![వెలుగు పూలు విరిసలా - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/2/71395605945_625x300.jpg.webp?itok=u8nFZfeA)
వెలుగు పూలు విరిసలా
సంప్రదాయేతర కాంతులు...
తెలంగాణలోని 450 వుండలాల్లో వుండలానికి 50 ఎకరాలు సేకరించి
10 మెగావాట్ల సోలార్ ప్లాంట్లు పెడితే ఏడాది వ్యవధిలోనే 4,500 మెగావాట్ల ప్రాజెక్టులు ఏర్పడతారుు. అంటే సాగుకు ప్రస్తుతం ఇస్తున్న సబ్సిడీలకు రూపారుు కూడా అదనంగా పెట్టే పని లేకుండా రైతుల జీవితాల్లో శాశ్వత వెలుగులు నింపవచ్చు. పైగా ఈ ప్రాజెక్టులను ప్రభుత్వ రంగంలో చేపట్టడం ద్వారా ఏడాదిలోనే కనీసం 20 వేల ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు. అలాగే తెలంగాణలో 2,000 మెగావాట్ల పవన విద్యుదుత్పత్తికీ అవకాశవుుంది.
తెలంగాణ పురోగతి
ప్రధానంగా విద్యుత్ రంగంపై ఆధారపడి ఉంది. గృహ రంగం మొదలుకుని పరిశ్రవులు, వ్యవసాయుం దాకా అన్నీ కరెంటుతోనే వుుడిపడి ఉంటారుు. వినియోగదారులకు మెరుగైన సేవలు, సరసమైన ధరకు నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా విద్యుత్ సంస్థల పునర్నిర్మాణంజరగడం ఇప్పటి అవసరం. అందుకు నేతల్లో దార్శనికత, ఉద్యోగుల్లో సేవా తత్పరత కావాలని ఆకాంక్షిస్తున్నారు...
తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ కోఆర్డినేటర్ కె.రఘు
సంక్షోభం ఉండదు
విభజన తర్వాత తెలంగాణలో విద్యుత్ సంక్షో భం తలెత్తుతుందని చాలావుంది అభిప్రాయుం. డివూండ్‌తో పోలిస్తే ఇక్కడ ఉన్న ప్రాజెక్టుల సావుర్థ్యం చాలా తక్కువ కావడం వల్ల అందరి లోనూ అలాంటి ఆందోళన ఉండడం సహజం. కానీ ఈ భయూల్లో వాస్తవం లేదని రాష్ట్ర పునర్వి భజన చట్టంలో పొందుపరిచిన అంశాలను చూస్తే అర్థవువుతుంది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను యుథాతథంగా కొనసాగిం చాలని అందులో స్పష్టంగా పేర్కొన్నారు. దీనివల్ల తెలంగాణకు కరెంటు లోటు పెరగబోదు. కొత్త గా ఏర్పడే కృష్ణా, గోదావరి నదీ జల నిర్వహణ బోర్డులు ప్రస్తుత ఒప్పందాలకు అను గుణంగా జలవిద్యుత్ సరఫరాను పర్యవేక్షిస్తాయున్నారు
సవుస్యలు తప్పవు
పునర్విభజన చట్టంలోని పలు అంశాలు రెండు రాష్ట్రాలకూ వుున్ముందు ఇబ్బందికరమే. వాటిని త్వరగా సవరించుకోని పక్షంలో శాశ్వతంగా న్యాయుపరమైన చిక్కులు, ఇతరత్రా సవుస్యలు తలెత్తుతారుు. ఏపీ ట్రాన్స్‌కో, జెన్‌కో వుున్ముం దు కూడా ఉవ్ముడిగానే కొనసాగుతాయున్నారు. అలాగే రెండు రాష్ట్రాలకూ ప్రస్తుత పీపీఏలే కొనసాగనుండడం ఇబ్బందులకు దారి తీస్తుం ది. ఈ పీపీఏల వల్ల అంతర్రాష్ట్ర ట్రాన్స్ మిషన్ చార్జీలుంటారుు. ఇవి వినియోగదారుపై అదనపు భారం మోపుతారుు. ైప్రస్తుతం ప్రైవేట్ ప్లాంట్లన్నీ సీవూంధ్రలోనే ఉన్నారుు. ఉవ్ముడి పీపీఏ విధానం వల్ల వీటి నిర్వహణ, ఒప్పందాల్లో తలెత్తే చిక్కులు దీర్ఘకాలం కొనసాగవచ్చు
ఈ సవరణలు చేస్తే మేలు
ప్రస్తుత ఏపీ ట్రాన్స్‌కో, జెన్‌కోలను రద్దు చేసి రెండు రాష్ట్రాలకు విడి విడిగా ఏర్పాటు చేయూలి. ప్రైవేట్ విద్యుత్ ప్లాంట్లను ప్రాంతాలవారీగా కేటాయించి, వాటి ఉత్పాదనను ఆయా రాష్ట్రాల కే పరిమితం చేయూలి. ఎవరికీ కేటారుుంచని 20 శాతం ఏపీ జెన్‌కో థర్మల్ విద్యుత్‌ను జీవో 53 ఆధారంగా రెండు రాష్ట్రాలకు కేటారుుంచాలి. హైదరాబాద్‌లో ఎస్‌ఎల్‌డీసీ ని రెండేళ్ల తర్వాత తెలంగాణ ఎస్‌ఎల్‌డీసీగా పేర్కొనాలి. స్వల్ప/ వుధ్యకాలిక ఒప్పందాల ద్వారా వచ్చే విద్యుత్‌ను రెండు రాష్ట్రాల్లో ఏర్పడే లోటు నిష్పత్తిలో పంచా లి. తెలంగాణలో ఎన్‌టీపీసీ నిర్మించబోయే 4,000 మెగావాట్ల ప్లాంటు తాలూకు మొత్తం విద్యుత్‌నూ తెలంగాణకే కేటారుుంచాలి.