Shardul Thakur
-
కౌంటీల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న శార్దూల్ ఠాకూర్
టీమిండియా పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. 33 ఏళ్ల శార్దూల్ 2025-26 కౌంటీ సీజన్ తొలి అర్ద భాగం కోసం ఎసెక్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఎసెక్స్‌తో డీల్‌లో శార్దూల్ ఏడు మ్యాచ్‌లు ఆడనున్నాడు. శార్దూల్ కౌంటీల్లో ఆడటం ఇదే తొలిసారి. ఎసెక్స్‌తో ఒప్పందం కుదుర్చుకోవడంపై శార్దూల్ ఆనందం వ్యక్తం చేశాడు. కౌంటీల్లో ఆడాలని తాను ఎప్పటి నుంచో అనుకుంటున్నట్లు తెలిపాడు.2017లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన శార్దూల్.. ఫిట్నెస్ సమస్యలు, ఫామ్ లేమి కారణంగా తరుచూ జట్టులోకి వస్తూ పోతూ ఉంటాడు. శార్దూల్ చివరిగా 2023 బాక్సింగ్ డే టెస్ట్‌లో (సౌతాఫ్రికాతో) టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. ఇటీవలికాలంలో శార్దూల్ దేశవాలీ క్రికెట్లో మంచి ఫామ్‌లో ఉన్నాడు. బౌలింగ్‌లో రాణిస్తుండటంతో పాటు లోయర్ ఆర్డర్లో బ్యాట్‌తోనూ సత్తా చాటుతున్నాడు.ప్రస్తుతం జరుగుతున్న రంజీ సీజన్లో శార్దూల్ మెరుపులు మెరిపిస్తున్నాడు. 8 మ్యాచ్‌ల్లో 33 వికెట్లు తీశాడు. లోయర్ ఆర్డర్లో పలు అర్ద సెంచరీలు చేశాడు. ఈ సీజన్లో ముంబై సెమీస్‌కు చేరడంలో శార్దూల్ కీలకపాత్ర పోషించాడు. ప్రస్తుతం శార్దూల్ విదర్భతో జరుగుతున్న సెమీస్‌లో పాల్గొంటున్నాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో శార్దూల్ ఓ వికెట్ తీసి, 37 పరుగులు చేశాడు.కష్టాల్లో ముంబైవిదర్భతో జరుగుతున్న రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో ముంబై ఎదురీదుతుంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 188 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. స్టార్ బ్యాటర్లు, టీమిండియా ప్లేయర్లు అజింక్య రహానే (18), సూర్యకుమార్ యాదవ్ (0), శివమ్ దూబే (0) దారుణంగా విఫలమయ్యారు. ఆకాశ్ ఆనంద్ (67 నాటౌట్), తనుశ్ కోటియన్ (5) ముంబైను గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. విదర్భ యువ స్పిన్నర్ పార్థ్ రేఖడే 3 వికెట్లు తీసి ముంబైని దెబ్బకొట్టాడు. విదర్భ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ముంబై ఇంకా 195 పరుగులు వెనుకపడి ఉంది. అంతకుముందు విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 383 పరుగులకు ఆలౌటైంది. ధృవ్ షోరే (74), దనిశ్ మలేవార్ (79), యశ్ రాథోడ్ (54) అర్ద సెంచరీతో రాణించారు. శివమ్ దూబే ఐదు వికెట్లతో మెరిశాడు. -
శతక్కొట్టిన రహానే, చెలరేగిన శార్దూల్.. సెమీస్‌లో ముంబై
రంజీ ట్రోఫీ(Ranji Trophy) 2024-25 సీజన్లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై(Mumbai) సెమీస్‌కు దూసుకువెళ్లింది. క్వార్టర్ ఫైనల్-3 మ్యాచ్‌లో హర్యానా జట్టును మట్టికరిపించి టాప్-4కు అర్హత సాధించింది. కాగా రంజీ తాజా ఎడిషన్‌లో భాగంగా శనివారం క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్‌లు మొదలయ్యాయి.తొలి ఇన్నింగ్స్‌లో రహానే విఫలంఈ క్రమంలో కోల్‌కతా వేదికగా ముంబై హర్యానాతో తలపడింది. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు ఆయుశ్ మాత్రే(0), ఆకాశ్ ఆనంద్(10)తో పాటు వన్‌డౌన్‌లో వచ్చిన సిద్ధేశ్ లాడ్(4) కూడా విఫలమయ్యాడు. కెప్టెన్ అజింక్య రహానే(Ajinkya Rahane) సైతం 31 పరుగులకే వెనుదిరగగా.. టీమిండియా టీ20 జట్టు సారథి సూర్యకుమార్ యాదవ్(9), ఆల్‌రౌండర్ శివం దూబే(28) కూడా నిరాశపరిచారు.ఇలాంటి తరుణంలో ఆల్‌రౌండర్ షామ్స్ ములానీ 91 పరుగులతో రాణించగా.. మరో ఆల్‌రౌండర్ తనుశ్ కొటియాన్ 97 పరుగులతో చెలరేగాడు. ఫలితంగా ముంబై తమ తొలి ఇన్నింగ్స్‌లో 315 పరుగులు చేసింది.అంకిత్ కుమార్ శతకం కారణంగాఅనంతరం బ్యాటింగ్ మొదలుపెట్టిన హర్యానా తమ మొదటి ఇన్నింగ్స్‌లో 301 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ అంకిత్ కుమార్ శతకం(136)తో మెరవగా.. మిగతా వాళ్ల నుంచి అతడికి ఎక్కువగా సహకారం లభించలేదు. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ దెబ్బకు హర్యానా బ్యాటర్లు పెవిలియన్‌కు వరుస కట్టారు. అతడు 18.5 ఓవర్ల బౌలింగ్‌లో 58 పరుగులు ఇచ్చి ఏకంగా ఆరు వికెట్లు కూల్చాడు. మిగతా వాళ్లలో షామ్స్ ములానీ, తనుశ్ కొటియాన్ రెండు వికెట్లు దక్కించుకున్నారు.ఈ నేపథ్యంలో పద్నాలుగు పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ముంబై.. 339 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అజింక్య రహానే శతక్కొట్టగా(108).. సూర్యకుమార్ యాదవ్(70) చాన్నాళ్ల తర్వాత అర్ధ శతకం బాదాడు. మిగిలిన వాళ్లలో సిద్దేశ్ లాడ్ 43, శివం దూబే 48 పరుగులతో రాణించారు.అప్పుడు శార్దూల్.. ఇప్పుడు రాయ్స్టన్ఇక ముంబై విధించిన 353 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో హర్యానా తడబడింది. ఓపెనర్ లక్ష్య దలాల్(64), సుమిత్ కుమార్(62) హాఫ్ సెంచరీలతో రాణించగా.. మిగతా వాళ్లంతా విఫలమయ్యారు. దీంతో 201 పరుగులకే హర్యానా కుప్పకూలింది. ముంబై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ మూడు వికెట్లు సాధించగా.. రాయ్స్టన్ డయాస్ ఐదు వికెట్లతో చెలరేగాడు. తనుశ్ కొటియాన్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఇక హర్యానాపై ముంబై 152 పరుగుల తేడాతో గెలుపొందిన ముంబై వరుసగా రెండోసారి సెమీస్‌లో అడుగుపెట్టింది. శార్దూల్ ఠాకూర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ముంబై వర్సెస్ హర్యానా(క్వార్టర్ ఫైనల్-3) సంక్షిప్త స్కోర్లు👉ముంబై స్కోర్లు: 315 & 339👉హర్యానా స్కోర్లు: 301 & 201👉ఫలితం: 152 పరుగుల తేడాతో హర్యానాను ఓడించిన ముంబై👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: శార్దూల్ ఠాకూర్(ముంబై)- మొత్తం తొమ్మిది వికెట్లు.చదవండి: IPL 2025: కొత్త యాజమాన్యం చేతిలోకి గుజరాత్ టైటాన్స్! -
శార్దూల్ ఠాకూర్ ఊచకోత.. తొలుత హ్యాట్రిక్, ఇప్పుడు..?
రంజీ ట్రోఫీ (Ranji Trophy) రన్నింగ్ సీజన్లో ముంబై ఆల్‌రౌండర్, టీమిండియా ప్లేయర్ శార్దూల్ ఠాకూర్ (Shardul Thakur) హవా కొనసాగుతుంది. ఈ సీజన్లో ఆది నుంచి తనదైన శైలిలో రెచ్చిపోతున్న శార్దూల్.. ప్రస్తుతం మేఘాలయాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో తొలుత హ్యాట్రిక్ (Hat Trick) తీసిన శార్దూల్.. బ్యాటింగ్‌లో మెరుపు అర్ద శతకంతో విరుచుకుపడ్డాడు. ఈ ఇన్నింగ్స్‌లో కేవలం 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన శార్దూల్.. ఓవరాల్‌గా 42 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 84 పరుగులు చేశాడు. శార్దూల్‌తో పాటు మిగతా ఆటగాళ్లంతా తలో చేయి వేయడంతో ముంబై తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ (671/7) చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.ముంబై బ్యాటర్లలో సిద్దేశ్ లాడ్ (145), వికెట్ కీపర్ ఆకాశ్ ఆనంద్ (103), షమ్స్ ములానీ (86 బంతుల్లో 100 నాటౌట్; 16 ఫోర్లు) సెంచరీలతో కదంతొక్కగా.. కెప్టెన్ అజింక్య రహానే (96) తృటిలో సెంచరీని చేజార్చుకున్నాడు. సుయాంశ్ షేడ్గే (61) అర్ద సెంచరీతో రాణించాడు. ఇన్నింగ్స్ డిక్లేర్ చేసే సమయానికి ముంబై 585 పరుగుల ఆధిక్యంలో ఉంది.అంతకుముందు శార్దూల్ ఠాకూర్ బంతితో చెలరేగడంతో మేఘాలయా తొలి ఇన్నింగ్స్‌లో 86 పరుగులకే కుప్పకూలింది. శార్దూల్ హ్యాట్రిక్ సహా 4 వికెట్లు తీయగా.. మోహిత్ అవస్థి 3, సిల్డెస్టర్ డిసౌజా 2, షమ్స్ ములానీ ఓ వికెట్ పడగొట్టారు. మేఘాలయా ఇన్నింగ్స్‌లో 10వ నంబర్ ఆటగాడు హిమాన్ పుఖాన్ చేసిన 28 పరుగులే అత్యధికం. శార్దూల్ దెబ్బకు మేఘాలయా టాపార్డర్‌కు చెందిన ఐదుగురు బ్యాటర్లు డకౌటయ్యారు. ఈ మ్యాచ్‌లో మేఘాలయా ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. కేవలం 2 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి రంజీ చరిత్రలో అత్యంత ఘోరమైన ప్రదర్శన నమోదు చేసింది. 90ల్లో ఔటైన ఐదుగురు ఆటగాళ్లు..ప్రస్తుతం జరుగుతున్న రంజీ మ్యాచ్‌ల్లో ఏకంగా ఐదు మంది ఆటగాళ్లు 90ల్లో ఔటయ్యారు. వీరిలో ఇద్దరు పరుగు తేడాతో సెంచరీ మిస్ అయ్యారు. సౌరాష్ట్ర ఆటగాడు చతేశ్వర్ పుజారా, ఢిల్లీ కెప్టెన్ ఆయుశ్ బదోని 99 పరుగుల వద్ద ఔట్ కాగా.. ముంబై కెప్టెన్ అజింక్య రహానే 96, రైల్వేస్ ఆటగాడు ఉపేంద్ర యాదవ్ 95, కర్ణాటక కెప్టెన్ మయాంక్ అగర్వాల్ 91 పరుగుల వద్ద ఔటయ్యారు. -
భార్యతో బీచ్ ఒడ్డున టీమిండియా క్రికెటర్ (ఫొటోలు)
-
2 పరుగులే 6 వికెట్లు.. 152 ఏళ్ల క్రికెట్ చరిత్రలోనే
మేఘాలయ బ్యాటర్లు దారుణ ప్రదర్శన కనబరిచారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన మేఘాలయ తమ మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 86 పరుగులకే ఆలౌటైంది. ఆరంభంలోనే ముంబై స్టార్ ఆల్‌రౌండర్ శార్ధూల్ ఠాకూర్(Shardul Thakur) హ్యాట్రిక్ వికెట్లను పడగొట్టి దెబ్బతీశాడు. అతడి ధాటికి మేఘాలయ కేవలం 2 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో మేఘాలయ అత్యంత చెత్త రికార్డును తమ పేరిట లిఖించుకుంది.152 ఏళ్ల ఫస్ట్ క్లాస్ క్రికెట్ హిస్టరీలోనే తొలి ఆరు వికెట్లకు అత్యల్ప స్కోర్ చేసిన రెండో జట్టుగా మేఘాలయ నిలిచింది. ఈ చెత్త రికార్డు సాధించిన జాబితాలో ఎసీసీ క్రికెట్ క్లబ్ అగ్రస్ధానంలో ఉంది. 1872లో లార్డ్స్‌లో సర్రేతో జరిగిన మ్యాచ్‌లో ఎంసీసీ ఖాతా తెరవకుండానే తొలి 6 వికెట్లను కోల్పోయింది. ఈ లిస్ట్‌లో ఎంసీసీ, మేఘాలయ తర్వాతి స్ధానాల్లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ (3-6), లీసెస్టర్‌షైర్(4-6), నార్తాంప్టన్‌షైర్(4-6) ఉన్నాయినాలుగేసిన శార్ధూల్..ఇక ఈ మ్యాచ్‌లో శార్థూల్ ఠాకూర్ హ్యాట్రిక్ వికెట్లతో మెరిశాడు. మేఘాలయ ఇన్నింగ్స్ మూడో ఓవర్ వేసిన లార్డ్ శార్ధూల్.. బి అనిరుధ్, సుమిత్ కుమార్, జస్కిరత్లను వరుస బంతుల్లో ఔట్ చేశాడు. ఓవరాల్‌గా 11 ఓవర్లు బౌలింగ్ చేసిన ఠాకూర్.. 43 పరుగులిచ్చి 4 వికెట్లను పడగొట్టాడు.అతడితో పాటు మొహిత్ అవస్థి మూడు, సిల్వస్టర్ డిసౌజా రెండు , షామ్స్ ములానీ ఒక్క వికెట్ సాధించారు. మేఘాలయ బ్యాటర్లలో టెయిలాండర్ హీమ్యాన్(28) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.చదవండి: RT 2025: హ్యాట్రిక్‌తో చెలరేగిన శార్ధూల్.. టీమిండియాలోకి రీ ఎంట్రీకి సిద్దం -
హ్యాట్రిక్‌తో చెలరేగిన శార్ధూల్.. టీమిండియాలోకి రీ ఎంట్రీకి సిద్దం
రంజీ ట్రోఫీ 2024-25 సీజన్లో ముంబై స్టార్ ఆల్‌రౌండర్, టీమిండియా వెటరన్ శార్దూల్ ఠాకూర్(Shardul Thakur) తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ టోర్నీలో భాగంగా శరద్ పవార్ క్రికెట్ అకాడమీ వేదికగా మేఘాలయతో జరుగుతున్న మ్యాచ్‌లో శార్ధూల్ హ్యాట్రిక్ వికెట్లతో మెరిశాడు.ముంబై బౌలింగ్ ఎటాక్‌ను ప్రారంభించిన శార్దూల్ తొలి ఓవర్లోనే మేఘాలయ ఓపెనర్ నిశాంత చక్రవర్తిని డకౌట్ చేసి పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత మళ్లీ మూడో ఓవర్ వేసిన లార్డ్ శార్ధూల్.. బి అనిరుధ్, సుమిత్ కుమార్, జస్కిరత్లను వరుస బంతుల్లో ఔట్ చేశాడు.దీంతో తొలి ఫస్ట్‌క్లాస్ క్రికెట్ హ్యాట్రిక్‌ను ఠాకూర్ తన ఖాతాలో వేసుకున్నాడు. అతడి దెబ్బకు మేఘాలయ కేవలం 2 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. మేఘాలయ కెప్టెన్ ఆకాష్ చౌదరి(14), ప్రింగ్సాంగ్ సంగ్మా(18) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. 15 ఓవర్లకు మేఘాలయ 6 వికెట్ల నష్టానికి 39 పరుగులు చేసింది.కాగా ఈ మ్యాచ్ కంటే ముందు జమ్మూ అండ్ కాశ్మీర్‌తో జరిగిన మ్యాచ్‌లో శార్ధూల్ ఠాకూర్ సెంచరీతో మెరిశాడు. ఎనిమిదో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన శార్ధూల్ వన్డే తరహాలో తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. రోహిత్ శర్మ,జైశ్వాల్,రహానే, శ్రేయస్ అయ్యర్ విఫలమైన చోట, ఠాకూర్ అద్బుతమైన సెంచరీతో మెరిశాడు. శార్దూల్ 119 బంతుల్లో 17 ఫోర్ల సాయంతో 113 పరుగులు చేశాడు. అంతకుముందు మ్యాచ్‌లో కూడా హాఫ్ సెంచరీతో ఈ ముంబై క్రికెటర్ రాణించాడు.టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇస్తాడా?లార్డ్ ఠాకూర్ గత 14 నెలలగా జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్నాడు. ఠాకూర్ చివరగా భారత్ తరుపున 2023లో సౌతాఫ్రికాపై టెస్టు మ్యాచ్‌లో ఆడాడు. ఆ తర్వాత పేలవ ఫామ్‌తో జట్టులో చోటు కోల్పోయాడు. అయితే శార్ధూల్ తన రిథమ్‌ను తిరిగి పొందాడు. దేశవాళీ క్రికెట్లో అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ ఏడాది ఇంగ్లండ్ పర్యటనతో శార్ధూల్ తిరిగి జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. అతడికి టెస్టుల్లో ఇంగ్లండ్ గడ్డపై అద్బుతమైన రికార్డు ఉంది. ఈ క్రమంలోనే ఇంగ్లండ్‌తో టెస్టులకు అతడిని ఎంపిక చేసే అవకాశమున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.చదవండి: SA 20: వారెవ్వా.. క్రికెట్ చరిత్రలోనే సూపర్ క్యాచ్! వీడియో వైరల్ -
ఎనిమిదో స్ధానంలో బ్యాటింగ్.. కట్‌చేస్తే! సూపర్ సెంచరీ
శరద్ పవార్ క్రికెట్ అకాడమీ వేదికగా జమ్మూ-కాశ్మీర్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో ముంబై తిరిగి కమ్‌బ్యాక్ ఇచ్చింది. రెండో ఇన్నింగ్స్‌లో ముంబై స్టార్ ఆల్‌రౌండర్ శార్ధూల్ ఠాకూర్ సెంచరీతో మెరిశాడు. ఎనిమిదో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన శార్ధూల్ వన్డే తరహాలో తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. రోహిత్ శర్మ, జైశ్వాల్, శ్రేయస్ అయ్యర్, రహానే వంటి స్టార్ ప్లేయర్లు విఫలమైన చోట.. లార్డ్ శార్థూల్ విరోచిత పోరాటంతో తన జట్టును అదుకున్నాడు. శార్దూల్ 119 బంతుల్లో 17 ఫోర్ల సాయంతో 113 పరుగులు చేసి తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ముంబై తమ రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. దీంతో 188 పరుగుల ఆధిక్యంలో ముంబై కొనసాగుతోంది. ప్రస్తుతం క్రీజులో శార్థూల్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ తనీష్ కొటియన్(58 నాటౌట్) ఉన్నారు.జమ్మూ బౌలర్లలో ఔకిబ్ నబీ దార్ మూడు వికెట్లు పడగొట్టగా.. ఉమర్ నజీర్ మీర్, యుధ్వీర్ సింగ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. కాగా పదేళ్ల తర్వాత రంజీ ఆడుతున్న భారత కెప్టెన్ రోహిత్ శర్మ రెండు ఇన్నింగ్స్‌లలోనూ తీవ్రనిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 19 బంతులు ఎదుర్కొని కేవలం మూడు పరుగులు మాత్రమే చేసిన రోహిత్.. రెండో ఇన్నింగ్స్‌లో 28 పరుగులు మాత్రమే చేయగలిగాడు.అతడితోపాటు జైశ్వాల్(4, 26), రహానే(12, 16) విఫలమయ్యారు. మొదటి ఇన్నింగ్స్‌లో ముంబై 120 పరుగులకు ఆలౌట్ కాగా.. జమ్మూ అండ్ కాశ్మీర్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 206 పరుగులు చేసింది. ఇక శార్దూల్ తొలి ఇన్నింగ్స్‌లోనూ హాఫ్ సెంచరీతో మెరిశాడు. లార్డ్ ఠాకూర్ గత 14 నెలలగా జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్నాడు.దేశవాళీ క్రికెట్లో మెరుగైన ప్రదర్శన చేస్తున్నప్పటికి భారత జట్టులోకి పునరాగమనం చేయలేకపోతున్నాడు. ఈ ఏడాది ఇంగ్లండ్ పర్యటనతో శార్ధూల్ తిరిగి జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. అతడికి టెస్టుల్లో ఇంగ్లండ్ గడ్డపై అద్బుతమైన రికార్డు ఉంది. ఈ క్రమంలోనే ఠాకూర్‌కు సెలక్లర్లు రీకాల్ చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి.చదవండి: భారత్‌తో రెండో టీ20: ఇంగ్లండ్ తుదిజట్టు ప్రకటన.. అతడిపై వేటు -
శార్దూల్ ఠాకూర్ ఊచకోత.. 28 బంతుల్లో 8 సిక్సర్ల సాయంతో..!
విజయ్ హజారే ట్రోఫీ 2024-25లో ముంబై ఆటగాడు శార్దూల్ ఠాకూర్ (Shardul Thakur) విశ్వరూపం ప్రదర్శించాడు. నాగాలాండ్‌తో ఇవాళ (డిసెంబర్ 31) జరుగుతున్న మ్యాచ్‌లో శార్దూల్ బ్యాట్‌తో చెలరేగిపోయాడు. 28 బంతుల్లో రెండు ఫోర్లు, ఎనిమిది సిక్సర్ల సాయంతో 73 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.సిక్సర్ల సునామీ సృష్టించిన శార్దూల్ 260.71 స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు సాధించాడు. శార్దూల్ సుడిగాలి ఇన్నింగ్స్ కారణంగా నాగాలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై అతి భారీ స్కోర్ చేసింది. ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 403 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన ముంబై ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసింది.ఆయుశ్ మాత్రే రికార్డు శతకంఈ మ్యాచ్‌లో ముంబై యువ సంచలనం ఆయుశ్ మాత్రే సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో మాత్రే (181) భారీ సెంచరీతో మెరిశాడు. 17 ఏళ్ల 168 రోజుల వయసులో మాత్రే ఈ సెంచరీ చేశాడు. లిస్ట్-ఏ క్రికెట్లో (50 ఓవర్ల ఫార్మాట్) ఇంత చిన్న వయసులో 150 ప్లస్ స్కోర్ ఎవరూ చేయలేదు. ఇదో వరల్డ్ రికార్డు. గతంలో ఈ రికార్డు టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ పేరిట ఉండేది. యశస్వి కూడా ముంబై తరఫున ఆడుతూ 17 ఏళ్ల 291 రోజుల వయసులో 150 ప్లస్ స్కోర్ చేశాడు. ఈ మ్యాచ్‌లో మాత్రే 117 బంతుల్లో 15 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 181 పరుగులు చేశాడు. విజయ్ హజారే ట్రోఫీలో ముంబై తరఫున ఇది ఐదో అత్యధిక స్కోర్.భారీ భాగస్వామ్యంఈ మ్యాచ్‌లో మాత్రే.. అంగ్‌క్రిశ్ రఘువంశీతో (56) కలిసి తొలి వికెట్‌కు 156 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అనంతరం మాత్రే.. సిద్దేశ్ లాడ్‌తో కలిసి మూడో వికెట్‌కు 96 పరుగులు జోడించాడు. డబుల్ సెంచరీకి చేరువైన మాత్రే మూడో వికెట్‌గా వెనుదిరిగాడు.మాత్రే, శార్దూల్ మినహా చెప్పుకోదగ్గ స్కోర్లేమీ లేవుముంబై ఇన్నింగ్స్‌లో మాత్రే, శార్దూల్ ఠాకూర్ మినహా చెప్పుకోదగ్గ స్కోర్లేమీ లేవు. బిస్త 2, సిద్దేశ్ లాడ్ 39, సుయాంశ్ షేడ్గే 5, ప్రసాద్ పవార్ 38, అంకోలేకర్ 0, హిమాన్షు సింగ్ (5) పరుగులు చేశారు. నాగాలాండ్ బౌలర్లలో దిప్ బోరా మూడు వికెట్లు పడగొట్టగా.. నగాహో చిషి 2, ఇమ్లివాటి లెమ్టూర్, జే సుచిత్ తలో వికెట్ దక్కించుకున్నారు.23 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన నాగాలాండ్404 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నాగాలాండ్ 23 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి ఓటమిని ఖరారు చేసుకుంది. ఏదో అద్భుతం జరిగేతే తప్ప ఈ మ్యాచ్‌లో నాగాలాండ్ గెలవలేదు. 36.4 ఓవర్ల అనంతరం నాగాలాండ్ స్కోర్ 115/6గా ఉంది. జగదీష సుచిత (46), లెమ్టూర్ (2) క్రీజ్‌లో ఉన్నారు. ఓపెనర్ రుపేరో (53) అర్ద సెంచరీతో రాణించాడు. ఈ మ్యాచ్‌లో నాగలాండ్ గెలవాలంటే 80 బంతుల్లో 289 పరుగులు చేయాలి. చేతిలో నాలుగు వికెట్లు ఉన్నాయి.బంతితోనూ రాణించిన శార్దూల్బ్యాట్తో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన శార్దూల్ ఈ మ్యాచ్‌లో బంతితోనూ రాణించాడు. బౌలింగ్ అటాక్‌ను మొదలుపెట్టిన శార్దూల్ నాలుగు ఓవర్లలో 12 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. ఇందులో ఓ మొయిడిన్ ఓవర్ ఉంది.స్టార్లకు విశ్రాంతిఈ మ్యాచ్‌లో ముంబై యాజమాన్యం స్టార్ ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చింది. ప్రత్యర్ధి చిన్న జట్టు కావడంతో ఈ మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే ఆడటం లేదు. శ్రేయస్ అయ్యర్ స్థానంలో శార్దూల్ ఠాకూర్ ముంబై కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. -
వేలంలో అమ్ముడుపోలేదు.. ఇక్కడేమో బ్యాటర్లు ఉతికారేశారు! పాపం శార్దూల్..
భారత ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ చరిత్రలో లో ఓ మ్యాచ్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా నిలిచాడు. కాగా ఇండియాలో ప్రస్తుతం దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ జరుగుతున్న విషయం తెలిసిందే.ఇందులో భాగంగా.. గ్రూప్-‘ఇ’లో ఉన్న కేరళ- ముంబై జట్లు శుక్రవారం తలపడ్డాయి. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో టాస్ గెలిచిన ముంబై తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన కేరళకు శార్దూల్ ఠాకూర్ ఆరంభంలోనే షాకిచ్చాడు. కెప్టెన్, ఓపెనర్ సంజూ శాంసన్(4)ను ఆదిలోనే పెవిలియన్‌కు పంపాడు.అయితే, ఆ తర్వాత ముంబైకి పెద్దగా ఏదీ కలిసిరాలేదు. వరుస విరామాల్లో వికెట్లు తీసినా.. ఓపెనర్ రోహన్ కణ్ణుమల్, సల్మాన్ నిజార్ ధాటికి ముంబై బౌలర్లు చేతులెత్తేశారు. రోహన్ 48 బంతుల్లోనే 87 పరుగులతో చెలరేగగా.. సల్మాన్ 49 బంతుల్లో 99 పరుగులతో అజేయంగా నిలిచాడు. వీరిద్దరి విధ్వంసకర ఇన్నింగ్స్ కారణంగా కేరళ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి ఏకంగా 234 పరుగులు చేసింది.కాగా ముంబై బౌలర్లలో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ తన నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి.. ఏకంగా 69 పరుగులు ఇచ్చుకున్నాడు. ఈ క్రమంలో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఓ మ్యాచ్‌లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా రమేశ్ రాహుల్ చెత్త రికార్డును సమం చేశాడు. కాగా రమేశ్ అరుణాచల్‌ప్రదేశ్ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్.ఇక ఇటీవల జరిగిన ఐపీఎల్ మెగా వేలం-2025లో రూ. 2 కో ట్ల కనీస ధరతో శార్దూల్ ఠాకూర్ అందుబాటులో ఉన్నాడు. అయితే, ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపకపోవడంతో అతడు అమ్ముడుపోకుండానే మిగిలిపోయాడు. ప్పుడిలా టీ20మ్యాచ్‌లో చె త్త ప్రదర్శన కనబరిచాడు.ఇక మ్యాచ్ విషయానికొస్తే.. కేరళ విధించిన భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో ముంబై ఆఖరి వరకు పోరాడింది. ఓపెనర్లు పృథ్వీ షా(23), అంగ్క్రిష్ రఘువంశీ(16) నిరాశపరచగా.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(18 బంతుల్లో 32) కాసేపు బ్యాట్ ఝులిపించాడు. ఈ క్రమంలో ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్న అజింక్య రహానే 35 బంతుల్లోనే 68 రన్స్ చేశాడు.రహానే ఇన్నింగ్స్‌లో ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉండటం విశేషం. మిగతా వాళ్లలో వికెట్ కీపర్ హార్దిక్ తామోర్(23) ఒక్కడే కాస్త మెరుగ్గా ఆడాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి ముంబై 191 పరుగులు చేయగలిగింది. దీంతో కేరళ 43 పరుగుల తేడాతో విజయఢంకా మోగించింది. చదవండి: Asia Cup 2024: రేపే భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. లైవ్ ఎక్కడో తెలుసా? -
అప్పుడు రూ. 10 కోట్లు.. ఇప్పుడు అన్‌సోల్డ్.. నా హృదయం ముక్కలైంది!
సౌదీ అరేబియాలోని జెద్దా నగరం వేదికగా రెండు రోజుల పాటు సాగిన ఐపీఎల్ మెగా వేలం-2025 సోమవారం ముగిసింది. ఇందులో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ టీమిండియా స్టార్ రిషభ్ పంత్ కోసం ఏకంగా రూ. 27 కోట్లు ఖర్చు చేసింది. ఫలితంగా క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలోనే అత్యంత ఎక్కువ ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా పంత్ ఆల్‌టైమ్ రికార్డు సృష్టించాడు.ఈసారి అతడు అన్సోల్డ్అదే విధంగా శ్రేయస్ అయ్యర్(రూ. 26.75 కోట్లు- పంజాబ్ కింగ్స్), వెంకటేశ్ అయ్యర్(రూ. 23.75 కోట్లు- కోల్‌కతా నైట్ రైడర్స్) కూడా భారీ ధర పలికారు. అయితే, కొంతమంది టీమిండియా క్రికెటర్లను మాత్రం ఫ్రాంఛైజీలు అస్సలు పట్టించుకోలేదు. అందులో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ ఒకడు. అతడు ఈసారి అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు.ఈ విషయంపై భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ శార్దూల్ కోసం కనీస ప్రయత్నం కూడా చేయకపోవడం తనను విస్మయపరిచిందన్నాడు. ‘‘లార్డ్ ఠాకూర్ పేరు రానేలేదు. క్రికెట్, క్రికెటేతర కారణాలు ఏవైనా కావచ్చు. అతడు రెండుసార్లు అందుబాటులోకి వచ్చాడు. అయినప్పటికీ ఒక్కరు కూడా ఆసక్తి చూపించలేదు.సీఎస్కే అందరి కోసం ట్రై చేసిందితాము వదిలేసిన ఫాస్ట్ బౌలర్లలో శార్దూల్ మినహా అందరినీ.. తిరిగి దక్కించుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్ ప్రయత్నించింది. అతడిని మాత్రం వదిలేసింది. శార్దూల్ అమ్ముడుపోకుండానే మిగిలిపోయాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో 2020-21 భాగంగా గాబా టెస్టులో అతడి అద్భుత ప్రదర్శన కారణంగా టీమిండియా గెలిచిన తర్వాత.. వేలంలో ఏకంగా రూ. 10 కోట్లు వచ్చాయి. కానీ.. ఈసారి రూ. 2 కోట్లకు అందుబాటులో ఉన్నా ఎవరూ కనీసం పట్టించుకోలేదు. నిజంగా అతడి పరిస్థితిని చూసి నా హృదయం ముక్కలైంది’’ అని ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానెల్ వేదికగా అభిప్రాయాలు పంచుకున్నాడు. ఇప్పటి వరకు 95 మ్యాచ్‌లుకాగా 2015లో ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చిన ముంబై ఆటగాడు శార్దూల్ ఠాకూర్.. ఈ ఏడాది చెన్నైకి ప్రాతినిథ్యం వహించాడు. అయితే, వేలానికి ముందు అతడిని వదిలేసిన సీఎస్కే.. వేలం సందర్భంగా మొత్తానికే గుడ్‌బై చెప్పింది. ఇక శార్దూల్ ఠాకూర్ తన ఐపీఎల్ కెరీర్లో ఇప్పటి వరకు 95 మ్యాచ్‌లు ఆడి 307 రన్స్ చేయడంతో పాటు.. 94 వికెట్లు పడగొట్టాడు.చదవండి: వెంకటేశ్ అయ్యర్, నరైన్ కాదు.. కేకేఆర్ కెప్టెన్‌గా అతడే!? -
శార్దూల్ ఎక్కడ?.. నితీశ్‌ను ఆడిస్తారా? అతడు కూడా గంగూలీలా..
