Ishan Kishan
-
ఇషాన్ కిషన్ విధ్వంసకర సెంచరీ.. 16 ఫోర్లు, 6 సిక్సర్లతో
టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ దేశీవాళీ క్రికెట్లో తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అదరగొట్టిన కిషన్.. ఇప్పుడు విజయ్ హజారే ట్రోఫీ 2024-25లో కూడా అదే జోరును కొనసాగిస్తున్నాడు. ఈ టోర్నీలో జార్ఖండ్‌కు సారథ్యం వహిస్తున్న కిషన్.. సోమవారం మణిపూర్‌తో జరిగిన మ్యాచ్‌లో విధ్వంసకర సెంచరీతో మెరిశాడు.255 పరుగుల లక్ష్య చేధనలో కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ప్రత్యర్ది బౌలర్లను ఈ జార్ఖండ్ డైనమెట్ ఊచకోత కోశాడు. కేవలం 78 బంతుల్లో 16 ఫోర్లు, 6 సిక్సర్లతో 134 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడి విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా జార్ఖండ్ లక్ష్యాన్ని కేవలం 2 వికెట్ల మాత్రమే కోల్పోయి 28.3 ఓవర్లలో చేధించింది. కిషన్‌తో పాటు మరో ఓపెనర్ ఉత్కర్ష్ సింగ్(68) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మణిపూర్ 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. మణిపూర్ బ్యాటర్లలో ప్రియోజిత్ సింగ్(43), జాన్సెన్ సింగ్(69) పరుగులతో రాణించారు. జార్ఖండ్ బౌలర్లలో అనుకుల్ రాయ్, ఉత్కర్ష్ సింగ్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. వికాస్ సింగ్,సుప్రీయో చక్రవర్తి తలా వికెట్ సాధించారు.కాగా ఇషాన్ కిషన్ గత కొంతకాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. తమ ఆదేశాలను ధిక్కరించినందుకు బీసీసీఐ అతడిపై వేటు వేసింది. ఇప్పుడు దేశీవాళీ క్రికెట్లో రాణిస్తూ రీఎంట్రీ దిశగా ఇషాన్ అడుగులు వేస్తున్నాడు. -
ఇషాన్ కిషన్ ఊచకోత.. 5 ఫోర్లు, 9 సిక్స్‌లతో తుపాన్ ఇన్నింగ్స్
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024లో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్, జార్ఖండ్ స్టార్ ప్లేయర్ ఇషాన్ కిషన్ విధ్వంసం సృష్టించాడు. ఈ టోర్నీలో భాగంగా శుక్రవారం వాంఖడే వేదికగా అరుణాచాల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో జార్ఖండ్ తరపున కిషన్ తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు. అరుణాచాల్ బౌలర్లను ఉతికారేశాడు. 23 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్స్‌లతో 77 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా 94 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం 4.3 ఓవర్లలోనే జార్ఖండ్ వికెట్ నష్టపోకుండా ఊదిపడేసింది. అతడితో పాటు మరో ఓపెనర్ ఉత్కర్ష్ సింగ్(13) ఆజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బౌలింగ్ చేసిన అరుణాచల్ ప్రదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 93 పరుగులకు ఆలౌటైంది. జార్ఖండ్ బౌలర్లలో స్పిన్నర్ అనుకుల్ రాయ్ నాలుగు వికెట్లతో సత్తాచాటగా.. రవి కుమార్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టాడు.ఎస్ఆర్హెచ్లోకి ఎంట్రీ..కాగా ఇటీవలే జెడ్డా వేదికగా జరిగిన ఐపీఎల్-2025 మెగా వేలంలో కిషన్ భారీ ధర దక్కింది. ఈ వికెట్ కీపర్ బ్యాటర్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 11.25 కోట్లకు కొనుగోలు చేసింది. గత సీజన్ వరకు అతడు ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు.కానీ ఈసారి అతడిని ముంబై రిటైన్ చేసుకోలేదు. కాగా దేశీవాళీ క్రికెట్ ఆడాలన్న బీసీసీఐ ఆదేశాలను ధిక్కరించడంతో కిషాన్ సెంట్రాల్ కాంట్రాక్ట్‌ను కోల్పోయాడు. దాదాపు ఏడాది నుంచి జాతీయ జట్టుకు కూడా దూరంగా ఉన్నాడు. -
ఇషాన్ కిషన్‌కు కళ్లు చెదిరే ధర.. రూ. 14.5 కోట్లకు వారి సొంతం!
టీమిండియాకు దూరమైన ఇషాన్ కిషన్‌కు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోనూ ఈ ఏడాది కలిసి రాలేదు. ముంబై ఇండియన్స్ తరపున ఐపీఎల్-2024లో ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. పద్నాలుగు మ్యాచ్‌లలో కలిపి 320 పరుగులు చేయగలిగాడు. అయితే, మెగా వేలానికి ముందు ముంబై ఫ్రాంఛైజీ మాత్రం అతడిని వదిలేసింది.జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మలతో పాటు యువ క్రికెటర్ తిలక్ వర్మను రీటైన్ చేసుకున్న ముంబై.. ఇషాన్ పేరును మాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. నిజానికి 2018లో ముంబై తరఫునే క్యాచ్ రిచ్ లీగ్‌లో ఎంట్రీ ఇచ్చాడు ఈ లెఫ్టాండర్ బ్యాటర్. ఆరంభం నుంచే మెరుగ్గా రాణించిన ఇషాన్ కిషన్ కోసం ఐపీఎల్-2022లో ముంబై భారీ మొత్తం వెచ్చించింది.నాడు రూ. 15.25 కోట్ల ధరకు ముంబై సొంతంనాటి మెగా వేలంలో అతడిని ఏకంగా రూ. 15.25 కోట్ల ధరకు సొంతం చేసుకుంది. కానీ.. అప్పటి నుంచి నేటి దాకా ఇషాన్ కిషన్ అందుకు తగ్గ పైసా వసూల్ ప్రదర్శన మాత్రం ఇవ్వలేకపోయాడు. అంతేకాదు.. దేశవాళీ క్రికెట్ ఆడాలన్న బీసీసీఐ ఆదేశాలను ధిక్కరించి సెంట్రల్ కాంట్రాక్టు కోల్పోయి.. జాతీయ జట్టుకూ దూరమయ్యాడు.అయితే, ఇటీవలే రంజీల్లో సెంచరీలు చేయడంతో రీ ఎంట్రీ ఇచ్చిన ఇషాన్ కిషన్.. భారత్-‘ఎ’ జట్టుకు సెలక్ట్ అయ్యాడు. కానీ.. ఆస్ట్రేలియా గడ్డపై కంగారూ జట్టుతో జరిగిన అనధికారిక టెస్టు సిరీస్‌లో పూర్తిగా విఫలమయ్యాడు. ఇలాంటి పరిస్థితుల నడుమ ఇషాన్ కిషన్ ఐపీఎల్-2025 మెగా వేలంలోకి రాబోతున్నాడు.వికెట్ కీపర్ కోటాలో కళ్లు చెదిరే మొత్తంఈ నేపథ్యంలో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నిర్వహించిన ‘మాక్ వేలం’లో మాత్రం ఇషాన్ కిషన్ భారీ ధర పలకడం విశేషం. మెగా వేలంలో ఇషాన్ రూ. 2 కోట్ల కనీస ధరతో పేరును నమోదు చేసుకున్నాడు. అయితే, అశ్విన్ మాత్రం తన వేలంలో.. వికెట్ కీపర్ కోటాలో ఇషాన్ కోసం బిడ్ వేసే ఫ్రాంఛైజీలు రూ. 5 కోట్ల నుంచి మొదలుపెట్టాలని సూచించాడు.ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ రూ. 5 కోట్లకు బిడ్ వేయగా.. క్రమక్రమంగా ఇషాన్ ధర రూ. 10 కోట్లకు పెంచింది. దీంతో పంజాబ్ కింగ్స్ రేసు నుంచి తప్పుకోగా.. లక్నో సూపర్ జెయింట్స్ మాత్రం వికెట్ కీపర్ కోసం ఏకంగా రూ. 14.5 కోట్లు వెచ్చించి దక్కించుకుంది.ఏకంగా రూ. 21 కోట్ల మొత్తానికి అతడు ఉన్నా కూడాఅయితే, అశ్విన్ నిర్వహించిన ఈ మాక్వేలంలో ఇషాన్ కిషన్‌కు కళ్లు చెదిరే మొత్తం దక్కడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫామ్‌లో లేని ఇషాన్ కోసం.. మెగా వేలంలో ఏ ఫ్రాంఛైజీ అంతగా ఆసక్తి చూపదని.. మహా అయితే, అతడికి రూ. ఐదు కోట్లు దక్కవచ్చని క్రికెట్ ప్రేమికులు అంటున్నారు.అంతేకాదు.. లక్నో ఇప్పటికే వికెట్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్‌ను ఏకంగా రూ. 21 కోట్ల మొత్తానికి అట్టిపెట్టుకుంది. అలాంటిది.. ఇషాన్‌ను ఆ ఫ్రాంఛైజీ కొనుక్కోవడం ఏమిటంటూ అశూ మాక్ వేలంలో లక్నో తరఫున పాల్గొన్న అభిమానులను ట్రోల్ చేస్తున్నారు. కాగా సౌదీ అరేబియాలోని జెద్దా వేదికగా నవంబరు 24, 25 తేదీల్లో మెగా వేలం జరుగనుంది.చదవండి: BGT 2024: టీమిండియాకు గుడ్‌న్యూస్ -
IPL 2025: ఇషాన్ కాదు.. వాళ్లిద్దరికోసం ముంబై పోటీ.. వాషీ కూడా రేసులోనే..
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2025 మెగా వేలానికి ముహూర్తం ఖరారైంది. సౌదీ అరేబియాలోని జిద్దా నగరంలో నవంబరు 24, 25 తేదీల్లో వేలంపాట నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అందరి కళ్లు టీమిండియా స్టార్లపైనే ఉన్నాయి.రేసులో భారత స్టార్లురిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్ సహా రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చహల్ తదితర సీనియర్ ప్లేయర్లు కూడా రేసులో ఉన్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈసారి ముంబై ఇండియన్స్ భారత స్పిన్నర్లను దక్కించుకునేందుకు ఇతర ఫ్రాంఛైజీలతో కచ్చితంగా పోటీపడుతుందని అభిప్రాయపడ్డాడు.పాలసీ పరిపూర్ణంగా ఉపయోగించుకునికాగా ఈసారి రిటెన్షన్ విధానాన్ని పరిపూర్ణంగా ఉపయోగించుకున్న జట్టు ముంబై ఇండియన్స్ అని చెప్పవచ్చు. నిబంధనలకు అనుగుణంగా ఐదుగురు క్యాప్డ్ ప్లేయర్లను అట్టిపెట్టుకుంది. జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, తిలక్ వర్మలను కొనసాగించాలని నిర్ణయించుకుంది.ఇక వీళ్లందరికి ఖర్చు పెట్టింది పోనూ.. ముంబై పర్సులో ఇంకా రూ. 45 కోట్లు మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘ముంబై బ్యాటింగ్ ఆర్డర్ మరోసారి పటిష్టంగానే కనిపిస్తోంది. అయితే, వాళ్ల రిటెన్షన్ లిస్టులో బుమ్రా రూపంలో ఒకే ఒక స్పెషలిస్టు బౌలర్ ఉన్నాడు.కాబట్టి వారికి ఇప్పుడు బౌలింగ్ విభాగాన్ని బలోపేతం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. నిజానికి ముంబై 225- 250 పరుగులు స్కోరు చేయగల సామర్థ్యం కలిగిన జట్టు. అయితే, అదే స్థాయిలో పరుగులు కూడా సమర్పించుకున్న సందర్భాలు ఉన్నాయి.బ్యాటింగ్ పైనే ఎక్కువగా ఏదేమైనా వాళ్లు బ్యాటింగ్ పైనే ఎక్కువగా ఆధారపడతారన్నది వాస్తవం. కానీ ప్రతిసారీ ఇదే టెక్నిక్ పనికిరాదు. వాళ్ల జట్టులో ఉంటే ఇండియన్ బ్యాటింగ్ లైనప్.. విదేశీ బౌలింగ్ లైనప్ ఉంటుంది. ఇప్పుడు వారికి ఇద్దరు స్పిన్నర్ల అవసరం కూడా ఉంది. అందుకే కచ్చితంగా వాళ్లు యుజీ చహల్ వెనుకపడటం ఖాయం.ఇషాన్ కాదుఒకవేళ అతడిని దక్కించుకోలేకపోతే.. ముంబై ఇండియన్స్ వాషింగ్టన్ సుందర్నైనా సొంతం చేసుకుంటుంది’’ అని చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా ఇషాన్ కిషన్ పేరును కూడా ప్రస్తావించిన ఆకాశ్ చోప్రా.. అతడిని ముంబై కొనుగోలు చేసే అవకాశం లేదని అభిప్రాయపడ్డాడు. వికెట్ కీపర్ కోటాలో ఇషాన్‌ను పరిగణించినా.. క్వింటన్ డికాక్ లేదంటే జితేశ్ శర్మ వైపు మొగ్గు చూపుతుందని అంచనా వేశాడు. చదవండి: Aus vs Pak: ఆసీస్‌కు కొత్త కెప్టెన్ -
Aus A vs Ind A: రుతు, నితీశ్ డకౌట్.. అభిమన్యు, ఇషాన్ విఫలం
ఆస్ట్రేలియా-‘ఎ’తో అనధికారిక తొలి టెస్టులో భారత-‘ఎ’ జట్టు ఆటగాళ్లు పూర్తిగా నిరాశపరిచారు. రంజీల్లో పరుగుల వరద పారించిన ఓపెనింగ్ బ్యాటర్ అభిమన్యు ఈశ్వరన్ 7 పరుగులకే పెవిలియన్ చేరగా.. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ డకౌట్‌గా వెనుదిరిగాడు.వన్‌డౌన్‌లో వచ్చిన సాయి సుదర్శన్(35 బంతుల్లో 21), నాలుగో నంబర్ బ్యాటర్ దేవ్‌దత్ పడిక్కల్(77 బంతుల్లో 36) ఫర్వాలేదనిపించగా.. ఆ తర్వాతి స్థానాల్లో వచ్చిన వాళ్లలో పేసర్ నవదీప్ సైనీ(23) మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగాడు.బాబా అపరాజిత్(9)తో పాటు వికెట్ కీపర్ ఇషాన్ కిషన్(4) విఫలం కాగా.. నితీశ్ కుమార్ రెడ్డి డకౌట్ అయ్యాడు. మానవ్ సుతార్ (1), ప్రసిద్ కృష్ణ(0) కూడా చేతులెత్తేశారు. ఆఖర్లో వచ్చిన ముకేశ్ కుమార్ 4 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇలా ఆసీస్ బౌలర్ల ధాటికి బ్యాటర్లంతా పెవిలియన్‌కు క్యూ కట్టడంతో 47.4 ఓవర్లలో 107 పరుగులకే భారత్ ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా బౌలర్లలో పేసర్ బ్రెండన్ డాగెట్ ఆరు వికెట్లతో చెలరేగగా.. మరో పేసర్ ఫెర్గూస్ ఒ నీల్, స్పిన్నర్ టాడ్ మర్ఫీ ఒక వికెట్ పడగొట్టాడు. మూకుమ్మడిగా విఫలంకాగా ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్‌లో భారత తుది జట్టులో స్థానం దక్కించుకోవడమే లక్ష్యంగా భారత యువ ఆటగాళ్లు అనధికారిక టెస్టులపై దృష్టి పెట్టారు. ఈ రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో సత్తా చాటి టీమ్ మేనేజ్మెంట్ను ఇంప్రెస్ చేయాలని పట్టుదలగా ఉన్నారు. ఈ క్రమంలో ఆసీస్-ఎతో గురువారం నుంచి భారత్-ఎ తొలి అనధికారిక టెస్టు మొదలైంది. అయితే, తొలి ఇన్నింగ్స్‌లోనే అందరూ మూకుమ్మడిగా విఫలం కావడం గమనార్హం. ముఖ్యంగా సీనియర్ టీమ్‌కు ఎంపికైన అభిమన్యు ఈశ్వరన్, నితీశ్ కుమార్ రెడ్డి బ్యాటింగ్‌లో నిరాశపరచగా.. ప్రసిద్ కృష్ణ వికెట్లు తీస్తేనే సెలక్టర్ల దృష్టిని ఆకర్షించగలడు.దేశవాళీల్లో సత్తా చాటి... 11 ఏళ్ల ఫస్ట్ క్లాస్ కెరీర్లో ఈశ్వరన్ భారీగా పరుగులు సాధించినా దురదృష్టవశాత్తూ ఇప్పటి వరకు జాతీయ జట్టుకు ఆడే అవకాశం రాలేదు. 99 మ్యాచ్‌లలో అతను 7638 పరుగులు సాధించగా, ఇందులో 27 సెంచరీలు ఉన్నాయి. ఇక ఆసీస్-ఎతో జరుగుతున్న తాజా మ్యాచ్ అతడికి 100వ ఫస్ట్ క్లాస్ మ్యాచ్ .ఇంతటి అపార అనుభవం ఉన్న ఈశ్వరన్ పేరు పెర్త్‌లో జరిగే తొలి టెస్టు కోసం ఇప్పటికే పరిశీలనలో ఉంది. వ్యక్తిగత కారణాలతో కెప్టెన్ రోహిత్ శర్మ తొలి టెస్టుకు దూరం అయ్యే అవకాశం ఉండటంతో రెగ్యులర్ ఓపెనర్‌గా ఈశ్వరన్కే తొలి ప్రాధాన్యత ఉంది. గాయాల నుంచి కోలుకునిఇక గాయం నుంచి కోలుకొని పునరాగమనం చేసిన తర్వాత దులీప్ ట్రోఫీ, ఇరానీ, రంజీలలో పేసర్ ప్రసిధ్ కృష్ణ ఆడాడు. వీటిలో ప్రదర్శన గొప్పగా లేకపోయినా... అతని బౌలింగ్ శైలికి ఆసీస్ పిచ్‌లు సరిగ్గా సరిపోతాయి. ఇదే కారణంతో అతను సీనియర్ టీమ్‌లోకి ఎంపికయ్యాడు. ఐదు టెస్టుల సిరీస్‌కు ముందు తన ఫామ్‌ను అందుకోవడంతో పాటు ఫిట్నెస్ నిరూపించుకునేందుకు కూడా ప్రసిద్‌కు ఇది సరైన వేదిక కానుంది. ఐపీఎల్లో మెరుపు బ్యాటింగ్తోఆంధ్ర క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి పరిస్థితి వీరితో పోలిస్తే భిన్నం. ఐపీఎల్లో మెరుపు బ్యాటింగ్‌తో పాటు ఇటీవల బంగ్లాదేశ్‌పై టి20లో చెలరేగిన నితీశ్ ఫస్ట్ క్లాస్ రికార్డు అద్భుతంగా ఏమీ లేదు. ఇటీవల దులీప్ ట్రోఫీలో కూడా ఐదు ఇన్నింగ్స్‌లలో రెండు సార్లు డకౌట్ అయిన అతను... 48 ఓవర్లు బౌలింగ్ చేసి రెండే వికెట్లు తీశాడు.అయినా సరే శార్దుల్ ఠాకూర్‌లాంటి ఆల్‌రౌండర్‌ను కాదని నితీశ్‌ను సెలక్టర్ల టెస్టు టీమ్‌కు ఎంపిక చేశారు. గత ఏడాది రంజీ సీజన్లో 25 వికెట్లు తీసిన నితీశ్ ప్రదర్శన కూడా ఒక కారణం కాగా... వికెట్‌కు ఇరు వైపులా బంతిని చక్కగా స్వింగ్ చేసే అతని నైపుణ్యం ఆసీస్ పిచ్‌లపై పనికొస్తుందని వారు భావించారు. ఈ నేపథ్యంలో తానేంటో నిరూపించుకోవాల్సిన బాధ్యత నితీశ్పైనే ఉంది. టెస్టు క్రికెటర్లు కూడా... భారత్ తరఫున ఇంకా టెస్టులు ఆడని రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలో భారత ‘ఎ’ జట్టు బరిలోకి దిగింది. ఇప్పటికే భారత్‌కు ఆడిన ఇషాన్ కిషన్, నవదీప్ సైనీ, దేవదత్ పడిక్కల్, ముకేశ్ కుమార్లాంటి ప్లేయర్లు మరోసారి ఎరుపు బంతితో తమ ఆటను నిరూపించుకోవాల్సి ఉంది.ఆసీస్ క్రికెటర్లకూ పరీక్షఇక రంజీ, దులీప్ ట్రోఫీలో రాణించి ఈ టీమ్‌కు ఎంపికైన బాబా ఇంద్రజిత్, రికీ భుయ్, ఖలీల్, తనుశ్ కొటియాన్, సాయిసుదర్శన్ రాణించడం వారి భవిష్యత్తుకు కీలకం. మరోవైపు ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టులో కూడా పలువురు టెస్టు క్రికెటర్లు ఉన్నారు. మైకేల్ నెసర్, మార్కస్ హారిస్, స్కాట్ బోలండ్, కామెరాన్ బాన్‌క్రాఫ్ట్, టాడ్ మర్ఫీ ఆసీస్ ప్రధాన జట్టులోకి పునరాగమనం చేసే ప్రయత్నంలో తమ అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకుంటున్నారు.ఇక పరిమిత ఓవర్ల పోటీల్లో సత్తా చాటిన జోష్ ఫిలిప్ కూడా ఇక్కడ రాణించి టెస్టు అరంగేట్రాన్ని ఆశిస్తున్నాడు. అందరికంటే ఎక్కువగా న్యూసౌత్‌వేల్స్‌కు చెందిన 19 ఏళ్ల ఓపెనర్ స్యామ్ కొన్‌స్టాస్‌పై ఆస్ట్రేలియా సెలక్టర్లు ఎక్కువగా దృష్టి పెట్టారు.‘జూనియర్ రికీ పాంటింగ్’గా అందరూ పిలుస్తున్న ఈ బ్యాటర్ 6 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో 2 సెంచరీలు సహా 45.70 సగటుతో పరుగులు సాధించాడు. ఇక్కడ బాగా ఆడితే భారత్‌తో టెస్టుకు అతడు కొత్త ఓపెనర్‌గా బరిలోకి దిగే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ‘ఎ’ జట్ల పోరు కూడా ఆసక్తికరంగా సాగడం ఖాయం. చదవండి: IPL 2025: రిషభ్ పంత్‌ను వదులుకున్న ఢిల్లీ క్యాపిటల్స్Waking up early just to see Ruturaj score a golden duck. Bro not doing justice to his fans now pic.twitter.com/KDfzJmXXZ2— Div🦁 (@div_yumm) October 31, 2024 -
