సౌతాఫ్రికా దిగ్గజ క్రికెటర్ జాంటీ రోడ్స్ గత కొన్ని రోజులుగా భారత్‌లో పర్యటిస్తున్నాడు. ఢిల్లీ, గోవా అంటూ దేశమంతా చక్కర్లు కొడుతున్నాడు. ఈ క్రమంలో బెంగళూరుకు పయనమైన జాంటీ రోడ్స్‌కు టాక్సీ డ్రైవర్ మూలంగా కర్ణాటక వంటల రుచులు చవిచూసే అవకాశం లభించింది. అది కూడా రోడ్‌సైడ్ ఫుడ్!
అయితే, జాంటీ రోడ్స్ ఆహార పదార్థాలను టేస్ట్ చేయడానికి మాత్రమే పరిమితమైపోలేదు. అవెంతో రుచిగా ఉన్నాయని.. తనకు ఈ అవకాశం కల్పించిన సదరు డ్రైవర్‌కు ధన్యవాదాలు కూడా చెప్పాడు. ట్రాఫిక్ చికాకు నుంచి తప్పించుకునే క్రమంలో తనకు ఇంత టేస్టీ ఫుడ్ పరిచయం చేసినందుకు అతడిపై ప్రశంసలు కురిపించాడు.
ఈ మేరకు..‘‘బెంగళూరు ఎయిర్‌పోర్టు దగ్గర టాక్సీ డ్రైవర్ నాకో సలహా ఇచ్చాడు. ఎలాగూ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి.. మార్గమధ్యంలో రోడ్డు పక్కన తనకు ఇష్టమైన రెస్టారెంట్‌లో కాసేపు ఆగుదామని నాకు చెప్పాడు.
నాకు తన ఆలోచన నచ్చి అలాగే అన్నాను. అద్భుతమైన రుచి గల మంగళూరు బన్‌తో మొదలుపెట్టి.. మైసూర్ మసాలా దోశ, మసాలా ఛాయ్‌తో ముగించాను’’ అంటూ ఐలవ్ ఇండియా అనే హ్యాష్ ట్యాగ్‌ను జతచేశాడు.
అక్కడితో జాంటీ రోడ్స్ ఆగిపోలేదు.. తనకు ఇంతటి రుచికరమైన వంటకాలు అందించిన రెస్టారెంట్ సిబ్బందితో ఫొటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ మేరకు మంగళవారం జాంటీ రోడ్స్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.
ఈ నేపథ్యంలో.. ‘‘క్రికెటర్లు అంటేనే లగ్జరీ లైఫ్.. ఫైవ్‌స్టార్ హోటళ్లలో బస.. లావిష్ రెస్టారెంట్లలో ఫుడ్.. అబ్బో వాళ్ల లైఫ్‌స్టైలే వేరు.. కానీ జాంటీ రోడ్స్ మాత్రం మిగతా క్రికెటర్లకు భిన్నం.. రోడ్‌సైడ్ ఫుడ్ టేస్ట్ చేయడంతో పాటు.. వాళ్ల సేవలకు తగిన మర్యాద ఇచ్చాడు.
ముఖ్యంగా భారత్ మీద తన ప్రేమను చాటుకున్న విధానం అద్భుతం.. అందుకే నువ్వు లెజెండ్’’ అంటూ అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా ఐసీసీ వన్డే వరల్డ్‌కప్-2023 ట్రోఫీ టూర్ నుంచి జాంటీ రోడ్స్ ఇండియాలోనే ఉన్నాడు. ఇందులో భాగంగా వందే భారత్ రైళ్లోనూ ప్రయాణం చేశాడు.
సౌతాఫ్రికా తరఫున 1992లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన జాంటీ రోడ్స్.. దిగ్గజ ఫీల్డర్‌గా పేరుగాంచాడు. 2003లో తన చివరి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడిన ఈ ప్రొటిస్ బ్యాటర్.. తన కెరీర్‌లో 52 టెస్టులు, 245 వన్డేలు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో వరుసగా.. 2532, 5935 పరుగులు సాధించాడు.
When taxi driver at Bengaluru airport suggested to stop at his favourite restaurant for a roadside bite, because according to him: "traffic will be standing!" Grateful I took his advice. Excellent #mangalorebun and #Mysoremasaldosa, finished off with #masalachai #loveIndia pic.twitter.com/tH3KjykLUI
— Jonty Rhodes (@JontyRhodes8) November 21, 2023
Comments
Please login to add a commentAdd a comment