లోపలికి పంపించారు. పవర్‌హౌస్‌లోని గ్యాస్ ఇన్సులేటెడ్ సిస్టమ్ దిగువ ప్రాంతంలో ఆయిల్ లీక్ కావడంతో మంటలు మరింత ఎగసిపడ్డాయి. అయినా అతికష్టం మీద ఫైర్ సిబ్బంది ప్రయత్నం కొనసాగించారు. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, సీఎండీ ప్రభాకర్‌రావు, జిల్లా కలెక్టర్ శర్మన్ దగ్గరుండి సహాయక చర్యలు పర్యవేక్షించారు. ఎన్డీఆర్ఎఫ్, సింగరేణి, తెలంగాణ స్టేట్ ఫైర్ సర్వీసెస్, సీఐఎస్ఎఫ్ సిబ్బంది అక్కడికి చేరుకొని పొగలో చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నం చేశారు. పొగ ఎక్కువగా ఉండటంతో శుక్రవారం మధ్యాహ్నం తర్వాత ప్రమాదం జరిగిన ప్లాంటులోకి ప్రవేశించి గల్లంతైన వారి ఆచూకీ కోసం వెతికారు. ప్రమాదంలో చిక్కుకున్న వారు దురదుష్టవశాత్తు మరణించడంతో మృతదేహాలను బయటకు తీసుకొచ్చారు. మృతులు వీరే.. 1. డీఈ శ్రీనివాస్‌గౌడ్ (హైదరాబాద్) 2. ఏఈ వెంకటేశ్వర్రావు (పాల్వంచ) 3. ఏఈ మోహన్ కుమార్ (హైదరాబాద్) 4. ఏఈ ఉజ్మా ఫాతిమా (హైదరాబాద్) 5. ఏఈ సుందర్ (సూర్యాపేట) 6. ప్లాంట్ అటెండర్ రాంబాబు (ఖమ్మం జిల్లా) 7. జూనియర్ ప్లాంట్ అటెండర్ కిరణ్ (పాల్వంచ) 8. వినేష్ కుమార్ (అమరాన్ బ్యాటరీ కంపెనీ ఉద్యోగి) 9. మహేష్ కుమార్ (అమరాన్ బ్యాటరీ కంపెనీ ఉద్యోగి) వీరందరూ ఎస్కేప్ టన్నెల్ ద్వారా బయటకు రావడానికి ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. -
శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం ఫొటోలు
-
నువ్వు, పిల్లలు జాగ్రత్త.. సుందర్ చివరి మాటలు
సాక్షి, నాగర్ కర్నూల్: ‘ నువ్వు, పిల్లలు జాగ్రత్త. 15 నిమిషాల్లో మమ్మల్ని కాపాడకపోతే బ్రతికే పరిస్థితి లేదు’ అని ఏఈ సుందర్ చివరగా భార్యతో మాట్లాడిన మాటలు ఇవి. శ్రీశైలం ఎడమ గట్టు కాలువ జల విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న తొమ్మిదిమంది మృత్యువాత పడ్డారు. ఇందులో సుందర్ నాయక్ ఒకరు. 35 ఏళ్ల సుందర్ నాయక్ నిన్ననే తిరిగి విధుల్లో చేరాడు. కరోనా బారిన పడి కొన్ని రోజుల పాటు చికిత్స తీసుకున్న తర్వాత తేరుకున్న సుందర్ డ్యూటీకి గురువారం హాజరయ్యాడు. (చదవండి: జల విద్యుత్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం..) కాగా, కరోనాను జయించిన సుందర్.. ఇలా విద్యుత్ ప్రమాదంలో చిక్కుకుని మృతి చెందుతాడని ఎవరూ అనుకోలేదు. కానీ మృత్యుంజయుడనుకున్న సుందర్‌ను విధి మరోలా వక్రించడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో తొలుత లభించిన మృతదేహం కూడా సుందర్‌దే. ప్రమాదంలో చిక్కుకున్న తర్వాత ఇక ప్రాణాలతో బయటపడలేమని ఊహించిన సుందర్.. భార్యకు జాగ్రత్తలు చెప్పాడు. ‘నువ్వు, పిల్లలు జాగ్రత్త. 15 నిమిషాల్లో మమ్మల్ని కాపాడలేకపోతే బ్రతికే పరిస్థితి లేదు’ అని భార్యకు ఫోన్లో ప్రమాద తీవ్రతను వివరించాడు. కాగా, మోహన్ అనే మరో ఏఈ తోటి వారిని కాపాడటానికి సహకరించాడు. ఈ ఘటనలో 17 మంది విధుల్లో ఉండగా, ఎనిమిది మంది బయటపడ్డారు. మిగతా తొమ్మిది మంది ప్రమాదంలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. (చదవండి: పవర్ హౌజ్ ప్రమాదం: సీఐడీ విచారణకు కేసీఆర్ ఆదేశం) -
కరోనాపై గెలిచి, అనూహ్యంగా మృత్యువాత
నాగర్‌కర్నూల్: శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రం అగ్ని ప్రమాదంలో విషాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం ఒకరు మృతి చెందారు. ఏఈ సుందర్ నాయక్ (35) మృతదేహాన్ని రెస్క్యూ బృందం గుర్తించింది. మిగతా 8 మంది కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మరో రెండు గంటలపాటు ఈ ఆపరేషన్ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, మృతుడు సుందర్ నాయక్ది సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం, జగన తండాగా తెలిసింది. అతనికి భార్య ప్రమీల ఇద్దరు కూతుళ్లు మనస్వి, నిహస్వి ఉన్నారు. నెల రోజుల క్రితం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో సుందర్ నాయక్ సొంతూరుకు వచ్చి 15 రోజులు హోమ్ క్వారెంటైన్లో ఉండి కరోనాను జయించారు. నిన్న రాత్రి 9 గంటలకు శ్రీశైలం ఎడమ జల విద్యుత్ కేంద్రంలో విధులకు హాజరయ్యారు. అతని తండ్రి నాగేశ్వరరావు కోపరేటివ్ అసిస్టెంట్ రిజిస్ట్రార్‌గా పనిచేశారు. (35 మందితో పవర్ హౌస్‌లోకి రెస్క్యూ టీమ్) -
శ్రీశైలం పవర్ హౌస్‌లోకి రెస్క్యూ టీమ్
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ఎడమ జల విద్యుత్ ఉత్పతి కేంద్రంలో చిక్కుకుపోయిన తొమ్మిదిమంది జెన్కో ఉద్యోగులను రక్షించేందుకు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పొగతో పాటు మంటలు అదుపులోకి రాకపోవడంతో గత రాత్రి సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడింది. దీంతో విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశారు. సీఐఎస్ఎఫ్ కమాండెంట్ సిద్ధార్థ రెహ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టారు. అధునాతన పరికరాలతో పవర్ హౌస్‌లోకి వెళ్లిన 35మంది సీఐఎస్ఎఫ్ సభ్యుల బృందం సహాయక చర్యలు మొదలుపెట్టింది. మరోవైపు అదనపు డీజీ సీవీ ఆనంద్ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. తెలంగాణ డీజీపీ విజ్ఞప్తితో సీఐఎస్ఎఫ్ ప్రత్యేక బృందాన్ని పంపింది. ఇవాళ మధ్యాహ్నానికి పరిస్థితి అదుపులోకి వచ్చే అవకాశం ఉంది. (చదవండి: జల విద్యుత్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం..) మంటల్లో చిక్కుకున్నవారి వివరాలు 1.DE శ్రీనివాస్ గౌడ్, హైదరాబాద్ 2.AE వెంకట్రావు, పాల్వంచ 3.AE మోహన్ కుమార్, హైదరాబాద్ 4.AE ఉజ్మ ఫాతిమా, హైదరాబాద్ 5.AE సుందర్, సూర్యాపేట 6. ప్లాంట్ అటెండెంట్ రాంబాబు, ఖమ్మం జిల్లా 7. జూనియర్ ప్లాంట్ అటెండెంట్ కిరణ్, పాల్వంచ 8,9 హైదరాబాద్‌కు చెందినా అమరన్ బ్యాటరీ కంపెనీ సిబ్బంది వినేష్ కుమార్, మహేష్ కుమార్ (చదవండి: గతంలో ఎప్పుడూ ఇలాంటి ఘటన జరగలేదు) ఏపీ గవర్నర్ దిగ్భ్రాంతి శ్రీశైలం ప్రాజెక్ట్ ఎడమ గట్టు భూగర్భ జల విధ్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదం పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భూగర్భ జల విధ్యుత్ కేంద్రంలో చిక్కుకున్న తొమ్మిది మంది ఉద్యోగులు క్షేమంగా బయటకు వస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రమాద స్థలం వద్ద ఏపీ ఎమ్మెల్యేలు పలువురు ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు ప్రమాదం జరిగిన శ్రీశైలం ప్రాజెక్ట్ ఎడమ గట్టు భూగర్భ జల విధ్యుత్ కేంద్రం వద్దకు చేరుకుని రెస్క్యూ ఆపరేషన్‌ను పరిశీలించారు. ఎడమ గట్టు విద్యుత్ కేంద్రంలో ప్రమాదం జరగడం దురదృష్టకరమని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. లోపల చిక్కుకుపోయిన 9 మంది క్షేమంగా తిరిగిరావాలని ఆకాక్షించారు. -
ప్రమాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి
సాక్షి, హైదరాబాద్ : శ్రీశైలం జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో అగ్నిప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఘటనపై మంత్రి జగదీష్ రెడ్డి, జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావును అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశాలు ఇచ్చారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో చిక్కుకుపోయిన తొమ్మిది మందిని బయటకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. (శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం..) మంటల్లో చిక్కుకున్నవారి వివరాలు 1.DE శ్రీనివాస్ గౌడ్, హైదరాబాద్ 2.AE వెంకట్రావు, పాల్వంచ 3.AE మోహన్ కుమార్, హైదరాబాద్ 4.AE ఉజ్మ ఫాతిమా, హైదరాబాద్ 5.AE సుందర్, సూర్యాపేట 6. ప్లాంట్ అటెండెంట్ రాంబాబు, ఖమ్మం జిల్లా 7. జూనియర్ ప్లాంట్ అటెండెంట్ కిరణ్, పాల్వంచ 8,9 హైదరాబాద్‌కు చెందినా అమరన్ బ్యాటరీ కంపెనీ సిబ్బంది వినేష్ కుమార్, మహేష్ కుమార్ అయితే, ప్రమాద స్థలంలో పొగ తగ్గకపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. రెస్క్యూ టీం లోపలికి వెళ్లేందుకు యత్నించగా.. ఆక్సిజన్ అందక వెనక్కి వచ్చారు.. సొరంగంలో దట్టమైన పొగ కారణంగా సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. శ్రీశైలం ఎడమ జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేశారు. సహాయక చర్యలను మంత్రి జగదీశ్‌రెడ్డి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. లోపల చిక్కుకున్న సిబ్బందిని కాపాడేందుకు అధికారులు సింగరేణి సహాయం కోరారు. ఇక ఈ ప్రమాదంలో అస్వస్థతకు గురైన వారికి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వారంతా బాగానే ఉన్నారని, ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని వైద్యులు తెలిపారు. బాధితులను ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పరామర్శించారు. పొగ కారణంగా మరో ఆరుగురు అస్వస్థకు గురికావడంతో జెన్కో ఆస్పత్రికి తరలించారు. (గతంలో ఎప్పుడూ ఇలాంటి ఘటన జరగలేదు..) ఏపీ సీఎం జగన్ దిగ్భ్రాంతి: తెలంగాణ జెన్కో విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎలాంటి సహకారం కావాలన్నా అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఏపీ విద్యుత్ శాఖ అధికారులు ప్రమాద స్థలం వద్దకు చేరుకున్నారు. -
జల విద్యుత్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం..
-
పొగ ఉండటంతో మూడుసార్లు లోనికి వెళ్లి వెనక్కి..
సాక్షి, హైదరాబాద్ : శ్రీశైలం ఎడమ గట్టు కాలువ జల విద్యుత్ కేంద్రంలో జరిగిన భారీ ప్రమాద సంఘటనలో చిక్కుకున్నవారిని కాపాడేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అయితే లోపల దట్టమైన పొగ ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. చిక్కుకున్న ఉన్నవారిని కాపాడేందుకు అగ్నిమాపక సిబ్బందితో పాటులో పోలీసులు లోపలకు వెళ్లినా దట్టంగా పొగ ఉండటంతో మూడుసార్లు లోనికి వెళ్లి వెనక్కి రావడం జరిగింది. ఆక్సిజన్ పెట్టుకుని వెళ్లినా లోపలకి వెళ్లలేకపోతున్నారని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారని, మరోవైపు సింగరేణి సిబ్బంది సాయం కోరినట్లు ఆయన చెప్పారు. (విద్యుత్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం..) శ్రీశైలం ఎడమ గట్టు కాలువ జల విద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదం ఘటనను ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావుకు వివరించినట్లు జెన్కో సీఎండీ ప్రభాకార్‌రావు తెలిపారు. గురువారం రాత్రి 10.35 గంటలకు ప్రమాదం జరిగిందని, లోపలికి వెళ్లేందుకు వీలుకాలేదని ఆయన పేర్కొన్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి సంఘటన జరగలేదని, 1200 కేవీ ఐసోలేట్ చేసినట్లు సీఎండీ తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంటలో శ్రీశైలం ఎడమ గట్టు కాలువ జల విద్యుత్ కేంద్రంలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. షాట్ సర్క్యూట్ కారణంగా విద్యుత్ తయారీ కేంద్రంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో దట్టంగా పొగలు అలుముకున్నాయి. దీంతో ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు. అయితే ప్రమాదం జరిగినప్పుడు 17 మంది ఉద్యోగులు విధుల్లో ఉండగా 8 మంది సొరంగం నుంచి బయటకు పరుగులు తీశారు. మిగిలిన 9 మంది ఉద్యోగులు సొరంగ మార్గంలోనే చిక్కుకున్నారు. వీరిలో ఏడుగురు జెన్కో ఉద్యోగులు కాగా ఇద్దరు అమ్రాన్ కంపెనీ సిబ్బంది ఉన్నారు. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్, జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు, కలెక్టర్ శర్మన్, ఎస్పీ సాయిశేఖర్ ఘటన స్ధలానికి చేరుకుని పరిశీలించారు. ఎమ్మెల్యే బాలరాజ్ మాట్లాడుతూ.. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, పొగలు అలుముకోవడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడిందన్నారు. విద్యుత్ కేంద్రంలో ప్రమాదం జరగటం ఇది మొదటిసారి అని ఆయన అన్నారు. మంటల్లో చిక్కుకున్నవారు: డీఈ శ్రీనివాస్, ఏఈలు వెంకట్రావు ఫాతిమా బేగం, మోహన్, సుందర్, సుష్మ, కుమార్ ప్రైవేట్ ఉద్యోగులు కిరణ్, రాంబాబు -
శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం..
సాక్షి, నాగర్ కర్నూల్: జిల్లాలోని అమ్రాబాద్ మండలం దోమలపెంట శ్రీశైలం ఎడమ గట్టు కాలువ జల విద్యుత్ కేంద్రంలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ తయారీ కేంద్రంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో దట్టంగా పొగలు అలుముకున్నాయి. దీంతో ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు. అయితే ప్రమాదం జరిగినప్పుడు 25 మంది ఉద్యోగులు విధుల్లో ఉండగా 15 మంది సొరంగం నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే మరీ కొంతమంది ఉద్యోగులు సొరంగ మార్గంలోనే ఉన్నట్లు తెలుస్తోంది. డీఈ శ్రీనివాస్ గౌడ్, సుందర్,మోహన్ కుమార్, సుస్మా, ఫాతిమా, వెంకట్ రావ్, ఎట్టి రాంబాబు, కిరణ్, ఇద్దరు అమ్రాన్ కంపెనీ సిబ్బంది గల్లంతు అయ్యినట్లు తెలుస్తోంది. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. ప్రమాదం దురదృష్టకరం: మంత్రి జగదీష్‌రెడ్డి శ్రీశైలం లెఫ్ట్ పవర్‌హౌస్‌లో ప్రమాదం దురదృష్టకరమని మంత్రి జగదీష్‌రెడ్డి తెలిపారు. మొదటి యూనిట్లో అగ్నిప్రమాదం జరిగిందన్నారు. అగ్నిప్రమాదంలో నాలుగు ప్యానెల్స్ దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. 10 మంది సురక్షితంగా బయటకొచ్చారు.. మరో 9 మంది చిక్కుకున్నారని వెల్లడించారు. ‘‘లోపల దట్టమైన పొగ ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. చిక్కుకున్నవారిని కాపాడేందుకు ఫైర్, పోలీస్ సిబ్బంది లోపలికి వెళ్లారు. దట్టంగా పొగ ఉండటంతో మూడుసార్లు లోపలికి వెళ్లి వెనక్కి వచ్చారు. ఆక్సిజన్ పెట్టుకుని వెళ్లినా లోపలికి వెళ్లలేకపోతున్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సింగరేణి సిబ్బంది సహాయం కోరాం. లోపల చిక్కుకున్నవారిని కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నామని’’ మంత్రి వెల్లడించారు. -
పెట్రోల్‌బాటిల్ తీసి ఒంటిపై పోసుకుని..
వెల్దండ (కల్వకుర్తి): భూ సమస్య పరిష్కరించాలంటూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టాడు. ఇది గమనించిన తోటి రైతులు వెంటనే నిలువరించారు. వివరాలిలా ఉన్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండకు చెందిన బొక్కల రామస్వామి రెండేళ్ల క్రితం మృతి చెందారు. ఈయనకు సర్వే నం.187, 194. 195, 198, 199, 200, 201లలో నాలుగెకరాల పొలం ఉంది. అనంతరం దీనిని భార్య బొక్కల లక్ష్మమ్మకు విరాసతు చేశారు. అయితే ఈ పట్టా భూమి కాస్తా అన్లైన్లో అసైన్డ్గా నమోదైంది. దీంతో తల్లితో పాటు కుమారుడు బొక్కల శ్రీనివాస్ పట్టా భూమిగా నమోదు చేయాలని ఏడాది కాలంగా రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నా పరిష్కరించలేకపోయారు. చివరకు విసుగు చెందిన అతను సోమవారం ఉదయం తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించాడు. అయినా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని వెంట తీసుకొచ్చిన పెట్రోల్‌బాటిల్ తీసి ఒంటిపై పోసుకుని నిప్పు అంటించుకోవడానికి యత్నించాడు. ఇది గమనించిన అక్కడే ఉన్న రైతులు బాటిల్‌ను తీసివేసి అగ్గిపెట్టెను లాగేశారు. అనంతరం బాధితుడితో ఎస్ఐ నర్సింహులు, తహసీల్దార్ సైదులు, డీటీ వెంకటరమణ మాట్లాడారు. మూడు రోజుల్లో సమస్యను తీర్చుతామని హామీ ఇవ్వడంతో శాంతించి వెనుదిరిగారు. -
కరోనాతో 2 నెలల శిశువు మృతి
సాక్షి, నాగర్‌కర్నూల్ : కరోనా చాపకింద నీరులా గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. తాజాగా శనివారం నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతలలోని బీసీకాలనీలో 58రోజుల చిన్నారి కరోనాతో మృతి చెందింది. దీంతో బాధిత కుటుంబం నివసిస్తున్న ఇంటిని అన్ని శాఖల అధికారులు పరిశీలించారు. ఈ కాలనీలోకి కొత్తవారు ప్రవేశించకుండా పోలీసులు దిగ్బంధం చేశారు. వివరాలిలా ఉన్నాయి..గత నెల 3న నాగర్‌కర్నూల్ ప్రభుత్వాస్పత్రిలో మగశిశువు జన్మించాడు. పది రోజులపాటు ఆస్పత్రిలో ఉన్న తల్లి తిరిగి బాబుతో పాటు ఉప్పునుంతలలోని పుట్టింటికి వచ్చింది. కాగా ఈనెల 27న బాబు అనారోగ్యానికి గురికావడంతో తల్లిదండ్రులు అచ్చంపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. తర్వాత అక్కడి వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షలు చేసిన వైద్యులు బాబుకు కరోనా పాజిటివ్ ఉన్నట్టు నిర్ధారించారు. అనంతరం ముగ్గురినీ గాంధీ ఆస్పత్రికి రిఫర్ చేయగా అక్కడికి చేర్చేలోపే బాబు మృతి చెందాడు. తల్లిదండ్రుల రక్త నమూనాలు తీసుకోగా..ఫలితాలు ఆదివారం వచ్చే అవకాశం ఉందని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి సాయినాథ్‌రెడ్డి తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులతో ప్రైమరీ కాంటాక్టు ఉన్న 28 మందిని హోం క్వారంటైన్లో ఉండాలని సూచించారు. ‘రాజధాని’ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికుడికి పాజిటివ్ కరీమాబాద్: రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో వరంగల్ రైల్వేస్టేషన్లో దింపేశారు. స్టేషన్ మేనేజర్ శ్రీనివాస్ కథనం ప్రకారం.. చైన్నై నుంచి న్యూఢిల్లీ వెళ్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్ శనివారం మధ్యాహ్నం 3.45 గంటలకు వరంగల్ స్టేషన్‌కు చేరుకుంది. కోచ్–8లో చెన్నై నుంచి వరంగల్ వరకు రావాల్సిన యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఓ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి (40) ఉన్నాడు. ఆయన చెన్నైలో రైలు ఎక్కే సమయంలో పరీక్షలు నిర్వహించారు. అయితే రైలు బయలుదేరాక అతనికి పాజిటివ్ ఉన్నట్లు రిపోర్టు వచ్చింది. అప్పటికే రైలు విజయవాడ చేరుకుందని తెలియడంతో వారు వరంగల్ స్టేషన్‌కు సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు.. రైలు ఇక్కడికి చేరుకోగానే సదరు వ్యక్తికి పీపీఈ కిట్ వేయించి అంబులెన్స్‌లో హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఇక ఇదే బోగీలో మొత్తం 41 మంది ఉండగా ఏడుగురు వరంగల్ స్టేషన్లో దిగారు. వీరందరికీ వైద్య పరీక్షలు చేయించడంతో పాటు బోగీని శానిటైజేషన్ చేశాక 5.20 గంటలకు రైలును పంపించారు. -
అడవి బిడ్డలు ఆగమాగం
సాక్షి, నాగర్‌కర్నూల్: నల్లమల అటవీ ప్రాంతంలో అరకొర వసతుల మధ్య జీవిస్తున్న చెంచులకు లాక్డౌన్ వల్ల మరిన్ని కష్టాలు వచ్చిపడ్డాయి. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో పేదలను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక సాయం చాలా మందికి అందలేదు. కొంత మంది చెంచుల బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ అయినా తీసుకోలేని పరిస్థితి. మరికొందరు చెంచులకు అసలు ప్రభుత్వం నగదు సాయం అందజేసినట్లుగా కూడా తెలియకపోవడం గమనార్హం. లాక్డౌన్ ఉన్నందున వారిని అడవిలో నుంచి బయటికి రానివ్వడం లేదు. ప్రస్తుతం రేషన్ బియ్యం మాత్రమే తీసుకున్న చెంచులు, దాతలు అందజేస్తున్న నిత్యావసరాలతోనే జీవనం వెల్లదీస్తున్నారు. మరో పక్క వేసవి కాలం కావడంతో చెంచుపెంటల్లో వేసిన బోర్లు పూర్తిగా అడుగంటి పోయాయి. గ్రామీణ నీటిసరఫరా పథకం (ఆర్డబ్ల్యూఎస్) ద్వారా అధికారులు ఇప్పటివరకు ట్యాంకర్లతో నీటిని సరఫరా చేసే వారు. ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా ఆ సదుపాయం కూడా నిలిచిపోయింది. మరో పక్క వాగులు, నీటి చెలిమలు కూడా ఎండిపోయాయి. దీంతో నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలోని నల్లమల అడవుల్లో ఉన్న మల్లాపూర్, ఫర్హాబాద్, పుల్లాయిపల్లి, రాంపూర్, అప్పాపూర్, భౌరాపూర్ తదితర పెంటల్లో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాల్లో ఉండి చదువుకుంటున్న పిల్లలంతా ఇప్పుడు ఇళ్లకు చేరుకున్నారు. నీటికొరత కారణంగా వ్యక్తిగత పరిశుభ్రత దూరమైంది. బట్టలు ఉతుక్కోవడానికి కూడా నీళ్లు దొరకని పరిస్థితి ఉంది. సరుకులకోసం ఇక్కట్లు.. మన్ననూర్‌కు వచ్చి చెంచులు తమకు కావాల్సిన నిత్యావసరాలను తీసుకెళ్లేవారు. కానీ.. ప్రస్తుతం రవాణా సౌకర్యాలు పూర్తిగా నిలిచి పోవడంతో చెంచు పెంటల నుంచి బయటికి వెళ్లలేని పరిస్థితి. గిరిజన కార్పొరేషన్ ద్వారా కొన్ని సరుకులు మాత్రమే దొరుకుతున్నాయి. ఉపాధిహామీ వల్ల వచ్చిన కూలీతో కొంత జీవనం గడిచేది. ప్రస్తుతం ఉపాధి పనులు కూడా కొన్ని చెంచుపెంటల్లో జరగడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన బియ్యం మాత్రమే అందాయి. రూ.1,500 నగదు సాయం తమ ఖాతాల్లో జమ అయిందా.. లేదా అనే అవగాహన కూడా వారికి లేదు. చాలా మందికి బ్యాంకు ఖాతాలు కూడా లేవు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన లాక్డౌన్ ఆర్థిక సాయం కూడా చెంచుల దరి చేరలేదు. నగదు సాయం ఇచ్చినట్లు తెలవదు.. పోయిన నెలలో రేషన్ బియ్యం మాత్రమే తీసుకున్నాం. ప్రభుత్వం నగదు సాయం ఇచ్చినట్లు మాకు తెలవదు. మన్ననూర్‌కు కూడా పోనిస్తలేరు. అధికారులు స్పందించి నగదు సాయం అందజేయాలి. – మహేశ్వరి, చెంచుమహిళ, భౌరాపూర్ ఇబ్బందులు లేకుండా చర్యలు.. లాక్డౌన్ వేళ చెంచులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. రేషన్‌బియ్యం, నిత్యావసరాలు అందజేస్తున్నాం. తాగునీటికి సం బంధించి 17 హామ్లెట్లకు బోర్లు మంజూరయ్యా యి. త్వరలో బోర్లు వేయిస్తాం. కొంతమందికి రేషన్‌కార్డులు లేవని గుర్తించాం. అలాంటి వారికి కూడా రేషన్ అందించేందుకు చర్యలు తీసుకుంటాం. ఉపాధి హామీ పనులు అన్ని పెంటల్లో జరుగుతున్నాయి. ఒకవేళ ఏ పెంటల్లోనైనా జరగకపోతే వెంటనే పని కల్పించాలని ఆదేశిస్తాం. –అఖిలేశ్‌రెడ్డి, ఐటీడీఏ పీఓ, మన్ననూర్, నాగర్‌కర్నూల్ జిల్లా -
అదొక్కటే కరోనా నియంత్రణకు మూలం
సాక్షి, నాగర్ కర్నూల్ : గృహ నిర్బంధమే కరోనా నియంత్రణకు మూలమని, ప్రజలు ఎవరికి వారుగా సామాజిక దూరం పాటించాలని మంత్రి నిరంజన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. గురువారం జిల్లా స్థాయి సమీక్షాసమావేశంలో ఆయన పాల్గొన్నారు. కరోనా కట్టడికి జిల్లాలో ఏర్పాట్లు, వైద్య సదుపాయాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిత్యావసర సరుకులు బ్లాక్ మార్కెట్ చేసి అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కూరగాయల మార్కెట్, కిరాణం షాపు వద్ద శానిటేషన్ పనులు చేపట్టాలన్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా రెండు మూడు గ్రామాలకు కలిపి ఒక ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు. మామిడి ఇతర ప్రాంతాలకు ఎగుమతి లేని దృష్ట్యా మామిడి మాల్స్ ఏర్పాటు చేయాలన్నారు. అనాథలు, బిచ్చగాళ్లకు ప్రత్యేక ఏర్పాట్లు చేసి భోజన వసతులు కల్పించాల్సిన బాధ్యత అధికారులదేనన్నారు. -
తల్లిదండ్రులు మందలించారని యువకుడు..
సాక్షి, కల్వకుర్తి : తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని మార్చాలకి చెందిన రాముడు (24) హోటళ్లలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం సమయంలో ఇంటికి వచ్చిన యువకుడిని ఏదో విషయమై అతని తల్లిదండ్రులు మందలించారు. అనంతరం ఇంట్లో ఎవరూ లేని సమయంలో అతను పురుగుల మందు తాగాడు. కొద్ది సమయం తర్వాత తల్లిదండ్రులు ఇంటికి వచ్చి చూడగా.. కుమారుడు అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లడాన్ని గమనించి వెంటనే కల్వకుర్తి ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చారు. పరిశీలించిన వైద్యులు.. అప్పటికే అతను మృతిచెందినట్లు ధ్రువీకరించారు. ఈ ఘటనపై కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఇంటిపై దాడి
సాక్షి, కల్వకుర్తి టౌన్: స్థానిక ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఇంటిపై టీఆర్ఎస్ నాయకులే దాడిచేసిన ఘటన శనివారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. వెల్దండ మండలం పోతేపల్లికి చెందిన సంజీవ్‌కుమార్‌యాదవ్ 9వ డైరెక్టర్ స్థానం, 7వ డైరెక్టర్ స్థానం నుంచి జూపల్లికి చెందిన భాస్కర్‌రావు పోటీచేసి గెలుపొందారు. వీరిలో జూపల్లి భాస్కర్‌రావుకు పీఏసీఎస్ చైర్మన్ పదవి ఇస్తున్నట్లు సమాచారం తెలుసుకున్న సంజీవ్ అనుచరులు కల్వకుర్తిలో ఎమ్మెల్యే ఇంటికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మాట్లాడుతుండగా సంజీవ్, జూపల్లి భాస్కర్‌రావు అనుచరులకు మాటమాట పెరిగి గొడవకు దారితీసి.. దాడి చేసుకునే స్థాయికి చేరుకుంది. ఈ క్రమంలోనే సంజీవ్ అనుచరులు ఎమ్మెల్యే ఇంటికి ఉన్న కిటికీ అద్దాలను ధ్వంసం చేయడంతోపాటు ఏకంగా ఎమ్మెల్యేపై దాడిచేసేందుకు యత్నించారు. వెంటనే తేరుకున్న గన్మెన్లు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి ఆందోళనకారులను చెదరగొట్టారు. అయితే ఇద్దరు కార్యకర్తలు ఒంటిపై పెట్రోలు పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. అద్దాలను ధ్వంసం చేస్తున్న సమయంలో ఓ కార్యకర్తకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో డివిజన్లోని అన్ని పోలీస్స్టేషన్ల పోలీసులు ఎమ్మెల్యే ఇంటికి చేరుకున్నారు. పరిశీలించిన డీఎస్పీ.. ఎమ్మెల్యే ఇంటిపై దాడి సమాచారం తెలుసుకున్న డీఎస్పీ గిరిబాబు అక్కడికి చేరుకొని పరిశీలించారు. ఎమ్మెల్యే ఇంటి ముందు నిరసన వ్యక్తం చేస్తున్న సంజీవ్‌యాదవ్‌కు, మద్దతుదారులకు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించారు. అనంతరం డీఎస్పీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ను కలిసి పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ విషయమై డీఎస్పీ స్పందిస్తూ ఫిర్యాదు అందితే తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
అందువల్లే స్వాతిరెడ్డి కోర్టుకు హాజరుకాలేకపోయింది
మహబూబ్‌నగర్ క్రైం: సరిగ్గా రెండేళ్ల తర్వాత స్వాతిరెడ్డి పేరు మళ్లీ ప్రచారంలోకి వచ్చింది. ఈ కేసులో రెండేళ్ల కిందట ప్రియుడితో కలిసి భర్తను అత్యంత కిరాతంగా హత్య చేయడంతో అప్పట్లో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా పెనుసంచలనం సృష్టించింది. భర్తను హత్య చేసినందుకు స్వాతిరెడ్డికి అప్పట్లో కోర్టు జైలు శిక్ష విధించింది. అనంతరం బెయిల్‌పై స్వాతిని 2018 జూలై 27న విడుదల చేశారు. అయితే, ఆమెను తీసుకువెళ్లేందుకు వారి బంధువులు ఎవరూ ముందుకు రాకపోవడంతో కలెక్టర్, న్యాయసేవ అధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా జైలు అధికారులు స్వాతిని జైలు నుంచి నేరుగా పట్టణంలోని మెట్టుగడ్డ దగ్గర ఉన్న రాష్ట్ర సదనంకు తరలించారు. అయితే ఈ కేసులో నాగర్‌కర్నూల్ జిల్లా కోర్టుకు వాయిదాల కోసం వెళ్లాల్సి ఉండగా మూడు సార్లు ఆమె కోర్టుకు హాజరుకాలేదు. దీంతో న్యాయమూర్తి స్వాతిరెడ్డిపై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంతో నాగర్‌కర్నూల్ పోలీసులు ఆమెను మంగళవారం అరెస్టు చేసి జిల్లా జైలుకు తరలించారు. రిమాండ్‌లో భాగంగా ప్రస్తుతం ఆమె జైలులో 14రోజుల పాటు శిక్ష అనుభవించనుంది. ఇదిలాఉండగా, స్టేట్‌హోం నుంచి నాగర్‌కర్నూల్ కోర్టుకు వెళ్లడానికి సరైన భద్రత, స్థానిక సిబ్బంది నుంచి సరైన సహకారం లేకపోవడం వల్లే ఆమె కోర్టుకు హాజరుకాకపోవడానికి కారణాలుగా తెలుస్తోంది. -
లక్ష మంది ఓవైసీలు వచ్చినా బీజేపీని అడ్డుకోలేరు
నాగర్‌కర్నూల్: రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం కాకుండా తండ్రీ కొడుకుల ప్రభుత్వం కొనసాగుతుందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం పట్టణంలో ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించి బస్టాండ్ వద్ద ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ ఎన్నికలు సాధారణ ఎన్నికలు కావని రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పేవన్నారు. టీఆర్ఎస్, ఎంఐఎం ఒకవైపు, బీజేపీ ఒకవైపని అన్నారు. ఇతర పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్థులను బెదిరిస్తూ టీఆర్ఎస్ కుట్ర చేస్తుందని, ఇంత దిగజారుడు రాజకీయం ఎన్నడూ చూడలేదని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా పరోక్షంగా ఎన్నికల్లో గెలిచేందుకు టీఆర్ఎస్ ప్రయత్నం చేస్తున్నదని ఆరోపించారు. అధికార పార్టీ నాయకులకు ఓటర్లపై నమ్మకం లేదని కేవలం డబ్బు, ఎంఐఎం పార్టీ పైనే నమ్మకం ఉందన్నారు. 2014లో 2లక్షలు ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారని, ఇప్పటి వరకు కేంద్రానికి ఒక్క లబ్ధిదారుని పేరు కూడా పంపలేదన్నారు. రాష్ట్రంలో అభివృద్ధిపై చర్చించేందుకు కేటీఆర్ తనకు ఎర్ర తివాచి పరుస్తా అన్నాడని, పేదలకు ఇళ్లు కట్టిసే తానే కేటీఆర్‌కు ఎర్ర తివాచి పరుస్తానని అన్నారు. బంగారు తెలంగాణ బదులు బంగారు కుటుంబం తయారైందన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేస్తే ధర్మానికి వేసినట్లేనని, టీఆర్ఎస్కు వేస్తే అవినీతికి వేసినట్లేనని తెలిపారు. ఆయుష్మాన్ భారత్ వంటి మంచి పథకాన్ని కేంద్రం ప్రవేశపెడితే తెలంగాణాలో అడ్డుకుంటున్నారని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకుంటామని ఓవైసీ అన్నాడని, లక్షమంది ఓవైసీలు వచ్చినా బీజేపీ గెలుపును అడ్డుకోలేరన్నారు. నియోజకవర్గ ఇన్చార్జ్ దిలీపాచారి మాట్లాడుతూ పట్టణాన్ని టీఆర్ఎస్ నాయకులు కుక్కలు చింపిన విస్తరి చేశారని ఆరోపించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బుసిరెడ్డి సుబ్బారెడ్డి, పార్లమెంట్ ఇన్చార్జ్ బంగారు శృతి పాల్గొన్నారు. -
వికటించిన ‘మధ్యాహ్న భోజనం’
పెద్దకొత్తపల్లి/ నాగర్‌కర్నూల్: ఓ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని 44మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా మారింది. వివరాలిలా ఉన్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలోని చంద్రకల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 144 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరిలో 125 మంది గురువారం పాఠశాలకు హాజరై ఎప్పటిలాగే మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం మూడు గంటలకు 44 మందికి తీవ్ర కడుపునొప్పితో వాంతులు చేసుకున్నారు. ఇది గమనించిన హెచ్ఎం శ్రీనివాసులు వెంటనే 108 అంబులెన్స్‌లో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, వీరిలో పదో తరగతి విద్యార్థులు మానస, ప్రేమలత, మంజుల, లక్ష్మి, వంశీలకు పరిస్థితి విషమంగా మారడంతో ఐసీయూలో ప్రత్యేక వైద్యం అందిస్తున్నారు. ఇదిలాఉండగా అధికారుల పర్యవేక్షణలోపం, నాసిరకమైన మధ్యాహ్న భోజనం అందించడం వల్లే ఇలా జరిగిందని విద్యార్థులు ఆరోపించారు. అనంతరం జెడ్పీ చైర్పర్సన్ పెద్దపల్లి పద్మావతి, డీఈఓ గోవిందరాజులు అక్కడికి చేరుకుని విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఈ ఘటనపై విచారణ జరిపి త్వరలోనే బాధ్యులపై చర్య తీసుకుంటామన్నారు. దీనిపై హెచ్ఎం శ్రీనివాసులును వివరణ కోరగా రోజూలాగే వంట ఏజెన్సీ మహిళలు తయారుచేసిన వంకాయ కూరతో కూడిన మధ్యాహ్న భోజనం అందించామన్నారు. ఈ కూరలో ఏమైనా కలిసి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. నాసిరకం భోజనమే కారణమా..? విద్యార్థుల అస్వస్థతకు నాసిరకం మధ్యాహ్న భోజనమే కారణమని స్థానికులు ఆరోపించారు. మండలంలోని చంద్రకల్ ఉన్నత పాఠశాలలో గురువారం కలుషిత మధ్యాహ్న భోజనం చేసిన విద్యార్థుల్లో 44మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూలో చేర్పించారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు. పరామర్శించిన నేతలు విషయం తెలుసుకున్న జిల్లా జెడ్పీచర్మన్ పెద్దపల్లి పద్మావతి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీపీ సూర్యప్రతాప్ గౌడ్, జిల్లా గ్రంధాలయాల సంస్థ చైర్మన్ విష్ణు తదితరులు ఆసుపత్రికి చేరుకుని విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యపరిస్థితి విషమించిన విద్యార్థులకు మైరుగైన వైద్యం అందించాలని కోరారు. విచారణకు ఆదేశించిన కలెక్టర్ చంద్రకల్ ఉన్నత పాఠశాలలో కలుషిత మధ్యాహ్న భోజనం చేసి అస్వస్థతకు గురైన విద్యార్థులను ఆసుపత్రిలో కలెక్టర్ ఈ.శ్రీధర్ పరామర్శించారు. వారితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక అందించాలని డీఈఓను ఆదేశించారు. -
కళాపిపాసి..విభిన్న రంగాల్లో రాణిస్తున్న వెంకటేష్
సాక్షి, కొల్లాపూర్: రంగస్థల నటనలో అభినయం, పాటలు పాడటంలో ప్రతిభ, శాస్త్రీయ నృత్య ప్రదర్శనలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు కొల్లాపూర్‌కు చెందిన వెంకటేష్. వృత్తిరీత్యా స్థానిక ప్రభుత్వ సివిల్ ఆస్పత్రిలో ఫార్మాసిస్టుగా పనిచేస్తూనే కళలపై తనకున్న మక్కువను ప్రదర్శిస్తున్నాడు. ఆయన ప్రతిభకు పలు అవార్డులు, ప్రశంసలు దక్కాయి. కొల్లాపూర్‌లో సాంస్కృతిక ప్రదర్శనల నిర్వహణలో తప్పనిసరిగా వెంకటేష్ పాత్ర ఉంటుంది. 20 ఏళ్లుగా కళాకారుడిగా.. నటన పట్ల తనకున్న మక్కువతో వెంకటేష్ రంగస్థల నాటకాలు వేయడంలో శిక్షణ పొందాడు. వెంకటేష్ నాటకరంగంలోకి ప్రవేశించాక తన సహచరులతో కలిసి శృతిలయ కల్చరల్ అకాడమీని స్థాపించారు. అకాడమీ ద్వారా ఎంతోమందికి నాటకాలపై శిక్షణ ఇచ్చారు. చిన్నారులకు కూచిపూడి, భరతనాట్యం నేర్పించారు. పాటలు పాడటంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. నియోజకవర్గంలో చాలామంది నాటకరంగ కళాకారులు శృతిలయ అకాడమీ ద్వారానే సమాజానికి పరిచయమయ్యారు. అకాడమీ ఏర్పాటు చేసి, నాటకరంగ శిక్షణ ఇవ్వడం వంటి కార్యక్రమాలకు శృతిలయ అకాడమీనే శ్రీకారం చుట్టింది. శృతిలయ కల్చరల్ అకాడమీ పేరుతో వందలాది నాటక ప్రదర్శనలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లో ప్రదర్శనలు శృతిలయ అకాడమీ ద్వారా 20 సంవత్సరాలుగా నియోజకవర్గంలో నాటక ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. కొల్లాపూర్‌లో నిర్వహించే సంబరాలు, కృష్ణానది పుష్కరాలు, పర్వదినాలు, జాతరల్లో నాటకాలు ప్రదర్శించారు. వెంకటేష్ ప్రతిభను గుర్తించి మహారాష్ట్రలోని కొల్హాపూర్ నాటకరంగం, వారణాసి, మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ నాటకరంగం వారు ఏకపాత్రాభినయ ప్రదర్శనలకు ఆహా్వనించారు. వీటితోపాటు రవీంద్రభారతి, త్యాగరాయగానసభ, సుందరయ్య విజ్ఞానకేంద్రం, విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రదర్శనలు ఇచ్చారు. బాలనాగమ్మ, సత్యహరిశ్చంద్ర, విప్రనారాయణ, శ్రీరామాంజనేయ యుద్ధం, భక్త చింతామణి, వేంకటేశ్వర మహాత్యం, మహాభారత సన్నివేశాలు ఇలా ఎన్నో రకాల నాటకాలను వెంకటేష్ నేతృత్వంలోని బృందం ప్రదర్శించి ప్రశంసలు అందుకుంది. నాటకం వేసే సమయంలో ఆయన హావాభావాలు, పద్యవచనాలు ఆహుతులను ఆకట్టుకుంటాయి. సత్యహరిశ్చంద్ర పౌరాణిక నాటకంలో హరిశ్చంద్ర పాత్రను వందసార్లు, భక్త చింతామణి నాటకంలో భవానీ శంకర్ పాత్రను 60 సార్లు, శ్రీకృష్ణ రాయభారం నాటకంలో శ్రీకృష్ణుని పాత్రను 35 సార్లకుపైగా పోషించాడు. అవార్డులు.. ప్రశంసలు కళారంగంలో విశిష్ట సేవలు అందిస్తున్నందుకు గాను అక్టోబర్‌లో వెంకటేష్ చెన్నైలోని గ్లోబల్ పీస్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. నవంబర్‌లో అదే యూనివర్సిటీ నుంచి భారత కళారత్న అవార్డు వరించింది. వీటితోపాటు నార్త్ ఢిల్లీ కల్చరల్ అకాడమీ నుంచి ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ అధికార ప్రతినిధి వేణుగోపాలచారి, రిటైర్డ్ హైకోర్టు జడ్జిలచే అవార్డులు స్వీకరించారు. తెలంగాణ సంగీత, నాటక అకాడమీ చైర్మన్ శివకుమార్‌చే రాష్ట్రస్థాయి అవార్డు, డాక్టర్ సి.నారాయణరెడ్డి, గుమ్మడి గోపాలకృష్ణ వంటి వారితోపాటు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులచే అవార్డులు, సత్కారాలు అందుకున్నారు. ముందు తరాలకు అందిస్తా.. ప్రస్తుత సమాజంలో సంప్రదాయ కళలకు సరైన ప్రాధాన్యం లేదు. పాశ్చాత్య పోకడల వైపు యువత వెళ్తున్నారు. సంప్రదాయ కళలైన శాస్త్రీయ సంగీతం, లలిత కళలు, నాటకరంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. వీటిని ముందు తరాలకు అందించాలనే సంకల్పంతోనే శృతిలయ కల్చరల్ అకాడమీ స్థాపించి శిక్షణ ఇస్తున్నా. సంప్రదాయ కళాకారులకు ప్రభుత్వంతోపాటు సమాజంలోని ప్రతి ఒక్కరూ తగిన సహకారం ఇవ్వాలి. – వెంకటేష్, కళాకారుడు -
విధి చిన్నచూపు..
