ICC ODI World Cup 2023
-
వన్డే ప్రపంచకప్‌తో భారత్‌కు రూ.11, 637 కోట్ల ఆదాయం..
దుబాయ్: గతేడాది నిర్వహించిన వన్డే ప్రపంచకప్ భారత దేశానికి గణనీయమైన ఆర్ధిక లబ్ధిని చేకూర్చిందని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మెగా ఈవెంట్ ఆర్థికంగా పెద్ద ప్రభావమే చూపిందని, విదేశీ పర్యాటకులతో భారత్‌లోని ఆతిథ్య రంగం పెద్ద ఎత్తున లాభపడిందని అందులో వివరించింది.గత అక్టోబర్, నవంబర్‌లో జరిగిన ఈ మెగా టోర్నీలో భారత్ రన్నరప్‌గా నిలిచింది. ‘ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్ క్రికెట్‌కు ఉన్న ఆర్ధిక శక్తి ఎలాంటిదో నిరూపించింది. ఆతిథ్య భారత్ 1.39 బిలియన్ అమెరికా డాలర్ల (రూ.11, 637 కోట్లు) ఆదాయం ఆర్జించేలా చేసింది.ఈ వరల్డ్‌కప్‌ను చూసేందుకు ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు భారత్‌కు పోటెత్తారు. ఇలా పర్యాటకుల రాకతో ఆతిథ్య నగరాలైన ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లో హోటల్స్, భోజనం, వసతి, రవాణ, ఆహార పదార్థాలు, పానీయాల విక్రయంతో కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది’ అని ఐసీసీ ఆ నివేదికలో పేర్కొంది. టోర్నీ జరిగింత కాలం కొనుగోలు శక్తి పెరిగిందని, టికెట్ల రూపంలోనూ భారీ ఆదాయం వచి్చందని, ఏకంగా 12.50 లక్షల మంది ప్రేక్షకులు క్రికెట్ మ్యాచ్‌ల్ని చూసేందుకు ఎగబడ్డారని అందులో తెలిపింది.ఐసీసీ ప్రపంచకప్‌ల చరిత్రలోనే ఇది ఘననీయమైన వృద్ధని, సగటున 75 శాతం ప్రేక్షకుల హాజరు నమోదు కావడం ఇదే తొలిసారని ఐసీసీ తెలిపింది. పర్యాటకులు, దేశీ ప్రేక్షకులకు సేవలందించడం ద్వారా 48 వేల మంది ఫుల్ టైమ్, పార్ట్ టైమ్ ఉద్యోగాలతో ఉపాధి పొందారని ఐసీసీ వివరించింది.చదవండి: AUS vs ENG: హెడ్ విధ్వంసం.. ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన ఆసీస్ -
ఐసీసీ అవార్డు అందుకున్న కోహ్లి.. వీడియో వైరల్
టీ20 ప్రపంచకప్-2024లో సత్తా చాటేందుకు సిద్ధమైపోయాడు టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి. మొదటి బ్యాచ్‌తో కాకుండా కాస్త ఆలస్యంగా అమెరికా చేరుకున్న ఈ రన్‌మెషీన్.. ప్రస్తుతం న్యూయార్క్‌లో ఉన్నాడు.ఈ నేపథ్యంలో తను గెలుచుకున్న ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును తాజాగా అందుకున్నాడు కోహ్లి. అదే విధంగా.. ఐసీసీ మెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ 2023 క్యాప్‌ను కూడా స్వీకరించాడు.ఇందుకు సంబంధించిన వీడియోను ఐసీసీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. కాగా 2023లో విరాట్ కోహ్లి అద్భుత ఆట తీరుతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. 35 ఏళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాటర్ గతేడాది 27 వన్డేలు ఆడి 1377 పరుగులు సాధించాడు.ఇందులో ఆరు సెంచరీలు, ఎనిమిది అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక గతేడాది కోహ్లి అత్యుత్తమ స్కోరు 166*. అదే విధంగా ఆసియా కప్-2023లో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై సూపర్ స్టేజ్‌లో సాధించిన 122(నాటౌట్) కూడా హైలైట్‌గా నిలిచిపోయింది.ఇక వన్డే వరల్డ్‌కప్-2023లోనూ ఈ రికార్డుల రారాజు దుమ్ములేపిన విషయం తెలిసిందే. సొంతగడ్డపై జరిగిన ఈ ఐసీసీ ఈవెంట్లో 11 మ్యాచ్‌లలో కలిపి 765 పరుగులు సాధించాడు కోహ్లి. టాప్ స్కోరర్‌గా నిలవడమే గాకుండా.. వరల్డ్‌కప్ సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు.ఈ క్రమంలో టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ పేరిట ఉన్న రికార్డు బద్దలు కొట్టాడు. అంతేగాక వన్డేల్లో 50వ సెంచరీ కూడా పూర్తి చేసుకున్న విరాట్ కోహ్లి.. ఈ ఘనత సాధించిన ఏకైక బ్యాటర్‌గా అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. అదే విధంగా ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా కూడా నిలిచాడు.ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2024 సన్నాహకాల్లో భాగంగా జూన్ 1న బంగ్లాదేశ్‌తో జరిగిన టీమిండియా వార్మప్ మ్యాచ్‌కు కోహ్లి(విశ్రాంతి) దూరంగా ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ సేన బంగ్లాను 60 పరుగులతో చిత్తు చేసింది. ఇక జూన్ 5న ఐర్లాండ్‌తో టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో తలపడనుంది. View this post on Instagram A post shared by ICC (@icc) -
షమీపై మరోసారి సంచలన ఆరోపణలు.. ఫ్యాన్స్ ఫైర్
టీమిండియా స్టార్ పేసర్‌గా నీరాజనాలు అందుకుంటున్న మహ్మద్ షమీ కెరీర్లో ఉన్నతస్థితిలో ఉన్నాడు. గాయం వేధిస్తున్నా లెక్కచేయక వన్డే వరల్డ్‌కప్-2023లో అదరగొట్టి.. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచిన ఘనత అతడి సొంతం. అయితే, చీలమండ గాయం తీవ్రత ఎక్కువ కావడంతో కొంతకాలంగా ఆటకు దూరమైన అతడు.. సర్జరీ చేయించుకున్నాడు. ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో ఐపీఎల్-2024 మొత్తానికి అందుబాటులో లేకుండా పోయాడు ఈ గుజరాత్ టైటాన్స్ బౌలర్. ఇదిలా ఉంటే.. కెరీర్‌పరంగా బాగానే ఉన్న షమీ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎప్పుడూ ఏదో ఒక కుదుపు వస్తూనే ఉంది. 2014లో హసీన్ జహానే అనే మహిళను పెళ్లాడాడు షమీ. ఈ జంటకు 2015లో కూతురు ఐరా జన్మించింది. కానీ.. కొంతకాలం తర్వాత ఈ దంపతుల మధ్య విభేదాలు తలెత్తగా.. భర్తపై సంచలన ఆరోపణలు చేసింది హసీన్. వివాహేతర సంబంధాలు, మ్యాచ్ ఫిక్సింగ్, గృహ హింస అంటూ తీవ్ర ఆరోపణలతో అతడిని సుప్రీంకోర్టు గడప తొక్కించింది. అరెస్టు చేయించాలని చూసింది. అయితే, విచారణ అనంతరం షమీకి ఊరట దక్కింది. ఈ పరిణామాల నేపథ్యంలో 2018 నుంచి షమీ- హసీన్ విడిగా ఉంటున్నారు. అయితే, తాజాగా మరోసారి షమీని ఉద్దేశించి హసీన్ జహాన్ ఆరోపణలు గుప్పించింది. ‘‘స్టార్ అయిన నా భర్త, అతడి కుటుంబం కారణంగా నేను చేదు అనుభవాలు ఎదుర్కొన్నాను. న్యాయస్థానం మెట్లు ఎక్కాల్సి వచ్చింది. కానీ ఆమ్రోహా పోలీసులు నన్ను, నా మూడేళ్ల కూతురిని టార్చర్ పెట్టారు. ప్రభుత్వం కూడా నా పట్ల అవమానకరంగా ప్రవర్తించింది. నాకు అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటోంది’’ అని హసీన్ జహాన్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీరును విమర్శించింది. అంతేకాదు.. మహ్మద్ షమీ యూపీ ప్రభుత్వం, పోలీసులతో కలిసి తనను హత్య చేయించేందుకు కుట్ర చేస్తాడంటూ సంచలన ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో షమీ అభిమానులు హసీన్ జహాన్ తీరుపై మండిపడుతున్నారు. నిరాధార ఆరోపణలు చేస్తూ కాలం గడపటం మానుకుని.. కుమార్తెకు మంచి భవిష్యత్తున్నిచ్చే ఆలోచనలు చేయాలని హితవు పలుకుతున్నారు. అయితే, మరికొంత మంది నెటిజన్లు మాత్రం అనుభవించే వారికి మాత్రమే ఆ బాధ ఏమిటో తెలుస్తుందని హసీన్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. చదవండి: ధోని ఆటగాడిగానూ రిటైర్ అయితే బాగుండేది: టీమిండియా మాజీ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్ -
అప్పటికే ఫిట్‌గా ఉన్నా.. టీమిండియాకు ఆడకపోవడానికి కారణం ఇదే!
ఐపీఎల్-2024లో బౌలింగ్ చేయడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నట్లు ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అన్నాడు. పేస్ దళంలో తన వంతు పాత్ర పోషించడానికి సమాయత్తంగా ఉన్నానని తెలిపాడు. కాగా గతేడాది నవంబరులో ముగిసిన వన్డే వరల్డ్‌కప్-2023 సందర్భంగా ఈ టీమిండియా ఆల్‌రౌండర్ గాయపడిన విషయం తెలిసిందే. పుణెలో బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా తన బౌలింగ్‌లో బౌండరీ ఆపే క్రమంలో అదుపుతప్పి పడిపోయాడు పాండ్యా. ఈ క్రమంలో అతడి చీలమండ(కుడికాలి)కు గాయం కాగా.. టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. అనంతరం జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందాడు. క్రమక్రమంగా కోలుకుని ఐపీఎల్ తాజా ఎడిషన్‌కు అందుబాటులోకి వచ్చాడు. ఇక గత రెండు సీజన్లలో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా వ్యవహరించిన హార్దిక్ పాండ్యా.. ట్రేడింగ్‌లో తిరిగి సొంత గూటికి చేరాడు. ముంబై ఇండియన్స్ సారథిగా రోహిత్ శర్మ స్థానంలో పగ్గాలు చేపట్టాడు. అయితే, పాండ్యా గాయం గురించి విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఫిట్నెస్ సాధించినప్పటికీ.. ఐపీఎల్‌కు సిద్ధం కావాలనే ఉద్దేశంతోనే అతడు టీమిండియా తరఫున పలు ద్వైపాక్షిక సిరీస్‌లకు దూరంగా ఉన్నాడనే ఆరోపణలు వచ్చాయి. ఈ అంశంపై తాజాగా స్పందించిన హార్దిక పాండ్యా.. తాను జనవరిలోనే ఫిట్నెస్ సాధించినట్లు వెల్లడించాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హోదాలో విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘ప్రపంచకప్ ఈవెంట్ సమయంలో దురదృష్టవశాత్తూ గాయపడ్డాను. పాత గాయాలేమీ తిరగబెట్టలేదు కానీ నొప్పి మాత్రం తీవ్రంగా ఉండేది. నా చీలమండ ట్విస్ట్ కావడంతో భరించలేని నొప్పి వచ్చేది. త్వరగానే కోలుకుంటాననుకున్నా. కానీ గాయం తీవ్రత ఎక్కువ కావడంతో వరల్డ్‌కప్ మొత్తానికి దూరమయ్యాను. ఇండియాకు ఆడటం ఎల్లప్పుడూ ప్రత్యేకమే. కానీ అప్పుడలా జరిగిపోయింది. అయితే, అఫ్గనిస్తాన్‌తో సిరీస్ నాటికి నేను ఫిట్నెస్ సాధించాను. కానీ అప్పటికి నేను ఆడాల్సిన మ్యాచ్‌లు ఏవీ మిగిలిలేవు’’ అని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తాను పూర్తి ఫిట్‌గా ఉన్నానని.. ఐపీఎల్లో తప్పక బౌలింగ్ చేస్తానని ఈ పేస్ ఆల్‌రౌండర్ పేర్కొన్నాడు. కాగా మార్చి 22న ఐపీఎల్-2024 ఆరంభం కానుండగా.. మార్చి 24న ముంబై ఇండియన్స్ గుజరాత్ టైటాన్స్‌తో తమ తొలి మ్యాచ్‌లో తలపడనుంది. ఇక గాయం కారణంగా హార్దిక్ పాండ్యా స్వదేశంలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌తో పాటు సౌతాఫ్రికా పర్యటన, సొంతగడ్డపై అఫ్గనిస్తాన్‌తో టీ20 సిరీస్‌లకు దూరమయ్యాడు. "It's very good to be back." 💙 Hardik Pandya shares his joy on reuniting with #MumbaiIndians, the team where his incredible journey started 🫶#OneFamily @hardikpandya7 pic.twitter.com/0SymPUikDY — Mumbai Indians (@mipaltan) March 18, 2024 -
ఐపీఎల్ కోసమే నాటకాలు.. అవునన్న షమీ! ఫొటో వైరల్
వన్డే వరల్డ్‌కప్-2023 సమయంలోనే మడిమ నొప్పి వేధించినా పంటి బిగువన భరించి జట్టు కోసం తపించాడు టీమిండియా బౌలర్ మహ్మద్ షమీ. మెగా టోర్నీలో ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చినా అత్యధిక వికెట్ల(24) వీరుడిగా నిలిచి సత్తా చాటాడు. సొంతగడ్డపై జరిగిన ఈ ఐసీసీ ఈవెంట్లో భారత జట్టు ఫైనల్ వరకు చేరడంలో తన వంతు పాత్ర పోషించాడు. అయితే, ఈ టోర్నీ ముగిసిన తర్వాత షమీ మళ్లీ ఇంత వరకు మైదానంలో దిగలేదు. మడిమ నొప్పి తీవ్రతరం కావడంతో శస్త్ర చికిత్స చేయించుకున్న ఈ రైటార్మ్ పేసర్ ప్రస్తుతం కోలుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో తన ఆరోగ్యానికి సంబంధించిన అప్డేట్ అందిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టాడు. ‘‘అందరికీ హెలో! నేను క్రమక్రమంగా కోలుకుంటున్నాను. నాకు సర్జరీ జరిగి 15 రోజులు అవుతోంది. ఇటీవలే సర్జరీ సమయంలో వేసిన కుట్లు విప్పారు. కోలుకునే ప్రయాణంలో తదుపరి దశకు చేరుకునేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’ అని షమీ తన ఫొటోలు పంచుకున్నాడు. ఇందుకు బదులిస్తూ ఓ నెటిజన్.. ‘‘వరల్డ్‌కప్ సమయంలో నొప్పిని భరిస్తూనే షమీ భాయ్... వంద శాతం ఎఫర్ట్ పెట్టాడు. కానీ ఓ ఆటగాడు ఉన్నాడు.. గాయపడకపోయినా.. గాయపడినట్లు నమ్మించి.. ఐపీఎల్ కోసం మాత్రం తీవ్రంగా శ్రమిస్తూ ఉంటాడు’’ అని పేర్కొన్నాడు. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్, పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను ఉద్దేశించినట్లుగా ఉన్న ఈ పోస్టుకు షమీ లైక్ కొట్టడంతో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా వరల్డ్‌కప్-2023 సమయంలో బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా గాయపడిన పాండ్యా.. తర్వాత టీమిండియాకు దూరమయ్యాడు. అయితే, ఐపీఎల్-2024కు మాత్రం అతడు అందుబాటులో ఉండనున్నాడు. ఇక గుజరాత్ టైటాన్స్‌ను వీడిన పాండ్యా.. తిరిగి ముంబై ఇండియన్స్ గూటికి చేరి కెప్టెన్‌గా ఎంపికైన విషయం విదితమే!.. మరోవైపు.. గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న షమీ.. ఈ సీజన్ మొత్తానికి దూరంగా ఉండనున్నాడు. చదవండి: అతడు టీమిండియా కెప్టెన్.. వేటు వేస్తారా?: యువరాజ్ సింగ్ Hello everyone! I wanted to provide an update on my recovery progress. It has been 15 days since my surgery, and I recently had my stitches removed. I am thankful for the advancements I have achieved and looking forward to the next stage of my healing journey. 🙌 pic.twitter.com/wiuY4ul3pT — 𝕸𝖔𝖍𝖆𝖒𝖒𝖆𝖉 𝖘𝖍𝖆𝖒𝖎 (@MdShami11) March 13, 2024 -
IPL 2024: గుజరాత్ టైటాన్స్‌కు బిగ్ షాక్..
IPL 2024- Blow To Gujarat Titans: ఐపీఎల్-2024 ఆరంభానికి ముందు గుజరాత్ టైటాన్స్‌కు పెద్ద ఎదురుదెబ్బ! ఆ జట్టు ప్రధాన బౌలర్, టీమిండియా పేసర్ మహ్మద్ షమీ తాజా సీజన్ మొత్తానికి దూరం కానున్నట్లు సమాచారం. షమీ మడిమ నొప్పి తీవ్రతరమైన నేపథ్యంలో అతడు సర్జరీ కోసం యూకే వెళ్తున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. కాగా వన్డే వరల్డ్‌కప్-2023 తర్వాత భారత రైటార్మ్ పేసర్ మహ్మద్ షమీ ఆటకు దూరమైన విషయం తెలిసిందే. వరల్డ్‌కప్‌లో ఇరగదీసి సొంతగడ్డపై జరిగిన ఈ మెగా టోర్నీలో తుదిజట్టులో చోటు కోసం ఎదురుచూడాల్సి వచ్చినా.. తనకు అవకాశం రాగానే ఆకాశమే హద్దుగా చెలరేగాడు షమీ. ఏకంగా మూడుసార్లు ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసి.. మొత్తంగా 24 వికెట్లు తీశాడు. తద్వారా వరల్డ్‌కప్-2023లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అవార్డు అందుకున్నాడు. కాగా ఎడమకాలి మడిమ నొప్పి వేధిస్తున్నా బాధను పంటిబిగువన భరిస్తూ షమీ తన నైపుణ్యాలను ప్రదర్శించాడు. అయితే, ఈ ఐసీసీ ఈవెంట్ తర్వాత నొప్పి ఎక్కువ కావడంతో సౌతాఫ్రికా పర్యటనకు దూరంగా ఉన్న షమీ.. స్వదేశంలో ఇంగ్లండ్‌తో తాజా టెస్టు సిరీస్‌కూ దూరమయ్యాడు. అయితే, మార్చిలో ఆరంభం కానున్న ఐపీఎల్ 17వ ఎడిషన్‌తో రీఎంట్రీ ఇస్తాడని భావించగా.. బీసీసీఐ వర్గాల తాజా సమాచారం ప్రకారం ఇది అసాధ్యమేనని తెలుస్తోంది. లండన్‌లో చికిత్స? మడిమ నొప్పి చికిత్సకై షమీ లండన్ వెళ్లనున్నట్లు బీసీసీఐ సీనియర్ అధికారి వెల్లడించినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. కాగా ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న షమీ.. అరంగేట్రంలోనే జట్టు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. గత సీజన్లో 17 మ్యాచ్‌లలో కలిపి 28 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ గెలుచుకున్నాడు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే కెప్టెన్ హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్‌ను వీడి ముంబై ఇండియన్స్ సారథిగా నియమితుడైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీమిండియా నయా సూపర్‌స్టార్, యువ క్రికెటర్ శుబ్‌మన్ గిల్ టైటాన్స్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనుండగా.. షమీ రూపంలో ప్రధాన బౌలర్ జట్టుకు దూరం కావడం ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. చదవండి: Yashasvi Jaiswal: టెంట్లలో నివాసం నుంచి.. బాంద్రా ఫ్లాట్ దాకా! కోట్లు పెట్టి కొన్నాడు -
మీ భార్యను ప్రేమిస్తున్నా.. సర్లే ఆమెకు చెప్తా!
Pat Cummins's response Goes Viral: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌ది ప్రేమ వివాహం. ఈ స్టార్ బౌలర్‌కు 2013లో బెకీ బోస్టన్ అనే అమ్మాయితో ఏర్పడిన పరిచయం స్నేహంగా మారింది. మనసులు కలవడంతో ప్రేమపక్షుల్లా విహరిస్తూ పరస్పరం అభిరుచులు పంచుకున్న ఈ జంట.. 2020లో నిశ్చితార్థం చేసుకుంది. అప్పటికే సహజీవనం చేస్తున్న కమిన్స్- బెకీ 2021లో తాము తమ తొలి సంతానానికి జన్మనివ్వబోతున్నట్లు ప్రకటించారు. ఆ మరుసటి ఏడాది అంటే 2022లో వివాహ బంధంలో అడుగుపెట్టారు. కుమారుడు ఆల్బీతో కలిసి సంతోషంగా జీవితం గడుపుతున్న ఈ జంట ఎప్పుటికప్పుడు కపుల్ గోల్స్ సెట్ చేయడంలో ముందుంటారు. గొప్ప తల్లి, భార్య, నా వాలైంటైన్ ఇక వాలంటైన్స్ డే సందర్భంగా భార్య బెకీతో కలిసి ఉన్న ఫొటోను ప్యాట్ కమిన్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. ‘‘గొప్ప తల్లి, భార్య, నా వాలైంటైన్. సర్ఫింగ్ చేయడంలోనూ దిట్ట. ప్రేమికుల దినోత్సవం శుభాకాంక్షలు బెకీ’’ అంటూ సతీమణిపై ప్రేమను కురిపించాడు. మీ భార్యను ప్రేమిస్తున్నా ఇందుకు స్పందించిన ఓ నెటిజన్.. ‘‘నేను భారతీయుడిని.. మీ భార్యను ప్రేమిస్తున్నా’’ అంటూ కామెంట్ చేశాడు. అయితే, ప్యాట్ కమిన్స్ ఇందుకు హుందాగా బదులిస్తూ... ‘‘సరే.. ఈ సందేశాన్ని ఆమెకు చేరవేస్తాను’’ అని పేర్కొనడం వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Pat Cummins (@patcummins30) కాగా గతేడాది ప్యాట్ కమిన్స్ కెరీర్లో అద్భుతంగా గడిచింది. అతడి సారథ్యంలో ఆస్ట్రేలియా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2021-23, వన్డే వరల్డ్‌కప్-2023 టైటిల్స్ గెలిచింది. ప్రస్తుతం క్రికెట్ నుంచి విశ్రాంతి తీసుకున్న కమిన్స్ కుటుంబానికి సమయం కేటాయించాడు. rఇక ఐపీఎల్ తాజా సీజన్లో అతడు సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున బరిలో దిగనున్నాడు. చదవండి: IPL 2024- SRH: తెలివైన నిర్ణయం.. సన్‌రైజర్స్ కెప్టెన్‌గా అతడే! Sanjana Ganesan: వదినమ్మ అంటూనే వెకిలి కామెంట్.. పో.. ఇక్కడి నుంచి! -
అతడే కాదు.. అసలు ఎవరికీ ఆ అర్హత లేదు: టీమిండియా దిగ్గజం
IPL 2024- KKR: ఐపీఎల్ వేలం-2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ అవలంబించిన వ్యూహాన్ని టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ విమర్శించాడు. ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ కోసం కేకేఆర్ ఏకంగా 24 కోట్లు వెచ్చించడం అతిశయోక్తిగా అనిపించిందన్నాడు. ఏ క్రికెటర్ కూడా అంత మొత్తం అందుకునేందుకు అర్హుడు కాదని తాను భావిస్తున్నట్లు గావస్కర్ పేర్కొన్నాడు. కాగా దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత స్టార్క్ క్యాష్ రిచ్ లీగ్‌లో రీ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఏకంగా రూ. 24.75 కోట్లు భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్-2023లో సత్తా చాటిన ఈ పేస్ బౌలర్ కోసం మినీ వేలంలో ఫ్రాంఛైజీలు పోటీపడ్డాయి. ఈ క్రమంలో స్టార్క్ కోసం గుజరాత్ టైటాన్స్‌తో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైన కేకేఆర్.. ఏకంగా రూ. 24.75 కోట్లు చెల్లించి అతడిని సొంతం చేసుకుంది. తద్వారా ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా మిచెల్ స్టార్క్ పాత రికార్డులన్నీ బద్దలుకొట్టాడు. ఈ విషయం గురించి సునిల్ గావస్కర్ తాజాగా స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడాడు. ‘‘నాకైతే నిజంగా ఇది అతిశయోక్తి అనిపించింది. అతడే కాదు.. అసలు ఎవరికీ ఆ అర్హత లేదు నాకు తెలిసి ఏ క్రికెటర్‌కు కూడా అంత భారీ మొత్తం అందుకోగల అర్హత లేదు. ఒకవేళ తాను ఆడే 14 మ్యాచ్‌లలో స్టార్క్ కనీసం నాలుగింటిలోనైనా ప్రభావం చూపితే.. ఆ డబ్బుకు కాస్తైనా న్యాయం చేసినట్లు అవుతుంది. మిగతా మ్యాచ్‌లలోనూ రాణించగలిగితే అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వంటి జట్లలో మేటి బ్యాటర్లు ఉన్నారు. ఈ జట్లపై స్టార్క్ బంతితో ప్రభావం చూపితే మాత్రం ఫ్రాంఛైజీ తన కోసం వెచ్చించిన మొత్తానికి న్యాయం చేసినవాడవుతాడు’’ అని సునిల్ గావస్కర్ వ్యాఖ్యానించాడు. తొలుత ఆర్సీబీకి ఆడాడు కాగా 2014, 2015 సీజన్లలో ఆర్సీబీకి ఆడిన స్టార్క్.. 2018లో కేకేఆర్‌కు మారాడు. అప్పుడు కేకేఆర్ అతడి కోసం రూ. 9.40 కోట్లు ఖర్చు చేయగా.. గాయం కారణంగా ఆడలేకపోయాడు. ఇక వన్డే వరల్డ్‌కప్-2023లో మిచెల్ స్టార్క్ మొత్తంగా ఆడిన 10 మ్యాచ్‌లలో 16 వికెట్లు తీసి సత్తా చాటాడు. ఆసీస్ ఆరోసారి ప్రపంచ చాంపియన్‌గా నిలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. చదవండి: Ravindra Jadeja: మా కోడలి వల్లే ఇదంతా... మండిపడ్డ రివాబా! -
అశ్విన్‌కు జట్టులో ఉండే అర్హతే లేదు: యువీ సంచలన వ్యాఖ్యలు
Ravichandran Ashwin Doesn't Deserve Place: టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను ఉద్దేశించి భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ చెన్నై బౌలర్‌కు పరిమిత ఓవర్ల జట్టులో స్థానం పొందే అర్హతే లేదన్నాడు. ఆధునికతరం భారత మేటి స్పిన్నర్లలో ఒకడిగా తనదైన ముద్ర వేస్తున్నాడు అశ్విన్. టెస్టుల్లో బంతి, బ్యాట్‌తో రాణిస్తూ ఆల్‌రౌండర్‌గా కీలక పాత్ర పోషిస్తున్నాడు. 500 వికెట్ల మైలురాయికి చేరువగా ముఖ్యంగా సొంతగడ్డపై టీమిండియా టెస్టు సిరీస్ ఆడుతుందంటే అశూ జట్టులో ఉండాల్సిందే. ఇప్పటికే సంప్రదాయ క్రికెట్లో 490 వికెట్లు తీసిన అశూ.. ఇంగ్లండ్‌తో జనవరి 25 నుంచి మొదలుకానున్న టెస్టు సిరీస్ సందర్భంగా 500 వికెట్ల క్లబ్లో చేరే దిశగా పయనిస్తున్నాడు. 5 శతకాలతో సత్తా చాటి బ్యాటర్‌గానూ ఇప్పటిదాకా 95 టెస్టుల్లో అశూ 3193 పరుగులు సాధించాడు. ఇందులో 5 శతకాలు, 14 అర్ధ శతకాలు ఉండటం విశేషం. ఇలా ఆల్‌రౌండర్‌గా భారత టెస్టు జట్టులో పాతుకుపోయిన అశూకు.. వన్డే, టీ20 జట్టులో మాత్రం ఉండే అర్హత లేదంటున్నాడు యువీ. అశూకు ఆ అర్హత లేదు టైమ్స్ ఆఫ్ ఇండియా ఇంటర్వ్యూలో భాగంగా టీమిండియా పరిమిత ఓవర్ల క్రికెట్లో అశ్విన్ గురించి ఎదురైన ప్రశ్నకు స్పందిస్తూ... ‘‘అశ్విన్ గొప్ప బౌలరే... కానీ వన్డే, టీ20 జట్టులో ఉండే అర్హత అతడికి లేదు. టెస్టుల్లో ఆల్‌రౌండర్‌గా అతడు బెస్ట్.. కానీ పరిమిత ఓవర్ల క్రికెట్లో బ్యాటర్‌గా, ఫీల్డర్‌గా తను ఏం చేయగలడు? అందుకే టెస్టుల్లో తను కచ్చితంగా ఉండాలి. కానీ వైట్‌బాల్ క్రికెట్ జట్టులో అతడికి చోటు అవసరం లేదు’’ అని కుండబద్దలు కొట్టాడు. 37 ఏళ్ల అశూ వైట్‌బాల్ జట్టులో అనవసరం! కాగా ఇప్పటి వరకు అంతర్జాతీయ స్థాయిలో అశ్విన్ 116 వన్డేల్లో 156.. అదే విధంగా 65 టీ20లలో 72 వికెట్లు తీశాడు. అయితే, వన్డే, టీ20లలో యువ బౌలర్లు ప్రతిభ నిరూపించుకుంటున్నప్పటికీ 2011 మొదలు తాజాగా ముగిసిన 2023 వరల్డ్‌కప్ జట్లలో 37 ఏళ్ల అశూకు స్థానం లభించింది. ఈ నేపథ్యంలోనే యువరాజ్ సింగ్ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. చదవండి: INDA Vs ENGA: శతక్కొట్టిన పాటిదార్.. పాపం సర్ఫరాజ్! భరత్ ఫిఫ్టీ.. -
అదొక్కటి తప్ప.. అన్నీ పూర్తి చేశానని గర్వంగా చెప్పగలను: గిల్
Shubman Gill About 2023: 2023.. తనకు మరుపురాని అనుభవాలు మిగల్చడంతో పాటు ఎన్నో పాఠాలు నేర్పిందని టీమిండియా స్టార్ క్రికెటర్ శుబ్‌మన్ గిల్ అన్నాడు. అనుకున్న లక్ష్యాలు సాధించేందుకు తాను శాయశక్తులా కృషి చేశానని.. కొత్త సంవత్సరంలో మరిన్ని కఠిన సవాళ్లకు సిద్ధమవుతున్నట్లు తెలిపాడు. ఒకటీ రెండు చేదు అనుభవాలు మినహా.. 2023 గొప్పగా గడిచిందని ఈ యువ ఓపెనర్ హర్షం వ్యక్తం చేశాడు. వన్డేల్లో ద్విశతకం కాగా గతేడాది శుబ్‌మన్ గిల్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. వన్డేల్లో తొలి ద్విశతకం బాదడంతో పాటు.. టెస్టు, టీ20 ఫార్మాట్లోనూ సెంచరీలతో మెరిశాడు. తన అంతర్జాతీయ కెరీర్లో తొలి వరల్డ్‌కప్ కూడా ఆడాడు. మొత్తంగా 2023లో 29 వన్డేలు ఆడి 1584 పరుగులు చేసిన గిల్.. టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. ఫ్రాంచైజీ క్రికెట్లో దుమ్ములేపాడు అంతేగాకుండా ఫ్రాంఛైజీ క్రికెట్లోనూ గొప్పగా రాణించాడు. ఐపీఎల్-2023లో గుజరాత్ టైటాన్స్ తరఫున 17 ఇన్నింగ్స్ ఆడి 890 పరుగులు సాధించాడు గిల్. ఇందులో మూడు సెంచరీలు, నాలుగు అర్ధ శతకాలు ఉండటం విశేషం. ఇలా సీజన్ ఆసాంతం బ్యాట్ ఝులిపించిన ఈ పంజాబీ బ్యాటర్.. అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచి ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు. అదే విధంగా హార్దిక్ పాండ్యా టైటాన్స్‌ను వీడటంతో ఐపీఎల్-2024 ఎడిషన్‌కు గానూ అతడి స్థానంలో కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. అందుకు గర్విస్తున్నా ఈ క్రమంలో.. 2023కు వీడ్కోలు పలుకుతూ శుబ్‌మన్ గిల్ ఇన్‌స్టాలో పోస్ట్ షేర్ చేశాడు. ‘‘గతేడాది నిర్దేశించుకున్న లక్ష్యాల్లో.. భారత్ తరఫున అత్యధిక శతకాలు బాదడం.. నా కుటుంబాన్ని సంతోషంగా ఉంచటం.. అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేయడం.. వరల్డ్‌కప్ గెలవడం.. వంటివి ఉన్నాయి. వీటిలో ఒక్కటి మినహా దాదాపుగా అన్నీ సాధించాను. 2023 ఎన్నో అనుభవాలు మిగిల్చింది. సరదాలు, సంతోషాలతో పాటు ఎన్నో గుణపాఠాలను నేర్పింది. అయితే, అనుకున్నట్లుగా ఏడాదిని పూర్తి చేయలేకపోయా(టీమిండియా వరల్డ్‌కప్ ఓటమి). అయితే, లక్ష్యాలకు చేరువగా వచ్చామని గర్వంగా చెప్పగలను. వచ్చే ఏడాదిలో లభించే అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ.. సవాళ్లను అధిగమిస్తూ ముందుకు సాగి.. 2024లో గోల్స్ సాధిస్తామని ఆశిస్తున్నా’’ అని గిల్ పేర్కొన్నాడు. ఈ సందర్భంగా 2023లో తను సాధించిన విజయాల తాలుకు ఫొటోలతో పాటు.. తన కుటుంబ సభ్యులతో దిగిన ఫొటోను శుబ్‌మన్ గిల్ ఇందుకు జతచేశాడు. చదవండి: 2024 ఏడాదిలో టీమిండియా షెడ్యూల్ ఇదే.. ఈ సారైనా కల నెరవేరేనా? View this post on Instagram A post shared by Ꮪhubman Gill (@shubmangill) -
మంచి జట్టే! కానీ టీమిండియా ఏదీ గెలవలేదు: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్
టీమిండియాను ఉద్దేశించి ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ ఘాటు విమర్శలు చేశాడు. గత పదేళ్లలో భారత జట్టు అసలేం సాధించిందని ప్రశ్నించాడు. పటిష్ట జట్టు అని చెప్పుకోవడమే తప్ప.. జట్టులోని వనరులను పూర్తిగా సద్వినియోగం చేసుకున్న దాఖలాలే లేవని విమర్శించాడు. టీ20 వరల్డ్‌కప్-2022 సెమీ ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో టీమిండియా పది వికెట్ల తేడాతో ఓడినప్పటి నుంచి మైకేల్ వాన్.. రోహిత్ సేనపై కఠిన విమర్శలు ఎక్కుపెడుతూనే ఉన్నాడు. అంచనాలు అందుకోలేని ఓ అండర్అచీవ్ టీమ్ అంటూ ఎద్దేవా చేస్తున్నాడు. తాజాగా సౌతాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా చిత్తుగా ఓడిపోవడంతో మరోసారి తన వ్యాఖ్యలకు పదును పెట్టాడు వాన్. ఫాక్స్ స్పోర్ట్స్ షోలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మార్క్ వాతో కలిసి పాల్గొన్న మైకేల్ వాన్.. అతడిని ఉద్దేశించి.. ‘‘క్రికెట్ ప్రపంచంలో ఎంతో గొప్ప జట్టు అనుకునే టీమిండియా అండర్అచీవ్ టీమ్ అని భావిస్తున్నారా?’’ అని అడిగాడు. ఇందుకు స్పందించిన మార్క్ వా తిరిగి అదే ప్రశ్న వేయడంతో మైకేల్ వాన్ బదులిచ్చాడు. ఈ మేరకు.. ‘‘ఇటీవలి కాలంలో టీమిండియా చెప్పుకోగదగ్గ విజయాలేమీ సాధించలేదు. వాళ్లపై అంచనాలు పెట్టుకున్న ప్రతిసారి వమ్ము చేస్తూనే ఉంటారు. వాళ్లు చివరిసారిగా అతి గొప్ప విజయం ఎప్పుడు సాధించారో గుర్తుందా? నిజానికి వాళ్ల దగ్గర ప్రతిభ, నైపుణ్యాలు గల ఆటగాళ్లకు కొదువలేదు. కానీ వారి సేవలను సద్వినియోగం చేసుకుంటున్నారా? అప్పుడెప్పుడో ఆస్ట్రేలియాలో రెండుసార్లు టెస్టులు గెలిచారు. కానీ వరల్డ్‌కప్ టోర్నీల సంగతేంటి? గత కొన్నేళ్లుగా వాళ్లు ఒక్కదాంట్లోనూ విజయం సాధించలేదు. నిజానికి ఇండియా మంచి టీమ్. ఎంతో మంది ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఆ జట్టులో ఉన్నారు. అయినా ఏం లాభం? వాళ్లు ఇక ముందు కూడా గెలుస్తారనే నమ్మకం లేదు’’ అని మైకేల్ వాన్ టీమిండియా ఆట తీరును తక్కువ చేసే విధంగా మాట్లాడాడు. కాగా మహేంద్ర సింగ్ సారథ్యంలో 2011లో వన్డే ప్రపంచకప్ గెలిచిన టీమిండియా.. 2013లో చాంపియన్స్ ట్రోఫీ కైవసం చేసుకుంది. ఆ తర్వాత మళ్లీ ఇంతవరకు ఒక్క ఐసీసీ టోర్నీ కూడా గెలవలేదు. టీ20 వరల్డ్‌కప్-2021, టీ20 వరల్డ్‌కప్-2022లో స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయిన టీమిండియా.. ఇటీవల సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్-2023లోనూ విజయలాంఛనం పూర్తి చేయలేకపోయింది. ఫైనల్ వరకు చేరినా.. ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. ఆస్ట్రేలియా చేతిలో ఓడి ట్రోఫీని చేజార్చుకుంది. అదే విధంగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో రెండు పర్యాయాలు ఫైనల్లో అడుగుపెట్టినా ఆఖరి గండాన్ని దాటలేకపోయింది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న టీమిండియా రెండో టెస్టు గెలిచి సిరీస్‌ను డ్రా చేసుకోవాలని పట్టుదలగా ఉంది. చదవండి: Ind vs SA: రోహిత్ ప్రాక్టీస్.. టీమిండియా పేసర్‌కు గాయం.. రెండో టెస్టుకు డౌటే! -
గిల్ సూపర్ టాలెంట్.. దిగ్గజ ఆటగాడిగా ఎదుగుతాడు
