ఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు స్మారకం నిర్మాణం విషయంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య రాజకీయం ఆసక్తికరంగా మారింది. రెండు పార్టీ నేతలు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సోనియా గాంధీపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
మాజీ ప్రధాని మన్మోహన్‌కు స్మారకం నిర్మించడంపై కాంగ్రెస్, బీజేపీ నేతలు పరస్పర విమర్శలు చేసుకున్నారు. మన్మోహన్‌ను కేంద్ర ప్రభుత్వం అవమానించిందని, స్మారకం నిర్మించే ప్రాంతంలో కాకుండా నిగంబోధ్‌లో అంత్యక్రియలు నిర్వహించిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఆరోపణలపై బీజేపీ చీఫ్ జేపీ నడ్డా స్పందిస్తూ.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై సంచలన ఆరోపణలు చేశారు.
తాజాగా జేపీ నడ్డా మాట్లాడుతూ..‘మన్మోహన్ మృతితో విషాదం నెలకొన్న సమయంలోనూ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ చౌకబారు రాజకీయాలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మన్మోహన్ స్మారకం కోసం స్థలాన్ని కేటాయించింది. ఆ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు కూడా తెలియజేశాం. మన్మోహన్ ప్రధానిగా ఉండగా.. సోనియా గాంధీ సూపర్ ప్రధానిగా వ్యవహరించి ప్రధాని పదవిని అవమానించారు. ఒక ఆర్డినెన్స్‌ను చించేయడం ద్వారా మన్మోహన్‌ను రాహుల్ గాంధీ కూడా అవమానించారు. అదే కాంగ్రెస్ ఇప్పుడు ఆయన మరణంపై రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు.
This is the way Gandhi family treated Ex PM #ManmohanSingh ..
Shameful act by Sonia Gandhi .. watch
pic.twitter.com/Bi8UrbNOU5— #Bagri (@Bagriml) December 27, 2024
ఇదే సమయంలో పీవీ అంశంపై కూడా నడ్డా స్పందించారు. ఈ సందర్బంగా నడ్డా మాట్లాడుతూ..‘పీవీ నరసింహారావు స్మారకం నిర్మించడానికి సోనియా గాంధీ అంగీకరించలేదు. కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన పార్థివదేహాన్ని ఉంచడానికి కూడా ఆమె అనుమతించలేదు. చివరకు ఆయన అంత్యక్రియలను ఢిల్లీలోని నిర్వహించనీయలేదని ధ్వజమెత్తారు. అలాగే, 2015లో పీవీ కోసం ప్రధాని మోదీ స్మారకం ఏర్పాటు చేశారని, భారత రత్న కూడా ఇచ్చారని గుర్తు చేశారు. ప్రణబ్ ముఖర్జీ మరణించినప్పుడు కాంగ్రెస్ పార్టీ కనీసం సీడబ్ల్యూసీ సమావేశం ఏర్పాటు చేయలేదని విమర్శించారు. దీంతో, ఆయన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి.
Sonia Gandhi, who insulted PM Dr #ManmohanSingh ji in this manner, ever apologized till date???
Was this not an insult to the Prime Minister of India, Manmohan Singh ? pic.twitter.com/6Yj4OavpTT— Ayesha (@KashmiriAyesha1) December 27, 2024
Comments
Please login to add a commentAdd a comment