సాక్షి, మహబూబ్‌నగర్ క్రైం: తొమ్మిది నెలల పాటు బిడ్డను మోసింది.. ఇక చివరి క్షణాల్లో కాన్పు అయి బిడ్డను కళ్లరా చూసుకోవాలని తపించింది. కానీ విధి అనుకోవాలో.. వైద్యుల నుంచి సరైన చికిత్స అందకపోవడమో కానీ ఒకే రోజు తల్లి, బిడ్డ మృతి చెందారు. ఈ ఘటన పాలమూరులో అందరిని కలిచివేసింది. రెండో కాన్పు కోసం జిల్లా జనరల్ ఆస్పత్రిలో ఆడ్మిట్ అయ్యింది ఓ గర్భిణి. నార్మల్ కాన్పు ద్వారా ఆడ శిశువుకు జన్మనిచ్చింది. శిశువు ఆరోగ్యంగా లేదని హైదరాబాద్ రెఫర్ చేశారు. అయితే గురువారం జనరల్ ఆస్పత్రిలో తల్లి..నిలోఫర్ ఆస్పత్రిలో శిశువు మృతి చెందారు. దీంతో కుటుంబానికి తీరాని శోకం మిగిలింది. రెండో కాన్పు కోసం ఆస్పత్రికి... జడ్చర్ల పట్టణ కేంద్రంలోని పాతబజార్‌కు చెందిన యాదమ్మ కాన్పు కోసం రెండు రోజుల కిందట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఆడ్మిట్ అయ్యింది. బుధవారం సాయంత్రం నొప్పులు రావడంతో ఆమెకు లెబర్ రూంలో నార్మల్ డెలవరీ చేయడం జరిగింది. పుట్టిన శిశువు ఆరోగ్యంగా లేదని వైద్యులు హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆస్పత్రికి రెఫర్ చేయడం వల్ల అక్కడి తీసుకువెళ్లారు. ప్రసవం అయిన తర్వాత యాదమ్మ గర్భసంచి ముడుచుకోవాలి కానీ అలాకాక రక్తస్రావం ఆగలేదు. అర్ధరాత్రి తర్వాత మళ్లీ సర్జరీ చేసి ఆమె గర్భసంచి తొలగించారు. అయినా ఆమె తీవ్ర రక్తస్రావం కావడం జరిగింది. ఆరు ఫ్యాకెట్ల బ్లడ్‌ను ఎక్కించిన కూడా ఫలితం లేకుండా రక్తం వెళ్లడంతో గురువారం ఉదయం యాదమ్మ మృతి చెందింది. ఇక్కడ తల్లి యాదమ్మ మృతిచెందిన కొంత సమయానికి నిలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నవజాత ఆడ శిశువు కూడా మృతి చెందింది. తల్లీ, బిడ్డ ఒకేరోజు మృతి చెందడంతో ఆ ఇంట్లో విషాదఛాయాలు అలముకున్నాయి. బాలింత యాదమ్మ మృతిపై జనరల్‌ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామకిషన్‌ను వివరణ కోరగా అధిక రక్తస్రావం అవుతుంటే వైద్యులు ప్రయత్నించారని, అయినా కంట్రోల్ కాలేదని, సర్జరీ చేసి గర్భసంచి తొలగించారన్నారు. కానీ చివరి దశలో కూడా రక్తస్రావం ఆగకపోవడం వల్ల మృతి చెందిందని వివరించారు. ఆస్పత్రి వర్గాల హడావుడి జిల్లా జనరల్ ఆస్పత్రిలో బాలింత యాదమ్మ మృతిచెందగా..మృతదేహాం ఎక్కువ సేపు ఆస్పత్రి ఆవరణలో ఉంటే ఆందోళనలు చేపడతారనే ఉద్దేశ్యంతో వారిని హడావుడి చేసి త్వరగా పంపాలనే ప్రయత్నం చేశారు. నిబంధనల ప్రకారం మృతదేహాలను పార్ధీవవదేహ అంబులెన్స్‌లో తరలించాలి. కానీ వీళ్లు మాత్రం మరో అంబులెన్స్‌లో తరలించారు. -
దొంగ డ్రైవర్ దొరికాడు
సాక్షి, కొత్తకోట రూరల్: డ్రైవర్‌గా నమ్మకంగా పనిచేస్తున్నట్లు నటించి ఏకంగా రూ.35లక్షల నగదుతో పరారైన దొంగ డ్రైవర్ దొరికాడు. నగదుతో పరారైన 24 గంటల్లోనే పోలీసులు మూడు టీంలుగా విడిపోయి దొంగను పట్టుకున్నారు. కొత్తకోట సీఐ వెంకటేశ్వర్రావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వైఎస్సార్ కడప జిల్లాకు చెం దిన విషాల్, ఆశోక్ వర్ధన్‌రెడ్డి అనే ఇద్దరు వ్యాపారులు బుధవారం తమ వ్యాపారం నిమిత్తం కడప నుంచి సొంత కారులో రూ.35లక్షల నగదుతో హైదరాబాద్ బయల్దేరారు. వనపర్తి జిల్లా పెబ్బేరు సమీపంలోకి రాగానే భోజనం చేయడం కోసం ఓ దాబా దగ్గర కారు నిలిపారు. కారులో డ్రైవర్ నందుకుమార్తోపాటు విశాల్ తల్లి లక్ష్మీదేవమ్మ, తండ్రి నర్సిరెడ్డి ఉండగా భోజనం కొరకు అందరూ కారు దిగగా లక్ష్మీదేవమ్మ మాత్రం నిద్రిస్తూ ఉండిపోయింది. టైర్లో గాలికొట్టిస్తానని చెప్పి డబ్బుతో పరార్.. అయితే, ఎలాగైనా డబ్బు కొట్టేయాలనే ఉద్దేశంలో ఉన్న డ్రైవర్ నందుకుమార్ కారు టైర్లో గాలి పట్టిస్తానని చెప్పి కారుతో బయలు దేరాడు. కొత్తకోట మండలం నాటవెళ్లి సమీపంలో గల ఓ పెట్రోల్ పంప్ దగ్గర గాలి పట్టేందుకు కారును ఆపి వెనుక సీట్లో ఉన్న డబ్బు బ్యాగుతో పరారయ్యాడు. కారులోనే నిద్రిస్తున్న లక్ష్మిదేమ్మ కొంత సేపటికి లేచి కొడుకుకు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పగా సంఘటన స్థలం దగ్గరకు వచ్చి కారుతో పెబ్బేర్ పోలీస్ స్టేషన్లో వారు ఫిర్యాదు చేశారు. మూడు టీంలుగా విడిపోయి గాలింపు ఆశోక్ వర్దన్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు కొత్తకోట సీఐ వెంకటేశ్వర్రావు అదేశానుసారం మూడు టీంలుగా విడిపోయి డ్రైవర్ ఆధార్‌కార్డు, ఫోన్ నంబర్ అధారంగా గాలింపు చేపట్టారు. అధార్‌కార్డు అడ్రస్ బీదర్ ఉండటంతో అక్కడకు ఒక టీంను పంపించి వివరాలు రాబట్టారు. బీదర్‌లో పోలీసులు తనకోసం వచ్చారని తెలుసుకున్న నందుకుమార్ హైదరాబాద్ వచ్చాడు. అక్కడ సైతం తాను అద్దెకు ఉంటున్న ఇంటి దగ్గర విచారిస్తున్నారని గుర్తించి తన అక్క దగ్గరకు వెళ్లేందుకు మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లకు వెళ్తుండగా కాపుకాసిన పోలీసులు జడ్చర్ల బస్టాండ్‌లో నిందితుడిని పట్టుకొని అతని వద్ద ఉన్న రూ.30లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. దొంగను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన కొత్తకోట ఎస్ఐ సతీష్, పెబ్బేర్ ఎస్ఐ విజయ్‌కుమార్, పెద్దమందడి ఎస్ఐ విజయ్‌భాస్కర్, కానిస్టేబుల్స్ యుగంధర్‌గౌడ్, తిరుపతిరెడ్డిని సీఐ వెంకటేశ్వర్రావు అభినందించారు. నిందితుడి నుండి మిగతా డబ్బును రాబట్టేందుకు విచారించి రిమాండ్‌కు పంపుతామని సీఐ తెలిపారు. -
గురుకులాల్లో ల్యాబ్ టెక్నీషియన్ కోర్సులు
సాక్షి, అచ్చంపేట: రాష్ట్రంలోని 34 గురుకుల పాఠశాలల్లో ల్యాబ్ టెక్నీషియన్ కోర్సులను ప్రారంభించినట్లు గురుకులాల రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలుర గురుకుల పాఠశాల, కళాశాలలో రూ.1.50 కోట్లతో నిర్మించిన అదనపు గదులు, కస్తూర్భా బాలికల విద్యాలయంలో నూతనంగా నిర్మిం చిన జూనియర్ కళాశాల భవనాన్ని మంగళవారం గురుకులాల కార్యదర్శి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం గురుకులాల పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియో గం చేసుకొని విద్యార్థులు చదువుల్లో రాణించాలని కోరారు. రాష్ట్రంలో ల్యాబ్ టెక్నిషియన్ కోర్సులతో పాటు 53 మహిళా డిగ్రీ కళాశాలలను ప్రారంభించినట్లు తెలిపారు. కస్తూర్భా విద్యాలయాల్లో ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులను మహిళా డిగ్రీ కళాశాలలకు పంపాలని ఆయన సంబంధిత విద్యాలయాల ప్రిన్స్‌పాల్స్‌ను కోరారు. రాబోయే కాలంలో గురుకులాలను సమర్థవంతంగా నిర్వహించుటకు తగు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. తల్లిదండ్రులు ఆడ పిల్లల చదువుల విషయంలో సమస్యగా మారకుండా స్వేచ్ఛగా చదువుకునేలా వాతావరణం కల్పించాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో గురుకులాల రూపు రేఖలే మారాయన్నారు. ప్రభుత్వం బడుగు, బలహీన విద్యార్థుల సంక్షేమం కోరుతూ అనేక అన్ని వర్గాల వారికి గురుకుల విద్యను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. సమస్యలను అధిగమించి ఆత్మగౌరవంతో చదువు కోవాలని, ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను హక్కుగా భావించి సద్వినియోగం చేసుకోవా లని విద్యార్థులను కోరారు. ఈ కార్యక్రమంలో డీఈఓ గోవిందరాజులు, ప్రిన్స్‌పాల్స్ నాగభూషణం, శారద, ఎంఈఓ చంద్రుడు, జెడ్పీటీసీ సభ్యు రాలు నేజమ్మ, ఎంపీపీ లింగమ్మ, స ర్పంచ్ కోనేటి తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు. -
పత్తి రైతుల కష్టం దళారుల పాలేనా?
సాక్షి, వనపర్తి : జిల్లా పత్తి రైతులు పండించిన పంట ఉత్పత్తులను మరోసారి దళారుల చేతిలో పెట్టాల్సిందేనా.. అన్న ప్రశ్నలు జిల్లాలో సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఏటా జిల్లాలో సుమారు ఎనిమిది వేల ఎకరాలకు పైచిలుకు పత్తి సాగవుతోంది. పండించిన పంటల ఉత్పత్తులను విక్రయించేందుకు వనపర్తి ప్రాంత రైతులు సుదూర ప్రయాణం చేసి జడ్చర్లలోని బాదేపల్లి మార్కెట్లో విక్రయించాలి. వ్యయప్రయాసలు ఎందుకని భావించే రైతులు స్వగ్రామంలోనే దళారులకు పత్తిని విక్రయించటం గత కొన్నేళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. వనపర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ మంత్రిగా పదవిలో ఉన్నారు. అయినా జిల్లాలో పత్తిరైతులకు మద్ధతు ధర కల్పించేందుకు సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయలేదు. ఈసారి జిల్లాలో కనీసం ఒక్కటైనా సీసీఐ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తారన్న రైతుల, వ్యవసాయ అధికారుల ఆశలపై నీళ్లు చల్లినట్లైంది. ఈ విషయం బహుశా మంత్రి నిరంజన్‌రెడ్డి దృష్టికి రాకపోయి ఉండవచ్చు. కానీ.. జిల్లాలో ఎక్కువగా పత్తిసాగు చేసే ఖిల్లాఘనపురం, పెద్దమందడి, గోపాల్పేట, వనపర్తి మండలాల పరిధిలోని రైతుల ఆశలు నీరుగారాయని చెప్పవచ్చు. సీసీఐ కొనుగోలు కేంద్రంలో పత్తి పంటను విక్రయిస్తే భారత ప్రభుత్వం ఇచ్చిన ఎంఎస్పీ (మినిమమ్ సపోర్టింగ్ ప్రైజ్) ధర క్వింటా రూ.5,550 తప్పక లభిస్తుంది. ఇదివరకు అడిగేవారులేక ప్రస్తుత వనపర్తి జిల్లా పరిధిలో కనీసం ఒక్కసారికూడా సీసీఐ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయలేదు. రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ మంత్రి సొంత జిల్లాలో ఈసారైనా సీసీఐ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తారనే ఆశ ఉండేది. దళారుల చేతుల్లో రైతు చిత్తు జిల్లాలో పత్తి సాగు చేస్తున్న రైతులు పంటల ఉత్పత్తులను వాహనాల్లో ఇతర ప్రాంతాల్లోని మార్కెట్‌కు తీసుకువెళ్లలేక గ్రామాలకు వచ్చే దళారులకే విక్రయిస్తున్నారు. వచ్చేందే రేటు.. ఇచ్చిందే మద్దతుధర అన్నట్లుగా వ్యవహారం నడుస్తుండేది. మంత్రి హయాంలో పరిస్థితి మారుతుందని రైతులు భావించారు. ఇకనైనా మంత్రి నిరంజన్‌రెడ్డి స్పందించి జిల్లాలో ఎక్కువగా పత్తిసాగు చేసే ప్రాంతంలో సీసీఐ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయిస్తే బాగుంటుందని రైతులు అభిప్రాయపడుతున్నారు. జిల్లాలో 7,295 ఎకరాల్లో పత్తిసాగు జిల్లా వ్యవసాయశాఖ అధికారుల అధికారిక లెక్కల ప్రకారం ప్రస్తుత ఖరీఫ్‌లో 7,295 ఎకరాల్లో పత్తిసాగు చేశారు. జిల్లాలో 14 మండలాలు ఉండగా వనపర్తి నియోజకవర్గం పరిధిలోని ఖిల్లాఘనపురం, పెద్దమందడి, గోపాల్పేట, వనపర్తి మండలాల్లోనే ఎక్కువగా పత్తి సాగు చేసినట్లు అధికారులు వెల్లడించారు. మిగతా మండలాల్లో కొంతమేర సాగయినట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఖరీఫ్‌లో జిల్లా సాధారణ పత్తిసాగు విస్తీర్ణం 8,315 ఎకరాలు కాగా 7,295 ఎకరాల్లో పత్తిసాగు చేశారు. గత ఏడాది 6,795, అంతకుముందు ఏడాది ఖరీఫ్‌లో 10,950 ఎకరాల్లో సాగు చేశారు. మార్కెటింగ్ సౌకర్యం సక్రమంగా ఉంటే జిల్లాలో పత్తిసాగు మరింత పెరిగే అవకాశం ఉంది. వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏటా విరివిగా జిల్లాలో ఏర్పాటు చేస్తున్న కారణంగా ఏటేటా జిల్లాలో వరిసాగు విస్తీర్ణం పెరుగుతోందని చెప్పవచ్చు. సీసీఐ కొనుగోలు కేంద్రాలకు కసరత్తు కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా.. అధికారులు ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14 పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు కసరత్తు ప్రారంభించారు. జిల్లా నుంచి మార్కెటింగ్‌శాఖ అధికారులు ప్రతిపాదనలు పంపించినా వనపర్తి జిల్లాలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. పత్తి రైతులకు మరోసారి విక్రయాల అవస్థలు తప్పేలాలేవు. కేంద్రం ఏర్పాటు చేయాలి మంత్రి చొరవతో ఈసారి పత్తిసాగు ఎక్కువగా చేసే మా ప్రాంతంలో సీసీఐ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి. ఏటా పండించిన పత్తిని మార్కెట్‌కు తీసుకువెళ్లలేక గ్రామాలకే వచ్చి కొనుగోలు చేసే దళారులకు విక్రయించేది. మా ప్రాంతంలో సీసీఐ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తే ప్రభుత్వం ఇచ్చే మద్ధతు ధరకే రైతులమంతా పత్తిని విక్రయించుకుంటాం. – శేఖర్‌గౌడ్, రైతు, అప్పారెడ్డిపల్లి, ఖిల్లాఘనపురం మండలం ప్రతిపాదనలు పంపించాం జిల్లాలో సీసీఐ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపించాము. సీసీఐ కొనుగోలు కేంద్రాలు మార్కెట్ యార్డులోగానీ, జిన్నింగ్ మిల్లులులోగానీ ఏర్పాటు చేస్తారు. వనపర్తి జిల్లా పరిధిలో నేషనల్ హైవే 44పై ఒక్కటే ఉంది. ఇప్పటివరకు జిల్లాలోని నాలుగు మార్కెట్ యార్డులలో ఎక్కడా విక్రయానికి పత్తి రాలేదు. – స్వరణ్‌సింగ్, డీఎం, మార్కెటింగ్, వనపర్తి జిల్లా -
సాగునీటి ప్రాజెక్టుల్లో పెరిగిన విద్యుత్ బకాయిలు
సాక్షి, మహబూబ్‌నగర్: పాలమూరు సాగునీటి పథకాలకు అసలే అరకొర కేటాయింపులు ఉండడంతో విద్యుత్ బిల్లుల చెల్లింపుకు జాప్యం జరుగుతోంది. అయితే ప్రతిసారి బడ్జెట్లో మంజూరైన నిధుల్లో పనులు, పునరావాసం, విద్యుత్ బిల్లుల చెల్లింపు, ఇతరాత్ర ఖర్చులు ఇలా అన్ని కేటగిరీలకు అవసరం మేరకు కేటాయిస్తారు. ఇందులో విద్యుత్ బిల్లుల కోసం కేటాయించిన నిధుల్లోనూ భారీగా కోత విధించి కనీసం పదిశాతం కూడా చెల్లించకపోవడంతో బిల్లులు ప్రతినెలా గుట్టల్లా పేరుకుపోతున్నాయి. దీంతో ఆ భారం విద్యుత్ సంస్థకు గుదిబండగా మారింది. ప్రస్తుతం ఐదు ఎత్తిపోతల పథకాలకు సంబంధించి రూ.1,641.57 కోట్ల మేర విద్యుత్ బకాయిలు ఉండడంతో ఏం చేయాలో తోచని పరిస్థితిలో అధికారులు ఉన్నారు. ఇలాంటి బిల్లుల పెండింగ్ ఇతర రంగాలకు చెందినవి అయితే వాటికి విద్యుత్ సరఫరా నిలిపేసే పరిస్థితి ఉండేది. కానీ రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి రంగానికి ప్రాజెక్టులకు పెద్దపీట వేస్తోన్న నేపథ్యంలో ఎత్తిపోతల పథకాల నిర్వహణకు విద్యుత్ సరఫరా నిలిపేసే ప్రసక్తే లేకుండా పోయింది. ఇదీలా ఉంటే కనీసం బడ్జెట్లో జరిగిన కేటాయింపుల మేరకైనా బిల్లులు చెల్లిస్తే అంత సమస్య ఉండదని విద్యుత్ అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకాల బిల్లుల చెల్లింపులు సంబంధిత శాఖ ద్వారా నేరుగా ట్రాన్స్‌కోకు ఉండడంతో తమకు సంబంధం లేదని చెబుతున్నారు. భారీ మోటార్లు.. బిల్లులు తడిసిమోపెడు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ నిర్వహణ కోసం ప్రభుత్వం 30మెగావాట్లతో కూడిన 15మోటార్లు ఏర్పాటు చేసింది. నెట్టెంపాడు ఎత్తిపోతలకు 17 మెగావాట్లతో కూడిన ఏడు మోటార్లు నడుస్తున్నాయి. భీమా 1,2 ఎత్తిపోతలకు సంబంధించి రెండు చోట్లా 12మెగావాట్లతో కూడిన మూడు మోటార్లు, నాలుగు మెగావాట్లతో కూడిన మూడు మోటార్లు పని చేస్తున్నాయి. కోయిల్‌సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్‌కు సంబంధించి ఐదు మెగావాట్లతో కూడిన నాలుగు మోటార్లు పని చేస్తున్నాయి. మోటార్లన్నీ భారీగా ఉండడంతో పంపులు పని చేసే సమయాన్ని బట్టి నెలకు కనిష్టంగా రూ.50లక్షలు గరిష్టంగా రూ.2కోట్ల వరకు విద్యుత్ బిల్లులు వస్తున్నాయి. రూ.328.21బడ్జెట్లో రూ.6.32 కోట్లే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న నాలుగు లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల నిర్వహణకు రూ.328.21కోట్ల కేటాయింపు జరిగింది. అందులో రూ.97.97 కోట్లతో విద్యుత్ బకాయిలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ గత నెలాఖరు వరకు కేవలం రూ. 6.32 కోట్లు మాత్రమే విద్యుత్ బిల్లులు చెల్లించారు. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఓటాన్ అకౌంట్లో రూ. 67.74 కోట్లు కేటాయించగా.. రూ. 18.01 కోట్లు విద్యుత్ బిల్లుల కోసం కేటాయించారు. కానీ అందులో నయాపైసా కూడా విద్యుత్ బిల్లుల కోసం ఖర్చు చేయలేదు. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్‌కు రూ.146 కోట్ల కేటాయించగా... అందులో రూ.69.89 కోట్లు విద్యుత్ బకాయిలకు కేటాయించారు. అయినా అందులో నయాపైసా కూడా బిల్లులు చెల్లించలేదు. దీంతో పాత బకాయిలతో కలిపి మొత్తం రూ. 1433.06 కోట్ల మేర విద్యుత్ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. రాజీవ్ భీమా లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి రూ.64.31 కోట్లు కేటాయించగా... రూ. 6.32 కోట్ల విద్యుత్ బిల్లులు చెల్లించారు. పాత బకాయిలతో కలిపి రూ. 104.70కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. కోయిల్‌సాగర్ పథకానికి సంబంధించి ఓటాన్ అకౌంట్లో రూ. 50.16 కోట్లు కేటాయించగా.. విద్యుత్ బిల్లుల కోసం రూ. 1.29 కేటాయించారు. కానీ అందులో ఒక్కరూపాయి కూడా విద్యుత్ బిల్లులు చెల్లించలేదు. ఇదీలావుంటే.. ఈ నెల 9న ప్రవేశపెట్టిన పూర్తి బడ్జెట్లో ఎత్తిపోతల పథకాలకు కేవలం రూ. 79 కోట్లు మాత్రమే కేటాయించారు. ఈ కేటాయింపులు నిర్మాణ పనుల పెండింగ్ బిల్లులకే సరిపోని పరిస్థితి నెలకొంది. దీంతో నయాపైసా కూడా విద్యుత్ బిల్లుల కోసం చెల్లించలే ని పరిస్థితిలో అధికారులు ఉన్నారు. నిధుల సమస్య ఉంది జిల్లాలో ఎత్తిపోతల పథకాల నిర్వహణకు సంబం ధించిన విద్యుత్ బకాయిలు చెల్లించాలంటే అవసరం మేరకు నిధుల కేటాయింపులు లేవు. పథకాల వారీగా మంజూరైన నిధుల్లో నిర్మాణ పనులు, పునరావాసం, విద్యుత్ బకాయిలు, ఇతరాత్ర ఖర్చుల విభజన చేసుకుని వాటిలో ఏది ఎంత అవసరమో గుర్తించి అందులో ఖర్చు చేస్తాం. విద్యుత్ బిల్లులకు అరకొర కేటాయింపులు ఉండడంతోనే చెల్లింపుకు జాప్యం జరుగుతోంది. – ఖగేందర్, సీఈ -
భార్య కాపురానికి రాలేదని.. ఆత్మహత్యాయత్నం
సాక్షి, నాగర్‌కర్నూల్: గొంతు కోసుకుని యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన నాగర్ కర్నూలు పోలీస్‌స్టేషన్ ఎదుట చోటుచేసుకుంది. బిజినపల్లి మండలానికి చెందిన నిజామ్..తన భార్య కాపురానికి రావడం లేదని నాగర్‌కర్నూలు పోలీస్‌స్టేషన్‌కు వచ్చాడు. అయితే బిజినపల్లి పోలీస్‌స్టేషన్‌కు వెళ్ళి ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు. పోలీసులు చెప్పినా వినకుండా.. మద్యం మత్తులో ఉన్నఆ వ్యక్తి గొంతు కోసుకున్నాడు. బాధితుడిని పోలీసులు నాగర్‌కర్నూలు జిల్లా ఆసుప్రతికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. -
చికిత్సపొందుతూ పంచాయతీకార్యదర్శి మృతి
నాగర్‌కర్నూల్: పని ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యకు యత్నించిన జూనియర్ పంచాయతీ కార్యదర్శి స్రవంతి చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి నిమ్స్‌లో మృతి చెందింది. నాగర్‌కర్నూల్ పట్టణానికి చెందిన స్రవంతి గుమ్మకొండలో పంచాయతీకార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నక్రమంలో గురువారం మధ్యాహ్నం కార్యాలయంలోనే పురుగుమందు తాగిన విషయం తెలిసిందే. స్రవంతి భర్త 8 నెలల క్రితం నాగర్‌కర్నూల్‌లో జరిగిన రోడ్డుప్రమాదంలో మృతిచెందాడు. ఆమెకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు -
గ్రామపంచాయతీ కార్యదర్శి ఆత్మహత్యాయత్నం
నాగర్‌కర్నూల్/జడ్చర్ల టౌన్: పనిఒత్తిడి తట్టుకోలేక జూనియర్ పంచాయతీ కార్యదర్శులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం చిన్నపల్లి గ్రామ జూనియర్ కార్యదర్శి ప్రత్యూష ఉద్యోగానికి రాజీనామా చేయగా, గురువారం నాగర్‌కర్నూలు జిల్లా తిమ్మా జిపేట మండలం గుమ్మకొండ జూని యర్ కార్యదర్శి స్రవంతి ఆత్మహత్యకు యత్నించింది. ‘30 రోజుల ప్రణాళిక’లో భాగంగా గురువారం తిమ్మాజిపేట మండలం గుమ్మకొండలో బడ్జెట్‌పై గ్రామసభ నిర్వహించారు. సభ ముగిశాక స్రవంతి కార్యాలయంలోనే పురుగుల మందు తాగింది. వెంటనే స్థానికులు స్రవంతిని తిమ్మాజిపేట ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు తరలించారు. స్రవంతి స్వస్థలం నాగర్‌కర్నూల్. ఆమెకు ఇద్దరు పిల్లలు. భర్త ఏడు నెలల క్రితమే రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. -
పీయూకు నిధుల కేటాయింపు అరకొరే
సాక్షి, మహబూబ్‌నగర్ : ప్రస్తుతం పాలమూరు యూనివర్సిటీ పరిధిలో వివిధ అభివృద్ది పనులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా కొత్త భవనాల నిర్మాణం, సదుపాయాల కల్పన, కొత్త కోర్సుల ఏర్పాట్లు, పీజీ కళాశాలలు, హాస్టళ్ల నిర్మాణానికి నిధులు అవసరం. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ పనులకు రూపాయైనా కేటాయించలేదు. కేవలం శాశ్వత ప్రతిపాదికన పనిచేస్తున్న సిబ్బందికి వేతనాలు ఇచ్చేందుకు మాత్రమే రూ.6.63 కోట్లు మంజూరు చేసింది. కాగా తాత్కాలిక పద్ధతిన పనిచేస్తున్న వారికి వేతనాలను పీయూకి వచ్చే ఆర్థిక వనరుల నుంచి ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. రూ.119 కోట్లతో ప్రతిపాదనలు వివిధ అభివృద్ధి పనులు, సిబ్బంది వేతనాలను దృష్టిలో ఉంచుకుని పీయూ అధికారులు మొత్తం రూ.119 కోట్లు కావాలని రాష్ట్ర ప్రభుత్వానాకి గతంలోనే ప్రతిపాదనలు పంపించారు. ఇందులో రూ.85 కోట్లు పీయూతో పాటు అనుబంధ పీజీ సెంటర్లలో కొనసాగుతున్న పనులకు కావాలని విన్నవించారు. మిగతా రూ.25 కోట్లు పీయూలో పనిచేస్తున్న సిబ్బంది వేతనాలకు అవసరమని పేర్కొన్నారు. అయితే ప్రస్తుత బడ్జెట్లో రూ.6.63 కోట్లను మాత్రమే కేటాయించింది. వచ్చే ఆరు నెలల వరకు కొత్త పనులు ప్రారంభించేందుకు అవకాశం లేకుండా పోయింది. అంతేగాక గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో కేటాయించిన బడ్జెట్లో పూర్తిస్థాయిలో నిధులను ఇంకా విడుదల చేయలేదు. దీంతో వివిధ అభివృద్ధి పనుల అంచనాలు తలకిందులయ్యాయి. అంతేగాక గత ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించిన పలు పనులు పూర్తికాని పరిస్థితి నెలకొంది. అభివృద్ధి ప్రశ్నార్థకమే.. పాలమూరు యూనివర్సిటీకి రాష్ట్ర ప్రభుత్వం ఏటా నిధులను క్రమంగా తగ్గిస్తూ వస్తోంది. చివరకు అభివృద్ధి పనులు ప్రశ్నార్థకంగా మారాయి. రెండేళ్ల నుంచి పరీక్షల విభాగం భవనం, వీసీ రెసిడెన్సీ, గెస్టుహౌస్ నిర్మిస్తున్నారు. వీటి కోసం రూ.17 కోట్లు కేటాయించినా అందులో ఇంకా నిధులు రావాల్సి ఉంది. ఇక పీయూలో చదువుతున్న బాలికలకు కేవలం ఒకే హాస్టల్ మాత్రమే ఉంది. విద్యార్థుల సంఖ్యను అనుగుణంగా మరోటి నిర్మించాలని, విద్యార్థులకు ప్రత్యేక ఆస్పత్రి, మరిన్ని కోర్సులు ప్రారంభించాలంటే కొత్త కళాశాలల భవనాలు అవసరం. గద్వాల, కొల్లాపూర్ జీపీ సెంటర్లను బలోపేతం చేసేందుకు ఎక్కడిక్కడ శాశ్వత భవనాలు నిర్మించాలని గ తంలో అధికారులు రూ.ఎనిమిది కోట్లతో ప్రతి పాదనలు చేశారు. ముఖ్యంగా కళాశాల భవనాలు, బాలబాలికలకు ప్రత్యేక హాస్టళ్లు అవసరం. ఈ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. నిధులు వస్తేనే అభివృద్ధి సాధ్యం మిగతా యూనివర్సిటీలతో పోల్చితే పీయూకు ఆదాయ వనరులు తక్కువ. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలంటే వసతుల కల్పన చాలా ముఖ్యం. అందుకు మరిన్ని నిధులు కేటాయిస్తేనే త్వరితగతిన అభివృద్ధి పనులు పూర్తవుతాయి. – కుమారస్వామి, పీయూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ అంతర్గత నిధులు కేటాయిస్తాం రాష్ట్ర బడ్జెట్లో కొత్త యూనివర్సిటీలకు నిధులు తక్కువ కేటాయించడంతో భవనాల నిర్మాణం, కొత్త కోర్సుల ఏర్పాటు, ఇతర వసతుల కల్పనపై ప్రభావం పడుతుంది. విద్యార్థులకు క్వాలిటీ, ఇన్నోవేటివ్ విద్య, న్యాక్‌లో ఉన్నతమైన గ్రేడింగ్ కోసం వసతులు కల్పించడం చాలా అవసరం. కొత్త యూనివర్సిటీల అభివృద్ధికి ప్రత్యేక గ్రాంట్ ఇవ్వాలి. ప్రస్తుతం కొనసాగుతున్న పనులకు పీయూ అంతర్గత నిధులు కేటాయిస్తాం. – పిండి పవన్‌కుమార్, పీయూ రిజిస్ట్రార్ -
పంచాయతీలపైనే భారం
సాక్షి, అచ్చంపేట: హరితహార కార్యక్రమం ప్రజాప్రతినిధులకు పెద్ద పరీక్షగా మారింది.. నిర్దేశిత లక్ష్యం మేరకు మొక్కలు నాటించడం వారికి తలనొప్పిగా పరిణమించింది.. ఐదో విడత హరితహారం కార్యక్రమంలో ప్రభుత్వ శాఖలు పూర్తిస్థాయిలో భాగస్వామ్యం కాకపోవడంతో గ్రామ పంచాయతీలపైనే భారం పడింది.. దీంతో లక్ష్యానికి అనుగుణంగా మొక్కలను నాటించడం తమకు తలకు మించిన భారంగా మారిందని సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది వాపోతున్నారు. గతంలో హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వివిధ ప్రభుత్వ శాఖలు బాధ్యత తీసుకునేవి. దీంతో ప్రతి విడతలో జిల్లాలో లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటించారు. అయితే, ఇప్పుడు కొనసాగుతున్న ఐదో విడతలో జిల్లాలో 2.10 కోట్ల మొక్కలను నాటించాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇప్పటి వరకు 30లక్షల మొక్కలను మాత్రమే నాటించారు. మరో 1.80 కోట్ల మొక్కలు నాటాల్సి ఉంది. ప్రస్తుతం ఈ భారమంతా పంచాయతీ పాలకవర్గంపైనే పడింది. అన్నింటికీ ఒకే లక్ష్యం.. నాగర్‌కర్నూల్ జిల్లాలో 453 గ్రామ పంచాయతీలు ఉండగా, ఇందులో ఎక్కువ భూవిస్తీర్ణం ఉన్న గ్రామాలు తక్కువగా ఉన్నాయి. మిగిలిన గ్రామాలు విస్తీర్ణం పరంగా చాలా చిన్నవి. అయితే అన్ని గ్రామ పంచాయతీలకు ఒకే విధమైన లక్ష్యాన్ని నిర్దేశించడంతో సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న, పెద్ద గ్రామాలు తేడా లేకుండా 40 వేల మొక్కలను నాటాలని నిర్ధేశించారు. ఈ లెక్కన మొక్కలను నాటితే గ్రామ పంచాయతీల పరిధిలో కోటిన్నర మొక్కలు నాటే అవకాశం ఉంది. మిగిలిన మొక్కలను మున్సిపాలిటీలు, మరికొన్ని అటవీ శాఖ భూముల్లో నాటించాలి. చిన్న గ్రామ పంచాయతీల పరిధిలో వ్యవసాయ భూమి తక్కువగానే ఉండటంతో 40 వేల చొప్పున మొక్కలను నాటడం సాధ్యం కావడం లేదు. కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం హరితహారం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంతోపాటు మొక్కలను సంరక్షించే బాధ్యత సర్పంచ్, కార్యదర్శి, వార్డు సభ్యులు, కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, సిబ్బందిపై ఉంది. కానీ, విస్తీర్ణం తక్కువగా ఉన్న చోట నిర్ధేశిత లక్ష్యం మేరకు మొక్కలు నాటడమే ఇబ్బందిగా మారింది. ఇదిలా ఉండగా ఈ ఏడాది వర్షాలు కూడా అంతంతమాత్రంగా ఉండటంతో మొక్కలు నాటడం సాధ్యం కావడం లేదు. గతంలో అన్ని శాఖలకు.. హరితహారం కార్యక్రమం తొలి నాలుగు విడతల్లో అన్ని ప్రభుత్వ శాఖలకు లక్ష్యాన్ని నిర్ణయించి ఆ మేరకు మొక్కలు నాటించారు. వ్యవసాయం, విద్య, వైద్య ఆరోగ్య శాఖ, ఎక్సైజ్, నీటి పారుదల శాఖ, ఆర్అండ్బీ, అటవీ శాఖ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, రవాణా తదితర శాఖలకు మొక్కలను నాటించే బాధ్యతను అప్పగించారు. వ్యవసాయ శాఖ ద్వారా పొలం గట్లు, వ్యవసాయ క్షేత్రాలు, నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో చెరువుల శిఖం భూముల్లో మొక్కలు నాటించారు. ఇలా అన్ని ప్రభుత్వ శాఖలను హరితహారంలో భాగస్వాములను చేయడంతో నిర్ధేశిత లక్ష్యం పూర్తయ్యింది. కానీ ఇప్పుడు పంచాయతీలపైనే భారం మోపడంతో ఆ మొక్కలను ఎలా నాటించాలో అర్థం కావడం లేదని సర్పంచ్‌లు, కార్యదర్శులు ఆందోళన చెందుతున్నారు. పంచాయతీలలో సిబ్బంది తక్కువగా ఉండటంతో లక్ష్యానికి అనుగుణంగా మొక్కలను నాటించడం ఇబ్బందిగా ఉందని చెబుతున్నారు. 4 వేల మొక్కలు నాటాం మాది జనాభా పరంగానే కాకుండా విస్తీర్ణంలోనూ చిన్న గ్రామం. రెవెన్యూ, అటవీ భూములు అసలే లేవు. అందువల్ల ఎక్కువ మొత్తంలో మొక్కలను నాటించడం ఇబ్బందిగా ఉంది. 10 నుంచి 15 వేల మొక్కలైతే సరిపోతుంది. ఇప్పటి వరకు 4 వేల మొక్కలు నాటాం. ప్రజల సహకారంతో ఇళ్ల వద్ద మొక్కలను నాటించడానికి కృషి చేస్తున్నాం. – సేవ్యానాయక్, సర్పంచ్, సీబీతండా, ఉప్పునుంతల మండలం పెద్ద బాధ్యతే.. మేం సర్పంచ్‌లుగా ఎంపికైన మొదటి సంవత్సరమే ప్రభుత్వం మాపై పెద్ద బాధ్యతను మోపింది. మాది చిన్న గ్రామమైనా లక్ష్యానికి అనుగుణంగా మొక్కలను నాటించడానికి కృషి చేస్తున్నాం. ప్రజలకు హరితహారంపై అవగాహన కల్పించి ఇళ్ల వద్ద ఎక్కువ మొక్కలను నాటించి, పెంచడానికి చర్యలు తీసుకుంటున్నాం. – జితేందర్‌రెడ్డి, సర్పంచ్, బ్రాహ్మణపల్లి, అచ్చంపేట మండలం -
అడుగడుగునా అడ్డంకులే..
సాక్షి, మహబూబ్‌నగర్: పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులకు ఎన్నో అడ్డంకులు ఎదురవుతున్నాయి. ముందుగా నార్లాపూర్ రిజర్వాయర్ పనులకు సంబంధించి అటవీ శాఖ నుంచి క్లియరెన్స్ లేదంటూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో నిధులు విడుదల కాలేదు. ఈ కారణంగా ఉమ్మడి జిల్లా పరిధిలో నిర్మిస్తున్న నార్లాపూర్, వట్టెం, కరివెన, ఉదండాపూర్ రిజర్వాయర్ల కాల్వ పనుల్లో పురోగతి ఆశించిన మేరకు కనిపించలేదు. తాజాగా నిధుల సమస్య తీరిందంటే ఆయా రిజర్వాయర్ల కింద భూములు కోల్పోయిన నిర్వాసితులు పరిహారం కోసం రోడ్డెక్కుతున్నారు. ఇన్ని చిక్కుల మధ్య గడువులోగా పనులను పూర్తి చేయడం అధికారులకు సవాల్‌గా మారింది. నిధులు మంజూరైనా.. ప్రాజెక్టుల పరిశీలనలో భాగంగా గత నెల 28న ఉమ్మడి జిల్లా పరిధిలోని మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో పర్యటించిన సీఎం కేసీఆర్ వాటి పరిధిలో నిర్మాణ దశలో ఉన్న కర్వెన, వట్టెం, నార్లాపూర్, ఏదుల రిజర్వాయర్ల పనులను పరిశీలించారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రూ.10 వేల కోట్ల రుణం మంజూరు కావడంతో ఇకపై ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టించాలని, వచ్చే ఖరీఫ్ నాటికి ఉమ్మడి జిల్లాలో 10 లక్షల ఎకరాలకు సాగునీరందించాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అధికారులూ అసంపూర్తి పనుల పూర్తితోపాటు కొత్తగా చేపట్టాల్సిన పనులపై దృష్టిసారించారు. అయితే పనులు చేపట్టాలంటే ముందుగా తమకు రావాల్సిన పరిహారం విషయాన్ని తేల్చాలంటూ భూ నిర్వాసితులు ఆందోళనకు దిగుతున్నారు. దీంతో గడువులోగా పనుల పూర్తి సంబంధిత అధికారులకు సవాల్‌గా మారింది. క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలను స్థానిక మంత్రుల ద్వారా సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఉదండాపూర్ ప్రాజెక్టు.. జడ్చర్ల మండల పరిధిలో వల్లూరు– ఉదండాపూర్ గ్రామాల పరిధిలో నిర్మిస్తున్న 15.97 టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్ పనులు ఆటంకాల మధ్య కొనసాగుతున్నాయి. రిజర్వాయర్ నిర్మాణ పనులకు సంబంధించి 5,107 ఎకరాలను సేకరించాలని గుర్తించారు. సాగునీటి సౌకర్యం కలిగిన భూములకు ఎకరానికి రూ.6.50 లక్షలు, బీడు భూములకు రూ.5.50 లక్షలు ఇవ్వాలని రేటు ఖరారు చేశారు. అందు లో భాగంగా ఉదండాపూర్ నిర్వాసితులకు 900 ఎకరాలకు ఇప్పటి వరకు రూ.65.5 కోట్ల పరిహారం అందజేశారు. మరో 480 ఎకరాలకు ఇం కా సుమారు రూ.18 కోట్ల పరిహారం ఇవ్వాల్సి ఉంది. అలాగే వల్లూరు నిర్వాసితులకు సంబంధించి 1,200 ఎకరాలకు పరిహారం ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు వంద ఎకరాలకు రూ.73 కోట్ల వరకు పరిహారం అందజేశారు. సకాలంలో అందని డబ్బులు సేకరించిన భూములకు సంబంధించి రైతులకు సకాలంలో పరిహారం డబ్బులు ఇవ్వలేదు. రైతుల ఆందోళనలు, నిరసనల అనంతరం దశల వారీగా పరిహారాన్ని అందించారు. అయితే ఎకరాకు ఇచ్చిన పరిహారానికి బహిరంగ మార్కెట్లో వంద చదరపు గజాల ప్లాటు రావడం లేదని రైతులు వాపోతున్నారు. ఇంకా చాలా మంది రైతులకు పరిహారం అందాల్సి ఉందని పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే ముంపునకు గురయ్యే వల్లూరు, ఉదండాపూర్ గ్రామాలతోపాటు వాటి పరిధిలోని ఒంటిగుడిసె తండా, తుమ్మలకుంట తండా, ర్యాగడిపట్ట తండా, చిన్నగుట్టతండాలకు సంబంధించి ఇంతవరకు పునరావాస చర్యలు చేపట్టలేదు. ఆయా గ్రామాలకు సంబంధించి ఇప్పటి వరకు కొత్తగా నిర్మించే ఇళ్లకు స్థల సేకరణ జరగలేదు. ఇటీవల ఉదండాపూర్ గ్రామానికి ఇళ్ల నిర్మాణాలకు గాను బండమీదిపల్లి గ్రామ శివారులో దాదాపు వంద ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించి చదును చేసే పనులు ప్రారంభించారు. వల్లూరుకు సంబంధించి ఇప్పటి వరకు స్థలాన్ని ఖరారు చేయలేదు. కరివెన రిజర్వాయర్ భూత్పూర్ మండలంలో చేపట్టిన ఈ రిజర్వాయర్‌కు సంబంధించి 6,676 ఎకరాలు భూమి సేకరించాల్సి ఉండగా వంద శాతం సేకరించారు. రూ.760 కోట్ల వ్యయంతో ప్రారంభమైన ఈ పనులు రూ.425 కోట్ల ఖర్చుతో దాదాపు 70 శాతం పూర్తయ్యాయి. అయితే ఈ రిజర్వాయర్ కోసం కొత్తూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని బోరోనిగుట్టతండా, కర్వెన గ్రామ పంచాయ తీలోని ఏకులగట్టు తండా, ఎల్కిచర్ల గ్రామ పంచాయతీలోని భట్టుపల్లి తండా ప్రజల వ్యవసాయ భూములతోపాటు ప్రజలు ఇళ్లు కోల్పోయారు. వీరిలో కొందరికి 123 జీఓ ప్రకారం ప్రభుత్వం ఎకరానికి రూ.3.50 లక్షల నుంచి రూ.5.50 లక్షల వరకు అందజేసింది. ఏదుల రిజర్వాయర్ రేవల్లి మండలంలో చేపట్టిన ఈ రిజర్వాయర్‌కు సంబంధించి 5,470 ఎకరాలు సేకరించాల్సి ఉండగా 5,011 ఎకరాలు సేకరించారు. మిగిలిన భూసేకరణ వివిధ దశల్లో ఉంది. రూ.664 కోట్ల వ్యయానికి గాను రూ.642 కోట్లు ఖర్చు చేసి 98 శాతం పనులను పూర్తి చేశారు. వట్టెం రిజర్వాయర్ బిజినేపల్లి మండలంలో చేపట్టిన ఈ రిజర్వాయర్‌కు 4,526 ఎకరాలు సేకరించాల్సి ఉండగా దాదాపు 4 వేలు సేకరించారు. రూ.6 వేల కోట్ల వ్యవయానికి గాను రూ.1,800 కోట్లతో 30 శాతం పనులు పూర్తి చేశారు. ఇందుకు సంబంధించి తిమ్మాజిపేట మండలంలోని పోతిరెడ్డిపల్లి, బిజినేపల్లి మండలంలోని కారుకొండతండా, అనెకాన్పల్లి, అనెకాన్పల్లితండా, రాంరెడ్డిపల్లితండా, జీగుట్టతండా వట్టెం గ్రామాల పరిధిలో 4,230 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. కాగా ఇప్పటి వరకు 3,370 ఎకరాల భూమి సేకరణ పూర్తి కాగా మరో 860 ఎకరాలు పెండింగ్‌లో ఉంది. పెండింగ్‌లో ఉన్న భూములకు సంబంధించి నిర్వాసితులకు పంటలను బట్టి రూ.3.50 లక్షల నుంచి రూ.5.50 లక్షలకు అందించింది. అయితే కొంతమంది రైతులు మాత్రం మల్లన్న సాగర్‌లో భూములు కోల్పోయిన రైతులకు ఇచ్చిన పరిహారం ప్రకారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే ప్రాజెక్టులో ఇళ్లు కోల్పోతున్న వారికి ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద రూ.25 లక్షలు, ప్రభుత్వం తరఫున డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల ప్రాజెక్టుల సందర్శనకు వచ్చిన కేసీఆర్‌కు సైతం వినతిపత్రం అందజేశారు. నార్లాపూర్ రిజర్వాయర్ కొల్లాపూర్ మండలంలో చేపట్టిన నార్లాపూర్ రిజర్వాయర్‌కు సంబంధించి మొత్తం 2,465 ఎకరాల భూమి సేకరించాల్సి ఉండగా ఇప్పటి వరకు 2,275 ఎకరాలు సేకరించారు. రూ.760 కోట్ల వ్యయానికి గాను రూ.425 కోట్లు ఖర్చు చేసి 60 శాతం పనులు పూర్తిచేశారు. రెండో ప్యాకేజీలో భాగంగా సున్నపుతండా వద్ద డిస్ట్రీబ్యూటరీ గేట్స్ ఏర్పాటు చేస్తున్నారు. అక్కడి నుంచి ఏదుల రిజర్వాయర్ వరకు కాల్వలు తవ్వుతున్నారు. ఈ కాల్వ పనులు కుడికిళ్ల గ్రామ సమీపంలో 1.5 కి.మీ మేరకు నిలిచిపోయాయి. ఈ ప్రాంతంలో 267 ఎకరాల భూమి సేకరించాల్సి ఉండగా ఇక్కడ రైతులు భూములు ఇవ్వడానికి మొదటి నుంచి ఒప్పుకోవడం లేదు. గతంలో కేఎల్ఐ ప్రాజెక్టు కాల్వల్లో తమ భూములు కోల్పోయామని, మిగిలిన భూములను రెండోసారి పాలమూరు ప్రాజెక్టు కోసం లాక్కోవడం తగదని ప్రభుత్వాన్ని కోరుతున్న వీరు మల్లన్నసాగర్ నిర్వాసితుల తరహాలో ఎకరాకు రూ.15 లక్షలు చొప్పున ఇస్తే భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామంటున్నారు. ప్రభుత్వం మాత్రం ఎకరాకు రూ.5.50 లక్షలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. ప్రభుత్వం ఇచ్చే డబ్బుతో కుడికిళ్లలో పావు ఎకరం భూమి కూడా ఇప్పుడు తాము కొనుగోలు చేయలేమని, పరిహారం పెంచితేనే భూములు ఇస్తామని రైతులు చెబుతున్నారు. పరిహారంపై స్పష్టత ఇచ్చిన తర్వాతనే సర్వేకు మా భూముల్లోకి రావాలని రైతులు గతంలో ఆందోళనలు చేపట్టారు. దీంతో రెండు రోజుల క్రితం భారీ పోలీసు బందోబస్తుతో అధికారులు భూ సేకరణ సర్వే పూర్తిచేశారు. -
దంపతుల అనుమానాస్పద మృతి
-
దంపతులు ఇద్దరూ ఒకే రీతిలో..
సాక్షి, నాగర్‌కర్నూల్ : రాత్రి భోజనం చేసి నిద్రించిన భార్యభర్తలు అకస్మాత్తుగా ఒకరి వెంట మరొకరు అనారోగ్యానికి గురి కావడం..ఆ తర్వాత ఇరువురు మృతి చెందడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంఘటన మండలంలోని మంతటిలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాలిలా.. మంతటికి చెందిన సూగూరు నారాయణ (65) సూగూరు ఈశ్వరమ్మ (50) భార్యభర్తలు. ఇరువురు సోమవారం రాత్రి ఇంట్లోనే భోజనం చేసి నిద్రించగా.. అకస్మాత్తుగా ఈశ్వరమ్మ వాంతులు, విరేచనాలతో అనారోగ్యానికి గురికాగా, గమనించిన భర్త నారాయణ తన తమ్ముడు, అన్న కొడుకు, అల్లుడికి సమాచారం అందించాడు. వారు వెంటనే అక్కడికి చేరుకుని ఈశ్వరమ్మను చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి ఆటోలో తరలిస్తుండగా మార్గమద్యలోనే మృతిచెందింది. ఆటోలో నాగర్‌కర్నూల్ చేరుకున్న తర్వాత అకస్మాత్తుగా నారాయణ సైతం వాంతులు చేసుకుని అనారోగ్యానికి గురయ్యాడు. వెంటనే అతన్ని జిల్లా ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అతని పరిస్థితి విషమంగా ఉండటంలో వైద్యులు మహబూబ్‌నగర్ జిల్లా ఆసుపత్రికి రెఫర్ చేయడంతో అక్కడికి తీసుకువెళ్లారు. అక్కడి వైద్యులు హైద్రాబాద్‌కు రెఫర్ చేయడంతో అంబులెన్స్‌లో చికిత్స కోసం తరలిస్తుండగా షాద్‌నగర్ చేరుకోగానే మృతిచెందాడు. ఇరువురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న సిఐ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్ఐ భగవంత్‌రెడ్డి జిల్లా ఆసుపత్రికి చేరుకుని మృతదేహాలను పరిశీలించి అక్కడి నుంచి మంతటిలోని మృతుల ఇంటిని పరిశీలించి రాత్రి మిగిలిన ఆహార పదార్దాలన ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపడం జరిగింది. దంపతుల మృతిపై భిన్నాభిప్రాయాలు నారాయణ, ఈశ్వరమ్మ మృతిపట్ల కుటుంబసభ్యుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మృతిపట్ల కుమారుడు సూగురు మహేష్ తన తల్లిదండ్రులు ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోయి ఉండవచ్చని ఫిర్యాదు చేశారు. కానీ మృతుల కుమార్తె మాత్రం తన తల్లిదండ్రులకు కోడలికి చాలా రోజుల నుంచి తగదాలు వున్నాయని, విషప్రయోగం జరిగి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేసింది. సంఘటనకు సంబంధించి ఎస్ఐ భగవంత్‌రెడ్డిని వివరణ కోరగా అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాలకు పోస్టుమార్టం చేసిన అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. -
ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు..
సాక్షి, నాగర్‌కర్నూల్ క్రైం : నిర్లక్ష్యంగా వాహనాలను నడిపి రోడ్డు ప్రమాదాలకు గురై.. మరణిస్తే ఆ కుటుంబంలో తీరని వేదన మిగలడంతోపాటు కుటుంబ పెద్దను కోల్పోయిన ఎన్నో కుటుంబాలు వీధిన పడుతున్నాయి. ఈ క్రమంలో జిల్లా పరిధిలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను తగ్గించడం కోసం పోలీస్, రవాణా శాఖల ఆధ్వర్యంలో పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు, వాహనాల డ్రైవర్లకు అవగాహన సదస్సులు నిర్వహించడంతోపాటు ప్రమాదాల నివారణ కోసం కలెక్టర్, ఎస్పీల ఆధ్వర్యంలో అధికారులతో తరచూ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ.. ఎప్పటికప్పుడు జిల్లాలోని ప్రమాదకరమైన రహదారులను, డేంజర్ స్పాట్లను, గుర్తించడంతోపాటు ప్రమాదాలు ఎక్కువగా చోటుచేసుకునే రహదారుల్లో నివారణ కోసం రక్షణ చర్యలు ఏర్పాటు చేస్తూ.. నిరంతరం పోలీస్ వాహనాలతో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు.. సూచిక బోర్డుల ఏర్పాటు నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగే 20 డేంజర స్పాట్లను అధికారులు గుర్తించారు. ఈ డేంజర్ స్పాట్లలో పోలీసులు, రవాణా శాఖాధికారులు తరచూ తనిఖీలు నిర్వహిస్తూ ఓవర్‌లోడ్‌తో వెళ్లే వాహనాలు, పరిమితికి మించి ప్రయాణికులను చేరవేసే ప్రైవేటు వాహనాలు, మోటారు వాహన చట్టాలను ఉల్లఘించే వాహనదారులకు అవగాహన కల్పించడంతోపాటు జరిమానాలు విధిస్తున్నారు. అధికారులు గుర్తించిన డేంజర్ స్పాట్లలో ఎక్కువగా రోడ్డు మలుపులు ఉన్న ప్రాంతాలు, శ్రీశైలం హైద్రాబాద్ ప్రధాన రహదారిలో, శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో నిత్యం ప్రమాదాలు చోటచేసుకోకుండా ఉండటం కోసం సూచిక బోర్డులు, అవసరమైన చోట్ల స్టాపర్లు ఏర్పాటు చేస్తున్నారు. తగ్గుతున్న రోడ్డు ప్రమాదాలు నాగర్‌కర్నూల్ జిల్లాగా ఆవిర్భవించిన తర్వాత ఎస్పీ కార్యాలయం, రవాణా శాఖ కార్యాలయాలను ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ఎస్పీ, జిల్లా రవాణాశాఖ అధికారిని నియమించారు. దీంతో పోలీస్, రవాణా శాఖాధికారులు రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేక దృష్టిసారించడంతో ప్రమాదాలు ఏటేటా తగ్గుముఖం పట్టాయి. 2016 సంవత్సరంలో రోడ్డు ప్రమాదాలు 136 సంభవించగా 155 మంది మృత్యువాత పడ్డారు. సాధారణ రోడ్డు ప్రమాదాలు 194 జరగగా 366 మంది గాయాలపాలయ్యారు. 2017 సంవత్సరంలో 132 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకోగా 140 మంది మృత్యువాత పడ్డారు. 356 సాధారణ రోడ్డు ప్రమాదాలు జరగగా 594 మంది గాయపడ్డారు. 2018 సంవత్సరంలో 121 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకోగా 129 మంది మృత్యువాత పడ్డారు. సాధారణ రోడ్డు ప్రమాదాలు 235 చోటుచేసుకోగా 558 మంది గాయపడ్డారు. ఈ ఏడాది రోడ్డు ప్రమాదాల సంఖ్య పదుల సంఖ్యలో నమోదనట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. జాగ్రత్తలు పాటిస్తే.. వాహనదారులు చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చు. ముఖ్యంగా తాగి వాహనాలను నడిపే వారి వల్ల, ర్యాష్ డ్రైవింగ్ వల్ల జరిగే రోడ్డు ప్రమాదాలతో భారీగా ప్రాణనష్టం జరిగే ఆస్కారం ఉంటుంది. కాబట్టి తాగి, ర్యాష్ డ్రైవింగ్ చేయకూడదు. సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ఆస్కారం ఉండటంతో సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపకూడదు. వాహనడ్రైవర్లు ఎక్కువ గంటలు వాహనాలను నడపడం వల్ల అలసిపోయి నిద్రలోకి జారుకొని అర్ధరాత్రి, తెల్లవారుజాము వరకు రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి. డ్రైవర్లు అలసిపోయే వరకు ఎక్కువ గంటలపాటు వాహనాలను నడపకూడదు. పరిమితికి మించి వాహనాల్లో ప్రయాణికులను ఎక్కించుకోకూడదు. ప్రత్యేకంగా దృష్టిసారించాం.. నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు రవాణా, పోలీస్ శాఖల ఆధ్వర్యంలో ఇప్పటికే 20 చోట్ల డేంజర్ స్పాట్లను గుర్తించాం. ఆయా చోట్ల ప్రమాదాలు చోటుచేసుకోకుండా భద్రతా చర్యలు చేపట్టాం. అలాగే మోటారువాహన చట్టాలను ఉల్లంఘించే వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. – ఎర్రిస్వామి, జిల్లా రవాణా శాఖాధికారి, నాగర్‌కర్నూల్ -
గీత దాటిన సబ్ జైలర్
సాక్షి, కల్వకుర్తి(నాగర్‌కర్నూల్) : విధుల పట్ల నిర్లక్ష్యం, అక్రమార్కులతో కుమ్మక్కు, తోటి ఉద్యోగుల పట్ల దురుసు ప్రవర్తన వెరసి కల్వకుర్తి సబ్‌జైలర్ సుధాకర్‌రెడ్డిపై వేటుకు కారణమైంది. కల్వకుర్తి సబ్ జైలర్‌గా మంథని నుంచి సుధాకర్‌రెడ్డి బదిలీపై వచ్చారు. అప్పటి నుంచి విధుల పట్ల అంటిముట్టనట్లుగా ఉన్న ఈయన సబ్‌జైలర్ నుంచి ఎస్ఐగా మారి తన పరిధి దాటి ఇసుక అక్రమార్కుల వద్ద వసూళ్లకు పాల్పడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎస్ఐ అవతారం ఎత్తి.. సబ్ జైలర్‌గా విధులు నిర్వహించాల్సిన సుధాకర్‌రెడ్డి దారితప్పి ఎస్ఐగా అవతారం ఎత్తి ఇసుక అక్రమార్కుల దగ్గర అక్రమంగా వసూళ్లకు పాల్పడుతూ దందా నిర్వహిస్తున్నారు. కొంతమంది సిబ్బందిని తన అక్రమాలకు అండగా ఉపయోగించుకుంటున్నారు. డబ్బులు ఇవ్వని ఇసుక వ్యాపారు లకు ఫోన్లు చేస్తూ, బెదిరింపులకు పాల్పడుతున్నారు. డబ్బులు ఇవ్వకపోతే ఇసుక ట్రా క్టర్లు సీజ్ చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు సబ్ జైలర్ సుధాకర్‌రెడ్డి మంథనిలో విధులు నిర్వహించిన సమయంలో అనేక ఆరోపణలు రావడంతో కల్వకుర్తికి బదిలీ చేశా రు. ఇక్కడ కూడా విధులు నిర్వహిస్తూ ఒక ఇసుక వ్యాపారిని డబ్బుల కోసం వేధించడం మొదలుపెట్టాడు. దీంతో బాధిత వ్యా పారి సబ్‌జైలర్ ఫోన్‌కాల్‌ను రికార్డు చేసి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో రెండు రోజుల క్రితం కల్వకుర్తికి వచ్చి సమగ్ర విచారణ జరిపారు. సుధాకర్‌రెడ్డిపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలడంతోపాటు విధుల పట్ల నిర్లక్ష్యాన్ని గుర్తించిన అధికారుల నివేదిక మేరకు డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిసన్స్ సస్పెన్షన్ వేటు వేస్తూ ఆదేశాలు జారీ చేయడంతోపాటు సుధాకర్‌రెడ్డిని హెడ్‌క్వార్టర్ వదిలి పోకూడదనే ఆదేశాలిచ్చారు. సబ్ జైలర్ వ్యవహారం కల్వకుర్తి ప్రాంతంలో కలకలం రేకెత్తించింది. -
జలయజ్ఞ ప్రదాత.. వైఎస్సార్
సాక్షి, నాగర్‌కర్నూల్: ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలుచేసి.. వేలాది మందికి లబ్ధిచేకూర్చిన మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి. రెతేరాజు అని నమ్మి శ్రీశైలం మిగులు కృష్ణా నీటిని ఎత్తిపోసేందుకు మహాత్మాగాంధీ కేఎల్ఐ, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకాలను జలయజ్ఞం పేరుతో చేపట్టిన సాగునీటిని తీసుకువచ్చారు. ఆయన తీసుకువచ్చిన పథకాలు నేటికీ బడుగు బలహీన వర్గాల ప్రజలుకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఆరోగ్యశ్రీ, 108, 104 ఆరోగ్య సేవలతో పాటు వృద్ధులు, వితంతువుల సామాజిక భద్రతకోసం పెన్షన్లు అందించారు. ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, అభయహస్తం, జలయజ్ఞం, ఫీజురీయింబర్స్‌మెంట్, భూపంపిణీ, మహిళలకు పావళా వడ్డీకే రుణాలు వంటి ఎన్నో సంక్షేమ పథకాలు పేదలపాలిట వరంలా మారాయి. ఏదో ఒక రూపంలో ప్రతి ఒక్కరికీ ఆయన తీసుకువచ్చిన పథకాలు లబ్ధిని చేకూర్చాయి. నేడు ఆయన ప్రజల మద్యలో లేకపోయినా వారి మదిలో చిరస్థాయిగా నిలిచేలా పథకాలను రూపొందించారాయన. జిల్లా ప్రజలు ఎన్నటికీ మరువరు.. జిల్లా వాసులు ఆయనను ఎన్నటికీ మరువలేరు. జలయజ్ఞంలో భాగంగా రూ.2.813కోట్లుతో నల్లగొండ జిల్లాకు 3లక్షల ఎకరాలకు నీళ్లు అందించే ఎస్ఎల్బీసి టన్నెల్ బోరింగ్ మిషన్ ప్రారంభించి ఈప్రాంత వాసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. మరో భారీనీటిపారుదల పథకం కల్వకుర్తి ఎత్తిపోతల. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2005లో జలయజ్ఞంలో భాగంగా కొల్లాపూర్ మండలం ఎల్లూర్ గ్రామ పంచాయతీ రేగుమాన్ గడ్డ ప్రాంతంలో శ్రీశైలం మిగులు కృష్ణా నీటిని 3.40లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు 25టీఎంసీల నీటి కేటాయింపు చేస్తూ రూ.2.990కోట్ల వ్యయంతో పనులు ప్రారంభించారు. ల్లాపూర్ నియోజకవర్గానికి వైఎస్.రాజశేఖరరెడ్డి పలుమార్లు వచ్చారు. 2004 నియోజకవర్గానికి వచ్చి ఎంజీఎల్‌ఐ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.2,995కోట్లను కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. సింగోటం శ్రీవారిసముద్రాన్ని మినీ రిజర్వాయర్‌గా మారుస్తామని ప్రకటించారు. అక్కడే కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పేరును మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకంగా మారుస్తున్నట్లు అధికారిక ప్రకటన చేశారు. 2009 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఐదోసారి కొల్లాపూర్‌లో పర్యటించి రూ.110కోట్ల వ్యయంతో సోమశిల–సిద్దేశ్వరం వంతెనకు, రూ.85కోట్ల వ్యయంతో కల్వకుర్తినుంచి నంద్యాల వరకు డబుల్‌లైన్ రహదారి పనులకోసం పైలాన్లను ఆవిష్కరించారు. ఆరోగ్యశ్రీ ఆదుకుంది ఉమ్మడి పాలమూరు జిల్లాలో 1,88,896మంది రోగులు లబ్ధి ఆరోగ్య శ్రీ పేదలకు సంజీవని..ఉమ్మడి జిల్లాలో మాత్రం ఎంతో మంది పేదలకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఖరీదైన చికిత్సలు పొందారు. విలువైన వైద్యం చేయించుకోలేని సామాన్యులకు సైతం ఆరోగ్య శ్రీ ద్వారా కార్పోరేట్ స్థాయిలో వైద్యం చేసుకోవడానికి అవకాశం కల్పించిన మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి. పేద ప్రజల కోసం అమలు చేసిన ఆరోగ్య శ్రీ పథకం వల్ల ఎంతో మంది వైద్యం చేయించుకోవడం జరిగింది. ఉమ్మడి జిల్లాలో ఆరోగ్య శ్రీ పథకం 2007లో ఐదు ఆస్పత్రుల్లో ప్రారంభం చేయడం జరిగింది. ఆరోగ్య శ్రీ పథకం కింద 948రకాల చికిత్సలు చేసుకోవడానికి వీలు కల్పించారు. ఉమ్మడి జిల్లాలో 2007 నుంచి 2017వరకు 1,88,896మంది రోగులు ఆరోగ్య శ్రీ కింద వివిధ రకాల చికిత్సలు చేసుకోవడం జరిగింది. దీనికోసం ప్రభుత్వాలు ఆయా ఆస్పత్రులకు ఈ 11ఏళ్ల కాలంలో రూ.49కోట్ల 74లక్షలు చెల్లించడం జరిగింది. 108వాహనాలతో వైద్య సేవలు కుయ్..కుయ్ మంటూ గ్రామాల్లోకి వచ్చి బాధితులను ఆస్పత్రికి చేర్చడంలో కీలక బాధ్యత వహిస్తున్నాయి 108 అంబులెన్స్‌లు. ఈ సేవలను ప్రారంభించింది.. అభివృద్ధి చేసింది.. వైఎస్సార్యే. ప్రమాదం.. ఆకస్మిక ఆనారోగ్యం.. ఏదైనా కావొచ్చు లేదా అపస్మారకస్థితికి చేరుకున్న వారినైనా సరే క్షణాల్లో ఆస్పత్రికి తీసుకొచ్చి వారికి మెరుగైన వైద్యం అందించేలా చేసింది. ఈ 108 అంబులెన్స్‌ల వల్ల ఇప్పటికే కొన్ని వేల మంది ప్రాణాలు నిలిచాయి. పీయూ అభివృద్ధికి పునాది పాలమూరు: వెనుకబడిన పాలమూరు జిల్లాకు ఉన్నత చదువుల కోసం అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్‌రాజశేఖరరెడ్డి ప్రత్యేక చొరవ చూపించి జిల్లాకు యూనివర్శిటీని మంజూరు చేయడం జరిగింది. ఉస్మానియా పీజీ సెంటర్‌ను స్థాయి పెంచుతూ 2008లో జిల్లాకు పాలమూరు యూనివర్శిటీ నిర్మాణానికి అనుమతి ఇచ్చారు. ఆ తర్వాత బండమీదిపల్లి శివారు ప్రాంతంలో దాదాపు 175ఏకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా 2008 ఆగష్టు 28న అప్పటి ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చేతుల మీదుగా పీయూ ప్రారంభానికి శిలఫలాకం వేశారు. తర్వాత భవన నిర్మాణ పనులు, హాస్టల్ నిర్మాణులు ప్రారంభం చేసి విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం పీయూను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఆ తర్వత పీయూకు వీసీ గోపాల్‌రెడ్డిని నియామించి త్వరగా అభివృద్ది పనులు చేయాలని వీసీని ఆయన ప్రోత్సహించారు. మొదట్లో 5కోర్సులతో 8మంది ఆచార్యులతో ప్రారంభించిన పీయూ ప్రస్తుతం 19కోర్సులు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం పీయూ పరిధిలో 3పీజీ కళాశాలలు, 94డిగ్రీ కళాశాలలు పని చేస్తున్నాయి. ఈ విద్యా సంవత్సరం పీయూలో అన్ని కోర్సులలో కలిపి 1800మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పటి వరకు 9బ్యాచ్‌లు ఇక్కడి నుంచి వెళ్లాయి. అంటే దాదాపుగా 17వేల మంది విద్యార్థులు పీయూలో ఉన్నత విద్యను అభ్యసించి వెళ్లారు. యూనివర్సిటీ ప్రారంభం చేసిన నాటి నుంచి ఇప్పటి వరకు యూనివర్సిటీ ఇంతటి అభివృద్ధి చెందడానికి కారణం వైఎస్ రాజశేఖరరెడ్డియేనని స్థానిక విద్యార్థులు చెబుతున్నారు. నెట్టెంపాడుతో 1.5 లక్షల ఎకరాలకు సాగునీరు ధరూరు (గద్వాల): రెండు దశాబ్దాల నడిగడ్డ ప్రజల ఆకాంక్ష అయిన నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంతో గద్వాల, అలంపూర్ నియోజకవర్గాలు సస్యశ్యామలయ్యాయి. 2006లో రూ.1448 కోట్ల అంచనా వ్యయంతో మండలంలోని గుడ్డెందొడ్డిలో నెట్టెంపాడు ఎత్తిపోతలకు ఉమ్మడి ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో బీజం పడింది. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం ద్వారా 1.5 లక్షల ఎకరాలకు సాగు నీరు అందనుంది. గద్వాల నియోజకవర్గంలోని గద్వాల, ధరూరు, మల్దకల్, గట్టు, కేటీదొడ్డి మండలాలతో పాటు అలంపూర్‌లోని ఇటిక్యాల తదితర మండలాలకు ఈ జలాలు అందుతున్నాయి. కరువు నేలలు సాగులోకి వచ్చాయి. ఆ ఘనత వైఎస్‌కే దక్కింది. ఏడు రిజర్వాయర్లను నిర్మించారు. అలాగే, ప్రయదర్శిని జూరాల ప్రాజెక్టు దిగువన ఉన్న 234 మెగావాట్ల సామర్థ్యంతో జెన్కో జల విద్యుత్ కేంద్రాన్ని ప్రారంభించారు. కోయిల్‌సాగర్ ఎత్తిపోతల వైఎస్ చలవే దేవరకద్ర: కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే పునాది పడింది. వైఎస్ తలపెట్టిన జలయజ్ఞంలో భాగంగా జిల్లాలో నాలుగు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. అందులో కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకాన్ని రూపొందించారు. జూరాల బ్యాక్ వాటర్ నుంచి నీటిని కొయిల్‌సాగర్‌కు తరలించడానికి సాంకేతికంగా రూపకల్పన చేశారు. కృష్ణట్రిబ్యునల్ తీర్పు ప్రకారం కోయిల్‌సాగర్‌కు 3.90 టీఎంసీల నీటిని వినియోగించు కోడానికి ఉన్న అవకాశాలను సద్వినియోగం చేశారు. 50,250 ఎకరాలకు సాగు నీరు అందించడానికి ఆయకట్టును నిర్దేశించి రూ.359 కోట్ల వ్యయంతో పనులు చేపట్టడానికి ప్రభుత్వ పరంగా పరిపాలన అనుమతులను మంజూరు చేశారు. 2006లో కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకానికి వైఎస్ శంఖుస్థాపన చేశారు. ఆర్డీఎస్ ఆధునీకరణకు కృషి అలంపూర్: 87వేల ఎకరాలకు సాగునీటిని అందించాల్సిన ఆర్డీఎస్ నిరాదరణకు గురికాగా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి దాని ఆధునీకరణకు ముందుకు వచ్చారు. కాలువల లైనింగ్, హెడ్‌వర్క్స్ వద్ద పూడికతీత, డిస్టిబ్యూటరీల నిర్మాణాలు చేపట్టడానికి అప్పట్లో రూ.112 కోట్లు కేటాయించారు. అంతేగాక, అలంపూర్, ర్యాలంపాడు గ్రామాలను కలుపుతూ తుంగభద్ర నదిపై వంతెన నిర్మాణానికి రూ.35 కోట్లు మంజూరు కావడంతో వాటి శంకుస్థాపనతో పాటు పనుల్లో పాల్గొన్నారు. స్థానిక మాజీ ఎమ్మెల్యే చల్లావెంకట్రామిరెడ్డికి వైఎస్ఆర్తో ఉన్న అనుబంధంతో ఆయన అలంపూర్ నియోజకవర్గాన్ని మూడు సార్లు రావడం జరిగింది. వైఎస్సార్ పాలన సువర్ణయుగంగా ప్రజల గుండెల్లో గుర్తుండిపోయింది. వైఎస్ దయ వల్లే ఎంటెక్ చేశా నాపేరు అనిల్ సాగర్ మాది కొత్తకోట పట్టణం. పట్టణంలో ఓ మధ్యతరగతి కుటుంబం. ఉన్నత చదువులు చదువుకునే స్తోమత లేదు. ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ రావడంతో బీటెక్, ఎంటెక్ పూర్తి చేసి ప్రస్తుతం రాజశేఖర్‌రెడ్డికి ఇష్టమైనటువంటి ఇరిగేషన్ శాఖలో ఏఈఈగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నా. రాజశేఖర్‌రెడ్డి పుట్టిన రోజు నాడే నా పుట్టినరోజు కావడంతో అదృష్టంగా భావిస్తున్నాను. – పి.అనిల్‌కుమార్ సాగర్, కొత్తకోట ‘ఆరోగ్యశ్రీ’తో ఆపరేషన్ చేయించుకున్నా నా పేరు సంగ నర్సింహులు, మాది నారాయణపేట పట్టణం. 2007వ గుండెకు సంబంధిత వ్యాధి లక్షణాలు కనిపించాయి. వైద్యులు అపరరేషన్ చేయాలన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం కింద హైదరాబాద్‌లోని గ్లోబల్ ఆస్పత్రిలో అపరేషన్ చేయించుకున్నా. అప్పట్లో ఆపరేషన్‌కు ఖర్చు రూ. 1.50 లక్షలు అయింది. నేను బతికి ఉన్నా అంటే వైఎస్సార్ పుణ్యమే. ఆయన మా గుండెలో చిరస్మరణీయులుగా ఉంటారు. – సంగ నర్సింహులు, నారాయణపేట -
ఈ‘సారీ’ కూత లేదు
సాక్షి, నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా మీదుగా ప్రతిపాదించిన గద్వాల– మాచర్ల రైల్వేలైన్ కోసం ఎదురుచూస్తున్నజిల్లా ప్రజలకు మరోమారు నిరాశే మిగిలింది. గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నా..ఈ బడ్జెట్లోనూ కేంద్ర ప్రభుత్వం కలను కలగానే మిగిల్చింది. తెలంగాణలోని గద్వాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా మాచర్ల వరకు రైల్వేలైన్ కోసం నిధులు కేటాయిస్తారని అంతా అనుకున్నామరోమారు మొండిచేయి చూపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమన్వయం లేకపోవడం వల్లనే శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా మంజూరు కాలేదు. దీంతో నాగర్‌కర్నూల్ నుంచి కల్వకుర్తి, అచ్చంపేట గుండా మాచర్ల వరకు రైల్వేలైన్ వస్తుందనుకున్న ప్రజల ఆశలు ఇప్పట్లో నెరవేరేలా లేవు. 1980లో రైల్వేలైన్‌కు బీజం 1980లో అప్పటి ఎంపీ మల్లు అనంతరాములు గద్వాల– మాచర్ల రైల్వేలైన్ వేయడం వల్ల కలిగే లాభాలను వివరి స్తూ అప్పటి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు. దీంతో అప్పట్లో రూ.919 కోట్ల బడ్జెట్‌తో 184.2 కి .మీ. మేర రైల్వేలైన్ కోసం ప్రతిపాదనలు తయారు చేయారు. ఈ రైల్వేలైన్ వనప ర్తి, నాగర్‌కర్నూల్, మిర్యాలగూడ మీ దుగా మాచర్ల వరకు చేరుకుంటుంది. ఈ రైల్వే లైన్ వల్ల వ్యాపార పరంగా ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అప్పటి నుంచి మరుగున పడిపోయిన ఈ అంశంపై 2007లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి డీటైల్ ప్రాజెక్టు రిపోర్ట్ (డీపీఆర్) తయారు చేసి కేంద్రానికి అందించారు. దీంతో 2015లో కేంద్రం కంటి తుడుపు చర్యగా కేవలం నల్లగొండ– మాచర్ల వరకు సర్వే నిర్వహించేందుకు రూ.20 కోట్లు మంజూరు చేసింది. ఇది మినహా ఇప్పటి వరకు ఈ రైల్వేలైన్‌కు సంబంధించి కేంద్రం తీసుకున్న చొరవ ఏమీ లేదు. అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంపైనే ఈ అంశం ఆధారపడి ఉందనేది అందరి వాదన. రైల్వేలైన్ కోసం అయ్యే ఖర్చులో 50 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభు త్వం ఒప్పుకుంటే ఈ అంశం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. భూ సేకరణ, ఇ తర అంశాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచే చెల్లింపులు చేయాలి. ఫలితంగా రాష్ట్ర ప్ర భుత్వం చొరవ తీసుకుంటే తప్ప కేం ద్రం ఒప్పుకునే అవకాశం లేకపోలేదు. మొదటి దశ పూర్తి.. రెండో దశ? ప్రజల డిమాండ్‌కు అనుగుణంగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ, తెలంగాణ రాష్టాలను కలుపుతూ రాయచూర్ నుంచి మాచర్లకు రైల్వేలైన్ కోసం ప్రతిపాదించారు. దీని వల్ల వ్యాపార పరంగా ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందడమే కాకుండా మూడు రాష్ట్రాల మధ్య సంబంధాలు కూడా మెరుగుపడే అవకాశం ఉంది. దీంతో 2002లో అప్పటి కేంద్ర రైల్వే సహాయ మంత్రి హోదాలో దత్తాత్రేయ రాయచూర్– గద్వాల రైల్వేలైన్‌కు శంకుస్థాపన చేశారు. గత రెండేళ్ల క్రితం డెమో కూడా పూర్తి చేసుకుని రాకపోకలు సైతం ప్రారంభమయ్యాయి. ఇక రెండో దశకు సంబంధించి గద్వాల నుంచి మాచర్ల వరకు రైల్వేలైన్ కోసం 151 నుంచి 154 కిలోమీటర్ల మేర ఉండే ఈ రైల్వే లైన్ కోసం దాదాపు రూ.1,160 కోట్లు అవుతుందని రైల్వేశాఖ అధికారులు ప్రతిపాదనలు పంపారు. సగం వాటా భరిస్తే కొత్త లైన్లు వేస్తామని కేంద్ర విధించిన నిబంధన మేరకు రాష్ట్రానికి చెందిన నేతలు, ఇక్కడి ఎంపీలు ఎప్పటికప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తూనే ఉన్నారు. అయితే ఇప్పటి వరకు రైల్వేలైన్‌కు సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. రాజకీయ నాయకులు రైల్వే లైన్ కోసం మరో ఉద్యమం చేస్తే తప్ప సాధ్యం కాదని ఇక్కడి ప్రజల అభిప్రాయం. ఏదేమైనా గద్వాల– మాచర్ల రైల్వేలైన్ కోసం ఇంకెన్ని దశాబ్దాలు వేచి చూడాలనేది ఈ ప్రాంత ప్రజల ప్రశ్న. ముఖ్యమంత్రి లేఖ ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆమోదం పొందేలోపు రాష్ట్ర Ðముఖ్యమంతి గద్వాల– మాచర్ల రైల్వేలైన్ కోసం లేఖ ఇవ్వాలి. సప్లిమెంటరీ కింద కేంద్ర నిధులు కేటాయించే అవకాశం ఉంది. ఈ రైల్వేలైన్ కోసం అయ్యే ఖర్చులో 50 శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంది. కాబట్టి ఈ అంశం రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉంది. ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు ఒప్పించి సమస్యను పరిష్కరించాలి. -సుధాకర్‌రెడ్డి, రైల్వే సాధన సమితి జిల్లా చైర్మన్ -
మా భూములు మీకివ్వం
సాక్షి, కొల్లాపూర్: మండలంలోని కుడికిళ్ల భూముల్లో పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబందించిన సర్వే చేయడానికి వచ్చిన తహసిల్దార్ వీరభద్రప్ప బృందాన్ని రైతులు అడ్డుకున్నారు. గురువారం పోలీస్ బందోబస్తుతో రైతుల పొలాలను సర్వే చేయడానికి వచ్చిన రెవెన్యూ అధికారులతోపాటు ఇరిగేషన్ అధికారులు వచ్చారు. కుడికిళ్ల రైతులు పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టుకు భూములు ఇచ్చేది లేదని నాలుగేళ్లుగా అడ్డుకుంటున్నారు. తాజాగా గురువారం వచ్చిన అధికారులను పంపించేశారు. కుడికిళ్ల గ్రామానికి చెందిన రైతుల పొలాలు 242 ఎకరాలు పాలమూరు ప్రాజెక్టు కింద పోతున్నాయి. గతంలో కల్వకుర్తి ప్రాజెక్టు, మిషన్ భగీరథ ప్రాజెక్టులలో భూములు కోల్పోయారు. ప్రస్తుతం పాలమూరు ప్రాజెక్టుకు భూములు ఇచ్చేది లేదని సంవత్సరాల కొద్దీ పోరాటాలు చేస్తున్నారు. భూమికి భూమి ఇవ్వాలి.. 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూమికి భూమి ఇస్తే తప్పా భూములు ఇవ్వమని తెగేసి చెప్పారు. ఒకటి, రెండు ఎకరాల చొప్పున భూములు మిగిలాయని అవి కూడా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో పోతే బతికేదెట్లా అని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు చేసేదేమి లేక ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి వెనుదిరిగారు. కార్యక్రమంలో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న మహిళారైతులు గ్రామస్తులు పాల్గొన్నారు. పోలీసు బందోబస్తుతో.. కుడికిళ్ల రైతులపై ఒత్తిడి పెంచేందుకు అధికారులు భారీ పోలీస్ బందోబస్తుతో వచ్చారు. సర్వేకు వచ్చిన అధికారులను దాదాపుగా 200మంది రైతులు అడ్డుకున్నారు. భూములలోకి అడుగు పెట్టనివ్వబోమని తేల్చి చెప్పారు. భారీ పోలీస్ బందోబస్తుతో వచ్చారు. అధికారులతో దాదాపుగా 2గంటల వాగ్వివాదం చోటుచేసుకుంది. మహిళా రైతులు పెట్రోలు బాటిళ్లు పట్టుకుకుని అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వే చేస్తే పెట్రోలు పోసుకుని అంటించుకుంటామని హెచ్చరించారు. కలెక్టర్, ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే మాతో చర్చలు జరపాలని అధికారులతో చెప్పారు. -
రోగాలకు నిలయం
సాక్షి, నాగర్‌కర్నూల్ : జిల్లా కేంద్రంలోని పభుత్వ ఆస్పత్రి అపరిశుభ్రతకు నిలయంగా మారింది. నిత్యం పందుల సంచారంతో రోగులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. రోగుల బంధువులు వంట చేసుకునే క్రమంలో పందుల సంచారంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆస్పత్రి ప్రాంగణం వెనక భాగంంలో మురుగు పూర్తిగా పేరుకుపోవడంతో ముక్కు పుటలు అదిరేలా వాసన వస్తోంది. మున్సిపల్ అధికారులు చెత్తను తొలగించి డ్రెయినేజీని శుభ్రం చేయాలని ఎన్ని వినతులు ఇచ్చినా పట్టించుకోవడం లేదని ఆస్పత్రి వైద్యాధికారులే చెబుతున్నారు. దీంతో రోగం నయం చేసుకునేందుకు వస్తే కొత్తరోగాలను కొని తెచ్చుకునే పరిస్థితి తయారైందని రోగులు మండిపడుతున్నారు. లక్షల నిధులున్నా అధికారులు, ప్రజాప్రతినిదులు మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఆస్పత్రిలో వైద్యుల కొరత జనరల్ ఆస్పత్రిలో దాదాపు 28 మంది వైద్యులు ఉండాల్సి ఉండగా, కేవలం 8 మంది మాత్రమే కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేస్తున్నారు. ప్రసవాలు చేయడానికి సరిపడ వైద్యులను నియమించకపోవడంతో గర్భిణులను ఇతర దవాఖానలకు రెఫర్ చేస్తున్నారు. జాడలేని అభివృద్ధి కమిటీ జిల్లా కేంద్రంగా మారి జిల్లా ఆస్పత్రిలా పేరు మారిందే తప్పా పనితీరులో మార్పు రాలేదని పట్టణ వాసులు అంటున్నారు. ప్రభుత్వ ఆస్పత్రి అభివృద్ధికి కమిటీని ఏర్పాటు చేయాలి కాని నేటికీ ఆ దిశగా అడుగులు పడలేదు. వచ్చిన నిధులన్నీ ఎక్కడ ఖర్చు చేస్తున్నారే అడిగే నాథుడే లేడు. దీంతో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారింది. ఏళ్ల తరబడి నిర్మించిన తాగునీటి పైపులైన్ ప్రస్తుతం పూర్తిగా మూసుకుపోవడంతో వార్డుల్లో నీరు అందడం లేదు. దీంతోపాటు ఆస్పత్రిలోని మరుగుదొడ్లు శుభ్రపరచడంలో శానిటరి సిబ్బందిసైతం అలసత్వం కారణంగా దుర్వాసన వస్తు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రోగులు మండిపడుతున్నారు. వర్షాకాలం ప్రారంభం కావడంతో సీజనల్ వ్యాధులు రోగులపై విజృంభించి ప్రతిరోజూ ఇన్‌పేషెంట్లు 80కి పైగా ఉండగా ఔట్ పేషెంట్లు 2,100 పైచిలుకు వస్తున్నారని ఆస్పత్రి వర్గాలు పేర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో అపరిశుభ్రంగా ఆస్పత్రి ఆవరణం ఉంటే కొత్త రోగాలు వచ్చే పరిస్థితి లేదా అని ప్రశ్నిస్తున్నారు. మున్సిపల్ అధికారులకు విన్నవించాం ఆస్పత్రి ఆవరణలో చెత్త తొలగింపు, మురుగు శుభ్రతం చేయాలని పలు మార్లు మున్సిపాలిటీ అధికారులకు విన్నవించాం. వారు స్పందించడం లేదు. ఆస్పత్రి వెనక భాగంలో మురుగు చాలా పేరుకుపోయింది. దీనిపై ఉన్నతాధికారులకు సమాచారం అందించాం. – ప్రభు, సూపరింటెండెంట్, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి -
టీచర్లు కావాలె!
సాక్షి, తాడూరు: అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నచందంగా.. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సదుపాయాలు, ఉచితంగా పాఠ్య పుస్తకాలు, దుస్తులు, మధ్యాహ్న భోజనం అందిస్తున్నా చదువు చెప్పే పంతుళ్లు కరువయ్యారు.. మండలంలోని చాలా పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతతో విద్యావలంటీర్లతోనే నెట్టుకొస్తున్నారు.. దీంతో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని ఉన్నప్పటికీ ఉపాధ్యాయుల లేకపోవడంతో ప్రైవేటు పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించి ఉపాధ్యాయులను నియమించి సమస్యను పరిష్కరించాలని తల్లిదండ్రులు, విద్యార్థులు కోరుతున్నారు. మండలంలో ఇలా మండలంలో చాలావరకు ఉపాధ్యాయులున్న చోట పిల్లలు లేరు, పిల్లలున్న చోట ఉపాధ్యాయులు లేరు. మండలంలోని ఆకునెల్లికుదురులో ఐదు తరగతులకు గాను 50మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. రెండు ఉపాధ్యాయ పోస్టులకు గాను ఒక పోస్టు ఖాళీగా ఉండటంతో ఉన్న ఒక్క ఉపాధ్యాయులు విద్యపరమైర సెలవుపై వెళ్లడతో వలంటీరుతో చదువు కొనసాగుతుంది. ప్రస్తుతం ఉన్న విద్యార్థుల్లో వలంటీరుతో చదువు ఎలా సాగుతుందన్న ఉద్దేశంతో గ్రామస్తులు తమ పిల్లలను మెరుగైన విద్య కోసం ప్రైవేటు పాఠశాలలకు పంపేందుకు సిద్ధమయ్యారు. అయినా ఒక ఉపాధ్యాయుడిని ఏర్పాటు చేస్తామని ఉపాధ్యాయులు గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయారు. దీంతో ఉన్న వలంటీరుతో చదువు సాగడం కష్టంగా ఉంటుందన్న ఉద్దేశంతో దాదాపు 20మందికి పైగా విద్యార్థులను ప్రైవేట్ పాఠశాలకు పంపేందుకు సిద్ధమయ్యారు. మండలంలో 24ప్రాథమికపాఠశాలలు, ఏడుప్రాథమికోన్నత, ఆరు ఉన్నత, ఒక కేజీబీవీ పాఠశాల ఉంది. పాఠశాలలో 1,856 మంది బాలురు, 2,304మంది బాలికలతో మొత్తం 3,890 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ సారి 565 మంది కొత్తగా పాఠశాలలో చేరినట్లు అధికారులు చెబుతున్నారు. వంద ఉపాధ్యాయ పోస్టులకుగాను 88మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. 13ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉపాధ్యాయులు లేక కొమ్ముకుంట తండా పాఠశాల మూసివేశారు. పలు గ్రామాల్లోని పాఠశాలలో అదనపు నగదుల కొరత మరి కొన్ని గ్రామాలలో శిథిలావస్థకు చేరిన భవనాలు, అరకొర వసతుల మధ్య పాఠశాలలు కొనసాగుతున్నాయి. విధిగా బోధించి ఉత్తమ ఫలితాలు తేవాలన్న ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ వారి సరిపడా వసతులు లేకపోవడం వల్ల చదువులు డీలా పడుతున్నాయి. అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి ఉమ్మడి జిల్లాలోనే ఉత్తమ ఫలితాలు సాధించే తాడూరు మండల పరిస్థితిని మెరుగుపర్చే విధంగా కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు. సమస్యలు పరిష్కరిస్తాం మొత్తం 13ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వలంటీర్లను ఏర్పాటు చేశాం. వలంటీర్ల ద్వారా చదువుకు ఆటంకం లేకుండ చూస్తాం. ఆకునెల్లికుదురు గ్రామానికి తాత్కాలికంగా ఉపాధ్కాయుడిని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తాం. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ విషయం ప్రభుత్వంపై ఆధారపడి ఉంది. – డా.చంద్రశేఖర్‌రెడ్డి, ఎంఈఓ -
‘పాలమూరు’ పరుగులు
ప్రతిష్టాత్మక పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పనుల్లో వేగం పుంజుకోనుంది. నిధుల సమస్యతో నత్తనడకన సాగుతున్న ప్రాజెక్టు నిర్మాణ పనులకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ.10వేల కోట్ల రుణం తీసుకోవాలని రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. రుణం మంజూరైన వెంటనే మందకొడిగా సాగుతోన్న ఈ పనులను త్వరితగతిన పూర్తి చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. రుణ ప్రక్రియ పూర్తయిందని, త్వరలో నిధులు మంజూరు చేయడమే మిగిలిందని అధికారులు చెబుతున్నారు. సాక్షి, మహబూబ్‌నగర్ : ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు రంగారెడ్డి జిల్లాల్లో 12.30లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేసేందుకు ప్రభుత్వం 2015 జూన్‌లో ప్రతిష్టాత్మకంగా రూ.35,200కోట్లతో పాలమూరు–ఎత్తిపోతల ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టింది. ఈ అప్పట్లో సీఎం కేసీఆర్ మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ వద్ద కరివెన రిజర్వాయర్‌కు శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. తర్వాత కాంట్రాక్టర్ల ఒప్పందం కోసం పది నెలల సమయం పట్టింది. చివరకు 2016 మే నుంచి పనులు ప్రారంభమయ్యాయి. ఆ సమయంలో 2018 ఆఖరులోగా ప్రాజెక్టును పూర్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. అయి తే ప్రాజెక్టు పనులు వేగంగా చేసేందుకు సరిపడా నిధులు లేకపోవడంతో పనుల్లో వేగం తగ్గింది. ఇప్పటి వరకు సుమారు రూ.10వేల కోట్ల మేర పనులు జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం రుణం మంజూరు కానుండడంతో పనుల్లో వేగం మరింత వేగం పెరిగే అవకాశం ఉంది. ప్రాజెక్టు స్వరూపం ఇదీ.. శ్రీశైలం వెనక జలాల నుంచి నీటిని ఎత్తిపోసేలా ఈ ప్రాజెక్టును రూపొందించారు. ప్రస్తుతం జిల్లాలో ఉన్న కేఎల్ఐ ప్రాజెక్టులకు సంబంధించి నీటిని నిల్వ చేసుకునేందుకు రిజర్వాయర్లు లేకపోవడంతో ప్రభుత్వం పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల కింద పెద్ద ఎత్తున రిజర్వాయర్లు నిర్మించేందుకు నిర్ణయించింది. మొత్తం ఆరు రిజర్వాయర్లతో ఈ ప్రాజెక్టును రూపొందించారు. ఇందులో సర్కిల్–1లో కొల్లాపూర్ పరిధిలోని నార్లాపూర్‌లో 8.55 టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. వనపర్తి పరిధిలోని ఏదుల 6.99టీఎంసీలు, నాగర్‌కర్నూల పరిధిలోని వట్టెం వద్ద 16.75 టీఎంసీలు, మహబూబ్‌నగర్ పరిధిలోని కరివెన వద్ద 17.34 టీఎంసీలు, సర్కిల్–2 పరిధిలోని ఉద్దండాపూర్ వద్ద 9.1టీఎంసీలు, రంగారెడ్డి జిల్లాలోని కేపీ లక్ష్మిదేవిపల్లి వద్ద 3 టీఎంసీలు (గతంలో 10 టీఎంసీల అంచనా ఉండగా> కుదించారు)మొత్తం ఆరు రిజర్వాయర్ నిర్మించేందుకు పథకాన్ని ప్రారంభించారు. పనులు ఇలా.. జిల్లాలో ఈ ప్రాజెక్టు పనులు 15ప్యాకేజీలుగా విభజించి కొనసాగిస్తున్నారు. రిజర్వాయర్ల వారీగా పరిశీలిస్తే నార్లాపూర్ రిజర్వాయర్‌కు సంబంధించి మొత్తం 2,465 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉండగా ఇప్పటి వరకు 2,275 ఎకరాల భూమిని సేకరించారు. రూ.760కోట్ల వ్యయానికిగాను రూ.425కోట్లు ఖర్చు చేసి 60శాతం పనులు పూర్తి చేశారు. ఏదుల రిజర్వాయర్‌కు సంబంధించి 5,470 ఎకరాలు సేకరించాల్సి ఉండగా 5,011 ఎకరాలు సేకరించారు. మిగిలిన భూసేకరణ వివిధ దశల్లో ఉంది. రూ. 664 కోట్ల వ్యయానికి రూ.622 కోట్లు ఖర్చు చేసి 95శాతం పనులను పూర్తి చేశారు. వట్టెం రిజర్వాయర్‌కు సంబంధించి 4,526ఎకరాలు సేకరించాల్సి ఉండగా దాదాపు 4 వేల ఎకరాలను సేకరించారు. రూ.6వేల కోట్ల వ్యయానికి రూ.1800 కోట్లతో 30శాతం పనులు పూర్తి చేశారు. కరివెన రిజర్వాయర్‌కు సంబంధించి 6,676 ఎకరాలు భూమిని సేకరించాల్సి ఉండగా 6,008 ఎకరాలను సేకరించారు. మిగిలిన భూమికి సంబంధించి సేకరణ అంశం వివిధ దశల్లో ఉంది. రూ.760కోట్ల వ్యయంతో ప్రారంభమైన ఈ పనులు రూ. 425కోట్ల ఖర్చుతో దాదాపు 60శాతం పూర్తయ్యా యి. కాలువల విషయానికొస్తే నార్లపూర్ నుంచి ఏదుల వరకు 8.375 కిలో మీటర్ల కాల్వలను 2, 3 ప్యాకేజీలుగా విభజించి ఇప్పటి వరకు 50శాతం పనులు పూర్తి చేశారు. ఏదుల నుంచి వట్టెం వరకు 6.4 కిలో మీటర్ల కాలువను 6, 7ప్యాకేజీలుగా విభజించి 81శాతం పనులు పూర్తి చేశారు. ఇక వట్టెం నుంచికరివెన వరకు 12కిలో మీటర్ల కాలువను 12వ ప్యాకేజీగా విభజించి 72 శాతం కాలువ పనులను పూర్తి చేశారు. మోటార్లకే కేటాయింపు.. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ప్రపంచంలోనే అత్యధిక సామర్థ్యం గల మోటార్లను బిగించనున్నారు. నార్లపూర్‌లో 145మెగావాట్ల సామర్థ్యం గల ఎనిమిది మోటార్లను ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా ప్రతి రోజు 22వేల క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేసేలా ఇంజనీర్లు డిజైన్ చేశారు. అయితే ఇంత సామర్థ్యం గల పంపులు ఇప్పటి వరకు ప్రపంచంలో ఎక్కడా వినియోగించకపోవడం విశేషం. పవర్ కార్పొరేషన్ ద్వారా మంజూరయ్యే రుణం వీటి కొనుగోలుకే కేటాయించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. వనపర్తి జిల్లా రేవల్లి మండలంలో 6.55 టీఎంసీల సామర్థ్యం గల ఏదుల రిజర్వాయర్‌ను రూ.600 కోట్ల అంచనాతో 2015లో అప్పటి రాష్ట్ర భారీ నీటి పారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పనులు ప్రారంభించారు. సొరంగాలు, సర్జిపూల్స్, కాల్వలు పనులు పురోగతిలో ఉన్నాయి. 7.5 కిలోమీటర్ల పొడవైన ఆనకట్ట నిర్మాణం 99 శాతం పూర్తి చేశారు. రూ.400 కోట్ల రిజర్వాయర్ నిర్మాణానికి, రూ. 200 కోట్ల కాల్వల నిర్మాణం కోసం కేటాయించారు. ఇక్కడ 1.45 హెచ్‌పీ సామర్థ్యం గల 9 పంపులను ఏర్పాటు చేసి, నీటిని ఎత్తిపోసే విధంగా ప్రాజెక్టు డిజైన్ చేశారు. ఈ రిజర్వాయర్‌కు నీరు వస్తే.. 29 గ్రామాల పరి«ధిలోని 45వేల ఎకరాల ఆయకట్టకు సాగునీరు అందుతోంది. ప్రాజెక్టు నిర్మాణం కోసం ఇప్పటి వరకు 5,011ఎకరాల భూసేకరణ చేశారు. ఇంకా 395 ఎకరాలు భూమిని సేకరించాల్సి ఉంది. ఇందులో 195 ఎకరాల భూమి వివాదాస్పదంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. -
కొత్త ఆశలు!
సాక్షి, చిన్నంబావి: నూతన పరిషత్ పాలకవర్గం కొలువుదీరనుండగా.. మండలంలోని ఆయా గ్రామాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కారమవుతాయని ప్రజలు కొంత ఆశతో ఎదురుచూస్తున్నారు. గ్రామాల్లో ఎలాంటి సమస్యలు లేకుండా నిబద్ధతలో పనిచేస్తామని హమీల వర్షం గుప్పించి అధికారంలోకి వచ్చిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలకు మండలంలోని పలు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ఒకవైపు ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ..మరోవైపు అభివృద్ధి వనరులు సమకూర్చేందుకు వీరికి శక్తికి మించిన భారంకానుంది. పల్లెల బలోపేతం కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన పంచాయతీరాజ్ చట్టం విధులు, విధానాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కొత్త మండలం.. సమస్యలతో సతమతం నూతనంగా ఏర్పడిన చిన్నంబావి మండలంలో అనేక సమస్యలు తిష్ట వేశాయి. మండలంలో ఒక్క ప్రభుత్వ కార్యాలయానికి పక్కా భవనం లేదు. పేరుకే మండలం ఏర్పడింది కాని చాలా వరకు శాఖలు ఉమ్మడి మండలం అయిన వీపనగండ్లలోనే కొనసాగుతున్నాయి. ఎంపీడీఓ, ఎంఈఓ, ఉద్యానవనశాఖ, పశువైద్యశాల, ప్రభుత్వ ఆసుపత్రి తదితర కార్యాలయాలన్ని అక్కడే కొనసాగుతున్నాయి. అదేవిధంగా చాలా కార్యాలయాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. దీనికితోడు ఇక్కడ ఒక్క పాఠశాల కూడా లేకపోవడంతో స్థానికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకు, సంక్షేమ హాస్టల్‌ను ఏర్పాటు చేసేందుకు నూతన ప్రజాప్రతినిధులను ప్రజలు కోరుతున్నారు. రైతుల కల నెరవేరేనా..? కృష్ణానది చెంతనే ఉన్న గుక్కెడు నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని ఇక్కడి ప్రాంత రైతులు అధికారులను, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్న కనీసం వాటి పరిష్కారం దిశగా అడుగులు వేయకపోవడం బాధకరమని ఇక్కడి ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టుకు టెయిలండ్ ప్రాంతం కావడంతో పంటల చివరి దశకు వచ్చే సరికి సాగునీరు అందక వేల ఎకరాల్లో పంటలు ఎండిపోయి రైతులు అప్పుల పాలవుతున్నారు. కృష్ణానదిపై ఉన్న చెల్లెపాడు, చిన్నమారూర్ మినీలిప్టులు గత దశాబ్ధ కాలంగా మరమ్మతుకు గురై శిథిలావస్థకు చేరాయి. ఎన్నికల సమయానికి లిప్టుల ప్రస్తావన తప్ప వాటికి పూర్తిస్థాయి పరిష్కార మార్గం చూపడం లేదని ఆందోళన చెందుతున్నారు. ఆ రెండు లిప్టులను మరమ్మతు చేస్తే దాదాపుగా 12వేల ఎకరాలకు సాగునీరు పుష్కాలంగా అందుతుంది. వీటి పరిష్కారం కోసం ఎంపీపీ,జడ్పిటిసిలు ప్రయత్నించాలని ఇక్కడి ప్రాంత రైతులు కోరుతున్నారు. -
వాటికి కూడా ఫిల్టర్ ఇసుకేనా..?!
నాగర్‌కర్నూల్ క్రైం : నదులు, వాగులు, వంకల్లో ప్రకృతి సిద్ధంగా లభించే ఇసుకను అక్రమంగా రవాణ చేసి రూ.కోట్లలో అక్రమ సంపాదనను వెనకేసుకుంటున్న ఇసుకాసురులు.. జిల్లా పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో ఫిల్టర్ ఇసుక దందాకు తెరలేపారు. ప్రకృతి సిద్ధంగా లభించే ఇసుకతో నిర్మాణాలు చేపడితే చాలాకాలం పాటు మన్నిక ఉంటాయి. కానీ, జిల్లాలో కొందరు ఇసుక వ్యాపారులు చెరువులు, పంట పొలాల్లో లభించే మట్టి తీసుకువచ్చి ఆ మట్టితో ఫిల్టర్ ఇసుకను తయారు చేసి విక్రయిస్తున్నారు. ఈ ఫిల్టర్ ఇసుకను ప్రభుత్వ నిర్మాణాలకు, సీసీరోడ్లతోపాటు భవన నిర్మాణాలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఫిల్టర్ ఇసుకను వాడటం వల్ల చాలాకాలంపాటు పటిష్టంగా ఉండాల్సిన నిర్మాణాలు, సీసీరోడ్లు, భవనాలు కొద్దిరోజుల్లో దెబ్బతినే అవకాశం ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యామ్నాయ మార్గాల వైపు జిల్లా పరిధిలో దుందుబీ వాగుతోపాటు కృష్ణానది వందల కిలోమీటర్ల దూరంలో ప్రవహిస్తుండటంతో నాణ్యమైన ఇసుకకు ఏమాత్రం కొదవలేదు. నదులు, వాగులు, వంకల్లో లభించే ఇసుకను ప్రభుత్వ అనుమతుల పేరిట అక్రమంగా తరలించి రూ.కోట్లు దండుకుంటున్న ఇసుకాసురులపై పోలీసు అధికారులు నిఘా పెట్టడం వల్ల ఇసుక అక్రమంగా తరలింపుపై ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇదే క్రమంలో జిల్లా పరిధిలో ఇసుక అక్రమ రవాణాపై కూడా నిఘా పెట్టడంతో ఇసుకాసురులు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుని నాణ్యతలేని ఫిల్టర్ ఇసుకను తయారుచేసి దర్జాగా అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా జిల్లా పరిధిలోని నాగర్‌కర్నూల్ నియోజకవర్గంతోపాటు కొన్ని ప్రాంతాల్లో ఫిల్టర్ ఇసుక తయారీ ఎంతోకాలంగా జోరుగా నడుస్తున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ప్రజలు ఫిల్టర్ ఇసుక తయారీదారులపై అధికారులకు ఫిర్యాదు చేసినా కనీసం ఫిల్టర్ ఇసుక తయారీ చేసే ప్రాంతాల దరిదాపుల వైపు వెళ్లి చూడటం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఫిల్టర్ ఇసుక తయారీ కొందరు రాజకీయ నాయకుల కనుసన్నల్లో నడుస్తుండటంతో అధికారులు అటువైపు వెళ్లే సాహసం చేయలేకపోతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. చెరువు మట్టి ద్వారా.. జిల్లాలోని పలు చెరువుల్లో, సారవంతమైన నేలల నుంచి మట్టిని తీసుకువెళ్లి కృత్రిమ పద్ధతి ద్వారా ఇసుకను తయారు చేస్తున్నారు. ఈ కృత్రిమ ఇసుకతో నిర్మించిన కట్టడాలు చాలాకాలం మన్నికగా ఉండవని తెలిసినా ధనార్జనే ధ్యేయంగా ఇసుకాసురులు కృత్రిమ ఇసుక తయారీకి తెరలేపారు. చెరువుల నుంచి, సారవంతమైన నేలల నుంచి మట్టిని తీసుకెళ్లడం ద్వారా అటు చెరువుల్లో నీరు ఇంకిపోవడమే గాక సారవంతమైన నేలలు దెబ్బతింటున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కృత్రిమ ఇసుక తయారీతో సహజ వనరులు నాశనమవ్వడమే గాక పర్యావరణానికి పెనుప్రమాదమని తెలిసినా అధికారులు పట్టించుకోవడం లేదు. అధిక శాతం వాటికే వినియోగం వాగులు, నదుల్లో లభించే ఇసుక కన్నా కృత్రిమంగా తయారు చేసే ఫిల్టర్ ఇసుక ధర తక్కువగా ఉండటంతో కాంట్రాక్టర్లు ప్రభుత్వ పనులకు ఎక్కువగా ఉపయోగిస్తున్నారని సమాచారం. ముఖ్యంగా ఫిల్టర్ ఇసుకను సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణాలకే ఉపయోగిస్తున్నా ఇ సుక నాణ్యతపట్ల అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా జిల్లాలో కృత్రి మ ఇసుకను తయారు చేసే వారి పట్ల చర్యలు తీసుకొని కృత్రిమ ఇసుకను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. కఠిన చర్యలు తప్పవు ప్రకృతి సిద్ధంగా వాగులు, నదుల్లో ఇసుకను కాకుండా కృత్రిమంగా ఇసుకను తయారు చేసే వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటాం. ఫిల్టర్ ఇసుక తయారీని అరికట్టాల్సిన బాధ్యత ఎక్కువగా రెవెన్యూ అధికారులపైనే ఉంటుంది. జిల్లాలో తయారవుతున్న కృత్రిమ ఇసుకను అరికట్టడం కోసం రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుని ఫిల్టర్ ఇసుకను అరికడతాం. -శ్రీనివాస్, మైనింగ్ ఏడీ, నాగర్‌కర్నూలు -
వలస ఓటర్లేరి?
సాక్షి,అడ్డాకుల: ఊర్లలో వరుసగా ఎన్నికలు...నాలుగు నెలల వ్యవధిలో మూడు ఎన్నికలు. నాలుగు నెలలుగా నాయకులు, కార్యకర్తలు ఎన్నికల కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్నారు. ఊర్లలో ఉండే ఓటర్లు ముందు జరిగిన రెండు ఎన్నికల్లో అంతా ఓట్లేశారు. పొట్టకూటి కోసం వలస వెళ్లిన ఓటర్లు, ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన ఓటర్లు రెండు ఎన్నికల్లో ఓట్లు వేయడానికి కొంత ఉత్సాహం కనబర్చడంతో జిల్లాలో దేవరకద్ర నియోజకవర్గంలోనే అత్యధిక పోలింగ్ నమోదైంది. కానీ గురువారం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఓట్లు వేయడానికి ఓటర్లు పెద్దగా ఆసక్తి కనబర్చలేదు. వరుస ఎన్నికలకు తోడు వేసవికాలం ఎండలు తోడు కావడం లోక్‌సభ ఎన్నికలపై ప్రభావం చూపింది. వలస ఓటర్లే కాకుండా గ్రామాల్లో ఉన్న ఓటర్లు కూడా ఓట్లు వేయడానికి పోలింగ్ కేంద్రాలను వెళ్లకపోవడంతో ఈసారి పోలింగ్ శాతం తగ్గిపోయింది. పోలింగ్ శాతం తగ్గడంతో ఏ పార్టీకి లాభం కలుగుతుంది, ఏ పార్టీకి నష్టం కలుగుతుందన్న దానిపై నేతలు లెక్కలేస్తున్నారు. తగ్గిన పోలింగ్ శాతం.. 2018 డిసెంబర్ 7న జరిగిన శాసనసభ ఎన్నికల్లో నియోజకవర్గ వ్యాప్తంగా 84.6శాతం పోలింగ్ నమోదైంది. అదే 2014 శాసనసభ ఎన్నికల్లో 71.67శాతం జరిగింది. ఇదిలా ఉంటే లోక్‌సభ ఎన్నికల్లో నియోజకవర్గ వ్యాప్తంగా 65.95శాతం పోలింగ్ నమోదైంది. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 18శాతం తక్కువ పోలింగ్ జరిగింది. దేవరకద్ర మండలంలో 65.98శాతం, అడ్డాకుల 59.67 శాతం, కొత్తకోట 64.02శాతం, మూసాపేట 63. 23శాతం, మదనాపురంలో 67.04శాతం, భూ త్పూర్ 69.5శాతం, చిన్నచింతకుంట మండలం లో 69.14శాతం పోలింగ్ నమోదైంది. అయితే నియోజకవర్గ వ్యాప్తంగా అడ్డాకుల మండలంలో అత్యల్పంగా 59.67శాతం పోలింగ్ నమోదు కావడం గమనార్హం. నియోజకవర్గ వ్యాప్తంగా 71,572 మంది పురుషులు, 71,728 మంది మహిళలు కలిపి మొత్తం 1,43,300 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. వలస ఓటర్లు రాకపోవడంతోనేనా..! నియోజకవర్గంలోని గ్రామాలకు చెందిన కూలీలు ఎక్కువ మంది హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. వారంతా ఎన్నికలప్పుడు ఊర్లకు వచ్చి ఓట్లు వేసి వెళ్తారు. మొన్న జరిగిన శాసనసభ, పంచాయతీ ఎన్నికల్లో నేతలు వలస ఓటర్లను ఊర్లకు రప్పించి ఓట్లు వేయించుకున్నారు. అయితే లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం వలస ఓటర్లపై నేతలు పెద్దగా దృష్టి పెట్టకపోవడంతో పోలింగ్‌పై ప్రభావం పడింది. ఎండల తీవ్రత మూలంగా ఇతర గ్రామాలకు వెళ్లి ఓట్లు వేయాల్సిన చోట ఊర్లలో ఉండి కూడా చాలా మంది ఓట్లు వేయడానికి వెళ్లలేదని తెలుస్తోంది. -
బీమా.. రైతుకు వరం
సాక్షి, కొల్లాపూర్ : రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రవేశపెట్టిన రైతు బీమా పథకం రైతుల పాలిట వరం లాంటిదని, సన్న, చిన్నకారు రైతులు ప్రభుత్వానికి అభినందనలు తెలుపుతున్నారు. గతేడాది ఒక గుంట పట్టా ఉన్న ప్రతి రైతుకు ప్రమాదవశాత్తూ గానీ, సహజంగా మరణించిన రైతులకు బీమా కల్పిస్తూ రైతు కుటుంబాలను ఆదుకోవడం అభినందనీయమని రైతులు అంటున్నారు. డిసెంబర్ నుంచి నేటి వరకు ఎంతోమంది రైతులు సహజంగా మరణించారు.వారికి రూ.5లక్షల బీమాను అందజేశారు. షరతులు లేకుండానే ఖాతాలో జమ కొల్లాపూర్ మండల పరిధిలోని చింతలపల్లి, రామాపురం, ముకిడిగుండం, కల్వకోల్, నర్సింగాపురం, నర్సింగరావుపల్లి, ఎన్మన్‌బెట్ల, సింగోటం, చుక్కాయిపల్లి, చెంచుగూడెం, ఎల్లూరు, మొలచింతలపల్లి తదితర గ్రామాలలో మృతిచెందిన రైతు కుటుంబాలకు ఇప్పటికే ఒక్కొక్కరికి రూ.5లక్షల బీమా బాధిత కుటుంబాల ఖాతాలో జమ చేశారు. చనిపోయిన ప్రతి రైతు కుటుంబానికి షరతులు లేకుండా బీమాను వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. 16 కుటుంబాలకు అందిన బీమా బీమా ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 16మంది రైతులు చనిపోయారు. వారందరికీ బీమా డబ్బులు వారి కుటుంబాలకు అందాయి. ఇప్పటి వరకు మృతి చెందిన రైతులు చింతలపల్లిలో చంద్రశేఖర్‌రావు, కుర్మయ్య, రామాపురంలో నాగపురం శ్రీనివాస్, ముకిడిగుండంలో బీమిని బిచ్చన్న, పాత్లావత్ పేట్లానాయక్, లౌడ్యా తిరుపతి, మొలచింతలపల్లిలో శ్రీవాణి బాలమ్మ, చెంచుగూడెంలో మండ్ల ఈశ్వరమ్మ, ఎల్లూరులో బండారి పార్వతమ్మ, సింగోటంలో వాకిటి నర్సింహ, ఎన్మన్‌బెట్లలో మండ్ల చిట్టెమ్మ, నర్సింగరావుపల్లిలో పుల్లాసి శాంతయ్య, నలుపోతుల నాగేంద్రం, చుక్కాయిపల్లిలో చవ్వ రాముడు, చెంచుగూడెంలో మండ్ల ఈశ్వరమ్మ, కల్వకోల్‌లో పెబ్బేటి కుర్మయ్య అనే రైతులు చనిపోయారు. వారి వారి కుటుంబాలకు రైతు బీమా పథకం పూర్తిగా వర్తించి వారికి ప్రభుత్వం అందజేస్తున్న బీమా డబ్బులు అందాయి. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో క్లయిమ్ రైతులందరూ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూడలేదని రైతులు అంటున్నారు. ప్రభుత్వం ఈవిధంగానే రైతు బంధు, రైతు బీమా అమలు చేస్తే శాశ్వతంగా రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఉంటుందని అంటున్నారు. వ్యవసాయ శాఖ కార్యాలయంలో మృతి చెందిన రైతుకు సంబంధించిన ఎల్ఐసీ బాండ్, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా నఖలు ఇస్తే ఇచ్చిన నెల రోజుల్లోనే తమ కుటుంబీకుల ఖాతాలో రూ.5లక్షలు జమ అయ్యాయన్నారు. నెలలోపే ఖాతాలో డబ్బు జమ చెంచు గూడెంకు చెందిన రైతు ఈశ్వరమ్మ మృతి చెందింది. నెలరోజుల్లోనే రాష్ట్ర ప్రభుత్వం రైతు బీమా పథకంలో భాగంగా రూ.5లక్షలను జమ చేసింది. రైతు బీమా మాకు అందడం ఎంతో ఆసరా అయ్యాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వాన్ని ఎప్పుడూ మరువం. – హన్మంతు, చెంచుగూడెం రైతు -
వలస జీవుల తీర్పెటో..?
