
ఐపీఎల్-2025 ప్రారంభానికి ముందు లక్నో సూపర్ జెయింట్స్‌కు భారీ షాక్ తగిలింది. రూ. 11 కోట్లు పెట్టి రీటైన్ చేసుకున్న ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ లీగ్ ఫస్ట్ హాఫ్‌కు దూరం కానున్నాడు. గతేడాది టీమిండియా అరంగేట్రం సందర్భంగా గాయపడిన మాయంక్ ఇంకా కోలుకోలేదు. ప్రస్తుతం అతను బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్‌లో రిహాబ్‌లో ఉన్నాడు.
బీసీసీఐ మయాంక్ గాయానికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు. ఐపీఎల్-2025 సెకండాఫ్ సమయానికి మయాంక్ కోలుకుని అవకాశం ఉందని తెలుస్తుంది. లీగ్ ఫస్ట్ హాఫ్‌లో మయాంక్ లేకపోవడం ఎల్‌ఎస్‌జీకి పెద్ద ఎదురుదెబ్బ అవుతుంది.
మయాంక్ గతేడాది ఐపీఎల్ సందర్భంగా స్థిరంగా 150 కిమీలకు పైగా వేగంతో బంతులు సంధించి వెలుగులోకి వచ్చాడు. ఈ ప్రదర్శన కారణంగా అతను గతేడాది అక్టోబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 సిరీస్‌కు (టీమిండియాకు) ఎంపికయ్యాడు. ఈ సిరీస్‌లో మయాంక్ అద్భుతంగా బౌలింగ్ చేసినప్పటికీ అనుకోని గాయం అతన్ని 6 నెలలకు పైగా క్రికెట్‌కు దూరం చేసింది. బంగ్లాతో జరిగిన టీ20 సిరీస్‌లో మయాంక్ అదే స్థిరమైన వేగంతో (150 కిమీ పైగా) బౌలింగ్ చేసి 3 మ్యాచ్‌ల్లో 4 వికెట్లు పడగొట్టాడు.
టీమిండియాకు మరో నాణ్యమైన ఫాస్ట్ బౌలర్ దొరికాడని అనుకునే లోపే మయాంక్ గాయపడ్డాడు. మయాంక్ గతేడాది ఐపీఎల్‌లో సూపర్ ఫాస్ట్ బౌలింగ్‌తో ప్రత్యర్థులకు దడ పుట్టించాడు. ఆ సీజన్‌లో అతను 4 మ్యాచ్‌ల్లో 7 వికెట్లు తీసి లక్నో విజయాల్లో కీలకపాత్ర పోషించాడు.
లక్నో గతేడాది కేఎల్ రాహుల్ సారథ్యంలో 14 మ్యాచ్‌ల్లో 7 విజయాలు సాధించి ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. గత చేదు అనుభవాల దృష్ట్యా లక్నో ఈసారి జట్టు మొత్తాన్ని ప్రక్షాళన చేసింది. లక్నో తమ నూతన కెప్టెన్‌గా రిషబ్ పంత్‌ను ఎంపిక చేసుకుంది. ఈ ఏడాది లక్నో జట్టులో విధ్వంకర బ్యాటర్లు మార్క్రమ్, డేవిడ్ మిల్లర్, మిచెల్ మార్ష్ చేరారు.
2025 సీజన్‌లో లక్నో తమ ప్రయాణాన్ని మార్చి 24 నుంచి ప్రారంభిస్తుంది. లక్నో తమ తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఢీకొంటుంది. ఈ మ్యాచ్ వైజాగ్‌లో జరుగనుంది. ఈ ఏడాది ఐపీఎల్ మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్ ఆర్సీబీతో తలపడుతుంది. ఈ మ్యాచ్ కోల్‌కతాలో జరుగనుంది.
కాగా, 2022లో గుజరాత్ టైటాన్స్‌తో కలిసి ఐపీఎల్ అరంగేట్రం చేసిన లక్నో సూపర్ జెయింట్స్ ఇప్పటివరకు ఆడిన 3 సీజన్లలో ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు. 2022, 2023 సీజన్లలో మూడో స్థానంలో నిలిచిన ఈ జట్టు.. గత సీజన్‌తో అడపాదడపా ప్రదర్శనలతో ఏడో స్థానంతో సరిపెట్టుకుంది.
2025 సీజన్ కోసం లక్నో సూపర్ జెయింట్స్ జట్టు..
డేవిడ్ మిల్లర్, ఎయిడెన్ మార్క్రమ్, హిమ్మత్ సింగ్, ఆయుశ్ బదోని, నికోలస్ పూరన్, రిషబ్ పంత్ (కెప్టెన్), మాథ్యూ బ్రీట్జ్కీ, ఆర్యన్ జుయల్, మిచెల్ మార్ష్, షాబాజ్ అహ్మద్, యువరాజ్ చౌదరీ, అబ్దుల్ సమద్, రాజవర్దన్ హంగార్గేకర్, అర్శిన్ కులకర్ణి, ఆవేశ్ ఖాన్, ఆకాశ్‌దీప్, ప్రిన్స్ యాదవ్, మొహిసిన్ ఖాన్, షమార్ జోసఫ్, ఆకాశ్ సింగ్, మయాంక్ యాదవ్, మణిమారన్ సిద్దార్థ్, దిగ్వేశ్ సింగ్, రవి బిష్ణోయ్
సపోర్ట్ స్టాఫ్..
హెడ్ కోచ్- జస్టిన్ లాంగర్
మెంటార్- జహీర్ ఖాన్
అసిస్టెంట్ కోచ్- విజయ్ దాహియా
డైరెక్టర్ ఆఫ్ టాలెంట్ సెర్చ్- ఎంఎస్‌కే ప్రసాద్
క్రికెట్ కన్సల్టెంట్- ఆడమ్ వోగ్స్
స్పిన్ బౌలింగ్ కన్సల్టెంట్- ప్రవీణ్ తాంబే
ఫీల్డింగ్ కోచ్- జాంటీ రోడ్స్
Comments
Please login to add a commentAdd a comment