ఆస్ట్రేలియతో టెస్టులకు ఎంపిక చేసిన భారత జట్టుపై టీమిండియా స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. హార్దిక్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్ వంటి సీనియర్ పేస్ ఆల్రౌండర్లను ఈ సిరీస్‌లో ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని ప్రశ్నించాడు. ఐదు టెస్టులుటీమిండియాకు ఎంతో కీలకమైన ఈ పర్యటనలో యువకుడైన నితీశ్ కుమార్ రెడ్డిపై భారం మోపడం సరైన నిర్ణయం కాదని భజ్జీ అభిప్రాయపడ్డాడు. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 3-0తో క్లీన్‌స్వీప్‌నకు గురైన టీమిండియా.. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉంది. ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా అక్కడ ఐదు టెస్టులు ఆడనుంది. పెర్త్ వేదికగా శుక్రవారం నుంచి ఈ సిరీస్ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో బుధవారం మీడియాతో మాట్లాడిన టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీ20లలో మెరుపులు మెరిపిస్తున్న ఆంధ్ర క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి అరంగేట్రం చేయడం ఖాయమనే సంకేతాలు ఇచ్చాడు.నితీశ్ రెడ్డి ఆట చూడాల్సిందేనితీశ్ గురించి మోర్కెల్ ప్రస్తావిస్తూ.. ‘అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ చేయగల సామర్థ్యం నితీశ్ సొంతం. ఈ పర్యటనలో అతడి ఆట చూసేందుకు ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఉన్నారు. నితీశ్ కుమార్ రెడ్డిలో ప్రతిభకు కొదవలేదు. అతడు ఆల్‌రౌండ్ సామర్థ్యం గల ఆటగాడు. అతడి బౌలింగ్‌లో పదును ఉంది.మనం ఊహించిన దానికంటే ఎక్కువ వేగంగా అతడి బంతి బ్యాట్‌ను తాకుతుంది. ఆస్ట్రేలియా పిచ్‌లపై అతడి బౌలింగ్ బాగా ఉపయోగపడుతుంది. స్వింగ్ బౌలింగ్‌కు అనుకూలమైన ఆసీస్ పిచ్‌లపై నితీశ్ మరింత ప్రమాదకారి కాగలడు. సరైన దిశలో వినియోగిస్తే అతడు ఉపయుక్త బౌలర్ అవుతాడు. ప్రతి బంతిని వికెట్ లక్ష్యంగా సంధించడం అతడి నైపుణ్యం.పేస్ ఆల్‌రౌండర్ స్థానాన్ని భర్తీ చేయడానికి నితీశ్‌కు ఇది చక్కటి అవకాశం. ప్రపంచంలోని ఏ జట్టయినా మంచి పేస్ ఆల్‌రౌండర్ ఉండాలని కోరుకుంటుంది. తమ పేసర్లకు మరింత విశ్రాంతి నివ్వగల ఆల్‌రౌండర్ లభిస్తే అంతకుమించి ఇంకేం కావాలి’ అని అన్నాడు.మరి శార్దూల్ ఠాకూర్ ఎక్కడికి వెళ్లాడు?ఈ నేపథ్యంలో మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘టీమిండియాకు ప్రస్తుతం హార్దిక్ పాండ్యా వంటి ఆల్‌రౌండర్ అవసరం ఉంది. కానీ.. అతడిని జట్టులోకి తీసుకునే పరిస్థితి లేదు కాబట్టి.. నితీశ్ కుమార్ రెడ్డి రూపంలో ఆప్షన్ వెదుక్కున్నారు. మరి శార్దూల్ ఠాకూర్ ఎక్కడికి వెళ్లాడు?హార్దిక్ పాండ్యా ఏమయ్యాడు? వాళ్లిద్దరిని పరిమిత ఓవర్ల క్రికెట్‌కే పరిమితం చేద్దామనుకుంటున్నారు కదా! గత రెండు, మూడేళ్లుగా శార్దూల్‌పై మీరు నమ్మకం ఉంచారు. అతడికి అవకాశాలు ఇచ్చారు. కానీ ఇప్పుడు ఏమైంది? అకస్మాత్తుగా నితీశ్‌ను బౌలింగ్ చేయమంటూ తెరమీదకు తీసుకువచ్చారు’’ అని ఘాటు వ్యాఖ్యలు చేశాడు.నితీశ్ కూడా గంగూలీలాఇక నితీశ్ రెడ్డికి ఇదొక సువర్ణావకాశమన్న భజ్జీ.. మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మాదిరి పేస్ దళానికి అదనపు బలంగా మారితే బాగుంటుందని సూచించాడు. పేసర్లకు విశ్రాంతినిచ్చేలా బౌలింగ్ చేయడంతో పాటు.. బ్యాటింగ్‌లోనూ సత్తా చాటితే ఉపయుక్తమని పేర్కొన్నాడు. ‘‘గంగూలీ మాదిరి.. కొన్ని ఓవర్లపాటు బౌలింగ్ చేసి.. నితీశ్ 1-2 వికెట్లు తీస్తే.. జట్టుకు అది ఒకరంగా బోనస్‌లా మారుతుంది’’ అని హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు.టెస్టు అరంగేట్రం చేయడం ఖాయంకాగా ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చి... టీ20ల్లో మెరుపుల ద్వారా టెస్టు జట్టులో స్థానం దక్కించుకున్న నితీశ్ కుమార్ రెడ్డి... ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్‌లో అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేయడం దాదాపు ఖాయమైంది. షమీ వంటి సీనియర్ పేసర్ లేకపోవడంతో అతడి స్థానంలో సీమ్, బౌన్స్‌ను వినియోగించుకోగలగడంతో పాటు లోయర్ ఆర్డర్లో ధాటిగా బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్నా నితీశ్‌ను తుది జట్టులోకి ఎంపిక చేసే చాన్స్ ఉంది. ఇదిలా ఉంటే.. టీమిండియా దిగ్గజ బ్యాటర్ గంగూలీ రైటార్మ్ మీడియం పేసర్ కూడా! తన కెరీర్లో గంగూలీ టెస్టుల్లో 32, వన్డేల్లో 100 వికెట్లు తీశాడు. ఇక హార్దిక్ ఫిట్నెస్ లేమి వల్ల కేవలం వన్డే, టీ20లకు పరిమితం కాగా.. శార్దూల్ ఇటీవలే గాయం నుంచి కోలుకుని రంజీల్లో ముంబై తరఫున ఆడుతున్నాడు.చదవండి: ICC: వరల్డ్ నంబర్ వన్‌గా హార్దిక్ పాండ్యా.. దూసుకువచ్చిన తిలక్ వర్మ.. ఏకంగా.. -
వంద శాతం ఫిట్‌గా ఉన్నా.. మేనేజ్మెంట్ నుంచి పిలుపు రాలేదు: టీమిండియా స్టార్
ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ నేపథ్యంలో టీమిండియా ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంతవరకు తనకు టీమిండియా మేనేజ్మెంట్ నుంచి పిలుపురాలేదని.. కానీ.. త్వరలోనే తాను జాతీయ జట్టు తరఫున పునగామనం చేస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా ఆసీస్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు బీసీసీఐ ప్రకటించిన జట్టులో శార్దూల్ ఠాకూర్‌కు చోటు దక్కలేదన్న సంగతి తెలిసిందే.నితీశ్ కుమార్ రెడ్డికి అవకాశంఈ ముంబై ఆటగాడికి బదులు యువ క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డిని బీసీసీఐ ఆస్ట్రేలియాకు పంపింది. ఈ నేపథ్యంలో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కోటాలో సీనియర్ అయిన శార్దూల్‌ను కాదని.. టెస్టు అరంగేట్రం చేయని నితీశ్‌ను సెలక్ట్ చేయడంపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ స్పందిస్తూ.. తాము గతాన్ని మరిచి సరికొత్తగా ముందుకు సాగాలని భావిస్తున్నట్లు సంకేతాలు ఇచ్చాడు.ముంబై తరఫున రంజీ బరిలోఇదిలా ఉంటే..కాలికి శస్త్ర చికిత్స చేయించుకున్న శార్దూల్ ఠాకూర్ ఇటీవలే మళ్లీ మైదానంలో అడుగుపెట్టాడు. ముంబై తరఫున రంజీ ట్రోఫీ 2024-25 సీజన్లో బరిలోకి దిగాడు. తాజాగా ఎలైట్ గ్రూప్-‘ఎ’లో భాగంగా సర్వీసెస్‌తో మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. శుక్రవారం ముగిసిన ఈ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లో కలిపి ఏడు వికెట్లు పడగొట్టాడు. తద్వారా సర్వీసెస్‌పై ముంబై విజయంలో కీలక పాత్ర పోషించాడు.వంద శాతం ఫిట్నెస్ సాధించానుఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన శార్దూల్ ఠాకూర్ టీమిండియా రీ ఎంట్రీ గురించి స్పందించాడు. ‘‘రంజీ ట్రోఫీ తాజా ఎడిషన్‌లో ఆరంభ మ్యాచ్‌లలో కాస్త ఆందోళనకు గురయ్యా. సర్జరీ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందోననే భయం వెంటాడింది. అయితే, క్రమక్రమంగా నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇప్పుడు వంద శాతం ఫిట్నెస్ సాధించాను.బౌలింగ్‌లో నేను రాణించిన తీరు ఇందుకు నిదర్శనం. గత మూడు, నాలుగు మ్యాచ్‌లను గమనిస్తే బౌలింగ్ బాగానే ఉంది. కొన్నిసార్లు క్యాచ్‌లు మిస్ చేశాను. అయితే, ఐదు మ్యాచ్‌లలో కలిపి దాదాపు 20 వికెట్ల దాకా తీశాను. నా ఫిట్నెస్, బౌలింగ్ పట్ల పూర్తి సంతృప్తిగా ఉన్నాను.ఇప్పటి వరకు పిలుపు రాలేదుటీమిండియా మేనేజ్మెంట్ నుంచి నాకైతే ఇప్పటి వరకు పిలుపు రాలేదు. ఎవరూ నన్ను సంప్రదించలేదు. అయితే, ఆస్ట్రేలియా పర్యటన తర్వాత.. టీమిండియా స్వదేశంలో ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడబోతోంది. కాబట్టి నాకు అవకాశం వస్తుందనే భావిస్తున్నా. ఇప్పుడైతే ఫిట్‌నెస్‌పై మరింత దృష్టి సారించి.. బౌలింగ్‌లో రాణించడమే నా ధ్యేయం’’ అని శార్దూల్ ఠాకూర్ చెప్పుకొచ్చాడు.ఆస్ట్రేలియాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి టీమిండియారోహిత్ శర్మ (కెప్టెన్)జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్)యశస్వి జైస్వాల్అభిమన్యు ఈశ్వరన్శుభ్మన్ గిల్విరాట్ కోహ్లీకేఎల్ రాహుల్రిషభ్ పంత్ (వికెట్ కీపర్)సర్ఫరాజ్ ఖాన్ధృవ్ జురెల్ (వికెట్‌కీపర్)రవిచంద్రన్ అశ్విన్రవీంద్ర జడేజామహ్మద్ సిరాజ్ఆకాశ్ దీప్ప్రసిద్ కృష్ణహర్షిత్ రాణానితీశ్ కుమార్ రెడ్డివాషింగ్టన్ సుందర్ చదవండి: BGT 2024: టీమిండియాకు గుడ్‌న్యూస్ -
ఆసీస్-‘ఎ’తో టెస్టుల్లో విఫలం.. అయినా అతడిపై భారీ అంచనాలు!
భారత వన్డే, టీ20 జట్టులో కీలకమైన పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా టెస్టులకు ఎప్పుడో దూరమయ్యాడు. ఇటీవల స్వదేశంలో బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌లతో టెస్టు సిరీస్‌లకు ముందు రెడ్‌బాల్‌తో ప్రాక్టీస్ చేసినా.. రీఎంట్రీ మాత్రం ఇవ్వలేకపోయాడు. ఇక హార్దిక్ లేకపోయినా.. శార్దూల్ ఠాకూర్ రూపంలో టెస్టుల్లో టీమిండియాకు పేస్ బౌలింగ్ దొరికాడు. కానీ నిలకడలేమి ఆట తీరుతో ప్రస్తుతం జట్టుకు దూరమైన ఈ ముంబై క్రికెటర్.. రంజీ ట్రోఫీలో ఆడుతున్నాడు. నితీశ్‌కుమార్ రెడ్డికి బంపరాఫర్ ఈ నేపథ్యంలో ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్‌కుమార్ రెడ్డికి బంపరాఫర్ వచ్చిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీకి ఎంపికైన జట్టులో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా 21 ఏళ్ల ఈ యువ ఆటగాడు చోటు దక్కించుకున్నాడు.ఆసీస్-‘ఎ’తో టెస్టుల్లో విఫలంఅంతకంటే ముందే ఆస్ట్రేలియా-‘ఎ’తో తలపడిన భారత్-‘ఎ’ జట్టు తరఫున ఆడేందుకు కంగారూ గడ్డపై అడుగుపెట్టాడు. అయితే, ఆసీస్-‘ఎ’తో జరిగిన రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్టు సిరీస్‌లో నితీశ్ పూర్తిగా నిరాశపరిచాడు. పరుగులు రాబట్టడంలో, వికెట్లు తీయడంలోనూ విఫలమయ్యాడు.రెండు మ్యాచ్‌లలో నితీశ్ చేసిన స్కోర్లు 0, 17, 16, 38. తీసిన వికెట్ ఒకే ఒక్కటి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాతో జరుగనున్న టెస్టుల్లో నితీశ్ రెడ్డిని ఆడిస్తారా? లేదా అన్న అంశంపై భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా తన అభిప్రాయాలు పంచుకున్నాడు.బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో సీమ్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా మేనేజ్మెంట్ నితీశ్ పేరును పరిశీలించే అవకాశం ఉందన్న ఆకాశ్.. అయితే, ఇప్పుడే అతడి నుంచి అత్యుత్తమ ప్రదర్శన ఊహించలేమన్నాడు. ఆస్ట్రేలియా-‘ఎ’ జట్టుతో మ్యాచ్‌లలో అతడు విఫలం కావడమే ఇందుకు కారణంగా పేర్కొన్నాడు. అనధికారిక టెస్టుల్లో రన్స్ రాబట్టలేక.. వికెట్లు తీయలేక నితీశ్ ఇబ్బంది పడ్డాడని.. అలాంటి ఆటగాడు పటిష్ట ఆసీస్‌పై ఎలా రాణించగలడని ప్రశ్నించాడు.అయినా భారీ అంచనాలు.. ఇప్పుడే అదెలా సాధ్యం?‘‘హార్దిక్ పాండ్యా లేనందుకు శార్దూల్ జట్టుతో ఉండేవాడు. కానీ ఇప్పుడు మనం నితీశ్ కుమార్ రెడ్డి నుంచి పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా సేవలు ఆశిస్తున్నాం. ఇప్పుడే అదెలా సాధ్యం? ఇటీవలి అతడి ప్రదర్శనలు గొప్పగా ఏమీలేవు. అయినప్పటికీ అతడిపై అంచనాలు భారీగానే ఉన్నాయి.ఏదేమైనా అతడు ఈ సిరీస్‌లో రాణించాలనే కోరుకుంటున్నా. నిజానికి ఫస్ట్‌క్లాస్ క్రికెట్లోనూ అతడికి పెద్దగా అనుభవం లేదు. అయినా.. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ రూపంలో నితీశ్ సేవలు జట్టుకు అవసరం కాబట్టి.. అతడు ఎంపికయ్యాడు’’ అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.ఐపీఎల్లో అదరగొట్టికాగా ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున అదరగొట్టిన విశాఖపట్నం కుర్రాడు నితీశ్ రెడ్డి.. ఇటీవలే టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. ఇక ఫస్ట్‌క్లాస్ క్రికెట్ విషయానికొస్తే.. 39 ఇన్నింగ్స్‌లో కలిపి 779 పరుగులు చేసిన నితీశ్.. 42 ఇన్నింగ్స్‌లో కలిపి 56 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే.. ఆసీస్- టీమిండియా మ ధ్య నవంబరు 22 నుంచి టెస్టు సిరీస్ ఆరంభం కానుంది.చదవండి: టీమిండియాకు గుడ్‌న్యూస్ -
స్టార్ ఓపెనర్ రీ ఎంట్రీ.. శ్రేయస్ అయ్యర్ కూడా! కానీ అతడు మిస్!
టీమిండియా ఓపెనర్, తమ స్టార్ క్రికెటర్ పృథ్వీ షాకు ముంబై క్రికెట్ అసోసియేషన్ శుభవార్త అందించింది. ఇటీవల రంజీ జట్టు నుంచి అతడిని తొలగించిన యాజమాన్యం.. దేశీ టీ20 టోర్నీ కోసం మళ్లీ పిలుపునిచ్చేందుకు సిద్ధమైంది. కాగా దేశవాళీ క్రికెట్లో అద్భుత ప్రదర్శనలతో టీమిండియాలోకి దూసుకువచ్చిన పృథ్వీ షా.. తన స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయాడు.టీమిండియా ఓపెనర్‌గా తన స్థానాన్ని కోల్పోయినిలకడలేని ఆటతీరుతో శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్లతో పోటీలో వెనుకబడి టీమిండియా ఓపెనర్‌గా తన స్థానాన్ని కోల్పోయాడు. 2018లో భారత జట్టు తరఫున అరంగేట్రం చేసిన పృథ్వీ.. 2021లో చివరగా టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. అంతర్జాతీయ కెరీర్లో ఇప్పటి వరకు మొత్తం 5 టెస్టులు, 6 వన్డేలు ఆడిన ఈ ముంబై బ్యాటర్.. ఆయా ఫార్మాట్లలో వరుసగా 339, 189 పరుగులు చేశాడు.ముంబై తరఫున ఆడుతూఅదే విధంగా.. టీమిండియా తరఫున ఒకే ఒక్క టీ20 ఆడి డకౌట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో మళ్లీ డొమెస్టిక్ క్రికెట్‌పై దృష్టిపెట్టిన పృథ్వీ షా.. ముంబై తరఫున ఆడుతూ తనను తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌తో పాటు.. విజయ్ హజారే ట్రోఫీ(వన్డే), సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ(టీ20)లో ఆడుతూనే.. ఐపీఎల్‌లోనూ అదృష్టాన్ని పరీక్షించుకంటున్నాడు.ఇంగ్లండ్ గడ్డపై రాణిస్తూఅలాగే ఇంగ్లండ్ దేశీ టోర్నీల్లోనూ పాల్గొంటున్న పృథ్వీ షా.. అక్కడ నార్తంప్టన్‌షైర్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. రంజీ ట్రోఫీ 2024-25లో తొలుత పృథ్వీ షాకు అవకాశం ఇచ్చిన ముంబై క్రికెట్ అసోసియేషన్.. ఆ తర్వాత అతడిని పక్కనపెట్టింది. ఫామ్ లేమి, ఫిట్నెస్ సమస్యలు, అనుచిత ప్రవర్తన కారణంగా పృథ్వీపై వేటు వేసింది.శ్రేయస్ అయ్యర్ కూడాఈ నేపథ్యంలో తాజాగా ముంబై ప్రాబబుల్స్ జట్టులో పృథ్వీ పేరు కనిపించడం విశేషం. దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024లో పాల్గొనే అవకాశం ఉన్న ఆటగాళ్ల పేరును ముంబై క్రికెట్ అసోసియేషన్ తాజాగా విడుదల చేసింది. ఇందులో పృథ్వీ షాతో పాటు టీమిండియా స్టార్, ప్రస్తుతం జట్టుకు దూరమైన శ్రేయస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్లతో పాటు వెటరన్ ప్లేయర్ అజింక్య రహానే తదితరుల పేర్లు కూడా ఉన్నాయి.అతడు మాత్రం మిస్‌అయితే, ఆల్‌రౌండర్ తనుష్ కొటియాన్ మాత్రం ఈ లిస్టులో మిస్సయ్యాడు. ఇటీవల భారత్-‘ఎ’ జట్టుకు ఎంపికైన అతడు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్నాడు. కానీ.. అక్కడ ఆసీస్-‘ఎ’తో రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్టు సిరీస్‌లో భారత్ 2-0తో క్లీన్‌స్వీప్ అయింది. కాగా నవంబరు 23 నుంచి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ తాజా సీజన్ మొదలుకానుంది. ఇందులో రంజీ సారథి రహానేనే ముంబైకి నాయక త్వం వహించే అవకాశం ఉంది.సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ తాజా ఎడిషన్‌లో పాల్గొనబోయే ముంబై ప్రాబబుల్ జట్టుపృథ్వీ షా, ఆయుష్ మాత్రే, అంగ్క్రిష్ రఘువంశీ, జే బిస్తా, శ్రీరాజ్ ఘరత్, అజింక్య రహానె, శ్రేయస్ అయ్యర్, సూర్యాన్ష్ షెడ్గే, ఇషాన్ ముల్చందానీ, సిద్ధేశ్ లాడ్, హార్దిక్ తామోర్ (వికెట్ కీపర్), ఆకాశ్ ఆనంద్ (వికెట్ కీపర్), సాయిరాజ్ పాటిల్, ఆకాశ్ పార్కర్, షామ్స్ ములానీ, హిమాన్షు సింగ్, సాగర్ చాబ్రియా, శార్దూల్ ఠాకూర్, మోహిత్ అవస్థి, సిల్వెస్టర్ డిసౌజా, రాయ్స్టన్ డైస్, యోగేశ్ పాటిల్, హర్ష్ తన్నా, ఇర్ఫాన్ ఉమైర్, వినాయక్ భోయిర్, కృతిక్ హనగవాడీ, శశాంక్ అటార్డే, జునేద్ ఖాన్. చదవండి: BGT: వరుసగా 4 సెంచరీలు.. ఆస్ట్రేలియాలో ఫెయిల్.. అయినా టీమిండియా ఓపెనర్‌గా అతడే! -
కెప్టెన్‌గా రహానే.. జట్టులోకి ఇద్దరు టీమిండియా స్టార్లు!
ఇరానీ కప్-2024కు ముంబై జట్టు పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతోంది. రెస్టాఫ్ ఇండియాపై గెలుపే లక్ష్యంగా ముంబై క్రికెట్ అసోసియేషన్(ఎంసీఏ) వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రెడ్‌బాల్ మ్యాచ్‌లో ముంబైకి అజింక్య రహానే సారథ్యం వహించనున్నాడు.ఇక ఈ మ్యాచ్‌కు ఇద్దరు టీమిండియా స్టార్లు కూడా అందుబాటులోకి రావడంతో జట్టు మరింత పటిష్టంగా మారనుందని ముంబై వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కాగా రంజీ ట్రోఫీ గెలిచిన జట్టుకు, రెస్టాఫ్ ఇండియా టీమ్‌కు మధ్య ఇరానీ కప్ పోటీ జరుగుతుంది.రంజీ తాజా ఎడిషన్ విజేత ముంబైఈ ఏడాది రంజీ టోర్నీలో రహానే సారథ్యంలోని ముంబై జట్టు విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అక్టోబరు 1 నుంచి మొదలయ్యే ఇరానీ కప్ మ్యాచ్‌లో రెస్టాఫ్ ఇండియాతో తలపడనుంది. ఇందుకోసం ఎంసీఏ మంగళవారం తమ జట్టును ప్రకటించనున్నట్లు క్రిక్‌బజ్ వెల్లడించింది.ఇద్దరు టీమిండియా స్టార్లు అందుబాటులోకిరహానే కెప్టెన్సీలో జరుగనున్న ఈ మ్యాచ్‌కు టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌తో పాటు.. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ కూడా అందుబాటులో ఉండనున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని ఎంసీఏ అధికారులు నిర్ధారించినట్లు పేర్కొంది. కాగా టీమిండియా మాజీ వైస్ కెప్టెన్ అజింక్య రహానే ఇటీవల ఇంగ్లండ్ కౌంటీ చాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు సిద్ధమయ్యాడు. లీసస్టర్షైర్కు ఆడే క్రమంలో అతడు గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు.అయితే, ఇరానీ కప్ మ్యాచ్ నాటికి రహానే పూర్తి ఫిట్నెస్ సాధించేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు.. టీమిండియాలో చోటు కోల్పోయిన శ్రేయస్ అయ్యర్.. బంగ్లాదేశ్‌తో రెండో టెస్టుకు కూడా ఎంపిక కాలేదు. కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్‌లతో మిడిలార్డర్లో పోటీలో అతడు వెనుకబడ్డాడు.శ్రేయస్‌కు మరో అవకాశంఇటీవల దులిప్ ట్రోఫీ-2024లోనూ శ్రేయస్ నిరాశపరిచాడు. దీంతో ఇరానీ కప్ మ్యాచ్‌లోనైనా సత్తా చాటాలని అతడు పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. శస్త్ర చికిత్స అనంతరం కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఇన్విటేషనల్ టోర్నీలో ఆడిన శార్దూల్ ఠాకూర్ సైతం ఈ మ్యాచ్‌కు అందుబాటులోని రానున్నట్లు సమాచారం. కాగా ముంబై చివరగా 1998లో ఇరానీ కప్ గెలిచింది. అయితే, ఈసారి మేటి ఆటగాళ్లు జట్టులో భాగమవడం సానుకూలాంశం. మరోవైపు.. రెస్టాఫ్ ఇండియా జట్టు గత హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదుంది. గత మ్యాచ్‌లలో సౌరాష్ట్రపై రెండుసార్లు, మధ్యప్రదేశ్ జట్టుపై ఒకసారి గెలిచి ఇరానీ కప్ టైటిల్ సొంతం చేసుకుంది. కాగా శ్రేయస్, శార్దూల్ రంజీ గెలిచిన ముంబై జట్టులోనూ సభ్యులేనన్న విషయం తెలిసిందే.చదవండి: ఇరగదీస్తున్న ఆసియా దేశాలు.. ఒక్క పాక్ మినహా..! -
టీమిండియాకు శుభవార్త.. స్టార్ ఆల్‌రౌండర్ వచ్చేశాడు..!
