JP Nadda
-
‘ఇదేమి దుస్థితి.. వందలాది మంది రోగులు ఫుట్‌పాత్‌పైనే..’
ఢిల్లీ: ‘వారికి అత్యంత ఖరీదైన వైద్యం(high-quality healthcare) చేయించుకునే స్థోమత లేదు. నాణ్యమైన వైద్యం చేయించుకునేందుకు వారి స్థాయి సరిపోవడం లేదు. అందుకే ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలోని వందలాది మంది రోగులు రోడ్లపైనే ఉంటున్నారు. ఫుట్‌పాత్‌లే వారికి దిక్కు అవుతున్నాయి.’ అని ఏఐసీసీ సీనియర్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖా మాత్యులు జేపీ నడ్డాకు, ఢిల్లీ సీఎం అతిషికి లేఖ రాశారు రాహుల్ గాంధీ.‘ ఢిల్లీలోని ఎయిమ్స్(AIIMS) దగర్గ పరిస్థితి హృదయ విదారకంగా ఉంది. ఢిల్లీ ఎయిమ్స్ బయట చూస్తే వందలాది మంది రోగులు ఫుట్‌పాత్‌లపైనే ఉంటున్నారు. ఈ దుస్థితి ఎందుకొచ్చిందనేది ఆలోచన చేస్తే కోట్ల మంది ప్రజలకు మెరుగైన వైద్యం చేయించుకునే పరిస్థితి దేశంలోలేదు. ఈ క్రమంలోనే ఢిల్లీ వంటి మహా నగరంలో ఎయిమ్స్ వంటి ప్రముఖ ఆస్పత్రికి అధిక భారంగా మారింది. దేశంలో హెల్త్ సిస్టమ్ మారాలి. అందుకే కేంద్ర హెల్త్ మినిస్టర్.జేపీ నడ్డాకు విన్నవించుకుంటున్నా. హెల్త్ సిస్టమ్‌లోని లోపాల్ని గుర్తించండి, మొదటిగా దేశంలోన ఉన్న ఎయిమ్స్ ఆస్పత్రిల్లో పరిస్థితిని చక్కదిద్దండి. ఎంత తొందరగా ఆ సమస్యను పరిష్కారిస్తానే ఇక్కడ ముఖ్యం. వైద్యానికి సంబంధించి మౌలిక సదుపాయాలు బలోపేతం కావాలి. ఇది అన్నిస్థాయిల్లోనూ జరగాల్సిన అవశ్యకత ఉంది. రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో వైద్య రంగాన్ని ప్రక్షాళన చేయండి’ అని రాహుల్ పేర్కొన్నారు.రాహుల్ ‘వైట్ టీ–షర్ట్’ ఉద్యమం కాంగ్రెస్ అగ్రనేత (రాహుల్ గాంధీ సామాన్యులకు హక్కుల సాధనే లక్ష్యంగా ఆదివారం వైట్ టీ–షర్ట్’ఉద్యమం ప్రారంభించారు. తన ఉద్యమంలో భాగస్వాములు కావాలంటూ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ ఆదివారం ‘ఎక్స్’లో..‘ఆర్థిక న్యాయం కోరుకునే వారు, పెరుగుతున్న ఆర్థిక అసమానతలను నిరసించేవారు, సామాజిక సమానత్వం కోసం పోరాడేవారు, అన్ని వివక్షలను వ్యతిరేకించేవారు, దేశంలో శాంతి స్థిరతలను కోరుకునే వారు తెల్ల టీ–షర్ట్‌లను ధరించండి. ఉద్యమంలో పాల్గొనండి’అని కోరుతూ ఓ వీడియో షేర్ చేశారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పేదలు, ఉద్యోగులను పట్టించుకోవడం మానేసింది. ప్రభుత్వం దృష్టంతా కేవలం కొందరు పెట్టుబడిదారులను మరింత ధనవంతులను చేయడంపైనే ఉంది. అందుకే, అసమానతలు పెరుగుతూ పోతున్నాయి. తమ రక్తం, స్వేదంతో దేశం కోసం కృషి చేస్తున్న సామాన్యుల పరిస్థితి మరింత దిగజారుతోంది. -
Delhi Elections: రమేష్ బిదురిపై బీజేపీ చర్యలు!
న్యూఢిల్లీ: మహిళా నేతలపై అనుచిత వ్యాఖ్యలతో వార్తల్లోకి ఎక్కిన బీజేపీ నేత రమేష్ బిదురి(Ramesh Bidhuri)పై బీజేపీ అధిష్టానం గరంగరంగా ఉంది. ఆయనపై క్రమశిక్షణ చర్యలకు సిద్ధమైంది. ఇందులో భాగంగా.. ఆయన్ని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నుంచి తప్పించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.ఢిల్లీ సీఎం అతిషితో పాటు ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రాపై రమేష్ బిదురి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇవి రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. బీజేపీ నేత వ్యాఖ్యలను ఖండిస్తూ.. ఇటు ఆప్, అటు కాంగ్రెస్‌లు దేశవ్యాప్త ఆందోళనకు దిగాయి. ఈ పరిణామాలను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) తీవ్రంగా పరిగణించినట్లు సమాచారం.ఈ పరిస్థితుల్లో ఆయన్ని ఎన్నికల నుంచి తప్పించడమో లేదంటే నియోజకవర్గాన్ని మార్చడమో చేయాలని ఆలోచిస్తున్నారట.ఈ అంశంపై రెండుసార్లు భేటీ జరిగినట్లు సమాచారం. ఇక బీజేపీ ఈ మధ్యే తొలి జాబితా విడుదల చేయగా.. కల్కాజీ నుంచి సీఎం అతిషిపైనే రమేష్ బిదురిని బీజేపీకి పోటీకి దింపింది. ఈ క్రమంలోనే ఓ సభలో పాల్గొన్న ఆయన అతిషిపైనా అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆయన్ని అభ్యర్థిగా కొనసాగించడం పార్టీకి మంచిది కాదని బీజేపీ భావిస్తోందట!.కల్కాజీ నియోజకవర్గంలో రమేష్ బిదురిని తప్పించి.. ఆ స్థానంలో మహిళా అభ్యర్థిని అతిషిపై నిలపాలని బీజేపీ(BJP) అనుకుంటోంది. ఈ మేరకు రమేష్‌తోనూ అధిష్టానం చర్చలు జరుపుతున్నట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. గుజ్జర్ సామాజికవర్గపు బలమైన నేతగా పేరున్న రమేష్ బిదురి గతంలో.. మూడుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఎంపీగా పని చేశారు.ఇంతకీ ఆయన ఏమన్నారంటే..రమేష్ బిదురి కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ(Priyanka Gandhi)ని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. తాను అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గితే.. నియోజకవర్గంలోని రోడ్లను ఢిల్లీలోని కల్కాజీ నుంచి తాను విజయం సాధిస్తే అన్ని రోడ్లను ప్రియాంక గాంధీ చెంపలలాగా నున్నగా చేస్తానంటూ వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. .. సీఎం ఆతీషి ఆమె తండ్రినే మార్చేశారు. గతంలో ఆమెకు ఒక ఇంటి పేరు ఉండగా.. ప్రస్తుతం మరో పేరును వినియోగిస్తున్నారు. అంతేకాకుండా, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డ అఫ్జల్ గురుకు క్షమాభిక్ష ప్రసాదించాలంటూ ఆమె తల్లిదండ్రులు పిటిషన్ దాఖలు చేశారు’’ అంటూ రమేశ్ విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. -
హెచ్ఎంపీవీ వైరస్..జేపీ నడ్డా కీలక ప్రకటన
సాక్షి,న్యూఢిల్లీ: హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తిపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా కీలక ప్రకటన చేశారు. భయపడాల్సిన పనిలేదని, పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనస్తున్నామని జేపీనడ్డా తెలిపారు. ఈ మేరకు సోమవారం(జనవరి6) ఆయన మీడియాతో మాట్లాడారు.‘హెచ్ఎంపీవీ వైరస్ కొత్తదేమీ కాదు.2001 సంవత్సరంలోనే దీన్ని కనుగొన్నారు. గాలి ద్వారా ఈ వైరస్ సోకుతుంది. శీతాకాలం ప్రారంభంలో ఇది బాగా వ్యాపిస్తుంది. చైనాలో వ్యాపిస్తున్న ఈ వైరస్‌ను ఎప్పటికప్పుడు గమనిస్తున్నాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ విషయంపై పరిశోధన చేస్తోంది.భారత్‌లో శ్వాసకోశ సంబంధ సమస్యల తీవ్రత లేదు. ఈ వైరస్‌పై డైరెక్టర్ జనరల్ హెల్త్ సర్వీసెస్ నేతృత్వంలో జాయింట్ గ్రూప్ సమీక్ష నిర్వహించింది.సమస్య ఎదుర్కోవడానికి యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉంది.ఇదీ చదవండి: హలో.. హెచ్ఎంపీవీ వైరస్‌తో జాగ్రత్త -
కాంగ్రెస్‌కు కౌంటర్.. సోనియాపై జేపీ నడ్డా విమర్శలు
ఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు స్మారకం నిర్మాణం విషయంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య రాజకీయం ఆసక్తికరంగా మారింది. రెండు పార్టీ నేతలు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సోనియా గాంధీపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.మాజీ ప్రధాని మన్మోహన్‌కు స్మారకం నిర్మించడంపై కాంగ్రెస్, బీజేపీ నేతలు పరస్పర విమర్శలు చేసుకున్నారు. మన్మోహన్‌ను కేంద్ర ప్రభుత్వం అవమానించిందని, స్మారకం నిర్మించే ప్రాంతంలో కాకుండా నిగంబోధ్లో అంత్యక్రియలు నిర్వహించిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఆరోపణలపై బీజేపీ చీఫ్ జేపీ నడ్డా స్పందిస్తూ.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై సంచలన ఆరోపణలు చేశారు.తాజాగా జేపీ నడ్డా మాట్లాడుతూ..‘మన్మోహన్ మృతితో విషాదం నెలకొన్న సమయంలోనూ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ చౌకబారు రాజకీయాలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మన్మోహన్ స్మారకం కోసం స్థలాన్ని కేటాయించింది. ఆ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు కూడా తెలియజేశాం. మన్మోహన్ ప్రధానిగా ఉండగా.. సోనియా గాంధీ సూపర్ ప్రధానిగా వ్యవహరించి ప్రధాని పదవిని అవమానించారు. ఒక ఆర్డినెన్స్‌ను చించేయడం ద్వారా మన్మోహన్‌ను రాహుల్ గాంధీ కూడా అవమానించారు. అదే కాంగ్రెస్ ఇప్పుడు ఆయన మరణంపై రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు.This is the way Gandhi family treated Ex PM #ManmohanSingh .. Shameful act by Sonia Gandhi .. watch pic.twitter.com/Bi8UrbNOU5— #Bagri (@Bagriml) December 27, 2024ఇదే సమయంలో పీవీ అంశంపై కూడా నడ్డా స్పందించారు. ఈ సందర్బంగా నడ్డా మాట్లాడుతూ..‘పీవీ నరసింహారావు స్మారకం నిర్మించడానికి సోనియా గాంధీ అంగీకరించలేదు. కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన పార్థివదేహాన్ని ఉంచడానికి కూడా ఆమె అనుమతించలేదు. చివరకు ఆయన అంత్యక్రియలను ఢిల్లీలోని నిర్వహించనీయలేదని ధ్వజమెత్తారు. అలాగే, 2015లో పీవీ కోసం ప్రధాని మోదీ స్మారకం ఏర్పాటు చేశారని, భారత రత్న కూడా ఇచ్చారని గుర్తు చేశారు. ప్రణబ్ ముఖర్జీ మరణించినప్పుడు కాంగ్రెస్ పార్టీ కనీసం సీడబ్ల్యూసీ సమావేశం ఏర్పాటు చేయలేదని విమర్శించారు. దీంతో, ఆయన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి.Sonia Gandhi, who insulted PM Dr #ManmohanSingh ji in this manner, ever apologized till date??? Was this not an insult to the Prime Minister of India, Manmohan Singh ? pic.twitter.com/6Yj4OavpTT— Ayesha (@KashmiriAyesha1) December 27, 2024 -