He’s a super talent: టీమిండియా యువ బ్యాటర్ శుబ్‌మన్ గిల్‌పై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుసేన్ ప్రశంసలు కురిపించాడు. మెన్స్ క్రికెట్లో అతడు దిగ్గజ ఆటగాడిగా ఎదుగుతాడని అంచనా వేశాడు. ఈ ఏడాది గిల్ అత్యుత్తమంగా రాణించాడంటూ అతడిని ‘‘సూపర్ టాలెంట్’’గా అభివర్ణించాడు. అత్యధిక పరుగుల వీరుడు కాగా అంతర్జాతీయ వన్డేల్లో టీమిండియా ఓపెనర్ శుబ్‌మన్ గిల్ ఈ ఏడాది అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచాడు. 2023లో మొత్తంగా 29 వన్డేలు ఆడిన 24 ఏళ్ల ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్.. సగటు 63.36తో 1584 పరుగులు సాధించాడు. ఇందులో ఓ డబుల్ సెంచరీ కూడా ఉండటం విశేషం. హైదరాబాద్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో గిల్.. 149 బంతుల్లోనే 208 పరుగులు రాబట్టి సంచలన ఇన్నింగ్స్‌తో మెరిశాడు. అంతేకాదు.. టీ20, టెస్టు ఫార్మాట్లోనూ ఒక్కో శతకం బాది సత్తా చాటాడు. అద్భుత నైపుణ్యాలు... తనకు తానే సాటి ఈ నేపథ్యంలో రాబోయే తరం క్రికెట్ సూపర్స్టార్ల గురించి ఎదురైన ప్రశ్నకు బదులిస్తూ నాసిర్ హుసేన్.. శుబ్‌మన్ గిల్ పేరును ప్రస్తావించాడు. ‘‘మెన్స్ క్రికెట్ నెక్ట్స్ సూపర్‌స్టార్ ఎవరంటే నేను శుబ్‌మన్ గిల్ పేరు చెబుతాను. 2023లో అతడు అత్యుత్తమంగా ఆడాడు. మరో ఎండ్ నుంచి తనకు సహకారం అందించే రోహిత్ శర్మ వంటి సీనియర్ల నుంచి అతడు చాలా విషయాలు నేర్చుకుని ఉంటాడు. గిల్ అద్భుత నైపుణ్యాలు కలిగిన ఆటగాడు. టీమిండియా తరఫున రాబోయే రోజుల్లో మరిన్ని సంచలన ప్రదర్శనలు ఇవ్వగలడు. 2024లోనూ అతడి ఫామ్ ఇలాగే కొనసాగాలని ఆశిస్తున్నా’’ అని నాసిర్ హుసేన్ శుబ్‌మన్ గిల్‌ను కొనియాడాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఐసీసీ ఇన్‌స్టా వేదికగా పంచుకుంది. రచిన్ రవీంద్ర జోరు కొనసాగాలి ఇక ఈ ఏడాది గిల్‌తో పాటు న్యూజిలాండ్ యువ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర కూడా తనను బాగా ఆకట్టుకున్నాడని నాసిర్ హుసేన్ తెలిపాడు. అతడి జోరు వచ్చే సంవత్సరం కూడా ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించాడు. కాగా రచిన్ రవీంద్ర వన్డే వరల్డ్‌కప్-2023లో ఏకంగా మూడు శతకాలు బాదిన విషయం తెలిసిందే. పది ఇన్నింగ్స్‌లో కలిపి 578 పరుగులు రాబట్టాడు రచిన్. చదవండి: IND Vs SA: వాళ్లిద్దరిని ఎంపిక చేయకుండా పెద్ద తప్పు చేశారు: భజ్జీ View this post on Instagram A post shared by ICC (@icc) -
అప్పుడు చాలా బాధపడ్డాను.. కానీ చాలా మంది సపోర్ట్‌గా నిలిచారు: రోహిత్
వన్డే వరల్డ్‌కప్-2023 తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తొలిసారి మైదానంలో అడుగుపెట్టేందుకు సిద్దమయ్యాడు. దక్షిణాఫ్రికాతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత జట్టును రోహిత్ నడిపించనున్నాడు. సఫారీ గడ్డపై ఇప్పటివరకు అందని ద్రాక్షగా ఉన్న టెస్టు సిరీస్‌ను.. ఈ సారి సొంతం చేసుకుని తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకోవాలని హిట్‌మ్యాన్ పట్టుదలతో ఉన్నాడు. ఈ సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు డిసెంబర్ 26 నుంచి సెంచూరియన్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ప్రీమ్యాచ్ కాన్ఫెరెన్స్‌లో రోహిత్ పాల్గొన్నాడు. ప్రపంచ కప్ ఓటమి గురించి రోహిత్ శర్మను మరోసారి విలేకరులు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో రోహిత్ మాట్లాడుతూ.. 'ప్రపంచకప్‌లో మేము అద్భుతమైన ప్రదర్శన కనబరిచాం. ట్రోఫీ కోసం చాలా చాలా కష్టపడ్డాము. ఫైనల్ మ్యాచ్‌లో మేము కొన్ని విభాగాల్లో రాణించలేకపోయాం. ఆఖరిపోరులో ఓడిపోవడం చాలా బాధ కల్గించింది. కానీ ఆ విషయాన్ని మర్చిపోయి ముందుకు పోవడానికి కొత్త దారులు వెతకాలి. ఓటమి తర్వాత చాలా మంది మాకు మద్దతుగా నిలిచారు. అది వ్యక్తిగతంగా నన్ను ఓటమి బాధ నుంచి కోలుకునేలా ప్రేరేపించింది. ప్రస్తుతం నా దృష్టి సౌతాఫ్రికా సిరీస్ పైనే ఉంది. పరిస్ధితులు ఎలా ఉన్న నేను బాగా బ్యాటింగ్ చేయడానికి 100 శాతం ప్రయత్నిస్తాను అని చెప్పుకొచ్చాడు. ఇక ప్రోటీస్ సిరీస్‌లో రోహిత్‌తో పాటు స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా కూడా భాగమయ్యారు. చదవండి: IND vs AUS: ఆసీస్‌తో వన్డే, టీ20 సిరీస్.. భారత జట్టు ప్రకటన! యువ క్రికెటర్‌కు ఛాన్స్ -
నా ఆటకు పునాది.. సర్వస్వం.. సంతృప్తి ఇక్కడే: కోహ్లి భావోద్వేగం
Virat Kohli Comments: ‘‘నా ఆటకు టెస్టు క్రికెట్ పునాది. ఇదొక చరిత్ర. ఒక సంస్కృతి. వారసత్వం. సర్వస్వం ఇదే. ప్రత్యర్థి జట్టుతో నాలుగు- ఐదు రోజుల పాటు పోటీపడటం అన్నింటికంటే భిన్న అనుభవాన్ని ఇస్తుంది. బ్యాటర్‌గా.. జట్టుగా ఈ ఫార్మాట్లో ఆడటం వల్లే పూర్తి సంతృప్తి లభిస్తుంది. క్రీజులో గంటల తరబడి నిలబడి.. జట్టును గెలిపించే అవకాశం దక్కడం అన్నిటికంటే ప్రత్యేకమైన భావన. నేను సంప్రదాయ క్రికెట్‌ను ఎక్కువగా ఇష్టపడేవాడిని. అందుకే నాకు టెస్టులంటే అమితమైన ఇష్టం. టీమిండియా తరఫున వంద కంటే ఎక్కువ టెస్టులు ఆడే అవకాశం రావడం నాకు దక్కిన గౌరవం. టెస్టు క్రికెటర్ కావాలన్న నా చిరకాల కల నెరవేరడమే గాకుండా ఇక్కడిదాకా వచ్చినందుకు గర్వంగా ఉంది’’ అని టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఉద్వేగపూరితంగా మాట్లాడాడు. మూడు ఫార్మాట్లలో తనకు టెస్టులు ఆడటమే అత్యంత సంతృప్తినిస్తుందని పేర్కొన్నాడు. వరల్డ్‌కప్ ఫైనల్ ఓటమి తర్వాత తొలిసారి కాగా సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్-2023లో విరాట్ కోహ్లి సత్తా చాటిన విషయం తెలిసిందే. దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండుల్కర్ వన్డే సెంచరీల రికార్డును బద్దలు కొట్టి సరికొత్త చరిత్ర సృష్టించిన ఈ రన్‌మెషీన్.. ఐసీసీ ఈవెంట్లో టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. అయితే, ఫైనల్లో టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేక కన్నీటి పర్యంతమయ్యాడు. ఇక ప్రపంచకప్ టోర్నీ తర్వాత విశ్రాంతి తీసుకున్న విరాట్ కోహ్లి.. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ సందర్భంగా రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఇంతవరకు ఒక్కసారి కూడా గెలవలేదు సఫారీ గడ్డపై భారత జట్టు ఇంత వరకు ఒక్కసారి కూడా టెస్టు సిరీస్ గెలవలేదన్న అపవాదు చెరిపివేసేందుకు తన వంతు ప్రయత్నం చేసేందుకు సన్నద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలో వరల్డ్‌కప్ ఫైనల్ ఓటమి తర్వాత తొలిసారి స్టార్ స్పోర్ట్స్ షోకు ఇంటర్వ్యూ ఇచ్చిన కోహ్లి.. తన కెరీర్లో టెస్టులకు ఉన్న ప్రాధాన్యం గురించి వివరిస్తూ ఎమోషనల్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. తొలి టెస్టుకు అందుబాటులో ఉంటాడు ఇదిలా ఉంటే.. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం దక్షిణాఫ్రికా వెళ్లిన భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి దక్షిణాఫ్రికా నుంచి అనూహ్యంగా స్వదేశానికి తిరిగి బయల్దేరిన విషయం తెలిసిందే. ‘వ్యక్తిగత కారణాలతో’ కోహ్లి వెనక్కి వచ్చినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. కోహ్లి ఇంటికి వెళ్లడంపై స్పష్టమైన కారణం ఏమిటో తెలియకపోయినా... ఈ విషయంపై అతను ముందే బీసీసీఐ అనుమతి తీసుకున్నట్లు సమాచారం. ‘‘గురువారమే కోహ్లి భారత్‌కు బయల్దేరాడు. ఇది ముందే నిర్ణయించుకున్నది. అందుకే అతను భారత్, దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్ల మధ్య జరిగిన మూడు రోజుల ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌లో కూడా ఆడలేదు’ అని బోర్డు ప్రతినిధి ఒకరు చెప్పారు. అయితే ఈ నెల 26 నుంచి జరిగే తొలి టెస్టు సమయానికి అతను మళ్లీ దక్షిణాఫ్రికాకు చేరుకుంటాడని, మ్యాచ్ కూడా ఆడతాడని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ చేతి వేలి గాయం కారణంగా టెస్టు సిరీస్ నుంచి తప్పుకున్నాడు. అతడి స్థానంలో అభిమన్యు ఈశ్వరన్‌కు పిలుపునిచ్చారు సెలక్టర్లు. చదవండి: ఆర్సీబీకి ఆడాలనేది నా కల.. ఇప్పుడిలా: కేఎల్ రాహుల్ Test cricket is the toughest & most demanding but the best form of cricket! It's pure, rich in history & heritage, say legends @ImRo45 & @imVkohli ahead of the Final Frontier vs #SouthAfrica. Tune-in the 1st #SAvIND Test TUE, DEC 26, 12:30 PM | Star Sports Network pic.twitter.com/wZDFGlVAVC — Star Sports (@StarSportsIndia) December 23, 2023 -
అది గతం.. ఇప్పుడు రోహిత్ మునుపటిలా లేడు: మంజ్రేకర్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ శైలిపై భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గత రెండేళ్లలో హిట్‌మ్యాన్ అత్యుత్తమ టెస్టు బ్యాటర్‌గా ఎదిగాడని కొనియాడాడు. లెఫ్టార్మ్ పేసర్ల బౌలింగ్‌లో సమర్థవంతంగా ఆడలేడన్న అపవాదును చెరిపివేసుకున్నాడని ప్రశంసించాడు. కాగా వన్డే వరల్డ్‌కప్-2023 ఫైనల్లో ఓటమి తర్వాత రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌తో హిట్‌మ్యాన్ మళ్లీ మైదానంలో అడుగుపెట్టనున్నాడు. ఇప్పటి వరకు సఫారీ గడ్డపై టీమిండియా టెస్టు సిరీస్ గెలవలేదన్న అపఖ్యాతిని పోగొట్టడమే లక్ష్యంగా సన్నద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలో సంజయ్ మంజ్రేకర్ స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘లెఫ్టార్మ్ పేసర్ల బౌలింగ్‌లో రోహిత్ శర్మ బాగా ఆడలేడు అనేది గతం. గత రెండు మూడేళ్లలో అతడు తన బలహీనతలను అధిగమించాడు. మిచెల్ స్టార్క్, షాహిన్ ఆఫ్రిది బౌలింగ్‌లో అద్భుతంగా ఆడాడు. ప్రస్తుతం తను అత్యుత్తమ టెస్టు ప్లేయర్‌గా కనిపిస్తున్నాడు. గతేడాది ఇంగ్లండ్ పర్యటనలో అద్భుతంగా ఆడాడు. టెస్టు ఓపెనర్‌గా రాణిస్తూ ఇంగ్లండ్ గడ్డ మీద సెంచరీ చేయడంతో పాటు టాప్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు. గంటల కొద్దీ క్రీజులో నిలబడి ఓపికగా ఆడాడు. ఇక ముందు లెఫ్టార్మ్ పేసర్లను అతడు విజయవంతంగా ఎదుర్కోవడం మనం చూస్తాం’’ అని పేర్కొన్నాడు. సౌతాఫ్రికా పర్యటనలో రోహిత్ శర్మ తప్పక రాణిస్తాడని సంజయ్ మంజ్రేకర్ ధీమా వ్యక్తం చేశాడు. కాగా డిసెంబరు 26న సౌతాఫ్రికా- భారత్ మధ్య తొలి టెస్టు మొదలుకానుంది. చదవండి: పెళ్లిళ్లు అక్కడే నిశ్చయమవుతాయంటారు: చహల్ భావోద్వేగం -
విరాట్ కోహ్లి 3.O.. 2023లో ఎన్నో ఘనతలు! కానీ అదొక్కటే
2023.. టీమిండియా స్టార్ బ్యాటర్, రన్‌మిషన్ విరాట్ కోహ్లికి చాలా ప్రత్యేకం. ఈ ఏడాది విరాట్‌కు తన జీవితాంతం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఎందుకంటే తన ఆరాధ్య దైవం సచిన్ టెండూల్కర్ వరల్డ్ రికార్డును బ్రేక్ చేసిన ఏడాది ఇది. ఎవరికి సాధ్యం కాదనుకున్న వన్డేల్లో అత్యధిక సెంచరీల రికార్డును బద్దలు కొట్టిన కింగ్ కోహ్లి.. తన పేరును క్రికెట్ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నాడు. అంతర్జాతీయ వన్డేల్లో 50 సెంచరీలు చేసిన విరాట్.. వరల్డ్‌క్రికెట్‌లో తానే కింగ్ అనే మరోసారి నిరూపించుకున్నాడు. ఇక ఈ ఏడాదిలో విరాట్ అత్యధిక వన్డే సెంచరీల రికార్డుతో పాటు మరిన్నో అరుదైన ఘనతలను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఏడాదిలో కోహ్లి సాధించిన రికార్డులపై ఓ లుక్కేద్దాం. క్రిస్ గేల్ రికార్డు బద్దలు.. ఈ ఏడాది ఐపీఎల్లో విరాట్ కోహ్లి సంచలన ప్రదర్శన కనబరిచాడు. ఐపీఎల్-2023లో విరాట్ రెండు అద్భుతమైన సెంచరీలతో చెలరేగాడు. తద్వారా ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా కోహ్లి రికార్డులకెక్కాడు. కోహ్లి ఇప్పటివరకు ఈ క్యాష్‌రిచ్ లీగ్‌లో 7 సెంచరీలు చేశాడు. అంతకుముందు ఈ రికార్డు విండీస్ లెజెండ్ క్రిస్ గేల్(6) పేరిట ఉండేది. ఈ ఏడాది సీజన్‌తో గేల్ ఆల్‌టైమ్ రికార్డును విరాట్ బ్రేక్ చేశాడు. తొలి ఆటగాడిగా.. ఈ ఏడాది ఐపీఎల్లో విరాట్ మరో అరుదైన ఘనతను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్లో 7000 పరుగులు మైలురాయిని అందుకున్న తొలి ఆటగాడిగా కోహ్లి నిలిచాడు. ఇప్పటివరకు 229 ఐపీఎల్ ఇన్నింగ్స్‌లలో 7263 పరుగులు కోహ్లి చేశాడు. సచిన్ రికార్డు బ్రేక్.. వన్డేల్లో ఒక క్యాలెండర్ ఇయర్లో 1000కు పైగా పరుగులు అత్యధిక సార్లు చేసిన ఆటగాడిగా విరాట్ రికార్డు సృష్టించాడు. వన్డే వరల్డ్‌కప్‌లో-2023లో భాగంగా శ్రీలంకతో మ్యాచ్‌లో కోహ్లి ఈ ఘనతను అందుకున్నాడు. కోహ్లి ఇప్పటివరకు 8 సార్లు ఒక క్యాలెండర్ ఇయర్లో 1000కుపైగా పరుగులు సాధించాడు. ఈ క్రమంలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్(7) ఆల్‌టైమ్ రికార్డును విరాట్ బ్రేక్ చేశాడు. 765 పరుగులతో.. భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్‌కప్-2023 విరాట్ కోహ్లి దుమ్మురేపాడు. 11 మ్యాచ్‌లు ఆడి 765 పరుగులతో టోర్నీ టాప్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు. తద్వారా వన్డే వరల్డ్‌కప్ ఒకే ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ నిలిచాడు. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్(674)ను అధిగమించాడు. పాకిస్తాన్‌పై వరల్డ్ రికార్డు.. వన్డేల్లో అత్యంత వేగంగా 13,000 పరుగుల మైలు రాయిని అందుకున్న ఆటగాడిగా రికార్డులకెక్కుతాడు. ఆసియాకప్-2023లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి ఈ ఘనత సాధించాడు. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్‌ను బ్రేక్ చేశాడు. సచిన్ 321 ఇన్నింగ్స్‌లలో ఈ మైలు రాయిని అందుకోగా.. కోహ్లి కేవలం 267 ఇన్నింగ్స్‌లలోనే ఈ ఘనతను అందుకున్నాడు. కోహ్లి 3.O.. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి.. 2019-2022 ఏడాది మధ్య గడ్డు పరిస్ధితులను ఎదుర్కొన్నాడు. ఒకనొక దశలో జట్టులో కోహ్లి అవసరమా అన్న స్ధితికి దిగజారిపోయాడు. ఇటువంటి సమయంలో దెబ్బతిన్న సింహంలా కోహ్లి అద్బుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చాడు. గతేడాది డిసెంబర్లో ఆసియాకప్‌లో భాగంగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో మెరుపు సెంచరీ చేసిన విరాట్.. తన 1000 రోజుల నిరీక్షణకు తెరదించాడు. ఇక అప్పటినుంచి కోహ్లి వెనక్కి తిరిగి చూడలేదు. ఈ ఏడాదిని సెంచరీతో ఆరంభించిన కోహ్లి పరుగులు వరుద పారించాడు. ఇప్పటివరకు ఈ ఏడాదిలో 27 వన్డేలు, 7 టెస్టు మ్యాచ్‌లు ఆడిన కోహ్లి.. వరుసగా 1377, 557 పరుగులు చేశాడు. ఓవరాల్ ఈ ఏడాదిలో 8 సెంచరీలు విరాట్ సాధించాడు. కాగా గతేడాది టీ20 వరల్డ్‌కప్ నుంచి ఇప్పటివరకు భారత తరపున ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడలేదు. అదొక్కటే.. ఈ ఏడాదిలో ఇన్ని ఘనతలు సాధించిన కోహ్లికి ఒకటి మాత్రం అందని ద్రాక్షగా మిగిలిపోయింది. సొంత గడ్డపై జరిగిన వన్డే వరల్డ్‌కప్ ట్రోఫిని ముద్దాడాలన్న కోహ్లి కల మాత్రం నెరవేరలేదు. టోర్నీ ఆసాంతం అదరగొట్టిన టీమిండియా ఆఖరి మొట్టుపై ఆస్ట్రేలియా చేతిలో బోల్తా పడింది. ఓటమి అనంతరం కోహ్లి కన్నీరు పెట్టుకున్నది అభిమానులు ఇప్పటికి మర్చిపోలేకపోతున్నారు. -
నేనొక భారత ముస్లింని గర్వంగా చెబుతా.. నన్ను ఎవరు ఆపుతారు: షమీ
వన్డే వరల్డ్‌కప్-2023 సందర్భంగా మైదానంలో నమాజ్ చేశాడని టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీని కొంతమంది నెటిజన్లు ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయంపై స్పందించిన షమీ.. తనపై విమర్శల చేసిన వారికి గట్టి కౌంటరిచ్చాడు. తాను గర్వించదగిన భారత ముస్లింనని, నమాజ్ చేయాలనుకుంటే అడ్డుకునేవారు ఎవరని సీరియస్ అయ్యాడు. అసలేం ఏం జరిగిందంటే? వన్డే ప్రపంచకప్‌లో మహ్మద్ షమీ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. కేవలం 7 మ్యాచ్‌ల్లో 24 వికెట్లు పడగొట్టి టోర్నీ లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. కాగా ఈ మెగా టోర్నీలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్లతో చెలరేగాడు. ఈ క్రమంలో తన ఐదు వికెట్ల హాల్‌ను అందుకోగానే షమీ మెకాలిపై కూర్చోని రెండు చేతులతో నేలను తాకుతూ సెలబ్రేషన్స్ జరుపుకున్నాడు. అయితే షమీ సెలబ్రేషన్స్‌ను కొంతమంది అభిమానులు తప్పుబట్టారు. షమీ మైదానంలో నమాజ్ చేశాడని ఆరోపిస్తూ అతడిని ట్రోలు చేశారు. నన్ను ఆపేవారు ఎవరు? "నేను నమాజ్ చేయాలనుకుంటే నన్ను ఎవరు అడ్డుకుంటారు? నేను ప్రార్థన చేయాలనుకుంటే చేస్తా. ఇందులో ఉన్న సమస్య ఏంటి? నేను ఒక భారతీయ ముస్లింనని గర్వంగా చెబుతాను. నమాజ్ చేయడానికి ఎవరో అనుమతి తీసుకోవాలంటే.. నేను ఈ దేశంలో ఎందుకు ఉంటాను? ఇంతకు ముందు కూడా నేను చాలా సార్లు 5 వికెట్లు సాధించాను. అప్పుడు ఎప్పుడైన నేను నమాజ్ చేయడం మీరు చూశారా? ఇటువంటి పిచ్చి పనులు మానుకోండి. నేను ఇప్పుడు ఎక్కడ ప్రార్థన చేయాలో చెప్పండి. అక్కడికి వెళ్లి నమాజ్ చేస్తాను. శ్రీలంకతో మ్యాచ్‌లో వికెట్ల కోసం 200 శాతం ఎఫర్ట్ పెట్టి బౌలింగ్ చేశాను. దీంతో కాస్త అలసటకు గురై మోకాళ్లపై కూర్చున్నాని ఓ జాతీయ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షమీ పేర్కొన్నాడు. కాగా షమీ ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు సిద్దమవుతున్నాడు. -
#Virushka: అందుకే విరాట్ కోహ్లి పేరును రాహుల్‌గా మార్చి మరీ!
సరిగ్గా ఆరేళ్ల క్రితం.. ఇదే రోజున.. టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి- బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మతో కలిసి వైవాహిక బంధంలో అడుగుపెట్టాడు. తమ ప్రేమ బంధాన్ని పెళ్లి పీటలు ఎక్కించి చిరకాల ప్రేయసితో కలిసి ఏడడుగులు నడిచాడు. ఇటలీలోని టస్కనీ వేదికగా ‘విరుష్క’ వివాహం అత్యంత సన్నిహితుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, ఆప్తమిత్రుల ఆశీర్వాదాలతో డిసెంబరు 11న విరాట్- అనుష్క ఒక్కటయ్యారు. షాంపూ యాడ్ ద్వారా 2013లో పరిచయమైన వీరిద్దరు చాన్నాళ్ల పాటు ప్రేమలో మునిగితేలిన విషయం తెలిసిందే. అయితే, చాలా మంది సెలబ్రిటీల లాగే వీరి బంధం కూడా మూణ్ణాళ్ల ముచ్చటగానే మిగిలిపోతుందంటూ వదంతులు వ్యాప్తి చేసిన వారి మాటలను నీటి మూటలు చేస్తూ విరుష్క వెడ్లాక్తో ముడిపడిపోయారు. కాగా విరాట్- అనుష్క జోడీ పబ్లిసిటీకి కాస్త దూరంగా ఉంటారన్న సంగతి తెలిసిందే. అందుకే ఎలాంటి హడావుడి లేకుండా .. రహస్యంగా పెళ్లి తంతు ముగించేశారు. విరాట్ కాదు రాహుల్! ఈ విషయం గురించి అనుష్క శర్మ గతంలో వోగ్‌తో మాట్లాడుతూ.. కేవలం 42 మంది అతిథుల సమక్షంలో విరాట్- తాను ఒక్కటయ్యామని తెలిపింది. అంతేకాదు విరాట్ కోహ్లికి ఉన్న క్రేజ్ దృష్ట్యా తమ పెళ్లి వార్త లీక్ కాకుండా నకిలీ పేరు వాడినట్లు వెల్లడించింది. ‘‘మేము నిరాడంబరంగా.. హోమ్ స్టైల్ వెడ్డింగ్ చేసుకోవాలని భావించాం. మా కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిసి మొత్తం ఆరోజు 42 మంది ఉన్నారు. అదొక సెలబ్రిటీ జంట పెళ్లిగా కాకుండా.. కేవలం విరాట్- అనుష్కల పెళ్లిలా ఉండాలని కోరుకున్నాం. అంతేకాదు కేటరర్ విషయంలో విరాట్ పేరు బయటికి రాకుండా అతడికి ‘రాహుల్’ అనే నకిలీ పేరును వాడాం. ప్రేమతో రెండు మనసులు ఏకమయ్యే వేడుకకు పబ్లిసిటీ అవసరం లేదని భావించాం. అందుకే హంగూఆర్భాటాలు లేకుండా పవిత్రత, శాంతితో కూడిన వాతావరణంలో పెళ్లి చేసుకోవాలనుకున్నాం’’ అని అనుష్క శర్మ తెలిపింది. అప్పటికే టీమిండియా కెప్టెన్‌గా విరాట్ పెళ్లినాటికి టీమిండియా సారథిగా విరాట్ కోహ్లి- నటిగా అనుష్క శర్మ తమ కెరీర్లో తారస్థాయిలో ఉన్నారు. అయితే, వ్యక్తిగత జీవితానికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలనే తలంపుతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. మీడియాకు దూరంగా వామిక ఇక ఈ జంటకు 2021, జనవరి 11న కూతురు జన్మించింది. పాపకు వామికా కోహ్లిగా నామకరణం చేసిన విరుష్క... ఇంతవరకు ఆమె ఫేస్‌ను మాత్రం రివీల్ చేయలేదు. పబ్లిసిటీకి దూరంగా.. స్టార్ కిడ్‌గా కాకుండా సాధారణ అమ్మాయిలా తమ కుమార్తెను పెంచాలనే ఉద్దేశంతోనే ఆమెను మీడియాకు దూరంగా ఉంచుతున్నట్లు ఇప్పటికే విరుష్క జోడీ వెల్లడించింది. రికార్డుల రారాజు.. వరల్డ్‌కప్ ఓటమితో కాగా రికార్డుల రారాజు విరాట్ కోహ్లి వన్డే వరల్డ్‌కప్-2023 టాప్ రన్ స్కోరర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే, ఫైనల్లో టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవడంతో కోహ్లి తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఈ క్రమంలో సెలవులు తీసుకున్న కోహ్లి భార్య అనుష్క, కూతురు వామికాతో కలిసి లండన్ టూర్‌కు వెళ్లాడు. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ సందర్భంగా ఈ రన్‌మెషీన్ డిసెంబరు 26న మైదానంలో దిగే అవకాశం ఉంది. చదవండి: క్రికెట్ రికార్డుల రారాజు అతడు.. ప్రతిభావంతురాలైన నటి ఆమె.. అప్పుడప్పుడు అతడూ ‘నటిస్తుంటాడు’.. అదే వారి చూపుల కలయికకు కారణమైంది.. పరిచయం స్నేహంగా.. ఆపై ప్రణయంగా మారి పరిణయానికి దారి తీసింది.. అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా పండంటి పాపాయినీ ఇచ్చింది........ Virat Kohli- Anushka Sharma Love Story: అప్పుడప్పుడు నటించేవాడు కూడా.. ‘బ్యాడ్ జోక్’తో మాట కలిపి!.. -
వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ పిచ్‌కు ఐసీసీ రేటింగ్.. ఎంతంటే?
వన్డే ప్రపంచకప్-2023 విజేతగా ఆస్ట్రేలియా నిలిచిన సంగతి తెలిసిందే. ఫైనల్ పోరులో భారత్‌ను ఓడించి ఆరోసారి విశ్వవిజేతగా ఆసీస్ నిలిచింది. ఈ మెగా టోర్నీలో వరుసగా పది మ్యాచ్‌లు గెలిచిన టీమిండియా.. ఆఖరి మొట్టుపై బోల్తా పడింది. ఇక ఇది ఇలా ఉండగా.. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తాజాగా ఫైనల్, సెమీఫైనల్ కు మ్యాచ్ లు జరిగిన పిచ్ లకు రేటింగ్ ఇచ్చింది. నవంబర్ 19న అహ్మదాబాద్ వేదికగా జరిగిన భారత్-ఆస్ట్రేలియా పిచ్ కు యావరేజ్ రేటింగ్ పాయింట్లు ఇచ్చింది. పిచ్ చాలా మందకొడిగా ఉన్నట్లు పేర్కొంది. అయితే అవుట్ ఫీల్డ్ మాత్రం ‘చాలా బాగుంది’ అని ఐసీసీ మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ వెల్లడించారు. కాగా ఫైనల్ మ్యాచ్ పిచ్‌పై టీమిండియా బ్యాటర్లు బ్యాటింగ్ చేయడానికి తీవ్ర ఇబ్బంది పడ్డారు. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 240 పరుగులకే ఆలౌటైంది. అయితే సెకెండ్ ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం ఉండడంతో ఆసీస్‌కు బ్యాటింగ్ సులభమైంది. ఇక భారత్, న్యూజిలాండ్ మధ్య ముంబైలోని వాంఖడే వేదికగా జరిగిన సెమీఫైనల్ పిచ్ కు గుడ్ రేటింగ్ దక్కింది. ఆ మ్యాచ్ కు రిఫరీగా వ్యవహరించిన జవగళ్ శ్రీనాథ్ ఈ రేటింగ్ ఇచ్చారు. అయితే రెండో సెమీఫైనల్‌కు వేదికైన ఈడెన్ గార్డెన్స్ పిచ్‌కు కూడా ఐసీసీ యావరేజ్ రేటింగ్ ఇచ్చింది. రెండో సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా జట్లు తలపడ్డాయి. లో స్కోరింగ్ థ్రిల్లర్‌లో ఆసీస్ విజయం సాధించింది. దక్షిణాఫ్రికా 212 పరుగులకు ఆలౌట్ కాగా.. ఆస్ట్రేలియా కూడా స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు 47.2 ఓవర్లు తీసుకోవాల్సి వచ్చింది. వరల్డ్ కప్ 2023లో టీమిండియా ఆడిన 11 మ్యాచ్ లలో ఐదు మ్యాచ్‌ల పిచ్ లకు ఐసీసీ యావరేజ్ రేటింగ్ వచ్చింది. చదవండి: IPL 2024-Mohammed Shami: గుజరాత్ టైటాన్స్‌కు షమీ గుడ్‌బై..? -
చెన్నైపై మిచౌంగ్ తుపాను దెబ్బ.. స్పందించిన వార్నర్! పోస్ట్ వైరల్
ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్‌కు ఐపీఎల్ ద్వారా భారత్‌తో అనుబంధం ఏర్పడింది. చాలా కాలం పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీకి ఆడిన ఈ వెటరన్ ఓపెనర్.. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్‌తో ప్రయాణం కొనసాగిస్తున్నాడు. ఎప్పటికప్పుడు భారత్ పట్ల అభిమానం చాటుకుంటూ టీమిండియా ఫ్యాన్స్‌కు కూడా చేరువయ్యాడు. తాజాగా చెన్నై వరదల గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మరోసారి ప్రత్యేకతను చాటుకున్నాడు వార్నర్. మిచౌంగ్ తుపాను ప్రభావం కారణంగా తమిళనాడు రాజధాని చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. వరద ముంచెత్తడంతో నగరంలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైపోయాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలో టీమిండియా వెటరన్ క్రికెటర్లు, చెన్నైకి చెందిన దినేశ్ కార్తిక్, రవిచంద్రన్ అశ్విన్ ప్రజలంతా ఇంటికే పరిమితమై సురక్షితంగా ఉండాలని పిలుపునిచ్చారు. అదే విధంగా.. సహాయక బృందాలు అవసరమైన వాళ్లకు తక్షణ సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. శ్రీలంక యువ పేసర్, చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ మతీశ పతిరణ సైతం ఈ క్రమంలో డేవిడ్ వార్నర్ సైతం చెన్నై వాసులకు మద్దతుగా నిలబడ్డాడు. విపత్కర పరిస్థితుల నుంచి నగరం తొందరగా బయటపడాలని ఆకాంక్షించాడు. ఈ మేరకు.. ‘‘చెన్నైలోని చాలా వరకు ప్రాంతాలను వరదలు ముంచెత్తడం ఆందోళన కలిగిస్తోంది. ఈ విపత్తు కారణంగా ఇబ్బందులు పడుతున్న వాళ్లను చూస్తుంటే బాధ కలుగుతోంది. దయచేసి ప్రతి ఒక్కరు ఇంట్లోనే సురక్షితంగా ఉండండి. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు. సహాయం చేయగలిగే స్థితిలో ఉన్నవాళ్లు అవసరమైన వాళ్లకు తప్పక సాయపడండి. ఎక్కడున్నా ఒకరికొకరం మద్దతుగా నిలవాల్సిన ఆవశ్యకత ఉంది’’అని తన అభిమానులను ఉద్దేశించి వార్నర్ పోస్ట్ చేశాడు. కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా చెన్నైలో తొలి మ్యాచ్ ఆడిన ఆస్ట్రేలియా.. అహ్మదాబాద్‌లో ఫైనల్లో గెలిచి ట్రోఫీ గెలిచిన విషయం తెలిసిందే. తొలి మ్యాచ్‌లో టీమిండియా ఆసీస్‌ను ఓడిస్తే.. తుదిపోరులో కంగారూ జట్టు రోహిత్ సేనపై గెలుపొందింది. ఈ రెండు మ్యాచ్‌లలోనూ వార్నర్ ఆడిన విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by David Warner (@davidwarner31) -
భారత్‌కు తిరిగి వచ్చిన రోహిత్ శర్మ.. వీడియో వైరల్
Rohit Sharma returns to India after vacation: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్వదేశానికి తిరిగి వచ్చాడు. భార్య రతికా సజ్దే, కుమార్తె సమైరా శర్మతో కలిసి సోమవారం ముంబైలో అడుగుపెట్టాడు. కాగా సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్-2023 ట్రోఫీ గెలవాలని రోహిత్ సేన ఆఖరి వరకు అద్భుతంగా పోరాడిన విషయం తెలిసిందే. లీగ్ దశ నుంచి సెమీస్ వరకు వరుసగా పది మ్యాచ్‌లు గెలిచిన టీమిండియా.. ఆఖరి మెట్టుపై మాత్రం బోల్తా పడింది. అహ్మదాబాద్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయి రిక్తహస్తాలతో మిగిలిపోయింది. మరోవైపు.. భారత గడ్డపై టీమిండియాను ఓడించిన కంగారూ జట్టు ఆరోసారి జగజ్జేతగా అవతరించి సంబరాలు చేసుకుంది. ఈ నేపథ్యంలో తీవ్ర నిరాశకు గురైన రోహిత్ శర్మ కంటతడి పెట్టుకున్నాడు. టీమిండియాకు వరల్డ్‌కప్ అందించిన కపిల్ దేవ్, మహేంద్ర సింగ్ ధోని సరసన నిలవాలనుకున్న కల చెదిరిపోయినందుకు కన్నీటి పర్యంతమయ్యాడు. హాలిడే ట్రిప్‌నకు లండన్ వెళ్లిన రోహిత్ శర్మ ఈ క్రమంలో నవంబరు 19 నాటి ఫైనల్ తర్వాత సెలవులు తీసుకున్నాడు రోహిత్ శర్మ. కుటుంబంతో కలిసి హాలిడే ట్రిప్‌నకు లండన్‌కు వెళ్లాడు. కొద్దిరోజుల పాటు కుటుంబంతో గడిపిన రోహిత్ సోమవారం భారత్‌కు తిరిగి వచ్చాడు. భార్య రితికాతో పాటు ముంబై ఎయిర్‌పోర్టు నుంచి రోహిత్ ఇంటికి పయనమైన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో రోహిత్ తన గారాలపట్టి సమైరా శర్మను ఎత్తుకుని నడుస్తూ.. కార్లో కూర్చోపెట్టిన దృశ్యాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో.. ‘‘కెప్టెన్ సాబ్ బెస్ట్ డాడీ’’ రోహిత్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా వరల్డ్‌కప్ తర్వాత.. స్వదేశంలో ఆస్ట్రేలియా టీ20 సిరీస్‌కు దూరంగా ఉన్న రోహిత్.. సౌతాఫ్రికాతో వన్డే, టీ20లకు కూడా అందుబాటులో ఉండటం లేదు. అతడి గైర్హాజరీలో వన్డేలకు కేఎల్ రాహుల్, టీ20లలో సూర్యకుమార్ యాదవ్ భారత జట్టును ముందుకు నడిపించనున్నారు. టెస్టు సిరీస్ నాటికి మాత్రం రోహిత్ శర్మ జట్టుతో చేరతాడు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సైతం అప్పుడే పునరాగమనం చేస్తాడు. చదవండి: IND vs SA: మిషన్ సౌతాఫ్రికా.. మరో టీ20 సిరీస్‌పై కన్నేసిన టీమిండియా View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
టీమిండియాను భారతీయుడు, పాక్‌ను పాకిస్తానీయే నడిపించాలి: గంభీర్
టీమిండియా, పాకిస్తాన్ కోచింగ్ సిబ్బందిని ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. విదేశీ కోచ్‌ల సేవల కోసం తాపత్రయ పడకుండా.. స్వదేశీ క్రికెటర్లను మార్గ నిర్దేశకులుగా నియమించుకుంటే సత్ఫలితం ఉంటుందని అభిప్రాయపడ్డాడు. ఇందుకు భారత జట్టు చక్కని ఉదాహరణ అంటూ పరోక్షంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు చురకలు అంటించాడు. కాగా గత కొన్నేళ్లుగా టీమిండియాకు భారత మాజీ క్రికెటర్లు హెడ్కోచ్లుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. చాలాకాలం వరకు రవిశాస్త్రి, అతడి తర్వాత ప్రస్తుతం రాహుల్ ద్రవిడ్ హెడ్‌కోచ్‌గా సేవలు అందిస్తున్నాడు. అయితే, పాకిస్తాన్ మాత్రం ఎక్కువగా విదేశీ కోచ్‌లనే నియమించుకుంటోంది. అయితే, వరల్డ్‌కప్-2023లో ఘోర పరాభవం తర్వాత మాత్రం పూర్తి ప్రక్షాళనకు సిద్ధమై.. మాజీ క్రికెటర్ల సేవలు వినియోగించుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో గౌతం గంభీర్ మాట్లాడుతూ.. ‘‘వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా ఆడిన విధానం చూసిన తర్వాత.. మనకు బయటి వ్యక్తులు కోచ్‌లుగా అవసరం లేదనే విషయం నిరూపితమైంది. విదేశీ కోచ్‌ల కంటే మన కోచ్‌లు ఏమాత్రం తక్కువకాదు. అయితే, మనవాళ్లకున్న ప్రధాన సమస్య ఏమిటంటే.. విదేశీ కోచ్లలా.. ప్రజెంటేషన్ ఇవ్వలేకపోవడం.. ఆ ల్యాప్‌టాప్‌లు పట్టుకుని హల్చల్ చేయడం.. అనర్గళంగా ఇంగ్లిష్ మాట్లాడలేకపోవడం వంటివన్న మాట! ఎందుకంటే మనది కార్పొరేట్ సంస్కృతి కాదు. అయితే, క్షేత్రస్థాయి నుంచే మన ఆటగాళ్లను మెరికల్లా ఎలా తీర్చిదిద్దాలో మనవాళ్లకు బాగా తెలుసు’’ అని గంభీర్ స్పోర్ట్స్‌కీడాతో వ్యాఖ్యానించాడు. ఇదే షోలో పాల్గొన్న పాక్ దిగ్గజ బౌలర్ వసీం అక్రంతో చర్చిస్తూ.. ‘‘మనవి ఇప్పుడిప్పుడే క్రికెట్ ఆడుతున్న దేశాలు కాదు. వరల్డ్‌కప్ గెలిచిన ఆటగాళ్లు మన దగ్గర ఉన్నారు. టీమిండియాను భారత కోచ్, పాకిస్తాన్ టీమ్‌ను పాకిస్తానీ ముందుకు నడిపించగలరు’’ అని గంభీర్ పేర్కొన్నాడు. కాగా 2007 టీ20, 2011 వన్డే వరల్డ్‌కప్ గెలిచిన టీమిండియాలో గంభీర్ సభ్యుడు. ఇక 2007లో భారత జట్టుకు కోచ్‌గా లాల్‌చంద్ రాజ్‌పుత్ వ్యవహరించగా.. 2011లో గ్యారీ కిర్‌స్టన్ మార్గదర్శనం చేశాడు. చదవండి: WC 2023: రోహిత్, ద్రవిడ్‌ను వివరణ అడిగిన బీసీసీఐ.. హెడ్‌కోచ్ ఆన్సర్ ఇదే?! -
వరల్డ్‌కప్ ఓటమిపై వివరణ అడిగిన బీసీసీఐ.. ద్రవిడ్ ఆన్సర్ ఇదే!?