జేడీయూలో చేరిన క్రికెటర్ ఇషాన్ కిషన్ తండ్రి
టీమిండియా క్రికెటర్ ఇషాన్ కిషన్ తండ్రి ప్రణవ్ కుమార్ పాండే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. బీహార్‌కు చెందిన ప్రణవ్ స్థానిక అధికార పార్టీ అయిన జనతాదల్ యునైటెడ్‌లో (జేడీయూ) చేరారు. జేడీయూ చీఫ్‌గా నితీశ్‌కుమార్ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. చున్నూగానూ పిలువబడే ప్రణవ్ను జేడీయూ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాజ్యసభ సభ్యుడు సంజయ్ ఝా పార్టీలోకి ఆహ్వానించారు. పట్నాలో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో ప్రణవ్ జేడీయూ తీర్థం పుచ్చుకున్నారు. ప్రణవ్ పాండేకు ఇషాన్ కిషన్ తండ్రిగానే కాకుండా స్థానికంగా ప్రముఖ బిల్డర్‌గా మంచి పేరుంది. బిల్డర్‌గా ఉంటూనే ప్రణవ్ మెడికల్ స్టోర్ వ్యాపారంలోనూ ఉన్నారు. జేడీయూలో చేరిక సందర్భంగా ప్రణవ్ ఇలా అన్నారు. పార్టీ కోసం నమ్మకమైన సైనికుడిగా పని చేస్తానని తెలిపాడు. ఇదే సందర్భంగా జేడీయూ ఎంపీ సంజయ్ ఝా మాట్లాడుతూ.. సీఎం నితీశ్‌కుమార్ చేస్తున్న అభివృద్దిని చూసి ప్రణవ్ పార్టీలో చేరారన్నారు. ప్రణవ్ చేరిక మగద్ ప్రాంతంలో పార్టీని బలోపేతం చేస్తుందని తెలిపారు.కాగా, ఇషాన్ కిషన్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన భారత-ఏ జట్టులో సభ్యుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఇషాన్ ఇటీవలికాలంలో సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. దేశవాలీ టోర్నీల్లో ఇషాన్ పరుగుల వరద పారించాడు. తిరిగి జాతీయ జట్టులో చోటే లక్ష్యంగా ఇషాన్ ముందుకు కదులుతున్నాడు. -
ఆసీస్ టూర్‌కు భారత జట్టు ప్రకటన.. ఆంధ్ర ప్లేయర్లకు చోటు
ఆస్ట్రేలియా గడ్డపై జరిగే రెండు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో పాల్గొనే భారత ‘ఎ’ జట్టును సెలక్టర్లు ప్రకటించారు. 15 మంది సభ్యుల ఈ రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఇద్దరు ఆంధ్ర ఆటగాళ్లు నితీశ్ కుమార్ రెడ్డి, రికీ భుయ్‌లకు ఇందులో చోటు లభించింది.భారత సీనియర్ టీమ్‌లో స్థానం కోల్పోయిన ఇషాన్ కిషన్‌కు ఈ జట్టులో అవకాశం దక్కడం విశేషం. ఈ టూర్లో భాగంగా ఆ్రస్టేలియా ‘ఎ’తో మెకే, మెల్బోర్న్లలో భారత్ ‘ఎ’ నాలుగు రోజుల మ్యాచ్‌లు రెండు ఆడుతుంది. ఆ తర్వాత టెస్టు సిరీస్ కోసం సిద్ధమవుతున్న భారత సీనియర్ టీమ్‌తో పెర్త్‌లో మూడు రోజుల మ్యాచ్‌లో కూడా తలపడుతుంది. ‘ఎ’ జట్టు ప్రదర్శన ద్వారా కూడా బోర్డర్–గావస్కర్ ట్రోఫీ కోసం కూడా ఒకరిద్దరు ఆటగాళ్లను ఎంపిక చేసే అవకాశం ఉంది. భారత ‘ఎ’ జట్టు వివరాలు: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), అభిమన్యు ఈశ్వరన్ (వైస్ కెప్టెన్), సాయిసుదర్శన్, నితీశ్ కుమార్ రెడ్డి, దేవ్‌దత్ పడిక్కల్, రికీ భుయ్, బాబా ఇంద్రజిత్, ఇషాన్ కిషన్, అభిషేక్ పొరేల్, ముకేశ్ కుమార్, ఖలీల్ అహ్మద్, యశ్ దయాళ్, నవదీప్ సైనీ, మానవ్ సుథార్, తనుశ్ కొటియాన్.చదవండి: అభిషేక్ శర్మ ఊచకోత.. యూఏఈపై టీమిండియా ఘన విజయం -
ఆసీస్ టూర్‌కు భారత జట్టు ఇదే.. కెప్టెన్‌గా రుతురాజ్! తెలుగోడికి చోటు?
ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు భారత్-ఎ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా ఆసీస్-ఎ జట్టుతో భారత్ రెండు అనాధికారిక టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. ఈ రెండు మ్యాచ్‌ల సిరీస్ ఆక్టోబర్ 31 నుంచి ప్రారంభం కానుంది.ఈ క్రమంలో భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఒకట్రెండు రోజుల్లో ప్రకటించే అవకాశముంది. ఇప్పటికే ఆస్ట్రేలియాకు పంపే జట్టును సెలక్టర్లు ఖారారు చేసినట్లు తెలుస్తోంది. ఈ పర్యటన భారత్-ఎ జట్టుకు స్టార్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ సారథ్యం వహించనున్నట్లు సమాచారం. రుతురాజ్ ఇప్పటికే దేశీయ, అంతర్జాతీయ క్రికెట్లో తను ఏంటో నిరూపించుకున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మహారాష్ట్రకు గైక్వాడ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడికి భారత-ఎ జట్టు పగ్గాలు అప్పగించనున్నట్లు వినికిడి.కిషన్‌కు చోటు?అదేవిధంగా ఆసీస్ టూర్‌కు స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌ను ఎంపిక చేయాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. భారత సీనియర్ జట్టులో చోటు కోల్పోయిన కిషన్.. ప్రస్తుతం రంజీల్లో జార్ఖండ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ టోర్నీలో కిషన్ పర్వాలేదన్పిస్తున్నాడు. అంతకముందు దులీప్ ట్రోఫీలో కూడా ఇషాన్ సత్తాచాటాడు. ఈ క్రమంలో అతడిని ఆస్ట్రేలియాకు పంపనున్నట్లు సమాచారం. ఇక ఆస్ట్రేలియాకు వెళ్లే జట్టులో ఆంధ్రా ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి, స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రికీ భుయ్ కూడా చోటు సంపాదించుకున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.ఆసీస్ టూర్‌కు భారత్- ఎ జట్టు(అంచనా)రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), అభిమన్యు ఈశ్వరన్, దేవదత్ పడిక్కల్,సాయి సుదర్శన్, బి ఇంద్రజిత్, అభిషేక్ పోరెల్, ఇషాన్ కిషన్, ముఖేష్ కుమార్, రికీ భుయ్, నితీష్ కుమార్ రెడ్డి, మానవ్ సుతార్, నవ్‌దీప్ సైనీ, ఖాలీల్ అహ్మద్, తనుష్ కోటియన్, యశ్ దయాళ్చదవండి: ‘కాస్తైనా సిగ్గుండాలి నీకు!: మండిపడ్డ టీమిండియా ఫ్యాన్స్ -
రోహిత్, కిషన్‌కు నో ఛాన్స్.. ముంబై రిటెన్షన్ లిస్ట్ ఇదే!
ఐపీఎల్-2025 మెగా వేలానికి సంబంధించి ఆటగాళ్ల రిటెన్షన్ రూల్స్‌ను బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈసారి మొత్తం ఆరుగురి ఆటగాళ్లను రిటైన్ చేసుకునేందుకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ అవకాశం ఇచ్చింది. ఇందులో ఒక రైట్ టు మ్యాచ్ (ఆర్టీఎం) ఆప్షన్ ఉంది. అదేవిధంగా ప్రతీ ఫ్రాంచైజీ పర్స్ వాల్యూను రూ.120 కోట్లకు పెంచారు. గతంలో ఈ పర్స్ విలువ రూ.90 కోట్లు ఉండేది. ఇక అట్టిపెట్టుకున్న అయిదుగురి కోసం ఓ ఫ్రాంఛైజీ రూ.75 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అట్టిపెట్టుకున్న మొదటి ఆటగాడికి రూ.18 కోట్లు, రెండో ఆటగాడికి రూ.14 కోట్లు, మూడో ఆటగాడికి రూ.11 కోట్లు ఫ్రాంఛైజీ చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన రెండు రిటెన్షన్లకు తిరిగి వరుసగా రూ.18 కోట్లు, రూ.14 కోట్లు వెచ్చించాలి. ఇక రిటెన్షన్‌కు సంబంధించి విధి విధానాలు ఖారారు కావడంతో ఆయా ఫ్రాంచైజీలు తమ అంటిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను సిద్దం చేసే పనిలో పడ్డాయి.రోహిత్, కిషన్‌కు నో ఛాన్స్!ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ తమ ప్లేయర్ల రిటెన్షన్ లిస్ట్‌ను ఫైనలైజ్ చేసినట్లు చేసినట్లు తెలుస్తోంది. ఆ జట్టు స్టార్ ప్లేయర్, కెప్టెన్‌గా 5 ట్రోఫీలు అందించిన రోహిత్ శర్మను వదులుకోవడానికి ముంబై ఇండియన్స్ సిద్దమైనట్లు తెలుస్తోంది.ఈ ఏడాది సీజన్‌కు ముందు హిట్‌మ్యాన్‌ను తమ జట్టు కెప్టెన్సీ నుంచి తప్పించి హార్దిక్ పాండ్యాకు ముంబై యాజమాన్యం బాధ్యతలు అప్పగించింది. అప్పటినుంచే ముంబైతో రోహిత్ తెగిపోయినట్లు సమాచారం. ఈ క్రమంలోనే రోహిత్ కూడా ఆ ఫ్రాంచైజీని నుంచి బయటకు వచ్చేందుకు సిద్దంగా ఉన్నాడంట. అతడితో పాటు స్టార్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌ను కూడా విడిచిపెట్టాలని ముంబై నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గత రెండు సీజన్ల నుంచి కిషన్ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. ఈ క్రమంలోనే అతడిని వేలంలోకి విడిచిపెట్టన్నట్లు వినికిడి.రిటెన్షన్ ఆటగాళ్లు వీరే? కెప్టెన్ హార్దిక్ పాండ్యా(రూ.18 కోట్లు), స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా(రూ.14 కోట్లు), యువ ఆటగాడు తిలక్ వర్మ(రూ.11 కోట్లు)లను ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకోవాలని భావిస్తున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. వీరితో పాటు ఆన్క్యాప్డ్ ప్లేయర్లగా నమాన్ ధీర్(రూ. 4 కోట్లు), ఆకాశ్ మధ్వాల్(రూ. 4కోట్లు) అంటిపెట్టుకోవాలని ముంబై యోచిస్తున్నట్లు ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి. కాగా ఈ ఏడాది డిసెంబర్లో మెగా వేలం జరిగే అవకాశముంది.చదవండి: అశ్విన్ వారసుడు దొరికినట్లేనా? -
Team India: ఇషాన్ కిషన్ కల చెదిరిపోయినట్లే!
