Manmohan Singh
-
కశ్మీర్ వెళ్లేందుకు భయపడ్డా
న్యూఢిల్లీ: కశ్మీర్ వెళ్లేందుకు భయపడ్డానంటూ యూపీఏ హయాంలో కేంద్ర హోం మంత్రిగా పనిచేసిన సుశీల్ కుమార్ షిండే చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఢిల్లీలో సోమవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో ‘ఫైవ్ డికేడ్స్ ఆఫ్ పాలిటిక్స్’అనే పేరుతో తన ఆత్మకథను షిండే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అప్పట్లో జమ్మూకశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులను ఆయన గుర్తుకు తెచ్చుకున్నారు. ‘హోం మంత్రి కాకమునుపు కశ్మీర్‌కు చాలాసార్లు వెళ్లాను. నా స్నేహితుడు, విద్యావేత్త విజయ్ ధార్ ఇంటికి అప్పట్లో వెళ్లేవాణ్ని.మంత్రి నయ్యాక మాత్రం ‘శ్రీనగర్‌లో దాల్ సరస్సును చూడు, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో తిరుగు. అంతేతప్ప, మిగతా చోట్లకు మాత్రం వెళ్లకు అని విజయ్ సలహా ఇచ్చాడు. దీంతో సాక్షాత్తూ దేశానికి హోం మంత్రినే అయినప్పటికీ కశ్మీర్ వెళ్లడానికి మాత్రం భయపడ్డా’అని చెప్పారు. ‘స్వయంగా హోం మంత్రిని అయిన నేను ఈ విషయం ఎవరికి చెప్పుకోను? ఇప్పుడెందుకు చెబుతున్నానంటే..కేవలం నవ్వుకోడానికి మాత్రమే. మాజీ హోం మంత్రి ఇలాంటి వాటిపై మాట్లాడకూడదు’అని షిండే చెప్పారు.మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో 2012–14 సంవత్సరాల్లో షిండే హోం మంత్రిగా ఉన్నారు. షిండే వ్యాఖ్యలపై బీజేపీ నేత, కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్ మాట్లాడుతూ..‘కాంగ్రెస్ పాలనలో సాక్షాత్తూ దేశానికి హోం మంత్రే కశ్మీర్ వెళ్లేందుకు భయపడ్డారు. మోదీ హయాంలో మాత్రం ఏటా 2–3 కోట్ల మంది పర్యాటకులు జమ్మూకశ్మీర్‌ను సందర్శిస్తున్నారు. రెండు పార్టీల ప్రభుత్వాలకీ ఉన్న ముఖ్యమైన తేడా ఇదే’అని ఆయన పేర్కొన్నారు. -
‘ప్రసంగాలతో గౌరవాన్ని తగ్గించిన తొలి ప్రధాని మోదీ’
ఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ చేసిన విద్వేశపూరిత వ్యాఖ్యలను మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తీవ్రంగా ఖండిచారు. ప్రతిపక్షాలు, ఓ వర్గం ప్రజలపై ప్రధాని మోదీ చేసిన విద్వేశపూరిత వ్యాఖ్యలు.. ప్రధాని ఆఫీసు గౌరవాన్ని దిగజార్చాయి. ఇలా గౌరవాన్ని దిగజార్చిన తొలి ప్రధాని మోదీ అని మండిపడ్డారు. లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా జూన్ 1న ఏడో విడత పోలింగ్ జరగనుంది. ఈ సందర్భంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పంజాబ్ ప్రజలకు లేఖ రాశారు.‘‘ ప్రధాని మోదీ విద్వేశపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారు. అవి దేశ ప్రజల్లో విభజన తీసుకువచ్చే విద్వేశ వ్యాఖ్యలు. 2022 వరకు మోదీ రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్నారు. మోదీ విధానాల వల్ల గత పదేళ్లలో రైతులు ఆదాయం దారుణంగా తగ్గిపోయింది. రోజుకు జాతీయ సగటు రైతు ఆదాయం రూ. 27 ఉంటే, సగటు అప్పు మాత్రం రూ. 27 వేలు ఉంది. ఇందనం, ఎరువులు అన్నింటి ధరలు పెరిగాయి. దీంతో రైతుల ఆదాయం తగ్గిపోయింది. పదేళ్ల దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. జీఎస్టీ, నోట్ల రద్దు, కరోనాను సరిగా ఎదుర్కొకపోవటం వల్ల దేశం దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్లింది. గ్రోత్ రేట్ కూడా పడిపోయింది. సుమారు 750 మంది రైతుల ఢిల్లీ సరిహద్దుల్లో మృతి చెందారు. లాఠీలు, రబ్బరు బుల్లెట్లతోనే కాకుండా ప్రధాని మోదీ తన మాటలతో రైతులపై దాడి చేశారు. రైతులను ‘‘ఆందోళన జీవులు’’ అని అవమానించారు. తమను సంప్రదించకుండా చేసిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు కోరారు. గడిచిన పదేళ్లలో పంజాబ్, పంజాబ్ ప్రజలను బీజేపీ ప్రభుత్వం తీవ్రంగా దూషించింది’’ అని మన్మోహన్ సింగ్ తెలిపారు.ఏప్రిల్‌లో మోదీ రాజస్థాన్‌లోని ఎన్నికల ప్రచార ర్యాలీలో తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే.. దేశ సంపదను ఎక్కువ మంది పిల్లలు కనేవారికి పంచిపెడతారని అన్నారు. ముస్లీంలకు తొలి ప్రాధాన్యమని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యానించినట్లు కూడా మోదీ ఆరోపణులు చేసిన విషయం తెలిసిందే. -
ఒక శకం ముగిసింది.. మన్మోహన్పై ఖర్గే ప్రశంసలు
సాక్షి, ఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నేడు రాజ్యసభ సభ్యుడిగా రిటైర్ కానున్నారు. రాజ్యసభలో తన 33 ఏళ్ల పార్లమెంటరీ ఇన్నింగ్స్‌ను మన్మోహన్ సింగ్ ముగించారు. ఈ నేపథ్యంలో మాజీ ప్రధాని మన్మోహన్పై అన్ని పార్టీలు ప్రశంసలు కురిపించాయి. ఇక, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. మన్మోహన్ సింగ్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన సేవలను కొనియాడుతూ ఖర్గే లేఖ రాశారు. ఈ లేఖలో ఒక శకం ముగిసిందని వ్యాఖ్యానించారు. భారత రాజకీయాలకు, దేశానికి మన్మోహన్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. మన్మోహన్ ఎల్లప్పుడూ మధ్యతరగతి, ఆకాంక్ష యువతకు హీరో, పారిశ్రామికవేత్తలకు నాయకుడు మార్గదర్శకుడు అని కొనియాడారు. మన్మోహన్ ఆర్థిక విధానాల వల్ల పేదరికం నుండి బయటపడగలిగిన పేదలందరికీ శ్రేయోభిలాషి అని చెప్పుకొచ్చారు. ఉపాధి హామీ పథకంతో మన్మోహన్ సింగ్ గ్రామీణులకు కష్ట సమయాల్లో ఆదాయం, తలెత్తుకు బతికే అవకాశం కల్పించారని అన్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావుతో కలిసి మన్మోహన్ సింగ్ వేసిన ఆర్థిక పునాదుల ఫలాలు నేటి సమాజానికి అందుతున్నాయని తెలిపారు. కానీ, నేటి రాజకీయ నాయకులు ఆయన పాత్రను గుర్తించట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరెన్ని విమర్శలు చేసినా క్షమించగలిగే పెద్ద మనసు ఆయన సొంతమని ప్రశంసించారు. మన్మోహన్ రాజకీయ ప్రస్థానం.. ఆర్థిక రంగంలో ఎన్నో సాహసోపేతమైన సంస్కరణలకు నాంది పలికిన మన్మోహన్ సింగ్ 1991 అక్టోబర్‌లో తొలిసారి రాజ్యసభ సభ్యుడయ్యారు. 1991 నుంచి 1996 వరకు పీవీ నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన సింగ్ 2004 నుంచి 2014 వరకు దేశ ప్రధానిగా ఉన్నారు. 1991 అక్టోబర్ 1 నుంచి 2019 జూన్ 14 వరకూ అస్సాం నుంచి ఐదు పర్యాయాలు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆ తరువాత 2019 ఆగస్టు 20న రాజస్థాన్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైయ్యారు. ఏప్రిల్ 3న బుధవారం 91 ఏళ్ల మన్మోహన్ సింగ్ పదవీ కాలం పూర్తి కావస్తుండటంతో ఆ స్థానంలో తొలిసారి రాజస్థాన్ నుంచి సోనియాగాంధీ రాజ్యసభలో అడుగుపెట్టబోతున్నారు. -
మన్మోహన్ సింగ్ పై ప్రధాని మోదీ ప్రశంసలు
-
మన్మోహన్ సింగ్‌పై ప్రధాని మోదీ ప్రసంశలు
ఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌పై ప్రధాని మోదీ ప్రసంశలు కురిపించారు. వీల్ చైర్లో కూడా వచ్చి పనిచేశారని పేర్కొన్నారు. రాజ్యసభలో పదవీ విరమణ చేస్తున్న సభ్యుల వీడ్కోలు సందర్భంగా సభలో ప్రసంగిస్తూ ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఓటింగ్ సమయంలో ట్రెజరీ బెంచ్ గెలుస్తుందని తెలిసినా.. మన్మోహన్ సింగ్ వీల్ చైర్లో వచ్చి ఓటేశారని ప్రధాని మోదీ గుర్తు చేశారు. సభ్యుడు తన విధుల పట్ల అప్రమత్తంగా ఉంటాడనడానికి ఇదొక ఉదాహరణ అని కొనియాడారు. పదవీ విరమణ చేయనున్న రాజ్యసభ సభ్యులకు ఢిల్లీలోని చైర్మన్ జగదీప్ ధన్ఖర్ నివాసంలో గురువారం వీడ్కోలు ఇవ్వనున్నారు. ఈమేరకు ఇవాళ ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి భవన్లో రాజ్యసభ సభ్యులు గ్రూప్ ఫోటోలో పాల్గొన్నారు. అనంతరం సాయంత్రం 6.30 గంటలకు చైర్మన్ నివాసంలో పదవీ విరమణ చేస్తున్న సభ్యులకు వీడ్కోలు కార్యక్రమంలో పాల్గొంటారు. ఇదీ చదవండి: కాశీ, అయోధ్య.. ఇక మథుర: యోగి -
పెద్దల సభలో 68 మంది రిటైర్మెంట్!
న్యూఢిల్లీ: తొమ్మిది మంది కేంద్ర మంత్రులతో సహా అరవై ఎనిమిది మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఈ ఏడాదితో ముగియనుంది. పార్లమెంట్లో ఎగువసభ/ పెద్దలసభగా పిలుచుకునే రాజ్యసభలో ఈ ఏడాది పదవీకాలం పూర్తి చేసుకుంటున్నవాళ్లలో.. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, జయా బచ్చన్ కూడా ఉన్నారు. ఖాళీ అవుతున్న ఈ 68 స్థానాల్లో ఢిల్లీలోని మూడు స్థానాలకు ఎన్నికల నిర్వహణకు నోటిషికేషన్ జారీ అయ్యింది. ఆప్ నుంచి పెద్దల సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంజయ్ సింగ్, నారాయణ్ దాస్ గుప్తా, సుశీల్‌కుమార్ గుప్తాలు జనవరి 27న తమ పదవీకాలం పూర్తవనుంది. ఇక సిక్కింలోని ఏకైక రాజ్యసభ స్థానానికి కూడా ఎన్నికలు త్వరలో జరగనుంది. ఎస్డీఎఫ్ నేత హిషే లచుంగ్పా ఫిబ్రవరి 23న పదవీ విరమణ చేయనున్నారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్, ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయా, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సహా 57 మంది నేతల పదవీకాలం ఏప్రిల్‌లో పూర్తవుతుంది. ►తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ తరపున జోగినిపల్లి సంతోష్ కుమార్, రవిచంద్ర వద్దిరాజు, బి లింగయ్య యాదవ్ పదవీ విరమణ చేయనున్నారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కనీసం ఇద్దరిని తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపాలని భావిస్తోంది. ► ఆంధ్రప్రదేశ్‌కి చెందిన టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్, బీజేపీ సభ్యుడు సీఎం రమేష్, వైఎస్సార్సీపీ సభ్యుడు ప్రభాకర్‌రెడ్డి వేమిరెడ్డి రాజ్యసభ నుంచి రిటైర్ అవుతున్నారు. ►ఇక ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 10 సీట్లు, మహారాష్ట్ర 6, బీహార్ 6, మధ్యప్రదేశ్ 5, పశ్చిమ బెంగాల్ 5, కర్ణాటక 4, గుజరాత్ 4, ఒడిశా 3, తెలంగాణ 3, కేరళ 3, ఆంధ్ర ప్రదేశ్ 3, జార్ఖండ్ 2, రాజస్థాన్ 2, ఉత్తరాఖండ్ 1, హిమాచల్ ప్రదేశ్ 1, హర్యానా 1, ఛత్తీస్‌గఢ్ 1 స్థానం చొప్పున పదవీ విరమణ చేయనున్నారు. వీరితోపాటు జూలైలో నలుగురు నామినేటెడ్ సభ్యులు జూలైలో పదవీ విరమణ చేయనున్నారు. పదవీ విరమణ చేస్తున్న సభ్యులలో మన్మోహన్ సింగ్, భూపేంద్ర యాదవ్ (రాజస్థాన్), అశ్విని వైష్ణవ్, బీజేపీ సభ్యులు ప్రశాంత నందా, అమర్ పట్నాయక్ (ఒడిశా), బిజెపి ముఖ్య అధికార ప్రతినిధి అనిల్ బలూని (ఉత్తరాఖండ్), మన్సుఖ్ మాండవీయా,యు మత్స్య శాఖ మంత్రి పర్షోత్తమ్ రూపాలా, కాంగ్రెస్ సభ్యులు నరన్భాయ్ రత్వా ఉన్నారు. ►గుజరాత్‌కు చెందిన అమీ యాగ్నిక్. విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్, ఎంఎస్ఎంఈ మంత్రి నారాయణ్ రాణే, మాజీ కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్, కాంగ్రెస్ సభ్యుడు కుమార్ కేత్కర్, ఎన్సీపీ సభ్యుడు వందనా చవాన్, శివసేన (ఉద్దవ్) సభ్యుడు అనిల్ దేశాయ్ మహారాష్ట్ర నుంచి పదవీ కాలం పూర్తి కానుంది. ►మధ్యప్రదేశ్ నుంచి ధర్మేంద్ర ప్రధాన్, సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్, బీజేపీ సభ్యులు అజయ్ ప్రతాప్ సింగ్ కైలాష్ సోనీ, కాంగ్రెస్ సభ్యుడు రాజమణి పటేల్ ఎగువసభ నుంచి పదవీ విరమణ చేయనున్నారు. ►కర్ణాటకలో బీజేపీకి చెందిన రాజీవ్ చంద్రశేఖర్, కాంగ్రెస్‌కు చెందిన ఎల్ హనుమంతయ్య, జీసీ చంద్రశేఖర్ సయ్యద్ నాసిర్ హుస్సేన్ పెద్దల సభ నుంచి వైదోలగనున్నారు. ►పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు అబిర్ రంజన్ బిస్వాస్, సుభాసిష్ చక్రవర్తి, మహమ్మద్ నడిముల్ హక్, శాంతాను సేన్, కాంగ్రెస్ నుంచి అభిషేక్ మను సింఘ్వీ పదవీ విరమణ చేయున్నారు. ►బీహార్‌లో ఆర్జేడీ నుంచి మనోజ్ కుమార్ ఝా, అహ్మద్ అష్ఫాక్ కరీం, జేడీయూ నుంచి అనిల్ ప్రసాద్ హెద్డే, బశిష్ట నారాయణ్ సింగ్, బీజేపీ తరపున సుశీల్ కుమార్ మోదీ, కాంగ్రెస్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న అఖిలేష్ ప్రసాద్ సింగ్ రాజ్యసభ పదవీకాలం పూర్తవుతోంది. ►ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ నుంచి అనిల్ అగర్వాల్, అశోక్ బాజ్‌పాయ్, అనిల్ జైన్, కాంత కర్దమ్, సకల్దీప్ రాజ్‌భర్, జీవీఎల్ నరసింహారావు, విజయ్ పాల్ సింగ్ తోమర్, సుధాంషు త్రివేది, హరనాథ్ సింగ్ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ సభ్యురాలు జయ బచ్చన్ పదవీ విరమణ చేస్తున్నారు. ►చత్తీస్‌గఢ్, హర్యానా నుంచి బీజేపీ తరపున సరోజ్ పాండే, డీపీ వాట్స్ పదవీ విరమణ చేయనున్నారు. ►జార్ఖండ్‌లో బీజేపీ నుంచి సమీర్ ఒరాన్, కాంగ్రెస్ సభ్యుడు ధీరజ్ ప్రసాద్ సాహు మేలో పదవీ విరమణ చేయనున్నారు. ►కేరళలో సీపీఎం పార్టీ నుంచి ఎలమరం కరీం, సీపీఐ నుంచి బినోయ్ విశ్వం, కేసీఎం సభ్యుడు జోస్ కె మణి జూలైలో పదవీ విరమణ పొందుతున్నారు. ►నామినేటెడ్ సభ్యుల్లో బీజేపీకి చెందిన మహేశ్ జెఠ్మలానీ, సోనాల్ మాన్సింగ్, రామ్ షకల్, రాకేష్ సిన్హా జూలైలో పదవీ విరమణ చేయనున్నారు. -
మన్మోహన్ సింగ్‌పై పవార్ కీలక వ్యాఖ్యలు
పుణె: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌పై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో ప్రధానిగా ఉన్న మన్మోహన్ రైతుల సమస్యల పరిష్కారంపై సానుకూలంగా ఉండేవారని ప్రస్తుతం రైతుల సమస్యలను పట్టించుకునే వారే లేరన్నారు. రైతుల ఆత్మహత్యల గురించి తెలుసుకుని ప్రధానిగా ఉన్నపుడు మహారాష్ట్ర అమరావతి ప్రాంతంలో మన్మోహన్ పర్యటించారని పవార్ తెలిపారు. ‘మన్మోహన్ సింగ్ సామాన్య ప్రజలు, రైతుల సమస్యల పట్ల సున్నితంగా వ్యవహరించేవారు. అందుకే ఆయన రూ.72 వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేశారు. ప్రస్తుతం దేశంలో రైతుల సమస్యల వైపు కన్నెత్తి చూశే వారు లేరు’ అని పవార్ అన్నారు. పుణెలోని శేట్కారి ఆక్రోశ్ మోర్చా సమావేశంలో మాట్లాడుతూ పవార్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదే కార్యక్రమంలో మాట్లాడిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంలు లేకుండా బీజేపీ కనీసం గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా గెలవలేదని ఎద్దేవా చేశారు. బీజేపీ పొత్తు ఈవీఎంలతోనేనన్నారు. ఈ కార్యక్రమానికి శివసేన(యూబీటీ)నేత ఉద్ధవ్ థాక్రేతో పాటు కాంగ్రెస్ నేత బాలాసాహెబ్ థోరట్, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే తదితరులు హాజరయ్యారు. ఇదీచదవండి..సన్‌బర్న్ షోలో ‘శివుడి ఫొటో’.. నిర్వాహకులపై ఫిర్యాదు -
కేంద్రానికి మద్దతు నిలిచిన మన్మోహన్ సింగ్
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మద్దతుగా నిలిచారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై భారత్ అవలంభించిన విధానం సరైనదేనని అన్నారు. భారత్ తన సార్వభౌమాధికారాన్ని, ఆర్ధిక ప్రయోజనాలను కాపాడుకోవడంలో ప్రధాన పాత్ర పోషించిందని కొనియాడారు. అదే క్రమంలో ప్రపంచ శాంతికి విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. జీ-20 సమావేశాలకు ఆహ్వానాలు అందిన వారిలో మన్మోహన్ సింగ్ కూడా ఒకరు. ఓ ఇంటర్వ్యూలో ఈ మేరకు సమాధానమిచ్చారు. విదేశాంగ విధానం దేశీయ రాజకీయాల్లో ప్రస్తుతం ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు మన్మోహన్ సింగ్ తెలిపారు. దౌత్య సంబంధాలను రాజకీయాల కోసం వాడుకోవడంలో సమన్వయం పాటించాలని కోరారు. జీ20కి ఇండియా ఆతిథ్యం ఇచ్చే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలోనే ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో భారత్ పాత్రకు మద్ధతుగా నిలిచారు. సరైన పనే చేసిందని అన్నారు. Former PMs Manmohan Singh and HD Deve Gowda invited to G20 dinner#G20India2023 #G20SummitDelhi #G20 #ManmohanSingh #HDDeveGowda #G20Summit pic.twitter.com/7Dbe7XV3o4 — Mr. Nitish (@Nitishvkma) September 8, 2023 జీ20 సమ్మిట్‌కు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ రాకపోవడం, చైనా-భారత్ సంబంధాలపై ఆయన స్పందించారు. దేశ సార్యభౌమాధికారాన్ని కాపాడటంలో ప్రధాని మోదీ ప్రభుత్వం కావాల్సినన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. క్లిష్టమైన దౌత్య వ్యవహారాలను ఎలా నిర్వహించాలో ప్రధానమంత్రికి సలహా ఇవ్వడం సరికాదని చెప్పారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్.. G20 శిఖరాగ్ర సమావేశానికి హాజరుకాకపోవడం దురదృష్టకరమని అన్నారు. స్వాతంత్య్రం సాధించి 75 ఏళ్లు పూర్తయినప్పటికీ ఇంకా దేశంలో ఉన్న సవాళ్లపై ప్రశ్నించినప్పుడు.. తాను ఆశావాదంతో ఉన్నట్లు చెప్పారు. దేశంలో అభివృద్ధికి ఆశావాద స్వభావమే నాంది అని అన్నారు. చంద్రయాన్ 3 విజయంపై కూడా ఆయన స్పందించారు. ఇస్రో సాధించిన విజయంపై ఆయన అభినందనలు తెలిపారు. ప్రపంచంలో భారత్ మరింత ముందుకు వెళుతోందని అన్నారు. ఇదీ చదవండి: ఢిల్లీకి చేరిన ఐఎంఎఫ్ చీఫ్.. ఫోక్ సాంగ్‌కు డ్యాన్సులు.. -
ఢిల్లీ చేరుకున్న జో బైడెన్.. తొలిసారి భారత్‌లో పర్యటన