వన్డే వరల్డ్‌కప్-2023 ఫైనల్లో టీమిండియా ఓటమి నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ భారత క్రికెట్ నియంత్రణ మండలికి వివరణ ఇచ్చినట్లు సమాచారం. ఇందులో భాగంగా ద్రవిడ్ అహ్మదాబాద్ పిచ్ తయారు చేసిన విధానం తమ విజయావకాశాలను దెబ్బతీసిందని పేర్కొన్నట్లు తెలుస్తోంది. కాగా ప్రపంచకప్ ఫైనల్లో పరాజయంతో రోహిత్ సేనతో పాటు కోట్లాది అభిమానుల హృదయాలు ముక్కలైన విషయం తెలిసిందే. లీగ్ దశలో తొమ్మిదికి తొమ్మిది గెలిచి.. సెమీస్‌లోనూ సత్తా చాటిన భారత జట్టు తుదిపోరులో మాత్రం అంచనాలు అందుకోలేకపోయింది. నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియా చేతిలో ఓడి టైటిల్‌కు అడుగుదూరంలో నిలిచిపోయింది. సొంతగడ్డపై పుష్కరకాలం తర్వాత ట్రోఫీ గెలుస్తుందని ధీమాగా ఉన్న రోహిత్ సేనకు షాకిచ్చిన ఆసీస్ ఆరోసారి జగజ్జేతగా నిలిచింది. ఈ నేపథ్యంలో ఆసీస్‌తో ఫైనల్లో టీమిండియా వైఫల్యంపై బీసీసీఐ రాహుల్ ద్రవిడ్, రోహిత శర్మను వివరణ అడిగినట్లు దైనిక్ జాగరణ్ తాజాగా కథనం వెలువరించింది. ఇందులో ఉన్న వివరాల ప్రకారం.. బీసీసీఐ సమావేశానికి రాహుల్ ద్రవిడ్ ప్రతక్ష్యంగా హాజరు కాగా.. కుటుంబంతో పాటు లండన్ పర్యటనలో ఉన్న రోహిత్ శర్మ వీడియో కాల్ ద్వారా అటెండ్ అయ్యాడు. బీసీసీఐ కార్యదర్శి జై షా, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, కోశాధికారి రాజీవ్ శేఖర్ తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో.. టీమిండియా వైఫల్యం గురించి ద్రవిడ్, రోహిత్ శర్మను వివరణ కోరారు. ఇందుకు బదులుగా.. నరేంద్ర మోదీ స్టేడియంలో తయారు చేసిన స్లో ట్రాక్ తమ అవకాశాలను దెబ్బకొట్టిందని ద్రవిడ్ సమాధానమిచ్చాడు. టీమ్ మేనేజ్మెంట్ ఊహించినట్లుగా పిచ్ నుంచి సహకారం అందలేదని.. బంతి ఎక్కువగా టర్న్ కాకపోవడం ప్రభావం చూపిందని ద్రవిడ్ తెలిపాడు. ఆస్ట్రేలియా బ్యాటర్లను స్పిన్ మాయాజాలంతో తిప్పలు పెట్టాలన్న వ్యూహాలు ఫలించలేదని ద్రవిడ్ పేర్కొన్నాడు. కాగా మోదీ స్టేడియంలో నవంబరు 19న టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ చేసింది. రోహిత్ శర్మ 47 పరుగులు, విరాట్ కోహ్లి 54, కేఎల్ రాహుల్ 66 పరుగులతో రాణించారు. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో 240 పరుగులకు టీమిండియా ఆలౌట్ అయింది. లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్‌ను ఓపెనర్ ట్రవిస్ హెడ్ 137 పరుగులతో రాణించి విజయతీరాలకు చేర్చాడు. తద్వారా కంగారూ జట్టు మరోసారి వన్డే వరల్డ్‌కప్ చాంపియన్‌గా నిలిచింది. చదవండి: Ind vs Pak: మెగా క్రికెట్ టోర్నీ షెడ్యూల్ విడుదల.. భారత్- పాక్ మ్యాచ్ ఆరోజే -
‘అలా అయితేనే షమీ టీ20 ప్రపంచకప్ ఆడతాడు.. లేదంటే!’
అనూహ్య రీతిలో వన్డే వరల్డ్‌కప్-2023 ఆడే అవకాశం దక్కించుకున్న టీమిండియా వెటరన్ స్పీడ్‌స్టర్ మహ్మద్ షమీ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చినా అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచి సత్తా చాటాడు. పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం కారణంగా మూడో ఆప్షన్‌గా తుది జట్టులో చోటు సంపాదించిన ఈ రైటార్మ్ పేసర్.. 7 మ్యాచ్‌లలో కలిపి 24 వికెట్లు తీశాడు. ఈ క్రమంలో వన్డే ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గానూ షమీ రికార్డు సృష్టించాడు. సొంతగడ్డపై ఐసీసీ టోర్నీలో ఇలా సత్తా చాటిన షమీ ప్రస్తుతం చీలమండ నొప్పితో బాధపడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే అతడిని సౌతాఫ్రికా పర్యటనలో పరిమిత ఓవర్ల సిరీస్‌కు ఎంపిక చేయనట్లు తెలుస్తోంది. అదే విధంగా టెస్టు జట్టులోనూ షమీ అందుబాటులో ఉంటాడో లేదోనన్న విషయంలో సందిగ్దత ఉంది. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి స్వయంగా ప్రకటించింది. షమీ ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నాడని.. పూర్తి ఫిట్నెస్ సాధిస్తేనే మళ్లీ మైదానంలో దిగే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో షమీ అంతర్జాతీయ టీ20 భవితవ్యం గురించి ఆసక్తికర కథనాలు వెలువడుతున్నాయి. ‘‘వచ్చే ఏడాది జరుగనున్న టీ20 ప్రపంచకప్‌లో షమీ ఆడతాడా లేదా అన్నది.. అతడి ఐపీఎల్ ప్రదర్శనపైనే ఆధారపడి ఉంటుంది. గుజరాత్ టైటాన్స్ తరఫున అతడు గత రెండు సీజన్లలో అద్భుతంగా ఆడుతున్నాడు. మరి రానున్న ఎడిషన్‌లో షమీ ఎలా ఆడతాడో చూడాలి’’ అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నట్లు జాతీయ మీడియా వెల్లడించింది. ‘‘మ్యాచ్ సమయంలో అతడికి గాయం కాలేదు. అయితే, మడిమ నొప్పి రాను రాను తీవ్రమైంది. ముంబైలో షమీ పలువురు డాక్టర్లను సంప్రదించాడు. తదుపరి జాతీయ క్రికెట్ అకాడమీలో అతడు పునరావాసం పొందనున్నాడు’’ సదరు వర్గాలు తెలిపినట్లు సమాచారం. ఇక బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం గాయమైతే అంత తీవ్రంగా లేదు. తన తమ్ముడు మహ్మద్ కైఫ్ విజయ్ హజారే ట్రోఫీ టోర్నీలో ఆడుతున్న మ్యాచ్‌ను చూడటానికి కూడా షమీ వచ్చాడు. అపుడు కాలు కాస్త ఉబ్బినట్లు కనిపించింది’’ అని పేర్కొన్నట్లు జాతీయ మీడియా తెలిపింది. కాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన షమీ దేశవాళీ క్రికెట్లో బెంగాల్‌కు ప్రాతినిథ్యం వహిస్తాడన్న విషయం తెలిసిందే. చదవండి: ‘సెలక్టర్లు అతడిని మర్చిపోవద్దు.. సౌతాఫ్రికా టూర్‌కు పంపాల్సింది’ -
ఆరోజు రోహిత్, కోహ్లి ఏడుస్తూనే ఉన్నారు.. మేమంతా
వన్డే ప్రపంచకప్-2023 ఫైనల్లో ఓటమి తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిల పరిస్థితి చూడలేకపోయామని టీమిండియా వెటరన్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. ఆస్ట్రేలియా చేతిలో ఓటమి తర్వాత వాళ్లిద్దరూ ఏడుస్తూనే ఉన్నారని నవంబరు 19 నాటి చేదు జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు. కాగా సొంతగడ్డపై పుష్కరకాలం తర్వాత వరల్డ్ కప్ టైటిల్ ముంగిట నిలిచిన భారత జట్టుకు ఆసీస్ షాకిచ్చిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో లక్షకు పైగా టీమిండియా అభిమానుల నడుమ ఆరోసారి చాంపియన్‌గా అవతరించింది. దీంతో కప్ గెలవాలనుకున్న రోహిత్ సేన ఆశలకు గండిపడింది. ఇక 36 ఏళ్ల రోహిత్ శర్మ, 35 ఏళ్ల విరాట్ కోహ్లికి ఇదే ఆఖరి వన్డే ప్రపంచకప్ కానుందన్న తరుణంలో వారిద్దరు కంటతడి పెట్టిన తీరు అభిమానుల మనసులను మెలిపెట్టింది. చేతుల్లో ముఖం దాచుకుంటూ కన్నీళ్లను ఆపుకొంటూ ఇద్దరూ మైదానం వీడటం ఉద్వేగానికి గురిచేసింది. నాటి సంఘటన గురించి తాజా ఇంటర్వ్యూలో ప్రస్తావించిన అశ్విన్.. "ఆరోజు మేమంతా చాలా బాధపడ్డాం. ముఖ్యంగా రోహిత్, కోహ్లి ఏడుస్తూనే ఉన్నారు. వాళ్లిద్దరిని అలా చూసి మాకు మరింత బాధ కలిగింది. అసలు అలా జరగకుండా ఉండాల్సింది. ఎంతో అనుభవం, నైపుణ్యం ఉన్న జట్టు. కచ్చితంగా గెలుస్తుందనే అనుకున్నాం. జట్టులోని ప్రతి ఒక్కరు తమ పాత్రలను చక్కగా పోషించారు. కానీ చేదు అనుభవం ఎదురైంది. సహజంగానే నాయకత్వ లక్షణాలు పుణికిపుచ్చుకున్న ఇద్దరు లీడర్లు ఆటగాళ్లకు కావాల్సినంత స్వేచ్ఛ ఇచ్చి వాళ్లు మరింత మెరుగుపడేలా చేశారు" అని రోహిత్, కోహ్లిల వ్యక్తిత్వాలను ప్రశంసించాడు. ఇక రోహిత్ శర్మ గొప్ప కెప్టెన్ అన్న అశూ.. జట్టులోని ప్రతి ఆటగాడి ఇష్టాలు, అయిష్టాలు అతడికి తెలుసని పేర్కొన్నాడు. అందరి నైపుణ్యాల గురించి అతడికి అవగాహన ఉందని.. ఎవరి సేవలను ఎలా ఉపయోగించుకోవాలో రోహిత్‌కు బాగా తెలుసని కొనియాడాడు. అయితే, కొన్నిసార్లు ఇలాంటి చేదు అనుభవాలు ఎదుర్కోక తప్పదంటూ ప్రపంచకప్ ఓటమిని ఉదాహరించాడు. కాగా అక్షర్ పటేల్ గాయం కారణంగా దూరం కావడంతో అశ్విన్ ఆఖరి నిమిషంలో వరల్డ్ కప్ జట్టులో చోటు సంపాదించాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియాతో అక్టోబరు 8 నాటి చెన్నై మ్యాచ్‌లో మాత్రమే ఆడే అవకాశం ఈ స్పిన్నర్‌కు దక్కింది. -
ఇక చాలు.. టీమిండియా తప్పులు తెలుసుకోవాలి.. 2007 తర్వాత..
గత దశాబ్దకాలంగా టీమిండియా ఐసీసీ టోర్నీల్లో నిలకడైన ప్రదర్శన కొనసాగిస్తున్నా ఒక్క ట్రోఫీ కూడా గెలవలేకపోయింది. ప్రపంచకప్-2015లో లీగ్ దశలో అజేయంగా నిలిచిన భారత జట్టు.. సెమీఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయి ఇంటిబాట పట్టింది. ఇక 2019లో లీగ్ దశలో ఒకే మ్యాచ్ ఓడిపోయి సెమీస్ చేరిన టీమిండియాకు అక్కడ.. న్యూజిలాండ్ చేతిలో పరాభవం తప్పలేదు. అయితే, ఈసారి సొంతగడ్డపై పొరపాట్లకు తావివ్వకుండా కచ్చితంగా మరోసారి వన్డే వరల్డ్ కప్ ట్రోఫీని ముద్దాడుతుందని అంతా భావించారు. అందుకు తగ్గట్లే రోహిత్ సేన ఫైనల్ వరకు అజేయంగా దూసుకువచ్చింది. టైటిల్‌కు అడుగుదూరంలో నిలిచిన భారత జట్టు గెలుపు లాంఛనమే అని అభిమానులు సంబరపడుతున్న వేళ.. ఫైనల్లో ఆస్ట్రేలియా గట్టి షాకిచ్చింది. దీంతో మరోసారి టీమిండియాకు భంగపాటు తప్పలేదు. ఈ క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి కన్నీటి పర్యంతం కాగా ప్రధాని నరేంద్ర మోదీ సహా దేశమంతా భారత జట్టుకు అండగా నిలిచారు. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌లోనైనా సత్తా చాటాలని కోరుకుంటున్నారు. ఈ పరిణామాలపై టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ తనదైన శైలిలో స్పందించాడు. తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకోకపోతే మరోసారి చేదు అనుభవం ఎదుర్కోక తప్పదని హెచ్చరించాడు. జట్టుకు అండగా నిలవడం మంచిదే అని.. అయితే, ప్రతిసారి ఏదో ఒక కారణం చూపి క్షమించేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు. టీమిండియా 2007 తర్వాత ఇప్పటి వరకు ఒక్క టీ20 ప్రపంచకప్ కూడా గెలవకలేకపోవడాన్ని ప్రస్తావించిన గావస్కర్... "టీమిండియా వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఓడిపోవడం తీవ్ర నిరాశకు గురిచేసిందనడంలో సందేహం లేదు. అయితే, ఇప్పుడది గతం. ఆ ఓటమి బాధ నుంచి త్వరగా తేరుకోవాలి. గత నాలుగు వరల్డ్ కప్ ఈవెంట్లలో రెండుసార్లు ఫైనల్ వరకు రాగలిగినా ఆఖరి మెట్టుపై బోల్తా పడింది టీమిండియా. మిగతా జట్లతో పోలిస్తే ఈసారి మరింత గొప్పగా రాణించినా ఫలితం లేకుండా పోయింది. అయితే.. ఇప్పటికైనా టీమిండియా తమ తప్పులను తెలుసుకుని విశ్లేషించుకోవాలి. ట్రోఫీ ఎందుకు గెలవలేకపోయారో ఆలోచించుకోవాలి. పొరపాట్లను అంగీకరించే గుణం అలవరచుకోవాలి. అప్పుడే పురోగతి కనిపిస్తుంది. రానున్న వారం రోజుల్లో సెలక్షన్ కమిటీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. 2007 తర్వాత మనం టీ20 ప్రపంచకప్ గెలవనేలేదు. ఐపీఎల్ రూపంలో ఇంత మంది యువ, ప్రతిభావంతులైన ఆటగాళ్లు వెలుగులోకి వస్తున్నా ఇలా జరగడం విచారకరం" అని మిడ్ డేకు రాసిన కాలమ్‌లో పేర్కొన్నాడు. అంతర్జాతీయ టీ20లకు దూరంగా ఉండాలని భావిస్తున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వంటి స్టార్ల నిర్ణయాలు గౌరవించి.. వరల్డ్ కప్-2024 నాటికి యువ జట్టును సన్నద్ధం చేయాలని పరోక్షంగా సూచించాడు గావస్కర్. కాగా వచ్చే ఏడాది జూన్ 4 నుంచి టీ20 ప్రపంచకప్ టోర్నీ ఆరంభం కానుంది. చదవండి: అదే అతడి బలం.. టీమిండియా కెప్టెన్ కాగలడు: అంబటి రాయుడు -
ఇంతకంటే చెత్త ప్రదర్శన మరోటి ఉండదు.. స్పిన్ దిగ్గజం విమర్శలు
శ్రీలంక క్రికెట్ భవితవ్యంపై దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. క్రికెటర్లుగా కెరీర్ ఎంచుకునే వాళ్లను భయపెట్టే విధంగా ప్రస్తుత పరిణామాలు ఉన్నాయని వాపోయాడు. శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింగే ఈ విషయంలో చొరవ తీసుకొని లంక క్రికెట్ బోర్డును ప్రక్షాళన చేయాలని విజ్ఞప్తి చేశాడు. భారత్ వేదికగా వన్డే ప్రపంచ కప్- 2023లో శ్రీలంక దారుణంగా వైఫల్యం చెందిన విషయం తెలిసిందే. వరుస పరాజయాలతో డీలాపడ్డ లంక పాయింట్ల పట్టికలో అట్టడుగు నుంచి రెండో స్థానంలో నిలిచింది. 1975, 1983, 1987, 1992 ఎడిషన్ల తర్వాత మరోసారి ఇలాంటి ఘోర పరాభవం మూటగట్టుకుంది స్వర్ణ యుగం కాగా... 1996లో ప్రపంచకప్ గెలిచిన శ్రీలంక 2007, 2011లో రన్నరప్‌గా నిలిచింది 2003లో సెమి ఫైనల్ వరకు చేరింది. అలాంటి జట్టు ఈసారి పూర్తిగా విఫలం కావడం తనను బాధించిందని మురళీధరన్ ఆవేదన వ్యక్తం చేశాడు. వరల్డ్ కప్ చరిత్రలో 1975 తర్వాత శ్రీలంకకు ఇదే అత్యంత చెత్త ఎడిషన్ అని విమర్శలు గుప్పించాడు. నిబద్ధత, అంకితభావం లోపించినందువల్లే ఇలాంటి చేదు అనుభవం ఎదురైందని ముత్తయ్య మురళీధరన్ పేర్కొన్నాడు. వ్యక్తిగత అజెండాలను ఆటలపై రుద్దాలనుకోవడం సరికాదని బోర్డు సభ్యులను విమర్శించాడు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం క్రికెట్‌ను తాకట్టు పెట్టొద్దని చురకలు అంటించాడు. వాళ్ల పరిస్థితి ఏం కావాలి? ఇలాంటి పరిణామాల వల్ల యువ ఆటగాళ్ల భవిష్యత్తు ఆగమ్య గోచరంగా తయారవుతుందని పేర్కొన్నాడు. దేశం కోసం క్రికెట్ ఆడాలనుకునే వాళ్లను చిన్నబుచ్చుకునేలా చేయొద్దని ముత్తయ్య మురళీధరన్ విజ్ఞప్తి చేశాడు కాగా వనిందు హసరంగ వంటి స్టార్ ఆల్ రౌండర్ ఫిట్‌గా ఉన్నప్పటికీ అతడిని పక్కన పెట్టారని లంక సెలక్షన్ బోర్డుపై విమర్శలు వచ్చాయి. అదే విధంగా.. క్రికెట్ బోర్డులో అవినీతిని నిర్మూలించే క్రమంలో తాను పాత కమిటీని రద్దు చేస్తున్నట్లు ఆదేశ క్రీడామంత్రి రోషన్ రణసింగి గతంలో ప్రకటించారు. లంక బోర్డుపై నిషేధం అయితే బోర్డు సభ్యులు కోర్టుకు వెళ్లగా అక్కడ వారికి సానుకూలంగా తీర్పు వచ్చింది. అయితే అంతర్జాతీయ క్రికెట్ మండలి మాత్రం ఈ విషయాలపై తీవ్రంగా స్పందించింది. లంక క్రికెట్ బోర్డులో ప్రభుత్వ జోక్యాన్ని నిరసిస్తూ నిషేధం విధించింది ఈ పరిణామాల నేపథ్యంలో లెజెండరీ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ న్యూస్ 18తో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. -
ఆ్రస్టేలియా : స్వదేశంలో వరల్డ్ కప్ గెలుపు సంబరాలు (ఫొటోలు)
-
ద్రవిడ్ గురించి రోహిత్ అలా చెప్పడం సరికాదు: గంభీర్
ICC ODI WC 2023- Gambhir Comments On Rohit Sharma: వన్డే వరల్డ్‌కప్-2023 ఫైనల్‌కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వ్యాఖ్యలను మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ తప్పుబట్టాడు. రాహుల్ ద్రవిడ్‌ను ఉద్దేశించి రోహిత్ అలా కామెంట్ చేయడం సరికాదని పేర్కొన్నాడు. ఆటగాళ్లు దేశం కోసం మాత్రమే ఆడాలని.. వ్యక్తుల కోసం కాదంటూ ఘాటు విమర్శలు చేశాడు. కాగా సొంతగడ్డపై పుష్కరకాలం తర్వాత ప్రపంచకప్ ఫైనల్‌కు చేరిన భారత జట్టు ట్రోఫీ గెలుస్తుందన్న ఆశలపై ఆస్ట్రేలియా నీళ్లు చల్లిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో రోహిత్ సేనను ఓడించి ఆరోసారి విశ్వవిజేతగా చరిత్రపుటల్లోకెక్కింది. ద్రవిడ్ కోసమన్న రోహిత్ అయితే, ఈ మ్యాచ్ ఆరంభానికి ముందు రోహిత్ శర్మ మాట్లాడుతూ.. హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ కోసం తాము కప్ గెలవాలని భావిస్తున్నట్లు తెలిపాడు. వరల్డ్‌కప్-2003లో ద్రవిడ్ ఆటగాడిగా ఉన్నపుడు ఆసీస్ చేతిలో భారత్ ఓడగా.. 20 ఏళ్ల తర్వాత అతడి మార్గదర్శనంలో తాము ప్రతీకారం తీర్చుకుంటామన్న ఉద్దేశంలో ఈ వ్యాఖ్యలు చేశాడు. ఈ నేపథ్యంలో తాజాగా స్పోర్ట్స్‌కీడా ఇంటర్వ్యూలో గౌతం గంభీర్ ఈ విషయంపై స్పందించాడు. దేశం కోసం ఆడాలే తప్ప.. వ్యక్తుల కోసం గెలుస్తామంటూ చెప్పడం సరికాదంటూ రోహిత్ వ్యాఖ్యలను విమర్శించాడు. తాను 2011 వరల్డ్‌కప్ సమయంలో కూడా ఇదే మాట సహచర ఆటగాళ్లతో చెప్పానని పేర్కొన్నాడు. సచిన్ కోసం నాడు ట్రోఫీ గెలిచామంటూ కాగా మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలోని టీమిండియా వరల్డ్‌కప్- 2011 చేరినపుడు.. సచిన్ టెండుల్కర్ కోసం తాము ట్రోఫీ గెలుస్తామంటూ కొంతమంది ఆటగాళ్లు చెప్పిన విషయం తెలిసిందే. అన్నట్లుగానే సచిన్ సొంతమైదానం వాంఖడేలో శ్రీలంకను ఓడించి విజయాన్ని అతడికి బహుమతిగా అందించారు. ఈ రెండు సందర్భాల్లో ఆటగాళ్లు చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ గంభీర్.. ‘‘అసలు క్రికెటర్లు ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడతారో నాకు ఇంతవరకూ అర్థం కాలేదు. ఒక వ్యక్తి కోసం తాము గెలవాలని కోరుకుంటున్నట్లు చెప్పడం సరికాదు. ఇలా ఎందుకు మాట్లాడతారో అర్థం కాదు దేశం కోసం మనం టైటిల్ గెలవాలి అనుకోవాలి. ఒకవేళ మీరు ఓ వ్యక్తి కోసం ఇలా చేయాలని భావిస్తే అలాంటివి మీడియా ముందు చెప్పడం ఎందుకు? 2011లో చాలా మంది నాతో.. ‘‘మనం వ్యక్తి కోసం గెలవాలి’’అని చెప్పారు. కానీ నేను మాత్రం బ్యాట్ చేతబట్టి నా దేశం కోసం గెలుస్తానని వాళ్లందరికీ చెప్పాను’’ అని గంభీర్ పేర్కొన్నాడు. కాగా గౌతం గంభీర్ ఐపీఎల్‌తో బిజీ కానున్నాడు. క్యాష్ రిచ్ లీగ్ 2024 సీజన్ సందర్భంగా లక్నో సూపర్ జెయింట్స్ నుంచి కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు మారిన గౌతీ.. ఆజట్టుకు మెంటార్‌గా వ్యవహరించనున్నాడు. చదవండి: మనుషులు దూరంగా ఉన్నా.. విరాట్ కోహ్లి తోబుట్టువు, వ్యాపారవేత్త భార్య! -
క్రికెట్ బోర్డులో అవినీతి? నన్ను చంపేస్తారంటూ సంచలన ఆరోపణలు
శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రక్షాళన కోసం తపించి తాను ప్రాణం మీదకు తెచ్చుకున్నానంటూ ఆ దేశ ‘క్రీడా మంత్రి’ రోషన్ రణసింఘే సంచలన వ్యాఖ్యలు చేశారు. బోర్డులో అవినీతి నిర్మూలిద్దామని భావిస్తే తనను చంపేందుకు కుట్రలు పన్నుతున్నారంటూ అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేపై సంచలన ఆరోపణలు చేశారు. కాగా భారత్ వేదికగా వన్డే వరల్డ్‌కప్-2023లో శ్రీలంక జట్టు దారుణ వైఫల్యం మూటగట్టుకున్న విషయం తెలిసిందే. ఆడిన తొమ్మిది మ్యాచ్‌లలో కేవలం రెండు మాత్రమే గెలిచి టోర్నీ నుంచి నిష్క్రమించింది. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచి విమర్శలు మూటగట్టుకుంది. వరల్డ్‌కప్‌లో పరాభవం ఈ నేపథ్యంలో ప్రపంచకప్ జట్టు ఎంపిక, అనుసరించిన వ్యూహాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన క్రీడా మంత్రి రోషన్ రణసింఘే బోర్డు సభ్యులందరినీ సస్పెండ్ చేశారు. మాజీ కెప్టెన్ అర్జున్ రణతుంగ నేతృత్వంలో తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో బోర్డు సభ్యులు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టిన కోర్టు లంక క్రికెట్ బోర్డును పునురద్ధరించింది. అయితే, ఈ పరిణామాలను తీవ్రంగా పరిగణించిన అంతర్జాతీయ క్రికెట్ మండలి కఠిన నిర్ణయం తీసుకుంది. లంక బోర్డుకు షాకిచ్చిన ఐసీసీ క్రికెట్ బోర్డు వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యాన్ని నిరసిస్తూ లంక బోర్డు సభ్యత్వాన్ని రద్దు చేసింది. ఈ క్రమంలో తాజాగా రోషన్ రణసింఘే సంచలన ఆరోపణలతో ముందుకు వచ్చారు. క్రికెట్ బోర్డులో జోక్యం వల్లే తనను మంత్రివర్గం నుంచి తొలగించారంటూ ఆయన ఆరోపించారు. నడిరోడ్డు మీద హత్య చేసే అవకాశం! ఈ మేరకు.. ‘‘క్రికెట్ బోర్డులో అవినీతిని నిర్మూలించాలనుకున్నందుకు నన్ను చంపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. రోడ్డు మీదే నన్ను హత్య చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒకవేళ నాకు ఏదైనా ప్రమాదం జరిగితే అందుకు అధ్యక్షుడు, అతడి చీఫ్ స్టాఫ్ మాత్రమే బాధ్యులు’’ అని రోషన్ రణసింఘే వ్యాఖ్యానించారు. భారీ ఆదాయానికి గండి! కాగా మంత్రి వర్గం నుంచి రోషన్ సస్పెన్షన్‌పై అధ్యక్షుడి కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన వచ్చింది. అయితే, ఆయన ఆరోపణలపై మాత్రం ఇంతవరకు ఎవరూ స్పందించలేదు. కాగా ద్వీపదేశంలో ధనిక క్రీడా సంస్థగా లంక క్రికెట్ బోర్డు కొనసాగుతోంది. క్రికెట్ ద్వారా దేశానికి పెద్ద ఎత్తున ఆదాయం లభిస్తోంది. గతంలో వరల్డ్‌కప్ గెలిచిన ఘనతతో పాటు పటిష్ట జట్టుగానూ ఆ టీమ్‌కు పేరుంది. అయితే, గత కొంతకాలంగా ఘోర పరాభవాలతో ప్రతిష్టను మసకబార్చుకుంటోంది శ్రీలంక జట్టు. ఇలాంటి పరిస్థితుల్లో ఐసీసీ సస్పెన్షన్ మరింత దెబ్బ కొట్టగా.. అధ్యక్షుడు విక్రమసింఘే నిషేధానికి గల కారణాల అన్వేషణకై విచారణ కమిటీ వేసినట్లు తెలుస్తోంది. చదవండి: Virat Kohli: తమ్ముడంటే ప్రేమ! మనుషులు దూరంగా ఉన్నా.. కోహ్లి తోబుట్టువు భావనా గురించి తెలుసా? -
రీఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ.. అభిమానులు ఖుషీ
ICC WC 2023- Rohit Sharma: అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చాలాకాలం తర్వాత సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చాడు. వన్డే వరల్డ్‌కప్-2023 ఓటమి తర్వాత తొలిసారి ఇన్‌స్టా వేదికగా అందమైన ఫొటోను పంచుకున్నాడు. కాగా.. ఆసియా వన్డే కప్-2023 గెలిచిన టీమిండియా సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్ కూడా గెలిచి సత్తా చాటుతుందని అభిమానులు భావించారు. సమిష్టి ప్రదర్శనతో సెమీస్‌కు అందుకు తగ్గట్లుగానే లీగ్ దశలో భారత జట్టు ఎదురులేని విజయాలతో సెమీస్‌కు దూసుకెళ్లింది. టాపార్డర్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ, మరో ఓపెనర్ శుబ్‌మన్ గిల్, వన్‌డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి.. మిడిలార్డర్లో శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ అద్భుతంగా రాణించారు. అదే విధంగా బౌలింగ్ విభాగంలో.. పేస్ త్రయం జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ అదరగొట్టడంతో ఈ విజయాలు సాధ్యమయ్యాయి. ఇక న్యూజిలాండ్‌తో సెమీ ఫైనల్లోనూ సమిష్టి కృషితో గెలుపొందిన టీమిండియా.. ఫైనల్లో ఆస్ట్రేలియాతో పోటీపడింది. ఆఖరి మెట్టుపై బోల్తా అయితే, అసలు పోరులో ఒత్తిడిని జయించలేక ఓటమిపాలైంది. అహ్మదాబాద్ మైదానంలో లక్ష పైచిలుకు అభిమానుల మధ్య భారీ అంచనాలతో బరిలోకి దిగిన భారత జట్టు ఓటమిపాలై టైటిల్‌కు అడుగుదూరంలో నిలిచిపోయింది. దీంతో జట్టుతో పాటు టీమిండియా అభిమానుల హృదయాలు ముక్కలైపోయాయి. కన్నీళ్లను దిగమింగి కెప్టెన్ రోహిత్ శర్మ సహా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సైతం కన్నీళ్లతో మైదానాన్ని వీడాడు. ఇక తనకు అనధికారికంగా ఇదే ఆఖరి వన్డే వరల్డ్‌కప్ కావడం.. ఇక్కడిదాకా వచ్చి కూడా ట్రోఫీ చేజారడంతో 36 ఏళ్ల రోహిత్ మరింత కుంగిపోయాడు. చేతులతో ముఖం దాచుకుంటూ కన్నీళ్లను ఆపుకొనే ప్రయత్నం చేశాడు. ఈ దృశ్యాలు చూసి రోహిత్ ఫ్యాన్స్ భావోద్వేగానికి లోనయ్యారు. ‘‘మరేం పర్లేదు హిట్‌మ్యాన్.. ఆటలో గెలుపోటములు సహజం’’ అంటూ సోషల్ మీడియా వేదికగా తమ అభిమాన ఆటగాడికి అండగా నిలిచారు. అప్పటి నుంచి రోహిత్ ఎప్పుడెప్పుడు స్పందిస్తాడా అని ఆశగా ఎదురుచూశారు. సెలవుల్లో రోహిత్ శర్మ ఈ క్రమంలో భార్య రితికా సజ్దేతో ఉన్న ఫొటోను హిట్‌మ్యాన్ ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేశాడు. ప్రస్తుతం హాలిడే మూడ్‌లో ఉన్న రోహిత్.. చెట్ల మధ్య ఉన్న మట్టిబాటలో భార్యతో కలిసి నడుస్తూ ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ నడుస్తూ ఉన్న ఈ ఫొటో వైరల్‌గా మారింది. కాగా వరల్డ్‌కప్ తర్వాత రోహిత్ సహా మిగతా సీనియర్లు విశ్రాంతి తీసుకుంటుండగా.. యువ జట్టు సూర్యకుమార్ సారథ్యంలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ఆడుతోంది. ఇప్పటి వరకు జరిగిన రెండు మ్యాచ్‌లలో రెండూ గెలిచి 2-0తో ఆధిక్యంలో ఉంది. తదుపరి మంగళవారం మూడో టీ20 ఆడనుంది సూర్యసేన. చదవండి: Ind vs Aus: యశస్వి సరికొత్త చరిత్ర.. రోహిత్ రికార్డు బద్దలు! తొలి భారత బ్యాటర్‌గా.. A beautiful Instagram story by Rohit Sharma. pic.twitter.com/HPVjT6ihMm — Johns. (@CricCrazyJohns) November 26, 2023 -
కుర్చీ ఎత్తి కిందపడేయగలను.. కానీ!.. అందుకే యూపీకి ఆడలేదు: షమీ
Mohammed Shami Comments: టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ సొంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్. అమ్రోహా జిల్లాలోని సహాస్పూరాలో జన్మించాడు. కానీ దేశవాళీ క్రికెట్లో మాత్రం యూపీకి ఎప్పుడూ ఆడలేదు షమీ. తన ప్రతిభను గుర్తించి అవకాశం ఇచ్చిన బెంగాల్ జట్టుకే సేవలు అందించాడు. ఒక్కో మెట్టు ఎక్కుతూ టీమిండియాకు ఆడే స్థాయికి చేరుకున్న షమీ.. ప్రస్తుతం భారత పేస్ త్రయంలో ముఖ్య సభ్యుడు. అంతేకాదు వన్డే వరల్డ్‌కప్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గానూ ఈ రైటార్మ్ పేసర్ రికార్డులు సాధించాడు. లేట్‌గా ఎంట్రీ ఇచ్చినా అవార్డుతో ముగించి భారత్ వేదికగా ప్రపంచకప్-2023 సందర్భంగా ఆరంభంలో ఆడలేకపోయినా.. తర్వాత వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుని ఏకంగా అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా నిలిచాడు. టోర్నీ మొత్తంలో 24 వికెట్లు తీసి అవార్డు అందుకున్నాడు. అంతాబాగానే ఉందని.. ఆఖర్లో ఇన్ని ఘనతలు సాధిస్తున్న షమీ సొంత రాష్ట్రం తరఫున ఒక్కసారి కూడా ఆడలేకపోయాడు. ఇందుకు గల కారణాన్ని తాజాగా ప్యూమా షోలో వెల్లడించాడు షమీ. ‘‘రంజీ టీమ్ ట్రయల్స్ కోసం రెండుసార్లు వెళ్లాను. అంతబాగానే ఉందని చెప్పి ఆఖర్లో నాకు మొండిచేయి చూపేవారు. మొదటి ఏడాదే చేదు అనుభవం ఎదురైనా.. నాలో ఆశావహ దృక్పథం కారణంగా మరోసారి ప్రయత్నించాం. కానీ మరుసటి ఏడాది కూడా అదే జరిగింది. ఆ సమయంలో నా సోదరుడు నాతోనే ఉన్నాడు. అపుడు చీఫ్‌గా ఉన్న వ్యక్తి దగ్గరకు వెళ్లి నా గురించి మాట్లాడాడు. కుర్చీ కదపడం కాదు.. ఎత్తి కిందపడేస్తా.. కానీ అందుకు బదులుగా అతడు ఇచ్చిన సమాధానం నా సోదరుడు జీవితంలో అంతకుముందెన్నడూ వినలేదు. అంత పరుషంగా మాట్లాడాడతను!! ‘‘నువ్వు నా కుర్చీని కదపగలిగితే.. మీ సోదరుడు సెలక్ట్ అయినట్లే.. అతడి కెరీర్ బాగుంటుంది. లేదంటే సారీ.. నేనేమీ చేయలేను!’’ అని నా సోదరుడితో అన్నాడు. ఇందుకు బదులుగా.. ‘‘నేను కేవలం ఈ కుర్చీని కదపడం కాదు.. ఎత్తి కిందపడేయగల బలవంతుడిని. నా తమ్ముడికి టాలెంట్ ఉంటే సెలక్ట్ చేయండి. లేదంటే వదిలేయండి’’ అని గట్టిగానే సమాధానమిచ్చాడు. అప్పుడు ఆ వ్యక్తి.. ‘‘ఇక్కడ బలవంతులకు.. బలంగా ఉండేవాళ్లకు చోటు లేదు’’అని ముఖం మీదే చెప్పాడు. దీంతో బయటకొచ్చిన నా సోదరుడు.. నా ఫామ్‌ను చించేసి ఇకపై నువ్వు యూపీకి ఆడే ప్రసక్తే లేదని చెప్పాడు’’ అంటూ గతం తాలుకు చేదు జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు 33 ఏళ్ల మహ్మద్ షమీ. చదవండి: సచిన్, కోహ్లి కాదు! అత్యంత ఖరీదైన భవనంలో నివసిస్తున్న భారత క్రికెటర్? -
IPL 2024: గంభీర్ గుడ్‌బై.. లక్నో మెంటార్‌గా రాహుల్ ద్రవిడ్?
