Pawar
-
‘అమ్మాయిపై చెయ్యేస్తే నపుంసకుడిని చెయ్యాలి’
దేశంలో అత్యాచార ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. ఇటువంటి ఉదంతాలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి ప్రభుత్వాల నిర్లక్ష్యమే కారణమంటూ పలువురు విమర్శిస్తున్నారు. తాజాగా మహారాష్ట్రలోని బద్లాపూర్ మరో అత్యాచారం ఉదంతం వెలుగు చూసింది.ఈ ఘటనకు కారకులైన వారిపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడపిల్లలపై చేయివేసే వారిని నపుంసకులుగా మార్చాలని ఆయన అన్నారు. ఇలాంటి పనులు చేసేవారికి చట్టం ఉన్నదనే భయాన్ని కల్పించాలని, అప్పుడు ఎవరూ తప్పుడు పనులకు పాల్పడరని అజిత్ పవార్ అన్నారు.యావత్మాల్లో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన బద్లాపూర్ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై నేరాలకు పాల్పడే ఏ ఒక్కరినీ తమ ప్రభుత్వం వదిలిపెట్టబోదన్నారు. ఇటువంటి నేరాలకు కఠిన శిక్షలు విధించాలని కోరుతూ రూపొందించిన బిల్లును మోదీ ప్రభుత్వం రాష్ట్రపతి ముర్ముకు పంపిందన్నారు. ఇది చట్టరూపం దాల్చి, అమలులోకి వస్తే మహిళలకు మరింత న్యాయం జరుగుతుందన్నారు. -
‘శరద్ పవార్‌కు టచ్‌లో 19 మంది అజిత్ వర్గం ఎమ్యెల్యేలు’
ముంబై: లోక్‌సభ ఎన్నికల ముగిసిన తర్వాత మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణమాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్) నేత రోహిత్ పవార్ సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ నేతృత్వంలోని అధికార ఎన్సీపీ నుంచి 18-19 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారనున్నారని తెలిపారు. వచ్చే వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం అజిత్ పవార్ వర్గం ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున ఆ పార్టీకి గుడ్‌బై చెబుతారన్నారు. 2023 జూలైలో ఎన్సీపీలో చీలికలు జరిగినప్పటి నుంచి అజిత్ వర్గంవైపు ఉన్న ఎమ్మెల్యేలు ఎప్పుడూ ఒక్కమాట కూడా ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్, ఇతర సీనియర్ నేతలపై వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయలేదని గుర్తుచేశారు.‘అజిత్ వర్గం ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారు. తమ నియోజకవర్గం అభివృద్ధి పనుల నిధుల కోసం సమావేశాల్లో పాల్గొంటారు. తర్వాత వారంతా అజిత్ వర్గం నుంచి బయటకు వచ్చేస్తారు. 18 నుంచి 19 మంది ఆ పార్టీ ఎమ్మెల్యేలు శరద్‌పవార్‌తో టచ్‌లో ఉన్నారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత శరద్ పవార్ వర్గంలో వారంతా చేరనున్నారు’అని రోహిత్ పవార్ అన్నారు. అజిత్ పవార్ వర్గం రాజ్యసభ ఎంపీప్రఫుల్ పటేల్ మాట్లాడుతూ.. తనకు కేబినెట్ విస్తరణలో కేంద్ర మంత్రి పదవి వస్తుందని చెతున్నారు. అంటే అజిత్ పవార్ వర్గంపై ప్రఫుల్‌కు మంచిపట్టు ఉందని తెలుస్తోంది. కానీ, అజిత్ పవార్ అనుకుంటున్న రాష్ట్ర అభివృద్ధి కోసమా? లేదా తనను ఈడీ నుంచి రక్షించుకోవడానికా? అని రోహిత్ పవార్ నిలదీశారు.ఇటీవల ఎంపీ ప్రఫుల్ పటేల్‌కు ఎన్డీయే ప్రభుత్వం కేంద్రమంత్రి( సంతంత్ర హోదా) పదవి ఆఫర్ ఇస్తే.. దానిని తిరస్కరించిన విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్సీపి( ఎస్పీ) 8, అజిత్ వర్గం ఎన్సీపీ 1 ఎంపీ స్థానాన్ని గెలుచుకుంది. ఇక.. మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జూన్ జూన్ 27 నుంచి జూలై 12 వరకు జరగనున్నాయి. అక్టోబర్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇవే చివరి అసెంబ్లీ సమావేశాలు. -
మన్మోహన్ సింగ్‌పై పవార్ కీలక వ్యాఖ్యలు
పుణె: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌పై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో ప్రధానిగా ఉన్న మన్మోహన్ రైతుల సమస్యల పరిష్కారంపై సానుకూలంగా ఉండేవారని ప్రస్తుతం రైతుల సమస్యలను పట్టించుకునే వారే లేరన్నారు. రైతుల ఆత్మహత్యల గురించి తెలుసుకుని ప్రధానిగా ఉన్నపుడు మహారాష్ట్ర అమరావతి ప్రాంతంలో మన్మోహన్ పర్యటించారని పవార్ తెలిపారు. ‘మన్మోహన్ సింగ్ సామాన్య ప్రజలు, రైతుల సమస్యల పట్ల సున్నితంగా వ్యవహరించేవారు. అందుకే ఆయన రూ.72 వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేశారు. ప్రస్తుతం దేశంలో రైతుల సమస్యల వైపు కన్నెత్తి చూశే వారు లేరు’ అని పవార్ అన్నారు. పుణెలోని శేట్కారి ఆక్రోశ్ మోర్చా సమావేశంలో మాట్లాడుతూ పవార్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదే కార్యక్రమంలో మాట్లాడిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంలు లేకుండా బీజేపీ కనీసం గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా గెలవలేదని ఎద్దేవా చేశారు. బీజేపీ పొత్తు ఈవీఎంలతోనేనన్నారు. ఈ కార్యక్రమానికి శివసేన(యూబీటీ)నేత ఉద్ధవ్ థాక్రేతో పాటు కాంగ్రెస్ నేత బాలాసాహెబ్ థోరట్, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే తదితరులు హాజరయ్యారు. ఇదీచదవండి..సన్‌బర్న్ షోలో ‘శివుడి ఫొటో’.. నిర్వాహకులపై ఫిర్యాదు -
అత్తమీద కోపం.. అల్లుడిపై ప్రతాపం
సాక్షి, మహబూబాబాద్: జిల్లా ఎస్పీ శరత్ చంద్రపవార్‌ను రాష్ట్ర పోలీస్ అకాడమికి బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో డీజీపీ కార్యాలయంలోని మల్టీ ఏజెన్సీ ఆపరేషన్ సెంటర్లో ఎస్పీగా పనిచేస్తున్న చంద్రమోహన్‌ను బదిలీపై జిల్లాకు పంపారు. ఈ మేరకు మంగళవారం ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆకస్మిక బదిలీపై సోషల్ మీడియాలో రకరకాల ప్రచారం జరుగుతోంది. 2021 డిసెంబర్ 26న జిల్లా ఎస్పీగా ఆయన బాధ్యతలు చేపట్టారు. బీఆర్ఎస్ నాయకులు ఏరికోరి తెచ్చుకున్న ఎస్పీ.. ఎన్నికల వరకు ఉంటారని అందరూ భావించారు. అయితే ఎవరు ఊహించని విధంగా 20 నెలల్లో బదిలీ కావడం.. దీని వెనుక ఏం జరిగింది అనేది అటు అధికారులు.. ఇటు రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. ఆకస్మిక బదిలీతో షాక్.. జిల్లా పోలీస్‌బాస్ ఆకస్మిక బదిలీతో ఆశాఖ అధికారులు విస్మయానికి గురయ్యారు. ఎన్నికల బదిలీల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ఐపీఎస్ అధికారులను ట్రాన్స్ఫర్ చేశారు. అప్పుడు జిల్లా ఎస్పీని బదిలీ చేయలేదు. దీంతో ఆయన ఎన్నికల వరకు ఉంటారని అందరు భావించారు. అయితే కుటుంబ సభ్యుల్లో జరిగిన రాజకీయ పరిణామాలే ఆయన బదిలీకి కారణం అని కొందరు చెబుతుండగా.. ఎస్పీపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో శాఖ తీసుకున్న నిర్ణయం అని మరికొందరు చెబుతున్నారు. కుటుంబ రాజకీయ పరిణామాలే కారణమైతే ఎస్పీ బదిలీతోనే ఆగిపోతుంది. అలా కాకుంటే ఎస్పీతో పాటు మరికొందరిపై బదిలీ వేటు పడే అవకాశం ఉందని పలువురు సీనియర్ పోలీస్ అధికారులు చెబుతున్నారు. దీంతో ఎస్పీ బదిలీ వార్తతో ఆయనకు అనుకూలంగా ఉండే అధికారులు మాత్రం ఆందోళనగానే ఉన్నట్లు సమాచారం. ఆ కోపమేనా..? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ తన బిడ్డను ఎస్పీ శరత్చంద్ర పవార్‌కు ఇచ్చి పెళ్లి చేశారు. కాగా అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న ఆమెకు ఈసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వడం లేదు. ఇటీవల విడుదల చేసిన జాబితాలో కూడా ఆమె పేరు లేదు. దీంతో ఆమె మనస్తాపం చెందిగా.. భర్త శ్యాం నాయక్ ఉద్యోగం వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈమేరకు నేడో రేపో రేఖానాయక్ కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఆమె పార్టీ మారకుండా ఉండేందుకు పలువురు బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నించారు. అయినా చర్చలు ఫలించలేదు. దీంతో రేఖానాయక్‌పై కోపంతో ఆమె అల్లుడు ఎస్పీ శరత్ చంద్రపవార్‌ను ప్రాధాన్యత లేని పోస్టుకు బదిలీ చేసినట్లు మానుకోటలో ప్రచారం జరుగుతోంది. -
‘మహా’ ప్రభుత్వం ఇప్పట్లో లేనట్లేనా?