updates.. తొలిసారి భారత్ చేపడుతున్నప్రతిష్టాత్మక జీ20 శిఖరాగ్ర సదస్స కోసం దేశ రాజధాని ముస్తాబవుతోంది. ప్రపంచ దేశాధినేతలు ఒక్కొక్కరిగా ఢిల్లీ చేరుకున్నారు. దేశాధినేతలు బసచేసే హోటళ్ల పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ►అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌భారత్ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్నారు. బైడెన్‌కు విదేశాంగశాఖ సహాయమంత్రి వీకే సింగ్ స్వాగతం పలికారు. తొలిసారి భారత్‌లో జోబైడెన్ పర్యటిస్తున్నారు. ఐటిసి మౌర్య హోటల్లో బస చేయనున్నారు జో బైడెన్. ప్రధాని నరేంద్ర మోదీ నివాసానికి అమెరికా అధ్యక్షుడు బయలుదేరారు. తన నివాసంలో జో బైడెన్‌కు మోదీ ప్రైవేటు డిన్నర్ ఏర్పాటు చేశారు. డిన్నర్ అనంతరం ఇరు నేతలు ద్వైపాక్షిక చర్చలు జరుపనున్నారు. భారతదేశంలో జెట్ ఇంజిన్లను సంయుక్తంగా తయారు చేసే ఒప్పందంపై పురోగతి, MQ-9B సాయుధ డ్రోన్ల కొనుగోలు, పౌర అణు బాధ్యత, వాణిజ్యంపై ఒప్పందం.. ప్రధాని, యూఎస్ అధ్యక్షుడు జోబైడెన్ ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్న ఎజెండాలో ప్రధాన అంశాలు ►జీ 20 సదస్సు కోసం దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా ఢిల్లీకి చేరుకున్నారు. రైల్వే, బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి రావుసాహెబ్ పాటిల్ దాన్వే ఆయనకు స్వాగతం పలికారు. #WATCH | G 20 in India | South African President Cyril Ramaphosa arrives in Delhi for the G 20 Summit. He was received by MoS for State for Railways, Coal and Mines, Raosaheb Patil Danve. pic.twitter.com/3OKiXtJVhi — ANI (@ANI) September 8, 2023 ►రష్యా విదేశాంగమంత్రి సెర్గీ లావ్రోవ్ ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అధ్యక్షుడు పుతిన్‌కు బదులుగా జీ20 సదస్సుకు లావ్రోవ్ హాజరవుతున్నారు. ►ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో ఘట్టర్స్‌కు గన స్వాగతం ►ఢీల్లీలో అర్జంటీనా ప్రెసిడెంట్ అల్బర్ట్ ఫెర్రాండెజ్, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాలకు ఘన స్వాతం పలికారు. ► జీ20 సదస్సు కోసం జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా ఢిల్లీకి చేరుకున్నారు #WATCH | G 20 in India | Japanese Prime Minister Fumio Kishida arrives in Delhi for the G 20 Summit pic.twitter.com/9q5I0FhwHE — ANI (@ANI) September 8, 2023 ►రాత్రి 7 గంటలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఢిల్లీ చేరుకోనున్నారు. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఢిల్లీ చేరుకున్నారు. పాలమ్ ఎయిర్‌పోర్టులోఆయన భారత ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. రేపు ప్రధాని మోదీతో రిషి సునాక్ ధ్వైపాక్షిక భేటీ కానున్నారు. యూకే ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి భారత్‌కు విచ్చేశారు రిషి. అంతకుముందు బ్రిటన్‌లో బయలుదేరే ముందు రిషి సునాక్ అక్కడి మీడియాతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్‌కు వెళ్లడం తనకు చాలా ప్రత్యేకమని అన్నారు. తనని ‘భారతదేశ అల్లుడు’గా వ్యవహరిస్తుండడాన్ని ఆయన సరదాగా గుర్తుచేసుకున్నారు. ఆప్యాయతతోనే తనని అలా పిలుస్తున్నారని ఆశిస్తున్నానని వ్యాఖ్యానించారు. భారత్ తన మనసుకు చాలా దగ్గరి దేశమని సునాక్ వ్యాఖ్యానించారు. కేంద్రమంత్రి అశ్వనీ చౌబే ► యూనియన్ ఆఫ్ కొమొరోస్ ప్రెసిడెంట్ మరియు ఆఫ్రికన్ యూనియన్ (AU) ఛైర్పర్సన్ అజలీ అసోమాని G20 సమ్మిట్ కోసం ఢిల్లీకి వచ్చారు. రైల్వే, బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి రావుసాహెబ్ పాటిల్ దాన్వే ఆయనకు స్వాగతం పలికారు. #WATCH | President of the Union of Comoros and Chairperson of the African Union (AU), Azali Assoumani arrives in Delhi for the G20 Summit. He was received by MoS for State for Railways, Coal and Mines, Raosaheb Patil Danve. pic.twitter.com/oEUI6gB57G — ANI (@ANI) September 8, 2023 ► జీ20 సదస్సులో పాల్గొనేందుకు ఇటలీ ప్రధాని జార్జియా మెలోనికి భారత్ చేరుకున్నారు. ఆమెకు స్వాగతం పలికేందుకు ఢిల్లీ విమానాశ్రయంలో సాంస్కృతిక నృత్య ప్రదర్శనను ఏర్పాటు చేశారు. #WATCH | G 20 in India | Cultural dance performance at Delhi airport to welcome Italian Prime Minister Giorgia Meloni, who arrived to attend the G20 Summit, earlier today. pic.twitter.com/ZZHsn4lukZ — ANI (@ANI) September 8, 2023 ► మూడు రోజుల్లో 15 ద్వైపాక్షిక సమావేశాలలో పాల్గొననున్న ప్రధాని నరేంద్ర మోదీ. నేడు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ చర్చలు.. జెట్ డీల్‌పై చర్చ జరిగే అవకాశం ఉంది. ► ప్రధాని మోదీ శుక్రవారం తన నివాసంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో ద్వైపాక్షిక సమావేశాలు జరపనున్నారు. మారిషస్ నేతలతోనూ ఆయన భేటీ కానున్నారు. ► ఇక, శనివారం జీ-20 సదస్సు మధ్యలో యూకే ప్రధాని రిషి సునాక్‌తో పాటు జపాన్, జర్మనీ, ఇటలీ దేశాధినేతలతోనూ ఆయన ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొననున్నారు. ► ఆదివారం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్‌తో ప్రధాని మోదీ లంచ్ మీటింగ్ నిర్వహించనున్నట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ఆ తర్వాత కెనడా ప్రధానితో కొంతసేపు ముచ్చటించనున్నారు. ► తుర్కియే, యూఏఈ, దక్షిణ కొరియా, కొమొరోస్, ఈయూ/ఈసీ (యూరోపియన్ కమిషన్), బ్రెజిల్, నైజీరియా దేశాల నేతలతోనూ ప్రధాని మోదీ ద్వైపాక్షికంగా భేటీ కానున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. Prime Minister Narendra Modi to hold more than 15 bilateral meetings with world leaders. On 8th September, PM will hold bilateral meetings with leaders of Mauritius, Bangladesh and USA. On 9th September, in addition to the G20 meetings, PM will hold bilateral meetings with the… pic.twitter.com/OAGVTBjTyx — ANI (@ANI) September 8, 2023 ►జీ20 సదస్సు కోసం శుక్రవారం ఉదయం అర్జెంటీనా అధ్యక్షుడు అల్బెర్టో ఫెర్నాండెజ్ ఢిల్లీ చేరుకున్నారు. #WATCH | Argentina President Alberto Fernández arrives in Delhi for the G20 Summit. He was received by MoS for Steel and Rural Development, Faggan Singh Kulaste. pic.twitter.com/hWTmnMb9Ov — ANI (@ANI) September 8, 2023 ► జీ-20 సదస్సు సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందించనున్న శనివారం విందు కార్యక్రమంలో నేతలందరూ పాల్గొనున్నారు. ఈ కార్యక్రమానికి మాజీ ప్రధానులు హెచ్డీ దేవేగౌడ, మన్మోహన్‌సింగ్‌కు ఆహ్వానం అందింది. అయితే, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు మాత్రం ఆహ్వానం అందలేదని ఆయన ఆఫీసు వర్గాలు తెలిపాయి. ► ఇక, విందు కార్యక్రమానికి తాను హాజరు కావడంలేదని దేవేగౌడ.. ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఆరోగ్య కారణల రీత్యా తాను హాజరు కాలేపోతున్నట్టు వెల్లడించారు. అయితే, జీ20 సమావేశాలు సక్సెస్ కావాలని తాను కోరుతున్నట్టు తెలిపారు. "I will not be attending the G20 dinner organised by the Hon. President of India Draupadi Murmuji, on 09 September 2023, due to health reasons. I have already communicated this to the government. I wish the G20 summit a grand success," tweets Former Prime Minister HD Deve Gowda https://t.co/pCl3dCxkY4 pic.twitter.com/Pj9NIqP9BI — ANI (@ANI) September 8, 2023 ► జీ-20 సమావేశాల నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. #WATCH | Security checks underway in the wake of the G20 Summit, scheduled to be held in the national capital from September 9 to 10. (Visuals from Minto Road) pic.twitter.com/PCIaIPOCB9 — ANI (@ANI) September 8, 2023 ► ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జీ-20 సదస్సు జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాల నేతలు ఢిల్లీ చేరుకుంటున్నారు. సదస్సు కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. #WATCH | Delhi: For the G20 Summit, the national capital has been adorned with mural paintings. (Visuals from Lotus Temple) pic.twitter.com/eimW5AhvUp — ANI (@ANI) September 8, 2023 సెప్టెంబరు 9-10 తేదీల్లో జరిగే జీ-20 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సుకు సర్వం సిద్ధమైంది. ఇందుకోసం పలు దేశాల అధినేతలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధుల రాకతో ఇప్పటికే ఢిల్లీలో సందడి మొదలైంది. ఈ సమావేశం కోసం దేశ రాజధాని అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వలయంలో ఉంది. గత ఏడాది కాలంగా జీ-20కి అధ్యక్షత వహిస్తున్న భారత్.. ఈ సమావేశంలో ఆ బాధ్యతలను బ్రెజిల్‌కు అప్పగించనుంది. -
వీల్ ఛైర్లో మన్మోహన్సింగ్.. బీజేపీ ఫైర్
ఢిల్లీ: ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుపై ఓటింగ్ సందర్భంగా మాజీ ప్రధానమంత్రి, రాజ్యసభ సభ్యులు మన్మోహన్ సింగ్ వీల్ ఛైర్లో పార్లమెంట్‌కి తీసుకువచ్చారు. ఈ అంశం అధికార విపక్షాల మధ్య తీవ్ర చర్చకు దారితీసింది. మన్మోహన్‌కు రాజ్యంగం పట్ల ఉన్న విధేయతపై ప్రతిపక్షాలు కొనియాడాయి. అదే తరుణంలో ఆరోగ్యం బాగులేకున్నా.. కేవలం ఢిల్లీ బిల్లును వ్యతిరేకించాలనే చెడు సంకల్పంతో ఆయన్ను సభలోకి తీసుకురావడంపై బీజేపీ మండిపడింది. ఈ చర్యను సిగ్గు చేటుగా అభివర్ణించింది. ఢిల్లీ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయడానికి వచ్చిన మన్మోహన్ సింగ్‌కు ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా ధన్యవాదాలు తెలిపారు. రాజ్యాంగ విలువల పట్ల ఆయనకు ఉన్న విదేయత ఎంతో గొప్పది అంటూ కొనియాడారు. బ్లాక్ ఆర్డినెన్స్‌పై స్పందించడానికి వచ్చినందుకు ఆయనకు రుణపడి ఉంటామని అన్నారు. మన్మోహన్‌ను రాజ్యసభలోకి తీసుకువచ్చిన తీరు దేశం గుర్తుంచుకుంటుందని బీజేపీ మండిపడింది. కాంగ్రెస్ పిచ్చి ఎంతటిదో అర్థమవుతుందని ఆరోపణలు చేశారు. రాత్రిపూట ఆరోగ్యం బాగులేని మన్మోహన్‌ను వీల్ ఛైర్లో తీసుకురావాల్సినంత అవసమేంటని కాంగ్రెస్‌ను నిందించింది. నిజాయితీ లేని తమ కూటమిని నిలుపుకోవాలనే కాంగ్రెస్ ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని దుయ్యబట్టింది. ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు మొత్తానికి పార్లమెంట్లో ఆమోదం పొందింది. 131 సీట్లు బిల్లుకు ఆమోదం తెలుపగా.. 101 ఓట్లు వ్యతిరేకంగా వచ్చాయి. ఈ బిల్లు ఢిల్లీలో ఆప్, కేంద్రానికి మధ్య విమర్శలకు దారితీసింది. ఇదీ చదవండి: ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు ఆమోదం.. కేజ్రీవాల్ కీలక నిర్ణయం.. -
PV జయంతి నేడు: క్లిష్టకాలంలో దేశాన్ని గట్టెక్కించిన తెలుగు బిడ్డ
భారత దేశ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం కలిగిన మేధావీ, పరిపాలనాదక్షుడూ పాము లపర్తి వెంకట నరసింహారావు. ఎవరి జీవితం, ఎట్లా మలుపు తిరుగుతుందో ఎవరికీ తెలియదు. తమిళ నాడు శ్రీపెరుంబుదూర్‌లో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న రాజీవ్ గాంధీని 1991 మే 21న ఎల్టీ టీఈ ఆత్మాహుతి దాడితో హత్య చేసింది. అత్యధిక మెజారిటీతో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్ట బెట్టారు. భారత పదవ ప్రధానమంత్రిగా బాధ్యత చేపట్టారు పీవీ. ఆ సమయంలో భారతదేశం అంతర్జాతీయ చెల్లింపులపై డిఫాల్ట్ అయ్యి రెండు వారాలు కావ స్తోంది. విదేశీ మారక నిల్వలు కేవలం రెండు వారాల దిగుమతులకు మాత్రమే సరిపో యేంతగా ఉన్నాయి. అంతకు నెలరోజుల క్రితం మొత్తం 55 టన్నుల బంగారాన్ని రిజర్వ్ బ్యాంక్ తనఖా పెట్టింది. పెద్ద మొత్తంలో చెల్లింపులు తగ్గు ముఖం పట్టాయి. భారతదేశా నికి రుణం ఇవ్వడానికి ఎవరూ సిద్ధంగా లేరు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్‌ను ఆర్థిక మంత్రిగా నియమించారు పీవీ. దేశ ఆర్థిక వ్యవస్థ గాడిలో పడడానికి ఎటువంటి నిర్ణయం తీసుకోవడానికైనా ఆయనకు స్వేచ్ఛ నిచ్చారు. అప్పటివరకూ ఉన్న కఠిన నిబంధనలను సడళించి సరళీకరణకు ద్వారాలు తెరచింది పీవీ ప్రభుత్వం. దాని ఫలితాలనే ఇప్పుడు మనమంతా అనుభ విస్తున్నాం. అంతర్జాతీయ సమాజంలో భారత్ పట్ల సన్నగిల్లిన విశ్వాసాన్ని తిరిగి పాదుకొల్పారు పీవీ. ఫలితంగా అంతర్జాతీయ ద్రవ్య సంస్థల సహాయం మళ్లీ ప్రారంభమయ్యింది. అలా దేశాన్ని తిరిగి అభివృద్ధి పథంలోకి తీసుకువచ్చారు. ప్రస్తుత తెలంగాణలోని హనుమకొండ జిల్లా లోని ‘వంగర’ గ్రామంలో 1921లో పీవీ జన్మించారు. అంచెలంచెలుగా రాష్ట్ర, కేంద్ర రాజకీయాల్లో ఎదిగారు. ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే బాబ్రీ మసీద్ కూల్చివేత జరిగింది. ఆ సమయంలో ఆయన తీవ్ర మైన విమర్శలను ఎదుర్కొన్నారు. దక్షిణ భారత్‌కు చెందిన పీవీకి వ్యతిరేకంగా ఆయన సొంత పార్టీ ప్రముఖులే పనిచేసి ఆయనను పదవి నుంచి లాగి వేయడానికి ప్రయత్నించారు. కానీ ఇటు ప్రతి పక్షాలు, అటు అసంతృప్తులైన సొంత పార్టీ వారి ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఆయన విజయవంతంగా తన ఐదేళ్ల పదవీకాలాన్ని దిగ్విజయంగా ముగించారు. ఆయన మరణించి 18 ఏళ్లు గడిచాయి. పీవీ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ తన సందేశాన్ని ట్వీట్ ద్వారా పంచుకున్నారు. Remembering Shri PV Narasimha Rao Ji on his birth anniversary. His far-sighted leadership and commitment to India’s development was noteworthy. We honor his invaluable contributions to our nation's progress. — Narendra Modi (@narendramodi) June 28, 2023 కాంగ్రెస్ పార్టీ పీవీ చేసిన సేవలను స్మరించుకుంది. On his birth anniversary, we remember the former PM of India, P.V. Narasimha Rao, who introduced some noteworthy liberal reforms to the Indian economy. Today, we pay a humble tribute to Mr. Rao, a distinguished statesman who reinvented India, both at home & abroad. pic.twitter.com/Cb0YPKbGjw — Congress (@INCIndia) June 28, 2023 ఈ తరుణంలో దేశానికి పీవీ చేసిన సేవను అన్ని వర్గాలూ మరచిపోవడం బాధాకరం. ఆయన శత జయంతి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు శత జయంతి ఉత్సవాలను ఏడాది పాటు ఘనంగా నిర్వహించి ఆయన కీర్తి ప్రతిష్ఠలను ఇను మడింప చేశారు.ఇంతటి మహా మేధా వినీ, పరిపాలనా దక్షుణ్ణీ నేను నా జీవితంలో ఆరుసార్లు అతి దగ్గర నుండి చూశాను. ఆయనతో కొంత సమయం గడిపాను. నా జీవితంలో మరపు రాని సందర్భాలివి. 1977లో పెద్ద పల్లి జిల్లా మా కొలనూరు పక్క ఊరైన ‘పెగడ పల్లి’లో మా చుట్టాల ఇంటిలో పెళ్లి సందర్భంగా ఆయనతో కలిసి బంతి భోజనం చేశాను. మరొకసారి ఒక దినపత్రిక విలేక రిగా పెద్దపల్లి విశ్రాంత భవనంలో ఆయన పక్క కూర్చుని ముచ్చటించడం అరుదైన ఘటన. – దండంరాజు రాంచందర్ రావు, రిటైర్డ్ డిప్యూటీ సూపరింటెండెంట్, సింగరేణి భవన్, హైదరాబాద్ (నేడు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి) -
మన్మోహన్ సింగ్ ఓ పిరికిపంద: అమిత్ షా ఫైర్
విశాఖపట్నం: బీజేపీ ప్రభుత్వం తొమ్మిదేళ్ల పరిపాలనను పూర్తి చేసుకున్న నేపధ్యంలో విశాఖపట్నం వేదికగా ఆ పార్టీ నిర్వహించిన భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంతకుముందు అధికారంలో ఉన్న మన్మోహన్ సింగ్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అంతర్గత భద్రత విషయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం దారుణంగా విఫలమైందన్నారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే అంతర్గత భద్రత వ్యవహారం పటిష్టంగా తయారైందని అన్నారు. ప్రజలు ధైర్యంగా ఉన్నారు.. బీజేపీ ప్రభుత్వం 9 ఏళ్ల పరిపాలన పూర్తి చేసుకున్న సందర్బంగా విశాఖపట్నంలో భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన అమిత్ షా సభనుద్దేశించి మాట్లాడుతూ గత యూపీఏ ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో విమర్శించారు. అంతర్గత భద్రత విషయంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం చాలా ఉదాసీనంగా వ్యవహరించేది. నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే ప్రజలు ధైర్యంగా ఉంటున్నారని అన్నారు. దేశంలో తీవ్రవాదాన్ని పెంచేశారు.. యూపీఏ ప్రభుత్వ హయాంలో ఆలియా, మాలియా, జమాలియా అనే పద్ధతిలో తీవ్రవాదాన్ని పెంచి పోషించింది. అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కు వారిపై చర్య తీసుకునే ధైర్యం లేదు. శత్రువులు మనపై దాడి చేసినా చేతులు ముడుచుకుని కూర్చునేవారు. నోరు విప్పేవారు కాదు. కానీ ఇప్పుడు మన ప్రధాని అలాంటి సవాళ్ళన్నిటినీ ధైర్యంగా ఎదుర్కొంటున్నారన్నారు. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తరవాతే దేశ అంతర్గత భద్రత పెంచి ప్రజలకు భరోసా కల్పించారు. ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో భారత సైన్యం ఎంతో తెగువతో కేవలం 10 రోజుల వ్యవధిలోనే ఉరి, పుల్వామా సర్జికల్ స్ట్రైక్, ఎయిర్ స్ట్రైక్ లు నిర్వహించి శత్రువులకు ఎదురెళ్లి మరీ భారత దేశ సత్తా ఏంటో చాటిందన్నారు. ఇప్పుడు తీవ్రవాదులు నరేంద్ర మోదీ పేరు వింటేనే భయపడుతున్నారని అన్నారు. ఇది కూడా చదవండి: పూణేలో భక్తులపై లాఠీచార్జ్.. ఉత్సవాల్లో అపశ్రుతి -
సారీ చెప్పడం తెలియకపోతే...
విధి విచిత్రమైనది. విరుద్ధంగా తిరుగుతాయని ఎంతమాత్రమూ ఊహించని ఘటనలు జరుగుతుంటాయి. 2013లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం తెచ్చిన ఒక ఆర్డినెన్స్ ను ‘పూర్తిగా అర్థరహితం’ అని పేర్కొంటూ రాహుల్ చింపేశారు. తన విమర్శను బహిరంగంగా ప్రదర్శించడం ద్వారా మన్మో హన్ను ఉద్దేశపూర్వకంగా అవమానించారు. ఆ ఆర్డినెన్స్ పాస్ అయి ఉంటే, పార్లమెంట్ నుంచి రాహుల్ ప్రస్తుత అనర్హతను అది అడ్డుకుని ఉండేది. ఆ విషయంలో ఎంత తప్పు చేశారన్నది ఇప్పుడు ఆయనకు కలిగిన దురవస్థ వెల్లడిస్తోంది. కానీ ‘దాన్ని చింపి, అవతల పారెయ్యాలి’ అన్న వ్యాఖ్య మన్మోహన్‌ను ప్రధానిగా బలహీనపర్చింది. అందుకే, మన్మోహన్ కు బహిరంగ క్షమాపణ చెప్పడాన్ని రాహుల్ బకాయి పడ్డారు. కానీ ఆయన మూర్ఖంగా ‘గాంధీలు ఎన్నడూ ఎవరికీ క్షమాపణ చెప్పరు’ అంటూ ప్రగల్భాలకు పోయారు. క్షమాపణ అవసరమైనప్పుడు కూడా అలాగే చేస్తానంటే ఆ బడాయికోరుతనం దోషం అవుతుంది. ఎలా క్షమాపణ చెప్పాలో తెలీని రాజకీయనాయకుడిగా ఆయన మిగిలిపోతారు. విధికి సంబంధించిన చమత్కారాలు, వక్రోక్తులు నాకు ఎంతో ఆసక్తి గొలుపుతుంటాయి. ఘటనలు మీకు విరుద్ధంగా జరుగుతాయని మీరు అసలు ఎంతమాత్రమూ ఊహించనప్పుడు, అవి వాస్తవంగా అలాగే పైకి తేలుతాయి. అవును, అలాగే జరుగుతాయి. వ్యావహారి కంగా దీన్ని ‘సోడ్ న్యాయం’ అని పిలుస్తారు. (ఒకటి తప్పుగా జరిగే అవకాశం ఉంటే, అది చివరకు తప్పుగానే జరుగుతుందని బ్రిటన్‌లో నవ్వుతూ చెప్పే మాట.) షేక్స్పియర్ వంటి నాటకకర్త చేతుల్లో అది మితిమీరిన గర్వంగా పరివర్తన చెందుతుంది. ఆయన గొప్ప విషాదాంత నాటకాలు ఈ వ్యవహారం పైనే ఆధారపడి రూపొందాయి. ఏ రకంగా చూసినా, ఇది ‘దేవుడి లీలావిలాసాలు’ మనకు వెల్లడయ్యే క్షణం! రెండు క్షమాపణలు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ విషయంలో జరిగింది అదే. ఆడంబరంగా, అలా కాదనుకుంటే డాంబికంగా అయన పత్రికా సమా వేశంలో ఇలా ప్రకటించారు: ‘‘నా పేరు గాంధీ; గాంధీలు ఎన్నడూ ఎవరికీ క్షమాపణ చెప్పరు’’. దురదృష్టవశాత్తూ ఇద్దరు వ్యక్తులకు ఆయన క్షమాపణలు బాకీ పడ్డారని స్పష్టమైన సమయంలోనే, ఆయన ఈ వ్యాఖ్య చేశారు. చాలా స్పష్టంగా అది బహిర్గతమైన విషయం. పైగా అది కచ్చితంగా బహిరంగంగా జరిగిన విషయం. రాహుల్ తన తొలి క్షమాపణను మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు బాకీ పడ్డారు. 2013లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం తెచ్చిన ఒక ఆర్డినెన్స్‌ను ‘‘పూర్తిగా అర్థరహితం’’ అని పేర్కొంటూ రాహుల్ దాన్ని చింపేశారు. విచిత్రమైన విషయం ఏమి టంటే, ఆ ఆర్డినెన్స్ పాస్ అయి ఉంటే, పార్లమెంట్ నుంచి రాహుల్ గాంధీ ప్రస్తుత అనర్హతను అది అడ్డుకుని ఉండేది. ఎందుకంటే, ఆ ఆర్డినెన్సు ఇలా ఒక శాసనాన్ని పొందుపర్చింది. ‘‘శిక్ష పడిన నాటి నుంచీ 90 రోజులలోపు, ఆ శిక్షను పునర్విమర్శ చేయమని కోరుతూ ఒక విజ్ఞప్తి లేదా అభ్యర్థనను దరఖాస్తు చేసినట్లయితే’’ కనీసం రెండేళ్ల శిక్ష పడిన పార్లమెంట్ సభ్యుడి తక్షణ అనర్హత అనేది అనిశ్చిత స్థితిలోకి వెళ్తుంది. (ఇంకోరకంగా చెప్పాలంటే, అప్పటికి నిలుపుదల అవు తుంది.) ముందుచూపు లేకపోవడం 2013లో రాహుల్ గాంధీ గుర్తించనిది – బహుశా, ఈరోజు ఆయన మర్చిపోనిది ఏమిటంటే, ఆయనకు పడిన శిక్షపై ఒకవేళ న్యాయస్థానం చివరకు స్టే విధించినప్పటికీ... ప్రస్తుత పార్లమెంటులో ఆయన చాలా వారాలపాటు అడుగుపెట్టే అవకాశం అప్పటికి కోల్పోయివుంటారు. ఇది కేవలం వ్యక్తిగత నష్టం మాత్రమే కాదు. అంతకంటే ముఖ్యంగా, ఆయన నియోజక వర్గమైన వయనాడ్ (కేరళ)కు ఈ కాలంలో ప్రాతినిధ్యం లేకుండా పోతుంది. నిజానికి, ఇది భార తీయ ప్రజాస్వామ్యాన్ని క్షీణింపజేస్తుందని కూడా మీరు వాదించ వచ్చు. ఎందుకంటే మామూలుగా లోక్‌సభలో వ్యక్తీకరించగలిగిన ఒక అభిప్రాయం వినలేని పరిస్థితి వస్తున్నది కాబట్టి. 2013లో రాహుల్ గాంధీ ఆ ఆర్డినెన్్సను లాలూ ప్రసాద్ యాదవ్‌ను కాపాడటానికి తెస్తున్న ముతక, ఇంకా చెప్పాలంటే అనైతిక ప్రయత్నంగానే చూశారు. కానీ ఆ ఆర్డినెన్స్‌కు అంతకంటే మించిన విలువ ఉందని ఆయన చూడలేకపోయారు. ఇంకా చెప్పాలంటే చూడ దల్చలేదు కూడా. బహుశా ఆ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ప్రజాగ్రహం ఉందన్న అంశంపైనే ఆయన దృష్టి మొత్తంగా ఉండేది. అయితే ఆయన ఆ విషయంలో ఎంత తప్పు చేశారన్నది ఇప్పుడు ఆయనకు కలిగిన దురవస్థ వెల్లడిస్తోంది. ఇంకా ఘోరమైన సంగతి ఏమిటంటే, తన విమర్శను బహిరంగంగా ప్రదర్శించడం ద్వారా మన్మోహన్ సింగ్‌ను ఉద్దేశపూర్వకంగా రాహుల్ అవమానించారు. ‘‘దాన్ని చింపి, అవతల పారెయ్యాలి’’. ఇది జూలియస్ సీజర్‌ను బ్రూటస్ పొడిచేయడం లాంటిదే. ఆ వ్యాఖ్య మన్మోహన్‌కు నష్టం చేయడమే కాదు, ప్రధానిగా ఆయన్ని బలహీన పర్చింది. అందుకే, డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు పూర్తిగా బహిరంగ క్షమాపణ చెప్పడాన్ని రాహుల్ గాంధీ బకాయి పడ్డారు. సముచితం కాని స్పందన రెండో క్షమాపణ – అది చెప్పడం జరిగినట్లయితే– రాహుల్ ఎలాంటి వ్యక్తో వెల్లడవుతుంది. అది ఆయన స్వభావానికి, చివరకు తన నైతిక సమగ్రతకు కూడా పరీక్షే అవుతుంది. అందువల్ల, ఈ రెండు క్షమాపణలు చెప్పడం కష్టమైనవే కానీ అవి మరింతగా అవసర మైనట్టివి. ‘‘ఓబీసీ కమ్యూనిటీని రాహుల్ గాంధీ అవమానించారని బీజేపీ చేసిన ఆరోపణపై మీ అభిప్రాయం ఏమి’’టని మార్చి 25న జరిగిన ఒక ప్రెస్ కాన్ఫరెన్సులో అడిగిన ఒక జర్నలిస్టు పట్ల రాహుల్ చాలా గర్వంతోనూ, మొరటుగానూ వ్యవహరించారు. కచ్చితమైన, సముచి తమైన ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి బదులుగా రాహుల్ ఆ విలేఖరిపై మాటల దాడికి దిగారు. ‘‘నువ్వు బీజేపీకి ఇంత నేరుగా ఎందుకు పనిచేస్తున్నావ్... నీకు వారి నుంచి ఆదేశాలు అందాయా... నువ్వు బీజేపీ కోసం పనిచేయాల నుకుంటే, బీజేపీ జెండా... లేదా గుర్తు ... తెచ్చుకుని నీ ఛాతీపై పెట్టుకో... అప్పుడు వారికి నేను ఏ రీతిలో సమాధానం చెబుతానో నీకు కూడా అలాగే జవాబు చెబుతాను. అంతేకానీ పత్రికల మనిషిగా నటించవద్దు.’’ ఇబ్బంది కలిగించేలా తన స్థిరత్వాన్ని, స్థిమితాన్ని కోల్పోవడం సరిపోలేనట్టుగా– రాహుల్ గాంధీ ఆ జర్నలిస్టును మరింత వెటకారం చేశారు. ఇంకో ప్రశ్న (మరెవరో) అడుగుతుండగా, అందరికీ వినబడే ట్టుగా రాహుల్ గాంధీ ‘‘హవా నికల్ గయీ’’(గాలి పోయింది) అనే శారు. ఆయన ముఖంలో తెలివితో కూడిన నవ్వు పరిస్థితిని మరింతగా దిగజార్చివేసింది. క్షమాపణ మనిషిని తగ్గించదు రాహుల్ గాంధీ చెప్పింది సమర్థించుకోలేనిది. దీంతో ఎవరైనా అంగీకరించారంటే నాకు సందేహమే. అయినా సరే ఆయన క్షమాపణ చెబుతారా? ఇది యధాలాపంగా సంధించిన ప్రశ్న కాదు. ఇది రాహుల్ వ్యక్తిత్వానికి, నైతిక స్వభావానికి కొలమానం. నిజాయితీగా చెప్పాలంటే, రాహుల్ ఎలాంటి వ్యక్తి అని తెలిపే పరీక్ష ఇది. వివేకం, ఆత్మసాక్షి ఉన్న రాజకీయ నాయకుడు క్షమాపణ చెబుతారు. పైగా క్షమాపణ అనేది రాహుల్ గాంధీ స్థాయిని పెంచు తుంది. ఆయన పట్ల మన గౌరవం పెరిగేట్లు కూడా చేస్తుంది. కానీ ఆయన ఇప్పటికే మూర్ఖంగా ప్రగల్భాలకు పోయారు: ‘‘గాంధీలు ఎన్నడూ ఎవరికీ క్షమాపణ చెప్పరు.’’ ఒకవేళ అదే ఆయన వైఖరి అయితే, అంటే క్షమాపణ అవసరమైనప్పుడు, దాన్ని బాకీ పడిన ప్పుడు కూడా అలాగే చేస్తానంటే ఆ బడాయికోరుతనం అనేది దోషం అవుతుంది. ఎలా క్షమాపణ చెప్పాలో తెలీని రాజకీయనాయకుడిగా ఆయన మారిపోతారు. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
పండిట్ నెహ్రూ, ఇందిరమ్మ రికార్డులను ఎవరు తిరగరాస్తారు!
దేశంలో ఒక ప్రధాని వరుసగా పదేళ్లు అధికారంలో ఉండడం గొప్ప విషయంగా మారిన రోజులివి. 2004లో అనూహ్య పరిస్థితుల్లో కాంగ్రెస్ తరఫున ప్రధాని అయిన డా.మన్మోహన్ సింగ్ అధికారంలో ఉండగా జరిగిన ఎన్నికల్లో పార్టీ బలం పెరిగాక రెండోసారి ప్రధానిగా ప్రమాణం చేసి పదేళ్లు ఆ పదవిలో ఉన్నారు. ఆయన తర్వాత బీజేపీ నేత నరేంద్ర మోదీ.. డా.మన్మోహన్ మాదిరిగా రెండోసారి ఎన్నికల్లో గెలిచి ప్రధానిగా ఇప్పుడు 9 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారు. ఊహించని పరిణామాలు జరగకపోతే మన్మోహన్ జీ మాదిరిగానే 21వ శతాబ్దంలో వరుసగా పదేళ్లు భారత ప్రధానిగా పని చేసిన రికార్డును మోదీ సమం చేస్తారు. వీరిద్దరి కంటే ముందు వరుసగా ఎక్కువ కాలం ప్రధాని పదవిలో ఎవరెవరు ఉన్నారో పరిశీలిద్దాం. లాంగ్ రికార్డ్ నెహ్రూదే స్వతంత్ర భారతంలో అత్యధిక కాలం పదవిలో కొనసాగిన రికార్డు తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూది. భారత రాజ్యాంగం అమలులోకి రావడానికి 2 ఏళ్ల 4 నెలల ముందు అంటే–1947 ఆగస్ట్ 15న ప్రధానిగా ప్రమాణం చేసిన నెహ్రూజీ 1964 మే 27న కన్నుమూసే వరకూ పదవిలో కొనసాగారు. ఆయన దేశ ప్రధానిగా 16 ఏళ్ల 286 రోజులు పదవిలో ఉండి సృష్టించిన రికార్డును ఈరోజుల్లో తిరగరాయడం కష్టమేనని రాజకీయ పండితులు భావిస్తున్నారు. నెహ్రూ మరణానంతరం తాత్కాలిక ప్రధాని గుల్జారీలాల్ నందా 13 రోజుల పాలన తర్వాత కాంగ్రెస్ తరఫున ప్రధాని అయిన లాల్ బహదూర్ శాస్త్రీ 1966 జనవరి 11న గుండెపోటుతో మరణించడంతో ఆయన పదవిలో ఉన్నది ఏడాది 216 రోజులే. శాస్త్రీ జీ తర్వాత మళ్లీ తాత్కాలిక ప్రధానిగా 13 రోజుల జీఎల్ నందా సర్కారు దిగిపోయాక 1966 జనవరి 11న తొలిసారి ప్రధాన మంత్రి పదవి చేపట్టిన నెహ్రూ జీ కుమార్తె ఇందిరాగాంధీ వరుసగా 1967, 1971 ఎన్నికల్లో కాంగ్రెస్‌ను విజయపథంలో నడిపించారు. ఇందిరమ్మ 1977 మార్చి ఎన్నికల్లో పార్టీ ఓడిపోయే వరకూ పదవిలో కొనసాగారు. తండ్రి తర్వాత కుమార్తెదే రికార్డు: ఇందిరమ్మ వరుసగా 11 ఏళ్ల 59 రోజులు ప్రధానిగా అధికారంలో కొనసాగి, తండ్రి నెహ్రూ తర్వాత ఎక్కువ కాలం పదవిలో కొనసాగిన రికార్డు స్థాపించారు. 1980 జనవరి 14న చివరిసారి ప్రధాని అయిన ఇందిరమ్మ 1984 అక్టోబర్ 31న హత్యకు గురికావడంతో ఆమె చివరి పదవికాలం 4 ఏళ్ల 291 రోజులకే ముగిసింది. ఇందిరమ్మ వారసుడిగా అధికారంలోకి వచ్చిన ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ 1984 డిసెంబర్ లోక్ సభ ఎన్నికల తర్వాత రెండోసారి ప్రధానిగా ప్రమాణం చేశారు. కాని క్లిష్ట రాజకీయ పరిణామాల కారణంగా ప్రధానిగా ఆయన కొనసాగిన మొత్తం కాలం 5 ఏళ్ల 32 రోజులే. రాజీవ్ తర్వాత ప్రధానులైన వి.పి.సింగ్, చంద్రశేఖర్ లలో ఏ ఒక్కరూ ఏడాది పాటు ప్రధానిగా కొనసాగలేకపోయారు. వారి తర్వాత ప్రధాని అయిన కాంగ్రెస్ అధ్యక్షుడు పీవీ నరసింహారావు మరుసటి ఎన్నికల వరకూ దాదాపు ఐదేళ్లు అధికారంలో ఉన్నారు. కమల సారథ్యం 1990లో దేశంలో బీజేపీ బలపడిన క్రమంలో ఈ పార్టీ అగ్రనేత అటల్ బిహారీ వాజపేయి మొదటిసారి 1996లో ప్రధానిగా ప్రమాణం చేసి మెజారిటీ లేక రెండు వారాలకే దిగిపోవాల్సివచ్చింది. ఆయన తర్వాత ప్రధానులైన జనతాదళ్ నేతలు హెచ్డీ దేవెగౌడ, ఐకే గుజ్రాల్ లలో ఏ ఒక్కరూ కూడా ఏడాది కాలం పదవిలో కొనసాగలేకపోయారు. 1998, 1999 పార్లమెంటు మధ్యంతర ఎన్నికల తర్వాత వరుసగా రెండుసార్లు బీజేపీ నేతగా ప్రధాని అయిన వాజపేయి ఈ రెండు సార్లు కలిపి మొత్తం 6 ఏళ్ల 64 రోజులు అధికారంలో ఉన్నారు. చదవండి: భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యం: సుస్థిరత నుంచి సుస్థిరతకు! వాజపేయి పదవీకాలాన్ని డా.మన్మోహన్, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ.. ఇద్దరూ దాటేశారు. ప్రధానిగా మోదీ వచ్చే ఏడాది మే నెలలో పదేళ్లు పూర్తిచేసుకుని మన్మోహన్ రికార్డును సమం చేసే అవకాశాలు సుస్పష్టమే. అయితే, వరుసగా 11 సంవత్సరాల 59 రోజులు ప్రధాని పదవిలో కొనసాగిన (నెహ్రూ తర్వాత రెండో రికార్డు) ఇందిరాగాంధీ రికార్డును దాటిపోయే అవకాశం బీజేపీ రెండో ప్రధానికి 2024 లోక్ సభ ఎన్నికల ఫలితాలు కల్పిస్తాయా? అనే విషయం ఏడాదిలో తేలిపోతుంది. -విజయసాయిరెడ్డి, రాజ్యసభ సభ్యులు, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు -
కుదిరి చెదిరిన ఒప్పందం
దీర్ఘకాల సరిహద్దు ఘర్షణలను పరిష్కరించే ఒక ఒప్పందం భారత్, పాకిస్తాన్ మధ్య దాదాపుగా కుదిరినట్లు కనిపించిందని సతీందర్ లాంబా పుస్తకం ‘ఇన్ పర్స్యూట్ ఆఫ్ పీస్’ వెల్లడిస్తోంది. ఈ ఒప్పందం కోసం ఇరుదేశాలు తెరవెనుక చర్చలను విస్తారంగా కొనసాగించాయనీ, దాదాపు సంతకాల దాకా వచ్చాయనీ ఈ పుస్తకం చెబుతోంది. 2014 సార్వత్రిక ఎన్నికలపై భారత్ దృష్టి పెట్టిన తర్వాత ఈ ప్రక్రియ నత్తనడక నడిచి ఆగిపోయింది. ఈ ఒప్పందం కుదిరివుంటే, చరిత్రే మారిపోయేది. ఈ ఒప్పంద ప్రక్రియను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని ఇరుపక్షాలూ భావిస్తే దానికి అవసరమైన మార్గదర్శక సూత్రాలు సిద్ధంగా ఉన్నాయని ఈ పుస్తకం గట్టిగా చెబుతోంది. మాజీ రాయబారి సతీందర్ లాంబా రచించిన పుస్తకం ‘ఇన్ పర్సూ్యట్ ఆఫ్ పీస్’ విషాదకరంగా ఆయన మరణానంతరం ప్రచురితమైంది. అయితే భారత్, పాకిస్తాన్ బ్యాక్ చానెల్‌కు (గుప్త లేదా ద్వితీయ శ్రేణి సమా చార బదిలీ మార్గం) సంబంధించిన అద్భుతమైన వివరాలను ఈ పుస్తకం వెల్లడించింది. అలాగే రెండు దేశాలు ఒప్పందానికి ఎంత సమీపానికి వచ్చాయో కూడా ఇది చక్కగా వివరించింది. యూపీఏ ప్రభుత్వ రెండో పాలనా కాలంలో, ప్రధానిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ పదేళ్ల పాలన చివరలో ఈ ముసాయిదా ఒప్పందంపై సంతకాలు చేయడానికి కూడా అంగీ కారం కుదిరిందని ఈ పుస్తకం నిర్ధారిస్తోంది. ‘2003 మే నుంచి 2014 మార్చి వరకు బ్యాక్ చానెల్ సమా వేశాలు 36 జరిగాయి’ అని నాకు తెలిసిన సతీ (సతీందర్) రాశారు. ఈ ఒప్పందంలో చాలావరకు జనరల్ ముషారఫ్ హయాంలో ముగింపునకు వచ్చింది. ఆయన అధికారం కోల్పోయిన తర్వాత ఏమీ జరగ లేదు. కానీ నవాజ్ షరీఫ్ ‘ఈ ప్రక్రియకు కొత్త ఊపును, వేగాన్ని తీసు కొచ్చారు’. దురదృష్టవశాత్తూ, ఆ తర్వాత ‘భారత్ దృష్టి 2014 సార్వ త్రిక ఎన్నికల వైపు మళ్లింది.’ నేను అనుకునేది సరైనదే అయితే, రెండు సందర్భాల్లో ఇరుదేశాల మధ్య ఒప్పందం కుదిరే పరిస్థితులు ఏర్పడ్డాయి. మొదట 2007లో అది సాధ్యపడేట్టు కనిపించింది కానీ ముషారఫ్‌కు ఉన్న ‘అంతర్గత సమస్యల’ వల్ల వీగిపోయింది. ఇక రెండోది– ఇది నా వ్యాఖ్యానం – ఎన్నికల వైపు దృష్టిని భారత్ మరల్చడానికి ముందుగా నవాజ్ షరీఫ్ కాలంలో! అనూహ్య ఘటన అయితే, మోదీ గెలుపుతో ఆశలేమీ పోలేదు. ‘బ్యాక్ చానెల్ ప్రక్రియను కొనసాగించాలనే ఉద్దేశం ఉన్నట్లు కనిపించింది’ అని సతీ పేర్కొన్నారు. ‘ఈ అంశంపై ఫైల్ని సమీక్షించారు. ఈ ఒప్పందంలో ఎలాంటి ముఖ్యమైన మార్పూ ఉండబోదని కూడా నాకోసారి చెప్పారు. ప్రత్యేక దూతగా ఒక విశిష్ట రాయబారిని నియమించాలని కూడా ప్రధానమంత్రి మోదీ భావించారు. నన్ను ఆయన్ని కలవాలని కోరారు.’ కానీ ఆ రాయబారిని నియమించనేలేదు. మోదీ ప్రభుత్వం 2017 ఏప్రిల్‌లో మరోసారి ఆ ఒప్పందం కోసం ప్రయత్నించింది. ‘ప్రధాని కార్యాలయంలోని సీనియర్ అధికారి ఒకరు నన్ను కలవడానికి మా ఇంటికొచ్చారు. పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌తో భేటీ కావడానికి మీరు పాకిస్తాన్ వెళ్లాలని ప్రధాని కోరుకుంటున్నారని ఆయన నాతో చెప్పారు’. అయ్యో! అయితే, భారత్ తరహా ఒక పరిణామం దీన్ని మొగ్గలోనే తుంచేసింది. షరీఫ్‌తో చర్చించాల్సిన అంశాల వివరాలతో పాటు పాకిస్తాన్‌కు ప్రయాణించడానికి అవసరమైన ట్రావెల్ డాక్యుమెంట్లను ఇవ్వాలని సతీందర్ కోరి, వాటికోసం వేచి ఉన్నారు. కానీ ఆ తరుణంలోనే విచిత్రమైన ఘటన జరిగింది. ‘దూతగా వ్యవహరిస్తున్న ఒక ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త తన వ్యక్తిగత విమానంలో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో భేటీ కావడానికి పాకిస్తాన్ వెళ్లారనే వార్తను నేను చూశాను. అలాంటి పరిస్థితుల్లో ఒకే ఉద్దేశం కోసం పాక్ ప్రధాని వద్దకు వెళ్లడానికి ఇద్దరు వ్యక్తులు ప్రాతినిధ్యం వహించడం సరైంది కాదు.’ ఆ వ్యాపారవేత్త పేరు సతీందర్ బయటపెట్టలేదు. అయితే ఆయన సజ్జన్ జిందాల్ కావచ్చునని పాకిస్తాన్ హైకమిషనర్‌గా పనిచేసిన అబ్దుల్ బాసిత్ అన్నారు. ‘ఈ అంశం మీద నేను జరిపిన చివరి సంభాషణ ఇదే’ అని సతీందర్ రాశారు. మన్మోహన్ సింగ్ పాలనలో ఇరుదేశాల మధ్య ఒప్పందం దాదాపుగా ఫలవంతమయ్యేటట్టు కనిపించిందని సతీందర్ చెప్పిన వివరాలు స్పష్టం చేస్తున్నాయి. ‘ప్రధాని మన్మోహన్‌తో నేను 68 సార్లు కలిసినట్లు నా డైరీ గుర్తుచేసింది’. పైగా ‘ఈ పరిణామాల గురించిన మొత్తం సమాచారం ప్రణబ్ ముఖర్జీకి తెలియజేయడమైంది’. 2006 నవంబర్‌లో సోనియాగాంధీకి ఈ ఒప్పంద వివరాలు తెలపడం జరిగింది. అంతకుముందు 2005లో ఆర్మీ చీఫ్ ఈ విషయంలో పాలు పంచుకున్నారు. పైగా అటల్ బిహారీ వాజ్‌పేయి, ఎల్కే అడ్వాణీ, బ్రజేశ్ మిశ్రా, ఫరూఖ్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, ముఫ్తీ మహమ్మద్ సయీద్, కరణ్ సింగ్, గులామ్ నబీ ఆజాద్‌లకు కూడా ఈ సమా చారం అందించడం జరిగింది. ఈ ఒప్పందం ఫలితం భారత రాజ్యాంగానికీ, జమ్ము–కశ్మీర్ రాజ్యాంగానికీ, పార్లమెంటరీ తీర్మానాలకూ అనుగుణంగా ఉండేలా ప్రయత్నాలు జరిగాయి. ప్రధాన న్యాయ మూర్తి ఆనంద్‌తో 2006 మార్చి నుంచి 2007 మార్చి మధ్యలో సతీందర్ ఆరుసార్లు సమావేశమయ్యారు. ప్రఖ్యాత న్యాయవాది ఫాలీ నారిమన్‌ను కూడా కలిశారు. సరిహద్దులు మారవు ముషారఫ్ నాలుగు సూత్రాల(ఫోర్–పాయింట్ ఫార్ములా)పై, మన్మోహన్ సింగ్ అమృత్‌సర్‌లో చేసిన ప్రసంగంలోని మూడు ఆలోచనలపై ఈ ఒప్పందం ఆధారపడింది. ఈ చర్చలకు పెట్టుకున్న 14 మార్గదర్శక సూత్రాలను సతీందర్ పేర్కొన్నారు. వాటిల్లో కొన్ని: ‘సరిహద్దులను తిరగరాసే ప్రసక్తి లేదు.’ ‘ఎల్ఓసీ(నియంత్రణ రేఖ)కి ఇరువైపులా, ముఖ్యంగా జనం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సైనిక కదలికలను కనిష్ఠ స్థాయిలో ఉంచాలి.’ ‘నియంత్రణ రేఖకు ఇరు వైపులా అంతర్గత నిర్వహణ కోసం స్వయంపాలనను ఏర్పర్చాలి.’ ‘నియంత్రణ రేఖకు ఇరువైపులా ఉన్న ప్రజలు ఒక వైపు నుంచి మరొక వైపునకు వెళ్లడానికి స్వేచ్ఛ ఉండాలి.’ అలాగే, ‘ప్రభుత్వ విధానంగా ఉగ్రవాదాన్ని ఉపయోగించకుండా, తన భూభాగాన్ని రాజ్యేతర శక్తులకు అనుమతించకుండా పాక్ కట్టడి చేయాలి’. ఈ ఒప్పందం జరిగివుంటే, ‘చరిత్ర క్రమాన్ని మార్చివేయడం సాధ్యపడేది’. అయితే ఇప్పటికి కూడా ఇది ముగిసిపోలేదని సతీందర్ సూచిస్తున్నారు. ‘ఈ ఒప్పంద సంభావ్యత ఇప్పటికీ ఉనికిలో ఉంది. ముసాయిదా ఒప్పంద సూత్రాలు కానీ, దాని పాఠం కానీ ఇప్పటికీ ఉన్నాయి. ఒప్పంద ప్రక్రియను పునరుద్ధరించాల్సిన ఆవశ్యకత ఉందని ఇరుపక్షాలూ భావించినప్పుడు ఎప్పుడైనా దాన్ని మొదలు పెట్టవచ్చు’. నేననుకోవడం ఆశ అనేది నిత్యవసంతం! - కరణ్ థాపర్, వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
పీవీ మధ్యే మార్గమే దేశానికి రక్ష!
సాక్షి, హైదరాబాద్: రాజకీయంగా భిన్న పార్టీలకు చెందిన వారైనప్పటికీ.. మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, అటల్ బిహారీ వాజ్‌పేయిలు ఒకే నాణేనికి ఉన్న రెండు పార్శ్వాలని ప్రఖ్యాత జర్నలిస్టు, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ సలహాదారు సంజయ్ బారు అభిప్రాయడ్డారు. దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందింది... అన్ని రంగాల్లోనూ ముందంజ వేసింది కూడా పీవీ, వాజ్‌పేయి, మన్మోహన్సింగ్ల ఏలుబడిలోనే అని ఆయన గణాంకాలతో సహా వివరించారు. పీవీ గ్లోబల్ ఫౌండేషన్ శనివారం ఏర్పాటు చేసిన పీవీ స్మారకోపన్యాస కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 1950ల నుంచి 2015 వరకూ దేశ ఆర్థికాభివృద్ధిని పరిశీలిస్తే.. 2000 – 2015 మధ్యకాలంలోనే సగటు ఆర్థికాభివృద్ధి అత్యధికంగా 7.5 శా తంగా నమోదైందని, ఈ కాలంలోనే దేశంలో పేదరికం గణనీయంగా తగ్గిందని తెలిపారు. 2015 తరువాత వృద్ధి తిరోగమనంలో ఉందని, కోవిడ్–19 విజృంభించిన ఏడాది రుణాత్మక వృద్ధిని మినహాయిస్తే 2014– 2023 మధ్యకాలంలో సగటున 6 శాతం మాత్రమే వృద్ధి నమోదైందని చెప్పారు. 1990లో ప్రధానిగా పీవీ చేపట్టిన ఆర్థిక సంస్కరణల ప్రభా వం 2000 సంవత్సరం నుంచి కనిపించడం మొదలైందని అన్నారు. మధ్యే మార్గంతో వృద్ధి పథంలోకి... 1990 వరకూ దేశంలో పేరెన్నిక కంపెనీలంటే ఓ వందకు మించి ఉండేవి కాదని, టాటా, బిర్లాలు, మోడీ, గోయాంకా, సింఘానియా, థాపర్లు వంటి పేర్లే ప్రతి రంగంలోనూ వినిపించేవని సంజయ్ బారు గుర్తు చేశారు. 1991లో పీవీ నరసింహారావు ఆర్థిక సరళీకరణ విధానాలను అవలంబించడం మొదలుపెట్టి.. పరిశ్రమల శాఖ మంత్రిగా వాటి అమల్లోనూ ముందున్న ఫలితంగా అంబానీలు మొదలుకొని మహింద్రా, ప్రేమ్‌జీ, ఇన్ఫోసిస్, టీవీఎస్ గ్రూపు వంటి దిగ్గజాలు ఎదిగాయని చెప్పారు. పీవీ ప్రధానిగా రోజుకో సవాలును ఎదుర్కొన్నా మధ్యే మార్గమన్న తారకమంత్రంతో వాటి ని అధిగమించారని రాజకీయ, ఆర్థిక విధానాల్లోనూ ఇదే రీతిన పాలన సాగిందని చెప్పారు. ఆధిపత్య రాజకీయాలతో చేటు...: పీవీ నరసింహరావు, అటల్ బిహారీ వాజ్‌పేయి, మన్మోహన్ సింగ్‌లు భారత జాతీయత పునాదులను పటిష్టం చేయడం ద్వారా ఆర్థికంగాఎదిగేందుకు సాధికారికంగా మెలిగేందుకు కారణమయ్యారని స్పష్టం చేశారు. రాజకీయ, ఆర్థిక ఆధిపత్యభావజాలం ఈ దేశానికి గతంలోనూ నష్టం కలుగజేసిందని, ఇప్పుడు జరిగేది కూడా అదేనని, దేశ కీర్తిని గతంలో తగ్గించినట్టే ఇప్పుడూ తగ్గిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. పీవీ తరహాలోనే అందరినీ కలుపుకుని పోయే రాజకీయాలు, మధ్యేమార్గాలు మాత్రమే మనల్ని రక్షించగలవని సంజయ్‌బారు అభిప్రాయపడ్డారు. భారత రత్నకు అన్ని విధాలుగా అర్హుడు పీవీ అని.. మన్మోహన్ ఏలుబడిలో ఆయనకు ఈ అవార్డు దక్కకపోవడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. కార్యక్రమంలో పీవీ గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ పీవీ ప్రభాకర్ రావు, సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వి.వి.లక్ష్మీనారాయణ, సీనియర్ పాత్రికేయులు కె.రామచంద్రమూర్తి, మా శర్మ తదితరులు పాల్గొన్నారు. -
క్షమించండి అంటూ నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు... షాక్‌లో బీజేపీ
భోపాల్: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ మధ్యప్రదేశ్‌లో నాసిరకంగా నిర్మించిన రహదారి విషయమై ప్రజలకు బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. పొరపాటు జరిగితే క్షమాపణలు కోరడానికి వెనుకడుగు వేయనని అన్నారు. ఈ మేరకు ఆయన మధ్యప్రదేశ్‌లో జబల్పూర్లోని ఒక అవార్డుల పంక్షన్లో ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన జబల్పూర్ హైవేకి 63 కి.మీ బరేలా నుంచి మండలానికి సుమారు రూ. 400 కోట్లతో నిర్మించిన రహదారి నాసిరకంగా ఉందంటూ బాధపడ్డారు. దీని గురించి అధికారులతో మాట్లాడాను. ప్రాజెక్టు నిలిపివేయడమో లేక మరమ్తతులు చేయడమో చేస్తాను లేదా కొత్త టెండర్ వేయించి మంచి రహదారి అందించేలా చూస్తానని అన్నారు. ఇప్పటి వరకు మీరంతా ఈ రహదారి కారణంగా ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఎదర్కొన్నందుకు క్షమాపణలు కోరుతున్నాను అని అన్నారు. గడ్కరీ గతంలో తన హాయాంలో మధ్యప్రదేశ్‌కి రూ. 6 లక్షల విలువైన రోడ్డు ఇస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఆ విషయమై భూసేకరణ, అడవుల తొలగింపు వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు కూడా. ఆ తర్వాత ఫంక్షన్ చివరిలో కాంగ్రెస్ గూర్చి అన్యూహ్యమైన వ్యాఖ్యలు చేసి బీజేపీని షాక్‌కి గురి చేశారు. ఈ మేరకు ఆ ఫంక్షన్లో మాట్లాడుతూ...2004 నుంచి 2014 మధ్య రెండు కాంగ్రెస్ ప్రభుత్వాలకు నాయకత్వం వహించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తన ఆర్థిక సంస్కరణలతో సరికొత్త సరళీకరణకు దిశా నిర్ధేశం చేశారంటూ ప్రశంసించారు. ఈ విషయమై దేశం ఆయనకు ఎంతగానో రుణపడి ఉంటుందని కొనియాడారు గడ్కరీ. ఐతే గడ్కరీ ఒక్కోసారి చేసే వ్యాఖ్యలు బీజీపీని ఇబ్బందుల్లోకి నెడుతుంటాయి. (చదవండి: కేరళ గవర్నర్‌కు షాక్.. వర్సిటీల ఛాన్సలర్‌గా తప్పించేందుకు సిద్ధమైన సర్కార్) -
మన్మోహన్ సింగ్‌పై గడ్కరీ ప్రశంసల జల్లు
న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత, కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. రాజ్యసభ ఎంపీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌పై ఆయన ప్రశంసల జల్లు గుప్పించారు. ఆర్థిక సంస్కరణలకుగానూ దేశం మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు రుణపడి ఉందని గడ్కరీ మంగళవారం టీఐవోఎల్-2022 అవార్డుల కార్యక్రమంలో పేర్కొన్నారు. దేశంలోని పేదలకు ప్రయోజనాలు అందించాలంటే ఉదారవాద ఆర్థిక విధానం అవసరం. 1991లో ఆర్థిక మంత్రిగా మనోహ్మన్ సింగ్ ప్రారంభించిన ఆర్థిక సంస్కరణలు.. ఉదారవాద ఆర్థిక వ్యవస్థకు నాంది పలికి మన దేశానికి కొత్త దిశానిర్దేశం చేశాయి. సరళీకరణతో కొత్త దిశానిర్దేశం చేసిన మన్మోహన్ సింగ్‌కు ఈ దేశం రుణపడి ఉంది అని గడ్కరీ పేర్కొన్నారు. మాజీ ప్రధాని సింగ్ ప్రారంభించిన ఆర్థిక సంస్కరణల కారణంగానే 1990ల మధ్యకాలంలో తాను మహారాష్ట్రలో మంత్రిగా ఉన్నప్పుడు రోడ్లు నిర్మించడానికి డబ్బును సేకరించగలిగానని గడ్కరీ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఏ దేశమైనా అభివృద్ధిలో ఉదారవాద ఆర్థిక విధానం ఎంతగానో దోహదపడుతుందని, అందుకు చైనా మంచి ఉదాహరణ అని గడ్కరీ అన్నారు. ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడానికి, భారత్‌కు మరిన్ని క్యాపెక్స్ పెట్టుబడి అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదీ చదవండి: ‘ఒకే భూమి.. ఒకే కుటుంబం.. ఒకే భవిష్యత్తు’ -
మనవాళ్లే లైట్ తీసుకున్నారు.. ఇక వాళ్లు ఫోటో పెడతారా?
మనవాళ్లే లైట్ తీసుకున్నారు.. ఇక వాళ్లు ఫోటో పెడతారా? -
అండర్ అచీవర్!
భారత ప్రధాని (2004–2014) మన్మోహన్ సింగ్‌ను ‘ది అండర్‌అచీవర్’గా ‘టైమ్’ మ్యాగజీన్ తన ముఖచిత్ర కథనంలో అభివర్ణించింది. దేశ ఆర్థిక సంస్కరణల విషయమై సింగ్ అనుకున్నంతగా ఏమీ సాధించలేకపోయారని రాసింది. ‘ది అండర్‌అచీవర్ : ఇండియా నీడ్స్ రీబూట్’ (తక్కువ సాధించిన వ్యక్తి : పునరుత్తేజ అవసరంలో ఇండియా) అనే శీర్షికతో వచ్చిన ఈ కథనం భారతదేశ రాజకీయాల్లో కలకలం రేపింది. ధ్వని లేని గుంభనత్వంతో కూడిన సింగ్ ఆత్మవిశ్వాసపు వెలుగు క్షీణించడం మొదలైందని, ఆర్థికమంత్రిగా ఉన్నప్పుడు దేశ పురోగమనం కోసం ఆయనే ప్రవేశపెట్టిన ఆర్థిక సరళీకరణల నుంచి సింగ్ దూరం అవుతున్నారంటే, ప్రధానిగా ఆయన తన నిష్క్రియాశీలతతో సొంత మంత్రివర్గ సభ్యుల మీదే నియంత్రణ కోల్పోయారని స్పష్టం అవుతోందని ‘టైమ్’ సుదీర్ఘ కథనాన్ని అందించింది. దీనిపై మన్మోహన్ సింగ్ గానీ, కాంగ్రెస్ గానీ బహిరంగంగా ఏమీ వ్యాఖ్యానించలేదు. ప్రతిపక్షాలు మాత్రం టైమ్ కథనాన్ని ఒక ఆయుధంగా మలుచుకునే ప్రయత్నం చేశాయి. ఇదే ఏడాది మరికొన్ని పరిణామాలు అజ్మల్ కసబ్‌కు ఉరి (నవంబర్ 21) భారత్‌లోని అజ్మీర్ షరిఫ్ దర్గా సందర్శనకు పాక్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ వ్యక్తిగత పర్యటన. 5000 కి.మీ. దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగల అగ్ని–5 ను ప్రయోగించిన భారత్. భారత పార్లమెంట్ 60వ వార్షికోత్సవం. భారత 13వ రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ. దారాసింగ్, రాజేశ్ ఖన్నా, వర్ఘీస్ కురియన్, యశ్ చోప్రా, బాల్ థాక్రే, ఐ.కె.గుజ్రాల్, రవిశంకర్.. కన్నమూత. (చదవండి: చైతన్య భారతి: ‘గాంధీ’కి ఆస్కార్ డిజైనర్ భాను అథియా) -
తమిళనాడు గవర్నర్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, చెన్నై: తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదాన్ని ఉద్దేశిస్తూ తుపాకీ ఉపయోగించే వారికి తుపాకీతోనే సమాధానం చెప్పాలంటూ వ్యాఖ్యానించారు. 2008 నవంబర్ 11న ముంబైలో పేలుళ్ల ఘటన జరిగిన నెలల్లోనే ఉగ్రవాదంపై పాకిస్థాన్‌తో భారత్ కుదుర్చుకున్న ఒప్పందాన్ని తప్పుబట్టారు. ఈ మేరకు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘అంతర్గత భద్రతకు సమకాలీన సవాళ్లు’ అనే అంశంపై కొచ్చిలో ఆదివారం గవర్నర్ మాట్లాడారు. నవంబర్ 11 ముంబైలో జరిగిన ఉగ్రవాద దాడులతో దేశం మొత్తం గాయపడిందన్నారు. ఉగ్రవాదుల కారణంగా దేశమంతా విషాదంలో మునిగిపోతే, ఘటన జరిగి 9 నెలలు గడవకముందే ఇరు దేశాలు (అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్, పాక్ ప్రధాని) తీవ్రవాద బాధితులుగా పేర్కొంటూ సంతకాలు చేశాయని గుర్తు చేశారు. పాకిస్థాన్ మనకు మిత్రదేశమా, లేక శత్రు దేశమా ఈ అంశంలో క్లారిటీ ఉండాలని, కన్ఫ్యూజన్ ఉంకూడదని అన్నారు. పాకిస్థాన్‌పై ప్రతీకార చర్య పుల్వామా ఉగ్రదాడి ఘటన తరువాత సర్జికల్ స్ట్రైక్ ద్వారా పాకిస్థాన్‌కు తగిన బుద్ధి చెప్పామని గవర్నర్ రవి వెల్లడించారు. పుల్వామా దాడి అనంతరం భారత యుద్ద విమానాలు పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి బాలాకోట్ ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశాయని తెలిపారు. భారత్ సర్జికల్ స్ట్రైక్ పేరుతో ప్రతీకార చర్య తీసుకుందని అన్నారు. దీని ద్వారా ఎవరైనా ఉగ్రవాదానికి పాల్పడితే తిరిగి అందుకు తగిన భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందనే వార్నింగ్ ఇచ్చినట్లు చెప్పారు. చదవండి: మంకీపాక్స్‌తో కేరళ వాసి మృతి.. కేంద్రం కీలక నిర్ణయం మన్మోహన్పై మండిపాటు మన్మోహన్ సింగ్ నాటి పాలనతో పోలిస్తే ప్రస్తుతం భారత అంతర్గత భద్రత మెరుగ్గా ఉందని వ్యాఖ్యానించారు. ఆయన సమయంలో అంతర్గత భద్రతకు మావోయిస్టుల ముప్పు ఎక్కువగా ఉండేదని గవర్నర్ ఆరోపించారు. అప్పట్లో తీవ్రవాదుల హింస 185 జిల్లాల్లో ఉండేదని, ఇప్పుడు ఆ సంఖ్య 8 జిల్లాలకు తగ్గినట్లు వెల్లడించారు. ప్రజలు తీవ్రవాదాన్ని తిరస్కరించి సాధారణ పరిస్థితులకు సహకరించడం వల్లే ఇదంతా సాధ్యమైందన్నారు కశ్మీర్‌పై రవి మాట్లాడుతూ.. హింసను సహించేది లేదని స్పష్టం చేశారు. తుపాకీ ఉపయోగించే వారికి తుపాకీతోనే సమాధానం చెప్పాలన్నారు. దేశ సమైక్యత, సమగ్రతకు వ్యతిరేకంగా మాట్లాడే వారితో చర్చలు ఉండవని స్పష్టం చేశారు. గత ఎనిమిదేళ్లలో ఎలాంటి సాయుధ గ్రూపుతోనూ చర్చలు జరపలేదని పేర్కొన్నారు. ఒకవేళ జరిగినా రాజకీయాలకు తావులేకుండా.. మావోయిస్టుల లొంగిపోవడం, పునరావాసం కోసమేనని తెలిపారు. మావో ప్రాంతాల్లోని వారికి ప్రత్యేక ఐడియాలజీ ఉంటుందని, వాళ్లు పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానాన్ని నమ్మరని అన్నారు. అయితే తాము దాన్ని అంగీకరించబోమని, ఇక వాళ్లతో చర్చలు అవసరం లేదని గవర్నర్ రవి తెలిపారు. చదవండి: Taiwan News: అమెరికా చైనా మధ్య... తైవాన్ తకరారు.. ఏమిటీ వివాదం? -
ఈ ప్రముఖుల గురించి చాలా మందికి తెలియని ఆసక్తికర విషయాలు
అమీషాకు పింక్ పిచ్చి... నటి అమీషా పటేల్‌కు పింక్ కలర్ అంటే పిచ్చి. ఆమె డ్రెస్‌లు, చీరలు, ఇతరత్రా అలంకరణ వస్తువులతో పాటు దాదాపుగా ప్రతి వస్తువు పింక్ కలర్లో ఉండేలా చూసుకుంటుంది. బద్రీ భామ ఇంట్లో ఆఖరికి గోడలు, తలుపులు, ఫర్నిచర్ కూడా పింక్ మయమేనట. ముఖ్యమంత్రి కాక ముందు బొటిక్ ఓనర్.. ఒడిశా మాజీ ముఖ్యమంత్రి.. (దివంగత) బిజు పట్నాయక్ రాజకీయాల్లోకి ప్రవేశించక ముందు బొటిక్ నిర్వహించేవారు.. ‘సైక్డెల్హి’ పేరుతో. ఇది నిజం. న్యూఢిల్లీలోని ఓబెరాయ్ హోటల్లో ఉండేది అది. కాళీ కాదు చిత్రకారిణి.. కలకత్తా కాళీలా గర్జించే మమతా బెనర్జీ చిత్రకళలో మేటి తెలుసా! ఆమె చిత్రాలు ఎక్కువగా మహిళలకు సంబంధించే ఉంటాయి. అందులో కొన్ని చిత్రకళా ప్రదర్శనల్లో అమ్ముడు పోయి అధిక మొత్తంలో కాసులనూ సంపాదించి పెట్టాయి ఆమెకు. ప్రపంచంలో ఒకే ఒక్కడు మన మన్మోహనుడు.. ఆర్థిక సంస్కరణలను అద్భుతంగా అమలు చేసిన ఆర్థికవేత్తగా.. ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ జగద్విదితం. ఆయనకు ఇంకో రికార్డ్ కూడా ఉంది. దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఆయనంత చదువుకున్న.. క్వాలిఫైడ్ ప్రధాని మరొకరు లేరుట. చాంపియన్ ప్రెసిడెంట్.. మన తొలి మహిళా ప్రెసిడెంట్ ప్రతిభా పాటిల్ ఎరుకే కదా! కానీ ఆమె టేబుల్ టెన్నిస్ చాంపియన్ అని తెలుసుండదు. అవును కాలేజీ రోజుల్లో ఆమె టీటీ చాంపియన్. మరీ ఇంత బిజీనా..? సుప్రసిద్ధ రచయిత హరుకి మురకామి డైలీ షెడ్యూల్ ఎంత బిజీగా ఉంటుందో ఓ ఇంటర్వ్యూలో ఆయన.. ‘నేను ఉదయం నాలుగింటికల్లా నిద్రలేస్తాను. లేవగానే రాయడం మీద కూర్చుంటాను అయిదు నుంచి ఆరుగంటల పాటు. మధ్యాహ్నం దాదాపు పది కిలోమీటర్లు నడవడమో.. లేక పదిహేను వందల మీటర్లు స్విమ్ చేయడమో లేదంటే రెండూ ఉంటాయి. ఆ తర్వాత కాసేపు నచ్చిన పుస్తకం చదవడమో.. మ్యూజిక్ వినడమో చేస్తాను. రాత్రి తొమ్మిదింటికల్లా నిద్రకుపక్రమిస్తాను. ఏమాత్రం తేడా లేకుండా. .రాకుండా రోజూ ఇదే షెడ్యూల్ కొనసాగుతుంది’ అంటూ చెప్పుకొచ్చారు. నోట్ చేసుకుంటున్న రిపోర్టర్ చివరి వాక్యం రాసి ఊపిరి పీల్చుకుంటూ నిట్టూర్చాడట. ఆయుష్మాన్ ఖురానా@దంతావధాని బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ ఆయుష్మాన్ ఖురానా.. దంతాల పట్ల చాలా శ్రద్ధ వహిస్తాడు. ఎంతంటే ఆ శ్రద్ధ ఓ అబ్సేషన్ అయ్యేంతగా. సాధారణంగా ఉదయం, రాత్రి రెండు సార్లు బ్రష్ చేసుకుంటాం. కానీ ఆయుష్మాన్.. తరచుగా అంటే రోజులో వీలైనన్ని సార్లు బ్రష్ చేసుకుంటూంటాడట. అందుకే నిత్యం తన వెంట డెంటల్ కేర్ కిట్‌ను క్యారీ చేస్తూంటాడట! -
ఒక సీఈవో.. ఇద్దరు దేశాధినేతలు.. ఓ ఆసక్తికర సన్నివేశం
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రధాని ఒకరు, మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ ఆన్ ఎర్త్‌కి ప్రెసిడెంట్ మరొకరు. వీరిద్దరు ఓ సమావేశంలో కలుసుకున్నారు. అక్కడే ఉన్న ఓ అంతర్జాతీయ సంస్థ సీఈవోని చూస్తూ.. తమ దేశానికి చెందినది అంటే తమ దేశానికి చెందినది అంటూ ఇద్దరు నేతలు పోటీ పడ్డారు. ఈ ఆరుదైన ఘటన 2009లో చోటు చేసుకుంది. భారత ప్రధాని మన్మోహన్ సింగ్ 2009లో అమెరికా పర్యటనకు వెళ్లారు. అక్కడ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తమ దేశం సాధిస్తున్న ప్రగతిని అక్కడి కంపెనీల పనితీరుని ప్రధాని మన్మోహన్‌కి వివరిస్తున్నారు బరాక్ ఒబామా. ఈ క్రమంలో పెప్సీ కంపెనీ వంతు వచ్చింది. 2009లో పెప్సీ కంపెనీకి గ్లోబల్ సీఈవోగా భారత సంతతికి చెందిన ఇంద్రానూయి ఉన్నారు. ఆమెను చూడగానే ప్రధాని మన్మోహన్సింగ్ ఈమె మాలో ఒకరు అని ఒబామాతో అన్నారు. వెంటనే స్పందించిన బరాక్ ఒబామా ‘ ఆహ్! కానీ ఆమె మాలో కూడా ఒకరు’ అంటూ బదులిచ్చారు. శక్తివంతమైన రెండు దేశాలకు చెందిన అధినేతలు తనను మాలో ఒకరు అంటూ ప్రశంసించడం తన జీవితంలో మరిచిపోలేని ఘటన అంటూ ఇంద్రనూయి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆనాడు జరిగిన ఘటనను గుర్తు చేసుకుని సంబరపడ్డారు. భారత సంతతికి చెందిన ఇంద్రానూయి అమెరికాలో స్థిరపడ్డారు. 25 ఏళ్ల పాటు పెప్సీ కంపెనీలో పని చేశారు. అందులో 12 ఏళ్ల పాటు సీఈవోగా కొనసాగారు. ఆమె సీఈవోగా ఉన్న కాలంలో పెప్పీ కంపెనీ రెవెన్యూ 35 బిలియన్ల నుంచి 63 బిలియన్లకు చేరుకుంది. తొలి గ్లోబల్ మహిళా సీఈవోగా ఇంద్రనూయి రికార్డు సృష్టించారు. ఆమె తర్వాత ఇటీవల లీనా నాయర్ ఛానల్ సంస్థకు గ్లోబల్ సీఈవోగా నియమితులయ్యారు. -
ప్రతి సమస్యకు తొలి ప్రధాని నెహ్రునే నిందిస్తున్నారు: మన్మోహన్ సింగ్
న్యూఢిల్లీ: పంజాబ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వీడియా సందేశంలో ప్రజలను కాంగ్రెస్‌కి ఓటు వేయాలని కోరారు. ప్రతి సమస్యకు తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూనే నిందిస్తున్నారంటూ మన్మోహన్ సింగ్ ప్రధాని నరేంద్రమోదీ పై విరుచుకుపడ్డారు. ప్రధానమంత్రి పదవికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉందంటూ ఆక్రోసించారు. అంతేకాదు ఆ వీడియోలో రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ ఎన్నడూ దేశాన్ని విభజించలేదని మోదీకి కౌంటరిచ్చారు. దేశం ద్రవ్యోల్బణం, నిరుద్యోగ సమస్యతో ప్రజలు సతమతమవుతుంటే గత ఏడున్నరేళ్లుగా అధికారంలో ఉన ప్రస్తుతం ప్రభుత్వం తమ తప్పులన ఒప్పుకోకుండా ప్రతి సమస్యకు తొలి ప్రధాని నెహ్రూనే కారణమంటూ ఇప్పటికీ నిందిస్తూనే ఉన్నారని ఆరోపించారు. అంతేకాదు మీరు మీ స్వంత లోపాలను తగ్గించే క్రమంలో చరిత్రను నిందించలేరంటూ వక్కాణించారు. ప్రపంచం ముందు దేశ ప్రతిష్టను పోగొట్టుకోనివ్వను, అలాగే భారతదేశ గర్వాన్ని నేనెప్పుడూ కించపరచలేదంటూ విమర్శలు గుప్పించారు. అంతేకాదు తనపై తప్పడు ఆరోపణలు చేసిన బీజేపీ, ఆ పార్టీకి సంబంధించిన బీ అండ్ సీ టీమ్‌లు గురించి దేశం ముందు బహిర్గతం అవుతున్నందుకు ఆనందంగా ఉందంటూ ఎద్దేవా చేశారు. (చదవండి: సర్జికల్ స్ట్రైక్స్, అయోధ్య విషయంలో వారు సంతోషంగా లేరు! ప్రధాని ఆగ్రహం) -
రాజధాని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం.. కేంద్రం అదే చెప్పింది: మంత్రి బొత్స
సాక్షి, విజయనగరం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విభజన చట్టంలో ఇచ్చిన హామీ అని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యసభలో అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్సింగ్ ప్రత్యేక హోదాపై హామీ ఇచ్చారు. సీఎం జగన్ ఆ హామీని నెరవేర్చమని కేంద్రాన్ని అడుగుతున్నారు. మూడు రాజధానులు, పరిపాలన వికేంద్రీకరణ మా ప్రభుత్వ విధానం. రాజధాని ఎక్కడ అనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం. కేంద్రం కూడా అదే చెప్పింది అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. చదవండి: (కొత్త జిల్లాల్లో కార్యాలయాలన్నీ ఒకే చోటు: విజయ్ కుమార్)