టీమిండియా హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ కొనసాగుతాడా లేదా అన్న అంశంపై ఇంకా సస్పెన్స్ వీడలేదు. వన్డే వరల్డ్‌కప్-2023 ముగిసిన తర్వాత అతడి భవితవ్యంపై ఓ స్పష్టత వస్తుందనుకుంటే బీసీసీఐ నుంచి ఇందుకు సంబంధించి ఎటువంటి ప్రకటనా రాలేదు. కాగా టీ20 వరల్డ్‌కప్-2021 తర్వాత రవిశాస్త్రి టీమిండియా హెడ్‌కోచ్‌గా వైదొలగగా.. ‘ది వాల్’ రాహుల్ ద్రవిడ్ ఆ బాధ్యతలు చేపట్టాడు. నాటి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జై షా ద్రవిడ్‌ను ఒప్పించి మరీ ఈ పదవిని కట్టబెట్టారు. ఈ క్రమంలో రాహుల్ మార్గదర్శనం, రోహిత్ శర్మ కెప్టెన్సీలో ద్వైపాక్షిక సిరీస్‌లలో అద్భుత విజయాలు సాధించిన టీమిండియా ఐసీసీ టోర్నీల్లో మాత్రం చేతులెత్తేసింది. టీ20 వరల్డ్‌కప్-2022లో సెమీస్‌లోనే నిష్క్రమించిన భారత జట్టు.. సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్-2023లో ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. ఇక ఈ ఐసీసీ ఈవెంట్ తర్వాత రాహుల్ ద్రవిడ్ పదవీకాలం అధికారికంగా ముగింపు దశకు వచ్చింది. ఈ నేపథ్యంలో ద్రవిడ్ హెడ్‌కోచ్ బాధ్యతల నుంచి తప్పుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, బీసీసీఐ మాత్రం అతడి సేవలను మరోమారు వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అతడు గనుక సుముఖంగా లేకపోతే వీవీఎస్ లక్ష్మణ్ హెడ్‌కోచ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర వార్త తెరమీదకు వచ్చింది. రాహుల్ ద్రవిడ్‌ను తమ మెంటార్‌గా నియమించుకునేందుకు ఐపీఎల్ ఫ్రాంఛైజీ లక్నో సూపర్ జెయింట్స్ ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. దైనిక్ జాగరణ్ కథనం ప్రకారం.. మెంటార్‌గా గౌతం గంభీర్ స్థానంలో ద్రవిడ్ అయితే బాగుంటుందని ఎల్ఎస్జీ యాజమాన్యం ఆలోచిస్తోందట. కాగా లక్నో మెంటార్‌గా సేవలు అందించిన మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ తిరిగి కోల్‌కతా నైట్‌రైడర్స్ గూటికి చేరుకున్నాడు. ఇక ఐపీఎల్-2024 వేలానికి ముందు ఆవేశ్ ఖాన్ వదులుకున్న లక్నో ఫ్రాంఛైజీ రాజస్తాన్ రాయల్స్‌తో డైరెక్ట్ స్వాప్ ద్వారా దేవ్‌దత్ పడిక్కల్‌ను దక్కించుకుంది. కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ హెడ్‌కోచ్ జస్టిన్ లాంగర్‌ను నియమించుకుంది. -
కోహ్లిలా ఉంటే రోహిత్ మరో వరల్డ్‌కప్ ఆడతాడు: లంక స్పిన్ దిగ్గజం
Rohit Sharma- T20I Future: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో వరల్డ్‌కప్ ఆడే సత్తా ఉన్నవాడేనని శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ అన్నాడు. విరాట్ కోహ్లి మాదిరి ఫిట్నెస్ కాపాడుకుంటే కచ్చితంగా టీ20 ప్రపంచకప్-2024లో అతడు ఆడతాడని అభిప్రాయపడ్డాడు. కాగా వన్డే వరల్డ్‌కప్-2023 ఫైనల్ దాకా అజేయంగా నిలిచిన టీమిండియా.. తుదిపోరులో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైన విషయం తెలిసిందే. సొంతగడ్డపై తప్పక అందుతుందనుకున్న ట్రోఫీ చేజారడంతో కెప్టెన్ రోహిత్ శర్మ సహా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, ఇతర ఆటగాళ్లంతా నిరాశలో కూరుకుపోయారు. ఇదిలా ఉంటే.. ఈ మెగా టోర్నీకి సంసిద్ధమయ్యే క్రమంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి గత ఏడాది కాలంగా అంతర్జాతీయ టీ20లకు దూరమయ్యారు. ఈ క్రమంలో ప్రపంచకప్ ఓటమి తర్వాత వీరిద్దరు ఇంటర్నేషనల్ పొట్టి ఫార్మాట్ నుంచి పూర్తిగా తప్పుకొనే యోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వన్డే వరల్డ్‌కప్‌లో అద్భుతంగా ఆడాడు ఈ నేపథ్యంలో ముత్తయ్య మురళీధరన్ రోహిత్ కెరీర్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘వన్డే వరల్డ్‌కప్ టోర్నీలో అతడి ప్రదర్శన అద్భుతంగా ఉంది. మెరుగైన స్ట్రైక్‌రేటుతో అతడి బ్యాటింగ్ సాగింది. ఈవెంట్ మొత్తంలో అతడు ఒక్కసారిగా వైఫల్యం చెందిన సందర్భం లేదు. అతడికి ఇప్పుడు కేవలం 36 ఏళ్లే.. అంటే ఇంకా యువకుడనే అర్థం. విరాట్ కోహ్లి మాదిరి ఫిట్నెస్ కాపాడుకుంటే కచ్చితంగా ఇంకో వరల్డ్‌కప్ ఆడే అవకాశం ఉంది. ఇంకా యువకుడే.. కోహ్లిలా ఫిట్నెస్ కాపాడుకుంటే వన్డేల్లో అతడి స్ట్రైక్‌రేటు 130కిపైగానే.. టీ20లలో కూడా మెరుగైన గణాంకాలే కలిగి ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెటర్‌గా తనకెంతో అనుభవం ఉంది. ఏ ఆటగాడైనా 35 ఏళ్ల తర్వాత కూడా కొనసాగాలనుకుంటే ఫిట్నెస్ కాపాడుకోవాల్సి ఉంటుంది. కాబట్టి రోహిత్ ఆడాలని భావిస్తే తప్పక ఆ దిశగా మరింత కష్టపడతాడు. నాకు తెలిసి తను మరో వరల్డ్‌కప్ ఆడటానికి కచ్చితంగా సిద్ధమవుతాడు’’ అని ముత్తయ్య మురళీధరన్ పేర్కొన్నాడు. కాగా అమెరికా, వెస్టిండీస్ సంయుక్తగా ఆతిథ్యమిస్తున్న టీ20 వరల్డ్‌కప్-2024 జూన్ 4న మొదలుకానుంది. ఇదిలా ఉంటే.. యంగ్ టీమిండియా ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌తో బిజీగా ఉంది. చదవండి: వాళ్లిద్దరు రిటైర్మెంట్ ప్రకటిస్తేనే తప్ప: ఆశిష్ నెహ్రా కీలక వ్యాఖ్యలు -
ద్రవిడ్ మా అంకుల్.. ఆయనను చూస్తే బాధేసింది: సీరియల్ నటి
వన్డే వరల్డ్‌కప్-2023 ఫైనల్లో భారత్ ఓటమి తననెంతో బాధించిందని టీమిండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ బంధువు, మరాఠా నటి అదితి ద్రవిడ్ ఆవేదన వ్యక్తం చేసింది. ఏదేమైనా తన అంకుల్ అత్యుత్తమ కోచ్‌గా చరిత్రలో నిలిచిపోతారంటూ ఉద్వేగానికి లోనైంది. కాగా సొంతగడ్డపై టీమిండియా వన్డే ప్రపంచకప్ గెలుస్తుందనుకున్న అభిమానులకు నిరాశే మిగిలిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్‌లో ఆదివారం జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా రోహిత్ సేనను ఓడించి ట్రోఫీని కైవసం చేసుకుంది. టోర్నీ ఆరంభం నుంచి అజేయంగా ఉన్న భారత జట్టుకు షాకిస్తూ.. ఏకంగా ఆరోసారి జగజ్జేతగా అవతరించింది. దీంతో టీమిండియా తీవ్ర నిరాశలో మునిగిపోయింది. స్టార్ బ్యాటర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి సహా కేఎల్ రాహుల్, మహ్మద్ సిరాజ్ తదితరులు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ దృశ్యాలు చూసి టీమిండియా ఫ్యాన్స్ హృదయాలు ముక్కలయ్యాయి. ఈ నేపథ్యంలో అదితి ద్రవిడ్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ తన మనసులోని భావాలు పంచుకుంది. రాహుల్ ద్రవిడ్‌ను చూసి తమ కుటుంబమంతా గర్విస్తోందని పేర్కొంది. ద్రవిడ్ మా అంకుల్ ఈ మేరకు.. ‘‘రాహుల్ ద్రవిడ్ మా అంకుల్. గత 30- 35 ఏళ్లుగా ఆయన క్రికెట్ మైదానంలో కఠిన శ్రమకోరుస్తున్నారు. మా నాన్న వినాయక్ ద్రవిడ్ కూడా రంజీ ప్లేయర్. అందుకే నాకు క్రికెట్‌తో అనుబంధం ఏర్పడింది. టీమిండియా ఓడిపోయిన దృశ్యాలు చూసి నేను తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాను. ఆ సమయంలో మా అంకుల్‌ను చూస్తే చాలా బాధేసింది. హెడ్‌కోచ్‌గా ఆయన ప్రస్థానం కూడా ముగింపునకు వస్తోంది. ఆయనకు బహుశా ఇదే ఆఖరి వరల్డ్‌కప్. ఎంతో హార్డ్‌వర్క్ చేసి జట్టును ఇక్కడిదాకా తీసుకువచ్చారు. కానీ ఆఖర్లో ఇలా జరిగిపోయింది. ఏదేమైనా ఆయన బెస్ట్ కోచ్’’ అని అదితి ద్రవిడ్ ఉద్వేగపూరిత వ్యాఖ్యలు చేసింది. ది వాల్ రాహుల్ ద్రవిడ్.. హెడ్‌కోచ్‌గానూ కాగా మరాఠా బ్రాహ్మణ కుటుంబానికి చెందిన రాహుల్ ద్రవిడ్‌కు అదితి కూతురు వరుస అవుతుంది. ఆమె ప్రస్తుతం బుల్లితెరపై నటిగా రాణిస్తోంది. ఇటీవల సుందర మన మధ్యే భార్లీ సీరియల్లో కనిపించింది. అంతేకాదు రెండు మరాఠా సినిమాల్లోనూ అదితి మెరిసింది. ఎంటర్‌ప్రెన్యూర్‌గానూ రాణిస్తోంది. ఇక మరాఠా మూలాలున్న రాహుల్ ద్రవిడ్ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జన్మించిన విషయం తెలిసిందే. తండ్రి ఉద్యోగరిత్యా కర్ణాటకకు షిఫ్ట్ కావడంతో అక్కడే పెరిగి పెద్దైన ద్రవిడ్.. దేశవాళీ క్రికెట్లో కన్నడ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. టీమిండియా తరఫున ది వాల్‌గా.. దిగ్గజ క్రికెటర్‌గా పేరొందిన రాహుల్ ద్రవిడ్ ప్రస్తుతం హెడ్‌కోచ్‌గా సేవలు అందిస్తున్నాడు. త్వరలోనే అతడి కాంట్రాక్ట్ ముగియనుంది. -
ఆసీస్‌తో ఫైనల్ రోజే అలా! అమ్మను తలచుకుని షమీ భావోద్వేగం
CWC 2023- Ind vs Aus- Mohammad Shami: టీమిండియా పేసర్ మహ్మద్ షమీ భావోద్వేగానికి లోనయ్యాడు. అనారోగ్యం బారిన పడ్డ తన తల్లి గురించి ఉద్వేగపూరిత నోట్ షేర్ చేశాడు. కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు షమీ. ఈ మెగా టోర్నీలో ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచి సత్తా చాటాడు. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం కారణంగా జట్టుకు దూరమైన తరుణంలో తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు ఈ యూపీ బౌలర్. మూడు ఐదు వికెట్ల హాల్స్ ఈ క్రమంలో.. లీగ్ దశలో తొలుత న్యూజిలాండ్‌పై ఫైవ్ వికెట్ల హాల్ నమోదు చేశాడు. ఆ తర్వాత ఇంగ్లండ్‌పై నాలుగు వికెట్లు తీసిన షమీ.. శ్రీలంకపై ఐదు వికెట్లతో చెలరేగాడు. ఆ తర్వాత సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసిన ఈ 33 ఏళ్ల పేసర్.. సెమీ ఫైనల్లో న్యూజిలాండ్‌పై రికార్డు స్థాయిలో ఏడు వికెట్లు పడగొట్టాడు. ఇక ఆస్ట్రేలియాతో అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్లో ఒక వికెట్‌తో మెరిశాడు. ఆసీస్‌తో ఫైనల్ ఆడుతున్న సమయంలో తల్లికి అస్వస్థత ఇలా సొంతగడ్డపై ఐసీసీ ఈవెంట్లో మొత్తం 24 వికెట్ల తన ఖాతాలో వేసుకుని.. అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా అవార్డు అందుకున్నాడు. అయితే, షమీ ఆసీస్‌తో ఫైనల్ ఆడుతున్న సమయంలో అతడి తల్లి ఆనుం ఆరా అనారోగ్యం పాలయ్యారు. సహాస్పూర్లోని తమ నివాసంలో ఉన్న సమయంలో అస్వస్థతకు గురైన ఆమెను స్థానిక ఆస్పత్రికి తీసుకువెళ్లారు. నీరసం, జ్వరంతో ఇబ్బంది పడుతున్న ఆనుం ఆరాకు చికిత్స అందించగా.. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు బంధువు డాక్టర్ ముంతాజ్ టైమ్స్ ఆఫ్ ఇండియాకు వెల్లడించారు. ఈ నేపథ్యంలో గురువారం ఇన్‌స్టా వేదికగా తన తల్లితో ఉన్న ఫొటోను షేర్ చేసిన షమీ.. ‘‘నువ్వే నా సర్వస్వం అమ్మా. త్వరలోనే కోలుకుని తిరిగి వస్తావు’’ అంటూ హార్ట్ ఎమోజీలు జతచేశాడు. నెట్టింట వైరల్ అవుతున్న షమీ పోస్టుకు అభిమానులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ‘‘అమ్మ తప్పక కోలుకుని త్వరలోనే తిరిగి వస్తారు. ఆమె కోసం మేము కూడా ప్రార్థన చేస్తాం భయ్యా’’ అంటూ అభిమానులు షమీకి ధైర్యం చెబుతున్నారు. చదవండి: యూట్యూబర్‌ను పెళ్లాడిన టీమిండియా పేసర్.. సిరాజ్ విషెస్ View this post on Instagram A post shared by 𝕸𝖔𝖍𝖆𝖒𝖒𝖆𝖉 𝖘𝖍𝖆𝖒𝖎 (@mdshami.11) -
టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా కెప్టెన్‌గా అతడే ఉండాలి: గంభీర్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ త్వరలోనే టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. గత కొంత కాలం నుంచి టీ20లకు దూరంగా ఉంటున్న రోహిత్.. కేవలం వన్డేల్లో, టెస్టుల్లో మాత్రమే కొనసాగున్నట్లు క్రికెట్ వర్గాల్లో తెగ చర్చనడుస్తోంది. రోహిత్‌తో పాటు భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి కూడా గత ఏడాది నుంచి టీ20ల్లో ఆడటం లేదు. రోహిత్ గైర్హజరీలో హార్దిక్ పాండ్యా టీ20ల్లో భారత జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఇద్దరూ ఆడాలని గంభీర్ అభిప్రాయపడ్డాడు. "టీ20 ప్రపంచకప్-2024కు రోహిత్ శర్మ, కోహ్లి ఇద్దరినీ కచ్చితంగా ఎంపిక చేయాలి. ముఖ్యంగా టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మ వ్యవహరించాలి. హార్దిక్ టీ20ల్లో సారథిగా ఉన్నప్పటికీ.. రోహిత్‌ను నేను కెప్టెన్‌గా చూడాలనుకుంటున్నాను. ఈ ఏడాది వన్డే వరల్డ్‌కప్‌లో రోహిత్ తన బ్యాటింగ్ పవర్ ఎంటో చూపించాడు. రోహిత్‌ను ఎంపిక చేస్తే విరాట్ కోహ్లి కూడా ఆటోమేటిక్‌గా జట్టులోకి వస్తాడు. రోహిత్ శర్మ టీ20 ప్రపంచకప్ ఆడాలని నిర్ణయించుకుంటే, అతడిని బ్యాటర్‌గా కాకుండా కెప్టెన్‌గా ఎంపిక చేయాలి" అని స్పోర్ట్స్ కీడాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గంభీర్ పేర్కొన్నాడు. కాగా ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు రోహిత్ శర్మ, కోహ్లితో పాటు సీనియర్ ఆటగాళ్లందరికీ విశ్రాంతి ఇచ్చారు. ఈ సిరీస్‌లో టీమిండియా తాత్కాలిక కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ వ్యవహరిస్తున్నాడు. చదవండి: IPL 2024-Rashid Khan Injury: గుజరాత్ టైటాన్స్‌కు బిగ్ షాక్.. రషీద్ ఖాన్‌కు సర్జరీ!? ఐపీఎల్‌కు దూరం -
అందుకే దాన్ని ఫైనల్ అంటారు: కైఫ్ విమర్శలపై వార్నర్ స్పందన
ICC CWC 2023 Winner Australia: టీమిండియా మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ వ్యాఖ్యలకు ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ కౌంటర్ ఇచ్చాడు. మీరంటే నాకిష్టం అంటూనే.. అసలైన రోజున ఆడినవాళ్లకు మాత్రమే విజేతలుగా నిలిచే అర్హత దక్కుతుందని ఉద్ఘాటించాడు. కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో లీగ దశలో తొమ్మిదికి తొమ్మిది మ్యాచ్‌లు గెలిచిన టీమిండియా.. సెమీస్‌లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన విషయం తెలిసిందే. తద్వారా టేబుల్ టాపర్‌గా ఫైనల్ చేరింది భారత జట్టు. మరోవైపు.. ఆరంభంలో రెండు వరుస పరాజయాలు మూటగట్టుకున్న ఆస్ట్రేలియా తర్వాత వరుసగా ఎనిమిది మ్యాచ్‌లు గెలిచి.. తుదిమెట్టుకు చేరుకుంది. ఈ క్రమంలో అహ్మదాబాద్‌లో టీమిండియాతో ఫైనల్లో జయభేరి మోగించి.. ఏకంగా ఆరోసారి ట్రోఫీని కైవసం చేసుకుంది. అయితే, ఈ మ్యాచ్ ముగిసిన అనంతరం టీమిండియా మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘అత్యుత్తమ జట్టు వరల్డ్‌కప్ గెలిచిందంటే మాత్రం నేను అస్సలు ఒప్పుకోను. ఎందుకంటే పేపర్ మీద చూస్తే టీమిండియా అత్యుత్తమంగా కనిపిస్తోంది’’ అని కైఫ్ అన్న క్లిప్పింగ్‌లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో గ్లెన్ మిచెల్ అనే యూజర్ కైఫ్ వ్యాఖ్యలకు సంబంధించిన ఫొటో షేర్ చేయగా.. వార్నర్ స్పందించాడు. ‘‘నాకు ఎంకే(మహ్మద్ కైఫ్) అంటే ఇష్టమే.. అయితే.. పేపర్ మీద ఏం కనబడుతుందన్న విషయంతో సంబంధం లేదు. అసలైన సమయంలో మన ప్రదర్శన ఎలా ఉందన్నదే ముఖ్యం. అందుకే దానిని ఫైనల్ మ్యాచ్ అంటారు. అదే అన్నిటికంటే కీలకం. అదే ఆటకు అర్థం. 2027లో చూద్దాం’’ అంటూ వార్నర్ ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించాడు. చదవండి: అక్క చెప్పింది నిజమే!.. అంతా మన వల్లే.. ఎందుకిలా విషం చిమ్మడం? I like MK, issue is it does not matter what’s on paper. At the end of the day you need to perform when it matters. That’s why they call it a final. That’s the day that counts and it can go either way, that’s sports. 2027 here we come 👍 https://t.co/DBDOCagG2r — David Warner (@davidwarner31) November 22, 2023 -
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సంచలన నిర్ణయం?
Is Rohit Sharma Unlikely To Play T20Is Anymore?: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇకపై అతడు అంతర్జాతీయ టీ20లకు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. వన్డే వరల్డ్‌కప్-2023 ఆరంభానికి ముందే రోహిత్ ఈ విషయం గురించి చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌తో చర్చించినట్లు వార్తలు వస్తున్నాయి. దారుణ వైఫల్యం.. విమర్శల వర్షం కాగా టీ20 వరల్డ్‌కప్-2022 టోర్నీలో టీమిండియా వైఫల్యం చెందిన విషయం తెలిసిందే. భారీ అంచనాలతో బరిలోకి దిగిన రోహిత్ సేన సెమీ ఫైనల్లోనే నిష్క్రమించింది. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ సహా సెలక్షన్ కమిటీపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ప్రక్షాళన చర్యలు చేపట్టిన భారత క్రికెట్ నియంత్రణ మండలి సెలక్షన్ కమిటీని రద్దు చేసింది. అజిత్ అగార్కర్ రాక.. కొన్ని రోజుల అనంతరం మళ్లీ చేతన్ శర్మను చీఫ్ సెలక్టర్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే, చేతన్ భారత ఆటగాళ్లను ఉద్దేశించి ఓ స్టింగ్ ఆపరేషన్‌లో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపగా.. అతడు రాజీనామా చేయాల్సి వచ్చింది. రోహిత్‌కు బదులు హార్దిక్ పాండ్యానే ఈ క్రమంలో మాజీ బౌలర్ అజిత్ అగార్కర్ టీమిండియా చీఫ్ సెలక్టర్‌గా నియమితుడయ్యాడు. ఇదిలా ఉంటే.. గతేడాది వరల్డ్‌కప్ ముగిసిన తర్వాత రోహిత్ అంతర్జాతీయ టీ20లకు దూరంగానే ఉంటున్నాడు. అతడి స్థానంలో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా పగ్గాలు చేపట్టి ముందుకు నడిపిస్తున్నాడు. అయితే, వరల్డ్‌కప్-2023 నేపథ్యంలో వన్డేలపై మరింత దృష్టి సారించాలనే ఉద్దేశంతోనే రోహిత్ టీ20లకు దూరంగా ఉన్నాడనే వార్తలు వినిపించాయి. పనిభారాన్ని తగ్గించుకునే క్రమంలో ప్రపంచకప్-2023 ముగిసిన తర్వాత హిట్‌మ్యాన్ తిరిగి టీ20లు ఆడతాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ.. పని భారాన్ని తగ్గించుకునే క్రమంలో రోహిత్ అంతర్జాతీయ టీ20లకు పూర్తిగా దూరంగా ఉందామనే నిర్ణయానికి వచ్చినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. రోహిత్ నిర్ణయమే ఇది ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు పీటీఐతో మాట్లాడుతూ.. ‘‘ఇది కొత్త విషయమేమీ కాదు. వన్డే వరల్డ్‌కప్ టోర్నీపై ఫోకస్ చేసే ఉద్దేశంతో గత ఏడాది కాలంగా రోహిత్ టీ20లకు దూరంగా ఉన్నాడు. ఈ విషయం గురించి ఇప్పటికే సెలక్షన్ చైర్మన్ అజిత్ అగార్కర్‌తో కూడా రోహిత్ చర్చించాడు. ఇంటర్నేషనల్ టీ20లకు దూరంగా ఉండాలనేది తనకు తానుగా తీసుకున్న నిర్ణయం’’ అని పేర్కొన్నాయి. ఆ లక్కీ ఛాన్స్ ఎవరికో?! కాగా రోహిత్ శర్మతో పాటు యువ బ్యాటర్లు శుబ్‌మన్ గిల్, యశస్వి జైశ్వాల్, ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్ ఓపెనర్ల రూపంలో అందుబాటులో ఉన్నారు. ఇప్పటికే గిల్ రోహిత్ జోడీగా పాతుకుపోగా.. మిగిలిన వాళ్లు తమను తాము నిరూపించుకున్నారు. ముఖ్యంగా టీ20 ఫార్మాట్లో సత్తా చాటుతున్నారు. ఒకవేళ అనుభవమున్న కెప్టెన్ కావాలనుకుంటే ఈ నేపథ్యంలో రోహిత్ వర్క్‌లోడ్ విషయంలో రాజీపడక టీ20లకు దూరంగా ఉండాలనుకుంటే గిల్‌తో పాటు మరో కొత్త ఓపెనర్‌ను చూసే అవకాశం ఉంటుంది. అలా కాకుండా.. టీ20 వరల్డ్‌కప్-2024లో అనుభవమున్న కెప్టెన్ కావాలని భావిస్తే.. 36 ఏళ్ల రోహిత్ అంతర్జాతీయ టీ20లలో కొనసాగాలని.. బీసీసీఐ ఆ దిశగా అతడిని ఒప్పించే ప్రయత్నాలు చేయొచ్చు. ఆసీస్ సిరీస్‌లో.. సూర్య టీ20 సారథిగా ఇక వన్డే వరల్డ్‌కప్-2023లో రన్నరప్‌తో సరిపెట్టుకున్న భారత జట్టు ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు సిద్ధమైంది. వైజాగ్ వేదికగా నవంబరు 23న ఈ సిరీస్ ఆరంభం కానుంది. రోహిత్, విరాట్ కోహ్లి తదితరులు విశ్రాంతి తీసుకోగా.. హార్దిక్ పాండ్యా గాయం కారణంగా దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్ ఆసీస్‌తో సిరీస్‌లో కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. చదవండి: సొంత బిడ్డల్లా అక్కున చేర్చుకున్నారు: పాక్ లెజెండ్ View this post on Instagram A post shared by ICC (@icc) -
రోహిత్ శర్మను ఉద్దేశించి కపిల్ దేవ్ వ్యాఖ్యలు.. నీ కోసం..
భారత్‌లో క్రికెట్ రూపురేఖలను మార్చి వేసిన ఘనత కపిల్ డెవిల్స్‌కే దక్కుతుందనడంలో అతిశయోక్తి లేదు. వన్డే వరల్డ్‌కప్-1983లో అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన కపిల్‌దేవ్ సేన.. అనూహ్య రీతిలో చాంపియన్‌గా నిలిచింది. ఇంగ్లండ్ గడ్డ మీద.. అప్పటికే రెండుసార్లు విజేత అయిన వెస్టిండీస్‌ను ఓడించి టైటిల్‌ను సొంతం చేసుకుంది. అలా టీమిండియాకు తొలి ఐసీసీ ట్రోఫీ అందించిన జట్టుగా చరిత్రలో నిలిచిపోయింది. ఈ క్రమంలో 2011లో సొంతగడ్డ మీద ధోని సేన మరోసారి వన్డే ప్రపంచకప్ గెలిచి.. ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేసింది. పుష్కరకాలం తర్వాత రోహిత్ బృందం కూడా అదే పునరావృతం చేస్తుందని భావించిన అభిమానులకు మాత్రం నిరాశే ఎదురైంది. వన్డే వరల్డ్‌కప్-2023లో అజేయ రికార్డుతో ఫైనల్‌తో దూసుకెళ్లిన టీమిండియా.. ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. ఐదుసార్లు చాంపియన్ ఆస్ట్రేలియా చేతిలో 6 వికెట్ల తేడాతో ఓటమి చెందింది. దీంతో భారత ఆటగాళ్లతో పాటు అభిమానుల హృదయాలు కూడా ముక్కలయ్యాయి. ఆస్ట్రేలియా ఆరోసారి జగజ్జేతగా నిలిచిన సంబరంలో మునిగిపోతే.. టీమిండియా కన్నీటితో మైదానాన్ని వీడింది. ఈ నేపథ్యంలో అభిమానులంతా రోహిత్ సేనకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఓదార్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో మాజీ కెప్టెన్, టీమిండియా దిగ్గజం కపిల్ దేవ్.. రోహిత్ శర్మను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ‘‘రోహిత్.. ఇప్పటికే నువ్వు చేసే పనిలో మాస్టర్‌వి అయిపోయావు. నీకోసం ఇంకెన్నో విజయాలు ఎదురుచూస్తున్నాయి. ఇలాంటివి మనసుకు బాధ కలిగిస్తాయని నాకు తెలుసు. కానీ నువ్వు నమ్మకం కోల్పోవద్దు’’ అంటూ రోహిత్ కళ్లలో నీళ్లు నిండిన ఫొటోను కపిల్ షేర్ చేశాడు. ఇక జట్టును ఉద్దేశిస్తూ.. ‘‘ఇండియా మొత్తం నీతో ఉంది. మీరంతా చాంపియన్సే బాయ్స్. తలెత్తుకోండి. ట్రోఫీ గెలవాలన్నది మీ అంతిమ లక్ష్యం. కానీ దానితో పనిలేకుండానే మీరు ఇప్పటికే విజేతలుగా నిలిచారు. దేశం మిమ్మల్ని చూసి గర్వపడుతోంది’’ అని కపిల్ దేవ్ బాసటగా నిలిచాడు. -
టాప్‌లోనే గిల్.. దూసుకొచ్చిన కోహ్లి, రోహిత్! సిరాజ్ వెనక్కి..
Top 5 of the ICC ODI Rankings for batters And Bowlers: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి టాప్-3లోకి దూసుకొచ్చాడు. వన్డే వరల్డ్‌కప్-2023లో అద్భుత ప్రదర్శనతో మూడో స్థానానికి చేరుకున్నాడు. మరోవైపు.. టీమిండియా యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ టాప్ ర్యాంకును నిలుపుకొన్నాడు. అదే విధంగా కెప్టెన్ రోహిత్ శర్మ నాలుగో స్థానంలో నిలిచాడు. దీంతో టాప్-5లో టీమిండియా బ్యాటర్ల సంఖ్య మూడుకు చేరింది. కాగా భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ టోర్నీలో కోహ్లి అదరగొట్టిన విషయం తెలిసిందే. ఈ ఐసీసీ ఈవెంట్లో మొత్తంగా 11 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి.. 3 శతకాలు, 6 అర్ధ శతకాల సాయంతో 765 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో 791 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానానికి చేరుకున్నాడు. గతంలో 1258 రోజుల పాటు నంబర్ 1లో కొనసాగిన ఈ పరుగుల యంత్రం సుదీర్ఘకాలం తర్వాత మరోసారి టాప్ ర్యాంకుకు చేరువకావడం విశేషం. భారీ జంప్ కొట్టిన హెడ్ ఇక రోహిత్ శర్మ సైతం.. 11 మ్యాచ్‌లు ఆడి ఒక సెంచరీ, 3 అర్ధ సెంచరీలతో కలిపి 597 పరుగులు చేశాడు. దీంతో మరిన్ని పాయింట్లు మెరుగుపరచుకుని నాలుగో ర్యాంకు సాధించాడు. మరోవైపు.. వరల్డ్‌కప్-2023 ఫైనల్లో ఆస్ట్రేలియాను ఒంటిచేత్తో గెలిపించిన ట్రవిస్ హెడ్ ఏకంగా 28 పాయింట్లు మెరుగుపరచుకుని 15వ స్థానానికి చేరుకున్నాడు. సిరాజ్‌ను వెనక్కి నెట్టిన హాజిల్‌వుడ్.. ఇక బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ఆసీస్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ నాలుగు స్థానాలు ఎగబాకాడు. టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్‌ను వెనక్కినెట్టి రెండో ర్యాంకు సాధించాడు. ఆసీస్ పేసర్లు మిచెల్ స్టార్క్ ఎనిమిది స్థానాలు మెరుగుపరచుకుని 12, ప్యాట్ కమిన్స్ ఏడు స్థానాలు మెరుగుపరచుకుని 27వ ర్యాంకుకు చేరుకున్నారు. ఇక మరో భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఓవరాల్‌గా నాలుగో స్థానంలో నిలిచాడు. ఐసీసీ తాజా వన్డే ర్యాంకింగ్స్ టాప్-5 బ్యాటర్లు 1. శుబ్‌మన్ గిల్(ఇండియా)- 826 పాయింట్లు 2. బాబర్ ఆజం(పాకిస్తాన్)- 824 పాయింట్లు 3. విరాట్ కోహ్లి(ఇండియా)- 791 పాయింట్లు 4. రోహిత్ శర్మ(ఇండియా)- 769 పాయింట్లు 5. క్వింటన్ డికాక్(సౌతాఫ్రికా)- 760 పాయింట్లు టాప్-5 బౌలర్లు 1. కేశవ్ మహరాజ్(సౌతాఫ్రికా)- 741 పాయింట్లు 2. జోష్ హాజిల్‌వుడ్(ఆస్ట్రేలియా)- 703 పాయింట్లు 3. మహ్మద్ సిరాజ్(ఇండియా)- 699 పాయింట్లు 4. జస్ప్రీత్ బుమ్రా(ఇండియా)- 685 పాయింట్లు 5. ఆడం జంపా(ఆస్ట్రేలియా)- 675 పాయింట్లు. చదవండి: CWC 2023: అక్క చెప్పింది నిజమే!.. అంతా మన వల్లే.. ఎందుకీ విద్వేష విషం? -
సొంత బిడ్డల్లా అక్కున చేర్చుకున్నారు: పాక్ లెజెండ్
ICC WC 2023- PM Modi Gesture: టీమిండియాకు ప్రధాని నరేంద్ర మోదీ మద్దతుగా నిలిచిన తీరుపై పాకిస్తాన్ లెజెండరీ బౌలర్ షోయబ్ అక్తర్ ప్రశంసలు కురిపించాడు. తన చర్య ద్వారా దేశం మొత్తం జట్టుకు అండగా ఉందనే సందేశాన్ని ఇచ్చారని ప్రధానిని కొనియాడాడు. ఆటగాళ్లను తన సొంత బిడ్డల్లా ఆప్యాయంగా హత్తుకున్న విధానం ఎంతో గొప్పగా ఉందని ప్రశంసించాడు. కాగా వన్డే వరల్డ్‌కప్-2023 ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత జట్టు ఓటమి పాలైన విషయం తెలిసిందే. సెమీస్ వరకు అజేయంగా కొనసాగిన టీమిండియా అహ్మదాబాద్‌లో ఆదివారం నాటి తుదిపోరులో మాత్రం స్థాయికి తగ్గట్లు ఆడలేకపోయింది. ఫలితంగా సొంతగడ్డపై ట్రోఫీ అందుకోవాలన్న కల చెదిరిపోయింది. కళ్లలో నీళ్లు నింపుకొని ఈ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లి, మహ్మద్ షమీ, కేఎల్ రాహుల్ తదితరులు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. లక్ష పైచిలుకు అభిమానుల మధ్య ఎదురైన పరాభవాన్ని తట్టుకోలేక.. కళ్లలో నీళ్లు నింపుకొని మైదానాన్ని వీడారు. షమీని ఆత్మీయంగా హత్తుకుని దీంతో అభిమానులు కూడా కన్నీటి పర్యంతమయ్యారు. టీమిండియాను ప్రేమించే వాళ్లంతా హృదయం ముక్కలైందంటూ సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి తరుణంలో ప్రధాని మోదీ భారత జట్టు డ్రెస్సింగ్‌రూంకు వెళ్లి ఆటగాళ్లను ఓదార్చారు. రోహిత్, కోహ్లిలను దగ్గరకు తీసుకుని.. ఆటలో గెలుపోటములు సహజమంటూ నచ్చజెప్పారు. మహ్మద్ షమీని ఆప్యాయంగా హత్తుకుని మరేం పర్లేదంటూ ఓదార్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. సొంతబిడ్డల్లా అక్కున చేర్చుకున్నారు ఈ నేపథ్యంలో రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ జీ న్యూస్‌తో మాట్లాడుతూ.. ‘‘డ్రెస్సింగ్రూంకి వెళ్లి.. వాళ్లకు తానున్నానంటూ ప్రధాని ధైర్యం చెప్పారు. దేశం మొత్తం మీ వెంటే ఉందనే సందేశాన్ని ఇచ్చారు. నిజానికి భారత్‌కు అదొక ఉద్విగ్న క్షణం. అలాంటి సమయంలో ప్రధాని మోదీ ఆటగాళ్లను తన సొంతపిల్లల్లా అక్కున చేర్చుకున్నారు. వాళ్లకు నైతికంగా మద్దతునిచ్చి తలెత్తుకోవాలంటూ స్ఫూర్తి నింపారు. ఆటగాళ్ల పట్ల ఆయన ఎంతో గొప్పగా వ్యవహరించారు’’ అని ప్రశంసల వర్షం కురిపించాడు. చదవండి: CWC 2023: అక్క చెప్పింది నిజమే!.. అంతా మన వల్లే.. ఎందుకీ విద్వేష విషం? -
అక్క చెప్పింది నిజమే!.. అంతా మన వల్లే.. ఎందుకిలా విషం చిమ్మడం?
