Lucknow Super Giants
-
విదేశాలకు విస్తరిస్తున్న ఐపీఎల్ ఫ్రాంచైజీలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభం నుంచి భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డుకు లాభాల పంట పండిస్తోంది. అందుకే ఐపీఎల్ ఫ్రాంచైజీల కోసం బడా వ్యాపారవేత్తలు అప్పట్లో ఎగబడ్డారు. ఇప్పుడు ఐపీఎల్ ఫ్రాంచైజీలు తమ వ్యాపారాన్ని విదేశాలకు కూడా విస్తరిస్తున్నారు. వివిధ దేశాల్లో నిర్వహిస్తున్న ఐపీఎల్ తరహా టోర్నమెంట్లలో పెట్టుబడులు పెట్టేందుకు క్యూ లు కడుతున్నారు. తాజాగా ఐపీఎల్లో హైదరాబాద్ వేదికగా పోటీ పడుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు నిర్వహిస్తున్న 'ది హండ్రెడ్' టోర్నమెట్లోకి రంగ ప్రవేశం చేసింది.మూడో ఐపీఎల్ ఫ్రాంచైజీబుధవారం నార్తర్న్ సూపర్‌చార్జర్స్‌ను కొనుగోలు కోసం నిర్వహించిన వేలంలో కళానిధి మారన్ యాజమాన్యంలోని సన్ గ్రూప్ పాల్గొని మొత్తం వంద శాతం వాటాను కొనుగోలు చేసింది. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు యొక్క 49 శాతం వాటాను, ఈ క్లబ్ నిర్వాహకులైన యార్క్‌షైర్ యొక్క 51 శాతం వాటాను కొనుగోలు చేయడానికి అంగీకారాన్ని పొందింది. దీంతో 'ది హండ్రెడ్' టోర్నమెంట్ లో 100% వాటాను పొందిన తొలి ఫ్రాంచైజ్ గా నిలిచింది. ఈ టోర్నమెంట్ లో వాటాలు చేజిక్కించుకున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీ లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ మూడో ఫ్రాంచైజీ కావడం విశేషం. సూపర్‌చార్జర్స్ కొనుగోలు కోసం సన్ గ్రూప్ ఏకంగా 100 మిలియన్ పౌండ్లు వెచ్చించినట్టు తెలుస్తోంది. నాలుగో స్థానంలో సూపర్చార్జర్స్యార్క్షైర్కు వేదికగా పోటీ పడుతున్న సూపర్‌చార్జర్స్ గత సీజన్లో పురుషులు మరియు మహిళల టోర్నమెంట్లలో నాలుగో స్థానంలో నిలిచింది. సూపర్‌చార్జర్స్ పురుషుల జట్టుకు ఇంగ్లాండ్ మాజీ ఆల్ రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుత ఇంగ్లాండ్ జట్లు లో సభ్యుడైన హ్యారీ బ్రూక్ ఈ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు.లక్నో సూపర్ జెయింట్స్ నిర్వాహకులైన ఆర్ పి ఎస్ జి గ్రూప్, ముంబై ఇండియన్స్ నిర్వాహకులైన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 'ది హండ్రెడ్' టోర్నమెంట్ లో పోటీ పడుతున్న జట్ల స్టాక్లను కొనుగోలు చేసిన కొన్ని రోజుల తర్వాత సన్ గ్రూప్ కూడా ఈ టోర్నమెంట్ లో పెట్టుబడి పెట్టింది.ప్రారంభంలో లండన్ స్పిరిట్ కొనుగోలు హక్కులను దక్కించుకోవడంలో విఫలమైన ఆర్ పి ఎస్ జి గ్రూప్ తర్వాత మాంచెస్టర్ ఒరిజినల్స్‌లో వాటాను కొనుగోలు చేసింది. రాబోయే రోజుల్లో ది హండ్రెడ్‌లో మరో ఐపీఎల్ క్లబ్ కూడా పెట్టుబడి పెట్టే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల కథనం.మొదటి స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ టాటా గ్రూప్ 2024-2028 సంవత్సరానికి ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్‌ను దాదాపు 2,500 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసింది. ఇది మునుపటి ఒప్పందం కంటే దాదాపు 50 శాతం అధికం. ఇక ఐపీఎల్ ఫ్రాంచైజీల విషయానికొస్తే, 231.0 మిలియన్ డాలర్లతో చెన్నై సూపర్ కింగ్స్ అత్యంత విలువైన ఫ్రాంచైజీ గా కొనసాగుతోంది. గత సంవత్సరం ఈ క్లబ్ తొమ్మిది శాతం వృద్ధి రేటు ని సాధించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 227.0 మిలియన్ డాలర్లతో రెండవ స్థానంలో ఉంది. గత సంవత్సరం ఐపీఎల్ విజేత అయిన కోల్‌కతా నైట్ రైడర్స్ వ్యాపార వృద్ధి లో 19.3 శాతం పెరుగుదలతో మొదటి స్థానాన్ని ఆక్రమించింది. ముంబై ఇండియన్స్ 204.0 మిలియన్ డాలర్లతో బ్రాండ్ విలువతో నాలుగో స్థానంలో ఉంది. తరువాత సన్‌రైజర్స్ హైదరాబాద్ (132 మిలియన్ డాలర్లు), రాజస్థాన్ రాయల్స్ (113 మిలియన్ డాలర్లు) ఉన్నాయి.లాభాల పంటవాణిజ్య ప్రకటనల ద్వారా ఐపీఎల్ ఫ్రాంచైజీలు విపరీతంగా లాభాలు ఆర్జిస్తున్నాయి. దాదాపు ప్రతి జట్టుకు 5 మిలియన్ డాలర్ల నుండి 12 మిలియన్ డాలర్ల వరకు స్పాన్సర్షిప్ ఆదాయం లభించడమే కాక టెలివిజన్ హక్కుల ద్వారా కూడా గణనీయమైన ఆదాయం సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మూడేళ్ల ఒప్పందం కోసం ఖతార్ ఎయిర్వేస్ దాదాపు 175 కోట్ల రూపాయలతో ఒప్పందం ఖరారు చేసుకుందంటే ఐపీఎల్ ఫ్రాంచైజీల ఆదాయం ఏ స్థాయిలో ఉందో అర్థంచేసుకోవచ్చు. -
మరో క్రికెట్ లీగ్‌లోకి అడుగుపెట్టిన లక్నో సూపర్ జెయింట్స్
ఐపీఎల్ (IPL) టీమ్ లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) మరో క్రికెట్ లీగ్‌లోకి అడుగుపెట్టింది. ఎల్ఎస్జీ యాజమాన్యం హండ్రెడ్ లీగ్‌లోని (The Hundred League) మాంచెస్టర్ ఒరిజినల్స్ (ఇంగ్లండ్) ఫ్రాంచైజీని కళ్లు చెదిరే ధర వెచ్చించి సొంతం చేసుకుంది. ఫ్రాంచైజీ మొత్తం విలువలో 49 శాతాన్ని ఎల్ఎస్జీ యాజమాన్యమైన RPSG గ్రూప్ దక్కించుకుంది. భారత కరెన్సీలో ఈ వాటా విలువ రూ. 1251 కోట్లు. మాంచెస్టర్ ఒరిజినల్స్‌లో (Manchester Originals) వాటా దక్కించుకున్న విషయాన్ని RPSG గ్రూప్ అధినేత సంజీవ్ గొయెంకా వెల్లడించారు. తొలుత ఎల్ఎస్జీ యాజమాన్యం హండ్రెడ్ లీగ్‌లోని మరో ఫ్రాంచైజీ (లండన్ స్పిరిట్) కోసం బిడ్ దాఖలు చేసింది. అయితే ఆ ప్రయత్నాలు ఫలించలేదు. అంతిమంగా RPSG గ్రూప్ మాంచెస్టర్ ఒరిజినల్స్‌లో వాటా దక్కించుకుంది. RPSG గ్రూప్‌తో జత కట్టడంపై మాంచెస్టర్ యాజమాన్యం లంకాషైర్ సంతోషం వ్యక్తం చేసింది. ఈ డీల్‌లో టర్మ్స్ అండ్ కండీషన్స్‌పై తదుపరి 8 వారాల్లో చర్చిస్తామని పేర్కొంది.కాగా, ఇటీవలే హండ్రెడ్ లీగ్‌లోకి మరో ఐపీఎల్ ఫ్రాంచైజీ కూడా అడుగుపెట్టింది. ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ (అంబానీ గ్రూప్).. ఓవల్ ఇన్విన్సిబుల్స్ ఫ్రాంచైజీని భారీ ధరకు కొనుగోలు చేసింది. మరో రెండు ఐపీఎల్ ఫ్రాంచైజీలు సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ కూడా హండ్రెడ్ లీగ్‌లో ఫ్రాంచైజీలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఎస్ఆర్హెచ్కు చెందిన సన్ గ్రూప్.. నార్త్రన్ సూపర్ ఛార్జర్స్, ట్రెంట్ రాకెట్స్‌ను కొనుగోలు చేయాలని చూస్తుండగా.. ఢిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని అయిన జీఎమ్ఆర్ గ్రూప్ సథరన్ బ్రేవ్‌లో వాటాను దక్కించుకునేందుకు ఆసక్తి కనబరుస్తుంది.అప్పట్లో రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్..లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యం 2016లో రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీని కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆ ఫ్రాంచైజీ తెరమరుగైంది. రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్‌కు ఎంఎస్ ధోని సారధిగా వ్యవహరించాడు. 2021లో సంజీవ్ గొయెంకాకు చెందిన RPSG గ్రూప్.. లక్నో సూపర్ జెయింట్స్‌ను రూ. 7090 కోట్లకు కొనుగోలు చేసింది. 2023లో RPSG గ్రూప్.. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో (SA20) డర్బన్ సూపర్ జెయింట్స్ ఫ్రాంఛైజీని కూడా కొనుగోలు చేసింది. -
ఛాంపియన్స్ ట్రోఫీ.. ఆసీస్‌కు భారీ షాక్! విధ్వంసకర వీరుడు దూరం
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025(Champions Trophy 2025)కి ముందు ఆస్ట్రేలియాకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్(Mitchell Marsh) వెన్ను గాయం కారణంగా ఈ ఐసీసీ మెగా టోర్నీకి దూరమయ్యాడు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా ధృవీకరించింది. ఛాంపియన్స్ ట్రోఫీకి ఆసీస్ సెలక్టర్లు ఎంపిక చేసిన జట్టులో మార్ష్‌కు చోటు దక్కింది. ఇప్పుడు అతడి స్ధానాన్ని మరో ఆల్‌రౌండర్‌తో సెలక్టర్లు భర్తీ చేయనున్నారు.స్వదేశంలో భారత్‌తో జరిగిన టెస్టు సిరీస్ ఆరంభంలోనే తను వెన్ను నొప్పితో బాధపడుతున్నాని క్రికెట్ ఆస్ట్రేలియాకు మార్ష్ తెలియజేశాడు. దీంతో అతడిపై ఎక్కువ బౌలింగ్ లోడ్‌ను టీమ్ మెనెజ్‌మెంట్ ఉంచలేదు. అటు బౌలింగ్‌లోనూ, ఇటు బ్యాటింగ్‌లోనూ మార్ష్ తీవ్ర నిరాశపరిచాడు.బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఏడు ఇన్నింగ్స్‌లలో కేవలం 73 పరుగులు చేశాడు. దీంతో సిడ్నీ వేదికగా జరిగిన ఆఖరి టెస్టుకు టీమ్ మెనెజ్‌మెంట్ అతడిపై వేటు వేసింది. అతడి స్ధానంలో బ్యూ వెబ్స్టార్కు చోటు ఇచ్చాడు. ఈ టాల్ ఆల్‌రౌండర్ తన అరంగేట్రంలోనే ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత బిగ్‌బాష్‌లోకి వెళ్లిన మార్ష్ కేవలం ఒకే ఒక మ్యాచ్ ఆడాడు.ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు కోలుకోవడానికి బిగ్‌బాష్ లీగ్ చివరి మూడు మ్యాచ్‌లను మార్ష్ దాటేశాడు. అయినప్పటికి అతడు పూర్తి ఫిట్నెస్ సాధించడంలో విఫలమయ్యాడు. ఈ క్రమంలోనే అతడు ఛాంపియన్స్ ట్రోఫీ మొత్తానికి దూరమయ్యాడు."మిచెల్ మార్ష్ వెన్ను నొప్పి కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీ జట్టు నుంచి తొలగించబడ్డాడు. ఇటీవల కాలంలో అతడి నడుము నొప్పి మరింత ఎక్కువైంది. దీంతో అతడిని జట్టు నుంచి తప్పించాలని ఆస్ట్రేలియా సెలక్షన్ ప్యానల్ నిర్ణయించింది. అతడు కోలుకోవడానికి కొన్ని వారాల సమయం పట్టనున్నట్లు" క్రికెట్ ఆస్ట్రేలియా ఓ ప్రకటనలో పేర్కొంది.కాగా మార్ష్ ఐపీఎల్ ఫస్ట్‌హాఫ్‌కు కూడా దూరమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. ఐపీఎల్-2025 మెగా వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ అతడిని రూ.3.4 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. కాగా మార్ష్ స్ధానాన్ని వెబ్‌స్టెర్‌తో భర్తీ చేసే అవకాశముంది.ఛాంపియన్స్ ట్రోఫీకి ఆసీస్ జట్టు: పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), అలెక్స్ కారీ, నాథన్ ఎల్లిస్, ఆరోన్ హార్డీ, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లాబుషేన్, గ్లెన్ మాక్స్వెల్, మాట్ షార్ట్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జాంపాచదవండి: Virat Kohli: పన్నెండేళ్ల తర్వాత రీఎంట్రీ.. క్లీన్‌బౌల్డ్! దారుణ వైఫల్యం -
లక్నో సూపర్ జెయింట్స్ కొత్త కెప్టెన్ ప్రకటన..
ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు లక్నో సూపర్ జెయింట్స్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు కెప్టెన్‌గా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్(Rishabh Pant)ను లక్నో ఫ్రాంచైజీ నియమించింది. ఈ విషయాన్ని లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా ధ్రువీకరించారు. ఐపీఎల్లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా మాత్రమే కాకుండా, అత్యుత్తమ కెప్టెన్‌గా కూడా పంత్ ఎదుగుతాడని గోయెంకా ఆశాభావం వ్యక్తం చేశారు.రికార్డు ధర.. జెడ్డా వేదికగా జరిగిన ఐపీఎల్-2025(IPL 2025) మెగా వేలంలో రిషబ్ పంత్‌ను రూ. 27 కోట్ల రికార్డు ధరకు కొనుగోలు చేసింది. తద్వారా ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా పంత్ రికార్డులకెక్కాడు. వేలంలో తొలుత సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో పోటీ పడిన సూపర్ జెయింట్స్.. రైట్ టూ మ్యాచ్ కార్డును ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి ఎదుర్కొని మరీ పంత్‌ను సొంతం చేసుకుంది.కాగా లక్నో సూపర్ జెయింట్స్ ఐపీఎల్-2021 సీజన్‌తో ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో అడుగు పెట్టింది. గత మూడు సీజన్లలో కేఎల్ రాహుల్ సారథ్యంలో లక్నో మెరుగైన ప్రదర్శన కనబరిచింది. రెండు సార్లు ప్లే ఆఫ్స్‌లో అడుగు పెట్టినప్పటికి తుది పోరుకు ఆర్హత సాధించలేకపోయింది. అయితే ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు రాహుల్‌ను లక్నో రిటైన్ చేసుకోలేదు.దీంతో ఈ ఏడాది సీజన్లో కేఎల్ రాహుల్ స్ధానాన్ని పంత్ భర్తీ చేయనున్నాడు. కాగా తొలుత లక్నో కెప్టెన్‌గా వెస్టిండీస్ స్టార్ వికెట్ కీపర్ నికోలస్ పూరన్ ఎంపిక అవుతాడని వార్తలు వినిపించాయి. కానీ లక్నో యాజమాన్యం మాత్రం పంత్ వైపే మొగ్గు చూపింది.రెండో జట్టుకు కెప్టెన్‌గా..కాగా ఐపీఎల్లో కెప్టెన్‌గా పంత్‌కు అనుభవం ఉంది. 2016 సీజన్‌తో ఐపీఎల్ అరంగేంట్రం చేసిన రిషబ్ పంత్.. అప్పటి నుంచి గతేడాది సీజన్‌కు అదే జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. 2021 నుంచి 2024 వరకు ఢిల్లీ కెప్టెన్‌గా రిషబ్ పని చేశాడు. అయితే గాయం కారణంగా ఐపీఎల్-2022 సీజన్‌కు మాత్రం దూరమయ్యాడు. మళ్లీ గతేడాది సీజన్‌తో పంత్ రీఎంట్రీ ఇచ్చాడు. వ్యక్తిగత ప్రదర్శతనతో అతడు ఆకట్టుకున్నప్పటికి.. సారథిగా మాత్రం జట్టును ముందుండి నడిపించడంలో విఫలమయ్యాడు. అతడి నాయకత్వంలోని ఢిల్లీ జట్టు లీగ్ స్టేజిలోనే ఇంటిముఖం పట్టింది. ఈ క్రమంలో జట్టు యాజమాన్యంతో పంత్‌కు విభేదాలు ఏర్పడినట్లు వార్తలు వినిపించాయి.ఈ కారణంగానే ఢిల్లీ ఫ్రాంచైజీతో పంత్ తెగదింపులు చేసుకున్నాడని, క్యాపిటల్స్ కూడా అతడిని రిటైన్ చేసుకోలేదని జోరుగా ప్రచారం సాగింది. ఏదమైనప్పటికి వేలంలోకి వచ్చిన పంత్‌కు మాత్రం కళ్లు చెదిరే ధర దక్కింది. పంత్ సారథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ 43 మ్యాచ్‌లు ఆడగా.. 24 విజయాలు, 19 ఓటములు చవిచూసింది. ఇక ఐపీఎల్ 18వ సీజన్ మార్చి 21 నుంచి ప్రారంభం కానుంది.చదవండి: రింకూ సింగ్, ఎంపీ ప్రియా సరోజ్‌ల పెళ్లి.. అఫీషియల్ అప్డేట్ -
IPL 2025: పంత్ ఒక్కడే కాదు.. ఆ ముగ్గురూ కెప్టెన్ ఆప్షన్లు: సంజీవ్ గోయెంకా
ఐపీఎల్-2025లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ ఎవరు?!.. ఇంకెవరు రిషభ్ పంత్ అంటారా?!.. ఆగండాగండి.. ఇప్పుడే అలా డిసైడ్ చేసేయకండి.. ఈ మాట అంటున్నది స్వయానా లక్నో ఫ్రాంఛైజీ యజమాని, వ్యాపారవేత్త సంజీవ్ గోయెంకా. తమ జట్టు కెప్టెన్ ఎవరన్న అంశంపై ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.రూ. 27 కోట్లకు కొనుగోలుకాగా మెగా వేలానికి ముందు లక్నో.. వెస్టిండీస్ స్టార్ నికోలసన్ పూరన్ కోసం ఏకంగా రూ. 21 కోట్లు ఖర్చుచేసిన విషయం తెలిసిందే. ఈ వికెట్ కీపర్ బ్యాటర్‌ను తమ జట్టులోనే కొనసాగిస్తూ ఈ మేర భారీ మొత్తం చెల్లించింది. అయితే, వేలంలో అనూహ్య రీతిలో టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్‌ను రికార్డు స్థాయిలో రూ. 27 కోట్లకు కొనుగోలు చేసింది.ఢిల్లీ క్యాపిటల్స్‌తో పోటీ నేపథ్యంలో పంత్ ధర రూ. 20 కోట్లకు చేరగా.. లక్నో ఒక్కసారిగా ఏడు కోట్లు పెంచింది. దీంతో ఢిల్లీ రేసు నుంచి తప్పుకోగా.. వికెట్ కీపర్ బ్యాటర్ పంత్‌ను లక్నో దక్కించుకుంది. ఈ నేపథ్యంలో లక్నో జట్టు కొత్త కెప్టెన్‌గా పంత్ నియామకం లాంఛనమేనని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.ఈ క్రమంలో టీమిండియా మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లక్నో జట్టు కొత్త కెప్టెన్ రిషభేనా లేదంటే మాకోసం ఏదైనా సర్ప్రైజ్ ప్లాన్ చేశారా? అని చోప్రా ప్రశ్నించాడు.నలుగురు ఉన్నారుఇందుకు బదులిస్తూ.. ‘‘అవును.. కచ్చితంగా అందరూ ఆశ్చర్యానికి లోనవుతారు. నా వరకైతే సర్ప్రైజ్లు ఇవ్వడం ఇష్టం ఉండదు. అయితే, మా కెప్టెన్ ఎవరన్నది త్వరలోనే తెలియజేస్తాం. మా జట్టులో రిషభ్, పూరన్, మార్క్రమ్, మిచెల్ మార్ష్ రూపంలో నలుగురు నాయకులు అందుబాటులో ఉన్నారు’’ అని సంజీవ్ గోయెంకా పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలను బట్టి.. నికోలస్ పూరన్‌కు లక్నో పగ్గాలు అప్పగించే యోచనలో యాజమాన్యం ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.వారే డిసైడ్ చేస్తారుఇక పంత్ ఓపెనర్‌గా వస్తాడా అన్న ప్రశ్నకు గోయెంకా సమాధానమిస్తూ.. ‘‘మా మిడిలార్డర్‌ను పటిష్టం చేసుకోవాలని భావిస్తున్నాం. వేలంలో బట్లర్(గుజరాత్ రూ, 15.75 కోట్లు) కోసం ప్రయత్నించాం. కానీ డబ్బు సరిపోలేదు. ఓపెనింగ్ జోడీపై జహీర్ ఖాన్, జస్టిన్ లాంగర్, మా కెప్టెన్ నిర్ణయం తీసుకుంటారు’’ అని పేర్కొన్నారు.కాగా 2022లో క్యాష్ రిచ్ లీగ్‌లో ఎంట్రీ ఇచ్చిన లక్నో ఫ్రాంఛైజీకి మూడు సీజన్లపాటు కేఎల్ రాహుల్ సారథ్యం వహించాడు. తొలి రెండు ఎడిషన్లలో జట్టును ప్లే ఆఫ్స్ చేర్చి సత్తా చాటాడు. అయితే, ఈ ఏడాది మాత్రం టాప్-4లో నిలపలేకపోయాడు. ఈ క్రమంలో రిటెన్షన్‌కు ముందు లక్నో రాహుల్‌ను వదిలేయగా.. వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 14 కోట్లకు కొనుక్కుంది.చదవండి: IPL 2025: అతడే గనుక బతికి ఉంటే.. పంత్ రికార్డు బ్రేక్ చేసేవాడు! -
IPL 2025: అతడే గనుక బతికి ఉంటే.. పంత్ రికార్డు బ్రేక్ చేసేవాడు!
ఆస్ట్రేలియా మాజీ హెడ్‌కోచ్ జస్టిన్ లాంగర్ ఉద్వేగపూరిత వ్యాఖ్యలు చేశాడు. ఫిలిప్ హ్యూస్ గనుక బతికి ఉంటే ఐపీఎల్ వేలంలో కోట్లు కొల్లగొట్టేవాడని.. కానీ తను ఇప్పుడు ఈ లోకంలో లేడంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. కాగా సౌదీ అరేబియాలో ఇటీవల ఐపీఎల్-2025 మెగా వేలం జరిగిన విషయం తెలిసిందే.అమాంతం ఏడు కోట్లు పెంచిఇందులో భాగంగా రూ. 2 కోట్ల కనీస ధరతో అందుబాటులో ఉన్న టీమిండియా స్టార్ రిషభ్ పంత్ కోసం ఫ్రాంఛైజీలు ఎగబడ్డాయి. ఢిల్లీ క్యాపిటల్స్‌తో పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్ పోటీకి రాగా.. లక్నో సూపర్ జెయింట్స్ కళ్లు చెదిరే మొత్తానికి ఈ వికెట్ కీపర్ బ్యాటర్‌ను సొంతం చేసుకుంది. పంత్ ధర రూ. 20 కోట్లకు చేరినపుడు ఢిల్లీ రైట్ టు మ్యాచ్ కార్డు ద్వారా పంత్‌ను తిరిగి దక్కించుకునే ప్రయత్నం చేయగా.. లక్నో అమాంతం ఏడు కోట్లు పెంచేసింది.దీంతో ఢిల్లీ రేసు నుంచి తప్పుకోగా.. లక్నో రూ. 27 కోట్లకు రిషభ్ పంత్‌ను తమ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా పంత్ రికార్డు సాధించాడు. ఈ నేపథ్యంలో లక్నో జట్టు హెడ్‌కోచ్, ఆసీస్ మాజీ క్రికెటర్ జస్టిన్ లాంగర్ ‘ది వెస్ట్ ఆస్ట్రేలియన్’కు రాసిన కాలమ్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.‘‘ఐపీఎల్లో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా పంత్ చరిత్ర సృష్టించాడు. మా ఫ్రాంఛైజీ.. లక్నో సూపర్ జెయింట్స్ అతడి సేవల కోసం ఐదు మిలియన్ డాలర్ల మేర ఖర్చు చేసింది. కేవలం ఎనిమిది వారాలకు ఇంత మొత్తం అంటే మాటలు కాదు.అతడే గనుక బతికి ఉంటేఒకవేళ హ్యూస్ గనుక బతికి ఉంటే.. ఐపీఎల్ వేలంలో అతడు కూడా భారీ ధర పలికేవాడు. కేవలం తన డైనమిక్ బ్యాటింగ్ మాత్రమే ఇందుకు కారణం కాదు.. తనలోని ఎనర్జీ కూడా ఇందుకు కారణం. కానీ.. విచారకరం ఏమిటంటే.. తను ఇప్పుడు మన మధ్యలేడు. ఎప్పటికీ వేలంలోకి రాలేడు’’ అంటూ ఆసీస్ దివంగత స్టార్ ఫిలిప్ హ్యూస్‌ను గుర్తుచేసుకున్నాడు. అదే విధంగా.. పంత్ క్రికెటింగ్ నైపుణ్యాలను కొనియాడిన లాంగర్.. ఆస్ట్రేలియా గడ్డ మీద టీమిండియా(2020-21)ను ఒంటిచేత్తో గెలిపించిన తీరు ఎన్నటికీ మరువలేనిదన్నాడు. కాగా 2014లో ఫిలిప్ హ్యూస్ ఈ లోకాన్ని శాశ్వతంగా విడిచివెళ్లాడు. ఆసీస్ దేశీ టోర్నీ షెఫీల్డ్ షీల్డ్‌లో భాగంగా న్యూ సౌత్‌వేల్స్- సౌత్ ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ సందర్భంగా ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. సీన్ అబాట్ వేసిన రాకాసి బంతి బలైన హ్యూస్ఆసీస్ బౌలర్ సీన్ అబాట్ వేసిన రాకాసి బంతి హ్యూస్ మెడకు బలంగా తాకడంతో అతడు కుప్పకూలిపోయి ప్రాణాలు వదిలాడు. నవంబరు 27న హ్యూస్ పదో వర్ధంతి జరిగింది. ఈ నేపథ్యంలో అతడిని తలచుకుంటూ జస్టిన్ లాంగర్ ఉద్వేగానికి గురయ్యాడు.కాగా న్యూ సౌత్ వేల్స్లో జన్మించిన హ్యూస్ 2009లో ఆస్ట్రేలియా తరఫున అరంగేట్రం చేశాడు. అంతర్జాతీయ కెరీర్లో 26 టెస్టులు, 25 వన్డేలు ఆడిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. ఆయా ఫార్మాట్లలో వరుసగా 1535, 826 పరుగులు చేశాడు. తన 26వ పుట్టినరోజు కంటే మూడు రోజుల ముందు.. క్రికెట్ ఆడుతూ తుదిశ్వాస విడిచాడు. చదవండి: ఐసీసీ దెబ్బకు దిగివచ్చిన పాకిస్తాన్.. ‘హైబ్రిడ్ మోడల్’కు ఓకే!.. కానీ.. -
IPL 2025: రిషభ్ పంత్ భావోద్వేగం.. ఎమోషనల్ నోట్ వైరల్
‘‘ఢిల్లీ క్యాపిటల్స్‌తో నా ప్రయాణం ఒక అద్భుతం. మైదానంలో ఎన్నెన్నో ఉత్కంఠభరిత క్షణాలు.. మరెన్నో మధుర జ్ఞాపకాలు. ఓ టీనేజర్‌గా ఇక్కడికి వచ్చాను. ఢిల్లీ క్యాపిటల్స్‌తో కలిసి ఈ తొమ్మిదేళ్లలో నేనూ ఎంతో ఎత్తుకు ఎదిగాను. నేనిది ఎన్నడూ ఊహించలేదు.నా ప్రయాణం ఇంత ప్రత్యేకంగా మారడానికి ప్రధాన కారణం అభిమానులు. నన్ను అక్కున చేర్చుకున్నారు. నా జీవితంలోని కఠిన సమయంలో నాకు అండగా నిలబడ్డారు. నేను ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్లిపోతున్నాను.అయితే, నాపై మీకున్న ప్రేమాభిమానాలను బరువైన హృదయంతో మోసుకెళ్తున్నాను. నేను ఎక్కడ ఉన్నా.. నా ఆటతో మీకు వినోదం అందిస్తాను. నన్ను కుటుంబ సభ్యుడిగా ఆదరించినందుకు.. నా ప్రయాణాన్ని ప్రత్యేకంగా మలిచినందుకు ధన్యవాదాలు.. ఏదేమైనా వీడ్కోలు చెప్పడం అంత సులువేమీ కాదు’’ అంటూ టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ ఉద్వేగపూరిత నోట్ షేర్ చేశాడు.వీడలేక వీడిపోతున్నట్లు..ఢిల్లీ క్యాపిటల్స్‌ను వీడలేక వీడిపోతున్నట్లు తన మనసులో ఉన్న మాటలను లేఖ రూపంలో వెల్లడించాడు. కాగా ఐపీఎల్- 2025 మెగా వేలానికి ముందు ఢిల్లీ ఫ్రాంఛైజీ పంత్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆక్షన్‌లోకి వచ్చిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్ కోసం లక్నో సూపర్ జెయింట్స్ ఆది నుంచి ఆసక్తి చూపింది.అయితే, పంత్ ధర రూ. 20 కోట్లకు చేరుకున్న సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ తమ రైట్ టు మ్యాచ్ కార్డును ఉపయోగించుకోవాలని చూసింది. కానీ లక్నో మాత్రం వెనక్కి తగ్గలేదు. అమాంతం ఏడు కోట్లు పెంచి మొత్తంగా రూ. 27 కోట్లకు రిషబ్ పంత్‌ను తమ సొంతం చేసుకుంది. దీంతో వచ్చే ఏడాది పంత్ లక్నోకు ఆడబోతున్నాడు.ఢిల్లీ ఫ్రాంఛైజీతో సుదీర్ఘ అనుబంధంకాగా పంత్‌కు ఢిల్లీ ఫ్రాంఛైజీతో సుదీర్ఘ అనుబంధం ఉంది. 2016లో ఢిల్లీ జట్టుతో తన ఐపీఎల్ జర్నీ ఆరంభించిన పంత్ కెప్టెన్ స్థాయికి ఎదిగాడు. 2017లో 366 పరుగులు మాత్రమే చేసిన అతడు.. 2018లో మాత్రం దుమ్ములేపాడు. పద్నాలుగు మ్యాచ్‌లలో కలిపి 684 పరుగులు సాధించాడు. ఇందులో ఓ సెంచరీ, నాలుగు ఫిప్టీలు ఉండటం విశేషం.ఇక 2022లో ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన పంత్ ఐపీఎల్-2023 మొత్తానికి దూరమయ్యాడు. ఆ సమయంలోనూ అభిమానులతో పాటు ఢిల్లీ క్యాపిటల్స్ అతడికి అండగా ఉంది. అయితే, వేలానికి ముందు అభిప్రాయ భేదాలు తలెత్తిన నేపథ్యంలో ఆ ఫ్రాంఛైజీతో పంత్ బంధం ముగిసినట్లు తెలుస్తోంది. కాగా ఈ ఏడాది రీఎంట్రీ ఇచ్చి పంత్ 13 ఇన్నింగ్స్‌లో కలిపి 446 పరుగులు చేశాడు. కెప్టెన్‌గా జట్టును ఆరో స్థానంలో నిలపగలిగాడు.చదవండి: IPL Auction 2025: అతడికి ఏకంగా రూ. 18 కోట్లు.. కారణం మాత్రం కావ్యానే!.. పాపం ప్రీతి! -
అతడు టాక్సిక్ బాస్.. ‘పంత్‌తో రాహుల్ ముచ్చట’? హర్ష్ గోయెంకా స్పందన వైరల్
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025 మెగా వేలంలో టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్‌కు అనుకున్నంత ధర దక్కలేదు. భారీ అంచనాల నడుమ ఆక్షన్‌లోకి వచ్చిన ఈ వికెట్ కీపర్ కోసం ఏ ఫ్రాంఛైజీ కూడా మరీ అంతగా ఎగబడిపోలేదు. రూ. 2 కోట్ల కనీస ధరతో రాహుల్ తన పేరును నమోదు చేసుకున్నాడు.అయితే, లోకల్ బాయ్ కోసం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తొలుత బిడ్ వేయగా.. కోల్‌కతా నైట్ రైడర్స్ కూడా పోటీకి వచ్చింది. కానీ ధర కాస్త పెరగగానే ఈ రెండూ తప్పుకోగా.. ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ రాహుల్ కోసం పోటీపడ్డాయి. అలా ఆఖరికి రాహుల్‌ను ఢిల్లీ రూ. 14 కోట్లకు దక్కించుకుంది.కాగా కేఎల్ రాహుల్ ఐపీఎల్-2022- 2024 వరకు లక్నో సూపర్ జెయింట్స్‌కు సారథ్యం వహించాడు. లక్నో ఫ్రాంఛైజీని అరంగేట్రంలో(2022)నే ప్లే ఆఫ్స్ చేర్చి సత్తా చాటాడు. మరుసటి ఏడాది కూడా టాప్-4లో నిలిపాడు. కానీ.. ఐపీఎల్-2024లో మాత్రం లక్నోకు వరుస పరాభవాలు ఎదురయ్యాయి.రాహుల్‌పై గోయెంకా ఆగ్రహంసీజన్ మొత్తంలో ఆడిన పద్నాలుగు మ్యాచ్‌లలో కేవలం ఏడు మాత్రమే గెలిచిన లక్నో.. 14 పాయింట్లతో పట్టికలో ఏడో స్థానానికి పరిమితమైంది. ఇదిలా ఉంటే.. సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో లక్నో చిత్తుగా ఓడిన నేపథ్యంలో.. ఆ ఫ్రాంఛైజీ యజమాని, ప్రముఖ వ్యాపారవేత్త సంజీవ్ గోయెంకా.. తమ కెప్టెన్ కేఎల్ రాహుల్‌పై బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేశాడు.స్వేచ్ఛ ఉన్న చోటే ఆడాలనిఅందరి ముందే రాహుల్‌ను గోయెంకా తిట్టినట్లుగా ఉన్న దృశ్యాలు నెట్టింట విస్తృతంగా వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో రిటెన్షన్‌కు ముందు రాహుల్- లక్నోల బంధం తెగిపోయింది. ఈ విషయంపై రాహుల్ స్పందిస్తూ.. స్వేచ్ఛ ఉన్న చోట ఆడాలని అనుకుంటున్నట్లు పరోక్షంగా గోయెంకా వైపు మాటల బాణాలు విసిరాడు.ఈ నేపథ్యంలో మెగా వేలం సందర్భంగా సంజీవ్ గోయోంకా సైతం కేఎల్ రాహుల్‌కు కౌంటర్ గట్టిగానే ఇచ్చాడు. కాగా సౌదీ అరేబియాలో జరిగిన ఆక్షన్‌లో లక్నో.. టీమిండియా స్టార్ రిషభ్ పంత్ కోసం రూ. 27 కోట్లు వెచ్చించింది. ఈ విషయం గురించి గోయెంకా మాట్లాడుతూ.. ‘‘మాకు కావాల్సిన ఆటగాడికి ఉండాల్సిన లక్షణాలన్నీ పంత్‌లో ఉన్నాయి. అందుకే అతడి కోసం మేము ముందే రూ. 25- 27 కోట్లు పక్కన పెట్టుకున్నాం’’ అని పేర్కొన్నాడు.ఏదేమైనా వేలం ముగిసే సరికి పంత్, రాహుల్‌ల జట్లు తారమారయ్యాయి. రాహుల్ స్థానంలో లక్నో కెప్టెన్‌గా పంత్, పంత్ ప్లేస్‌లో ఢిల్లీ సారథిగా రాహుల్ వ్యవహరించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ వీళ్లిద్దరి ఫొటోతో ఓ ఆసక్తికర ట్వీట్ చేశాడు. అన్నీ బాగానే ఉంటాయి.. కానీరాహుల్ పంత్ చెవిలో ముచ్చటిస్తున్నట్లుగా ఉన్న ఫొటోకు.. ‘‘చూడు భాయ్.. కంపెనీ మంచిది.. డబ్బు కూడా బాగానే ఇస్తారు.. కానీ బాస్ మాత్రం విషపూరితమైన మనసున్న వ్యక్తి’’ అంటూ క్యాప్షన్ జతచేశాడు. ఇందుకు ప్రముఖ వ్యాపారవేత్త, సంజీవ్ గోయెంకా అన్న హర్ష్ గోయెంకా స్పందించారు. ఇదేమిటబ్బా అన్నట్లుగా ఉన్న ఎమోజీని ఆయన జతచేశారు.చదవండి: IPL 2025 Mega Auction: మెగా వేలంలో అమ్ముడుపోయిన ఆటగాళ్ల పూర్తి జాబితా ఇదే..! -
లక్నో ‘నవాబ్’ రిషభ్ పంత్
బ్యాటింగ్‌లో దూకుడుకు మారుపేరు... వికెట్ కీపర్... కెప్టెన్ గా అనుభవం... ఎలాంటి స్థితిలోనైనా జట్టును గెలిపించగల నైపుణ్యం... అన్నీ కలిసి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రిషభ్ పంత్ స్థాయి ఏమిటో చూపించాయి. ఇలాంటి ఆటగాడి కోసమే ఏ జట్టయినా పోటీ పడుతుంది. అందుకే అతని పేరు వచ్చినప్పుడు వేలం వెర్రిగా సాగింది. అతనిపై కోట్లు వెదజల్లేందుకు ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. అలా అలా పెరుగుతూ పోయిన ఆ విలువ చివరకు రూ.27 కోట్ల వద్ద ఆగింది. లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక మొత్తం చెల్లించి భారత ఆటగాడు రిషభ్ పంత్‌ను సొంతం చేసుకుంది. దాంతో అంతకు కొద్ది నిమిషాల క్రితమే పంజాబ్ కింగ్స్ సంచలన రీతిలో రూ.26 కోట్ల 75 లక్షలకు శ్రేయస్ అయ్యర్‌ను సొంతం చేసుకున్న రికార్డు వెనక్కి వెళ్లిపోయింది. వీరిద్దరూ భారత జట్టులో సభ్యులుగా ఇప్పటికే తమకంటూ గుర్తింపు తెచ్చుకోగా... నాలుగు సీజన్లలో అంతంత మాత్రం ఆటనే ప్రదర్శించిన వెంకటేశ్ అయ్యర్ కోసం కోల్‌కతా నైట్‌రైడర్స్ ఏకంగా రూ.23 కోట్ల 75 లక్షలు చెల్లించడం వేలంలో అతి పెద్ద సంచలనం. ఏకంగా 20 మంది ఆటగాళ్లకు రూ.10 కోట్లకంటే ఎక్కువ విలువ దక్కడం విశేషం. అనూహ్యాలకు వేదికగా నిలిచే ఐపీఎల్ వేలం ఎప్పటిలాగే తమ రివాజును కొనసాగించింది. అర్ష్ దీప్ సింగ్, బట్లర్, కేఎల్ రాహుల్, సిరాజ్, స్టార్క్, స్టొయినిస్, షమీవంటి ప్లేయర్లకు ఆశించిన మొత్తాలే దక్కగా... చహల్, జేక్ ఫ్రేజర్, ఆర్చర్, జితేశ్ శర్మ, రబాడ, నూర్, అవేశ్ ఖాన్లకు మాత్రం చాలా పెద్ద మొత్తం లభించింది. డికాక్, మ్యాక్స్‌వెల్, హర్షల్ పటేల్, డేవిడ్ మిల్లర్, మార్క్రమ్ తక్కువ మొత్తాలకే సరిపెట్టుకోవాల్సి రాగా... ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన విదేశీ ఆటగాడైన డేవిడ్ వార్నర్‌ను తొలిరోజు ఎవరూ తీసుకోకపోవడం అత్యంత ఆశ్చర్యకరం! జిద్దా: ఐపీఎల్–2025 వేలం ఊహించిన విధంగానే కోట్లాది రూపాయల రికార్డులకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. తొలి రోజు 72 మంది ఆటగాళ్లను 10 ఫ్రాంచైజీలు ఎంచుకున్నాయి. వీరిలో రిషభ్ పంత్ (రూ.27 కోట్లు) అత్యధిక ధరతో అందరికంటే టాపర్‌గా నిలిచాడు. 2024 వేలంలో మిచెల్ స్టార్క్ (కోల్‌కతా; రూ.24 కోట్ల 75 లక్షలు) నెలకొల్పిన అత్యధిక మొత్తం రికార్డును పంత్ బద్దలు కొట్టాడు. 2024లో కెపె్టన్‌గా కోల్‌కతాను చాంపియన్‌గా నిలిపిన శ్రేయస్ అయ్యర్ (రూ.26 కోట్ల 75 లక్షలు) కాస్త తేడాతో రెండో స్థానంలో నిలవగా... వెంకటేశ్ అయ్యర్ కోసం ఏకంగా రూ.23 కోట్ల 75 లక్షలు చెల్లించి కోల్‌కతా వెనక్కి తీసుకుంది. భారత ఆటగాళ్లలో అర్ష్ దీప్ సింగ్ తన ప్రస్తుతం టీమ్ పంజాబ్ కింగ్స్‌కే వెళ్లగా... చహల్, కేఎల్ రాహుల్, షమీ, ఇషాన్ కిషన్ కొత్త జట్ల తరఫున బరిలోకి దిగనున్నారు. హైదరాబాదీ పేసర్ సిరాజ్‌ను గుజరాత్ టైటాన్స్ ఎంచుకోగా... కెరీర్ చివర్లో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరోసారి తన ‘హోం’ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్‌కు వెళ్లడం విశేషం. సోమవారం కూడా వేలం సాగనుంది. మొత్తం 577 మంది నుంచి మిగిలిన ఆటగాళ్లతో పాటు ఆదివారం అమ్ముడుపోని ఆటగాళ్లు కూడా రెండో రోజు మళ్లీ వేలంలోకి వస్తారు. పంత్ కోసం పోటీపడ్డారిలా...తొలి రోజు ఆరో ఆటగాడిగా రూ. 2 కోట్ల కనీస విలువతో పంత్ పేరు వేలంలోకి వచ్చింది. లక్నో ముందుగా తమ ఆసక్తిని చూపించింది. వెంటనే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) బరిలోకి దిగింది. ఈ రెండు ఫ్రాంచైజీలు పోటీ పడుతూ మొత్తాన్ని రూ.10 కోట్ల 50 లక్షల వరకు తీసుకెళ్లాయి. ఈ దశలో ఆర్సీబీ వెనక్కి తగ్గగా... సన్‌రైజర్స్ పోటీకి సిద్ధమైంది. అలా ఇరు జట్ల మధ్య సాగిన సమరం పంత్ విలువను రూ.20 కోట్ల 75 లక్షల వరకు తీసుకెళ్లింది. ఈ దశలో పంత్ పాత జట్టు ఢిల్లీ అతడిని రైట్ టు మ్యాచ్ ద్వారా మళ్లీ తీసుకునేందుకు ప్రయత్నించింది. అయితే లక్నో ఏకంగా రూ.27 కోట్ల మొత్తానికి ప్యాడిల్ ఎత్తడంతో పంత్ విలువ శిఖరానికి వెళ్లింది. శ్రేయస్ అయ్యర్ ముందుగా... పంత్‌కంటే ముందు రికార్డు ధరతో శ్రేయస్ అయ్యర్ అమ్ముడుపోయాడు. 2024 ఐపీఎల్లో కోల్‌కతాను చాంపియన్‌గా నిలిపిన కెప్టెన్‌గా అతని పేరు వచ్చింది. గతంలో ఢిల్లీ టీమ్‌లో శ్రేయస్ ఆడినప్పుడు కోచ్‌గా ఉన్న పాంటింగ్ ఈసారి పంజాబ్ తరఫున ముందుగా అతనిపై ఆసక్తిని ప్రదర్శించాడు. ఆపై కోల్‌కతా, ఢిల్లీ మధ్య పోటీ సాగగా... రూ.25 కోట్ల వద్ద ఢిల్లీ సొంతమైనట్లు కనిపించింది. కానీ అనూహ్యంగా మళ్లీ ముందుకొచి్చన పంజాబ్ కింగ్స్ చివరకు బిడ్‌ను ఖాయం చేసుకుంది. వెంకటేశ్ అయ్యర్ కోసం హోరాహోరీ... ఐపీఎల్లో 2021–24 మధ్య నాలుగు సీజన్ల పాటు ఆడిన కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫునే ఆడిన వెంకటేశ్ అయ్యర్ 49 ఇన్నింగ్స్‌లలో 137.12 స్ట్రయిక్‌రేట్‌తో 1326 పరుగులు చేశాడు. 9 ఇన్నింగ్స్‌లలో మాత్రమే బౌలింగ్ చేసే అవకాశం దక్కింది. అప్పుడప్పుడు కొన్ని చెప్పుకో దగ్గ ప్రదర్శనలు ఉన్నా... ఒంటి చేత్తో మ్యాచ్‌ను మార్చగల విధ్వంసకర ఆటగాడైతే కాదు. కానీ అతని కోసం వేలం అసాధారణ రీతిలో సాగింది. కోల్‌కతా టీమ్ ముందుగా వేలం మొదలు పెట్టింది. లక్నో ముందు ఆసక్తి చూపించినా...ఆ తర్వాత ప్రధానంగా కోల్‌కతా, ఆర్సీబీ మధ్యే పోటీ సాగింది. ఇరు జట్లు కలిసి రూ. 20 కోట్లు దాటించాయి. కోల్‌కతా రూ. 23 కోట్ల 75 లక్షలకు చేర్చిన తర్వాత బెంగళూరు స్పందించలేదు. డేవిడ్ వార్నర్‌కు నిరాశ!పట్టించుకోని ఫ్రాంచైజీలుఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన బ్యాటర్లలో ఒకడు, 184 మ్యాచ్‌లలో 6565 పరుగులతో అత్యధిక స్కోరర్ల జాబితాలో నాలుగో స్థానం, ఒంటి చేత్తో మ్యాచ్‌లను గెలిపించిన రికార్డుతో పాటు కెపె్టన్‌గా సన్‌రైజర్స్‌కు టైటిల్ అందించిన ఘనత! ఇలాంటి ఘనాపాటి ఆసీస్ స్టార్ డేవిడ్ వార్నర్‌ను ఎవరూ తీసుకోకపోవడం ఆశ్చర్యం కలిగించింది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నా... అతనేమీ ఆటకు దూరమై చాలా కాలం కాలేదు. ఇటీవల టి20 వరల్డ్‌కప్ ఆడి చురుగ్గా ఉన్న వార్నర్‌లో ఇప్పటికీ ఈ ఫార్మాట్లో చెలరేగిపోగల సత్తా ఉంది.వేలంలో కొందరు అనామక ఆటగాళ్ల కోసం సాగిన పోటీ చూస్తే వార్నర్ కనీస విలువ రూ.2 కోట్లకు కూడా తీసుకునేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం అనూహ్యం. గత సీజన్లో పూర్తిగా విఫలం కావడం వేలంపై ప్రభావం చూపించి ఉండవచ్చు. తొలి రోజు 12 మందిని మాత్రమే ఫ్రాంచైజీలు తిరస్కరించగా అందులో వార్నర్, బెయిర్‌స్టో ఎక్కువగా గుర్తింపు పొందిన ఆటగాళ్లు కాగా... ప్రస్తుతం భారత టెస్టు టీమ్‌లో ఉన్న దేవదత్ పడిక్కల్‌పై పెద్దగా అంచనాలు లేవు. మిగిలిన 9 మందిలో పీయూష్ చావ్లా తప్ప ఇతర ఆటగాళ్లు అనామకులే. అమ్ముడుపోయిన ఆటగాళ్ల జాబితాచెన్నై సూపర్ కింగ్స్ నూర్ అహ్మద్ (రూ.10 కోట్లు) ఆర్. అశ్విన్ (రూ. 9.75 కోట్లు) కాన్వే (రూ. 6.25 కోట్లు) ఖలీల్ అహ్మద్ (రూ. 4.80 కోట్లు) రచిన్ రవీంద్ర (రూ. 4 కోట్లు) రాహుల్ త్రిపాఠి (రూ. 3.40 కోట్లు) విజయ్ శంకర్ (రూ. 1.20 కోట్లు) ఢిల్లీ క్యాపిటల్స్ కేఎల్ రాహుల్ (రూ. 14 కోట్లు) స్టార్క్ (రూ. 11.75 కోట్లు) నటరాజన్ (రూ. 10.75 కోట్లు) జేక్ ఫ్రేజర్ (రూ 9 కోట్లు) హ్యారీ బ్రూక్ (రూ. 6.25 కోట్లు) అశుతోష్ శర్మ (రూ. 3.80 కోట్లు) మోహిత్ శర్మ (రూ.2.20 కోట్లు) సమీర్ రిజ్వీ (రూ. 95 లక్షలు) కరుణ్ నాయర్ (రూ. 50 లక్షలు) గుజరాత్ టైటాన్స్ బట్లర్ (రూ.15.75 కోట్లు) సిరాజ్ (రూ.12.25 కోట్లు) రబాడ (రూ.10.75 కోట్లు) ప్రసిధ్ కృష్ణ (రూ.9.50 కోట్లు) లోమ్రోర్ (రూ.1.70 కోట్లు) కుమార్ కుశాగ్ర (రూ.65 లక్షలు) మానవ్ సుతార్ (రూ. 30 లక్షలు) అనూజ్ రావత్ (రూ.30 లక్షలు) నిశాంత్ సింధు (రూ. 30 లక్షలు) కోల్‌కతా నైట్‌రైడర్స్ వెంకటేశ్ (రూ.23.75 కోట్లు) ఆన్రిచ్ నోర్జే (రూ.6.50 కోట్లు) డికాక్ (రూ.3.60 కోట్లు) అంగ్కృష్ (రూ.3 కోట్లు) గుర్బాజ్ (రూ.2 కోట్లు) వైభవ్ అరోరా (రూ.1.80 కోట్లు) మర్కండే (రూ. 30 లక్షలు) లక్నో సూపర్ జెయింట్స్ రిషభ్ పంత్ (రూ.27 కోట్లు) అవేశ్ ఖాన్ (రూ.9.75 కోట్లు) మిల్లర్ (రూ.7.50 కోట్లు) అబ్దుల్ సమద్ (రూ.4.20 కోట్లు) మిచెల్ మార్‡్ష (రూ.3.40 కోట్లు) మార్క్రమ్ (రూ.2 కోట్లు) ఆర్యన్ జుయాల్ (రూ.30 లక్షలు) ముంబై ఇండియన్స్ ట్రెంట్ బౌల్ట్ (రూ.12.50 కోట్లు) నమన్ ధీర్ (రూ.5.25 కోట్లు) రాబిన్ మిన్జ్ (రూ.65 లక్షలు) కరణ్ శర్మ (రూ.50 లక్షలు) పంజాబ్ కింగ్స్ శ్రేయస్ అయ్యర్ (రూ.26.75 కోట్లు) అర్ష్ దీప్ సింగ్ (రూ.18 కోట్లు) చహల్ (రూ.18 కోట్లు) స్టొయినిస్ (రూ.11 కోట్లు) నేహల్ వధేరా (రూ.4.20 కోట్లు) మ్యాక్స్‌వెల్ (రూ.4.20 కోట్లు) వైశాక్ విజయ్ (రూ.1.80 కోట్లు) యశ్ ఠాకూర్ (రూ.1.60 కోట్లు) హర్‌ప్రీత్ బ్రార్ (రూ.1.50 కోట్లు) విష్ణు వినోద్ (రూ.95 లక్షలు) రాజస్తాన్ రాయల్స్ జోఫ్రా ఆర్చర్ (రూ.12.50 కోట్లు) హసరంగ (రూ.5.25 కోట్లు) మహీశ్ తీక్షణ (రూ.4.40 కోట్లు) ఆకాశ్ మధ్వాల్ (రూ.1.20 కోట్లు) కార్తికేయ (రూ.30 లక్షలు) బెంగళూరు హాజల్‌వుడ్ (రూ.12.50 కోట్లు) ఫిల్ సాల్ట్ (రూ.11.50 కోట్లు) జితేశ్ శర్మ (రూ.11 కోట్లు) లివింగ్‌స్టోన్ (రూ.8.75 కోట్లు) రసిక్ ధార్ (రూ.6 కోట్లు) సుయాశ్ శర్మ (రూ.2.60 కోట్లు) సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇషాన్ కిషన్ (రూ.11.25 కోట్లు) మొహమ్మద్ షమీ (రూ.10 కోట్లు) హర్షల్ పటేల్ (రూ.8 కోట్లు) రాహుల్ చహర్ (రూ.3.20 కోట్లు) మనోహర్ (రూ.3.20 కోట్లు) ఆడమ్ జంపా (రూ.2.40 కోట్లు) సిమర్జిత్ సింగ్ (రూ.1.50 కోట్లు) అథర్వ తైడే (రూ.30 లక్షలు) టాప్–20 (రూ.10 కోట్లు, అంతకుమించి) రిషభ్ పంత్ (రూ.27 కోట్లు) శ్రేయస్ (రూ.26.75 కోట్లు) వెంకటేశ్ (రూ.23.75 కోట్లు) అర్ష్ దీప్ సింగ్ (రూ.18 కోట్లు) చహల్ (రూ.18 కోట్లు) బట్లర్ (రూ.15.75 కోట్లు) కేఎల్ రాహుల్ (రూ. 14 కోట్లు) ట్రెంట్ బౌల్ట్ (రూ.12.50 కోట్లు) హాజల్‌వుడ్ (రూ.12.50 కోట్లు) జోఫ్రా ఆర్చర్ (రూ.12.50 కోట్లు) సిరాజ్ (రూ.12.25 కోట్లు) స్టార్క్ (రూ. 11.75 కోట్లు) ఫిల్ సాల్ట్ (రూ.11.50 కోట్లు) ఇషాన్ కిషన్ (రూ.11.25 కోట్లు) జితేశ్ శర్మ (రూ.11 కోట్లు) స్టొయినిస్ (రూ.11 కోట్లు) నటరాజన్ (రూ. 10.75 కోట్లు) రబాడ (రూ.10.75 కోట్లు) మొహమ్మద్ షమీ (రూ.10 కోట్లు) నూర్ అహ్మద్ (రూ.10 కోట్లు) తొలి రోజు మొత్తం 72 మంది ఆటగాళ్లను ఫ్రాంచైజీలు వేలంలో దక్కించుకోగా... ఇందులో 24 మంది విదేశీయులు ఉన్నారు. వేలం కోసం మొత్తం రూ.467.95 కోట్లను జట్లు వెచ్చించాయి. -
Rishabh Pant: అయ్యర్ రికార్డు బ్రేక్.. కోట్లు కొల్లగొట్టిన పంత్! లక్నో సొంతం
ఐపీఎల్-2025 మెగా వేలంలో టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ అత్యంత భారీ ధర పలికాడు. రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన ఈ వికెట్ కీపర్ కోసం లక్నో సూపర్ జెయింట్స్(ఎల్ఎస్జీ), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ఆదిలోనే పోటీకి దిగాయి. ఇరు ఫ్రాంఛైజీలు పంత్ కోసం హోరాహోరీగా తలపడి వేలం మొదలైన కాసేపటికే ధరను రూ. 10 కోట్లకు పెంచాయి.సన్‌రైజర్స్ హైదరాబాద్ రేసులోకి వచ్చిఆ తర్వాత కూడా తగ్గేదేలే అన్నట్లు పంత్ ధరను పెంచుతూ పోగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ రేసులోకి వచ్చి.. రూ. 13 కోట్లకు పెంచింది. ఈ క్రమంలో ఆర్సీబీ తప్పుకోగా.. హైదరాబాద్, లక్నో నువ్వా- నేనా అన్నట్లు దూకుడు పెంచాయి. శ్రేయస్ అయ్యర్ రికార్డు బ్రేక్అయితే, రూ. 20 కోట్లకు ధర పెరిగిన తర్వాత హైదరాబాద్ పోటీ నుంచి తప్పుకొంది. అయితే, అనూహ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్ రైట్ టు మ్యాచ్ ద్వారా రేసులోకి రాగా.. లక్నో అమాంతం ఏడు కోట్లు పెంచింది. మొత్తంగా రూ. 27 కోట్ల భారీ ధరకు పంత్‌ను లక్నో సొంతం చేసుకుంది. దీంతో శ్రేయస్ అయ్యర్ రికార్డు బ్రేక్ అయింది.పడిలేచిన కెరటంకాగా 2022 చివర్లో పంత్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తీవ్రమైన గాయాలపాలైనా అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ క్రమంలో ఐపీఎల్-2023 మొత్తానికి దూరమైన పంత్.. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా ఈ ఏడాది పునరాగమనం చేశాడు. ఈ సీజన్లో మొత్తంగా 13 ఇన్నింగ్స్‌లో కలిపి 446 పరుగులు చేశాడు. సారథిగా జట్టును ప్లే ఆఫ్స్ చేర్చలేకపోయినా.. ఆరో స్థానంలో నిలపగలిగాడు. ఇక టీమిండియా తరఫున రీఎంట్రీలో కూడా అదరగొడున్నాడు. అయితే, వేలానికి ముందు ఢిల్లీ అతడిని వదిలేసింది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్లో పంత్ ఇప్పటి వరకు 111 మ్యాచ్‌లు ఆడి 3284 పరుగులు సాధించాడు.ఇప్పటి వరకు ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర పలికిన టాప్-5 ఆటగాళ్లు👉రిషభ్ పంత్(లక్నో సూపర్ జెయింట్స్- 2025)- రూ. 27 కోట్లు(వికెట్ కీపర్ బ్యాటర్- టీమిండియా)👉శ్రేయస్ అయ్యర్(పంజాబ్ కింగ్స్- 2025)- రూ. 26.75 కోట్లు(బ్యాటర్- టీమిండియా)👉మిచెల్ స్టార్క్(కోల్‌కతా నైట్ రైడర్స్- 2024)- రూ. 24.75 కోట్లు(పేస్ బౌలర్)👉ప్యాట్ కమిన్స్(సన్‌రైజర్స్ హైదరాబాద్- 2024)- రూ. 20.5 కోట్లు(పేస్ బౌలర్- ఆస్ట్రేలియా)👉సామ్ కర్రాన్(పంజాబ్ కింగ్స్- 2023)- రూ. 18.50 కోట్లు(ఆల్‌రౌండర్- ఇంగ్లండ్).చదవండి: IPL 2025: కేఎల్ రాహుల్‌కు భారీ షాక్..𝗥𝗲𝗰𝗼𝗿𝗱-𝗯𝗿𝗲𝗮𝗸𝗶𝗻𝗴 𝗥𝗶𝘀𝗵𝗮𝗯𝗵 🔝Snippets of how that Historic bidding process panned out for Rishabh Pant 🎥 🔽 #TATAIPLAuction | #TATAIPL | @RishabhPant17 | @LucknowIPL | #LSG pic.twitter.com/grfmkuCWLD— IndianPremierLeague (@IPL) November 24, 2024 -
ఇషాన్ కిషన్‌కు కళ్లు చెదిరే ధర.. రూ. 14.5 కోట్లకు వారి సొంతం!
టీమిండియాకు దూరమైన ఇషాన్ కిషన్‌కు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోనూ ఈ ఏడాది కలిసి రాలేదు. ముంబై ఇండియన్స్ తరపున ఐపీఎల్-2024లో ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. పద్నాలుగు మ్యాచ్‌లలో కలిపి 320 పరుగులు చేయగలిగాడు. అయితే, మెగా వేలానికి ముందు ముంబై ఫ్రాంఛైజీ మాత్రం అతడిని వదిలేసింది.జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మలతో పాటు యువ క్రికెటర్ తిలక్ వర్మను రీటైన్ చేసుకున్న ముంబై.. ఇషాన్ పేరును మాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. నిజానికి 2018లో ముంబై తరఫునే క్యాచ్ రిచ్ లీగ్‌లో ఎంట్రీ ఇచ్చాడు ఈ లెఫ్టాండర్ బ్యాటర్. ఆరంభం నుంచే మెరుగ్గా రాణించిన ఇషాన్ కిషన్ కోసం ఐపీఎల్-2022లో ముంబై భారీ మొత్తం వెచ్చించింది.నాడు రూ. 15.25 కోట్ల ధరకు ముంబై సొంతంనాటి మెగా వేలంలో అతడిని ఏకంగా రూ. 15.25 కోట్ల ధరకు సొంతం చేసుకుంది. కానీ.. అప్పటి నుంచి నేటి దాకా ఇషాన్ కిషన్ అందుకు తగ్గ పైసా వసూల్ ప్రదర్శన మాత్రం ఇవ్వలేకపోయాడు. అంతేకాదు.. దేశవాళీ క్రికెట్ ఆడాలన్న బీసీసీఐ ఆదేశాలను ధిక్కరించి సెంట్రల్ కాంట్రాక్టు కోల్పోయి.. జాతీయ జట్టుకూ దూరమయ్యాడు.అయితే, ఇటీవలే రంజీల్లో సెంచరీలు చేయడంతో రీ ఎంట్రీ ఇచ్చిన ఇషాన్ కిషన్.. భారత్-‘ఎ’ జట్టుకు సెలక్ట్ అయ్యాడు. కానీ.. ఆస్ట్రేలియా గడ్డపై కంగారూ జట్టుతో జరిగిన అనధికారిక టెస్టు సిరీస్‌లో పూర్తిగా విఫలమయ్యాడు. ఇలాంటి పరిస్థితుల నడుమ ఇషాన్ కిషన్ ఐపీఎల్-2025 మెగా వేలంలోకి రాబోతున్నాడు.వికెట్ కీపర్ కోటాలో కళ్లు చెదిరే మొత్తంఈ నేపథ్యంలో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నిర్వహించిన ‘మాక్ వేలం’లో మాత్రం ఇషాన్ కిషన్ భారీ ధర పలకడం విశేషం. మెగా వేలంలో ఇషాన్ రూ. 2 కోట్ల కనీస ధరతో పేరును నమోదు చేసుకున్నాడు. అయితే, అశ్విన్ మాత్రం తన వేలంలో.. వికెట్ కీపర్ కోటాలో ఇషాన్ కోసం బిడ్ వేసే ఫ్రాంఛైజీలు రూ. 5 కోట్ల నుంచి మొదలుపెట్టాలని సూచించాడు.ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ రూ. 5 కోట్లకు బిడ్ వేయగా.. క్రమక్రమంగా ఇషాన్ ధర రూ. 10 కోట్లకు పెంచింది. దీంతో పంజాబ్ కింగ్స్ రేసు నుంచి తప్పుకోగా.. లక్నో సూపర్ జెయింట్స్ మాత్రం వికెట్ కీపర్ కోసం ఏకంగా రూ. 14.5 కోట్లు వెచ్చించి దక్కించుకుంది.ఏకంగా రూ. 21 కోట్ల మొత్తానికి అతడు ఉన్నా కూడాఅయితే, అశ్విన్ నిర్వహించిన ఈ మాక్వేలంలో ఇషాన్ కిషన్‌కు కళ్లు చెదిరే మొత్తం దక్కడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫామ్‌లో లేని ఇషాన్ కోసం.. మెగా వేలంలో ఏ ఫ్రాంఛైజీ అంతగా ఆసక్తి చూపదని.. మహా అయితే, అతడికి రూ. ఐదు కోట్లు దక్కవచ్చని క్రికెట్ ప్రేమికులు అంటున్నారు.అంతేకాదు.. లక్నో ఇప్పటికే వికెట్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్‌ను ఏకంగా రూ. 21 కోట్ల మొత్తానికి అట్టిపెట్టుకుంది. అలాంటిది.. ఇషాన్‌ను ఆ ఫ్రాంఛైజీ కొనుక్కోవడం ఏమిటంటూ అశూ మాక్ వేలంలో లక్నో తరఫున పాల్గొన్న అభిమానులను ట్రోల్ చేస్తున్నారు. కాగా సౌదీ అరేబియాలోని జెద్దా వేదికగా నవంబరు 24, 25 తేదీల్లో మెగా వేలం జరుగనుంది.చదవండి: BGT 2024: టీమిండియాకు గుడ్‌న్యూస్ -
IPL 2025: అందుకే లక్నోకు గుడ్‌బై.. కారణం వెల్లడించిన కేఎల్ రాహుల్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్‌తో తాను కొత్త ప్రయాణం మొదలుపెట్టాలనుకుంటున్నానని టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ తెలిపాడు. స్వేచ్ఛాయుత వాతావరణంలో తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేస్తానన్నాడు. కాగా ఈ ఏడాది ఐపీఎల్ మెగా వేలం జరుగనున్న విషయం తెలిసిందే.లక్నో సూపర్ జెయింట్స్‌ను వీడిన కేఎల్ రాహుల్సౌదీ అరేబియాలోని జిద్దా నగరం వేదికగా నవంబరు 24, 25 తేదీల్లో వేలంపాట నిర్వహించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పది ఫ్రాంఛైజీలు తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను విడుదల చేశాయి.ఈ సందర్భంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో కేఎల్ రాహుల్ బంధం తెంచుకున్నట్లు వెల్లడైంది. అయితే, ఇందుకు గల కారణాన్ని ఈ టీమిండియా స్టార్ తాజాగా బయటపెట్టాడు. ‘‘నా ప్రయాణాన్ని సరికొత్తగా మొదలుపెట్టాలనుకుంటున్నాను. నాకు ఉన్న ఆప్షన్లను పరిశీలించాలని భావిస్తున్నా. ముఖ్యంగా ఎక్కడైతే నాకు స్వేచ్ఛగా ఆడే వీలు ఉంటుందో అక్కడికి వెళ్లాలనుకుంటున్నాను.కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకోకతప్పదుఅక్కడి వాతావరణం కాస్త తేలికగా, ప్రశాంతంగా ఉండగలగాలి. అందుకే మన మంచి కోసం మనమే కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకోకతప్పదు’’ అని కేఎల్ రాహుల్ ఇండియా టుడేతో పేర్కొన్నాడు. కాగా 2022లో లక్నో ఫ్రాంఛైజీ ఐపీఎల్లో అడుగుపెట్టింది. తమ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్‌ను నియమించుకుంది.కెప్టెన్‌గా రాణించినాఅయితే, యాజమాన్యం అంచనాలకు తగ్గట్లుగానే రాహుల్.. లక్నోను అరంగేట్ర సీజన్లోనే ప్లే ఆఫ్స్‌నకు చేర్చాడు. ఆ తర్వాతి ఎడిషన్‌లోనూ టాప్-4లో నిలిపాడు. అయితే, ఐపీఎల్-2024లో మాత్రం లక్నో ప్లే ఆఫ్స్‌నకు అర్హత సాధించలేకపోయింది. పద్నాలుగు మ్యాచ్‌లకు గానూ.. ఏడే గెలిచి పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది.ఇదిలా ఉంటే.. లక్నో జట్టు యజమాని, ప్రముఖ వ్యాపారవేత్త సంజీవ్ గోయెంకా ఐపీఎల్ 2024లో ఓ మ్యాచ్ సందర్భంగా.. రాహుల్‌ను అందరి ముందే తిట్టాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఘోర ఓటమిని జీర్ణించుకోలేక కెప్టెన్‌పై బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేశాడు.రాహుల్‌కు ఘోర అవమానంఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ కాగా.. సంజీవ్ గోయెంకాపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. అయితే, ఆ తర్వాత అతడు నష్టనివారణ చర్యలే చేపట్టి.. రాహుల్‌ను తన ఇంటికి ఆహ్వానించి ఫొటోలు విడుదల చేశాడు. కానీ.. అందరి ముందు జరిగిన అవమానాన్ని మర్చిపోలేకపోయిన రాహుల్ ఆ జట్టును వీడినట్లు అతడి తాజా వ్యాఖ్యల ద్వారా స్పష్టమైంది. ఇక టీమిండియా టీ20 జట్టులో పునరాగమనమే లక్ష్యంగా తాను ఇకపై అడుగులు వేస్తానని కేఎల్ రాహుల్ ఈ సందర్భంగా తన మనసులోని మాటను వెల్లడించాడు. కాగా లక్నో తరఫున కేఎల్ రాహుల్ 2022లో 616 పరుగులు చేశాడు. గత రెండు సీజన్లలో కలిపి 23 మ్యాచ్‌లు ఆడి 800 రన్స్ స్కోరు చేశాడు. ఇక మొత్తంగా అంతర్జాతీయ టీ20లలో రాహుల్ ఇప్పటి వరకు 72 మ్యాచ్‌లు ఆడి 2265 పరుగులు సాధించాడు.చదవండి: CT 2025: పాకిస్తాన్ కాదు... సౌతాఫ్రికా వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ!? -
IPL 2025: నికోలస్ పూరన్‌కు 18 కోట్లు..!
ఐపీఎల్ 2025 సీజన్‌కు సంబంధించి అన్ని ఫ్రాంచైజీలు తమతమ రిటైన్ లిస్ట్‌ను సమర్పించడానికి మరో మూడు రోజుల గడువు మాత్రమే ఉంది. అక్టోబర్ 31 రిటైన్ లిస్ట్‌ను సమర్పించడానికి డెడ్ లైన్ అని బీసీసీఐ తెలిపింది. ప్రస్తుతమున్న సమాచారం మేరకు ఒక్కో ఫ్రాంచైజీ ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకోవచ్చు. ఇందులో గరిష్టంగా అయిదుగురు క్యాప్డ్ ప్లేయర్లు, ఇద్దరు అన్క్యాప్డ్ ప్లేయర్లకు అవకాశం ఉంటుంది.రిటైన్ చేసుకునే క్యాప్డ్ ప్లేయర్లకు ఛాయిస్ ప్రకారం వరుసగా 18, 14, 11 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. రిటైన్ చేసుకునే అన్క్యాప్డ్ ప్లేయర్‌కు 4 కోట్లు పారితోషికం చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఫ్రాంచైజీలన్నీ తమ తమ రిటైన్ లిస్ట్‌ను దాదాపుగా ఖరారు చేసుకున్నాయి. అన్ని ఫ్రాంచైజీల బాటలోనే లక్నో సూపర్ జెయింట్స్ కూడా నడుస్తుంది. ఈ ఫ్రాంచైజీ కూడా తమ రిటైన్ జాబితాను సిద్దం చేసుకున్నట్లు సమాచారం.అయితే ఎల్ఎస్జీ ఈసారి తమ కెప్టెన్ కేఎల్ రాహుల్ లేకుండానే రిటైన్ లిస్ట్‌ను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఫస్ట్ చాయిస్ కింద నికోలస్ పూరన్‌ను ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. పూరన్‌కే కెప్టెన్సీ బాధ్యతలు కూడా కట్టబెట్టనున్నట్లు తెలుస్తుంది. ఇదే కరెక్ట్ అయితే పూరన్‌కు పారితోషికం కింద రూ. 18 కోట్లు దక్కనున్నాయి.ఎల్ఎస్జీ.. పూరన్‌తో పాటు మయాంక్ యాదవ్, రవి బిష్ణోయ్, ఆయుశ్ బదోని, మొహిసిన్ ఖాన్‌లను రిటైన్ చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ ఫ్రాంచైజీ మయాంక్ యాదవ్‌ను సెకెండ్ ఛాయిస్‌గా ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. ఇదే నిజమైతే మయాంక్ యాదవ్‌కు రూ. 14 కోట్లు దక్కనున్నాయి. 2024 ఐపీఎల్ సీజన్లో అరంగేట్రం చేసిన మయాంక్ కేవలం 4 మ్యాచ్‌లే ఆడాడు. ఇందులో 7 వికెట్లు పడగొట్టాడు. -
కేఎల్ రాహుల్‌ను వదిలేయనున్న లక్నో.. మయాంక్ యాదవ్‌కు 14 కోట్లు..?