సాక్షి, మహబూబ్‌నగర్: పాలమూరు.. ఈ పేరు వినగానే ఠక్కున గుర్తొచ్చేది ఈ ప్రాంతంలో నెలకొన్న కరువే.వ్యవసాయ భూములున్నా సాగుకు నీరు లేక.. స్థానికంగా చేసేందుకు పని దొరక్క పొట్ట కూటి కోసం ముంబై.. పూణె.. కర్ణాటక.. హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వలస వెళ్లిన లక్షలాది కుటుంబాలు గుర్తొస్తాయి. దశాబ్దాల కాలంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా.. ఎంత మంది పాలకులు మారినా.. వలసజీవుల తల రాతలు మారడం లేదు. పరాయి ప్రాంతాల్లో వారు పడుతోన్న కష్టాలు గుర్తుకొస్తాయి. ‘స్థానికంగా సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి జిల్లాను సస్యశామలం చేస్తాం.. నిరుద్యోగ యువత ఇతర ప్రాంతాలకు తరలివెళ్లకుండా ఇక్కడే ఉపాధి అవకాశాలు కల్పిస్తాం’ అంటూ ప్రతిసారీ ఎన్నికల్లో అభ్యర్థులు ఇచ్చే హామీలు గుర్తొస్తాయి. ఇప్పుడు మళ్లీ వలస జీవులతో మన నాయకులకు పని పడింది. ఈ నెల 11 తేదీన జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలను మచ్చిక చేసుకునే పనిలో పడ్డ ఎంపీ అభ్యర్థులు తాజాగా వలస జీవుల ఓట్లనూ తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రస్తుత ఎన్నికలు బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఇప్పటికే బహిరంగసభలు, ర్యాలీలు, రోడ్ షోలు, కార్యకర్తలు.. కుల.. మత పెద్దలతో సమావేశాలు నిర్వహిస్తున్న అభ్యర్థులు తాజాగా ఇతర ప్రాంతాల్లో నివసిస్తోన్న వలస కూలీలు, కార్మికుల ఓట్లపై దృష్టి సారించారు. మూడున్నర లక్షలకు పైనే.. ఉమ్మడి జిల్లాలో మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ లోక్‌సభ స్థానాలున్నాయి. మహబూబ్‌నగర్ పరిధిలో 15,05,190మంది, నాగర్‌కర్నూల్ పరిధిలో 15,88,746మంది ఓటర్లున్నారు. రెండు సెగ్మెంట్ల నుంచి మూడున్నర లక్షలకు పైగా మంది ఓటర్లు ఇతర ప్రాంతాల్లో వలస కూలీలు, కార్మికులుగా పని చేసుకుంటున్నారు. మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలోని నారాయణపేట అసెంబ్లీ సెగ్మెంట్ ఉన్న కోయిలకొండ, దామరగిద్ద, ధన్వాడ, నారాయణపేట, కొడంగల్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని కొడంగల్, దౌల్తాబాద్, బొంరాజ్‌పేట, మద్దూరు, కోస్గి మండలాల నుంచి పెద్ద మొత్తంలో ముంబయి, బెంగళూరు, పూణె నగరాల్లో ఉంటున్నారు. మక్తల్ మండలం కర్లి, గుడిగండ, మంతన్‌గోడ్, అనుగొండ, జక్లేర్ ప్రాంతాలకు చెందిన ప్రజలు ముంబయి, ఢిల్లీ ప్రాంతాల్లో ఉంటున్నారు. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధి నుంచి నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, అచ్చంపేట అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి ఎక్కువ మంది ముంబైలో ఉంటున్నారు. ఇలా వలస వెళ్లిన వారిని గుర్తించిన ఎంపీ అభ్యర్థులు, అనుచరులు వారికి ఫోన్లు చేస్తున్నారు. ఉగాది పండుగకు రాకున్నా.. పోలింగ్ రోజు కచ్చితంగా రావాలని అభ్యర్థిస్తున్నారు. ఉగాదికి తమ సొంతూర్లకు విచ్చేసిన వారి వివరాలు తీసుకుని వారిని కలుస్తున్నారు. ఎన్నికల తర్వాతే వెళ్లాలని అప్పటి వరకు ఏవైనా ఖర్చులున్నా తామే చూసుకుంటామని భరోసా ఇస్తున్నారు. అందరి నోటా అదే మాటా.. ఎన్నికలు సమీపిస్తున్నా కొద్దీ ప్రచారాన్ని వేగిరాన్ని పెంచిన ఎంపీ అభ్యర్థులందరూ ‘వలస’ ఓట్లు రాబట్టేందుకు హామీల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, ఇతర సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనులను ప్రధాన ప్రచారాస్త్రంగా ఎంచుకున్న అభ్యర్థులు తాము గెలిస్తే వలసలకు అడ్డుకట్ట వేసేలా స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తామంటూ హామీలు చేస్తున్నారు. అభ్యర్థులతో పాటు ఎమ్మెల్యేలు, ఇతర పార్టీల నాయకులందరూ క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహిస్తూ ఇలాంటి హామీలే ఇస్తున్నారు. కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలో వస్తుందని.. నరేంద్రమోదీ మళ్లీ ప్రధానమంత్రి అవుతారని.. తమను ఎంపీగా గెలిపిస్తే కేంద్రంతో పోరాడైనా పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నిధులు తీసుకొచ్చి పనులు పూర్తి చేస్తామని, వలసలను నివారించేందుకు ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామంటూ బీజేపీ అభ్యర్థులు డీకే అరుణ, బంగారు శ్రుతి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. తమకు మహబూబ్‌నగర్ ప్రజల సమస్యలు తెలుసని.. ఎంపీగా గెలిస్తే జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేసి ఎవరూ వలస వెళ్లకుండా, వలస వెళ్లిన వారిని రప్పించి ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, అసంపూర్తిగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని కాంగ్రెస్ అభ్యర్థులు చల్లా వంశీచందర్‌రెడ్డి, మల్లురవి హామీలు ఇస్తున్నారు. వలస వెళ్లిన వారందరూ తిరిగి వచ్చేలా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి వలసలకు అడ్డుకట్ట వేస్తామంటూ టీఆర్ఎస్ అభ్యర్థులు మన్నె శ్రీనివాస్‌రెడ్డి, పోతుగంటి రాములు ఎన్నికల ప్రచారంలో హామీల వర్షం కురిపిస్తున్నారు. ఏదేమైనా ఈ ఎన్నికల్లో వలస జీవులు ఎవరి వైపు మొగ్గు చూపుతారో అని అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. -
నాగర్ కర్నూల్లో నారాజయ్యేదెవ్వరు..?
సాక్షి. నాగర్‌కర్నూల్ : ఒకప్పుడు వలసలు, తీవ్ర కరువు కాటకాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న నాగర్‌కర్నూలు లోక్‌సభ నియోజకవర్గంలో ప్రస్తుతం ఎన్నికల యుద్ధం దాదాపు ఏకపక్షంగా మారింది. టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ ఉన్నా.. ప్రచారంలో మాత్రం ‘కారు’ దూసుకెళ్తోంది. ఇప్పటికే అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేయగా, నియోజకవర్గ ఇన్చార్జి, మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. చేతిలో ఉన్న ఒక్క ఎమ్మెల్యే జారుకోవడం, నేతల మధ్య సమన్వయ లోపంతో కాంగ్రెస్ కొట్టుమిట్టాడుతోంది. బీజేపీ మాత్రం తన అస్తిత్వాన్ని కాపాడుకునే పనిలో పడింది. ప్రభుత్వ విజయాలు, వైఫల్యాలు ప్రచారాస్త్రాలైనా.. ప్రధానంగా సాగునీరు, రైల్వేలైన్, జోగుళాంబ ఆలయ అభివృద్ధి చుట్టూ ఇక్కడ రాజకీయం తిరుగుతోంది. నాగర్‌కర్నూలు నియోజకవర్గం అంతా ఒకప్పుడు తీవ్ర కరువు కాటకాలు, వలసలకు పేరుగాంచింది. 2004లో ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి బాధ్యతలు చేపట్టాక కరువు నివారణ చర్యల్లో భాగంగా సాగునీటి వసతిని కల్పించేందుకు తొలి ప్రాధాన్యం ఇచ్చారు. కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకాలు చేపట్టారు. వైఎస్ మరణానంతరం ఈ పనులు నెమ్మదించినా, అనంతరం టీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ వేగిరం చేసింది. ఈ నాలుగు ప్రాజెక్టుల కింద మొత్తంగా 8.77 లక్షల ఎకరాలకు నీరివ్వాల్సి ఉండగా, ఇప్పటికే 6.03 లక్షల ఎకరాలకు సాగునీరందుతోంది. ఇందులో ఒక్క కల్వకుర్తి కిందే 3.40 లక్షల ఎకరాలకు సాగునీరు అందించింది. ఈ ప్రాజెక్టు కింద 700కు పైగా చెరువులను నింపారు. సాగుకు నీరందడంతో ఈ ప్రాంతంలో వలసలు ఆగాయి. దీనికి తోడు కొత్తగా పాలమూరు–రంగారెడ్డి ద్వారా పూర్వ పాలమూరు జిల్లాలో 10 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చేలా పనులు జరుగుతున్నాయి. ఇవి పూర్తయితే నాగర్‌కర్నూలు పరిధిలోని ప్రాంతాలన్నీ సస్యశ్యామలమవుతాయి. అదే జరిగితే వలసలకు అడ్డుకట్ట పడినట్టేనని స్థానికులు చెబుతున్నారు. అయితే ప్రధాన ప్రాజెక్టుల పరిధిలో ఇంకా భూసేకరణ, నిర్వాసితులకు పరిహారం, కాల్వల పనులు పూర్తి, ఆర్డీఎస్ కాల్వల ఆధునీకరణ వంటి పనులు చేపట్టాల్సి ఉంది. జోగుళాంబ.. రైల్వేలైన్..గట్టు.. ఈ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో పలు కీలకాంశాల చుట్టూ అన్ని పార్టీలు ప్రదక్షిణం చేస్తున్నాయి. ముఖ్యంగా నాలుగు దశాబ్దాలుగా గద్వాల–మాచర్ల రైల్వేలైన్ నాగర్‌కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ ప్రజలను ఇదిగో అదిగో అంటూ ఊరిస్తోంది. ప్రతి పార్లమెంట్ ఎన్నికల్లో ఇదే ప్రధానాంశంగా మారింది. పోటీ చేసే ప్రతి నాయకుడు రైల్వేలైన్‌ను సాధిస్తామని చెబుతున్నా.. సాధ్యం కాలేదు. గద్వాల–మాచర్ల రైల్వేలైన్ కోసం 1980లో అప్పటి ఎంపీ మల్లు అనంతరాములు కేంద్రానికి ప్రతిపాదనలు పంపగా, ఇప్పటికీ పనులు కొలిక్కి రాలేదు. గట్టు ఎత్తిపోతల పథకం, చిన్నోనిపల్లి రిజర్వాయర్ పనులు చేపడితే గద్వాల నియోజకవర్గంలోని గట్టు, ధరూర్, కేటిదొడ్డి మండలాలకు పూర్తిస్థాయిలో సాగునీరందే అవకాశం ఉంది. అయితే ఈ ప్రతిపాదనలు మళ్లీ మారడంతో ప్రాజెక్టు పట్టాలెక్కేందుకు సమయం పట్టేలా ఉంది. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన ఐదవ శక్తిపీఠం జోగుళాంబ ఆలయాన్ని అభివృద్ధి చేయాల్సి ఉంది. ఇక్కడ సరైన రవాణా వసతులు లేవు. ఆలయ అభివృధ్ధికి పురావస్తు శాఖ నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్న గద్వాల జిల్లాకు చేనేత పార్కు మంజూరైంది. అయితే, పనులు మొదలు కావాల్సి ఉంది. అచ్చంపేట నియోజకవర్గంలో కాగితపు పరిశ్రమ ఏర్పాటు, కొల్లాపూర్ నియోజకవర్గంలో సోమశిల బ్రిడ్జి నిర్మాణం, శ్రీశైలం ముంపు నిర్వాసితులకు సంబంధించి 98 జీఓ అమలు వంటి అంశాలు ఈ ఎన్నికల్లో కీలకం కానున్నాయి. లోక్‌సభ ఓటర్లు పురుషులు 7,99,182 మహిళలు 7,89,529 ఇతరులు 35 మొత్తం 15,88,746 నాగర్‌కర్నూలు లోక్‌సభ పరిధిలో అసెంబ్లీ సెగ్మెంట్లు గద్వాల, అలంపూర్, వనపర్తి, నాగర్‌కర్నూలు, అచ్చంపేట, కొల్లాపూర్, కల్వకుర్తి రేసులో ముందున్న ‘కారు’ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఈ పార్లమెంట్ పరిధిలోని ఏడు స్థానాల్లో ఆరింట టీఆర్ఎస్ గెలిచింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మొత్తంగా 2 లక్షల మెజారిటీ వచ్చింది. ఆ పార్టీకి 6,36,002 ఓట్లు రాగా, కాంగ్రెస్‌కు 4,44,084 ఓట్లు వచ్చాయి. అయితే 2004 నుంచి ఈ లోక్‌సభ స్థానంలో టీఆర్ఎస్ గెలవలేదు. గత ఎన్నికల్లోనూ కాంగ్రెస్ నుంచి నంది ఎల్లయ్య టీఆర్ఎస్ అభ్యర్థిపై 17,800 ఓట్లతో గెలిచారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని నాగర్‌కర్నూలులో ఎట్టి పరిస్థితుల్లోనూ పాగా వేయాలని పట్టుదలతో ఉన్న టీఆర్ఎస్ అన్ని పార్టీల కన్నా ముందే కదన రంగంలోకి దిగింది. ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సన్నాహక సభ పేరుతో వనపర్తి సభకు హాజరయ్యారు. శాసనసభ ఎన్నికల్లో ఈ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో 51 శాతం ఓట్లు వచ్చిన దృష్ట్యా, ఈసారి ఎలాగైనా 4 లక్షల ఓట్ల మెజార్టీతో పార్టీ అభ్యర్థి పి.రాములును గెలిపించి కేసీఆర్‌కు బహుమానంగా ఇద్దామంటూ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దీంతో పాటే కొల్లాపూర్ నియోజకవర్గం నంచి గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డిని పార్టీలో చేర్చుకున్నారు. దీంతో టీఆర్ఎస్ బలం మరింత పెరిగింది. అనంతరం గత నెల 31న వనపర్తిలో సీఎం కేసీఆర్ సభ విజయవంతం కావడంతో పార్టీలో మరింత జోష్ పెరిగింది. సర్పంచ్ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ మద్దతుదారులు ప్రతి నియోజకవర్గంలో వంద స్థానాలకు పైగా కైవసం చేసుకోవడం పార్టీకి కలిసొస్తోంది. ఇతర పార్టీల నుంచి గెలిచిన సర్పంచ్‌లు, ముఖ్య నేతలు పార్టీలో చేరుతుండటం ఊపునిస్తోంది. కల్వకుర్తి సామర్థ్యాన్ని 25 నుంచి 40 టీఎంసీలకు పెంచడం, దీని ద్వారా 400కు పైగా చెరువులను నింపడం, శ్రీశైలం నిర్వాసితులను ఆదుకుంటామని, సిధ్ధేశ్వరం బ్రిడ్జి నిర్మించి తీరుతామని చేసిన వాగ్దానాలు కలిసొస్తున్నాయి. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేసి పూర్వ మహబూబ్‌నగర్ జిల్లాలో 20 లక్షల ఎకరాలకు ఆయకట్టుకు నీరిస్తామన్న సీఎం హామీ సైతం ఇక్కడ బాగా పనిచేస్తోం ది. ‘ఎన్నికల తర్వాత ఇక్కడికొచ్చి మూడు రోజులు ఉంటా.. అన్ని సమస్యలు ప్రజా దర్బార్‌లో పెట్టి పరిష్కరించుకుందాం’ అని సీఎం కేసీఆర్ వనపర్తి సభలో ప్రకటించడం ఇక్కడ ప్రజలను ప్రభావితం చేస్తోంది. పోటీలో ఉన్న పి.రాములుకు సౌమ్యుడనే పేరుండటం, ఆయనకు మాజీ ఎంపీ మందా జగన్నాథం నుంచి సహకారం అందుతుండటంతో విజయవకాశాలు మెరుగయ్యాయి. పై‘చేయి’ కష్టమే.. ఈ నియోజకవర్గంలో తొలి నుంచి కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగిస్తూ వస్తోంది. 2009, 2014 ఎన్నికల్లోనూ ఆ పార్టీ అభ్యర్థులు ఇక్కడ గెలుపొందారు. మొత్తంగా ఈ స్థానానికి 12సార్లు ఎన్నికలు జరగ్గా ఏడుసార్లు కాంగ్రెస్, నాలుగుసార్లు టీడీపీ, ఒకసారి టీపీఎస్ గెలుపొందాయి. ఇందులో 1980–84, 1989–91 మధ్య కాలంలో మల్లు అనంతరాములు, 1991–96, 1998–99 మధ్యకాలంలో మల్లు రవి ఎంపీగా పని చేశారు. ప్రస్తుతం మళ్లీ మల్లు రవి పోటీలో ఉన్నారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో జడ్చర్ల అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన ఆయన మాజీ మంత్రి లక్ష్మారెడ్డి చేతిలో ఓడిపోయారు. లోక్‌సభ నియోజకవర్గంపై పట్టు ఉండటం, సీనియర్ నేత కావడంతో కాంగ్రెస్ అధిష్టానం ఆయనకే ఈ టికెట్ కేటాయించింది. ప్రస్తుతం పార్టీ నుంచి జరుగుతున్న ఫిరాయింపులు ఆయనకు ఇక్కట్లను తెచ్చిపెడుతున్నాయి. కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి హైదరాబాద్‌లో గులాబీ కండువా కప్పుకున్నారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కొల్లాపూర్–సిద్ధేశ్వరం వంతెన, శ్రీశైలం ముంపు బాధితులను ఆదుకుంటామని కేసీఆర్ హామీ ఇవ్వడంతోనే ఆయన కాంగ్రెస్‌ను వీడినట్లు ప్రకటించారు. కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన బీసీ నేత, మాజీ ఎమ్మెల్యే చిత్తరంజన్‌దాస్ సైతం పార్టీని వీడారు. గత ఎన్నికల్లో నంది ఎల్లయ్య గెలుపులో కీలకంగా వ్యవహరించిన మాజీ మంత్రి డీకే అరుణ ప్రస్తుతం బీజేపీలో చేరి మహబూబ్‌నగర్ పార్లమెంట్ బరిలో నిలిచారు. ఇదే పార్లమెంట్ పరిధిలోని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి సైతం కాంగ్రెస్ నుంచి మహబూబ్‌నగర్ పోటీలో ఉన్నారు. దీంతో మల్లు రవికి కీలక నేతల సహాయం కొరవడింది. సీనియర్ నేత చిన్నారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంపత్కుమార్పైనే ఎక్కువ ఆధారపడుతున్నారు. గట్టు ఎత్తిపోతల చేపట్టకపోవడం, తుమ్మిళ్ల రెండో ఫేజ్, కల్వకుర్తి, నెట్టెంపాడు పనుల పూర్తిలో విఫలం వంటి అంశాలను మల్లు రవి తన ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. జడ్చర్ల–మాచర్ల రైల్వేలైన్ పనులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడం వల్లే పనులు ముందుకు సాగడం లేదని ఆరోపిస్తున్నారు. ఇటీవల వనపర్తిలో రాహుల్‌గాంధీ బహిరంగసభ సక్సెస్ కావడం కాంగ్రెస్‌లో సంతోషాన్ని నింపింది. ‘కమల’ వికాసం ఎంత? బీజేపీ తరఫున పార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ కూతురు బంగారు శ్రుతి పోటీలో ఉన్నారు. 2006 నుంచి పార్టీలో క్రియాశీలక కార్యకర్తగా సేవలందిస్తున్న ఆమె ప్రస్తుతం బీజేపీ దళిత మోర్చా జాతీయ కార్యదర్శిగా పని చేస్తున్నారు. ఆమె తన విజయానికి తీవ్రంగానే శ్రమిస్తున్నారు. అయితే కల్వకుర్తి పరిధిలో తప్ప మరెక్కడా ఆమెకు చెప్పుకోదగ్గ బలం లేదు. ఈ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన ఆచారికి చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు వచ్చాయి. అక్కడ మినహా బీజేపీ ఎక్కడా బలంగా లేదు. కొంతమేర వనపర్తిలో మాత్రం పార్టీకి పట్టున్న నేతలున్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీ అస్తిత్వాన్ని కాపాడేందుకు శ్రుతి తీవ్రంగానే శ్రమిస్తున్నారు. దేశ సమగ్రత విషయంలో ప్రధాని నరేంద్రమోదీ సేవలు, అవినీతి నిర్మూలన, సర్జికల్ స్ట్రయిక్స్, స్కిల్ ఇండియా వంటి వాటిని ప్రచారం చేస్తున్నారు. ఇటీవల మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచార సభ విజయవంతం కావడం, శక్తిమేర బీజేపీ శ్రేణులు కలిసిమెలిసి పనిచేయడం కొంత సానుకూలంగా ఉన్నాయి. నాగర్‌కర్నూలుæ పార్లమెంట్ నియోజకవర్గంలో వీలైనంత ఎక్కువగా శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణనిచ్చి ఉపాధి కల్పిస్తానంటూ ఆమె చేస్తున్న ప్రచారం యువతను ఎక్కువగా ఆకర్షిస్తోంది. -
భగీరథ.. దాహం తీర్చే
సాక్షి, కల్వకుర్తి: వేసవి వస్తే చాలు పల్లెలు, పట్టణాలని వ్యత్యాసం లేకుండా తాగునీటికి కష్టాలు ఉండేవి. మహిళలు బిందెలు పట్టుకొని వ్యవసాయ పొలాలలోని బోర్ల వద్దకు పరుగులు తీసేవారు. ప్రభుత్వం లీజ్బోర్లు, ట్యాంకర్లతో సరఫరా చేస్తూ రూ.కోట్లు వ్యయం చేసేది. ఎన్ని సమీక్షలు పెట్టినా నిధులు నీళ్ల వ్యయం చేసినా నీటి కష్టాలు మాత్రం తీరేవి కావు. ప్రజలు నీటి బిందెలు పట్టుకొని ధర్నాలు సైతం చేసేవారు. ప్రతి గ్రామ సర్పంచ్‌కి అధికారులకు ఈ సమస్య పెద్దతలనొప్పిగా మారేది. ప్రస్తుతం అంతా మారిపోయింది. సీఎం కేసీఆర్ బృహత్తరమైన ఆలోచన తాగునీటి ఎద్దడికి శాశ్వతమైన పరిష్కారం చూపింది. మిషన్ భగీరథతో అ న్ని చోట్ల తాగునీటి కటకటకు పుల్‌స్టాప్ పడింది. వేసవిలో సైతం దాహం తీరి నీటి కష్టాలు తొలిగాయి. 35 గ్రామాలకు సరఫరా మండలంలోని 35 గ్రామాలకు భగీరథ ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. అన్ని చోట్ల అవసరాన్ని గుర్తించి కొత్తగా ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులు మం జూరు చేశారు. కొన్ని చోట్ల ట్యాంకుల నిర్మాణం పూర్తయింది. మిగతా చోట్ల నిర్మాణంలో ఉన్నా యి. నిర్మాణం పూర్తయిన గ్రామాలు సుద్దకల్, గుండూరు, తాండ్ర, పంజుగుల్, సత్యసాయికాలనీలో కొత్త ట్యాంకులకు నీరు ఎక్కించి గ్రామాల్లో సరఫరా చేస్తున్నారు. మిగతా గ్రామాల్లో పాత ట్యాంకులకు నీటిని పంపింగ్ చేసి ఇళ్లలోకి సరఫరా చేస్తున్నారు. దాదాపు పెద్దగ్రామాలకు రోజు ల క్ష లీటర్ల చొప్పున సరఫరా చేస్తుంటే చిన్న గ్రామాలకు 50వేల లీటర్ల చొప్పున సరఫరా చేస్తున్నారు. వేసవిలో సైతం ప్రజల దాహార్తిని తీరుస్తున్నారు. కల్వకుర్తి మున్సిపల్ పరిధిలో.. వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో భూగర్భజలాలు ఏటా గణనీయంగా పడిపోయి మున్సిపల్ బోర్లే కాదు, ఇళ్లలో ఉండే బోర్లు సైతం ఎండిపోయాయి. దీంతో కల్వకుర్తి పట్టణంలో నీటి సమస్య తీవ్రంగా ఉండేది. అంతే కాకుండా దాదాపు 40వేల జనాభా ఉండడంతో నీటి సమస్య జఠిలంగా ఉండేది. దీంతో మున్సిపల్లో కొన్నేళ్ల నుంచి నీటి సరఫరా ట్యాంకర్ల ద్వారానే చేస్తున్నారు. నీటి సరఫరాకు రోజు రూ.లక్ష ట్యాంకర్లకే ఖర్చు పెట్టేవారు. సమస్య తీరేది కాదు. ప్రజలు ఎవరింటికి వారు ట్యాంకర్ల ద్వారా పోయించుకునే వారు. నాలుగేళ్లలో ట్యాంకర్ల కోసం రూ.మూడు కోట్లపైనే వ్యయం చేశారని అంచనా. ఇక భగీరథ వచ్చిన తర్వాత పట్టణానికి నిత్యం 40లీక్షల లీటర్లు సరఫరా చేస్తున్నారు. ట్యాంకర్ల నిర్మాణం పూర్తి కాకపోవడంతో పాత ట్యాంకుల ద్వారా సరఫరా చేస్తున్నారు. వేసవి వస్తే రోడ్లపై, కాలనీలో ట్యాంకర్ల చప్పుడే ఉండేది. ఇప్పుడు ఆ సమస్య లేకుండా పోయింది. ఒక్కరోజు తప్పించి మరోరోజు నీటి సరఫరా అవుతుండడంతో పట్టణంలో వేసవిలో సైతం నీటి సమస్య లేకుండా ఉండడంతో ప్రజలు చాలా సంతోష పడుతున్నారు. వేసవి కాలం అంతా.. సరఫరా మరో రెండు నెలల పాటు వేసవి ఉంటుం ది. భగీరథ నీరు వేసవిలో ఎలాంటి ఇబ్బంది లేకుండా సరఫరా చేయనున్నామని మిషన్ భగీరథ ఈఈ పు ల్లారెడ్డి తెలిపారు. దీంతో ఇక వేసవిలో నీటి సమస్య రాదు. గ్రా మాల్లో, పట్టణాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికినట్లే. వేసవిలో సరఫరా చేస్తే ఇక వర్షాకాలం నల్లేరుమీద నడకలాంటిందే. -
సంక్షేమానికే పట్టం
‘టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు రాష్ట్రాన్ని సంక్షేమ బాటలో నడిపిస్తున్నాయని, ఈ పథకాలు దేశంలో కూడా అమలు కావాలంటే టీఆర్ఎస్ 16 ఎంపీ సీట్లు గెలవాల’ని పలువురు అభిప్రాయపడ్డారు. కార్కొండకు చెందిన వెంకటయ్య ‘కేసీఆర్ అధికారంలోకి వచ్చాక పింఛన్లు పెంచారు. రైతుబంధు కింద ఎకరాకు రూ.8 వేలు ఇస్తూ ఆదుకుంటున్నారు. ఇంతకంటే ఏం కావాలి? లోక్‌సభ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్నే గెలిపిస్తాం’ అని కుండబద్ధలు కొట్టారు. నాగర్‌కర్నూలు – మన్ననూరు (శ్రీశైలం రోడ్డు) రహదారిపై ‘సాక్షి’ రోడ్డు షో నిర్వహించింది. రాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కారు పనితీరుపై పలువురు సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే, దేశ రక్షణ దృష్ట్యా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని, మళ్లీ మోదీ ప్రధాని కావాలని కూడా ఆకాంక్షించారు. నాగర్‌కర్నూలు లోక్‌సభ స్థానం నుంచి పి.రాములు (టీఆర్ఎస్), మల్లు రవి (కాంగ్రెస్), బంగారు శ్రుతి (బీజేపీ) తలపడుతుండగా, ఈ నియోజకవర్గ ప్రజల మనోగతం ఇలా ఉంది..నాగర్‌కర్నూలు– సాక్షి, నెట్వర్క్ టీఆర్ఎస్కే మద్దతు ఎందుకంటే..: రోడ్డు షోలో భాగంగా శ్రీశైలం రహదారిలో ప్రయాణించిన ‘సాక్షి’ బృందం.. ఆ రహదారిపై వెళ్తున్న పలువురిని వివిధ అంశాలపై పలకరించింది. ఏ పార్టీకి ఎందుకు ఓటెయ్యాలనుకుంటున్నారు?, కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని భావిస్తున్నారు?, లోక్‌సభ ఎన్నికల్లో మీ ప్రాంతానికి సంబంధించిన ప్రభావం చూపే ప్రధానాంశం ఏమిటి?, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి?.. అనే అంశాలపై ప్రశ్నించింది. రాష్ట్రం విషయానికి వచ్చేసరికి టీఆర్ఎస్ పలు సీట్లలో గెలుస్తుందని చెప్పిన వారు.. కేంద్రంలో మాత్రం బీజేపీ అధికారంలోకి వస్తుందని, మోదీ మళ్లీ ప్రధాని అవుతారని బదులిచ్చారు. కోమటికుంటకు చెందిన జయంత్‌రెడ్డి ఇదే విషయమై మాట్లాడుతూ.. ‘టీఆర్ఎస్ అభ్యర్థి రాములు సౌమ్యుడు. అలాంటి వ్యక్తి గెలిస్తే లోక్‌సభ పరిధిలో అభివృద్ధి జరుగుతుంది’ అన్నారు. తిమ్మాజిపేటకు చెందిన పాల ఉత్పత్తిదారుడు గువ్వల నర్సింహ, గుమ్మకొండకు చెందిన వ్యాపారి షేక్ మహబూబ్‌పాషా, బిజినేపల్లికి చెందిన కృష్ణమూర్తి.. ‘రాష్ట్ర ప్రభుత్వ పనితీరు అన్ని విషయాల్లోనూ బాగుంద’ని కితాబునిచ్చారు. మోదీ మళ్లీ రావాలి: ‘ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఉగ్రవాదమని, దాని నుంచి దేశాన్ని బీజేపీ మాత్రమే కాపాడగలుగుతుంద’ని చెప్పిన వారిలో యువతే ఎక్కువగా ఉన్నారు. తెలకపల్లి రాకొండ గ్రామానికి చెందిన కృష్ణయ్యగౌడ్ మాట్లాడుతూ ‘గతంలో ప్రధానమంత్రులుగా చేసిన వారెవరూ పాకిస్తాన్లో ఉగ్రవాదులను ఏరి పారేసిన ఉదంతాలు లేవు. మోదీ ప్రధాని అయ్యాక పాకిస్తాన్ లాంటి ఉగ్ర దేశాలకు సరైన బుద్ధి చెప్పారు. ఆయన నాయకత్వంలోనే దేశం సురక్షితంగా ఉంటుంది’ అన్నారు. మోదీ విధానాల వల్ల చిన్నపాటి వ్యాపారులకు రుణాలందాయనే అభిప్రాయం కూడా వ్యక్తమైంది. కమ్మరెడ్డిపల్లికి చెందిన ఆవుల రామకృష్ణ ‘చిరు వ్యాపారుల గురించి ఆలోచించిన ఏకైక వ్యక్తి మోదీ’ అని ప్రశంసించారు. పెద్ద నోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థ గాడిన పడిందని, కేంద్రంలో మోదీ ప్రభుత్వం దేశ భద్రతకు, అభివృద్ధికి తీసుకుంటున్న దీర్ఘకాలిక చర్యలు మునుముందు మరిన్ని ఫలితాలనిస్తాయని పలువురు చెప్పారు. ‘మోదీ మళ్లీ ప్రధాని అయితే దేశానికి మరో ఐదేళ్ల సుస్థిర పాలన అందుతుంది’ అని తెలకపల్లికి చెందిన రవిగౌడ్ అభిప్రాయ పడ్డారు. ప్రత్యామ్నాయం : ప్రస్తుతం దేశాన్ని ఇప్పటి వరకు పాలించిన బీజేపీ, కాంగ్రెస్‌లు దేశాభివృద్ధికి పాటుపడలేదని, కేంద్రంలో ప్రత్యామ్నాయం వస్తేనే బాగుంటుందనే అభిప్రాయాన్ని కూడా కొందరు వ్యక్తం చేశారు. తెలకపల్లి మండలం గడ్డంపల్లికి చెందిన రమేష్‌శెట్టి ‘థర్డ్ ఫ్రంట్ అధికారంలోకి వస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. అదీ కేసీఆర్ నేతృత్వంలో రావాలి’ అన్నారు. మరికొందరు కాంగ్రెస్ పార్టీ గెలవాలని ఆకాంక్షించారు. ఇంకొందరు రాష్ట్రంలో టీఆర్ఎస్కే ఓటేస్తామని చెబుతున్నా.. కేంద్రంలో మాత్రం నరేంద్రమోదీనే ప్రధాన మంత్రి కావాలని కోరుకున్నారు. మరికల్‌కు చెందిన మేస్త్రీ దశరథం.. ‘కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావాలి. కానీ ఇక్కడ మాత్రం టీఆర్ఎస్ ఎంపీ గెలవాలి. అలా అయితేనే పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయి, సాగునీరు వస్తుంది’ అన్నారు.తిమ్మాజిపేటకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ ‘టీఆర్ఎస్ అభివృద్ధి పనులు బాగా చేస్తోందని, మళ్లీ ఆ పార్టీకే మద్దతునిస్తా’నని చెప్పారు. కానీ కేంద్రంలోకాంగ్రెస్ వస్తే బాగుంటుందన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు కావాలంటే టీఆర్ఎస్కు చెందిన ఎంపీ అభ్యర్థిని గెలిపించాలని అన్నారు. రోడ్డు షో.. రూటిదీ ♦ నాగర్‌కర్నూలు లోక్‌సభ స్థానం పరిధిలోకి వచ్చే నాగర్‌కర్నూల్– శ్రీశైలం రహదారిపై ‘సాక్షి’ బృందం దాదాపు 50 కిలోమీటర్ల మేర పర్యటించింది. ♦ తిమ్మాజిపేట మండలం మరికల్ నుంచి తెలకపల్లి మండలం రాకొండ వరకు గల ఈ దూరంలో.. రహదారి పక్కన ఉన్న వివిధ వర్గాల ప్రజలను, ప్రయాణికులను, వ్యాపారులను, రైతుల స్పందనను ఈ బృందం తెలుసుకోగలిగింది. ♦ 50 కి.మీ. దూరాన్ని 10 రూట్లుగా విభజించుకుని.. ఒక్కో రూట్లో కనీసం 10 నుంచి 20 మంది అభిప్రాయాన్ని కోరింది. ఉద్యోగులు, వ్యాపారులు, మహిళలు, యువత, రైతులు, కూలీలు.. ఇలా దారిలో ఎదురుపడిన ప్రతి ఒక్కరినీ పలకరించి, వారి అంతరంగాన్ని తెలుసుకునే ప్రయత్నం జరిగింది. ♦ ఎన్నికలు ఎలా జరుగుతున్నాయి?, ఏ పార్టీ గెలుస్తుంది?, ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది?, కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? తదితర ప్రశ్నలకు స్పందన కోరింది. మా కోసం కూడా ఏదైనా.. కులవృత్తిపైనే ఆధారపడ్డ కుమ్మరుల బతుకులుఛిద్రమవుతున్నాయి. కుండల అమ్మకం చాలా తగ్గింది. కుండల తయారీ మా తరంతోనే అంతరించేలా ఉంది.వివిధ కులాలకు ఇస్తున్నట్టుగానే టీఆర్ఎస్ సర్కారు మా కోసం ఏదైనా చేయాలి.– కుమ్మరి వెంకటయ్య, ఎండబెట్ల ‘మద్దతు’ వద్దు.. గిట్టుబాటు కావాలె నాకున్న కొద్ది భూమిలో వరి, వేరుశనగ, కూరగాయలు సాగు చేశాం. గిట్టుబాటు కాకపోవడంతో రోజూ ఇక్కడే ఉండి కిలోలెక్కన అమ్ముకోవాల్సి వస్తుంది. సర్కారోళ్లు రైతులకు మద్దతు ధర కాకుండా గిట్టుబాటు ధర అందిస్తే మేలు జరుగుతుంది.– బోనాసి లక్ష్మి, కూరగాయల రైతు,తిర్మలాపూర్ రైతుబంధు మంచిగుంది నా మద్దతు టీఆర్ఎస్కే. కేసీఆర్ ప్రభుత్వం రైతులకు మంచి చేస్తోంది. రైతుబంధు ద్వారా నాకు డబ్బులు వచ్చాయి. నాలాగా మరెందరో రైతులు సంతోషంగా ఉన్నారు. కేంద్రంలో మాత్రం బీజేపీ వస్తే బాగుంటుంది.– సత్యనారాయణ, రైతు, తిమ్మాజిపేట మంచి చేసే వారికే.. నాకు ఓటు హక్కు వచ్చి మూడేళ్లయ్యింది. అసెంబ్లీ ఎన్నికల్లోటీఆర్ఎస్కే మద్దతునిచ్చా. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో అందరూ ఓటు అడుగుతున్నారు. పేదలకు మంచి చేసే వారికే నా ఓటు. – గంటా శంకర్, బొమ్మన్‌పల్లి వీధి వ్యాపారులకు ఉపాధి చాలా ఏళ్లుగా రోడ్డుపైనే మా బతుకు జట్కాబండి నడుస్తోంది. ఎండనక, వాననక, వణుకుతూ జీవనం సాగిస్తున్నాం. గతంలో కంటే ప్రస్తుతం గిరాకీ కూడా తగ్గింది. వీధి వ్యాపారులకు గుర్తింపు కార్డులు ఇచ్చి ఆర్థికంగా ఆదుకోవాలి.– పోలేపల్లి లక్ష్మమ్మ,చాటల వ్యాపారి, నాగర్‌కర్నూల్ గుర్తింపు కార్డులివ్వాలి.. కేంద్ర ప్రభుత్వం చిరు వ్యాపారులకు గుర్తింపు కార్డులను ఇచ్చి రుణాలను అందించాలి. కానీ చాలాకాలంగా రోడ్డు సైడ్ వ్యాపారాలతో బతుకీడుస్తున్న మాకు గుర్తింపు కార్డుల్లేవు. రోడ్డుకు అడ్డంగా వ్యాపారాలున్నాయనే నెపంతో ట్రాఫిక్ పోలీసుల నుంచి ఇతరత్రా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కనీసం బ్యాంకు రుణాలైనా ఇప్పిస్తే వడ్డీ వ్యాపారుల నుంచి అప్పులు తీసుకునే బాధ తప్పుతుంది. – తన్నీరు మురళి, చిరు వ్యాపారి సమ న్యాయం జరగాలంటే.. రైతులను పట్టించుకునేది కాంగ్రెస్సే. అందుకే ఆ పార్టీనే అధికారంలోకి రావాలి. రాహుల్ ప్రధాని కావాలి. కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న మల్లు రవిని ఎంపీగా గెలిపించి పార్లమెంట్‌కు పంపుతాం. – మొగులాలుగౌడ్, పర్వతాపూర్ మరోసారి ఆయనే.. కేంద్రంలో నరేంద్ర మోదీ అధికారంలోకి మరోసారి రావాలి. ఆయన ఉద్యోగాలు ఇచ్చేందుకు అనేక విప్లవాత్మక మార్పులు తెచ్చారు. దూరదృష్టితో చేపడుతున్న పనులు సఫలమైతే రానున్న ఐదేళ్లలో అనేక లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తారని నమ్ముతున్నా. నరేంద్రమోదీ గెలిస్తేనే ఇది సాధ్యమవుతుంది.– సత్యనారాయణ, మంతటి -
నయా జోష్‌లో ప్రధాన పార్టీలు
సాక్షి, మహబూబ్‌నగర్ : జిల్లాలో వరుసగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి కేసీఆర్ జరిపిన పర్యటనలు ఆయా పార్టీల శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపాయి. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ పార్లమెంట్ల పరిధిలో నిర్వహించిన బహిరంగ సభల్లో పాల్గొన్న అగ్రనేతలు తమ పార్టీ అభ్యర్థులతో పాటు క్యాడర్‌కు కూడా దిశానిర్దేశం చేసి వెళ్లారు. సభలన్నీ విజయవంతం కావడంతో ప్రధాన పార్టీ శ్రేణులు రెట్టింపు ఉత్సాహంతో ప్రచారంలో పాల్గొంటున్నారు. సమీపిస్తున్న పోలింగ్ పోలింగ్‌కు వారం రోజులు మాత్రమే గడువు ఉండడం, ఎన్నికల ప్రచారానికి కేవలం ఐదు రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకునే పనిలో పడ్డారు అభ్యర్థులు, ముఖ్యనేతలు. ఇప్పటికే అభ్యర్థులు స్థానిక నాయకులతో కలిసి ప్రచారాన్ని హోరెత్తించారు. ఊరూవాడ పర్యటిస్తూ అన్ని వర్గాలను కలుస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. వారి పార్టీ అధికారంలోకి వస్తే చేపట్టబోయే కార్యక్రమాలు, అమలు చేయనున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓటర్లకు గాలం వేస్తున్నారు. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో పనిచేసే నాయకులు, క్యాడర్‌ను గుర్తిస్తూ వారికి ప్రచార బాధ్యతలు అప్పగించారు. పగలంతా ఎన్నికల ప్రచారం.. సాయంత్రం క్యాడర్‌తో వ్యూహరచనలు చేస్తున్నారు. దీంతో ఉమ్మడి జిల్లాలో రాజకీయం వేడెక్కింది. ఒక్కొక్కటిగా వదులుతున్న ప్రచారాస్త్రాలు ఎన్నికల సమయం దగ్గరపడుతుండగా టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు తమ ప్రచారాస్త్రాలకు పదును పెట్టి ఒక్కొక్కటిగా వదులుతున్నారు. రాజకీయ అనుభవం.. స్థానికత అంశాలే ప్రధాన ఎజెండాగా ఒకరిపై మరొకరు విమర్శలు.. ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు. టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు ఇన్నాళ్లు జరిగిన అభివృద్ధి గురించి వివరిస్తున్నారు. ముఖ్యంగా పాలమూరు ఎత్తిపోతల పథకానికి నిధులు.. ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించే అంశంపై మాట్లాడుతున్నారు. తెలంగాణలో 16 స్థానాల్లో గెలుపొంది థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుతో జాతీయ రాజకీయాలను శాసించడమే లక్ష్యంగా పావులు కదుపుతోన్న టీఆర్ఎస్ పార్టీ గత ఐదేళ్లలో రాష్ట్రంలో అమలు చేసిన సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం నిర్వహిస్తోంది. అందులో భాగంగానే ముస్లిం మైనార్టీల ఓట్లను కూడగట్టడానికి తాజాగా 12 శాతం రిజర్వేషన్లను తెరపైకి తీసుకొచ్చింది. అంతటితో ఆగకుండా మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో స్థానిక ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి తరుఫున ఎన్నికల ప్రచారం నిర్వహించడానికి హోంశాఖ మంత్రి మహమూద్ అలీని పిలిపించారు. టీఆర్ఎస్కు పట్టం కడితేనే 12శాతం రిజర్వేషన్ వచ్చితీరుతుందని భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. ఇటు మహబూబ్‌నగర్ అటు నాగర్‌కర్నూల్ బీజేపీ అభ్యర్థులు డీకే అరుణ, బంగారు శ్రుతితో పాటు ఆ పార్టీ శ్రేణులు దేశ రక్షణ.. భద్రతతో పాటు కేంద్రంలో మోదీ అవసరంపై విస్తృత ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ ఎంపీ అభ్యర్థులు వంశీచంద్‌రెడ్డి, మల్లురవి కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే న్యాయ్ పథకం కింద పేదల బ్యాంకు ఖాతాల్లో ఏడాదికి రూ.72వేలు జమ చేస్తామనీ, రైతులకు ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీ చేస్తామనే అంశాలపై ప్రచారం చేస్తున్నారు. చివర్లో ఇంకొందరు..? ఇప్పటికే బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ అధినేతలు ఉమ్మడి జిల్లాలోని రెండు పార్లమెంట్ పరిధుల్లో పర్యటించారు. ఈనెల 7న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంతో పాటు జడ్చర్ల, షాద్‌నగర్‌లో స్థానిక ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డికి మద్దతుగా నిర్వహించనున్న బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. దాతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ సైతం వచ్చే అవకాశాలున్నాయని ఆయా పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. -
మున్సిపల్ స్థలంపై కన్ను!
