
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025ను సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్బుతమైన విజయంతో ప్రారంభించింది. ఉప్పల్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 44 పరుగుల తేడాతో ఎస్ఆర్‌హెచ్ గెలుపొందింది. 287 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ 6 వికెట్లు కోల్పోయి 242 పరుగులు మాత్రమే చేయగల్గింది. ఎస్ఆర్‌హెచ్ బౌలర్లలో సిమర్జీత్ సింగ్, హర్షల్ పటేల్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. షమీ, జంపా చెరో వికెట్ సాధించారు. రాజస్తాన్ బ్యాటర్లలో ధ్రువ్ జురెల్(70) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఎస్‌ఆర్‌హెచ్ 6 వికెట్ల నష్టానికి 286 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే రాజస్తాన్ బౌలర్లను సన్‌రైజర్స్ బ్యాటర్లు ఊచకోత కోశారు. క్రీజులోకి వచ్చిన ప్రతీ బ్యాటర్ బంతిని స్టాండ్స్‌కు తరలించాడు. ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్లలో ఇషాన్ కిషన్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. కేవలం 47 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్స్‌లతో 106 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.
ఇషాన్‌కు ఇదే తొలి ఐపీఎల్ సెంచరీ కావడం గమనార్హం. కాగా ఐపీఎల్-2025 మెగా వేలంలో కిషన్‌ను రూ.11.25 కోట్లకు ఎస్‌ఆర్‌హెచ్ కొనుగోలు చేసింది. కిషన్‌తో పాటు ట్రావిస్ హెడ్(67), క్లాసెన్(34), నితీశ్ కుమార్(30) పరుగులతో రాణించారు. రాజస్తాన్ బౌలర్లలో తుషార్ దేశ్‌పాండే మూడు వికెట్లు పడగొట్టగా.. థీక్షణ రెండు, సందీప్ శర్మ ఒక్క వికెట్ సాధించారు. ఇక ఈ మ్యాచ్‌లో భారీ స్కోర్ చేసిన సన్‌రైజర్స్ ఓ అరుదైన రికార్డును తమ పేరిట లిఖించుకుంది.
ఎస్ఆర్‌హెచ్ వరల్డ్ రికార్డు..
టీ20 క్రికెట్‌లో అత్యధిక సార్లు 250 ప్లస్ స్కోర్లు సాధించిన తొలి జట్టుగా ఎస్ఆర్‌హెచ్ వరల్డ్ రికార్డు సృష్టించింది. సన్‌రైజర్స్ ఇప్పటివరకు 4 సార్లు 250 పైగా పరుగులు చేసింది. ఇంతకుముందు రికార్డు ఇంగ్లండ్ క్రికెట్ క్లబ్ సర్రే పేరిట ఉండేది. సర్రే 3 సార్లు 250 ప్లస్ స్కోర్లు నమోదు చేసింది. తాజా మ్యాచ్‌తో సర్రే అల్‌టైమ్ రికార్డును కమ్మిన్స్ సేన బ్రేక్ చేసింది. అదేవిధంగా ఐపీఎల్ చరిత్రలో ఇది రెండో అత్యధిక స్కోర్ కావడం గమనార్హం.
చదవండి: IPL 2025: ముంబై ఇండియన్స్ వదిలేసింది.. కట్ చేస్తే! తొలి మ్యాచ్‌లోనే భారీ సెంచరీ
Comments
Please login to add a commentAdd a comment