న్యూఢిల్లీ/ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ, గందరగోళం మరికొన్ని రోజులు కొనసాగే పరిస్థితి కనిపిస్తోంది. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ల ప్రభుత్వం ఏర్పడటంపై అనుమానాలు బలపడుతున్నాయి. తదుపరి ప్రభుత్వం తమదేనన్న శివసేన నమ్మకంగా చెబుతున్నా.. ఆ పార్టీకి ఎన్సీపీ, కాంగ్రెస్‌లు మద్దతివ్వడంపై విభిన్న వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో భేటీ అనంతరం ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ మీడియాతో చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ మరింత పెరిగేందుకు కారణమయ్యాయి. ‘సోనియాతో మహారాష్ట్ర రాజకీయాలపై మాట్లాడాను కానీ ప్రభుత్వ ఏర్పాటుపై మా మధ్య ఎలాంటి చర్చ జరగలేదు’ అని పవార్ మీడియాతో చెప్పిన విషయం తెలిసిందే. మరోవైపు, మహారాష్ట్రలో శివసేనను దెబ్బతీసేందుకు బీజేపీ ఎన్సీపీకి దగ్గరవడానికి ప్రయత్నిస్తోందని శివసేన వర్గాలు భావిస్తున్నాయి. ప్రభుత్వ ఏర్పాటులో సహకరిస్తే.. మహారాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించే అవకాశంతో పాటు, పవార్‌కు రాష్ట్రపతి పదవిని బీజేపీ ఆఫర్ చేసినట్లు తమకు తెలిసిందని శివసేన వర్గాలు వెల్లడించాయి. అయితే, బీజేపీకి మద్దతిచ్చే విషయాన్ని సోమవారం శరదపవార్ నిర్ద్వంద్వంగా ఖండించిన విషయం తెలిసిందే. మహారాష్ట్ర రాజకీయాలకు సంబంధించి మంగళవారం పలు పరిణామాలు చోటు చేసుకున్నాయి. శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సంబంధించి ఎన్సీపీ, కాంగ్రెస్‌ల మధ్య ఢిల్లీలో మంగళవారం జరగాల్సిన చర్చలు నేటి(బుధవారం)కి వాయిదా పడ్డాయి. ఇందిరాగాంధీ జయంతి కార్యక్రమాల్లో బిజీగా ఉన్నందున చర్చలను వాయిదా వేద్దామని కాంగ్రెస్ కోరిందని ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ తెలిపారు. నవంబర్ 22న ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలతో శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే సమావేశమవనున్నారు. భవిష్యత్ కార్యాచరణను వారికి వివరించనున్నారు. మరోవైపు, శివసేన నేత సంజయ్‌రౌత్ మంగళవారం ఢిల్లీలో మాట్లాడుతూ.. మహారాష్ట్రలో శివసేన నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని పునరుద్ఘాటించారు. ఈ విషయంలో మీడియానే గందరగోళం సృష్టిస్తోందని విమర్శించారు. పవార్ మీడియాతో సోమవారం చేసిన వ్యాఖ్యలపై ప్రశ్నించగా.. ‘పవార్ వ్యాఖ్యలను అర్థం చేసుకోవడానికి 100 జన్మలు ఎత్తాలి’ అని రౌత్ వ్యాఖ్యానించారు. మహమ్మద్ ఘోరిలాంటి వారే.. తాజాగా మరోసారి బీజేపీపై శివసేన విరుచుకుపడింది. పార్టీ పత్రిక సామ్నాలో బీజేపీని భారత్‌పై 17 సార్లు దండెత్తిన మహమ్మద్ ఘోరితో పోలుస్తూ సంపాదకీయం రాసింది. యుద్ధంలో ఓడిపోయిన ఘోరికి హిందూ రాజు పృథ్వీరాజ్ చౌహాన్ ఎన్నోసార్లు ప్రాణబిక్ష పెట్టాడని, కానీ ఒక్కసారి గెలవగానే ఘోరి పృథ్వీరాజ్ చౌహాన్‌ను చంపేశాడని గుర్తు చేస్తూ.. మహారాష్ట్రలో కొందరి తీరు అలాగే ఉందని, నేరుగా బీజేపీ పేరు ఎత్తకుండా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తమను సవాలు చేసిన బీజేపీని మహారాష్ట్రలో నామరూపాలు లేకుండా చేస్తామని ఆ సంపాదకీయంలో శివసేన ప్రతిన బూనింది. ఎన్డీయే ఏర్పాటులో శివసేనదే కీలక భూమిక అని, ఆ సమయంలో ఇప్పటి బీజేపీ నాయకులంతా బచ్చాలని మండిపడింది. -
