న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాసిన లేఖకు బీజేపీ జాతీయ అధక్షుడు జేపీ నడ్డా కౌంటర్ ఇచ్చారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఖర్గే ఆందోళన వ్యక్తం చేస్తూ పీఎం మోదీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. ప్రతిపక్ష నేతపై బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు సరికాదని వారిపై చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే తాజాగా గురువారం ఖర్గే లేఖపై జేపీ నడ్డా కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పిస్తూ కౌంటర్ లేఖ రాశారు.
‘‘ప్రజలచే పదే పదే తిరస్కరణకు గురైన మీ విఫలమైన ఉత్పత్తి, విధానాలను మెరుగుపరిచి.. రాజకీయ బలవంతంతో ప్రజల ముందుకు తీసుకువెళ్లడానికే మీరు(ఖర్గే) ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఆ లేఖలో మీరు చెప్పిన విషయాలు వాస్తవాలకు చాలా దూరంగా ఉన్నాయని అనిపించింది.
మీరు రాసిన లేఖలో రాహుల్ గాంధీ సహా మీ నాయకుల అకృత్యాలను ఉద్దేశపూర్వకంగా మరచిపోయినట్లు అనిపిస్తుంది. ఆ విషయాలను మీ దృష్టికి వివరంగా తీసుకురావాలని భావించా. దేశంలోని పురాతన రాజకీయ పార్టీ ప్రస్తుతం యువరాజు రాహుల్ గాంధీ ఒత్తిడితో 'కాపీ అండ్ పేస్ట్' పార్టీగా మారిపోవటం బాధాకరం’’ అని పేర్కొన్నారు.
చదవండి: ‘వారిపై చర్యలు తీసుకోండి’.. ప్రధాని మోదీకి ఖర్గే లేఖ
Comments
Please login to add a commentAdd a comment