ఇరానీ కప్-2024 మ్యాచ్‌లో టీమిండియా యువ క్రికెటర్ ధ్రువ్ జురెల్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ముంబైతో జరుగుతున్న ఈ ఐదు రోజుల మ్యాచ్‌లో సూపర్ హాఫ్ సెంచరీ సాధించాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి మొత్తంగా 121 బంతులు ఎదుర్కొని 93 పరుగులతో దుమ్ములేపాడు.'శతకం చేజారినాసెంచరీకి ఏడు పరుగుల దూరంలో నిలిచిపోయినా.. ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్(191)తో కలిసి రెస్ట్ ఆఫ్ ఇండియాకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. ఇక ఇదే మ్యాచ్‌లో తన వికెట్ కీపింగ్ నైపుణ్యాలతోనూ ధ్రువ్ జురెల్ అదరగొడుతున్నాడు. ముంబై తొలి ఇన్నింగ్స్‌లో అతడు మూడు క్యాచ్‌లతో మెరిశాడు.ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో ఆయుశ్ మాత్రే(19), హార్దిక్ తామోర్(0), యశ్ దయాల్ బౌలింగ్‌లో కెప్టెన్ అజింక్య రహానే(97) ఇచ్చిన క్యాచ్‌లు పట్టి.. వారిని పెవిలియన్‌కు పంపడంలో తోడ్పడ్డాడు. తద్వారా టీమిండియా సెలక్టర్ల దృష్టి తనపై నుంచి మరలకుండా చేసుకోగలిగాడు ఈ వికెట్ కీపర్ బ్యాటర్.ఇషాన్ కిషన్ విఫలంమరోవైపు.. ఇరానీ కప్-2024 మ్యాచ్‌లో ధ్రువ్ జురెల్‌తో పాటు రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టుకే ఆడుతున్న మరో టీమిండియా స్టార్ ఇషాన్ కిషన్ మాత్రం నిరాశపరిచాడు. ఐదో స్థానంలోబ్యాటింగ్‌కు దిగిన ఈ లెఫ్టాండర్ 60 బంతులు ఎదుర్కొని 38 పరుగులకే పరిమితమయ్యాడు. కాగా ఇషాన్ కిషన్ గత కొన్నాళ్లుగా టీమిండియాకు దూరమైన విషయం తెలిసిందే.టీమిండియా సెలక్టర్ల దృష్టి మరలకుండాముఖ్యంగా టెస్టుల్లో స్థానం పొందాలన్న ఇషాన్ కల ఇప్పట్లో నెరవేరేలా కనిపించడం లేదు. ఇప్పటికే క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడి సెంట్రల్ కాంట్రాక్టు కోల్పోయిన ఈ జార్ఖండ్ బ్యాటర్‌కు ధ్రువ్ జురెల్ చెక్ పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.రోడ్డు ప్రమాదం కారణంగా జట్టుకు దూరమైన రిషభ్ పంత్ స్థానంలో టెస్టుల్లో అరంగేట్రం చేసిన ధ్రువ్.. తన తొలి మ్యాచ్‌లోనే మెరుగ్గా రాణించాడు. ఈ ఏడాది ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో 46 పరుగులతో ఆకట్టుకున్నాడు. తాజాగా దులిప్ ట్రోఫీ-2024లోనూ వికెట్ కీపర్‌గా రాణించిన ధ్రువ్ జురెల్.. బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో పంత్ బ్యాకప్‌గా ఉన్నాడు.ఇషాన్ రంజీల్లో రాణిస్తేనేతాజాగా రెస్ట్ ఆఫ్ ఇండియా తరఫున అద్బుత ఇన్నింగ్స్‌తో అలరించాడు. స్వదేశంలో టీమిండియా తదుపరి న్యూజిలాండ్‌తో ఆడే సిరీస్‌కు ముందు సెలక్టర్ల ముందు సత్తా నిరూపించుకున్నాడు. దీంతో సెలక్టర్లు.. టెస్టుల్లో ఇషాన్ కిషన్‌ను వికెట్ కీపర్ రేసు నుంచి తప్పించడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఈ ఏడాది రంజీల్లో గనుక ఇషాన్ రాణిస్తే తన రాత మారే అవకాశం ఉంటుంది. భారీ ఆధిక్యం దిశగా ముంబైకాగా రంజీ చాంపియన్- రెస్ట్ ఆఫ్ ఇండియా జట్ల మధ్య ఇరానీ కప్ టైటిల్ కోసం పోటీ జరుగుతుందన్న విషయం తెలిసిందే. ఈసారి రంజీ ట్రోఫీ గెలిచిన ముంబై.. ఇరానీ కప్ కూడా గెలవడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. లక్నోలో అక్టోబరు 1న మొదలైన ఈ ఐదు రోజుల మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 537 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇందుకు రెస్ట్ ఆఫ్ ఇండియా 416 పరుగులతో బదులిచ్చింది. ఈ క్రమంలో శుక్రవారం నాటి నాలుగో రోజు ఆట ముగిసే సరికి ముంబై రెండో ఇన్నింగ్స్‌లో 40 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది.చదవండి: IPL 2025: ‘ఆర్సీబీ రోహిత్ శర్మను కొని.. కెప్టెన్ చేయాలి’ -
Ind vs Ban: అతడికి రెస్ట్.. టీమిండియాలోకి ఇషాన్ ఎంట్రీ!
యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ టీమిండియాలో పునరాగమనం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ సందర్భంగా అతడు రీఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. అయితే, రెస్టాఫ్ ఇండియా టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయంపైనే ఈ విషయం ఆధారపడి ఉంది. గతేడాది దక్షిణాఫ్రికా పర్యటన మధ్యలోనే స్వదేశానికి తిరిగి వచ్చిన ఇషాన్ కిషన్.. ఇప్పటి వరకు జాతీయ జట్టుకు ఎంపిక కాలేదు.రెడ్‌బాల్ క్రికెట్లో రీఎంట్రీరంజీల్లో ఆడాలన్న బీసీసీఐ ఆదేశాలను బేఖాతరకు చేయడం వల్ల.. క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడ్డాడంటూ బోర్డు ఇషాన్‌కు గట్టి షాకిచ్చింది. సెంట్రల్ కాంట్రాక్టు నుంచి అతడిని తప్పించింది. ఈ క్రమంలో దిద్దుబాటు చర్యలకు దిగిన ఇషాన్ ఇటీవలే బుచ్చిబాబు టోర్నీ ద్వారా రెడ్‌బాల్ క్రికెట్లో రీఎంట్రీ ఇచ్చాడు. సెంచరీతో ఆకట్టుకుని.. దులిప్ ట్రోఫీ-2024లో చోటు దక్కించుకున్నాడు.రెస్టాఫ్ ఇండియా టీమ్‌కు ఎంపికబీసీసీఐ ఆధ్వర్యంలోని ఈ దేశీ రెడ్‌బాల్ టోర్నీలోనూ ఇషాన్ కిషన్ ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. ఇండియా-‘సి’ జట్టు తరఫున శతకంతో అలరించాడు. ఈ క్రమంలో ఇరానీ కప్-2024 మ్యాచ్‌లో రెస్టాఫ్ ఇండియా టీమ్‌కు ఎంపికయ్యాడు.రిషభ్ పంత్‌కు విశ్రాంతిరంజీ చాంపియన్ ముంబైతో అక్టోబరు 1- 5 వరకు జరుగనున్న మ్యాచ్‌లో రెస్టాఫ్ ఇండియా తలపడనుంది. ఆ వెంటనే అంటే.. అక్టోబరు 6- 12 వరకు టీమిండియా స్వదేశంలో బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఇదిలా ఉంటే.. ఈ సిరీస్ నేపథ్యంలో టీమిండియా సెలక్టర్లు స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కు విశ్రాంతినివ్వనున్నట్లు తెలుస్తోంది.బంగ్లా సిరీస్ తర్వాత.. న్యూజిలాండ్‌తో టెస్టుల నేపథ్యంలో ఈ యోచన చేస్తున్నట్లు సమాచారం. కాబట్టి పంత్ స్థానంలో ఇషాన్‌ను బంగ్లాదేశ్‌తో టీ20సిరీస్‌కు ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రధాన వికెట్ కీపర్‌గా సంజూ శాంసన్‌కు ఛాన్స్ ఇవ్వనున్న సెలక్టర్లు.. అతడికి బ్యాకప్‌గా ఇషాన్‌కు జట్టులోస్థానం కల్పించనున్నట్లు తెలుస్తోంది. రెస్టాఫ్ ఇండియా నుంచి రిలీజ్ చేస్తేనేఅయితే, అదే సమయంలో.. ఇరానీ కప్ మ్యాచ్ ఉన్నందున రెస్టాఫ్ ఇండియా నుంచి ఇషాన్‌ను రిలీజ్ చేస్తేనే ఇది సాధ్యమవుతుంది. ఏదేమైనా.. ఒకప్పుడు జట్టులో కీలక సభ్యుడిగా ఉన్న ఈ లెఫ్టాండర్.. స్వీయ తప్పిదాల వల్ల ఇప్పుడు జట్టులో అదనపు ప్లేయర్‌గానైనా చోటు దక్కించుకోవడం గగనమైపోయింది.చదవండి: రంజీ ‘జట్టు’లో విరాట్ కోహ్లి, మరో టీమిండియా స్టార్ కూడా.. డీడీసీఏ ప్రకటన -
అభిమన్యు ఈశ్వరన్ సెంచరీ.. నిరాశపరిచిన స్కై, రుతు, ఇషాన్