టీమిండియాకు శుభవార్త. స్టార్ బౌలింగ్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ నాలుగు నెలల తర్వాత కాంపిటేటివ్ క్రికెట్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. బెంగళూరులో జరిగిన కెప్టెన్ కే తిమ్మప్పయ్య మెమోరియల్ టోర్నీలో శార్దూల్ పాల్గొన్నాడు. ఈ టోర్నీలో అతను ముంబై జట్టుకు ప్రాతనిథ్యం వహించాడు. నిన్న కేఎస్‌సీఏ సెక్రటరీ ఎలెవెన్‌తో జరిగిన మ్యాచ్‌లో శార్దూల్ బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్‌లో శార్దూల్ ప్రదర్శన ఏమంత ఆశాజనకంగా లేదు. బ్యాటింగ్‌లో డకౌటైన అతను.. బౌలింగ్‌లో ఎనిమిది ఓవర్లు వేసి వికెట్ లేకుండా 29 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో శార్దూల్ రాణించకపోయినా లాంగ్ టెస్ట్ సీజన్‌కు ముందు భారత్‌కు ఓ ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అందుబాటులోకి వచ్చాడు. బంగ్లాదేశ్‌తో రెండో టెస్ట్‌కు భారత సెలెక్టర్లు శార్దూల్‌ను పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. ఇక్కడ కుదరకపోయినా ఆసీస్‌లో జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో శార్దూల్‌కు అవకాశం ఇచ్చే ఛాన్స్‌లు ఉన్నాయి. ఆసీస్‌లో జరిగిన గత బీజీటీలో శార్దూల్ అద్భుతంగా రాణించాడు. అక్కడి పిచ్‌లు శార్దూల్ బౌలింగ్ స్టయిల్‌కు అనుకూలిస్తాయి. లోయర్ ఆర్డర్లో ఉపయోగకరమైన బ్యాటర్ కూడా కావడంతో శార్దూల్‌ను బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఎంపిక చేయవచ్చు. కాగా, శార్దూల్ 2024 ఐపీఎల్ సందర్భంగా గాయపడిన విషయం తెలిసిందే. శార్దూల్‌కు జూన్ 12న లండన్‌లో కాలి మడమకు సర్జరీ జరిగింది. శార్దూల్ త్వరలో జరిగే ఇరానీ ట్రోఫీలో ముంబై తరఫున ఆడతాడు. ఆ మ్యాచ్‌లో ముంబై రెస్ట్ ఆఫ్ ఇండియాతో తలపడుతుంది. ఇదిలా ఉంటే, భారత టెస్ట్ సీజన్ త్వరలో బంగ్లాదేశ్‌తో జరుగబోయే టెస్ట్ మ్యాచ్ నుంచి ప్రారంభమవుతుంది. వచ్చే ఏడాది జనవరి వరకు భారత్ 10 టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. బంగ్లాదేశ్‌తో రెండు, న్యూజిలాండ్‌తో మూడు, ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లలో భారత్ పాల్గొంటుంది. బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్ ఈ నెల 19 నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ చెన్నై వేదికగా జరుగనుంది. రెండో టెస్ట్ కాన్పూర్ వేదికగా సెప్టెంబర్ 27 నుంచి ప్రారంభం కానుంది. బంగ్లాతో రెండు టెస్ట్‌ల అనంతరం భారత్ అదే జట్టుతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. మూడు టీ20లు గ్వాలియర్, ఢిల్లీ, హైదరాబాద్ వేదికలుగా అక్టోబర్ 6, 9, 12 తేదీల్లో జరుగనున్నాయి.తొలి టెస్ట్‌కు భారత జట్టు..రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, సర్ఫరాజ్ ఖాన్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, ధృవ్ జురెల్, రిషబ్ పంత్, మొహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్‌దీప్, యశ్ దయాల్, జస్ప్రీత్ బుమ్రాచదవండి: సచిన్ మరో రికార్డు బద్దలు కొట్టేందుకు రెడీగా ఉన్న కోహ్లి -
టీమిండియా స్టార్ ప్లేయర్‌కు సర్జరీ.. మూడు నెలలు ఆటకు దూరం
కొంత కాలంగా గాయంతో బాధపడుతున్న టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ ఎట్టకేలకు తన కుడికాలికి సర్జరీ చేయించుకున్నాడు. లండన్‌లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యులు ఠాకూర్‌కు శస్త్ర చికిత్స నిర్వహించారు.అయితే తన శస్త్రచికిత్స విజయవంతమైనట్లు శార్దూల్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఆస్పత్రి బెడ్‌పై ఉన్న ఫోటోను ఠాకూర్ షేర్ చేశాడు. నా సర్జరీ విజయవంతంగా నిర్వహించబడింది అంటూ క్యాప్షన్‌గా ఠాకూర్ ఇచ్చాడు. కాగా ఠాకూర్ కుడి కాలి పాదానికి శస్త్రచికిత్స జరగడం ఇది రెండో సారి. ఐదేళ్ల క్రితం 2019లో తొలిసారి శార్ధూల్ సర్జరీ చేయించుకున్నాడు. అయితే ఈ గతేడాది దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా గాయం మళ్లీ తిరగబెట్టింది.దీంతో మరోసారి అతడు శస్త్రచికిత్స చేసుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో అతడు మూడు నెలల పాటు ఆటకు దూరంగా ఉండనున్నాడు. శార్ధూల్ తిరిగి మళ్లీ ఈ ఏడాది ఆఖరిలో జరగనున్న రంజీ ట్రోఫీతో పునరాగామనం చేసే ఛాన్స్ ఉంది. కాగా ఐపీఎల్-2024లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఠాకూర్ ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే. -
Ranji- శార్దూల్ ఏమన్నాడో విన్నాను: ద్రవిడ్
దేశవాళీ క్రికెట్లో మ్యాచ్‌ల మధ్య ఎక్కువ విరామం ఉండాలన్న టీమిండియా పేస్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ వ్యాఖ్యలపై హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందించాడు. శార్దూల్ మాదిరే మెజారిటీ ఆటగాళ్లు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిస్తే తప్పక పరిగణనలోకి తీసుకోవాలని బీసీసీఐకి సూచించాడు. కాగా జాతీయ జట్టు తరఫున విధుల్లో లేనప్పుడు రంజీల్లో కచ్చితంగా ఆడాలంటూ భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆటగాళ్లను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే ముంబై తరుఫు బరిలోకి దిగిన శార్దూల్ ఠాకూర్ సెమీ ఫైనల్లో అదరగొట్టాడు. అలా అయితే కష్టమే కదా తమిళనాడుతో జరిగిన ఈ మ్యాచ్‌లో సంచలన సెంచరీ(109)తో జట్టును ఫైనల్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో మ్యాచ్ అనంతరం అతడు మాట్లాడుతూ.. ‘‘కేవలం మూడు రోజుల గ్యాప్‌లో వరుసగా 10 మ్యాచ్‌లు ఆడటం అంటే దేశవాళీ క్రికెటర్లకు చాలా కష్టం. ముఖ్యంగా ఫాస్ట్‌బౌలర్లు ఎక్కువగా గాయాలబారిన పడే అవకాశం ఉంటుంది. గతంలో రెగ్యులర్ మ్యాచ్‌లకు మూడు రోజులు, నాకౌట్ మ్యాచ్‌లకు ఐదు రోజుల విరామం ఉండేది. కానీ.. ఇప్పుడు అన్నింటికి కేవలం మూడు రోజుల వ్యవధే ఉంటోంది’’ అని పేర్కొన్నాడు. శరీరాలను పణంగా పెడుతోంది వాళ్లే ఈ నేపథ్యంలో... ఇంగ్లండ్‌పై టీమిండియా 4-1 సిరీస్ విజయం తర్వాత హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు ఈ విషయం గురించి ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘ఈ కామెంట్లు చేసింది శార్దూల్ అనుకుంటా.. అతడే కాదు చాలా మంది క్రికెటర్లు ఇలాంటి అభిప్రాయాలు వ్యక్తపరిచారు. ఇండియాలో లాంటి పెద్ద దేశంలో ప్రయణాలు, విరామం లేని షెడ్యూళ్లు అంటే కష్టమే. ఆటగాళ్ల ఇబ్బందుల గురించి తప్పక తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే.. విరామం లేని ఆట కోసం వారి శరీరాల(ఆరోగ్యాన్ని)ను పణంగా పెడుతోంది వాళ్లే. కాబట్టి.. ఇలాంటి అంశాల్ని లేవనెత్తుతూ వారు గళం వినిపించినపుడు తప్పక పరిగణనలోకి తీసుకోవాలి. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా పలు మార్పులు చేర్పులు ఉండేలా షెడ్యూళ్లను ఎలా ప్లాన్ చేసుకోవాలో ఆలోచించుకోవాలి’’ అని రాహుల్ ద్రవిడ్ శార్దూల్ ఠాకూర్ వంటి ఆటగాళ్లకు అండగా నిలిచాడు. ఆధునిక యుగంలో అవసరం లేదనుకున్న కొన్ని టోర్నీల నిర్వహణ గురించి.. ఆటగాళ్లు, కోచ్‌ల నుంచి అభిప్రాయాలు సేకరించి పునరాలోచన చేస్తే బాగుంటుందంటూ కీలక వ్యాఖ్యలు చేశాడు. చదవండి: షూ కొనుక్కోవడానికీ డబ్బు లేదు.. అతడే ఆదుకున్నాడు -
షూ కొనేందుకు డబ్బు లేదు.. అతడే ఆదుకున్నాడు: శార్దూల్ భావోద్వేగం
“When I did not have money to buy shoes: ‘‘ఇదే తన చివరి ఫస్ట్‌క్లాస్ మ్యాచ్. తనతో పాటు నాకు కూడా భావోద్వేగ సమయం. చిన్ననాటి నుంచే అతడి ఆటను గమనిస్తూ ఉన్నాను. బౌలింగ్‌లో నాకెన్నో నైపుణ్యాలు నేర్పించాడు. అంతేకాదు.. షూ కొనడానికి నా దగ్గర డబ్బు లేని సమయంలో.. తన దగ్గర ఉన్న బూట్ల జతలు నాకు ఇచ్చాడు. కెరీర్ ఆరంభంలో నాకెంతో సహాయం చేశాడు’’ అని టీమిండియా క్రికెటర్, ముంబై ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ ఉద్వేగానికి లోనయ్యాడు. I.C.Y.M.I The Mumbai team gave a Guard Of Honour on Day 1 to Dhawal Kulkarni, who is playing his final first-class game 👏@dhawal_kulkarni | @IDFCFIRSTBank | #Final | #MUMvVID Follow the match ▶️ https://t.co/k7JhkLhOID pic.twitter.com/LTCs0142fc — BCCI Domestic (@BCCIdomestic) March 11, 2024 కాగా రంజీ ట్రోఫీ 2023-24 సీజన్ ఫైనల్‌కు చేరుకున్న ముంబై.. టైటిల్ కోసం విదర్భతో పోటీ పడుతోంది. ఇరు జట్ల మధ్య ఆదివారం ఫైనల్ మ్యాచ్ మొదలైంది. టాస్ ఓడిన ముంబై తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు పృథ్వీ షా(46), భూపేన్ లల్వాణి(37) మెరుగైన ఆరంభమే అందించినా.. విదర్భ బౌలర్ల దెబ్బకు మిడిలార్డర్ కుప్పకూలింది. ఫలితంగా 111 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన శార్దుల్ ఠాకూర్ (69 బంతుల్లో 75; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) విదర్భ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. కేవలం 37 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేసిన శార్దుల్ చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. దీంతో 224 పరుగుల వద్ద ముంబై తొలి ఇన్నింగ్స్ ముగిసింది. అనంతరం.. తొలి రోజే బ్యాటింగ్‌కు దిగిన విదర్భను ముంబై పేసర్ ధవళ్ కులకర్ణి దెబ్బకొట్టాడు. The experience of Dhawal Kulkarni provides Mumbai a wicket in the evening session! Vidarbha lose the crucial wicket of Karun Nair. Follow the match ▶️ https://t.co/L6A9dXYmZA#RanjiTrophy | #MUMvVID | #Final | @IDFCFIRSTBank pic.twitter.com/VNk7HAkgSU — BCCI Domestic (@BCCIdomestic) March 10, 2024 ధవళ్ కులకర్ణిని అభినందిస్తున్న సహచరులు (PC: PTI) మరో పేసర్ శార్దూల్ ఠాకూర్ కూడా రాణించాడు. తొలిరోజు ఆట ముగిసే ధవళ్ రెండు, శార్దూల్ ఒక వికెట్ దక్కించుకున్నారు. ఈ క్రమంలో ఆట పూర్తయ్యేసరికి విదర్భ 3 వికెట్లు కోల్పోయి 31 పరుగులు మాత్రమే చేసింది. ధవళ్ కులకర్ణి రిటైర్మెంట్ ఇదిలా ఉంటే.. 35 ఏళ్ల ధవళ్ కులకర్ణి ఈ మ్యాచ్ తర్వాత ఫస్ట్‌క్లాస్ క్రికెట్ నుంచి కూడా సెలవు తీసుకోకున్నాడు. ఇప్పటికే రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించిన ఈ రైటార్మ్ పేసర్.. మోహిత్ అవస్థి గాయం కారణంగా విదర్భతో ఫైనల్ మ్యాచ్ తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ నేపథ్యంలో తొలి రోజు ఆట అనంతరం శార్దూల్ ఠాకూర్ మాట్లాడుతూ.. ధవళ్ కులకర్ణితో తన అనుబంధం గురించి గుర్తుచేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా తాను బాధపడిన సమయంలో కులకర్ణి తనకు అండగా నిలబడ్డాడంటూ అభిమానం చాటుకున్నాడు. చదవండి: Ind vs Eng 2024: టీమిండియా నయా సంచలనాలు.. ధనాధన్ దంచికొట్టి హీరోలుగా! -
మరోసారి రెచ్చిపోయిన శార్దూల్ ఠాకూర్
టీమిండియా ఆల్‌రౌండర్, ముంబై ప్లేయర్ శార్దూల్ ఠాకూర్ రంజీల్లో చెలరేగిపోతున్నాడు. ఇటీవల తమిళనాడుతో జరిగిన సెమీఫైనల్లో మెరుపు శతకం (104 బంతుల్లో 109) బాది జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన శార్దూల్.. ప్రస్తుతం విదర్భతో జరుగుతున్న ఫైనల్లో విధ్వంసకర అర్దసెంచరీ (69 బంతుల్లో 75; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) చేసి తన జట్టుకు గౌరవప్రదమైన స్కోర్‌ను అందించాడు. Century in the semi-final& a brilliant 75 when the team was struggling at 111-6 in finalLORD @imShard show in #RanjiTrophy2024 🔥pic.twitter.com/U1vjWvk9Ws— CricTracker (@Cricketracker) March 10, 2024 ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. విదర్భ బౌలర్లు రెచ్చిపోవడంతో 224 పరుగులకే పరిమితమైంది. హర్ష్ దూబే (3/62), యశ్ ఠాకూర్ (3/54), ఉమేశ్ యాదవ్ (2/43), ఆదిత్య థకారే (1/36) ముంబై పతనాన్ని శాశించారు. ముంబై ఇన్నింగ్స్‌లో శార్దూల్ ఠాకూర్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ముంబై ఇన్నింగ్స్‌కు ఓపెనర్లు పృథ్వీ షా (46), భూపేన్ లాల్వాని (37) శుభారంభాన్ని అందించినప్పటికీ.. మిడిలార్డర్ వైఫల్యం ఆ జట్టు కొంప ముంచింది. ముషీర్ ఖాన్ (6), అజింక్య రహానే (7), శ్రేయస్ అయ్యర్ (7), హార్దిక్ తామోర్ (5), షమ్స్ ములానీ (13) తక్కువ స్కోర్లకే పెవిలియన్‌కు చేరారు. భీకరఫామ్‌లో ఉన్న 10, 11వ ఆటగాళ్లు తనుశ్ కోటియన్ (8), తుషార్ దేశ్‌పాండే (14) ఈ మ్యాచ్‌లో చేతులెత్తేశారు. బ్యాటింగ్‌లో రాణించిన శార్దూల్.. బౌలింగ్‌లోనూ సత్తా చాటాడు. ముంబై ఇన్నింగ్స్ అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన విదర్భను శార్దూల్ ఆదిలోనే దెబ్బకొట్టాడు. శార్దూల్ విదర్భ ఓపెనర్, ఇన్ ఫామ్ బ్యాటర్ దృవ్ షోరేను డకౌట్ చేసి పెవిలియన్‌కు పంపాడు. నాలుగు ఓవర్ల అనంతరం విదర్భ స్కోర్ వికెట్ నష్టానికి నాలుగు పరుగులుగా ఉంది. -
తమిళనాడును చిత్తు చేసిన ముంబై.. రికార్డు స్థాయిలో 48వ సారి ఫైనల్లోకి ప్రవేశం
ముంబై క్రికెట్ జట్టు రంజీ ట్రోఫీలో తమ గుత్తాధిపత్యాన్ని కొనసాగిస్తుంది. ఈ జట్టు రికార్డు స్థాయిలో 48వ సారి ఫైనల్లోకి ప్రవేశించింది. రంజీ ట్రోఫీ చరిత్రలో ఏ జట్టు ఇన్ని సార్లు ఫైనల్స్‌కు అర్హత సాధించలేదు. ముంబై తర్వాత ఆత్యధికంగా (14) కర్ణాటక/మైసూర్ ఫైనల్స్‌కు చేరింది. ఈ రెండు జట్ల తర్వాత ఢిల్లీ (15), మధ్యప్రదేశ్/హోల్కర్ (12), బరోడా (9), సౌరాష్ట్ర (5), విదర్భ (2), బెంగాల్ (15), తమిళనాడు/మద్రాస్ (12), రాజస్థాన్ (10), హైదరాబాద్ (5) అత్యధిక సార్లు ఫైనల్స్‌కు అర్హత సాధించాయి. దేశవాలీ టోర్నీలో 48 సార్లు ఫైనల్స్‌కు చేరిన ముంబై ఏ జట్టుకు ఊహకు సైతం అందని విధంగా 41 సార్లు టైటిల్‌ను కైవసం చేసుకుంది. ప్రస్తుతం డిఫెండింగ్ ఛాంపియన్‌గా సౌరాష్ట్ర ఉంది. ఈ జట్టు అనూహ్య రీతిలో క్వార్టర్ ఫైనల్లోనే ఇంటిముఖం పట్టింది. మ్యాచ్ విషయానికొస్తే.. ఇవాళ (మార్చి 4) ముగిసిన రెండో సెమీఫైనల్లో ముంబై తమిళనాడును ఇన్నింగ్స్ 70 పరుగుల తేడాతో చిత్తు చేసింది. శార్దూల్ ఠాకూర్ ఆల్‌రౌండ్ షోతో (109, 4 వికెట్లు) ముంబై గెలుపులో కీలకపాత్ర పోషించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన తమిళనాడు తొలి ఇన్నింగ్స్‌లో 146 పరుగులకే కుప్పకూలింది. అనంతరం ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 378 పరుగుల భారీ స్కోర్ చేసింది. శార్దూల్ ఠాకూర్ మెరుపు సెంచరీతో విరుచుకుపడ్డాడు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో సైతం చేతులెత్తేసిన తమిళనాడు 162 పరుగులకే ఆలౌటై ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకున్న శార్దూల్ ఠాకూర్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. మరోవైపు మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న తొలి సెమీఫైనల్లో విదర్భ 199 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. ప్రస్తుతం ఆట మూడో రోజు కొనసాగుతుంది. -
శార్దూల్, హిమాన్షు శతకాలు.. ముంబై, మధ్యప్రదేశ్ పైచేయి
రంజీ ట్రోఫీ 2024 సెమీఫైనల్స్‌లో ముంబై, మధ్యప్రదేశ్ జట్లు పైచేయి సాధించాయి. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఈ రెండు జట్లు.. తమతమ ప్రత్యర్దుల కంటే మెరుగైన స్థితిలో ఉన్నాయి. ముంబై తమిళనాడుపై.. మధ్యప్రదేశ్ విదర్భపై ఆధిక్యతను ప్రదర్శిస్తున్నాయి. హిమాన్షు సూపర్ సెంచరీ.. నాగ్‌పూర్‌లో జరుగుతున్న తొలి సెమీఫైనల్లో విదర్భ రెండో రోజు ఆట ముగిసే సమయానికి సెకెండ్ ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 13 పరుగులు చేసింది. ఈ జట్టు మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 69 పరుగులు వెనుకపడి ఉంది. అథర్వ తైడే (2) ఔట్ కాగా.. దృవ్ షోరే (10), అక్షయ్ వాఖరే (1) క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు హిమాన్షు మంత్రి (126) సూపర్ సెంచరీతో కదంతొక్కడంతో మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 252 పరుగులు చేసింది. హిమాన్షు మినహా మధ్యప్రదేశ్ ఇన్నింగ్స్‌లో ఎవరూ రాణించలేకపోయారు. ఉమేశ్ యాదవ్ (3/40), యశ్ ఠాకూర్ (3/51), వాఖరే (2/68), సర్వటే (1/48) మధ్యప్రదేశ్ పతనాన్ని శాశించారు. దీనికి ముందు ఆవేశ్ ఖాన్ (4/49) విజృంభించడంతో విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 170 పరుగులకే ఆలౌటైంది. కరుణ్ నాయర్ (63) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. శతక్కొట్టిన శార్దూల్.. ముంబై వేదికగా తమిళనాడుతో జరుగుతున్న రెండో సెమీఫైనల్లో ముంబై ఆధిక్యత ప్రదర్శిస్తుంది. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన శార్దూల్ (109) మెరుపు శతకంతో విరుచుకుపడటంతో ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 353 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. 10, 11 స్థానాల్లో వచ్చి సెంచరీలతో (క్వార్టర్ ఫైనల్స్‌లో) సంచలనం సృష్టించిన తనుశ్ కోటీయన్ (74), తుషార్ దేశ్ పాండే (17) క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం ముంబై 207 పరుగుల లీడ్‌లో కొనసాగుతుంది. సాయికిషోర్ ఆరేసి (6/97) ముంబైను దెబ్బకొట్టాడు. అంతకుముందు తమిళనాడు తొలి ఇన్నింగ్స్‌లో 146 పరుగులకే కుప్పకూలింది. ముంబై బౌలర్లు సంయుక్తంగా రాణించడంతో తమిళనాడు ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. తుషార్ దేశ్ పాండే 3, ముషీర్ ఖాన్, శార్దూల్ ఠాకూర్, తనుశ్ కోటియన్ తలో 2 వికెట్లు, మోహిత్ అవస్థి ఓ వికెట్ పడగొట్టారు. తమిళనాడు ఇన్నింగ్స్‌లో విజయ్ శంకర్ (44), వాషింగ్టన్ సుందర్ (43) కాస్త పర్వాలేదనిపించగా.. మిగతా వాళ్లంతా దారుణంగా విఫలమయ్యారు. -
సెంచరీ సాధించిన శార్దూల్ ఠాకూర్.. మొట్టమొదటిది
ముంబై ఆటగాడు, టీమిండియా ప్లేయర్ శార్దూల్ ఠాకూర్ సెంచరీతో (109) మెరిశాడు. రంజీ ట్రోఫీ 2024లో భాగంగా తమిళనాడుతో జరుగుతున్న రెండో సెమీఫైనల్లో అతను ఈ ఫీట్‌ను సాధించాడు. జట్టు కష్టాల్లో (106/7) ఉన్నప్పుడు బరిలోకి దిగిన శార్దూల్.. బాధ్యతాయుతంగా ఆడి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సెంచరీని అతను కేవలం 89 బంతుల్లోనే సాధించాడు. ఇందులో 13 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. రంజీల్లో శార్దూల్‌కు ఇది మొదటి సెంచరీ. Shardul Thakur 🫡pic.twitter.com/6ySG9JOwcA — CricTracker (@Cricketracker) March 3, 2024 శార్దూల్ సెంచరీతో కదంతొక్కడంతో ముంబై తమ తొలి ఇన్నింగ్స్‌లో గౌరవప్రదమైన స్కోర్ చేసింది. 88 ఓవర్లలో ఆ జట్టు 9 వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసి, 157 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. తనుశ్ కోటియన్ (40), తుషార్ దేశ్‌పాండే క్రీజ్‌లో ఉన్నారు. ముంబై ఇన్నింగ్స్‌లో ముషీర్ ఖాన్ (55) అర్ద సెంచరీతో రాణించగా.. హార్దిక్ తామోర్ (35) పర్వాలేదనిపించాడు. సాయికిషోర్ (6/79) ముంబైని ముప్పుతిప్పలు పెట్టాడు. కుల్దీప్ సేన్ 2, సందీప్ వారియర్ ఓ వికెట్ దక్కించకున్నారు. దీనికి ముందు తొలి ఇన్నింగ్స్‌లో తమిళనాడు 146 పరుగులకే కుప్పకూలింది. ముంబై బౌలర్లు సంయుక్తంగా రాణించడంతో తమిళనాడు ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. తుషార్ దేశ్ పాండే 3, ముషీర్ ఖాన్, శార్దూల్ ఠాకూర్, తనుశ్ కోటియన్ తలో 2 వికెట్లు, మోహిత్ అవస్థి ఓ వికెట్ పడగొట్టారు. తమిళనాడు ఇన్నింగ్స్‌లో విజయ్ శంకర్ (44), వాషింగ్టన్ సుందర్ (43) కాస్త పర్వాలేదనిపించగా.. మిగతా వాళ్లంతా దారుణంగా విఫలమయ్యారు. -
రికార్డుల్లోకెక్కిన తమిళనాడు కెప్టెన్
తమిళనాడు రంజీ జట్టు కెప్టెన్ సాయికిషోర్ రికార్డు పుటల్లోకెక్కాడు. ముంబైతో జరుగుతున్న రెండో సెమీఫైనల్లో 6 వికెట్లు తీయడం ద్వారా ప్రస్తుత సీజన్లో తన వికెట్ల సంఖ్యను 52 పెంచుకున్నాడు. తద్వారా ఓ రంజీ సీజన్లో 50 అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టిన మూడో తమిళ బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. అలాగే ప్రస్తుత సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గానూ నిలిచాడు. ఈ సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో సాయికిషోర్ తర్వాత అజిత్ రామ్ (41), ధరేంద్ర సిన్హ్ జడేజా (41), హితేశ్ వాలుంజ్ (41), గౌరవ్ యాదవ్ (41) ఉన్నారు. ఇదిలా ఉంటే, ముంబైతో జరుగుతున్న మ్యాచ్‌లో తమిళనాడు తడబాటుకు గురైంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న తమిళనాడు.. ముంబై బౌలర్లు సంయుక్తంగా రాణించడంతో 146 పరుగులకే కుప్పకూలింది. తుషార్ దేశ్ పాండే 3, ముషీర్ ఖాన్, శార్దూల్ ఠాకూర్, తనుశ్ కోటియన్ తలో 2 వికెట్లు, మోహిత అవస్థి ఓ వికెట్ పడగొట్టారు. తమిళనాడు ఇన్నింగ్స్‌లో విజయ్ శంకర్ (44), వాషింగ్టన్ సుందర్ కాస్త పర్వాలేదనిపించగా.. మిగతా వాళ్లంతా దారుణంగా విఫలమయ్యారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ముంబై... శార్దూల్ ఠాకూర్ (82 నాటౌట్), ముషీర్ ఖాన్ (55) రాణించడంతో రెండో రోజు మూడో సెషన్ సమయానికి 8 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. హార్దిక్ తామోర్ (35) ఓ మోస్తరు స్కోర్ చేయగా.. శార్దూల్‌కు జతగా నుశ్ కోటియన్ (20) క్రీజ్‌లో ఉన్నాడు. సాయికిషోర్ (6/79) ముంబైని ముప్పుతిప్పలు పెట్టాడు. సందీప్ వారియర్, కుల్దీప్ సేన్ తలో వికెట్ దక్కించకున్నారు. ప్రస్తుతం ముంబై 108 పరుగుల లీడ్‌లో ఉంది. -
దుమ్ములేపిన శార్దూల్, తుషార్.. విఫలమైన పృథ్వీ షా
రంజీ ట్రోఫీ 2023-24 సీజన్ రెండో సెమీ ఫైనల్లో ముంబై- తమిళనాడు తలపడుతున్నాయి. శరద్ పవార్ క్రికెట్ అకాడమీలో శనివారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన తమిళనాడు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ముంబై పేసర్ల దెబ్బకు కేవలం 146 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. తొలుత.. ‘లార్డ్’ శార్దూల్ ఠాకూర్.. తమిళనాడు ఓపెనర్ సాయి సుదర్శన్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకుని డకౌట్‌గా వెనక్కిపంపాడు. ఆ తర్వాత మరో ఇద్దరు ఫాస్ట్‌బౌలర్లు మోహిత్ అవస్థి, తుషార్ దేశ్‌పాండే తమిళ బ్యాటర్ల పనిపట్టారు. మోహిత్.. ఎన్ జగదీశన్(4) రూపంలో వికెట్ దక్కించుకోగా.. ప్రదోష్ పాల్(8), కెప్టెన్ సాయి కిషోర్(1), ఇంద్రజిత్ బాబా(11) వికెట్లు పడగొట్టాడు. ఇక ప్రమాదకరంగా మారుతున్న విజయ్ శంకర్(44)ను శార్దూల్ ఠాకూర్ అవుట్ చేసి మరోసారి బ్రేక్ అందించగా.. అర్ధ శతకం దిశగా వెళ్తున్న వాషింగ్టన్ సుందర్(43)ను స్పిన్నర్ తనుశ్ కొటియాన్ పెవిలియన్‌కు పంపాడు. ఓవరాల్‌గా తమిళనాడు తొలి ఇన్నింగ్స్‌లో పేసర్లు శార్దూల్ రెండు, తుషార్ దేశ్‌పాండే మూడు, మోహిత్ అవస్థి ఒక వికెట్ తీయగా.. స్పిన్నర్లు తనుశ్ కొటియాన్, ముషీర్ ఖాన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఈ క్రమంలో తొలిరోజే తమిళనాడు ఆలౌట్ చేసి.. బ్యాటింగ్ మొదలుపెట్టిన ముంబైకి కూడా శుభారంభం లభించలేదు. ఓపెనర్లు పృథ్వీ షా(5), భూపేన్ లల్వానీ(15) పూర్తిగా విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో శనివారం నాటి ఆట పూర్తయ్యేసరికి ముంబై తమ తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల నష్టానికి 45 పరుగులు చేసింది. తమిళనాడు కంటే ప్రస్తుతం 101 పరుగులు వెనుకబడి ఉంది. Early Breakthroughs for Mumbai 🙌 Shardul Thakur and Mohit Avasthi get the big wickets of Sai Sudharsan and N Jagadeesan, respectively 👌👌@IDFCFIRSTBank | #RanjiTrophy | #MUMvTN | #SF2 Follow the match ▶️ https://t.co/697JfqUC9i pic.twitter.com/H1cgkXWzpO — BCCI Domestic (@BCCIdomestic) March 2, 2024 -
రెచ్చిపోయిన చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్లు
రంజీ ట్రోఫీ 2024 సీజన్లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 16) మొదలైన వేర్వేరు మ్యాచ్‌ల్లో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్లు రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబే, శార్దూల్ ఠాకూర్ ఇరగదీశారు. సర్వీసెస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్ (మహారాష్ట్ర) తృటిలో సెంచరీ (96) చేజార్చుకోగా.. అసోంతో జరుగుతున్న మ్యాచ్‌లో శివమ్ దూబే మెరుపు శతకంతో (95 బంతుల్లో 101 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) విరుచుకుపడ్డాడు. ఇదే మ్యాచ్‌లో మరో సీఎస్కే ప్లేయర్ శార్దూల్ ఠాకూర్ బంతితో వీరవిహారం చేశాడు. శార్దూల్ కేవలం 21 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. ఇలా ఒకే రోజు ముగ్గురు సీఎస్కే ఆటగాళ్లు సత్తా చాటడంతో ఆ ఫ్రాంచైజీ అభిమానులు సంబురపడిపోతున్నారు. ఈసారి కూడా ప్రత్యర్దులకు దబిడిదిబిడే అంటూ రచ్చ చేస్తున్నారు. సీఎస్కే ఆటగాళ్లు ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే.. టైటిల్ నిలబెట్టుకోవడం ఖాయమని కామెంట్స్ చేస్తున్నారు. గతేడాది ఐపీఎల్లో ధోని నేతృత్వంలో సీఎస్కే ఐదో సారి ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. రాబోయే సీజన్‌కు సంబంధించి సీఎస్కే ఇప్పటికే ట్రైనింగ్ క్యాంప్‌ను స్టార్ట్ చేసింది. కెప్టెన్ ధోనితో పాటు అందుబాటులో ఉన్న ప్లేయర్లతో క్యాంప్ నడుస్తుంది. కాగా, సీఎస్కే ఆటగాళ్లు రాణించడంతో అసోంతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై పట్టుబిగించింది. శార్దూల్ ఠాకూర్ ఆరేయడంతో అసోం తొలి ఇన్నింగ్స్‌లో 84 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ముంబై.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. 101 పరుగులతో దూబే, 2 పరుగులతో శార్దూల్ క్రీజ్‌లో ఉన్నారు. ఇప్పటికే ఆ జట్టు 133 పరుగుల లీడ్‌లో ఉంది. సర్వీసెస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రుతురాజ్ రాణించినప్పటికీ మహారాష్ట్ర తడబడింది. సర్వీసెస్ బౌలర్లు అర్జున్ శర్మ (5/59), వరుణ్ చౌదరీ (4/39) విజృంభించడంతో ముంబై 225 పరుగులకే ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన సర్వీసెస్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 27 పరుగులు చేసింది. -
మెరుపు శతకంతో విరుచుకుపడిన శివమ్ దూబే
రంజీ ట్రోఫీ 2024లో భాగంగా అసోంతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఆటగాడు శివమ్ దూబే మెరుపు శతకంతో విరుచుకుపడ్డాడు. కేవలం 87 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో శతక్కొట్టాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన దూబే అసోం బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డాడు. ముంబై ఇన్నింగ్స్‌లో రెండో అత్యధిక స్కోర్ 31 పరుగులు (షమ్స్ ములానీ) కాగా.. దూబే ఒక్కడే వన్ మ్యాన్ షో నడిపించాడు. గత మ్యాచ్‌లో రెస్ట్ తీసుకున్న దూబే రీఎంట్రీలో అదగొట్టాడు. ఈ ఇన్నింగ్స్‌లో 95 బంతులు ఎదుర్కొన్న దూబే 101 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతనితో పాటు శార్దూల్ ఠాకూర్ (2) క్రీజ్‌లో ఉన్నాడు. ముంబై ఇన్నింగ్స్‌లో పృథ్వీ షా 30, భుపేన్ లాల్వాని 0, హార్దిక్ తామోర్ 22, కెప్టెన్ అజింక్య రహానే 22, సుయాంశ్ షేడ్గే 0, షమ్స ములానీ 31 పరుగులు చేసి ఔటయ్యారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ముంబై స్కోర్ తొలి ఇన్నింగ్స్‌లో 217/6గా ఉంది. అసోం బౌలర్లలో దిబాకర్ జోహ్రి, రాహుల్ సింగ్ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. సునీల్ లచిత్, కునాల్ శర్మ తలో వికెట్ దక్కించుకున్నారు. ఇవాళే మొదలైన ఈ మ్యాచ్‌లో అసోం టాస్ ఓడి ముంబై ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసింది. అసోం బ్యాటర్లను శార్దూల్ ఠాకూర్ ఉతికి ఆరేశాడు (6/21). శార్దూల్‌తో పాటు షమ్స్ ములానీ (2/8), తుషార్ దేశ్‌పాండే (1/32), మోహిత్ అవస్థి (1/10) కూడా చెలరేగడంతో అసోం ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. ఆ జట్టు 84 పరుగులకే ఆలౌటైంది. అసోం ఇన్నింగ్స్‌లో అభిషేక్ ఠాకూరీ (31), సాహిల్ జైన్ (12), అబ్దుల్ అజీజ్ ఖురేషి (15) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. -
నిప్పులు చెరిగిన శార్దూల్ ఠాకూర్.. 84 పరుగులకే కుప్పకూలిన ప్రత్యర్ది
రంజీ ట్రోఫీ 2024లో భాగంగా ఆసోంతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై మీడియం పేసర్ శార్దూల్ ఠాకూర్ నిప్పులు చెరిగాడు. కేవలం 21 పరుగులిచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు. ఫలితంగా అసోం 84 పరుగులకే కుప్పకూలింది. శార్దూల్‌తో పాటు షమ్స్ ములానీ (2/8), తుషార్ దేశ్‌పాండే (1/32), మోహిత్ అవస్థి (1/10) కూడా చెలరేగడంతో అసోం ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. అసోం ఆటగాళ్లలో అభిషేక్ ఠాకూరీ (31), సాహిల్ జైన్ (12), అబ్దుల్ అజీజ్ ఖురేషి (15) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. SHARDUL THAKUR MASTERCLASS 🤯 - Thakur took 6 wickets for just 21 runs against Assam in Ranji Trophy. pic.twitter.com/usthQsPu2Z — Johns. (@CricCrazyJohns) February 16, 2024 అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ముంబై టీ విరామం (24.4 ఓవర్లు) సమయానికి నాలుగు వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసింది. ముంబై ఓపెనర్లలో పృథ్వీ షా వేగంగా 30 పరుగులు చేసి ఆకట్టుకోగా.. భుపేన్ లల్వాని డకౌటయ్యాడు. వన్‌డౌన్‌లో బరిలోకి దిగిన హార్దిక్ తామోర్ 22 పరుగులు చేయగా.. ఐదో నంబర్ ఆటగాడు సుయాంశ్ షేడ్గే డకౌటయ్యాడు. కెప్టెన్ అజింక్య రహానే (18), శివమ్ దూబే (26) క్రీజ్‌లో ఉన్నారు. అసోం బౌలర్లలో రాహుల్ సింగ్ 2, సునలీ లచిత్, దిబాకర్ జోహ్రి తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై తొలుత బౌలింగ్ ఎంచుకుంది. -
శివం దూబే దూరం.. శార్దూల్ ఠాకూర్ ఎంట్రీ!
Ranji Trophy 2023-24: ముంబై తాత్కాలిక కెప్టెన్ శివం దూబే జట్టుకు దూరమయ్యాడు. కండరాల నొప్పితో బాధపడుతున్న అతడికి సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు. కాగా అఫ్గనిస్తాన్‌తో టీమిండియా టీ20 సిరీస్ ముగించుకున్న తర్వాత ఆల్‌రౌండర్ శివం దూబే ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌పై దృష్టి పెట్టాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌తో పాటు టీమిండియా టెస్టు రేసులోనూ అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు. ఇందులో భాగంగా ముంబై తరఫున రంజీ ట్రోఫీ 2023-24 సీజన్ బరిలో దిగాడు. ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్‌లలో రెండు హాఫ్ సెంచరీలతో పాటు ఓ శతకం(117) బాదాడు. బౌలింగ్‌లోనూ ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. బెంగాల్‌తో మ్యాచ్‌లో కెప్టెన్‌గా హిట్ ఈ క్రమంలో అజింక్య రహానే గైర్హాజరీలో ఆఖరిగా ముంబై ఆడిన మ్యాచ్‌లో కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం దక్కించుకున్నాడు. బెంగాల్‌తో ఆదివారం ముగిసిన ఈ మ్యాచ్‌లో దూబే 72 పరుగులు సాధించాడు. అదే విధంగా రెండు వికెట్లు కూడా తీసి ముంబై విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే, బెంగాల్‌తో మ్యాచ్ సందర్భంగా శివం దూబే కండరాలు పట్టేసినట్లు సమాచారం. ఈ విషయం గురించి ముంబై చీఫ్ సెలక్టర్ రాజు కులకర్ణి మాట్లాడుతూ.. ముందు జాగ్రత్త చర్యలో భాగంగానే దూబేకు రెస్ట్ ఇచ్చినట్లు తెలిపాడు. శార్దూల్ ఠాకూర్ ఎంట్రీ నాకౌట్ మ్యాచ్‌ల సమయానికి అతడు అందుబాటులోకి వస్తాడని తెలిపాడు. ఇదిలా ఉంటే.. టీమిండియా ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ ముంబై తరఫున రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. సౌతాఫ్రికా టూర్లో గాయపడిన అతడు రంజీ బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. ఫిబ్రవరి 9 నుంచి ఛత్తీస్‌గఢ్‌తో మ్యాచ్‌కు కెప్టెన్ అజింక్య రహానే తిరిగి జట్టుతో చేరనున్నాడు. చదవండి: అరిచీ.. అరిచీ.. నా గొంతు పోయింది: రోహిత్ శర్మ వ్యాఖ్యలు వైరల్ -
IND Vs SA: 'దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు.. అతడి కంటే అశ్విన్‌ను తీసుకోవడమే బెటర్'
కేప్ టౌన్‌లోని న్యూలాండ్స్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా దక్షిణాఫ్రికా-భారత్ మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో ఘోర ఓటమి చవిచూసిన టీమిండియా.. ఈ మ్యాచ్‌లో తిరిగి పుంజుకుని సిరీస్‌ను సమం చేయాలని పట్టుదలతో ఉంది. మరోవైపు దక్షిణాఫ్రికా మాత్రం తమ సొంత గడ్డపై మరోసారి భారత్‌ను చిత్తు చేయాలని వ్యూహాలు రచిస్తోంది. ఇక ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే కేప్‌టౌన్‌కు చేరుకున్న భారత జట్టు మంగళవారం తమ ఆఖరి ప్రాక్టీస్ సెషన్లో పాల్గోనుంది. ఇక తొలి మ్యాచ్‌కు దూరమైన స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించాడు. దీంతో అతడు రెండో టెస్టుకు భారత తుది జట్టులోకి రావడం దాదాపు ఖాయమైంది. జడ్డూ ప్లేయింగ్ ఎలెవన్‌లోకి వస్తే వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌పై వేటు పడే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. రెండో టెస్టులో ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్‌కు బదులుగా అశ్విన్ ఆడించాలని శ్రీకాంత్ సూచించాడు. అశ్విన్‌ను రెండో టెస్టులో కూడా కొనసాగించాలి. శార్దూల్ ఠాకూర్ కంటే అశ్విన్ బెటర్ అని నేను భావిస్తున్నాను. జడేజా ఫిట్నెస్ సాధించినప్పటికీ శార్దూల్ స్థానంలో అశ్విన్‌ను ఆడించాలి. అశ్విన్ ఐదు వికెట్ల హాల్స్ సాధించికపోయినప్పటికీ.. ఒకట్రెండు వికెట్లైనా తీయగలడు. అతడు జడేజాతో కలిసి ప్రత్యర్ధి బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలడు. వీరిద్దరూ కలిసి నాలుగు-ఐదు వికెట్ల తీయగలరు. కేప్‌టౌన్‌లో దక్షిణాఫ్రికా బ్యాటర్లను కట్టడి చేయాలంటే స్పిన్నర్లే కీలకం. భారత్ గట్టిగా ప్రయత్నిస్తే అక్కడ కూడా సఫారీలను ఓడించవచ్చు. కేవలం ఒక్క టెస్టు మాత్రమే ఆడిన పేసర్ ప్రసిద్ద్ కృష్ణను పక్కనపెట్టడం సరైన నిర్ణయం కాదు. కాబట్టి తొలి టెస్టులో దారుణంగా విఫలమైన శార్ధూల్‌పై వేటు వేయడం బెటర్ అని తన యూట్యూబ్ ఛానల్లో శ్రీకాంత్ పేర్కొన్నాడు. చదవండి: Aus Vs Pak 3rd Test: వార్నర్ ఫేర్వెల్ టెస్టు.. ఆస్ట్రేలియా తుది జట్టు ప్రకటన -
టీమిండియాకు భారీ షాక్.. స్టార్ ఆల్‌రౌండర్‌కు గాయం
సెంచూరియన్: తొలి టెస్టులో ఓడిన భారత్‌కు మరో దెబ్బ! బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా సెంచూరియన్ టెస్టు ఆడిన శార్దుల్ ఠాకూర్ గాయపడ్డాడు. అయితే ఇది మ్యాచ్ సమయంలో కాదు! నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా అతని ఎడమ భుజానికి గాయమైంది. వెంటనే జట్టు ఫిజియో ఐస్ ప్యాక్‌తో ఉపశమన సపర్యలు చేశాడు. అనంతరం మళీ ప్రాక్టీస్‌కు దిగలేదు. దీంతో అతను కేప్‌టౌన్‌లో జనవరి 3 నుంచి జరిగే ఆఖరి టెస్టుకు దూరమయ్యే అవకాశముంది. గాయం తీవ్రతను తెలుసుకునేందుకు శార్దుల్ భుజానికి స్కానింగ్ తీయాల్సి ఉంది. దీన్నిబట్టే అతను అందుబాటులో ఉంటాడ లేదా అనే విషయంపై స్పష్టత వస్తుంది. సఫారీ బౌలర్ కొయెట్జీ అవుట్ దక్షిణాఫ్రికా పేసర్ గెరాల్డ్ కొయెట్జీ రెండో టెస్టుకు దూరమయ్యాడు. 23 ఏళ్ల బౌలర్ పొత్తికడుపు నొప్పితో సతమతమవుతున్నాడు. ఈ నొప్పితోనే తొలిటెస్టు ఆడటంతో వాపు మొదలైందని జట్టు వర్గాలు తెలిపాయి. దీంతో కొయెట్జీ కేప్‌టౌన్ టెస్టుకు అందుబాటులో లేడని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు సోషల్ మీడియా ‘ఎక్స్’ ద్వారా వెల్లడించింది. ఇదివరకే రెగ్యులర్ కెపె్టన్ బవుమా కూడా గాయంతో రెండో టెస్టుకు గైర్హాజరు కానున్నాడు. కొయెట్జీ స్థానాన్ని ఎన్గిడి, ముల్డర్లలో ఒకరితో భర్తీ చేసే అవకాశముంది. -
నెట్స్‌లో రోహిత్ ప్రాక్టీస్.. టీమిండియా స్టార్‌కు గాయం
South Africa Vs India 2nd Test: సౌతాఫ్రికాతో తొలి టెస్టులో చిత్తుగా ఓడిపోయిన టీమిండియా రెండో మ్యాచ్‌కు సన్నద్ధం అవుతోంది. లోపాలు సవరించుకుని ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగేందుకు వీలుగా నెట్స్‌లో చెమటోడుస్తోంది. ముఖ్యంగా సెంచూరియన్ టెస్టులో ఓపెనర్‌గా విఫలమైన కెప్టెన్ రోహిత్ శర్మ మరింత కఠినంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. హిట్‌మ్యాన్ కఠిన ప్రాక్టీస్ నెట్స్‌లో వైవిధ్యమైన బంతులు ఎదుర్కొంటూ కేప్‌టౌన్ టెస్టుకు పూర్తిస్థాయిలో సిద్ధమవుతున్నాడు. ఇదిలా ఉంటే.. ప్రాక్టీస్ సందర్భంగా భారత పేస్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ గాయపడినట్లు సమాచారం. త్రోడౌన్స్ ఎదుర్కొంటూ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అతడి భుజానికి గాయమైనట్లు తెలుస్తోంది. The Indian skipper @ImRo45 at Centurion nets. #INDvSA Video Courtesy: @kushansarkar pic.twitter.com/p0pvmbkyEX — Kushan Sarkar (@kushansarkar) December 30, 2023 షార్ట్ బాల్‌ను ఆడటంలో విఫలమైన శార్దూల్.. బంతి ఎడమ భుజానికి తాకడంతో నొప్పితో విలవిల్లాడగా.. ఫిజియో వచ్చి ఐస్‌ప్యాక్ పెట్టాడు. అయితే, నొప్పి నుంచి పూర్తిగా ఉపశమనం లభించకపోవడంతో అతడు మళ్లీ బౌలింగ్ ప్రాక్టీస్‌కు కూడా అందుబాటులో ఉండలేకపోయాడు. పూర్తిగా విఫలమైన శార్దూల్.. యువ పేసర్ ఎంట్రీ! ఒకవేళ నొప్పి తీవ్రతరమైతే అతడిని స్కానింగ్ పంపాలని వైద్య సిబ్బంది భావిస్తోంది. కాగా ఒకవేళ గాయం కారణంగా శార్దూల్ ఠాకూర్ రెండో టెస్టుకు దూరమైతే అతడి స్థానంలో ఆవేశ్ ఖాన్ లేదంటే ముకేశ్ కుమార్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. అలా గాకుండా శార్దూల్ అందుబాటులో ఉన్నా కూడా మేనేజ్మెంట్ అతడిపై వేటు వేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. తొలి టెస్టులో ఆల్‌రౌండర్‌గా అతడి ప్రదర్శన దారుణంగా ఉండటమే ఇందుకు కారణం. సెంచూరియన్‌లో జరిగిన బాక్సింగ్ డే మ్యాచ్‌లో శార్దూల్ 19 ఓవర్ల బౌలింగ్‌లో ఏకంగా 100 పరుగులు ఇచ్చి పూర్తిగా నిరాశపరిచాడు. ఇక బ్యాటర్‌గా తొలి ఇన్నింగ్స్‌లో 24 పరుగులతో పర్వాలేదనిపించిన శార్దూల్ ఠాకూర్.. రెండో ఇన్నింగ్స్‌లో కేవలం రెండు పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికా- టీమిండియా మధ్య జనవరి 3 నుంచి రెండో టెస్టు మొదలుకానుంది. చదవండి: Future Legend: గిల్ సూపర్ టాలెంట్.. దిగ్గజ ఆటగాడిగా ఎదుగుతాడు! రచిన్ సైతం... STORY | Shardul Thakur gets hit on shoulder at nets in South Africa READ: https://t.co/CCreEtNC8Q VIDEO: #INDvsSA pic.twitter.com/4357zyDm3J — Press Trust of India (@PTI_News) December 30, 2023 -
IND Vs SA: దక్షిణాఫ్రికా బౌలర్ రాకాసి బౌన్సర్.. శార్దూల్‌కు తప్పిన ప్రమాదం
సెంచూరియన్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి రోజు ఆటముగిసింది. మొదటి రోజు ఆటముగిసే సమయానికి టీమిండియా 8 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. అయితే ఈ మ్యాచ్‌లో సఫారీ పేసర్లు భారత బ్యాటర్లకు చుక్కలు చూపించారు. నిప్పులు చెరిగే బంతులను సంధించారు. ఈ క్రమంలో టీమిండియా బౌలింగ్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌కు పెను ప్రమాదం తప్పింది. ఏమి జరిగిందంటే? భారత తొలి ఇన్నింగ్స్ 44 ఓవర్లో మూడో బంతిని గంటకు 148 కిలోమీటర్ల వేగంతో ప్రోటీస్ యువ పేసర్ కోయిట్జీ బౌన్సర్‌గా సంధించాడు. శార్ధూల్ ఆ బంతిని ఫుల్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతిని అంచనా వేయడంలో శార్ధూల్ విఫలమయ్యాడు. దీంతో బంతి బ్యాట్‌కు మిస్స్ అయ్యి అతడి హెల్మెట్‌కు బలంగా తాకింది. ఠాకూర్ నుదిటిపై వాపు వచ్చింది. మైదానంలో నొప్పితో విల్లావిల్లాడు. వెంటనే ఫిజియో వచ్చి కంకషన్ టెస్టు చేశాడు. ఆ తర్వాత శార్దూల్ మళ్లీ బ్యాటింగ్ ప్రారంభించాడు. రబాడ వేసిన ఓవర్లో మళ్లీ బంతి శార్ధూల్ చేతికి తగిలింది. వెంటనే ఫిజియో వచ్చి చికిత్స అందించాడు. అయితే దెబ్బ తగిలిన తర్వాతి బంతికే శార్దూల్ (33 బంతుల్లో 24) ఔటయ్యాడు. చదవండి: IND vs SA 1st Test: టీమిండియాతో తొలి టెస్టు.. దక్షిణాఫ్రికాకు బిగ్ షాక్ -
IPL 2024: స్టార్క్, కమిన్స్‌లకు భారీ ధర.. శార్దూల్ ఠాకూర్‌కు జాక్‌పాట్..!
ఐపీఎల్ 2024 వేలం రేపు (డిసెంబర్ 19) దుబాయ్‌లోని కోకాకోలా ఎరీనాలో జరుగనుంది. భారతకాలమానం ప్రకారం ఈ వేలం రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమవుతుంది. ఈ వేలానికి ముందు ఇవాళ (డిసెంబర్ 18) అదే వేదికపై మాక్ ఆక్షన్ (డమ్మీ వేలం) జరిగింది. ఈ వేలంలో పలువురు స్టార్ ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు ఎగబడ్డాయి. ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ కోసం ఆర్సీబీ చిన్న సైజ్ యుద్దమే చేసింది. ఆ జట్టు ప్రతినిధి మైక్ హెస్సన్ స్టార్క్‌ను 18.5 కోట్ల భారీ ధరకు దక్కించుకున్నాడు. మాక్ వేలంలో ఇదే అత్యధిక ధర. స్టార్క్ తర్వాత సౌతాఫ్రికా యంగ్ గన్ గెరాల్డ్ కొయెట్జీ కోసం ఫ్రాంచైజీలు ఎగబడ్డాయి. చివరికి కొయెట్జీని గుజరాత్ టైటాన్స్ 18 కోట్లకు దక్కించుకుంది. వీరిద్దరి తర్వాత ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ కోసం ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీపడ్డాయి. అంతిమంగా కమిన్స్‌ను 17.5 కోట్లకు సన్‌రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది. ఈ మాక్ ఆక్షన్‌లో ఎవరూ ఊహించని ధరకు లార్డ్ శార్దూల్ ఠాకూర్ అమ్ముడుపోయాడు. శార్దూల్‌ను పంజాబ్ కింగ్స్ 14 కోట్లకు దక్కించుకుంది. లంక పేసర్ దిల్షన్ మధుషంక, లంక స్పిన్నర్ వనిందు హసరంగ, ఆసీస్ స్టార్ బ్యాటర్, వరల్డ్‌కప్ హీరో ట్రవిస్ హెడ్ల కోసం కూడా ఫ్రాంచైజీలు తెగ పోటీపడ్డాయి. మధుషంకను కేకేఆర్ (10.5 కోట్లు), హ్యారీ బ్రూక్‌ను గుజరాత్ టైటాన్స్ ( 9.5 కోట్లు), హసరంగను (8.5 కోట్లు), ట్రవిస్ హెడ్లను (7 కోట్లు) సీఎస్కే దక్కించుకున్నాయి. మిచెల్ స్టార్క్- 18.5 కోట్లు (ఆర్సీబీ) గెరాల్డ్ కొయెట్జీ-18 కోట్లు (గుజరాత్ టైటాన్స్) పాట్ కమిన్స్- 17.5 కోట్లు (సన్‌రైజర్స్ హైదరాబాద్) శార్దూల్ ఠాకూర్-14 కోట్లు (పంజాబ్ కింగ్స్) దిల్షన్ మధుషంక-10.5 కోట్లు (కేకేఆర్) హ్యారీ బ్రూక్- 9.5 కోట్లు (గుజరాత్ టైటాన్స్) వనిందు హసరంగ-8.5 కోట్లు (సీఎస్కే) ట్రవిస్ హెడ్- 7 కోట్లు (సీఎస్కే) కాగా, మాక్ వేలంలో లభించిన ధర డమ్మీ ధర అయినప్పటికీ.. పై పేర్కొన్న ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు ఎగబడటం మాత్రం ఖాయంగా కనిపిస్తుంది. రేపు జరుగబోయే అధికారిక వేలంలో ఈ ఆటగాళ్లపై కనక వర్షం కురువడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వీరితో పాటు వరల్డ్‌కప్ హీరో, న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర కోసం కూడా ఫ్రాంచైజీలు ఎగబడవచ్చు. ఐపీఎల్ 2024 వేలం తేదీ: డిసెంబర్ 19, 2023 సమయం: మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ప్రారంభం (భారతకాలమానం ప్రకారం) వేదిక: దుబాయ్‌లోని కోకాకోలా ఎరీనా ప్రత్యక్ష ప్రసారం: స్టార్ స్పోర్ట్స్ (టీవీ) డిజిటల్: జియో సినిమా మొత్తం స్లాట్లు: 77 వేలంలో పాల్గొంటున్న మొత్తం ఆటగాళ్లు: 333 భారతీయ ఆటగాళ్లు: 214 విదేశీ ఆటగాళ్లు: 119 -
IPL 2024: ఫ్రాంచైజీలు వదిలించుకున్న ఖరీదైన ఆటగాళ్లు వీరే..! (ఫొటోలు)
-
WC 2023: టీమిండియాకు భారీ షాక్! హార్దిక్ పాండ్యా ఇక..
ICC WC 2023: వన్డే వరల్డ్‌కప్-2023లో వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా చీలమండ గాయం తీవ్రతరమైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు దూరమైన పాండ్యా.. మరికొన్ని మ్యాచ్‌లకు కూడా అందుబాటులో ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఈ మేరకు బీసీసీఐ వర్గాలు.. ‘‘పాండ్యా ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో నితిన్ పటేల్ నేతృత్వంలోని వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు. గాయం తీవ్రత ఎక్కువగానే ఉన్నట్లు కనిపిస్తోంది. లిగమెంట్ టియర్(మోకాలి జాయింట్లో) కూడా ఉందనిపిస్తోంది. కాబట్టి కనీసం రెండు వారాల పాటు విశ్రాంతి అవసరమవుతుంది. గాయం పూర్తిగా తగ్గకముందు ఎన్సీఏ అతడిని ఆడేందుకు అస్సలు పంపించదు. అయితే, వైద్య బృందం నిరంతరం పాండ్యాను పర్యవేక్షిస్తూ మేనేజ్మెంట్కు ఎప్పటికపుడు అప్డేట్ ఇస్తోంది. అతడు కోలుకునేందుకు కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది. త్వరలోనే అతడు మైదానంలో దిగేలా కృషి చేస్తోంది’’ అని పేర్కొన్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తన కథనంలో వెల్లడించింది. అయితే, పాండ్యా లీగ్ దశ ముగిసేనాటికి అందుబాటులోకి వస్తాడని భావిస్తున్న మేనేజ్మెంట్ అతడి స్థానాన్ని వేరే ప్లేయర్‌తో భర్తీ చేసేందుకు సుముఖంగా లేనట్లు తెలిపింది. కాగా ప్రపంచకప్-2023లో హార్దిక్ పాండ్యా బ్యాట్‌తో రాణించడంతో పాటు కీలక వికెట్లు తీసి బౌలింగ్‌లోనూ రాణించాడు. అయితే, మరో పేస్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ అందుబాటులో ఉన్నప్పటికీ పాండ్యా స్థానాన్ని అతడు పూర్తి స్థాయిలో భర్తీ చేయలేకపోవచ్చు. చదవండి: WC 2023: ఇంగ్లండ్‌తో మ్యాచ్.. స్టార్ పేసర్‌కు రెస్ట్! జట్టులోకి అశ్విన్.. -
‘శార్దూల్ ఎందుకు? సిరాజ్‌ను ఎందుకు ఆడిస్తున్నారు?.. అసలేంటి ఇదంతా?’
ICC WC 2023- Team India: టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌కు భారత మాజీ పేసర్ శ్రీశాంత్ అండగా నిలిచాడు. మేనేజ్మెంట్ అన్నీ ఆలోచించిన తర్వాతే తుదిజట్టును ఎంపిక చేస్తుందని.. మ్యాచ్ సాగుతున్న తీరును బట్టి విమర్శలు చేయడం సరికాదని హితవు పలికాడు. కొంతమంది ‘టోపీ మాస్టర్లు’ మాత్రం అంతా తమకే తెలుసునన్నట్లు మాట్లాడతారంటూ సిరాజ్‌ను విమర్శించిన వారిపై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో టీమిండియా ఆరంభ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై సిరాజ్ ఒక వికెట్ తీయగలిగాడు. అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లో ధారాళంగా పరుగులిచ్చి పవర్ ప్లేలో మ్యాజిక్ చేయలేకపోయినప్పటికీ 6.3 ఓవర్లలో కేవలం 26 పరుగులు మాత్రమే ఇచ్చి పొదుపుగానే బౌలింగ్ చేశాడు. అయితే, రెండో మ్యాచ్‌లో మాత్రం ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. అఫ్గనిస్తాన్‌తో ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ మైదానంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో సిరాజ్ ఏకంగా 76 పరుగులిచ్చాడు. 9 ఓవర్ల బౌలింగ్‌లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఈ నేపథ్యంలో.. మహ్మద్ షమీని కాదని సిరాజ్‌ను ఎంపిక చేసి మేనేజ్మెంట్ తప్పుచేసిందంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు వచ్చాయి. ఈ విషయంపై స్పందించిన కేరళ మాజీ బౌలర్ శ్రీశాంత్.. ‘‘మ్యాచ్ మొదలుకావడానికి ముందు.. అసలేంటి ఇదంతా? ‘‘అయ్యో.. శార్దూల్‌ను ఎందుకు ఆడిస్తున్నారు? అంటూ గగ్గోలుపెట్టారు. మ్యాచ్ మొదలైన తర్వాత.. సిరాజ్ పరుగులిస్తూ ఉంటే.. ‘‘ఈరోజు సిరాజ్‌ను ఎందుకు ఆడిస్తున్నారు?’’ అంటూ కామెంట్లు చేశారు. వాళ్లంతా ‘టోపీ మాస్టర్లు’. ఇదిలా ఉంటే.. కెమెరా మాటిమాటికీ షమీ, అశ్విన్‌పైకి గురిపెట్టి చూపిస్తూనే ఉండటం దేనికి సంకేతం. యాజమాన్యం ఎంపిక చేసిన జట్టుకు మనం మద్దతుగా నిలవాలి కదా!’’ అని స్పోర్ట్స్‌కీడాతో చెప్పుకొచ్చాడు. కాగా అఫ్గన్‌తో మ్యాచ్ సందర్భంగా టీమిండియా ఒక మార్పుతో బరిలోకి దిగిన విషయం తెలిసిందే. తదుపరి పాకిస్తాన్‌తో వెటరన్ స్పిన్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో.. పేస్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ ఆడాడు. ఈ క్రమంలో అశూను కాదని శార్దూల్‌ను ఎందుకు ఆడిస్తున్నారంటూ సునిల్ గావస్కర్ వంటి దిగ్గజాలు కెప్టెన్ రోహిత్ శర్మ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. మరికొందరు సిరాజ్‌ను టార్గెట్ చేశారు. ఈ నేపథ్యంలో శ్రీశాంత్ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇక ఆసీస్ మీద 6, అఫ్గనిస్తాన్ మీద 8 వికెట్ల తేడాతో గెలుపొందిన టీమిండియా అక్టోబరు 14న పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. చదవండి: WC: క్యాన్సర్‌తో పోరాడుతూ వరల్డ్‌కప్ ఆడాను.. డెంగ్యూ వల్ల గిల్..: యువీ -
Ind vs Pak: అతడి బ్యాటింగ్ అంతగొప్పగా ఏమీ ఉండదు.. షమీని ఆడించండి!
ICC WC 2023- Ind vs Pak: ‘‘శార్దూల్ ఠాకూర్.. మహ్మద్ షమీ వీరిద్దరిలో ఎవరిని ఆడిస్తారనే చర్చ ఎప్పుడూ నడుస్తూ ఉంటుంది. అయితే, చాలాసార్లు మేనేజ్మెంట్ శార్దూల్ వైపే మొగ్గు చూపుతుంది. ఎనిమిదో నంబర్లో బ్యాటింగ్ చేస్తాడు గనుక షమీని కాదని అతడిని తీసుకుంటారని ఇప్పటికే ఎన్నోసార్లు రుజువైంది. అయితే, అఫ్గనిస్తాన్ వంటి జట్టుతో మ్యాచ్‌లో కూడా నంబర్ 8లో బ్యాటింగ్ చేసే అవకాశం ఉంటుందా? అంటే లేదనే సమాధానం చెప్పొచ్చు. లేదంటే.. కొంతమంది బిగ్షాట్లు ఆడే ప్లేయర్లు ఉంటారు.. వాళ్లు లేకపోతే ఓటమి ఎదురవుతుందనే సందర్భాల్లో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవచ్చు. అంత గొప్ప బ్యాటరేమీ కాదు! కానీ.. ఇలాంటి టీమ్స్‌తో ఆడినపుడు లోయర్ ఆర్డర్ వరకు బ్యాటింగ్ చేసే ఛాన్స్ ఉందనుకుంటే పొరబడినట్లే! నిజానికి శార్దూల్ ఏమీ గొప్ప బ్యాటర్ కాదు. ఎనిమిదో నంబర్లో అతడు కేవలం రన్-ఏ- బాల్ ప్లేయర్ మాత్రమే. 20 బంతుల్లో 45 పరుగులు రాబట్టే రకమేమీ కాదు. అతడు అలా ఆడలేడు కూడా! ఏదేమైనా బ్యాటింగ్ ఆర్డర్లో ఎనిమిదో స్థానం వరకు డెప్త్ ఉండాలనుకుంటే వాళ్లు శార్దూల్ ఆడిస్తారు. కానీ నా అభిప్రాయం ప్రకారం పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో శార్దూల్ కంటే షమీ అవసరమే ఎక్కువగా ఉంటుంది. తదుపరి మ్యాచ్‌లో అతడిని తప్పక ఆడించాలి’’ అని టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా ఆస్ట్రేలియాతో చెన్నైలో టీమిండియా తమ తొలి మ్యాచ్ ఆడిన విషయం తెలిసిందే. చెపాక్‌లో అశ్విన్.. ఢిల్లీలో శార్దూల్ చెపాక్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ‘లోకల్ స్టార్’ రవిచంద్రన్ అశ్విన్ తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే, ఢిల్లీలో అఫ్గనిస్తాన్‌తో రెండో మ్యాచ్‌లో అశ్విన్ స్థానంలో పేస్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌ను జట్టులోకి తీసుకుంది. అరుణ్‌జైట్లీ స్టేడియంలో అదనపు సీమర్ అవసరమన్న విశ్లేషణల నడుమ ఎనిమిదో నంబర్లో బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్న శార్దూల్ వైపు మొగ్గు చూపింది. అయితే, అఫ్గనిస్తాన్‌పై మంచి రికార్డు ఉన్న షమీని కాదని శార్దూల్‌ను తీసుకోవడం సునిల్ గావస్కర్ వంటి దిగ్గజాలకు నచ్చలేదు. పాక్‌తో మ్యాచ్‌లో షమీని ఆడిస్తేనే బెటర్ ఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఈ విషయం గురించి మాట్లాడుతూ.. తన యూట్యూబ్ చానెల్ వేదికగా పైవిధంగా స్పందించాడు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో మహ్మద్ షమీని ఆడిస్తేనే జట్టుకు ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నాడు. కాగా ఆసీస్‌పై 6 వికెట్లు, అఫ్గన్‌పై 8 వికెట్ల తేడాతో గెలుపొంది ఫుల్‌జోష్‌లో ఉన్న టీమిండియా అక్టోబరు 14న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో పోరుకు సిద్ధమవుతోంది. అహ్మదాబాద్‌లోని దాదాపు లక్ష సీట్ల సామర్థ్యం గల నరేంద్ర మోదీ స్టేడియం ఇందుకు వేదిక. ఇక పాకిస్తాన్ సైతం ఆడిన రెండు మ్యాచ్‌లలో విజయాలు సాధించి జోరు మీదున్న విషయం తెలిసిందే. సాక్షి టీవీ వాట్సాప్ ఛానెల్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి చదవండి: WC 2023- Ind Vs Pak: పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు ముందు టీమిండియాకు గుడ్‌న్యూస్! కానీ.. -
ఆస్ట్రేలియాతో రెండో వన్డే.. భారత జట్టులో కీలక మార్పు! యువ పేసర్ ఎంట్రీ
తొలి వన్డేలో ఆసీస్‌పై విజయం సాధించిన టీమిండియా.. ఇప్పుడు అదే జట్టుతో మరో కీలక పోరుకు సిద్దమైంది. ఇండోర్ వేదికగా ఆదివారం జరగనున్న రెండో వన్డేలో ఆసీస్‌తో భారత జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి 2-0 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకోవాలని రాహుల్ సేన బావిస్తోంది. ఇక రెండో వన్డేలో భారత ఒక మార్పుతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. రెండో వన్డేలో విఫలమైన శార్ధూల్ ఠాకూర్ స్ధానంలో పేసర్ ప్రసిద్ద్ కృష్ణకు ఛాన్స్ ఇవ్వనున్నట్లు సమాచారం. మొదటి మ్యాచ్‌లో 10 ఓవర్లు బౌలింగ్ చేసిన ఠాకూర్ 7.80 ఏకానమితో ఏకంగా 78 పరుగులు సమర్పించుకున్నాడు. ఒక్క వికెట్ కూడా సాధించలేకపోయాడు. ఈ క్రమంలోనే అతడిపై వేటు వేయాలని జట్టు మేనెజ్మెంట్ భావిస్తున్నట్లు వినికిడి. మరోవైపు ఆస్ట్రేలియా రెండు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు పలురిపోర్టులు పేర్కొంటున్నాయి. తొలి వన్డేకు దూరమైన మాక్స్వెల్, మిచెల్ స్టార్క్, కారీ .. ఇండోర్ వన్డేకు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అబాట్, షార్ట్, ఇంగ్లీస్ బెంచ్‌కు పరిమిత మయ్యే ఛాన్స్ ఉంది. పిచ్ రిపోర్ట్ ఇండోర్ పిచ్ బ్యాటర్లకు స్వర్గధామం. ఈ వికెట్‌పై భారీ స్కోర్లు నమోదు అవ్వడం ఖాయం. అయితే ఈ వికెట్‌పై కాస్త బౌన్స్ కూడా ఉంటుంది. ఇది బౌలర్లకు సానుకూలాంశం. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకునే ఛాన్స్ ఉంది. తుది జట్లు(అంచనా) భారత్: శుబ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ద్ కృష్ణ ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మార్నస్ లాబుషేన్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), మార్కస్ స్టోయినిస్, సీన్ అబాట్, పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), మాక్స్వెల్, ఆడమ్ జంపా -
ఇదేమి బౌలింగ్రా బాబు.. ఇతడితోనా వరల్డ్‌కప్ ఆడేది! రోహిత్ సపోర్ట్‌తోనే!!
వరల్డ్‌కప్ సన్నాహాకాల్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా శుభారంభం చేసింది. మొహాలీ వేదికగా ఆసీస్‌తో జరిగిన తొలి వన్డేలో 5 వికెట్ల తేడాతో భారత్ విజయ భేరి మోగించింది. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించినప్పటికీ.. ఫాస్ట్ బౌలర్ శార్ధూల్ ఠాకూర్ ప్రదర్శన మాత్రం అందరనీ కలవరపెడుతోంది. మొహాలీ వన్డేలో శార్ధూల్ ఘోరమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ మ్యాచ్‌లో శార్ధూల్ పూర్తిగా తేలిపోయాడు. 10 ఓవర్లు బౌలింగ్ చేసిన ఠాకూర్ 7.80 ఏకానమితో ఏకంగా 78 పరుగులు సమర్పించుకున్నాడు. మిగితా నలుగురు బౌలర్లు కనీసం ఒక్క వికెట్ అయినా పడగొట్టగా.. శార్ధూల్ మాత్రం ఒక్క వికెట్ కూడా దక్కించుకోలేకపోయాడు. వికెట్ మాట పక్కన పెడితే.. తన బౌలింగ్‌తో బ్యాటర్లను కనీసం కట్టడి కూడా చేయలేకపోయాడు. ఆసీస్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ వేసిన శార్ధూల్ ఏకంగా 13 పరుగులు ఇచ్చాడు. అర్ష్‌దీప్‌ను ఎంపిక చేయాల్పింది.. కాగా వరల్డ్‌కప్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో శార్ధూల్ భాగంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే వరల్డ్‌కప్‌కు ముందు ఇటువంటి ప్రదర్శన చేసిన శార్ధూల్‌పై నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అతడు ప్రపంచకప్ వంటి మెగా టోర్నీకి ఆర్హుడు కాదని, అతడిలో ఏమి టాలెంట్ చూసి సెలక్టర్లు ఎంపిక చేశారో అర్ధం కావడం లేదని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. Shardul Thakur potentially will bowl at the death for us in the World Cup..#INDvsAUS pic.twitter.com/B3Dz3VI2NO — Sanchit Desai (@sanchitd43) September 22, 2023 అతడి స్ధానంలో లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్ష్‌దీప్‌ను ఎంపిక చేయాల్సందని భారత ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మరి కొంతమంది టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సపోర్ట్‌తోనే శార్థూల్ జట్టులో కొనసాగతున్నాడని కామెంట్లు చేస్తున్నారు. ఇక రెండో వన్డేకు అతడిపై వేటు పడే ఛాన్స్ ఉంది. What a shame that shardul thakur will be our third Pacer in the world cup, he is nothing without luck!😭#INDvsAUS pic.twitter.com/AVBkuns8pC — Y𝕏 Samar (@Yrtweets) September 22, 2023 -
పాక్‌ను ఓడించాలంటే అతడిపై వేటు పడాల్సిందే! లేదంటే..
Asia Cup 2023- Pakistan vs India: పాకిస్తాన్‌ను ఓడించాలంటే టీమిండియా ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగక తప్పదని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. నంబర్ 8లోనూ బ్యాటింగ్ ఆప్షన్ ఉండాలని కోరుకుంటే మాత్రం దాయాదిపై గెలవడం కష్టమేనని అభిప్రాయపడ్డాడు. కాగా ఆసియా కప్-2023లో తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో తలపడిన టీమిండియా స్థాయికి తగ్గట్లు బ్యాటింగ్ చేయలేకపోయింది. పాక్ పేసర్ల ధాటికి పాక్ పేసర్లు షాహిన్ ఆఫ్రిది, నసీం షా, హ్యారిస్ రవూఫ్ విజృంభణతో 266 పరుగులకు ఆలౌట్ అయింది. అయితే, భారత ఇన్నింగ్స్ తర్వాత వర్షం తెరిపినివ్వకపోవడంతో పాక్ బ్యాటింగ్ సాధ్యం కాలేదు. దీంతో మ్యాచ్ రద్దు కాగా ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. ఈ నేపథ్యంలో నేపాల్‌పై గెలుపొందిన టీమిండియా, పాకిస్తాన్ సూపర్-4లో ఆదివారం మరోసారి పోటీపడనున్నాయి. కాగా లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేస్తాడంటూ పేస్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌ను జరిగిన రెండు మ్యాచ్‌లలోనూ తుదిజట్టులోకి తీసుకుంది మేనేజ్మెంట్. షమీని కాదని శార్దూల్‌ను తీసుకుంటే ఇందులో భాగంగా పాక్‌తో మ్యాచ్‌లో సీనియర్ పేసర్ మహ్మద్ షమీపై వేటు వేసింది. అయితే, అతడిని కాదని శార్దూల్ తీసుకున్నా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. కేవలం 3 పరుగులకే అతడు అవుటయ్యాడు. షమీ- శార్దూల్ (PC: BCCI) ఇక నేపాల్‌తో మ్యాచ్‌కు జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో లేకపోవడంతో షమీకి చోటు దక్కగా.. అతడు 7 ఓవర్ల బౌలింగ్‌లో 4.10 ఎకానమీతో ఒక వికెట్ తీశాడు. ఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. పాకిస్తాన్‌తో తదుపరి మ్యాచ్‌లో షమీని ఆడిస్తేనే టీమిండియా అనుకున్న ఫలితం రాబట్టగలదని పేర్కొన్నాడు. పాక్‌ను ఓడించాలంటే అతడిపై వేటు వేయాల్సిందే ‘‘బౌలింగ్ విభాగంలో కచ్చితంగా మార్పులు చేయాలి. శార్దూల్ ఠాకూర్ స్థానంలో మహ్మద్ షమీని ఆడించాలి. గత మ్యాచ్ సాగిన తీరు బట్టే నేను ఈ మాట చెబుతున్నా. జట్టులో కనీసం ముగ్గురు నాణ్యమైన పేసర్లు ఉండాలి. అలా కాకుండా.. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో మళ్లీ బ్యాటింగ్ ఆర్డర్లో నంబర్ 8 వరకు ఆటగాళ్లు ఉండాలని కోరుకుంటే మాత్రం కష్టం. పాక్‌ను ఓడించాలంటే కచ్తిచంగా మంచి ఫాస్ట్‌బౌలర్లు జట్టులో ఉండాలి’’ అని మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. తుదిజట్టులో కచ్చితంగా బుమ్రా, సిరాజ్‌లతో పాటు షమీ కూడా ఉండాలని పేర్కొన్నాడు. రిజర్వ్ డే కాగా శ్రీలంకలోని కొలంబోలో భారత్- పాక్ తమ తదుపరి మ్యాచ్ ఆడనున్నాయి. అయితే, అక్కడి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మరోసారి చిరకాల ప్రత్యర్థుల పోరుకు వర్షం అడ్డంకి మారే అవకాశం ఉన్న నేపథ్యంలో రిజర్వ్ డేను కేటాయించింది ఆసియా క్రికెట్ కౌన్సిల్. చదవండి: Ind Vs Pak: మాకు కూడా కావాలన్న కోచ్‌లు! మా అంగీకారంతోనేనన్న బోర్డులు.. ఇదేం ట్విస్టు? -
IND Vs PAK: ప్రాక్టీస్‌లో టీమిండియా.. శ్రేయస్ అయ్యర్ ‘గెలుపు’! కానీ..