పార్లమెంట్లో ‘సోరోస్’ రగడ
న్యూఢిల్లీ: కాంగ్రెస్–జార్జి సోరోస్ బంధంతోపాటు అదానీ వ్యవహారంపై పార్లమెంట్ ఉభయ సభలు అట్టుడికిపోయాయి. మంగళవారం ఉదయం రాజ్యసభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు అదానీ అంశాన్ని లేవనెత్తారు. దీనిపై వెంటనే చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ నినాదాలతో హోరెత్తించారు. పరిస్థితి ఎంతకీ అదుపులోకి రాకపోవడంతో సభ మధ్యాహ్నం 12 గంటలవరకు వాయిదా పడింది. సభ పునఃప్రారంభమైన తర్వాత కేంద్ర మంత్రి నడ్డా మాట్లాడారు. బిలియనీర్ ఇన్వెస్టర్ జార్జి సోరోస్‌కు, కాంగ్రెస్ పెద్దలకు మధ్య సంబంధాలున్నాయని ఆరోపించారు.వారంతా చేతులు కలిపారని, ఇండియాను అస్థిరపర్చడానికి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. నడ్డా ఆరోపణలపై కాంగ్రెస్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు ప్రారంభించారు. బీజేపీ సభ్యులు ప్రతిస్పందించారు. సోరోస్‌తో సంబంధాలపై కాంగ్రెస్ సమాధానం చెప్పాలని పట్టుబట్టారు. నడ్డా ఆరోపణలను కాంగ్రెస్ సభ్యుడు ప్రమోద్ తివారీ ఖండించారు. అదానీ పెద్ద ఎత్తున లంచాలు ఇచి్చనట్లు ఆరోపణలు వచ్చాయని, దీనిపై వెంటనే చర్చ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ సమయంలో అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నినాదాలు మిన్నంటాయి. దీంతో సభను మరుసటి రోజుకు వాయిదా వేస్తున్నట్లు రాజ్యసభ చైర్మన్ ప్రకటించారు. లోక్‌సభలోనూ అదే దుమారం సోరోస్తోపాటు భారతదేశ వ్యతిరేక శక్తులతో కాంగ్రెస్ నాయకులు సంబంధాలు కొనసాగిస్తున్నారని లోక్‌సభలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ కిరణ్ రిజిజు ఆరోపించం దుమారం రేపింది. మంగళవారం జీరో అవర్‌లో ఆయన మాట్లాడారు. తర్వాతవిపక్ష సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. సోరోస్‌తో కాంగ్రెస్‌కు సంబంధాలున్నాయంటూ రిజిజు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. బీజేపీకి వ్యతిరేకంగా బిగ్గరగా నినాదాలు చేశారు. దాంతో సభాపతి స్థానంలో ఉన్న దిలీప్ సైకియా లోక్‌సభను మరుసటి రోజుకు వాయిదావేశారు. అంతకుముందు మర్చంట్ షిప్పింగ్ బిల్లు–2024ను కేంద్ర మంత్రి శర్భానంద సోనోవాల్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. మర్చంట్ షిప్పింగ్ చట్టం–1958 స్థానంలో ఈ బిల్లును తీసుకొచ్చారు. పార్లమెంట్ ప్రాంగణంలో నిరసన అదానీ వ్యవహారంపై విపక్ష ఎంపీలు మంగళవారం పార్లమెంట్ ప్రాంగణంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా మోదీ, అదానీ ఫొటోలు ముద్రించి ఉన్న సంచులను ధరించారు. ఈ సంచులకు మరోవైపు ‘మోదీ అదానీ భాయి భాయి’ అని రాసి ఉంది. పార్లమెంట్ మకరద్వారం మెట్ల ముందు కాంగ్రెస్ సభ్యులు రాహుల్ గాంధీ, ప్రియాంకతోపాటు డీఎంకే, జేఎంఎం, సీపీఎం, సీపీఐ తదితర పార్టీలు నిరసన వ్యక్తంచేశారు. మోదీ, అదానీ బంధంపై పెద్ద ఎత్తున నినాదాలు కొనసాగించారు. -
ఇది గారడీ సర్కార్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గారడీ ప్రభుత్వం కొనసాగుతోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మండిపడ్డారు. ఆచరణ సాధ్యంకాని హామీ లిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్.. ఏడాది నుంచి ప్రజల్ని వంచిస్తోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ఏడాది పాలనంతా గత బీఆర్ఎస్ పాలనకు నకలుగా ఉందని ఎద్దేవా చేశారు. శనివారం హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ స్టేడియంలో ‘కాంగ్రెస్ ఏడాది పాలన–వైఫల్యాలపై బీజేపీ నిర్వహించిన బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన జేపీ నడ్డా ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.అన్నీ మోసపూరిత హామీలే... ‘తెలంగాణ, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్ పరిస్థితు లను చూస్తే కాంగ్రెస్ వైఖరి స్పష్టమవుతుంది. పాత పెన్షన్ స్కీం జాడలేదు. 2 లక్షల ఉద్యోగాల ఊసులేదు. మహిళలకు ప్రతి నెలా ఇస్తామన్న రూ. 2,500 ఏ ఒక్కరికీ అందలేదు. ఆటోడ్రైవర్లకు రూ. 12 వేల హామీ ఏమైంది? రైతులకు ఎకరాకు రూ. 15 వేలు, కౌలు రైతులకు రూ. 12 వేలు, షాదీ ముబారక్ కింద రూ.లక్ష, తులం బంగారం, విద్యార్థులకు రూ.5 లక్షల క్రెడిట్ కార్డులు, స్కూటర్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు... ఇలా వందల సంఖ్యలో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా రేవంత్ ప్రభుత్వం అమలు చేయలేదు. దీనిపై ప్రశ్నించిన మాపై ఎదురుదాడి చేస్తున్నారు’ అని నడ్డా మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఆయనపైనే నమ్మకం లేదని.. అందుకే పూటకోమాట చెప్పి ప్రజల్ని ప్రసన్నం చేసుకొనే ప్రయత్నం చేస్తున్నారని వివర్శించారు. అప్పులు చేస్తూ మనుగడ సాగించే ప్రభుత్వాలు ఎక్కువకాలం ఉండవంటూ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.కాంగ్రెస్‌పై పోరాడతాం..‘కాంగ్రెస్ ఏడాది పాలనను ప్రజల ముందే ఎండగట్టేందుకు ఇక్కడికి వచ్చా. పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు, ఇప్పుడున్న కాంగ్రెస్ పాలనకు ఏమాత్రం తేడా లేదు. ఉద్యమాలు చేసి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజలు ఇప్పటికీ మోసపోతూనే ఉన్నారు. మాయమాటలతో రైతులు, మహిళలు, యువకులు, కార్మికులను మోసగించిన కాంగ్రెస్‌పై పోరాడాలని నిర్ణయించాం’ అని నడ్డా పేర్కొన్నారు.భవిష్యత్ అంతా బీజేపీదే...ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఓట్ల శాతం భారీగా పెరిగిందని నడ్డా ఉద్ఘాటించారు. ‘దేశంలోని 19 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. మరో ఆరు రాష్ట్రాల్లో ఎన్డీయే ప్రభుత్వాలున్నాయి. ఒక్కసారి బీజేపీ అధికారంలోకి వస్తే అది శాశ్వతంగా ఉంటుంది. గత 30 ఏళ్లుగా గుజరాత్లో బీజేపీదే అధికారం. అక్కడి ప్రజల గుండెల్లో కేవలం కమలమే ఉంది. రాజస్తాన్‌లో ఆరుసార్లు, గోవా మూడుసార్లు, మధ్యప్రదేశ్‌లో మూడుసార్లు, యూపీలో రెండుసార్లు బీజేపీ అధికారం దక్కించుకుంది. మహారాష్ట్రలోనూ మూడోసారి విజయం సాధించింది. ఉత్తరాఖండ్‌లో రెండు, మణిపూర్‌లో మూడు, అస్సాంలో రెండు, హరియాణాలో మూడోసారి అధికారంలోకి వచ్చింది. ఇకపై దేశ భవిష్యత్ అంతా బీజేపీదే. వచ్చే ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి వస్తుంది’ అని నడ్డా ధీమా వ్యక్తం చేశారు.తెలంగాణకు ఎన్నో కేంద్ర ప్రాజెక్టులు..మోదీ ప్రభుత్వంలో తెలంగాణకు ఎంతో అభివృద్ధి జరిగిందని. పన్నుల రూపంలో రూ. 1.60 లక్షల కోట్లు, గ్రాంట్ల ద్వారా రూ. 1.12 లక్షల కోట్లు, స్మార్ట్‌సిటీ ప్రాజెక్టు, టెక్స్టైల్, రైల్వేకు 20 రెట్ల బడ్జెట్ కేటాయింపులు, వందేభారత్ రైళ్లు, భారత్ మాలా ప్రాజెక్టు కింద హైదరాబాద్ ఇండోర్, సూరత్ చెన్నై, హైదరాబాద్–వైజాగ్ లాంటి జాతీయ రహదారులు, బీబీనగర్‌లోనూ ఎయిమ్స్ నిర్మాణం తదితర ఎన్నో ప్రాజెక్టులు ముందుకు సాగుతున్నాయన్నారు.నిజమైన మార్పు బీజేపీతోనే సాధ్యం: కిషన్రెడ్డిబీఆర్ఎస్ పాలనపై అసంతృప్తితో ఉన్న రాష్ట్ర ప్రజలకు కొత్త హామీలతో కాంగ్రెస్ పార్టీ వల వేసి ఓట్లు వేయించుకొని ఇప్పుడు వాటిని అమలు చేయకుండా మోసగిస్తోందని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. నిజమైన మార్పు కేవలం బీజేపీతోనే సాధ్యమన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో మరింత ఆర్థిక సంక్షేభం ఏర్పడిందని, ఇకపై ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీజేపీదే అధికారమని జోస్యం చెప్పారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ బీఆర్ఎస్కు సరైన నాయకుడు లేడని.. ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. రేవంత్ పాలనలో భాగ్యనగర్ బంగ్లాదేశ్‌గా మారుతోందని ఆరోపించారు.హామీలు నెరవేర్చకుండా సంబురాలా?: డీకే అరుణ, కొండారాష్ట్రంలో ఒక నియంత గద్దె దిగాడనుకుంటే మరో నియంత వచ్చాడని సీఎం రేవంత్‌ను ఉద్దేశించి మెదక్ ఎంపీ రఘునందన్‌రావు విమర్శించారు. ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చని ప్రభుత్వం.. ఏ ముఖంతో సంబురాలు చేసుకుంటోందని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు. మూసీ ప్రక్షాళన పేరుతో పేదల భూములను బడా కంపెనీలకు కట్టబెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ దుయ్యబట్టారు. ప్రపంచ నేతగా గుర్తింపు పొందిన ప్రధాని మోదీపై కాంగ్రెస్ అడ్డగోలు ఆరోపణలు చేస్తోందని.. విదేశీ శక్తులకు తొత్తుగా మారిందని బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్ మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ దుష్టపాలనకు చరమగీతం పాడాలని బీజేపీ సీనియర్ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. -
మాయల ఫకీర్‌లా రేవంత్ సర్కార్: జేపీ నడ్డా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మండిపడ్డారు. సరూర్‌నగర్ స్టేడియంలో కాంగ్రెస్ ఏడాది పాలన వైఫల్యాలపై బీజేపీ నిరసన సభలో ఆయన మాట్లాడుతూ.. రేవంత్ ప్రభుత్వం మాయల ఫకీర్‌లా మోసం చేస్తోందన్నారు. కాంగ్రెస్ అధికారం వారి స్వార్థం కోసం వాడుకుంటోందని.. బీజేపీ ప్రజల అవసరాలు తీర్చేందుకు ఉపయోగిస్తోందన్నారు.‘‘దేశంలో వరుసగా 3వ సారి ప్రధాని అయినా ఘనత మోదీదే. విపక్షాలు బలంగా ఉన్నప్పటికీ కూడా మోదీ మూడోసారి ప్రధాని అయ్యారు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాతే ప్రభుత్వ అనుకూల ఓటు వచ్చింది. 13 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. ఆరు రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. 19 రాష్ట్రాల్లో కమలం వికసిస్తోంది. తెలంగాణలో మార్పు బీజేపీతోనే సాధ్యం. గత రికార్డులను బ్రేక్ చేస్తూ రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేశాం. కాంగ్రెస్ ఇతర పార్టీల మద్దతుతో నిలబడే ప్రయత్నం చేసి ఆ పార్టీలను ముంచేస్తోంది...ప్రాంతీయ పార్టీల అండతోనే కాంగ్రెస్ అధికారంలోకి వస్తోంది. తెలంగాణ ప్రజలు బీజేపీ ప్రభుత్వం కోసం ఎదురుచూస్తున్నారు. తెలంగాణలో బీజేపీఅధికారంలోకి రావడం ఖాయం. ఇతర పార్టీల బలహీనతలే.. కాంగ్రెస్ బలం’’ అని జేపీ నడ్డా వ్యాఖ్యానించారు.రేవంత్‌కి ఆయన మీద ఆయనకే భరోసా లేదు. ఇక ప్రజలకు ఏమీ భరోసా కల్పిస్తారు. విద్య భరోసా కార్డు ఎక్కడ?. మహిళలకు రూ.2500 వచ్చాయా?. తులం బంగారం, లక్ష రూపాయలు అందాయా?. రేవంత్ ప్రభుత్వం మహిళ, యువత, రైతు వ్యతిరేక ప్రభుత్వం. ఒక్కసారి కాంగ్రెస్‌ను ప్రజలు తిరస్కరిస్తే మళ్లీ వారిని ఆ రాష్ట్ర ప్రజలు ఆదరించరు. ఉదాహరణకు 60 ఏళ్లుగా తమిళనాడులో, 30 ఏళ్లుగా గుజరాత్, ఉత్తర ప్రదేశ్, 25 ఏళ్లుగా బీహార్‌లో కాంగ్రెస్ అధికారంలోకే రాలేదు. రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా కాంగ్రెస్‌కు ఇదే గతి రావడం ఖాయం.రేవంత్‌రెడ్డి అబద్దాలతో గద్దె నెక్కారు. కాంగ్రెస్ ప్రభుత్వంతో తెలంగాణలో అన్ని వర్గాలు ఇబ్బంది పడుతున్నాయి. వారందరికీ బీజేపీ అండగా ఉంటుంది. రానున్న రోజుల్లో ప్రజా సమస్యలను లేవనెత్తి అధికారమే లక్ష్యంగా బీజేపీ ఉద్యమాలు చేపడుతుంది. బీజేపీ ఫ్యూచర్ ఆఫ్ ది తెలంగాణ. 70 ఏళ్ల భారత చరిత్రలో ప్రభుత్వాలపై ప్రజల వ్యతిరేకత పెరిగేది. మోదీ అధికారంలోకి వచ్చాక బీజేపీకి ఆదరణ పెరుగుతూ వచ్చింది. 2019తో పోలిస్తే 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ రూ.5 కోట్లకు పైగా ఓట్లు పెరిగాయి.తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలను చూశారు. వచ్చే రోజుల్లో బీజేపీకి పట్టం కట్టేందుకు తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు. అనేక రాష్ట్రాల్లో బీజేపీ తిరిగి మళ్లీ మళ్లీ అధికారంలో వస్తోంది. జమ్మూ కాశ్మీర్లో బీజేపీ ఒంటరిగానే మెరుగైన స్థానాలు సాధించింది. కాంగ్రెస్ పరాన్నజీవి పార్టీ లాంటిది. కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ రీజినల్ పార్టీలపై ఆధారపడి గెలుస్తూ వస్తుంది. కాంగ్రెస్ హిమాచల్ ప్రదేశ్, కర్నాటక, తెలంగాణలో ప్రజలను మోసం చేసి అధికారాన్ని కైవసం చేసుకున్నారు. హిమాచల్‌లో ఫ్రీ కరెంట్ దేవుడు ఎరుగు.. అసలు కరెంట్ ఇవ్వడం లేదు’’ అంటూ జేపీ నడ్డా మండిపడ్డారు. -
నడ్డా, ఖర్గేలకు ఈసీ లేఖ.. కీలక ఆదేశాలు
ఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారంటూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పరస్పరం ఇటీవల ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై ఈసీ స్పందించింది. ఇరు పార్టీల అధ్యక్షులు జేపీ నడ్డా, మల్లికార్జున ఖర్గేలకు వేర్వేరుగా లేఖలు రాసింది.కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ తన ప్రసంగంలో ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారంటూ ఈసీకి ఇటీవల బీజేపీ ఫిర్యాదు చేసింది. మరో వైపు.. కేంద్ర మంత్రి అమిత్ షా కూడా కోడ్ ఉల్లంఘించారంటూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో ఫిర్యాదులపై ఈ నెల 18వ తేదీ(సోమవారం) మధ్యాహ్నం ఒంటిగంట లోపు అధికారికంగా వివరణ ఇవ్వాలంటూ ఆ పార్టీల అధ్యక్షులకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.ఇటీవల లోక్‌సభ ఎన్నికల సందర్భంగా జాతీయ పార్టీల స్టార్ క్యాంపెయినర్లకు చేసిన సూచనలను ఈసీ ప్రస్తావిస్తూ.. ఇతరులకు ఆదర్శంగా మెలగాలంటూ హితవు పలికింది. ఎన్నికల ప్రచార సమయంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను కచ్చితంగా పాటించాల్సిందేనని ఎన్నికల సంఘం తాజాగా మరోసారి గుర్తు చేసింది.ఇదీ చదవండి: జో బైడెన్‌లాగే ప్రధాని మోదీకి మతిపోయినట్లుంది: రాహుల్ -
కసబ్‌కు కాంగ్రెస్ బిర్యానీ పెట్టింది: జేపీ నడ్డా
థానే: జాతీయ భద్రత విషయంలో కాంగ్రెస్ నిష్క్రియాత్మకంగా వ్యవహరించిందని ఆరోపిస్తూ, ఇందుకు నాటి 26/11 ముంబై ఉగ్రదాడులే ఉదాహరణ అంటూ కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్ర స్థాయిలో కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. ముంబై దాడుల్లో దోషిగా తేలి, మరణశిక్ష పడిన పాక్ ఉగ్రవాది అజ్మల్ కసబ్‌కు కాంగ్రెస్ బిర్యానీ వడ్డించిందని నడ్డా ఆరోపించారు.మహారాష్ట్రలోని థానేలో జరిగిన ఎన్నికల ర్యాలీలో జేపీ నడ్డా ప్రసంగిస్తూ అప్పటి యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (యుపీఏ) ప్రభుత్వం పాకిస్తాన్ విషయంలో ఉదాశీన వైఖరి అవలంబించిందని నడ్డా ఆరోపించారు. 26/11 దాడుల సమయంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నదన్నారు. అయితే ఉరీ, పుల్వామా ఉగ్రదాడుల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాత్మక చర్యలు ప్రశంసనీయమైనవని నడ్డా పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీ జాతీయ ప్రయోజనాలను నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు.లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి రాజ్యాంగంలోని ఏబీసీ కూడా అర్థం కావడం లేదని నడ్డా ఎద్దేవా చేశారు. రాజ్యాంగం మత ప్రాతిపదికన రిజర్వేషన్లను అనుమతించదనే విషయం రాహుల్‌కు తెలియనట్లున్నదన్నారు. ఎన్నికలు జరగనున్న మహారాష్ట్ర, జార్ఖండ్‌లలో రాజ్యాంగ ప్రతులను చూపిస్తూ, ఉద్యోగాలు, విద్యలో రిజర్వేషన్లను తొలగించాలని బీజేపీ కోరుకుంటున్నదని ఓటర్లకు చెప్పడానికి రాహుల్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.రాహుల్ గాంధీ బుజ్జగింపులు, ఓటు బ్యాంకు రాజకీయాలకు స్వస్తి చెప్పాలని సూచించారు. తెలంగాణ, కర్నాటకలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కోటా రద్దు చేసి, మైనారిటీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని కాంగ్రెస్ కోరుకుంటోందని ఆరోపించారు. అయితే ప్రధాని మోదీ ఎప్పుడూ ఎవరిపైనా వివక్ష చూపలేదని నడ్డా పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: యూపీ విషాదం.. మంటలు చెలరేగినా మోగని అలారం! -
బీజేపీ జాతీయ అధ్యక్ష రేసులో కిషన్‌రెడ్డి?
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ కొత్త జాతీయ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియను బీజేపీ అధిష్టానం వేగిరం చేసింది. డిసెంబర్ కల్లా కొత్త అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ పూర్తయ్యేలా అన్ని రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అన్ని రాష్ట్రాల యూనిట్లను ఆదేశించింది. ఈసారి దక్షిణాది రాష్ట్రాల వారికే అవకాశం ఎక్కువగా ఉందని, తద్వారా అక్కడ పార్టీ మరింత బలోపేతం దిశగా చర్యలుంటా యని బీజేపీ వర్గాలు బలంగా చెబుతున్నాయి. ఇప్పటికే సంస్థాగత ఎన్నికల నిర్వహణకు పార్టీ ఎంపీ కె.లక్ష్మణ్ నేతృత్వంలో ఎన్నికల కమిటీని నియమించారు. కమిటీ రెండ్రోజుల కిందటే పార్టీ కీలక నేతలతో వర్క్‌షాప్ నిర్వహించి సంస్థాగత ఎన్ని కల ప్రక్రియపై మార్గదర్శనం చేసింది. బీజేపీలో మొదట బూత్, ఆ తర్వాత మండల, ఆ తర్వాత జిల్లా స్థాయిలో ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తారు. ఎన్నికల అధికారులు ప్రకటించే తేదీల్లో బూత్, డివిజన్, జిల్లా, రాష్ట్ర స్థాయిలో అధ్యక్ష ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడి ఎన్నికతోపాటు రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడి ఎన్నిక కూడా నిర్వహిస్తారు. రాష్ట్ర కౌన్సిల్ సభ్యుల తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ కౌన్సిల్ సభ్యులను ఎన్నుకోవాలి. రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాష్ట్రాల అధ్యక్షుడిని ఎన్నుకోనుండగా, జాతీయ కౌన్సిల్ సభ్యులు జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ఈ మొత్తం ప్రక్రియ పూర్తి కావడానికి దాదాపు 2 నెలల సమయం.. అంటే డిసెంబర్ రెండో వారానికి పూర్తవుతుంది, ఆ తర్వాత జాతీయ అధ్యక్షుడి పేరును ప్రకటిస్తారు. దక్షిణాదికే అవకాశమెక్కువ.. ప్రస్తుత అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా పదవీకాలం గత ఏడాది డిసెంబర్‌తో ముగిసినా సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఆయన పదవీకాలాన్ని జూన్ 30 వరకు పొడిగించారు. ఆ తర్వాతా ఆయన్నే కొనసాగిస్తున్నారు. ఆరు నెలల నుంచి వివిధ పేర్లపై బీజేపీ కసరత్తు చేస్తోంది. ఇందులో తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డితోపాటు సీనియర్ నేతలు శివరాజ్‌సింగ్ చౌహాన్ (మధ్యప్రదేశ్), సునీల్ భూపేంద్ర యాదవ్ (రాజస్తాన్), దేవేంద్ర ఫడ్నవీస్ (మహారాష్ట్ర), ధర్మేంద్ర ప్రధాన్ (ఒడిశా)ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే కర్ణాటకలో తిరిగి అధికారం చేజిక్కించుకోవడం సహా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలో పార్టీని మరింత విస్తరించాలని భావిస్తున్న బీజేపీ.. దక్షిణాది రాష్ట్రాల నుంచే అధ్యక్షుడిని ఎంపిక చేస్తుందని బలమైన ప్రచారం జరుగుతోంది. జనవరిలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరిగే అవకాశమున్న దృష్ట్యా, డిసెంబర్ రెండు లేదా మూడో వారానికి కొత్త అధ్యక్షుడి నియామక ప్రక్రియ పూర్తి చేయాలనే కృతనిశ్చయంతో అధినాయకత్వం ఉంది. -
నాయబ్‌సింగ్ సైనీ అనే నేను..
చండీగఢ్: హరియాణా ముఖ్యమంత్రిగా ఓబీసీ నాయకుడు నాయబ్‌సింగ్ సైనీ ప్రమాణ స్వీకారం చేశారు. పంచకులలోని దసరా గ్రౌండ్లో గురువారం అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో ఆయనతో రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే పలువురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. నూతన మంత్రుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. గురువారం వాలీ్మకి జయంతి కావడంతో ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణ స్వీకారానికి బీజేపీ నాయకత్వం ఇదే రోజును ముహూర్తంగా ఎంచుకుంది. ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ, చిరాగ్ పాశ్వాన్తోపాటు బీజేపీ/ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్, భూపేంద్ర పటేల్, ప్రమోద్ సావంత్, హిమంత బిశ్వ శర్మ, విష్ణుదేవ్ సాయి, పుష్కర్‌సింగ్ దామీ తదితరులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం కంటే ముందు సైనీ గురుద్వారాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇటీవల జరిగిన హరియాణా శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు గాను కమలం పార్టీ 48 స్థానాలు గెలుచుకుని వరుసగా మూడోసారి అధికారంలోకి వచి్చంది. మోదీ అభినందనలు హరియాణా సీఎం నాయబ్‌సింగ్ సైనీతోపాటు కొత్త మంత్రులకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. మంత్రివర్గం కూర్పు చక్కగా ఉందని ప్రశంసించారు. ఈ మేరకు గురువారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. హరియాణా ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం నెరవేరుస్తుందని, రాష్ట్ర అభివృద్ధిని నూతన శిఖరాలకు చేరుస్తుందని పేర్కొన్నారు. పేదలు, రైతులు, యువత, మహిళలతోపాటు సమాజంలోని ఇతర వర్గాల సంక్షేమం, సాధికారత విషయంలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుందన్న విశ్వాసం తనకు ఉందన్నారు. బీజేపీతో మూడు దశాబ్దాల అనుబంధం బీజేపీ సీనియర్ సీనాయకుడు నాయబ్‌సింగ్ సైనీని మరోసారి అదృష్టం వరించింది. హరియాణా సీఎంగా వరుసగా రెండోసారి ఆయన ప్రమాణం చేశారు. ఈ ఏడాది మార్చి నెలలో ఆయన తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. మనోహర్‌లాల్ ఖట్టర్ స్థానంలో ఆయనను బీజేపీ అధిష్టానం నియమించింది. ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించడంతోపాటు ఓబీసీల ఓట్లపై గురిపెట్టిన కమల దళం అదే వర్గానికి చెందిన సైనీని తెరపైకి తీసుకొచి్చంది. ఈ ప్రయోగం సత్ఫలితాలు ఇచి్చంది. హరియాణాలో బీజేపీ వరుసగా మూడోసారి నెగ్గింది. అనూహ్యంగా పార్టీని గెలిపించిన సైనీకే మళ్లీ సీఎం పీఠం దక్కింది. ఆయన సాధారణ కార్యకర్త స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్నారు. సైనీ 1970 జనవరి 25న అంబాలా జిల్లాలోని మీర్జాపూర్ మాజ్రా గ్రామంలో జని్మంచారు. మూడు దశాబ్దాలుగా బీజేపీలో కొనసాగుతున్నారు. పార్టీలో వివిధ బాధ్యతలు నిర్వర్తించారు. 2014లో ఎమ్మెల్యేగా, 2019లో ఎంపీగా గెలిచారు. 2014 నుంచి 2019 దాకా మనోహర్‌లాల్ ఖట్టర్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. 2023 అక్టోబర్‌లో హరియాణా బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. బీజేపీ అధిష్టానం ఆదేశాల మేరకు ఖట్టర్ ఈ ఏడాది మార్చి సీఎం పదవితోపాటు కర్నాల్ ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. ఖట్టర్ స్థానంలో సైనీ ముఖ్యమంత్రి అయ్యారు. మే నెలలో జరిగిన కర్నాల్ ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అక్టోబర్ 5న జరిగిన అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో లాడ్వా స్థానం నుంచి 16,054 ఓట్ల మెజారీ్టతో జయకేతనం ఎగురవేశారు. -
ఆ రెండు రాష్ట్రాల్లోనూ క్లీన్ స్వీప్ చేస్తాం: జేపీ నడ్డా
సిమ్లా: రాబోయే మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా జోస్యం చెప్పారు. ఇవాళ (శుక్రవారం) హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం బిలాస్‌పూర్‌లోని నైనా దేవి ఆలయంలో కేంద్ర మంత్రి జేపీ నడ్డా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారు. హర్యానా తరహాలోనే మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ విజయం సాధిస్తుంది. నేడు తీవ్రవాదం అదుపులో ఉంది. బీజేపీ పాలన కేవలం అధికారంలో రావటామే కాదు. దేశాన్ని సురక్షితంగా ఉంచేలా చూస్తుంది. ప్రపంచంలో నెలకొన్న పరిస్థితులపై ఇది యుద్ధం సమయం కాదు. అభివృద్ధికి సమయం ఆసన్నమైంది. అందరూ కలిసికట్టుగా నడుచుకోవాలని ప్రధాని మోదీ తెలిపారు.హర్యానాలో అధికారాన్ని నిలుపుకోవడానికి.. కాంగ్రెస్ కుట్రలు ఎదుర్కొని మరీ బీజేపీ హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక.. జమ్ము కశ్మీర్లో 90 సీట్లకు గాను 29 సీట్లు గెలుచుకోవడం ద్వారా బీజేపీ చెప్పుకోదగ్గ మెరుగైన ఫలితాలు రాబట్టింది. బీజేపీ హయాంలో హిమాచల్ ప్రదేశ్‌లో అభివృద్ధి పనులు జరిగాయి. హిమాచల్ ప్రదేశ్‌లో గ్రామాలను రోడ్లతో అనుసంధానం చేశాం. బీజేపీ అంటే అభివృద్ధి అని చూపించాం. విభజించి పాలించు, ఓటు బ్యాంకు రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ పర్యాయపదం. ముఖ్యంగా మహారాష్ట్ర, జార్ఖండ్ ప్రజలు ఓట్లు వేసేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి’’ అని అన్నారు.आज मुझे शारदीय नवरात्रों में नवमी के दिन मां नैना देवी का आशीर्वाद लेने का सौभाग्य प्राप्त हुआ।हम सब लोग माता के आशीर्वाद से प्रधानमंत्री मोदी जी के विकसित भारत के सपने को पूरा करने में अपनी पूरी ऊर्जा के साथ कार्य करेंगे।- श्री @JPNadda pic.twitter.com/LE0avEBDsm— BJP (@BJP4India) October 11, 2024 -
రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తేవాలి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడుతూనే సభ్యత్వ నమోదును కూడా పూర్తిస్థాయిలో చేపట్టాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా పార్టీ రాష్ట్ర నేతలను ఆదేశించారు. ఈ కార్యక్రమాలను సమాంతరంగా చేపడుతూ వచ్చే ఎన్నికల్లో బీజేపీని రాష్ట్రంలో అధికారంలోకి తెచ్చే లా కృషి చేయాలని సూచించారు. శనివారం బేగంపేటలోని ఓ హోటల్లో సభ్యత్వ నమోదుపై సమీక్షలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఎన్నికల్లో పోటీ చేసిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలతో నడ్డా సమావేశమయ్యారు. అత్యధిక సభ్యత్వాలు చేసిన వారికే పదవులు గత ఎన్నికల్లో ఓటమి చవిచూసిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను ఎంపీలు, ఎమ్మెల్యేలుగానే పార్టీ పరిగణిస్తోందని చెప్పారు. అందువల్ల ఎన్నికల్లో ఓడిన నేతలు కూడా పార్టీ పటిష్టానికి పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 10 లక్షల మందిని సభ్యులుగా చేర్చారని.. అక్టోబర్ 15 వరకు చేపడుతున్న సభ్యత్వ నమోదులో భాగంగా 50 లక్షల మందికిపైగా సభ్యులను చేరి్పంచేలా కృషి చేయాలన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు 77 లక్షల ఓట్లు రావడంతోపాటు 8 ఎంపీ సీట్లు గెలిచినందున... పడిన ఓట్లలో 75 శాతం మందిని పార్టీ సభ్యులుగా చేర్పించడం పెద్ద కష్టమేమి కాకూడదన్నారు.అత్యధిక సభ్యత్వాలను చేయించిన వారికే పదవులు దక్కుతాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ పరిస్థితులు, పార్టీ పటిష్టానికి చేపడుతున్న చర్యలను గురించి పార్టీ నేతలను అడిగి తెలుసుకున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో రైతు రుణమాఫీని చేయనందున ఈ నెల 30న పార్టీ ఆధ్వర్యంలో రైతు హామీల సాధన పేరిట దీక్ష నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర నేతలు నడ్డాకు వివరించారు. ఈ సమావేశం ముగిశాక బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. కాసం వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ సభ్యత్వ నమోదుకు మంచి స్పందన వస్తోందని నడ్డా ప్రశంసించారన్నారు. నడ్డాతో భేటీలో పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె. లక్ష్మణ్, కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎం.రఘునందన్‌రావు, గోడెం నగే‹Ù, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి పాల్గొన్నారు. -
ఖర్గే మోదీకంటే సీనియర్.. అవమానించడం తగదు: ప్రియాంక ఫైర్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే రాసిన లేఖకు ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం ఇవ్వకపోవడం పట్ల ప్రియాంక గాంధీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఖర్గేను ప్రధాని మోదీ అగౌరవపరిచారని, అవమానపరిచారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఉన్న గొప్ప సంప్రదాయాన్ని అత్యున్నత స్థాయిలో ఉన్న నాయకులు పాటించకపోవడం దురదృష్టకరమని అసహనం వ్యక్తం చేశారు.అంతేగాక మోదీకి బదులుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందింస్తూ ఖర్గేకు కౌంటర్ లేక రాయడంపై ఆమె మండిపడ్డారు. ‘ఖర్గే ప్రధానమంత్రి కంటే పెద్దవారు. ఆయన్ను మోదీ ఎందుకు అగౌరపరిచారు? ప్రధాని మోదీకి ప్రజాస్వామ్య విలువలపై విశ్వాసం, పెద్దలపై గౌరవం ఉంటే ఆయనే స్వయంగా ఖర్గే ఈ లేఖకు సమాధానమిచ్చేవారు. కానీ అలాకాకుండా నడ్డా ద్వారా ఆయన లేఖ రాయించారు. అందులోనూ ఖర్గేను అవమానపరిచారు. 82 ఏళ్ల సీనియర్ నాయకుడిని అగౌరవపరచాల్సిన అవసరం ఏముంది?ప్రశ్నించడం, సమాధానాలు తెలియజేయడం ప్రజాస్వామ్యంలో భాగం. గౌరవం, మర్యాద వంటి విలువలకు ఎవరూ అతీతులు కాదని మతం కూడా చెబుతోంది. నేటి రాజకీయాలు విషపూరితంగా మారాయి. అయితే ప్రధాని తన పదవికి ఉన్న గౌరవాన్ని నిలబెట్టుకొని దీనికి భిన్నమైన ఉదాహరణను చూపాలి. ప్రధాని తమ పదవికి ఉన్న స్థాయిని దృష్టిలోపెట్టుకొని సీనియర్ నాయకుడికి సమాధానం ఇచ్చి ఉంటే ఆయనకు విలువ ఉండేది. ఆయనపై గౌరవం పెరిగేది. ప్రభుత్వంలో అత్యున్నత స్థానాల్లో ఉన్న నాయకులు ఈ గొప్ప సంప్రదాయాలను తిరస్కరించడం దురదృష్టకరం’ అని ప్రియాంక మండిపడ్డారు.కాగా ఇటీవల బీజేపీ నేతలు, ఎన్డీఏ మిత్రపక్షాలు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని, వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని మోదీకి ఖర్గే లేఖ రాసిన విషయం తెలిసిందే. లేఖ రాశారు. దీనిపై బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందిస్తూ రాహుల్ గాంధీని విఫల నాయకుడిగా అభివర్ణించారు.గతంలో రాహుల్ ప్రధానిని ఇదేవిధంగా అవమానపరచలేదా? అని ప్రశ్నించారు. ‘మోదీపై సోనియాగాంధీ ‘మృత్యుబేహారీ’ అని అవమానకర వ్యాఖ్యలు చేయలేదా? అప్పుడు కాంగ్రెస్ రాజకీయ నైతికతను మరిచిపోయిందా? గత ఐదేళ్లలో ప్రధానిని మీ నేతలు 110 సార్లు అవమానించారు. ఎన్నికల్లో విజయం సాధించే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ తమ నాయకుడిని హైలెట్ చేయాలని ప్రయత్నిస్తోంది’ అంటూ పేర్కొన్నారు. कुछेक भाजपा नेताओं और मंत्रियों की अनर्गल और हिंसक बयानबाज़ी के मद्देनज़र लोकसभा में विपक्ष के नेता राहुल गांधी के जीवन की सुरक्षा के लिए चिंतित होकर कांग्रेस अध्यक्ष और राज्यसभा में विपक्ष के नेता श्री मल्लिकार्जुन खरगे जी ने प्रधानमंत्री जी को एक पत्र लिखा।प्रधानमंत्री जी की…— Priyanka Gandhi Vadra (@priyankagandhi) September 20, 2024 -
ప్రధాని మోదీకి ఖర్గే లేఖ.. కౌంటర్ ఇచ్చిన నడ్డా
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాసిన లేఖకు బీజేపీ జాతీయ అధక్షుడు జేపీ నడ్డా కౌంటర్ ఇచ్చారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఖర్గే ఆందోళన వ్యక్తం చేస్తూ పీఎం మోదీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. ప్రతిపక్ష నేతపై బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు సరికాదని వారిపై చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే తాజాగా గురువారం ఖర్గే లేఖపై జేపీ నడ్డా కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పిస్తూ కౌంటర్ లేఖ రాశారు.‘‘ప్రజలచే పదే పదే తిరస్కరణకు గురైన మీ విఫలమైన ఉత్పత్తి, విధానాలను మెరుగుపరిచి.. రాజకీయ బలవంతంతో ప్రజల ముందుకు తీసుకువెళ్లడానికే మీరు(ఖర్గే) ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఆ లేఖలో మీరు చెప్పిన విషయాలు వాస్తవాలకు చాలా దూరంగా ఉన్నాయని అనిపించింది. మీరు రాసిన లేఖలో రాహుల్ గాంధీ సహా మీ నాయకుల అకృత్యాలను ఉద్దేశపూర్వకంగా మరచిపోయినట్లు అనిపిస్తుంది. ఆ విషయాలను మీ దృష్టికి వివరంగా తీసుకురావాలని భావించా. దేశంలోని పురాతన రాజకీయ పార్టీ ప్రస్తుతం యువరాజు రాహుల్ గాంధీ ఒత్తిడితో 'కాపీ అండ్ పేస్ట్' పార్టీగా మారిపోవటం బాధాకరం’’ అని పేర్కొన్నారు.చదవండి: ‘వారిపై చర్యలు తీసుకోండి’.. ప్రధాని మోదీకి ఖర్గే లేఖ -
ఈసారి 10 కోట్ల మందికి బీజేపీ సభ్యత్వ నమోదు: జేపీ నడ్డా
ఢిల్లీ: బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఢిల్లీలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి హాజరైన పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, శివరాజ్ సింగ్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడారు. ‘‘ప్రధాని నరేంద్ర మోదీ దేశానికి ప్రధాన సేవకుడు. దేశంలోని నూట నలభై కోట్ల ప్రజలకు నేతృత్వం వహిస్తున్నారు. విధి నిర్వహణ కోసం పగలనక రాత్రనక ప్రధాని పని చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మనందరికీ ఆదర్శం. పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్నారు. ఈసారి బీజేపీ సభ్యత్వ నమోదు 10 కోట్లకు చేరనుంది. అంతకు ఎక్కువ కూడా అయ్యే అవకాశం ఉంది. ..దేశంలో 1500 వరకు పెద్దా, చిన్న రాజకీయ పార్టీలు ఉన్నాయి. బీజేపీ మాత్రమే పార్టీ రాజ్యాంగం ప్రకారం కార్యక్రమాలను అమలు చేస్తుంది. బీజేపీలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరుగుతున్నాయి. సభ్యత్వ నమోదు పారదర్శకంగా నిర్వహిస్తున్నాం. మొత్తం మూడు దశల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం జరగనుంది. బీజేపీ సభ్యత్వ నమోదు మిస్డ్ కాల్, వాట్సాప్ ద్వారా, బీజేపీ వెబ్సైట్ ద్వారా, క్యూఆర్ కోడ్ ద్వారా, నమో యాప్ ద్వారా, బీజేపీ పార్టీ రసీదు ద్వారా కూడా సభ్యత్వం పొందవచ్చు’అని అన్నారు.#WATCH | Delhi: At the launch of BJP's Sanghatan Parva, Sadasyata Abhiyan 2024, Union Minister and BJP chief JP Nadda says, "Seeing your enthusiasm and the love of people of India for PM Modi as well as their faith in the BJP, I can confidently say that the Sadasyata Abhiyan this… pic.twitter.com/qsFRaD0akv— ANI (@ANI) September 2, 2024 -
వారంలో రెండో సారి.. జేపీ నడ్డాతో కంగనా భేటీ
రైతుల నిరసనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ వారం రోజుల వ్యవధిలో రెండోసారి బీజేపీ చీఫ్ జేపీ నడ్డాతో భేటీ అయ్యారు.ఈ భేటీలో ఏం చర్చ జరింగిందన్న అంశంపై పార్టీ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు.ఈ వారం ప్రారంభంలో కేంద్రం వెనక్కి తీసుకున్న మూడు వ్యవసాయ చట్టాలపై నిరసనలు కొనసాగేలా కుట్ర జరిగే అవకాశం ఉందని, రైతుల నిరసనలను మోదీ ప్రభుత్వం కట్టడి చేయాలని, లేదంటే భారత్ మరో బంగ్లాదేశ్ తరహా అశాంతి పరిస్థితులకు దారితీసే అవకాశం ఉందని కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పైగా అల్లర్లు సృష్టించే వారికి దేశం కుక్కలపాలైనా వారికేం పట్టదని విమర్శించారు. రైతుల నిరసనపై ఆమె చేసిన వ్యాఖ్యల్ని సొంత పార్టీ ఖండించింది.అదే సమయంలో ఆమె స్వీయ దర్శకత్వంలో కంగనా రనౌత్ నటించిన చిత్రం ‘ఎమర్జెన్సీ’సెప్టెంబర్ 6న విడుదల కానుంది. ఈ సినిమా భారత తొలి మహిళా ప్రధాని ఇందిరా గాంధీ రాజకీయ జీవితం ఆధారంగా రూపొందింది. ఇందులో తమ వర్గం గురించి తప్పుగా చిత్రీకరించారంటూ శిరోమణి గురుద్వార ప్రబంధక్ కమిటీ (ఎస్జీపీసీ) పేర్కొంది.ఈ మేరకు కంగన సహా పలువురికి లీగల్ నోటీసులు పంపింది. ఈ నేపథ్యంలో కంగనా జేపీ నడ్డాతో భేటీ అవ్వడంపై ప్రాధాన్యత సంతరించుకుంది.दिल्ली: जेपी नड्डा के आवास पहुंचीं कंगना रनौत, किसान आंदोलन पर कंगना ने बयान से बीजेपी पार्टी के नेता नाराज़ थे। जिसके चलते बीजेपी ने पार्टी लाइन से हटकर बयानबाजी न करने की नसीहत भी दी थी। #Delhi @JPNadda #KanganaTeam pic.twitter.com/9r6nxypRnx— Ashutosh Tripathi (@tripsashu) August 29, 2024 -