సాక్షి, అచ్చంపేట: స్థానిక మున్సిపాలిటీ పరిధిలో విలువైన స్థలాలు అన్యాక్రాంతమవుతున్నాయి. గతంలో గ్రామ పంచాయతీ వారు వివిధ సంఘాలకు సుమారు 6వేల గజాల స్థలాలు దారదత్తం చేశారు. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం వీటి విలువ రూ.10కోట్లపై మాటే. పట్టణ నడ్డిబొడ్డున ఉన్న స్థలాలపై అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. లేఅవుట్ల రూపేణ పంచాయతీకి కేటాయించిన స్థలాలను పరిరక్షించుకోవడంలో మున్సిపాలిటీ పూర్తిగా విఫలమైంది. అచ్చంపేటలో గజం ధర రూ.7వేల నుంచి రూ.17 వేల వరకు పలుకుతోంది. వందలు, వేలలో ఉన్న పన్నులు చెల్లించకుంటే నల్లా కనెక్షన్ తొలగిస్తామని హెచ్చరించే మున్సిపల్ అధికారులు అనుమతులు లేకుండా నిర్మాణాలు జరుగుతున్న పట్టించుకోరు. రియల్ వ్యాపారుల నుంచి పంచాయతీకి రావాల్సిన రూ.లక్షల ఆదాయ వనరులను తుంగలో తొక్కేస్తున్నారు. మేజర్ గ్రామంచాయతీ సమయంలో పట్టణంలో వెంచర్లు చేసినా.. 10శాతం స్థలంతో పాటు వెడల్పు రోడ్లు చేశారు. మున్సిపాలిటీగా అపగ్రేడ్ తర్వాత మేజర్ పంచాయతీ నుంచి నగరపంచాయతీ, మున్సిపాలిటీగా ఆప్‌గ్రేడ్ అయినా ఇంతవరకు ఒక వెంచర్లో కూడా స్థలం ఇవ్వలేదంటే ఎంత ఉదాసీనంతో వ్యరిస్తున్నారో అర్థమవుతోంది. ప్రస్తుతం పట్టణంలో పదుల సంఖ్యలో వెంచర్ల వెలిశాయి. వెంచర్లలో ఎక్కువశాతం కౌన్సిలర్లు భాగస్వాములుగా ఉండడంతో ఈ పరిస్థితి దాపురించినట్లు విద్యావంతులు, మేధావులు చర్చించుకుంటున్నారు. దీంతో మున్సిపల్ ఆదాయానికి గండిపడుతోంది. వివిధ సర్వే నంబర్లలో.. సర్వే నంబరు 292ఇలో 208 గజాల స్థలాన్ని టైలరింగ్ అసోషియేషన్‌కు కేటాయించారు. 309, 310 సర్వే నంబరులో 1040 గజాలు వెంకటేశ్వర కాలనీ వెల్ఫేర్ సొసైటీ, 311/62లో 560 గజాలు రెడ్డిసేవా సమితి, 281లో 244 గజాలు అంబేద్కర్ సంఘం, 305/8, 307లో 282 గజాలు రైస్ మిల్లర్స్ అసోషియేషన్, 24/అ, 24/ఆలో 644 గజాలు కెమిస్ట్రీ, డ్రగ్గిస్ట్ అసోషియేషన్‌కు కేటాయించారు. అలాగే 305, 307లో 282 గజాలు ప్రజాపిత బ్రహ్మ కుమారీస్ ఈశ్వరమ్మ విద్యాలయం, 302అ, 303ఆ2లో 264 గజాలు రిక్రియేషన్ క్లబ్, 26, 27, 77/లో 605 గజాలు బుడగ జంగాల హక్కుల పోరాట సంఘం, 26అ, 26ఆ, 13లో 813 గజాలు మాల మహానాడు, 303ఇ, 303అలో 223 గజాలు వస్త్ర వ్యాపార సంఘం, 308, 309లో 312 గజాలు శాలివాహన సంఘం 301/6లో492 గజాలు బాబు జగ్జీవన్‌రావ్ సంక్షేమ సంఘం, సర్వేనెంబరు 33లో మదురానగర్‌లో 2,100 గజాల స్థలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి కేటాయించారు. అప్పట్లో పంచాయతీ వారు ఇచ్చిన వివరాల ప్రకారం ఇవి కొన్ని మాత్రమే. స్థలాల కేటాయింపులు ఇంకా వెలుగులోకి రానివి చాలా ఉన్నాయి. కేటాయించిన వాటిలో కూడా చాలా వరకు భవన నిర్మాణాలు జరగలేదు. ఆయా సంఘాలు ఆస్థలాలను అద్దెకు ఇచ్చుకుంటున్నాయి. స్థలాలు కేటాయించేది ఎవరు? పంచాయతీ, ప్రభుత్వ స్థలాలను సంఘాలు, ఇతరులకు కేటాయించాలంటే తీర్మానం చేసి జిల్లా కలెక్టర్‌కు పంపించాలి. అనుమతి కోసం కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక పంపించి కేబినెట్ నిర్ణయం తర్వాత కేటాయింపులు జరగాలి. కానీ ఇక్కడ అందుకు విరుద్ధంగా స్థలాల కేటాయింపులు జరిగాయి.ఈ స్థలాలు ఎక్కడ ఉన్నాయో కూడా నేటికీ అచ్చంపేట మున్సిపల్ అధికారులకు తెలియదంటే అతిశయోక్తి. ప్రజా అవసరాలు అక్కరల్లేదా? పట్టణ ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేసి పాట్లు చేసే రియల్ వెంచర్లు వ్యాపారులు 10 శాతం భూమిని మున్సిపల్ పేరిట రిజిస్ట్రేషన్ చేయాలి. దీని మున్పిపాలిటీ ప్రజా అవసరాలకు వినియోగించాలి. ప్రభుత్వ భవనాలు, పార్కులు ఇతర అవసరాలకు ఈ స్థలం ఉపయోగించుకోవాలి. అయితే ఇక్కడ అందుకు విరుద్ధంగా జరుగుతోంది. -
బాబోయ్ దొంగలు
సాక్షి,నాగర్‌కర్నూల్ క్రైం: ఉమ్మడి జిల్లాలో ఇటీవల చోటుచేసుకుంటున్న పలు దొంగతనాలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. కురుమూర్తి ఆలయం, అచ్చంపేట ఉమామహేశ్వరం, కొత్తకోట మండ లంలోని పలు ఆలయాల్లో చోటుచేసుకుంటున్న హుండీల చోరీలు, ఇళ్లల్లో చోరీలతో మరింత భ యానికి గురవుతున్నారు. వేసవి ఉక్కపోతకు ఇళ్లలో పడుకోలేక.. ఆరుబయట నిద్రపోదామంటే ఒకింత ఆందోళనతో ప్రజలు జంకే పరిస్థితి నెలకొంది. తాళం వేసిన ఇళ్లే టార్గెట్ వేసవికాలం కావడంతో చాలామటుకు గ్రామాలు, పట్టణాల్లో ఇళ్లకు తాళాలు వేసి ఆరుబయట, ఇంటి మిద్దెలపై నిద్రిస్తుంటారు. కానీ, దొంగలకు ఇదే మంచి అవకాశంగా మారుతుంది. తాళం వేసిన ఇళ్లనే వారు టార్గెట్ చేసి దొరికిన కాడికి దోచుకెళుతున్నారు. ఇళ్ల యజమానులు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కష్టపడి దాచుకున్న సొమ్మును దొంగలు దోచుకెళ్లే అవకాశం ఉంది. ఇదిలాఉండగా, పార్లమెంట్ ఎన్నికల బందోబస్తులో పోలీసులు క్షణం తీరిక లేకుండా విధులు నిర్వహిస్తున్నారు. ప్రజలు తమ వంతుగా దొంగతనాల నివారణ కోసం చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ∙వేసవి సెలవుల్లో దూరప్రాంతాలకు వెళ్లే వారు తమ ఇంటి అడ్రస్, ఫోన్ నంబర్‌ను పోలీస్ అధికారులకు తెలియజేస్తే అలాంటి ప్రాంతాలలో పోలీసులు నిఘా పెడతారు. ∙విహారయాత్రలకు వెళ్లేవారు ఇళ్లలో నగదు, బంగారం, వెండి వస్తువులు, ఆభరణాలు ఉంచొద్దు. బ్యాంకు లాకర్లలో భద్రపర్చుకోవాలి. ∙పని నిమిత్తం ఎవరైనా ఇంటికి తాళం వేసి వె ళ్లాల్సి వస్తే పక్కింటి వారికి చెప్పి వెళ్లాలి. ఇళ్లు తా ళం వేసి ఉంటే దొంగతనం జరిగే ఆస్కారం ఉంది. ∙ఇంటి ఆవరణ, కాలనీ పరిసరాలు, షాపింగ్ కాంప్లెక్స్‌లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. ∙మేడపై నిద్రించే వారు మెడలో బంగారు, వెండి ఆభరణాలు వేసుకోవద్దు. ∙ఇళ్లలో ఉక్కబోత నుంచి ఉపశమనం కోసం కిటికీలు, తలుపులు తెరిచి నిద్రపోవద్దు. అలా ఉండడం వల్ల కిటికీ పక్కన ఉంచే షర్ట్స్, ప్యాంట్లలో నుంచి పర్సులు, నగదు, సెల్ఫోన్లు చోరీ అయ్యే అవకాశం ఉంది. ∙అపరిచితులను నమ్మొదు. బంగారానికి మెరుగు పెడతామని వచ్చే వారికి విలువైన వస్తువులు ఇచ్చి మోసపోవద్దు. ∙మహిళలు బంగారు ఆభరణాలు ధరించి బయటికి, శుభకార్యాలకు వెళ్లాల్సి వస్తే మెడచుట్టూ కొంగు కప్పుకోవాలి. లేదంటే బైక్‌లపై వచ్చి చోరీ చేసే ఆస్కారం ఉంది. ∙తమ ఇంటి సభ్యుల సౌకర్యార్థం ఇంటి తాళాన్ని పరిసరాల్లో, కిటికీల పక్కన పెట్టవద్దు. దొంగలు వాటిని గుర్తించి దొంగతనం చేసే అవకాశం ఉంది. ∙వేసవి కావడంతో తాళం వేసిన ఇంటి ముందు వాహనాలు నిలపొద్దు. చోరీకి గురయ్యే అవకాశం ఉంది. జనసంచారం కల్గిన పార్కింగ్‌లలో వాహనాలు ఉంచాలి. ∙ఊళ్లకు వెళ్లే వారు ఇళ్లలో ఓ గదిలో లైట్ వేసి ఉం చితే మంచిది. రాత్రి వేళలో లైట్ వెలుగుతూ ఉం టే ఇంట్లో ఎవరో ఉన్నారని దొంగలు ఊహిస్తారు. ∙ఇంటి డోర్లకు సెంట్రల్ లాకింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకోవడం సురక్షితం. అలాగే, ఇంటి గేట్లకు సైరన్లను బిగించుకోవాలి. అపరిచితులు గేటు డోర్లను ముట్టుకుంటే శబ్దం వచ్చేలా ఏర్పాట్లు చేసుకోవాలి. ∙ఇంటి పరసరాల్లో అపరిచిత వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి. ఏదైనా సమాచారాన్ని అందించాలి అనుకుంటే 100 నంబర్‌కు డయల్ చేయాలి. -
అభివృద్ధి వైపు అడుగులు
సాక్షి,తాడూరు: మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాలు పారిశుద్ధ్యం వైపు పరుగులు తీస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలుచేస్తున్న పలు సంక్షేమ పథకాలను ప్రజలకు అందించి అవగాహన కల్పించాలన్న ఉద్దేశ్యంతో కొత్తగా ఎంపికైన సర్పంచ్‌లు ఆయా గ్రామాలలో మొదట పారిశుద్ధ్య పనుకే ప్రాధాన్యత కనబరుస్తున్నారు. ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి సహకారంతో గ్రామ పంచాయతీల్లో నూతన పాలక వర్గం మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించింది. గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు పారిశుద్ధ్య పనులు ముఖ్యమని గుర్తించారు. ఇందుకు పాలక వర్గాల సభ్యులు గ్రామంలోని అన్ని వార్డులను తిరిగి స్థానిక పరిస్థితులను అధ్యాయనం చేశారు. మురుగు కాల్వలు లేకపోవడంతో సీసీరోడ్లు బురదమయం అవుతున్నాయని, ప్రజల వినతుల మేరకు మురుగు కాల్వల నిర్మాణంపై ప్రాధాన్యత పెంచారు. సీసీరోడ్లకు ఇరువైపులా మురుగు కాల్వ నిర్మాణం ప్రధాన లక్ష్యంగా మురుగు కాల్వల నిర్మాణాల కోసం సంబంధిత అధికారులతో ప్రతిపాదనలు తయారు చేయిస్తున్నారు. నిర్మాణలను త్వరగా చేపట్టే విధంగా తగిన చర్యలు తీసుకుంటామని సర్పంచ్‌లు అంటున్నారు. చకచకా పనులు మండల కేంద్రంలో సర్పంచ్‌గా ఎన్నికైన అనుపటి యాదమ్మ ఆధ్వర్యంలో వార్డులోని ప్రధాన సమస్యలు గుర్తించి మంచినీటి వసతితో పాటు చేమురుగు కాల్వలు, సీసీరోడ్ల నిర్మాణం పనులు చేపట్టారు. రెండు రోజుల క్రితం జరిగిన గ్రామసభలో స్వచ్ఛ తాడూరుగా చేయాలన్న ఉద్ధేశంతో గ్రామస్తులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్యంగా 9, 10, 11, 12వ వార్డులను నీటి సమస్యతో పాటు మురుగు కాల్వ నిర్మాణాలను చేపట్టారు. ప్రధాన రోడ్డు వరకు సీసీరోడ్డు వేయించేందుకు ప్రతిపాదనలు తయారు చేశారు. -
కాంగ్రెస్ సిట్టింగ్.. 'కారు' పార్కింగ్!
వలసలు, వెనుకబాటుకు చిరునామాగా మారిన నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం 1967లోఏర్పడింది. ఈ పార్లమెంట్‌నియోజకవర్గానికి 12 మార్లు ఎన్నికలు జరగగా ఇందులో ఏడుసార్లు కాంగ్రెస్, నాలుగు సార్లు టీడీపీ, ఒకసారి తెలంగాణ ప్రజా సమితి (టీపీఎస్) గెలుపొందాయి. ఈ పార్లమెంట్ స్థానం పరిధిలోకి వనపర్తి, గద్వాల్, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, ఆలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయి. మొత్తంగా 15.88 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. పూర్తి వెనుకబడిన నియోజకవర్గమైన ఈ ప్రాంతంలో జలయజ్ఞం కింద చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులతో అద్భుత ఫలితాలు వస్తున్నాయి. సాగునీరే ప్రధాన ఎజెండాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేసింది. కొల్లాపూర్ స్థానం తప్ప మిగిలిన ఆరు స్థానాలను భారీ మెజార్టీతో దక్కించుకుంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుచుకున్న ఈ స్థానాన్ని ఈసారి వదులుకోరాదనే పట్టుదలతో ఉన్న టీఆర్ఎస్.. పార్టీ సీనియర్ నేత పి.రాములును బరిలో నిలపనుంది! ఇక కాంగ్రెస్ నుంచి నంది ఎల్లయ్యను కాకుండా మరో నేతలను బరిలో దించేలా కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. బీజేపీ సైతం అభ్యర్థి వేటలో పడింది....::: సోమన్నగారి రాజశేఖర్‌రెడ్డి మెజార్టీ దిశగా ‘కారు’.. నాగర్‌కర్నూల్ నుంచి టీడీపీ తరఫున మూడుసార్లు, కాంగ్రెస్ తరఫున ఒకసారి మంద జగన్నాథం గెలుపొందారు. అనంతరం టీఆర్ఎస్ నుంచి పోటీచేసి గత ఎన్నికల్లో నంది ఎల్లయ్యపై 17,800 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అయినా మందకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధి పదవిని కట్టబెట్టారు. అయితే ఈసారి నాలుగు సార్లు ఎంపీగా పనిచేసిన మంద జగన్నాథాన్ని కాదని మాజీ ఎమ్మెల్యే పి.రాములును టీఆర్ఎస్ బరిలో నిలుపుతోంది. సౌమ్యుడిగా పేరున్న రాములుకు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నేతలతో సత్సంబంధాలున్నాయి. దీంతో ఆయన పేరు ప్రకటన ఖాయంగా కనిపిస్తోంది. నాగరకర్నూల్ పార్లమెంట్ పరిధిలో ఇటీవల అసెంబ్లీ వారీగా వచ్చిన మెజార్టీని లెక్కిస్తే దాదాపు 1.75 లక్షల ఓట్ల మెజార్టీ టీఆర్ఎస్కు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఈ మెజార్టీని డబుల్ చేయాలని పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ అనుబంధంగా ఉన్న అభ్యర్థులే ఎక్కువగా గెలుపొందారు. ఇవన్నీ కూడా వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు కలిసొస్తాయన్న భావన టీఆర్ఎస్ వర్గాల్లో ఉంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే లేని కొల్లాపూర్‌లోనూ పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీని ఇచ్చే విధంగా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పావులు కదుపుతున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి నాగర్‌కర్నూల్ పార్లమెంట్ స్థానంలో భారీ మెజార్టీ వచ్చేలా ప్రణాళిక రచన చేస్తున్నారు. కాగా ఇటీవలే నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సన్నాహక సమావేశాన్ని వనపర్తిలో నిర్వహించగా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరై శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. కాంగ్రెస్‌లో ‘లోకల్’ కుంపటి తెలంగాణ హవా కొనసాగిన 2014 ఎన్నికల్లోనూ నాగర్‌కర్నూల్ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ సొంతం చేసుకోగలిగింది. స్థానికేతరుడైన నంది ఎల్లయ్యను బరిలో నిలిపినా, గెలుపు బాధ్యతలు తనపై ఎత్తుకున్న మాజీ మంత్రి డీకే అరుణ ఈ గెలుపులో కీలక పాత్ర పోషించారు. దీంతో నంది ఎల్లయ్య 17,800 ఓట్ల మెజారిటీతో బయటపడ్డారు. ప్రస్తుతం పరిస్థితి మారింది. కాంగ్రెస్ కీలక నేత, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరారు. ఇక మొత్తంగా ఏడు నియోజకవర్గ అసెంబీల్లో కేవలం కొల్లాపూర్ నుంచి హర్షవర్ధన్‌రెడ్డి ఒక్కరే కాంగ్రెస్ నుంచి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. మిగతా ఆరు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ విజయావకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్ ప్రచారపర్వంలో దూసుకుపోతుంటే కాంగ్రెస్‌లో ఇంకా టికెట్ల పంచాయితీ కొలిక్కి రాలేదు. నాగర్‌కర్నూల్ స్థానానికి ఇప్పటివరకు స్థానికేతరులనే ఎంపిక చేశారని, ప్రస్తుత పరిస్థితుల్లోనైనా స్థానికులకు టికెట్ కేటాయించాలనే డిమాండ్ ఊపందుకుంది. ఒకవైపు పార్లమెంట్ ఎన్నికల అభ్యర్థుల కోసం హైకమాండ్ కసరత్తు చేస్తోంటే మరోవైపు నేతలు లోకల్ కుంపటిని రాజేస్తున్నారు. అదీగాక టిక్కెట్‌ను ఎవరికి కేటాయించాలన్న దానిపై నేతల్లో స్పష్టత లేదు. మాజీ ఎంపీ మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ టికెట్ కోసం పోటీ పడుతుండగా, డీకే అరుణ.. సతీష్‌మాదిగ పేరును ప్రతిపాదిస్తున్నారు. అయితే సిట్టింగ్గా ఉన్న నంది ఎల్లయ్యకే ఇవ్వాలని అధిష్టానం ఆలోచిస్తోంది. లేనిపక్షంలో గతంలో ఇక్కడి నుంచి ఎంపీగా పనిచేసిన మల్లు రవి లేదా సంపత్‌కుమార్‌కు కేటాయించే అవకాశాలున్నాయి. ‘సెంటిమెంట్’నుసెట్ చేసినకేసీఆర్ ఎన్నికల సమయంలో నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో ప్రచారమంటేనే ప్రధాన పార్టీల నేతలు బెంబేలెత్తే పరిస్థితి ఉండేది. ఇక్కడికి ప్రచారానికి వస్తే అధికారానికి దూరమవుతారనే ‘సెంటిమెంటే’ దీనికి కారణం. ముప్పై ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సెంటిమెంట్‌ను కేసీఆర్ తిరగరాశారు. 1989లో నాగర్‌కర్నూల్‌లోని ఓ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచారానికి రాజీవ్‌గాంధీ హాజరయ్యారు. ఆ తర్వాత ఆయన ప్రధాని పదవి కోల్పోయారు. ఇక, కాంగ్రెస్ పార్టీ తరఫున నటుడు కృష్ణ కూడా ఎన్నికల ప్రచారానికి వచ్చి, అదే ఎన్నికల్లో ఏలూరు పార్లమెంట్ స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఎన్టీఆర్ సైతం 1989 ఎన్నికల్లో ఇక్కడ ప్రచారం నిర్వహించి తర్వాత జరిగిన ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. ఈ సెంటిమెంట్‌ను పరిగణనలోకి తీసుకునే చంద్రబాబు, రాజశేఖర్‌రెడ్డి కూడా నాగర్‌కర్నూల్‌లో అడుగుపెట్టలేదని అంటారు. అయితే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తానికి సీఎం కేసీఆర్ నాగర్‌కర్నూల్‌లో ప్రచారం చేసి టీఆర్ఎస్ను అధికారంలోకి తీసుకురావడంతో ఆ సెంటిమెంట్ తుడిచిపెట్టుకుపోయింది. ఈ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనార్దన్ రెడ్డి 54,500 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అదే ఊపుతో పార్లమెంట్ ఎన్నికల్లో గెలుస్తామనే ధీమాతో ఆ పార్టీ ఉంది. బీజేపీప్రభావం అంతంతే.. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ లోక్‌సభ పరిధిలోకి వచ్చే ఒక్క కల్వకుర్తి పరిధిలో మాత్రమే తన ప్రభావాన్ని చూపగలిగిన బీజేపీ.. నాగర్‌కర్నూలు లోక్‌సభ స్థానం నుంచి కేవలం ఉనికిని చాటుకోవడానికే పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ దృష్ట్యానే ఆ పార్టీ తరఫున అభ్యర్థుల నుంచి పెద్దగా పోటీ సైతం కనిపించడం లేదు. దళిత మోర్చా మహిళా నేత బంగారు శ్రుతి పేరును ప్రకటించే అవకాశం ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. ఎన్నికల్లో ప్రభావం చూపేఅంశాలు ♦ పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోభాగంగా నిర్మిస్తున్న నార్లాపూర్, ఏదుల, వట్టెం రిజర్వాయర్లు ♦ శ్రీశైలం ముంపు బాధితులకు ఉద్యోగాలు ♦ గట్టు ఎత్తిపోతల, తుమ్మిళ్ల రెండో ఫేజ్ పనులుమరింత వేగం పుంజుకోవాల్సి ఉంది ♦ సోమశిల బ్రిడ్జి నిర్మాణం ♦ ఆలంపూర్ దేవాలయ అభివృధ్ధి, బస్సు డిపో ఏర్పాటు ♦ గద్వాల–మాచర్ల రైల్వేలేన్ పనులు.. చెంచులకు ఇళ్ల నిర్మాణం లోక్‌సభ ఓటర్లు పురుషులు 7,99,182 మహిళలు 7,89,529 ఇతరులు 35 మొత్తం 15,88,746 -
స్వచ్ఛత పనుల జోరు
సాక్షి, పెంట్లవెల్లి: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛభారత్ మిషన్ కార్యక్రమంలో భాగంగా ఊరురా.. మరుగుదొడ్ల నిర్మాణం జోరందుకుంది. గ్రామాల్లో మరుగుదొడ్లను నిర్మించుకోవడం కోసం స్వచ్ఛందంగా ప్రజలు ముందుకు రావడంతో వీటి నిర్మాణాలను వేగవంతంగా నిర్మించేందుకు అధికారుల సైతం ఉత్సాహం చూపుతున్నారు. 3600 మరుగుదొడ్లు మంజూరు మండలంలోని జటప్రోల్, పెంట్లవెల్లి, కొండూరు, మల్లేశ్వరం, మంచాలకట్ట, మాధవస్వామినగర్ గ్రామాలలో ప్రజలు మరుగుదొడ్ల నిర్మాణంపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. గతంలో మరుగుదొడ్లు లేక ఇబ్బందులు పడిన మహిళలు స్వచ్ఛభారత్ నేపథ్యంలో ఈ పథకంపై ఆసక్తి చూపుతున్నారు. మండలంలో 10గ్రామ పంచాయతీలకు 3,600 మరుగుదొడ్లు మంజూరయ్యాయి. ఇందులో 1500పైగా నిర్మాణాలు పూర్తయ్యాయి. ఆసక్తి చూపుతున్న ప్రజలు ప్రతి గ్రామంలో అధికారులు పర్యటించి స్వచ్ఛతపై అవగాహన కల్పించారు. ఊరూరా తిరుగుతూ మరుగుదొడ్లు నిర్మించుకోవాలని చెప్పారు. కొన్నిచోట్ల వాటిని కఠినం చేస్తూ సంక్షేమ పథకాలు నిలిపివేస్తామని చెప్పడంతో స్వచ్ఛతపై అవగాహన పెంచుకున్నారు. గతంలో ఎవరో ఒకరు మాత్రమే నిర్మించుకునే వారని, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఇంటింటికి మరుగుదొడ్డి నిర్మించుకుంటున్నారని అధికారులు అంటున్నారు. చెక్కుల పంపిణీ గ్రామీణ ప్రాంతాల్లో మరుగుదొడ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు మొదటి, రెండో విడుతల చెక్కులను అందజేసేందుకు పంచాయతీ కార్యదర్శి, గ్రామ సర్పంచ్, మహిళ సంఘం అధ్యక్షురాలుతో చెక్కుపై సంతాకం పెట్టించారు. మరుగుదొడ్లు నిర్మించుకున్నవారికి ప్రభుత్వం అందించే రూ.12వేల ప్రోత్సాహకం సమయానికి అందుతుంది. మండలంలో 1500లకు పైగానే మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేసుకున్నారు. ఇంకా 2,100 నిర్మాణ దశలో ఉన్నాయి. స్వచ్ఛత పాటిస్తాం మరుగుదొడ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.12వేలు ఇచ్చే పథకం ఎంతో బాగుంది. ప్రభుత్వ నిధులకు తోడు మరికొంత వ్యయం చేసి మరుగుదొడ్డి నిర్మించుకున్నాం. స్వచ్ఛత పాటిస్తేనే అందరూ ఆరోగ్యంగా ఉంటారు. చిన్నారులు, వృద్ధులు, మహిళల ఇబ్బందులు తొలగిపోయాయి. – శివయ్య, మంచాలకట్ట -
‘ఖిల్లా’ కుండలకు క్రేజ్ కుమ్మరి
సాక్షి,ఖిల్లాఘనపురం: జిల్లాలోనే ఖిల్లాఘనపురం కుమ్మరులు తయారు చేసే కూజల(నీటి కోసం ప్రత్యేకంగా తయారు చేసే కుండల)కు ఎంతో పేరుంది. ఇక్కడి కుమ్మరులు ఎండాకాలంలో ఈ కూజలు, కుండల తయారీపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటారు. ఎంతో అందంగా చూడముచ్చటగా ఉండే ఈ కుండలంటే ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. ఏళ్లు గడుస్తున్నా వాటి క్రేజ్ మాత్రం తగ్గట్లేదు. ఇక్కడి కుండలు మార్కెట్లో ఉంటే మరే ఇతర కుండలు కొనేందుకు ప్రజలు ఇష్టపడరు. తయారీలో ప్రత్యేక నైపుణ్యం ఖిల్లాఘనపురం కుమ్మరులు కుండల తయారీలో ప్రత్యేక నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. చెరువుల నుంచి తెచ్చిన మట్టిని ఎండలో ఆరబెట్టి పొడిగా తయారు చేస్తారు. తరువాత నీటితో కలిపి పలుచగా తయారు చేసి వడబోస్తారు. మట్టిలో చిన్నపాటి ఇసుక రేనువులు కూడా ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. నీటిశాతం తగ్గే వరకు ఎండలో ఆరబెట్టి రెండు రోజుల తరువాత ముద్దగా తయారు చేస్తారు. తరువాత కొద్ది కొద్దిగా మట్టిని సారి(కుమ్మరి చక్రం)పై వేసుకుని కుండలను అందంగా తయారు చేస్తారు. ఆరిన కుండలను 12గంటల పాటు ఆము(కుమ్మరి పొయ్యి)లో కాల్చడం జరుగుతుందని కుమ్మరులు తెలిపారు. ఒక్క ఆములో 250నుంచి 300 కుండల వరకు కాల్చడం జరుగుతుంది. ఈ కుండలను భార్య భర్తలు ఇద్దరు కలిసి 15 రోజుల్లో తయారు చేయడం జరుగుతుంది. హైదరాబాద్‌తోపాటు ఇతర పట్టణాల నుంచి వ్యాపారులు ఒక్కో కుండను ఇంటివద్దకే వచ్చి రూ.50 నుంచి రూ.100లకు కొనుగోలు చేసి తీసుకెళ్తారని పలువురు పేర్కొన్నారు. అక్కడ ఒక్కో కుండను రూ.200 నుంచి రూ.300వరకు విక్రయిస్తారని సమాచారం. కుండల తయారీతో ఉపాధి మండలంలో మొత్తం 80శాలివాహన కుటుంబాలు ఉన్నాయి. వీరు వేసవిలో కూజలు, కుండల తయారీతో ఉపాధి పొందుతారు. కుటుంబ సమేతంగా కష్టపడి కుండలు తయారు చేసి విక్రయించడం జరుగుతుంది. ఖర్చులుపోను ఒక్కో కుటుంబం రూ.70 వేల నుంచి రూ.లక్ష వరకు సంపాదిస్తారు. అయితే, ప్రభుత్వం తమకు ఆర్థికంగా సహకారం అందిస్తే రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు కుండలను సరఫరా చేసి జిల్లాకే పేరు తెస్తామంటున్నారు ఇక్కడి కుమ్మరులు. కనీసం ప్రభుత్వం నుంచి సబ్సిడీపై రుణసౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. వృత్తిపై మక్కువ, తయారీలో నైపుణ్యం ఉన్న ఇలాంటి కుమ్మరులకు సహకారం అందిస్తే ఆర్థికంగా ఎదగడంతో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాకు మంచి గుర్తింపు తెస్తారని వివిధ పట్టణాల నుండి ఇక్కడకు కుండలు తీసుకెళ్లేందుకు వచ్చే వ్యాపారులు, ప్రజలు అంటున్నారు. పేదోడి ఫ్రిజ్‌గా పేరు వేసవికాలం వచ్చిందంటే చాలు కొద్దో గొప్పో ఉన్నోళ్లు ఫ్రిజ్‌లు కొనుగోలు చేస్తారు. పేదోళ్లు మాత్రం మట్టితో తయారుచేసిన కొత్త కుండల్లో నీరు ఉంచి తాగేందుకు ఇష్టపడతారు. అందుకే కుండలను పేదవాడి ఫ్రిజ్‌గా పిలుస్తారు. అలాంటి కుండలకు ఉమ్మడి పాలమూరులోనే ఖిల్లాఘనపురం కుండలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడ తయారుచేసిన కూజ, కుండలకు హైదరాబాద్‌తోపాటు కర్నూల్, మహబూబ్‌నగర్ తదితర పట్టణాల్లో మంచి గిరాకీ ఉంది. రాష్ట్ర రాజధానిలో రోజువారి కూలీలు, వలసల వచ్చిన కూలీలు ఎక్కువగా ఉండడంతో ఇక్కడి కుండలను కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఇష్టపడతారు. ఉపాధి పొందుతున్నాం ఎండాకాలంలో పట్టణాలకు వలసపోకుండా కులవృత్తి ద్వార ప్రత్యేకమైన కూజలు తయారు చేసి విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నాం. కుటుంబ సమేతంగా కష్టపడి రూ.70 నుంచి రూ.లక్ష వరకు సంపాదించడం జరుగుతుంది. – కుమ్మరి శ్రీనివాసులు, ఖిల్లాఘనపురం -
మళ్లీ ఎన్నికల సందడి
సాక్షి, తాడూరు: గ్రామాల్లో మళ్లీ ఎన్నికల సందడి నెలకొంది. శాసన సభ, సర్పంచ్ ఎన్నికలు ముగిసి నెల రోజులు దాటిందో లేదో మళ్లీ ఎన్నికల వేడి మొదలైంది. తాజాగా అధికారులు ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యుల రిజర్వేషన్లు ఖరారు చేసే ప్రక్రియను చేపట్టడంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యులు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. దీంతో పాటు ఎంపీటీసీ సభ్యుల రిజర్వేషన్లు కొలిక్కి రావడంతో అధికారుల రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేశారు. ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. సర్పంచ్ ఎన్నికలు ముగిసిన తర్వాత నెల రోజుల పాటు స్తబ్ధత ఏర్పడిన తాజాగా రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో గ్రామాల్లో ఎక్కడ ఎంపీటీసీ రిజర్వేషన్లు గ్రామాల పరిధిపై చర్చ కొనసాగుతుంది. రిజర్వేషన్లు ఖరారు కావడంతో రాజకీయ పార్టీలు సహితం పోటీకి సమాయత్తం అవుతున్నాయి. ఆశావహుల్లో ఉత్కంఠ ఆయా స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు ఆశావహుల్లో ఉత్కంఠతో పాటు మరి కొంత మంది ఏ విధంగా బరిలోకి దిగాలన్న ఆలోచనలో పావులు కదుపుతున్నారు. గ్రామాల పునర్విభజన చేయడంతో కొత్త పంచాయతీలు ఏర్పాటయ్యాయి. మండలంలో ఆరు కొత్త గ్రామపంచాయతీలను ఏర్పాటు చేశారు. గతంలో గ్రామాలలో ఆశించిన స్థాయిలో రిజర్వేషన్లు కాకపోవడం, ప్రస్తుతం రిజర్వేషన్లు అయిన తర్వాత అనుకూలంగా రాకపోవడంతో ఆశవాహుల్లో కొంత మేరనిరాశ, ఉత్కంఠ నెలకొంది. ఇప్పటి నుంచి ఆయా పార్టీల నాయకులు మాజీ సర్పంచ్‌లు, ప్రస్తుత సర్పంచ్‌లతో మంతనాలు మొదలయ్యాయి. దీంతో మండలంలో ఎన్నికల సందడి నెలకొంది. రిజర్వేషన్లు ఇలా.. జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలు జనరల్ మహిళకు కేటాయించగా, పది ఎంపీటీసీ స్థానాలకు సిర్సవాడ జనరల్, భల్లాన్‌పల్లి జనరల్ మహిళ, తుమ్మలసుగూరు జనరల్, చర్ల తిర్మలాపూర్ ఎస్సీ మహిళ, ఇంద్రకల్ జనరల్ మహిళ, తాడూరు బీసీ మహిళ, యాదిరెడ్డిపల్లి బీసీ జనరల్, అల్లాపూర్ ఎస్సీ జనరల్, మేడిపూర్ జనరల్, అంతారం బీసీ మహిళ రిజర్వేషన్లు ఖరారయ్యాయి. -
వీడని ఉత్కంఠ!