దులీప్ ట్రోఫీ 2024లో ఇండియా-బి కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ వరుసగా రెండో సెంచరీ చేశాడు. అనంతపురం వేదికగా ఇండియా-డితో జరుగుతున్న మ్యాచ్‌లో ఈశ్వరన్ 116 పరుగులు చేసి ఔటయ్యాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా-బి తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. వాషింగ్టన్ సుందర్ (39), రాహుల్ చాహర్ (0) క్రీజ్‌లో ఉన్నారు. ఇండియా-డి బౌలర్లలో అర్షదీప్ సింగ్ 3, ఆధిత్య థాకరే 2, సౌరభ్ కుమార్ ఓ వికెట్ పడగొట్టారు. ఇండియా-బి ఇండియా-డి తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 139 పరుగులు వెనుకపడి ఉంది.సూర్యకుమార్ యాదవ్ విఫలంఇండియా-బి ఇన్నింగ్స్‌లో ఈశ్వరన్ మినహా ఎవ్వరూ రాణించలేదు. గాయం తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఐదు పరుగులు మాత్రమే చేసి అర్షదీప్ సింగ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఎన్ జగదీషన్ (13), సుయాశ్ ప్రభుదేశాయ్ (16), ముషీర్ ఖాన్ (5), నితీశ్ రెడ్డి (0) కూడా విఫలమయ్యారు.సంజూ మెరుపు సెంచరీసంజూ శాంసన్ మెరుపు సెంచరీతో (106) చెలరేగడంతో ఇండియా-డి తొలి ఇన్నింగ్స్‌లో 349 పరుగులకు ఆలౌటైంది. దేవ్‌దత్ పడిక్కల్ (50), శ్రీకర్ భరత్ (52), రికీ భుయ్ (56) అర్ద సెంచరీలతో రాణించారు. ఇండియా-బి బౌలర్లలో నవ్‌దీప్ సైనీ ఐదు వికెట్లు తీయగా.. రాహుల్ చాహర్ 3, ముకేశ్ కుమార్ ఓ వికెట్ పడగొట్టారు.నిరాశపరిచిన రుతురాజ్, ఇషాన్ కిషన్అనంతపురంలోనే జరుగుతున్న మరో మ్యాచ్‌లో (ఇండియా-ఏతో) ఇండియా-సి ఆటగాళ్లు రుతురాజ్ గైక్వాడ్ (17), సాయి సుదర్శన్ (17), రజత్ పాటిదార్ (0), ఇషాన్ కిషన్ (5) నిరాశపరిచారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా-సి తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది.రాణించిన అభిషేక్ పోరెల్ఇండియా-సి ఇన్నింగ్స్‌లో అభిషేక్ పోరెల్ (82) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోర్ చేశాడు. పుల్కిత్ నారంగ్ (35 నాటౌట్), విజయ్ కుమార్ వైశాఖ్ (14 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నారు. ఇండియా-ఏ చేసిన తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇండియా-సి ఇంకా 81 పరుగులు వెనుకపడి ఉంది. ఇండియా-ఏ బౌలర్లలో ఆకిబ్ ఖాన్ 3, షమ్స్ ములానీ 2, ఆవేశ్ ఖాన్, తనుశ్ కోటియన్ తలో వికెట్ పడగొట్టారు.శాశ్వత్ రావత్ సెంచరీ.. హాఫ్ సెంచరీ చేసిన ఆవేశ్ ఖాన్శాశ్వత్ రావత్ సెంచరీతో (124) కదంతొక్కడంతో ఇండియా-ఏ తొలి ఇన్నింగ్స్‌లో 297 పరుగులు చేసింది. ఆవేశ్ ఖాన్ (51 నాటౌట్) అర్ద సెంచరీతో రాణించాడు. టెయిలెండర్లు షమ్స్ ములానీ (44), ప్రసిద్ద్ కృష్ణ (34) పర్వాలేదనిపించారు. ఇండియా-సి బౌలర్లలో విజయ్‌కుమార్ 4, అన్షుల్ కంబోజ్ 3, గౌరవ్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టారు. చదవండి: IND VS BAN 1st Test: మరో అరుదైన మైలురాయిని అధిగమించిన విరాట్ -
ఇషాన్ కిషన్ సెంచరీ.. భారీ స్కోర్ దిశగా ఇండియా-సి టీమ్
సాక్షి, అనంతపురం: యువ ఆటగాడు ఇషాన్ కిషన్ (126 బంతుల్లో 111; 14 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీతో చెలరేగాడు. ఫలితంగా అనంతపురంలో భారత్ ‘బి’ జట్టుతో గురువారం మొదలైన దులీప్ ట్రోఫీ రెండో రౌండ్ మ్యాచ్‌లో భారత్ ‘సి’ జట్టు భారీ స్కోరు దిశగా సాగుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ ‘సి’ జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 79 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. ఫస్ట్‌క్లాస్ క్రికెట్ పునరాగమనంలో ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఇషాన్ కిషన్ శతక్కొట్టగా... మిగతా బ్యాటర్లు కూడా విలువైన పరుగులు చేయడంతో భారత్ ‘సి’ జట్టు మెరుగైన స్కోరు చేయగలిగింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (50 బంతుల్లో 46 బ్యాటింగ్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), సాయి సుదర్శన్ (75 బంతుల్లో 43; 8 ఫోర్లు), రజత్ పాటిదార్ (67 బంతుల్లో 40; 8 ఫోర్లు), బాబా ఇంద్రజిత్ (136 బంతుల్లో 78; 9 ఫోర్లు) రాణించారు. మ్యాచ్ ఆరంభంలో రెండు బంతులు ఎదుర్కోగానే మడమ నొప్పితో మైదానాన్ని వీడిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్... కోలుకొని తిరిగి క్రీజులో అడుగు పెట్టి అజేయంగా నిలిచాడు. అతడితో పాటు మానవ్ సుతార్ (8 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. గాయం కారణంగా దులీప్ ట్రోఫీ తొలి రౌండ్ మ్యాచ్‌కు అందుబాటులో లేకుండా పోయిన ఇషాన్ కిషన్... రెండో రౌండ్ మ్యాచ్‌లో చక్కటి ఆటతీరు కనబర్చాడు. ఇంద్రజిత్తో కలిసి మూడో వికెట్‌కు 189 పరుగులు జోడించి జట్టును పటిష్ట స్థితికి చేర్చాడు. ఇటీవల బుచ్చిబాబు టోర్నమెంట్లో జార్ఖండ్ తరఫున సెంచరీతో చెలరేగిన ఇషాన్ కిషన్... ఇక్కడే అదే జోరు కొనసాగించాడు. భారత్ ‘బి’ బౌలర్లలో ముఖేశ్ కుమార్ 3 వికెట్లు పడగొట్టగా... నవ్‌దీప్ సైనీ, రాహుల్ చహర్ చెరో వికెట్ తీశారు. స్కోరు వివరాలు భారత్ ‘సి’ తొలి ఇన్నింగ్స్: రుతురాజ్ గైక్వాడ్ (బ్యాటింగ్) 46; సాయి సుదర్శన్ (సి) నవ్‌దీప్ సైనీ (బి) ముకేశ్ కుమార్ 43; రజత్ పాటిదార్ (బి) నవ్‌దీప్ సైనీ 40; ఇషాన్ కిషన్ (బి) ముకేశ్ కుమార్ 111; బాబా ఇంద్రజిత్ (బి) రాహుల్ చాహర్ 78; అభిషేక్ పొరేల్ (ఎల్బీడబ్ల్యూ) ముకేశ్ కుమార్ 12; మానవ్ సుతార్ (బ్యాటింగ్) 8; ఎక్స్‌ట్రాలు 19; మొత్తం (79 ఓవర్లలో 5 వికెట్లకు) 357. వికెట్ల పతనం: 1–96, 2–97, 3–286, 4–311, 5–345. బౌలింగ్: ముకేశ్ కుమార్ 21–3–76–3; నవ్‌దీప్ సైనీ 17–2–78–1; వాషింగ్టన్ సుందర్ 10–0–55–0; నితీశ్ కుమార్ రెడ్డి 14–2–58–0; సాయికిశోర్ 12–0–46–0; రాహుల్ చహర్ 5–0–35–1. -
సెంచరీతో కదం తొక్కిన ఇషాన్ కిషన్
ఇవాళ (సెప్టెంబర్ 12) మొదలైన దులీప్ ట్రోఫీ రెండో రౌండ్ మ్యాచ్‌లో ఇండియా-సి ఆటగాడు ఇషాన్ కిషన్ మెరుపు సెంచరీతో కదంతొక్కాడు.అనంతపురం వేదికగా ఇండియా-బితో జరుగుతున్న మ్యాచ్‌లో ఇషాన్ ఈ ఫీట్‌ను సాధించాడు. ఇషాన్ 121 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. Ishan Kishan century moment in the Duleep Trophy! 🌟- A class return by Kishan. 👏pic.twitter.com/xRMbxt36jU— Mufaddal Vohra (@mufaddal_vohra) September 12, 2024గాయం కారణంగా ఇషాన్ తొలి రౌండ్ మ్యాచ్ ఆడలేదు. తొలి రౌండ్ మ్యాచ్‌కు ముందు బుచ్చిబాబు టోర్నీలోనూ ఇషాన్ సెంచరీతో మెరిశాడు. ఇషాన్ సూపర్ ఫామ్‌లో ఉండటం భారత సెలెక్టర్లకు తలనొప్పిగా మారింది. ఇప్పటికే భారత జట్టులో వికెట్‌కీపర్ బ్యాటర్లుగా రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, ధృవ్ జురెల్ ఉన్నారు. బంగ్లాదేశ్‌తో సిరీస్‌కు భారత జట్టు ఎంపిక ఇదివరకే పూర్తైన నేపథ్యంలో ఇషాన్ టీమిండియా నుంచి పిలుపు కోసం మరికొంత కాలం పాటు వేచి ఉండాల్సిందే.మ్యాచ్ విషయానికొస్తే... ఇండియా-బితో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఇండియా-సి.. 63 ఓవర్లు ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 270 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (103), బాబా ఇంద్రజిత్ (62) క్రీజ్‌లో ఉన్నారు. ఇండియా-సి ఇన్నింగ్స్‌లో సాయి సుదర్శన్ 43, రజత్ పాటిదార్ 40 పరుగులు చేసి ఔట్ కాగా.. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 4 పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఇండియా-బి బౌలర్లలో ముకేశ్ కుమార్, నవ్‌దీప్ సైనీలకు తలో వికెట్ దక్కింది.ఇదిలా ఉంటే, ఇవాళే మొదలైన మరో మ్యాచ్‌లో ఇండియా-ఏ, ఇండియా-డి జట్లు తలపడుతున్నాయి. అనంతపురం వేదికగానే జరుగుతున్న ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఇండియా-ఏ 70 ఓవర్లు పూర్తయ్యేసరికి 7 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. ప్రథమ్ సింగ్ (7), మయాంక్ అగర్వాల్ (7), తిలక్ వర్మ (10), రియాన్ పరాగ్ (37), షాశ్వత్ రావత్ (15), కుమార్ కుషాగ్రా (28), తనుశ్ కోటియన్ (53) ఔట్ కాగా.. షమ్స్ ములానీ (64), ప్రసిద్ధ్ కృష్ణ (2) క్రీజ్‌లో ఉన్నారు. ఇండియా-డి బౌలర్లలో విధ్వత్ కావేరప్ప, అర్ష్‌దీప్ సింగ్ చెరో 2, హర్షిత రాణా, సరాన్ష్ జైన్, సౌరభ్ కుమార్ తలో వికెట్ పడగొట్టారు. చదవండి: హాఫ్ సెంచరీతో చెలరేగిన ఇషాన్ కిషన్.. -
హాఫ్ సెంచరీతో చెలరేగిన ఇషాన్ కిషన్..