వికసించిన పద్మాలు
-
వికసించిన పద్మాలు
• యేసుదాసు, జోషి, పవార్సహా ఏడుగురికి విభూషణ్ • మరో ఏడుగురికి పద్మభూషణ్ • ఇన్నాళ్లూ వెలుగులోకి రానివారికే ఈసారి పట్టం • జాబితాలో 19 మంది మహిళలు సహా 89 మంది న్యూఢిల్లీ: సామాజిక, రాజకీయ, శాస్త్రసాంకేతిక, వైద్య, సంగీత, ఆధ్యాత్మిక, క్రీడా రంగాల్లో విశేష కృషి చేసిన 89 మంది ప్రముఖులతో 2017 సంవత్సరానికి గానూ కేంద్రం పద్మ అవార్డుల జాబితా విడుదల చేసింది. ఇందులో ఏడుగురికి రెండో అత్యున్నత భారత పౌరపురస్కారం పద్మ విభూషణ్, మరో ఏడుగురికి పద్మ భూషణ్, 75 మందిని పద్మ శ్రీ అవార్డులకు ఎంపిక చేశారు. రాజకీయ కురువృద్ధులు మురళీ మనోహర్ జోషి (బీజేపీ), శరద్ పవార్ (ఎన్సీపీ)కు ఈసారి పద్మ విభూషణ్ అవార్డులివ్వనున్నారు. ఇషా ఫౌండేషన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా 70 లక్షల మంది వాలంటీర్లను తయారుచేసిన ఆధ్మాత్మిక సద్గురు జగ్గీ వాసుదేవ్, ప్రొఫెసర్ ఉడిపి రామచంద్రరావు (ఇస్రో మాజీ చైర్మన్), ప్రముఖ గాయకుడు యేసుదాసు కూడా విభూషణ్ జాబితాలో ఉన్నారు. వివిధ భాషల్లో 50వేలకు పైగా సినిమా పాటలు పాడిన యేసుదాసు 1975లో పద్మశ్రీ, 2002లో పద్మ భూషణ్ అవార్డులను అందుకున్నారు. లోక్‌సభ మాజీ స్పీకర్ పీఏ సంగ్మా, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సుందర్‌లాల్ పట్వాలకూ మరణానంతరం పద్మ విభూషణ్ అవార్డులు ఇవ్వనున్నారు. ఈ ఏడాది పద్మ అవార్డుల ఎంపికలో.. దేశానికి, సమాజానికి విశేష సేవలందిస్తున్నా.. ఇన్నాళ్లుగా గుర్తింపునకు నోచుకోని గొప్పవారికే అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. దీనికి అనుగుణంగానే వివిధ రాష్ట్రాల నుంచి జాబితా తెప్పించుకున్నట్లు వెల్లడించింది. మొత్తం 18 వేల నామినేషన్లు (4వేలు ఆన్లైన్లో వచ్చాయి) రాగా అందులోనుంచి 89 మందిని ఎంపిక చేసినట్లు తెలిపింది. ఈసారి పద్మ అవార్డుల్లో మహిళలు 19 మంది, విదేశీయులు–ఎన్నారైలు ఐదుగురుండగా.. మరణానంతరం అవార్డులకు ఎంపికైనవారు ఆరుగురున్నారు. వైద్య, సామాజిక రంగంలో కృషిచేసినవారితోపాటు సంగీత దర్శకులు, గాయకులకు ఈసారి ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. గ్రామీ అవార్డు విజేత, మ్యుజీషియన్ విశ్వ మోహన్ భట్ పద్మ భూషణ్‌కు, గాయకులు కైలాశ్ ఖేర్, అనురాధ పౌడ్వాల్లను పద్మశ్రీ అవార్డులు వరించనున్నాయి. భారత శాస్త్రీయ సంగీతంలో భట్‌కు ప్రత్యేక స్థానముంది. పద్మశ్రీకి ఎంపికవటం పట్ల కైలాశ్ ఖేర్, పౌడ్వాల్‌లు హర్షం వ్యక్తం చేశారు. పండిట్ రవిశంకర్ శిష్యుడైన భట్ ‘మోహన వీణ’ అనే కొత్త రాగాన్ని సృష్టించారు. అయితే సినిమా రంగం నుంచి ప్రముఖులెవరికీ ఈసారి జాబితాలో చోటు దక్కలేదు. ప్రముఖ పాకశాస్త్ర ప్రవీణుడు సంజీవ్ కపూర్, కేరళకు చెందిన ప్రఖ్యాత కథాకళి నృత్యకారుడు చెమంచేరి కున్హిరామన్ నాయర్ (100) కూడా పద్మశ్రీ జాబితాలో ఉన్నారు. క్రీడారంగం నుంచి భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి, రియో ఒలింపిక్స్ తారలు దీపా కర్మాకర్, సాక్షి మాలిక్లూ పద్మశ్రీ అందుకోనున్నారు. పద్మ విభూషణ్ 1. యేసుదాసు. 