Asia Cup 2023 Ind vs Pak: ఆసియా కప్-2023లో భాగంగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు టీమిండియా సన్నద్ధమవుతోంది. చిరకాల ప్రత్యర్థిపై గెలవాలనే పట్టుదలతో నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు భారత ఆటగాళ్లు. ముఖ్యంగా పాకిస్తాన్ పేస్ త్రయాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనే క్రమంలో లెఫ్టార్మ్, రైట్ ఆర్మ్ ఫాస్ట్‌బౌలర్ల బౌలింగ్‌లో ప్రాక్టీస్ చేస్తున్నారు. పెనాల్టీ షూటౌట్ ఇక ఆదివారం(సెప్టెంబరు 10) నాటి మ్యాచ్ కోసం గురవారం నుంచే నెట్ సెషన్ ఆరంభించిన టీమిండియా.. శుక్రవారం కూడా ప్రాక్టీసులో తలమునకలైంది. శుబ్‌మన్ గిల్, శార్దూల్ ఠాకూర్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ తదితరులు ఓవైపు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూనే మరోవైపు.. పెనాల్టీ షూటౌట్‌తో సరదాగా గడిపారు. అయ్యర్ గెలిచాడు భారత క్రికెట్ జట్టు ఫీల్డింగ్ కోచ్ దిలీప్‌తో కలిసి ఫుట్‌బాల్‌ను కిక్ చేస్తూ పోటీపడ్డారు. ఇందులో సూర్య, గిల్, శార్దూల్ ఓడిపోగా.. శ్రేయస్ అయ్యర్ మిడిల్ స్టంప్‌ను హిట్ చేయగా.. దిలీప్ తన్నిన బంతి మూడు స్టంప్స్‌ను తాకింది. దీంతో వాళ్లిదరిని ఎత్తుకుని విన్నర్స్ అంటూ సెలబ్రేట్ చేశారు మిగతా ఆటగాళ్లు. పాక్‌తో ఆ మ్యాచ్ రద్దు.. ఈసారి ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘‘లక్ష్యం చేరుకోవడంలో అలసత్వం లేదు. ఎప్పటికప్పుడు నూతనోత్సాహంతో మున్ముందుకు’’ అంటూ దీనికి #TeamIndia #AsiaCup హ్యాష్‌ట్యాగ్‌లతో క్యాప్షన్ జతచేసింది. కాగా పాకిస్తాన్‌తో పల్లెకెలె మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు పాక్ పేసర్లు షాహిన్ ఆఫ్రిది, నసీం షా, హ్యారిస్ రవూఫ్‌లను ఎదుర్కోవడంలో తడబడ్డారు. ఈ క్రమంలో రోహిత్ సేన 266 పరుగులకే ఆలౌట్ అయింది. అయితే వర్షం కారణంగా మ్యాచ్ రద్దు కావడంతో ఫలితం తేలలేదు. ఇక మరి కొలంబోలో ఆదివారం ఏం జరుగుతుందో చూడాలి! చదవండి: గేల్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాలి!; రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు View this post on Instagram A post shared by Team India (@indiancricketteam) -
జింబాబ్వేపై ఆడాడని వరల్డ్‌కప్‌కు సెలక్ట్ చేశారా? జట్టులో దండుగ అతడు
వన్డే ప్రపంచకప్-2023కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును మంగళవారం బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ జట్టులో తిలక్ వర్మ, సంజూ శాంసన్, యుజువేంద్ర చాహల్‌కు చోటు దక్కలేదు. అయితే ఈ మెగా టోర్నీ కోసం సెలక్షన్ కమిటీ ఎంపిక చేసిన జట్టుపై చాలా మంది భారత మాజీ క్రికెటర్లు పెదవివిరుస్తున్నారు. ఈ జాబితాలో బీసీసీఐ మాజీ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ చేరాడు. ఆల్‌రౌండర్ కోటాలో శార్దూల్ ఠాకూర్‌ను తీసుకువడంపై శ్రీకాంత్ ఆసంతృప్తి వ్యక్తం చేశాడు. శార్దూల్ ఠాకూర్ ఇంకా పూర్తిస్థాయి ఆల్‌రౌండర్‌గా మారలేదని అతడు చెప్పుకొచ్చాడు. అసలేందుకు ఎంపిక చేశారు? "శార్దూల్ ఠాకూర్‌ను వరల్డ్‌కప్‌కు ఎందుకు ఎంపిక చేశారో నాకు అర్ధం కావడం లేదు. 8వ స్ధానంలో బ్యాటింగ్ చేసే సత్తా ఉన్న ఆటగాడు కావాలని అందరూ అంటున్నారు. ఆ స్దానంలో అతడు వచ్చి 10 పరుగులు మాత్రమే చేస్తున్నాడు. అది సరిపోతుందా? అలాగే 10 ఓవర్లు బౌలింగ్ కూడా చేయడు. నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు ఎన్ని ఓవర్లు బౌలింగ్ చేశాడో మనం చూశాం. కేవలం 4 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. అతడు జింబాబ్వే, వెస్టిండీస్ వంటి జట్లపై చేసిన ప్రదర్శనను పరిగణలోకి తీసుకోవద్దు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి జట్లపై ప్రదర్శన చేస్తే ఒత్తడి ఎలా ఉంటుందో తెలుస్తోంది. చిన్న జట్లపై ఆడింది వేరు వరల్డ్‌కప్ వంటి టోర్నీల్లో వేరు. వరల్డ్‌కప్ వంటి మెగా టోర్నీలకు జట్టును ఎంపిక చేసేముందు ఓవరాల్ సగటు కాకుండా వ్యక్తిగత ప్రదన్శనలను పరిగణలోకి తీసుకోవాలి. 2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టును ఓ సారి పరిశీలించండి. అన్నివిధాలగా సమతుల్యతగా ఉందని స్టార్‌స్పోర్ట్స్ షోలో కృష్ణమాచారి శ్రీకాంత్ పేర్కొన్నాడు. ప్రపంచకప్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా(వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, శార్థూల్ ఠాకూర్. చదవండి: మ్యాచ్ ఫిక్సింగ్ వివాదం.. శ్రీలంక వరల్డ్‌కప్ విన్నర్ అరెస్టు! -
WC 2023: శ్రేయస్ అయ్యర్‌కు నో ఛాన్స్! అనూహ్యంగా వాళ్లిద్దరికి చోటు..
Gautam Gambhir's Picks For India's ICC World Cup 2023 Squad: వన్డే ప్రపంచకప్-2023 నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ తన జట్టును ఎంచుకున్నాడు. అనూహ్యంగా మిడిలార్డర్ స్టార్ బ్యాటర్‌కు మాత్రం చోటివ్వని గౌతీ.. యువ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ జట్టులో ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. కాగా అక్టోబరు 5 నుంచి భారత్ వేదికగా ఐసీసీ ఈవెంట్ మొదలుకానున్న విషయం తెలిసిందే. పుష్కరకాలం తర్వాత తొలిసారి డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్- రన్నరప్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్‌తో వరల్డ్‌కప్ టోర్నీకి తెరలేవనుంది. సొంతగడ్డపై ప్రపంచకప్ ట్రోఫీ గెలిచిన పుష్కర కాలం తర్వాత మళ్లీ భారత్ ఈ ఈవెంట్‌కు ఆతిథ్యం ఇస్తున్న క్రమంలో రోహిత్ సేనపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా.. టీమిండియాతో పాటు.. ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నెదర్లాండ్స్ వరల్డ్‌కప్ టైటిల్ వేటకు అర్హత సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయా దేశాల తుది జట్ల కూర్పు ఎలా ఉండాలన్న అంశంపై మాజీ క్రికెటర్లు అభిప్రాయాలు పంచుకుంటున్నారు. అయ్యర్‌తో పాటు వాళ్లకూ నో ఛాన్స్ ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ 15 మంది సభ్యుల టీమిండియాను ఎంచుకున్నాడు. ఈ సందర్భంగా.. శ్రేయస్ అయ్యర్‌ను విస్మరించిన గౌతీ.. ఆసియా కప్-2023 జట్టులో చోటు దక్కని వాషింగ్టన్ సుందర్‌కు స్థానం కల్పించాడు. అంతేకాదు.. సూర్యకుమార్ యాదవ్ తప్పక జట్టులో ఉండాలన్న ఈ కామెంటేటర్.. తిలక్ వర్మకు అవకాశం ఇవ్వలేదు. ఇక సంజూ శాంసన్‌ను పక్కనపెట్టి.. కేఎల్ రాహుల్‌కు బ్యాకప్ కీపర్‌గా ఇషాన్ కిషన్‌ను గౌతీ ఎంపిక చేశాడు. అదే విధంగా నాలుగో ఫాస్ట్‌బౌలర్‌గా శార్దూల్ ఠాకూర్‌ను కాదని కర్ణాటక యువ పేసర్ ప్రసిద్ కృష్ణకు టాప్-15లో చోటు కల్పించాడు. గౌతీ జట్టుపై ఫ్యాన్స్ కామెంట్స్ దీంతో వన్డేల్లో మెరుగైన రికార్డు ఉన్న అయ్యర్‌ను కాదని.. సూర్యకు చోటివ్వడం.. అలాగే పూర్తిస్థాయిలో ఫిట్నెస్ సాధించని కేఎల్ రాహుల్ కోసం సంజూను బలిచేయాలనడం సరికాదంటూ గౌతీ టీమ్‌పై టీమిండియా అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. గంభీర్ ఏ ప్రాతిపదికన ఈ జట్టును ఎంపిక చేశాడో తెలియడం లేదంటూ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ కోసం గౌతం గంభీర్ ఎంచుకున్న 15 మంది సభ్యుల జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ. చదవండి: ఆరోజు నేను- ధోని కాదు.. భజ్జీ గెలిపించాడు! వెటకారమెందుకు గంభీర్? బుద్ధుందా? -
నేపాల్‌తో మ్యాచ్.. శార్ధూల్‌పై వేటు! షమీకి ఛాన్స్!
ఆసియాకప్-2023లో భాగంగా సెప్టెంబర్ 4న నేపాల్‌తో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్‌లో పసికూనపై గెలిచి సూపర్-4లో అడుగుపెట్టాలని భారత జట్టు భావిస్తోంది. కాగా శనివారం పాకిస్తాన్‌తో జరగాల్సిన భారత తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. దీంతో భారత ఖాతాలో ఒక్కపాయింట్ వచ్చి చేరింది. ఈ క్రమంలో నేపాల్‌పై భారత్ విజయం సాధిస్తే 3 పాయింట్లతో సూపర్-4కు అర్హత సాధిస్తుంది. బ్యాటింగ్‌కు మంచి ఛాన్స్.. ఇక పాకిస్తాన్‌తో మ్యాచ్‌తో రద్దైనప్పటికీ భారత బ్యాటింగ్ టాపర్డర్ మాత్రం తమ ఆటతీరుతో తీవ్ర నిరాశపరిచారు. వారు తిరిగి మళ్లీ ట్రాక్‌లోకి రావడానికి నేపాల్‌తో మ్యాచ్ మంచి అవకాశం. నేపాల్‌పై అద్భుతమైన ప్రదర్శన చేసి ఆత్మవిశ్వాసంతో సూపర్-4లో ఆటగాళ్లు రాణించవచ్చు. పాకిస్తాన్‌పై టాపర్డర్ విఫలమైనప్పటికీ హార్దిక్ పాండ్యా(87) ఇషాన్ కిషన్(82) మాత్రం కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. వీరి ఆటతీరుకు అంతా ఫిదా అయిపోయారు. శార్ధూల్‌పై వేటు.. షమీకి ఛాన్స్ ఇక పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో షమీకి కాదని శార్థూల్ ఠాకూర్ రూపంలో బౌలింగ్ ఆల్‌రౌండర్‌కు జట్టు మెన్జ్మెంట్ అవకాశం ఇచ్చింది. మెనెజ్‌మెంట్ నమ్మకన్ని శార్ధూల్ నిలబెట్టకోలేకపోయాడు. బ్యాటింగ్ చేసే ఛాన్స్ వచ్చినప్పటికీ కేవలం 3 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. ఈ క్రమంలో నేపాల్‌తో మ్యాచ్‌కు శార్ధూల్‌ను పక్కన పెట్టి షమీకి ఛాన్స్ ఇవ్వాలని జట్టు మెన్‌జెమెంట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నేపాల్‌తో మ్యాచ్‌కు భారత తుది జట్టు(అంచనా): రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్. చదవండి: Asia Cup 2023: పాకిస్తాన్ బౌలర్ ఓవరాక్షన్.. బుద్దిచెప్పిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్ -
IND VS PAK: షమీని కాదని శార్దూల్‌ను తీసుకుంది ఇందుకేనా..?
ఆసియా కప్-2023లో భాగంగా పల్లెకెలె వేదికగా పాకిస్తాన్‌తో ఇవాళ (సెప్టెంబర్ 2) జరుగుతున్న హైఓల్టేజీ మ్యాచ్‌లో టీమిండియా ఓ మోస్తరు స్కోర్‌కే పరిమితమైంది. 66 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న టీమిండియాను ఇషాన్ కిషన్ (81 బంతుల్లో 82; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), హార్ధిక్ పాండ్యా (90 బంతుల్లో 87; 7 ఫోర్లు, సిక్స్) ఆదుకున్నారు. అయితే వీరిద్దరూ స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌కు చేరడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. ఇషాన్, హార్ధిక్ ఔటవ్వగానే రవీంద్ర జడేజా (14), శార్దూల్ ఠాకూర్ (3) ఇలా వచ్చి అలా వెళ్లారు. కేవలం 3 పరుగుల వ్యవధిలో హార్దిక్, జడేజా, శార్దూల్ ఔటయ్యారు.దీంతో 48.5 ఓవర్లలో టీమిండియా ఇన్నింగ్స్‌కు తెరపడింది. 266 పరుగులకు భారత్ ఆలౌటైంది. ఆఖర్లో బుమ్రా (16) అడపాదడపా బ్యాట్‌ను ఝులిపించడంతో భారత్ 250 పరుగుల మార్కును దాటింది. ఇదిలా ఉంటే, షమీని కాదని శార్దూల్‌ను తుది జట్టులోకి తీసుకోవడంపై టీమిండియా అభిమానులు మండిపడుతున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ తలాతోకా లేని లాజిక్ చెప్పి షమీని పక్కకు పెట్టాడని దుయ్యబడుతున్నారు. బ్యాటింగ్ డెప్త్ కోసమని కీలక బౌలర్‌ను పక్కకు పెట్టడమేంటని అక్షింతలు వేస్తున్నారు. శార్దూల్ కేవలం 3 పరుగులు చేసి ఔటైన విధానాన్ని చూసి, ఇందుకేనా షమీని కాదని ఇతన్ని తీసుకున్నారని ధ్వజమెత్తుతున్నారు. ఈ మాత్రం బ్యాటింగ్ షమీ చేయలేడా అని అంటున్నారు. శార్దూల్ కోసమని షమీని పక్కకు పెట్టి టీమిండియా తగు మూల్యం చెల్లించుకుంటుందని కామెంట్స్ చేస్తున్నారు. ఓ మోస్తరు స్కోర్‌ను డిఫెండ్ చేసుకోవాలంటే షమీ ఉండి ఉండాల్సిందని అభిప్రాయపడుతున్నారు. పిచ్ కూడా పేసర్లకు సహకరిస్తుండటంతో ఫ్యాన్స్ ఈ విషయంలో రోహిత్ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. కాగా, షమీని ఇలా పొంతనలేని కారణాల చెప్పి పక్కకు పెట్టిడం ఇది కొత్తేమీ కాదు. గతంలో చాలా సందర్భాల్లో బలమైన కారణాలు లేకుండా షమీని బెంచ్‌కు పరిమితం చేశారు. ఫలితంగా తగిన మూల్యం చెల్లించుకున్నారు. ఈ మ్యాచ్‌లో కూడా అదే రిపీటవుతుందేమోనని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. -
Ind Vs Pak: షమీకి నో ఛాన్స్.. అందుకే ముందు బ్యాటింగ్: రోహిత్ శర్మ
Asia Cup, 2023 Pakistan vs India- Toss- Rohit Sharma Comments: ‘‘మేము ముందు బ్యాటింగే చేస్తాం. వాతావరణం ఎలా ఉండబోతుందనే విషయం గురించి ఎవరూ ఏమీ చెప్పలేరు కదా! మేము ఇక్కడికి క్రికెట్ ఆడటానికి వచ్చాం.సవాళ్లు, కఠిన పరిస్థితులను ఎదుర్కొనేందుకు తప్పకుండా సిద్ధంగా ఉండాలి. వెస్టిండీస్ పర్యటన తర్వాత మాకు కావాల్సినంత సమయం దొరికింది. బెంగళూరులో మా ఆటగాళ్లంతా కఠినంగా శ్రమించారు. ఈ టోర్నీలో మా ఆట ఎలా ఉండబోతుందో చూడాల్సి ఉంది. ప్రత్యర్థి జట్లు కూడా పటిష్టంగా ఉన్నాయి. ఏదేమైనా.. జట్టుగా మమ్మల్ని మేము నిరూపించుకోవాల్సి ఉంది. అయ్యర్, బుమ్రా తిరిగి వచ్చారు. ఈరోజు ముగ్గురు సీమర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగుతున్నాం’’ అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌తో ప్రయాణం ఆరంభం పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు తాము అన్ని రకాలుగా సిద్ధమయ్యామని పేర్కొన్నాడు. ఆసియా కప్-2023లో భారత్.. దాయాది పాక్‌తో మ్యాచ్‌తో తమ ప్రయాణాన్ని ఆరంభించనుంది. శ్రీలంకలోని పల్లెకెలె ఇందుకు వేదిక అయింది. ఆశ్చర్యపరిచిన రోహిత్ నిర్ణయం ఈ క్రమంలో శనివారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన రోహిత్ శర్మ తొలుత బ్యాటింగ్ ఎంచుకోవడం కాస్త ఆశ్చర్యం కలిగించింది. పిచ్ బౌలర్లకు అనుకూలిస్తుందన్న అభిప్రాయాల నేపథ్యంలో టాస్ గెలిచిన కెప్టెన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంటాడని అంతా భావించారు. కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ రోహిత్ ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం విశేషం. సవాలును ఎదుర్కొనేందుకు సిద్ధపడే బ్యాటింగ్ చేశామని హిట్‌మ్యాన్ ధీమాగా ఉన్నప్పటికీ.. వర్షం ముప్పు పొంచి ఉన్న తరుణంలో ఈ నిర్ణయం ఎలాంటి ఫలితాలను ఇస్తుందోనని అభిమానులు ఆందోళన పడుతున్నారు. షమీకి నో ఛాన్స్ కాగా క్యాండీలోని హై క్వాలిటీ పిచ్‌పై బౌలర్లు లేదంటే బ్యాటర్లు.. ఎవరు పరిస్థితులను తమకు అనుగుణంగా మార్చకుంటే వారికే మేలు చేకూర్చే విధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక ఈ హైవోల్టేజీ వన్డేలో శార్దూల్ ఠాకూర్‌కు అవకాశమిచ్చిన మేనేజ్మెంట్ టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీని పక్కనపెట్టింది. ఆసియా కప్-2023 పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు భారత తుది జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్. చదవండి: మా దగ్గర షాహిన్ ఆఫ్రిది, నసీం షా, హ్యారిస్ రవూఫ్ లేరు.. అదే ప్లస్: రోహిత్ శర్మ -
అలాంటి వాడిని కాదు! ఆ విషయంలో నేనేం చేయలేను: శార్దూల్ ఠాకూర్
West Indies vs India, 3rd ODI: వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు టీమిండియా పేసర్ శార్దూల్ ఠాకూర్. విండీస్‌తో మూడు మ్యాచ్‌లలో కలిపి ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. బార్బడోస్‌లో తొలి వన్డేలో విండీస్ ఓపెనర్ బ్రాండన్ కింగ్(17) వికెట్ తన ఖాతాలో వేసుకున్న ఈ పేస్ ఆల్‌రౌండర్.. అదే వేదికపై రెండో వన్డేలో మూడు వికెట్లు తీశాడు. వరల్డ్‌కప్ సన్నాహక సిరీస్‌లో.. ఇక ఆఖరిదైన నిర్ణయాత్మక మూడో మ్యాచ్‌లో ఏకంగా నాలుగు వికెట్ల(4/37)తో చెలరేగాడు. వన్డే వరల్డ్‌కప్-2023 సన్నాహకంగా భావిస్తున్న సిరీస్‌లో ఈ అద్భుతంగా రాణించి సెలక్టర్లకు సవాల్ విసిరాడు. ఈ నేపథ్యంలో ప్రపంచకప్ జట్టులో చోటు గురించి ప్రశ్న ఎదురుకాగా శార్దూల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 8 వికెట్లు పడగొట్టి మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ‘‘ఈ సిరీస్‌లో 8 వికెట్లు పడగొట్టడం సంతోషంగా ఉంది. ఓ క్రికెటర్‌గా జట్టులో స్థానం కోసం మేము ఏళ్లకు ఏళ్లు ఎదురుచూడాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఒక్కోసారి మెరుగ్గా రాణిస్తాం.. మరికొన్నిసార్లు నిరాశ తప్పదు. అయితే, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నేనైతే నా కెరీర్లో ఆడిన ప్రతి మ్యాచ్ నుంచి ఏదో ఒక పాఠం నేర్చుకుంటూనే ఉంటాను. జట్టులో స్థానం సంపాదించాలనే ఆలోచనతో ఉండే మనస్తత్వం కాదు నాది. అది సెలక్టర్ల ఇష్టం జట్టుకు ఉపయోగపడే విధంగా ఆడాలని మాత్రమే అనుకుంటాను. ప్రపంచకప్ జట్టుకు ఎంపిక చేస్తారో చేయరో అన్నది సెలక్టర్ల ఇష్టం. ఆ విషయంలో నేనైతే ఏమీచేయలేను. ముందుగా చెప్పినట్లు పరిస్థితులకు అనుగుణంగా జట్టును గెలిపించేలా ఆడటంపైనే నా దృష్టి కేంద్రీకృతమై ఉంటుంది’’ అని రైట్ ఆర్మ్ సీమర్ శార్దూల్ ఠాకూర్ చెప్పుకొచ్చాడు. లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేస్తాను కాబట్టే గత రెండేళ్లలో తాను జట్టులో రెగ్యులర్ సభ్యుడినయ్యానన్న ఈ మహారాష్ట్ర ఆల్‌రౌండర్.. లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయడం తనను కీలక ఆటగాళ్లలో ఒకడిగా మార్చిందన్నాడు. జట్టును గెలిపించే క్రమంలో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్ని విభాగాల్లో రాణించాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే.. చివరిదైన మూడో వన్డేలో వెస్టిండీస్‌ను 200 పరుగుల తేడాతో మట్టికరిపించిన టీమిండియా.. 2-1 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే.. అక్టోబరు 5 నుంచి భారత్ వేదికగా వన్డే ప్రపంచప్-2023 టోర్నీ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. చదవండి: టీమిండియా క్రికెటర్‌గా ఉండటం కష్టం.. ఎప్పుడు, ఎక్కడైనా: సంజూ శాంసన్ విండీస్‌ను చిత్తు చేసిన టీమిండియా.. అరుదైన రికార్డు! ప్రపంచంలోనే ఏకైక జట్టుగా.. -
చెలరేగిన బ్యాటర్లు.. విజృంభించిన బౌలర్లు.. మూడో వన్డేలో టీమిండియా ఘన విజయం
విండీస్ పర్యటనలో టీమిండియా వరుసగా రెండో సిరీస్ నెగ్గింది. తొలుత 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 1-0 తేడాతో గెలుచుకున్న భారత్.. నిన్న జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో 200 పరుగుల భారీ తేడాతో గెలుపొంది, 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో గెలిచి, రెండో వన్డేలో ఓటమిపాలైన భారత్.. మూడో మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగి విండీస్‌పై తమ రికార్డును మరింత మెరుగుపర్చుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. ఇషాన్ కిషన్ (64 బంతుల్లో 77; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), శుభ్‌మన్ గిల్ (92 బంతుల్లో 85; 11 ఫోర్లు), సంజూ శాంసన్ (41 బంతుల్లో 51; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), హార్ధిక్ పాండ్యా (52 బంతుల్లో 70 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) అర్ధసెంచరీతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 351 పరుగుల భారీ స్కోర్ చేసింది. విండీస్ బౌలర్లలో రొమారియో షెపర్డ్ 2, అల్జరీ జోసఫ్, గుడకేశ్ మోటీ, కారియా తలో వికెట్ పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన విండీస్‌ను భారత బౌలర్లు మూకుమ్మడిగా రాణించి 151 పరుగులకే కుప్పకూల్చారు. శార్దూల్ ఠాకూర్ (4/37), ముకేశ్ కుమార్ (3/30), కుల్దీప్ యాదవ్ (2/25), ఉనద్కత్ (1/16) అద్భుతంగా బౌలింగ్ చేసి విండీస్ ఆటగాళ్ల పనిపట్టారు. భారత బౌలర్ల ధాటికి విండీస్ 35.3 ఓవర్లలోనే చాపచుట్టేసింది. విండీస్ ఇన్నింగ్స్‌లో అలిక్ అథనాజ్ (32), కారియా (19), అల్జరీ జోసఫ్ (26), గడకేశ్ మోటీ (39 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. -
90 పరుగుల వద్ద తొలి వికెట్.. 181 పరుగులకు ఆలౌట్.. చిత్రంగా విండీస్ మాత్రం!
West Indies vs India, 2nd ODI- ICC ODI WC 2023- బ్రిడ్జ్‌టౌన్: స్వదేశంలో త్వరలో జరిగే వన్డే ప్రపంచకప్‌నకు ముందు కరీబియన్ పర్యటనకు వచ్చిన భారత జట్టు టెస్టు సిరీస్ గెలిచేంత వరకు బాగానే ఉంది. కానీ మెగా టోర్నీ సన్నాహాకమైన కీలక వన్డే సిరీస్‌లో టీమిండియా ఆట ఏమాత్రం బాగోలేదు. తొలి వన్డేలో అర్థంలేని ప్రయోగాలను రెండో వన్డేలోనూ చేసింది. మొదటి మ్యాచ్‌లో గెలిచేందుకు కష్టపడింది. కానీ రెండో మ్యాచ్‌లో టీమిండియా ఎంత కష్టపడినా నెగ్గలేకపోయింది. తమ కెరీర్లో ఆఖరి వన్డే ప్రపంచకప్ అనుకుంటున్న కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిలకు ప్రతీ మ్యాచ్ కీలకం కాగా... వీళ్లిద్దరు విశ్రాంతి పేరిట దూరమైన వైనం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కానేకాదు. అందుకేనేమో మెగా ఈవెంట్‌కు అర్హత సాధించలేకపోయిన వెస్టిండీస్ జట్టు చేతిలో టీమిండియా అపహాస్యం కావాల్సి వచ్చింది. ఇషాన్ ఒక్కడే భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన ఈ రెండో వన్డేలో భారత్ ఆరు వికెట్ల తేడాతో విండీస్ చేతిలో పరాజయం చవిచూసిన విషయం తెలిసిందే. హార్దిక్ పాండ్యా సారథ్యంలోని భారత్ 40.5 ఓవర్లలో 181 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు ఇషాన్ కిషన్ (55 బంతుల్లో 55; 6 ఫోర్లు, 1 సిక్స్), శుబ్‌మన్ గిల్ (49 బంతుల్లో 34; 5 ఫోర్లు) మాత్రమే బాగా ఆడారు. టీమిండియా పసలేని బౌలింగ్‌పై.. తర్వాత పసలేని బౌలింగ్‌పై సులువైన లక్ష్యాన్ని వెస్టిండీస్ 36.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసి ఛేదించింది. కెప్టెన్ షై హోప్ (80 బంతుల్లో 63 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), కీసీ కార్టీ (65 బంతుల్లో 48 నాటౌట్; 4 ఫోర్లు) విండీస్‌ను గెలిపించారు. భారత బౌలర్లలో శార్దుల్ ఠాకూర్ 3 వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్‌నకు వికెట్ దక్కింది. సిరీస్ విజేతను నిర్ణయించే వన్డే మంగళవారం(ఆగష్టు 1) టరోబాలో జరుగుతుంది. శార్దుల్ రాణించినా... భారత బౌలర్లలో శార్దుల్ ఠాకూర్ తన పేస్‌తో నిప్పులు చెరిగాడు. ఇన్నింగ్స్ 9వ ఓవర్లో జోరుమీదున్న ఓపెనర్లు మేయర్స్ (28 బంతుల్లో 36; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), బ్రాండన్ కింగ్ (23 బంతుల్లో 15; 3 ఫోర్లు)లను అవుట్ చేశాడు. కాసేపటికే వన్‌డౌన్‌లో వచి్చన అతనెజ్ (6)కూ శార్దుల్ క్రీజులో నిలిచే అవకాశమివ్వలేదు. 72 పరుగులకే టాపార్డర్ వికెట్లన్నీ పడ్డాయి. 90 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయి.. చిత్రంగా విండీస్ మాత్రం వంద పరుగుల్లోపు మరో వికెట్ హెట్‌మైర్ (9) రూపంలో పడింది. కుల్దీప్‌నకు ఈ వికెట్ దక్కింది. 17 ఓవర్లలో విండీస్ స్కోరు 91/4. ఈ దశలో భారత్‌కు గెలిచే అవకాశం కనిపించింది. కానీ కెపె్టన్ షై హోప్, కార్టీతో కలిసి ప్రత్యర్థి జట్టుకు ఆ చాన్సు ఇవ్వకుండా క్రీజ్‌లో పాతుకుపోయాడు. ఈ క్రమంలో హోప్ 70 బంతుల్లో అర్ధసెంచరీ సాధించగా... ఇద్దరు కలిసి అబేధ్యమైన ఐదో వికెట్‌కు 91 పరుగులు చేశారు. ఈ మ్యాచ్ విచిత్రమేంటంటే... భారత్ 90 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయి 181 పరుగులకు ఆలౌటైంది. కానీ అదే విండీస్ 91 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయాక మళ్లీ వికెట్‌నే చేజార్చుకోలేదు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: 181; వెస్టిండీస్ ఇన్నింగ్స్: బ్రాండన్ కింగ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) శార్దుల్ 15; మేయర్స్ (సి) ఉమ్రాన్ (బి) శార్దుల్ 36; అతనెజ్ (సి) ఇషాన్ (బి) శార్దుల్ 6; షై హోప్ (నాటౌట్) 63; హెట్‌మైర్ (బి) కుల్దీప్ 9; కార్టీ (నాటౌట్) 48; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (36.4 ఓవర్లలో 4 వికెట్లకు) 182. వికెట్ల పతనం: 1–53, 2–54, 3–72, 4–91. బౌలింగ్: హార్దిక్ పాండ్యా 6.4–0–38–0, ముకేశ్ 3–0–17–0, ఉమ్రాన్ మాలిక్ 3–0–27–0, శార్దుల్ ఠాకూర్ 8–0–42–3, కుల్దీప్ యాదవ్ 8–0–30–1, జడేజా 6–0–24–0, అక్షర్ పటేల్ 2–1–4–0. చదవండి: చరిత్ర సృష్టించిన శుబ్‌మన్ గిల్.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా! కావాలనే రోహిత్, కోహ్లి లేకుండా! మ్యాచ్ ఓడిపోతేనే! ఆసియా కప్ తర్వాత ఇద్దరూ అవుట్? 4 Overs. 16 Runs. 3 Wickets! Shardul Thakur's first spell 🔥 from yesterday 😮#INDvWIAdFreeonFanCode #INDvWI pic.twitter.com/iQU260e4TI — FanCode (@FanCode) July 30, 2023 -
మరీ అంత బద్దకమా.. సహాచర ఆటగాడిపై రోహిత్ సీరియస్! వీడియో వైరల్
వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా బోణీ కొట్టింది. బార్బోడస్ వేదికగా విండీస్‌తో జరిగిన తొలి వన్డేలో 5 వికెట్ల తేడాతో భారత జట్టు ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కరేబియన్ జట్టు.. భారత స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, జడేజా ధాటికి కేవలం 114 పరుగులకే కుప్పకూలింది. కుల్దీప్ కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టగా.. జడేజా 3 వికెట్లు సాధించాడు. అనంతరం 115 లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత బ్యాటర్లలో ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీతో రాణించాడు. శార్దూల్‌పై రోహిత్ సీరియస్.. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన ప్రశాంతతను కోల్పోయాడు. సహాచర ఆటగాడు శార్ధూల్ ఠాకూర్‌పై రోహిత్ సీరియస్ అయ్యాడు. ఫీల్డింగ్‌లో శార్ధూల్ బద్దకంగా వ్యవహరించడంతో రోహిత్ కోపమయ్యాడు. విండీస్ ఇన్నింగ్స్ 19 ఓవర్ వేసిన కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో షాయ్ హోప్ కవర్ డ్రైవ్ షాట్ ఆడాడు. అయితే షాట్లో పవ్ర్ లేకపోవడంతో బంతి బౌండరికి వెళ్లలేకపోయింది. అయితే కవర్స్‌లో ఉన్న శార్ధూల్ బంతిని అందుకోవడానికి నెమ్మదిగా వెళ్లాడు. ఈ క్రమంలో విండీస్‌తో బ్యాటర్లు 3 పరుగులు పూర్తి చేశారు. దీంతో శార్ధూల్ పేలవ ఫీల్డింగ్‌పై రోహిత్ ఆసహనం వ్యక్తం చేశాడు. అతడి వైపు చూస్తూ ఏదో అన్నాడు. ఇందుకు సబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: IND vs WI: కోహ్లి సింగిల్ హ్యాండ్ స్టన్నింగ్ క్యాచ్.. నోరెళ్లబెట్టిన గిల్! వీడియో వైరల్ Rohit Sharma praising Shardul Thakur for his fielding effort.#INDvsWI pic.twitter.com/121NrAKQhY — Foax Cricket News (@FoaxCricket) July 27, 2023 -
Ind vs WI: బార్బడోస్ చేరుకున్నాం.. జడ్డూ ఫొటో వైరల్! ఇక వాళ్లిద్దరు..