దులీప్ ట్రోఫీ-2024ను భారత వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఘనంగా ఆరంభించాడు. ఈ టోర్నీలో ఇండియా-సికి ప్రాతినిథ్యం వహిస్తున్న కిషన్.. అనంతపూర్ వేదకగా ఇండియా-బితో మ్యాచ్‌లో అదరగొడుతున్నాడు. ఈ మ్యాచ్‌లో అద్భుతమైన హాఫ్ సెంచరీతో చెలరేగాడు. కిషన్ 40 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. రజిత్ పాటిదార్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన కిషన్.. ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కిషన్ ప్రస్తుతం 52 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. కాగా బీసీసీఐ ఆదేశాలను దిక్కరించి వేటుకు గురైన కిషన్ మళ్లీ భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నాడు. ఈ ఏడాది జరగనున్న దేశీవాళీ టోర్నీ మొత్తానికి అందుబాటులో ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పటికే తమిళనాడు వేదికగా జరిగిన బుచ్చిబాబు టోర్నీలో సత్తాచాటిన కిషన్.. ఇప్పుడు మరో దేశీవాళీ టోర్నీలో దులీప్ ట్రోఫీలో కూడా తన మార్క్‌ను చూపిస్తున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. 41 ఓవర్లకు ఇండియా-సి జట్టు 2 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది.చదవండి: Vinesh Phogat: వినేశ్ ఫొగట్ ఆస్తి వివరాలు వెల్లడి.. ఎన్ని కోట్లంటే? -
టీమిండియా వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ బర్త్‌డే: ఆ ముగ్గురు హైలైట్ (ఫొటోలు)
-
పాపం సంజూ.. ఇక్కడ కూడా అవకాశం దక్కలే..!
దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లు ఇవాల్టి (సెప్టెంబర్) నుంచి ప్రారంభమయ్యాయి. ఇండియా-ఏ, ఇండియా-బి మధ్య తొలి మ్యాచ్ బెంగళూరు వేదికగా జరుగుతుండగా.. ఇండియా-సి, ఇండియా-డి మధ్య రెండో మ్యాచ్ అనంతపురంలో జరుగుతుంది.తొలి మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఇండియా-బి మూడో సెషన్ సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసి గౌరవప్రదమైన స్కోర్ కోసం ప్రాకులాడుతుంది. ముషీర్ ఖాన్ (77), నవ్‌దీప్ సైనీ (7) ఇండియా-బిని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇండియా-బి ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ 30, అభిమన్యు ఈశ్వరన్ 13, సర్ఫరాజ్ ఖాన్ 9, రిషబ్ పంత్ 7, నితీశ్ రెడ్డి 0, వాషింగ్టన్ సుందర్ 0, సాయికిషోర్ 1 పరుగు చేసి ఔటయ్యారు. ఇండియా-ఏ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, ఆకాశ్‌దీప్, ఆవేశ్ ఖాన్ తలో రెండు వికెట్లు తీశారు.రెండో మ్యాచ్ విషయానికొస్తే.. ఇండియా-డి తొలి ఇన్నింగ్స్‌లో 164 పరుగులకే ఆలౌటైంది. అక్షర్ పటేల్ 86 పరుగులు చేసి ఇండియా-డిని ఆదుకున్నాడు. 76 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన దశలో అక్షర్.. అర్ష్‌దీప్ సింగ్‌తో (13) కలిసి తొమ్మిదో వికెట్‌కు 84 పరుగులు జోడించాడు.అక్షర్ మినహా ఇండియా-డిలో ఎవ్వరూ రాణించలేదు. అథర్వ తైడే 4, యశ్ దూబే 10, శ్రేయస్ అయ్యర్ 9, దేవ్‌దత్ పడిక్కల్ 0, రికీ భుయ్ 4, శ్రీకర్ భరత్ 13,సరాన్ష్ జైన్ 13, హర్షిత్ రాణా 0, అర్ష్‌దీప్ సింగ్ 13 పరుగులు చేశారు. ఇండియా-సి బౌలర్లలో విజయ్‌కుమార్ వైశాఖ్ 3, అన్షుల్ కంబోజ్, హిమాన్షు చౌహన్ చెరో 2, మానవ్ సుతార్, హృతిక్ షొకీన్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా-సి 17 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 43 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (5), సాయి సుదర్శన్ (7), ఆర్యన్ జుయెల్ (12) ఔట్ కాగా.. రజత్ పాటిదార్ (13), బాబా ఇంద్రజిత్ (2) క్రీజ్‌లో ఉన్నారు.పాపం సంజూ.. ఇక్కడ కూడా అవకాశం దక్కలే..!రెండో మ్యాచ్‌కు ముందు ఇండియా-డి ఆటగాడు ఇషాన్ కిషన్ గాయపడటంతో సంజూ శాంసన్ జట్టులోకి వచ్చాడు. సంజూ తుది జట్టులో ఉండటం ఖాయమని అంతా అనుకున్నారు. అయితే మేనేజ్మెంట్ అనూహ్యంగా సంజూను పక్కన పెట్టి శ్రీకర్ భరత్‌కు తుది జట్టులోకి తీసుకుంది. ఇండియా-సితో మ్యాచ్‌లో సంజూ బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఈ మ్యాచ్‌లో అవకాశం వస్తే తనను తాను నిరూపించుకుని టెస్ట్ జట్టులో చోటు కొట్టేయాలని సంజూ భావించాడు. చివరికి అతని ఆశలు అడియాశలుగా మిగిలిపోయాయి. -
సంజూ శాంసన్‌కు లక్కీ ఛాన్స్!
టీమిండియా స్టార్ క్రికెటర్ ఇషాన్ కిషన్ దులిప్ ట్రోఫీ-2024 ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. గాయం కారణంగా అతడు ఇండియా-డి జట్టుకు అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం. అతడి స్థానంలో మరో భారత వికెట్ కీపర్ బ్యాటర్ టీమ్‌లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.సెంచరీతో కదం తొక్కికాగా గతేడాది దక్షిణాఫ్రికా పర్యటన నుంచి అర్ధంతరంగా స్వదేశానికి వచ్చిన ఇషాన్ కిషన్.. ఆ తర్వాత టీమిండియాలో మళ్లీ చోటు దక్కించుకోలేకపోయాడు. రంజీ ట్రోఫీలో ఆడాలన్న బీసీసీఐ ఆదేశాలను ధిక్కరించి సెంట్రల్ కాంట్రాక్టు కూడా కోల్పోయాడు. ఈ క్రమంలో దిద్దుబాటు చర్యలకు దిగిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ఇటీవల బుచ్చిబాబు ఇన్విటేషనల్ టోర్నీ బరిలో దిగాడు.తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలోని ఈ రెడ్‌బాల్ టోర్నమెంట్లో జార్ఖండ్ కెప్టెన్‌గా వ్యవహరించిన ఇషాన్ సెంచరీతో అలరించాడు. అయితే, తన జట్టును మాత్రం సెమీస్ రేసులో నిలపలేకపోయాడు. ఇదిలా ఉంటే.. ఈ టోర్నీ సందర్భంగానే ఇషాన్‌కు గాయమైనట్లు క్రిక్‌బజ్ వెల్లడించింది. ఫలితంగా.. సెప్టెంబరు 5న ఆరంభమయ్యే దులిప్ ట్రోఫీకి అతడు అందుబాటులో ఉండకపోవచ్చని పేర్కొంది.సంజూ శాంసన్‌కు చోటు?ఇషాన్ కిషన్ స్థానంలో కేరళ క్రికెటర్ సంజూ శాంసన్ ఇండియా-డి జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉన్నట్లు తెలిపింది. కాగా సెప్టెంబరు 19 నుంచి టీమిండియా స్వదేశంలో బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లకు సన్నాహకంగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో శుబ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ తదితర టీమిండియా స్టార్లు దులిప్ ట్రోఫీ బరిలో దిగనున్నారు.ఇషాన్‌కు తప్పని కష్టాలుఈ టోర్నీలో సత్తా చాటి బంగ్లాతో సిరీస్‌కు ఎంపికకావాలని కొందరు.. జట్టులో స్థానం సుస్థిరం చేసుకోవాలని మరికొందరు పట్టుదలగా ఉన్నారు. అయితే, తీవ్రమైన పోటీనెలకొన్న తరుణంలో ఇషాన్ కిషన్ ఇప్పట్లో రీఎంట్రీ ఇవ్వకపోయినా.. కనీసం సెలక్టర్ల దృష్టిని ఆకర్షించే అవకాశం ఉండేది. కానీ గాయం తీవ్రతరమైతే అతడు ఈ ఎడిషన్ మొత్తానికి దూరమైతే.. మళ్లీ రంజీ దాకా వేచిచూడాల్సిందే!! ఏదేమైనా ఇషాన్‌కు ఇప్పట్లో కెరీర్ కష్టాల నుంచి విముక్తి లభించేలా కనిపించడం లేదు!!దులిప్ ట్రోఫీ: బీసీసీఐ ప్రకటించిన ఇండియా-డి జట్టుశ్రేయస్ అయ్యర్(కెప్టెన్), అథర్వ తైడే, యశ్ దూబే, దేవదత్ పడిక్కల్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), రికీ భుయ్, శరణ్ జైన్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, ఆదిత్య థాకరే, హర్షిత్ రాణా, తుషార్ దేశ్‌పాండే, ఆకాశ్ సేన్‌గుప్తా, కేఎస్ భరత్(వికెట్ కీపర్), సౌరభ్ కుమార్.చదవండి: Duleep Trophy 2024: అనంతపూర్ చేరుకున్న క్రికెటర్లు -
మొన్న పంత్.. ఇప్పుడు ఇషాన్ కిషన్! బౌలింగ్ వీడియో వైరల్
భారత వికెట్ కీపర్ బ్యాటర్, జార్ఖండ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ సరికొత్త అవతారమెత్తాడు. బుచ్చిబాబు టోర్నమెంట్లో భాగంగా హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కిషన్ స్పిన్ బౌలింగ్ చేసి అందరని ఆశ్చర్యపరిచాడు.చెన్నై వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో బ్యాట్‌తో విఫలమైన కిషన్.. బంతితో మాత్రం ఆకట్టుకున్నాడు. హైదరాబాద్ బ్యాటర్ టి రవితేజకు కిషన్ ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేశాడు. రెండు ఓవర్లు వేసిన కిషన్ కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవతున్నాయి. కాగా ఇటీవల తన సహచర వికెట్ కీపర్ రిషబ్ పంత్ కూడా స్పిన్ బౌలింగ్ చేసి అందరిని షాక్ గురిచేశాడు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో పంత్ స్పిన్నర్‌గా మారాడు. ఇప్పుడు కిషన్ కూడా తన బౌలింగ్ స్కిల్స్‌ను ప్రదర్శించాడు.ఇక మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లో వరుసగా 114, 41 (నాటౌట్) పరుగులతో ఇషాన్ అలరించాడు. అయితే రెండో మ్యాచ్‌లో మాత్రం కిషన్ తన మార్క్‌ను చూపించలేకపోయాడు. కాగా దేశవాళీ క్రికెట్లో ఆడాలన్న తమ ఆదేశాలను దిక్కరించడంతో కిషన్‌పై బీసీసీఐ వేటు వేసిన సంగతి తెలిసిందే. కిషన్ చివరగా భారత్ తరపున గతేడాది వన్డే ప్రపంచకప్‌లో ఆడాడు. The Bowler Ishan Kishan in the town you all 😎🔥@ishankishan51 #IshanKishan #BuchiBabuTournament pic.twitter.com/AvgkAfDibE— Ishan's💙🧘♀️ (@IshanWK32) August 22, 2024 -
ఫామ్‌లో ఉన్నా.. ఇషాన్‌కు టీమిండియాలో ఇప్పట్లో నో ఛాన్స్!
భారత క్రికెట్ జట్టులో పునరాగమనమే లక్ష్యంగా యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ముందుకు సాగుతున్నాడు. స్వీయ తప్పిదాల వల్ల జట్టులో చోటు కోల్పోయిన అతడు.. వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇందులో భాగంగానే బుచ్చిబాబు టోర్నమెంట్ ద్వారా దేశవాళీ క్రికెట్లో రీఎంట్రీ ఇచ్చిన ఈ జార్ఖండ్ చోటా డైనమైట్.. సెంచరీతో చెలరేగాడు.తదుపరి దులిప్ ట్రోఫీలోమధ్యప్రదేశ్తో జరిగిన మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లో వరుసగా 114, 41 (నాటౌట్) పరుగులతో ఇషాన్ అలరించాడు. ఈ టోర్నీలో జార్ఖండ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ఇషాన్ కిషన్ తదుపరి దులిప్ ట్రోఫీలోనూ ఆడనున్నాడు. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని టీమ్-డిలో వికెట్ కీపర్‌గా సేవలు అందించనున్నాడు.ఈ రెడ్‌బాల్ టోర్నీలోనూ నిరూపించుకుంటే ఇషాన్ కిషన్ బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా రీఎంట్రీ ఇవ్వడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ మాత్రం ఆ అవకాశం లేదంటున్నాడు. ఇప్పట్లో ఇషాన్‌కు టీమిండియా సెలక్టర్ల పిలుపురాదని.. జాతీయ జట్టులో చోటుపై ఆశలు పెట్టుకోవడం మాని.. ఐపీఎల్‌పై దృష్టి సారించాలని అతడికి హితవు పలికాడు.అప్పటిదాకా నో ఛాన్స్.. ఐపీఎల్‌పై ఫోకస్ పెడితే మంచిదిచాంపియన్స్ ట్రోఫీ-2025 వరకు ఇషాన్ కిషన్ పేరును బీసీసీఐ సెలక్టర్లు పరిశీలించకపోవచ్చునని అభిప్రాయపడ్డాడు. ‘‘ఆస్ట్రేలియా సిరీస్ దాకా ఇషాన్ కిషన్ వేచి చూడాల్సిందే. అయితే, అంతకంటే ఎక్కువగా అతడు ఐపీఎల్‌పైన ఫోకస్ పెడితే మంచిది. నాకు తెలిసి చాంపియన్స్ ట్రోఫీ వరకు కూడా ఇషాన్ రీఎంట్రీ కుదరకపోవచ్చు’’ అని పాక్ మాజీ బ్యాటర్ బసిత్ అలీ యూట్యూబ్ చానెల్ వేదికగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు.పంత్ రాకతో ఇషాన్‌కు చిక్కులుకాగా గతేడాది జట్టుతో పాటు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన ఇషాన్ కిషన్ అర్ధంతరంగా స్వదేశానికి తిరిగి వచ్చేశాడు. మానసిక ఆందోళన కారణం చూపి సెలవు తీసుకున్న ఇషాన్.. తిరిగి జట్టులోకి రావాలంటే దేశవాళీ క్రికెట్ ఆడాలన్న బీసీసీఐ ఆదేశాలను బేఖాతరు చేశాడు. ఫలితంగా సెంట్రల్ కాంట్రాక్టు కోల్పోయాడు. ఈ నేపథ్యంలో సెలక్టర్ల దృష్టిని ఆకర్షించే క్రమంలో డొమెస్టిక్ క్రికెట్‌పై దృష్టి సారించాడు. అయితే, బంగ్లాదేశ్‌తో సెప్టెంబరు 19 నుంచి టెస్టు సిరీస్ ఆరంభం నేపథ్యంలో స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ (పునరాగమనం), ధ్రువ్ జురెల్ రూపంలో కీపర్ కోటాలో ఇషాన్‌కు గట్టి పోటీ ఎదురుకానుంది. మరోవైపు కేఎస్ భరత్ కూడా రేసులో ఉండే అవకాశం ఉంది.చదవండి: బుమ్రా ఓకే.. రోహిత్, కోహ్లికి రెస్ట్ అవసరమా?: టీమిండియా దిగ్గజం -
భారత సెలెక్టర్లకు తలనొప్పిగా మారిన ఇషాన్ కిషన్
టీమిండియా యువ వికెట్‌కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ బంగ్లాదేశ్ పర్యటనకు ముందు భారత సెలెక్టర్లకు సరికొత్త తలనొప్పులు తెచ్చిపెట్టాడు. బుచ్చి బాబు టోర్నీలో వరుసగా సెంచరీ (114), మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ (41 నాటౌట్) ఆడిన ఇషాన్.. బ్యాట్‌తో సెలెక్టర్లకు సవాలు విసిరాడు. బంగ్లాదేశ్ పర్యటన నేపథ్యంలో భారత బ్యాటింగ్ లైనప్ ఇప్పటికే ఖాళీ లేకుండా ఉంది. ఇప్పుడు ఇషాన్ కొత్తగా రేసులోకి వచ్చి సీనియర్ల స్థానాలను ప్రశ్నార్థకంగా మార్చాడు. భారత సెలెక్టర్లు బంగ్లాదేశ్ పర్యటనకు ఇషాన్‌ను ఎంపిక చేస్తారో లేదో వేచి చూడాలి.Ishan Kishan - the hero of Jharkhand !!!- Jharkhand needed 12 with 2 wickets in hands, captain smashed 6,0,6 to seal the game. pic.twitter.com/3uTqFF1KI2— Mufaddal Vohra (@mufaddal_vohra) August 18, 2024బుచ్చి బాబు టోర్నీలో భాగంగా జార్ఖండ్, మధ్య ప్రదేశ్ మధ్య జరిగిన మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌ను జార్ఖండ్ కెప్టెన్ అయిన ఇషాన్ కిషన్ స్టయిల్‌గా ముగించాడు. తన జట్టు గెలుపుకు 12 పరుగులు అవసరం కాగా.. ఇషాన్ రెండు సిక్సర్లతో మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. ఇషాన్ విన్నింగ్ షాట్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతుంది. -
జడ్డూనే ముందుగా అడిగా.. నా నిర్ణయాల వల్లే ఇలా: జై షా
తమ కఠిన వైఖరి కారణంగానే టీమిండియా స్టార్లలో మార్పు వచ్చిందని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కార్యదర్శి జై షా అన్నాడు. యువ క్రికెటర్లు శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ దేశవాళీ టోర్నీల్లో ఆడటమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నాడు. కేవలం వీరిద్దరిని దృష్టిలో పెట్టుకుని నిబంధనలు ప్రవేశపెట్టలేదని.. అందరి కంటే ముందుగా రవీంద్ర జడేజా విషయంలో తాను ఈ వైఖరి అవలంబించినట్లు తెలిపాడు.బోర్డు ఆదేశాలను లెక్కచేయలేదుసెంట్రల్ కాంట్రాక్టు ఉన్న భారత క్రికెటర్లు ఫిట్‌గా ఉండి, జాతీయ జట్టుకు దూరంగా ఉన్న సమయంలో కచ్చితంగా దేశవాళీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ నిబంధనలు ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే, వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్, మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ బోర్డు ఆదేశాలను లెక్కచేయలేదు. ఈ నేపథ్యంలో వీరిద్దరిని సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తప్పిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడ్డారన్న కారణంగా ఈ మేరకు కఠిన చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో పొరపాటు సరిచేసుకున్న శ్రేయస్ ఇప్పటికే రంజీల్లో ఆడి శ్రీలంకతో వన్డే సిరీస్ జట్టులో చోటు దక్కించుకోగా.. ఇషాన్ సైతం దులిప్ ట్రోఫీ-2024 బరిలో దిగేందుకు సిద్ధమయ్యాడు. ఈ విషయం గురించి జై షా స్పందిస్తూ... ‘‘రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి మినహా మిగతా వాళ్లంతా దులిప్ ట్రోఫీ ఆడబోతున్నారు.నా కఠిన నిర్ణయాల వల్లే ఇలానేను కఠినమైన నిర్ణయాలు తీసుకున్నందు వల్లే ఇది సాధ్యమైంది. శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ కూడా ఈ టోర్నీలో భాగమయ్యారు. మేము స్ట్రిక్ట్‌గా ఉండాలనే నిర్ణయించుకున్నాం. నిజానికి రవీంద్ర జడేజా గాయం కారణంగా జట్టుకు దూరమైనపుడు.. నేను తనకి కాల్ చేశాను.కోలుకున్న తర్వాత ముందుగా దేశవాళీ క్రికెట్ ఆడాలని సూచించాను. జడేజా అందుకు తగ్గట్లుగా ముందుగా రంజీ మ్యాచ్ ఆడి ఆ తర్వాత టీమిండియాలోకి వచ్చాడు. ఆటగాళ్లు గాయపడటం సహజం. అయితే, గాయం కారణంగా జట్టుకు దూరమైన ఆటగాళ్లు తిరిగి ఫిట్నెస్ సాధించడంతో పాటు డొమెస్టిక్ క్రికెట్ ఆడితేనే జాతీయ జట్టుకు ఎంపిక చేస్తామని చెప్పాం’’ అని జై షా టైమ్స్ ఆఫ్ ఇండియాతో పేర్కొన్నాడు. సెప్టెంబరు 5 నుంచిఅయితే, కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి మాత్రం ఇందుకు మినహాయింపు అని జై షా స్పష్టం చేశాడు. కాగా సెప్టెంబరు 5 నుంచి దేశవాళీ రెడ్‌బాల్ టోర్నీ దులిప్ ట్రోఫీ ఆరంభం కానుంది. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు ముందుకు టీమిండియా స్టార్లు ఈ టోర్నమెంట్ బరిలో దిగనున్నారు. చదవండి: Ind vs Ban: టీమిండియాలో చోటు దక్కదని తెలుసు.. అయినా! -
సెంచరీతో చెలరేగిన ఇషాన్ కిషన్.. 86 బంతుల్లోనే!