మోదీ సారథ్యంలో కశ్మీర్లో బీజేపీ ప్రచారం
జమ్మూ: జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే స్టార్ క్యాంపెయినర్ల జాబితాను బీజేపీ సోమవారం విడుదల చేసింది. ప్రధాని మోదీ సారథ్యంలో చేపట్టే మొదటి విడత ఎన్నికల ప్రచారంలో హోం మంత్రి అమిత్ షా, రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి తదితర 40 మంది కీలక నేతలు పాల్గొననున్నారు. ఈ జాబితాను ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ప్రధాన కార్యాలయం ఇన్చార్జి అరుణ్ సింగ్ ఎన్నికల కమిషన్‌కు అందజేశారు. నిర్ణీత గడువులోగా సవరించిన మరో జాబితా అందజేస్తే తప్ప, మూడు దశలకు కూడా స్టార్ క్యాంపెయినర్ల జాబితా ఇదే ఉంటుందని ఆయన ఈసీకి వివరించారు. జమ్మూకశ్మీర్‌లో సెప్టెంబర్ 18, 25వ తేదీలతోపాటు నవంబర్ ఒకటో తేదీన మూడు విడతలుగా ఎన్నికలు జరుగనుండటం తెలిసిందే. -
వైఎస్ జగన్ హయాంలో మెడిసిన్‌కు మహర్దశ
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ప్రజల ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు. అందులో భాగంగా వైద్య రంగాన్ని విస్తృతం చేశారు. మారుమూల ప్రజలకు కూడా అత్యాధునిక వసతులతో స్పెషాలిటీ వైద్య సేవలందించేలా చర్యలు తీసుకున్నారు. ఒక్క ప్రభుత్వ రంగంలోనే రాష్ట్రవ్యాప్తంగా రూ.8,480 కోట్లతో 17 వైద్య కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే 5 వైద్య కళాశాలల్లో తరగతుల, వైద్యం ప్రారంభం కాగా, ఈ ఏడాది మరో ఐదు కళాశాలలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. తద్వారా ప్రజలకు అధునాతన వైద్య సేవలు చేరువవడమే కాకుండా, వైద్య విద్యార్థులకు ఎంబీబీఎస్ సీట్లు కూడా భారీగా పెరిగాయి. ఒక్కడ 2023–24 విద్యా సంవత్సరంలోనే కొత్తగా ఏర్పాటైన విజయనగరం, ఏలూరు, రాజమండ్రి, మచిలీపట్నం, నంద్యాల ప్రభుత్వ కాలేజీల ద్వారా 750 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. మొత్తంమీద 2019–20 నుంచి 2023–24 సంవత్సరాల మధ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో కొత్తగా 1,585 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వమే స్వయంగా లోక్ సభలో వెల్లడించింది. 2018–19లో (నాటి చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయేనాటికి) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెడికల్ సీట్లు 4,900 మాత్రమే ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా లోక్‌సభలో తెలిపారు. ఆ తర్వాతి ఐదేళ్లలో (వైఎస్ జగన్ హయాంలో) 1,585 సీట్లు పెరిగి 6,485కు చేరినట్లు వెల్లడించారు. దేశంలోనే అత్యధిక మెడికల్ సీట్లు గల రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఏడో స్థానంలో ఉంది. ప్రభుత్వ లేదా ప్రైవేటు మెడికల్ కాలేజీలు లేని జిల్లాల్లో కొత్త కళాశాలలను మంజూరు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. మూడు దశల్లో దేశవ్యాప్తంగా 157 కాలేజీలను మంజూరు చేసినట్లు మంత్రి వివరించారు. -
యూపీ బీజేపీలో సమూల మార్పులు..?
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో పార్టీని సమూల ప్రక్షాళన చేసేందుకు బీజేపీ హై కమాండ్ సిద్ధమైంది. ఇందులో భాగంగానే లక్నో విచ్చేసిన పార్టీ జాతీయ ప్రెసిడెంట్ నడ్డా డిప్యూటీ సీఎం కేశవ్‌ప్రసాద్ మౌర్య, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భూపేందర్ చౌదరితో సుదీర్ఘ మంతనాలు జరిపారు. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవితో సహా పలు స్థానాల్లో మార్పులు చేసే విషయమై చర్చించినట్లు తెలుస్తోంది.ఓబీసీల్లో పట్టుండంతో పాటు ఆర్ఎస్ఎస్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న డిప్యూటీ సీఎం మౌర్యకు పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మౌర్యకు, సీఎం ఆదిత్యనాథ్‌కు పొసగడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన రెండు కేబినెట్ మీటింగ్‌లకు మౌర్య హాజరవకపోవడం చర్చనీయాంశమైంది.ఈ కారణంతోనే మౌర్య ప్రభుత్వం నుంచి తప్పుకుని పార్టీ చీఫ్‌గా వెళ్లే అవకాశముంది. పార్టీ గ్రూపులుగా చీలిపోయిందని కొందరు నేతలు నడ్డాకు ఫిర్యాదు చేశారు. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగలడంతో దిద్దుబాటు చర్యలకు పార్టీ అధిష్టానం రంగంలోకి దిగింది. యూపీలో సీట్లు కోల్పోవడంతో కేంద్రంలో బీజేపీ ఒంటరిగా మ్యాజిక్‌ఫిగర్‌ను దాటలేక ఎన్డీఏ పార్టీలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
రూ.693 కోట్ల ఎన్హెచ్ఎం బకాయిలు ఇవ్వండి: సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం)లో భాగంగా కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన రూ.693.13 కోట్ల బకాయి లను వెంటనే విడుదల చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఢిల్లీలో కేంద్ర మంత్రిని ఆయన కలిశారు. ఈ సందర్భంగా వైద్యారోగ్య రంగంపై తెలంగాణ ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధ గురించి నడ్డాకు రేవంత్ వివరించారు. ఆయుష్మాన్ భారత్ నిబంధనలన్నీ ఈ ఏడాది జనవరి నుంచి అమలు చేస్తున్నట్లు వివరించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు 5,159 బస్తీ దవాఖానాలు (ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు) నిర్వహిస్తున్నామని చెప్పారు.కేంద్రం వాటా ఆలస్యంతో మేమే చెల్లిస్తున్నాం..: రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నందున కేంద్రం సహకరించాలని, ఎన్హెచ్ఎం బకాయిలు విడుదల చేయాలని నడ్డాను రేవంత్ కోరారు. 2023–24 ఆర్థిక సంవత్సరంలోని మూడు, నాలుగు త్రైమాసికాల కింద రూ. 323.73 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని.. 2024–25 మొదటి త్రైమాసిక గ్రాంట్ రూ. 138 కోట్లు మంజురు చేయాల్సి ఉందన్నారు. ఆ మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలని కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి కోరారు. ఎన్హెచ్ఎం కింద చేపట్టిన మౌలికవసతులు, నిర్వహణ కాంపొనెంట్ కింద 2023–2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రావల్సిన రూ. 231.40 కోట్లను తక్షణమే రీయింబర్స్ చేయాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఎన్హెచ్ఎంకు సంబంధించి కేంద్రం నుంచి రావల్సిన నిధులు ఆలస్యం కావడంతో అత్యవసర వైద్య సేవలకు అంతరాయం, సిబ్బందికి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు రాష్ట్ర వాటాతోపాటు కేంద్రం వాటా మొత్తాన్ని 2023 అక్టోబర్ నుంచి తామే విడుదల చేస్తున్నామని నడ్డా దృష్టికి రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు. -
బీజేపీ రాజ్యసభ పక్షనేతగా జేపీ నడ్డా!
బీజేపీ పార్టీ సీనియర్ నేత, కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా రాజ్యసభలో పార్టీ పక్ష నేతగా ఎంపికైనట్లు తెలుస్తోంది. మరోవైపు బీజేపీ జాతీయ అద్యక్షుడి పదవిలోనూ కొంతకాలం పాటు ఆయన కొనసాగనున్నారు. కాగా ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్ నుంచి కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రితోపాటు రసాయనాలు-ఎరువుల మంత్రిత్వ శాఖ బాధ్యతలు అప్పగించారు.2020లో ప్రస్తుత కేంద్ర హోం మంత్రి అమిత్ షా నుంచి పార్టీ జాతీయ అధ్యక్షుడి బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం కేంద్ర మంత్రిత్వ శాఖ దక్కడంతో నడ్డా.. బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తారని ఊహాగానాలు వచ్చాయి. కానీ ఆయన రాజీనామా చేయలేదు. బీజేపీ అగ్ర సంస్థాగత నేతగా కొనసాగుతున్నారు.అన్ని రాష్ట్రాల్లో 50 శాతం సంస్థాగత ఎన్నికలు పూర్తయిన తర్వాతే జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. ఇది జరగడానికి దాదాపు ఆరు నెలల సమయం పడుతుంది. కాబట్టి కొత్త అధ్యక్షుడిని డిసెంబర్-జనవరిలో జరగవచ్చు.ఇక న్యాయశాస్త్రంలో పట్టా పొందిన నడ్డా, ABVP కార్యకర్తగా తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. 1991లో పార్టీ యువజన విభాగం, భారతీయ జనతా యువ మోర్చా నాయకుడిగా ఎదిగారు. 2012లో తొలిసారిగా హిమాచల్ ప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2014లో అమిత్ షా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యునిగా ఎంపికయ్యారు.గతంలో హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా కూడా పనిచేశాడు; బిలాస్పూర్ నుంచి మూడుసార్లు (1993, 1998, 2007) గెలుపొందారు. 1998 -2003 మధ్య ఆరోగ్య మంత్రిగా పనిచేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో గుజరాత్ నుంచి రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు. -
బెంగాల్లో హింసపై బీజేపీ కమిటీ
సాక్షి, న్యూఢిల్లీ: పశి్చమ బెంగాల్లో ఎన్నికల అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై దర్యాప్తు చేసేందుకు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నలుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీలో ఎంపీలు బిప్లబ్ కుమార్ దేబ్ కన్వీనర్‌గా, రవిశంకర్ ప్రసాద్, బ్రిజ్ లాల్, కవితా పటీదార్ సభ్యులుగా ఉన్నారు. ఈ మేరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఒక ప్రకటన విడుదల చేశారు. -
బీజేపీ జాతీయాధ్యక్ష పదవిపై కొనసాగనున్న సస్పెన్స్!