India tour of West Indies, 2023: టీమిండియా ఆటగాళ్లు ఒక్కొక్కరుగా వెస్టిండీస్‌కు చేరుకుంటున్నారు. టెస్టు జట్టు వైస్ కెప్టెన్ అజింక్య రహానే సహా పలువురు శుక్రవారమే కరేబియన్ దీవిలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇక టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా శనివారం విండీస్‌కు చేరుకున్నట్లు తెలిపాడు. ఈ సందర్భంగా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, పేసర్ శార్దూల్ ఠాకూర్‌తో కలిసి ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ‘‘బార్బడోస్ చేరుకున్నాం’’ అంటూ ఇందుకు క్యాప్షన్ జతచేశాడు. కాగా జూలై 12 నుంచి టీమిండియా- వెస్టిండీస్ మధ్య టెస్టు సిరీస్ మొదలుకానుంది. రోహిత్, కోహ్లి ఆలస్యంగా! ఇందుకోసం ఇప్పటికే భారత క్రికెట్ నియంత్రణ మండలి జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ తర్వాత లభించిన విరామ సమయాన్ని రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి తమ కుటుంబాలకు కేటాయించారు. దీంతో పారిస్, లండన్లలో చక్కర్లు కొడుతున్న ఈ బ్యాటింగ్ స్టార్లు కాస్త ఆలస్యంగా విండీస్‌కు పయనం కానున్నట్లు తెలుస్తోంది. పాపం వెస్టిండీస్ కాగా డొనిమినికా వేదికగా విండీస్- భారత్‌ల మధ్య తొలి టెస్టు జరుగనుంది. ఇందుకోసం ఆతిథ్య జట్టు ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టింది. క్రెగ్ బ్రాత్‌వైట్ సారథ్యంలోని 18 మంది సభ్యులతో కూడిన జట్టు నెట్స్‌లో శ్రమిస్తోంది. ఇదిలా ఉంటే.. వన్డే ప్రపంచకప్-2023 టోర్నీ రేసు నుంచి వెస్టిండీస్ అధికారికంగా నిష్క్రమించింది. జింబాబ్వేలోని హరారే వేదికగా సూపర్ సిక్సెస్ దశలో శనివారం జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్ చేతిలో ఓడి ఘోర అవమానాన్ని మూటగట్టుకుంది. రెండుసార్లు చాంపియన్‌గా నిలిచిన విండీస్ కనీసం ప్రధాన టోర్నీకి అర్హత సాధించలేక చతికిలపడింది. ఇక క్వాలిఫయర్స్‌లో జూలై 7న ఆఖరి మ్యాచ్ ఆడనున్న విండీస్ ఆటగాళ్లు.. ఆ వెంటనే స్వదేశంలో భారత్‌తో సిరీస్‌కు సిద్ధం కానున్నారు. వెస్టిండీస్‌తో టెస్టు 'సిరీస్ ఆడనున్న టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), కేఎస్ భరత్ (వికెట్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్ సిరాజ్, ముకేష్ కుమార్, జయదేవ్ ఉనాద్కట్, నవదీప్ సైనీ. వెస్టిండీస్ సన్నాహక జట్టు: క్రెయిగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), అలిక్ అథనేజ్, జెర్మైన్ బ్లాక్‌వుడ్, ఎన్క్రుమా బోనర్, తగెనరైన్ చంద్రపాల్, రఖీమ్ కార్న్‌వాల్, జాషువా డా సిల్వా, షానన్ గాబ్రియేల్, కవెమ్ హాడ్జ్, అకీమ్ జోర్డాన్, జైర్ మెక్అలిస్టర్, కిర్క్ మెకెంజీ, మార్క్వినో మైండ్లీ, అండర్సన్ ఫిలిప్, రేమన్ రీఫర్, కీమర్ రోచ్, జేడెన్ సీల్స్, జోమెల్ వారికన్. చదవండి: మా ఓటమికి ప్రధాన కారణం అదే.. ఒకవేళ అలా జరిగి ఉంటే: విండీస్ కెప్టెన్ పచ్చగడ్డి.. పులి.. సింహం! అవును.. నువ్వు గాడిదవే! మా కోహ్లి ఎప్పటికీ కింగే! Touchdown Barbados🛬 pic.twitter.com/netOxNARuY — Ravindrasinh jadeja (@imjadeja) July 1, 2023 -
కష్టమొచ్చిన ప్రతీసారి నేనున్నానంటూ.. నొప్పిని భరిస్తూనే
టీమిండియా ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ మరోసారి తన బ్యాటింగ్ విలువను చూపించాడు. ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్లో లార్డ్ శార్దూల్(#LordShardul) మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. టీమిండియా కష్టాల్లో ఉన్న ప్రతీసారి నేనున్నానంటూ భరోసా ఇస్తున్న శార్దూల్ మరోసారి దానిని నిలబెట్టుకున్నాడు. 2020లో ఆస్ట్రేలియాతో గబ్బా వేదికగా జరిగిన చారిత్రాత్మక టెస్టులో శార్దూల్ హాఫ్ సెంచరీని అంత తొందరగా ఎవరు మరిచిపోరు. ఆ మ్యాచ్‌లో ఆసీస్ బౌలర్ల ధాటికి టాపార్డర్, మిడిలార్డర్ కుప్పకూలిన వేళ వారిని సమర్థంగా ఎదుర్కొన్న శార్దూల్.. వాషింగ్టన్ సుందర్‌తో కలిసి ఏడో వికెట్‌కు వందకు పైగా పరుగులు జోడించారు. ఈ క్రమంలో 115 బంతుల్లో 67 పరుగులతో బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో టీమిండియా మూడు వికెట్ల తేడాతో విజయం సాధించడమే గాక 2-1తేడాతో ఆసీస్‌ను సొంత గడ్డపై ఓడించిన చారిత్రక సిరీస్ విజయాన్ని అందుకుంది. మరో విశేషమేమిటంటే ఈ సిరీస్ నుంచి కోహ్లి మధ్యలోనే తప్పుకోవడంతో రహానే కెప్టెన్సీలో టీమిండియా టెస్టు సిరీస్ సొంతం చేసుకుంది. అంతేకాదు ఇంగ్లండ్‌తో 2021లో ఓవల్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లోనూ అర్థసెంచరీలు సాధించడమే గాక బౌలింగ్‌లోనూ వికెట్లు తీసి టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇక ఆసీస్‌తో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో మూడోరోజు ఆట ప్రారంభమైన కాసేపటికే ఐదు పరుగులు చేసిన కేఎస్ భరత్ స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీంతో టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. రహానే ఒంటరిపోరాటం చేస్తున్నా లాభం లేదు.. ఇంకేముంది.. మరో 40 లేదా 50 పరుగుల్లోపూ టీమిండియా ఆలౌట్ అయిపోతుంది.. ఆస్ట్రేలియా టీమిండియాను ఫాలోఆన్ ఆడించి భారీ విజయం నమోదు చేస్తుంది.. ఇదే మనం చూడబోతున్నాం అంటూ టీమిండియా ఫ్యాన్స్ నిట్టూర్చారు. కానీ అప్పుడు క్రీజులోకి వచ్చాడు ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్. అయితే వచ్చీ రావడంతోనే కమిన్స్ బౌలింగ్‌లో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఆసీస్ పేసర్ల జోరు చూస్తుంటే శార్దూల్‌ను ఔట్ చేయడం పెద్ద కష్టమేమి కాదనుకున్నారు. దీనికి తోడు కమిన్స్ బౌలింగ్‌లో వరుసగా రెండుసార్లు గాయపడ్డాడు. కమిన్స్ వేగంతో విసిరిన బంతులు శార్దూల్ చేతిని టార్గెట్ చేశాయి. అయితే నొప్పిని భరిస్తూనే ఆసీస్ బౌలింగ్‌ను ధీటుగా ఎదుర్కొంటున్నాడు. శార్దూల్ చేసిన 36 పరుగులు టీమిండియా ఇన్నింగ్స్‌కు కొండంత ధైర్యాన్ని ఇచ్చాయి. ముఖ్యంగా ఒంటరిపోరాటం చేస్తున్న రహానేకు అండగా నిలబడేందుకు ఒక బ్యాటర్ కావాల్సిన సమయంలో శార్దూల్ ఆ బాధ్యతను తీసుకున్నాడు. ఎక్కువగా రహానేకు స్ట్రైక్ ఇస్తూ మధ్యమధ్యలో తాను పరుగులు చేశాడు. ఇద్దరు కలిసి ఏడో వికెట్‌కు 108 పరుగులు జోడించి అజేయంగా సాగుతున్నారు. లంచ్ విరామ సమయానికి టీమిండియా ఆరు వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. రహానే 89 బ్యాటింగ్, శార్దూల్ 36 పరుగులు బ్యాటింగ్ క్రీజులో ఉన్నారు. అయితే శార్దూల్ ఆట ఇంకా ముగియలేదు.. మరోసారి హాఫ్ సెంచరీ చేస్తాడా.. లేదంటే ఏకంగా సెంచరీతో మెరుస్తాడా అనేది చూడాలి. -
WTC ఫైనల్లో ఇషాన్ కిషన్ బెస్ట్ ఎందుకంటే..!
-
అసలు క్రికెటరే కాదు.. ఇంకా: టీమిండియా ఆల్‌రౌండర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు
IPL 2023 CSK Vs KKR: ఐపీఎల్-2023లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న టీమిండియా ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్.. ఇప్పటి వరకు ఒకటీ రెండు మినహా మ్యాచ్‌లలో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఆడిన 9 ఇన్నింగ్స్‌లో 110 పరుగులు చేసిన ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్.. బౌలర్‌గానూ స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతున్నాడు. శార్దూల్ ఈ సీజన్లో ఇప్పటి వరకు కేవలం 5 వికెట్లు తీశాడు. కేకేఆర్ తన కోసం వెచ్చించిన రూ. 10. 75 కోట్ల భారీ మొత్తానికి పూర్తిగా న్యాయం చేయలేకపోతున్నాడు. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో 3 ఓవర్లలో 15 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసి పర్వాలేదనిపించాడు శార్దూల్. సీఎస్కేతో మ్యాచ్‌లో ఇలా ఇక నితీశ్ రాణా, రింకూ సింగ్ అర్ధ శతకాలతో కదం తొక్కి 18.3 ఓవర్లలోనే విజయం అందించడంతో అతడికి బ్యాటింగ్ చేసే అవకాశమే రాలేదు. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ మాజీ ఆల్‌రౌండర్, కామెంటేటర్ స్కాట్ స్టైరిస్ శార్దూల్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. చెపాక్ వేదికగా ఆదివారం నాటి సీఎస్కే- కేకేఆర్ మ్యాచ్ ఆరంభానికి ముందు జియో సినిమా షోలో స్టైరిస్ మాట్లాడుతూ.. ‘‘శార్దూల్ ఠాకూర్ అసలు ఒక క్రికెటర్‌లాగే అనిపించడం లేదు. అతడిని ఆల్కరౌండర్ అనడం కంటే అరకొర ఆటగాడు(bits-and-pieces cricketer) అని పిలవడం మేలు’’ అంటూ అటు బ్యాటింగ్‌లోనూ ఇటు బౌలింగ్‌లోనూ సగం సగమే అన్న అర్థంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అప్పుడు జడ్డూను కాగా 2019లో టీమిండియా స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఇదే తరహా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇందుకు జడ్డూ సైతం గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. ఇక ఆసియా కప్-2022 సందర్భంగా వీరి మధ్య మాటలు కలిశాయి. ఇక ఇప్పుడు స్కాట్ స్టైరిస్ టీమిండియా ‘పేస్ ఆల్‌రౌండర్’ శార్దూల్ ఠాకూర్‌ను ఉద్దేశించి ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాగా ప్రస్తుతం ఐపీఎల్-2023తో బిజీగా ఉన్న శార్దూల్ తదుపరి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు సన్నద్ధమవుతాడు. జూన్ 9 నుంచి ఆస్ట్రేలియాతో ఇంగ్లండ్ వేదికగా జరుగనున్న ఈ మెగా ఫైట్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో అతడు చోటు దక్కించుకున్నాడు. చదవండి: వాళ్ల తప్పేం లేదు..! అతడు అద్భుతం.. జట్టుకు దొరికిన విలువైన ఆస్తి: ధోని పనిష్మెంట్.. అంపైర్లతో రాణా అలా.. వైరల్! ఎందుకో ప్రతిదానికీ ఇలా! -
మోహిత్ శర్మ స్టన్నింగ్ క్యాచ్.. ప్రయోగం బెడిసికొట్టింది
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో కేకేఆర్ ప్రయోగం వికటించింది. ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌కు బ్యాటింగ్‌లో ప్రమోషన్ కల్పించి పించ్ హిట్టర్‌గా మూడో స్థానంలో పంపితే అతను మాత్రం డకౌట్ అయ్యాడు. షమీ బౌలింగ్‌లో ఇన్నింగ్స్ ఐదో ఓవర్ నాలుగో బంతిని భారీ షాట్ ఆడే ప్రయత్నంలో మోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే ఇక్కడ మోహిత్ క్యాచ్ హైలెట్‌గా నిలిచింది. మిడాన్ నుంచి వెనక్కి పరిగెత్తిన మోహిత్ శరీరాన్ని విల్లులా ఒంపి డైవ్ చేస్తూ అద్భుతంగా క్యాచ్ తీసుకున్నాడు. దీంతో శార్దూల్ కథ ముగిసింది. అంతకముందే మోహిత్ ఎడమచేతి వేలికి గాయమైంది. ఐస్ ప్యాక్ పెట్టుకొని ఫీల్డింగ్ చేశాడు. గాయాన్ని సైతం లెక్కచేయకుండా స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. శార్దూల్‌కు కలిసి రాని ప్రమోషన్ ఇక శార్దూల్ ఠాకూర్‌కు బ్యాటింగ్‌లో ప్రమోషన్ ఇచ్చిన ప్రతీసారి అతనికి కలిసిరాలేదని చెప్పొచ్చు. తన టి20 కెరీర్లో మూడో స్థానంలో బ్యాటింగ్ రావడం శార్దూల్‌కు ఇదే తొలిసారి. ఇంతకముందు 2021 ఐపీఎల్లో క్వాలిఫయర్‌లో భాగంగా సీఎస్కేతో మ్యాచ్‌లో ఢిల్లీ తరపున నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. అప్పుడు గోల్డెన్ డకౌట్ అయిన శార్దూల్ తాజాగా గుజరాత్‌తో మ్యాచ్‌లో పించ్ హిట్టర్‌గా వచ్చి(మూడోస్థానంలో) డకౌట్‌గా వెనుదిరిగాడు. Mohit Sharma you beauty 🔥🔥 A remarkable catch running backwards to dismiss Shardul Thakur 👏🏻👏🏻#TATAIPL | #KKRvGT pic.twitter.com/QOOS30qusH — IndianPremierLeague (@IPL) April 29, 2023 చదవండి: ట్రాక్‌లో పడాలంటే ఆలు పరోటాలు చేయాల్సిందేనా! -
టీమిండియా ఆల్‌రౌండర్‌కు బంపరాఫర్.. పాపం సూర్యకుమార్!
లండన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరగనున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. భారత జట్టులో రెండు అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. ఐపీఎల్లో అదరగొడుతున్న వెటరన్ ఆటగాడు అజింక్య రహానే సెలక్టర్లు పిలుపునిచ్చారు. గాయం కారణంగా దూరమైన శ్రేయస్ అయ్యర్ స్థానంలో రహానే అవకాశం దక్కింది. దాదాపు 17 నెలల విరామం తర్వాత రహానేకు భారత జట్టులో చోటు దక్కడం విశేషం. అదే విధంగా ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌కు కూడా డబ్ల్యూటీసీ ఫైనల్ జట్టులో చోటు దక్కింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు శార్దూల్ ఠాకూర్ భారత టెస్టు జట్టులో చోటు కోల్పోయాడు. ఇంగ్లండ్ పరిస్థితులు ఫాస్ట్ బౌలర్లకు అనుకూలించనున్న నేపథ్యంలో శార్దూల్‌కు సెలక్టర్లు పిలుపునిచ్చారు. షమీ, సిరాజ్, ఉమేశ్ యాదవ్, ఉనద్కట్‌తో పాటు అదనపు పేసర్‌గా శార్దూల్ ఉండనున్నాడు. అదే విధంగా ప్లేయింగ్ ఎల్వన్లో కూడా శార్దూల్ చోటు దక్కే ఛాన్స్ ఉంది. ఎందుకంటే శార్దూల్ ఇంగ్లండ్ గడ్డపై మంచి రికార్డు ఉంది. గతంతో ఓ ఫోర్ వికెట్ హాల్‌తో పాటు ఒక హాఫ్ సెంచరీ కూడా ఉంది. ఇక ఓవరాల్‌గా భారత్ తరపున 8 టెస్టు మ్యాచ్‌లు ఆడిన శార్ధూల్.. 27 వికెట్లతో 254 పరుగులు చేశాడు. మరోవైపు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతో టెస్టు అరంగేట్రం చేసిన సూర్యకుమార్ యాదవ్‌కు చుక్కదరైంది. తొలుత అయ్యర్ స్థానంలో సూర్యకుమార్‌కు చోటు దక్కుతుందని వార్తలు వినిపించినప్పటికీ.. సెలక్టర్లు మాత్రం రహానే వైపు మొగ్గు చూపారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, పుజారా, విరాట్ కోహ్లి, అజింక్య రహానే, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్, అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, సిరాజ్, ఉమేశ్ యాదవ్, ఉనద్కత్ చదవండి: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు భారత జట్టు ప్రకటన.. ఐపీఎల్ హీరోకు పిలుపు -
జట్టు నిండా విధ్వంసకర వీరులే.. అయినా గెలుపు కోసం అష్టకష్టాలు..!
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో విధ్వంసకర వీరులతో నిండి, లోతైన బ్యాటింగ్ లైనప్ కలిగిన జట్టు ఏది అంటే..? నిస్సంకోచంగా కేకేఆర్ పేరే చెప్పాలి. ఆ జట్టులో తొమ్మిదో నంబర్ ఆటగాడి వరకు అందరూ మెరుపులు మెరిపించగల సమర్ధులే. టాపార్డర్, మిడిలార్డర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరి ఊచకోత ఏ రేంజ్లో ఉంటందో ఇదివరకే చూశాం. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో భారీ లక్ష్య ఛేదనలో (205) ఐదో నంబర్ ఆటగాడిగా బరిలోకి దిగిన రింకూ సింగ్.. చివరి 5 బంతుల్లో 5 సిక్సర్లు బాది తన జట్టుకు చిరస్మరణీయ విజయాన్నందించిన వైనాన్ని క్రికెట్ ప్రపంచం ఎప్పటికీ మరచిపోలేదు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వన్‌డౌన్‌లో (ఇంపాక్ట్ ప్లేయర్‌గా) బరిలోకి దిగిన వెంకటేశ్ అయ్యర్ (51 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్సర్లతో 104).. సిక్సర్ల సునామీ సృష్టించి, 15 ఏళ్ల తర్వాత కేకేఆర్ తరఫున రెండో సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. అంతకుముందు ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఏడో నంబర్ ఆటగాడిగా బరిలోకి దిగిన శార్దూల్ ఠాకూర్.. పూనకం వచ్చినట్లు ఊగిపోగి ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడి, జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. రింకూ సింగ్ గురించి చెప్పాల్సి వస్తే.. ఈ యువ ఆటగాడు మిడిలార్డర్లో బ్యాటింగ్‌కు వచ్చి దాదాపు ప్రతి మ్యాచ్‌లో విలయం సృష్టిస్తున్నాడు. కెప్టెన్ నితీశ్ రాణా సైతం అప్పర్ మిడిలార్డర్లో అడపాదడపా మెరుపులు మెరిపిస్తున్నాడు. లేట్‌గా జట్టులో చేరిన జేసన్ రాయ్.. తాజాగా సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో అంతకుముందు ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడ్డాడు. సీఎస్కేతో మ్యాచ్‌లో ఐదో నంబర్ ఆటగాడిగా బరిలోకి దిగిన జేసన్.. కేవలం 26 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో మెరుపు అర్ధసెంచరీ చేశాడు. వీరు మాత్రమే కాక ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్ లాంటి బిగ్ గన్స్ కేకేఆర్‌లో ఉండనే ఉన్నారు. వీరు ఈ సీజన్లో ఇప్పటివరకు పేలలేదు కాని, వీరిదైన రోజున వీరి ఆపడం దాదాపుగా అసంభవమని చెప్పాలి. అయితే, ఇంత పటిష్టమైన, విధ్వంసకర బ్యాటింగ్ లైనప్ కలిగిన కేకేఆర్ ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో కేవలం రెండే విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో చివరి నుంచి మూడో స్థానంలో ఉండటం ఆ జట్టు అభిమానులను తీవ్రంగా కలిచి వేస్తుంది. లోపం ఒక్కడ ఉందో ఫ్యాన్స్ అంచనా వేయలేకపోతున్నారు. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ సత్తా చాటుతున్నప్పటికీ, గెలుపు వాకిట ఆగిపోవడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. పలువురు సీనియర్ల విశ్లేషణ మేరకు.. కేకేఆర్ బ్యాటింగ్‌లో పటిష్టంగానే ఉన్నప్పటికీ, జట్టుగా ఒక్క మ్యాచ్‌లో కూడా వారు కలిసికట్టుగా ఆడింది లేదు. ఓ జట్టు గెలవాలంటే ప్రతి మ్యాచ్‌లో ఎవరో ఒకరు ఆడితే సరిపోదు. బ్యాటింగ్‌తో పాటు అన్ని విభాగాల్లో జట్టుగా రాణించాల్సి ఉంటుంది. ఈ సీజన్లో కేకేఆర్ బ్యాటర్లు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన మ్యాచ్‌ల్లో అంతా వన్ మ్యాన్ షో నే సాగింది. కేకేఆర్ బౌలింగ్ విషయానికొస్తే.. ఉమేశ్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, టిమ్ సౌథీ, ఫెర్గూసన్, వరుణ్ చక్రవర్తి, ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్, యువ స్పిన్నర్ సుయాష్లతో కూడిన ఆ జట్టు బౌలింగ్ సైతం పటిష్టంగా కనిపిస్తుంది. అయితే ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో వీరు కూడా కలిసికట్టుగా రాణించింది లేదు. ఇక టీ20ల్లో అత్యంత కీలకమైన ఫీల్డింగ్ విభాగంలోనూ కేకేఆర్ పటిష్టంగానే ఉంది. నితీశ్ రాణా, రింకూ సింగ్ లాంటి వరల్డ్‌క్లాస్ ఫీల్డర్లు ఆ జట్టులో ఉన్నారు. ఇన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు.. కేకేఆర్ దాదాపుగా అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్నా, గెలుపు కోసం శ్రమిస్తుంది. అన్ని విభాగాల్లో బలంగా ఉన్న కేకేఆర్.. కలిసికట్టుగా ఆడితే మాత్రం వీరిని ఆపడం కష్టమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
వాళ్లదే పైచేయి; డెత్ ఓవర్ల స్పెషలిస్టులు ఉన్నారు.. మాకేం భయం లేదు: మార్కరమ్
IPL 2023- Kolkata Knight Riders vs Sunrisers Hyderabad: ‘‘శార్దూల్ ఠాకూర్, రింకూ సింగ్ కేకేఆర్‌కు పూర్తి న్యాయం చేస్తున్నారు. కీలక సమయాల్లో అద్భుతంగా రాణించారు. నిజానికి కేకేఆర్ దూకుడైన ఆటతో ముందుకు సాగుతోంది. సమిష్టిగా రాణిస్తే వారిని తట్టుకోవడం కష్టమే. ప్రతి ఒక్కరికి తమ రోజంటూ ఒకటి ఉంటుంది. నిజానికి కేకేఆర్ రూపంలో మాకు భారీ ముప్పు ఎదురుకాబోతుంది. అయితే, మా బలాలు ఏమిటో మాకు తెలుసు. మా ప్రణాళికలు పక్కాగా అమలు చేస్తే గనుక అనుకున్న ఫలితాలను రాబట్టగలం. శార్దూల్, రింకూలు అద్భుతంగా ఫినిషింగ్ చేస్తున్నారు. అయితే, మా బౌలర్లపై మాకు పూర్తి నమ్మకం ఉంది. ముఖ్యంగా డెత్ ఓవర్లలో మా వాళ్లు అద్భుతంగా బౌలింగ్ చేస్తారు. ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయగలరు’’ అని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఎయిడెన్ మార్కరమ్ అన్నాడు. వరుస ఓటములు తర్వాత కాగా ఐపీఎల్-2023లో ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో మూడింట ఒకటి మాత్రమే గెలిచింది ఎస్ఆర్హెచ్. సొంతమైదానంలో రాజస్తాన్ రాయల్స్‌తో తమ ఆరంభ మ్యాచ్‌లో రెగ్యులర్ కెప్టెన్ మార్కరమ్ దూరం కాగా.. స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ సారథ్యం వహించాడు. ఈ మ్యాచ్‌లో భారీ తేడాతో ఓడి పరాజయంతో పదహారో ఎడిషన్‌ను ఆరంభించింది. ఇక రెండో మ్యాచ్‌కు మార్కరమ్ అందుబాటులోకి రాగా లక్నో సూపర్ జెయింట్స్‌లో చేతిలో 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. తర్వాత.. ఉప్పల్‌లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో గెలుపొంది.. ఎట్టకేలకు తొలి విజయం నమోదు చేసింది. కేకేఆర్‌తో మ్యాచ్ ఈ క్రమంలో ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో సన్‌రైజర్స్ శుక్రవారం తమ నాలుగో మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన కెప్టెన్ మార్కరమ్.. తమ బౌలర్లపై నమ్మకం ఉందంటూ ధీమా వ్యక్తం చేశాడు. కేకేఆర్‌కు గత రెండు మ్యాచ్‌లలో విజయాలు అందించిన శార్దూల్ ఠాకూర్, రింకూ సింగ్‌లను చూసి తామేమీ బెదిరిపోవడం లేదని.. వాళ్లను కట్టడి చేసే వ్యూహాలు రచించామని పేర్కొన్నాడు. ముఖాముఖి పోరులో మాత్రం కేకేఆర్‌తో ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌లలో సన్‌రైజర్స్ కేవలం 8 మ్యాచ్‌లలో మాత్రమే గెలుపొందింది. మిగిలిన 15 సార్లు విజయం కేకేఆర్‌నే వరించింది. ఇక ఈడెన్ గార్డెన్స్‌లో సైతం కోల్‌కతాదే పైచేయి. సొంతమైదానంలో ఎస్ఆర్హెచ్తో ఆడిన ఎనిమిది మ్యాచ్‌లలో కేకేఆర్ ఆరింట గెలుపొందింది. ఇక 2020 తర్వాత సన్‌రైజర్స్ కేవలం ఇక్కడ ఒక మ్యాచ్ మాత్రమే గెలిచింది. మీకు తెలుసా? సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠి ఇంత వరకు ఒక్కసారి కూడా సునిల్ నరైన్ బౌలింగ్‌లో అవుట్ కాలేదు. నరైన్ బౌలింగ్‌లో త్రిపాఠి 150కి పైగా స్ట్రైక్‌రేటుతో ఆధిపత్యం కొనసాగిస్తున్నాడు. ఇక మార్కరమ్ కేకేఆర్‌తో చివరి మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో 20 బంతుల్లో 40 పరుగులు రాబట్టాడు. సమిష్టిగా పోరాడితేనే సన్‌రైజర్స్ పేస్ దళానికి నాయకుడు టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్. అతడితో పాటు ప్రొటిస్ ఫాస్ట్‌బౌలర్ మార్కో జాన్సెన్, ఉమ్రాన్ మాలిక్, నటరాజన్ ఉన్నారు. ఇక స్పిన్ విభాగంలో ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్, గత మ్యాచ్ హీరో మయాంక్ మార్కండే మరోసారి రాణించాలని ఎస్ఆర్హెచ్ కోరుకుంటోంది. తుది జట్టులో బౌలింగ్ విభాగంలో మార్కండే, జాన్సెన్, భువీ, ఉమ్రాన్ మాలిక్‌కు కచ్చితంగా చోటు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే బ్యాటింగ్ విభాగంలో టాపార్డర్ రాణిస్తేనే కోల్‌కతాను నిలువరించడం సన్‌రైజర్స్‌కు సాధ్యమవుతుంది. కేకేఆర్‌తో మ్యాచ్ సన్‌రైజర్స్ తుది జట్టు అంచనా మయాంక్ అగర్వాల్, హ్యారీ బ్రూక్, రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్కరమ్(కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్, మయాంక్ మార్కండే, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్. చదవండి: ఒకప్పుడు పర్పుల్ క్యాప్ విన్నర్.. తర్వాత నెట్‌బౌలర్! 6.5 కోట్ల నుంచి 50 లక్షల ధరకు.. దుమ్ము రేపుతున్నాడు.. సన్‌రైజర్స్ వదిలేసి పెద్ద తప్పు చేసింది! ఎవరంటే? var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
అస్సలు ఊహించలేదు.. అందరి అంచనాలు తలకిందులు చేశాడు: మాజీ ప్లేయర్
IPL 2022- KKR vs RCB: ఐపీఎల్-2023లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు తొలి విజయం అందించిన ‘లార్డ్’ శార్దూల్ ఠాకూర్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. జట్టు కష్టాల్లో కూరుకుపోయిన వేళ ఈ పేస్ ఆల్‌రౌండర్ తన అద్భుత ఇన్నింగ్స్‌తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చి వేశాడంటూ కేకేఆర్ కెప్టెన్ నితీశ్ రాణా కొనియాడాడు. ఇక టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ సైతం శార్దూల్ నుంచి ఇలాంటి బ్యాటింగ్ ప్రదర్శన అస్సలు ఊహించలేదంటూ ఆకాశానికెత్తాడు. కాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో గురువారం జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 81 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈడెన్ గార్డెన్స్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్ టాపార్డర్‌లో ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్(57) మిగతా వాళ్లంతా దారుణంగా విఫలమయ్యారు. చుక్కలు చూపించిన శార్దూల్ ఈ క్రమంలో ఐదో స్థానంలో వచ్చిన రింకూ సింగ్(46), ఏడో స్థానంలో వచ్చిన శార్దూల్ ఠాకూర్ అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నారు. శార్దూల్ 29 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 68 పరుగులతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈ నేపథ్యంలో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి కేకేఆర్ 204 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన ఆర్సీబీ 123 పరుగులకే చాపచుట్టేసింది. కేకేఆర్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి 4 వికెట్లు పడగొట్టగా.. సునిల్ నరైన్ రెండు, సూయశ్ శర్మ మూడు వికెట్లతో మెరిశారు. బ్యాటింగ్‌లో అదరగొట్టి శార్దూల్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. రసెల్ లాంటి వాళ్ల నుంచి ఇలాంటివి ఊహిస్తాం.. కానీ ఈ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ షోలో ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ.. ‘‘కఠిన పరిస్థితుల్లో శార్దూల్ ఠాకూర్ ఆడిన ఇన్నింగ్స్ ప్రశంసనీయం. కేకేఆర్ టాపార్డర్, స్టార్ బ్యాటర్లు డగౌట్లో కూర్చున్న వేళ మైదానంలోకి దిగిన శార్దూల్ ప్రత్యర్థి జట్టు బౌలర్లకు ధీటుగా బదులిచ్చాడు. మ్యాచ్ స్వరూపాన్నే మార్చివేశాడు. ఊహించని రీతిలో శార్దూల్ నిజానికి ఆండ్రీ రసెల్, నితీశ్ రాణా, మన్దీప్ సింగ్ నుంచి ఇలాంటి ఇన్నింగ్స్ ఊహిస్తాం. కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ శార్దూల్ చెలరేగిన తీరు అద్బుతం. శార్దూల్ 30-35 పరుగులు చేస్తే ఎక్కువని భావిస్తాం. అలాంటిది అతడు ఎవరూ ఊహించని రీతిలో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. నమ్మకం నిలబెట్టుకున్నాడు టీ20లలో అతడికి ఇదే అత్యధిక స్కోరనుకుంటా. తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. వికెట్లు తీస్తాడని.. ఆరు.. ఏడో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడని కేకేఆర్ అతడిని కొనుగోలు చేసింది. తనను ఎంపిక చేసి వారు తప్పు చేయలేదని శార్దూల్ నిరూపించుకున్నాడు’’ అని ఇర్ఫాన్ పఠాన్.. శార్దూల్ ఠాకూర్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. కాగా కేకేఆర్ తమ తదుపరి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఏప్రిల్ 9న తలపడనుంది. చదవండి: ఎందుకు వస్తున్నాడో తెలియదు.. చెత్త బ్యాటింగ్! ప్రతీసారి ఇంతే గిల్, రాహుల్ కాదు.. అతడే టీమిండియా కెప్టెన్ అవుతాడు! జట్టులో ప్లేసే దిక్కు లేదు Lord Shardul Thakur show. Unbelievable hitting against RCB bowlers.pic.twitter.com/yY0qeQGhhC — Mufaddal Vohra (@mufaddal_vohra) April 6, 2023 -