సాక్షి, నాగర్‌కర్నూల్: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అభ్యర్థులు ఎవరనే విషయంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న నంది ఎల్లయ్యను ఖరారు చేస్తారా లేదా ఇతరులకు కేటాయిస్తారా అనే విషయంలో తర్జనభర్జన కొనసాగుతోంది. ఆ పార్టీ జాతీయ నాయకత్వం ఎవరిని ఎంపిక చేస్తుందనే దానిపై కాంగ్రెస్ నేతలు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ మంత్రి పి.రాములుకు కేటాయిస్తారనే చర్చ కొనసాగుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో నామినేషన్ల స్వీకరణకు కేవలం మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉండడంతో ఆ లోగానే అభ్యర్థులను ప్రకటించాల్సిన అవసరం ఉంది. దీంతో కాంగ్రెస్, టీఆర్ఎస్ రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులను ఎప్పుడు ఖరారు చేస్తారా అనే చర్చ జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ అభ్యర్థులను శనివారం ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. శుక్రవారం జరిగిన సీఈసీ సమావేశంలో అభ్యర్థులు ఎవరనే విషయంపై కాంగ్రెస్ అధిష్టానం స్పష్టతకు వచ్చినట్లు సమాచారం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన తర్వాతనే టీఆర్ఎస్ తమ అభ్యర్థులను ప్రకటించాలని నిర్ణయించినట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అధికార పార్టీ అభ్యర్థిగా రాములు? శాసనసభ ఎన్నికల్లో నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడు నియోజకవర్గాలకు గానూ ఆరు నియోజకవర్గాలను తన ఖాతాలో వేసుకుని ఉత్సాహంగా ఉన్న అధికార టీఆర్ఎస్ పార్టీ నాగర్‌కర్నూల్ పార్లమెంట్ స్థానాన్ని కీలకంగా భావిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 17ఎంపీ స్థానాలలో 16 స్థానా లు గెలవాలని ఆ పార్టీ నాయకత్వం ప్రకటించింది. ఈనెల 9వ తేదీన వనపర్తిలో జరిగిన సన్నాహక సమావేశంలో కేసీఆర్ టీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలకు దిశానిర్దే శం చేశారు. ఎలాగైనా నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంలో విజయం సాధించేందుకు టీఆర్ఎస్ శ్రేణులు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. గత మూడు పర్యాయాలుగా నాగర్‌కర్నూల్‌లో టీఆర్ఎస్ పార్టీ గెలిచింది లేదు. కానీ ఈసారి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో కొల్లాపూర్ మినహా మిగిలిన ఆరు చోట్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే విజయం సాధించడం, అన్ని చోట్లా టీఆర్ఎస్ భారీ మెజార్టీ ఉండటం వంటి కారణాల నేపథ్యంలో ఈసారి నాగర్‌కర్నూల్ ఎంపీ స్థానం తమదేనన్న ధీమా ఆ పార్టీ నాయకత్వంలో వ్యక్తమవుతోంది. అధికార పార్టీ నుంచి పలువురు టికెట్ ఆశిస్తున్నప్పటికీ మాజీ మంత్రి పి. రాములు పేరు ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. టీఆర్ఎస్ నేత మందా జగన్నాథం, గాయకుడు సాయిచంద్, ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ నేత శ్రీశైలం కూడా తమకు ఎంపీ టికెట్ కేటాయించా లని అధిష్టానాన్ని కోరుతున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ అభ్యర్థులపై కసరత్తు నాగర్‌కర్నూల్ స్థానంలో అత్యధిక సార్లు గెలిచిన చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎన్నికల్లోనూ సరైన అభ్యర్థిని బరిలో ఉం చాలని కసరత్తు చేస్తోంది. ఆ పార్టీ జాతీయ నాయకత్వం వద్ద జాబితా సిద్ధంగా ఉంద ని, అన్ని సమీకరణాలను బేరీజు వేసుకుని శుక్రవారం జరిగిన సీఈసీ సమావేశంలో అభ్యర్థి ఎవరనేది ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. గత ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందిన, ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ నంది ఎల్లయ్యకు అధిష్టానం మొగ్గుచూపుతోందని, ఒకవేళ ఆయన బరిలో లేకుంటే మాజీ ఎంపీ మల్లురవి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్, సతీష్ మాదిగ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నేడు, రేపు స్పష్టత కాంగ్రెస్ అభ్యర్థులను అధిష్టానం శనివారం ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొదటి విడతలోనే నాగర్‌కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తుందని కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థుల విషయంలోనూ ఇప్పటికే అధినేత కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలతో ఫోన్ ద్వారా సంప్రదించి లోక్‌సభ అభ్యర్థులు ఎవరు ఉండాలనే అంశంలో అభిప్రాయాలు సేకరించారు. ఈనేపథ్యంలోనే నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా పి.రాములు పేరు దాదాపు ఖరారైందని వినిపిస్తోంది -
మిషన్ భగీరథ పనులు అస్తవ్యస్తం
సాక్షి, ఉప్పునుంతల: మండలంలో మిషన్ భగీరథ పనులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఏడాదిన్నర కావస్తున్నా ఇప్పటివరకు వాటర్ ట్యాంకుల పనులు, పైప్లైన్ల పనులు పూర్తికాలేదు. కొన్ని గ్రామాల్లో ట్యాంక్‌ల నిర్మాణం పనులు నేటికీ ప్రారంభించలేదు. మరికొన్ని గ్రామాల్లో ట్యాంకుల నిర్మాణం అర్ధాంతరంగా నిలిపేశారు. పనులు పెండింగ్‌లో ఉండడంతో కొన్ని గ్రామాలకు ఇప్పటివరకు నీటి సరఫరా కావడం లేదు. పనులపై అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. భగీరథలో చేపడుతున్న వాటర్ ట్యాంకులు, ఇతర పైప్లైన్ల పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించడంలేదని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నాణ్యతతో పనులు త్వరితగతిన పూర్తిచేయించాలని వారు కోరుతున్నారు. మండలంలో సగం వాటర్ ట్యాక్‌లు పూర్తి.. మండలంలోని 27 పంచాయతీల పరిధిలో ఉన్న 38 ఆవాస గ్రామాల్లో మిషన్ భగీరథ పథకంలో 31 వాటర్ ట్యాంకులు మంజూరయ్యాయి. వాటిలో ఇప్పటివరకు 14 వాటర్ ట్యాంకులు పూర్తయ్యాయి. 17 వాటరు ట్యాంకుల పనులు పూర్తికాలేదు. మూన్య తండాలో ఇప్పటివరకు ట్యాంక్ పనులు ప్రారంభించలేదు. బిల్లులు రాలేదంటూ సంబంధిత కాంట్రాక్టర్ రంగంపేట తదితర గ్రామాల్లో ట్యాంకు పనులు బెస్మెంట్ వరకు మాత్రమే నిలిపేశారు. ఇంటర్‌గ్రిడ్ పనుల్లో జాప్యం.. మండలంలో ఇంటర్‌గ్రిడ్ పనుల్లో తీవ్ర జాప్యం చేస్తున్నారు. చిన్న చిన్న గ్రామాలు, తండాల్లోని కాలనీల్లో ఇళ్లలోకి కనెక్షన్లు ఇవ్వడానికి పైప్లైన్లు వేసి ఉంచినా నల్లాలు అమర్చలేదు. కొన్ని గ్రామాలకు మెయిన్ గ్రిడ్ పనులు ఇప్పటికీ పూర్తి కాకపోవడంతో నీళ్లు రావడంలేదు. రంగంపేట, మూన్య తాండ, కొత్తరాంనగర్ తదితర గ్రామాల్లో ట్యాంకులు, ఇంటర్‌గ్రిడ్ పనులు పూర్తిచేయకపోవడంతో భగీరథ నీళ్లు అందడంలేదు. గుట్టమీది తండాలో అసంపూర్తిగా పైపులైన్ పనులు , ఉప్పునుంతలలో పూర్తికాని ఇంటర్ గ్రిడ్ పైపులైన్ -
నల్లమలలో వెలసిన శ్రీ ఉమా మహేశ్వర అలయంలో చోరీ
-
దర్జాగా కబ్జా!
నాగర్‌కర్నూల్ రూరల్: జిల్లా కేంద్రం సరిహద్దు ప్రాంతాల్లో వెలసిన అక్రమ వెంచర్లపై అధికారుల నజర్ లేకపోవడంతో ఎలాంటి అనుమతులు లేకుండానే అక్రమ వెంచర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ప్రైవేటు పట్టా భూములతో పాటు అందినంత ప్రభుత్వ భూములను కబ్జా చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎక్కడా లేనివిధంగా రియల్టర్లు సిండికేట్‌గా మారి వ్యాపారాన్ని దర్జాగా కొనసాగిస్తున్నారు. సిండికేట్ దగ్గరకు రావాలంటేనే అధికారులే ఆందోళన చెందే స్థాయికి ఎదగడంతో జిల్లా సమీపంలోని చెరువులు, కుంటలు అన్యాక్రాంతమై ప్రభుత్వ భూములు కుచించుకుపోతున్నాయి.రోజురోజుకు అక్రమంగా వెంచర్లు వెలుస్తున్నా వాటిని నిలువరించడంలో అధికారులు విఫలమవుతున్నారు. రియల్టర్లుగా పలుకుబడి కలిగిన వ్యక్తులు పలు పార్టీల నాయకుల చెలామణిలో ఉంటూ ఎప్పటికప్పుడు పుకార్లను షికార్లుగా మలుచుకుని ధరలు అమాంతం పెంచుకుంటూ లాభపడుతున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో వెంచర్లు జిల్లా కేంద్రం సరిహద్దు ప్రాంతాలైన ఎండబెట్ల, దేశియిటిక్యాల, ఉయ్యలవాడ, మంతటి, గగ్గలపల్లి, నల్లవల్లి రోడ్డు వెంబడి ప్రధాన రహదారుల ఇరువైపులా పంట పొలాలను రియల్టర్లు కొనుగోలు చేసుకుని రియల్ దందాకు కొనసాగిస్తున్నారు. వీటితో పాటు ఒకప్పుడు వర్షపు నీటితో కళకళలాడిన చెరువు శిఖం భూములు, కుంటల భూముల్లోనూ రియల్టర్లు ప్లాట్లుగా మలిచి అందినకాడికి దండుకుంటున్నారు.ఫుల్ ట్యాంక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ శిఖం భూముల్లో మట్టిని పోసి ప్లాట్లుగా మార్చేశారు. ఇంత జరుగుతున్నా ఏ ఒక్క అధికారి పట్టించుకున్న పాపాన పోలేదు. ఫలితంగా పంట భూములన్నీ ప్లాట్లుగా మారిపోతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండానే.. పంటలతో కళకళలాడిన పంట పొలాలు సైతం ఇప్పుడు ఎలాంటి అనుమతులు లేకుండా ప్లాట్లుగా మారిపోతున్నాయి. ఫలితంగా ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుంది. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చుకోవాలంటే ముందుగా రెవెన్యూ అధికారుల అనుమతులు పొందాల్సి ఉంది.అంతేకాక ఆయా భూముల్లో పబ్లిక్ అవసరాల కోసం 10 శాతం భూమి కేటాయించాల్సి ఉంది. ఎలాంటి అనుమతులు పొందకుండా ప్లాట్లను ఏర్పాటు చేస్తుండటంతో భవిష్యత్‌లో ప్లాట్లు కొనుగోలు చేసిన వ్యక్తులు నిర్మాణ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికైనా అక్రమ వెంచర్ల రియల్టర్లపై అధికారులు నజర్ వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు కోరుతున్నారు. -
అనుమతి లేకుండా తొలగించొద్దు
నాగర్‌కర్నూల్: ఓటర్ జాబితా నుంచి ప్రొఫార్మా–7, ఎన్నికల సంఘం అనుమతి లేకుండా ఓటర్ జాబితా నుంచి ఓట్లను తొలగించొద్దని జిల్లా కలెక్టర్ ఈ.శ్రీధర్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం ఓటర్ జాబితాలో బోగస్ ఓట్ల తొలగింపుపై తహసీల్దార్లు, ఆర్డీఓలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తహసీల్దార్ బోగస్ ఓట్లను తొలగించేందుకు అన్ని పోలింగ్ బూత్ లెవల్ అధికారులతో సమావేశం నిర్వహించి డబుల్ ఎంట్రీ ఓటర్లను తొలగించాలన్నారు. ఓటరు జాబితా సవరణలో క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ చేయకుండా కొన్ని చోట్ల ఓట్లను తొలగించారని, మరికొన్ని చోట్ల రెండు పేర్లను తొలగించడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. పూర్తి స్థాయిలో బోగస్ ఓట్లను తొలగించేందుకు బూత్ లెవల్ అధికారులను సంప్రదించి ఎన్ని ఓట్లు తొలగించారో పూర్తి సమాచారంతో గురువారం జరిగే సమావేశానికి హాజరు కావాలన్నారు. రెండు ఓట్లు తొలగించిన వారితో ప్రొ ఫార్మా–6తో తిరిగి వారికి ఓటుహక్కు కల్పించాలని ఆదేశించారు. జిల్లాలో సాంకేతిక లోపంతో ఉన్న 450 ఓట్లను ప్రొ ఫార్మా–8 వినియోగించి పేర్లు, డేట్ ఆఫ్ బర్త్, ఇతర సవరణలను సరిచేయాలని తహసీల్దార్లకు సూచించారు. నియోజకవర్గంలో డబుల్ ఎంట్రీ ఓట్లను ఆయా మండలాల్లో తొలగించేందుకు ఆర్డీఓలు రాష్ట్ర ఎన్నికల అధికారి అనుమతి పొందేందుకు లేఖతో సమావేశానికి హాజరు కావాలన్నారు. అదే విధంగా భూ ప్రక్షాళన పనులు వేగవంతం చేసి, వాటికి సంబంధించిన డిజిటల్ సంతకాలు, ఇతర విషయాలపై దృష్టి సారించాలని ఆదేశించారు. సమావేశంలో జేసీ శ్రీనివాస్‌రెడ్డి, డీఆర్ఓ మధుసూదన్‌నాయక్, జిల్లా ఎన్నికల నోడల్ అధికారులు మోహన్‌రెడ్డి, అనిల్ ప్రకాశ్, ఆర్డీఓలు హనుమనాయక్, పాండునాయక్, రాజేష్‌కుమార్, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈవీఎంలపై వీడియో కాన్ఫరెన్స్ కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు బుధవారం జిల్లా కలెక్టర్లతో ఈవీఎంలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా లోక్‌సభ ఎన్నిక ల్లో వినియోగించే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, వీవీ ప్యాట్ల పనితీరు, నియోజకవర్గానికి అవసరమైన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, పార్లమెంట్ నియోజకవర్గాలకు చేరాయా లేదా అనే విషయంపై సమీక్ష నిర్వహించారు. అదే విధంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు మొదటి విడత తనిఖీలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈవీఎంలకు సంబంధించి టెక్నికల్ సమస్యలు వస్తే భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ కంపెనీ నుంచి ప్రతినిధులు వస్తారని తెలిపారు. ఈ వీసీలో కలెక్టర్ ఈ.శ్రీధర్, జేసీ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
స్థానికేతరులకు ఇవ్వొద్దు
సాక్షి, హైదరాబాద్: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో నాగర్‌కర్నూల్ లోక్‌సభ సీటును స్థానిక అభ్యర్థికే కేటాయిం చాలంటూ ఆ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు గాంధీభవన్ ఎదుట ధర్నా నిర్వహించారు. స్థానికేతరులకు టికెట్ ఇస్తే సహకరించబోమంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ నాయకత్వం ఈసారి కూడా స్థానికేతరులకు కేటాయిస్తే, ఆ ఎంపీ సీటు పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఆమరణ నిరాహార దీక్షలకు దిగుతామంటూ హెచ్చరించారు. సోమవారం గాంధీభవన్ ఎదుట నాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గ కార్యకర్తలు ధర్నా నిర్వహించిన అనంతరం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని ఉద్దేశించి కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు, నాన్‌లోకల్ వ్యతిరేక పోరాట కమిటీ పక్షాన రాసిన వినతిపత్రాన్ని ఉపాధ్యక్షుడు కుమార్‌రావుకు సమర్పించారు. ఈ వినతిపత్రం ప్రతులను పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ఏఐసీసీ అబ్జర్వర్ కొప్పుల రాజు, టీపీసీసీ ఇన్చార్జి కుంతియాలకు పంపనున్నట్లు తెలిపారు. నాగర్‌కర్నూల్ స్థానం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటిదాకా స్థానికేతరులకే కాంగ్రెస్ టికెట్లు కేటాయిస్తూ రావడాన్ని ప్రస్తావిం చారు. ఎంపీలుగా స్థానికేతరులుండటం వల్ల ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందట్లేదన్నారు. ఈ పరిస్థితుల్లో నాగర్‌కర్నూల్ ప్రజలు ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ స్థానికేతరులకు మద్దతివ్వొద్దని తీర్మానించినట్లు తెలిపారు. పార్టీ పెద్దల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి ఈసారి స్థానికులకే నాగర్‌కర్నూల్ టికెట్ వచ్చేలా చూడాలని కోరారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో మల్లిఖార్జున్, మల్లేశ్ తదితరులున్నారు. -
భగ్గుమంటున్న ఎండలో బుగ్గిపాలవుతున్న వాహనాలు
సాక్షి, నాగర్‌కర్నూల్ క్రైం: సాధారణంగా మార్చి నెలలో ప్రారంభం కావాల్సిన ఎండాకాలం ఈ ఏడాది ఫిబ్రవరి మధ్య నుంచే తీవ్రరూపం దాల్చాయి. వేసవిలో భానుడి భగభగలకు వాహనాలు బుగ్గి పాలవుతున్నాయి. వాహన యజమానుల అవగాహన లేమితో కొన్ని వాహనాలు, స్వయం కృతాపరాదంతో మరికొన్ని వాహనాలు వేసవికాలంలో మంటల్లో చిక్కుకుని కాలిపోయి రూ.లక్షల్లో నష్టపోతున్నారు. వేసవిలో వాహనదారులు అప్రమత్తంగా ఉండకపోతే ఆస్తినష్టంతోపాటు ప్రాణనష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. వాహన యజమానులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల నిత్యం ఎక్కడో ఒకచోట వేసవి కాలంలో వాహనాలు అగ్ని ప్రమాదానికి గురవుతున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో వాహనదారులు ముందుజాగ్రత్తలు పాటిస్తే అగ్ని ప్రమాదాలను కొంతవరకైనా అరికట్టవచ్చు. ఈ ఘటనలే నిదర్శనం ఈ నెల 23న బిజినేపల్లి మండలం వెంకటాద్రి రిజర్వాయర్ పనుల వద్ద హైచర్ వెహికల్ (డీసీఎం)లో బ్యాట్రీ షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగి వాహనం పూర్తిగా కాలిపోయింది. గతేడాది నవంబర్ 22న బిజినేపల్లి మండలం వెంకటాద్రి రిజర్వాయర్ పనుల వద్ద మెకానికల్ హీట్‌తో టిప్పర్‌లో మంటలు చెలరేగి టిప్పర్ ముందుభాగంతోపాటు, ఇంజన్ కాలిపోయింది. ఇవే ప్రధాన కారణాలు వాహనదారులు నిత్యం వాహనాలు నడపడం మాత్రమే చేస్తుంటారు. వాటి నిర్వహణను సరిగా పట్టించుకోరు. తరచూ వాహనాలను మెకానిక్ వద్దకు తీసుకువెళ్లి సర్వీసింగ్ చేయించి వాహనాల్లోని మెకానికల్ సమస్యలను పరిష్కరించుకుంటే వాహనాలలో జరిగే అగ్నిప్రమాదాలు అరికట్టవచ్చు. వాహనాల్లో తరచూ అగ్నిప్రమాదాలకు కారణం వాహనాలకు కంపెనీ నుంచి వచ్చే వైరింగ్ కాకుండా ఇతర ఎక్స్ట్రా వైరింగ్ చేయిస్తుండటంతో వైర్లకు వేసే అతుకుల వల్ల, వాటి నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల అగ్ని ప్రమాదాలకు ఆస్కారం ఏర్పడుతుంది. వేసవికాలంలో 4 వీలర్ వాహనాల్లో చాలా దూరం ప్రయాణం చేసే వారు వాహనంలో ఏసీని వాడటం వల్ల కూడా షార్ట్‌సర్క్యూట్ జరిగే అవకాశం ఉంది. వేసవిలో వాహనాలను ఆపకుండా నడపడం వ ల్ల ఇంజన్ హీట్ అయి ప్రమాదాలు జరుగుతాయి. వాహనాల్లో మైలేజీ కోసం గ్యాస్ కిట్లను వాడు తున్నారు. అయితే ఈ గ్యాస్ కిట్లు అప్రూవల్ కిట్లు కాకుండా నాసిరకానివి వాడటం వల్ల వేసవి ఎండలకు వాహనాల్లో అగ్నిప్రమాదాలు జరుగుతాయి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాహనాలను నడిపేటప్పుడు టెంపరేచర్ మీటర్ చూసుకుంటూ వాహనాలను నడపాలి. టెంపరేచర్ మీటర్లో స్పీడ్ ఎక్కువగా చూయిస్తే వెంటనే వాహనాన్ని నడపడం ఆపివేయాలి. ప్రతి వాహనంలో చిన్న ఫైర్ఎక్జ్సింగ్ విషర్ను అందుబాటులో ఉంచుకోవాలి. ప్రమాదవశాత్తు వాహనంలో మంటలు చెలరేగితే ఫైర్ ఎక్జ్సింగ్ విషర్ ద్వారా మంటలను అదుపు చేయవచ్చు. వాహనాల్లో ఇంజన్ వేడెక్కడం ఆ తర్వాత ఓవర్ హీట్ కావడం వల్ల మంటలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంజన్‌కు కూలింగ్ చాలా కీలకంగా ఉండటంతో వాహనాల్లో తరచూ కూలింగ్ చెక్ చేసుకోవాలి. వాహనాల్లో వైరింగ్ వల్ల మంటలు వచ్చే అవకాశం ఉన్నందున కంపెనీ వారు అమర్చిన వైరింగ్‌లో ఎలాంటి మార్పులు చేయకపోవడం ఉత్తమం. వీల్బెరింగ్ను ఎప్పటికప్పుడు సర్వీసింగ్ చేయించుకోవాలి. వాటి వల్ల కూడా ఎక్కువగా మంటలు వ్యాపించే అవకాశం ఉంది. వాహనాలకు తప్పనిసరిగా బీమా చేయించుకోవాలి. అగ్నిప్రమాదాలు జరిగితే ఇన్సూరెన్స్ ద్వారా జరిగే నష్టాన్ని పూడ్చుకోవచ్చు. వాహనం కాలిపోతుంటే అందులోని వస్తులను తీసుకునే ప్రయత్నం చేయకూడదు. ఒకవేళ వస్తువులను తీసుకునే ప్రయత్నం చేస్తే శరీరానికి మంటలు అంటుకునే ఆస్కారం ఉంది. వేసవి కాలంలో లాంగ్ డ్రైవింగ్‌లకు సాధ్యమైనంత వరకు స్వస్తి చెప్పాలి. తప్పనిసరి పరిస్థితుల్లోనే లాంగ్ డ్రైవింగ్‌లకు వెళ్లడం ఉత్తమం. అలాగే ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే ప్రయాణాలు కొనసాగించాలి. వాహనాల సీట్లలో, ఇతర విడి భాగాలు ప్లాస్టిక్ ఉండటంతో అగ్నిప్రమాదాలు జరిగితే వాటి నుంచి విషవాయులు వెలువడే ఆస్కారం ఉంటుంది. కాబట్టి అగ్నిప్రమాదం జరిగిన వెంటనే వాహనానికి దూరంగా వెళ్లాలి. నిర్వహణ సరిగా ఉండాలి.. వాహనదారులు తమ వాహనాలను నిత్యం సర్వీసింగ్ చేయించుకుని వాటి నిర్వహణను సరిగా చేయాలి. వాహనాలలో కంపెనీ వారు ఇచ్చిన పరికరాలు, వైరింగ్‌ల స్థానంలో ఇతర వాటిని అమర్చడం వల్ల అగ్నిప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది. కంపెనీ నుంచి వాహనాలను తీసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫిట్టింగ్ పేరుతో చాలా మార్పులు చేయిస్తున్నారు. సాధ్యమైనంత వరకు కంపెనీ అమర్చిన వైరింగ్ దగ్గరికి వెళ్లకపోవడమే మంచిది. వాహనదారులు వాహనాలలో ఏర్పాటు చేసుకునే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లకు తప్పనిసరిగ్గా అనుమతి పొందాలి. – ఎర్రిస్వామి, జిల్లా రవాణా శాఖాధికారి, నాగర్‌కర్నూల్ -
కాలంతో పరుగెడుతున్న అభ్యర్థులు..
సాక్షి, అచ్చంపేట: మరో నాలుగు రోజులు చెమటోడ్చి కష్టపడితే ఐదేళ్ల పాటు హాయిగా వీఐపీ హోదాలో దర్జాగా అనుభవించవచ్చు. శాసనసభలో కీలక వ్యక్తులుగా చట్టాల రూపకల్పనలో ప్రధాన ప్రాత వహిస్తూ అధికార దర్పంతో హాయిగా బతుకొచ్చు. కాలం కలిసి వస్తే మంత్ర పదవులు దక్కొచ్చు. అలాంటి రాజకీయ జీవితం అనుభవించే అవకాశం ఉండడంతో అభ్యర్థులు ముందుస్తు పోరులో ప్రత్యర్థుల ముందు ఎలాగైనా గెలవాలని రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. ఓ పక్కా ఉష్ణోగ్రతలు పడిపోయి గ్రామాలన్నీ మంచు దప్పటి పరుచుకుని ఉంటే తెలతెల్లవారంగానే చలికి వణికుతున్నప్పటికీ అవేమి లెక్క చేయకుండా అభ్యర్థులు మరింత వేడిగా ప్రచారం వేగం పెంచారు. ఉదయమే ఇంటి నుంచి బయలుదేరి ఎప్పడో తెల్లవారు జామున ఇంటికి చేరకుంటున్నారు. అభ్యర్థుల రోజువారి దినచర్య అత్యంత బిజీ షెడ్యూల్లో గడిపేస్తున్నారు. అలసట, విశ్రాంతి అనే పదాలకు చోటు లేకుండా ముందుస్తు సంగ్రామంలో మందుకు సాగుతున్నారు. సమయం వృథా కాకుండా.. రోజులో ఉన్న 24గంటల్లో ఆ రోజును సంపూర్ణగా ఉపయోగించుకునేందుకు అభ్యర్థులు తమ షెడ్యూల్‌ను ప్రతీ నిమిషం జాగ్రత్తగా ప్లాన్ వేస్తున్నారు. కేవలం నిద్రపోయే సమయం తప్పా... మిగతా సమయాన్ని మొత్తం ప్రచారం పర్వానికే వినియోగిస్తున్నారు. కాలంతో పరుగెడుతూ ఎన్నికల కుస్తీకి సిద్ధమవుతున్నారు. బిజీ షెడ్యూల్లో అభ్యర్థులకు నెలరోజుల నుంచి కంటి నిండ నిద్రేకరువైయింది. గ్రామాల్లోని ప్రజలంతా ఉదయమే వ్యవసాయం పనులకు వెళ్లతుండడంతో వారిని కలిసేందుకు వీలైనంత త్వరగా ఇంటి నుంచి బయల్దేరుతున్నారు. ఉదయం లేనినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు వేలాది మందిని ప్రత్యక్షంగా పలకరిస్తున్నారు. అభ్యర్థులు ఇంటి ముందు నెల రోజులుగా నిత్యం జనంతో కోలహాలం కనిపిస్తోంది. ఉదయం లేచే సరికే వందలాది మంది అభ్యర్థులతో మాట్లాడేందుకు క్యూలో ఉంటున్నారు. దీంతో నిద్రలేచింది మొదలు ప్రచార తంతు ప్రారంభమువుతోంది. కింద స్థాయి నేతలతో మాట్లాడుతూ గ్రామాలు, మండలాల్లో పరిస్థితిపై ఆరా తీసేందుకు కొంత సయమం కేటాయించాల్సి వస్తోంది. రోజు ఏదో ఒక చోటికి వెళ్లడం దినచర్యలో తప్పని సరిగా మారింది. దీంతో నియోజకవర్గ మొత్తం చుట్టి రావడం లక్ష్యంగా ఉండడంతో ప్రతి రోజూ ఏదో ఒక ప్రాంతానికి తమ కార్యకర్తలను పురమాయించి ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామాల్లో వెళ్లే రాకపోకల సమయంలోనూ వాహనాల్లో ప్రయాణం చేస్తూనే ముఖ్య నేతలతో ఎప్పటికప్పుడు పరిస్థితులపై చర్చిస్తూ సమయాన్ని పొదుపుగా వాడుతున్నారు. అలాగే చేరికలు ప్రత్యర్థి పార్టీల నుంచి పెద్ద ఎత్తున చేరికలు ప్రొత్సహించేందుకు స్థానిక లీడర్ల సాయంతో ఆ కార్యక్రమంలో ప్రతిరోజు చేరికల కోసం ప్రత్యేకంగా కొంత టైం కేటాయిస్తున్నారు. అలాగే నియోజకవర్గంలో ఎవరైనా పార్టీ చెందిన ముఖ్య నేతలు వస్తే జనం సమీకరణలు తదితర ఏర్పాట్లు చూసుకోవాల్సి వస్తోంది. ఇందుకోసం రోజులో ఎంతో కొంత సమయం కేటాయించాల్సి వస్తోంది. ఒక్కోసారి ఉదయం ఇంట్లో అల్పాహారం తీసుకుని బయల్దేరితే మధ్యాహ్న భోజనం ఎప్పుడు తినేది వేళాపాల ఉండడం లేదు. ఒక్కోసారి రోజులో ఒకసారే మాత్రమే తిన్న రోజులు కూడా ఉన్నాయని చెబుతున్నారు. కార్యక్రమాలు అనుకున్న సమయానికి అన్ని జరగకపోతే ఆరోజంతా షెడ్యూల్ మొత్తం మారిపోతుంది. కొంత మంది అభ్యర్థులు తమ కుటుంబ సభ్యులతో కూడా సరిగా మాట్లాడలేని పరిస్థితి. ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ వీలు చిక్కినప్పుడల్లా ఫోన్లో గంటల కొద్ది మాట్లాడేస్తున్నారు. -
అధికారాన్ని నిర్ణయించనున్న యువ ఓటర్లు..!
సాక్షి, అచ్చంపేట: టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. అభ్యర్థులు తమ వ్యూహాలకు పదును పెడుతూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో విభాగాల వారీగా ఓటర్ల సంఖ్యను బట్టి హామీలు గుప్పిస్తూ ముందుకు సాగుతున్నారు. జిల్లాలో నియోజకవర్గాల్లో కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ నవంబరు 9తో ముగిసింది. దీంతో అధికారులు తుది జాబితాను ప్రకటించారు. ఇందులో వయస్సుల వారీగా ఓటర్ల వివరాలను సైతం పొందుపరిచారు. అధికారులు ప్రకటించిన జాబితాలో యువ ఓటర్ల సంఖ్య ఉండడంతో అభ్యర్థులు వారిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ప్రసన్నం చేసుకునేందుకు ప్రణాళిలు మూడు నియోజకవర్గాల్లో యువకులు గణనీయంగా తమ ఓటు హక్కును నమోదు చేసుకున్నారు. 18–29 మధ్య వయ స్సు వారు 1,66,496మంది ఉన్నారు. నాగ ర్‌కర్నూల్ నియోజకవర్గంలో 54,361, అచ్చంపేటలో 57,572, కొల్లాపూర్‌లో 54,563మంది యువ ఓటర్లు ఈసారి ప్రభావం చూపనున్నా రు. వీరితో పాటు 30నుంచి 39ఏళ్ల మధ్య ఉన్న ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ ఎన్నికల్లో వీరందరూ కీలకంగా మారనున్నారు. అభివృద్ధి, పరిపాలన తీరు, అభ్యర్థి పనితీరును బట్టి సమగ్రంగా ఆలోచించి ఓటువేసే ఓటర్లు కావడంతో పార్టీల అభ్యర్థులు వీరిని ఆకట్టుకునేందుకు పకడ్బందీ ప్రణాళికలు చేసుకుంటున్నారు. మూడు నియోజకవర్గాల్లో మధ్య వయస్సు ఓటర్లు తీసుకునే నిర్ణయంపైనే అభ్యర్థుల విజయం ఆధారపడి ఉంటుందనేది పలు సర్వేలో తేలింది. యువ ఓటర్లతో పోటీగా వీరి ఓట్లను కొల్లగొట్టేవారిని విజయం వరిస్తుంది. మొదటిసారి ఓటు వేసేవారు 26,039 గత సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే ఈసారి కొత్త ఓటర్ల సంఖ్య నమోదు శాతం పెరిగింది. ఈ ఎన్నికల్లో కొత్తగా 26,039 మంది 18 నుంచి 19 ఏళ్ల వయస్సు ఉన్న యువకులకు అధికారులు ఓటు హక్కును కల్పించారు. వీరిలో అమ్మాయిలు 12,022మంది, అబ్బాయిలు 14,022మంది ఉన్నారు. వీరంతా మొదటిసారిగా ఓటు వినియోగించుకోనున్నారు. కొత్త ఓటర్ల నమోదు మూడు నియోజకవర్గాల్లో ఆశాజనకంగానే సాగింది. ఈ జాబితాలో నాగర్‌కర్నూల్ 12,782 మందితో మొదటి స్థానంలో, అచ్చంపేట 9,328 మందితో రెండవ స్థానంలో, కొల్లాపూర్ 3,923మందితో మూడో స్థానంలో ఉంది. పార్టీల యువమంత్రం జిల్లాలో అధికశాతం గ్రామీణ ప్రాంతాలు కావడంతో పోలింగ్ శాతం 70శాతానికి పైగానే ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో కొంత ఓటింగ్ శాతం తక్కువగా ఉన్నప్పటికీ గ్రామీణ ప్రాంతా ల్లో ఈ సమస్య లేదు. ఓటు హక్కును వినియో గించుకునే వారిలో యువకులు అధికంగా ఉండటం మరో విశేషం. దీంతో అన్ని పార్టీలు యుక ఓటర్లకు గాలం వేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. యువతను ఆకట్టుకునేందుకు సామాజిక మాధ్యమాలతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సైతం వినియోగిస్తున్నారు. -
నాలుగున్నరేళ్లలో 4500మంది ఆత్మహత్యలు...
