
PC: BCCI/IPL.com
Punjab kings vs Lucknow super giants live updates:
లక్నోపై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
ఐపీఎల్-2025లో భాగంగా ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై 37 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ ఘన విజయం సాధించింది. 236 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 199 పరుగులు మాత్రమే చేయగల్గింది. లక్నో బ్యాటర్లలో అయూష్ బదోని(74) ఒంటరి పోరాటం చేయగా.. అబ్దుల్ సమద్(45) పర్వాలేదన్పించాడు. మిగితా బ్యాటర్లంతా చేతులేత్తేశారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టగా.. ఒమర్జాయ్ రెండు, జాన్సెన్, చాహల్ తలా వికెట్ సాధించారు.
అయూష్ బదోని హాఫ్ సెంచరీ..
పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అయూష్ బదోని హాఫ్ సెంచరీ సాధించాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నప్పటికి బదోని(67) తన అద్బుత ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. 18 ఓవర్లు ముగిసేసరికి లక్నో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది.
14 ఓవర్లకు లక్నో స్కోర్: 126/5
14 ఓవర్లు ముగిసే సరికి లక్నో 5 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. క్రీజులో బదోని(40), అబ్దుల్ సమద్(29) ఉన్నారు.
కష్టాల్లో లక్నో.. 74 పరుగులకే 5 వికెట్లు
237 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ 74 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. రిషబ్ పంత్(18), డేవిడ్ మిల్లర్(11) వరుసగా పెవిలియన్‌కు చేరారు.
అర్ష్‌దీప్ ఆన్ ఫైర్..
లక్నోతో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ నిప్పులు చేరుగుతున్నాడు. లక్నో తొలి మూడు వికెట్లు పడగొట్టి దెబ్బతీశాడు. లక్నో టాప్ బ్యాటర్లు మార్ష్, మార్‌క్రమ్, పూరన్‌ను అర్ష్‌దీప్ పెవిలియన్‌కు పంపాడు. 6 ఓవర్లు ముగిసే సరికి లక్నో 3 వికెట్ల నష్టానికి 38 పరుగులు చేసింది.
లక్నో తొలి వికెట్ డౌన్..
237 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ తొలి వికెట్ కోల్పోయింది. అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో మిచెల్ మార్ష్ ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. 2.1 ఓవర్లకు లక్నో స్కోర్: 15/1
చెలరేగిన పంజాబ్ బ్యాటర్లు.. లక్నో టార్గెట్ ఎంతంటే
ధర్మశాల వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 236 పరుగుల భారీ స్కోర్ చేసింది. పంజాబ్ బ్యాటర్లలో ప్రభ్‌సిమ్రాన్ సింగ్(91) తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోగా.. శ్రేయస్ అయ్యర్(45), శశాంక్ సింగ్(33), ఇంగ్లిష్(30) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. లక్నో బౌలర్లలో ఆకాష్ మహారాజ్ సింగ్, దిగ్వేష్ సింగ్ తలా రెండు వికెట్లు సాధించారు.
పంజాబ్ నాలుగో వికెట్ డౌన్
నేహాల్ వధేరా రూపంలో పంజాబ్ కింగ్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. 16 పరుగులు చేసిన వధేరా.. ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. 16 ఓవర్లకు పంజాబ్ నాలుగు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. క్రీజులో ప్రబ్‌సిమ్రాన్ సింగ్(74), శశాంక్(2) ఉన్నారు.
పంజాబ్ మూడో వికెట్ డౌన్..
శ్రేయస్ అయ్యర్ రూపంలో పంజాబ్ కింగ్స్ మూడో వికెట్ కోల్పోయింది. 45 పరుగులు చేసిన అయ్యర్.. దిగ్వేష్ సింగ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 13 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ మూడు వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. క్రీజులో ప్రభ్‌సిమ్రాన్ సింగ్(51), వధేరా(5) ఉన్నారు.
పంజాబ్ రెండో వికెట్ డౌన్
జోష్ ఇంగ్లిష్ రూపంలో పంజాబ్ కింగ్స్ రెండో వికెట్ కోల్పోయింది. 30 పరుగులు చేసిన ఇంగ్లిష్.. ఆకాష్ మహారాజ్ సింగ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 7 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ కింగ్స్ రెండు వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. క్రీజులో శ్రేయస్ అయ్యర్(9), ఫ్రబ్ సిమ్రాన్(35) ఉన్నారు.
పంజాబ్ తొలి వికెట్ డౌన్
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్‌కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన ప్రియాన్ష్ ఆర్య.. ఆకాష్ మహారాజ్ సింగ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 2 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ వికెట్ నష్టానికి 26 పరుగులు చేసింది. క్రీజులో జోష్ ఇంగ్లిష్(23), ప్రభ్‌సిమ్రాన్ సింగ్(2) ఉన్నారు.
ఐపీఎల్-2025లో ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌తో ఆకాష్ మహరాజ్ సింగ్ లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. అదేవిధంగా పంజాబ్ కింగ్స్ జట్టులోకి మార్కస్ స్టోయినిష్ తిరిగొచ్చాడు.
తుది జట్లు
లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(కెప్టెన్), అబ్దుల్ సమద్, ఆయుష్ బడోని, డేవిడ్ మిల్లర్, ఆకాష్ మహరాజ్ సింగ్, దిగ్వేష్ సింగ్ రాఠీ, అవేష్ ఖాన్, మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్
పంజాబ్ కింగ్స్(ప్లేయింగ్ XI): ప్రియాంష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), శశాంక్ సింగ్, నెహాల్ వధేరా, మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో జాన్సెన్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్