ఐపీఎల్ 2025 సీజన్ మెగా వేలానికి ముందు లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యం కేఎల్ రాహుల్‌ను రిలీజ్ చేయాలని డిసైడైనట్లు తెలుస్తుంది. ఫ్రాంచైజీ మేనేజ్మెంట్ రాహుల్ స్ట్రయిక్‌రేట్ పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. గత మూడు సీజన్లలో జట్టు పేలవ ప్రదర్శనకు రాహుల్ స్ట్రయిక్ రేట్ ప్రధాన కారణమని మేనేజ్మెంట్ భావిస్తుందట.రాహుల్ స్థానంలో లక్నో కెప్టెన్సీ పగ్గాలు నికోలస్ పూరన్‌కు అప్పజెప్పాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఎల్ఎస్జీ యాజమాన్యం పూరన్‌తో పాటు మరో ఇద్దరిని రిటైన్ చేసుకోనుందని సమాచారం. రవి బిష్ణోయ్, మయాంక్ యాదవ్‌ల కోసం భారీ మొత్తం ఖర్చు చేయనున్నట్లు తెలుస్తుంది. మయాంక్‌కు పారితోషికం కింద దాదాపు రూ. 14 కోట్లు దక్కవచ్చని అంచనా. అన్క్యాప్డ్ ప్లేయర్ల కోటాలో ఆయుశ్ బదోని, మొహిసిన్ ఖాన్‌లను కూడా రిటైన్ చేసుకోనున్నట్లు సమాచారం.కాగా, లక్నో సూపర్ జెయింట్స్ 2022 సీజన్‌తో ఐపీఎల్ అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి మూడు సీజన్ల పాటు కేఎల్ రాహుల్ ఆ జట్టుకు నాయకత్వం వహించాడు. 2022, 2023 సీజన్లలో ప్లే ఆఫ్స్‌కు చేరిన లక్నో.. ఈ ఏడాది లీగ్ స్టేజ్‌లోనే ఇంటిముఖం పట్టింది. చదవండి: ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ.. 103 బంతుల్లో 27 ఫోర్లు, 7 సిక్సర్లు -
గంభీర్ భయ్యా ఆరోజు నాతో చెప్పాడు: మయాంక్ యాదవ్
తాను టీమిండియాకు ఎంపికవుతానని ఊహించలేదన్నాడు యువ బౌలర్ మయాంక్ యాదవ్. భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) వెబ్సైట్ చూసిన తర్వాతే తనకు నమ్మకం కుదిరిందన్నాడు. ఆ తర్వాత తనను అభినందిస్తూ ఫోన్ కాల్స్ వచ్చాయని.. ఆ సమయంలో ఒక్కసారిగా గతం కళ్ల ముందు కదలాడిందని ఉద్వేగానికి లోనయ్యాడు.లక్నోకు ఆడిన మయాంక్టీమిండియా ప్రస్తుత హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్ గతంలో చెప్పిన మాటలు తనపై ప్రభావం చూపాయని మయాంక్ యాదవ్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. కాగా ఢిల్లీకి చెందిన మయాంక్.. 2024లో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అరంగేట్రం చేశాడు. లక్నో సూపర్ జెయింట్స్‌కు ఆడిన ఈ పేస్ బౌలర్.. గంటకు 150కి పైగాకిలో మీటర్ల వేగంతో బంతులు విసిరి క్రికెట్ ప్రేమికుల దృష్టిని ఆకర్షించాడు.స్పీడ్‌కు గాయాల బ్రేక్వరుసగా రెండు మ్యాచ్‌లలో అద్భుత ప్రదర్శనతో జట్టును గెలిపించి.. పేస్ స్టన్ గన్‌గా ప్రశంసలు అందుకున్నాడు. అయితే, గాయం కారణంగా అతడి స్పీడ్‌కు బ్రేక్ పడింది. పక్కటెముకల నొప్పితో మిగిలిన మ్యాచ్‌లకు అతడు దూరమయ్యాడు. ఈ క్రమంలో బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో చికిత్స పొందిన మయాంక్ యాదవ్ ఇటీవలే మ్యాచ్ ఫిట్నెస్ సాధించాడు. నెట్స్‌లో అతడి బౌలింగ్ పట్ల సంతృప్తివ్యక్తం చేసిన టీమిండియా సెలక్టర్లు బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు మయాంక్‌ను ఎంపిక చేశారు.గంభీర్ భయ్యా ఆరోజు నాతో చెప్పాడుఈ నేపథ్యంలో మయాంక్ యాదవ్ మాట్లాడుతూ.. ‘‘‘కొంత మంది ఆటగాళ్లు వరుసగా విఫలమైనా.. తమను తాము నిరూపించుకోవడానికి వరుస అవకాశాలు వస్తాయి.. కానీ కొంతమందికి మాత్రం ఎప్పుడో ఒకసారి ఒక్క ఛాన్స్ మాత్రమే వస్తుంది’ అని గౌతం గంభీర్ భయ్యా ఓసారి నాతో చెప్పాడు. నిజానికి నన్ను ఓ ఐపీఎల్ టీమ్ కొనుగోలు చేసిన తర్వాత కూడా షూ స్పాన్సర్ కోసం వెతుక్కోవాల్సిన దుస్థితిలో ఉన్న రోజులవి..నన్ను నేను నిరూపించుకున్నానుఆ సమయంలో గౌతం భయ్యా మాటలో నా మనసులో అలాగే ఉండిపోయాయి. ఆయనతో పాటు విజయ్ దహియా(లక్నో మాజీ కోచ్) కూడా.. కనీసం రెండేళ్ల తర్వాతైనా నువ్వు మొదటి ఐపీఎల్ మ్యాచ్ ఆడతావు. అప్పటి వరకు ఓపికగా వేచిచూడు అని చెప్పారు. ఈ ఏడాది ఆ అవకాశం వచ్చింది. నన్ను నేను నిరూపించుకున్నాను.ఇక నేను టీమిండియాకు ఎంపికయ్యాననే విషయం కాస్త ఆలస్యంగానే తెలిసింది. ఎన్సీఏలో నా సహచర ఆటగాళ్లకు కంగ్రాట్యులేషన్స్ చెబుతూ కాల్స్ వచ్చాయి. అప్పుడు నేను బీసీసీఐ అధికారిక వెబ్సైట్ చూస్తే టీ20 జట్టులో నా పేరు కూడా కనిపించింది. అప్పుడు ఒక్కసారిగా గతం గుర్తుకు వచ్చింది. అరంగేట్రం ఖాయమే!వరుస గాయాలతో సతమతమవుతూ నేను ఎన్సీఏకు చేరడం.. నాలుగు నెలలు అక్కడే ఇప్పుడిలా జట్టుకు ఎంపిక కావడం.. అన్నీ గుర్తుకువచ్చాయి’’ అని టైమ్స్ ఆఫ్ ఇండియాతో పేర్కొన్నాడు. కాగా 22 ఏళ్ల మయాంక్ స్వదేశంలో బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టడం దాదాపు ఖాయమైనట్లే! లక్నో సూపర్ జెయింట్స్ మాజీ మెంటార్ గంభీర్, మాజీ బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్లకు మయాంక్ నైపుణ్యాల గురించి అవగాహన ఉంది. వీరిద్దరిలో ఒకరు ఇప్పుడు టీమిండియా హెడ్‌కోచ్, మరొకరు బౌలింగ్ కోచ్ అన్న సంగతి తెలిసిందే. చదవండి: టీమిండియా స్టార్లంతా రెండు నెలలు ఆటకు దూరం -
బంగ్లాతో టీ20లు.. టీమిండియాలోకి పేస్ గన్ ఎంట్రీ!
భారత సంచలన పేసర్ మయాంక్ యాదవ్ త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ సందర్భంగా ఈ యువ స్పీడ్‌స్టర్ టీమిండియా తరఫున అరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా దేశవాళీ క్రికెట్లో ఢిల్లీకి ఆడుతున్న ఫాస్ట్ బౌలర్ ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఎంట్రీ ఇచ్చాడు.మెరుపు వేగంతో దూసుకువచ్చే బంతులు విసరడంలో దిట్టలక్నో సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వహించిన ఈ రైటార్మ్ బౌలర్.. తన మెరుపు వేగంతో హాట్‌టాపిక్‌గా మారాడు. గంటకు 150కి పైగా కిలో మీటర్ల వేగంతో బంతులు విసురుతూ యువ బౌలర్లందరిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. లక్నో తరఫున వరుసగా రెండు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకుని.. ఐపీఎల్ చరిత్రలో ఈ ఘనత సాధించిన మొదటి క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు.మ్యాచ్ ఫిట్నెస్ కూడా సాధించాడు!అయితే, ఆ వెంటనే గాయం కారణంగా మయాంక్ జట్టుకు దూరం కావాల్సి వచ్చింది. పక్కటెముకల నొప్పితో బాధపడుతున్న అతడు.. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)కి చేరాడు. అక్కడి వైద్య బృందం పర్యవేక్షణలో చికిత్స పొందిన 22 ఏళ్ల మయాంక్.. ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నాడు. మ్యాచ్ ఫిట్నెస్ కూడా సాధించాడు.టీమిండియా సెలక్టర్ల ఆరాఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు మాట్లాడుతూ.. ‘‘గత నెల రోజులుగా మయాంక్ గాయం కారణంగా ఎలాంటి ఇబ్బందిపడలేదు. ఎన్సీఏ నెట్స్‌లో పూర్తి స్థాయిలో బౌలింగ్ చేశాడు. అతడు అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రానికి సిద్ధంగా ఉన్నాడా? లేదా? అని టీమిండియా సెలక్టర్లు ఆరా తీశారు.స్వదేశంలో వరుస టెస్టు సిరీస్‌లు ఉన్న కారణంగా.. బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ సందర్భంగా ఎక్కువగా కొత్త ముఖాలకే చోటు ఇవ్వాలనే యోచనలో ఉన్నారు. మయాంక్ ఇక్కడ రోజుకు 20 ఓవర్ల పాటు వైట్‌బాల్‌తో ప్రాక్టీస్ చేస్తున్నాడు.ఎన్సీఏలో అతడి ప్రదర్శన చూసిన తర్వాత.. టీమిండియా సెలక్టర్లు అతడి బంగ్లాతో టీ20 సిరీస్‌కు ఎంపిక చేస్తారనే నమ్మకం బలపడింది. ఎన్సీఏ కొత్త కార్యాలయం ప్రారంభోత్సవం కోసం టీమిండియా ఛీఫ్ సెలక్టర్ అగార్కర్ బెంగళూరుకు రానున్నాడు. అప్పుడు ఈ విషయంపై స్పష్టత వస్తుంది.గంభీర్, మోర్కెల్లకు తెలుసుఅయినా.. మయాంక్‌ను కేవలం టీ20 ఫార్మాట్‌కే పరిమితం చేయాలని సెలక్టర్లు భావించడం లేదు. టీమిండియా ప్రస్తుత హెడ్‌కోచ్ గౌతం గంభీర్, బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ లక్నో సూపర్ జెయింట్స్‌తో ఉన్న సమయంలో మయాంక్‌ను దగ్గరగా గమనించారు. అతడి ప్రతిభ గురించి వారికి తెలుసు’’ అని టైమ్స్ ఆఫ్ ఇండియాతో వ్యాఖ్యానించాయి. దీనిని బట్టి బంగ్లాదేశ్‌తో అక్టోబరు 6-12 మధ్య జరుగనున్న టీ20 సిరీస్‌కు మయాంక్ యాదవ్ ఎంపిక కావడం ఖాయంగా కనిపిస్తోంది.చదవండి: లివింగ్‌స్టోన్ విధ్వంసం.. బ్రూక్ కెప్టెన్ ఇన్నింగ్స్.. మట్టికరిచిన ఆసీస్ -
లక్నోలోకి రోహిత్ శర్మ..? హింట్ ఇచ్చిన ఫీల్డింగ్ కోచ్ జాంటీ రోడ్స్
ఐపీఎల్-2025 సీజన్ ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీని వీడిడంపై ఊహాగానాలు ఊపుందుకున్నాయి. రోహిత్ వచ్చే ఏడాది సీజన్ కోసం లక్నో సూపర్ జెయింట్స్‌తో జతకట్టనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.అతడి కోసం ఎంత మొత్తాన్ని నైనా వెచ్చించేందుకు లక్నో ఫ్రాంచైజీ సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా లక్నో ఫీల్డింగ్ కోచ్ జాంటీ రోడ్స్ చేసిన వ్యాఖ్యలు ఈ వార్తలకు మరింత ఊతమిస్తున్నాయి."శర్మ వేలంలోకి వస్తే అతడిని స్వాగతించేందుకు లక్నో సూపర్ జెయింట్స్ సిద్దంగా ఉంది. అతడు చాలా గొప్ప ఆటగాడు. హిట్‌మ్యాన్ వేలంలోకి వస్తే ప్రతీ ఫ్రాంచైజీ అతడిని సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ముంబై ఫీల్డింగ్ కోచ్‌గా ఉన్న సమయంలో రోహిత్‌తో చాలా క్లోజ్‌గా పనిచేశా. అతడి బ్యాటింగ్ స్టైల్ అంటే నాకెంతో ఇష్టమని" న్యూస్ 24కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రోడ్స్ పేర్కొన్నాడు. దీంతో రోహిత్‌పై లక్నో దృష్టిసారించినట్లు తేటతెల్లమైంది.కాగా ఐపీఎల్-2024 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ తమ జట్టు కెప్టెన్సీ నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. అతడి స్ధానంలో స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ చేసుకుని మరి ముంబై తమ జట్టు పగ్గాలు అప్పగించింది. అప్పటి నుంచి ముంబై యాజమాన్యం పట్ల హిట్‌మ్యాన్ అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఫ్రాంచైజీ మారేందుకు రోహిత్ శర్మ సిద్దమైనట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. -
లక్నో జట్టు ‘గేమ్ ఛేంజర్’ అతడే: ఎమ్ఎస్కే ప్రసాద్
జహీర్ ఖాన్ రాకతో లక్నో సూపర్ జెయింట్స్ రాత మారబోతుందని ఆ జట్టు టాలెంట్ సెర్చ్ డైరెక్టర్, టీమిండియా మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్ఎస్కే ప్రసాద్ అన్నాడు. ఈ రివర్స్ స్వింగ్ కింగ్‌ను గేమ్ ఛేంజర్‌గా అభివర్ణించాడు. అంతర్జాతీయ క్రికెట్లో అపార అనుభవం ఉన్న జహీర్ మార్గదర్శనంలో లక్నో అద్భుత విజయాలు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశాడు.లక్నో మెంటార్‌గా జహీర్ నియామకంకాగా ఐపీఎల్ ఫ్రాంఛైజీ లక్నో సూపర్ జెయింట్స్ తమ కొత్త మెంటార్‌గా భారత మాజీ పేస్ బౌలర్ జహీర్ ఖాన్‌ను నియమించిన విషయం తెలిసిందే. జహీర్ ఈ జట్టుతో చేరుతున్నట్లుగా గత కొంత కాలంగా వార్తలు వినిపించగా... టీమ్ యజమాని సంజీవ్ గోయెంకా బుధవారం అధికారికంగా ప్రకటించారు. మెంటార్‌గా ప్రధాన జట్టుకే పరిమితం కాకుండా ప్రతిభాన్వేషణ, కొత్త ఆటగాళ్లను తీర్చిదిద్దే అదనపు బాధ్యతలను కూడా జహీర్‌కు లక్నో యాజమాన్యం అప్పగించింది.క్యాష్ రిచ్ లీగ్‌లోకి 2022లో లీగ్‌లోకి ప్రవేశించిన లక్నో సూపర్ జెయింట్స్‌కు రెండేళ్లు గౌతమ్ గంభీర్ మెంటార్‌గా వ్యవహరించగా.. కేఎల్ రాహుల్ సారథ్యంలోని ఈ జట్టు రెండుసార్లు ప్లే ఆఫ్స్‌కు చేరింది. ఆ తర్వాత మెంటార్ బాధ్యతల నుంచి గంభీర్ తప్పుకోగా.. 2024 సీజన్లో లక్నో పేలవ ప్రదర్శన కనబర్చింది. ఈ క్రమంలో గంభీర్ స్థానాన్ని జహీర్‌తో భర్తీ చేసింది యాజమాన్యం.అత్యుత్తమ బౌలర్ రాక మాకు శుభ పరిణామంఈ నేపథ్యంలో ఎమ్ఎస్కే ప్రసాద్ మాట్లాడుతూ.. ‘‘లక్నో జట్టుకు ఇదొక శుభవార్త. జహీర్ ఖాన్ వంటి మేటి క్రికెటర్ మెంటార్‌గా రావడం మంచి పరిణామం. జహీర్ నెమ్మదస్తుడు. కూల్‌గానే తనకు కావాల్సిన ఫలితాలను రాబట్టుకోగల సమర్థత ఉన్నవాడు. ఆట పట్ల అతడికి విశేష జ్ఞానం ఉంది. ఐపీఎల్లో జహీర్ కెరీర్ ఇలాటీమిండియా తరఫున మూడు ఫార్మాట్లలో అత్యుత్తమంగా రాణించిన ఘనత అతడి సొంతం. ఐపీఎల్‌లోనూ తనకు గొప్ప అనుభవం ఉంది. లక్నో జట్టుకు అతడు గేమ్ ఛేంజర్ కాబోతున్నాడు’’ అని స్పోర్ట్స్కీడాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. కాగా భారత అత్యుత్తమ పేస్ బౌలర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న జహీర్ 2017 వరకు ఐపీఎల్ ఆడాడు. ముంబై, బెంగళూరు, ఢిల్లీ జట్ల తరఫున మొత్తం 100 మ్యాచ్‌లు ఆడి 102 వికెట్లు పడగొట్టిన అతను ఆ తర్వాత కూడా ఐపీఎల్‌తో కొనసాగాడు. 2018–2022 మధ్య ఐదేళ్ల పాటు జహీర్ ఖాన్ ముంబై ఇండియన్స్ టీమ్‌కు డైరెక్టర్, ఆ తర్వాత హెడ్ ఆఫ్ గ్లోబల్ డెవలప్‌మెంట్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. ఇక ఐపీఎల్-2025లో లక్నో మెంటార్‌గా వ్యవహరించనున్నాడు.చదవండి: ఒక్కడి కోసం అంత ఖర్చు పెడతారా? లక్నో జట్టు ఓనర్ -
ఒక్కడి కోసం అంత ఖర్చు పెడతారా? లక్నో జట్టు ఓనర్
‘‘టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కోసం ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంఛైజీ లక్నో సూపర్ జెయింట్స్ రూ. 50 కోట్లు అయినా సరే ఖర్చుపెట్టబోతోంది.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో పోటీ నేపథ్యంలో అతడికి ఇప్పటికే ఈ మేర భారీ ఆఫర్ కూడా ఇచ్చింది’’ అంటూ సోషల్ మీడియాలో కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ ఊహాగానాలపై లక్నో జట్టు యజమాని సంజీవ్ గోయెంకా తాజాగా స్పందించాడు. ముంబై జట్టుతో సుదీర్ఘ అనుబంధంఇలాంటి నిరాధార వార్తలు ఎలా పుట్టుకొస్తాయో తనకు అర్థం కావడం లేదని.. అయినా ఒక్క ఆటగాడి కోసం ఇంత పెద్ద మొత్తం ఎవరైనా ఖర్చు చేస్తారా? అంటూ విస్మయం వ్యక్తం చేశాడు. ఈ ఏడాది ఐపీఎల్ మెగా వేలం జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కళ్లన్నీ దిగ్గజ బ్యాటర్ రోహిత్ శర్మపైనే ఉన్నాయి. ముంబై ఇండియన్స్‌ను ఐదుసార్లు చాంపియన్స్‌గా నిలిపిన హిట్‌మ్యాన్.. పదేళ్లపాటు ఆ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అనూహ్య రీతిలో వేటుఅయితే, గతేడాది ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఆగమనంతో రోహిత్‌ను సారథ్య బాధ్యతల నుంచి తప్పించి ముంబై యాజమాన్యం. దీంతో అసంతృప్తికి లోనైన రోహిత్ శర్మ ఆ జట్టును వీడాలని నిర్ణయించుకున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఫలితంగా రోహిత్ శర్మ వేలంలోకి రానున్నాడని.. అతడి కోసం లక్నో, ఢిల్లీ తదితర జట్లు పోటీపడే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయం గురించి సంజీవ్ గోయెంకాకు ప్రశ్న ఎదురైంది.‘‘రోహిత్ కోసం లక్నో రూ. 50 కోట్లు విడిగా పెట్టిందనే వదంతులు వస్తున్నాయి. ఇవి నిజమేనా?’’ అని యాంకర్ ప్రశ్నించారు. ఇందుకు బదులిస్తూ.. ‘‘అసలు రోహిత్ శర్మ వేలంలోకి వస్తాడో? లేదో మీరే చెప్పండి. ఈ విషయం గురించి ఎవరికైనా స్పష్టత ఉందా?ఒక్కడి కోసం రూ. 50 కోట్లా?ఇవన్నీ వట్టి వదంతులే. ముంబై ఇండియన్స్ రోహిత్‌ను రిలీజ్ చేస్తుందో లేదో కూడా తెలియదు. ఒకవేళ అదే జరిగి అతడు వేలంలోకి వచ్చినా.. సాలరీ పర్సులోని 50 శాతం డబ్బు ఒక్క ప్లేయర్ కోసమే ఎవరైనా ఖర్చు చేస్తారా? అలాంటపుడు మిగతా 22 ప్లేయర్ల సంగతేంటి?’’ అని సంజీవ్ గోయెంకా తిరిగి ప్రశ్నించాడు.కోరుకుంటే సరిపోదుఈ క్రమంలో.. ‘‘రోహిత్ మీ విష్ లిస్ట్‌లో ఉన్నాడా?’’ అనే ప్రశ్నకు స్పందిస్తూ.. ‘‘ప్రతి ఒక్కరికి ఒక విష్ లిస్ట్ ఉంటుంది. అత్యుత్తమ ఆటగాడు, అత్యుత్తమ కెప్టెన్‌నే ఎవరైనా కోరుకుంటారు. అయితే, మనం ఏం ఆశిస్తున్నామనేది కాదు.. మనకు ఏది అందుబాటులో ఉంది.. మనం పొందగలిగేదన్న విషయం మీదే అంతా ఆధారపడి ఉంటుంది. నేను కావాలనుకున్న వాళ్లను వేరే ఫ్రాంఛైజీ దక్కించుకోవచ్చు కదా!’’ అని సంజీవ్ గోయెంకా సమాధానం దాటవేశాడు.చదవండి: ‘రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్‌తోనే ఉంటాడు’గంభీర్ స్థానంలో జహీర్ ఖాన్.. కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా ఉంటాడా? -
లక్నోకు కొత్త మెంటార్.. కేఎల్ రాహుల్‌పై గోయెంకా కామెంట్
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఫ్రాంఛైజీ లక్నో సూపర్ జెయింట్స్ తమ కొత్త మెంటార్ పేరును ప్రకటించింది. టీమిండియా రివర్స్ స్వింగ్ కింగ్ జహీర్ ఖాన్ తమ జట్టుకు మార్గ నిర్దేశనం చేయనున్నట్లు తెలిపింది. ఈ దిగ్గజ పేసర్‌తో జతకట్టడం సంతోషంగా ఉందంటూ హర్షం వ్యక్తం చేసింది. కాగా ఐపీఎల్-2023లో లక్నో మెంటార్‌గా ఉన్న భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్.. ఈ ఏడాది ఆ జట్టును వీడిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో గౌతీ తిరిగి కోల్‌కతా నైట్ రైడర్స్ గూటికి చేరుకోగా.. లక్నో అతడి స్థానాన్ని అలాగే ఖాళీగా ఉంచింది. ఈ నేపథ్యంలో తాజాగా జహీర్ ఖాన్‌ను తమ మెంటార్‌గా అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా లక్నో ఫ్రాంఛైజీ యజమాని, ప్రముఖ వ్యాపారవేత్త సంజీవ్ గోయెంకా జహీర్‌కు లక్నో జెర్సీ(నంబర్ 34)ని ప్రదానం చేశాడు.రివర్స్ స్వింగ్ కింగ్‌కు 102 వికెట్లుకాగా మహారాష్ట్రకు చెందిన 45 ఏళ్ల జహీర్ ఖాన్ దాదాపు రెండేళ్ల విరామం తర్వాత ఐపీఎల్లో రీఎంట్రీ ఇస్తున్నాడు. గతంలో ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ఆడిన ఈ లెఫ్టార్మ్ పేసర్... పది సీజన్లలో 100 మ్యాచ్‌లు ఆడి 7.58 ఎకానమీతో 102 వికెట్లు పడగొట్టాడు.అనంతరం కోచ్ అవతారమెత్తిన జహీర్ ఖాన్.. తొలుత ముంబై ఇండియన్స్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా పనిచేశాడు. 2018- 2022 మధ్య కాలంలో ఆ ఫ్రాంఛైజీతో ప్రయాణం చేసిన ఈ దిగ్గజ బౌలర్.. రెండేళ్ల విరామం అనంతరం మళ్లీ ఐపీఎల్లో అడుగుపెట్టాడు. కాగా లక్నో బౌలింగ్ కోచ్‌గా ఉన్న సౌతాఫ్రికా స్పీడ్‌స్టర్ మోర్నీ మోర్కెల్ ఇటీవలే టీమిండియా బౌలింగ్ శిక్షకుడిగా నియమితుడైన విషయం తెలిసిందే.కేఎల్ రాహుల్‌పై గోయెంకా కామెంట్ఈ నేపథ్యంలో లక్నో మెంటార్‌గా వ్యవహరించడంతో పాటు ఫాస్ట్ బౌలింగ్ విభాగాన్ని కూడా జహీర్ పర్యవేక్షించనున్నట్లు తెలుస్తోంది. ఇక జస్టిన్ లాంగర్ ఈ జట్టుకు హెడ్‌కోచ్‌గా ఉండగా.. లాన్స్ క్లూస్నర్, ఆడం వోగ్స్ అతడికి డిప్యూటీలుగా పనిచేస్తున్నారు. ఇదిలా ఉంటే.. లక్నో కెప్టెన్సీకి కేఎల్ రాహుల్ గుడ్‌బై చెప్తున్నాడనే వార్తల నడుమ.. సంజీవ్ గోయెంకా మాట్లాడుతూ.. అతడు తమ కుటుంబంలోని వ్యక్తి లాంటివాడని తెలిపాడు. అయితే, తమ కెప్టెన్ మార్పు గురించి వస్తున్న వార్తలపై స్పందించేందుకు నిరాకరించాడు. మరోవైపు.. కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఈ ఏడాది చాంపియన్‌గా నిలపడంలో కీలక పాత్ర పోషించిన గంభీర్ టీమిండియా ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన విషయం విదితమే.చదవండి: భారత స్టార్ క్రికెటర్ గుండెలో రంధ్రం.. సర్జరీ తర్వాత ఇలా..Zaheer, Lucknow ke dil mein aap bohot pehle se ho 🇮🇳💙 pic.twitter.com/S5S3YHUSX0— Lucknow Super Giants (@LucknowIPL) August 28, 2024 -
లక్నో కెప్టెన్సీకి రాహుల్ గుడ్‌బై!.. రేసులో ఆ ఇద్దరు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025లో లక్నో సూపర్ జెయింట్స్‌కు కొత్త కెప్టెన్ వచ్చే అవకాశం ఉంది. టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ స్థానంలో మరో సీనియర్ ప్లేయర్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించేందుకు ఫ్రాంఛైజీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. వేలం నేపథ్యంలో రిటెన్షన్ విధివిధానాలపై బీసీసీఐ స్పష్టతనిచ్చిన తర్వాత ఇందుకు సంబంధించి లక్నో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.కెప్టెన్‌గా విఫలంకాగా 2022లో క్యాష్ రిచ్ లీగ్‌లో అరంగేట్రం చేసిన లక్నో జట్టుకు ఆది నుంచి కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా ఉన్నాడు. గత రెండు సీజన్లలో టీమ్‌ను ప్లే ఆఫ్స్‌నకు చేర్చిన ఈ కర్ణాటక వికెట్ కీపర్ బ్యాటర్.. ఈ ఏడాది మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. ఆటగాడిగా 520 పరుగులతో పర్వాలేదనపించినా కెప్టెన్‌గా మాత్రం విఫలమయ్యాడు. లక్నోతోనే రాహుల్.. కానీఈ క్రమంలో లక్నో ఈసారి పద్నాలుగింట కేవలం ఏడు మాత్రమే గెలిచి ఏడోస్థానానికి పరిమితమైంది. ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఘోర ఓటమి నేపథ్యంలో ఫ్రాంఛైజీ ఓనర్ సంజీవ్ గోయెంక బహిరంగంగానే రాహుల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో రాహుల్ లక్నో ఫ్రాంఛైజీని వీడనున్నాడనే వార్తలు రాగా.. సోమవారం సంజీవ్ గోయెంకాతో భేటీ అయిన రాహుల్ తాను జట్టుతోనే ఉంటాననే సంకేతాలు ఇచ్చాడు. రేసులో ఆ ఇద్దరుఈ క్రమంలో లక్నో జట్టు సంబంధిత వర్గాలు వార్తా సంస్థ IANSతో ఆసక్తికర విషయాలు వెల్లడించాయి. ‘‘సీఈఓ సంజీవ్ గోయెంకాతో రాహుల్ అధికారికంగానే భేటీ అయ్యాడు. రిటెన్షన్ గురించి చర్చలు జరిగాయి. వచ్చే ఏడాది కెప్టెన్‌గా ఉండటానికి రాహుల్ విముఖత చూపాడు. బ్యాటర్‌గా తాను మరింతగా రాణించేందుకు సారథ్య బాధ్యతలు వదులుకోవాలని భావిస్తున్నాడు. నిజానికి రాహుల్ కెప్టెన్సీ పట్ల గోయెంకాకు పూర్తి విశ్వాసం ఉంది. అయితే, తను మాత్రం అందుకు సిద్ధంగా లేడు.లక్నో రాహుల్‌ను రిటైన్ చేసుకోవడం ఖాయం. అయితే, కెప్టెన్‌గా ఉండడు. బీసీసీఐ విధివిధానాలు ఖరారు చేసిన తర్వాత ఈ అంశంపై మేము నిర్ణయం తీసుకుంటాం. అయితే, ఇప్పటికి కెప్టెన్సీ రేసులో కృనాల్ పాండ్యా, నికోలస్ పూరన్ ఉన్నారు’’ అని సదరు వర్గాలు పేర్కొన్నాయి. కాగా సెప్టెంబరు 5 నుంచి మొదలుకానున్న దులిప్ ట్రోఫీతో కేఎల్ రాహుల్ బిజీ కానున్నాడు.చదవండి: Duleep Trophy: ఆ ముగ్గురు స్టార్లు దూరం.. బీసీసీఐ ప్రకటన -
లక్నో మెంటార్‌గా జహీర్ ఖాన్!
న్యూఢిల్లీ: భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్‌ను మెంటార్‌గా నియమించుకునేందుకు ఐపీఎల్ ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) ప్రయత్నాలు చేస్తోంది. మెగా వేలం ప్రారంభానికి ముందే జహీర్‌తో ఒప్పందం కుదుర్చుకోవాలని లక్నో జట్టు యాజమాన్యం భావిస్తోంది. ముంబై ఇండియన్స్ గ్లోబల్ డెవలప్మెంట్ హెడ్‌గా పనిచేస్తున్న జహీర్ ఖాన్.. ఐపీఎల్లో 10 సీజన్లపాటు మూడు జట్ల తరఫున 100 మ్యాచ్‌లు ఆడి 102 వికెట్లు పడగొట్టాడు.2017లో అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికిన జహీర్... అప్పటి నుంచి ముంబై ఇండియన్స్‌తో కొనసాగుతున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్‌కు మెంటార్‌గా వ్యవహరించిన గౌతమ్ గంభీర్ 2023 సీజన్ అనంతరం లక్నోను వీడి కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) జట్టుకు మారాడు. ఈ సీజన్లో గంభీర్ మార్గదర్శకత్వంలో కోల్‌కతా జట్టు అద్వితీయ ప్రదర్శన కనబర్చి మూడోసారి ఐపీఎల్ ట్రోఫీ కైవసం చేసుకుంది. ‘టీమ్ మెంటార్‌గా జహీర్ ఖాన్‌ను నియమించేందుకు లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యం ప్రయత్నిస్తోంది.గంభీర్ నిష్క్రమణతో అతడి స్థానాన్ని జహీర్‌తో భర్తీ చేయాలని అనుకుంటున్నారు’ అని పలు కథనాలు వెలుగులోకి వచ్చాయి. గంభీర్ మెంటార్షిప్లో 2022, 2023లో ప్లేఆఫ్స్‌కు చేరిన లక్నో... ఈ ఏడాది అంతగా ఆకట్టుకోలేకపోయింది. తాజాగా లక్నో బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ కూడా ఆ జట్టును వీడి... భారత జాతీయ జట్టు బౌలింగ్ కోచ్‌గా నియమితుడయ్యాడు. దీంతో లక్నో జట్టు ఐపీఎల్ మెగా వేలానికి ముందు సహాయక సిబ్బంది ఎంపిక పూర్తి చేయాలని భావిస్తోంది.మరోవైపు పంజాబ్ కింగ్స్ జట్టు కూడా కోచ్ కోసం అన్వేషణ కొనసాగిస్తోంది. హెడ్ కోచ్ ట్రేవర్ బేలిస్ స్థానంలో భారత ఆటగాడికే ఈ బాధ్యతలు అప్పగించాలని పంజాబ్ యాజమాన్యం భావిస్తోంది. అయితే ఈ జాబితాలో వీవీఎస్ లక్ష్మణ్ పేరు బలంగా వినిపిస్తోంది. ఆటపై అపార అనుభవం ఉన్న లక్ష్మణ్ ప్రధాన కోచ్ పదవికి సరైన ప్రత్యామ్నాయం అని పంజాబ్ మేనేజ్మెంట్ భావిస్తోంది.అయితే గత కొన్నాళ్లుగా బీసీసీఐతో కొనసాగుతున్న వీవీఎస్.. ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) హెడ్‌గా వ్యవహరిస్తున్నాడు. మరో ఏడాది కాలం లక్ష్మణ్ ఎన్సీఏ హెడ్‌గా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో పంజాబ్ ప్రయత్నాలు ఫలిస్తాయా చూడాలి! -
లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్‌గా టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్..?
లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్‌గా టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ పేరు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తుంది. ఈ నెలాఖరులో జహీర్ పేరును అధికారికంగా ప్రకటించవచ్చని సమాచారం. జహీర్, ఎల్ఎస్జీ యాజమాన్యం మధ్య ప్రస్తుతం ఆర్ధిక పరమైన చర్చలు సాగుతున్నట్లు తెలుస్తుంది. ప్యాకేజీ కాస్త అటూ ఇటైనా డీల్‌కు ఓకే చెప్పాలనే జహీర్ భావిస్తున్నాడట. అన్నీ కుదిరితే జహీర్ ఎల్ఎస్జీలో మెంటార్షిప్తో పాటు బౌలింగ్ కోచ్ స్థానాన్ని కూడా భర్తీ చేసే అవకాశం ఉంది. గౌతమ్ గంభీర్, మోర్నీ మోర్కెల్ టీమిండియా కోచింగ్ బాధ్యతలు చేపట్టాక ఎల్ఎస్జీ మెంటార్షిప్, బౌలింగ్ కోచ్ పదవులు ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే. జహీర్ స్వతహాగా ఫాస్ట్ బౌలర్ కావడంతో బౌలింగ్ కోచ్ పదవిని కూడా అతనికే కట్టబెట్టాలని ఎల్ఎస్జీ మేనేజ్మెంట్ భావిస్తుందట. రెండు పదవులు రానుండటంతో ఈ డీల్ పట్ల జహీర్ కూడా సానుకూలంగా ఉన్నాడని సమాచారం.వాస్తవానికి జహీర్ టీమిండియా బౌలింగ్ కోచ్ పదవి ఆశించాడని టాక్. అయితే గంభీర్ పట్టుబట్టడంతో ఆ పదవి మోర్నీ మోర్కెల్‌కు దక్కిందని తెలుస్తుంది. కాగా, ప్రస్తుతం లక్నో హెడ్ కోచ్‌గా జస్టిన్ లాంగర్, అసిస్టెంట్ కోచ్‌లుగా ఆడమ్ వోగ్స్, లాన్స్ క్లూసెనర్, జాంటీ రోడ్స్ ఉన్న విషయం తెలిసిందే.జహీర్ గురించి వివరాలు..జహీర్ గతంలో ముంబై ఇండియన్స్ కోచింగ్ టీమ్‌లో పని చేశాడు. 45 ఏళ్ల జహీర్ టీమిండియా తరఫున 92 టెస్ట్‌లు, 200 వన్డేలు, 17 టీ20లు ఆడాడు. జహీర్ ఐపీఎల్లో వివిధ ఫ్రాంచైజీల తరఫున 100 గేమ్‌లు ఆడాడు. జహీర్ చివరిగా 2017లో ఐపీఎల్ ఆడాడు.లక్నో సూపర్ జెయింట్స్ విషయానికొస్తే.. ఈ ఫ్రాంచైజీ 2022, 2023 సీజన్లలో ప్లే ఆఫ్స్‌కు చేరి, 2024 సీజన్లో చేరలేకపోయింది. లక్నో.. గుజరాత్ టైటాన్స్‌తో కలిసి 2022 ఐపీఎల్ సీజన్లో అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే.ఐపీఎల్ 2025 విషయానికొస్తే.. బీసీసీఐ ఈ నెలాఖరులోగా ఆటగాళ్ల రిటెన్షన్ రూల్స్‌ను ప్రకటించే అవకాశం ఉంది. ఫ్రాంచైజీలు ఆర్టీఎం ఆప్షన్ సహా ఆరు రిటెన్షన్స్ చేసుకోవచ్చని ప్రచారం జరుగుతుంది. ఇటీవల జరిగిన మీటింగ్‌లో ఫ్రాంచైజీలు భారీ వేలాన్ని రద్దు చేయాలని కోరినప్పటికీ బీసీసీఐ ప్రస్తుతానికి అందుకు అనుకూలంగా లేదని టాక్. -
ఐపీఎల్ ఫ్రాంఛైజీకి గుడ్‌బై.. టీమిండియా బౌలింగ్ కోచ్‌గా!
టీమిండియా బౌలింగ్ కొత్త కోచ్‌గా సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ మోర్నీ మోర్కెల్ ఎంపిక ఖరారైనట్లు సమాచారం. నూతన హెడ్‌కోచ్ గౌతం గంభీర్ సహాయక సిబ్బందిలో చేరేందుకు మోర్కెల్ మార్గం సుగమం చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రొటిస్ పేస్ దళంలో కీలక బౌలర్‌గా సేవలు అందించిన మోర్నీ మోర్కెల్.. గత కొన్నేళ్లుగా ఐపీఎల్‌తో బంధం కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్‌గా గౌతం గంభీర్ వ్యవహరించిన సమయంలో ఆ జట్టు కీలక పేసర్లలో మోర్కెల్ ఒకడిగా ఉన్నాడు. ఆ తర్వాత ఇద్దరూ లక్నో సూపర్ జెయింట్స్‌లో కలిసి పనిచేశారు. లక్నో మెంటార్‌గా గంభీర్ వ్యవహరించగా.. బౌలింగ్ కోచ్‌గా మోర్కెల్ ఉన్నాడు.అనంతరం గంభీర్ కేకేఆర్ మెంటార్‌గా మారగా.. మోర్కెల్ మాత్రం ఐపీఎల్-2024లోనూ లక్నోతోనే కొనసాగాడు. తాజాగా ఫ్రాంఛైజీతో బంధం తెంచుకునేందుకు మోర్నీ మోర్కెల్ సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టీమిండియా బౌలింగ్ కోచ్‌గా నియమితుడయ్యే క్రమంలోనే 39 ఏళ్ల మోర్కెల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.బీసీసీఐ నిబంధనల ప్రకారం భారత జట్టు కోచ్‌గా పనిచేయాలంటే.. ఇతర బాధ్యత(క్రికెట్‌కు సంబంధించిన)ల నుంచి సదరు వ్యక్తులు వైదొలగాలన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే గంభీర్ కేకేఆర్‌ను వీడగా.. ఇప్పుడు మోర్నీ మోర్కెల్ కూడా అదే బాటలో నడవాలని నిర్ణయించుకున్నట్లు ఇన్‌సైడ్‌స్పోర్ట్ వెల్లడించింది. టీమిండియా శ్రీలంక పర్యటన తర్వాత టీమిండియా బౌలింగ్ కోచ్‌గా మోర్నె మోర్కెల్ నియామకానికి సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉందని పేర్కొంది. కాగా తన తండ్రి అనారోగ్యం దృష్ట్యా మోర్కెల్ ప్రస్తుతం సౌతాఫ్రికాలో ఉన్నాడు. ఇదిలా ఉంటే.. జూలై 27 నుంచి శ్రీలంక- టీమిండియా మధ్య ద్వైపాక్షిక సిరీస్ మొదలుకానుంది. ఇరు జట్ల మధ్య తొలుత మూడు టీ20లు.. తర్వాత మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్ జరుగనుంది. ఈ టూర్‌తో టీమిండియా ప్రధాన కోచ్‌గా గౌతం గంభీర్ ప్రస్థానం ఆరంభం కానుంది. ఇక ఈ పర్యటనలో టీమిండియా బౌలింగ్ తాత్కాలిక కోచ్ సాయిరాజ్ బహుతులే ఎంపికయ్యాడు. కేకేఆర్‌లో గౌతీ సహచరులు అభిషేక్ నాయర్, ర్యాన్ టెన్ డష్కాటే అసిస్టెంట్ కోచ్‌లుగా పనిచేయనుండగా.. ఫీల్డింగ్ కోచ్‌గా టి.దిలీప్ రీఎంట్రీ ఇచ్చాడు. -
లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్‌గా వీవీఎస్ లక్ష్మణ్!?
భారత మాజీ క్రికెటర్, హైదరాబాదీ వీవీఎస్ లక్ష్మణ్ ఐపీఎల్‌లోకి తిరిగి రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమయ్యాడు. ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు లక్నో సూపర్ జెయింట్స్ కోచింగ్ స్టాప్‌లో లక్ష్మణ్ భాగం కానున్నట్లు సమాచారం. లక్నో ఫ్రాంచైజీ తమ కోచింగ్ స్టాప్‌లోకి భారత దిగ్గజ ఆటగాళ్లను తీసుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే లక్ష్మణ్‌పై కన్నేసినట్లు వినికిడి. అతడిని తమ జట్టు మెంటార్‌గా నియమించాలని లక్నో యోచిస్తున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఇప్పటికే లక్ష్మణ్‌తో లక్నో ఫ్రాంచైజీ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.కాగా లక్ష్మణ్ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ( (NCA) ఛీప్‌గా ఉన్నాడు. లక్ష్మణ్ పదవీకాలం త్వరలోనే ముగియనుంది. తన కాంట్రాక్ట్‌ను పొడగించే అవకాశం బీసీసీఐ ఇచ్చినా.. వీవీయస్ మాత్రం అందుకు సుముఖంగా లేనట్లు సమాచారం.లక్ష్మణ్ తన నిర్ణయాన్ని బీసీసీఐ ఇప్పటికే తెలియజేసినట్లు తెలుస్తోంది. ఇక మెంటార్‌గా లక్ష్మణ్‌కు అపారమైన అనుభవం ఉంది. 2013 నుంచి 2021 వరకు ఎస్ఆర్హెచ్ జట్టుకు లక్ష్మణ్ పనిచేశాడు. ఆ తర్వాత ఏన్సీఏ హెడ్‌గా బాధ్యతలు చేపట్టడంతో మెంటార్ పదవి నుంచి ఈ ఈ సొగసరి బ్యాటర్ తప్పుకున్నాడు. ఇక లక్ష్మణ్ తర్వాత ఎన్సీఏ ఛీప్‌గా మాజీ భారత బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ బాధ్యతలు చేపట్టే అవకాశముంది. -
IPL 2025: డుప్లెసిస్‌కు షాక్.. ఆర్సీబీ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్!?
ఐపీఎల్-2025 సీజన్‌కు పలు ఫ్రాంచైజీలు భారీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో ఒకటి లక్నో సూపర్ జెయింట్స్. వచ్చే ఏడాది సీజన్‌కు ముందు తమ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను విడిచిపెట్టాలని లక్నో ఫ్రాంచైజీ యాజమాన్యం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దైనిక్ జాగరణ్ రిపోర్ట్ ప్రకారం.. కేఎల్ రాహుల్, లక్నో మేనేజ్మెంట్ మధ్య విభేదాలు తలెత్తినట్లు సమాచారం. ఈ క్రమంలోనే అతడిని లక్నో విడిచిపెట్టాలని భావిస్తున్నట్లు సదరు పత్రిక పేర్కొంది. రాహుల్ కూడా లక్నో మేనేజ్మెంట్ పైన ఆంసతృప్తితో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఈ ఏడాది సీజన్లో ఎల్ఎస్జి యజమాని సంజీవ్ గోయెంకా, రాహుల్ మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నట్లు పలు ఊహాగానాలు వినిపించాయి.ఆ తర్వాత రాహుల్, గోయెంకా ఇద్దరూ ఈ ఊహాగానాలను ఖండించినప్పటికి.. క్రికెట్ వర్గాల్లో మాత్రం ఇంకా ఈ చర్చనడుస్తోంది. రాహుల్ సారథ్యంలోని ఎల్ఎస్జి రెండు సార్లు ఫ్లే ఆఫ్స్‌కు చేరింది. కానీ ఈ ఏడాది సీజన్లో లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది.ఆర్సీబీ కెప్టెన్‌గా రాహుల్?ఇక కేఎల్ రాహుల్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ కన్నేసినట్లు తెలుస్తోంది. మెగా వేలానికి ముందు ఎల్ఎస్జి నుంచి రాహుల్‌ను ట్రేడ్ చేసుకోవాలని ఆర్సీబీ భావిస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడతున్నాయి. ప్రస్తుత ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ వయస్సు 40కి చేరుకోవడంతో.. దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా కొత్త కెప్టెన్‌ను ఫ్రాంచైజీ వెతుకుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో కేఎల్ రాహల్‌ను సొంతం చేసుకుని తమ జట్టు పగ్గాలను అప్పగించాలని ఆర్సీబీ యాజమాన్యం యోచిస్తున్నట్లు వినికిడి. కాగా కేఎల్ రాహుల్ తన ఐపీఎల్ కెరీర్‌ను ఆర్సీబీ ఫ్రాంచైజీతో ప్రారంభించాడు. -
ప్రేయసిని పెళ్లాడిన టీమిండియా స్టార్.. పోస్ట్ వైరల్
టీమిండియా క్రికెటర్ దీపక్ హుడా ఓ ఇంటివాడయ్యాడు. తన చిరకాల ప్రేయసిని పెళ్లాడినట్లు తెలిపాడు. సోమవారం(జూలై 15) తమ వివాహం జరిగిందని సోషల్ మీడియా వేదికగా తాజాగా వెల్లడించాడు.తొమ్మిదేళ్ల సుదీర్ఘ నిరీక్షణఈ సందర్భంగా పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫొటోలను దీపక్ హుడా షేర్ చేశాడు. ‘‘తొమ్మిదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ.. ఈ ప్రయాణంలోని ప్రతీ క్షణం, ప్రతీ కల, ప్రతీ సంభాషణ మనల్ని ఈరోజు ఇక్కడి దాకా తీసుకువచ్చాయి.మా కళ్లలోని భావాలు.. మేము చెప్పుకొనే ముచ్చట్లు కేవలం మా రెండు హృదయాలకు మాత్రమే అర్థమవుతాయి. నా చిన్నారి- పొన్నారి హిమాచలి అమ్మాయీ.. మన ఇంట్లోకి నీకు స్వాగతం పలుకుతున్నా’’ అంటూ దీపక్ హుడా తన శ్రీమతిని ఉద్దేశించి భావోద్వేగ క్యాప్షన్ కూడా జతచేశాడు.కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల నడుమ.. అందరి ఆశీర్వాదాలతో తాము కొత్త జీవితం మొదలుపెట్టామని తెలిపాడు. తమ బంధం ఈరోజుతో శాశ్వతంగా ముడిపడిపోయిందని.. మనసంతా సంతోషంతో నిండిందని పేర్కొన్నాడు.శుభాకాంక్షల వెల్లువఈ నేపథ్యంలో కొత్త జంటకు క్రికెటర్లు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. శిఖర్ ధావన్, అర్ష్‌దీప్ సింగ్, యజువేంద్ర చహల్, ఖలీల్ అహ్మద్ తదితర భారత క్రికెటర్లతో పాటు మహ్మద్ నబీ(అఫ్గనిస్తాన్), లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా.. దీపక్ హుడా దంపతులను విష్ చేశారు.అయితే, దీపక్ హుడా తన భార్య పేరును మాత్రం వెల్లడించలేదు. కాగా ఐపీఎల్-2024లో దీపక్ హుడా లక్నో సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు.అదే ఆఖరుహర్యానాకు చెందిన దీపక్ హుడా కుడిచేతి వాటం బ్యాటర్.. రైటార్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్. ఐపీఎల్లో సత్తా చాటిన 29 ఏళ్ల ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్.. 2022లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు.అదే ఏడాది వన్డేల్లోనూ ఎంట్రీ ఇచ్చాడు. గతేడాది న్యూజిలాండ్‌తో సిరీస్ సందర్భంగా దీపక్ హుడా టీమిండియాకు చివరిసారిగా ఆడాడు.ఇక ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్లో 10 వన్డేలు, 21 టీ20లు ఆడిన దీపక్ హుడా.. ఆయా ఫార్మాట్లలో 153, 368 పరుగులు చేశాడు. అదే విధంగా.. 3, 6 వికెట్లు తీశాడు. చదవండి: పక్షవాతాన్ని జయించి.. ప్యారిస్ ఒలింపిక్స్‌లో! View this post on Instagram A post shared by Deepak Hooda (@deepakhooda30) -
కోలుకున్న పేస్‌గన్.. టీమిండియా ఎంట్రీ మాత్రం ఆ తర్వాతే!
భారత యువ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ శుభవార్త పంచుకున్నాడు. గాయం నుంచి తాను పూర్తిగా కోలుకున్నట్లు వెల్లడించాడు. అయితే, పూర్తి ఫిట్నెస్ సాధించాలంటే మరికొంత కాలం చెమటోడ్చక తప్పదని పేర్కొన్నాడు.కాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన స్పీడ్‌స్టర్ మయాంక్ యాదవ్ ఈ ఏడాది ఐపీఎల్లో అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. లక్నో సూపర్ జెయింట్స్ తరఫున తొలి మ్యాచ్‌లోనే సత్తా చాటిన ఈ యంగ్ పేస్‌గన్.. వరుసగా రెండు మ్యాచ్‌లలో జట్టును గెలిపించాడు.రెండుసార్లు వరుసగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గంటకు 150కి పైగా కిలో మీటర్ల వేగంతో బంతులు సంధిస్తూ అందరి దృష్టిని ఆకర్షించిన ఈ యూపీ ఎక్స్‌ప్రెస్ రెండుసార్లు వరుసగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్నాడు. తద్వారా ఐపీఎల్ చరిత్రలో ఈ ఘనత సాధించిన మొదటి క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు.అయితే, దురదృష్టవశాత్తూ పక్కటెముకల గాయం కారణంగా ఐపీఎల్-2024లో మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు మయాంక్ యాదవ్. ప్రస్తుతం అతడు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందుతున్నాడు.వందశాతం ఫిట్నెస్ సాధించాలంటేఈ నేపథ్యంలో టెలిగ్రాఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘నా చికిత్స పూర్తైంది. గాయం నుంచి కోలుకుంటున్నాను. ఇక్కడ నాకు ఉపశమనం లభించింది.పూర్తి ఫిట్‌గా ఉన్నట్లు అనిపిస్తోంది. అయితే, వందశాతం ఫిట్నెస్ సాధించాలంటే మరికొంత కాలం ఇక్కడ ఉండక తప్పదని తెలుసు.గత కొన్ని రోజులుగా పూర్తిస్థాయిలో బౌలింగ్ చేయడం సానుకూలాంశం. ఇప్పటి వరకు సాధించిన పురోగతి పట్ల సంతోషంగా ఉన్నాను’’ అని మయాంక్ యాదవ్ చెప్పుకొచ్చాడు.రీఎంట్రీ అప్పుడే కాగా పేస్ సంచలనం మయాంక్ యాదవ్‌పై దృష్టి సారించిన సెలక్టర్లు అతడి పునరాగమనం కోసం వేదిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. దులీప్ ట్రోఫీ- 2024 ద్వారా ఈ బౌలర్ రీఎంట్రీ ఇస్తే.. ఆ ప్రదర్శన ఆధారంగా జాతీయ జట్టులో చోటు ఇచ్చే అంశం గురించి సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.అరంగేట్రం ఆ తర్వాతే ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు మాట్లాడుతూ.. ‘‘మయాంక్ యాదవ్ వంటి అద్భుత నైపుణ్యాలున్న ఫాస్ట్‌బౌలర్ విషయంలో రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేము. అతడు పూర్తిగా కోలుకున్న తర్వాత వేర్వేరు ఫార్మాట్లలో ఆడించాలనుకుంటున్నాం.అక్కడ ప్రతిభ నిరూపించుకున్న తర్వాతే టీమిండియా అరంగేట్రం గురించి స్పష్టత వస్తుంది. అంతేతప్ప హడావుడిగా జాతీయ జట్టులోకి పంపితే అనుకున్న ఫలితాలు రాకపోవచ్చు’’ అని పేర్కొన్నాయి. కాగా ప్రస్తుతం జింబాబ్వే పర్యటనలో ఉన్న టీమిండియా తదుపరి శ్రీలంకతో తలపడనుంది.చదవండి: అభి"షేక్" శర్మ.. రసెల్, హెడ్ కూడా దిగదుడుపే..! -
భారత క్రికెట్‌కు శుభవార్త.. తిరిగి రంగంలోని దిగిన ఫాస్ట్ బౌలర్
భారత క్రికెట్‌కు శుభవార్త. ఐపీఎల్ 2024 సందర్భంగా గాయపడిన యువ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ తిరిగి రంగంలోకి దిగాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకున్న అనంరతం మయాంక్ ఇవాళే ప్రాక్టీస్ షురూ చేశాడు. మయాంక్ నెట్స్‌లో సాధన చేస్తున్న దృశ్యాలు, వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి.Mayank Yadav has been gearing up for the tour against Sri Lanka and Zimbabwe in July. pic.twitter.com/PZ7WS8mFo9— Mufaddal Vohra (@mufaddal_vohra) June 11, 2024గత సీజన్‌తోనే లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఐపీఎల్ అరంగేట్రం చేసిన మయాంక్ ఆడిన 4 నాలుగు మ్యాచ్‌ల్లో తనేంటో రుజువు చేసుకున్నాడు. తన ప్రధాన అస్త్రమైన పేస్‌తో భారత క్రికెట్లో హాట్ టాపిక్ అయ్యాడు. దాదాపుగా ప్రతి బంతిని 150 కిమీ పైగా వేగంతో సంధించగల సత్తా ఉన్న మయాంక్.. తన పేస్ పదునుతో ప్రత్యర్ధులను గడగడలాడించాడు.తన అరంగేట్రం మ్యాచ్‌లోనే (పంజాబ్‌పై (4-0-27-3)) ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్న మయాంక్.. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో (4-0-14-3) మరింత రెచ్చిపోచి, వరుసగా రెండో మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. సీజన్లో ముగిసే లోపు ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకుంటాడనుకున్న తరుణంలో మాయంక్ గాయపడ్డాడు. గుజరాత్‌తో మ్యాచ్ సందర్భంగా గాయపడిన మయాంక్.. ఆ మ్యాచ్‌లో కేవలం ఒకే ఒక ఓవర్ వేసి పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత అతను తిరిగి బరిలోకి దిగలేదు.తాజాగా గాయం పూర్తిగా నయం కావడంతో మయాంక్ తిరిగి ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. వచ్చే నెల (జులై) భారత జట్టు శ్రీలంక, జింబాబ్వే పర్యటనలకు వెళ్లాల్సి ఉండగా.. భారత సెలెక్టర్లు మయాంక్ పేరును పరిశీలించవచ్చని తెలుస్తుంది. -
BCCI: రాహుల్ నా కళ్లు తెరిపించాడు: జస్టిన్ లాంగర్ కీలక వ్యాఖ్యలు
టీమిండియా హెడ్ కోచ్ రేసులో వినిపిస్తున్న పేర్లలో జస్టిన్ లాంగర్ పేరు ఒకటి. గతంలో ఆస్ట్రేలియా ప్రధాన కోచ్‌గా పనిచేసిన లాంగర్.. ఆటగాళ్లతో విభేదాల నేపథ్యంలో ఆ బాధ్యతల నుంచి వైదొలిగాడు.ఈ క్రమంలో కొన్నాళ్ల పాటు విరామం తీసుకున్న జస్టిన్ లాంగర్ 2024లో ఐపీఎల్ ఫ్రాంఛైజీ లక్నో సూపర్ జెయింట్స్‌తో జట్టుకట్టాడు. పదిహేడో సీజన్లో లక్నోకు కోచ్‌గా నియమితుడయ్యాడు ఈ ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్.లాంగర్ మార్గదర్శనంలో కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో లక్నో అద్భుతాలు సాధిస్తుందనుకుంటే కనీసం ప్లే ఆఫ్స్ కూడా చేరకుండానే నిష్క్రమించింది. పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచి సీజన్‌ను ముగించింది.ద్రవిడ్ వారసుడు ఎవరు?ఇదిలా ఉంటే.. బీసీసీఐ రాహుల్ ద్రవిడ్ స్థానంలో కొత్త కోచ్ వేట మొదలుపెట్టిన నేపథ్యంలో జస్టిన్ లాంగర్, రిక్కీ పాంటింగ్, స్టీఫెన్ ఫ్లెమింగ్ తదితర విదేశీ కోచ్‌ల పేర్లు తెరమీదకు వచ్చాయి.ఈ విషయంపై స్పందించిన జస్టిన్ లాంగర్ బీబీసీతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా కోచ్‌గా బాధ్యతలు చేపడితే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందో కేఎల్ రాహుల్ తనకు వివరించాడంటూ బాంబు పేల్చాడు.అంతకు మించి.. వెయ్యి రెట్లు అధికంగా‘‘కోచ్ పాత్ర ఎలాంటిదో నాలుగేళ్ల పాటు ఆస్ట్రేలియా జట్టుతో గడిపినపుడే నాకు అర్థమైంది. అప్పుడు నేనైతే పూర్తిగా అలసిపోయాను. ఇక భారత జట్టు హెడ్ కోచ్ బాధ్యత ఎలా ఉంటుందన్న విషయం గురించి నేను కేఎల్ రాహుల్‌తో మాట్లాడినపుడు ఆసక్తికర సమాధానం విన్నాను.‘ఐపీఎల్ జట్టు విషయంలో ఒత్తిడి, రాజకీయాలు ఎలా ఉంటాయో మీకు తెలుసు. అందుకు వెయ్యి రెట్ల ఒత్తిడి, పాలిటిక్స్ టీమిండియా కోచ్‌గా ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని చెప్పాడు.అంతకంటే గొప్ప సలహా మరొకటి ఉంటుందని నేను అనుకోను’’ అని జస్టిన్ లాంగర్ పేర్కొన్నాడు. భారత జట్టు ప్రధాన కోచ్ పదవి విషయంలో తనకు ఇప్పుడు పూర్తి స్పష్టత వచ్చిందని తెలిపాడు. ఒక విధంగా కేఎల్ రాహుల్ తన కళ్లు తెరిపించాడని పేర్కొన్నాడు.రిక్కీ పాంటింగ్ సైతంఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా దిగ్గజ కెప్టెన్ రిక్కీ పాంటింగ్ సైతం టీమిండియా హెడ్‌కోచ్ పదవి చేపట్టేందుకు సిద్ధంగా లేనని పేర్కొన్న విషయం తెలిసిందే. తన కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించాలనుకుంటున్నానని.. అందుకే బీసీసీఐ ఆఫర్ ఇచ్చినా తాను తిరస్కరించానని తెలిపాడు.చదవండి: IPL 2024: టైమ్‌కి చెక్ వస్తుంది.. రూ. 11 కోట్లు.. ఇంకెందుకు ఆడటం? -
వరల్డ్‌కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్‌పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఐపీఎల్-2024 లీగ్ దశలో లక్నో సూపర్ జెయింట్స్ తమ ఆఖరి మ్యాచ్ ఆడేసింది. ముంబై ఇండియన్స్‌తో శుక్రవారం నాటి మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్స్ ఆశలను ఇంకా సజీవంగానే ఉంచుకుంది.అయితే, చెన్నై సూపర్ కింగ్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య శనివారం నాటి మ్యాచ్ ఫలితంపైనే లక్నో భవితవ్యం ఆధారపడి ఉంది. అయితే, ఈ మ్యాచ్‌లో ఏవైనా అద్భుతాలు జరిగితే తప్ప ఇప్పటికైతే లక్నో దాదాపుగా నిష్క్రమించినట్లే!ఇదిలా ఉంటే.. లీగ్ దశను విజయంతో ముగించడం పట్ల లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ హర్షం వ్యక్తం చేశాడు. సీజన్ ఆసాంతం ఇలాగే ఆడి ఉంటే బాగుండేదని పేర్కొన్నాడు. ఏదేమైనా ఈ ఎడిషన్‌లో ఓవరాల్‌గా తమ ప్రదర్శన మాత్రం నిరాశకు గురిచేసిందని విచారం వ్యక్తం చేశాడు.ఫ్రాంఛైజీ మయాంక్ యాదవ్, యుధ్వీర్ వంటి భారత యువ ఆటగాళ్ల మీద భారీ మొత్తం పెట్టుబడి పెట్టిందని.. అయితే, గాయాల కారణంగా వారు తమ పని పూర్తి చేయలేకపోయారని కేఎల్ రాహుల్ పేర్కొన్నాడు. నేను మా మామగారి జట్టులో ఉన్నాఅదే విధంగా.. తన బ్యాటింగ్ పొజిషన్‌పై దృష్టి సారించానని.. మిడిలార్డర్లో ఆడితే ఎలా ఉంటుందన్న అంశంపై చర్చించినట్లు తెలిపాడు. కాగా ఈ ఎడిషన్‌లో లక్నో 14 మ్యాచ్‌లలో ఏడు గెలిచింది. ఇక ఐపీఎల్-2024 తర్వాత తదుపరి ప్రణాళికలు ఏమిటన్న ప్రశ్నకు కేఎల్ రాహుల్ బదులిస్తూ.. ‘‘ప్రస్తుతం నేను మా మామగారి జట్టులో ఉన్నాను. ఇద్దరం కలిసి ప్రపంచకప్ టోర్నీలో ఆడే శర్మా జీ వాళ్ల అబ్బాయిని చీర్ చేస్తాం’’ అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు. టీ20 ప్రపంచకప్-2024లో ఆడనున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశాడు.తన మామగారు, బాలీవుడ్ నటుడు సునిల్ శెట్టితో కలిసి మ్యాచ్‌లు చూస్తూ ఎంజాయ్ చేస్తానని తెలిపాడు. కాగా జూన్ 1 నుంచి ఆరంభం కానున్న టీ20 వరల్డ్‌కప్-2024 టోర్నీ నేపథ్యంలో కేఎల్ రాహుల్‌కు భారత జట్టులో చోటు దక్కలేదు. వికెట్ కీపర్ కోటాలో రాహుల్‌ను కాదని రిషభ్ పంత్, సంజూ శాంసన్‌లకు చోటిచ్చింది బీసీసీఐ సెలక్షన్ కమిటీ!చదవండి: BCCI: హార్దిక్ పాండ్యాకు ఊహించని షాక్.. ఐపీఎల్ 2025లో ఇక.. #LSG wrapped up their season on a winning note and happy faces in Mumbai😃👌🎥 Here's a roundup of the #MIvLSG clash at the Wankhede 🏟️ #TATAIPL pic.twitter.com/FbdT2QQQAk— IndianPremierLeague (@IPL) May 18, 2024 -
BCCI: హార్దిక్ పాండ్యాకు భారీ షాక్.. ఐపీఎల్-2025లో..
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు భారత క్రికెట్ నియంత్రణ మండలి భారీ షాకిచ్చింది. రూ. 30 లక్షల జరిమానాతో పాటు తదుపరి మ్యాచ్‌కు దూరంగా ఉండాలని నిషేధం విధించింది.కాగా ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ సారథిగా రోహిత్ శర్మ స్థానాన్ని భర్తీ చేసిన హార్దిక్ పాండ్యాకు అడుగడుగునా చేదు అనుభవాలే ఎదురయ్యాయి. రోహిత్ స్థానంలో వచ్చినందుకు సొంత జట్టు అభిమానుల నుంచే ఛీత్కారాలు.. కెప్టెన్‌గా తీసుకున్న నిర్ణయాల కారణంగా విమర్శలు ఎదుర్కొన్నాడు.ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుఆల్‌రౌండర్‌గానూ తన స్థాయికి తగ్గట్లు ఆకట్టుకోలేకపోయాడు హార్దిక్ పాండ్యా. సారథిగానూ సరైన వ్యూహాలు రచించలేక చతికిలపడ్డాడు. ఫలితంగా ఈ సీజన్లో ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా ముంబై పరాభవం మూటగట్టుకుంది.ఇక లీగ్ దశలో ఆఖరిదై మ్యాచ్‌లో భాగంగా ముంబై ఇండియన్స్ శుక్రవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడింది. వాంఖడే వేదికగా జరిగిన ఈ పోరులో లక్నో ముంబైని 18 పరుగుల తేడాతో ఓడించింది. దీంతో ముంబై ఖాతాలో పదో పరాజయం నమోదైంది.ఇదిలా ఉంటే.. లక్నోతో మ్యాచ్ సందర్భంగా ముంబై ఇండియన్స్ నిర్ణీత సమయంలో ఓవర్ల కోటా పూర్తి చేయలేకపోయింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ హార్దిక్ పాండ్యాకు పనిష్మెంట్ ఇచ్చింది.ఐపీఎల్-2025లో తొలి మ్యాచ్ ఆడకుండా నిషేధంఈ మేరకు.. ‘‘ఈ సీజన్లో ముంబై జట్టు చేసిన మూడో తప్పిదం కావున.. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి కింద.. స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసిన కారణంగా పాండ్యాకు రూ. 30 లక్షల జరిమానా విధించడంతో పాటు.. జట్టు తదుపరి ఆడే మ్యాచ్ ఆడకుండా నిషేధం విధిస్తున్నాం’’ అని ఐపీఎల్ నిర్వాహకులు ప్రకటన విడుదల చేశారు. అంటే ఐపీఎల్-2025లో పాండ్యా తన తొలి మ్యాచ్‌కు దూరంగా ఉండాలన్నమాట! ఇక పాండ్యాతో పాటు ముంబై జట్టుకు కూడా ఎదురుదెబ్బ తగిలింది. ముంబై జట్టు మొత్తానికి జరిమానా‘‘లక్నోతో మ్యాచ్ ఆడిన ముంబై తుదిజట్టులోని ఆటగాళ్లందరికీ.. ఇంపాక్ట్ ప్లేయర్‌తో సహా ప్రతి ఒక్కరికి రూ. 12 లక్షల జరిమానా లేదంటే మ్యాచ్ ఫీజులో 50 శాతం మేర కోత(ఏది తక్కువగా ఉంటే అది) విధిస్తాం’’ అని తెలిపారు. కాగా ఐపీఎల్-2024లో ఆడిన 14 మ్యాచ్‌లలో కేవలం నాలుగు మాత్రమే గెలిచిన ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది.చదవండి: Pat Cummins: సన్‌రైజర్స్ కెప్టెన్ చేసిన పనికి అభిమానులు ఫిదా.. వీడియో వైరల్ #LSG wrapped up their season on a winning note and happy faces in Mumbai😃👌🎥 Here's a roundup of the #MIvLSG clash at the Wankhede 🏟️ #TATAIPL pic.twitter.com/FbdT2QQQAk— IndianPremierLeague (@IPL) May 18, 2024 -
MI Vs LSG: లక్నో విజయంతో ముగింపు
ముంబై: ఐదుసార్లు ఐపీఎల్ చాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో అందరికంటే ముందుగా ప్లేఆఫ్స్ దశకు దూరమైంది. ఇప్పుడు ఆఖరి స్థానంతో లీగ్ దశను పేలవంగా ముగించింది. మధ్యలో వర్షం ఆటంకం కలిగించిన ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 18 పరుగుల తేడాతో ముంబైపై ఘనవిజయం సాధించింది. ముందుగా లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ (29 బంతుల్లో 75; 5 ఫోర్లు, 8 సిక్స్‌లు) సునామీలా చెలరేగిపోయాడు. కెప్టెన్ కేఎల్ రాహుల్ (41 బంతుల్లో 55; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించాడు. పియూశ్ చావ్లా, తుషారా చెరో 3 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై 20 ఓవర్లలో 6 వికెట్లకు 196 పరుగులు చేసి ఓడింది. రోహిత్ శర్మ (38 బంతుల్లో 68; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు), నమన్ ధీర్ (28 బంతుల్లో 62 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) మెరిపించారు. పూరన్ ధనాధన్ పది ఓవర్లలో లక్నో స్కోరు 69/3. పడిక్కల్ (0), స్టొయినిస్ (22 బంతుల్లో 28; 5 ఫోర్లు), దీపక్ హుడా (11) అవుటయ్యారు. ఇంకో 10 ఓవర్లలో వంద కొట్టినా... 170 దాటదు! కానీ పూరన్ తన 29 బంతుల్లో అంతా మార్చేశాడు. రాహుల్‌తో కలిసి విధ్వంసరచన చేశాడు. అన్షుల్ 13వ ఓవర్లో పూరన్ 4, 0, వైడ్, 4, 6, 6, 1లతో 22 పరుగులు రాబట్టాడు. 15వ ఓవర్‌ను అర్జున్ టెండూల్కర్ ప్రారంభించి 2 బంతులేస్తే పూరన్ సిక్సర్లుగా మలిచాడు. కండరాలు పట్టేయడంతో అర్జున్ వెనుదిరిగాడు. మిగతా ఓవర్‌ను నమన్ ధీర్ వేయగా పూరన్ 6, 4, 1 కొట్టాడు. ఆఖరి బంతిని రాహుల్ సిక్స్ బాదడంతో ఈ ఓవర్లో 29 పరుగులు వచ్చాయి. పూరన్ 19 బంతుల్లోనే ఫిఫ్టీ చేసుకోగా... రాహుల్ 37 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. ఆఖర్లో బదోని (10 బంతుల్లో 22 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడటంతో లక్నో 200 పైచిలుకు స్కోరు చేసింది. రోహిత్, ధీర్ ఫిఫ్టీ–ఫిఫ్టీ భారీ లక్ష్యఛేదనకు అవసరమైన హిట్టింగ్తో రోహిత్ ముంబై స్కోరును పరుగుపెట్టించాడు. మరో ఓపెనర్ బ్రెవిస్ (20 బంతుల్లో 23; 1 ఫోర్, 2 సిక్స్‌లు) వేగంలో వెనుకబడినా రోహిత్ బౌండరీలతో జోరు కనబరిచాడు. 28 బంతుల్లో ఫిఫ్టీ సాధించాడు. 88 పరుగుల వద్ద బ్రెవిస్ అవుటయ్యాక ముంబై తడబడింది. సూర్యకుమార్ (0), రోహిత్, హార్దిక్ (16), నేహల్ (1) వికెట్లను కోల్పోవడంతో ముంబై లక్ష్యానికి దూరమైంది. ఈ దశలో నమన్ ధీర్ మెరిపించినా అప్పటికే ఆలస్యమైంది. నమన్ 25 బంతుల్లో అర్ధసెంచరీ సాధించినా ముంబైని ఓటమి నుంచి గట్టెక్కించలేకపోయాడు. స్కోరు వివరాలు లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: రాహుల్ (సి) తుషారా (బి) చావ్లా 55; పడిక్కల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) తుషారా 0; స్టొయినిస్ (ఎల్బీడబ్ల్యూ) (బి) చావ్లా 28; హుడా (సి) నేహల్ (బి) చావ్లా 11; పూరన్ (సి) సూర్య (బి) తుషారా 75; అర్షద్ (సి) నేహల్ (బి) తుషారా 0; బదోని (నాటౌట్) 22; కృనాల్ (నాటౌట్) 12; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 214. వికెట్ల పతనం: 1–1, 2–49, 3–69, 4–178, 5–178, 6–178. బౌలింగ్: తుషారా 4–0–28–3, అర్జున్ 2.2–0–22–0, అన్షుల్ 3–0–48–0, పియూశ్ చావ్లా 4–0–29–3, నేహల్ 2–0– 13–0, హార్దిక్ 2–0–27–0, నమన్ 0.4–0–17–0, షెఫర్డ్ 2–0–30–0. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) మోసిన్ (బి) బిష్ణోయ్ 68; బ్రెవిస్ (సి) కృనాల్ (బి) నవీనుల్ 23; సూర్య (సి) బిష్ణోయ్ (బి) కృనాల్ 0; ఇషాన్ (బి) నవీనుల్ 14; హార్దిక్ (సి) నవీనుల్ (బి) మోసిన్ 16; నేహల్ (సి) కృనాల్ (బి) బిష్ణోయ్ 1; నమన్ (నాటౌట్) 62; షెఫర్డ్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 196. వికెట్ల పతనం: 1–88, 2–89, 3–97, 4–116, 5–120, 6–188. బౌలింగ్: అర్షద్ 2–0–11–0, హెన్రీ 2–0–24–0, కృనాల్ 4–0–29–1, మోసిన్ 4–0– 45–1, నవీనుల్ 4–0–50–2, రవి బిష్ణోయ్ 4–0–37–2. -
ఐపీఎల్లో విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే!
ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎల్ఎస్జీ ప్లేయర్ నికోలస్ పూరన్ విధ్వంసం సృష్టించారు. కేవలం 19 బంతుల్లోనే అర్ధసెంచరీ సాధించారు. ఇందులో 7 సిక్సర్లు, 2 ఫోర్లతో చేలరేగాడు. అర్జున్ టెండూల్కర్ వేసిన 15 ఓవర్లో వరుస బంతుల్లో నికోల పూరన్ మూడు సిక్సర్లు బాదాడు. దీంతో ఆ ఓవర్లో ఏకంగా 29 పరుగులు సమర్పించుకున్నారు. కేవలం 29 బంతుల్లో 75 పరుగులు నికోలస్ పూరన్ ఐదు ఫోర్లు, ఎనిమిది సిక్సర్లు కొట్టాడు. చివరికీ నువాన్ తుషార బౌలింగ్‌లో ఔటై వెనుదిరిగారు. అయితే ఇప్పటికే ముంబయి ఇండియన్స్ ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు లక్నో సూపర్ జైయింట్స్కు సైతం దాదాపుగా ప్లే ఆఫ్ వెళ్లే అవకాశం లేనట్లే. ఇప్పటికే 12 పాయింట్లతో ఉన్న లక్నోకు రన్‌రేట్ లేకపోవడం వారి అవకాశాలు దెబ్బతీసింది. ఇవాల్టి మ్యాచ్‌లో గెలిచినా ఎలాంటి ఉపయోగం లేదు. కాగా.. ఇప్పటికే మూడు జట్లు ప్లే ఆఫ్స్‌కు చేరుకోగా.. మరో స్థానం కోసం ఆర్సీబీ, చెన్నై పోటీ పడుతున్నాయి. "De chauka de chakka. Aaj ho jaye, ho jaye, Dhoom Dhadaka" pic.twitter.com/f0gZiT3kjz— Lucknow Super Giants (@LucknowIPL) May 17, 2024 -
IPL 2024: చెన్నైని ఓడించినా ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరదు! అదెలా?
ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్‌లో మూడో బెర్తు కూడా ఖరారైంది. కోల్‌కతా నైట్ రైడర్స్ టేబుల్ టాపర్‌గా ముందుగానే టాప్-4లో తిష్ట వేయగా.. రాజస్తాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా అర్హత సాధించాయి.లక్నో సూపర్ జెయింట్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం(మే 14)తో ఎలాంటి సమీకరణలతో పనిలేకుండా రాజస్తాన్.. గుజరాత్ టైటాన్స్‌తో గురువారం నాటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్‌లో నేరుగా చోటు దక్కించుకున్నాయి.ఆ మూడు జట్ల మధ్య పోటీఇక ప్లే ఆఫ్స్‌లో మిగిలిన ఒక్క స్థానం కోసం చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ జట్టు పోటీపడుతున్నాయి. నిజానికి రన్‌రేటు పరంగా ఈ రెండు జట్ల కంటే వెనుకబడి ఉన్న లక్నో(12 పాయింట్లు, నెట్ రన్‌రేటు -0.787) ఈ రేసు నుంచి అనధికారికంగా నిష్క్రమించినట్లే!ఒకవేళ ఆశలు సజీవం చేసుకోవాలంటే.. ముంబై ఇండియన్స్‌తో శుక్రవారం నాటి మ్యాచ్‌లో భారీ తేడాతో లక్నో గెలవాలి. అయినప్పటికీ సీఎస్కే- ఆర్సీబీ ఫలితంపై ఆధారపడాల్సి ఉంటుంది. అందులోనూ ఆర్సీబీని సీఎస్కే కచ్చితంగా.. అది కూడా స్వల్ప తేడాతో ఓడిస్తేనే లక్నోకు అవకాశం ఉంటుంది.సీఎస్కే- ఆర్సీబీ ఫలితంపై సర్వత్రా ఆసక్తిఈ నేపథ్యంలో.. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప లక్నో వరుసగా మూడోసారి ప్లే ఆఫ్స్ చేరడం సాధ్యంకాదు. కాబట్టి ప్రధానంగా పోటీలో ఉన్నది సీఎస్కే- ఆర్సీబీ మాత్రమే అని చెప్పవచ్చు.ఈ రెండు జట్లలోనూ చెన్నై(14 పాయింట్లు, రన్‌రేటు 0.528) ఆర్సీబీ(12 పాయింట్లు 0.387) కంటే ఓ మెట్టు పైనే ఉంది. అయినప్పటికీ ఆర్సీబీ సీఎస్కేను దాటి ప్లే ఆఫ్స్ చేరాలంటే..? సాధ్యమయ్యే రెండు సమీకరణలు ఇలా!అలా చెన్నైపై గెలిచినా సాధ్యం కాదు1. చిన్నస్వామి స్టేడియంలో శనివారం జరిగే మ్యాచ్‌లో ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ చేసి 200 పరుగులకు తక్కువ కాకుండా స్కోరు చేయాలి. అంతేకాదు 18 పరుగుల తేడాతో చెన్నైని ఓడించాలి. అంతకంటే ఒక్క పరుగు తక్కువ తేడాతో చెన్నైని ఓడించినా ఫలితం ఉండదు. నెట్ రన్‌రేటు ఆధారంగా చెన్నై ప్లే ఆఫ్స్ చేరితే.. ఆర్సీబీ మాత్రం ఇంటిబాట పడుతుంది.2. ఒకవేళ ఆర్సీబీ గనుక సెకండ్ బ్యాటింగ్ చేయాల్సి వచ్చి.. చెన్నై విధించిన 201 పరుగుల లక్ష్యాన్ని.. 11 బంతులు మిగిలి ఉండగానే ఆర్సీబీ పూర్తి చేయాలి. చదవండి: Kavya Maran- SRH: కేన్ మామను హత్తుకున్న కావ్యా.. వీడియో వైరల్ -
కేఎల్ రాహుల్ అవుటైనా సరే.. సంజీవ్ గోయెంక రియాక్షన్ వైరల్!
రెండేళ్ల క్రితం ఐపీఎల్లో అడుగుపెట్టిన లక్నో సూపర్ జెయింట్స్ వరుసగా రెండుసార్లు ప్లే ఆఫ్స్ చేరింది. కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో టాప్-4కు అర్హత సాధించి సత్తా చాటింది. కానీ ఐపీఎల్-2024లో మాత్రం ఈ ఫీట్ పునరావృతం చేసే అవకాశాలు కనిపించడం లేదు.ఢిల్లీ క్యాపిటల్స్‌తో మంగళవారం నాటి మ్యాచ్‌లో లక్నో 19 పరుగుల తేడాతో ఓడిపోయింది. తద్వారా ప్లే ఆఫ్స్ రేసు అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న లక్నో.. మిగిలిన మ్యాచ్‌లో గెలిచినా.. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన దుస్థితి.ఈ నేపథ్యంలో ఢిల్లీతో మ్యాచ్ సందర్భంగా లక్నో యజమాని సంజీవ్ గోయెంక ఇచ్చిన రియాక్షన్స్ వైరల్‌గా మారాయి. కాగా గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో లక్నో చిత్తుగా ఓడిపోయిన విషయం తెలిసిందే.ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌గా, వికెట్ కీపర్ బ్యాటర్‌గా కేఎల్ రాహుల్ విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో సంజీవ్ గోయెంక మైదానంలోనే అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. రాహుల్ వివరణ ఇస్తున్నా పట్టించుకోకుండా కోపంతో ఊగిపోయాడు.ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట విరివిగా చక్కర్లు కొట్టగా సంజీవ్ గోయెంక తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. టీమిండియా స్టార్ పట్ల ఇలా వ్యవహరించడం సరికాదంటూ మాజీ క్రికెటర్లు హితవు పలికారు.ఈ క్రమంలో పొరపాటు గ్రహించిన సంజీవ్ గోయెంక ఢిల్లీతో మ్యాచ్‌కు ముందు రాహుల్‌ను తన ఇంటికి డిన్నర్‌కు పిలిచాడు. ఈ నేపథ్యంలో అతడిని ప్రేమగా హత్తుకున్న ఫొటోను బయటకు వదిలారు. తమ మధ్య అంతా బాగానే ఉందనే సంకేతాలు ఇచ్చారు. Goenka smiling after KL Rahul's wicket pic.twitter.com/R0K4BVteSN— Div🦁 (@div_yumm) May 14, 2024 ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ సందర్భంగా కెమెరాలన్నీ సంజీవ్ గోయెంక వైపే దృష్టి సారించాయి. కేఎల్ రాహుల్ ఐదు పరుగులకే అవుటైనా గోయెంక చిన్నగా నవ్వులు చిందించాడే తప్ప కోపం తెచ్చుకోలేదు. Sanjeev Goenka appreciating KL Rahul's catch. pic.twitter.com/pAeTqjcnTB— Mufaddal Vohra (@mufaddal_vohra) May 14, 2024 అదే విధంగా.. షాయీ హోప్ ఇచ్చిన క్యాచ్‌ను రాహుల్ పట్టగానే లేచి నిలబడి మరీ చప్పట్లు కొడుతూ అతడిని అభినందించాడు. ఇక మ్యాచ్ ఓడిపోయిన తర్వాత మైదానంలో కేఎల్ రాహుల్‌తో నవ్వుతూ మాట్లాడాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు బయటకురాగా నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఇంతలో ఎంత మార్పు సార్.. మీరు సూపర్’’ అంటూ సెటైర్లు వేస్తున్నారు.చదవండి: సీజన్ మొత్తం మాకు అదే సమస్య.. అందుకే ఈ దుస్థితి: కేఎల్ రాహుల్ Ishant Sharma x Mukesh Kumar ⚡️⚡️The duo combine to dismiss the #LSG openers 👏👏Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #DCvLSG pic.twitter.com/nuFD7AlK28— IndianPremierLeague (@IPL) May 14, 2024A clinical win at home to finish off their home season 🙌 @DelhiCapitals with a lap of honour for their roaring home fans to extend their gratitude for their love and support 🥳#TATAIPL | #DCvLSG pic.twitter.com/DroMjvb9bU— IndianPremierLeague (@IPL) May 15, 2024KL Rahul with Sanjiv Goenka at the special Dinner in Sanjiv Goenka's home last night in Delhi. [LSG] - All is well at LSG Camp. 🌟 pic.twitter.com/W5BtE0Qmff— Johns. (@CricCrazyJohns) May 14, 2024 -
సిక్సర్ల మోత.. ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలిసారి
ఐపీఎల్-2024 తుది అంకానికి చేరుకుంటోంది. ఈ సీజన్లో ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టిన తొలి జట్టుగా కోల్‌కతా నైట్ రైడర్స్ నిలవగా.. ఢిల్లీ క్యాపిటల్స్- లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ ఫలితంతో రాజస్తాన్ రాయల్స్ కూడా టాప్-4కు అర్హత సాధించింది.సొంత మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్ లక్నోను ఓడించడంతో రాజస్తాన్ ప్లే ఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకుంది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్ తాజా ఎడిషన్‌లో 64వ మ్యాచ్ అయిన ఢిల్లీ- లక్నో పోరు తర్వాత సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది.ఈసారి ఏకంగాక్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు నమోదైన సీజన్‌గా 2024 నిలిచింది. ఈ ఎడిషన్‌లో ఇప్పటి వరకు మొత్తంగా 1125 సిక్సర్లు నమోదయ్యాయి. ఇక మంగళవారం నాటి మ్యాచ్ సందర్భంగా ఢిల్లీ బ్యాటర్లలో అభిషేక్ పోరెల్ 4, షాయీ హోప్ రెండు, ట్రిస్టన్ స్టబ్స్ 4 సిక్సర్లు బాదగా.. లక్నో ఆటగాళ్లలో నికోలసన్ పూరన్ 4, అర్షద్ ఖాన్ 5, యుద్వీర్ సింగ్ చరక్ ఒక సిక్సర్ కొట్టారు.కాగా ఐపీఎల్-2024 ఆరంభం నుంచే సిక్సర్ల మోత మోగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా విధ్వంసకర బ్యాటింగ్‌కు మారుపేరుగా మారిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో పాటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కూడా సిక్స్‌ల వర్షం కురిపించింది. తద్వారా ఈ సీజన్లో ఇప్పటి వరకు అత్యధిక సిక్స్‌లు నమోదు చేసిన తొలి రెండు జట్లుగా సన్‌రైజర్స్, ఆర్సీబీ నిలవగా.. అనూహ్య రీతిలో ఢిల్లీ క్యాపిటల్స్ మూడో స్థానం ఆక్రమించింది.ఒక ఐపీఎల్ సీజన్లో అత్యధిక సిక్సర్లు👉1125 సిక్సర్లు - 2024👉1124 సిక్సర్లు - 2023👉1062 సిక్సర్లు - 2022👉872 సిక్సర్లు- 2018👉784 సిక్సర్లు- 20192024లో ఇప్పటి వరకు అత్యధిక సిక్స్‌లు నమోదు చేసిన జట్లు👉సన్‌రైజర్స్ హైదరాబాద్- 12 మ్యాచ్‌లలో 146 సిక్స్‌లు👉ఆర్సీబీ- 13 మ్యాచ్‌లలో 141 సిక్స్‌లు👉ఢిల్లీ క్యాపిటల్స్- 14 మ్యాచ్‌లలో 135 సిక్స్‌లు👉కోల్‌కతా నైట్ రైడర్స్- 12 మ్యాచ్‌లలో 125 సిక్స్‌లు👉ముంబై ఇండియన్స్- 13 మ్యాచ్‌లలో 122 సిక్స్‌లు👉పంజాబ్ కింగ్స్- 12 మ్యాచ్‌లలో 102 సిక్స్‌లు👉రాజస్తాన్ రాయల్స్- 12 మ్యాచ్‌లలో 100 సిక్స్‌లు. Fearless striking from Arshad Khan 🔥He's not given up yet in this chase 💪Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #DCvLSG pic.twitter.com/JxfdwBnG0t— IndianPremierLeague (@IPL) May 14, 2024 -
సీజన్ మొత్తం మాకు అదే సమస్య.. అందుకే ఈ దుస్థితి: కేఎల్ రాహుల్
ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఓటమి పాలైంది. ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో 19 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఢిల్లీ వేదికగా మంగళవారం జరిగిన ఈ మ్యాచ్ ఫలితంతో రాజస్తాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది.ఇక సమిష్టి ప్రదర్శనతో లక్నోపై గెలుపుతో లీగ్ దశను ముగించిన ఢిల్లీ క్యాపిటల్స్.. ఓవరాల్‌గా ఈ సీజన్లో ఏడు విజయాలు సాధించింది. వెళ్తూ వెళ్తూ లక్నో సూపర్ జెయింట్స్ ప్లే ఆఫ్స్ ఆశలను దాదాపుగా గల్లంతు చేసింది.వాళ్లిద్దరు పట్టుదలగా నిలబడ్డారుఈ నేపథ్యంలో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఢిల్లీ చేతిలో ఓటమిపై స్పందించాడు. ‘‘40 ఓవర్ల పాటు వికెట్ ఒకే విధంగా ఉంది. తొలి ఓవర్లోనే మేము జేక్ ఫ్రేజర్ మెగర్క్‌ను అవుట్ చేసి శుభారంభం అందుకున్నాం.అయితే, దానిని మేము నిలబెట్టుకోలేకపోయాం. షాయీ హోప్, అభిషేక్ పోరెల్ పట్టుదలగా నిలబడ్డారు. ఇక్కడ 200 పెద్ద స్కోరేమీ కాదు. అయినా, లక్ష్య ఛేదనలో మేము తడబడ్డాం.సీజన్ మొత్తం మాకు అదే సమస్యనిజానికి ఇది పూర్తి చేయదగిన టార్గెట్. ఈ సీజన్ ఆసాంతం పవర్ ప్లేలో త్వరగా వికెట్లు కోల్పోవడం మాకు ఇబ్బందికరంగా మారింది. బ్యాటింగ్ పరంగా మాకు ఎప్పుడూ శుభారంభం లభించలేదు.స్టొయినిస్, పూరన్‌లకు మేము సహకారం అందించలేకపోయాం. అందుకే మేము ఇప్పుడిలా విపత్కర పరిస్థితిలో కూరుకుపోయాం’’ అని కేఎల్ రాహుల్ విచారం వ్యక్తం చేశాడు. కాగా ఈ మ్యాచ్‌లో రాహుల్ పూర్తిగా విఫలమయ్యాడు. 3 బంతులు ఎదుర్కొన్న ఈ ఓపెనింగ్ బ్యాటర్ కేవలం ఐదు పరుగులు మాత్రమే చేశాడు.ఢిల్లీ వర్సెస్ లక్నో స్కోర్లు👉వేదిక: అరుణ్‌జైట్లీ స్టేడియం.. ఢిల్లీ👉టాస్: లక్నో.. బౌలింగ్👉ఢిల్లీ స్కోరు: 208/4 (20)👉లక్నో స్కోరు: 189/9 (20)👉ఫలితం: 19 పరుగుల తేడాతో లక్నోపై ఢిల్లీ గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్:ఇషాంత్ శర్మ(3/34).చదవండి: Virat Kohli: అదే జరిగితే.. ఆర్సీబీ కెప్టెన్‌గా మళ్లీ కోహ్లినే!A clinical win at home to finish off their season 🙌 @DelhiCapitals with a lap of honour for their roaring home fans to extend their gratitude for their love and support 🥳#TATAIPL | #DCvLSG pic.twitter.com/kekvx9uuZK— IndianPremierLeague (@IPL) May 15, 2024 -
ఢిల్లీ ఆశలు పదిలం!
న్యూఢిల్లీ: సొంతగడ్డపై సత్తా చాటిన ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ లీగ్ దశను విజయంతో ముగించింది. ఈ గెలుపుతో సాంకేతికంగా ‘ప్లే ఆఫ్స్’ అవకాశాలు ఇంకా మిగిలే ఉన్నా... ఆ జట్టు ముందంజ వేయడం చాలా రకమైన ఇతర సమీకరణాలపై ఆధారపడి ఉంది. మరోవైపు గెలిస్తే ప్లే ఆఫ్స్ రేసులో మెరుగైన స్థితికి చేరే అవకాశం ఉన్నా కూడా లక్నో సూపర్ జెయింట్స్ దానిని చేజార్చుకుంది. మంగళవారం జరిగిన పోరులో ఢిల్లీ 19 పరుగుల తేడాతో లక్నోపై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. అభిõÙక్ పొరేల్ (33 బంతుల్లో 58; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు), ట్రిస్టన్ స్టబ్స్ (25 బంతుల్లో 57 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేయగా... షై హోప్ (27 బంతుల్లో 38; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), రిషభ్ పంత్ (23 బంతుల్లో 33; 5 ఫోర్లు) రాణించారు. అనంతరం లక్నో 20 ఓవర్లలో 9 వికెట్లకు 189 పరుగులు చేసి ఓడిపోయింది. నికోలస్ పూరన్ (27 బంతుల్లో 61; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు), అర్షద్ ఖాన్ (33 బంతుల్లో 58 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) దూకుడుగా ఆడగా మిగతా వారంతా పూర్తిగా విఫలమయ్యారు. ఢిల్లీ–లక్నో మ్యాచ్ ఫలితంతో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే రాజస్తాన్ రాయల్స్ 16 పాయింట్లతో ‘ప్లే ఆఫ్స్’కు బెర్త్‌ను ఖరారు చేసుకున్న రెండో జట్టుగా నిలిచింది. కీలక భాగస్వామ్యం... తొలి ఓవర్లోనే జేక్ ఫ్రేజర్ (0)ను అవుట్ చేసిన లక్నో ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. పొరేల్, హోప్ కలిసి దూకుడుగా ఆడారు. అర్షద్ ఓవర్లో పొరేల్ 3 ఫోర్లు, సిక్స్ కొట్టగా, యు«ద్వీర్ ఓవర్లో హోప్ 2 ఫోర్లు, సిక్స్ బాదాడు. పవర్‌ప్లేలో ఢిల్లీ 73 పరుగులు చేసింది.21 బంతుల్లోనే పొరేల్ అర్ధసెంచరీ పూర్తి కాగా, ఈ జోడీ రెండో వికెట్‌కు 92 పరుగులు (49 బంతుల్లో) జోడించింది. వీరిద్దరు తక్కువ వ్యవధిలో వెనుదిరగ్గా, పంత్ కొన్ని కీలక పరుగులు సాధించాడు. అయితే స్టబ్స్ ధాటైన బ్యాటింగ్ ఢిల్లీ స్కోరును 200 దాటించింది. అర్షద్ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ కొట్టిన అతను, నవీన్ ఓవర్లో 2 సిక్స్‌లు, ఫోర్ బాది 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీని అందుకున్నాడు. పూరన్ మినహా... భారీ ఛేదనలో లక్నో పూర్తిగా తడబడింది. పూరన్ మెరుపు బ్యాటింగ్ తప్ప ఇన్నింగ్స్‌లో ప్రధాన బ్యాటర్ ఒక్కరు కూడా కనీస ప్రదర్శన ఇవ్వలేకపోయారు. పవర్‌ప్లే ముగిసేలోపే కేఎల్ రాహుల్ (5), డికాక్ (12), స్టొయినిస్ (5), హుడా (0) వెనుదిరగడం జట్టును బాగా దెబ్బ తీసింది. మరోవైపు అక్షర్ ఓవర్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు కొట్టిన పూరన్... ఇతర బౌలర్లపై కూడా చెలరేగి 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే లక్నోను విజయం దిశగా తీసుకెళ్లేందుకు ఇది సరిపోలేదు. విజయానికి 9 ఓవర్లలో 108 పరుగులు చేయాల్సిన స్థితిలో పూరన్ అవుట్ కావడంతో జట్టు ఆశలు కోల్పోయింది. చివర్లో అర్షద్ పోరాడినా అప్పటికే ఆలస్యమైపోయింది. స్కోరు వివరాలు ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: జేక్ ఫ్రేజర్ (సి) నవీన్ (బి) అర్షద్ 0; పొరేల్ (సి) పూరన్ (బి) నవీన్ 58; హోప్ (సి) రాహుల్ (బి) బిష్ణోయ్ 38; పంత్ (సి) హుడా (బి) నవీన్ 33; స్టబ్స్ (నాటౌట్) 57; అక్షర్ (నాటౌట్) 14; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 208. వికెట్ల పతనం: 1–2, 2–94, 3–111, 4–158. బౌలింగ్: అర్షద్ 3–0–45–1, మొహసిన్ 4–0–29–0, యుధ్వీర్ 2–0–28–0, నవీన్ 4–0–51–2, బిష్ణోయ్ 4–0–26–1, కృనాల్ 2–0–20–0, హుడా 1–0–9–0. లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: డికాక్ (సి) ముకేశ్ (బి) ఇషాంత్ 12; రాహుల్ (సి) ముకేశ్ (బి) ఇషాంత్ 5; స్టొయినిస్ (స్టంప్డ్) పంత్ (బి) అక్షర్ 5; హుడా (ఎల్బీ) (బి) ఇషాంత్ 0; పూరన్ (సి) అక్షర్ (బి) ముకేశ్ 61; బదోని (సి) గుల్బదిన్ (బి) స్టబ్స్ 6; కృనాల్ (స్టంప్డ్) పంత్ (బి) కుల్దీబ్ 18; అర్షద్ (నాటౌట్) 58; యుధ్వీర్ (సి) హోప్ (బి) ఖలీల్ 14; బిష్ణోయ్ (రనౌట్) 2; నవీన్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 189. వికెట్ల పతనం: 1–7, 2–24, 3–24, 4–44, 5–71, 6–101, 7–134, 8–167, 9–183. బౌలింగ్: ఇషాంత్ 4–0–34–3, ఖలీల్ 2–0–22–1, అక్షర్ 1–0–20–1, ముకేశ్ 4–0–33–1, కుల్దీప్ 4–0–33–1, స్టబ్స్ 1–0–4–1, గుల్బదిన్ 1–0–12–0, సలామ్ 3–0–30–0. ఐపీఎల్లో నేడురాజస్తాన్ X పంజాబ్ వేదిక: గువాహటిరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
లక్నోపై ఢిల్లీ ఘన విజయం.. ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం
ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ సత్తాచాటింది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో 19 పరుగుల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది. దీంతో ఢిల్లీ తమ ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. అయితే ఢిల్లీ ప్లే ఆఫ్స్ భవితవ్యం ఇతర జట్ల గెలుపోటములుపై ఆధారపడి ఉంటుంది. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోర్ సాధించింది.ఢిల్లీ బ్యాటర్లలో అభిషేక్ పోరెల్(58), ట్రిస్టన్ స్టబ్స్(57) అద్బుతమైన హాఫ్ సెంచరీలతో చెలరేగారు. వారిద్దరితో పాటు షాయ్ హోప్(38), కెప్టెన్ రిషబ్ పంత్(33) పరుగులతో రాణించారు. ఇక లక్నో బౌలర్లలో నవీన్ ఉల్ హక్ రెండు వికెట్లు పడగొట్టగా.. అర్షద్ ఖాన్, బిష్ణోయ్ తలా వికెట్ సాధించారు.చెలరేగిన ఇషాంత్..అనంతరం 209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 189 పరుగులకే పరిమితమైంది. లక్నో టెయిలాండర్ అర్షద్ ఖాన్ అద్బుతమైన పోరాట పటిమ కనబరిచనప్పటికి తన జట్టును గెలిపించలేకపోయాడు. 7వ స్ధానంలో బ్యాటింగ్‌లో వచ్చిన అర్షద్.. ఢిల్లీ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. లక్ష్య చేధనలో 102 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన సమయంలో క్రీజులోకి వచ్చిన అర్షద్ ఖాన్.. గెలుపు అంచుల దాకా తీసుకువచ్చాడు. 33 బంతులు ఎదుర్కొన్న అర్షద్.. 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 58 పరుగులు చేశాడు. అతడితో పాటు నికోలస్ పూరన్(61) కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరూ మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఇక ఢిల్లీ బౌలర్లలో ఇషాంత్ శర్మ మూడు వికెట్లు, ఖాలీల్ అహ్మద్, అక్షర్ పటేల్, స్టబ్స్, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్ తలా వికెట్ సాధించారు. -
DC Vs LSG: చెలరేగిన స్టబ్స్, అభిషేక్.. లక్నో ముందు భారీ టార్గెట్
ఐపీఎల్-2024లో తమ చివరి లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు జూలు విధిల్చారు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఢిల్లీ బ్యాటర్లలో అభిషేక్ పోరెల్(58), ట్రిస్టన్ స్టబ్స్(57) అద్బుతమైన హాఫ్ సెంచరీలతో చెలరేగారు. వారిద్దరితో పాటు షాయ్ హోప్(38), కెప్టెన్ రిషబ్ పంత్(33) పరుగులతో రాణించారు. ఇక లక్నో బౌలర్లలో నవీన్ ఉల్ హక్ రెండు వికెట్లు పడగొట్టగా.. అర్షద్ ఖాన్, బిష్ణోయ్ తలా వికెట్ సాధించారు. -
ఢిల్లీతో లక్నో డూర్ ఆర్ డై మ్యాచ్.. తుది జట్లు ఇవే
ఐపీఎల్-2024లో లక్నో సూపర్ జెయింట్స్ కీలక పోరుకు సిద్దమైంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా లక్నో, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడతున్నాయి.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఇరు జట్లు పలు మార్పులతో ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగాయి. గత మ్యాచ్‌కు దూరమైన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ తిరిగి రీఎంట్రీ ఇచ్చాడు. లక్నో జట్టులోకి పేసర్లు అర్షద్ ఖాన్, యుద్దవీర్, మోహ్షిన్ ఖాన్ వచ్చారు. కాగా లక్నో సూపర్ జెయింట్స్‌కు ఈ మ్యాచ్ చాలా కీలకం. ప్లే ఆఫ్ రేసులో ఉండాలంటే ఈ మ్యాచ్‌లో లక్నో కచ్చితంగా విజయం సాధించాలి. మరోవైపు ఢిల్లీ తమ చివరి లీగ్ మ్యాచ్‌లో సత్తాచాటాలని భావిస్తోంది. కాగా ఈ మ్యాచ్‌లో ఢిల్లీ గెలిచిన ప్లే ఆఫ్స్ చేరాలంటే అద్భుతాలు జరగాలి.తుది జట్లుఢిల్లీ క్యాపిటల్స్ : అభిషేక్ పోరెల్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, షాయ్ హోప్, రిషబ్ పంత్(కెప్టెన్/ వికెట్ కీపర్), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, గుల్బాదిన్ నాయబ్, రసిఖ్ దార్ సలామ్, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్లక్నో సూపర్ జెయింట్స్ : కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్/ కెప్టెన్), క్వింటన్ డి కాక్, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్యా, యుధ్వీర్ సింగ్ చరక్, అర్షద్ ఖాన్, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, మొహ్సిన్ ఖాన్ -
కేఎల్ రాహుల్‌ను ఇంటికి పిలిచిన గోయెంక: అతియా శెట్టి పోస్ట్ వైరల్
లక్నో సూపర్ జెయింట్స్ యజమాని, బడా వ్యాపారవేత్త సంజీవ్ గోయెంక నష్ట నివారణ చర్యలు చేపట్టారు. లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను తన ఇంటికి ఆహ్వానించి.. తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో రాహుల్‌ను ఆయన ఆత్మీయంగా హత్తుకున్న ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది.ఐపీఎల్-2022లో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అడుగుపెట్టిన లక్నో ఫ్రాంఛైజీ తమ సారథిగా టీమిండియా స్టార్ కేఎల్ రాహుల్‌ను నియమించింది. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ కెప్టెన్సీలో లక్నో అరంగేట్రంలోనే ప్లే ఆఫ్స్ చేరింది. గతేడాది సైతం టాప్-4తో ముగించింది.ఈ క్రమంలో పదిహేడో ఎడిషన్‌లోనూ సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. అయితే, ప్లే ఆఫ్స్ రేసులో ఆటంకాలు లేకుండా ముందుకు సాగాలంటే సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో లక్నో ఓడిపోయింది.అందరూ చూస్తుండగానే చీవాట్లుఈ మ్యాచ్‌లో ప్యాట్ కమిన్స్ టీమ్ కేఎల్ రాహుల్ సేనను 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి.. బ్యాటింగ్ విధ్వంసంతో పలు రికార్డులు ఖాతాలో వేసుకుంది. ఈ నేపథ్యంలో లక్నో యజమాని సంజీవ్ గోయెంక కెప్టెన్ రాహుల్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.మైదానంలో అందరూ చూస్తుండగానే చీవాట్లు పెట్టాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ కావడంతో సంజీవ్ గోయెంక తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. కెప్టెన్ పట్ల ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా అంటూ మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్ వంటి వాళ్లు గోయెంక వ్యవహారశైలిని తప్పుబట్టారు.డిన్నర్ కోసం తన ఇంటికి ఆహ్వానించిఇక ఫ్యాన్స్ అయితే, రాహుల్ ఆత్మగౌరవం నిలబడాలంటే వెంటనే లక్నోకు గుడ్‌బై చెప్పాలంటూ సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో తాజా ఫొటో తెర మీదకు వచ్చింది. కేఎల్ రాహుల్‌ను డిన్నర్ కోసం తన ఇంటికి ఆహ్వానించిన సంజీవ్ గోయెంక అతడిని ఆలింగనం చేసుకున్నాడు. Sanjiv Goenka invited KL Rahul for dinner at his home last night and both hugged each other.- Everything is okay now in LSG. ❤️ pic.twitter.com/RY9KsiNre3— Tanuj Singh (@ImTanujSingh) May 14, 2024తుపాన్ వెలిసిన తర్వాతఈ నేపథ్యంలో గోయెంక- రాహుల్ మధ్య సఖ్యత కుదిరిందని.. జట్టులో ప్రస్తుతం అంతా బాగానే ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. కేఎల్ రాహుల్ భార్య, నటి అతియా శెట్టి చేసిన పోస్ట్ ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది. తుపాన్ వెలిసిన తర్వాత ప్రశాంతంగా ఇలా అంటూ ఆమె మబ్బులు వీడిన సూర్యుడి ఫొటో పంచుకుంది.కాగా ఐపీఎల్-2024లో భాగంగా లక్నో మంగళవారం ఢిల్లీతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే లక్నో ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంటాయి. అయితే, మిగిలి ఉన్న మరో మ్యాచ్ గెలవడంతో పాటు ఇందుకోసం ఇతర జట్ల ఫలితాలపై కూడా ఆధారపడాల్సి ఉంటుంది. Athiya Shetty Instagram story.Cryptic post 🤔🤔 pic.twitter.com/HTKdJ95G9d— DREAM11s STATS (@fantasy1Cricket) May 14, 2024 -
రూ. 400 కోట్ల లాభం వస్తోంది.. చాలదా?: సెహ్వాగ్ కామెంట్స్ వైరల్
ఐపీఎల్ ఫ్రాంఛైజీ యజమానులను ఉద్దేశించి టీమిండియా మాజీ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆటగాళ్లు, కోచ్‌లే జట్టును ముందుకు నడిపిస్తారని.. ఈ విషయంలో ఓనర్ల జోక్యం అనవసమా అంటూ ఘాటుగా విమర్శించాడు.వ్యాపారవేత్తలు కేవలం లాభనష్టాల గురించే ఆలోచిస్తారని.. అయితే, మైదానంలోనే ఆటగాళ్లను కించపరిచేలా వ్యవహరించడం సరికాదని హితవు పలికాడు. లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా ఆ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ పట్ల అనుచితంగా ప్రవర్తించిన నేపథ్యంలో సెహ్వాగ్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.కాగా ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో కేఎల రాహుల్ కెప్టెన్‌గా, బ్యాటర్‌గా విఫలమయ్యాడు. ఫలితంగా రైజర్స్ చేతిలో లక్నో చిత్తుగా ఓడిపోయింది. ఈ క్రమంలో సంజీవ్ గోయెంకా మైదానంలోనే రాహుల్‌తో వాదనకు దిగాడు.అతడు సర్దిచెప్తున్నా వినిపించుకోకుండా ఆగ్రహం ప్రదర్శించాడు. అదే విధంగా కోచ్ జస్టిన్ లాంగర్ పట్ల కూడా ఇదే తరహాలో వ్యవహరించాడు గోయెంకా. ఈ విషయంపై స్పందించిన సెహ్వాగ్ క్రిక్‌బజ్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు.‘‘డ్రెస్సింగ్ రూం లేదంటే ప్రెస్ మీట్ సమయంలోనే ఓనర్లు ఆటగాళ్లతో మాట్లాడాలి. అది కూడా వాళ్లలో స్ఫూర్తి నింపేలా వ్యవహరించాలి గానీ.. ‘‘సమస్య ఏంటి? ఏం జరుగుతోంది?’’ అంటూ మైదానంలోనే ఇలా వ్యవహరించకూడదు.కోచ్‌లు, కెప్టెన్ జట్టును నడిపిస్తారు. కాబట్టి ఓనర్లు ఆటగాళ్ల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడమే బెటర్. వాళ్లంతా వ్యాపారవేత్తలు. వాళ్లకు కేవలం లాభం, నష్టం గురించి మాత్రమే తెలుసు.అయినా ఇక్కడ వారికి ఎలాంటి లాస్ లేదు. 400 కోట్ల రూపాయల వరకు లాభం ఆర్జిస్తున్నారు. అంటే.. ఇక్కడ వాళ్లకు నష్టమేమీ ఉండదు కదా అని అంటున్నా! లాభాలు తీసుకోవడం తప్ప జట్టులో ఏం జరిగినా పట్టించుకునే అవసరం పెద్దగా లేదనే అనుకుంటున్నా. మీరేమైనా చెప్పాలనుకుంటే ఆటగాళ్లను మోటివేట్ చేసేలా ఉండాలి.ఐపీఎల్లో చాలా ఫ్రాంఛైజీలు ఉన్నాయి. ఆటగాడు ఓ జట్టును వీడితే మరో జట్టు అతడిని తీసుకుంటుంది. కీలకమైన ఆటగాడిని కోల్పోతే మీ విజయాల శాతం సున్నా అవుతుంది. నేను పంజాబ్ జట్టును వీడినపుడు వాళ్లు ఐదో స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత ఎప్పుడూ కనీసం ఐదో స్థానంతో ముగించలేకపోయారు’’ అని సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. -
కేఎల్ రాహుల్‌కు సారీ.. లక్నోతోనే టీమిండియా స్టార్?!
భారత స్టార్ క్రికెటర్ కెప్టెన్ కేఎల్ రాహుల్ లక్నో సూపర్ జెయింట్స్‌ను వీడనున్నాడనే వార్తల నేపథ్యంలో ఆ జట్టు సన్నిహిత వర్గాలు కీలక అప్డేట్ అందించాయి. కెప్టెన్- యాజమాన్యం మధ్య అంతాబాగానే ఉందని స్పష్టం చేశాయి. కాగా ఐపీఎల్-2024లో హైదరాబాద్‌లో సన్‌రైజర్స్‌తో ఘోర ఓటమి నేపథ్యంలో కేఎల్ రాహుల్‌కు ఘోర అవమానం జరిగిన విషయం తెలిసిందే. లక్నో ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గోయెంకా మైదానంలోకి వచ్చి రాహుల్‌పై తీవ్ర అసహనాన్ని ప్రదర్శించారు. రాహుల్‌పై గోయెంకా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫలితంగా.. ఫ్రాంచైజీ అసంతృప్తి నేపథ్యంలో రాహుల్ మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో పగ్గాలు వదిలేసి పూర్తిగా బ్యాటింగ్‌పై శ్రద్ధ పెడతాడా లేదా ఫ్రాంఛైజీకి గుడ్‌బై చెబుతాడా? అనేవి చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలో.. ‘లక్నో ఈ నెల 14న ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడుతుంది. ఇందుకు ఇంకా గడువు ఉండటంతో ఏ నిర్ణయం తీసుకోలేదు. మేనేజ్మెంట్ తప్పిస్తుందా లేదంటే కెప్టెన్ రాహులే వైదొలగుతాడా అనే దానిపై త్వరలోనే స్పష్టత వస్తుంది’ అని ఐపీఎల్ వర్గాలు తెలిపాయి.తాజాగా ఈ విషయం గురించి లక్నో వర్గాలు స్పందిస్తూ.. ‘‘కేఎల్ రాహుల్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించడమే గాక... వచ్చే వేలంలో కూడా అతడిని లక్నో తీసుకోదు అని వస్తున్నవి కేవలం వదంతులు మాత్రమే.గత మ్యాచ్ ఫలితం మాకు అనుకూలంగా లేదనే బాధ ఉంది. అయితే, జట్టు, ఓనర్ల మధ్య అంతా బాగానే ఉంది. రాహుల్ కూడా బాగున్నాడు. ఢిల్లీతో మ్యాచ్‌కు ముందు అతడు విశ్రాంతి తీసుకుంటున్నాడంతే!’’ అని వార్తా సంస్థ IANSకు తెలిపాయి. కాగా సంజీవ్ గోయెంకా తీరుతో రాహుల్ తీవ్ర మనస్తాపం చెందడం, సోషల్ మీడియాలో తనపై పెద్ద ఎత్తున నెగటివిటీ రావడంతో ఆయన అతడిని క్షమాపణ కోరినట్లు వదంతులు వినిపిస్తున్నాయి.చదవండి: ప్లే ఆఫ్స్ రేసులో ఉండాలంటే.. సన్‌రైజర్స్ చేయాల్సిందిదే! ఆ రెండు జట్లు కన్ఫామ్!? -
KL Rahul: జట్టు గెలవాలన్న తపనే అది: ఆసీస్ దిగ్గజం.
రెండేళ్ల క్రితం ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అడుగుపెట్టింది లక్నో సూపర్ జెయింట్స్. కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో వరుసగా రెండుసార్లు ప్లే ఆఫ్స్ చేరింది. తద్వారా క్యాష్ రిచ్ లీగ్ ఆరంభం నుంచి ఉన్న కొన్ని జట్లకు సాధ్యం కాని ఘనతను లక్నో సాధించింది.ఐపీఎల్-2024లోనూ ప్లే ఆఫ్స్ రేసులో ముందుకు వెళ్లాలని పట్టుదలగా ఉంది. కేఎల్ రాహుల్ వికెట్ కీపర్ బ్యాటర్‌గా, కెప్టెన్‌గా రాణిస్తూ జట్టును టాప్-4లో నిలిపేందుకు తన వంతు కృషి చేస్తున్నాడు.అయితే, టాప్-4లో అడుగుపెట్టాలంటే కీలకమైన మ్యాచ్‌లో లక్నో చిత్తుగా ఓడిపోయింది. సన్‌రైజర్స్ హైదాబాద్తో బుధవారం నాటి మ్యాచ్‌లో పది వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ బ్యాటర్‌గా, సారథిగా విఫలమయ్యాడు.ఈ నేపథ్యంలో లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా అందరి ముందే కేఎల్ రాహుల్, కోచ్ జస్టిన్ లాంగర్‌కు గట్టిగా చీవాట్లు పెట్టాడు. దీంతో సంజీవ్ గోయెంకా తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెండుసార్లు జట్టును ప్లే ఆఫ్స్ వరకు తీసుకువచ్చిన కెప్టెన్‌కు మీరిచ్చే గౌరవం ఇదేనా అంటూ మహ్మద్ షమీ వంటి ప్రముఖులు ఫైర్ అవుతున్నారు.ఈ క్రమంలో ఆస్ట్రేలియా దిగ్గజ పేసర్ బ్రెట్ లీ భిన్నంగా స్పందించాడు. ‘‘అందరి ముందు అలా మాట్లాడేకంటే.. లోపలికి వెళ్లిన తర్వాత చర్చించాల్సింది. ఒకవేళ అదే జరిగితే ఈ విషయం గురించి స్పందించమనే ప్రశ్న నాకు ఎదురయ్యేదే కాదు.అయితే, నాణేనికి మరోవైపు కూడా ఆలోచించాలి. ఆట పట్ల జట్ల యజమానులు, కోచ్‌లకు ఉన్న ప్యాషన్‌ను మనం అర్థం చేసుకోవాలి. వాళ్ల జట్టు అత్యుత్తమంగా రాణించాలని కోరుకోవడంలో తప్పు లేదు. బహుశా అందుకే ఈ ఘటన జరిగి ఉంటుంది’’ అని బ్రెట్ లీ ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించాడు. చదవండి: ద్రవిడ్ గుడ్ బై!.. టీమిండియా కొత్త కోచ్‌గా ఫారినర్?.. జై షా కామెంట్స్ వైరల్ -
సిగ్గు పడండి.. కెమెరాల ముందు ఇలా చేస్తారా?: మహ్మద్ షమీ ఫైర్
లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకాపై టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆటగాళ్లను కించపరిచేలా వ్యవహరించడం సరికాదని విమర్శించాడు. కెప్టెన్ పట్ల బహిరంగంగా అసహనం వ్యక్తం చేయడం సిగ్గు చేటంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.కాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో లక్నో సూపర్ జెయింట్స్ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఉప్పల్‌లో బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ సేన నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 165 పరుగులు చేయగలిగింది.టాపార్డర్ పూర్తిగా విఫలం కాగా ఐదు, ఆరు స్థానాల్లో వచ్చిన నికోలస్ పూరన్(48), ఆరో నంబర్ బ్యాటర్ ఆయుశ్ బదోని(55) అద్భుత ఇన్నింగ్స్ చేయడంతో ఈ మాత్రం పరుగులు రాబట్టింది.ఇక ఈ మ్యాచ్‌లో రాహుల్ 33 బంతులు ఎదుర్కొని కేవలం 29 పరుగులు మాత్రమే చేశాడు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన సన్‌రైజర్స్ ఓపెనర్లు అభిషేక్ శర్మ(28 బంతుల్లో 75), ట్రావిస్ హెడ్(30 బంతుల్లో 89) విధ్వంసకర ఇన్నింగ్స్ కారణంగా 9.4 ఓవర్లలోనే పని పూర్తి చేసింది.ఫలితంగా లక్నో 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. ఈ నేపథ్యంలో లక్నో యజమాని కెప్టెన్ కేఎల్ రాహుల్‌పై అందరి ముందే సీరియస్ అయ్యాడు. రాహుల్ వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించినా అస్సలు వినిపించుకోలేదు.ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ కాగా.. సంజీవ్ గోయెంకా తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో మహ్మద్ షమీ స్పందిస్తూ.. గోయెంకా తీరును తప్పుబట్టాడు.‘‘ఆటగాళ్లకు ఆత్మ గౌరవం ఉంటుంది. యజమానిగా మీరు కూడా ఒక గౌరవప్రదమైన స్థాయిలో ఉన్న వ్యక్తి. చాలా మంది మిమ్మల్ని చూసి చాలా విషయాలు నేర్చుకుంటారు.కెమెరాల ముందు మీరిలా చేయడం నిజంగా సిగ్గు చేటు. ఇది కచ్చితంగా సిగ్గుపడాల్సిన విషయమే. ఒకవేళ మీరు కెప్టెన్‌తో మాట్లాడాలనుకుంటే అందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి.డ్రెసింగ్‌రూం లేదంటే హోటల్ రూంలో కెప్టెన్‌తో మాట్లాడవచ్చు. కానీ ఇలా అందరి ముందే మైదానంలో ఇలా అరిచేయడం సరికాదు. ఇలా చేయడం ద్వారా ఎర్రకోట మీద జెండా ఎగురవేసినంత గొప్ప ఏమైనా వచ్చిందేంటి?అతడు కేవలం ఆటగాడే కాదు కెప్టెన్ కూడా! ప్రతిసారి ప్రణాళికలు పక్కాగా అమలు చేయలేకపోవచ్చు. ఆటలో గెలుపోటములు సహజం. అంత మాత్రాన కెప్టెన్ కించపరిచేలా వ్యవహరిస్తారా? ఇలా చేసి తప్పుడు సందేశం ప్రజల్లోకి వెళ్లేలా చేశారు’’ అంటూ మహ్మద్ షమీ సంజీవ్ గోయెంకా వ్యవహార శైలిపై విరుచుకుపడ్డాడు. కాగా చీలమండ సర్జరీ కారణంగా షమీ(గుజరాత్ టైటాన్స్) ఐపీఎల్-2024 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. -
IPL 2024: కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్న కేఎల్ రాహుల్..?
కేఎల్ రాహుల్ లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్నాడని తెలుస్తుంది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని సమాచారం. ఈ సీజన్లో లక్నో ఆడబోయే తదుపరి రెండు మ్యాచ్‌ల్లో రాహుల్ సాధారణ ఆటగాడిగా కొనసాగుతాడని ప్రముఖ వార్తా సంస్ధ వెల్లడించిన నివేదిక ద్వారా తెలుస్తుంది.సన్‌రైజర్స్‌తో నిన్నటి మ్యాచ్ తదనంతర పరిణామాల్లో రాహుల్ ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సన్‌రైజర్స్ చేతిలో దారుణ పరాభవాన్ని ఎదుర్కొన్న అనంతరం లక్నో ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గోయంకా రాహుల్ పట్ల చాలా అసభ్యంగా ప్రవర్తించాడు. అందరూ చూస్తుండగానే రాహుల్‌పై మాటల దాడికి దిగాడు.గొయెంకా నుంచి ఈ తరహా ప్రవర్తనను ఊహించని రాహుల్ తీవ్ర మనస్థాపానికి గురై కెప్టెన్సీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. రాహుల్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడానికి మరో కారణం కూడా ఉందని తెలుస్తుంది.గొయెంకా తదుపరి సీజన్లో రాహుల్‌ను వదించుకోవాలని సన్నిహితుల వద్ద ప్రస్తావించాడని సమాచారం. గొయెంకాకు ఆ అవకాశం ఇవ్వడమెందుకని రాహులే స్వయంగా కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రచారం జరగుతుంది. 2022 సీజన్లో లక్నో టీమ్ లాంచ్ అయినప్పుడు రాహుల్‌ను గొయెంకా 17 కోట్ల రికార్డు ధరకు సొంతం చేసుకున్నాడు.ఈ సీజన్లో లక్నో ఆడబోయే తదుపరి మ్యాచ్‌కు ఐదు రోజుల సమయం ఉండటంతో రాహుల్ నిర్ణయం ఏ క్షణానైనా వెలువడవచ్చని సమాచారం. గొయెంకా గతంలో పూణే వారియర్స్ అధినేతగా ఉన్నప్పుడు ధోని విషయంలోనూ ఇలాగే వ్యవహరించాడు. ఓ సీజన్ తర్వాత ధోనిని తప్పించి స్టీవ్ స్మిత్‌ను కెప్టెన్‌గా నియమించాడు.ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ చేతిలో ఓడినప్పటికీ లక్నో ప్లే ఆఫ్స్ అవకాశాలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. లక్నో తదుపరి ఆడబోయే రెండు మ్యాచ్‌ల్లో భారీ తేడాతో గెలిస్తే 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్ రేసులో ఉంటుంది. అయితే ఈ జట్టు ప్లే ఆఫ్స్ బెర్త్ మిగిలిన జట్ల జయాపజయాలపై అధారపడి ఉంటుంది. -
పిచ్ స్వరూపం మారిందా లేక మార్చేశారా.. మరీ ఈ రేంజ్లో విధ్వంసమా..?
ఐపీఎల్ 2024 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. దాదాపుగా ప్రతి మ్యాచ్‌లో పట్టపగ్గాల్లేకుండా విరుచుకుపడుతున్నారు. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రవిస్ హెడ్ విధ్వంసం మాటల్లో వర్ణించలేనట్లుగా ఉంది. వీరిద్దరి ఊచకోత ధాటికి పొట్టి క్రికెట్ రికార్డులు బద్దలవుతున్నాయి. నిన్న లక్నోతో జరిగిన మ్యాచ్‌లో వీరి విధ్వంసం వేరే లెవెల్లో ఉంది. వీరిద్దరు లక్నో బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డారు. ఫలితంగా 166 పరుగుల ఓ మోస్తరు లక్ష్యం 9.4 ఓవర్లలోనే తునాతునకలైంది. అభిషేక్ (28 బంతుల్లో 75 నాటౌట్; 8 ఫోర్లు, 6 సిక్సర్లు), హెడ్ (30 బంతుల్లో 89 నాటౌట్; 8 ఫోర్లు, 8 సిక్సర్లు) ఊహకందని విధ్వంసం సృష్టించి తమ జట్టుకు చిరస్మరణీయ విజయాన్నందించారు. ఈ విజయంతో సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది.పిచ్ స్వరూపం మారిందా.. ఆ ఇద్దరూ మార్చేశారా..?నిన్నటి మ్యాచ్‌లో అభిషేక్, హెడ్ విధ్వంసం ఏ రేంజ్లో సాగిందన్నదానికి ఓ విషయం అద్దం పడుతుంది. ఈ మ్యాచ్‌లో లక్నో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఉప్పల్ మైదానంలోని పిచ్ ఆనవాయితీగా తొలుత బ్యాటింగ్ చేసే జట్లకు సహకరిస్తుంది. అయితే సన్‌రైజర్స్ బౌలర్లు, ముఖ్యంగా భువీ చెలరేగడంతో లక్నో ఇన్నింగ్స్ నత్తనడకలా సాగింది. ఆఖర్లో పూరన్, బదోని మెరుపులు మెరిపించడంతో లక్నో గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది.ఇక్కడ ఓ ఆసక్తికర విషయం ఏంటంటే.. లక్నో తొలుత బ్యాటింగ్ చేస్తూ పవర్ ప్లేలో (తొలి 6 ఓవర్లలో) 2 వికెట్లు కోల్పోయి కేవలం 27 పరుగులు మాత్రమే చేసింది. అదే సన్‌రైజర్స్ తొలి ఆరు ఓవర్లలో మాటల్లో వర్ణించలేని విధ్వంసాన్ని సృష్టించి ఏకంగా 107 పరుగులు పిండుకుంది. సన్‌రైజర్స్ ఓపెనర్ల విధ్వంసం చూశాక అభిమానులు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. పిచ్ స్వరూపం మారిందా లేక ఆ ఇద్దరూ మార్చేశారా..? అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఒకే మ్యాచ్‌లో పవర్ ప్లేల్లో మరీ ఇంత వ్యత్యాసమా అని ముక్కునవేల్లేసుకుంటున్నారు. ఇరు జట్ల పవర్ ప్లే స్కోర్లలో 80 పరుగుల వ్యత్యాసం ఉంది. మొత్తానికి నిన్నటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఓపెనర్ల విధ్వంసం ధాటికి పలు రికార్డులు బద్దలయ్యాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.ఐపీఎల్ పవర్ ప్లేల్లో రెండో అత్యధిక స్కోర్ (107/0)ఐపీఎల్లో సన్‌రైజర్స్ మాత్రమే రెండు సందర్భాల్లో (ఇదే సీజన్లో ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో (125/0) పవర్ ప్లేల్లో 100 పరుగుల మార్కును దాటింది.ఓ మ్యాచ్ పవర్ ప్లేల్లో అత్యధిక వ్యత్యాసం (80 పరుగులు- లక్నో 27/2, సన్‌రైజర్స్ 107/0)లక్నోకు పవర్ ప్లేల్లో ఇదే అత్యల్ప స్కోర్ (27/2)ఈ సీజన్ బ్యాటింగ్ పవర్ ప్లేల్లో ట్రవిస్ హెడ్‌కు ఇది నాలుగో అర్ద సెంచరీ. ఓ సీజన్ పవర్ ప్లేల్లో ఇవే అత్యధికం.ఒకే సీజన్లో 20 బంతుల్లోపే మూడు హాఫ్ సెంచరీలు సాధించిన హెడ్. ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ ఆటగాడు జేక్ ఫ్రేజర్, హెడ్ మాత్రమే ఈ ఘనత సాధించారు.ఐపీఎల్ చరిత్రలో రెండో వేగవంతమైన 100 పరుగుల భాగస్వామ్యం (అభిషేక్, హెడ్ (34 బంతుల్లో). ఇదే జోడీ పేరిటే వేగవంతమైన 100 పరుగుల భాగస్వామ్యం రికార్డు కూడా నమోదై ఉంది. ఇదే సీజన్లో ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌ల్లో ఈ ఇద్దరు 30 బంతుల్లోనే 100 పరుగుల పార్ట్‌నర్‌షిప్‌ను నమోదు చేశారు.ఐపీఎల్ చరిత్రలోనే తొలి 10 ఓవర్లలో అత్యధిక స్కోర్ (సన్‌రైజర్స్ 9.4 ఓవర్లలో 167/0)100కు పైగా లక్ష్య ఛేదనలో అత్యధిక మార్జిన్‌తో విజయం (166 పరుగుల లక్ష్యాన్ని మరో 62 బంతులు మిగిలుండగానే ఛేదించిన సన్‌రైజర్స్)మూడో వేగవంతమైన 100 పరుగులు (జట్టు స్కోర్)-5.4 ఓవర్లలో 100 పరుగులు టచ్ చేసిన సన్రైజర్స్ఓ సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన జట్టుగా రికార్డుల్లోకెక్కిన సన్‌రైజర్స్. ఆరెంజ్ ఆర్మీ ఈ సీజన్లో ఇప్పటికే 146 సిక్సర్లు బాదింది. 2018 సీజన్లో సీఎస్కే 145 సిక్సర్లతో రెండో స్థానంలో ఉంది. -
చరిత్ర సృష్టించిన సన్‌రైజర్స్.. ప్రపంచంలోనే తొలి టీ20 జట్టుగా..
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ చేతిలో ఓటమి తర్వాత అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చింది సన్‌రైజర్స్ హైదరాబాద్. సొంత మైదానం ఉప్పల్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ను చిత్తు చిత్తుగా ఓడించింది.ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ తుఫాన్ ఇన్నింగ్స్ కారణంగా క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో తొలిసారి లక్నోపై విజయం నమోదు చేసింది. అదే విధంగా ఈ సీజన్లో ఆడిన 12 మ్యాచ్‌లలో ఏడో గెలుపు నమోదు చేసింది.విధ్వంసకర బ్యాటింగ్తద్వారా 14 పాయింట్లతో పట్టికలో మూడోస్థానానికి ఎగబాకి.. ప్లే ఆఫ్స్ రేసులో ముందుకు దూసుకువచ్చింది. కాగా లక్నోతో మ్యాచ్ సందర్భంగా సన్‌రైజర్స్ సరికొత్త ప్రపంచ రికార్డు సాధించింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ విధ్వంసకర బ్యాటింగ్ వల్లే ఇది సాధ్యమైంది.ఉప్పల్‌లో టాస్ గెలిచిన లక్నో తొలుత బ్యాటింగ్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది రాహుల్ సేన.సునామీ ఇన్నింగ్స్అయితే, లక్ష్య ఛేదనకు దిగిన తర్వాత లక్నోకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు రైజర్స్ ఓపెనర్లు. ట్రావిస్ హెడ్ ఆది నుంచే దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ లక్నో బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టాడు. అతడి ప్రోద్బలంతో అభిషేక్ శర్మ కూడా హిట్టింగ్తో మెరిశాడు.హెడ్ 30 బంతుల్లోనే 89 పరుగులతో దుమ్ములేపగా.. అభిషేక్ 28 బంతుల్లో 75 పరుగులతో విరుచుకుపడ్డాడు. వీరిద్దరి సునామీ ఇన్నింగ్స్ కారణంగా 8.2 ఓవర్లలోనే 150 పరుగుల మార్కు అందుకుంది.ప్రపంచంలోనే తొలి జట్టు👉టీ20 చరిత్రలో అత్యంత తక్కువ ఓవర్లలో ఇలా 150 స్కోరు చేసిన తొలి జట్టు సన్‌రైజర్స్ కావడం విశేషం. ఇక హెడ్, అభి విధ్వంసం కారణంగా సన్‌రైజర్స్ 9.4 ఓవర్లలోనే లక్నో విధించిన 166 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.తద్వారా మరో వరల్డ్ రికార్డు కూడా సాధించింది. టీ20 క్రికెట్ చరిత్రలో 150కి పైగా లక్ష్యాన్ని అత్యంత వేగంగా ఛేదించిన జట్టుగా నిలిచింది. లక్నోతో మ్యాచ్ సందర్భంగా సన్‌రైజర్స్ సాధించిన ప్రపంచ రికార్డులు క్లుప్తంగా..టీ20 హిస్టరీలో ఫాస్టెస్ట్ 150+ ఛేజింగ్1. సన్‌రైజర్స్ హైదరాబాద్- లక్నో సూపర్ జెయింట్స్ మీద- 9.4 ఓవర్లలోఏ 166 పరుగుల లక్ష్య ఛేదన.2. బ్రిస్బేన్ హీట్- మెల్బోర్న్ స్టార్స్ మీద- 10 ఓవర్లలో 157 పరుగుల లక్ష్య ఛేదన.3. గయానా అమెజాన్ వారియర్స్- జమైకా తలావాస్- 10.3 ఓవర్లలో 150 పరుగుల లక్ష్య ఛేదన.ఐపీఎల్ చరిత్రలో 10 ఓవర్లలోపే మూడుసార్లు అత్యధిక పరుగులు సాధించిన ఏకైక జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్👉లక్నో సూపర్ జెయింట్స్ మీద- 167/0 (9.4)- 2024లో👉ఢిల్లీ క్యాపిటల్స్ మీద- 157/4- 2024లో👉ముంబై ఇండియన్స్ మీద- 148/2- 2024లో.WHAT. A. CHASE 🧡A 🔟-wicket win for @SunRisers with more than 🔟 overs to spare! Scorecard ▶️ https://t.co/46Rn0QwHfi#TATAIPL | #SRHvLSG pic.twitter.com/kOxzoKUpXK— IndianPremierLeague (@IPL) May 8, 2024 -
కొడితే ఫోర్లు, సిక్సర్లే!.. ఓడిపోతే అందరూ అనేవాళ్లే!
‘‘నాకసలు ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. టీవీలోనే ఇలాంటి బ్యాటింగ్ చూశాం. కానీ ఇప్పుడిలా.. అస్సలు నమ్మలేకపోతున్నాం. ప్రతి బంతి బౌండరీ లేదంటే సిక్సర్.వారి నైపుణ్యాలకు హ్యాట్సాఫ్. సిక్స్‌లు కొట్టేందుకు వాళ్లు పడిన శ్రమ ఇక్కడ కనిపిస్తోంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో అసలు పిచ్ ఎలా ఉంటుందో అంచనా వేసే ఛాన్స్ కూడా వాళ్లు మాకివ్వలేదు.మొదటి బంతి నుంచే వారి దూకుడు కొనసాగగా.. మేము ఏ దశలోనూ అడ్డుకట్ట వేయలేకపోయాం. జట్టు ఓడిపోయినట్లయితే.. మనం తీసుకున్న ప్రతీ నిర్ణయాన్ని ప్రశ్నిస్తూనే ఉంటారు.మేము కనీసం ఇంకో 40- 50 పరుగులు చేయాల్సింది. పవర్ ప్లేలో వికెట్లు కోల్పోయిన తర్వాత అస్సలు కోలుకోలేకపోయాం. ఆయుశ్, నిక్కీ అద్భుతంగా బ్యాటింగ్ చేసినందు వల్లే 166 టార్గెట్ విధించగలిగాం’’ అని లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అన్నాడు.ఒకవేళ తాము 240 పరుగులు చేసినా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆ లక్ష్యాన్ని ఛేదించేదేనేమో అంటూ ప్రశంసలు కురిపించాడు. కాగా ఐపీఎల్-2024 తాజా మ్యాచ్‌లో లక్నో సన్‌రైజర్స్‌తో తలపడింది.టాపార్డర్ పూర్తిగా విఫలం ఉప్పల్‌లో బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో తొలుత బ్యాటింగ్ చేసి.. పరుగులు రాబట్టేందుకు ఆపసోపాలు పడింది. ఓపెనర్, కెప్టెన్ కేఎల్ రాహుల్(29) సహా టాపార్డర్‌లో క్వింటన్ డికాక్(2), మార్కస్ స్టొయినిస్(3) పూర్తిగా విఫలమయ్యారు.నాలుగో నంబర్ బ్యాటర్ కృనాల్ పాండ్యా(21 బంతుల్లో 24) నిలదొక్కునే ప్రయత్నం చేసినా రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అతడి పప్పులు ఉడకనివ్వలేదు. దీంతో కష్టాల్లో పడిన లక్నోను నికోలస్ పూరన్(26 బంతుల్లో 48), ఆయుశ్ బదోని(30 బంతుల్లో 55) ఆదుకున్నారు.పరుగుల సునామీవీరిద్దరి భాగస్వామ్యం కారణంగానే లక్నో నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 165 పరుగులు చేయగలిగింది. అయితే, లక్ష్య ఛేదనలో ఊహించని విధంగా పరుగుల సునామీ సృష్టించారు సన్‌రైజర్స్ ఓపెనర్లు అభిషేక్ శర్మ(28 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లు- 75 పరుగులు), ట్రావిస్ హెడ్(30 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్స్‌లు- 89 రన్స్).కొడితే బౌండరీ లేదంటే సిక్స్ అన్నట్లుగా సాగింది వీళ్లిద్దరి విధ్వంసం. అభిషేక్ 267.86, హెడ్ 296.67 స్ట్రైక్‌రేటుతో బ్యాటింగ్ చేయడంతో.. దెబ్బకు 9.4 ఓవర్లలోనే టార్గెట్ పూర్తి చేసింది సన్‌రైజర్స్.పాపం రాహుల్లక్నోను 10 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఇక ఈ పరుగుల విధ్వంసానికి సాక్షిగా నిలిచిన వికెట్ కీపర్ బ్యాటర్, కెప్టెన్ కేఎల్ రాహుల్ ఓటమి అనంతరం పైవిధంగా స్పందించాడు. కాగా ఓటమి నేపథ్యంలో లక్నో యజమాని సంజీవ్ గోయెంకా రాహుల్‌పై సీరియస్ అయ్యాడు. చదవండి: SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్WHAT. A. CHASE 🧡A 🔟-wicket win for @SunRisers with more than 🔟 overs to spare! Scorecard ▶️ https://t.co/46Rn0QwHfi#TATAIPL | #SRHvLSG pic.twitter.com/kOxzoKUpXK— IndianPremierLeague (@IPL) May 8, 2024 -
SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
#Abhishek Sharma: లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్ సందర్భంగా సన్‌రైజర్స్ యువ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి తన బ్యాటింగ్ పవర్ చూపించాడు. గత కొన్ని రోజులుగా భారీ స్కోర్లు నమోదు చేయలేక చతికిల పడిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. ఉప్పల్‌లో మాత్రం శివాలెత్తిపోయాడు.మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్(30 బంతుల్లో 89)తో కలిసి ఆకాశమే హద్దుగా చెలరేగాడు. లక్నో విధించిన 166 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 28 బంతుల్లోనే 75 పరుగులు సాధించాడు అభిషేక్ శర్మ.హెడ్‌తో కలిసి అజేయంగా నిలిచి 9.4 ఓవర్లలోనే సన్‌రైజర్స్ టార్గెట్ పూర్తి చేసి ఉప్పల్ స్టేడియాన్నిహోరెత్తించాడు. ఈ నేపథ్యంలో అభిషేక్ శర్మపై ప్రశంసల వర్షం కురుస్తోంది.That's Sunrisers Hyderabad for you 💥#IPLonJioCinema #SRHvLSG #TATAIPL pic.twitter.com/xFiuuafuXa— JioCinema (@JioCinema) May 8, 2024యువీ పాజీకి థాంక్స్ఇక మ్యాచ్ అనంతరం అభిషేక్ శర్మ మాట్లాడుతూ.. ‘‘ఈ టోర్నీ ఆరంభానికి ముందు నేను చేసిన హార్డ్‌వర్క్ ఫలితాన్నిస్తోంది. యువీ పాజీ(యువరాజ్ సింగ్), బ్రియన్ లారా, నా తండ్రికి ధన్యవాదాలు. మా నాన్నే నా మొదటి కోచ్’’ అంటూ ఉద్వేగానికి లోనయ్యాడు 23 ఏళ్ల అభిషేక్.కాస్త ఓపికగా పట్టుఈ నేపథ్యంలో యువరాజ్ సింగ్ స్పందిస్తూ.. ‘‘అద్భుతంగా ఆడావు అభిషేక్ శర్మ. ఇలాగే నిలకడగా ఆడు. కాస్త ఓపికగా ఉండు! త్వరలోనే నీకూ టైమ్ వస్తుంది’’ అంటూ టీమిండియాలో ఎంట్రీ ఇవ్వాలని ఆకాంక్షించాడు.అదే విధంగా ట్రావిస్ హెడ్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘నువ్వు ఏ గ్రహం నుంచి వచ్చావు ఫ్రెండ్? అస్సలు నమ్మలేకున్నాం’’ అని యువీ అతడిని ఆకాశానికెత్తాడు. కాగా టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ పంజాబ్ యువ సంచలనం అభిషేక్ శర్మకు మెంటార్!!సూపర్ అభికాగా ఐపీఎల్-2024లో అభిషేక్ శర్మ నమోదు చేసిన స్కోర్లు వరుసగా.. 32(19), 63(23), 29(20), 37(12), 16(11), 34(22), 46(12), 31(13), 15(9), 12(10), 11(16), 75*(28). మొత్తం 195 బంతుల్లో 35 సిక్సర్ల సాయంతో 401 పరుగులు.సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ స్కోర్లు👉వేదిక: ఉప్పల్ స్టేడియం.. హైదరాబాద్👉టాస్: లక్నో.. బ్యాటింగ్👉లక్నో స్కోరు: 165/4 (20)👉సన్‌రైజర్స్ స్కోరు: 167/0 (9.4)👉ఫలితం: 10 వికెట్ల తేడాతో లక్నోను చిత్తు చేసిన సన్‌రైజర్స్👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ట్రావిస్ హెడ్ (30 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్స్‌ల సాయంతో 89 రన్స్- నాటౌట్). -
Playoffs: పాండ్యాకు పరాభవం.. ముంబై కథ ముగిసిందిలా!
ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్ రేసు నుంచి ముంబై ఇండియన్స్ నిష్క్రమించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్- లక్నో సూపర్ జెయింట్స్ మధ్య బుధవారం మ్యాచ్ ఫలితంతో పాండ్యా సేన టాప్-4 ఆశలు గల్లంతయ్యాయి. లక్నోను సన్‌రైజర్స్ చిత్తు ఓడించడంతో ఈ సీజన్లో ముంబై ప్రయాణం ముగిసినట్లయింది.ఎలా అంటే?ఉప్పల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ లక్నోను పది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. కేఎల్ రాహుల్ సేన విధించిన 166 పరుగుల లక్ష్యాన్ని వికెట్ నష్టపోకుండా 9.4 ఓవర్లలోనే ఛేదించింది.WHAT. A. CHASE 🧡A 🔟-wicket win for @SunRisers with more than 🔟 overs to spare! Scorecard ▶️ https://t.co/46Rn0QwHfi#TATAIPL | #SRHvLSG pic.twitter.com/kOxzoKUpXK— IndianPremierLeague (@IPL) May 8, 2024తద్వారా క్యాష్ రిచ్ లీగ్ పదిహేడో ఎడిషన్‌లో ఏడో విజయం(పన్నెండు మ్యాచ్‌లకు గానూ) నమోదు చేసి.. మొత్తంగా 14 పాయింట్లు సాధించింది. నెట్ రన్‌రేటు(0.406) కూడా మెరుగుపరచుకుని పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది. టాప్-2లో తిష్ట వేసిన కేకేఆర్, రాజస్తాన్‌మరోవైపు.. కోల్‌కతా నైట్ రైడర్స్(రన్‌రేటు 1.453), రాజస్తాన్ రాయల్స్(రన్‌రేటు 0.476) పదకొండేసి మ్యాచ్‌లు ఆడి చెరో 16 పాయింట్లతో టాప్-2లో కొనసాగుతున్నాయి. ఇక చెన్నై సూపర్ కింగ్స్ 11 మ్యాచ్‌లలో ఆరు గెలిచి 12 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది.ఈ నేపథ్యంలో చెరో 12 పాయింట్లతో ఐదు, ఆరు స్థానాల్లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్(రన్‌రేటు -0.316), లక్నో సూపర్ జెయింట్స్(రన్‌రేటు -0.769) వచ్చే వారం తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఏ జట్టు గెలిచినా 14 పాయింట్లతో పైకి ఎగబాకుతుంది.పాండ్యా సేనకు తప్పని పరాభవంమరోవైపు.. ఆర్సీబీ(11 మ్యాచ్‌లు- 8 పాయింట్లు- మిగిలినవి 3), పంజాబ్ కింగ్స్(11 మ్యాచ్‌లు- 8 పాయింట్లు- మిగిలినవి 3) ఏడు, ఎనిమిది స్థానాల్లో కొనసాగుతున్నాయి. అయితే, ముంబై ఇండియన్స్ తొమ్మిదో స్థానంలో ఉన్నప్పటికీ ఇప్పటికే 12 మ్యాచ్‌లు ఆడేసింది. కేవలం నాలుగింట గెలిచి 8 పాయింట్లతో ఉంది.మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిచినా మహా అయితే మొత్తంగా 12 పాయింట్లు వస్తాయి. కాబట్టి టాప్-4లో అడుగుపెట్టేందుకు ముంబైకి దారులు మూసుకపోయినట్లే! ఇక అట్టడుగున ఉన్న గుజరాత్ టైటాన్స్‌కు ఇంకో మూడు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేకేఆర్, రాజస్తాన్, సన్‌రైజర్స్ దాదాపుగా ప్లే ఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకోగా.. ముంబై టోర్నీ నుంచి నిష్క్రమించినట్లయింది.చదవండి: #KL Rahul: కెప్టెన్‌పై కోపంతో ఊగిపోయిన లక్నో ఓనర్.. అందరూ చూస్తుండగానే అలా.. -
కేఎల్ రాహుల్‌పై లక్నో ఓనర్ ఫైర్.. చెప్పేది విను! వీడియో
లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంఛైజీ యజమాని సంజీవ్ గోయెంకాపై కేఎల్ రాహుల్ అభిమానులు మండిపడుతున్నారు. కెప్టెన్ పట్ల మరీ ఇంత దారుణంగా వ్యవహరిస్తారా? అంటూ ఫైర్ అవుతున్నారు. ఇంతకు ముందు ఏ జట్టు ఓనర్ కూడా ఇలా ప్రవర్తించినట్లు చూడలేదని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.ఐపీఎల్-2024లో భాగంగా లక్నో జట్టు బుధవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడింది. టాస్ గెలిచిన లక్నో సారథి కేఎల్ రాహుల్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే, సొంత మైదానం ఉప్పల్‌లో ప్యాట్ కమిన్స్ బృందం సమిష్టి ప్రదర్శనతో ఆకట్టుకుంది.సన్‌రైజర్స్ బౌలర్లు, ఫీల్డర్ల అద్భుత ప్రదర్శన కారణంగా లక్నో నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 165 పరుగులకు పరిమితమైంది. కేఎల్ రాహుల్(29), కృనాల్ పాండ్యా(24) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. నికోలస్ పూరన్(26 బంతుల్లో 48*), ఆయుశ్ బదోని(30 బంతుల్లో 55*) అద్భుతంగా రాణించారు.అయితే, లక్నో విధించిన నామమాత్రపు లక్ష్యాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ ఉఫ్‌మని ఊదేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ(28 బంతుల్లో 75), ట్రావిస్ హెడ్(30 బంతుల్లో 89) పరుగుల వరద పారించి.. 10 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌ను గెలిపించారు. వీరిని కట్టడి చేసేందుకు లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ అమలు చేసిన వ్యూహాలలో ఒక్కటీ ఫలితాన్నివ్వలేదు.ఈ నేపథ్యంలో ఘోర ఓటమి అనంతరం లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా కేఎల్ రాహుల్‌తో వాదనకు దిగాడు. అందరూ చూస్తుండగానే సీరియస్‌గా రాహుల్‌కు క్లాస్ తీసుకున్నాడు.కెప్టెన్ వివరణ ఇచ్చినా పట్టించుకోకుండా.. ‘‘సాకులు చెప్పొద్దు.. నేను సహించను.. ఆ రెండు పాయింట్లు ఎంత ముఖ్యమో తెలుసు కదా’’ అన్నట్లుగా కోపంతో ఊగిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.Mr Goenka is a pathetic owner.I support KL Rahul 100%Repost and show your support towards #KLRahul #SRHvLSG #PBKSvRCB #PBKSvsRCBpic.twitter.com/JUYv9AgVdd— Samira (@Logical_Girll) May 9, 2024 ఈ నేపథ్యంలో సంజీవ్ గోయెంకా ప్రవర్తనను రాహుల్ ఫ్యాన్స్ తప్పుబడుతున్నారు. కాగా ప్లే ఆఫ్స్ రేసులో సాఫీగా ముందుకు వెళ్లాలంటే గెలవాల్సిన మ్యాచ్‌లో లక్నో చిత్తుగా ఓడిపోయింది. పాయింట్ల పట్టికలో ప్రస్తుతానికి ఆరో స్థానంలోనే నిలిచిపోయింది. మరోవైపు సన్‌రైజర్స్ మూడో స్థానానికి దూసుకువచ్చింది.చదవండి: SRH: వాళ్లిద్దరు పిచ్‌ను మార్చేశారు.. అతడొక అద్భుతం.. నమ్మలేకపోతున్నా! WHAT. A. CHASE 🧡A 🔟-wicket win for @SunRisers with more than 🔟 overs to spare! Scorecard ▶️ https://t.co/46Rn0QwHfi#TATAIPL | #SRHvLSG pic.twitter.com/kOxzoKUpXK— IndianPremierLeague (@IPL) May 8, 2024 -
SRH: వాళ్లిద్దరు పిచ్‌ను మార్చేశారు.. అతడొక అద్భుతం!