2. సద్గురు జగ్గీ వాసుదేవ్, 3. శరద్ పవార్, 4. మురళీ మనోహర్ జోషి, 5. ప్రొఫెసర్ ఉడిపి రామచంద్రరావు, 6. సుందర్‌లాల్ పట్వా (మరణానంతరం), 7. పీఏ సంగ్మా (మరణానంతరం) పద్మ భూషణ్ 1. విశ్వమోహన్ భట్, 2. ప్రొఫెసర్ దేవీ ప్రసాద్ ద్వివేది, 3. తెహంతోన్ ఉద్వాదియా, 4. రత్న సుందర్ మహారాజ్, 5. స్వామి నిరంజనానంద సరస్వతి, 6. చో రామస్వామి (మరణానంతరం), 7. యువరాణి మహాచక్రి సిరింధోర్న్ (థాయ్‌లాండ్) మట్టిలో మాణిక్యాలు కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించిన పద్మశ్రీ పురస్కార విజేతల్లో అనేక మంది ఇప్పటివరకు మనకు పెద్దగా పరిచయం లేని వారే. పేరు, ప్రతిష్టల కోసం కాకుండా కేవలం సేవా దృక్పథంతో, అవసరంలో ఉన్న వారికి చేతనైన సాయం చేస్తున్న వీరి వివరాలు క్లుప్తంగా... ⇔ కరీముల్ హక్ (52 ఏళ్లు): పశ్చిమ బెంగాల్‌లోని జల్పాయ్గుడి జిల్లాకు చెందిన ఈయన అంబులెన్స్ దాదాగా గుర్తింపు పొందారు. తేయాకు తోటల్లో పనిచేసే హక్ తన బైక్‌నే అంబులెన్స్‌గా మార్చారు. ఆపదలో ఉన్న వారికి 24 గీ7 సాయం అందిస్తున్నారు. ఆయన తల్లి అనారోగ్యానికి గురైనప్పుడు అంబులెన్సు సౌకర్యం లేక ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని తలచి, అర్థించిన వారికి సాయం చేస్తున్నారు. ⇔ గిరీష్ భరద్వాజ్ (66 ఏళ్లు): కర్ణాటకకు చెందిన ఈయన సామాజిక కార్యకర్త. మారుమూల గ్రామాల్లో నూటికి పైగా చిన్న చిన్న వంతెనలను నిర్మించి పల్లెలను పట్టణాలతో అనుసంధానం చేయడంలో కీలకపాత్ర పోషించి ‘సేతు బంధు’గా పేరు తెచ్చుకున్నారు. ⇔ అనురాధా కొయిరాలా (67 ఏళ్లు): నేపాల్‌కు చెందిన ఈమె 12 వేల మంది మహిళలను వ్యభిచార ముఠాల చెరల నుంచి విడిపించి, పునరావాసం కల్పించడంలో కీలక పాత్ర పోషించారు. మరో 45 వేల మంది స్త్రీలు అక్రమ రవాణాకు గురి కాకుండా అడ్డుకోగలిగారు. ⇔ డా. సుబ్రతో దాస్ (51 ఏళ్లు): ‘హైవే మీసయ్య’గా పేరొందిన దాస్ గుజరాత్‌కు చెందిన వారు. జాతీయ రహదారులపై ప్రమాదాలకు గురైన వారికి వైద్య సేవలు అందించడానికి బాటలు వేసిన వారిలో ఈయన ఒకరు. లైఫ్‌లైన్ ఫౌండేషన్‌ను స్థాపించి 4 వేల కి.మీ జాతీయ రహదారుల పరిధిలో కేరళ, మహారాష్ట్ర, రాజస్తాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో సేవలు అందిస్తున్నారు. ⇔ మీనాక్షి అమ్మ (76 ఏళ్లు): కేరళకు చెందిన మీనాక్షి ఏడేళ్ల వయసులోనే యుద్ధ విద్యలు నేర్చుకుని గత 68 ఏళ్లుగా ఇతరులకు నేర్పిస్తున్నారు. ‘కలరిపయట్టు’అనే యుద్ధ విద్యకు ప్రాచుర్యం కల్పించడానికి కృషి చేస్తున్నారు. ⇔ డా. మాపుస్కర్ (88 ఏళ్లు) : మహారాష్ట్రలోని పుణెకు దగ్గర్లోని దెహు గ్రామానికి చెందిన ఈయన 1960ల నుంచే ఆ పల్లెను బహిరంగ మల,మూత్ర విసర్జన రహిత గ్రామంగా మార్చడానికి కృషి చేశారు. ఈయనకు ‘స్వచ్ఛతా దూత్’అనే పేరుంది. ⇔ గెనాభాయ్ దర్గాభాయ్ పటేల్ (52 ఏళ్లు): గుజరాత్‌కు చెందిన ఈయన దివ్యాంగుడైన రైతు. ఒకప్పుడు కరువుతో అల్లాడిన ఆయన గ్రామం నేడు దానిమ్మ పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే అగ్రగామిగా ఉంది. దీన్ని సాధించడానికి గెనాభాయ్ ఎనలేని కృషి చేశారు. అందుకే ఈయనకు ‘అనార్ దాదా’అనే పేరు కూడా ఉంది. ⇔ బల్వీర్ సింగ్ సీచేవాల్ (51 ఏళ్లు): పంజాబ్‌కు చెందిన బల్వీర్ సామాజిక కార్యకర్త. 160 కి.