దాదాపు పుష్కరకాలం తర్వాత సొంతగడ్డపై జరగనున్న వన్డే ప్రపంచకప్‌పై టీమిండియా కన్నేసింది. ఈ మెగాటోర్నీలో ఎలాగైనా గెలిచి తమ 12 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని భారత్ భావిస్తోంది. ఆక్టోబర్ 5న అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్-న్యూజిలాండ్ మ్యాచ్‌తో ఈ మెగా ఈవెంట్ ప్రారంభం కానుంది.
అయితే ప్రపంచకప్‌కు ముందు భారత జట్టును కొన్ని ప్రధాన సమస్యలు వెంటాడుతున్నాయి. అందులో ఒకటి వికెట్ కీపింగ్. రెగ్యూలర్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ గాయపడి జట్టుకు దూరమైన తర్వాత ప్రతీ సిరీస్‌లో వికెట్ కీపర్‌ను మెనెజ్‌మెంట్ మారుస్తూ వస్తోంది. కొనాళ్ల పాటు వైట్‌బాల్ సిరీస్‌లలో పంత్ స్ధానాన్ని కేఎల్ రాహుల్ భర్తీ చేశాడు.
కానీ రాహుల్ కూడా గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో.. శ్రీకర్ భరత్, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్ వంటి వికెట్ కీపర్ బ్యాటర్లకు అవకాశం లభించింది. కిషన్ కాస్త పర్వాలేదనపించిన భరత్, సంజూ శాంసన్ మాత్రం తీవ్రనిరాశపరిచారు. ఈ క్రమంలో ఆసియాకప్, వన్డే ప్రపంచకప్ వంటి మెగా టోర్నీల్లో భారత వికెట్ కీపర్‌గా ఎవరూ వ్యవహరిస్తరన్నది అందరి మెదడలను తొలుస్తున్న ప్రశ్న.
అయితే రాహుల్ ఫిట్‌నెస్ సాధించి తిరిగి జట్టులోకి వస్తే.. అతడే వికెట్ కీపింగ్ చేసే అవకాశం ఉంది. ఒక వేళ రాహుల్ ఫిట్‌నెస్ టెస్టులో విఫలమైతే, సంజూ శాంసన్, కిషన్‌లలో ఎవరో ఒకరిని సెలక్టర్లు ఎంపిక చేయక తప్పదు. ఇక ఇదే విషయంపై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తన అభిప్రాయలను వెల్లడించాడు.
అతడిని తీసుకోండి..
"భారత అత్యుత్తమ వికెట్ కీపర్లలో రిషబ్ పంత్ ఒకడు. కానీ అతడు దురదృష్టవశాత్తూ గాయపడి జట్టుకు దూరంగా ఉన్నాడు. ఇక కెఎల్ రాహుల్, ఇషాన్ కిషన్‌లలో కూడా అత్యుత్తమ వికెట్ కీపింగ్ స్కిల్స్ ఉన్నాయి. ఈ ఇద్దరూ కూడా ద్రవిడ్, రోహిత్ దృష్టిలో ఉంటారు. రాహుల్ ఫిట్‌గా లేకపోతే కిషన్‌ను కచ్చితంగా జట్టులోకి తీసుకుంటారు.
నా వరకు అయితే కిషన్‌కు అవకాశం ఇస్తే మంచిది. అతడికి వికెట్ కీపింగ్‌తో పాటు ఓపెనర్‌గా రాణించే సత్తా కూడా ఉందని" ఓ కార్యక్రమంలో దాదా చెప్పుకొచ్చాడు. కాగా గంగూలీ మరో వికెట్ కీపర్ సంజూ శాంసన్ పేరును కూడా ప్రస్తావించకపోవడం గమానార్హం.
చదవండి: Asia Cup: హార్దిక్ పాండ్యాకు బిగ్‌షాక్.. టీమిండియా కొత్త వైస్ కెప్టెన్ అతడే!
Comments
Please login to add a commentAdd a comment