‘‘మనం ఊహించిన ఫలితం వేరు.. కానీ జరిగింది వేరు.. అయినా మనమంతా టీమిండియా వెంటే ఉంటాం.. కుటుంబంలోని సభ్యులు ఎవరైనా బాధతో కుంగిపోయినపుడు.. మనం వాళ్లను వదిలేయం కదా! నిజానికి అలాంటపుడే మనం వాళ్లకు మరింత మద్దతుగా నిలవాలి’’- వన్డే వరల్డ్‌కప్-2023 ఫైనల్లో భారత జట్టు ఓటమి తర్వాత తన తమ్ముడు విరాట్ కోహ్లిని అనునయిస్తూ భావనా కోహ్లి ధింగ్రా సోషల్ మీడియా వేదికగా పంచుకున్న భావాలు.. అవును భావనా అన్న మాటలు అక్షరాలా నిజం.. అన్నీ సజావుగా సాగుతూ.. ఉన్నత స్థితిలో ఉన్నపుడు మనోళ్లు అంటూ ప్రశంసించడం కంటే.. కష్టాల్లో ఉన్నపుడు అండగా ఉంటేనే ఏ బంధానికైనా విలువ ఉంటుంది. భారీ అంచనాలు ఇప్పుడు ఈ విషయాన్ని నిరూపించాల్సిన బాధ్యత భారత క్రికెట్ జట్టు అభిమానులపై ఉంది. సొంతగడ్డపై వన్డే ప్రపంచకప్ అనగానే దేశమంతా సరికొత్త ఉత్సాహం.. క్రికెట్‌ను కేవలం ఆటలా కాకుండా ఓ ‘మతం’లా భావించే భారతీయులకు నిజంగా ఇది పండుగ లాంటిదే. మొదటి నుంచీ భారీ అంచనాలు.. ఈసారి కప్పు మనదేనంటూ జోస్యాలు.. అక్టోబరు 5న ఇంగ్లండ్- న్యూజిలాండ్ పోరుతో ఈ మెగా క్రికెట్ సమరానికి తెర లేచింది. ఆ తర్వాతి మూడు రోజులకు ఆస్ట్రేలియాతో చెన్నై వేదికగా టీమిండియా తొలి మ్యాచ్.. నాడు రోహిత్ సేన ఛేదించాల్సిన లక్ష్యం 200.. కష్టమ్మీద వచ్చిన గెలుపుతో ఆరంభం చిన్న టార్గెట్ ఈజీగానే కొట్టేస్తారు అనుకున్నారంతా! కానీ ఆరంభంలోనే ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ డకౌట్.. వన్‌డౌన్‌లో వచ్చిన కోహ్లికి శ్రేయస్ అయ్యర్ తోడుంటానుకుంటే అతడూ సున్నా చుట్టి పెవిలియన్ చేరాడు. అప్పుడొచ్చాడు కేఎల్ రాహుల్.. కోహ్లితో కలిసి స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. రన్‌మెషీన్ 85 పరుగులు సాధిస్తే.. రాహుల్ 97 పరుగులతో అజేయంగా నిలిచాడు. 41.2 ఓవర్ వద్ద సిక్సర్‌తో లక్ష్యాన్ని ఛేదించి జట్టును విజయతీరాలకు చేర్చాడు. చెన్నై నుంచి ముంబై దాకా టాప్ గేర్ ఒకవేళ ఆరోజు కోహ్లి, రాహుల్ పట్టుదలగా నిలబడి ఉండకపోతే ఫలితం వేరేలా ఉండేది. అలా అతి కష్టమ్మీద తొలి మ్యాచ్ తర్వాత.. టీమిండియా గేర్ మార్చింది. చెన్నైలో మొదలుపెట్టిన విజయ ప్రస్థానాన్ని ముంబై దాకా అప్రతిహతంగా కొనసాగించింది. లీగ్ దశలో ఆస్ట్రేలియా తర్వాత అఫ్గనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఇంగ్లండ్, శ్రీలంక, సౌతాఫ్రికా, నెదర్లాండ్స్‌లపై వరుస విజయాలు సాధించింది. ముఖ్యంగా శ్రీలంకను ఏకంగా 302 పరుగుల తేడాతో ఓడించి అతిపెద్ద గెలుపు నమోదు చేసింది. సెమీస్ గండాన్నీ దాటేసి.. ఆ తర్వాత తొలి సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ రూపంలో ఎదురైన గండాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకుని ఫైనల్‌కు అర్హత సాధించింది టీమిండియా. ఇక అప్పటి నుంచి అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. దేశవ్యాప్తంగా పూజలు అహ్మదాబాద్‌లో నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా భారత జట్టు సారథి రోహిత్ శర్మ ట్రోఫీ అందుకోవడం ఖాయమని ఫిక్సైపోయారు అభిమానులు. అంతటితో ఆగిపోలేదు.. ఆస్ట్రేలియా వంటి పటిష్ట జట్టును ఎదుర్కోవాలంటే ఆటతో పాటు సెంటిమెంట్లు కూడా కలిసిరావాలి.. పూజలు, ప్రార్థనలు చేయాలి.. ఉపవాసాలు ఉండాలి.. ఏం చేసినా ఏదేమైనా కప్పు మనదేనన్న విషయం మాత్రం మర్చిపోకూడదు.. ఇలా దేశమంతా అభిమానులు ఒక్కటై సోషల్ మీడియాలోనే కాదు.. బయట కూడా తమ ఆకాంక్షలను పెద్ద ఎత్తున చాటారు. మనోళ్లు గెలవాలన్న తాపత్రయమే ఇదంతా.. కానీ నిజానికి ఇదంతా.. జట్టు విజయాన్ని ఆకాంక్షిస్తూ.. సానుకూల దృక్పథంతో ఉండటంలో భాగమే! కానీ ఎంత కాదనుకున్నా.. బయటి విషయాలు పట్టించుకోమని చెబుతున్నా.. కచ్చితంగా ఆటగాళ్లపై ఇవన్నీ ప్రభావం చూపుతాయి. ఈ ఐసీసీ టోర్నీ ఆరంభానికి ముందు ఎంతో మంది క్రికెట్ దిగ్గజాలు కూడా చెప్పిన మాట ఇదే... ఈసారి టైటిల్ ఫేవరెట్ టీమిండియానే.. కానీ సొంతగడ్డపై ఆడటం వారికి ఎంత సానుకూలమో.. అంచనాలు, ఆశల వల్ల కలిగే ఒత్తిడి కూడా అదే స్థాయిలో ఉంటుంది.. అందుకు తగ్గట్లుగానే.. లక్ష పైచిలుకు అభిమానుల మధ్య.. నీలి సంద్రాన్ని తలపించే స్టేడియంలో.. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టుపై ఆ ప్రభావం పడింది. మనోళ్లు సిక్స్ కొడితే ప్రేక్షకుల ఉత్సాహంతో హోరెత్తిపోయిన స్టేడియం.. ఒక్క వికెట్ పడితే అంతకంటే నిశ్శబ్దంగా మారిపోయింది. మైదానంలో దిగిన ఆటగాళ్లకు ఈ ఒక్క మార్పు చాలు అభిమానుల మనఃస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవడానికి! ఎలాగైనా పవర్ ప్లేలో పరుగులు రాబట్టాలనే తొందరలో వికెట్ పారేసుకున్నాడు రోహిత్.. తొలి వరల్డ్‌కప్ ఆడుతున్న మరో ఓపెనర్, యువ బ్యాటర్ గిల్ అప్పటికే పెవిలియన్ చేరాడు. కోహ్లితో కలిసి రోహిత్ ఇన్నింగ్స్ నిర్మిస్తాడనుకుంటే ఆ ఆశ కూడా పోయింది. అంతకు ముందు వరుస శతకాలు చేసిన శ్రేయస్ అయ్యర్ నాలుగు పరుగులకే అవుటయ్యాడు. తొలి మ్యాచ్ మాదిరే.. మరోసారి అదే ప్రత్యర్థిపై కోహ్లి, కేఎల్ రాహుల్ కచ్చితంగా వీరబాదుడు బాదుతారని అభిమానుల నమ్మకం.. కానీ ఆసీస్ పేసర్ల బంతులు మన ఆశల కంటే పదునైనవి కదా.. ఎంత జాగ్రత్తగా ఆడుతున్నా కీలక సమయంలో కోహ్లిని ఆసీస్ సారథి ప్యాట్ కమిన్స్ అనూహ్య రీతిలో వెనక్కి పంపితే.. బాధ్యతగా ఆడుతున్న రాహుల్‌ను మిచెల్ స్టార్క్ అవుట్ చేశాడు. అంతే.. మన బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలిపోయింది. 240 పరుగులకే కథ ముగిసింది. స్టేడియంలో మరోసారి నిశ్శబ్దం.. అయితే, మన పేస్ త్రయం బుమ్రా, షమీ, సిరాజ్‌పై అంతే నమ్మకం కూడా! ఎలాగైనా గెలిచేస్తాం.. కప్పు మనదే.. కానీ సీన్ రివర్స్ అయింది. షమీ బౌలింగ్‌లో కోహ్లి.. ఓపెనర్ వార్నర్ క్యాచ్ పట్టగానే ఎగిరి గంతేసిన ఫ్యాన్స్ ఆనందాన్ని ట్రవిస్ హెడ్ ఎంతో సేపు నిలవనీయలేదు. లబుషేన్‌తో కలిసి క్రీజులో పాతుకుపోయి 137 పరుగులు చేసి మ్యాచ్‌ను టీమిండియా నుంచి లాగేసుకున్నాడు. లబుషేన్ ఆఖరి వరకు అజేయ అర్ధ శతకంలో నిలవగా.. ఈ టోర్నీలో ద్విశతక వీరుడైన మాక్స్వెల్ విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. View this post on Instagram A post shared by ICC (@icc) అంతే.. ఒక్కసారిగా స్మశాన నిశ్శబ్దం.. అంతా మనవల్లేనేమోనన్న పశ్చాత్తాపం కొందరిలో! అవును.. బ్యాటింగ్ చేస్తున్నపుడు.. ఫీల్డింగ్ చేస్తున్నపుడు మన వాళ్ల తత్తరబాటు చూస్తే నిజమే అనిపించింది. మరోవైపు.. ఆస్ట్రేలియా జట్టు.. లక్ష మందికి పైగా.. ప్రత్యక్షంగా ప్రత్యర్థికి మద్దతుగా.. తమకు వ్యతిరేక పవనాలు వీస్తున్న చోట.. ఫ్లడ్ లైట్ల వెలుగులో.. పిచ్ నుంచి సహకారం లభించక తిప్పలు పడుతున్న ప్రత్యర్థి బౌలింగ్‌లో.. చాలా సింపుల్‌గా.. ఏదో ద్వైపాక్షిక సిరీస్ మ్యాచ్ ఆడుతుందా అన్నట్లుగా అలా అలా ముందుకు సాగి.. ఏకంగా ఆరోసారి చాంపియన్‌గా నిలిచింది. ఏమాత్రం ఒత్తిడికి లోనుకాకుండా తమ వ్యూహాలు, ప్రణాళికలు పక్కాగా అమలు చేసి.. తాము కంగారు పడే వాళ్లం కాదు.. కంగారు పెట్టేవాళ్లమని మరోసారి నిరూపించింది. అంతే అక్కడితో కథ ముగిసిపోయిందనుకుంటే పొరపాటే! ఎందుకీ విద్వేష విషం? కొందరు ‘దురభిమానులు’.. వాళ్ల ఐడెంటిటీని వ్యక్తపరిచే ధైర్యం లేని వ్యక్తులు.. తమ వ్యాఖ్యలకు ‘టీమిండియా ఫ్యాన్స్’ను బాధ్యులను చేస్తూ.. ఆసీస్ క్రికెటర్లు, వారి కుటుంబాలపై విద్వేష విషం చిమ్మారు. మనోళ్ల తప్పులు ఎంచుతూనే.. ప్రత్యర్థి జట్టును కూడా దారుణంగా.. అసభ్యకరరీతిలో అవమానించారు. షమీకి మద్దతుగా ఉన్నందుకు కోహ్లి కుటుంబాన్ని టార్గెట్ చేసినట్లుగా ఈసారి ఆస్ట్రేలియా ఆటగాళ్లను లక్ష్యంగా చేసుకుని ట్రోలింగ్ పేరిట నిజమైన అభిమానులకు మచ్చ తెచ్చేలా ప్రవర్తించారు. నిజమైన అభిమానులంటే? అవును.. నిజమైన అభిమానులు ఎవరు?? అత్యధిక పరుగుల వీరుడు కోహ్లి నిరాశతో కళ్ల నిండా నీళ్లు నింపుకొంటే.. తాము కన్నీటి ధారలు కురిపించేవాళ్లు.. ఇక్కడిదాకా వచ్చి.. ఇప్పుడుకాక.. ఇంకెప్పుడూ లేదని ముఖం దాచుకున్న రోహిత్‌ను చూసి కళ్లను నీటి చెమ్మతో తడిచేసుకునే వాళ్లు.. సిరాజ్ చిన్నపిల్లాడిలా ఏడుస్తుంటే.. రాహుల్ తల నేలకేసి నిట్టూరుస్తుంటే అయ్యో ఆటలో ఇవన్నీ భాగమే.. బాధపడొద్దు అని దూరం నుంచే నచ్చజెప్పే వాళ్లు.. వీటన్నిటికీ మించి.. గెలుపోటములు సహజం అంటూ ప్రత్యర్థి జట్టు విజయాన్ని కూడా హుందాగా అంగీకరించే మనస్తత్వం ఉన్నవాళ్లు.. అని చెప్పొచ్చేమో బహుశా!! మీరేమంటారు!? అభిమానానికి ఇదీ ఓ నిర్వచనం లాంటిదనుకుంటే అందులో నేనూ ఉంటాను!! -ఇట్లు టీమిండియా ఫ్యాన్.. ఎస్వీ!! View this post on Instagram A post shared by Bhawna Kohli Dhingra (@bhawna_kohli_dhingra) -
ఫైనల్లో అలా ఎందుకు చేశారు.. అతడికి బదులు: గంభీర్ విమర్శలు
CWC 2023 Final Ind Vs Aus Winner Australia: వన్డే వరల్డ్‌కప్-2023 ఫైనల్లో టీమిండియా ఓటమిని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. లీగ్ దశ నుంచి సెమీస్ వరకు అజేయంగా నిలిచిన రోహిత్ సేన తుదిమెట్టుపై బోల్తా పడటాన్ని తట్టుకోలేకపోతున్నారు. ప్రపంచకప్ టోర్నీ ముగిసి రెండురోజులు అవుతున్నా క్రీడా వర్గాల్లో ఈ మ్యాచ్ గురించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ బ్యాటర్ గౌతం గంభీర్, పాకిస్తాన్ దిగ్గజ బౌలర్ వసీం అక్రం చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. కాగా అహ్మదాబాద్ వేదికగా ప్రపంచకప్-2023 ఫైనల్లో టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఆరోసారి జగజ్జేతగా నరేంద్ర మోదీ స్టేడియంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 240 పరుగులకు ఆలౌట్ అయింది. రోహిత్ సేన విధించిన ఈ లక్ష్యాన్ని ఆసీస్ 43 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. తద్వారా ఆరోసారి విశ్వవిజేతగా అవతరించింది. ఇదిలా ఉంటే.. ఫైనల్ సందర్భంగా టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చర్చలకు తావిచ్చాయి. సూర్యకుమార్ యాదవ్‌ను ఆరో స్థానంలో గాకుండా ఏడో నంబర్లో ఆడించడంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అలా ఎందుకు చేశారు? ఈ విషయంపై తాజాగా స్పందించిన గంభీర్.. ‘‘నిజం చెప్తున్నా.. సూర్యకుమార్ కుమార్ విషయంలో అలా ఎందుకు చేశారో అర్థం కావడం లేదు. ఏదేమైనా అతడిని ఏడో నంబర్‌కు డిమోట్ చేయడం సరైన నిర్ణయం కాదు. విరాట్ అవుటైన తర్వాత కేఎల్ రాహుల్ మంచిగా బ్యాటింగ్ చేస్తున్నపుడు.. అతడికి తోడుగా సూర్యను పంపించి.. దూకుడుగా ఆడమని చెప్పాల్సింది. ఎందుకంటే అతడి తర్వాత జడేజా ఉంటాడు కాబట్టి సూర్య కూడా కాస్త స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసేవాడు. కానీ ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన సూర్య బాగా ఇబ్బంది పడ్డాడు. ‘‘నేను అవుటైతే.. నా తర్వాత జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్‌షమీ, కుల్దీప్ యాదవ్ మాత్రమే ఉన్నారు’’ అనే మైండ్‌సెట్‌తో మరీ డిఫెన్సివ్‌గా ఆడాడు. సమర్థించిన వసీం ఒకవేళ తన తర్వాత జడేజా వస్తాడంటే సూర్య తన సహజమైన గేమ్ ఆడేవాడు. సూర్యకు ప్యూర్ బ్యాటర్‌గా జట్టులో చోటిచ్చి ఏడో నంబర్లో పంపే బదులు.. అతడికి బదులు వేరే వాళ్లను ఎంపిక చేయాల్సింది’’ అని స్పోర్ట్స్‌కీడా షోలో అభిప్రాయపడ్డాడు. ఇక వసీం అక్రం కూడా గంభీర్ వాదనను సమర్థిస్తూ.. ‘‘అవును.. అతడు ప్యూర్ బ్యాటర్. ఒకవేళ హార్దిక్ జట్టులో ఉన్నపుడు కేవలం కొన్ని ఓవర్లు మాత్రమే మిగిలి ఉన్నాయనకుంటే ఇలాంటి నిర్ణయం తీసుకున్నా పర్లేదనిపిస్తుంది. కానీ అప్పటికి చాలా ఓవర్లు మిగిలే ఉన్నాయి కదా!’’ అని కెప్టెన్ రోహిత్ శర్మ నిర్ణయాన్ని తప్పుబట్టాడు. చదవండి: వరల్డ్‌కప్‌లో ఘోర పరాభవం.. పాక్ బోర్డు మరో కీలక నిర్ణయం View this post on Instagram A post shared by ICC (@icc) -
వరల్డ్‌కప్‌లో ఘోర పరాభవం.. పాక్ బోర్డు మరో కీలక నిర్ణయం
CWC 2023- Pakistan Team- PCB: వన్డే వరల్డ్‌కప్-2023లో ఘోర పరాభవం నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి బాబర్ ఆజం తప్పుకోగా.. పేసర్ షాహిన్ ఆఫ్రిదిని టీ20 సారథిగా ప్రకటించింది. అదే విధంగా టెస్టు పగ్గాలను షాన్ మసూద్‌కు అప్పగించింది. ఇక కెప్టెన్సీ మార్పులతో పాటు పాలనా విభాగం, శిక్షనా సిబ్బందిలోనూ కీలక మార్పులు చేస్తోంది. ఇందులో భాగంగా.. మాజీ క్రికెటర్లు మహ్మద్ హఫీజ్‌ను డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా నియమించిన పీసీబీ.. వహాబ్ రియాజ్‌ను చీఫ్ సెలక్టర్‌గా ఎంపిక చేసింది. బౌలింగ్ కోచ్‌లుగా ఉమర్ గుల్, సయీద్ అజ్మల్ తాజాగా.. పీసీబీ తమ కోచింగ్ స్టాఫ్‌లో మరో ఇద్దరు మాజీ క్రికెటర్లను చేర్చుకుంది. ఉమర్ గుల్, సయీద్ అజ్మల్లకు బౌలింగ్ కోచ్‌లుగా అవకాశం ఇచ్చింది. గుల్ ఫాస్ట్‌బౌలింగ్ విభాగానికి కోచ్‌గా సేవలు అందించనుండగా.. అజ్మల్ స్పిన్ దళానికి మార్గదర్శనం చేయనున్నాడు. వీరిద్దరు డిసెంబరులో ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు పీసీబీ చైర్మన్ జకా ఆష్రఫ్ మంగళవారం ప్రకటన విడుదల చేశాడు. కాగా ఉమర్ గుల్ ఇప్పటికే పాకిస్తాన్ జట్టుతో ప్రయాణం ఆరంభించాడు. అఫ్గనిస్తాన్‌తో టీ20 సిరీస్ సందర్భంగా కోచ్‌గా వ్యవహరించాడు. మోర్నీ మోర్కెల్ గుడ్‌బై కాగా భారత్ వేదికగా ప్రపంచకప్ ఈవెంట్లో పాకిస్తాన్ దారుణ వైఫల్యంతో విమర్శల పాలైన విషయం తెలిసిందే. ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన బాబర్ బృందం వరుస ఓటముల కారణంగా.. కనీసం సెమీస్ కూడా చేరకుండానే నిష్క్రమించింది. ముఖ్యంగా వన్డే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అఫ్గనిస్తాన్ చేతిలో చిత్తై పరాభవాన్ని మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో బాబర్ ఆజం కెప్టెన్సీ నుంచి తప్పుకోగా.. బౌలింగ్ కోచ్‌గా మోర్నీ మోర్కెల్ తన విధుల నుంచి వైదొలిగాడు. ఉమర్ గుల్.. సయీద్ అజ్మల్ కెరీర్ వివరాలు పాకిస్తాన్ తరఫున 2003లో ఎంట్రీ ఇచ్చిన 2016లో తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ఇక తన కెరీర్లో ఈ రైటార్మ్ పేసర్ 47 టెస్టులాడి 163, 130 వన్డేల్లో 179, 60 టీ20లలో 85 వికెట్లు పడగొట్టాడు. అజ్మల్ విషయానికొస్తే.. 2008లో ఇంటర్నేషనల్ క్రికెట్ మొదలుపెట్టిన ఈ రైటార్మ్ ఆఫ్‌బ్రేక్ స్పిన్నర్.. 2015లో ఆటకు గుడ్‌బై చెప్పాడు. తన కెరీర్లో 35 టెస్టులు, 113 వన్డేలు, 64 టీ20 మ్యాచ్‌లు ఆడి.. ఆయా ఫార్మాట్లలో 178, 184, 85 వికెట్లు పడగొట్టాడు. చదవండి: T20 WC: ‘వరల్డ్‌కప్-2024లో కెప్టెన్ రోహిత్ శర్మనే! కోహ్లి కూడా..’ -
CWC 2023: టాక్సీ డ్రైవర్ మాట విన్నందుకు ఇలా: సౌతాఫ్రికా లెజెండ్
సౌతాఫ్రికా దిగ్గజ క్రికెటర్ జాంటీ రోడ్స్ గత కొన్ని రోజులుగా భారత్‌లో పర్యటిస్తున్నాడు. ఢిల్లీ, గోవా అంటూ దేశమంతా చక్కర్లు కొడుతున్నాడు. ఈ క్రమంలో బెంగళూరుకు పయనమైన జాంటీ రోడ్స్‌కు టాక్సీ డ్రైవర్ మూలంగా కర్ణాటక వంటల రుచులు చవిచూసే అవకాశం లభించింది. అది కూడా రోడ్‌సైడ్ ఫుడ్! అయితే, జాంటీ రోడ్స్ ఆహార పదార్థాలను టేస్ట్ చేయడానికి మాత్రమే పరిమితమైపోలేదు. అవెంతో రుచిగా ఉన్నాయని.. తనకు ఈ అవకాశం కల్పించిన సదరు డ్రైవర్‌కు ధన్యవాదాలు కూడా చెప్పాడు. ట్రాఫిక్ చికాకు నుంచి తప్పించుకునే క్రమంలో తనకు ఇంత టేస్టీ ఫుడ్ పరిచయం చేసినందుకు అతడిపై ప్రశంసలు కురిపించాడు. ఈ మేరకు..‘‘బెంగళూరు ఎయిర్‌పోర్టు దగ్గర టాక్సీ డ్రైవర్ నాకో సలహా ఇచ్చాడు. ఎలాగూ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి.. మార్గమధ్యంలో రోడ్డు పక్కన తనకు ఇష్టమైన రెస్టారెంట్లో కాసేపు ఆగుదామని నాకు చెప్పాడు. నాకు తన ఆలోచన నచ్చి అలాగే అన్నాను. అద్భుతమైన రుచి గల మంగళూరు బన్‌తో మొదలుపెట్టి.. మైసూర్ మసాలా దోశ, మసాలా ఛాయ్‌తో ముగించాను’’ అంటూ ఐలవ్ ఇండియా అనే హ్యాష్ ట్యాగ్‌ను జతచేశాడు. అక్కడితో జాంటీ రోడ్స్ ఆగిపోలేదు.. తనకు ఇంతటి రుచికరమైన వంటకాలు అందించిన రెస్టారెంట్ సిబ్బందితో ఫొటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ మేరకు మంగళవారం జాంటీ రోడ్స్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో.. ‘‘క్రికెటర్లు అంటేనే లగ్జరీ లైఫ్.. ఫైవ్‌స్టార్ హోటళ్లలో బస.. లావిష్ రెస్టారెంట్లలో ఫుడ్.. అబ్బో వాళ్ల లైఫ్‌స్టైలే వేరు.. కానీ జాంటీ రోడ్స్ మాత్రం మిగతా క్రికెటర్లకు భిన్నం.. రోడ్‌సైడ్ ఫుడ్ టేస్ట్ చేయడంతో పాటు.. వాళ్ల సేవలకు తగిన మర్యాద ఇచ్చాడు. ముఖ్యంగా భారత్ మీద తన ప్రేమను చాటుకున్న విధానం అద్భుతం.. అందుకే నువ్వు లెజెండ్’’ అంటూ అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా ఐసీసీ వన్డే వరల్డ్‌కప్-2023 ట్రోఫీ టూర్ నుంచి జాంటీ రోడ్స్ ఇండియాలోనే ఉన్నాడు. ఇందులో భాగంగా వందే భారత్ రైళ్లోనూ ప్రయాణం చేశాడు. సౌతాఫ్రికా తరఫున 1992లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన జాంటీ రోడ్స్.. దిగ్గజ ఫీల్డర్‌గా పేరుగాంచాడు. 2003లో తన చివరి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడిన ఈ ప్రొటిస్ బ్యాటర్.. తన కెరీర్లో 52 టెస్టులు, 245 వన్డేలు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో వరుసగా.. 2532, 5935 పరుగులు సాధించాడు. When taxi driver at Bengaluru airport suggested to stop at his favourite restaurant for a roadside bite, because according to him: "traffic will be standing!" Grateful I took his advice. Excellent #mangalorebun and #Mysoremasaldosa, finished off with #masalachai #loveIndia pic.twitter.com/tH3KjykLUI — Jonty Rhodes (@JontyRhodes8) November 21, 2023 -
CWC 2023: ఇంకా తేల్చుకోలేదు... అహర్నిశలు పనిచేశా
అహ్మదాబాద్: టీమిండియా హెడ్ కోచ్ పదవీ కాలాన్ని పొడిగించుకోవాలా లేదంటే ముగించుకోవాలనే అంశంపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. బీసీసీఐ ఆయనతో కుదుర్చుకున్న రెండేళ్ల కాంట్రాక్టు నవంబర్ 19న వరల్డ్‌కప్ ఫైనల్‌తో ముగిసింది. టైటిల్ పోరులో పరాజయం అనంతరం భారమైన హృదయంతో ద్రవిడ్ మీడియా సమావేశానికి వచ్చాడు. నిరాశను దిగమింగి జట్టు ప్రదర్శన, ఫైనల్ పరాజయంపై విలేకర్లు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చాడు. ‘కొంతకాలంగా నేను పూర్తిగా ప్రపంచకప్‌పైనే దృష్టి పెట్టాను. జట్టు సన్నద్ధత కోసమే అహర్నిశలు పనిచేశాను. ఇది కాకుండా మరో ఆలోచనేది నేను చేయలేదు. భవిష్యత్ ప్రణాళికలపై ఆలోచించడానికి కూడా నేను సమయం వెచ్చించలేదు. నా రెండేళ్ల పదవీకాలంలోని జయాపజయాలు, ఘనతలు, విశేషాలపై విశ్లేషించుకోవడం లేదు’ అని 50 ఏళ్ల ద్రవిడ్ వివరించాడు. ‘అన్ని ఫార్మాట్లకు కోచ్‌గా పనిచేయడం చాలా బాగా అనిపించింది. వచ్చే ఏడాది జరిగే టి20 ప్రపంచకప్ మార్గదర్శనంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయదల్చుకోలేదు. జట్టు కోసం, ప్రపంచకప్ కోసం నాయకుడిగా రోహిత్ శర్మ ఎంతో శ్రమించాడు. మున్ముందు భారత హెడ్ కోచ్‌గా కొనసాగడంపై ఏ నిర్ణయం తీసుకోని నేను 2027 వన్డే ప్రపంచకప్‌పై ఏం మాట్లాడగలను. అప్పటికి జట్టులో ఎవరు ఉంటారో... ఏవరు పోతారో ఎవరికీ తెలియదు. అలాంటి దానిపై స్పందించడం తగదు’ అని ద్రవిడ్ వివరించాడు. -
వరల్డ్‌కప్ ఫైనల్లో టీమిండియా ఓటమి.. షాహీన్ షా అఫ్రిది పోస్ట్ వైరల్
వన్డే ప్రపంచకప్-2023 ఫైనల్లో టీమిండియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో 6 వికెట్ల తేడాతో భారత్ ఓటమి చవిచూసింది. దీంతో ఆరోసారి ఆస్ట్రేలియా ఛాంపియన్స్‌గా అవతరించగా.. భారత్ మరోసారి రన్నరప్‌గా నిలిచింది. ఇక ఛాంపియన్స్‌గా నిలిచిన ఆస్ట్రేలియాకు పాకిస్తాన్ స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిది అభినందనలు తెలిపాడు. "వన్డే ప్రపంచకప్-2023 విజేతగా నిలిచిన ఆస్ట్రేలియాకు నా అభినందనలు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మెరుగైన ప్రదర్శరన కనబరిచింది. టీమిండియాకు అదృష్టం కలిసిరాలేదు. కానీ టోర్నీ మొత్తం భారత్ అద్భుతంగా ఆడింది" అని ట్విటర్లో అఫ్రిది పోస్ట్ చేశాడు. కాగా ఈ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ విఫలమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 240 పరుగులకే ఆలౌటైంది. భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లి(54), కేఎల్ రాహుల్(66) పరుగులు చేశారు. అనంతరం 241 పరుగుల లక్ష్యాన్ని 43 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆసీస్ విజేతగా నిలవడంలో ట్రావిడ్ హెడ్ కీలక పాత్ర పోషించాడు. హెడ్ అద్బుతమైన సెంచరీతో (120 బంతుల్లో 137 పరుగులు) ఆరోసారి తన జట్టును ఛాంపియన్స్‌గా నిలిపాడు. చదవండి: AUS vs PAK: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్.. పాక్ జట్టు ప్రకటన! యువ సంచలనం ఎంట్రీ -
దెబ్బకొట్టిన ప్రపంచకప్ ఫైనల్.. తెలుగు హిట్ సినిమాకు ఆ రేంజ్ నష్టాలు!
ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా ఓడిపోయింది. ఈసారి కూడా మనోళ్లకు అదృష్టం కలిసిరాలేదని.. అభిమానులు తెగ బాధపడిపోతున్నారు. సరే దాని గురించి అలా వదిలేయండి. ఇదే వరల్డ్‌కప్ ఫైనల్ వల్ల ఓ తెలుగు హిట్ సినిమాపై దారుణమైన దెబ్బ పడింది. అలాంటి ఇలాంటి దెబ్బ కాదని చెప్పొచ్చు. దీంతో లాభాలు రావాల్సింది నష్టాలు వచ్చాయని తెలుస్తోంది. ఇంతకీ ప్రపంచకప్- ఆ తెలుగు చిత్రానికి సంబంధమేంటి? దురదృష్టం.. ఎప్పుడు, ఎలా వస్తుందనేది మనం అస్సలు ఊహించలేం. 'మంగళవారం' చిత్రానికి మాత్రం ప్రపంచకప్ ఫైనల్ రూపంలో వచ్చింది. సినిమాపై మంచి బజ్, ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దానికి తోడు థియేటర్లలోకి వచ్చిన తర్వాత అద్భుతమైన టాక్ సంపాదించింది. కానీ ఏం లాభం. టీమిండియా.. ఈ వరల్డ్‌కప్‌లో అత్యద్భుతమైన ఫామ్ తో ఫైనల్‌కి చేరడం.. 'మంగళవారం' మూవీకి శాపమైంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో రిలీజ్ కానున్న 24 సినిమాలు) ఆదివారం ఫైనల్ మ్యాచ్ అయినప్పటికీ శనివారం నుంచి దేశమంతా ఆ వైబ్‌లోకి వెళ్లిపోయింది. దీంతో హిట్ కొట్టిన 'మంగళవారం' మూవీని పూర్తిగా మరిచిపోయారు. ఈ క్రమంలోనే కలెక్షన్స్‌లో ఘోరమైన డ్రాప్ కనిపించింది. తొలిరోజు బాగానే వచ్చాయి కానీ కీలకమైన వీకెండ్లో మాత్రం వరల్డ్‌కప్ వల్ల జనాలు థియేటర్ల ముఖమే చూడలేదు. మనోళ్లు కప్ కొట్టకపోయేసరికి అభిమానులు ఇంకా బాధలోకి వెళ్లిపోయారు. దాన్నుంచి బయటకొచ్చి సినిమా చూస్తారా? అంటే సందేహమే!? అలానే వరల్డ్‌కప్ లేకపోయింటే.. 'మంగళవారం' సినిమాకు తక్కువలో తక్కువ రూ.3 కోట్లు గ్రాస్ వసూళ్లు అయినా వచ్చి ఉండేవని, ఈ ఫైనల్ దెబ్బకు రూ.1 కోటి కంటే చాలా తక్కువ కలెక్షన్స్ వచ్చాయని ట్రేడ్ వర్గాలు టాక్. ఇప్పుడు వీక్ డేస్‌లో జనాలు ఈ సినిమాని ఆదరిస్తే పుంజుకునే ఛాన్స్ ఉంది. లేదంటే హిట్ కొట్టిన నష్టాలు మాత్రం తప్పవు! (ఇదీ చదవండి: తెలుగు హీరోయిన్ కొడుక్కి ఎంగేజ్మెంట్.. ఫొటోలు వైరల్!) -
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్.. పాక్ జట్టు ప్రకటన! యువ సంచలనం ఎంట్రీ
వన్డే ప్రపంచకప్-2023లో లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టిన పాకిస్తాన్.. ఆస్ట్రేలియా పర్యటనకు సిద్దమవుతోంది. ఈ టూర్లో భాగంగా ఆతిథ్య ఆసీస్‌తో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో పాకిస్తాన్ తలపడనుంది. ఈ క్రమంలో 18 మంది సభ్యులతో కూడిన తమ జట్టును పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సోమవారం ప్రకటించింది. ఈ జట్టుకు వెటరన్ బ్యాటర్ షాన్ మసూద్ సారథ్యం వహించనున్నాడు. ఈ సిరీస్‌తో పాకిస్తాన్ టెస్టు కెప్టెన్‌గా మసూద్ ప్రయాణం ప్రారంభం కానుంది. బాబర్ ఆజం కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో పాక్ టెస్టు సారధిగా మసూద్ ఎంపికయ్యాడు. ఇక దేశీవాళీ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్న యువ ఓపెనర్ సైమ్ అయూబ్‌కు తొలిసారి పాక్ టెస్టు జట్టులో చోటు దక్కింది. అయూబ్‌తో పాటు యువ బౌలర్ ఖుర్రం షాజాద్‌కు పాక్ సెలక్టర్లు పిలుపునిచ్చారు. కాగా డిసెంబర్ 14న పెర్త్ వేదికగా జరగనున్న తొలి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఆసీస్‌తో టెస్టులకు పాక్ జట్టు: షాన్ మసూద్ (కెప్టెన్), సయీమ్ అయూబ్, అమీర్ జమాల్, అబ్దుల్లా షఫీక్, బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), ఇమామ్-ఉల్-హక్, సర్ఫరాజ్ అహ్మద్ (వికెట్ కీప), షాహీన్ షా ఆఫ్రిది, మహ్మద్ వసీం జూనియర్, మీర్ హమ్జా, ఖుర్రం షాజాద్ హసన్ అలీ, ఫహీమ్ అష్రఫ్, నోమన్ అలీ, అబ్రార్ అహ్మద్, సల్మాన్ అలీ అఘా, సౌద్ షకీల్ చదవండి: CWC 2023: నిన్నటి రోజు మనది కాకుండా పోయింది.. మోదీకి ధన్యవాదాలు: షమీ భావోద్వేగం The 18-member squad for Australia series has been revealed Saim Ayub & Khurram Shahzad have been called up for the three-match series #PAKvAUS #TestSeries pic.twitter.com/9rhZujQOg1 — Cricket Pakistan (@cricketpakcompk) November 20, 2023 -
వరల్డ్‌కప్ విజేత ఆస్ట్రేలియాకు ప్రైజ్ మనీ ఎంతో తెలుసా..?
వన్డే వరల్డ్‌కప్-2023 ఫైనల్లో టీమిండియాకు ఊహించని పరాభవం ఎదరైంది. ఈ మెగా టోర్నీలో వరుసగా 10 మ్యాచ్‌ల్లో గెలిచి ఫైనల్‌కు చేరిన భారత్.. తుది పోరులో మాత్రం ఆసీస్ జోరు ముందు చిత్తు అయింది. ఫైనల్ పోరులో ఆసీస్ చేతిలో 6 వికెట్ల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. దీంతో సొంత గడ్డపై భారత పతాకాన్ని రెపాలపాడాలంచాలనకున్న రోహిత్ సేన ఆశలు ఆడియాశలయ్యాయి. మరోవైపు వరల్డ్‌కప్‌ను తమ ఇంటిపేరుగా మార్చుకున్న ఆస్ట్రేలియా.. ఆరోసారి విశ్వ విజేతగా నిలిచింది. ఇక ఈ మెగా టోర్నీ ముగిసిన నేపథ్యంలో ఛాంపియన్స్, రన్నరప్ జట్లకు ఇచ్చే ఫ్రైజ్మనీపై ఓ లుక్కేద్దాం. విజేతకు ఎంతంటే? వన్డే వరల్డ్‌కప్ ప్రపంచకప్ విజేత ఆస్ట్రేలియాకు ప్రైజ్‌మనీ రూపంలో 4 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం 33 కోట్ల 17 లక్షల 8 వేల రూపాయలు) లభించింది. అదే విధంగా అదే విధంగా రన్నరప్‌గా నిలిచిన భారత్‌కు 2 మిలియన్ డాలర్లు(భారత కరెన్సీ ప్రకారం 16 కోట్ల 58 లక్షల 54 వేల రూపాయలు) దక్కింది. ఇక సెమీ ఫైనల్లో ఓటమి పాలైన దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌కు 8 లక్షల యూఎస్ డాలర్లు (6 కోట్ల 63 లక్షల 43 వేల 600 రూపాయలు)చొప్పున అందింది. అదే విధంగా గ్రూపు దశ నుంచి వైదొలిగిన 6 జట్లకు లక్ష యూఎస్ డాలర్లు (82 లక్షల 92 వేల 950 రూపాయలు) చొప్పున లభించింది. అదనంగా ప్రతీ గ్రూప్ స్టేజ్ విజయానికి ఆయా జట్లకు 40,000 డాలర్లు (సుమారు రూ. 33 లక్షలు) దక్కుతాయి. చదవండి: CWC 2023: నిరాశలో టీమిండియా! ఫైనల్లో బెస్ట్ ఫీల్డర్ మెడల్ అతడికే.. వీడియో వైరల్ -
వరల్డ్‌కప్ ఫైనల్లో ఓటమి.. టీమిండియా చేసిన తప్పులు ఇవే?