సాక్షి, నాగర్‌కర్నూల్: తమది రైతు సంక్షేమ ప్రభుత్వమని చెబుతున్న టీఆర్ఎస్ నాలుగున్నరేళ్ల పాలనలో 4500మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. ఎందుకు చేసుకున్నారో చెప్పాలని కేసీఆర్‌ను ప్రశ్నించారు. గురువారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో బీజేపీ అభ్యర్థి దిలీపాచారి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మార్పు కోసం బీజేపీ’ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని, ఆర్థిక ప్రగతిని విస్మరించి నిర్లక్ష్యం చేసిందని, పథకాలు అమలుపర్చడంలో విఫలమైందని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం పేదలకు రూ.5లక్షల వరకు ఉచితంగా వైద్యం అందించేందుకు ఆయుష్మాన్ భారత్ పేరుతో పథకం ప్రారంభిస్తే తెలంగాణలో అమలుచేయడం లేదని అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోయి నాలుగున్నరేళ్లు అవుతున్నా ముఖ్యమంత్రి అసమర్థత వల్ల అభివృద్ధి జరగడంలేదని విమర్శించారు. యూపీఏ హయాంలో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.16వేల కోట్లు ఇస్తే మోడీ హయాంలో రూ.లక్షా 15వేల కోట్లు రాష్ట్రానికి ఇచ్చామని అన్నారు. ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇతర పథకాలకు మళ్లించిందన్నారు. దీనినుంచి దృష్టి మరల్చేందుకే రాజ్యాంగ వ్యతిరేకమైన మైనర్లకు 12శాతం రిజర్వేషన్ అంటున్నారని చెప్పారు. టీడీపీ, కాంగ్రెస్‌ల పొత్తు అపవిత్ర కలయిక అని, దీనివల్ల ఎన్టీఆర్ ఆత్మ ఘోషిస్తుందని అన్నా రు. కాంగ్రెస్ నాయకులు ప్రధాని పదవిని అవమానించేలా మాట్లాడటం సరికాదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వారు ఏర్పాటుచేసే ఒకే ఒక్కపరిశ్రమ అవినీతి పరిశ్రమ అని ఎద్దేవా చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వరి, పత్తి, గోధుమలకు మద్దతు ధర పెంచిందని, 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని, రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని అన్నారు. లక్ష ఉద్యోగాలు వెంటనే భర్తీ చేస్తామని చెప్పారు. దిలీపాచారిని గెలిపించాలి నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో బీజేపీ తరఫున పోటీ చేస్తున్న దిలీపాచారిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. దిలీప్ ప్రసంగం విన్నానని, మంచి వక్త అని, అసెంబ్లీకి పంపితే నాగర్‌కర్నూల్ ప్రజల కష్టాలపై అసెంబ్లీలో మాట్లాడతారని చెప్పారు. హిందీలో ప్రసంగించిన రాజ్‌నాథ్‌సింగ్ మొదట తెలుగులో నాగర్‌కర్నూల్ ప్రజలకు అభినందనలు తెలిపారు. అనంతరం హిందీలో ప్రసంగిస్తుండగా జాతీయ కిసాన్ మోర్చ ప్రధాన కార్యదర్శి సుగుణాకర్‌రావు తెలుగులో అనువదించారు. నాగర్‌కర్నూల్‌లో అభివృద్ధి ఏదీ? బీజేపీ అభ్యర్థి దిలీపాచారి మాట్లాడుతూ టీఆర్ఎస్ పాలనలో నాగర్‌కర్నూల్‌లో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరగలేదని అన్నారు. అభివృద్ధి, సమస్యలను పరిష్కరించకుండా ఓట్లు అడుగుతున్నారని అన్నారు. వారిని ఓటుతో తిప్పికొట్టాలని ప్రజలను కోరారు. ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్రూం ఇల్లు, దళితులకు మూడెకరాల భూమి ఇస్తానన్న హామీలు అమలుచేయలేదన్నా రు. బీజేపీని గెలిపిస్తే నాగర్‌కర్నూల్‌కు కేంద్రీయ సంస్థలను తీసుకొస్తానని, యువకులకు ఉపాధి కల్పిస్తామని అన్నారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కేంద్ర హోంశాఖ మంత్రి మొదటిసారిగా నాగర్‌కర్నూల్‌కు వస్తుండటంతో సభాప్రాంగణం వద్ద, సభా ప్రాంగణానికి చేరుకునే దారిలో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ఉయ్యలవాడ వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్దకు చేరుకుని అక్కడి నుంచి కాన్వాయ్ ద్వారా సభాస్థలికి చేరుకున్నారు. దాదాపు గంటసేపు ప్రసంగించారు. 1.45గంటలకు తిరిగి వెళ్లిపోయారు. బహిరంగ సభకు ప్రజలు, బీజేపీ శ్రేణులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. సభలో బళ్లారి ఎమ్మెల్యే సోమశేఖర్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు సాంబమూర్తి, బంగారు శృతి, కాశీరాజు, నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షులు సుబ్బారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
బాత్రూమ్లో నీళ్లు పోయలేదని..
సాక్షి, నాగర్ కర్నూలు: జిల్లాలోని తెలకపల్లి మండల కేంద్రంలోని కేకే రెడ్డి స్కూల్లో దారుణం చోటుచేసుకుంది. క్రమశిక్షణ పేరుతో స్కూల్ వార్డెన్ విద్యార్థులను విచక్షణారహితంగా చితకబాదాడు. వివరాల్లోకి వెళితే.. కేకే రెడ్డి స్కూల్లో వార్డెన్‌గా పనిచేస్తున్న రవీందర్.. బాత్రూమ్లో నీళ్లు పోయలేదన్న కోపంతో 130 మంది విద్యార్థులను ఇష్టానుసారంగా చితకబాదాడు. ఈ దాడిలో పలువురు విద్యార్థులకు తీవ్రంగా గాయాలు కావడంతో వారిని నాగర్ కర్నూలులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మిగిలిన విద్యార్థులకు స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులపై విచక్షణారహితంగా దాడి చేసిన వార్డెన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కాగా, ప్రస్తుతం వార్డెన్ రవీందర్ పరారీలో ఉన్నారు. -
నిరంతర నిఘా.. ఆందోళనలో వ్యాపారులు...
సాక్షి, వెల్దండ: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో డబ్బు పంపిణీని అరికట్టేందుకు అధికారులు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. జిల్లా ముఖధ్వారం కావడంతో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. హైదరాబాద్, తదితర ప్రాంతాలను నుంచి డబ్బు, మద్యం చేరవేయకుండా పోలీస్ అధికారులు వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా ముఖద్వారం కావడంతో వెల్దండ మండలంలోని రాఘయపల్లి వద్ద పోలీస్ చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. ఇక్కడ రాత్రీ, పగలు తేడా లేకుండా అనుమానం వచ్చిన వాహనాలను తనిఖీ చేస్తున్నారు. వెల్దండ, కల్వకుర్తి సర్కిల్ పరిధిలోని పోలీస్‌స్టేషన్ సిబ్బందితో విడతల వారీగా విధులు నిర్వహించి ద్విచక్ర, లారీలు, ఆటోలు, ఎన్నికల ప్రచార వాహనాలు, కారు ఏ వాహనాన్ని వదల కుండా ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఎన్నికల కమిషన్ నిబంధనలను అధికారులు, పోలీసులు ప్రణాళికా ప్రకారం అమలు చేస్తున్నారు. తనిఖీల్లో పట్టుబడిన నగదును ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందానికి అప్పగిస్తున్నారు. తనిఖీలో పట్టుబడిన డబ్బుకు సంబంధించిన ధ్రువపత్రాలు సక్రమంగా ఉంటే జిల్లా రిటర్నింగ్ అధికారుల ద్వారా ఆ డబ్బును బాధితులకు అందజేస్తామని అధికారులు పేర్కొంటున్నారు. ఆందోళన చెందుతున్న వ్యాపారులు వాహనాలను తనిఖీ చేస్తుండడంతో వ్యాపారులు, సామాన్య ప్రజలు అందోళన చెందుతున్నారు. కల్వకుర్తి, అచ్చంపేట, వెల్దండ తదితర ప్రాంతాలకు చెందిన వ్యాపారులు సరుకులు తీసుకెళ్లాడానికి హైదరాబాద్ వెళ్తుంటారు. వ్యాపారం కోసం అధిక మొత్తంలో డబ్బు తీసుకెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రూ.7.19లక్షల నగదు పట్టివేత వెల్దండ మండలంలోని రాఘయపల్లి వద్ద చెక్‌పోస్టును అక్టోబర్ 21న ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి కల్వకుర్తి, వెల్దండ సర్కిల్ పరిధిలోని పోలీస్‌స్టేషన్ సిబ్బందితో ప్రతిరోజు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఇప్పటివరకు మొత్తం రూ.7.19లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదును రంగారెడ్డి జిల్లా కలెక్టర్ బృందానికి అప్పగించారు. లబ్ధిదారులు సరైన పత్రాలు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో చూపి నగదు పొందవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో.. ఎన్నికలు సమీపిస్తుండడంతో వాహనాల తనిఖీలు ముమ్మరం చేశాం. రెండు బృందాలను చెక్‌పోస్టు వద్ద ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నాం. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. ఒక వ్యక్తి వద్ద రూ.50వేల కంటే ఎక్కువగా ఉండకూడదనే నిబందన ఉంది. ఇది గమనించి ప్రజలు వారి అవసరాల దృష్ట్యా రూ.50వేల కంటే ఎక్కువ నగదును తీసుకెళ్ల వద్దు. ప్రయాణిస్తు వాహనంలో ఎక్కువ నగదు ఉంటే వాటిని పోలీసులు స్వాధీనం చేసుకుని వాటికి సంబంధించిన పూర్తి పత్రాలను చూపిస్తే వారంలోగా అధికారులు లబ్ధిదారులకు అందజేస్తారు. అలాగే మండలంలోని అన్ని గ్రామాల్లో బెల్టుషాపులను మూసివేయించాం. అక్రమంగా మద్యం విక్రయిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. – వీరబాబు, ఎస్ఐ వెల్దండ జిల్లా అధికారులకు అప్పగిస్తాం ఎన్నికలు రంగారెడ్డి కలెక్టరేట్ పరిధిలో నిర్వహిస్తున్నారు. ఎన్నికల సమయంలో వాహనాల తనిఖీలో లభ్యమైన నగదును రంగారెడ్డి డీటీఓ జిల్లా అధికారులకు అప్పగిస్తాం. డబ్బుకు సంబంధించి పత్రాలు అక్కడ చూయించి నగదును పొందవచ్చు. – వెంకటరమణ, ఫ్టైయింగ్స్క్వాడ్, వెల్దండ -
కల్వకుర్తిలో బోణీ..
సాక్షి, కల్వకుర్తి :అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ సోమవారం మొదలైంది. మొదటిరోజు జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో కల్వకుర్తి మినహా ఎక్కడా అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయలేదు. కల్వకుర్తిలో కాంగ్రెస్, టీఆర్ఎస్ తరుఫునా నామినేషన్ వేశారు. మొదటి సెట్ కావడంతో ఇరువురు నాయకులు సాదాసీదాగా వచ్చి నామినేషన్ పత్రాలు అధికారులకు అందించి వెళ్లారు. కల్వకుర్తిలో రెండు జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా నామినేషన్ల దాఖలు హడావిడి కనిపించలేదు. కానీ కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రంలో మొదటి రోజే కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డి కాంగ్రెస్ తరఫున, టీఆర్ఎస్ తరఫున మాజీ ఎమ్మెల్యే గుర్క జైపాల్‌యాదవ్ నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజేష్‌కుమార్‌కు అందజే«శారు. ఇరువురు మొదటి సెట్ మాత్రం అందజేసి వెళ్లిపోయారు. మరోరోజు భారీ ర్యాలీలతో మరోసారి నామినేషన్ దాఖలు చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జైపాల్ యాదవ్ తన నామినేషన్ పత్రాన్ని మధ్యాహ్నం 1.15 గంటలకు పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే కిష్టారెడ్డి, నాయకులు గోలి శ్రీనివాస్‌రెడ్డి, బాలాజీసింగ్, విజితారెడ్డిలతో కలిసి తహసీల్దారు కార్యాలయానికి వెళ్లారు. రెండో విడత పత్రాలను మంత్రి హరీశ్‌రావు, టీఆర్ఎస్ ముఖ్యనాయకులతో కలిసి మరోమారు నామినేషన్ వేసేందుకు రానున్నారు. మెదటి సెట్ నామినేషన్ పత్రాల్లో ఎడ్మ కిష్టారెడ్డి.. జైపాల్ యాదవ్ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ నామినేషన్ పత్రాలపై సంతకం చేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున తాజా మాజీ ఎమ్మెల్యే చల్లావంశీచంద్‌రెడ్డి మధ్యాహ్నం 12.15 గంటలకు తన కుటంబ సభ్యులతో కలిసి వచ్చి మొదటి సెట్ నామినేసన్ పత్రాలను దాఖలు చేశారు. తండ్రి రాంరెడ్డి, తల్లి శోభారెడ్డిలతో పాటు భార్య ఆశ్లేషారెడ్డి, కూతురు మహాక్షారెడ్డిలతో కలిసి వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. రెండో విడతలో సీనియర్ నాయకులు జైపాల్‌రెడ్డితో రానున్నట్లు తెలిసింది. వంశీచంద్‌రెడ్డి భార్య ఆశ్లేషారెడ్డి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ నామినేషన్ పత్రాలపై సంతకం చేశారు. నాగర్‌కర్నూల్‌లో నిల్.. నాగర్‌కర్నూల్: జిల్లా కేంద్రంలో నామినేషన్ల స్వీకరణకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేయగా మొదటిరోజు సోమవారం ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. నాగర్‌కర్నూల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేసే ఏ అభ్యర్థి కూడా నామినేషన్ వేయడానికి రాలేదు. స్థానిక ఆర్డీఓ (రిటర్నింగ్ అధికారి) కార్యాలయంలో నామినేషన్లను స్వీకరించేందుకు అందుబాటులో ఉన్నారు. కార్యాలయం వద్ద భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయగా ఉదయం 11గంటలకు నామినేషన్ పత్రాల స్వీకరణకు ముందే బాంబ్ స్క్వాడ్‌తో కార్యాలయ ఆవరణ మొత్తం తనిఖీలు నిర్వహించారు. అచ్చంపేటలోనూ నిల్ అచ్చంపేట: ఎన్నికల ప్రక్రియలో కీలకఘట్టమైన నామినేషన్ల దరఖాస్తుల స్వీకరణ సోమవారం ప్రారంభించగా మొదటిరోజు ఏ అభ్యర్థి కూడా దాఖలు చేయలేదు. ప్రచారంలో మునిగి తేలు తున్న అభ్యర్థులు నామినేషన్లకు ముహూర్తాలను వెతుక్కుంటున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజు ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా బీఫామ్ తీసుకున్నారు. ఆయన ఆర్భాటంగా ఈనెల 14న నామినేషన్ వేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే మహాకూటమి అభ్యర్థి డాక్టర్ వంశీకృష్ణ కా>ంగ్రెస్ పార్టీ నుంచి భీఫామ్ ఇంకా అందుకోలేదు. అలాగే బీజేపీ అభ్యర్థి మల్లేశ్వర్‌తో పాటు ఇతర పార్టీల అభ్యర్థులు ముహూర్తం చూసుకుని నామినేషన్ వేయాలని చూస్తున్నారు. అచ్చంపేట తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. డీఎస్పీ నర్సింహులు మొదటిరోజు రిటర్నింగ్ అధికారి కార్యాలయాన్ని పరిశీలించారు. అక్కడ భారీ బందోబస్తును ఏర్పాటు చేసి 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. సీఐ రామకృష్ణ, ఎస్ఐలు పరుషరామ్, రమేష్ బందో బస్తును పర్యవేక్షిస్తున్నారు. -
‘స్వచ్ఛ’ పాఠశాల
సాక్షి, లింగాల:ప్రధానోపాధ్యాయుడి కృషి, గ్రామస్తుల సహకారంతో మూతపడే దశలో ఉన్న పాఠశాలను ఆదర్శంగా తీర్చిదిద్దారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడంతో రెండుసార్లు అవార్డులు అందుకున్నారు. విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. విద్యార్థులు తక్కువగా ఉన్నారు. ఇక మూసివేస్తారని అనుకున్నారు. ఓ ఉపాధ్యాయుడి పట్టుదల, కృషితో పూర్వవైభవం తీసుకొచ్చారు. నేడు మండలంలోని ఆదర్శ పాఠశాలగా వెలుగొందుతుంది. అదే మండలంలోని మగ్ధూంపూర్ ప్రాథమిక పాఠశాల. విద్యార్థుల సంఖ్య పెరగడంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే స్వచ్ఛ విద్యాలయం పురస్కారాలు అందుకున్నారు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జె.శంకర్. నాడు 6.. నేడు 33 మంది ఈ పాఠశాలలో ఒకటి నుంచి 5వరకు తరగతులు కొనసాగుతున్నాయి. ప్రధానోపాధ్యాయుడిగా శంకర్, విద్యావలంటీర్‌గా లక్ష్మీప్రసన్న పని చేస్తున్నారు. 2015లో ఆయన పాఠశాలకు వచ్చిన సమయంలో కేవలం ఆరుగురు మంది విద్యార్థులు ఉన్నారు. ఆ సమయంలో పాఠశాల మూత పడే అవకాశాలు ఉండేవి. దీంతో ఉపాధ్యాయుడు శంకర్ చేసిన కృషి ఫలించింది. ప్రతి రోజు పాఠశాల ప్రారంభానికి ముందుగా వచ్చి గ్రామంలో ఇంటింటికి వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు. విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందిస్తామని, మధ్యాహ్న భోజనం తదితర ప్రభుత్వ పథకాలను వివరించారు. గ్రామం పాఠశాల మూతపడితే తిరిగి పున:ప్రారంభం కావడం కష్టమని గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఆయన పట్టుదల, కృషిని శ్లాఘించిన విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు మాన్పించి గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలకు పంపడం మొదలు పెట్టారు. దీంతో ప్రశ్నార్థకంగా ఉన్న పాఠశాల పరిస్థితి నేడు ఉన్నతంగా మారింది. నేడు 33 మంది విద్యార్థులు ఉన్నారు. రెండు స్వచ్ఛ పురస్కారాలు పాఠశాల హెచ్ఎం శంకర్ శ్రద్ధతో గత సెప్టెబంరు 5న పాఠశాలకు రెండు స్వచ్ఛ పురస్కారాలు వచ్చాయి. జిల్లాకు మొత్తం మూడు పురస్కారాలు రాగా అందులో రెండు ఈ పాఠశాలకు రావడం గర్వంగా ఉందని హెచ్ఎం పేర్కొన్నారు. సొంతంగా ఖర్చు పాఠశాల నేడు పచ్చదనంతో విరాజిల్లుతుంది. ప్ర తి ఏటా పాఠశాలకు ప్రభుత్వం నుంచి వస్తున్న రూ .10 వేలు సౌకర్యాలకు ఏ మాత్రం సరిపోవడం లే దు. ఇప్పటివరకు హెచ్ఎం సొంతంగా రూ.40వేల వరకు ఖర్చు చేసి ప్రొజెక్టర్ ఏర్పాటు చేయించచారు. కలరింగ్‌తో పాటు విద్యార్థులను ఆకర్శించే విధంగా వివిధ జాతీయ నాయకుల చిత్రపటాలను వేయించారు. మరుగుదొడ్లు, మూత్రశాలల సౌకర్యం తదితర పనులు చేయించారు. సంపాదనలో కొంత పాఠశాలకు ఖర్చు ప్రతి నెలా తనకు వస్తున్న వేతనంలో కొంత భాగం పాఠశాలకు ఖర్చు చేయాలని నిర్ణయించాను. గ్రామస్తులు సహకరించడంతో నేడు విద్యార్థుల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం పాఠశాలకు అదనపు గదులు, ఆటస్థలం కావాల్సి ఉంది. దీనికి కొంత మేరకు దాతల సహకారం కోరుతున్నాను. దాతలు సహకరిస్తే సౌకర్యాలు కల్పించి తనవంతు కర్తవ్యాన్ని నెరవేరుస్తా. ఉపాధ్యాయులను నియమించాల్సి ఉంది. – జక్కం శంకర్, హెచ్ఎం, పీఎస్ మగ్ధూంపూర్ -
టైరు ఊడి.. అదుపుతప్పి..
సాక్షి, బిజినేపల్లి రూరల్/హైదరాబాద్/నర్సాపూర్: కొండగట్టు బస్సు ప్రమాదం మరువక ముందే నాగర్‌కర్నూల్ జిల్లాలో మరో బస్సు ప్రమాదం జరిగింది. వట్టెం గ్రామ సమీపంలో ఆర్టీసీ బస్సు టైరు ఊడి పంట పొలాల్లోకి దూసుకెళ్ల డంతో 11 మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో 9మందిని నిమ్స్‌కు, మిగిలిన వారిని నాగర్‌కర్నూల్ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో అందరూ వీఆర్వో అభ్యర్థులే ఉన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 100 మంది ఉన్నట్లు తెలిసింది. బస్సు టాప్‌పై.. యాదగిరిగుట్ట డిపోకు చెందిన (ఏపీ 24జడ్ 0037) బస్సు ఆదివారం హైదరాబాద్ నుంచి వనపర్తి బయలుదేరింది. వీఆర్వో పరీక్ష ఉండటం, బస్సులో ప్రయాణికులు ఎక్కువగా ఉండటంతో కొందరు బస్సు టాప్ పైకి ఎక్కారు. బిజినేపల్లి మండలం వట్టెం సమీపంలో లక్ష్మీనర్సింహస్వామి ఆలయం వద్దకు బస్సు రాగానే ముందు టైరు పేలింది. దీంతో బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. బస్సులో ప్రయాణికులు కిక్కిరిసి ఉండటంతో తొక్కిసలాట జరిగింది. బస్సు టాప్‌పై ఉన్న వారు కిందపడ్డారు. కిందపడిన వారిలో 11 మందికి తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. వెంటనే ప్రమాద స్థలికి చేరుకున్న డీఎస్పీ లక్ష్మినారాయణ, సీఐ శ్రీనివాస్‌రెడ్డి సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో ప్రయాణిస్తున్న 100 మందిలో 65 మంది వీఆర్వో అభ్యర్థులే ఉన్నారు. చాలా కాలంగా పరీక్షకు సిద్ధమవుతున్నామని, పరీక్షకు వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగి రాయలేకపోయామని అభ్యర్థులు కన్నీరుమున్నీరయ్యారు. కాగా, నిమ్స్‌లో చికిత్స పొందుతున్న వారిని స్థానిక మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి పరామర్శించారు. తక్షణ సహాయంగా కొంత నగదును బాధితుల బంధువులకు అందజేశారు. క్షతగాత్రుల వివరాలు మ«ధుకర్ (బైరాపూర్), భూపాల్ (బోడంపహాడ్), రాజు (బాలానగర్), అనిల్ (కొడంగల్) నాగర్ కర్నూల్ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తీవ్రంగా గాయపడిన రాజశేఖర్ (మాడ్గుల), ప్రభాకరాచారి (హైదరాబాద్), రాంచందర్ (బాలానగర్), నాగమల్లయ్య (తెల్కపల్లి), జింకల శివకుమార్ (ఆలేరు), నర్సింహులు (పెద్దఅల్వాల్), కృష్ణ (వెల్జాల)ను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నిమ్స్‌కు తరలించారు. కలెక్టర్ చొరవతో పరీక్షకు.. పాన్‌గల్: ప్రమాదంలో గాయపడి ఆలస్యంగా కేంద్రానికి చేరుకున్న అభ్యర్థి కలెక్టర్ శ్వేతామహంతి చొరవతో పరీక్ష రాసేందుకు సిబ్బంది అనుమతించారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ చెందిన పవన్ కల్యాణ్.. వనపర్తి జిల్లా పాన్‌గల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రానికి చేరుకోవాల్సి ఉంది. కానీ నాగర్‌కర్నూల్‌లో జరిగిన బస్సు ప్రమాదంలో పవన్ కూడా గాయపడ్డాడు. అయినా 11.28 నిమిషాలకు కేంద్రానికి చేరుకున్నాడు. కానీ ఆలస్యమవడంతో అధికారులు అనుమతించలేదు. విషయం కలెక్టర్‌కు తెలియడంతో పరీక్షకు అనుమతించారు. అప్పటికే పవన్ వెనుదిరిగినా పాన్‌గల్ ఎస్సై తిరుపాజీ హుటాహుటిన వెళ్లి వనపర్తి మండలం అంజనగిరి వద్ద బస్సును ఆపి పవన్‌ను తన వాహనంపై పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లారు. ప్రత్యేక గదిలో 12.40కి పరీక్ష రాసేందుకు అనుమతించారు. నర్సాపూర్‌లో మరో ప్రమాదం నర్సాపూర్‌లో మరో బస్సు ప్రమాదం జరిగింది. బస్సు బ్రేకులు పనిచేయకపోవడంతో లారీని ఢీ కొట్టింది. సంగారెడ్డి డిపోకు చెందిన ఏపీ 28 జెడ్ 0480 నంబర్ బస్సు ఆదివారం సాయంత్రం సంగారెడ్డి నుంచి గజ్వేల్ బయలుదేరింది. నర్సాపూర్ పట్టణ శివారులోని బీవీఆర్టీ కాలేజీ దగ్గరకు రాగానే స్పీడ్ బ్రేకర్ వద్ద బస్సు బ్రేకులు పనిచేయకపోవడంతో లారీని వెనక నుంచి ఢీ కొట్టింది. ప్రమాదంలో డ్రైవర్ రాములు సహా పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులు నవ్య, మనోహర, బూదమ్మలను స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. నవ్య, మనోహర సంగారెడ్డిలో వీఆర్వో పరీక్ష రాసి వస్తున్నట్లు చెప్పారు. ప్రమాద సమయంలో 60 మంది ప్రయాణికులున్నారని కండక్టర్ శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు. కాలేజీ సమీపంలో ఉన్న స్పీడ్ బ్రేకర్ వద్ద బ్రేకులు పడకపోవడంతో ముందున్న లారీని ఢీ కొట్టిందని డ్రైవర్ తెలిపారు. బస్సు ప్రమాదంలో గాయపడిన ‘వీఆర్వో’ అభ్యర్థులు -
దోచేస్తుండ్రు !
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : సులువుగా డబ్బు సంపాదించడానికి అలవాటు పడిన అక్రమార్కులు సహజవనరులను దోపిడీ చేసేస్తున్నారు. అందులో భాగంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తంగా ప్రవహిస్తున్న దుందుభీ నదిలోని ఇసుకపై అక్రమార్కుల కన్ను పడింది. అత్యంత పొడువుగా విస్తరించి ఉన్న దుందుభి నదిలో భారీగా ఇసుక మేటలు ఉన్నాయి. ప్రస్తుతం నిర్మాణం రంగం ఊపందుకున్న క్రమంలో ఇసుకకు భారీ డిమాండ్ ఉండడంతో అధికారుల సహకారంతో అనుమతుల పేరిట దోచే స్తున్నారు. మిషన్ భగీరథ, సీసీ రోడ్లు, ప్రభుత్వ భవనాల నిర్మాణాల పేరుతో ఇసుకను పక్కదారి పట్టిస్తున్నారు. అలా మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల మీదుగా దాదాపు 150 కి.మీ మేర ప్రవహించే దుందుభీలో ఇసుకను స్వాహా చేస్తున్నారు. అక్రమార్కులకు అధికారుల అండదండలు తోడవడంతో దోపిడీకి అడ్డూఅదుపు లేకుండా పోయింది. పది మండలాలో ప్రవాహం కృష్ణా నదికి ఉపనది అయిన దుందుభీ నది ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు జీవాధారం. దాదాపు 150 కి.మీ పైగా ప్రవహిస్తూ పది మండలాలకు సాగు, తాగునీరు అందిస్తోంది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని బాలానగర్‌తో మొదలుకొని రాజాపూర్, జడ్చర్ల, మిడ్జిల్, తిమ్మాజిపేట, తాడూర్, కల్వకుర్తి, తెలకపల్లి, వంగూరు, ఉప్పునుంతల మండలాల మీదుగా ప్రవహించి నల్లగొండ జిల్లాలోని డిండిలో కలుస్తుంది. దుందుభీ నది ఒక్కసారి ప్రవహించిందంటే దాదాపు నాలుగేళ్ల వరకు కరువు ఉండదనేది ఇక్కడి రైతుల నమ్మకం. అయితే ఆ నమ్మకం కాస్తా సడలిపోతుంది. నదిలో మేట వేసిన ఇసుకను కొన్ని చోట్ల తోడేస్తుండడంతో భూగర్భజలాలు గతంలో మాదిరిగా ఇంకడం లేదు. ఫలితంగా నది ప్రవహించినా అంతగా ఉపయోగం లేకుండా పోతుంది. గతేడాది దాదాపు 15రోజుల పాటు దుందుభీ ప్రవహించినా... జడ్చర్ల మండల పరిధిలోని కోడుగల్, లింగంపేట, ఆల్వాన్‌పల్లి తదితర గ్రామాల్లో గత వేసవిలో బోర్లు ఎండిపోయాయి. ఇసుక లూటీ దుందుభీ పరివాహక ప్రాంతాల్లో గత పదిహేను రోజుల నుంచి అక్రమార్కులు ఇసుక లూటీ చేస్తున్నారు. మహబూబ్‌నగర్‌లోని బాలానగర్ మండలంతో పాటు నాగర్‌కర్నూల్ జిల్లాలోని వంగూరు, ఉప్పునుంతల మండలాల నుంచి భారీగా ఇసుకను తరలిస్తున్నారు. స్థానిక అవసరాలు, ప్రభుత్వ పనులైన మిషన్ భగీరథ, సీసీ రోడ్లు పేరిట ట్రాక్టర్లతో ఇసుకను విచ్చలవిడిగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఉప్పునుంతల, వంగూరు మండలాల సరిహద్దులో ఉన్న తిర్మలాపూర్-చింతపల్లి బ్రిడ్జి దిగువన గతంలో ఒడ్డుకు తరిమిన ఇసుకను గోతులు పెట్టి ట్రాక్టర్లకు నింపుతున్నారు. ప్రతీరోజు ఇక్కడ ఒకే చోట నుంచి దాదాపుగా 30 ట్రాక్టర్ల వరకు ఇసుకను తరలిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇసుకను తవ్వుతున్న ప్రాంతం చింతపల్లి శివారు వంగూరు మండల పరిధిలోకి వస్తుంది. ఇసుకను అక్కడ నింపుకుని ఉప్పునుంతల మండల పరిధిలోని శాండ్ క్వారీ రోడ్డు వెంట తాడూరు మీదుగా అచ్చంపేట తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. అదే విధంగా ఉప్పునుంతల మండలంలోని పెద్దాపూర్ సమీపంలో కూడా ఆ గ్రామానికి చెందిన కొంతమంది రాత్రి వేళ దుందుభీ నుంచి ఇసుకను ట్రాక్టర్లతో తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇటీవలే స్థానిక ఎస్సైని జిల్లా కేంద్రానికి అటాచ్ చేయడంతో ఇసుక వ్యాపారులు ఆగడాలకు అడ్డు లేకుండా పోయింది. దుందుభీ నది ఉప్పునుంతల, వంగూరు మండలాల సరిహద్దులో ఉండడంతో ఇక్కడి పోలీసులు దాడులు చేసినప్పుడు అటు, అక్కడి పోలీసులు దాడులు చేసినప్పుడు ఇటు వస్తూ తప్పించుకుంటున్నారు. నిబంధనలకు తూట్లు ప్రభుత్వ అనుమతుల పేరిట కొందరు అక్రమార్కులు నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. మిషన్ భగీరథ, రోడ్డుబ్రిడ్జి పనులు, సీసీ రోడ్లు తదితర పేర్లతో అనుమతులు పొంది ఇసుకను పక్కదారి పట్టిస్తున్నారు. అలాగే ఉదయం 8గంటలకు ఇసుక తవ్వకాలు ప్రారంభించాల్సి ఉండగా 6గంటలకు ముందే తవ్వకాలు ప్రారంభిస్తున్నారు. అలాగే సాయంత్రం 5గంటలకు ముగించాల్సి ఉన్నా రాత్రి పొద్దుపోయే దాకా ఫ్లడ్‌లైట్లు బిగించి మరీ ఇసుక తరలింపు సాగిస్తున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో అనుమతులు పొందిన వాహనాలకు జీపీఎస్ విధానం లేకపోవడంతో అక్రమార్కుల పంట పండుతోంది. ఒక లారీ ఇసుకను పక్కదారి పట్టిస్తే దాదాపు రూ.30వేల వరకు మిగులుబాటు ఉంటుంది. దీంతో నిత్యం పదుల సంఖ్యలో వాహనాలను దారి మళ్లించి సొమ్ముచేసుకుంటున్నారు. -
ఉడికీ ఉడకని అన్నం తినేదెట్టా?
బల్మూర్ నాగర్‌కర్నూల్ : దాదాపు పదిహేను రోజులుగా మధ్యాహ్న భోజనంలో ఉడికి ఉడకని అన్నం.. నీళ్ల చారు వడ్డిస్తుండటంతో ఆకలి మంటలు తాళలేని విద్యార్థులు ఆందోళనకు దిగారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో పదిహేను రోజుల నుంచి మధ్యాహ్న భోజనం నాసిరకంగా ఉడికి ఉడకని అన్నం.. నాణ్యత లేని కూరగాయలతో వడ్డిస్తున్నారని శుక్రవారం విద్యార్థులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ సరిగా ఉడకని అన్నం తినడంతో కడుపునొప్పితో ఇబ్బంది పడుతున్నామని తహసీల్దార్ అంజిరెడ్డి ఎదుట వాపోయారు. స్పందించిన తహసీల్దార్ వెంటనే పాఠశాలకు చేరుకొని విద్యార్థుల మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. నిత్యం పర్యవేక్షణ చేయాల్సిన హెచ్ఎం కూడా సరైన సమాధానం చెప్పకుండా దాటవేయడంతో తహసీల్దార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజనాన్ని నాణ్యతగా అందించకుంటే తర్యలు తీసుకుంటామని ఏజెన్సీ మహిళలను హెచ్చరించారు. ఇక ముందు ఎలాంటి సమస్య వచ్చినా కఠిన చర్యలు తీసుకుంటామని, ఈ విషయమై ఉన్నతాధికారులకు నివేదిస్తామని ఆయన తెలిపి విద్యార్థులను శాంతింపజేశారు. -
గుడిపల్లి లిఫ్ట్–3 మోటార్లు ప్రారంభం
నాగర్‌కర్నూల్ ఎడ్యుకేషన్/ వనపర్తి : ఎగువ కృష్ణ మ్మ పరవళ్లు తొక్కుతున్న సందర్భంగా శ్రీశైలం బ్యాక్ వాటర్ నీటిని తోడిపోసుకునేందుకు కేఎల్ ఐ (మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథ కం)లో భాగంగా గురువారం గుడిపల్లి థర్డ్ లిఫ్ట్ మోటార్లను ప్రారంభించారు. రాష్ట్ర ప్రణాళిక సం ఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మ ర్రి జనార్దన్‌రెడ్డి, చిన్నారెడ్డి హాజరై మోటార్లను ప్రా రంభించారు. ఈసందర్భంగా నిరంజన్‌రెడ్డి మా ట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన ఫలితంగానే ఎత్తిపోతల పథకాల ద్వారా రైతులకు సాగు నీరు అందించగలుగుతున్నామని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఆశీస్సులు అం దించాలని కోరారు. ప్రాజెక్టులపై కాంగ్రెస్ నాయకులకు అవగాహన లేదని, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పూర్తి కావటానికి భారీ నీటి పారుదల శా ఖా మంత్రి హరీశ్‌రావుతోపాటు పంచాయతీరాజ్ శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రాజెక్టు పనులను పూర్తి చేసేందుకు రాత్రివేళ ఇక్కడే బసచేశారని, కాంట్రాక్టర్లపై ఒత్తిడి తెచ్చి పూర్తి చేశారని పేర్కొన్నారు. గతంలో కేఎల్‌ఐకి 25టీఎంసీల నీటి కేటాయింపులే ఉంటే ప్రస్తుతం 40 టీఎంసీలకు పెంచి వరద జలాలు వినియోగించుకునేలా 2015 సెప్టెంబర్‌లో జీఓ తెచ్చామని అన్నారు. వరద జలాలపై ఆధారపడిన ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులకు నికర జలాలు వినియోగించుకునేలా కృషి చేస్తున్నామని తెలిపారు. న్యాయబద్ధంగా కృష్ణానికర జలాలను సంపూర్ణంగా వినియోగించుకునేందుకు వంద టీఎంసీలతో పాలమూరు ఎత్తిపోతలను నిర్మించామని అన్నారు. 46వేల చిన్న నీటి చెరువులను నీటితో నింపి సాగునీరు అందిస్తామన్నారు. ఈ ఏడాది కేఎల్ఐ కింద రైతులు రెండు పంటలు వేసుకునే అవకాశం ఉందన్నారు. నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రికి వ్యవసాయంపై ప్రేమ ఉందని, గతంలో ప్రాజెక్టులను ఎవరూ పట్టించుకోలేదని, రాష్ట్ర నీటి పారుదల శాఖా మంత్రి హరీశ్‌రావు చొరవతో కేఎల్ఐ త్వరితగతిన పూర్తయిందని అన్నారు. కార్యక్రమంలో కేఎల్ఐ ఎస్ఈ భద్రయ్య, ఈఈ రమేష్‌జాదవ్, ఏఈఈ సందీప్‌రెడ్డి, మహ్మద్‌గౌస్, నరేష్, గోపాల్పేట ఎంపీపీ జానకిరాంరెడ్డి, నాగర్‌కర్నూల్ నియోజకవర్గ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, టీఆర్ఎస్ నాయకులు జక్కా రఘునందన్‌రెడ్డి పాల్గొన్నారు. -
పెళ్లి పీటలపై వధువు మృతి
అచ్చంపేట రూరల్: కోటి ఆశలతో కొత్త కాపురంలోకి అడుగు పెట్టాల్సిన ఓ యువతి.. తాళి కట్టించుకున్న కొద్దినిముషాలకే పెళ్లిపీటలపై కుప్పకూలి కన్ను మూసింది. తాళి కార్యక్రమం ముగిశాక.. అరుంధతి నక్షత్రాన్ని చూసేందుకు బయటకు రావాలని పురోహితుడు కోరగా, పైకి లేస్తున్న క్రమంలో ఆ యువతి పెళ్లి వేదికపై కింద పడిపోయింది. బంధువులు ఆందోళనతో ఆస్పత్రికి తీసుకెళ్లే లోగానే మృతి చెందింది. రెండు కుటుంబాల్లో విషాదం నింపిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని మహేంద్రనగర్ కాలనీలో కొండి నిరంజన్, శంకరమ్మ దంపతులకు ఐదుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. ఇందులో ఇద్దరు కుమారులతో పాటు తండ్రి నిరంజన్ చనిపోయారు. చిన్న కుమార్తె లక్ష్మి అలియాస్ నిరంజనమ్మ(20)కు వికారాబాద్ జిల్లా పరిగికి చెందిన శేఖర్ కుమారుడు బాగాడి వెంకటేశ్‌తో కుటుంబీకులు వివాహం నిశ్చయించారు. శనివారం ఉదయం 11 గంటలకు వధువు ఇంటి వద్ద మహేంద్రనగర్ కాలనీలోనే పెళ్లి వేడుక నిర్వహించారు. వరుడు తాళి కట్టిన అనంతరం అరుంధతి నక్షత్రాన్ని చూడడానికి బయటకు రావాలని నూతన జంటను పురోహితుడు పిలిచాడు. వధువు లక్ష్మి పైకి లేవడానికి ప్రయత్నించి అకస్మాత్తుగా పెళ్లి పీటలపైనే కుప్పకూలిపోయింది. అప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్న లక్ష్మి కుప్పకూలవడంతో బంధువులు వెంటనే పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. వధువు సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని ఎస్ఐ పరశురాం తెలిపారు. మృతురాలి కుటుంబ సభ్యులను మున్సిపల్ చైర్మన్ తులసీరాం, టీఆర్ఎస్ నాయకులు నర్సింహగౌడ్, కోట కిషోర్, హుస్సేన్ తదితరులు పరామర్శించారు.