IPL 2023: ఏప్రిల్ 6.. ఏడాది గ్యాప్.. కేకేఆర్ బ్యాటర్ల మహోగ్రరూపం
ఐపీఎల్ 2023లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో నిన్న (ఏప్రిల్ 6) జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 81 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో శార్దూల్ ఠాకూర్ (29 బంతుల్లో 68; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) పూనకం వచ్చినట్లు ఊగిపోవడంతో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. ఛేదనలో చేతులెత్తేసిన ఆర్సీబీ 17.4 ఓవర్లలో 123 పరుగులకు ఆలౌటై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. Still in awe of this... 🥰pic.twitter.com/amSg9sZdvU — KolkataKnightRiders (@KKRiders) April 6, 2023 ఇక్కడ గమనించదగ్గ ఆసక్తికర విషయం ఏంటంటే.. సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజున (ఏప్రిల్ 6, 2022) కేకేఆర్ ఆల్‌రౌండర్ పాట్ కమిన్స్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ బాదాడు. నాడు ముంబై ఇండియన్స్‌పై కమిన్స్ 14 బంతుల్లోనే హాఫ్‌సెంచరీ కొట్టాడు. నిన్నటి మ్యాచ్‌లో శార్దూల్ కూడా కమిన్స్ తరహాలోనే రెచ్చిపోయి ఆర్సీబీ బౌలర్లను ఊచకోత కోశాడు. ఒకే రోజు, ఏడాది గ్యాప్‌లో కేకేఆర్ బ్యాటర్లు మహోగ్రరూపం దాల్చడం యాదృచ్చికంగా జరిగినప్పటికీ కేకేఆర్ అభిమానులు మాత్రం ఏప్రిల్ 6 గురించి చెప్పుకుంటూ తెగ సంబురపడిపోతున్నారు. 𝘚𝘢𝘮𝘢𝘫𝘩 𝘳𝘢𝘩𝘦 𝘩𝘰! 😌@imShard @patcummins30 #KKRvRCB | #AmiKKR | #TATAIPL 2023 pic.twitter.com/shanGi5s82 — KolkataKnightRiders (@KKRiders) April 6, 2023 ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్‌లో కేకేఆర్ ఇన్నింగ్స్‌లో శార్దుల్‌తో పాటు రహ్మానుల్లా గుర్బాజ్ (44 బంతుల్లో 57; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), రింకూ సింగ్ (33 బంతుల్లో 46; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) కూడా అదరగొట్టారు. ఆర్సీబీ బౌలర్లలో డేవిడ్ విల్లీ, కరణ్ శర్మ తలో 2 వికెట్లు పడగొట్టారు. Pat Cummins finishes things off in style! Also brings up the joint fastest half-century in #TATAIPL off 14 deliveries.#KKR win by 5 wickets with 24 balls to spare. Scorecard - https://t.co/22oFJJzGVN #KKRvMI #TATAIPL pic.twitter.com/r5ahBcIWgR — IndianPremierLeague (@IPL) April 6, 2022 అనంతరం 205 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీని.. వరుణ్ చక్రవర్తి (4/15), సునీల్ నరైన్ (2/16), ఇంపాక్ట్ ప్లేయర్ సుయశ్ శర్మ (3/30) దారుణంగా దెబ్బకొట్టారు. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో డెప్లెసిస్ (23) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. -
శార్దుల్ ధనాధన్...కేకేఆర్ ఘన విజయం
కోల్‌కతా: సొంతగడ్డపై కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) సమష్టి ప్రదర్శనతో గర్జించింది. ఐపీఎల్ టోర్నీలో తొలి విజయం నమోదు చేసింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుతో ఈడెన్ గార్డెన్స్‌లో గురువారం జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 81 పరుగుల తేడాతో గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 20 ఓవర్లలో 7 వికెట్లకు 204 పరుగులు సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శార్దుల్ ఠాకూర్ (29 బంతుల్లో 68; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. గుర్బాజ్ (44 బంతుల్లో 57; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), రింకూ సింగ్ (33 బంతుల్లో 46; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) కూడా దూకుడుగా ఆడారు. ఈ ముగ్గురి బ్యాటింగ్ కారణంగా కోల్‌కతా స్కోరు 200 పరుగులు దాటింది. బెంగళూరు బౌలర్లలో డేవిడ్ విల్లీ, కరణ్ శర్మ రెండు వికెట్ల చొప్పున తీశారు. అనంతరం 205 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు 17.4 ఓవర్లలో 123 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. వరుణ్ చక్రవర్తి (4/15), సునీల్ నరైన్ (2/16), తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడిన ‘ఇంపాక్ట్ ప్లేయర్’ సుయశ్ శర్మ (3/30) తమ స్పిన్ మాయాజాలంతో బెంగళూరు జట్టును దెబ్బతీశారు. ఆ ఇద్దరి దూకుడుతో... తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతాకు శుభారంభం లభించలేదు. డేవిడ్ విల్లీ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో వరుస బంతుల్లో వెంకటేశ్ అయ్యర్, మన్దీప్ బౌల్డ్ అయ్యారు. ఒకవైపు గుర్బాజ్ జోరు కొనసాగించడంతో కోల్‌కతా పవర్‌ప్లేలో రెండు వికెట్లకు 47 పరుగులు చేసింది. ఏడో ఓవర్ తొలి బంతికి కోల్‌కతా కెపె్టన్ నితీశ్ రాణా అవుటయ్యాడు. ఆ తర్వాత రింకూ సింగ్‌తో జత కలిసి గుర్బాజ్ కోల్‌కతా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. 11 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా 87/3తో నిలిచింది. కరణ్ శర్మ వేసిన 12వ ఓవర్లో కోల్‌కతాకు దెబ్బ పడింది. వరుస బంతుల్లో గుర్బాజ్, రసెల్ పెవిలియన్ చేరడంతో కోల్‌కతా 89/5తో ఇబ్బందుల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చి న శార్దుల్ ఠాకూర్ చెలరేగిపోయాడు. బెంగళూరు బౌలర్లపై ఫోర్లు, సిక్స్‌లతో విరుచుకుపడ్డాడు. 20 బంతుల్లోనే 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రింకూ, శార్దుల్ 102 పరుగుల భాగస్వామ్యానికి 19వ ఓవర్ చివరి బంతికి హర్షల్ పటేల్ తెరదించాడు. ఆఖరి ఓవర్లో శార్దుల్‌ను సిరాజ్ అవుట్ చేయగా... చివరి రెండు బంతుల్లో ఉమేశ్ ఆరు పరుగులు స్కోరు చేయడంతో కోల్‌కతా స్కోరు 200 పరుగులు దాటింది. తడబాటు... భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరుకు ఓపెనర్లు కోహ్లి (18 బంతుల్లో 21; 3 ఫోర్లు), డు ప్లెసిస్ (12 బంతుల్లో 23; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) శుభారంభం ఇచ్చారు. అయితే ఐదో ఓవర్లో నరైన్ బౌలింగ్‌లో కోహ్లి, ఆరో ఓవర్లో వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో డు ప్లెసిస్ బౌల్డయ్యారు. దాంతో బెంగళూరు ఇన్నింగ్స్ తడబడింది. హిట్టర్లు బ్రేస్‌వెల్, మ్యాక్స్‌వెల్, దినేశ్ కార్తీక్ క్రీజులో నిలదొక్కుకోవడంలో విఫలమయ్యారు. తక్కువ స్కోర్లకే పెవిలియన్ బాట పట్టడంతో బెంగళూరు ఓటమి ఖాయమైంది. కోల్‌కతా జట్టులో వెంకటేశ్ అయ్యర్ స్థానంలో ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా బరిలోకి దిగిన లెగ్ స్పిన్నర్, 19 ఏళ్ల సుయశ్ శర్మ మూడు వికెట్లతో ప్రభావం చూపించాడు. మరోవైపు బెంగళూరు ఇన్నింగ్స్‌లో సిరాజ్ స్థానంలో ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా బరిలోకి దిగిన అనూజ్ రావత్ కేవలం ఒక పరుగు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఐపీఎల్లో నేడు లక్నోVs హైదరాబాద్ (రాత్రి గం. 7:30 నుంచి ) స్టార్ స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం స్కోరు వివరాలు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: రహా్మనుల్లా గుర్బాజ్ (సి) ఆకాశ్‌దీప్ (బి) కరణ్ శర్మ 57; వెంకటేశ్ అయ్యర్ (బి) విల్లీ 3; మన్దీప్ సింగ్ (బి) విల్లీ 0; నితీశ్ రాణా (సి) దినేశ్ కార్తీక్ (బి) బ్రేస్‌వెల్ 1; రింకూ సింగ్ (సి) దినేశ్ కార్తీక్ (బి) హర్షల్ పటేల్ 46; రసెల్ (సి) కోహ్లి (బి) కరణ్ శర్మ 0; శార్దుల్ ఠాకూర్ (సి) మ్యాక్స్‌వెల్ (బి) సిరాజ్ 68; నరైన్ (నాటౌట్) 0; ఉమేశ్ యాదవ్ (నాటౌట్) 6; ఎక్స్‌ట్రాలు 23; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 204. వికెట్ల పతనం: 1–26, 2–26, 3–47, 4–89, 5–89, 6–192, 7–198. బౌలింగ్: సిరాజ్ 4–0–44–1, డేవిడ్ విల్లీ 4–1–16–2, ఆకాశ్‌దీప్ 2–0–30–0, బ్రేస్‌వెల్ 3–0–34–1, షహబాజ్ అహ్మద్ 1–0–6–0, కరణ్ శర్మ 3–0–26–2, హర్షల్ పటేల్ 3–0–38–1. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (బి) నరైన్ 21; డు ప్లెసిస్ (బి) వరుణ్ చక్రవర్తి 23; బ్రేస్‌వెల్ (సి) నితీశ్ రాణా (బి) శార్దుల్ ఠాకూర్ 19, మ్యాక్స్‌వెల్ (బి) వరుణ్ చక్రవర్తి 5; హర్షల్ పటేల్ (బి) వరుణ్ చక్రవర్తి 0; షహబాజ్ అహ్మద్ (సి) శార్దుల్ (బి) నరైన్ 1; దినేశ్ కార్తీక్ (సి) వరుణ్ (బి) సుయశ్ శర్మ 9; అనూజ్ రావత్ (సి) నరైన్ (బి) సుయశ్ శర్మ 1; విల్లీ (నాటౌట్) 20, కరణ్ శర్మ (సి) నితీశ్ రాణా (బి) సుయశ్ శర్మ 1, ఆకాశ్‌దీప్ (సి అండ్ బి) వరుణ్ చక్రవర్తి 17; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (17.4 ఓవర్లలో ఆలౌట్) 123. వికెట్ల పతనం: 1–44, 2–46, 3–54, 4–54, 5–61, 6–61, 7–84, 8–86, 9–96, 10–123. బౌలింగ్: ఉమేశ్ యాదవ్ 2–0–17–0, టిమ్ సౌతీ 2–0–25–0, సునీల్ నరైన్ 4–0–16–2, వరుణ్ చక్రవర్తి 3.4–0–15–4, సుయశ్ శర్మ 4–0–30–3, శార్దుల్ ఠాకూర్ 2–0–15–1. -
#Lord Shardul: ఆర్సీబీకి చుక్కలు.. తొలి ఫిఫ్టీతోనే రికార్డులు
ఐపీఎల్ 16వ సీజన్లో కేకేఆర్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ ఆర్సీబీకి చుక్కలు చూపించాడు. తన బ్యాటింగ్ పవర్ చూపించిన శార్దూల్ ఐపీఎల్లో తొలి అర్థసెంచరీ సాధించాడు. కేవలం 20 బంతుల్లోనే అర్థశతకం మార్క్ అందుకున్న శార్దూల్ ఠాకూర్ ఈ సీజన్లో జాయింట్ ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించి రికార్డులకెక్కాడు. ఇంతకముందు ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ బ్యాటర్ జాస్ బట్లర్ కూడా 20 బంతుల్లోనే అర్థశతకం సాధించాడు. ఇక కేకేఆర్ తరపున ఏడు, ఆ తర్వాత స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చి 50ప్లస్ స్కోరు సాధించిన ఆటగాడిగాను నిలిచాడు. ఇంతకముందు ఆండ్రీ రసెల్ ఐదుసార్లు, పాట్ కమిన్స్ మూడుసార్లు, సాహా, శార్దూల్ ఠాకూర్లు ఒక్కోసారి ఈ ఘనత సాధించారు. ఇక ఏడు ఆ తర్వాత స్థాన్లాల్లో బ్యాటింగ్‌కు వచ్చి ఐపీఎల్లో అత్యధిక స్కోరు సాధించిన బ్యాటర్ల జాబితాలోనూ శార్దూల్ చోటు సంపాదించాడు. ఓవరాల్‌గా శార్దూల్ 29 బంతుల్లో 69 పరుగులు చేసి ఔటయ్యాడు. అతని ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ఒక దశలో 150 కూడా కష్టమనుకున్న తరుణంలో రింకూ సింగ్(33 బంతుల్లో 46 పరుగులు)తో కలిసి ఆరో వికెట్‌కు 103 పరుగులు జోడించి కేకేఆర్ స్కోరు 200 మార్క్ అందుకునేలా చేశాడు. Lord Shardul Thakur show. Unbelievable hitting against RCB bowlers.pic.twitter.com/yY0qeQGhhC — Mufaddal Vohra (@mufaddal_vohra) April 6, 2023 -
అయ్యర్ దూరం.. కేకేఆర్ కెప్టెన్ అతడేనా..?
ఐపీఎల్-2023 సీజన్‌కు కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్, టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ దూరమైన సంగతి తెలిసిందే. అయ్యర్ గత కొంత కాలంగా వెన్ను సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ గాయం కారణంగానే ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు దూరంగా ఉన్న అయ్యర్.. మూడో టెస్టుకు జట్టుతో కలిశాడు. అయితే అహ్మదాబాద్ వేదికగా ఆసీస్‌తో జరిగిన ఆఖరి టెస్టులో అయ్యర్ గాయం మళ్లీ తిరిగి బెట్టింది. దీంతో అతడు నాలుగో టెస్టులో బ్యాటింగ్ కూడా రాలేదు. ఈ క్రమంలో అతడు ఆసీస్‌తో వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. కాగా తన వెన్నుముక సంబంధిత సమస్యకు సర్జరీ చేయించుకోవాలని అయ్యర్‌ను నేషనల్ క్రికెట్ అకాడమీ వైద్య బృందం సూచించింది. ఒక వేళ సర్జరీ జరిగితే అతడు దాదాపు ఏడాది వరకు ఆటకు దూరంగా ఉండాల్సి వస్తుంది. అదే విధంగా ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ జరగనుండంతో అయ్యర్ ఎన్సీఏ సలహాను తిరస్కరించినట్లు తెలుస్తోంది. అయితే అయ్యర్ ప్రస్తుతం డాక్టర్ల సలహా మెరకు ఇంటి వద్దే విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఏదిఏమైనప్పటికీ అయ్యర్ ఈ ఏడాది ఐపీఎల్‌కు మాత్రం దూరంగా ఉండనున్నాడు. కేకేఆర్ కెప్టెన్‌గా శార్దూల్ ఠాకూర్.. ఇక ఈ ఏడాది సీజన్‌కు అయ్యర్ దూరం కావడంతో కేకేఆర్ తమ కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేసే పనిలో పడింది. కేకేఆర్ కెప్టెన్సీ రేసులో ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్లు శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్ ఉన్నారు. అయితే టైమ్స్ ఇండియా రిపోర్ట్ ప్రకారం.. కేకేఆర్ జట్టు మేనెజ్మెంట్ శార్దూల్ ఠాకూర్ వైపు మెగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఐపీఎల్-2023 మినీ వేలంకు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి ట్రేడింగ్ ద్వారా శార్దూల్‌ను ఢిల్లీ కొనుగోలు చేసింది. మరోవైపు యూఏఈ టీ20లీగ్‌లో కేకేఆర్ ఫ్రాంచైజీ అబుదాబి నైట్‌రైడర్స్ కు సారథ్యం వహించిన సునీల్ నరైన్ దారుణంగా విఫలమయ్యాడు. అతడు కెప్టెన్సీలోని నైట్‌రైడర్స్ కేవలం ఒకే ఒక మ్యాచ్‌లో విజయం సాధించింది. దీంతో నరైన్‌ను కాదని శార్దూల్‌కే తమ జట్టు పగ్గాలు అప్పజెప్పాలని కేకేఆర్ దృఢ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తమ కొత్త కెప్టెన్ పేరును ఒకట్రెండు రోజుల్లో కేకేఆర్ ప్రకటించే అవకాశం ఉంది. ఇక కేకేఆర్ తమ తొలి మ్యాచ్‌లో ఏప్రిల్1న పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. చదవండి: BCCI: భువనేశ్వర్‌కు బిగ్ షాకిచ్చిన బీసీసీఐ.. ఇక మర్చిపోవడమే! -
Ind Vs Aus: నేనెలా అర్హుడిని అవుతాను? జట్టులో చోటు గురించి ఆలోచనే లేదు!
India vs Australia- WTC Final: ‘‘నేను ప్రతి విషయంలోనూ నిక్కచ్చిగా.. నిజాయితీగా ఉంటాను. జట్టులో చోటు దక్కించుకునేందుకు చేయాల్సిన దాంట్లో కనీసం 10 శాతం కూడా సాధించలేదు. పది దాకా ఎందుకు.. కనీసం ఒక్క శాతం కూడా నేను అందుకు అర్హుడిని కాను. అలాంటిది.. ఇప్పటికిప్పుడు జట్టులోకి వచ్చి వేరే వాళ్ల స్థానాన్ని ఆక్రమించలేను కదా! అది సరైంది కాదు కూడా!’’ అని టీమిండియా తాత్కాలిక కెప్టెన్ హార్దిక్ పాండ్యా అన్నాడు. లేదు.. ఆ ఆలోచనే లేదు! ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ నేపథ్యంలో రోహిత్ శర్మ గైర్హాజరీలో స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మొదటి మ్యాచ్‌కు సారథ్యం వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన పాండ్యాకు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ గురించి ప్రశ్న ఎదురైంది. ఐపీఎల్-2023 తర్వాత జరుగబోయే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు మీరు అందుబాటులో ఉంటారా అన్న ప్రశ్నకు బదులుగా.. ‘‘లేదు’’ అని హార్దిక్ స్పష్టం చేశాడు. అసలు ఇప్పట్లో టెస్టు జట్టులో చోటు గురించి అసలు తనకు ఆలోచనే లేదని కుండబద్దలు కొట్టాడు. కాగా 2017 జూలైలో శ్రీలంకతో మ్యాచ్ సందర్భంగా అంతర్జాతీయ టెస్టుల్లో అడుగుపెట్టిన ఈ పేస్ ఆల్‌రౌండర్.. 2018లో ఇంగ్లండ్‌తో ఆడిన టెస్టు ఆఖరిది. అప్పటి నుంచి ఇంతవరకు అతడు టెస్టు మ్యాచ్ ఆడలేదు. పేస్ ఆల్‌రౌండర్ కావాలి కదా! పోటీలో లేను ఇక ఇప్పుడు పరిమిత ఓవర్ల క్రికెట్లో భవిష్య కెప్టెన్‌గా ఎదుగుతున్న 29 ఏళ్ల పాండ్యా.. ఇప్పటికే పలు టీ20 సిరీస్‌లకు సారథ్యం వహించి పలు విజయాలు అందుకున్నాడు. ఈ నేపథ్యంలో టెస్టుల్లో అతడి రీఎంట్రీ గురించి చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే.. స్వదేశంలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 సిరీస్‌లో ఆస్ట్రేలియాపై విజయం సాధించిన టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇంగ్లండ్ వేదికగా జూన్ 7-11 వరకు ఫైనల్ ఆడనుంది. ఈ నేపథ్యంలో పేస్ ఆల్‌రౌండర్ ఆవశ్యకత గురించి కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడగా.. శార్దూల్ ఠాకూర్ ప్రస్తావన వచ్చింది. విదేశాల్లో ముఖ్యంగా ఆసీస్‌పై అతడికి మంచి రికార్డే ఉంది. ఈ నేపథ్యంలో డబ్ల్యూటీసీ ఫైనల్ జట్టు కూర్పుపై ప్రశ్న ఎదురుకాగా.. హార్దిక్ పాండ్యా ఇలా తాను పోటీలో లేనంటూ క్లారిటీ ఇచ్చాడు. చదవండి: Ind Vs Aus: అప్పటి మ్యాచ్‌లో విజయం వాళ్లదే! కానీ ఈసారి.. పిచ్ ఎలా ఉందంటే! Rishabh Pant: ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నాడు! పంత్‌ను కలిసిన యువీ.. ఫొటో వైరల్ -
ముంబైలో ఘనంగా క్రికెటర్ శార్దూల్ ఠాకూర్ పెళ్లి (ఫొటోలు)
-
ప్రేయసితో ఘనంగా టీమిండియా ఆల్‌రౌండర్ పెళ్లి
టీమిండియా ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ సోమవారం రాత్రి ఒక ఇంటివాడయ్యాడు. తన స్నేహితురాలు, వ్యాపారవేత్త మిథాలీ పారుల్కర్‌ను పెళ్లాడాడు. బంధువులు, స్నేహితులు, అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఈ జంట ఒక్కటయ్యారు. ముంబైలో అంగరంగ వైభవంగా ఈ వివాహ వేడుక జరిగింది. గత కొన్నేళ్లుగా వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడిచింది. ఇరు కుటుంబాలు అంగీకరించడంతో గతేడాది నవంబర్‌లో నిశ్చితార్థం జరిగింది. తాజాగా సోమవారం రాత్రి వివాహబంధంతో వీరిద్దరు ఒక్కటయ్యారు. మిథాలీ పారుల్కర్ ‘ది బేక్స్’ పేరుతో బేకరీ ఫుడ్ వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. ఆల్ ది జాజ్ లగ్జరీ బేకర్స్ సంస్థ ద్వారా ముంబైలో వ్యాపారాలను నిర్వహిస్తోంది. క్రికెటర్ దీపక్ చాహర్ భార్య మాలతీ చాహర్ వివాహ వేడుకలో కనిపించింది. కేకేఆర్ టీమ్ మేనేజ్మెంట్ సభ్యుడు అభిషేక్ నాయర్, ముంబై ప్లేయర్ సిద్ధేష్ లాడ్ కూడా శార్దూల్ ఠాకూర్ పెళ్లికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ఇక టీమిండియా తరపున శార్దూల్ ఠాకూర్ 8 టెస్టులు, 34 వన్డేలు, 25 టి20 మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించాడు. గతేడాది ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడిన శార్దూల్ 14 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు తీయడంతో పాటు 120 పరుగులు చేశాడు. గతేడాది మినీ వేలంలో శార్దూల్ ట్రేడింగ్‌లో కేకేఆర్‌కు బదిలీ అయ్యాడు. మార్చి 31 నుంచి ఐపీఎల్ 2023 సీజన్ షురూ కానుంది. కాగా, పెళ్లి కారణంగా శార్దూల్ ఠాకూర్ ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్‌కు దూరమయ్యాడు. అయితే, ఆసీస్‌తో వన్డే సిరీస్ కు శార్దూల్ జట్టులో చేరతాడని సమాచారం. Congratulations You Beautiful Couple Lord #Shardul Thakur and Mittali Parulkar pic.twitter.com/vKSUQjGgY1 — Lalit Tiwari (@lalitforweb) February 27, 2023 చదవండి: ఓటమి నేర్పిన పాఠం.. ప్రతీసారి 'బజ్‌బాల్' పనికిరాదు పరుగు తేడాతో విజయం.. 30 ఏళ్ల రికార్డు కనుమరుగు -
Viral Video: శార్దూల్ ఠాకూర్ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్లో శ్రేయస్ అయ్యర్ రచ్చ
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ ఇవాళ (ఫిబ్రవరి 27) ముంబైలో తన ఫియాన్సీ మిథాలీ పరుల్కర్‌ను వివాహం చేసుకోనున్న విషయం తెలిసిందే. పెళ్లి ఇవాళే అయినప్పటికీ కొద్ది రోజుల ముందు నుంచే సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. మెహందీ ఫంక్షన్లో శార్దూల్ ఓ కర్రాడితో కలిసి మాస్ డ్యాన్స్ చేసిన వీడియోలు ఇప్పటికీ సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుండగా.. తాజాగా శార్దూల్ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్‌కు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట హల్చల్ చేస్తుంది. ఈ వీడియోలో టీమిండియా స్టార్ ఆటగాడు, ఐపీఎల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ సారధి శ్రేయస్ అయ్యర్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచాడు. గత కొన్ని రోజులుగా ఏదో ఒక వీడియోతో సోషల్‌మీడియాను షేక్ చేస్తున్న అయ్యర్.. ఈ వీడియోలోనూ తన స్టయిల్లో హంగామా చేశాడు. కేకేఆర్ టీమ్ మేనేజ్మెంట్ సభ్యుడు అభిషేక్ నాయర్‌తో కలిసి శార్దూల్-మిథాలీ ప్రీవెడ్డింగ్ ఫంక్షన్‌కు హాజరైన అయ్యర్.. బ్రహ్మాస్త్ర సినిమాలోని పాపులర్ 'కేసరియా' పాటను పాడాడు. సింగర్‌తో పాటు శ్రేయస్, నాయర్లు పాట పాడుతుండగా.. కాబోయే భార్య మిథాలీతో కలిసి శార్దూల్ కొన్ని రొమాంటిక్ స్టెప్పులేశాడు. View this post on Instagram A post shared by Kolkata Knight Riders (@kkriders) అనంతరం శార్దూల్ స్టేజ్‌పైకి ఎక్కి కేకేఆర్ సహచరులతో పాటు కొన్ని లైన్లు పాట కూడా పాడాడు. ఈ మొత్తం తంతుకు సంబంధించిన వీడియోను కేకేఆర్ టీమ్ మేనేజ్మెంట్ సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది. ఇందుకు క్యాప్షన్‌గా పలు ఆసక్తికర కామెంట్స్‌ను కూడా జోడించింది. ఒక్క విషయం చెప్పండి.. కేకేఆర్ బాయ్స్‌పై ఎవరైనా ఎలా మనసు పారేసుకోలేరు అంటూ కామెంట్స్ జోడించింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాను షేక్ చేస్తుంది. ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన 3 గంటల్లోనే ఈ వీడియోకు రికార్డు స్థాయిలో 65000 లైకుల వచ్చాయి. కాగా, శ్రేయస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్ ఇద్దరు టీమిండియాతో పాటు ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. శ్రేయస్.. కేకేఆర్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా.. శార్దూల్‌ను ఇటీవలే కేకేఆర్ ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి ట్రేడింగ్ చేసుకుంది. ప్రస్తుతం ఆసీస్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ ముగిసాక జరిగే 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో శ్రేయస్-శార్దూల్ కలిసి పాల్గొంటారు. అనంతరం ఐపీఎల్లో కేకేఆర్ తరఫున వీరి జర్నీ ప్రారంభమవుతుంది. శ్రేయస్, శార్దూల్ ఇద్దరూ మహారాష్ట్రకు చెందిన వారే కావండతో వీరిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ బలపడింది. -
గ్రాండ్‌గా భారత స్టార్ క్రికెటర్ శార్దూల్ ఠాకూర్ హల్దీ ఫంక్షన్ (ఫొటోలు)
-
రెండు రోజుల్లో భారత స్టార్ క్రికెటర్ పెళ్లి.. డ్యాన్స్ అదిరిపోయిందిగా! వీడియో వైరల్
టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ పెళ్లి పీటలెక్కనున్నాడు. తన ప్రేయసి మితాలీ పారుల్కర్ ఫిబ్రవరి 27న (సోమవారం) శార్దూల్ మనువాడనున్నాడు. ముంబైలోని ఓ ఫంక్షన్ హాల్లో వీరిద్దరి పెళ్లి ఘనంగా జరగనుంది. వీరిద్దరి వివాహానికి 250 మంది అతిథులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. మరో రెండ్రోజుల్లో జరగబోయే వీరి పెళ్లి సందడి ఇప్పటికే ప్రారంభమైంది. హల్దీ, మెహందీ వేడుకలు ఘనంగా ముగిశాయి. హల్దీ వేడుకలో శార్దూల్ డ్యాన్స్ ఇరగదీశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా కొన్ని నెలల క్రితం ఓ ఇంటర్వ్యూలో పెళ్లికూతురు మిథాలీ స్వయంగా వారిద్దరి పెళ్లి గురించి ప్రస్తావించింది. 2021 నవంబర్ లో వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది. అయితే వీరి వివాహం టీ20 ప్రపంచకప్-2022 అనంతరం జరగాల్సింది. కానీ వివిధ కారణల వలన వాయిదా పడింది. ఇక ఈ ఏడాది ఆరంభంలో టీమిండియా స్టార్ క్రికెటర్లు కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ కూడా మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. బాలీవుడ్ నటి అతియా శెట్టితో రాహుల్ వివాహం కాగా..అక్షర్ పటేల్ తన స్నేహితురాలు మేహా పటేల్‌ను పెళ్లి చేసుకున్నాడు. View this post on Instagram A post shared by Shardul Thakur FC🔵 (@shardulthakur16) చదవండి: Dinesh Karthik: 'అతడికి 300 వికెట్లు తీసే సత్తా ఉంది.. ప్రపంచకప్‌లో అదరగొడతాడు' -
WC 2023: ప్రపంచకప్ జట్టులో శార్దూల్‌కు చోటు ఖాయం! అంతలేదు..
India vs New Zealand- Shardul Thakur: ‘‘శార్దూల్.. అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. లోపాలు సవరించుకుంటూ పట్టువదలని విక్రమార్కుడిలా ముందుకు సాగుతూనే ఉంటాడు. తను బంతిని పెద్దగా స్వింగ్ చేయలేడని మనం భావించినప్పుడల్లా మనల్ని ఆశ్చర్యపరుస్తూ వికెట్లు తీస్తూనే ఉంటాడు. తను ప్రతిసారి గంటకు 140కిలోమీటర్లకు పైగా వేగంతో బౌలింగ్ చేయకపోవచ్చు. కానీ.. అతడు నంబర్ 1గా ఎదుగుతాడు’’ అని టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. భారత పేస్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌ను ఉద్దేశించి ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. రాణించిన శార్దూల్ ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్‌తో ముగిసిన వన్డే సిరీస్‌లో శార్దూల్ మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. హైదరాబాద్‌లో జరిగిన మొదటి వన్డేలో 7.2 ఓవర్లలో 54 పరుగులు ఇచ్చిన రెండు వికెట్లు తీసిన అతడు.. 3 పరుగులు చేయగలిగాడు. రాయ్‌పూర్ వన్డేలో 6 ఓవర్లలో 26 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఆఖరిదైన ఇండోర్ మ్యాచ్‌లో 17 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 25 పరుగులతో సత్తా చాటిన శార్దూల్.. 6 ఓవర్లలో 45 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. చోటు ఖాయం ఈ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ మ్యాచ్ పాయింట్ సందర్భంగా.. వన్డే ప్రపంచకప్ జట్టు గురించి ప్రస్తావనకు రాగా ఇర్ఫాన్ పఠాన్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కివీస్‌తో ఫైనల్ వన్డేలో శార్దూల్ ప్రదర్శనపై స్పందిస్తూ.. వరల్డ్‌కప్ జట్టులో ఫాస్ట్‌బౌలర్ల విభాగంలో అతడికి కచ్చితంగా చోటు దక్కుతుందని అంచనా వేశాడు. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ చేయగల శార్దూల్ మిగతా వాళ్లకంటే ఓ అడుగు ముందే ఉంటాడని చెప్పుకొచ్చాడు. అంతలేదన్న మంజ్రేకర్ అయితే, మరో మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ మాత్రం ఇర్ఫాన్ అభిప్రాయంతో ఏకీభవించలేదు. ప్రపంచకప్ జట్టులో శార్దూల్‌కు స్థానం దక్కుతుందని తాను భావించడం లేదన్నాడు. ‘‘మెగా టోర్నీకి ఇంకా చాలా సమయం ఉంది. జట్టులో హార్దిక్ పాండ్యా ఉన్నాడు. తనూ పేస్ ఆల్‌రౌండరే. కాబట్టి శార్దూల్‌కు చోటు కష్టమే. పేసర్ల విభాగంలోనూ అతడు గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది’’ అని మంజ్రేకర్ పేర్కొన్నాడు. చదవండి: ICC T20 World Cup: ప్రపంచకప్ సెమీ ఫైనల్లో టీమిండియా.. కివీస్‌తో పోరుకు సై IPL: ఆల్‌టైం జట్టులో ఏబీడీకి చోటివ్వని టీమిండియా లెజెండ్! కానీ.. -
అప్పటికే 2 వికెట్లు.. అయినా శార్దూల్‌పై రోహిత్ ఫైర్! మరీ ఇంత ఓవరాక్షనా?