మీ పొడవైన కాలీ బీన్ అనే నదికి పునరుజ్జీవం తీసుకురావడానికి అక్కడి యువత, స్వచ్ఛంద సేవకులను ఆయన కదిలించారు. ఈయనకు రస్తేవాలే బాబా. సడకన్వాలే బాబా, ఎకో బాబా లాంటి పలు పేర్లున్నాయి. ⇔ బిపిన్ గంటారా (59 ఏళ్లు): ఈయన పశ్చిమ బెంగాల్‌కు చెందిన వారు. కోల్‌కతాలో గత 40 ఏళ్లుగా అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశాలకు వెళ్లి స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్నారు.బిపిన్ సోదరుడు మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోవడంతో అప్పటి నుంచి ఆయన అగ్ని ప్రమాద బాధితులకు సహాయం చేస్తున్నారు. ⇔ సునితి సాలమన్: చెన్నైకి చెందిన వైద్యురాలైన ఈమె దేశంలో తొలి ఎయిడ్స్ కేసును గుర్తించారు. 2015లో మరణించారు. ఆమె స్మృత్యర్థం కేంద్రం పద్మ పురస్కారాన్ని ప్రకటించింది. ⇔ భక్తి యాదవ్ (91 ఏళ్లు): మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఎంబీబీఎస్ డిగ్రీ పొందిన తొలి మహిళ ఈమె. గత 68 ఏళ్లుగా ఇండోర్‌లో ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు. ఇప్పటికి వేల మంది గర్భిణులకు కాన్పులు చేశారు. ⇔ సుక్రీ బొమ్మగౌడ (58 ఏళ్లు): కర్ణాటకకు చెందిన ఈమె జానపద గాయకురాలు. ‘నైటింగేల్ ఆఫ్ హళక్కి’గా గుర్తింపు పొందారు. ⇔ జితేంద్ర హరిపాల్: ఒడిశాకు చెందిన ఈయన ‘రంగబతీ కీ ఆవాజ్’పేరుతో ప్రాచుర్యం పొందారు. ఒడిశాలో బాగా పాపులర్ అయిన రంగబతీ పాట కోసం ఈయన ఎంతో శ్రమించారు. కోస్లి–సంబాల్‌పురి సంగీతానికి ఎనలేని సేవ చేస్తున్నారు. ⇔ ఎలా అహ్మద్ (81 ఏళ్లు): అస్సాంకు చెందిన వీరు 1970 నుంచి మహిళల కోసం ప్రత్యేక మేగజీన్ నడుపుతున్నారు. ఈశాన్య రాష్ట్రాల నుంచి వెలువడుతున్న ఒకే ఒక్క మహిళా మేగజీన్ ఇదే. -
ఆరు నెలల్లో అమలు చేయండి
-
దావూద్ లొంగిపోతానన్నాడు..
కొన్ని షరతులు పెట్టాడు.. పవార్ పట్టించుకోలేదు: జెఠ్మలానీ ముంబై: చీకటి సామ్రాజ్యాధినేత దావూద్ ఇబ్రహీం.. 1990ల్లో భారత అధికారులకు లొంగిపోతానని ముందుకు వచ్చాడని.. కానీ నాటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి శరద్‌పవార్ ఈ అంశాన్ని ముందుకు తీసుకువెళ్లలేదని సీనియర్ న్యాయవాది రాం జెఠ్మలానీ ఆరోపించారు. ‘‘దావూద్.. తాను వెనక్కు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. అయితే.. తనపై థర్డ్ డిగ్రీ (హింసాత్మక విచారణ) ప్రయోగించబోమని, తనను గృహ నిర్బంధం (హౌస్ అరెస్ట్)లో ఉంచుతామని ప్రభుత్వం నుంచి హామీ కావాలన్నాడు. తను తప్పు చేసినట్లయితే శిక్ష ఎదుర్కోవటానికి సిద్ధమనీ చెప్పాడు’’ అని జెఠ్మలానీ శనివారం ఏఎన్ఐ వార్తా సంస్థతో పేర్కొన్నారు. తాము లండన్‌లో కలిసినపుడు దావూద్ ఈ ప్రతిపాదన చేసినట్లు తెలిపారు. ‘‘అతడు ఈ విషయం చెప్పినపుడు.. నేను దీనిని రాతపూర్వకంగా శరద్‌పవార్‌కు పంపించాను. ఈ ప్రతిపాదన గురించి స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వాల్సిందిగా నా కుమారుడికి చెప్పాను’’ అని తెలిపారు. ఈ విషయంలో ముందుకు వెళ్లరాదని నాటి కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం నిర్ణయించి ఉండొచ్చని పరోక్షంగా అభిప్రాయపడ్డారు. ‘‘అది శరద్‌పవారా? లేక కాంగ్రెస్సా? అనేది మాకు తెలీదు. కానీ.. ఈ నిర్ణయాన్ని శరద్‌పవార్ ఒక్కరే తీసుకోగలిగి ఉండకపోవచ్చు. కేంద్రం అభిప్రాయం ఇందులో ఉండి ఉండాలి’’ అని వ్యాఖ్యానించారు. షరతులు ఆమోదనీయం కాదని తిరస్కరించాం: పవార్ రాంజెఠ్మలానీ వెల్లడించిన అంశంపై ఎన్సీపీ అధినేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శరద్‌పవార్ స్పందిస్తూ.. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం లొంగిపోవటానికి సిద్ధంగా ఉన్నాడని, తనను సంప్రదించటం నిజమేనని.. అయితే అందుకు పెట్టిన షరతులు రాష్ట్ర ప్రభుత్వానికి ఆమోదనీయం కాదని.. దాంతో ఆ ప్రతిపాదనను తిరస్కరించటం జరిగిందని చెప్పారు. ‘‘దావూద్‌ను జైలులో పెట్టరాదని, అతడిని ఇంట్లోనే ఉండేందుకు అనుమతించాలని షరతు పెట్టారు. అది ఆమోదనీయం కాదు. అతడు చట్టం ముందు నిలవాల్సి ఉంటుందని మేం చెప్పాం’’ అని పవార్ శనివారం ముంబైలో విలేకరులకు వివరించారు. 1993 ముంబై వరుస పేలుళ్ల కేసులో దావూద్ ఇబ్రహీం కీలక నిందితుడన్న విషయం తెలిసిందే. -
డాలర్స్ కాలనీ న్యూ మూవీ స్టిల్స్
-
వెలుగు పూలు విరిసలా
సంప్రదాయేతర కాంతులు... తెలంగాణలోని 450 వుండలాల్లో వుండలానికి 50 ఎకరాలు సేకరించి 10 మెగావాట్ల సోలార్ ప్లాంట్లు పెడితే ఏడాది వ్యవధిలోనే 4,500 మెగావాట్ల ప్రాజెక్టులు ఏర్పడతారుు. అంటే సాగుకు ప్రస్తుతం ఇస్తున్న సబ్సిడీలకు రూపారుు కూడా అదనంగా పెట్టే పని లేకుండా రైతుల జీవితాల్లో శాశ్వత వెలుగులు నింపవచ్చు. పైగా ఈ ప్రాజెక్టులను ప్రభుత్వ రంగంలో చేపట్టడం ద్వారా ఏడాదిలోనే కనీసం 20 వేల ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు. అలాగే తెలంగాణలో 2,000 మెగావాట్ల పవన విద్యుదుత్పత్తికీ అవకాశవుుంది. తెలంగాణ పురోగతి ప్రధానంగా విద్యుత్ రంగంపై ఆధారపడి ఉంది. గృహ రంగం మొదలుకుని పరిశ్రవులు, వ్యవసాయుం దాకా అన్నీ కరెంటుతోనే వుుడిపడి ఉంటారుు. వినియోగదారులకు మెరుగైన సేవలు, సరసమైన ధరకు నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా విద్యుత్ సంస్థల పునర్నిర్మాణంజరగడం ఇప్పటి అవసరం. అందుకు నేతల్లో దార్శనికత, ఉద్యోగుల్లో సేవా తత్పరత కావాలని ఆకాంక్షిస్తున్నారు... తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ కోఆర్డినేటర్ కె.రఘు సంక్షోభం ఉండదు విభజన తర్వాత తెలంగాణలో విద్యుత్ సంక్షో భం తలెత్తుతుందని చాలావుంది అభిప్రాయుం. డివూండ్‌తో పోలిస్తే ఇక్కడ ఉన్న ప్రాజెక్టుల సావుర్థ్యం చాలా తక్కువ కావడం వల్ల అందరి లోనూ అలాంటి ఆందోళన ఉండడం సహజం. కానీ ఈ భయూల్లో వాస్తవం లేదని రాష్ట్ర పునర్వి భజన చట్టంలో పొందుపరిచిన అంశాలను చూస్తే అర్థవువుతుంది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను యుథాతథంగా కొనసాగిం చాలని అందులో స్పష్టంగా పేర్కొన్నారు. దీనివల్ల తెలంగాణకు కరెంటు లోటు పెరగబోదు. కొత్త గా ఏర్పడే కృష్ణా, గోదావరి నదీ జల నిర్వహణ బోర్డులు ప్రస్తుత ఒప్పందాలకు అను గుణంగా జలవిద్యుత్ సరఫరాను పర్యవేక్షిస్తాయున్నారు సవుస్యలు తప్పవు పునర్విభజన చట్టంలోని పలు అంశాలు రెండు రాష్ట్రాలకూ వుున్ముందు ఇబ్బందికరమే. వాటిని త్వరగా సవరించుకోని పక్షంలో శాశ్వతంగా న్యాయుపరమైన చిక్కులు, ఇతరత్రా సవుస్యలు తలెత్తుతారుు. ఏపీ ట్రాన్స్‌కో, జెన్కో వుున్ముం దు కూడా ఉవ్ముడిగానే కొనసాగుతాయున్నారు. అలాగే రెండు రాష్ట్రాలకూ ప్రస్తుత పీపీఏలే కొనసాగనుండడం ఇబ్బందులకు దారి తీస్తుం ది. ఈ పీపీఏల వల్ల అంతర్రాష్ట్ర ట్రాన్స్ మిషన్ చార్జీలుంటారుు. ఇవి వినియోగదారుపై అదనపు