న్యూఢిల్లీ, సాక్షి: ఇటీవల కొలువు దీరిన కొత్త కేబినెట్లో జేపీ నడ్డాకు స్థానం దక్కింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలూ చేపట్టారు. ఈ తరుణంలో.. బీజేపీ జాతీయాధ్యక్షుడి బాధ్యతల నుంచి ఆయన తప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నెలలో ప్రధాని మోదీ ఇటలీ పర్యటనకు వెళ్లి రానున్నారు. ఆయన వచ్చాక బీజేపీకి కొత్త అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ ప్రారంభమవుతుందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.బీజేపీలో పార్టీ ప్రెసిడెంట్ ఎన్నిక అంత సులువుగా జరగదు. అందుకోసం సుదీర్ఘమైన ప్రక్రియ కొనసాగుతుంది. సాధారణంగా.. బీజేపీ పార్లమెంటరీ బోర్డు వర్కింగ్ ప్రెసిడెంట్‌ను ఎన్నుకుంటుంది. అయితే.. కనీసం సగం రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికలు ముగిశాకే జాతీయ అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుంది. జులైలో మెంబర్షిప్ క్యాంపెయిన్ మొదలవుతుందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఇది కనీసం ఆరు నెలపాటు కొనసాగే అవకాశం ఉంది. ఈ లెక్కన డిసెంబర్-జనవరి మధ్యలో కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుంది.వాస్తవానికి జేపీ నడ్డా అధ్యక్ష కాలపరిమితి ఈ ఏడాది జనవరితోనే పూర్తైంది. అయితే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆయన కాలపరిమితిని ఈ జూన్ దాకా పొడిగిచింది బీజేపీ హైకమాండ్. ఇక బీజేపీలో వన్ పర్సన్.. వన్ పోస్ట్ పాలసీ ఉన్నప్పటికీ అది కచ్చితంగా అమలు కావడం లేదు. అయితే బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి విషయంలో మాత్రం బీజేపీ తప్పుకుండా రూల్స్ పాటించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో.. కొత్త అధ్యక్షుడి ఎంపిక జరిగేదాకా నడ్డానే అధ్యక్షుడిగా కొనసాగమని బీజేపీ అధిష్టానం కోరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏడాది చివరికల్లా ఎన్నిక ప్రక్రియ పూర్తి అవుతుంది. కాబట్టి.. అప్పటిదాకా ఆయనే కొనసాగవచ్చని సమాచారం. దీంతో ఈ గ్యాప్‌లో పలువురి పేర్లను సైతం పరిశీలించేందుకు తమకు వీలుంటుందని హైకమాండ్ భావిస్తోంది.ఇక.. బీజేపీ తొలుత వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎన్నుకుని.. ఆ తర్వాతే పూర్తిస్థాయి అధ్యక్షుడి బాధ్యతలు అప్పజెప్తుంది. జేపీ నడ్డా ఇంతకు ముందు ఇలాగే ఎన్నుకున్నారు. 2019 జూన్‌లో జేపీ నడ్డాకు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు అప్పజెప్పారు. ఆపై 2020 జనవరి 20 నుంచి పూర్తి స్థాయి బీజేపీ జాతీయ అధ్యక్షుడి హోదాలో ఆయన కొనసాగుతున్నారు.జేపీ నడ్డా నేపథ్యం.. జగత్ ప్రకాశ్ నడ్డా.. లాయర్ వృత్తి నుంచి క్రియాశీల రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. హిమాచల్ ప్రదేశ్ 1993 అసెంబ్లీ ఎన్నికల్లో బిలాస్పూర్ ఎమ్మెల్యేగా తొలిసారి నెగ్గారాయన. పదేళ్లపాటు ఎమ్మెల్యేగా కొనసాగిన ఆయన.. 2003 ఎన్నికల్లో మాత్రం ఓడారు. 2007లో మళ్లీ నెగ్గి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. ఆ తర్వాత 2012లో అసెంబ్లీ ఎన్నికలకు ఆయన పోటీ చేయలేదు. అయితే సీనియర్ కోటాలో రాజ్యసభకు మాత్రం ప్రమోషన్ దక్కించుకున్నారు. 2014లో కేంద్ర మంత్రివర్గ పునర్వవ్యస్థీకరణలో భాగంగా జేపీనడ్డాకు ఆరోగ్య శాఖ దక్కింది. 2019లో అమిత్ షా కేంద్ర మంత్రి వర్గంలోకి వచ్చాక.. పార్టీ పగ్గాలు ఎవరికి అప్పజెప్పాలన్నదానిపై తర్జన భర్జనలు జరిగాయి. ఆ సమయంలో జేపీ నడ్డాకు బాధ్యతలు తప్పగించారు. ఇక.. 2024 మార్చిలో హిమాచల్ రాజ్యసభ సభ్యతానికి రాజీనామా చేసి.. గుజరాత్ రాజ్యసభ స్థానం నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మోదీ 3.0 కేబినెట్లో మళ్లీ ఆయనకు ఆరోగ్య మంత్రిత్వ శాఖనే దక్కింది. -
తొలిసారి కేంద్రమంత్రి పదవి చేపట్టిన వారిలో పలువురి విశేషాలు...
‘మామ’కు తొలిసారి కేంద్ర మంత్రి పదవి నాలుగు సార్లు మధ్యప్రదేశ్ సీఎంగా చేసిన బీజేపీ సీనియర్ నేత ‘మామ’ శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు తొలిసారి కేంద్ర మంత్రి పదవి దక్కింది. 1977లో ఆర్ఎస్ఎస్లో వాలంటీర్‌గా చేరి అంచెలంచెలుగా ఎదిగారు. ఆరు సార్లు ఎంపీగా గెలిచారు. సీఎంగా రైతులు, మహిళలు, గ్రామీణ ప్రజల అభివృద్ధికి పెద్దపీట వేశారు. మృదు స్వభావి. నిరాడంబర నాయకుడు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లో బీజేపీకి బంపర్ మెజారిటీ సాధించినా సీఎంగా కొనసాగింపు దక్కలేదు. ఆయనను పూర్తిగా పక్కన పెడతారన్న ప్రచారానికి భిన్నంగా కేంద్ర మంత్రి పదవి దక్కడం విశేషం.నడ్డా.. వివాదాలకు దూరం బీజేపీ జాతీయ అధ్యక్షుడు 63 ఏళ్ల జగత్ ప్రకాశ్ నడ్డా హిమాచల్ ప్రదేశ్ నుంచి కేబినెట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక నాయకుడు. ఏబీవీపీలో చురుగ్గా పనిచేశారు. బీజేపీలో పలు హోదాల్లో పలు రాష్ట్రాల్లో పనిచేశారు. 2012లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. మోదీ తొలి కేబినెట్లో 2014 నుంచి 2019 దాకా ఆరోగ్య మంత్రిగా ఉన్నారు. 2020లో బీజేపీ అధ్యక్షుడయ్యారు. వివాదరహితుడు.మోదీ సన్నిహితుడిగా పదవీ యోగం గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు 69 ఏళ్ల చంద్రకాంత్ రఘునాథ్ పాటిల్‌కు అనూహ్యంగా కేంద్ర మంత్రి పదవి లభించింది. నాలుగోసారి ఎంపీగా నెగ్గారు. ఈసారి ఏకంగా 7.73 లక్షల మెజారీ్ట సాధించారు. మహారాష్ట్రలో జని్మంచిన పాటిల్ గుజరాత్లో బీజేపీకి సారథ్యం వహించడం విశేషం. కానిస్టేబుల్‌గా చేసిన ఆయన 1989లో బీజేపీలో చేరారు. 1991లో నవగుజరాత్ అనే పత్రికను స్థాపించారు. 1995 నుంచి మోదీతో సాన్నిహిత్యముంది. సామాన్యులకు నిత్యం అందుబాటులో ఉంటారు.బిహార్ దళిత తేజం లోక్‌జనశక్తి పారీ్ట(రామ్‌విలాస్) పార్టీ చీఫ్, దళిత నాయకుడు చిరాగ్ పాశ్వాన్ తన తండ్రి, దివంగత రామ్‌విలాస్ పాశ్వాన్ వారసుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. బిహార్‌లో ఐదుకు ఐదు ఎంపీ స్థానాలూ గెలుచుకున్నారు. 41 ఏళ్ల చిరాగ్ 2011లో ఓ హిందీ సినిమాలో నటించారు. అందులో హీరోయిన్ ఈసారి బీజేపీ తరఫున తొలిసారి ఎంపీగా గెలిచిన బాలీవుడ్ నటి కంగానా రనౌత్ కావడం విశేషం. చిరాగ్కా రోజ్‌గార్ సంస్థ ద్వారా బిహార్ యువతకు ఉపాధి కలి్పంచేందుకు చిరాగ్ కృషి చేస్తున్నారు.యాక్షన్ హీరో మాస్ ఎంట్రీ ప్రముఖ మలయాళ యాక్షన్ హీరో 65 ఏళ్ల సురేశ్ గోపి తన సొంత రాష్ట్ర కేరళలో బీజేపీ తరఫున గెలిచిన తొలి ఎంపీగా చరిత్ర సృష్టించారు. అలా మాస్ ఎంట్రీ ఇచ్చి, అదే ఊపులో కేంద్ర మంత్రి అయ్యారు! ఆయన వామపక్షాలు, కాంగ్రెస్‌కు పట్టున్న త్రిసూర్ లోక్‌సభ స్థానంలో 2019 లోక్‌సబ, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా పట్టు విడవకుండా ఈసారి గెలవడం విశేషం. బీజేపీతో ఆయనకు చాలా ఏళ్లుగా అనుబంధం ఉంది. మోదీ, అమిత్ షాలకు సన్నిహితుడు. 2016లో రాజ్యసభకు నామినేటయ్యారు. ‘మోదీ ఆదేశిస్తారు, నేను పాటిస్తా’ అంటారు సురేశ్ గోపి. బిహార్ ఈబీసీ నేత ప్రముఖ సోషలిస్టు నాయకుడు, భారతరత్న కర్పూరి ఠాకూర్ కుమారుడైన రామ్‌నాథ్ ఠాకూర్ మోదీ మంత్రివర్గంలో చేరారు. జేడీ(యూ) అధినేత, బిహార్ సీఎం నితీశ్ కుమార్‌కు ఆయన సన్నిహితుడు. ప్రముఖ ఈబీసీ నాయకుడిగా ఎదిగారు. 74 ఏళ్ల రామ్‌నాథ్ 2014 ఏప్రిల్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఆయన తండ్రి కర్పూరి ఠాకూర్ రెండు సార్లు బిహార్ ముఖ్యమంత్రిగా పనిచేశారు.ప్రతాప్ జాదవ్64 ఏళ్ల జాదవ్‌కు శివసేన కోటాలో చోటు దక్కింది. నాలుగుసార్లు ఎంపీగా, మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఎంపీగా లోక్‌సభలో పలు చర్చల్లో చురుగ్గా పాలుపంచుకున్నారు.ఒకప్పటి చురుకైన విద్యార్థి నేత..సంజయ్ సేథ్ (64) జార్ఖండ్‌కు చెందిన వ్యాపారవేత్త. 1976లో ఏబీవీపీ నేతగా ప్రస్థానం ప్రారంభించి అనేక సమస్యలపై జైలుకూ వెళ్లారు. ఈయనను 2016లో జార్ఖండ్ ప్రభుత్వం ఖాదీ గ్రామోద్యోగ్ బోర్డు చైర్మన్‌గా నియమించడం వివాదానికి దారి తీసింది. 2019లో తొలిసారి రాంచీ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. కాంగ్రెస్ నేత సుబోధ్ కాంత్ సహాయ్ను, తాజా ఎన్నికల్లో ఆయన కుమార్తె యశస్వినిని ఓడించారు!గిరిజన నేత ఉయికెమధ్యప్రదేశ్కు చెందిన గిరిజన నేత దుర్గా దాస్ ఉయికె(58). తాజా ఎన్నికల్లో బెతుల్(ఎస్టీ) నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున వరుసగా రెండోసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. రాష్ట్రంలోని గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే స్కూల్లో ఈయన టీచర్‌గా పనిచేసేవారు. 2019లో బీజేపీలో చేరి మొదటిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చెందిన రాము టెకంపై 3.79 లక్షల మెజారిటీతో విజయం సాధించారు. కుల సమీకరణాల ఆధారంగానే తాజాగా కేంద్రంలో సహాయ మంత్రి పదవి ఈయన్ను వరించిందని భావిస్తున్నారు. రెండుసార్లు సీఎం.. నేడు కేంద్ర మంత్రిమాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవెగౌడ కుమారుడు కుమారస్వామి (64). ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. బీజేపీ, కాంగ్రెస్‌లతో వేర్వేరుగా జట్టుకట్టి రెండుసార్లు కర్నాటక సీఎంగా చేశారు. జేడీఎస్ అధ్యక్షుడు. కర్ణాటకలోని పలుకుబడి గత వొక్కలిగ వర్గానికి చెందిన నేత. సినిమాలంటే తెగపిచ్చి. అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చానని చెబుతుంటారు!వీరేంద్ర కుమార్మధ్యప్రదేశ్లో షెడ్యూల్డ్ కులానికి చెందిన బీజేపీ సీనియర్ నేత వీరేంద్ర కుమార్(70). ఎనిమిదిసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. చిన్నతనంలో తండ్రి నడిపే సైకిల్ షాపులో పంక్చర్లు వేశారు. అంచెలంచెలుగా ఎదిగి బాల కార్మికుల వెతలే అంశంగా పీహెచ్డీ చేయడం విశేషం. 2017లో మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి అయ్యారు. ఎమర్జెన్సీ సమయంలో 16 నెలలపాటు జైలు శిక్ష అనుభవించారు. ఇప్పటికీ సొంతూళ్లో స్కూటర్‌పై తిరుగుతూ సైకిల్ రిపేర్ దుకాణదారులతో ముచ్చటిస్తుంటారు.మాంఝీకి దక్కిన ఫలితంబిహార్ రాజకీయాల్లో సుపరిచితుడు జితన్ రాం మాంఝీ(80). మాజీ సీఎం. హిందుస్తానీ ఆవామ్ మోర్చా(సెక్యులర్) వ్యవస్థాపకుడు. 2014 నితీశ్ కుమార్ వైదొలగడంతో సీఎం అయినా ఆయనతో విభేదాలతో కొద్దినెలలకే తప్పుకుని సొంత పార్టీ పెట్టారు. కాంగ్రెస్‌తో మొదలైన ఆయన రాజకీయ ప్రస్థానం జనతాదళ్, ఆర్జేడీ, జేడీయూల్లో సాగింది.టంటా.. ఉత్తరాఖండ్ సీనియర్ నేతఉత్తరాఖండ్కు చెందిన సీనియర్ బీజేపీ ఎంపీ అజయ్ టంటా(51). అల్మోరా నుంచి వరుసగా మూడుసార్లు ఎన్నికయ్యారు. అంతకుపూర్వం, 2009లో తన చిరకాల ప్రత్యర్థి కాంగ్రెస్ నేత ప్రదీప్ టంటా చేతిలో ఓటమి చవిచూశారు. ఆ తర్వాత 2014, 2019, 2024 ఎన్నికల్లో ప్రదీప్‌పై వరుస విజయాలు సాధించడం గమనార్హం. 2014లో టెక్స్టైల్స్ శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 2007, 2012 ఎన్నికల్లో రెండుసార్లు రాష్ట్ర శాసనసభకు సైతం ఎన్నికయ్యారు. 2007లో రాష్ట్రమంత్రిగా ఉన్నారు. 23 ఏళ్లకే రాజకీయాల్లోకి ప్రవేశించి పంచాయతీ స్థాయిలో చురుగ్గా అనేక ఏళ్లపాటు పనిచేశారు. వివాదరహితుడిగా, స్వచ్ఛమైన నేతగా పేరుంది.ఖట్టర్.. ప్రచారక్ నుంచి కేంద్ర మంత్రి 1977లో ఆర్ఎస్ఎస్ శాశ్వత సభ్యుడిగా మారిన మనోహర్ లాల్ ఖట్టర్(70)కు ఆ సంస్థతో దాదాపు 40 ఏళ్ల అనుబంధం ఉంది. బ్రహ్మచారి. మోదీకి సన్నిహితునిగా పేరుంది. వ్యవసాయ కుటుంబానికి చెందిన ఈయన 2014లో హరియాణా సీఎం అయ్యారు. పదేళ్ల అనంతరం గత మార్చిలో నాయబ్ సింగ్ సైనీకి బాధ్యతలు అప్పగించారు. దేశ విభజన సమయంలో పాకిస్తాన్ నుంచి ఈయన కుటుంబం వలస వచ్చి 1954లో హరియాణాలోని రొహ్తక్ జిల్లా నిందానలో స్థిరపడింది.ఓరం.. ఒడిశా గిరిజన నేత63 ఏళ్ల జువల్ ఓరమ్ఒడిశాలో గిరిజన నేతగా ఎంతో పేరుంది. వాజ్‌పేయీ కేబినెట్లో గిరిజన సంక్షేమ శాఖకు తొలి మంత్రిగా చరిత్ర నెలకొల్పారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఆరుసార్లు ఎంపీగా గెలిచారు. మూడుసార్లు ఒడిశా బీజేపీ చీఫ్‌గా చేశారు.రాజీవ్ రతన్ సింగ్ ‘లలన్’లలన్ సింగ్‌గా సుపరిచితుడు. 69 ఏళ్ల ఈ నేత బిహార్‌లో పలుకుబడి కలిగిన భూమిహార్ వర్గానికి చెందిన నేత. నితీశ్ కుమార్‌కు అత్యంత సన్నిహితుడు. 2009, 2019, 2024 ఎన్నికల్లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైనప్పటికీ రాజ్యసభకు నితీశ్ కుమార్ ఈయన్ను జేడీయూ తరఫున నామినేట్ చేశారు.జిల్లా పంచాయతీ సభ్యురాలి నుంచి కేంద్రమంత్రిగాఇటీవలి ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లోని ధార్ లోక్‌సభ నియోజకవర్గం(ఎస్టీ)నుంచి సావిత్రీ ఠాకూర్(46) ఎన్నికయ్యారు. 2003లో మొదటిసారిగా జిల్లా పంచాయతీ సభ్యురాలిగా ఈమె రాజకీయ ప్రస్థానం మొదలైంది. పార్టీలో వివిధ పదవులను రాష్ట్రం, జాతీయ స్థాయిలో నిర్వహించిన సావిత్రీ ఠాకూర్ మధ్యప్రదేశ్‌లో ప్రముఖ గిరిజన మహిళా నేతగా ఎదిగారు. 2014లో మొదటిసారిగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2019లో బీజేపీ ఆమెకు టిక్కెటివ్వలేదు. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ నేత రాధేశ్యామ్ మువెల్పై 2.18లక్షల ఓట్ల తేడాతో విజయం సాధించారు. రెండుసార్లు భావ్‌నగర్ మేయర్..తాజా లోక్‌సభకు గుజరాత్ నుంచి ఎన్నికైన ముగ్గురు మహిళల్లో నిముబెన్ బంభానియా(57) ఒకరు. భావ్‌నగర్ నుంచి ఆప్ అభ్యర్థి ఉమేశ్ మక్వానాపై 4.55 లక్షల భారీ మెజారిటీతో ఈమె విజయం సాధించారు. 2009–10, 2015–18 సంవత్సరాల్లో భావ్‌నగర్ మేయర్‌గా రెండు సార్లు పనిచేశారు. బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలిగా 2013 నుంచి 2021 వరకు బాధ్యతల్లో ఉన్నారు. కోలి వర్గానికి చెందిన మాజీ ఉపాధ్యాయిని అయిన నిముబెన్ 2004లో బీజేపీ కండువా కప్పుకున్నారు. అదే ఏడాదిలో స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొంది రాజకీయ జీవితం ప్రారంభించారు.సినీ నిర్మాత.. రాజకీయ నేతరెండు సాంస్కృతిక మేగజీన్లకు ఎడిటర్‌గా ఉన్న పబిత్రా మర్ఘెరిటా(49)..అస్సామీస్ ఫీచర్, షార్ట్ ఫిల్మ్‌లను నిర్మించారు. జున్బాయ్ సిరీస్‌తో తీసిన తక్కువ నిడివి కలిగిన చిత్రాలకు ఎంతో పేరు వచ్చింది. ఈయన నటించిన ఫీచర్ ఫిల్మ్ ‘మొన్ జాయ్’ పలువురి ప్రశంసలు అందుకుంది. ప్రముఖ అస్సామీ నటి గాయత్రి మహంతాను పెళ్లి చేసుకున్నారు. 2014లో బీజేపీలో చేరి రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2022 మార్చిలో రాజ్యసభకు ఎన్నికయ్యారు.– సాక్షి, నేషనల్ డెస్క్