Updates..
మోదీ నేతృత్వంలో దేశం అభివృద్ది దిశగా సాగుతోందని, తెలంగాణ అభివృద్ధిలో మోదీ చేయాల్సింది అంతా చేస్తున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ఆదివారం ఆయన నాగర్ కర్నూల్‌లోని నవ సంకల్పసభలో మాట్లాడుతూ, తెలంగాణలో కేసీఆర్ కుటుంబం మాత్రమే లాభపడింది. తెలంగాణ కోసం ఎంతో మంది ఆత్మబలిదానాలు ఇచ్చారు. తెలంగాణ సామర్థ్యాన్ని కేసీఆర్ నాశనం చేశారు’’ అంటూ జేపీ నడ్డా మండిపడ్డారు.
‘‘తెలంగాణ వికాసం కోసం ప్రధాని మోదీ ఎంతో చేశారు. తెలంగాణకు మోదీ భారీ ఎత్తున నిధులు ఇచ్చారు. 80 కోట్ల ప్రజలకు మోదీ ప్రభుత్వం రేషన్ ఇస్తోంది. కిసాన్ సమ్మాన్ నిధితో రైతులను కేంద్రం ఆదుకుంటోంది. మొత్తం ఐరోపా ఖండం కన్నా ఐదు రెట్ల మందికి రేషన్ అందుతోంది. దేశంలో పేదరికం 10 శాతం కన్నా తక్కువకు పడిపోయింది. ఉజ్వల, ఉజాలా పథకాలతో గ్యాస్ అందిస్తున్నాం. ఆయుస్మాన్ పథకంతో ఎంతోమందికి బీమా కల్పించాం. మోదీ నేతృత్వంలో 9 ఏళ్లలో భారత్ ఎంతో అభివృద్ధి సాధించింది’’ అని జేపీ నడ్డా పేర్కొన్నారు.
♦సాయంత్రం 5 గంటలకు నాగర్ కర్నూల్‌కు వెళ్లనున్న జేపీ నడ్డా.. అక్కడ బహిరంగ సభలో పాల్గొననున్నారు.
♦ సంపర్క్ సే సమర్థన్ ప్రచారంలో భాగంగా ఫిల్మ్‌నగర్‌లో క్లాసికల్ డ్యాన్సర్, పద్మశ్రీ గ్రహీత ఆనంద శంకర జయంత్‌తో జేపీ నడ్డా, కిషన్‌రెడ్డి భేటీ అయ్యారు. మోదీ పాలనలో అభివృద్ధిపై రూపొందించిన పుస్తకాలను ఆనంద శంకరకు అందించారు.
నా అభిప్రాయాలను జేపీ నడ్డాతో పంచుకున్నా: ప్రొ.నాగేశ్వర్
జేపీ నడ్డాతో భేటీ అనంతరం ప్రొఫెసర్ నాగేశ్వర్ మీడియాతో మాట్లాడుతూ, మోదీ ప్రభుత్వ పాలన గురించి నడ్డా వివరించారని తెలిపారు. ‘‘వివిధ అంశాలపై సమావేశంలో చర్చించాం. దేశవ్యాప్తంగా అనేకమందిని కలుస్తున్నారు. అందులో భాగంగానే నన్ను కలిశారు. నా అభిప్రాయాలను జేపీ నడ్డాతో పంచుకున్నా. ప్రజాస్వామ్యంలో ఇలా కలుసుకోవడం శుభపరిణామం. సిద్ధాంతాలు వేరైనా అభిప్రాయాలు పంచుకోవడం మంచిది’’ అని నాగేశ్వర్ పేర్కొన్నారు.
♦ప్రొఫెసర్ నాగేశ్వర్‌తో జేపీ నడ్డా సమావేశమయ్యారు. బీజేపీ 9 ఏళ్ల పాలనపై రూపొందించిన పుస్తకానికి నాగేశ్వర్‌కు ఆయన అందించారు. నడ్డా వెంట తెలంగాణ బీజేపీ ముఖ్య నాయకులు ఉన్నారు.
♦ నోవాటెల్‌లో రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలతో జేపీ నడ్డా సమావేశమయ్యారు.
♦ ఈ సమావేశంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, బండి సంజయ్, రఘునందరావు, విజయశాంతి, వివేక్ తదితరులు ఉన్నారు.
♦ శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న జేపీ నడ్డా.
♦బీజేపీ అధిష్టానం తెలంగాణ రాజకీయాలపై ఫోకస్ పెంచింది. ఈ నేపథ్యంలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు మరోసారి తెలంగాణకు వస్తున్నారు. ఈ క్రమంలో నాగర్ కర్నూలులో బీజేపీ తలపెట్టిన సభకు జేపీ నడ్డా హాజరుకానున్నారు.
♦ అయితే, కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయంగా, రాష్ట్రంలో పార్టీ పరంగా నాయకుల్లో ఏర్పడిన గందరగోళాన్ని తొలగించి దిశానిర్దేశం చేసే విషయంలో ఈ పర్యటనకు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. పార్టీలో ముఖ్యనేతల మధ్య సమన్వయం కొరవడి బీజేపీ డీలాపడిందనే ప్రచారం మధ్య నడ్డా పర్యటన రాష్ట్రంలో పార్టీకి కొత్త ఊపును ఇస్తుందని భావిస్తున్నారు.
♦ జేపీ నడ్డా.. మధ్యాహ్నం ‘సంపర్క్ సే సమర్థన్’లో భాగంగా ఆర్థిక, రాజకీయ విశ్లేషకుడు ప్రొ. కె.నాగేశ్వర్, పద్మశ్రీ అవార్డు గ్రహీత ఆనంద్ శంకర్ జయంత్‌ల ఇళ్లకు వెళ్లి నడ్డా వారిని కలుసుకోనున్నారు.
నడ్డా పూర్తి షెడ్యూల్ ఇదే..
♦ ఆదివారం మధ్యాహ్నం 12.30 నిమిషాలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దిగుతారు.
♦ మధ్యాహ్నం 12.55 నుంచి 1.45 గంటల దాకా నోవాటెల్ హోటల్లో రిజర్వ్ టైమ్.
♦ 2.30 గంటలకు టోలిచౌకిలోని ప్రొ.నాగేశ్వర్ నివాసానికి వెళ్లి 15 నిమిషాలు సమావేశమవుతారు.
♦ 2.55 నిమిషాలకు ఫిల్మ్‌నగర్‌లో పద్మశ్రీ ఆనంద శంకర్ జయంత్‌ను కలుసుకుంటారు.
♦ 3.50కి నోవాటెల్‌కు చేరుకుంటారు.
♦ 4.20 గంటలకు శంషాబాద్ నుంచి హెలికాప్టర్‌లో నాగర్‌కర్నూ ల్‌కు బయలుదేరి 4.50కు అక్కడికి చేరుకుంటా రు.
♦ సాయంత్రం 5–6గంటల మధ్య నాగర్‌కర్నూల్ జెడ్పీ హైసూ్కల్ మైదానంలో బహిరంగసభలో పాల్గొంటారు.
♦ 6.15కు హెలి కాప్టర్‌లో తిరుగు ప్రయాణమై 6.40కి శంషాబాద్‌కు చేరుకుంటారు.
♦ 6.45 గంటలకు ప్రత్యేక విమా నంలో కేరళలోని తిరువనంతపురం వెళతారు.
Comments
Please login to add a commentAdd a comment