ఒకే ఒక్క మ్యాచ్.. కోట్ల మంది భారత అభిమానుల గుండె పగిలేలా చేసింది. ఒకే ఒక్క మ్యాచ్.. సొంత గడ్డపై మూడోసారి వరల్డ్‌కప్ ట్రోఫీని ముద్దాడాలన్న టీమిండియా ఆశలను అడియాశలు చేసింది. టోర్నీ ఆసాంతం అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన భారత జట్టు.. కీలకమైన ఫైనల్లో మాత్రం కంగారుల ముందు చేతులేత్తేసింది. తుది పోరులో అన్ని విభాగాల్లో విఫలమైన రోహిత్ సేన.. ఆస్ట్రేలియాకు మరోసారి వరల్డ్‌కప్‌ను అప్పగించింది. కాగా ఫైనల్ వరకు అజేయ జైత్రయాత్ర కొనసాగించిన టీమిండియా.. ఆఖరి మెట్టుపై ఎందుకు బోల్తా పడింది? అందుకు కారణాలు ఏంటి? బ్యాటింగ్ వైఫల్యం.. టీమిండియా ఓటమికి ప్రాధాన కారణం బ్యాటింగ్ వైఫల్యం. ఈ నిజాన్ని మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సైతం అంగీకరించాడు. ఆసీస్ కెప్టెన్ టాస్ గెలిచి అందరిని ఆశ్చర్యపరుస్తూ భారత జట్టును తొలుత బ్యాటింగ్‌కు ఆహ్హనించాడు. అదేంటి బ్యాటింగ్ అనుకూలించే వికెట్‌పై కమ్మిన్స్ బ్యాటింగ్ తీసుకున్నాడేంటని తెగ చర్చనడిచింది. హమ్మయ్య టీమిండియా తొలుత బ్యాటింగ్.. ఇక వరల్డ్‌కప్ మనదే అని అంతా ఫిక్స్ అయిపోయారు. రోహిత్ సైతం తాము మొదట బ్యాటింగే చేయాలనకుంటున్నట్లు టాస్ సందర్భంగా తెలిపాడు. కానీ మ్యాచ్ సగంలోనే ఆర్ధమైంది కమ్మిన్స్ తీసుకున్న నిర్ణయం సరైనదే అని. ఇన్నింగ్స్ ఆరంభంలోనే భారత్‌కు బిగ్ షాక్ తగిలింది. కీలకమైన ఫైనల్ మ్యాచ్ ఆడుతున్నానని మర్చిపోయిన యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్.. చెత్త షాట్ ఆడి తన వికెట్‌ను కోల్పోయాడు. అనంతరం కాసేపు అలరించిన రోహిత్ శర్మ కూడా అనవసరపు షాట్ ఆడి పెవిలియన్‌కు చేరాడు. కీలక సమయంలో క్రీజులో వచ్చిన శ్రేయస్ అయ్యర్ సైతం కేవలం 4 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఈ సమయంలో విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే చేశారు. అయితే విరాట్, రాహుల్‌ను జట్టును ముందుకు నడిపించినప్పటికి.. పూర్తిగా డిఫెన్సివ్ మైండ్ సెట్లోకి వెళ్లిపోయారు. దీంతో స్కోరింగ్ రేట్ పూర్తిగా పడిపోయింది. మిడిల్ ఓవర్లలో అస్సలు వీరిద్దరూ బ్యాట్ నుంచి బౌండరీలు కరవైపోయాయి. ఈ క్రమంలో విరాట్ కూడా ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా సైతం జట్టును ఆదుకోలేకపోయాడు. రాహుల్ బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడినప్పటికీ.. ప్రత్యర్ధి బౌలర్లపై ఎటువంటి ఒత్తిడి పెట్టలేకపోయాడు. 107 బంతులు ఆడిన రాహుల్ ఇన్నింగ్స్‌లో కేవలం ఒక్క బౌండరీ మాత్రమే ఉంది. ఇక్కడే మనకు అర్ధమవుతోంది. మిడిల్ ఓవర్లలో టీమిండియా బ్యాటింగ్ తీరు ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఆఖరిలో సూర్యకుమార్ యాదవ్ అయినా మెరుపులు మెరిపిస్తుండనుకుంటే తుస్సుమన్పించాడు. 28 బంతుల్లో 18 పరుగులు చేసి ఓ చెత్త షాట్ ఆడి తన వికెట్‌ను కోల్పోయింది. రాహుల్-కోహ్లి భాగస్వామ్యం మినహా భారత బ్యాటింగ్‌లో చెప్పకొదగ్గ పార్టనర్ షిఫ్ లేదు. వరుస క్రమంలో వికెట్లు కోల్పోయి 240 పరుగులకే చాపచుట్టుసేంది. చెత్త ఫీల్డింగ్.. టోర్నీ ఆరంభం నుంచి అద్బుతమైన ఫీల్డింగ్ ప్రదర్శన కనబరిచిన టీమిండియా.. ఫైనల్లో మాత్రం చేతేలేస్తేంది. తొలుత ఆస్ట్రేలియా ఫీల్డింగ్‌లో 20-25 పరుగులు కాపాడుకోగల్గితే.. భారత్ అందుకు భిన్నంగా అదనపు పరుగులు సమర్పించకుంది. ఫీల్డ్‌లో చాలా బద్దకంగా వ్యవహరించారు. ఒక పరుగు రావల్సిన చోట మరో అదనపు ఇచ్చి ఆసీస్ బ్యాటర్లపై ఒత్తిడి లేకుండా లేకుండా చేశారు. వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ కూడా సంప్ట్స్ వెనుక పెద్దగా అకట్టుకోలేకపోయాడు. ఇక భారత్ ఫీల్డింగ్‌లో ఆటగాళ్లు డైవ్ చేయడం కూడా మర్చిపోయారు. ఆసీస్ ఇన్నింగ్స్ మొత్తంలో డైవ్ చేసిన సందర్భాలు కేవలం ఒకట్రెండు ఉంటాయి. ఎక్స్‌ట్రాస్.. స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతీ పరుగు చాలా ముఖ్యం. అటువంటిది భారత్ బౌలర్లు ఏకంగా 18 అదనపు పరుగులు సమర్పించుకున్నారు. ఆస్ట్రేలియా మొత్తం 50 ఓవర్లలో 12 ఎక్స్‌ట్రాస్ ఇస్తే.. టీమిండియా 43 ఓవర్లలో 18 ఎక్స్‌ట్రాస్ సమర్పించుకుంది. ఇందులో 9 పరుగులు వైడ్ల రూపంలో వచ్చినివి. స్పిన్నర్లు విఫలం.. ఫైనల్ పోరులో టీమిండియా పేసర్లు కాస్త పర్వాలేదన్పించనప్పటికీ స్పిన్నర్లు మాత్రం విఫలమయ్యారు. కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. వికెట్ మాట పక్కన పడితే బ్యాటర్లను కొంచెం కట్టడి చేయలేకపోయారు. జడేజా తన 10 ఓవర్ల కోటాలో 43 పరుగులిస్తే.. కుల్దీప్ 56 పరుగులు సమర్పించుకున్నాడు. హెడ్ అద్బుత పోరాటం.. 241 స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఆరంభంలోనే గట్టి ఎదురు దెబ్బలు తగిలాయి. మనకంటే ఆసీస్‌కు చెత్త ఆరంభం లభించింది. మనం 10.2 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేస్తే.. ఆసీస్ 6.6 ఓవర్లకే మూడు వికెట్లు కోల్పోయి 47 పరుగులు చేసింది. ఈ సమయంలో ఓపెనర్ ట్రావిస్ హెడ్ తన శైలికి భిన్నంగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఎప్పుడైతే క్రీజులో నిలదొక్కుకున్నాడననే భారత బౌలర్లపై బౌండరీలతో విరుచుకుపడ్డాడు. చివరి వరకు అద్బుతంగా ఆడిన హెడ్ (120 బంతుల్లో 137 పరుగులు) ఆరోసారి తన జట్టును విశ్వవిజేతగా నిలిపాడు. అతడితో పాటు మార్నస్ లబుషేన్ (58 నాటౌట్) పరుగులతో ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. చదవండి: CWC 2023: నిన్నటి రోజు మనది కాకుండా పోయింది.. మోదీకి ధన్యవాదాలు: షమీ భావోద్వేగం -
నిరాశలో టీమిండియా! ఫైనల్లో బెస్ట్ ఫీల్డర్ మెడల్ అతడికే.. వీడియో వైరల్
వన్డే వరల్డ్‌కప్-2023 ఫైనల్లో అనూహ్య ఓటమితో టీమిండియాకు నిరాశే మిగిలింది. సొంతగడ్డపై కప్ గెలవాలన్న పట్టుదలతో ఆది నుంచి అద్భుతంగా ఆడినా.. అసలు పోరులో పరాజయమే ఎదురైంది. దీంతో పుష్కరకాలం తర్వాత మరోసారి వన్డే ప్రపంచకప్‌ను అందుకోవాలన్న కల కలగానే మిగిలిపోయింది. అహ్మదాబాద్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి తర్వాత అభిమానులతో పాటు ఆటగాళ్ల గుండెలు ముక్కలయ్యాయి. కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సహా ఇతర ఆటగాళ్లంతా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తుదిమెట్టుపై బోల్తా పడిన తీరును జీర్ణించుకోలేక ముంచుకొస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుని డ్రెస్సింగ్‌రూంకు వెళ్లిపోయారు. నిరాశతో అలా కూర్చుండిపోయారు. అయితే, ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్ ఆ గంభీర వాతావరణాన్ని తేలికపరిచే ప్రయత్నం చేశాడు. ప్రపంచకప్-2023 సందర్భంగా ప్రవేశపెట్టిన సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఆఖరి మ్యాచ్‌లోనూ బెస్ట్ ఫీల్డర్ మెడల్‌ను అందజేశాడు. అహ్మదాబాద్‌లో ఆసీస్‌తో ఆదివారం నాటి ఫైనల్లో ఈ అవార్డు అత్యధిక పరుగుల వీరుడు విరాట్ కోహ్లికి లభించింది. అయితే, ప్రతిసారి వినూత్న పద్ధతిలో విజేతను ప్రకటించే దిలీప్ ఈసారి మాత్రం సాదాసీదాగా కోహ్లి పేరును ప్రకటించాడు. ఓటమి బాధలో ఉన్న ఆటగాళ్లంతా అలా నిరాశగా కూర్చుండిపోగా దిలీప్ స్ఫూర్తిదాయక ప్రసంగంతో వారిలో ఉత్సాహం నింపేందుకు ప్రయత్నించాడు. ‘‘ఇది కష్టసమయం. మనందరికీ బాధాకరమైన రోజు. అయితే, మనలో ఎలాంటి ప్రయత్నలోపం లేదు. ప్రతి ఒక్కరం గెలుపు కోసం శ్రమించాం. కానీ ఫలితం మనకు అనుకూలంగా రాలేదు. అయితే, రాహుల్ భయ్యా చెప్పినట్లు మిమ్మల్ని చూసి మాతో పాటు అభిమానులంతా గర్వపడుతున్నారు. ఈ జట్టులో ఉన్న ప్రతి ఒక్క ఆటగాడు ప్రాక్టీస్ సెషన్లో ఎంత కఠినశ్రమకోర్చాడో మాకు తెలుసు. ఆట పట్ల మీ అంకిత భావం, నిబద్ధతను ప్రశంసించితీరాల్సిందే. గెలిచేందుకు మీరు శాయశక్తులా ప్రయత్నించారు. ఇంతకంటే ఇంకేం కావాలి. చాలా బాగా ఆడారు’’ అని దిలీప్ టీమిండియాను ప్రశంసించాడు. అనంతరం రవీంద్ర జడేజా మెడల్‌ను కోహ్లి మెడలో వేశాడు. కాగా ప్రపంచకప్ ఈవెంట్లో ఫీల్డింగ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లకు దిలీప్ ఇలా మెడల్స్ అందజేశాడు. కోహ్లి రెండుసార్లు, శ్రేయస్ అయ్యర్ రెండుసార్లు గెలవగా.. రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ తదితరులు కూడా పతకం అందుకున్నారు. కాగా ఆసీస్‌తో ఫైనల్లో షమీ బౌలింగ్‌లో ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఇచ్చిన క్యాచ్‌ను కోహ్లి అద్భుత రీతిలో క్యాచ్ అందుకున్న విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by Team India (@indiancricketteam) View this post on Instagram A post shared by ICC (@icc) -
నిన్నటి రోజు మనది కాకుండా పోయింది: షమీ భావోద్వేగం.. పోస్ట్ వైరల్
ICC WC 2023- Mohammad Shami Post Goes Viral: వన్డే వరల్డ్‌కప్-2023 ఫైనల్లో ఓటమిపై టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ స్పందించాడు. టోర్నీ ఆసాంతం తాము అద్బుతంగా ఆడామని.. కానీ నిన్నటి రోజు మాత్రం తమది కాకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. పడిలేచిన కెరటంలా తిరిగి పుంజుకుని అభిమానులను గర్వపడేలా చేస్తామని ధీమా వ్యక్తం చేశాడు. కాగా అహ్మదాబాద్ వేదికగా ఆదివారం(నవంబరు 19) జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలైన విషయం తెలిసిందే. నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన తుదిపోరులో ఆస్ట్రేలియా భారత జట్టును 6 వికెట్ల తేడాతో ఓడించి ట్రోఫీని కైవసం చేసుకుంది. అజేయ జట్టు.. ఆఖరి మెట్టుపై బోల్తా ఈ ఎడిషన్‌లో లీగ్ దశ నుంచి ఓటమన్నదే ఎరుగని రోహిత్ సేనకు తొలి ఓటమిని రుచి చూపించి.. ఏకంగా ఆరోసారి జగజ్జేతగా నిలిచింది. దీంతో.. మనోళ్లు కప్ గెలుస్తారని ఆశగా ఎదురుచూసిన కోట్లాది మంది అభిమానుల హృదయాలు ముక్కలయ్యాయి. సొంతగడ్డపై భారత్‌ను మరోసారి చాంపియన్‌గా చూడాలనుకున్న స్వప్నాలు చెదిరిపోయాయి. ఈ నేపథ్యంలో మహ్మద్ షమీ ‘ఎక్స్’ వేదికగా తన భావాలు పంచుకున్నాడు. ‘‘దురదృష్టవశాత్తూ నిన్నటి రోజు మనది కాకుండా పోయింది. జట్టుకు, నాకు టోర్నీ ఆసాంతం మద్దతుగా నిలిచిన భారతీయులందరికి పేరుపేరునా కృతజ్ఞతలు. మోదీజీకి థాంక్స్ ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ జీకి ప్రత్యేక ధన్యవాదాలు. ఆయన డ్రెస్సింగ్ రూంకి వచ్చి మాలో స్ఫూర్తిని నింపారు. మేము తిరిగి పుంజుకుంటాం’’ అని షమీ ఉద్వేగపూరిత నోట్ షేర్ చేశాడు. ప్రధాని మోదీ తనను ఆత్మీయంగా హత్తుకుని ఓదార్చుతున్న ఫొటోను జత చేశాడు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా భారత పేస్ త్రయంలో కీలకమైన మహ్మద్ షమీకి ప్రపంచకప్-2023 ఆరంభ మ్యాచ్‌లలో ఆడే అవకాశం రాలేదు. హార్దిక్ పాండ్యా రూపంలో పేస్ ఆల్‌రౌండర్ అందుబాటులో ఉండటంతో షమీని పక్కనపెట్టారు. ఆరంభంలో చోటే లేదు.. హయ్యస్ట్ వికెట్ టేకర్‌గా జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌లకు తుదిజట్టులో చోటిచ్చే క్రమంలో అతడికి తుదిజట్టులో చోటు లేకుండా పోయింది. ఈ క్రమంలో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో పాండ్యా గాయపడగా షమీ జట్టులోకి వచ్చాడు. లీగ్ దశలో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌తో ఎంట్రీ ఇచ్చిన ఈ రైటార్మ్ పేసర్ ఐదు వికెట్ల హాల్‌తో మెరిశాడు. ఆ తర్వాత ఇంగ్లండ్‌పై 4, శ్రీలంకపై 5, సౌతాఫ్రికాపై 2 వికెట్లు పడగొట్టాడు. ఇక న్యూజిలాండ్‌తో సెమీస్‌లో ఏకంగా రికార్డు స్థాయిలో ఏడు వికెట్లు కూల్చాడు. ఆస్ట్రేలియాతో ఫైనల్లో ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇలా మొత్తంగా 24 వికెట్లు తీసిన షమీ.. ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా నిలిచి అవార్డు అందుకున్నాడు. చదవండి: CWC 2023: అత్యుత్తమ జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా రోహిత్.. ఆసీస్ హీరోకు నో ఛాన్స్ Unfortunately yesterday was not our day. I would like to thank all Indians for supporting our team and me throughout the tournament. Thankful to PM @narendramodi for specially coming to the dressing room and raising our spirits. We will bounce back! pic.twitter.com/Aev27mzni5 — 𝕸𝖔𝖍𝖆𝖒𝖒𝖆𝖉 𝖘𝖍𝖆𝖒𝖎 (@MdShami11) November 20, 2023 View this post on Instagram A post shared by ICC (@icc) -
CWC 2023: అత్యుత్తమ జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా రోహిత్.. ఆసీస్ హీరోకు నో ఛాన్స్
45 రోజుల పాటు క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించిన వన్డే ప్రపంచకప్-2023కు ఎండ్ కార్డ్ పడింది. నవంబర్ 19న అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ ముగిసింది. వరల్డ్‌కప్-2023 ఛాంపియన్స్‌గా ఆస్ట్రేలియా నిలవగా.. టీమిండియా రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్ పోరులో ఆసాధరణ ప్రదర్శన కనబరిచిన ఆస్ట్రేలియా ఆరోసారి విశ్వవిజేతగా అవతరించింది. టోర్నీ ఆరంభం నుంచి అదరగొట్టిన భారత జట్టు ఆఖరి పోరులో మాత్రం తేలిపోయింది. ఇక ఇది ఇలా ఉండగా.. వరల్డ్‌కప్ ముగిసిన నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్‌ను ప్రకటించింది. ఈ జట్టుకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సారథిగా ఎంపికయ్యాడు. ఈ జట్టులో రోహిత్‌తో కలిపి మొత్తం 6 మంది భారత ఆటగాళ్లకు చోటు దక్కింది. భారత్ నుంచి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ ఉన్నారు. ఇక వీరితో పాటు ఆస్ట్రేలియా నుంచి గ్లెన్ మాక్స్వెల్, ఆడమ్ జంపా.. దక్షిణాఫ్రికా నుంచి క్వింటన్ డికాక్, న్యూజిలాండ్ నుంచి డార్లీ మిచెల్, శ్రీలంక ఫాస్ట్ బౌలర్ దిల్షాన్ మదుషంకకు చోటు దక్కింది. అదే విధంగా 12వ ఆటగాడిగా సౌతాఫ్రికాకు చెందిన కోయెట్జీని ఐసీసీ ఎంపిక చేసింది. కాగా ఐసీసీ ఎంపిక చేసిన ఈ జట్టులో ఉన్న ఆటగాళ్లందరూ ఈ మెగా టోర్నీలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. అయితే ఈ వరల్డ్‌కప్ సెమీఫైనల్, ఫైనల్లో అదరగొట్టిన ఆసీస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్‌కు చోటు దక్కకపోవడం గమనార్హం. ఐసీసీ బెస్ట్ ఎలెవన్: క్వింటన్ డికార్ (సౌతాఫ్రికా), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, డారెల్ మిచెల్, కేఎల్ రాహుల్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, దిల్షాన్ మదుషంక, ఆడమ్ జంపా, మహ్మద్ షమీ. 12వ ఆటగాడిగా కోయెట్జీ. -
గెలుపోటములు సహజం.. అదొక్కటే విషాదం! కోహ్లిని ఓదార్చిన సచిన్
ఒక్క అడుగు.. ఇంకొక్క అడుగు అంటూ ఊరించిన విజయం ఈసారి కూడా అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. పుష్కరకాలం తర్వాత సొంతగడ్డపై వన్డే ప్రపంచకప్ ట్రోఫీని గెలవాలన్న టీమిండియా కల ఆస్ట్రేలియా కారణంగా చెదిరిపోయింది. ఐసీసీ టోర్నీల్లో తమకు తామే సాటి అన్న విషయాన్ని మరోసారి నిరూపించిన కంగారు జట్టు రికార్డు స్థాయిలో ఆరోసారి విజేతగా నిలవగా.. మూడోసారి కప్‌ను ముద్దాడాలని భావించిన భారత జట్టుకు నిరాశ ఎదురైంది. అత్యధిక పరుగుల వీరుడుగా విరాట్ కోహ్లి.. అత్యధిక వికెట్లు పడగొట్టిన ధీరుడిగా మహ్మద్ షమీ.. కెప్టెన్‌గానే కాకుండా బ్యాటర్‌గానూ రాణించిన రోహిత్ శర్మ.. మిడిలార్డర్లో స్థాయికి తగ్గట్లు ఆడిన శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్.. తమ పని తాము చేసుకుపోతూ విజయాల్లో తమ వంతు పాత్ర పోషించిన బౌలింగ్ దళం.. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్.. చిన్నపిల్లాడిలా ఏడ్చేసిన సిరాజ్ ఒక మ్యాచ్‌లో ఒకరు హీరోగా నిలిస్తే.. మరో మ్యాచ్‌లో ఇంకొకరు.. అంతా కలిసి సమష్టిగా రాణించి లీగ్ దశతో పాటు సెమీ ఫైనల్లోనూ జట్టును అజేయంగా నిలిపారు. ఉవ్వెత్తున ఎగిసే కెరటాల్లా టాప్‌గేర్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లారు. కానీ.. తుదిమెట్టుపై ఊహించని ఫలితంతో డీలా పడ్డారు. ఇప్పుడు కాక.. ఇంకెప్పుడు.. దిగాలుగా రోహిత్, కోహ్లి అహ్మదాబాద్‌లో లక్ష మందికి పైగా అభిమానుల సమక్షంలో ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన ఓటమిని జీర్ణించుకోలేక సిరాజ్ చిన్నపిల్లాడిలా ఏడిస్తే.. రోహిత్, కోహ్లి సైతం దిగాలుగా తలలు దించుకున్నారు. ఇంతదాకా వచ్చి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు అన్న పరిస్థితిలో దాదాపుగా తమ ఫైనల్ వన్డే వరల్డ్‌కప్ ఆడిన ఈ దిగ్గజ బ్యాటర్ల మనసులో దాగిన ఆవేదన వారి ముఖాల్లో స్పష్టంగా కనిపించింది. దీంతో అశేష అభిమానులతో పాటు భారత మాజీ క్రికెటర్ల హృదయాలు కూడా ముక్కలయ్యాయి. జట్టును ఓదార్చిన సచిన్ అయితే, ఆటలో గెలుపోటములు సహజమంటూ ఫ్యాన్స్‌తో పాటూ వారూ రోహిత్ సేనకు అండగా నిలబడుతున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ మైదానంలోకి వచ్చి భారత ఆటగాళ్లను ఓదార్చిన దృశ్యాలు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తన వన్డే సెంచరీల రికార్డు బ్రేక్ చేసిన కోహ్లిని ఆత్మీయంగా హత్తుకున్న సచిన్.. మిగతా ఆటగాళ్లతో కరచాలనం చేస్తూ వారిని అనునయించే ప్రయత్నం చేశాడు. ఇక్కడిదాకా సాగిన మీ ప్రయాణం అద్బుతం అంటూ ఓటమి బాధలో కూరుకుపోయిన జట్టును ఓదార్చాడు. నిజమే కదా.. ఆట అన్నాక ఒకరు గెలవడం.. మరొకరు ఓడిపోవడం సహజమే.. అయితే, ఆ ఓడిపోయిన వాళ్లుగా మన జట్టు ఉండటం విషాదం!! చదవండి: CWC 2023: విరాట్ కోహ్లికి మూడు, షమీకి రెండు.. అవార్డుల జాబితా Sachin Tendulkar with the Indian team. pic.twitter.com/6JshYuzDsd — Mufaddal Vohra (@mufaddal_vohra) November 19, 2023 View this post on Instagram A post shared by ICC (@icc) -
భారతదేశపు మొట్టమొదటి దళిత క్రికెటర్.. ఎవరీ పల్వంకర్ బాలూ
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ పోరులో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓటమి చెందిన విషయం తెలిసిందే. లీగ్ మ్యాచుల్లో అదరగొట్టి ఓటమి ఎరుగని జట్టుగా పేరుతెచ్చిన భారత్.. ఫైనల్లో చతికిలబడింది. తుదిపోరులో ఆరు వికేట్ల తేడాతో రోహిత్ సేన జట్టు కంగారుల చేతిలో ఘోర పరాజయపాలైంది. అయితే హోం గ్రౌండ్లో టీమిండియా ఓటమిని భారత క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. 12 తర్వాత ప్రపంచకప్‌ను ముద్దాడుతుందనుకున్న భారత్‌కు ఇలా జరగడంపై తీవ్ర నిరాశ చెందుతున్నారు. ఉద్వేగంతో కన్నీరు పెట్టుకుంటున్నారు. ఈ తరుణంలో కన్నడ నటుడు, సామాజిక కార్యకర్త చేతన్ కుమార్ అహింస చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. క్రికెట్లో కూడా రిజర్వేషన్లు ఉండాలని, ఒకవేళ ఇప్పటికే రిజర్వేషన్లు ఉంటే భారత్ వరల్డ్‌కప్ సులువగా గెలిచేదని తెలిపారు. వరల్డ్ కప్ జరిగే రోజు చేతన్ మరో ట్వీట్ కూడా చేశాడు. డబ్బు, కీర్తి కోసం కాకుండా సమాజం గురించి ఆలోచించే ఆటగాళ్లు దేశానికి అవసరమని.. 1876లో కర్ణాటకలోని ధర్వాడ్‌లో జన్మించిన భారత దేశపు మొట్టమొదటి దళిత క్రికెటర్ పల్వకంర్ బాలూ ప్రస్తావన తీసుకొచ్చారు. వందేళ్ల క్రితం పల్వంకర్ బాలూ క్రికెటర్(బౌలర్)గా, సామాజిక, రాజకీయ కార్యకర్తగా చురుకుగా పనిచేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈయన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చేతన్ అహింస ప్రస్తావనతో పల్వంకర్ బాలూ గురించి బయటకొచ్చింది. పల్వంకర్ బాలూ భారతీయ క్రికెటర్, రాజకీయ కార్యకర్త. 1876 మార్చి 19న కర్ణాటకలోని ధార్వాడ్‌లో(ఒకప్పటి బాంబే ప్రెసిడెన్సీ) జన్మించాడు. ప్రపంచ క్రీడల్లో పేరు ప్రఖ్యాతలు సాధించిన దళిత సమాజానికి చెందిన మొదటి వ్యక్తిగా బాలూ చరిత్రకెక్కాడు. అతడు పరమానందాస్ జీవందాస్ హిందూ జింఖానా, బాంబే బెరార్, కేంద్ర రైల్వేశాఖకు చెందిన కార్పొరేట్ క్రికెట్ జట్టు తరపున ఆడాడు. ఎడమ చేతి స్పిన్ బౌలర్ అయిన బాలూ.. మొత్తం 33 ఫస్ట్-క్లాస్మ్యాచ్లలో (15.21 బౌలింగ్ సగటుతో) 179 వికెట్లు పడగొట్టాడు. 1911 ఇంగ్లాండ్ పర్యటనలో ఇండియా తరపున అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి ‘రోడ్స్ ఆఫ్ ఇండియా’గా పేరు సంపాదించాడు. అయితే బాలూ తన సామాజిక వర్గం కారణంగా కెరీర్లో అనేక వివక్షతను ఎదుర్కొన్నారనే అభిప్రాయాలు ఉన్నాయి. తక్కువ కులానికి చెందిన వ్యక్తిగా ముద్ర పడటంతో సమాన అవకాశాలు దక్కలేదనే విమర్శ ఉంది. ఒకసారి పుణెలో మ్యాచ్ ఆడుతుండగా.. టీ విరామం సమయంలో అతనికి టీం సభ్యులందరితో కాకుండా బయట డిస్పోజబుల్ కప్పులో అందించినట్లు, అతనికి భోజనం కూడా ప్రత్యేక టేబుల్‌పై వడ్డించినట్లు వార్తలొచ్చాయి. పల్వంకర్ తన ముఖం కడక్కోవాలనుకున్నా అణగారిన వర్గానికి చెందిన అటెండర్ అతనికి ఒక మూలన నీళ్లు తెచ్చి పెట్టేవాడని తెలుస్తోంది. అయితే బాలూ బొంబాయికి మారిన తర్వాత పరిస్థితులు మెరుగుపడినప్పటికీ.. క్వాడ్రాంగ్యులర్ టోర్నమెంట్లో అతనికి హిందూ జట్టు కెప్టెన్సీ నిరాకరించారు. భారత క్రికెట్ చరిత్రలో గొప్ప క్రికెటర్లలో ఒకరిగా పల్వంకర్ పేరు గాంచారు. గాంధీ భావజాలంతో ప్రభావితమై.. దేశంలో హోమ్ రూల్ తీసుకురావడానికి కృషి చేశాడు. 1910లో పల్వంకర్ బీఆర్ అంబేద్కర్‌ను తొలిసారి కలిశాడు. అనంతరం ఇరువురు మంచి మిత్రులుగా మారారు. వీరిద్దరూ అణగారిన వర్గాల అభివృద్ధికి కృషి చేసి ప్రశంసలు అందుకున్నారు. అనంతరం వీరిద్దరి మధ్య స్నేహం దెబ్బతింది. 1932లో అణగారిన తరగతులకు ప్రత్యేక నియోజకవర్గాల కోసం డాక్టర్ అంబేద్కర్ చేసిన డిమాండ్‌ను బాలూ వ్యతిరేకించాడు. అనంతరం అంబేద్కర్‌కు వ్యతిరేకంగా ‘రాజా-మూంజే ఒప్పందం’పై సంతకమూ చేశాడు. అంబేద్కర్ బౌద్ధమతంలోకి మారాలనే తన ఉద్దేశాన్ని వ్యక్తం చేసినప్పుడు.. అణగారిన వర్గాలను ఇతర మతాల్లోకి మార్చడాన్ని 'ఆత్మహత్య'గా అభివర్ణించాడు. 1933లో బాలూ హిందూ మహాసభ టికెట్‌పై బొంబాయి మున్సిపాలిటీ నియోజకవర్గానికి పోటీ చేసి ఓటమి చెందాడు. నాలుగు సంవత్సరాల తరువాత కాంగ్రెస్‌లో చేరి బొంబాయి శాసనసభ ఎన్నికలలో బీఆర్ అంబేద్కర్‌కు వ్యతిరేకంగా పోటీ చేసి మరోసారి పరాజయం పొందాడు. స్వాతంత్ర్యం అనంతరం 1955 జూలై4న బాంబే స్టేట్‌లో మరణించాడు. డాయన అంత్యక్రియలకు పలువురు జాతీయ నాయకులు మరియు క్రికెటర్లు హాజరయ్యారు. -
CWC 2023: వాళ్ల చేతిలో ఓడినందుకు సిగ్గుపడాల్సిన అవసరం లేదు!