India vs New Zealand, 3rd ODI: మైదానంలో ఉన్నపుడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చాలా వరకు కూల్‌గానే ఉంటాడు. కానీ.. కీలక సమయంలో ఆటగాళ్లు.. ప్రత్యర్థి పని సులువు చేస్తూ.. మరీ చిన్న చిన్న విషయాల్లో కూడా పొరపాట్లు చేస్తే మాత్రం విశ్వరూపం ప్రదర్శిస్తాడు. సహనం కోల్పోయి నోటికి పని చెప్తాడు. న్యూజిలాండ్‌తో మూడో వన్డే సందర్భంగా పేసర్ శార్దూల్ ఠాకూర్‌కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఇండోర్ వేదికగా మంగళవారం జరిగిన నామమాత్రపు ఆఖరి మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. పర్యాటక కివీస్‌పై ఏకంగా 90 పరుగుల తేడాతో గెలుపొంది సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. అయితే, న్యూజిలాండ్ ఓపెనర్ డెవాన్ కాన్వే మాత్రం కాస్త భయపెట్టాడు. 100 బంతుల్లో 12 ఫోర్లు, 8 సిక్స్‌ల సాయంతో 138 పరుగులు చేసి ప్రమాదకరంగా పరిణమించిన ఈ బ్యాటర్‌ను ఉమ్రాన్ మాలిక్ 31.4వ ఓవర్లో పెవిలియన్‌కు పంపాడు. శార్దూల్‌పై రోహిత్ ఫైర్ కాన్వే ఇన్నింగ్స్‌కు బ్రేక్ వేశాడు. మిడ్ వికెట్లో ఫీల్డింగ్ చేస్తున్న కెప్టెన్ రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి కాన్వే మైదానాన్ని వీడాడు. అంతకు ముందు అంటే.. 26వ ఓవర్లో శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో కాన్వే వరుసగా రెండు బౌండరీలు బాదడంతో రోహిత్ సహనం కోల్పోయాడు. శార్దూల్ దగ్గరికి వెళ్లి.. ‘‘చూసుకుని బౌలింగ్ చేయొచ్చు కదా.. అసలేం ఏం చేస్తున్నావు’’ అన్నట్లు కోపం ప్రదర్శించాడు. ఇంత ఓవరాక్షనా? అయితే, ఆ ఓవర్లో అప్పటికే మిచెల్ సాంట్నర్(24), టామ్ లాథమ్(0) వికెట్లు తీసిన శార్దూల్ .. రోహిత్ మాటలు పట్టించుకోనట్లుగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు రోహిత్‌పై ఫైర్ అవుతున్నారు. ‘‘పిచ్చి పట్టినట్లు ప్రవర్తించావు.. రెండు ఫోర్లకే అంత ఓవరాక్షనా? తను అంతకు ముందే కదా రెండు వికెట్లు తీశాడు. పాపం శార్దూల్’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కాగా మూడో వన్డేలో శార్దూల్ ఠాకూర్ 6 ఓవర్ల బౌలింగ్‌లో 45 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. అదే విధంగా 17 బంతుల్లో 25 పరుగులు సాధించాడు ఈ పేస్ ఆల్‌రౌండర్. చదవండి: SEC Vs PR: చెలరేగిన బట్లర్, మిల్లర్.. సన్‌రైజర్స్‌కు తప్పని ఓటమి.. అయినా.. మైదానంలో ‘కింగ్’లైనా.. ‘రాణుల’ ప్రేమకు తలవంచిన వాళ్లే! pic.twitter.com/uZ3wpkU3qd — Anna 24GhanteChaukanna (@Anna24GhanteCh2) January 25, 2023 -
టీమిండియా బౌలర్ల విజృంభణ.. 108 పరుగులకే కుప్పకూలిన న్యూజిలాండ్
రాయ్‌పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా బౌలర్లు రెచ్చిపోయారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన భారత్.. మహ్మద్ షమీ (3/18), మహ్మద్ సిరాజ్ (1/10), శార్దూల్ ఠాకూర్ (1/26), హార్ధిక్ పాండ్యా (2/16), కుల్దీప్ యాదవ్ (1/29), వాషింగ్టన్ సుందర్ (2/7) విజృంభించడంతో 34.3 ఓవర్లలోనే కివీస్‌ను ఆలౌట్ చేసింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో గ్లెన్ ఫిలిప్స్ (36), మైఖేల్ బ్రేస్‌వెల్ (22), మిచెల్ సాంట్నర్ (27) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. తొలి వన్డే సెంచరీ హీరో బ్రేస్‌వెల్ ఈ మ్యాచ్‌లోనూ చెలరేగేలా కనిపించినప్పటికీ.. అతన్ని షమీ బోల్తా కొట్టించాడు. కివీస్ ఇన్నింగ్స్‌లో ఫిన్ అలెన్ (0), డెవాన్ కాన్వే (7), హెన్రీ నికోల్స్ (2), డారిల్ మిచెల్ (1), టామ్ లాథమ్ (1), ఫెర్గూసన్ (1), బ్లెయిర్ టిక్నర్ (2) విఫలమయ్యారు. కాగా, హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్ 12 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. 3 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. -
రెండో వన్డేలోనూ ఉమ్రాన్‌కు నో ఛాన్స్! ఒకవేళ ఆడించినా..
India vs New Zealand: న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో కూడా టీమిండియా యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్‌కు చోటు దక్కే అవకాశం లేదని భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ అన్నాడు. జట్టుకు ప్రస్తుతం ఆల్‌రౌండర్ల అవసరం ఎక్కువగా ఉందని అభిప్రాయపడ్డాడు. బ్యాటింగ్ ఆప్షన్లను పెంచుకునే క్రమంలో స్పిన్ లేదంటే పేస్ బౌలింగ్ చేయగల ఆల్‌రౌండర్లకే అవకాశం ఇస్తే బాగుంటుందని పేర్కొన్నాడు. కాగా మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో హైదరాబాద్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్.. ఇద్దరు పేస్ ఆల్‌రౌండర్లు, ఓ స్పిన్ ఆల్‌రౌండర్ సహా ఓ స్పిన్నర్, ఇద్దరు సీమర్లతో బరిలోకి దిగింది. హార్దిక్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్లతో పాటు యువ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను ఆడించింది. బౌలింగ్ విభాగంలో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తుది జట్టులో ఉండగా.. పేసర్లు షమీ, సిరాజ్ సేవలను ఉపయోగించుకుంది. ఇందులో భాగంగా శార్దూల్ ఠాకూర్‌కు అవకాశం ఇచ్చే క్రమంలో ఉమ్రాన్‌ను పక్కనపెట్టాల్సి వచ్చింది.ఈ నేపథ్యంలో వసీం జాఫర్ ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ రెండో వన్డేలో జట్టు కూర్పు గురించి తన అభిప్రాయాలు పంచుకున్నాడు. శార్దూల్ ఉండటం అత్యంత ముఖ్యం ‘‘నాకు తెలిసి ఉమ్రాన్‌కు రెండో వన్డేలో కూడా ఛాన్స్ రాకపోవచ్చు. ఒకవేళ తను జట్టులోకి వచ్చినా శార్దూల్ ఠాకూర్ స్థానంలో మాత్రం వస్తాడనుకోను. నా అభిప్రాయం ప్రకారం.. జట్టులో శార్దూల్ ఉండటం అత్యంత ముఖ్యం. ఎనిమిదో స్థానంలో తను బ్యాటింగ్ చేస్తాడు. ఇది జట్టుకు అవసరం. గత మ్యాచ్‌లో అతడు బాగానే బౌలింగ్ చేశాడు. అలెన్ వికెట్ సహా ఆఖర్లో యార్కర్‌తో బ్రేస్‌వెల్‌ను బౌల్డ్ చేయడం మనం చూశాం. తనకు వికెట్లు తీసే సామర్థ్యం ఉంది. ఒక్కోసారి పరుగులు ధారాళంగా ఇవ్వొచ్చు... కానీ కచ్చితంగా వికెట్లు తీయగలడు. అంతేకాదు బ్యాట్‌తోనూ రాణించగలడు’’ అని వసీం జాఫర్ చెప్పుకొచ్చాడు. ఆల్‌రౌండర్లు కావాలి జట్టులో ఆల్‌రౌండర్లు ఎక్కువగా ఉంటే ప్రయోజనకరమని అభిప్రాయపడ్డాడు. వరల్డ్‌కప్ టోర్నీ సమీపిస్తున్న తరుణంలో మూడో సీమర్ కచ్చితంగా ఆల్‌రౌండర్ అయి ఉంటే బాగుంటుందని పేర్కొన్నాడు. కాగా తొలి వన్డేలో శార్దూల్ రెండు వికెట్లు తీసినప్పటికీ భారీగా పరుగులు సమర్పించుకున్న విషయం తెలిసిందే. 7.2 ఓవర్ల బౌలింగ్‌లో 54 పరుగులు ఇచ్చాడు. ఏడు వైడ్లు వేసి విమర్శలు మూటగట్టుకున్నాడు. అయితే, కీలక సమయంలో వికెట్ తీసి జట్టు విజయం ఖరారు చేశాడు. ఇక టీమిండియా ఇన్నింగ్స్‌లో భాగంగా మూడు పరుగులకే రనౌట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో వసీం జాఫర్ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక రాయ్‌పూర్ వేదికగా టీమిండియా- న్యూజిలాండ్ మధ్య శనివారం రెండో వన్డే జరుగనుంది. సిరీస్‌లో 1-0తో ముందంజలో ఉన్న టీమిండియా ట్రోఫీ గెలవడమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. చదవండి: పిచ్చిగా మాట్లాడొద్దు.. అతడిని చూసి నేర్చుకో! అంటే.. తనెప్పటికీ టీమిండియాకు ఆడొద్దా? ఫ్యాన్స్ ఫైర్ Sunrisers: దుమ్మురేపుతున్న సన్‌రైజర్స్.. హ్యాట్రిక్ విజయాలు.. ఫ్యాన్స్ ఖుషీ! ఈసారి.. లార్డ్ శార్దూల్ ఠాకూర్.. ఇలా అయితే ఎలా.. ఇంకెన్ని మ్యాచ్‌లు ఇలా..? -
లార్డ్ శార్దూల్ ఠాకూర్.. ఇలా అయితే ఎలా.. ఇంకెన్ని మ్యాచ్‌లు ఇలా..?
హైదరాబాద్ వేదికగా న్యూజిలాండ్‌తో నిన్న (జనవరి 18) జరిగిన వన్డే మ్యాచ్‌లో టీమిండియా ఘోర పరాభవం గేట్ల వరకు వెళ్లి తిరిగి వచ్చింది. భారీ ఛేదనలో విధ్వంసకర శతకంతో టీమిండియాకు ముచ్చెమటలు పట్టించిన మైఖేల్ బ్రేస్‌వెల్ (78 బంతుల్లో 140; 12 ఫోర్లు, 10 సిక్సర్లు) ఆఖరి ఓవర్లో ఔట్ కాకపోయుంటే పరిస్థితి వేరేలా ఉండేది. టీమిండియా బౌలర్లను అందరూ ఆడిపోసుకునే వారు. 349 పరుగుల భారీ స్కోర్‌ను కూడా కాపాడుకోలేకపోయారని దుమ్మెత్తి పోసేవారు. ముఖ్యంగా ధారాళంగా పరుగులు సమర్పించుకున్న శార్దూల్ ఠాకూర్, హార్ధిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్‌లను అందరూ టార్గెట్ చేసేవారు. వీరిలో మరి ముఖ్యంగా లార్డ్ శార్దూల్ భారత అభిమానుల ఆగ్రహావేశాలకు గురయ్యేవాడు. కీలక దశలో వరుస వైడ్ బాల్స్ (39వ ఓవర్లో 4 వైడ్లు, 3 ఫోర్లు) వేయడంతో పాటు బేసిక్స్ మరిచి బౌలింగ్ చేసినందుకు గానూ శార్దూల్‌ను ఓ రేంజ్లో ఆటాడుకునేవారు. అయితే ఆఖరి ఓవర్లో విరాట్ కోహ్లి సలహా మేరకు, చాకచక్యంగా యార్కర్ బాల్ వేయడంతో బ్రేస్‌వెల్ ఔటయ్యాడు. అప్పుడు శార్దూల్ సహా అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఒకవేళ బ్రేస్‌వెల్ ఔట్ కాకుండా.. న్యూజిలాండ్ మ్యాచ్ గెలిచి ఉండి ఉంటే, లార్డ్ శార్దూల్‌కు సీన్ సితార అయ్యేది. భారత్ మ్యాచ్ గెలిచినా ఫ్యాన్స్ మాత్రం శార్దూల్‌పై ఇంకా ఆగ్రహంగానే ఉన్నారు. అసలు ఇతన్ని ఆల్‌రౌండర్‌గా ఎలా పరిగణిస్తారు.. అటు బ్యాటింగ్‌కు న్యాయం చేయడం లేదు, ఇటు బౌలింగ్‌లోనూ తేలిపోతున్నాడు.. ఇతనికి ఎందుకు వరుస అవకాశాలు ఇస్తున్నారని సెలక్టర్లను నిలదీస్తున్నారు. మరికొందరు ఫ్యాన్స్ ఏమో.. లార్డ్ శార్దూల్.. ఇలా అయితే ఎలా అమ్మా.. నిన్ను నీవు నిరూపించుకోవడానికి ఇంకెన్ని మ్యాచ్‌లు కావాలమ్మా.. జట్టులో చోటు కోసం చాలా మంది వెయిటింగ్ అక్కడ అంటూ సోషల్‌మీడియా వేదికగా సున్నితంగా చురకలంటిస్తున్నారు. నిన్నటి మ్యాచ్‌లో శార్దూల్.. 7.2 ఓవర్లు వేసి 54 పరుగులిచ్చాడు. అయితే కీలకమైన ఫిన్ అలెన్ (40), బ్రేస్‌వెల్ వికెట్లు పడగొట్టాడు. కాగా, ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కోటాలో జట్టులో చోటు సంపాదిస్తున్న లార్డ్ శార్దూల్.. కెరీర్ ఆరంభం నుంచే తన ప్రాతకు కనీస న్యాయం చేయలేకపోతున్నాడన్న వాదనలు వినిపిస్తున్నాయి. అడపాదడపా రాణించినప్పటికీ.. అవి చెప్పుకోదగ్గ ప్రదర్శనలేమీ కాదు. ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా బ్యాట్‌తో పాటు బంతిలోనూ రాణించాలని మేనేజ్మెంట్ అతని నుంచి ఆశిస్తుంది. శార్దూల్ దగ్గర ఆ సామర్థ్యం ఉన్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తాడనే టాక్ నడుస్తుంది. మరో వైపు హార్ధిక్ మినహా టీమిండియాకు మరో ప్రత్యామ్నాయ ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ లేకపోవడంతో శార్దూల్ పప్పులు ఉడుకుతున్నాయి. వెంకటేశ్ అయ్యర్, విజయ్ శంకర్, శివమ్ దూబేలకు అవకాశాలు ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయారు. టీమిండియా ఫ్యాన్స్ అయితే అండర్19 జట్టు యువ ఆల్‌రౌండర్ రాజ్ అంగడ్ బవా, శివమ్ మావీలకు అవకాశాలు ఇవ్వాలని సూచిస్తున్నారు. త్వరలో ప్రారంభంకానున్న వన్డే వరల్డ్‌కప్ నేపథ్యంలో టీమిండియా ఏమైనా ప్రయోగాలు చేస్తుందేమో వేచి చూడాలి. -
WC 2023: ఆ ఇద్దరు వరల్డ్‌కప్ జట్టులో వద్దు! ‘చీఫ్ సెలక్టర్’గా చెబుతున్నా
ICC ODI World Cup 2023- Team India: వన్డే వరల్డ్‌కప్-2023 నేపథ్యంలో భారత జట్టు కూర్పుపై టీమిండియా మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్టార్లుగా ఎదుగుతున్న ఓ ఇద్దరు ఆటగాళ్లకు తన జట్టులో చోటు ఇచ్చేది లేదని పేర్కొన్నాడు. తానే గనుక బీసీసీఐ చీఫ్ సెలక్టర్ పదవిలో ఉంటే ప్రపంచకప్ జట్టు ఇలాగే ఉండాలని కోరుకుంటానంటూ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. వాళ్లు నలుగురు చాలు స్టార్ స్పోర్ట్స్ షోలో చిక్కా మాట్లాడుతూ.. ‘‘నా వరల్డ్‌కప్ జట్టులో శుబ్‌మన్ గిల్, శార్దూల్ ఠాకూర్‌కు చోటు లేదు. ఇక పేసర్ల విషయానికొస్తే.. నలుగురు చాలు. బుమ్రా, ఉమ్రాన్ మాలిక్ , అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్ జట్టులో ఉంటే సరిపోతుంది. షమీ సో-సోగా ఆడతాడు. కాబట్టి తను అవసరం లేదు. దీపక్ హుడా జట్టులో ఉంటే బాగుంటుంది. వీళ్లందరికి జట్టును గెలిపించగల సత్తా ఉంది. అయితే, ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించగల యూసఫ్ పఠాన్ వంటి రేసు గుర్రాలు జట్టులో ఉండాలని కోరుకుంటాం కదా! నా వరకైతే అలాంటి గెలుపు గుర్రం రిషభ్ పంత్. క్రిష్ణమాచారి శ్రీకాంత్ పంత్ ఉంటేనే పదింట మూడు మ్యాచ్‌లను గెలిపించినా నేను వాళ్లకే పెద్దపీట వేస్తాను. కీలక సమయంలో జట్టును గెలిపించే వాళ్లు కావాలి. పంత్ అలాంటి వాడే! ఇలాంటి ఆటగాళ్ల నుంచి నిలకడైన ప్రదర్శన కోరుకోకూడదు. రిషభ్ పంత్‌కు ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పగల సత్తా ఉంది కాబట్టి తను ఉంటే బాగుంటుంది’’ అని అభిప్రాయపడ్డాడు. టీమిండియా అభిమానిగా కాకుండా.. చీఫ్ సెలక్టర్ పదవిలో ఉన్నాననుకుని ఈ మాటలు మాట్లాడానంటూ ఈ మాజీ సెలక్టర్ పేర్కొన్నాడు. ఓపెనింగ్ స్థానం కోసం తీవ్ర పోటీ సొంతగడ్డపై ఈ ఏడాది జరుగనున్న వన్డే ప్రపంచకప్ కోసం బీసీసీఐ 20 మందితో జట్టును సిద్ధం చేస్తున్న వేళ శ్రీకాంత్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. శిఖర్ ధావన్ స్థానంలో యువ బ్యాటర్ శుబ్‌మన్ గిల్‌కు వరుస అవకాశాలు ఇస్తున్న తరుణంలో చిక్కా.. అతడికి తన జట్టులో చోటివ్వనని పేర్కొనడం గమనార్హం. ఇదిలా ఉంటే.. రోహిత్ శర్మకు జోడీగా రాహుల్‌తో పాటు యువ ప్లేయర్లు ఇషాన్ కిషన్, గిల్ ఓపెనింగ్ స్థానం కోసం పోటీపడుతున్నారు. చదవండి: Sarfaraz Ahmed: నీ కెరీర్ ముగిసిపోయిందన్నాడు! రమీజ్ రాజాకు దిమ్మతిరిగేలా కౌంటర్! Ind VS SL 3rd T20: భారీ స్కోర్లు గ్యారంటీ! అతడికి ఉద్వాసన.. రుతురాజ్ ఎంట్రీ! -
పెళ్లి పీటలు ఎక్కబోతున్న భారత క్రికెటర్ (ఫోటోలు)
-
ఫిబ్రవరిలో పెళ్లిపీటలు ఎక్కనున్న టీమిండియా ఆల్‌రౌండర్
టీమిండియా ఆల్‌రౌండర్ శార్ధూల్ ఠాకూర్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నాడు.ఎంట్రప్రెన్యూర్ అయిన మితాలీ పారుల్కర్‌ను ఫిబ్రవరిలో వివాహం చేసుకోనున్నాడు. గతేడాది నవంబర్‌లో ఈ జంటకు ఎంగేజ్మెంట్ జరిగింది. అప్పటినుంచి శార్దూల్ క్రికెట్లో బిజీగా ఉండడంతో సమయం కుదరలేదు. ముంబై సమీపంలోని కర్జత్ ప్రాంతంలో వీరిద్దరి వివాహం జరగనుంది. మహారాష్ట్ర సంప్రదాయ పద్ధతిలో ఈ జంట పెళ్లి చేసుకోనుంది. వీళ్ల పెళ్లి వేడుకకు సంబంధించిన పనులు ఫిబ్రవరి 25వ తేదీన మొదలు అవుతాయి. కాగా శార్దూల్‌తో పెళ్లిపై స్వయంగా పెళ్లి కూతురు మితాలీ స్పందించింది. ''శార్ధూల్ క్రికెట్ షెడ్యూల్‌తో బిజీగా ఉన్నాడు. ఫిబ్రవరి 24 వరకు అతనికి మ్యాచ్‌లు ఉన్నాయి. ఫిబ్రవరి 25న మాతో కలుస్తాడు. మా పెళ్లికి దాదాపు 200 నుంచి 250 మంది అతిథులు వస్తారని అనుకుంటున్నాం. మేము మొదటగా గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలి అనుకున్నాం. అయితే, బంధువులు, స్నేహితులు ఎక్కువ మంది ఉండడంతో అందరినీ గోవా తీసుకెళ్లడం కష్టమని ఆ నిర్ణయం వాయిదా వేశాం '' అని చెప్పుకొచ్చింది. ఈ ఏడాది ఐపీఎల్లో శార్దూల్ కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున బరిలోకి దిగనున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి అతడిని కోల్‌కతా కొనుగోలు చేసింది. పోయిన ఏడాది వేలంలో రూ. 10.75 కోట్లకు శార్ధూల్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. అయితే అతను పెద్దగా ఆకట్టుకోలేదు. దాంతో ట్రేడింగ్ పద్ధతిలో కోల్‌కతాకు అమ్మేసింది. -
Ind Vs Ban: కచ్చితంగా గెలుస్తాం! అతడు గొప్ప ఆల్‌రౌండర్‌గా ఎదుగుతాడు!
India tour of Bangladesh, 2022- Bangladesh vs India, 2nd ODI: ‘‘సిరీస్‌లో మొదటి మ్యాచ్ ఓడటం మాకేమీ కొత్తకాదు. ఇదే తొలిసారి కూడా కాదు. కఠిన పరిస్థితులను అధిగమించి ఎలా ముందుకు సాగాలో మాకు తెలుసు’’ టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ అన్నాడు. బంగ్లాదేశ్‌తో తొలి వన్డేలో తక్కువ స్కోరుకు పరిమితం కావడం ప్రభావం చూపిందని.. అయితే, ప్రతిసారి ఇలాగే జరగదని వ్యాఖ్యానించాడు. రెండో మ్యాచ్‌లో కచ్చితంగా విజయం సాధించి సిరీస్‌ను సమం చేస్తామని గబ్బర్ ధీమా వ్యక్తం చేశాడు. బంగ్లా పర్యటనలో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రోహిత్ సేన మొదటి మ్యాచ్‌లో ఒక వికెట్ తేడాతో పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఢాకా వేదికగా బుధవారం రెండో వన్డేలో తలపడనుంది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ధావన్.. తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకున్నామని, కచ్చితంగా తిరిగి పుంజుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశాడు. ఇక ఆదివారం నాటి మ్యాచ్‌లో కండరాల నొప్పితో బాధపడ్డ శార్దూల్ ఠాకూర్ ప్రస్తుతం పూర్తి ఫిట్‌గా ఉన్నాడని.. రెండో మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడని తెలిపాడు. న్యూజిలాండ్‌లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన వాషీ! బంగ్లాతో మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడిన సందర్భంగా ధావన్.. టీమిండియా యువ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌పై ప్రశంసలు కురిపించాడు. అతడు ప్రపంచంలోనే గొప్ప ఆల్‌రౌండర్‌గా ఎదుగుతాడని కితాబులిచ్చాడు. కాగా గాయాల బెడదతో కొన్నాళ్లపాటు జట్టుకు దూరమైన వాషింగ్టన్ సుందర్.. న్యూజిలాండ్ పర్యటనలో సత్తా చాటిన విషయం తెలిసిందే. ముఖ్యంగా మొదటి వన్డేలో మెరుపు ఇన్నింగ్స్‌తో అర్ధ శతకం సాధించాడు. అతడు గొప్ప ఆల్‌రౌండర్‌గా ఎదుగుతాడు ఈ నేపథ్యంలో ధావన్ మాట్లాడుతూ.. ‘‘వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా ఆడుతున్నాడు. పునరాగమనంలో సత్తా చాటుతున్నాడు. న్యూజిలాండ్‌లో అతడి ప్రదర్శన మనమంతా చూశాం. తను మంచి ఆల్‌రౌండర్. ఆఫ్ స్పిన్నర్‌గా.. లోయర్ ఆర్డర్లో ఫినిషర్‌గా జట్టుకు ఉపయోగపడతాడు. అనుభవం గడిస్తున్న కొద్దీ తను మరింత రాటుదేలతాడు. ఒత్తిడిలోనూ రాణించగల సుందర్.. ప్రపంచంలో గొప్ప ఆల్‌రౌండర్‌గా ఎదుగుతాడని నమ్మకంగా చెప్పగలను’’ అని వాషీని ప్రశంసించాడు. కాగా బంగ్లాతో మొదటి వన్డేలో 10 పరుగులు చేసిన వాషింగ్టన్ సుందర్.. 2 వికెట్లు తీశాడు. ఇదిలా ఉంటే.. కివీస్ టూర్లో వన్డే సిరీస్ ధావన్ కెప్టెన్‌గా వ్యవహరించగా.. 1-0తో టీమిండియా ట్రోఫీని ఆతిథ్య జట్టుకు అప్పగించింది. ప్రస్తుతం రెండో వన్డేలో గెలిస్తేనే బంగ్లా చేతిలో సిరీస్ ఓటమి నుంచి తప్పించుకోగలదు. చదవండి: Ind A Vs Ban A: ఆరు వికెట్లతో చెలరేగిన ముకేశ్.. బంగ్లా 252 పరుగులకు ఆలౌట్ IPL 2023: విండీస్ విధ్వంసకర ఆల్‌రౌండర్‌పై కన్నేసిన రాజస్తాన్! 🗣️ 🗣️ We know how to bounce back from tough situations.#TeamIndia batter @SDhawan25 ahead of the second #BANvIND ODI. pic.twitter.com/YgHpfI7IeZ — BCCI (@BCCI) December 6, 2022 -
ఈజీగా గెలుస్తామనుకున్నాం.. కానీ సిరాజ్, శార్దూల్ వల్ల..
India tour of Bangladesh, 2022- Bangladesh vs India, 1st ODI: బంగ్లాదేశ్ లక్ష్యం 187 పరుగులు... ఒకదశలో 136/9... మరో వికెట్ తీస్తే తొలి వన్డే భారత్‌దే. కానీ మెహదీ హసన్, ముస్తఫిజుర్ టీమిండియాకు షాక్ ఇచ్చారు. 41 బంతుల్లోనే అభేద్యంగా 51 పరుగులు జోడించి తమ జట్టును గెలిపించారు. బౌలర్లు చివరి వికెట్ తీయలేకపోయినా... బ్యాటింగ్ వైఫల్యమే భారత్ పరాజయానికి కారణం. పేలవ ఆటతో పూర్తి ఓవర్లు కూడా ఆడలేక 186 పరుగులకు కుప్పకూలడంతో ఓటమికి బాట పడింది. కేఎల్ రాహుల్ మినహా ఏ ఒక్కరూ ప్రభావం చూపలేకపోగా, షకీబ్ 5 వికెట్లతో, ఇబాదత్ 4 వికెట్లతో భారత జట్టును పడగొట్టారు. తద్వారా ఈ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో బంగ్లాదేశ్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం బంగ్లా కెప్టెన్ లిటన్ దాస్ మాట్లాడుతూ.. భారత బౌలర్లపై ప్రశంసలు కురిపించడం విశేషం. లక్ష్య ఛేదన సులువు అనుకున్న తరుణంలో టీమిండియా బౌలర్లు మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్ రాణించిన తీరును అమోఘమంటూ కొనియాడాడు. ‘‘ఈ మ్యాచ్ గెలవడం చాలా సంతోషంగా ఉంది. ఆటలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. నేను, షకీబ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో సులభంగానే విజయం సాధిస్తామని భావించాను. అయితే, సిరాజ్, శార్దూల్ మిడిల్ ఓవర్లలో మ్యాచ్‌ను వాళ్లవైపు తిప్పేశారు. మేమిద్దరం అవుటైన తర్వాత గెలుపు కష్టమనిపించింది. భారత బౌలర్లు విజృంభించిన తీరు టెన్షన్‌కు గురిచేసింది. అయితే, మెహదీ అద్భుత ఇన్నింగ్స్‌తో మెరిశాడు. ఆఖర్లో 6-7 ఓవర్లలో అతడు బ్యాటింగ్ చేస్తూ ఉంటే అలా చూస్తూ ఉండిపోయా’’ అని లిటన్ దాస్ చెప్పుకొచ్చాడు. కాగా ఈ మ్యాచ్‌లో సిరాజ్ 3, శార్దూల్ ఠాకూర్ ఒకటి, వాషింగ్టన్ సుందర్ 2, అరంగేట్ర బౌలర్ కుల్దీప్ సేన్ 2, దీపక్ చహర్ ఒక వికెట్ తీశారు. మ్యాచ్ సాగిందిలా... రాహుల్ మినహా... అటు స్పిన్‌కు, ఇటు బౌన్స్‌కు అనుకూలించిన పిచ్ పై బంగ్లా బౌలర్లు షకీబ్, ఇబాదత్ పండగ చేసుకున్నారు. ముస్తఫిజుర్ వేసిన ‘మెయిడిన్’తో భారత ఇన్నింగ్స్ మొదలు కాగా, శిఖర్ ధావన్ (7) వైఫల్యం కొనసాగింది. మరో ఎండ్‌లో రోహిత్ శర్మ (31 బంతుల్లో 27; 4 ఫోర్లు, 1 సిక్స్) కొన్ని చక్కటి షాట్లు ఆడటంతో పవర్‌ప్లేలో భారత్ స్కోరు 48 పరుగులకు చేరింది. అయితే షకీబ్ తన తొలి ఓవర్లోనే రోహిత్, కోహ్లి (9)లను అవుట్ చేసి భారత్‌ను దెబ్బ కొట్టాడు. ఈ దశలో జట్టును రాహుల్ ఆదుకున్నాడు. అయ్యర్ (39 బంతుల్లో 24; 2 ఫోర్లు), సుందర్ (19) కొద్దిసేపు అతనికి సహకరించారు. మిరాజ్ ఓవర్లో వరుస బంతుల్లో 4, 6 బాదిన రాహుల్, ఇబాదత్ వేసిన తర్వాతి ఓవర్లో రెండు ఫోర్లు కొట్టి 49 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే వరుస ఓవర్లలో సుందర్, షహబాజ్ (0) వెనుదిరగ్గా, ఆ తర్వాత షకీబ్ మరోసారి ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టాడు. ఇబాదత్ ఓవర్లో సిక్స్, ఫోర్ కొట్టిన అనంతరం 9వ వికెట్‌గా రాహుల్ అవుట్ కావడంతో భారత్ 200 పరుగుల మార్క్‌ను కూడా చేరలేకపోయింది. రాణించిన సిరాజ్... ఇన్నింగ్స్ తొలి బంతికే నజ్ముల్ (0)ను అవుట్ చేసి చహర్ శుభారంభమిచ్చాడు. అయితే తర్వాతి బ్యాటర్లు తలా ఓ చేయి వేయడంతో బంగ్లా సులువుగానే లక్ష్యం దిశగా సాగుతున్నట్లు అనిపించింది. దాస్, షకీబ్ (38 బంతుల్లో 29; 3 ఫోర్లు) బాధ్యత గా ఆడారు. వీరిద్దరిని సుందర్ అవుట్ చేసినా... ఒకదశలో 128/4తో బంగ్లా సురక్షిత స్థితిలోనే ఉంది. చేతిలో 6 వికెట్లతో మరో 91 బంతుల్లో 59 పరుగులు మాత్రమే చేయాల్సి ఉంది. అయితే ఈ దశలో సిరాజ్, శార్దుల్, కుల్దీప్ సేన్ ఒక్కసారిగా విజృంభించడంతో బంగ్లాదేశ్ 26 బంతుల వ్యవధిలో 8 పరుగులు మాత్రమే చేసి 5 వికెట్లు కోల్పోయింది. అద్భుత భాగస్వామ్యం... బంగ్లా 9వ వికెట్ కోల్పోయాక గెలుపు సమీకరణం 63 బంతుల్లో 51 పరుగులుగా ఉంది. చివరి వికెట్ కాబట్టి భారత్ గెలుపు లాంఛనమే అనిపించింది. అయితే మెహదీ అపార పట్టుదలను కనబర్చాడు. కీలక సమయంలో ముస్తఫిజుర్ (11 బంతుల్లో 10 నాటౌట్; 2 ఫోర్లు) నుంచి అతనికి సరైన సహకారం లభించింది. సేన్ ఓవర్లో రెండు సిక్సర్లతో ఆశలు పెంచిన మెహదీ, చహర్ ఓవర్లోనూ 3 ఫోర్లు కొట్టి లక్ష్యానికి చేరువ చేశాడు. చహర్ తర్వాతి ఓవర్ చివరి బంతికి సింగిల్ రావడంతో బంగ్లా శిబిరం సంబరాల్లో మునిగిపోయింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే బుధవారం జరుగుతుంది. చదవండి: KL Rahul: అతడిని ఎందుకు తప్పించారో తెలీదు! పంత్ దరిద్రం నీకు పట్టుకున్నట్టుంది! బాగా ఆడినా.. ఇదేం పోయే కాలమో! Saina Nehwal: తన మొహం కూడా చూడనంటూ పెదవి విరుపులు! నాడు భోరున ఏడ్చేసిన సైనా! రూ. 2500 కూడా..