టీమిండియా యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ రెడ్‌బాల్ క్రికెట్ పునరాగమనం అదిరిపోయింది. ఆకాశమే హద్దుగా 86 బంతుల్లోనే శతక్కొట్టాడు ఈ జార్ఖండ్ డైనమైట్. భారత జట్టులో చోటే లక్ష్యంగా కఠినంగా శ్రమిస్తున్నానని సెలక్టర్లకు తన సెంచరీతో సందేశం పంపించాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో తనను ఉద్దేశపూర్వకంగా బెంచ్‌కే పరిమితం చేశారని ఇషాన్ కిషన్ మధ్యలోనే నిష్క్రమించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.రంజీల్లో ఆడనందుకు వేటు మానసిక ఇబ్బందులు అని చెప్పి ఆ టూర్ మధ్యలోనే స్వదేశానికి తిరిగి వచ్చిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. తదుపరి కుటుంబంతో ట్రిప్‌నకు వెళ్లాడు. ఈ నేపథ్యంలో ఇషాన్‌పై కన్నెర్ర చేసిన భారత క్రికెట్ నియంత్రణ మండలి.. దేశవాళీ క్రికెట్ ఆడిన తర్వాతే టీమిండియాలో మళ్లీ చోటు దక్కుతుందని అతడికి స్పష్టం చేసింది. అయినప్పటికీ.. స్వరాష్ట్రానికి చెందిన జార్ఖండ్ తరఫున రంజీల్లో ఆడటానికి అతడు నిరాకరించాడు.ఫలితంగా సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తప్పిస్తూ బీసీసీఐ కఠిన నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత ఐపీఎల్-2024లో ఇషాన్ కిషన్ ఆకట్టుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో కెరీర్‌పై దృష్టి సారించిన ఈ జార్ఖండ్ బ్యాటర్... బుచ్చిబాబు టోర్నమెంట్ ద్వారా తిరిగి రెడ్‌బాల్ క్రికెట్లో అడుగుపెట్టాడు. జార్ఖండ్‌కు కెప్టెన్‌గా బరిలోకి దిగిన ఈ డైనమైట్.. మధ్యప్రదేశ్‌తో తమ తొలి మ్యాచ్‌లో శతకంతో కదం తొక్కాడు.సిక్సర్‌తో సెంచరీ పూర్తిసిక్సర్తో సెంచరీ మార్కు అందుకున్న ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. అంతకుముందు.. మధ్యప్రదేశ్ ఇన్నింగ్స్ సమయంలో మూడు అద్భుత క్యాచ్‌లతో మెరిసి వికెట్ కీపర్‌గానూ తనను తాను నిరూపించుకున్నాడు 26 ఏళ్ల ఇషాన్ కిషన్. కాగా జార్ఖండ్‌తో మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ 225 పరుగులకు ఆలౌట్ అయింది. రెండో రోజు ఆటలో భాగంగా ఇషాన్ సెంచరీ కారణంగా జార్ఖండ్ 69.1 ఓవర్లోనే 233 పరుగుల మార్కు అందుకుంది. ఇక టీమిండియా తరఫున ఈ జార్ఖండ్ కెప్టెన్ చివరగా 2023 నవంబరులో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో భాగమయ్యాడు.చదవండి: తప్పంతా ఆమెదేనా?.. ఇంకా మగాడు మగాడే అంటారా?: సిరాజ్ పోస్ట్ వైరల్ISHAN KISHAN YOU’RE SO ICONIC!!!Ishan Kishan 100 in 86 balls!!#IshanKishan pic.twitter.com/I37dgcnciS— shrey (@slidinjun) August 16, 2024 -
రీ ఎంట్రీ అదుర్స్: అద్భుత క్యాచ్‌తో మెరిసిన ఇషాన్ కిషన్
టీమిండియా యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ దేశవాళీ క్రికెట్ బాటపట్టాడు. జాతీయ జట్టులో పునరాగమనం చేయాలని పట్టుదలగా ఉన్న ఈ డాషింగ్ క్రికెటర్ తాజాగా బుచ్చిబాబు టోర్నమెంట్ బరిలో దిగాడు. ఈ రెడ్‌బాల్ టోర్నీలో సొంత రాష్ట్రం జార్ఖండ్ జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన ఇషాన్ కిషన్.. తొలిరోజు శుభారంభం అందుకున్నాడు.బుచ్చిబాబు టోర్నీలో భాగంగా గ్రూప్-ఏలో ఉన్న మధ్యప్రదేశ్‌తో జార్ఖండ్ తొలి మ్యాచ్ ఆడుతోంది. గురువారం మొదలైన ఈ మ్యాచ్‌లో తొలి రోజు ఆట ముగిసే సరికి జార్ఖండ్ మధ్యప్రదేశ్ జట్టును 224-8కు కట్టడి చేసింది. ప్రత్యర్థిని నామమాత్రపు స్కోరుకు కట్టడి చేయడంలో కెప్టెన్ ఇషాన్ కిషన్ కీలక పాత్ర పోషించాడు.సూపర్ క్యాచ్ అందుకున్న ఇషాన్ అద్భుతమైన వికెట్ కీపింగ్ నైపుణ్యాలతో ఆకట్టుకుని మూడు వికెట్లు పడగొట్టడంలో భాగం పంచుకున్నాడు. ముఖ్యంగా క్రీజులో నిలదొక్కుకుని.. జార్ఖండ్ బౌలర్లకు చుక్కలు చూపించిన మధ్యప్రదేశ్ లెఫ్టాండర్ బ్యాటర్ శుభం కువాష్ ఇచ్చిన క్యాచ్ తనదైన స్టైల్లో ఒడిసిపట్టి వారెవ్వా అనిపించాడు. 74వ ఓవర్లో ఆఫ్ స్పిన్నర్ ఆదిత్య సింగ్ వేసిన బంతిని తప్పుగా అంచనా వేసిన శుభం(84).. షాట్ ఆడేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు.బ్యాట్ ఎడ్జ్‌ని తాకిన బాల్ తన వైపునకు రాగానే ఇషాన్ కిషన్ ఏమాత్రం పొరపాటు చేయకుండా క్యాచ్ అందుకున్నాడు. మిస్ అవుతుందనుకున్న బంతిని ఒడిసిపట్టి శుభంను డిస్మిస్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా మధ్యప్రదేశ్‌తో మ్యాచ్‌లో శుభంతో పాటు చంచల్ రాథోడ్, రామ్‌వీర్ గుర్జార్ వికెట్లు పడగొట్టడంలోనూ ఇషాన్ కిషన్ కీపర్‌గా తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించాడు. కాగా గతేడాది దక్షిణాఫ్రికా పర్యటన మధ్యలోనే టీమిండియాను వీడిన ఇషాన్ కిషన్.. రంజీలు ఆడాలన్న బీసీసీఐ ఆదేశాలను బేఖాతరు చేశాడు. ఈ క్రమంలో సెంట్రల్ కాంట్రా క్టు కోల్పోయాడు. దీంతో దిద్దుబాటు చర్యలకు దిగిన ఇషాన్.. తొలుత బుచ్చిబాబు టోర్నీతో దేశవాళీ క్రికెట్ మొదలు పెట్టాడు. బుచ్చిబాబు టోర్నమెంట్- ఏగ్రూపులో ఏ జట్లు?తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుచ్చిబాబు టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. నాలుగు రోజుల మ్యాచ్‌ల ఈ రెడ్‌బాల్ టోర్నీలో మొత్తం 12 జట్లు పాల్గొంటున్నాయి. వీటిని నాలుగు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-ఏలో డిఫెండింగ్ చాంపియన్ మధ్యప్రదేశ్‌తో పాటు జార్ఖండ్, హైదరాబాద్.. గ్రూప్-బిలో రైల్వేస్, గుజరాత్, తమిళనాడు ప్రెసిడెంట్స్ ఎలెవన్, గ్రూప్-సిలో ముంబై, హర్యానా, తమిళనాడు ప్రెసింగ్ ఎలెవన్ 2, గ్రూప్-డిలో జమ్మూ కశ్మీర్, బరోడా, ఛత్తీస్‌గఢ్ జట్లు ఉన్నాయి. ప్రతి గ్రూప్‌లో టాప్-2లో నిలిచిన జట్లు సెమీ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఆగష్టు 15- సెప్టెంబరు 5 వరకు ఈ టోర్నీ జరుగనుంది. Ishan Kishan in good rhythm. 💥- Great piece of wicketkeeping!pic.twitter.com/sjnsGZTaQF— Mufaddal Vohra (@mufaddal_vohra) August 15, 2024 -
ఇషాన్ కిషన్ రీఎంట్రీ.. ఆ జట్టు కెప్టెన్‌గా ఎంపిక?
టీమిండియా యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమయ్యాడు. బుచ్చి బాబు టోర్నమెంట్లో జార్ఖండ్ జట్టుకు కిషన్ సారథ్యం వహించనున్నాడు. ఈ విషయాన్ని జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ధ్రువీకరించినట్లు ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ ఫో తమ కథనంలో పేర్కొంది. ఈ బుచ్చిబాబు టోర్నీ చెన్నై వేదికగా ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీ కోసం జార్ఖండ్ జట్టు ఇప్పటికే చెన్నైకు చేరుకుంది. కాగా తొలుత కిషన్ ఈ టోర్నీకి దూరంగా ఉండాలని భావించాండంట. ఈ క్రమంలోనే మొదట ప్రకటించిన జార్ఖండ్ జట్టులో కిషన్‌కు జెఎస్సీఎ సెలక్టర్లు చోటివ్వలేదు.అయితే తర్వాత ఇషాన్ తన నిర్ణయాన్ని మార్చకుని, ఈ బుచ్చిబాబు టోర్నీకి అందుబాటులో ఉంటానని జెఎస్సీఎకు తెలియజేశాడు. ఈ నేపథ్యంలోనే తమ జట్టు పగ్గాలను అతడికి జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ అప్పగించింది. కిషన్ బుధవారం(ఆగస్టు 14) చెన్నైలో ఉన్న తన జట్టుతో కలవనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ టోర్నీలో కిషన్ అద్భుతంగా రాణిస్తే భారత క్రికెట్లో తిరిగి పునరాగమనం చేసే అవకాశముంటుంది. కాగా దేశవాళీ క్రికెట్లో ఆడాలన్న తమ ఆదేశాలను దిక్కరించడంతో కిషన్‌పై బీసీసీఐ వేటు వేసిన సంగతి తెలిసిందే. జాతీయ జట్టులో చోటుతో పాటు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను ఈ జార్ఖండ్ డైనమెట్ కోల్పోయాడు.అసలేంటి ఈ బుచ్చి బాబు టోర్నీ..?దక్షిణాది భారత క్రికెట్ పితామహుడు ఎం. బుచ్చి బాబు నాయుడు(మోతవరపు వెంకట మహిపతి నాయుడు) పేరు మీద ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు. దాదాపు ఆరేళ్ల తర్వాత ఈ టోర్నీ జరగనుంది. చివరగా 2017లో జరిగింది. ఈ ఏడాది టోర్నీలో మొత్తం 12 జట్లు పాల్గోనున్నాయి. వాటిని రెండు గ్రూపులుగా విభిజించారు. తమిళనాడులోని తిరునెల్వేలి, కోయంబత్తూరు, సేలం, నాథమ్ వేదికగా మ్యాచ్‌లు జరగనున్నాయిజట్లు ఇవేగ్రూప్ ఎ: మధ్యప్రదేశ్(డిఫెండింగ్ ఛాంపియన్ ), జార్ఖండ్, హైదరాబాద్గ్రూప్ బి: రైల్వేస్, గుజరాత్, TNCA ప్రెసిడెంట్స్ XIగ్రూప్ సి: ముంబై, హర్యానా, TNCA XIగ్రూప్ డి: జమ్మూ & కాశ్మీర్, బరోడా, ఛత్తీస్‌గఢ్