వన్డే వరల్డ్‌కప్-2023 ఫైనల్లో ఓడిన రోహిత్ సేనకు టీమిండియా క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ అండగా నిలిచాడు. ఇప్పటికే ఐదుసార్లు చాంపియన్ అయిన జట్టు చేతిలో ఓడిపోయినందుకు సిగ్గుపడాల్సిన అవసరం లేదన్నాడు. టోర్నీ ఆసాంతం అద్భుత ప్రదర్శనతో వినోదం పంచడం గొప్ప విషయమంటూ బాసటగా నిలిచాడు. కాగా సొంతగడ్డపై లీగ్ దశలో తొమ్మిదికి తొమ్మిది మ్యాచ్‌లు గెలిచిన టీమిండియా.. సెమీస్‌లో న్యూజిలాండ్ రూపంలో ఎదురైన గండాన్ని దిగ్విజయంగా దాటింది. ప్రపంచకప్ పదమూడవ ఎడిషన్‌లో ఫైనల్ చేరిన తొలి జట్టుగా నిలిచింది. కానీ తుదిమెట్టుపై ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలై ట్రోఫీని చేజార్చుకుంది. టాస్ ఓడి నామమాత్రపు స్కోరుకు పరిమితమైన రోహిత్ సేన 6 వికెట్ల తేడాతో ఓడి రిక్తహస్తాలతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో భారత్ ఓటమిపై మాజీ కెప్టెన్, కామెంటేటర్ సునిల్ గావస్కర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఈసారి అంతా సజావుగా సాగుతుందని భావిస్తే దురదృష్టవశాత్తూ ఆఖరి నిమిషంలో తారుమారైంది. ఒక్కోసారి అదృష్టం కూడా కలిసి వస్తేనే అనుకున్నవి సాధ్యపడతాయి. అయినా.. పటిష్ట జట్టు చేతిలో ఓడిపోయిన కారణంగా ఇందులో సిగ్గుపడాల్సింది ఏమీ లేదు. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో ఆసీస్‌పై టీమిండియా పైచేయి సాధించింది. ఈరోజు వాళ్లు తమదైన శైలిలో రాణించి గెలిచారు. ఐదుసార్లు చాంపియన్ అయిన జట్టుకు ఫైనల్లో ఎలా గెలవాలో కచ్చితంగా తెలిసే ఉంటుంది కదా! ఏదేమైనా టీమిండియా ఇక్కడి దాకా సాగించిన ప్రయాణం మమ్మల్నందరినీ గర్వపడేలా చేసింది. కోట్లాది మంది ప్రేక్షకులకు మీరు వినోదం పంచారు. గర్వపడేలా చేశారు’’ అంటూ భారత ఆటగాళ్లను గావస్కర్ ప్రశంసించాడు. కాగా ప్రధాని నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సహా పలువురు ప్రముఖులు సైతం టీమిండియాకు మద్దతుగా ట్వీట్లు చేసిన విషయం విదితమే!! ఇదిలా ఉంటే తాజా విజయంలో ఆస్ట్రేలియా ఆరోసారి చాంపియన్‌గా నిలిచి సత్తా చాటింది. View this post on Instagram A post shared by ICC (@icc) -
రోహిత్ నిరాశ చెందాడో లేదో కానీ.. వాళ్లు మాత్రం: సెహ్వాగ్ విమర్శలు
ICC CWC 2023 Final- Rohit Sharma: టీమిండియా ఈసారి కచ్చితంగా ట్రోఫీ గెలుస్తుందనే అభిమానుల ఆశలు అడియాసలయ్యాయి. సొంతగడ్డపై 2011 నాటి ఫలితం పునరావృతమవుతుందనుకుంటే తీవ్ర నిరాశే మిగిలింది. తుదిపోరుకు ముందు దాకా అజేయంగా ముందుకు సాగిన రోహిత్ సేన అసలు మ్యాచ్‌లో తడబడి భారీ మూల్యమే చెల్లించింది. ఆఖరి మెట్టుపై ఆస్ట్రేలియా ఒత్తిడిని చిత్తు చేసి ట్రోఫీ గెలవగా.. భారత జట్టుతో పాటు అభిమానుల గుండెలు ముక్కలయ్యాయి. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ ఆట తీరుపై భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దూకుడుగా ఆడిన రోహిత్ అహ్మదాబాద్ వేదికగా ఆసీస్‌తో మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగింది టీమిండియా. ఓపెనర్ రోహిత్ శర్మ ఆది నుంచే దూకుడుగా ఆడి అద్భుత ఆరంభం అందించాడు. మరో ఓపెనర్ శుబ్‌మన్ గిల్(4) విఫలమైనా వన్‌డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి(54)తో కలిసి స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. వీరిద్దరు క్రీజులో కుదురుకుంటే మెరుగైన భాగస్వామ్యంతో భారీ స్కోరుకు పునాది పడేది. కానీ రోహిత్ శర్మ అనూహ్య రీతిలో అవుట్ కావడం కొంపముంచింది. టీమిండియా ఇన్నింగ్స్ పదో ఓవర్లో ఆసీస్ స్పిన్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ బౌలింగ్‌కు వచ్చాడు. హెడ్ అద్భుత క్యాచ్‌తో హిట్‌మ్యాన్ ఇన్నింగ్స్‌కు తెర అతడి బౌలింగ్‌లో రెండో బంతికి సిక్స్ కొట్టిన రోహిత్.. మరుసటి బంతికి ఫోర్ బాదాడు. కానీ మరోసారి భారీ షాట్‌కు యత్నించి మూల్యం చెల్లించాడు. మాక్సీ విసిరిన బంతిని మిడాన్ దిశగా రోహిత్ గాల్లోకి లేపగా.. కవర్ పాయింట్లో ఉన్న ట్రవిస్ హెడ్ పాదరసంలా వెనక్కి కదిలి అద్భుత రీతిలో క్యాచ్ అందుకున్నాడు. దీంతో మాక్సీ, ఆసీస్ కెప్టెన్ గట్టిగా అరుస్తూ సంబరాలు చేసుకోగా.. మోదీ స్టేడియంలో ఉన్న అభిమానులు ఒక్కసారిగా మూగబోయారు. అలా హాఫ్ సెంచరీకి చేరువైన రోహిత్.. తొందరపడి తప్పుడు షాట్ సెలక్షన్‌తో 47 పరుగుల వద్ద నిష్క్రమించాడు. మిగతా వాళ్లలో కోహ్లి 54, రాహుల్ 66 పరుగులతో రాణించగా.. 240 పరుగులకు ఆలౌట్ అయిన భారత్.. స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోలేక ఓటమిపాలైంది. చెత్త షాట్ సెలక్షన్ ఈ నేపథ్యంలో సెహ్వాగ్ క్రిక్‌బజ్ షోలో మాట్లాడుతూ.. ‘‘ఈ విషయంలో రోహిత్ నిరాశ చెందాడో లేదో కానీ మేనేజ్మెంట్ మాత్రం కచ్చితంగా డిస్సప్పాయింట్ అయి ఉంటుంది. వరుస బంతుల్లో సిక్స, ఫోర్ బాదిన తర్వాత కూడా ఇలాంటి షాట్లు ఎంపిక చేసుకోవద్దని శిక్షణా సిబ్బంది అతడికి చెప్పండి. పవర్ ప్లే ముగస్తుంది కాబట్టి మాక్స్వెల్ బౌలింగ్‌లో వీలైనన్ని ఎక్కువ పరుగులు రాబట్టాలని రోహిత్ భావించి ఉంటాడు. ఏదేమైనా.. నిజంగా అది చెత్త షాట్ సెలక్షన్. ఒకవేళ రోహిత్ గనుక అలా చేయకపోయి ఉంటే కథ వేరుగా ఉండేది’’ అని విమర్శించాడు. చదవండి: CWC 2023 Final: మిచెల్ మార్ష్ అనుచిత ప్రవర్తన.. ! View this post on Instagram A post shared by ICC (@icc) -
CWC 2023: విరాట్ కోహ్లికి మూడు, షమీకి రెండు.. అవార్డుల జాబితా
CWC 2023 Winner Australia: క్రికెట్ మెగా సమరానికి తెరపడింది. భారత్ వేదికగా అక్టోబరు 5న మొదలైన వన్డే వరల్డ్‌కప్ పండుగ ఆదివారంతో ముగిసిపోయింది. అజేయ రికార్డుతో ఫైనల్ చేరిన టీమిండియా ట్రోఫీ గెలుస్తుందని కోటి ఆశలతో ఎదురుచూసిన అభిమానులకు నిరాశే మిగిలింది. అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్లో రోహిత్ సేనను ఓడించి ఆస్ట్రేలియా ఆరోసారి విశ్వవిజేతగా అవతరించింది. అనూహ్య విజయాలతో తుదిపోరుకు అర్హత సాధించిన ప్యాట్ కమిన్స్ బృందం విజయంతో ఈ ఐసీసీ టోర్నీని ముగించి సగర్వంగా స్వదేశానికి వెళ్లనుంది. ఇదిలా ఉంటే.. అసలు మ్యాచ్‌లో ఓటమిపాలైన టీమిండియా ఈ ఐసీసీ టోర్నీలో అత్యధిక పరుగుల వీరుడు, అత్యధిక వికెట్లు తీసిన బౌలర్, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ వంటి అవార్డులు గెలుచుకుంది. ప్రపంచకప్-2023 టోర్నమెంట్లో వివిధ అవార్డులు అందుకున్న ప్లేయర్ల లిస్టు 1.ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ - విరాట్ కోహ్లీ- ఇండియా (765 పరుగులు, 1 వికెట్, 5 క్యాచ్‌లు) 2. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఫైనల్- ట్రవిస్ హెడ్- ఆస్ట్రేలియా(137 పరుగులు, 1 క్యాచ్) 3.అత్యధిక పరుగులు- విరాట్ కోహ్లి(11 ఇన్నింగ్స్‌లో 765 పరుగులు) 4.అత్యధిక స్కోరు- గ్లెన్ మాక్స్వెల్(ముంబైలో అఫ్గనిస్తాన్ మీద 201 పరుగులు- నాటౌట్) 5. అత్యధిక సెంచరీలు- క్వింటన్ డికాక్- సౌతాఫ్రికా(4 శతకాలు) 6. అత్యధిక అర్ధ శతకాలు- విరాట్ కోహ్లి(6 ఫిఫ్టీలు) 7. అత్యధిక వికెట్లు- మహ్మద్ షమీ- ఇండియా(7 ఇన్నింగ్స్‌లో 24 వికెట్లు) 8. అత్యుత్తమ గణాంకాలు- మహ్మద్ షమీ(ముంబైలో న్యూజిలాండ్ మీద 7/57) 9. అత్యధిక సిక్సర్లు- రోహిత్ శర్మ- ఇండియా(31 సిక్స్‌లు) 10. అత్యధిక క్యాచ్‌లు- డారిల్ మిచెల్- న్యూజిలాండ్(11 క్యాచ్‌లు) 11. అత్యధిక అవుట్లు చేసిన వికెట్ కీపర్- క్వింటన్ డికాక్(20) 13. అత్యధిక స్ట్రైక్‌రేటు- గ్లెన్ మాక్స్వెల్(150.37) పూర్తి వివరాలు- ఇతర విశేషాలు ►ఈ ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా భారత స్టార్ విరాట్ కోహ్లి నిలిచాడు. కోహ్లి 11 మ్యాచ్‌లు ఆడి 3 సెంచరీలు, 6 అర్ధ సెంచరీలతో కలిపి మొత్తం 765 పరుగులు సాధించాడు. ►ఈ ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా భారత పేసర్ మొహమ్మద్ షమీ నిలిచాడు. షమీ 7 మ్యాచ్‌లు ఆడి మొత్తం 24 వికెట్లు పడగొట్టాడు. షమీ మొత్తం 48.5 ఓవర్లు వేసి 257 పరుగులు ఇచ్చాడు. ►మొత్తం ప్రపంచకప్ టోర్నీలలో అత్యధిక టీమ్ స్కోరు ఈ ప్రపంచకప్‌లోనే నమోదైంది. శ్రీలంకతో న్యూఢిల్లీలో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 5 వికెట్లకు 428 పరుగులు సాధించింది. ►ధర్మశాలలో ఆ్రస్టేలియా (388 ఆలౌట్; 49.2 ఓవర్లలో), న్యూజిలాండ్ (50 ఓవర్లలో 383/9) జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో మొత్తం 771 పరుగులు వచ్చాయి. ప్రపంచకప్ టోర్నీల చరిత్రలో ఇదే అత్యధికం. ►ఈ ప్రపంచకప్‌లో అత్యధిక వ్యక్తిగత నమోదు చేసిన బ్యాటర్‌గా ఆస్ట్రేలియా క్రికెటర్ మ్యాక్స్‌వెల్ నిలిచాడు. అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్ (128 బంతుల్లో 201 నాటౌట్; 21 ఫోర్లు, 10 సిక్స్‌లు) అజేయ డబుల్ సెంచరీ సాధించాడు. ►ఈ ప్రపంచకప్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన బౌలర్‌గా భారత పేసర్ మొహమ్మద్ షమీ నిలిచాడు. న్యూజిలాండ్‌తో ముంబైలో జరిగిన సెమీఫైనల్లో షమీ 57 పరుగులిచ్చి 7 వికెట్లు తీశాడు. ►ఈ ప్రపంచకప్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో 400 అంతకంటే ఎక్కువ స్కోర్లు మూడుసార్లు నమోదయ్యాయి. శ్రీలంకపై దక్షిణాఫ్రికా (428/5), నెదర్లాండ్స్‌పై భారత్ (410/4), పాకిస్తాన్‌పై న్యూజిలాండ్ (401/6) సాధించాయి. ►వన్డే వరల్డ్‌కప్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్’ అవార్డు గెల్చుకున్న మూడో భారతీయ క్రికెటర్‌గా విరాట్ కోహ్లి గుర్తింపు పొందాడు. గతంలో సచిన్ టెండూల్కర్ (2003లో), యువరాజ్ సింగ్ (2011లో) ఈ ఘనత సాధించారు. చదవండి: అదే మా కొంపముంచింది.. చాలా బాధగా ఉంది! వారిద్దరికి క్రెడిట్: రోహిత్ శర్మ View this post on Instagram A post shared by ICC (@icc) -
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చూస్తూ గుండెపోటుతో యువకుడి మృతి
సాక్షి, తిరుపతి: తిరుపతిలో విషాదం చోటుచేసుకుంది. వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ మ్యాచ్ చూస్తూండగా ఉత్కంఠ లోనైన క్రికెట్అభిమాని గుండె పోటుతో మృతి చెందాడు. వివరాలు.. తిరుపతి రూరల్ మండలం దుర్గసముద్రం గ్రామానికి చెందిన జ్యోతి కుమార్ యాదవ్ అనే యువకుడు బెంగుళూరులో సాఫ్ట్‌వేర్‌గా ఉద్యోగం చేస్తున్నారు. ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం చేస్తున్న జ్యోతి కుమార్.. ఇంటి వద్దనే ఆదివారం భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన వన్డే వరల్డ్‌కప్‌ఫైన్ మ్యాచ్‌ను స్నేహితులతో కలిసి చూశాడు. ఎంతో ఉద్వేగంతో మ్యాచ్ వీక్షిస్తున్న సమయంలో గుండె నొప్పి రావడంతో చికిత్స కోసం స్నేహితులు తిరుపతి స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. మ్యాచ్ చూస్తున్న సమయంలో ఆస్ట్రేలియా జట్టు మూడు వికెట్లు పడే సరికి ఆనందంతో తట్టుకోలేక ఊగిపోయాడని, ఆ తర్వాత గుండె నొప్పి రావడంతో తుది శ్వాస విడిచాడని స్నేహితులు కన్నీళ్ల పర్యంతమయ్యారు. మృతుడు కుటుంబాన్ని తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పరామర్శించారు. చదవండి: దేశం ఎప్పుడూ మీ వెంటే: వరల్డ్‌కప్ ఫైనల్లో భారత్ ఓటమిపై ప్రధాని మోదీ -
ఛేదనలో నా గుండె దడ కూడా పెరిగింది.. అతడో లెజెండ్: ఆసీస్ కెప్టెన్
CWC 2023 Winner Australia- Pat Cummins Comments: భారత గడ్డపై వన్డే ప్రపంచకప్ గెలవడం రెట్టింపు సంతోషాన్నిచ్చిందని ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ హర్షం వ్యక్తం చేశాడు. జట్టు సమిష్టిగా రాణించడం వల్లే ఈ అపురూప విజయం సాధ్యమైందని పేర్కొన్నాడు. భారత్‌లో ఐసీసీ ట్రోఫీ గెలవడం అద్భుతమైన అనుభూతి అని.. తన జీవితంలో ఈ క్షణాలు మధుర జ్ఞాపకాలుగా మిగిలిపోతాయని ఉద్వేగానికి లోనయ్యాడు. లక్ష పైచిలుకు అభిమానుల నడుమ కాగా ప్రపంచకప్-2023లో ఆదిలో ఓటముల పాలైన ఆస్ట్రేలియా అనూహ్య రీతిలో పుంజుకుని ఫైనల్‌కు దూసుకువచ్చింది. సౌతాఫ్రికాతో సెమీస్‌లో పోరాడి గెలిచిన కంగారూ జట్టు తుదిపోరులో ఆతిథ్య టీమిండియాపై జయభేరి మోగించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం లక్ష పైచిలుకు భారత అభిమానుల మధ్య ఆతిథ్య జట్టును ఓడించి.. గెలిచి టైటిల్ సొంతం చేసుకుంది. టాస్ గెలిచి తొలుత టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన ఆసీస్ 240 పరుగులకే కట్టడి చేసింది. లక్ష్య ఛేదనలో ఆరంభంలో తడబడ్డా ఓపెనర్ ట్రవిస్ హెడ్ శతకం(137)తో చెలరేగి జట్టును విజయతీరాలకు చేర్చాడు. View this post on Instagram A post shared by ICC (@icc) పిచ్‌కు అనుగుణంగా వ్యూహాలు మార్చుకున్నాం ఈ సందర్భంగా కమిన్స్ మాట్లాడుతూ.. ‘‘మా అత్యుత్తమ ప్రదర్శనను ఫైనల్ కోసం దాచి ఉంచినట్లుంది. కీలక మ్యాచ్‌లలో ఆడే సత్తా ఉన్నవారంతా సరైన సమయంలో స్పందించారు. ఇలాంటి ఛేదన సులువని మేం భావించాం. మా బౌలింగ్ చాలా బాగా సాగింది. పిచ్‌కు అనుగుణంగా వ్యూహాలు మార్చుకున్నాం. జట్టులో ఎక్కువ వయస్సున్నవాళ్లు ఉన్నా అంతా రాణించారు. టీమిండియాను 300 లోపు కట్టడి చేద్దామనుకుంటే 240కే ఆపగలిగాం. ఛేదనలో నా గుండె దడ కూడా పెరిగింది. కానీ హెడ్, లబుషేన్ కలిసి గెలిపించారు. చేయి విరిగిన తర్వాత కూడా హెడ్‌పై మేం నమ్మకం ఉంచి జట్టుతో కొనసాగించడం పని చేసింది. ఆటపై విపరీత అభిమానం చూపించే భారత గడ్డపై మ్యాచ్ ఆడటమే ఒక మంచి జ్ఞాపకం. అలాంటిది మేం ఇక్కడ ప్రపంచకప్ గెలుచుకోవడం అద్భుతమైన అనుభూతి. ఈ క్షణాన్ని చిరస్మరణీయంగా మార్చుకోగలిగాం. మేము సాధించిన విజయాల్లో ఇది ఎప్పుటికీ శిఖరాగ్రాన నిలిచిపోతుంది’’ అని సంతోషం వ్యక్తం చేశాడు. View this post on Instagram A post shared by ICC (@icc) -
దేశం ఎప్పుడూ మీ వెంటే: వరల్డ్‌కప్ ఫైనల్లో భారత్ ఓటమిపై ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఓటమిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. దేశం నేడు, ఎప్పుడూ టీమిండియాకు మద్దతుగా ఉంటుందని తెలిపారు. ఈ మేరకు ఎక్స్(ట్విటర్)లో.. ‘డియర్ టీమిండియా. ప్రపంచకప్‌లో ద్వారా మీరు చూపిన ప్రతిభ, పట్టుదల గుర్తించదగినది. గొప్ప స్పూర్తితో ఆడి దేశానికి గర్వకారణంగా నిలిచారు. దేశం ఎప్పుడూ మీకు అండగా, మీ వెంటే ఉంటాం’ అంటూ టీమిండియా జట్టును ఉద్ధేశించి మోదీ ట్వీట్ చేశారు. Dear Team India, Your talent and determination through the World Cup was noteworthy. You've played with great spirit and brought immense pride to the nation. We stand with you today and always. — Narendra Modi (@narendramodi) November 19, 2023 అదే విధంగా ఆరోసారి వన్డే వరల్డ్ కప్‌లో ఘన విజయం సాధించిన ఆస్ట్రేలియా జట్టుకు మోదీ అభినందనలు తెలిపారు. ఈ టోర్నీలో వారి ఆట ప్రదర్శన ప్రశంసనీయమైనదని.. అద్భుతమైన విజయంతో ముగించారని తెలిపారు. ఫైనల్లో అద్భుతంగా ఆడిన ట్రావిస్ హెడ్‌కు అభినందనలు తెలిపారు. కాగా మ్యాచ్ సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్ మార్లెస్‌తో కలిసి స్టేడియంలో మ్యాచ్‌ని వీక్షించారు. మ్యాచ్ ముగిసిన అనంతరం ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌కు ప్రపంచకప్ టైటిల్‌ను మోదీ, ఆసీస్ ఉప ప్రధాని అందించారు. Congratulations to Australia on a magnificent World Cup victory! Theirs was a commendable performance through the tournament, culminating in a splendid triumph. Compliments to Travis Head for his remarkable game today. — Narendra Modi (@narendramodi) November 19, 2023 ఇక వన్డే ప్రపంచకప్ ఫైనల్లో భారత్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. భారత్ విషాదంగా మెగా టోర్నీని ముగిచింది. లీగ్ దశలో టీమిండియా ఆటతీరు చూస్తే కప్ ఈసారి మనదే అనిపించగా.అసలు పోరాటంలో మాత్రం అనూహ్యంగా అడుగులు తడబడ్డాయి.. భారతావని క్రికెట్ అభిమానులంతా టీమిండియా విజయం కోసం చేసిన పూజలు, మొక్కులు పని చేయక మరోసారి విషాదమే మిగిలింది. ఆదివారం నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో ఆరు వికెట్ల తోడాతో టీమిండియా పరాజయం పాలవ్వగా.. అద్భుత ప్రదర్శనతో అదరగొట్టిన ఆ్రస్టేలియా ఆరోసారి వన్డే క్రికెట్లో జగజ్జేతగా నిలిచింది. చదవండి: IND Vs AUS Finals: గుండె ‘పదకొండు’ ముక్కలు! -
ఆస్ట్రేలియా కెప్టెన్ కమ్మిన్స్ ఫ్యామిలీ (ఫొటోలు)
-
IND Vs AUS Finals: గుండె ‘పదకొండు’ ముక్కలు!
నిశ్శబ్దం...నిశ్శబ్దం...నిశ్శబ్దం...నిశ్శబ్దం ఎంత భయంకరంగా ఉంటుందో! లక్ష మందికి పైగా మన జనాలు ఉన్న మైదానంలో కూడా నిశ్శబ్దం ఆవరిస్తే ఆ పరిస్థితి ఎలా ఉంటుందనేది అక్కడ కనిపించింది... లక్ష మందిని నిశ్శబ్దంగా ఉంచగలిగితే అంతకు మించిన ఆనందం ఏముంటుంది అంటూ మ్యాచ్‌కు ముందు పరిహసించిన కమిన్స్ దానిని నిజం చేసి చూపించాడు... ఆ నిశ్శబ్దం ఒక్కసారి కాదు స్టేడియంలో మళ్లీ మళ్లీ కనిపించింది... దూసుకుపోతున్న రోహిత్ అవుటైన క్షణాన... 97 బంతుల పాటు కనీసం ఫోర్ కూడా కనిపించని వేళ... కోహ్లిని అవుట్ చేసి కమిన్స్ సింహనాదం చేసినప్పుడు... ఆ తర్వాత ట్రవిస్ హెడ్, లబుషేన్ వికెట్ల వద్ద పాతుకుపోయి అసలు ఏమాత్రం అవకాశం ఇవ్వనప్పుడూ అదే నిశ్శబ్దం కనిపించింది. మైదానంలోనే కాదు... దేశంలోని కోట్లాది మంది అభిమానుల ఆశలు, అంచనాలు కూడా తప్పగా మరోసారి గుండెకోతను మిగుల్చుతూ భారత ప్రపంచకప్ సమరం ఓటమితో ముగిసింది. రోహిత్, కోహ్లి ముఖాల్లో ఎలాంటి భావాలు కనిపించడం లేదు... కేఎల్ రాహుల్ మోకాళ్లపై కూర్చుండిపోయాడు... సిరాజ్‌కు కన్నీళ్లు ఆగడం లేదు... బుమ్రాలో నాలుగేళ్ల తర్వాతా మళ్లీ అదే బాధ... ప్రపంచకప్ గెలుచుకోవాలని కలగన్న మిగతా ఆటగాళ్ల కళ్ల ముందూ ఒక్కసారిగా శూన్యం ఆవరించింది... ఎన్ని అద్భుత ప్రదర్శనలు... ఎంత గొప్ప ఆట... తిరుగులేని బ్యాటింగ్, పదునైన బౌలింగ్‌తో వరుసగా 10 విజయాలు... ఓటమన్నదే లేకుండా సాగిన ప్రయాణం చివరి మెట్టుపై నిరాశను మిగిల్చింది. లీగ్ దశలో టీమిండియా ఆటతీరు చూస్తే కప్ ఈసారి మనదే అనిపించగా... అసలు పోరాటంలో మాత్రం అనూహ్యంగా అడుగులు తడబడ్డాయి... భారతావని క్రికెట్ అభిమానులంతా టీమిండియా విజయం కోసం చేసిన పూజలు, మొక్కులు పని చేయక మరోసారి విషాదమే మిగిలింది. పదేళ్లుగా ఒక్క ఐసీసీ టైటిల్లేని టీమిండియా బాధ మరికొంత కాలం అందరినీ వెంటాడక తప్పదు. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది... తీవ్ర ఒత్తిడి ఉండే ఫైనల్లో ముందుగా బ్యాటింగ్ చేయడం మంచి అవకాశమే అనిపించింది... రోహిత్ దూకుడైన ఆరంభం చూస్తే భారీ స్కోరు ఖాయం అన్నట్లుగా అతని బ్యాటింగ్ ధాటి చూపించింది. కానీ ఆ తర్వాత ఒక్కసారిగా సీన్ మారిపోయింది... ఫైనల్ మ్యాచ్ ఒత్తిడి కనిపించింది... తొలి 10 ఓవర్లలో 80 పరుగులు చేసిన జట్టు తర్వాతి పదేసి ఓవర్లలో 35, 37, 45, 43 పరుగులే...చివరకు 240 వద్దే ఆట ముగిసింది. అయినా సరే...ఇంగ్లండ్‌తో 229 పరుగులను కాపాడుకోలేదా? సెమీస్‌లో దక్షిణాఫ్రికాపై 213 పరుగులు సాధించేందుకు ఆసీస్ తీవ్రంగా ఇబ్బంది పడలేదా? ఇప్పుడూ సాధ్యమే అనే ఆశ... ఆసీస్ 47/3 వద్ద ఆ నమ్మకం పెరిగింది... కానీ ‘హెడ్’ను తీయలేక, లబుషేన్‌ను అడ్డుకోలేక ఆ విశ్వాసం ఓవర్లు సాగుతున్నకొద్దీ కరుగుతూ వచ్చింది... చివరకు ఏమి చేయలేని స్థితిలో భారత్ ఓటమికి సిద్ధమైంది... 2003 ప్రపంచకప్ ఫైనల్‌కు ప్రతీకారంలా కాకుండా రీప్లేలా 2023 వరల్డ్ కప్ సినిమా ముగిసింది. అహ్మదాబాద్: అద్భుత ప్రదర్శనతో అదరగొట్టిన ఆ్రస్టేలియా ఆరోసారి వన్డే క్రికెట్లో జగజ్జేతగా నిలిచింది. టోర్నీ ఆరంభ దశలో తడబడి ఆ తర్వాత కోలుకున్న ఆ జట్టు చివరి వరకు అదే పట్టుదలను కనబర్చి వరల్డ్‌కప్‌ను సొంతం చేసుకుంది. లీగ్ దశలో అజేయంగా నిలవడంతో పాటు వరుసగా 10 విజయాలతో ఊపు మీద కనిపించిన భారత్ అసలు పోరులో తలవంచింది. ఆదివారం నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 240 పరుగులకే ఆలౌటైంది. కేఎల్ రాహుల్ (107 బంతుల్లో 66; 1 ఫోర్), విరాట్ కోహ్లి (63 బంతుల్లో 54; 4 ఫోర్లు), రోహిత్ శర్మ (31 బంతుల్లో 47; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. అనంతరం ఆ్రస్టేలియా 43 ఓవర్లలో 4 వికెట్లకు 241 పరుగులు సాధించి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్’ ట్రవిస్ హెడ్ (120 బంతుల్లో 137; 15 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు సెంచరీతో చెలరేగగా, మార్నస్ లబుషేన్ (110 బంతుల్లో 58 నాటౌట్; 4 ఫోర్లు) అండగా నిలిచాడు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 35.5 ఓవర్లలో 192 పరుగులు జోడించారు. గతంలోఆ్రస్టేలియా 1987, 1999, 2003, 2007, 2015లలో కూడా వన్డే ప్రపంచకప్ చాంపియన్‌గా నిలిచింది. వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోవడం ఇది రెండోసారి. 2003 ప్రపంచకప్ ఫైనల్లోనూ ఆస్ట్రేలియా చేతిలోనే భారత్ ఓడిపోయింది. ఆ్రస్టేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌కు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆ్రస్టేలియా డిప్యూటీ ప్రధానమంత్రి రిచర్డ్ మార్లెస్ విన్నర్స్ ట్రోఫీని అందజేశారు. విజేతగా నిలిచిన ఆ్రస్టేలియా జట్టుకు 40 లక్షల డాలర్లు (రూ. 33 కోట్ల 32 లక్షలు), రన్నరప్ భారత జట్టుకు 20 లక్షల డాలర్లు (రూ. 16 కోట్ల 66 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. రాహుల్ అర్ధ సెంచరీ... రోహిత్ ఎప్పటిలాగే తనదైన శైలిలో దూకుడుగా ఆటను ప్రారంభించాడు. మరో ఎండ్‌లో గిల్ (7 బంతుల్లో 4) విఫలమైనా రోహిత్ జోరుతో స్కోరు దూసుకుపోయింది. స్టార్క్ ఓవర్లో వరుసగా మూడు ఫోర్లతో కోహ్లి కూడా ధాటిని చూపాడు. 9 ఓవర్లలో భారత్ స్కోరు 66/1. అయితే మ్యాక్స్‌వెల్ వేసిన తర్వాతి ఓవర్లో వరుసగా సిక్స్, ఫోర్ కొట్టిన రోహిత్ మరో భారీ షాట్‌కు ప్రయత్నించగా, హెడ్ పట్టిన అద్భుత క్యాచ్‌కు వెనుదిరిగాడు. తర్వాతి ఓవర్లోనే శ్రేయస్ అయ్యర్ (3 బంతుల్లో 4; 1 ఫోర్) కూడా అవుటయ్యాడు. ఇక్కడి నుంచి భారత్ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఆసీస్ బౌలర్లు మన బ్యాటర్లను పూర్తిగా కట్టిపడేశారు. మెరుగైన ఫీల్డింగ్ కూడా ఆ జట్టు అదనపు బలంగా మారింది. కోహ్లి కొంత మెరుగ్గా ఆడినా... రాహుల్ తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఒకదశలో వరుసగా 26.1 ఓవర్ల పాటు (97 బంతులు) ఒక్క ఫోర్ కూడా రాలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు! 56 బంతుల్లో కోహ్లి అర్ధసెంచరీ పూర్తయింది. ఆ వెంటనే కమిన్స్ వేసిన బంతిని వికెట్లపైకి ఆడుకొని కోహ్లి నిష్క్ర మించాడు. కోహ్లి, రాహుల్ నాలుగో వికెట్‌కు 67 పరుగులు జోడించారు. తడబాటును కొనసాగిస్తూ 86 బంతుల్లో రాహుల్ హాఫ్ సెంచరీకి చేరగా, బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు వచ్చిన రవీంద్ర జడేజా (22 బంతుల్లో 9) ప్రభావం చూపలేకపోయాడు. ఆపై వరుసగా వికెట్లు తీసిన ఆసీస్ చివరి వరకు ఒత్తిడిని కొనసాగించడంలో సఫలమైంది. 41వ ఓవర్లో స్కోరు 200 పరుగులకు చేరగా, సూర్యకుమార్ యాదవ్ (28 బంతుల్లో 18; 1 ఫోర్) కూడా ఆఖర్లో ఏమీ చేయలేకపోయాడు. భారీ భాగస్వామ్యం... లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా తడబడింది. షమీ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్ తొలి బంతికే వార్నర్ (3 బంతుల్లో 7; 1 ఫోర్) వెనుదిరగ్గా, బుమ్రా బౌలింగ్‌లో మిచెల్ మార్ష్ (15 బంతుల్లో 15; 1 ఫోర్, 1 సిక్స్) పెవిలియన్ చేరాడు. స్టీవ్ స్మిత్ (9 బంతుల్లో 4; 1 ఫోర్)ను కూడా బుమ్రా వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో ఆసీస్ స్కోరు 47/3... ఇక్కడే భారత బృందంలో చిన్న ఆశ. మరో వికెట్ తీస్తే ప్రత్యర్థిని ఒత్తిడిలో పడేయొచ్చనే వ్యూహం. కానీ హెడ్, లబుషేన్ ఆ అవకాశం ఇవ్వలేదు. హెడ్ తన దూకుడును ఎక్కడా తగ్గించకుండా చెలరేగిపోగా, లబుషేన్ చక్కటి డిఫెన్స్‌తో బలంగా నిలబడ్డాడు. వీరిద్దరి జోడీని విడదీయడానికి భారత్ ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేకపోయింది. పిచ్ జీవం కోల్పోయి బ్యాటింగ్‌కు బాగా అనుకూలంగా మారిపోవడంతో పాటు మన బౌలర్లలో కూడా పదును లోపించింది. దీనిని ఆసీస్ ఇద్దరు బ్యాటర్లూ సమర్థంగా వాడుకున్నారు. ఎక్కడా కనీస అవకాశం కూడా ఇవ్వకుండా వీరిద్దరు లక్ష్యం దిశగా జట్టును నడిపించారు. 95 బంతుల్లోనే హెడ్ శతకం పూర్తి చేసుకోగా, 99 బంతుల్లో లబుషేన్ హాఫ్ సెంచరీ పూర్తయింది. విజయానికి మరో 2 పరుగుల దూరంలో హెడ్ అవుటైనా... మ్యాక్స్‌వెల్ (2 నాటౌట్) లాంఛనం పూర్తి చేశాడు. దాంతో ఆసీస్ శిబిరంలో భారీ సంబరాలు మొదలయ్యాయి. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి) హెడ్ (బి) మ్యాక్స్‌వెల్ 47; గిల్ (సి) జంపా (బి) స్టార్క్ 4; కోహ్లి (బి) కమిన్స్ 54; అయ్యర్ (సి) ఇన్‌గ్లిస్ (బి) కమిన్స్ 4; రాహుల్ (సి) ఇన్‌గ్లిస్ (బి) స్టార్క్ 66; జడేజా (సి) ఇన్‌గ్లిస్ (బి) హాజల్‌వుడ్ 9; సూర్యకుమార్ (సి) ఇన్‌గ్లిస్ (బి) హాజల్‌వుడ్ 18; షమీ (సి) ఇన్‌గ్లిస్ (బి) స్టార్క్ 6; బుమ్రా (ఎల్బీ) (బి) జంపా 1; కుల్దీప్ (రనౌట్) 10; సిరాజ్ (నాటౌట్) 9; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (50 ఓవర్లలో ఆలౌట్) 240. వికెట్ల పతనం: 1–30, 2–76, 3–81, 4–148, 5–178, 6–203, 7–211, 8–214, 9–226, 10–240. బౌలింగ్: స్టార్క్ 10–0–55–3, హాజల్‌వుడ్ 10–0–60–2, మ్యాక్స్‌వెల్ 6–0–35–1, కమిన్స్ 10–0–34–2, జంపా 10–0–44–1, మార్ష్ 2–0–5–0, హెడ్ 2–0–4–0. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: వార్నర్ (సి) కోహ్లి (బి) షమీ 7; హెడ్ (సి) గిల్ (బి) సిరాజ్ 137; మార్ష్ (సి) రాహుల్ (బి) బుమ్రా 15; స్మిత్ (ఎల్బీ) (బి) బుమ్రా 4; లబుషేన్ (నాటౌట్) 58; మ్యాక్స్‌వెల్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం (43 ఓవర్లలో 4 వికెట్లకు) 241. వికెట్ల పతనం: 1–16, 2–41, 3–47, 4–239. బౌలింగ్: బుమ్రా 9–2–43–2, షమీ 7–1–47–1, జడేజా 10–0–43–0, కుల్దీప్ 10–0–56–0, సిరాజ్ 7–0–45–1. -
ఆస్ట్రేలియాకు మాత్రమే సాధ్యం! 2015 కంటే ఈ విజయమే గొప్పది!
CWC 2023 Winner Australia: ‘2015 కంటే ఈ విజయమే గొప్పది, ఎందుకంటే ఇది భారత గడ్డపై వచ్చింది’... హాజల్‌వుడ్ వ్యాఖ్య ఇది. ఇదే ఈ విజయం విలువేమిటో చెబుతోంది. టోర్నీ ఆరంభంలో 2 మ్యాచ్‌లలో ఓడిన తర్వాత పాయింట్ల పట్టికలో ఆ్రస్టేలియా అట్టడుగున ఉంది. ఫలితం మాత్రమే కాదు ప్రదర్శన కూడా చెత్తగా ఉంది. రెండు మ్యాచ్‌లలో జట్టు 199, 177 పరుగులే చేయగలిగింది. దాంతో అందరూ ఆసీస్‌ని తేలిగ్గా తీసుకున్నారు. కానీ తర్వాతి మ్యాచ్ నుంచి మొదలు పెడితే సెమీస్ వరకు వరుసగా ఎనిమిదో విజయాలతో ఆ జట్టు దూసుకుపోయింది. న్యూజిలాండ్‌తో, సెమీస్‌లో దక్షిణాఫ్రికాతో అతి కష్టమ్మీద గెలవడంతో ఫైనల్ కూడా భారతే ఫేవరెట్‌గా కనిపించింది. కానీ పట్టుదల, చివరి వరకు ఓటమిని అంగీకరించని తర్వాత ఉన్న కంగారూ బృందం ఎప్పటిలాగే ఐసీసీ టోర్నీలో అసలు సమరంలో సత్తా చాటింది. ప్రధాన పోటీల్లో ఒత్తిడికి తలవంచని తమ బలాన్ని మళ్లీ చూపించింది. ప్రపంచ కప్‌కు ముందు హెడ్ చేతికి గాయమైంది. అతని స్థానంలో మరో ఆటగాడిని ఎంచుకునే అవకాశం ఉన్నా ఆసీస్ ఆ పని చేయక 14 మందితోనే జట్టును కొనసాగించింది. ఇప్పుడు అతను సెమీస్, ఫైనల్లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచిన అరుదైన ఆటగాళ్ల జాబితాలో నిలిచాడు. టోర్నీకి ప్రకటించిన టీమ్‌లో లబుషేన్‌కు చోటు దక్కలేదు. స్పిన్నర్ అగర్ గాయపడగా... అతని స్థానంలో మరో స్పిన్నర్‌ను ఎంచుకోకుండా లబుషేన్‌ను తీసుకుంది. జట్టు కుప్పకూలిపోకుండా మిడిలార్డర్లో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దేందుకు సరైన వాడని ఆసీస్ భావించింది. ఫైనల్లో అతను అదే చేసి చూపించాడు. వార్నర్, మ్యాక్స్‌వెల్ ఐపీఎల్ అనుభవం ఇక్కడా బాగా పని చేయగా, మార్ష్ కూడా రెండు కీలక శతకాలు బాదాడు. ముఖ్యంగా అఫ్గానిస్తాన్‌పై 91/7తో ఓటమికి చేరువైన దశలో మ్యాక్స్‌వెల్ చేసిన డబుల్ సెంచరీ నభూతో నభవిష్యత్. స్టార్క్, హాజల్‌వుడ్ చెరో 16 వికెట్లతో జట్టుకు చుక్కానిలా నిలవగా, లెగ్‌స్పిన్నర్ జంపా 23 వికెట్లతో సత్తా చాటాడు. అన్నింటికి మించి పేసర్‌గా, కెప్టెన్ కమిన్స్ ముద్ర ప్రత్యేకం. బౌలింగ్‌లో 15 వికెట్లు పడగొట్టడంతో పాటు వ్యూహాలపరంగా అతను చూపించిన సాహసం, తెగువ కమిన్స్‌ను ప్రత్యేకంగా నిలిపాయి. ఫైనల్లో తన 10 ఓవర్లలో ఒక్క బౌండరీ కూడా ఇవ్వకుండా భారత్‌ను కట్టి పడేయగలిగాడు. 2023లో డబ్ల్యూటీసీ, యాషెస్, వరల్డ్ కప్ కోసం సన్నద్ధమయ్యేందుకు ఐపీఎల్‌కు దూరంగా ఉంటున్నానని ప్రకటించిన కమిన్స్... ఈ మూడింటిలోనూ అద్భుత విజయాలతో ఆసీస్ గొప్ప నాయకుల్లో ఒకడిగా తన స్థానాన్ని లిఖించుకున్నాడు. –సాక్షి క్రీడా విభాగం View this post on Instagram A post shared by ICC (@icc) -
CWC 2023: అందరూ హీరోలే.. కానీ టీమిండియా చివరకు ఇలా!
మళ్లీ అదే బాధ... మరోసారి అదే వేదన... చేరువై దూరమైన వ్యథ! తమ అద్భుత ఆటతో అంచనాలను పెంచి విశ్వ విజేతగా నిలిచేందుకు అన్ని అర్హతలు ఉన్న జట్టుగా కనిపించిన భారత్ విషాదంగా మెగా టోర్నీని ముగించింది. 2003లో ఆసీస్ చేతిలో ఓడిన బాధ నాటి తరానికి మాత్రమే గుర్తుంటుంది... కానీ నాలుగేళ్ల క్రితం 2019 సెమీఫైనల్లో మన ఓటమి ఇంకా అభిమానుల మదిలో తాజాగానే ఉంది. ఇప్పుడు స్వదేశంలో దానిని సరిదిద్దుకునే అవకాశం లభించింది. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై మన ఆధిపత్యం చూస్తే భారత జట్టుపై అంచనాలు పెరిగాయి... ప్రపంచకప్‌నకు ఆరు నెలల ముందు నుంచి జట్టు కూర్పుపై ప్రణాళికలు, ప్రదర్శన, ఒక్కో ఆటగాడి వ్యక్తిగత ప్రదర్శనలు, వారికి అప్పగించిన వేర్వేరు బాధ్యతలు అద్భుతంగా పని చేశాయి. కోచ్‌గా రాహుల్ ద్రవిడ్, రోహిత్ కెప్టెన్సీ మధ్య గొప్ప సమన్వయం మెరుగైన వ్యూహాలకు బాట వేసింది. ఈ నాలుగేళ్ల కాలంలో 66 వన్డేల్లో కలిపి భారత్ 50 మంది ఆటగాళ్లను ఆడించింది. ఏ ఇతర జట్టూ ఇంత మందికి అవకాశం కల్పించలేదు. ముఖ్యంగా ప్రతీ స్థానం కోసం సరిగ్గా సరిపోయే ఆటగాళ్లను గుర్తించే ప్రయత్నం ఇందులో జరిగింది. ఆయా ఆటగాళ్ల ప్రదర్శన తర్వాత ఈ సంఖ్యను సగానికి తగ్గించి 24 మందితో ఒక జాబితా తయారైంది. ఇందులో నుంచే వరల్డ్‌కప్ కప్ టీమ్ ఉంటుందనే విషయంపై స్పష్టత వచ్చింది. వరల్డ్‌కప్‌నకు ఆరు నెలల ముందునుంచి చూస్తే 2023 మార్చి 1 నుంచి అక్టోబర్ 4 మధ్య భారత్ 15 వన్డేలు ఆడితే ఈ 24 నుంచే జట్లను ఎంపిక చేశారు. అనంతరం 15 మందితో వరల్డ్ కప్ టీమ్ ఎంపికైంది. వరుస అద్భుత విజయాలు వీరితోనే సాధ్యమయ్యాయి. ‘మేం జట్టుగా గెలుస్తాం...జట్టుగా ఓడతాం’... ప్రపంచకప్ మొత్తం భారత డ్రెస్సింగ్ రూమ్‌లో ఈ నినాదం గట్టిగా మార్మోగింది. సెమీస్ వరకు ఒక్కసారి కూడా ఓటమిని దరి చేరనీయకుండా విజయంపై విజయంపై సాధిస్తూనే టీమిండియా తమ స్థాయిని ప్రదర్శించింది. ఎదురులేని ఆటతో వరుసగా 10 మ్యాచ్‌లను సొంతం చేసుకొని అంచనాలను ఆకాశానికి పెంచింది. 1983 వరల్డ్‌కప్ అనగానే జింబాబ్వేపై కపిల్ దేవ్ 175 నాటౌట్, ఫైనల్లో కపిల్ పట్టిన రిచర్డ్స్ క్యాచ్లాంటివి ప్రత్యేకంగా కనపడతాయి. 2011లో యువరాజ్ సింగ్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో పాటు ధోని కొట్టిన విన్నింగ్ సిక్సరే అందరి మనసుల్లో ముద్రించుకుపోయింది. ఈ రెండు మెగా టోర్నీల్లోనూ ఇతర ఆటగాళ్లూ తమ వంతు పాత్ర పోషించినా... టీమ్ గేమ్‌లో గెలవాలంటే అందరి భాగస్వామ్యం తప్పనిసరి అని ఎన్ని మాటలు చెప్పుకున్నా కొన్ని వ్యక్తిగత ప్రదర్శనలే హైలైట్ అయి అవే ప్రపంచకప్‌ను గెలిపించాయనే భావన కలిగిస్తాయి. కానీ ఈ టోర్నీలో మాత్రం భారత ఆటగాళ్లందరూ హీరోలే. ఒకరు ఎక్కువా కాదు, ఒకరు తక్కువా కాదు. మైదానంలోకి దిగిన ప్రతీ ఒక్కరు తమదైన ఆటతో జట్టును గెలిపించారు... జట్టు కోసం గెలుపు అవకాశాలు సృష్టించారు. జట్టుకు విజయం అందించేందుకు ఒకటో నంబర్ ఆటగాడినుంచి పదకొండో నంబర్ ప్లేయర్ వరకు ఒకరితో మరొకరు పోటీ పడ్డారు. వ్యక్తిగతంగా చూస్తే ప్రతీ పోరులో ఒకరు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలుస్తారు. కానీ భారత జట్టుకు సంబంధించి ప్రతీ మ్యాచ్‌లో అందరూ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌లే. ఒక బ్యాటర్ నెమ్మదించినట్లు కనిపిస్తే మరొకరు చెలరేగిపోయారు. ఒక బౌలర్ కాస్త తడబడినట్లు అనిపిస్తే నేనున్నానంటూ మరో బౌలర్ వచ్చి లెక్క సరిచేశారు. పవర్‌ప్లేలో పవర్ అంతా చూపిస్తే, మధ్య ఓవర్లలో మరొకరు ఇన్నింగ్స్ నడిపించారు. చివర్లో చెలరేగే బాధ్యత ఇంకొకరిది. భారత గడ్డపై పేసర్లు ఇంతగా ప్రభావం చూపించగలరని ఎవరైనా అనుకున్నారా! మన త్రయం దానిని చేసి చూపించింది. ఒక్కో బంతిని ఆడేందుకు బ్యాటర్లు పడిన తిప్పలు చూస్తే దాని పదునేమిటో తెలుస్తుంది. ఇక స్పిన్ ద్వయం ప్రత్యర్థులను పూర్తిగా కట్టి పడేసింది. ఒకరు కాదు ఇద్దరు కాదు...ఐదుగురూ వికెట్లు తీయగల సమర్థులైన బౌలర్లు ఉన్న టీమిండియాను చూసి ఎన్నాళ్లయింది? అంకెలపరంగా చూస్తే ప్రతీ ఒక్కరి పాత్ర జట్టును గెలిపించింది. 11 ఇన్నింగ్స్‌లలో 3 సెంచరీలు, 6 అర్ధసెంచరీలతో 765 పరుగులు చేసిన కోహ్లి తన విలువేంటో చూపించాడు. ముందుగా క్రీజ్‌లో కుదురుకొని తర్వాత ధాటిగా ఆడే తన శైలిని మార్చుకొని ఆరంభంలో చెలరేగి విజయానికి పునాది వేసే వ్యూహంతోనే ఆడిన కెప్టెన్ రోహిత్ కూడా 597 పరుగులు చేశాడు. శ్రేయస్ (530), రాహుల్ (452), శుబ్‌మన్ గిల్ (354) కూడా కీలక పరుగులు సాధించారు. ఇక బౌలింగ్‌లో 7 మ్యాచ్‌లలోనే కేవలం 10.70 సగటుతో 24 వికెట్లు తీసి మొహమ్మద్ షమీ టోర్నీని ఒక ఊపు ఊపాడు. బుమ్రా 20 వికెట్లతో తన సత్తాను చాటగా... జడేజా (16), కుల్దీప్ (15), సిరాజ్ (14) బౌలింగ్ దళం బలాన్ని చూపించారు. కానీ... కానీ... ఫైనలో పోరులో మాత్రం ఈ గణాంకాలన్నీ పనికి రాలేదు. సెమీస్ వరకు స్వేచ్ఛగా ఆడినా... వరల్డ్ కప్ ఫైనల్ ఆడుతున్న ఒత్తిడి సహజంగానే వారిలో కనిపించింది. అందుకే అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ ఏదీ కలిసి రాలేదు. గిల్, శ్రేయస్ జోరు చూపించలేకపోగా, రాహుల్ పూర్తిగా తడబడ్డాడు. ఫైనల్‌లాంటి కీలక పోరులో రోహిత్ తన దూకుడు కాస్త నియంత్రించుకొని ఉంటే బాగుండేదని అనిపించినా... అతనూ విఫలమయ్యే ప్రమాదమూ ఉండేది. కోహ్లి ఒక్కడే తన స్థాయికి తగ్గ ఆటను చూపించగలిగినా అది సరిపోలేదు. జడేజా, సూర్య ఇలాంటి సమయంలో ఆదుకోలేకపోయారు. అయితే బౌలింగ్ దళం కాస్త ఆశలు కలిగించింది. ఆరంభంలో మూడు వికెట్లు తీయడం కూడా నమ్మకం పెంచింది. అయితే 240 పరుగుల స్కోరు మరీ చిన్నదైపోయింది. పది విజయాల ప్రదర్శన తర్వాత ఇలాంటి ఆట ఓటమి వైపు నిలిపింది. అయినా సరే... భారత్ ప్రదర్శనను తక్కువ చేయలేం. లీగ్ దశలో తొమ్మిది వేర్వేరు ప్రత్యర్థులతో, వేర్వేరు వేదికలపై సాగించిన ఆధిపత్యం అసాధారణం. ఆటగాళ్ల శ్రమ, అంకితభావం అన్నింటిలో కనిపించాయి. ఈ టీమ్ చాంపియన్‌గా నిలిచేందుకే పుట్టింది అని అనిపించింది. అయితే ఏదైనా తప్పు జరగాలని రాసి పెట్టి ఉంటే అది ఎలాగూ జరుగుతుంది. కానీ కీలక సమయంలోనే అది జరుగుతుంది. ఈ టోర్నీలో మనం ఒక్క మ్యాచ్ అయినా ఓడాలని రాసి పెట్టి ఉన్నట్లుంది. ఆ మ్యాచ్ కాస్తా ఫైనల్ మ్యాచ్ కావడమే విషాదం! –సాక్షి క్రీడా విభాగం View this post on Instagram A post shared by ICC (@icc) -
అదే మా కొంపముంచింది.. చాలా బాధగా ఉంది! వారిద్దరికి క్రెడిట్: రోహిత్ శర్మ
టీమిండియా అభిమానుల గుండె పగిలింది. ముచ్చటగా మూడో సారి వరల్డ్‌కప్ ట్రోఫీని ముద్దాడాలన్న భారత జట్టు ఆశలు అడియాశలయ్యాయి. టోర్నీ ఆరంభం నుంచి వరుస విజయాలతో అదరగొట్టిన భారత జట్టు.. కీలకమైన ఫైనల్లో చేతులేత్తేసింది. అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో 6 వికెట్ల తేడాతో భారత్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌లో విఫలమైన రోహిత్ సేన.. కంగూరులకు వరల్డ్‌కప్‌ను అప్పగించేసింది. 241 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 43 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో ఆరోసారి ఆస్ట్రేలియా వరల్డ్ ఛాంపియన్స్‌గా నిలిచింది. ఆసీస్ విశ్వవిజేతగా నిలవడంలో ఆ జట్టు ఓపెనర్ ట్రావిస్ హెడ్ కీలక పాత్ర పోషించాడు. ట్రావిస్ హెడ్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. 118 బంతులు ఎదుర్కొన్న హెడ్ 14 ఫోర్లు, 4 సిక్స్‌లతో 137 పరుగులు చేశాడు. అతడితో పాటు మార్నస్ లబుషేన్(57) హాఫ్ సెంచరీతో రాణించాడు.అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ 240 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక ఫైనల్లో ఓటమిపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. బ్యాటింగ్‌లో విఫలమకావడంతో ఓటమి పాలైమని రోహిత్ తెలిపాడు. "ఫైనల్ మ్యాచ్‌లో ఓడి పోవడం చాలా బాధగా ఉంది. ఫలితం మేము ఆశించిన విధంగా రాలేదు. ఈ మ్యాచ్‌లో మేము మా స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. మేము టార్గెట్‌ను డిఫెండ్ చేయడానికి అన్ని విధాల ప్రయత్నించాం. కానీ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయాం. మరో 20-30 పరుగులు చేసి ఉంటే బాగుండేది. రాహుల్, కోహ్లి మంచి భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ సమయంలో 270 నుంచి 280 స్కోర్ వస్తాదని మేము అనుకున్నాం. కానీ మేము వరుస క్రమంలో వికెట్లు కోల్పోయాం. 240 వంటి స్వల్ప లక్ష్యాన్ని డిఫెండ్ చేయాలంటే ఆరంభంలో వికెట్లు తీయాలని నిర్ణయించుకున్నాం. మేము అనుకున్న విధంగా మూడు వికెట్లు సాధించాం. కానీ హెడ్, లబుషేన్ భారీ భాగస్వామ్యం నెలకొల్పి మ్యాచ్‌ను మా నుంచి దూరం చేశారు. కచ్చితంగా వారిద్దరికి క్రెడిట్ ఇవ్వాలి. ఫ్లడ్ లైట్స్‌లో బ్యాటింగ్ చేయడానికి పిచ్ కొంచెం మెరుగ్గా ఉంది. అయితే దీనిని సాకుగా చెప్పాలనుకోవడం లేదు. మేము ప్రత్యర్ధి ముందు మంచి టార్గెట్‌ను ఉంచలేకపోయాం. ఏదైమనప్పటికీ ఆస్ట్రేలియా మంచి ప్రదర్శన కనబరిచింది" పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో రోహిత్ శర్మ పేర్కొన్నాడు. చదవండి: World Cup 2023 Final Viral Videos: వరల్డ్‌కప్‌లో ఓటమి.. కనీళ్లు పెట్టుకున్న విరాట్ కోహ్లి! వీడియో వైరల్ -
CWC 2023 Final: పోరాట యోధులు.. మ్యాచ్ ఓడినా, మనసులు గెలుచుకున్నారు..!
తాడేపల్లి : వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ పై సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. 2023 వరల్డ్ కప్‌లో మన క్రికెటర్లు మంచి పోరాట పటిమ చూపించారు. మ్యాచ్ మనకు అనుకూలంగా లేకపోయినా వారి క్రీడా స్ఫూర్తి, యావత్ దేశానికి ఎంతో స్ఫూర్తినిచ్చాయి. ఇండియా టీమ్ దేశ ప్రజల హృదయాలను గెలుచుకుంది అంటూ సీఎం వైస్ జగన్ తన ట్వీట్లో పేర్కొన్నారు. My admiration and respect for our warriors of the Indian Cricket Team for their incredible journey in the 2023 Cricket World Cup. Although the match didn’t go in our favour, their spirit, sportsmanship and innumerable moments through this journey have greatly inspired the entire… — YS Jagan Mohan Reddy (@ysjagan) November 19, 2023 -
వరల్డ్‌కప్‌లో ఓటమి.. కన్నీళ్లు పెట్టుకున్న విరాట్ కోహ్లి! వీడియో వైరల్
వన్డే వరల్డ్‌కప్-2023 టోర్నీ ఆసాంతం అదరగొట్టిన టీమిండియా.. ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో 6 వికెట్ల తేడాతో భారత జట్టు ఓటమి పాలైంది. దీంతో 12 ఏళ్ల వరల్డ్‌కప్ ట్రోఫి నిరీక్షణకు తెరదించాలని బరిలోకి దిగిన మరోసారి తీవ్ర నిరాశే ఎదురైంది. ఈ ఓటమితో 140 కోట్ల భారతీయులకు గుండె కోతను మిగిల్చింది. మరోవైపు ఈ ఫైనల్ పోరులో అద్బుత ప్రదర్శన ఆస్ట్రేలియా.. ఆరోసారి వరల్డ్ ఛాంపియన్స్‌గా నిలిచింది. 241 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. 43 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆస్ట్రేలియా విజయంలో ట్రావిస్ హెడ్ కీలక పాత్ర పోషించాడు. ట్రావిస్ హెడ్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. 118 బంతులు ఎదుర్కొన్న హెడ్ 14 ఫోర్లు, 4 సిక్స్‌లతో 137 పరుగులు చేశాడు. అతడితో పాటు మార్నస్ లబుషేన్(57) హాఫ్ సెంచరీతో రాణించాడు.అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ 240 పరుగులకు ఆలౌట్ అయింది. కన్నీరు పెట్టుకున్న విరాట్ కోహ్లి, మహ్మద్ సిరాజ్.. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలవ్వగానే స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. తన బౌలింగ్‌లో మాక్స్వెల్ తన బౌలింగ్‌లో విన్నింగ్ షాట్ కొట్టగానే సిరాజ్ కన్నీరు పెట్టుకున్నాడు. ఈ సమయంలో బుమ్రా అతడి దగ్గరకు వెళ్లి ఓదార్చాడు. అంతకుముందు విరాట్ కోహ్లి కన్నీటి పర్యంతం అయ్యాడు. ఆసీస్ విజయానికి చేరువులో ఉన్నప్పుడు కోహ్లి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ టోర్నీ మొత్తం కోహ్లి అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. 765 పరుగులతో టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చదవండి: CWC 2023: అన్నంత పనిచేసిన కమిన్స్.. టీమిండియా అభిమానుల హృదయాలు ముక్కలు Siraj & entire team crying they dint deserve this man💔#CWC23 #CWC23Final #INDvAUS pic.twitter.com/avux5bct6H — ᴀꜱɪᴍ ʀɪᴀᴢ ᴜɴɪᴠᴇʀꜱᴇ 💛 (@AsimRiazworld) November 19, 2023 pic.twitter.com/l7rXZYXzIj — Sitaraman (@Sitaraman112971) November 19, 2023 View this post on Instagram A post shared by ICC (@icc) -
CWC 2023 Final Photos Gallery: ఆరోసారి వరల్డ్ ఛాంపియన్స్‌గా ఆస్ట్రేలియా (ఫొటోలు)
-
IND Vs AUS Finals: అన్నంత పనిచేసిన కమిన్స్.. టీమిండియా అభిమానుల హృదయాలు ముక్కలు
ఆస్ట్రేలియా వంటి ప్రమాదకరమైన జట్టుతో జాగ్రత్త.. డేంజరస్ టీమ్.. ఫైనల్‌కు వచ్చిందంటే కప్ ఎగురేసుకుపోకుండా ఉండదు.. వన్డే వరల్డ్‌కప్-2023 ఫైనల్‌కు ముందు టీమిండియాకు మాజీ క్రికెటర్లు జారీ చేసిన హెచ్చరికలు.. ఇప్పుడు ఆ మాటలే నిజమయ్యాయి. స్టేడియంలో లక్ష మందికిపైగా టీమిండియా అభిమానుల మధ్య రోహిత్ సేనపై అలవోకగా విజయం సాధించింది కంగారూ జట్టు. రికార్డు స్థాయిలో ఏకంగా ఆరోసారి వన్డే ప్రపంచకప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. భారత జట్టుకు మద్దతుగా నరేంద్ర మోదీ స్టేడియం మొత్తం హోరెత్తుతుందని తెలుసు.. వాళ్లందరినీ నిశ్శబ్దంగా ఉంచడమే లక్ష్యం.. అంతకంటే సంతృప్తి మరొకటి ఉండదు.. అన్నట్లుగానే కోట్లాది మంది టీమిండియా అభిమానుల హృదయాలను ముక్కలు చేశాడు ఆసీస్ సారథి ప్యాట్ కమిన్స్. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం మొదలు.. పదే పదే బౌలర్లను మారుస్తూ భారత బ్యాటర్లను కట్టడి చేసిన విధానం.. ఆపై లక్ష్య ఛేదనలో ఆరంభం నుంచే భారత బౌలర్లపై ఒత్తిడి పెంచేలా వ్యూహాలు రచించిన తీరు అద్భుతం. మ్యాచ్ ఆసాంతం పూర్తి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిన విధానం కమిన్స్ నాయకత్వ ప్రతిభకు అద్దంపట్టాయి. ఆసీస్‌కు వరల్డ్‌కప్ అందించిన దిగ్గజ కెప్టెన్ల సరసన నిలిపాయి. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుని క్రికెట్ ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూసిన ప్రపంచకప్-2023 ఫైనల్ ఆదివారంతో ముగిసింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన తుదిపోరులో ఆతిథ్య టీమిండియాను ఓడించిన ఆస్ట్రేలియా చాంపియన్‌గా అవతరించింది. మోదీ స్టేడియంలో టాస్ గెలిచిన ప్యాట్ కమిన్స్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. గిల్, అయ్యర్ పూర్తిగా విఫలం ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ రోహిత్ శర్మ ఆది నుంచే దూకుడుగా ఆడుతూ 31 బంతుల్లో 47 పరుగులు సాధించాడు. అయితే, మరో ఓపెనర్ శుబ్‌మన్ గిల్ మాత్రం పూర్తిగా తేలిపోయాడు. మొత్తంగా ఏడు బంతులు ఎదుర్కొన్న ఈ యువ బ్యాటర్ 4 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. వన్‌డౌన్‌లో వచ్చిన విరాట్ కోహ్లి, 54 పరుగులతో రాణించగా.. నాలుగో నంబర్ బ్యాటర్, గత మ్యాచ్‌లలో వరుసగా సెంచరీలు చేసిన శ్రేయస్ అయ్యర్ కీలక మ్యాచ్‌లో మాత్రం 4 పరుగులకే నిష్క్రమించాడు. రాహుల్ బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఈ క్రమంలో రాహుల్ బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. 107 బంతులు ఎదుర్కొని 66 పరుగులు సాధించి టీమిండియా ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా వాళ్లలో సూర్యకుమార్ యాదవ్ (18), కుల్దీప్ యాదవ్(10) మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్లు చేయగలిగారు. ఆసీస్ బౌలర్లలో పేసర్లు మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు దక్కించుకోగా.. హాజిల్‌వుడ్, కమిన్స్ తలా రెండు వికెట్లు తీశారు. స్పిన్నర్లు మాక్స్వెల్, జంపా చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. హెడ్ అద్భుత సెంచరీ ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాను ఆరంభంలో టీమిండియా కట్టడి చేయగలిగింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్(7)ను షమీ పెవిలియన్‌కు చేర్చగా.. వన్‌డౌన్ బ్యాటర్ మిచెల్ మార్ష్(15)ను బుమ్రా అవుట్ చేశాడు. ఆరోసారి జగజ్జేతగా ఆస్ట్రేలియా కానీ మరో ఓపెనర్ ట్రవిస్ హెడ్ అద్భుత ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను టీమిండియా నుంచి లాగేసుకున్నాడు. అద్భుత శతకం(120 బంతుల్లో 137 పరుగులు)తో రాణించి ఆరోసారి ఆస్ట్రేలియా విశ్వవిజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక అతడి తోడుగా మార్నస్ లబుషేన్ 58 పరుగులతో అజేయంగా నిలవగా.. మాక్స్వెల్ రెండు పరుగులు తీసి విజయ లాంఛనం పూర్తి చేశాడు. దీంతో 43 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన కంగారూ జట్టు 6 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. ఆశగా ఎదురుచూసిన టీమిండియా అభిమానులకు కోలుకోలేని షాకిచ్చింది. View this post on Instagram A post shared by ICC (@icc) -
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్: 51 టెంకాయలు ఆర్డర్.. ‘ఎక్స్’ పోస్ట్ వైరల్!
అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగింది. భారత్ విజయం కోసం కోట్లాది మంది భారతీయులు ఎంతో ఆతృతంగా ఎదురు చూశారు.. అన్ని వర్గాల వారు ఆకాంక్షించారు.. ప్రార్థనలు చేశారు. కానీ అవేవీ ఫలించలేదు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించి వరల్డ్ కప్ కైవసం చేసుకుంది. అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందు వరల్డ్ కప్‌లో భారత్ విజయం సాధించి కప్ గెలిస్తే కొట్టడానికి 51 టెంకాయలను థానేకు చెందిన ఓ వ్యక్తి ఫుడ్‌డెలివరీ యాప్ స్విగ్గీలో ఆర్డర్ చేశారు. ఈ సమాచారాన్ని స్విగ్గీ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘ఎక్స్’ (ట్విటర్) ద్వారా తెలియజేసింది. థానే నుంచి ఎవరో ఇప్పుడే 51 టెంకాయలు ఆర్డర్ చేశారు. బహుశా వరల్డ్ కప్ ఫైనల్ గెలుపు కోసమే అయిఉండచ్చు. అదే నిజమై భారత్‌కు కప్ రావాలని ఆకాంక్షించింది. కాగా స్విగ్గీ పోస్ట్ చేసిన కొద్దిసేపటికే ఈ ఆర్డర్ చేసింది తానే అంటూ ఓ వ్యక్తి స్విగ్గీ పోస్ట్‌ను రీట్వీట్ చేశారు. భారత్ వరల్డ్ కప్ గెలిస్తే కొట్టడానికే టెంకాయలు ఆర్డర్ చేసినట్లు పేర్కొన్నారు. టీవీ ముందు టెంకాయలు ఉంచిన దృశ్యాన్ని ఈ ట్వీట్‌కు జత చేశారు. ఈ ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ మారాయి. లక్షల్లో వ్యూవ్స్, కామెంట్లు వచ్చాయి. కాగా ఇదే వ్యక్తి భారత్ విజయాన్ని వ్యక్తీకరించడానికి 240 అగరబత్తులను ఆర్డర్ చేశారు. haan bhay yeh someone from thane bhi mai hi hoon, 51 nariyal for unreal manifestation✨ https://t.co/aNa3WACNOp pic.twitter.com/kVuQ6WjCjH — gordon (@gordonramashray) November 19, 2023 -
CWC 2023: చెప్పినట్లే రోహిత్, అయ్యర్ అవుటయ్యారు! ఇదేందయ్యా..!
ICC CWC 2023 Final Ind Vs Aus: సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో టీమిండియా.. ప్రపంచంలోనే అతిపెద్దదైన నరేంద్ర మోదీ స్టేడియంలో ఆస్ట్రేలియాతో తుదిపోరు.. దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఈ హైవోల్టేజీ మ్యాచ్ గురించే చర్చ.. భారీ స్క్రీన్లు ఏర్పాటు చేసుకుని మరీ వీక్షణలు.. ఏ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా? అనే విశ్లేషణలు.. ఈసారి భారత జట్టు ఎలాగైనా ట్రోఫీ గెలవాలని పూజలు, ప్రార్థనలు.. టాప్ స్కోరర్, టాప్ వికెట్ టేకర్.. మ్యాచ్ విజేత ఎవరన్న విషయాలపై అంచనాలు.. రోహిత్ హిట్టింగ్ ఆడతాడు.. కోహ్లి పరుగుల వరద పారిస్తాడనే ఆకాంక్షలు.. ఇలా ఆదివారం ప్రతీ క్రికెట్ అభిమాని తమకు తోచిన రీతిలో సోషల్ మీడియా వేదికగా వారి వారి అభిప్రాయాలు పంచుకుంటూనే ఉన్నారు. అయితే, ఇందులో ప్రముఖ జ్యోతిష్కుడు సుమిత్ బజాజ్ కచ్చితమైన అంచనాతో ముందుకు వచ్చి క్రికెట్ ప్రేమికులను ఆశ్చర్చపరిచారు. టీమిండియా- ఆస్ట్రేలియా ఫైనల్లో ముఖ్యమైన ఓవర్లు ఇవేనంటూ సుమిత్ వేసిన అంచనా నిజమైంది. ‘‘తొలి ఇన్నింగ్స్‌లో 3, 5, 7,9, 9.4- 10.2, 10.3- 11.2, 14.4- 15.2, 17, 19, 20, 22, 24,25,27,31,34.4-35.2,47’’ అని సుమిత్ బజాజ్ ఎక్స్ ఖాతాలో తన అంచనాను తెలియజేశాడు. కాగా అహ్మదాబాద్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ ఎంచుకోవడంతో భారత్ బ్యాటింగ్‌కు దిగింది. పవర్ ప్లేలో టీమిండియా రెండు వికెట్లు కోల్పోయింది. ఐదో ఓవర్ రెండో బంతికి స్టార్క్ బౌలింగ్‌లో శుబ్‌మన్ గిల్(4) ఆడం జంపాకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లి రోహిత్‌తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఇద్దరూ దూకుడుగా ఆడుతున్న తరుణంలో 9.4 ఓవర్ వద్ద గ్లెన్ మాక్స్వెల్ బౌలింగ్‌లో రోహిత్(42) హెడ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ వచ్చీ రావడంతోనే ఫోర్ బాదాడు. కానీ... 10.2 వద్ద కమిన్స్ బౌలింగ్‌లో జోష్ ఇంగ్లిస్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. సుమిత్ చెప్పినట్లు 9.4-10.2 మధ్య టీమిండియా రోహిత్, అయ్యర్ రూపంలో రెండు కీలక వికెట్లు కోల్పోయింది. కాగా ఈ మ్యాచ్‌లో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌట్ అయింది. View this post on Instagram A post shared by ICC (@icc) -
IND Vs AUS: అయ్యో కోహ్లి.. అస్సలు ఊహించలేదు! షాకింగ్ రియాక్షన్
వన్డే ప్రపంచకప్-2023 ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఫైనల్లో టీమిండియా నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లి(54), కేఎల్ రాహుల్(66), రోహిత్ శర్మ మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఈ మ్యాచ్‌లో శుబ్‌మన్ గిల్(4), శ్రేయస్ అయ్యర్(4), రవీంద్ర జడేజా(9) తీవ్ర నిరాశపరిచారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ 3 వికెట్లు పడగొట్టగా.. హాజిల్‌వుడ్,కమ్మిన్స్ తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు మాక్స్వెల్, జంపా చెరో వికెట్ సాధించారు. కోహ్లి షాకింగ్ రియాక్షన్.. కాగా ఈ మ్యాచ్‌లో శుబ్‌మన్ గిల్, రోహిత్ శర్మ ఔటైన తర్వాత విరాట్ కోహ్లి.. రాహుల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. అయితే 54 పరుగులతో అద్బుత ఇన్నింగ్స్ ఆడుతున్న కోహ్లి.. ఊహించని రీతిలో ఔటయ్యాడు. భారత ఇన్నింగ్స్ 29 ఓవర్లో మూడో బంతిని కమ్మిన్స్ షర్ట్ ఆఫ్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు. ఈ క్రమంలో కోహ్లి ఆఫ్ సైడ్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి ఇన్ సైడ్ ఎడ్జ్ తీసుకుని సంప్ట్స్‌ను గిరాటేసింది. దీంతో విరాట్ కోహ్లి షాక్‌తో కాసేపు క్రీజులో అలా ఉండిపోయాడు. నిరాశతో మైదానాన్ని వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared b -
అందుకే ఫైనల్ మ్యాచ్ చూడను - ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్!
యావత్ భారతావని ఈ రోజు టీవీలకు అతుక్కుపోయి ఉంటారు. ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో విశ్వవిజేత ఎవరనేది తెలుసుకోవడానికి సర్వత్రా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్‌ను దేశీయ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా చూడనని ట్వీట్ చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా.. దేశ సేవలో భాగంగానే జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ చూడనని నిర్ణయం తీసుకున్నారు. తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఒక జెర్సీ ఫొటో షేర్ చేస్తూ.. ఎవరైనా వచ్చి మనం గెలిచామని చెప్పేవరకు లైవ్ చూడనని ట్వీట్ చేశారు. నిజానికి ఆనంద్ మహీంద్రా ఓ సెంటిమెంట్ నమ్ముతారు. ఆయన లైవ్ మ్యాచ్ చూస్తే ఇండియా ఓడిపోతుందేమో అని నమ్ముతారు. ఈ కారణంగానే ఆనంద్ మహీంద్రా లైవ్ మ్యాచ్ చూడకూడదని నిర్ణయించుకున్నారు. గతంలో ఈ విషయాన్ని చాలా సార్లు ఆయన స్వయంగా వెల్లడించారు. ఫ్యాన్స్ కూడా కీలకమైన మ్యాచ్‌లు మీరు చూడకండి అంటూ సరదాగా సలహాలు ఇచ్చారు. ఇదీ చదవండి: వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌కు ముందే కొత్త కారు కొన్న ఆస్ట్రేలియా క్రికెటర్ - వీడియో వైరల్ తాజాగా చేసిన ట్వీట్ వైరల్ కావడంతో నెటిజన్లలో ఒకరు స్పందిస్తూ మీరు తీసుకున్న నిర్ణయం జట్టుకు మద్దతుగా నిలవడంతో ఒక భాగమే అంటూ వెల్లడించారు. మరొకరు ఎప్పటికీ మీరు మా హీరోనే.. మీ త్యాగాన్ని చరిత్ర గుర్తుంచుకుందని కామెంట్ చేశారు. ఇంకొకరు ఇవన్నీ అపోహలు.. మీరు హ్యాప్పీగా మ్యాచ్ చూడవచ్చని సలహా ఇచ్చారు. No, no, I am not planning to watch the match (my service to the nation 🙂) But I will, indeed, be wearing this jersey and installing myself in a hermetically sealed chamber with no contact with the outside world until someone knocks and tells me we’ve won… pic.twitter.com/HhMENqORp1 — anand mahindra (@anandmahindra) November 19, 2023 -
IND Vs AUS: విరాట్ కోహ్లి- మ్యాక్స్‌వెల్ ఫ్రెండ్లీ ఫైట్.. వీడియో వైరల్
వన్డే ప్రపంచకప్-2023 ఫైనల్లో టీమిండియా-ఆస్ట్రేలియా జట్లు తలపడతున్నాయి. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా తడబడుతోంది. 44 ఓవర్లు ముగిసే సరికి 7 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. క్రీజులో సూర్యకుమార్ యాదవ్(13), బుమ్రా(1) ఉన్నారు. అంతకుముందు రాహుల్(66), రోహిత్ శర్మ(47), విరాట్ కోహ్లి(54) పరుగులతో రాణించారు. కాగా ఈ మ్యాచ్‌లో భారత ఇన్నింగ్స్ సందర్భంగా విరాట్ కోహ్లి- గ్లెన్ మాక్స్వెల్ మధ్య ఓ ఫన్నీ సంఘటన చోటు చోటు చేసుకుంది. ఏం జరిగిందంటే? భారత ఇన్నింగ్స్ 20వ ఓవర్ వేసిన మిచెల్ మార్ష్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లి మిడ్ వికెట్ దిశగా ఆడాడు. అయితే బంతి నేరుగా మిడ్ వికెట్లో ఫీల్డింగ్ చేస్తున్న మాక్స్వెల్ చేతికి వెళ్లింది. అయితే మాక్సీ వికెట్ కీపర్ త్రో వేసే క్రమంలో బంతి మిస్స్ అయ్యి విరాట్ కోహ్లి పైకి వెళ్లింది. కోహ్లి వెంటనే బంతిని చేతితో పట్టుకున్నాడు. మాక్సీ కూడా కోహ్లి వైపు చూస్తూ సారీ చెప్పాడు. ఈ క్రమంలో కోహ్లి మాక్సీ దగ్గరకు వెళ్లి సీరియస్‌గా చూస్తూ నవ్వాడు. మాక్సీ కూడా నవ్వుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఐసీసీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఈ వీడియో ప్రస్తుతం వైరలవుతోంది. కాగా మాక్సీ, కోహ్లి మధ్య మంచి స్నేహ బంధం ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. చదవండి: World cup 2023: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. వరల్డ్ కప్ హిస్టరీలోనే View this post on Instagram A post shared by ICC (@icc) -
ఫైనల్ మ్యాచ్‌కు ముందే కొత్త కారు కొన్న ఆస్ట్రేలియా క్రికెటర్ - వీడియో వైరల్
Matthew Hayden Mahindra Scorpio N: మహీంద్రా కార్లను సాధారణ ప్రజల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు చాలామంది ఇష్టపడి మరీ కొనుగోలు చేస్తూ ఉంటారు. దేశీయ విఫణిలో విడుదలైన అతి తక్కువ కాలంలో మంచి అమ్మకాలతో ముందుకు దూసుకెళ్లిన 'మహీంద్రా స్కార్పియో ఎన్' (Mahindra Scorpio N) ఎస్‌యూవీని మాజీ ఆస్ట్రేలియన్ క్రికెటర్ 'మాథ్యూ హేడెన్' (Matthew Hayden) కొనుగోలు చేశారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఆస్ట్రేలియాలో భారతీయ కార్ల తయారీ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న ఆస్ట్రేలియన్ క్రికెట్ లెజెండ్ మాథ్యూ హేడెన్ ఇటీవల తన గ్యారేజీకి 'స్కార్పియో ఎన్' జోడించాడు. దీనికి సంబంధించిన వీడియోను మహీంద్రా ఆస్ట్రేలియా యూట్యూబ్ ఛానెల్ ద్వారా షేర్ చేశారు. ఈ వీడియోలో మాథ్యూ హేడెన్ క్వీన్స్ల్యాండర్ బ్రిస్బేన్‌లోని మహీంద్రా డీలర్షిప్ చుట్టూ తిరుగుతూ, ఎవరెస్ట్ వైట్ కలర్ స్కీమ్ కలిగిన స్కార్పియో-ఎన్ డెలివరీ తీసుకోవడం చూడవచ్చు. మహీంద్రా స్కార్పియో-ఎన్ ప్రారంభం నుంచి ఉత్తమ అమ్మకాలను పొందుతున్న మహీంద్రా స్కార్పియో ఎన్ ప్రారంభ ధర రూ. 13.26 లక్షలు, టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 22.78 లక్షలు (ఎక్స్-షోరూమ్). వేరియంట్లలో లభించే ఈ కారు 6-సీట్లు మరియు 7-సీట్ల ఆప్సన్లలో లభిస్తుంది. మహీంద్రా స్కార్పియో ఎన్ SUV 2.2-లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్, 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్లను పొందుతుంది. డీజిల్ ఇంజిన్ 175 పీఎస్ పవర్, 400 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. పెట్రోల్ ఇంజిన్ 203 పీఎస్ పవర్, 380 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇవి రెండూ కూడా 6-స్పీడ్ మ్యాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లను పొందుతుంది. ఇదీ చదవండి: మస్క్ చేసిన పనికి మండిపడ్డ అమెరికా.. గుణపాఠం చెప్పిన దిగ్గజ కంపెనీలు! ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో 20.32 సెం.మీ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 17.78 సెం.మీ కలర్ డ్రైవర్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో అండ్ క్రూయిజ్ కంట్రోల్స్, 6-వే పవర్ అడ్జస్టబల్ డ్రైవర్ సీట్, డ్యూయల్ టోన్ డ్యాష్‌బోర్డ్, ప్రీమియం-లుకింగ్ బ్రౌన్ అండ్ బ్లాక్ లెదర్ సీట్లు మొదలైనవి ఉంటాయి. -
వరల్డ్‌కప్ ఫైనల్.. పాత టాలెంట్ బయటకు తీసిన హీరో నాని!
టాలీవుడ్ హీరో నాని పేరు చెప్పగానే మంచి ఎంటర్టైనింగ్ సినిమాలు గుర్తొస్తాయి. ఇతడి లేటెస్ట్ మూవీ 'హాయ్ నాన్న'. పాన్ ఇండియా వైడ్ డిసెంబరు 7న విడుదల కానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ జోరుగా చేస్తున్నాడు. తాజాగా వన్డే ప్రపంచకప్‌లోనూ సందడి చేశాడు. బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్‌ఖాన్‌ని కలవడంతో పాటు తనలోని ఓ పాత టాలెంట్‌ని మళ్లీ అందరికీ చూపించాడు. (ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భర్త వరుణ్ గురించి లావణ్య ఫస్ట్ పోస్ట్!) హీరో కాకముందే అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన నాని.. 'అష్టాచెమ్మా' మూవీతో హీరో అయ్యాడు. ఒక్కో సినిమాతో తన నటన మెరుగుపరుచుకుంటూ పాన్ ఇండియా స్థాయికి వెళ్లాడు. తాజాగా ప్రపంచకప్ ఫైనల్లో తనదైన కామెంటరీ చేసి ఆకట్టుకున్నాడు. ఇతర కామెంటేటర్స్ కూడా చాలా బాగా చేస్తున్నావ్ నాని అనగా.. సినిమాల్లోకి రాకముందే తను ఆర్జే(రేడియా జాకీ)గా కొన్నేళ్ల పనిచేశానని, అందుకే ఇలా అని నాని చెప్పుకొచ్చాడు. అలానే బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌తో నాని ఉన్న ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒకరేమో సూపర్ స్టార్, నాని ఏమో నేచురల్ స్టార్.. వీళ్లిద్దరూ ఒకే ఫ్రేములో కనిపించడం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. (ఇదీ చదవండి: నెలన్నర నుంచి ఓటీటీ ట్రెండింగ్‌లో ఆ థ్రిల్లర్ మూవీ) Natural Star @NameisNani LIVE now on @StarSportsTel for the epic clash of #INDvsAUSfinal. 🏏💪 Watch on @DisneyPlusHS 🔥 #CWC2023 #INDvAUS #TeamIndia #HiNanna #HiNannaOnDec7th @VyraEnts pic.twitter.com/mSQX6v3YTg — Telugu Film Producers Council (@tfpcin) November 19, 2023 -
చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. వరల్డ్ కప్ హిస్టరీలోనే
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా ఆస్ట్రేలియాతో జరగుతున్న ఫైనల్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మరోసారి జట్టుకు అద్బుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. కేవలం 31 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 47 పరుగులు చేశాడు. భారత ఇన్నింగ్స్ 10 ఓవర్లో మాక్స్వెల్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన హిట్‌మ్యాన్.. హెడ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. కాగా ఈ మెగా టోర్నీలో రోహిత్ శర్మ ఓవరాల్‌గా 597 పరుగులు సాధించాడు. తద్వారా ఓ అరుదైన ఘనతను రోహిత్ తన పేరిట లిఖించుకున్నాడు.వరల్డ్‌కప్ సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ పేరిట ఉండేది. 2019 వరల్డ్‌కప్‌లో విలియమ్సన్ 578 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్‌తో కేన్ మామ ఆల్‌టైమ్ రికార్డును హిట్‌మ్యాన్ బ్రేక్ చేశాడు. చదవండి: World Cup 2023 Final: చెత్త షాట్ ఆడి ఔటైన శుబ్‌మన్ గిల్.. కోపంతో చూసిన రోహిత్! వీడియో వైరల్ Most runs by captains in a World Cup: 597 - ROHIT SHARMA🇮🇳 in 2023 578 - Kane Williamson🇳🇿 in 2019 548 - Mahela Jayawardene🇱🇰 in 2007#CWC2023 #INDvsAUSfinal pic.twitter.com/PJ8utlco09 — Kausthub Gudipati (@kaustats) November 19, 2023 View this post on Instagram A post shared by ICC (@icc)