
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025 ఆరంభానికి కేవలం ఒక్క రోజు సమయం మాత్రమే మిగిలింది. మార్చి 22న ఈడెన్ గార్డెన్స్ కేకేఆర్-ఆర్సీబీ మధ్య జరగనున్న మ్యాచ్‌తో ఈ మెగా ఈవెంట్‌కు తేరలేవనుంది. ఈ క్రమంలో మొత్తం పది ఫ్రాంచైజీలు గాయాల కారణంగా దూరమైన ఆటగాళ్ల స్ధానాలను భర్తీ చేసే పనిలో పడ్డాయి.
లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ టీమిండియా వెటరన్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. గాయం కారణంగా ఈ ఏడాది సీజన్‌కు దూరమైన లక్నో పాస్ట్ బౌలర్ మొహ్సిన్ ఖాన్ స్థానంలో శార్ధూల్‌ను తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే శార్ధూల్ ఠాకూర్ వైజాగ్‌లో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్ టీమ్‌తో కలిసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ టోర్నీలో లక్నో సూపర్ జెయింట్స్ తమ తొలి మ్యాచ్‌లో ఈ నెల 24న ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడనుంది. కాగా ఐపీఎల్-2025 మెగా వేలంలో శార్ధూల్ ఠాకూర్ అమ్ముడు పోలేదు. రూ. 2 కోట్ల బేస్‌ప్రైస్‌తో వేలంలోకి వచ్చిన అతడిని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు.
కానీ ఇప్పుడు మరోసారి అతడికి ఐపీఎల్‌లో భాగమయ్యే అవకాశం లక్నో జట్టు కల్పించింది. కాగా శార్థూల్‌తో ఒప్పందంపై లక్నో ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. శార్ధూల్ ఇటీవల జరిగిన హోలీ వేడుకల్లో ఢిల్లీ జట్టు సభ్యులతో కన్పించాడు.
ఐపీఎల్‌లో అదుర్స్..
కాగా ఐపీఎల్‌లో శార్దూల్ ఠాకూర్ మంచి రికార్డు ఉంది. శార్థూల్ 2015లో పంజాబ్ కింగ్స్ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు 95 మ్యాచ్‌లు ఆడిన లార్డ్ ఠాకూర్.. 307 పరుగులతో పాటు 94 వికెట్లు పడగొట్టాడు. 2017 నుంచి అతడు అన్ని ఐపీఎల్ సీజన్లలోనూ ఆడాడు. గతేడాది మెగా వేలానికి ముందు సీఎస్‌కే అతడిని విడిచిపెట్టింది.
వీక్‌గా పేస్ బౌలింగ్ యూనిట్..
కాగా లక్నో సూపర్ జెయింట్స్ పేస్ బౌలింగ్ విభాగం చాలా వీక్‌గా కన్పిస్తోంది. పేస్ అటాక్‌లో భాగంగా ఉన్న ఆకాష్ దీప్, అవేష్ ఖాన్, మయాంక్ యాదవ్ గాయాలతో పోరాడుతున్నారు. వీరూ ఇంకా లక్నో జట్టుతో చేరలేదు. మోహ్షిన్ ఖాన్ అయితే పూర్తిగా ఈ ఏడాది సీజన్‌కే దూరమయ్యాడు. ప్రస్తుతం షెమార్ జోషఫ్, ప్రిన్స్ యాదవ్, రాజవర్ధన్ హంగర్గేకర్ వంటి యువ పేసర్ల లక్నో జట్టులో ఉన్నారు. ఈ నేపథ్యంలో శార్థూల్ ఠాకూర్ లక్నో జట్టుకు కీలకంగా మారే అవకాశముంది.
చదవండి: 'సెహ్వాగ్ నన్ను అవమానించాడు.. అందుకే మాట్లాడటం మానేశా'
Comments
Please login to add a commentAdd a comment