భారం మోపుతారుు. ైప్రస్తుతం ప్రైవేట్ ప్లాంట్లన్నీ సీవూంధ్రలోనే ఉన్నారుు. ఉవ్ముడి పీపీఏ విధానం వల్ల వీటి నిర్వహణ, ఒప్పందాల్లో తలెత్తే చిక్కులు దీర్ఘకాలం కొనసాగవచ్చు ఈ సవరణలు చేస్తే మేలు ప్రస్తుత ఏపీ ట్రాన్స్‌కో, జెన్కోలను రద్దు చేసి రెండు రాష్ట్రాలకు విడి విడిగా ఏర్పాటు చేయూలి. ప్రైవేట్ విద్యుత్ ప్లాంట్లను ప్రాంతాలవారీగా కేటాయించి, వాటి ఉత్పాదనను ఆయా రాష్ట్రాల కే పరిమితం చేయూలి. ఎవరికీ కేటారుుంచని 20 శాతం ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్‌ను జీవో 53 ఆధారంగా రెండు రాష్ట్రాలకు కేటారుుంచాలి. హైదరాబాద్‌లో ఎస్ఎల్డీసీ ని రెండేళ్ల తర్వాత తెలంగాణ ఎస్ఎల్డీసీగా పేర్కొనాలి. స్వల్ప/ వుధ్యకాలిక ఒప్పందాల ద్వారా వచ్చే విద్యుత్‌ను రెండు రాష్ట్రాల్లో ఏర్పడే లోటు నిష్పత్తిలో పంచా లి. తెలంగాణలో ఎన్టీపీసీ నిర్మించబోయే 4,000 మెగావాట్ల ప్లాంటు తాలూకు మొత్తం విద్యుత్‌నూ తెలంగాణకే కేటారుుంచాలి. -
మూడో కూటమిలో పవార్ చేరరు: ముండే
ముంబై: మూడో కూటమి పేరుతో పలు పార్టీల నేతలు ఒక్కచోట చేరడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా కేంద్రంలో మద్దతునివ్వడమేగాకుండా మహారాష్ట్రలో కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్న రాష్ట్రవాది కాంగ్రెస్(ఎన్సీపీ) మూడో కూటమి నేతలతో సన్నిహితంగా మెలగడం రాష్ట్రంలో కొత్త రాజకీయ చర్చకు దారితీసింది. బుధవారం ఢిల్లీలో వామపక్షాలు నిర్వహించిన కార్యక్రమంలో మూడో కూటమిలో చేరే సభ్యులుగా చెప్పుకుంటున్న పలు పార్టీల నేతలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఎన్సీపీ నేత డీపీ త్రిపాఠి హాజరు కావడంతో మిత్రపక్షమైన కాంగ్రెస్‌తోపాటు ప్రతిపక్ష బీజేపీ కూడా స్పందించింది. బీజేపీ సీనియర్ నేత గోపీనాథ్ ముండే ఈ విషయమై గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ మూడో కూటమిలో చేరదు. నా అంచనా ప్రకారం పవార్ మూడో కూటమిలో చేరే ఆలోచన చేయకపోవచ్చు. లోక్‌సభ ఎన్నికల కోసం ఇరు పార్టీల మధ్య సీట్ల కేటాయింపు విషయమై ఈ మధ్య కాలంలో కొన్ని విభేదాలు తలెత్తాయి. తాము కోరినన్ని సీట్లను కాంగ్రెస్ ఇచ్చేలా, పాత పొత్తునే కొనసాగించేలా కాంగ్రెస్‌పై ఒత్తిడి తీసుకొచ్చేందుకే ఎన్సీపీ మూడో కూటమి సభకు హాజరై ఉండవచ్చు. తమ పంతాన్ని నెగ్గించుకేనుందుకు, కాంగ్రెస్‌ను దారికి తెచ్చుకునేందుకే ఎన్సీపీ అధినేతఈ పాచిక వేశారని నేననుకుంటున్నా. ఇక అత్యాచార నిందితులకు శిక్ష విషయంలో అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యల గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. గతంలో కూడా అజిత్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. క్షమాపణ చెప్పే పరిస్థితి కొనితెచ్చుకున్నారు. మీడియా గురించి కూడా అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు క్షమాపణలు చెప్పాల్సిందిగా శరద్‌పవార్ ఆదేశించినా ఆయన చెప్పలేదు. పండగపూట విద్యుత్ కోతలు విధించడాన్ని కూడా అజిత్ పరిహాసం చేశారు. ఈ ప్రభుత్వానికి ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి ఉన్నట్లు కనిపించడంలే’న్నారు. కాగా పవార్ స్పందిస్తూ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో యూపీఏలోనే కొనసాగుతామన్నారు.