New Delhi: కాంగ్రెస్‌కు కొత్త కార్యాలయం.. నేడు ‍ప్రారంభించనున్న సోనియా | 9A Kotla Marg - New Address of Congress Headquarters | Sakshi
Sakshi News home page

New Delhi: కాంగ్రెస్‌కు కొత్త కార్యాలయం.. నేడు ‍ప్రారంభించనున్న సోనియా

Published Wed, Jan 15 2025 6:54 AM | Last Updated on Wed, Jan 15 2025 12:40 PM

9A Kotla Marg - New Address of Congress Headquarters

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యాలయం చిరునామా మారింది. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ నేడు (జనవరి 15) పార్టీ కొత్త ప్రధాన కార్యాలయం 'ఇందిరా భవన్'ను ప్రారంభించనున్నారు. గత ఐదు దశాబ్దాలుగా పార్టీ ప్రధాన కార్యాలయం ఢిల్లీలోని 24, అక్బర్ రోడ్‌లో ఉంది. ఇ‍ప్పుడు కాంగ్రెస్ కొత్త ప్రధాన కార్యాలయం పేరు ‘ఇందిరా భవన్’.. ఇది 9-ఎ కోట్ల రోడ్డులో  ఏర్పాటయ్యింది. నేటి ఉదయం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు.  ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు పలువురు  నేతలు పాల్గొననున్నారు.
 

మీడియాకు అందిన వివరాల ప్రకారం ఈ నూతన కార్యాలయ నిర్మాణం ప్రియాంక గాంధీ సారధ్యంలో కొనసాగింది.  కార్యాలయ మ్యాప్‌ను ఖరారు చేయడం మొదలుకొని పెయింటింగ్‌, చిత్రాలు, కర్టెన్లు,  ఫర్నిచర్ వరకు ప్రియాంక స్వయంగా అన్నింటినీ పర్యవేక్షించారు. ఈ కొత్త కార్యాలయంలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పలు పాత ఛాయాచిత్రాలను ఏర్పాటు చేశారని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసీ వేణుగోపాల్ మంగళవారం ట్విట్టర్‌లో ఇలా పోస్ట్ చేశారు.. ‘2025, జనవరి 15న ఉదయం 10 గంటలకు, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చీఫ్ సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సమక్షంలో కొత్త ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ‘ఇందిరా గాంధీ గాంధీ భవన్‌’ను ప్రారంభించనున్నారు’ అని తెలిపారు.

ఢిల్లీలో ఏఐసీసీ కొత్త కేంద్ర కార్యాలయం ప్రారంభం

కాంగ్రెస్‌ నూతన కేంద్ర కార్యాలయం ‘ఇందిరా గాంధీ భవన్’ పార్టీలో పెరుగుతున్న అవసరాలను తీర్చడానికి, పరిపాలనా, సంస్థాగత, వ్యూహాత్మక విధుల నిర్వహణకు అనువుగా ఆధునిక సౌకర్యాలతో రూపొందింది. 1978లో కాంగ్రెస్(ఐ) ఏర్పడినప్పటి నుండి పార్టీ ప్రధాన కార్యాలయం '24, అక్బర్ రోడ్'లో ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement