
షిమ్లా: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాజ్యసభ పదవీ కాలం త్వరలో ముగుస్తోంది. ఈ సీటు సోనియాగాంధీ లేదా ప్రియాంక గాంధీకి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని హిమాచల్‌ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ ప్రతిభా సింగ్ తెలిపారు. సోనియా, ప్రియాంకలకు ఆసక్తి ఉంటే ఈ సీటుకు వారి పేర్లను పరిశీలిస్తామని చెప్పారు. ఈ విషయమై సీనియర్ కాంగ్రెస్ నేతలతో చర్చిస్తామన్నారు.
దేశవ్యాప్తంగా 56 రాజ్యసభ సీట్లకు ఎన్నికల కమిషన్ ఇటీవల షెడ్యూల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా హిమాచల్ ప్రదేశ్‌లోని నడ్డా ప్రాతినిధ్యం వహిస్తున్న సీటుకు కూడా ఎన్నిక జరగనుంది. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 68 సీట్లకుగాను 40 సీట్లతో కాంగ్రెస్‌కు పూర్తి మెజారిటీ ఉండటంతో ఈ సీటు కాంగ్రెస్‌కే దక్కనుంది.
వచ్చే నెల హిమాచల్‌ప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు జరగనున్న సమయంలో ఈ సీటుకు ఎన్నిక జరగనుంది. 2018లో బీజేపీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నపుడు నడ్డా హిమాచల్ ప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆయన పదవీ కాలం వచ్చే ఏప్రిల్ 2తో ముగియనుంది. రాష్ట్రంలో మొత్తం 3 రాజ్యసభ సీట్లుండగా మూడు ప్రస్తుతం బీజేపీ ఖాతాలోనే ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment