పుణె: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌పై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో ప్రధానిగా ఉన్న మన్మోహన్ రైతుల సమస్యల పరిష్కారంపై సానుకూలంగా ఉండేవారని ప్రస్తుతం రైతుల సమస్యలను పట్టించుకునే వారే లేరన్నారు. రైతుల ఆత్మహత్యల గురించి తెలుసుకుని ప్రధానిగా ఉన్నపుడు మహారాష్ట్ర అమరావతి ప్రాంతంలో మన్మోహన్ పర్యటించారని పవార్ తెలిపారు.
‘మన్మోహన్ సింగ్ సామాన్య ప్రజలు, రైతుల సమస్యల పట్ల సున్నితంగా వ్యవహరించేవారు. అందుకే ఆయన రూ.72 వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేశారు. ప్రస్తుతం దేశంలో రైతుల సమస్యల వైపు కన్నెత్తి చూశే వారు లేరు’ అని పవార్ అన్నారు. పుణెలోని శేట్కారి ఆక్రోశ్ మోర్చా సమావేశంలో మాట్లాడుతూ పవార్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇదే కార్యక్రమంలో మాట్లాడిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంలు లేకుండా బీజేపీ కనీసం గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా గెలవలేదని ఎద్దేవా చేశారు. బీజేపీ పొత్తు ఈవీఎంలతోనేనన్నారు. ఈ కార్యక్రమానికి శివసేన(యూబీటీ)నేత ఉద్ధవ్ థాక్రేతో పాటు కాంగ్రెస్ నేత బాలాసాహెబ్ థోరట్, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే తదితరులు హాజరయ్యారు.
ఇదీచదవండి..సన్‌బర్న్ షోలో ‘శివుడి ఫొటో’.. నిర్వాహకులపై ఫిర్యాదు
Comments
Please login to add a commentAdd a comment