IPL 2024 SRH vs LSG: ఉప్పల్ స్టేడియంలో మరోసారి పరుగుల వరద పారింది. మ్యాచ్‌కు వాన గండం పొంచి ఉందంటూ అభిమానులు ఆందోళన పడిన వేళ.. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించి అసలైన టీ20 మజాను అందించారు సన్‌రైజర్స్ ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్.తమ బ్యాటింగ్ విధ్వంసంతో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు కళ్లు తేలేసేలా చేసి జట్టుకు అపూర్వ విజయాన్ని అందించారు. రాహుల్ సేన పరుగులు చేసేందుకు తడబడిన పిచ్‌పై.. 166 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించారు.కనీవినీ ఎరుగని రీతిలో 62 బంతులు మిగిలి ఉండగానే సన్‌రైజర్స్‌ను గెలుపుతీరాలకు చేర్చారు. తమ కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌కు ఈ విజయాన్ని పుట్టినరోజు కానుకగా అందించారు. న భూతో న భవిష్యతి అన్న చందంగా ప్రత్యర్థి జట్టు బౌలింగ్‌ను ఊచకోత కోశారు అభిషేక్, హెడ్.వాళ్లిద్దరు పిచ్‌ను మార్చేశారుఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ.. ‘‘బహుశా ట్రావిస్, అభిషేక్ కలిసి పిచ్‌ను మార్చేసి ఉంటారు(నవ్వుతూ). వాళ్లు ఏం చేయగలరో మాకు తెలుసు. అందుకే వారికి పూర్తి స్వేచ్ఛనిచ్చాం.నిజానికి నేనొక బౌలర్‌ను. కాబట్టి ఆ బ్యాటర్లకు పెద్దగా ఇన్పుట్స్ ఇవ్వలేను. ట్రావిస్ హెడ్ విషయానికొస్తే.. అతడు గత రెండేళ్లుగా ఇలాగే ఆడుతున్నాడు.అతడొక అద్భుతంకఠినమైన పిచ్‌లపై కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇక అభిషేక్ శర్మ.. అతడొక అద్భుతమైన ఆటగాడు. స్పిన్, పేస్ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కోగలడు.పవర్ ప్లేలో వీళ్లిద్దరిని ఎదుర్కోవడం ప్రత్యర్థి బౌలర్లకు కష్టమే. ఈ సీజన్లో మా వాళ్లు సూపర్‌గా ఆడుతున్నారు. అయితే, పది కంటే తక్కువ ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించడం నమ్మలేకపోతున్నాం’’ అంటూ హర్షం వ్యక్తం చేశాడు.10 వికెట్ల తేడాతో గెలుపుకాగా లక్నోతో బుధవారం నాటి మ్యాచ్‌లో టాస్ ఓడిన సన్‌రైజర్స్ తొలుత బౌలింగ్ చేసింది. భువనేశ్వర్ కుమార్(2/12)కు తోడు ఫీల్డర్లు అద్భుతంగా రాణించడంతో లక్నోను 165/4 స్కోరుకు కట్టడి చేసింది.ఇక లక్ష్య ఛేదనకు దిగిన సన్‌రైజర్స్.. ఓపెనర్లు అభిషేక్ శర్మ(28 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లు), ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ ట్రావిస్ హెడ్(30 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్సర్లు) తుఫాన్ ఇన్నింగ్స్ కారణంగా 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా ప్లే ఆఫ్స్ రేసులో మరో ముందడుగు వేసింది. WHAT. A. CHASE 🧡A 🔟-wicket win for @SunRisers with more than 🔟 overs to spare! Scorecard ▶️ https://t.co/46Rn0QwHfi#TATAIPL | #SRHvLSG pic.twitter.com/kOxzoKUpXK— IndianPremierLeague (@IPL) May 8, 2024 -
SRH Vs LSG Photos: సన్‌రైజర్స్ విధ్వంసం..లక్నోపై 10 వికెట్లతో ఘనవిజయం (ఫొటోలు)
-
IPL 2024 SRH Vs LSG: సన్‌రైజర్స్ విధ్వంసం
250 పరుగుల లక్ష్యమైనా సన్‌రైజర్స్ ఛేదించేదేమో? ఓటమి తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ జట్టు కెప్టెన్ రాహుల్ వ్యాఖ్య... ప్రత్యర్థి బ్యాటర్ల వీర బాదుడుకు మైదానంలో మొదటి బాధితుడిగా అతను చెప్పిన మాట అక్షరసత్యం. తొలుత బ్యాటింగ్ చేస్తూ సీజన్లో రికార్డు స్కోర్లు సాధించిన హైదరాబాద్ ఇప్పుడు ఛేదనలోనూ వి«ధ్వంసం సృష్టించింది. వీడియోగేమ్ తరహాలో ట్రవిస్ హెడ్, అభిõÙక్ శర్మ విరుచుకుపడుతుంటే స్టేడియంలో పరుగుల ఉప్పెన వచ్చింది. 16 ఫోర్లు, 14 సిక్స్‌లంటే 148 పరుగులు బౌండరీలతోనే... లక్నో విధించిన 166 పరుగుల లక్ష్యం మరీ చిన్నదేమీ కాదు. కానీ 10 ఓవర్లకు ముందే కేవలం 52 నిమిషాల్లో రైజర్స్ ఛేదించిపడేసింది. రైజర్స్ ఛేజింగ్ రాత్రి 9 గంటల 23 నిమిషాలకు మొదలై 10 గంటల 15 నిమిషాలకు ముగిసింది. ఈ గెలుపుతో సన్‌రైజర్స్ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. లక్నో పరాజయంతో ముంబై ఇండియన్స్ జట్టు ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది.సాక్షి, హైదరాబాద్: సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ బ్యాటింగ్ పవర్‌ను మరోసారి చూపించింది. బుధవారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 10 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్‌ను చిత్తుగా ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లక్నో 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఆయుశ్ బదోని (30 బంతుల్లో 55 నాటౌట్; 9 ఫోర్లు), నికోలస్ పూరన్ (26 బంతుల్లో 48 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. అనంతరం హైదరాబాద్ కేవలం 9.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 167 పరుగులు సాధించి గెలిచింది. ఓపెనర్లు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ట్రవిస్ హెడ్ (30 బంతుల్లో 89 నాటౌట్; 8 ఫోర్లు, 8 సిక్స్‌లు), అభిషేక్ శర్మ (28 బంతుల్లో 75 నాటౌట్; 8 ఫోర్లు, 6 సిక్స్‌లు) మరో అవకాశం ఇవ్వకుండా చెలరేగి కేవలం 58 బంతుల్లోనే మ్యాచ్‌ను ముగించారు. లక్నో ఓటమితో ముంబై ఇండియన్స్ జట్టు ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. ముంబై తమ చివరి రెండు మ్యాచ్‌ల్లో నెగ్గినా 12 పాయింట్లతో టాప్–4లో స్థానాన్ని దక్కించుకునే అవకాశం లేదు. రాహుల్ విఫలం... భువనేశ్వర్ చక్కటి బౌలింగ్ వల్ల లక్నో ఇన్నింగ్స్ పేలవంగా ప్రారంభమైంది. భువీ తన వరుస ఓవర్లలో డికాక్ (2), స్టొయినిస్ (3)లను పెవిలియన్ పంపించాడు. ఈ రెండు సందర్భాల్లో ఆంధ్ర క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి, సన్వీర్ సింగ్ అద్భుత క్యాచ్‌లు కారణంగా నిలిచాయి. పవర్‌ప్లే ముగిసేసరికి లక్నో 27 పరుగులకే పరిమితమైంది. ఈ దశలో రాహుల్, కృనాల్ ఆదుకునే ప్రయత్నం చేసినా వీరిద్దరూ నెమ్మదిగా ఆడటంతో పరుగులు రావడం మందగించింది. పదో ఓవర్ చివరి బంతికి రాహుల్ అవుట్ కాగా... లక్నో స్కోరు 57 పరుగులకు చేరింది. అవుటయ్యే వరకు కూడా ఏ దశలోనూ రాహుల్ స్ట్రయిక్‌రేట్ కనీసం 100 కూడా లేకపోవడం జట్టు అవకాశాలను దెబ్బ తీసింది. ఆ తర్వాత కొద్ది సేపటికే కృనాల్ రనౌట్ కావడంతో స్కోరు 66/4గా మారింది. ఇలాంటి స్థితిలో పూరన్, బదోని బ్యాటింగ్ లక్నో కాస్త గౌరవప్రదమైన స్కోరును అందించింది. చివరి 5 ఓవర్లలో 63 పరుగులు రాగా... వీరిద్దరు 52 బంతుల్లోనే అభేద్యంగా 99 పరుగులు జోడించారు. మెరుపు వేగంతో... 8, 17, 22, 17, 23, 20, 19, 17, 14, 10... ఛేదనలో సన్‌రైజర్స్ ఒక్కో ఓవర్లో చేసిన పరుగులు ఇవి. తొలి ఓవర్ మినహాయిస్తే ఎక్కడా తగ్గకుండా హెడ్, అభిషేక్ చెలరేగిపోయారు. యశ్ ఓవర్లో అభిషేక్ 4 ఫోర్లు కొట్టగా, గౌతమ్ ఓవర్లో హెడ్ 3 సిక్స్‌లు, ఫోర్ బాదాడు. నవీనుల్ ఓవర్లో వరుసగా 4, 4, 6, 4, 4 బాదిన హెడ్... ఈ క్రమంలో 16 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. యశ్ ఓవర్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు కొట్టిన అభిషేక్ హాఫ్ సెంచరీ 19 బంతులకు పూర్తయింది. పవర్‌ప్లేలో 107 పరుగులు చేసిన రైజర్స్ ఆట ముగించేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. యశ్ వేసిన పదో ఓవర్ నాలుగో బంతిని అభిõÙక్ సిక్స్‌గా మలచడంతో ఉప్పల్ స్టేడియంలో సంబరాలు మొదలయ్యాయి. స్కోరు వివరాలు లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: కేఎల్ రాహుల్ (సి) నటరాజన్ (బి) కమిన్స్ 29; డికాక్ (సి) నితీశ్ (బి) భువనేశ్వర్ 2; స్టొయినిస్ (సి) సన్వీర్ (బి) భువనేశ్వర్ 3; కృనాల్ పాండ్యా (రనౌట్) 24; పూరన్ (నాటౌట్) 48; బదోని (నాటౌట్) 55; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 165. వికెట్ల పతనం: 1–13, 2–21, 3–57, 4–66. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–12–2, కమిన్స్ 4–0–47–1, షహబాజ్ 2–0–9–0, విజయకాంత్ 4–0–27–0, ఉనాద్కట్ 2–0–19–0, నటరాజన్ 4–0–50–0. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ శర్మ (నాటౌట్) 75; హెడ్ (నాటౌట్) 89; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (9.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 167. బౌలింగ్: గౌతమ్ 2–0–29–0, యశ్ ఠాకూర్ 2.4–0–47–0, బిష్ణోయ్ 2–0–34–0, నవీనుల్ హక్ 2–0–37–0, బదోని 1–0–19–0. ఐపీఎల్లో నేడుపంజాబ్ X బెంగళూరు వేదిక: ధర్మశాలరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
SRH Vs LSG: లక్నోపై 10 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 17వ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ నేడు(బుధవారం) లక్నో సూపర్‌జెయింట్‌తో తలపడింది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో లక్నో టాస్ గెలిచింది. దీంతో హైదరాబాద్ ముందుగా బౌలింగ్‌ను ఎంచుకుంది. హైదరాబాద్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో లక్నో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేయగా 4 నాలుగు వికెట్ల నష్టానికి మొత్తం 165 పరుగులు చేసింది. అనంతరం రంగంలోకి దిగిన సన్‌రైజర్స్ జట్టు లక్ష్యాన్నిఅలవోకగా ఛేదించింది. కనీసం ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 167 పరుగులు చేసి విజేతగా నిలిచింది.స్కోర్లు: లక్నో 165/4, హైదరాబాద్ 167/0 -
IPL 2024: భువీ విజృంభణ.. నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైన లక్నో
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఇవాళ (మే 8) జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న లక్నోను భువనేశ్వర్ కుమార్ (4-0-12-2) కట్టడి చేయడంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 165 పరుగులు మాత్రమే చేసింది. ఆఖర్లో ఆయుశ్ బదోని (55 నాటౌట్), పూరన్ (48 నాటౌట్) చెలరేగి ఆడటంతో లక్నో ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. లక్నో ఇన్నింగ్స్‌లో డికాక్ (2), స్టోయినిస్ (3), కృనాల్ పాండ్యా (24), రాహుల్ (29) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. బదోని, పూరన్ ఆఖరి రెండు ఓవర్లలో ఆకాశమే హద్దుగా చెలరేగడంతో ఏకంగా 34 పరుగులు వచ్చాయి. కమిన్స్ వేసిన ఆఖరి ఓవర్లో 19, నటరాజన్ వేసిన 19 ఓవర్లో 15 పరుగులు వచ్చాయి.ఈ మ్యాచ్‌లో బర్త్ డే బాయ్ కమిన్స్‌ను బదోని, పూరన్ ఆడుకున్నారు. కమిన్స్ 4 ఓవర్లలో వికెట్ తీసి ఏకంగా 47 పరుగులు సమర్పించుకున్నాడు. నటరాజన్ సైతం ధారాళంగా పరుగులిచ్చాడు. నటరాజన్ 4 ఓవర్లలో ఏకంగా 50 పరుగులిచ్చాడు. అరంగేట్రం బౌలర్ (శ్రీలంక) విజయ్‌కాంత్ వియాస్కాంత్ (4-0-27-0) అకట్టుకున్నాడు. -
SRH VS LSG: సిక్సర్ల సునామీ.. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా..!
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో గతంలో ఎన్నడూ లేని విధంగా సిక్సర్ల మోత మోగుతుంది. ఈ సీజన్ మరో 18 మ్యాచ్‌లు మిగిలుండగానే 1000 సిక్సర్ల అత్యంత అరుదైన మైలురాయిని తాకింది. సన్‌రైజర్స్‌తో ఇవాళ (మే 8) జరుగుతున్న మ్యాచ్‌లో కృనాల్ పాండ్యా కొట్టిన సిక్సర్‌తో ఈ సీజన్లో 1000 సిక్సర్లు పూర్తయ్యాయి. ఈ మైలురాయిని చేరుకునే క్రమంలో ప్రస్తుత ఐపీఎల్ సీజన్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టింది. వెయ్యి సిక్సర్ల మార్కును అత్యంత వేగంగా చేరుకున్న సీజన్‌గా ఐపీఎల్ 2024 సరికొత్త చరిత్ర సృష్టించింది.1000TH SIXES IN IPL 2024...!!!! 🤯- THE MOST CRAZIEST IPL SEASON EVER. 🔥 pic.twitter.com/mfYwS6fbUY— Tanuj Singh (@ImTanujSingh) May 8, 2024ఐపీఎల్ చరిత్రలో 2022 (1062 సిక్సర్లు), 2023 (1124 సిక్సర్లు), 2024 సీజన్లలో మాత్రమే 1000కి పైగా సిక్సర్లు నమోదు కాగా.. ఈ సీజన్లోనే అత్యంత వేగంగా ఆ మార్కు తాకింది. 2022 సీజన్లో ఈ మార్కును తాకేందుకు 16269 బంతులు అవసరమైతే.. గత సీజన్లో 15390 బంతులు.. ఈ సీజన్లో అన్నిటికంటే తక్కువగా 13079 బంతుల్లోనే వెయ్యి సిక్సర్లు పూర్తయ్యాయి.సన్‌రైజర్స్-లక్నో మ్యాచ్ విషయానికొస్తే.. హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో లక్నో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తుంది. 18 ఓవర్లు పూర్తయ్యాక లక్నో స్కోర్ 4 వికెట్ల నష్టానికి 131 పరుగులుగా ఉంది. డికాక్ (2), స్టోయినిస్ (3), కృనాల్ పాండ్యా (24), రాహుల్ (29) ఔట్ కాగా.. పూరన్ (30), బదోని (39) క్రీజ్‌లో ఉన్నారు. భువనేశ్వర్ కుమార్ అద్భుతమైన స్పెల్‌తో (4-0-12-3) లక్నోను దారుణంగా దెబ్బ కొట్టగా.. కమిన్స్ ఓ వికెట్ పడగొట్టాడు. కృనాల్‌ను కమిన్స్ అద్భుతమైన త్రోతో రనౌట్ చేశాడు. -
IPL 2024: ఇవెక్కడి క్యాచ్‌లు రా బాబు.. చూస్తే ఫ్యూజ్‌లు ఎగిరిపోవాల్సిందే..!
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో ఇవాళ (మే 8) జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు కళ్లు చెదిరే క్యాచ్‌లు పట్టారు. తొలుత నితీశ్ కుమార్ రెడ్డి, ఆ తర్వాత సన్వీర్ సింగ్ నమ్మశక్యంకాని రీతిలో క్యాచ్‌లు పట్టి హైలైటయ్యారు.సన్వీర్ సూపర్ క్యాచ్భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో సన్వీర్ మిడ్ ఆన్ దిశగా ముందుకు పరిగెడుతూ అద్భుతమన డైవింగ్ క్యాచ్ అందుకున్నాడు. సన్వీర్ క్యాచ్ పట్టిన విధానం క్లారిటీగా లేకపోవడంతో ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేయగా రీ ప్లేలో స్పష్టమైన క్యాచ్‌గా తేలింది. దీంతో బ్యాటర్ స్టోయినిస్ నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు. ఈ క్యాచ్ చూసిన జనాలకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. - First Nitish Reddy.- Then Sanvir Singh.- Two Incredible Catches by these SRH's youngsters. 🤯🙌 pic.twitter.com/DHtMenorn5— Tanuj Singh (@ImTanujSingh) May 8, 2024నితీశ్ అద్భుత విన్యాసంసన్వీర్ పట్టిన అద్భుతమైన క్యాచ్‌కు ముందు నితీశ్ కుమార్ రెడ్డి కూడా సూపర్ క్యాచ్ పట్టాడు. భువీ బౌలింగ్‌లోనే నితీశ్ బౌండరీ లైన్ వద్ద చూడచక్కని క్యాచ్ అందుకున్నాడు. సిక్సర్‌కు వెళ్లాల్సిన బంతిని నితీశ్ అద్భుతంగా బ్యాలెన్స్ చేసి తన జట్టుకు 6 పరుగులు ఆదా చేయడంతో పాటు కీలకమైన డికాక్‌ను పెవిలియన్‌కు సాగనంపాడు. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఆటగాళ్లు మైదానంలో చాలా చురుగ్గా కదులుతున్నారు. బౌలింగ్‌లోనూ సత్తా చాటుతున్నారు.టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న లక్నో.. భువీ దెబ్బకు (3-0-7-2) 9 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి కేవలం 49 పరుగులు మాత్రమే చేయగలిగింది. డికాక్ (2), స్టోయినిస్ (3) పెవిలియన్‌కు చేరగా.. రాహుల్ (22), కృనాల్ (21) క్రీజ్‌లో ఉన్నారు. -
IPL 2024: సన్‌రైజర్స్, లక్నో మ్యాచ్.. లంక యువ స్పిన్నర్ అరంగేట్రం
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఇవాళ (మే 8) జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న ఇరు జట్లకు అత్యంత కీలకంగా మారింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో సన్‌రైజర్స్ నాలుగులో.. లక్నో ఆరో స్థానంలో ఉన్నాయి. నగరంలో నిన్న రాత్రి అతి భారీ వర్షం కురిసిన నేపథ్యంలో నేటి మ్యాచ్ సాధ్యాసాధ్యాలపై అనుమానాలు ఉండేవి. అయితే ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే వరుణుడి నుంచి మ్యాచ్‌కు ఎలాంటి ముప్పు లేదని తెలుస్తుంది. తుది జట్ల విషయానికొస్తే.. ఇరు జట్లు పలు మార్పులతో బరిలోకి దిగుతున్నాయి. లక్నో జట్టుకు సంబంధించి డికాక్ తిరిగి జట్టులోకి రాగా.. మొహిసిన్ ఖాన్ ఔటయ్యాడు. సన్‌రైజర్స్ తరఫున లంక యువ స్పిన్నర్ విజయ్‌కాంత్ వియాస్కాంత్ అరంగేట్రం చేయనుండగా.. మయాంక్ అగర్వాల్ స్థానంలో సన్వీర్ సింగ్ జట్టులోకి వచ్చాడు.హెడ్ టు హెడ్ రికార్డ్స్ విషయానికొస్తే.. ఐపీఎల్లో ఇరు జట్లు ఇప్పటివరకు మూడు సార్లు తలపడగా.. అన్ని సందర్భాల్లో లక్నోనే విజయం సాధించింది.తుది జట్లు..లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్ (కెప్టెన్/వికెట్‌కీపర్), మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, కృష్ణప్ప గౌతమ్, యశ్ ఠాకూర్, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్సన్రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): ట్రవిస్ హెడ్, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్‌కీపర్), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, సన్వీర్ సింగ్, పాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, విజయకాంత్ వియాస్కాంత్, టి నటరాజన్ -
IPL 2024 SRH VS LSG: మరో మూడేస్తే..!
ఐపీఎల్ 2024 సీజన్లో ఇవాళ (మే 8) మరో బిగ్ ఫైట్ జరుగనుంది. విధ్వంసకర ఆటగాళ్లతో నిండిన సన్‌రైజర్స్, లక్నో సూపర్ జెయింట్స్ అమీతుమీకి సిద్దమయ్యాయి. సన్‌రైజర్స్ హోం గ్రౌండ్ అయిన ఉప్పల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగునుంది. హైదరాబాద్‌లో నగరంలో నిన్న రాత్రి అతి భారీ వర్షం కురిసింది. ఇవాళ కూడా వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే నగరంలో ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే వరుణుడి నుంచి మ్యాచ్‌కు ఎలాంటి ముప్పు లేదని తెలుస్తుంది. ప్రస్తుతం సన్‌రైజర్స్, ఎల్ఎస్జీ పాయింట్ల పట్టికలో సమవుజ్జీలుగా ఉన్నాయి. రెండు జట్లు చెరి 11 మ్యాచ్‌లు ఆడి ఆరింట గెలుపొందాయి. అయితే లక్నోతో పోలిస్తే సన్‌రైజర్స్ రన్‌రేట్ కాస్త మెరుగ్గా ఉండటంతో ఆ జట్టు మెరుగైన స్థానంలో ఉంది. సన్‌రైజర్స్ నాలుగులో.. లక్నో ఆరో స్థానంలో కొనసాగుతున్నాయి. ఇరు జట్లకు ప్లే ఆఫ్స్ అవకాశాలు సమానంగా ఉండటంతో ఈ మ్యాచ్ ఫలితం అత్యంత కీలకం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచే జట్టు టెన్షన్ లేకుండా తదుపరి మ్యాచ్‌కు వెళ్లవచ్చు. ఇరు జట్ల ఈ సీజన్లో ఇదే తొలి మ్యాచ్. ఐపీఎల్లో ఇరు జట్లు ఇప్పటివరకు మూడు సార్లు తలపడగా.. అన్ని సందర్భాల్లో లక్నోనే విజయం సాధించింది.మరో మూడేస్తే..ఇక ఈ మ్యాచ్ ఓ భారీ మైలురాయికి వేదిక కానుంది. ఈ మ్యాచ్‌లో మరో మూడు సిక్సర్లు నమోదైతే ఈ సీజన్లో 1000 సిక్సర్లు (అన్ని జట్లు కలిపి) పూర్తవుతాయి. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు నమోదైన సీజన్‌గా ఐపీఎల్ 2023 ఉంది. గత సీజన్లో రికార్డు స్థాయిలో 1124 సిక్సర్లు నమోదయ్యాయి. ఈ సీజన్లో ఇంకా 18 మ్యాచ్‌లు మిగిలుండగానే 1000 సిక్సర్లు మార్కు తాకితే ఆల్‌టైమ్ హైయెస్ట్ సిక్సర్ల రికార్డు బద్దలవడం ఖాయం. నేటి మ్యాచ్‌లో తలపడబోయే సన్‌రైజర్స్, లక్నో జట్లలో భారీ హిట్టర్లు ఉండటంతో ఈ మ్యాచ్‌లో కనీసం 20 సిక్సర్లు నమోదయ్యే అవకాశం ఉంది. సీజన్ల వారీగా సిక్సర్లు..2008- 6222009- 5062010- 5852011- 6392012- 7312013- 6722014- 7142015- 6922016- 6382017- 7052018- 8722019- 7842020- 7342021- 6872022- 10622023- 11242024- 997* -
SRH vs LSG: ఉప్పల్ మ్యాచ్‌కు వెళ్తున్న వారికి అలర్ట్! ఇలా అయితే..
సాక్షి, హైదరాబాద్: సన్‌రైజర్స్ హైదరాబాద్ సొంత మైదానంలో మరో మ్యాచ్‌కు సిద్ధమైంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో ఉప్పల్ వేదికగా బుధవారం తలపడనుంది. ప్లే ఆఫ్స్ రేసులో సాఫీగా ముందుకు వెళ్లాలంటే లక్నోతో మ్యాచ్‌లో కమిన్స్ బృందం తప్పక గెలవాలి.అయితే, వర్షం రూపంలో సన్‌రైజర్స్- లక్నో పోరుకు ఆటంకం కలిగే అవకాశం ఉంది. నగరంలో కురుస్తున్న అకాల వర్షాల కారణంగా మ్యాచ్ గనుక రద్దైతే ఇరు జట్లకు చెరో పాయింట్ వస్తుంది.ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లుఇదిలా ఉంటే.. హోంగ్రౌండ్లో సన్‌రైజర్స్ మెరుపులను వీక్షించడానికి వచ్చే అభిమానుల కోసం ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఐపీఎల్ మ్యాచ్ కోసం నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.ఆ ప్రాంతాల నుంచి స్పెషల్ బస్సులు ఈసీఐఎల్, ఎల్బీనగర్, కొండాపూర్, జీడిమెట్ల, వనస్థలిపురం, ఇబ్రహీంపట్నం,మియాపూర్,లక్డీకాపూల్, కూకట్పల్లి హౌసింగ్‌బోర్డ్, జూబ్లీ బస్‌స్టేషన్, హకీంపేట్, మేడ్చల్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, మెహిదీపట్నం, బీహెచ్ఈఎల్ తదితర ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియంకు ప్రత్యేక బస్సులను నడుపనున్నారు.మెట్రోలో సైతంఅలాగే ప్రయాణికుల రద్దీ మేరకు వివిధ మార్గాల్లో అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లను నడిపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. రాయదుర్గం నుంచి నాగోల్ వరకు మియాపూర్ నుంచి ఎల్బీనగర్, జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ మధ్య ప్రయాణికుల డిమాండ్ మేరకు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయి.చదవండి: సంజూ శాంసన్‌కు ఊహించని షాకిచ్చిన బీసీసీఐThe Risers are back to Hyderabad 🧡💪 pic.twitter.com/uecAotesSz— SunRisers Hyderabad (@SunRisers) May 7, 2024 -
SRH: సన్‌రైజర్స్ గుండెల్లో గుబులు.. మ్యాచ్ గనుక రద్దైతే!
ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్ రేసు రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే పదకొండేసి మ్యాచ్‌లు ఆడిన కోల్‌కతా నైట్ రైడర్స్(నెట్ రన్‌రేటు 1.453), రాజస్తాన్ రాయల్స్ రాయల్స్(నెట్ రన్‌రేటు 0.476) ఎనిమిది గెలిచి టాప్-2లో తిష్ట వేశాయి.చెరో పదహారు పాయింట్లతో ప్లే ఆఫ్స్ బెర్తును దాదాపుగా ఖరారు చేసుకున్నాయి. ఇక ప్రస్తుతం మూడో స్థానం కోసం 12 పాయింట్లతో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ (-0.065)మధ్య జరుగుతున్న పోటీలో ఇప్పటి వరకు రన్‌రేటు పరంగా మెరుగ్గా ఉన్న సీఎస్కే(0.700)నే పైచేయి సాధించింది.ప్లే ఆఫ్స్ పోటీలో కీలక మ్యాచ్దీంతో రైజర్స్ నాలుగో స్థానంలో కొనసాగుతుండగా.. రాజస్తాన్ రాయల్స్‌పై మంగళవారం నాటి విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ సైతం ముందుకు దూసుకువచ్చింది. ఇక లక్నో సూపర్ జెయింట్స్ సైతం 12 పాయింట్లతో ఆరో స్థానంలో కొనసాగుతూ టాప్-4పై కన్నేసింది.ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్- లక్నో సూపర్ జెయింట్స్ మధ్య బుధవారం నాటి మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ప్లే ఆఫ్స్ రేసులో ముందుకు దూసుకువెళ్తుంది. అదే సమయంలో ఓడిన జట్టు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.పొంచి ఉన్న వాన గండంఅయితే, సొంతగడ్డపై మ్యాచ్ జరుగనుండటం సన్‌రైజర్స్‌కు సానుకూల అంశమే అయినా.. వర్షం రూపంలో ప్రమాదం పొంచి ఉంది. ఐపీఎల్ తాజా ఎడిషన్‌లో ఇప్పటి వరకు 56 మ్యాచ్‌లు జరిగాయి.కానీ ఒక్క మ్యాచ్ కూడా వరణుడి కారణంగా రద్దు కాలేదు. అయితే, ఉప్పల్ స్టేడియంలో జరగాల్సిన సన్‌రైజర్స్- లక్నో మ్యాచ్‌కు మాత్రం వాన గండం పొంచి ఉంది. హైదరాబాద్‌లో మంగళవారం కుండపోతగా వర్షం కురిసింది.ఈ నేపథ్యంలో స్టేడియం సిబ్బంది మైదానంలోని మధ్య భాగాన్ని కవర్లతో కప్పి ఉంచారు. అయితే, వాతావరణ శాఖ రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని మంగళవారం హెచ్చరించడం ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో గుబులు రేపుతోంది.మ్యాచ్ గనుక రద్దు అయితేకాగా తాజా సీజన్లో ఆరంభ మ్యాచ్‌లో తడబడ్డా ప్యాట్ కమిన్స్ బృందం తర్వాత అనూహ్య రీతిలో పుంజుకుంది. 266.. 277.. 287 స్కోర్లు నమోదు చేసి పరుగుల విధ్వంసానికి మారుపేరుగా నిలిచింది.అయితే, గత కొన్ని మ్యాచ్‌ల నుంచి సన్‌రైజర్స్ పేలవ బ్యాటింగ్‌తో తేలిపోతోంది. ఆఖరిగా సోమవారం ముంబై ఇండియన్స్‌తో ఆడిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఏడు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఇక బుధవారం నాటి మ్యాచ్ గనుక రద్దైతే సన్‌రైజర్స్, లక్నోల ఖాతాలో చెరో పాయింట్ చేరుతుంది. అలా కాక మ్యాచ్ సాఫీగా సాగితే గెలిచిన జట్టుకు రెండు పాయింట్లు వస్తాయి.వాతావరణ శాఖ హెచ్చరికనగరంలో వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్‌లో బుధవారం సాయంత్రం లేదా రాత్రి సమయంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది.చదవండి: సంజూ శాంసన్‌కు ఊహించని షాకిచ్చిన బీసీసీఐ 𝙇𝙤𝙘𝙠𝙚𝙙 𝙖𝙣𝙙 𝙡𝙤𝙖𝙙𝙚𝙙 👊🔥#PlayWithFire #SRHvLSG pic.twitter.com/En1XXReksW— SunRisers Hyderabad (@SunRisers) May 8, 2024 -
‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
లక్నో సూపర్ జెయింట్స్‌ను చిత్తుగా ఓడించిన కోల్‌కతా నైట్ రైడర్స్‌పై టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ప్రశంసలు కురిపించాడు. ఏకపక్ష విజయం అన్న మాటలకు కేకేఆర్ సరైన నిర్వచనం ఇచ్చిందని.. విధ్వంసకర ఆట తీరును కళ్లకు కట్టిందని ఆకాశానికెత్తాడు.లక్నో గల్లీకి వెళ్లి గల్లీ క్రికెట్లో మాదిరి వారిని మట్టికరిపించిన తీరు అద్భుతమంటూ కేకేఆర్‌ను కొనియాడాడు. కాగా సొంత మైదానంలో ఆదివారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో తొలుత బౌలింగ్ ఎంచుకుంది.సంచలన ఇన్నింగ్స్ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్(14 బంతుల్లో 32), సునిల్ నరైన్(39 బంతుల్లో 81) మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోగా.. ఏడో నంబర్ బ్యాటర్ రమణ్ దీప్ సింగ్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు.కేవలం ఆరు బంతుల్లోనే 25 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన లక్నోను కేకేఆర్ 137 పరుగులకే కుప్పకూల్చింది. పేసర్లు హర్షిత్ రాణా(3/24, రసెల్(2/17), మిచెల్ స్టార్క్(1/22).. స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి(3/30), సునిల్ నరైన్(1/22) లక్నో బ్యాటింగ్ ఆర్డర్‌ను కుదేలు చేశారు.ఏకపక్ష విజయం ఫలితంగా కేకేఆర్ లక్నోపై ఏకంగా 98 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక ఐపీఎల్లో లక్నోకు ఇదే అతిపెద్ద పరాజయం కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.‘‘లక్నో గల్లీకి వెళ్లి గల్లీ క్రికెట్ మాదిరే వారిని చిత్తు చేసింది కేకేఆర్. ఏకపక్ష విజయం ఎలా ఉంటుందన్న దానికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది.SRH అని ఎవరన్నారు?లక్నోకు తమ రెండున్నరేళ్ల ప్రయాణంలో అతిపెద్ద ఓటమిని రుచి చూపించింది. ఈ ఏడాది ఐపీఎల్ టోర్నీలో సన్‌రైజర్స్ హైదరాబాద్ అత్యంత విధ్వంసకర జట్టు అని ఎవరు చెప్పారు?ఎస్ఆర్హెచ్ కాదు! అది కేకేఆర్ మాత్రమే’’ అని ఆకాశ్ చోప్రా శ్రేయస్ అయ్యర్ సేనకు కితాబులిచ్చాడు. ఇప్పటికే కేకేఆర్ ఆరుసార్లు 200 పరుగుల స్కోరు దాటిందని.. కోల్‌కతా కంటే ప్రమాదకర జట్టు ఇంకేది ఉందని టేబుల్ టాపర్‌ను ప్రశంసించాడు. కాగా ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు(287) సాధించిన జట్టుగా సన్‌రైజర్స్ ఈ ఎడిషన్ సందర్బంగా అరుదైన రికార్డు సాధించిన విషయం తెలిసిందే.చదవండి: అచ్చా.. అలాగా?: కోహ్లిపై గావస్కర్ కామెంట్స్.. వసీం అక్రం కౌంటర్High-Fives in the @KKRiders camp 🙌With that they move to the 🔝 of the Points Table with 16 points 💜Scorecard ▶️ https://t.co/CgxfC5H2pD#TATAIPL | #LSGvKKR pic.twitter.com/0dUMJLasNQ— IndianPremierLeague (@IPL) May 5, 2024 -
KKR Vs LSG: నరైన్ మెరుపులు
లక్నో: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) ఐపీఎల్ టోరీ్నలో ఎనిమిదో విజయం నమోదు చేసింది. లక్నో సూపర్ జెయింట్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా జట్టు 98 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. గతంలో రెండుసార్లు ఐపీఎల్ చాంపియన్‌గా నిలిచిన కోల్‌కతా తాజా విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకొచి్చంది. రాజస్తాన్, కోల్‌కతా జట్లు 16 పాయింట్లతో సమంగా ఉన్నప్పటికీ... మెరుగైన రన్‌రేట్‌తో కోల్‌కతా టాప్ ర్యాంక్‌ను అందుకుంది. టాస్ గెలిచి లక్నో జట్టు ఫీల్డింగ్ ఎంచుకోగా... మొదట బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నిరీ్ణత 20 ఓవర్లలో 6 వికెట్లకు 235 పరుగులు సాధించింది. ఓపెనర్ సునీల్ నరైన్ (39 బంతుల్లో 81; 6 ఫోర్లు, 7 సిక్స్‌లు) మెరిపించాడు. ఫిల్ సాల్ట్ (14 బంతుల్లో 32; 5 ఫోర్లు, 1 సిక్స్), రమణ్‌దీప్ సింగ్ (6 బంతుల్లో 25 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్స్‌లు) కూడా దూకుడుగా ఆడారు. అనంతరం 236 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన లక్నో జట్టు 16.1 ఓవర్లలో 137 పరుగులకే కుప్పకూలింది. స్టొయినిస్ (21 బంతుల్లో 36; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) మినహా ఇతర బ్యాటర్లు విఫలమయ్యారు. ఈ సీజన్లో అద్భుతమైన ఫామ్‌లో ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్ మరోసారి కోల్‌కతా జట్టుకు శుభారంభాన్నిచ్చారు. తొలి బంతి నుంచే వీరిద్దరు లక్నో బౌలర్ల భరతం పట్టారు. మోసిన్ ఖాన్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో నరైన్ చెలరేగిపోయాడు. వరుసగా మూడు ఫోర్లతోపాటు ఒక సిక్స్ కూడా బాదడంతో ఈ ఓవర్లో 20 పరుగులు వచ్చాయి. ఐదో ఓవర్లో సాల్ట్ అవుట్‌కాగా, పవర్‌ప్లే ముగిసేసరికి కోల్‌కతా 70 పరుగులు సాధించింది. పవర్‌ప్లే తర్వాత కూడా నరైన్ తన జోరు కొనసాగించాడు. 27 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. స్టొయినిస్ వేసిన ఇన్నింగ్స్ 11వ ఓవర్లో నరైన్ మూడు సిక్స్‌లు కొట్టాడు. రవి బిష్ణోయ్ వేసిన 12వ ఓవర్లో ఒక సిక్స్ కొట్టిన నరైన్ ఆ తర్వాత మరో భారీ షాట్‌కు యత్నించి అవుటయ్యాడు. నరైన్ వెనుదిరిగాక... శ్రేయస్, రమణ్‌దీప్ దూకుడును కొనసాగించడంతో కోల్‌కతా స్కోరు 230 దాటింది.స్కోరు వివరాలు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: సాల్ట్ (సి) రాహుల్ (బి) నవీనుల్ 32; నరైన్ (సి) సబ్–పడిక్కల్ (బి) బిష్ణోయ్ 81; రఘువంశీ (సి) రాహుల్ (బి) యు«ద్వీర్ 32; రసెల్ (సి) సబ్–గౌతమ్ (బి) నవీనుల్ 12; రింకూ సింగ్ (సి) స్టొయినిస్ (బి) నవీనుల్ 16; శ్రేయస్ అయ్యర్ (సి) రాహుల్ (బి) యశ్ ఠాకూర్ 23; రమణ్‌దీప్ సింగ్ (నాటౌట్) 25; వెంకటేశ్ అయ్యర్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 235. వికెట్ల పతనం: 1–61, 2–140, 3–167, 4–171, 5–200, 6–224.బౌలింగ్: స్టొయినిస్ 2–0–29–0, మోసిన్ ఖాన్ 2–0–28–0, నవీనుల్ హక్ 4–0–49–3, యశ్ ఠాకూర్ 4–0–46–1, కృనాల్ పాండ్యా 2–0–26–0, రవి బిష్ణోయ్ 4–0–33–1, యు«ద్వీర్ సింగ్ 2–0–24–1. లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: కేఎల్ రాహుల్ (సి) రమణ్‌దీప్ (బి) హర్షిత్ 25; అర్షిన్ (సి) రమణ్‌దీప్ (బి) స్టార్క్ 9; స్టొయినిస్ (సి) హర్షిత్ (బి) రసెల్ 36; దీపక్ హుడా (ఎల్బీడబ్ల్యూ) (బి) వరుణ్ 5; పూరన్ (సి) సాల్ట్ (బి) రసెల్ 10; బదోని (సి) స్టార్క్ (బి) నరైన్ 15; టర్నర్ (సి అండ్ బి) వరుణ్ 16; కృనాల్ పాండ్యా (సి) సాల్ట్ (బి) హర్షిత్ 5; యు«ద్వీర్ (సి) రసెల్ (బి) వరుణ్ 7; బిష్ణోయ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) హర్షిత్ 2; నవీనుల్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (16.1 ఓవర్లలో ఆలౌట్) 137. వికెట్ల పతనం: 1–20, 2–70, 3–77, 4–85, 5–101, 6–109, 7–125, 8–129, 9–137, 10–137.బౌలింగ్: వైభవ్ 2–0–21–0, స్టార్క్ 2–0–22–1, నరైన్ 4–0–22–1, హర్షిత్ రాణా 3.1–0–24–3, వరుణ్ చక్రవర్తి 3–0–30–3, రసెల్ 2–0–17–2. -
లక్నోను చిత్తు చేసిన కేకేఆర్.. 98 పరుగుల తేడాతో ఘన విజయం
ఐపీఎల్-2024లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జైత్ర యాత్ర కొనసాగుతోంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఏక్నా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 98 పరుగుల తేడాతో కేకేఆర్ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో కేకేఆర్ తమ ప్లేఆఫ్ బెర్త్‌ను దాదాపు ఖారారు చేసుకున్నట్లే. కేకేఆర్ పాయింట్ల పట్టికలో అగ్రస్ధానానికి చేరుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో 236 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో 16.1 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌటైంది. కేకేఆర్ బౌలర్లలో హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి తలా మూడు వికెట్ల పడగొట్టగా.. రస్సెల్ రెండు, స్టార్క్, నరైన్ చెరో వికెట్ సాధించారు. లక్నో బ్యాటర్లలో మార్కస్ స్టోయినిష్(36) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగితా బ్యాటర్లు ఎవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు.ఇక తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ స్కోర్ సాధించింది. కేకేఆర్ బ్యాటర్లలో ఓపెనర్ సునీల్ నరైన్ మరోసారి ఆకాశమే హద్దుగా చెలరేగాడు. నరైన్ 39 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్స్‌లతో 81 పరుగులు చేశాడు. అతడితో పాటు ఫిల్ సాల్ట్(32), రఘువంశీ(32), రమణ్ దీప్ సింగ్(6 బంతుల్లో 25) రాణించారు. లక్నో బౌలర్లలో నవీన్ ఉల్- హాక్ మూడు వికెట్లు పడగొట్టగా.. బిష్ణోయ్, యుద్దవీర్, యష్ ఠాకూర్ తలా వికెట్ సాధించారు. -
KKR Vs LSG: నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
ఐపీఎల్-2024లో భాగంగా ఏక్నా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ స్కోర్ సాధించింది. కేకేఆర్ బ్యాటర్లలో ఓపెనర్ సునీల్ నరైన్ మరోసారి ఆకాశమే హద్దుగా చెలరేగాడు.నరైన్ 39 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్స్‌లతో 81 పరుగులు చేశాడు. అతడితో పాటు ఫిల్ సాల్ట్(32), రఘువంశీ(32), రమణ్ దీప్ సింగ్(6 బంతుల్లో 25) రాణించారు. లక్నో బౌలర్లలో నవీన్ ఉల్- హాక్ మూడు వికెట్లు పడగొట్టగా.. బిష్ణోయ్, యుద్దవీర్, యష్ ఠాకూర్ తలా వికెట్ సాధించారు. -
కేకేఆర్‌తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
ఐపీఎల్-2024లో మరో కీలక సమరానికి రంగం సిద్దమైంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఏక్నా స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు లక్నో యువ పేసర్ మయాంక్ యాదవ్ దూరమయ్యాడు. అతడి స్ధానంలో యష్ ఠాకూర్ వచ్చాడు. మరోవైపు కేకేఆర్ మాత్రం ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగింది .తుది జట్లుకోల్‌కతా నైట్ రైడర్స్: ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, అంగ్క్రిష్ రఘువంశీ, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణాలక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, అష్టన్ టర్నర్, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, మొహ్సిన్ ఖాన్, యశ్ ఠాకూర్ -
వరుస ఓటములు ఎదుర్కొంటున్న హార్దిక్ సేనకు మరో బిగ్ షాక్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో వరుస ఓటములు ఎదుర్కొంటున్న ముంబై ఇండియన్స్‌కు మరో భారీ షాక్ తగిలింది. నిన్న (ఏప్రిల్ 30) లక్నోతో మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ మెయింటైన్ చేసినందుకు గాను కెప్టెన్ హార్దిక్ పాండ్యా మ్యాచ్ ఫీజ్‌లో 24 లక్షల కోత పడింది. ఇంపాక్ట్ ప్లేయర్ సహా జట్టు సభ్యులందరికి 6 లక్షల జరిమానా విధించారు. హార్దిక్ ఈ సీజన్లో రెండో సారి స్లో ఓవర్ రేట్‌కు కారుకుడు కావడంతో అతనికి భారీ జరిమానా పడింది.కాగా, లక్నో సూపర్ జెయింట్స్‌తో నిన్న జరిగిన లో స్కోరింగ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 4 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. లక్నో బౌలర్లు రెచ్చిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 144 పరుగులు మాత్రమే చేసింది.ఇషాన్ కిషన్ (32), నేహల్ వధేరా (46), టిమ్ డేవిడ్ (35 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. రోహిత్ శర్మ (4), సూర్యకుమార్ (10), తిలక్ వర్మ (7), హార్దిక్ పాండ్యా (0), మొహమ్మద్ నబీ (1) విఫలమయ్యారు. లక్నో బౌలర్లలో మొహిసిన్ ఖాన్ 2 వికెట్లు పడగొట్టగా.. స్టోయినిస్, నవీన్ ఉల్ హక్, మయాంక్ యాదవ్, రవి బిష్ణోయ్ తలో వికెట్ పడగొట్టారు.145 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన లక్నో.. ఆపసోపాలు పడి 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. స్టోయినిస్ (62) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడి లక్నోను గెలిపించాడు. రాహుల్ (28), దీపక్ హూడా (18), పూరన్ (14 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. ముంబై బౌలర్లలో హార్దిక్ పాండ్యా 2 వికెట్లు పడగొట్టగా.. నువాన్ తుషార, గెరాల్డ్ కొయెట్జీ, నబీ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో ఓటమితో ముంబై ప్లే ఆఫ్స్ అవకాశాలు గల్లంతు కాగా.. లక్నో ఈ సీజన్ ఆరో విజయం సాధించి, పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. -
MI Vs LSG: సూపర్ స్టొయినిస్...
లక్నో: బౌలర్లు శాసించిన ఐపీఎల్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ పైచేయి సాధించింది. 4 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. తొలుత ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. నేహల్ వధెరా (41 బంతుల్లో 46; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), టిమ్ డేవిడ్ (18 బంతుల్లో 35 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. మోసిన్ ఖాన్ 2 వికెట్లు తీశాడు. తర్వాత లక్నో 19.2 ఓవర్లలో 6 వికెట్లకు 145 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ స్టొయినిస్ (45 బంతుల్లో 62; 7 ఫోర్లు, 2 సిక్స్) నెమ్మదించిన పిచ్‌పై కీలకపాత్ర పోషించాడు. హార్దిక్ పాండ్యా 2 వికెట్లు తీశాడు. ముంబై 28/4 మెరుపులు మెరిపించాల్సిన పవర్ ప్లేలో ముంబై కష్టాలపాలైంది. రోహిత్ (4), సూర్యకుమార్ (10), తిలక్ వర్మ (7), హార్దిక్ పాండ్యా (0) ఇలా హిట్టర్లంతా వరుస కట్టడంతో 6 ఓవర్లలో ముంబై 28/4 స్కోరు చేసింది. 9వ ఓవర్లో 8 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఇషాన్ కిషన్‌కు లైఫ్ వచ్చింది... లేదంటే పరిస్థితి ఇంకాస్త క్లిష్టంగా ఉండేది.పదో ఓవర్లో ముంబై కష్టంగా 50 పరుగులు దాటింది. కిషన్ (36 బంతుల్లో 32; 3 ఫోర్లు), నేహల్ వధెరా ఐదో వికెట్‌కు 53 పరుగులు జోడించారు. వీళ్లిద్దరు అవుటయ్యాక ఆఖర్లో టిమ్ డేవిడ్ ధాటిగా ఆడటంతో ముంబై ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. మొదటి ఓవర్లోనే అర్శిన్ కులకర్ణి (0) డకౌటైనా... కెప్టెన్ రాహుల్ (22 బంతుల్లో 28; 3 ఫోర్లు, 1 సిక్స్), స్టొయినిస్ క్రీజులో పాతుకుపోవడంతో పవర్ ప్లేలో లక్నో 52/1 స్కోరు చేసింది. కాసేపటికే రాహుల్ నిష్క్రమించినప్పటికీ స్టొయినిస్ తర్వాత వచ్చిన బ్యాటర్స్‌తో జట్టును లక్ష్యం వైపు నడిపించాడు. 39 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. స్వల్ప వ్యవధిలో స్టొయినిస్, టర్నర్ (5) అవుటైనప్పటికీ పూరన్ (14 బంతుల్లో 14 నాటౌట్; 1 సిక్స్) బాధ్యతగా ఆడి మిగతా లక్ష్యాన్ని పూర్తి చేశాడు. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: ఇషాన్ (సి) మయాంక్ (బి) బిష్ణోయ్ 32; రోహిత్ (సి) స్టొయినిస్ (బి) మోసిన్ 4; సూర్యకుమార్ (సి) రాహుల్ (బి) స్టొయినిస్ 10; తిలక్ వర్మ (రనౌట్) 7; హార్దిక్ (సి) రాహుల్ (బి) నవీనుల్ 0; నేహల్ (బి) మోసిన్ 46; టిమ్ డేవిడ్ (నాటౌట్) 35; నబీ (బి) మయాంక్ 1; కొయెట్జీ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 144. వికెట్ల పతనం: 1–7, 2–18, 3–27, 4–27, 5–80, 6–112, 7–123. బౌలింగ్: స్టొయినిస్ 3–0–19–1, మోసిన్ 4–0–36–2, నవీనుల్ 3.5–0–15–1, మయాంక్ 3.1–0–31–1, రవి బిష్ణోయ్ 4–0–28–1, దీపక్ హుడా 2–0–13–0. లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: రాహుల్ (సి) నబీ (బి) హార్దిక్ 28; అర్శిన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) తుషార 0; స్టొయినిస్ (సి) తిలక్ (బి) నబీ 62; హుడా (సి) బుమ్రా (బి) హార్దిక్ 18; పూరన్ (నాటౌట్) 14; టర్నర్ (బి) కొయెట్జీ 5; బదోని (రనౌట్) 6; కృనాల్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (19.2 ఓవర్లలో 6 వికెట్లకు) 145. వికెట్ల పతనం: 1–1, 2–59, 3–99, 4–115, 5–123, 6–133. బౌలింగ్: తుషార 4–0–30–1, బుమ్రా 4–0–17–0, కొయెట్జీ 3–0–29–1, పియూశ్ చావ్లా 3–0–23–0, హార్దిక్ పాండ్యా 4–0–26–2, నబీ 1.2–0–16–1. ఐపీఎల్లో నేడుచెన్నై X పంజాబ్ వేదిక: చెన్నైరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో మంగళవారం (ఏప్రిల్ 30) జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లు అదరగొట్టారు.డూ ఆర్ డై లా జరిగిన మ్యాచ్‌లో ముంబై కేవలం నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లు ముంబైకి చుక్కలు చూపించారు. వరుసగా వికెట్లు పడగొట్టడంతో పాటు పరుగులు కూడా రాకుండా కట్టడి చేశారు. ఫలితంగా ముంబై జట్టుపై నాలుగు వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది. దాంతో పాయింట్ల జాబితాలో లక్నో మూడో స్ధానానికి చేరింది. ఇక ప్లే ఆఫ్ అవకాశాలు ముంబై జట్టు దాదాపు కోల్పోయింది.స్కోర్లు: ముంబై 144/7, 145/6(19.2 ఓవర్లు)ముంబై ఇండియన్స్: ఇషాన్ కిషన్(వికెట్‌కీపర్), రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), నేహాల్ వధేరా, టిమ్ డేవిడ్, మహ్మద్ నబీ, గెరాల్డ్ కోయెట్జీ, పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రాఇంపాక్ట్ ప్లేయర్స్: నువాన్ తుషార, కుమార్ కార్తికేయ, డెవాల్డ్ బ్రెవిస్, నమన్ ధీర్, షమ్స్ ములానీలక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్/వికెట్‌కీపర్), మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, అష్టన్ టర్నర్, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, మొహ్సిన్ ఖాన్, మయాంక్ యాదవ్ఇంపాక్ట్ ప్లేయర్స్: అర్షిన్ కులకర్ణి, మణిమారన్ సిద్ధార్థ్, కృష్ణప్ప గౌతం, యుధ్వీర్ సింగ్, ప్రేరక్ మన్కడ్ -
IPL 2024: లక్నో బౌలర్ల విజృంభణ.. స్వల్ప స్కోర్‌కే పరిమితమైన ముంబై
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో ఇవాళ (ఏప్రిల్ 30) జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లు అదరగొట్టారు. పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు క్రమం తప్పకుండా వికెట్లు తీసి ముంబై ఇండియన్స్‌ను స్వల్ప స్కోర్‌కే కట్టడి చేశారు. లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (32), నేహల్ వధేరా (46), టిమ్ డేవిడ్ (35 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. రోహిత్ శర్మ (4), సూర్యకుమార్ (10), తిలక్ వర్మ (7), హార్దిక్ పాండ్యా (0), మొహమ్మద్ నబీ (1) విఫలమయ్యారు. లక్నో బౌలర్లలో మొహిసిన్ ఖాన్ 2 వికెట్లు పడగొట్టగా.. స్టోయినిస్, నవీన్ ఉల్ హక్, మయాంక్ యాదవ్, రవి బిష్ణోయ్ తలో వికెట్ పడగొట్టారు.తుది జట్లు..ముంబై ఇండియన్స్: ఇషాన్ కిషన్(వికెట్‌కీపర్), రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), నేహాల్ వధేరా, టిమ్ డేవిడ్, మహ్మద్ నబీ, గెరాల్డ్ కోయెట్జీ, పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రాఇంపాక్ట్ ప్లేయర్స్: నువాన్ తుషార, కుమార్ కార్తికేయ, డెవాల్డ్ బ్రెవిస్, నమన్ ధీర్, షమ్స్ ములానీలక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్/వికెట్‌కీపర్), మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, అష్టన్ టర్నర్, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, మొహ్సిన్ ఖాన్, మయాంక్ యాదవ్ఇంపాక్ట్ ప్లేయర్స్: అర్షిన్ కులకర్ణి, మణిమారన్ సిద్ధార్థ్, కృష్ణప్ప గౌతం, యుధ్వీర్ సింగ్, ప్రేరక్ మన్కడ్ -
IPL 2024: లక్నో, ముంబై మ్యాచ్.. సంచలన ఫాస్ట్ బౌలర్ రీఎంట్రీ
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 30) లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి. లక్నో హోం గ్రౌండ్ అయిన భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఎఖానా క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. గాయం కారణంగా గత కొన్ని మ్యాచ్‌లకు దూరంగా ఉన్న ఫాస్ట్ బౌలింగ్ సంచలనం మయాంక్ యాదవ్ ఈ మ్యాచ్‌తో రీఎంట్రీ ఇస్తున్నాడు. లక్నో జట్టులో మరిన్ని మార్పులు జరిగాయి. క్వింటన్ డికాక్ ఈ మ్యాచ్‌కు దూరం కాగా.. అర్షిన్ కులకర్ణి జట్టులోకి వచ్చాడు. ముంబై విషయానికొస్తే.. లూక్ వుడ్ స్థానంలో గెరాల్డ్ కొయెట్జీ తిరిగి జట్టులోకి వచ్చాడు. లక్నో ఈ మ్యాచ్‌తో పాటు మిగతా మ్యాచ్‌లన్నీ గెలిస్తే ప్లే ఆఫ్స్ రేసులో ఉంటుంది. ముంబై ప్లే ఆఫ్స్‌పై ఆశలు దాదాపుగా వదులుకుంది. ప్రస్తుతం లక్నో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉండగా.. ముంబై చివరి నుంచి రెండో స్థానంలో ఉంది.తుది జట్లు..ముంబై ఇండియన్స్: ఇషాన్ కిషన్(వికెట్‌కీపర్), రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), నేహాల్ వధేరా, టిమ్ డేవిడ్, మహ్మద్ నబీ, గెరాల్డ్ కోయెట్జీ, పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రాఇంపాక్ట్ ప్లేయర్స్: నువాన్ తుషార, కుమార్ కార్తికేయ, డెవాల్డ్ బ్రెవిస్, నమన్ ధీర్, షమ్స్ ములానీలక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్/వికెట్‌కీపర్), మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, అష్టన్ టర్నర్, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, మొహ్సిన్ ఖాన్, మయాంక్ యాదవ్ఇంపాక్ట్ ప్లేయర్స్: అర్షిన్ కులకర్ణి, మణిమారన్ సిద్ధార్థ్, కృష్ణప్ప గౌతం, యుధ్వీర్ సింగ్, ప్రేరక్ మన్కడ్ -
లక్నో సూపర్ జెయింట్స్‌కు గుడ్ న్యూస్.. టీమిండియాకు కూడా
ఐపీఎల్-2024లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ ఏప్రిల్ 30న ఏక్నా స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు లక్నో సూపర్ జెయింట్స్‌కు గుడ్ న్యూస్ అందింది.గాయం కారణంగా గత నాలుగు మ్యాచ్‌లకు దూరమైన ఆ జట్టు పేస్ సంచలనం మయాంక్ యాదవ్.. ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించాడు. సోమవారం నిర్వహించిన ఫిట్నెస్ పరీక్షను మయాంక్ క్లియర్ చేశాడు. ఈ విషయాన్ని లక్నో సూపర్ జెయింట్స్ బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ ధ్రువీకరించాడు.దీంతో అతడు ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌కు జట్టు సెలక్షన్‌కు యాదవ్ అందుబాటులో ఉండనున్నాడు. "మయాంక్ యాదవ్ ఫుల్ ఫిట్‌గా ఉన్నాడు. అతడు అన్ని రకాల ఫిట్నెస్ టెస్ట్‌లను క్లియర్ చేశాడు. మాకు ఇది నిజంగా గుడ్ న్యూస్. మంగళవారం జరిగే మ్యాచ్‌కు అతడు అందుబాటులో ఉండనున్నాడు.ఇంపాక్ట్ ప్లేయర్‌గా అతడిని ఉపయోగించే ఛాన్స్ ఉందని" ప్రీమ్యాచ్ కాన్ఫరెన్స్‌లో మోర్కెల్ పేర్కొన్నాడు. కాగా ఈ ఏడాది సీజన్లో మయాంక్ సంచలన ప్రదర్శన కనబరిచాడు. 155 కిలోమీటర్ల పైగా వేగంతో బౌలింగ్ చేసి ప్రత్యర్ధి బ్యాటర్లను వణికించాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ తన ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు. మయాంక్ ఫిట్నెస్ సాధించడం టీమిండియాకు కూడా కలిసిసొచ్చే ఆంశంగా చెప్పుకోవాలి. మయాంక్‌ను టీ20 వరల్డ్‌కప్-2024కు ఎంపిక చేసే అవకాశముంది. -
అక్కడ బ్యాటింగ్ చేయడం కష్టం.. అతడు అద్భుతం!
ఐపీఎల్-2024లో వరుస విజయాలతో అదరగొడుతున్న రాజస్తాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్ రేసులో మరింత ముందుకు దూసుకెళ్లింది. లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి.. అందరి కంటే ముందుగానే టాప్-4లో బెర్తు ఖరారు చేసుకునే పనిలో పడింది.ఈ నేపథ్యంలో రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ హర్షం వ్యక్తం చేశాడు. జట్టు ప్రదర్శన పట్ల తాను సంతృప్తిగా ఉన్నట్లు వెల్లడించాడు. అదే విధంగా రాయల్స్‌ను గెలుపుతీరాలకు చేర్చడంలో తనకు అండగా నిలిచిన ధ్రువ్ జురెల్‌పై ప్రశంసలు కురిపించాడు.ఫామ్లేమితోగతేడాది ఐపీఎల్లో అదరగొట్టి టీమిండియా తరఫున టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్‌కు.. ఐపీఎల్-2024 ఆరంభంలో చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఫామ్‌లేమితో సతమతమైన అతడు లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్ కంటే ముందు ఆడిన ఐదు ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం 50 పరుగులే చేశాడు.అయితే, శనివారం నాటి మ్యాచ్‌లో ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ధనాధన్ ఇన్నింగ్స్‌తో అలరించాడు. వన్‌డౌన్ బ్యాటర్, కెప్టెన్ సంజూ శాంసన్ సుడిగాలి ఇన్నింగ్స్(33 బంతుల్లో 71 నాటౌట్)తో విరుచుకుపడగా మరో ఎండ్ నుంచి అతడికి సహకారం అందించాడు.మొత్తంగా 34 బంతులు ఎదుర్కొని ఐదు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 52 పరుగులు రాబట్టాడు. తద్వారా సంజూ శాంసన్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 121 పరుగులు జోడించి ఇంకా ఆరు బంతులు మిగిలి ఉండగానే జట్టును విజయతీరాలకు చేర్చాడు.ఈ నేపథ్యంలో సంజూ శాంసన్ మాట్లాడుతూ.. ‘‘ఫామ్ టెంపరరీ. నిజానికి టీ20 క్రికెట్లో ఐదో స్థానంలో బ్యాటింగ్ చేయడం చాలా కష్టం. అయితే, ధ్రువ్ జురెల్ వంటి యువ ఆటగాళ్లు పిచ్ పరిస్థితులను చక్కగా అర్థం చేసుకుని రాణిస్తుండటం సానుకూలాంశం.టీమిండియా తరఫున టెస్టుల్లో తన ప్రదర్శన మనం చూశాం. ఆరంభంలో తడబడ్డా అతడిపై మా నమ్మకం సడలలేదు. నెట్స్‌లో రెండు నుంచి మూడు గంటల పాటు తీవ్రంగా శ్రమించాడు. అతడు తప్పక రాణిస్తాడని మాకు తెలుసు. అదే జరిగింది కూడా’’ అని ధ్రువ్ జురెల్ ఆట తీరును కొనియాడాడు.రాజస్తాన్ వర్సెస్ లక్నో స్కోర్లు:వేదిక: లక్నోటాస్: రాజస్తాన్.. బౌలింగ్లక్నో స్కోరు: 196/5 (20)రాజస్తాన్ స్కోరు: 199/3 (19)ఫలితం: లక్నోపై ఏడు వికెట్ల తేడాతో రాజస్తాన్ విజయంప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: సంజూ శాంసన్.చదవండి: డీకే అవసరమా?: యువీ Winning streak continues 🩷A Sanju Samson special & Dhruv Jurel's attractive innings propel Rajasthan Royals to their 8th win this season🙌Scorecard ▶️ https://t.co/Dkm7eJqwRj#TATAIPL | #LSGvRR | @rajasthanroyals pic.twitter.com/cam0GepXVo— IndianPremierLeague (@IPL) April 27, 2024 -
రాజస్తాన్ దర్జాగా...
లక్నో: ఈ సీజన్లో తిరుగులేని విజయాలతో దూసుకెళ్తున్న రాజస్తాన్ రాయల్స్ అందరికంటే ముందుగా ప్లేఆఫ్స్ చేరేందుకు మరింత చేరువైంది. శనివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో రాజస్తాన్ 7 వికెట్ల తేడాతో లక్నోపై గెలిచింది. తొలుత లక్నో సూపర్‌జెయింట్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది.ఆరంభంలోనే ఓపెనర్ డికాక్ (8), హిట్టర్ స్టొయినిస్ (0) వికెట్లను కోల్పోయి కష్టాల్లో ఉన్న సూపర్‌జెయింట్స్‌ను కేఎల్ రాహుల్ (48 బంతుల్లో 76; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), దీపక్ హుడా (31 బంతుల్లో 51; 7 ఫోర్లు) ఆదుకున్నారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 115 పరుగులు జోడించారు.మిగతావారిలో పూరన్ (11), బదోని (18 నాటౌట్), కృనాల్ పాండ్యా (15 నాటౌట్) పెద్ద స్కోర్లేమీ చేయలేదు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన రాజస్తాన్ రాయల్స్ 19 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది.కెప్టెన్ సంజు సామ్సన్ (33 బంతుల్లో 71 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు), ధ్రువ్ జురేల్ (34 బంతుల్లో 52 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అబేధ్యమైన నాలుగో వికెట్‌కు 121 పరుగులు జోడించి మరో ఆరు బంతులు మిగిలి ఉండగానే గెలిపించారు. స్కోరు వివరాలు లక్నో సూపర్‌జెయింట్స్ ఇన్నింగ్స్: డికాక్ (బి) బౌల్ట్ 8; రాహుల్ (సి) బౌల్ట్ (బి) అవేశ్ ఖాన్ 76; స్టొయినిస్ (బి) సందీప్ 0; దీపక్ హుడా (సి) పావెల్ (బి) అశి్వన్ 50; పూరన్ (సి) బౌల్ట్ (బి) సందీప్ 11; బదోని నాటౌట్ 18; కృనాల్ నాటౌట్ 15; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 196. వికెట్ల పతనం: 1–8, 2–11, 3–126, 4–150, 5–173. బౌలింగ్: బౌల్ట్ 4–0–41–1, సందీప్ 4–0–31–2, అవేశ్ ఖాన్ 4–0–42–1, అశ్విన్ 4–0–39–1, చహల్ 4–0–41–0. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: యశస్వి (సి) బిష్ణోయ్ (బి) స్టొయినిస్ 24; బట్లర్ (బి) యశ్ ఠాకూర్ 34; సామ్సన్ నాటౌట్ 71; పరాగ్ (సి) బదోని (బి) అమిత్ 14; జురేల్ నాటౌట్ 52; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (19 ఓవర్లలో 3 వికెట్లకు) 199. వికెట్ల పతనం: 1–60, 2–60, 3–78. బౌలింగ్: హెన్రీ 3–0–32–0, మొహసిన్ 4–0–52–0, యశ్ ఠాకూర్ 4–0–50–1, స్టొయినిస్ 1–0–3–1, కృనాల్ 4–0–24–0, అమిత్ మిశ్రా 2–0–20–1, రవి బిష్ణోయ్ 1–0–16–0. -
ఐపీఎల్లో ఇవాళ (Apr 27) రెండు మ్యాచ్‌లు.. రెండూ రసవత్తర సమరాలే..!
ఐపీఎల్లో ఇవాళ (ఏప్రిల్ 27) రెండు రసవత్తర సమరాలు జరుగనున్నాయి. మధ్యాహ్నం 3:30 గంటలకు జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ-ముంబై.. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో లక్నో-రాజస్థాన్ జట్లు తలపడనున్నాయి. మధ్యాహ్నం మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్ ఢిల్లీ హోం గ్రౌండ్ అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగనుంది. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఢిల్లీ ఆరో స్థానంలో.. ముంబై తొమ్మిదో స్థానంలో ఉన్నాయి. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే ముంబై ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సి ఉంది. ముంబై ఈ మ్యాచ్‌లో ఓడితే మాత్రం ప్లే ఆఫ్స్ ఆశలు వదులుకోవాల్సి ఉంటుంది. ముంబై ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడి 3 విజయాలతో ఆరు పాయింట్లు ఖాతాలో కలిగి ఉంది.ఢిల్లీ విషయానికొస్తే.. లీగ్ ఆరంభంలో వరుస పరాజయాలు ఎదుర్కొన్న ఈ జట్టు ఇటీవల వరుస విజయాలు సాధించి ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఢిల్లీ ఈ మ్యాచ్‌లో గెలిస్తే ప్లే ఆఫ్స్ బెర్త్ కోసం ప్రధాన పోటీదారుగా మారుతుంది. ఒకవేళ ఓడితే మాత్రం ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంటుంది. ఢిల్లీ ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో 4 విజయాలు సాధించి 8 పాయింట్లు కలిగి ఉంది.హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే.. ఇరు జట్లు ఇప్పటివరకు 34 మ్యాచ్‌ల్లో ఎదురెదురుపడగా.. ముంబై 19, ఢిల్లీ 15 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి. తుది జట్లు (అంచనా)..ఢిల్లీ: పృథ్వీ షా, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, అభిషేక్ పోరెల్, షాయ్ హోప్, రిషబ్ పంత్ (కెప్టెన్/విరుట్కీపర్), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జై రిచర్డ్సన్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్. [ఇంపాక్ట్ సబ్: రసిఖ్ సలామ్]ముంబై: ఇషాన్ కిషన్ (వికెట్‌కీపర్), రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), టిమ్ డేవిడ్, నేహాల్ వధేరా, మొహమ్మద్ నబీ, గెరాల్డ్ కోయెట్జీ, పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా. [ఇంపాక్ట్ సబ్: నువాన్ తుషార]రాత్రి మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్ లక్నో హోం గ్రౌండ్ అయిన భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఎఖానా క్రికెట్ స్టేడియంలో జరుగనుంది. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం రాజస్థాన్ అగ్రస్థానంలో.. లక్నో నాలుగో స్థానంలో ఉన్నాయి. 8 మ్యాచ్‌ల్లో ఏడింట గెలిచిన రాజస్థాన్ ప్లే ఆఫ్స్ బెర్త్‌ను అనధికారికంగా దక్కించుకోగా.. 8 మ్యాచ్‌ల్లో ఐదింట గెలిచిన లక్నో ప్లే ఆఫ్స్ బెర్తు కోసం పోటీపడుతుంది.ప్లే ఆఫ్స్ రేసులో మిగతా జట్ల కంటే ముందుండాలంటే లక్నో ఈ మ్యాచ్ తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది. మరోవైపు రాజస్థాన్‌ను ఈ మ్యాచ్ ఫలితం పెద్దగా ప్రభావితం చేయకపోవచ్చు. గెలిస్తే మాత్రం రాజస్థాన్ ప్లే ఆఫ్స్‌కు అధికారికంగా అర్హత సాధిస్తుంది.హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే.. ఇరు జట్లు ఇప్పటివరకు 4 మ్యాచ్‌ల్లో ఎదురెదురుపడగా.. రాజస్థాన్ 3, లక్నో ఓ మ్యాచ్‌లో గెలుపొందాయి.తుది జట్లు (అంచనా)..రాజస్థాన్: యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, రియాన్ పరాగ్, ధృవ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మన్ పావెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్ [ఇంపాక్ట్ సబ్: జోస్ బట్లర్]లక్నో: క్వింటన్ డి కాక్, కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, దీపక్ హుడా, ఆయుష్ బదోని, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, మాట్ హెన్రీ, యష్ ఠాకూర్ [ఇంపాక్ట్ సబ్: మయాంక్ యాదవ్] -
రెండోసారి తండ్రైన పాండ్యా
లక్నో సూపర్ జెయింట్స్ ఆల్‌రౌండర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా సోదరుడు కృనాల్ పాండ్యా రెండో సారి తండ్రయ్యాడు. ఈ నెల 21 కృనాల్ భార్య పంఖురి శర్మ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డకు 'వాయు' అని నామకరణం చేసినట్లు కృనాల్ తెలిపాడు. ఈ విషయాన్ని సోషల్‌మీడియా వేదికగా షేర్ చేసుకున్నాడు. బిడ్డ పేరుతో (వాయు కృనాల్ పాండ్యా) పాటు పుట్టిన తేదీని (21.4.24) కృనాల్ తన పోస్ట్‌లో పేర్కొన్నాడు. Vayu Krunal Pandya21.04.24 💙🪬 🌍 pic.twitter.com/TTLb0AjOVm— Krunal Pandya (@krunalpandya24) April 26, 2024 కృనాల్-పంఖురి శర్మ దంపతులకు ఇదివరకే ఓ మగబిడ్డ ఉన్నాడు. ఆ అబ్బాయి పేరు కవిర్ కృనాల్ పాండ్యా. కవిర్ 2022 జులై 24న జన్మించాడు. ప్రముఖ మోడల్ అయిన పంఖురితో కృనాల్‌కు 2017లో వివాహమైంది. కృనాల్ సోదరుడు హార్దిక్‌కు కూడా ఓ కుమారుడు ఉన్నాడు. ఆ అబ్బాయి పేరు అగస్త్య. అగస్త్య.. హార్దిక్-సటాషా స్టాంకోవిచ్ దంపతులకు జన్మించిన సంతానం.ఇదిలా ఉంటే, కృనాల్ ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఓ మోస్తరు ప్రదర్శనలతో పర్వాలేదనిపించాడు. ఈ సీజన్లో కృనాల్ 8 మ్యాచ్‌ల్లో 58 పరుగులు చేసి, 5 వికెట్లు పడగొట్టాడు. కృనాల్ జట్టు లక్నో ఈ సీజన్లో 8 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతుంది. ఈ సీజన్లో కృనాల్‌కు బ్యాటింగ్ చేసే అవకాశాలు పెద్దగా రాలేదు. బంతితో మాత్రం వచ్చిన అవకాశాలను కృనాల్ సద్వినియోగం చేసుకున్నాడు.ఈ సీజన్లో కృనాల్ ప్రదర్శనలు..రాజస్థాన్‌పై (4-0-19-0, 3 నాటౌట్)పంజాబ్‌పై (43 నాటౌట్, 3-0-26-0)ఆర్సీబీపై (0 నాటౌట్, 1-0-10-0)గుజరాత్‌పై (2 నాటౌట్, 4-0-11-3)ఢిల్లీపై (3, 3-0-45-0)కేకేఆర్‌పై (7 నాటౌట్, 1-0-14-0)సీఎస్కేపై (3-0-16-2)సీఎస్కేపై (2-0-15-0)