విండీస్ పర్యటనలో టీమిండియా వరుసగా రెండో సిరీస్ నెగ్గింది. తొలుత 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 1-0 తేడాతో గెలుచుకున్న భారత్.. నిన్న జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో 200 పరుగుల భారీ తేడాతో గెలుపొంది, 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో గెలిచి, రెండో వన్డేలో ఓటమిపాలైన భారత్.. మూడో మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగి విండీస్‌పై తమ రికార్డును మరింత మెరుగుపర్చుకుంది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. ఇషాన్ కిషన్ (64 బంతుల్లో 77; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), శుభ్‌మన్ గిల్ (92 బంతుల్లో 85; 11 ఫోర్లు), సంజూ శాంసన్ (41 బంతుల్లో 51; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), హార్ధిక్ పాండ్యా (52 బంతుల్లో 70 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) అర్ధసెంచరీతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 351 పరుగుల భారీ స్కోర్ చేసింది. విండీస్ బౌలర్లలో రొమారియో షెపర్డ్ 2, అల్జరీ జోసఫ్, గుడకేశ్ మోటీ, కారియా తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన విండీస్‌ను భారత బౌలర్లు మూకుమ్మడిగా రాణించి 151 పరుగులకే కుప్పకూల్చారు. శార్దూల్ ఠాకూర్ (4/37), ముకేశ్ కుమార్ (3/30), కుల్దీప్ యాదవ్ (2/25), ఉనద్కత్ (1/16) అద్భుతంగా బౌలింగ్ చేసి విండీస్ ఆటగాళ్ల పనిపట్టారు. భారత బౌలర్ల ధాటికి విండీస్ 35.3 ఓవర్లలోనే చాపచుట్టేసింది. విండీస్ ఇన్నింగ్స్‌లో అలిక్ అథనాజ్ (32), కారియా (19), అల్జరీ జోసఫ్ (26), గడకేశ్ మోటీ (39 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment