mangalore
-
New expressway: బెంగళూరు- మంగళూరు మధ్య తగ్గనున్న ప్రయాణ దూరం
కర్నాటక ప్రజలకు కేంద్రప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని రెండు మెగా నగరాలైన బెంగళూరు- మంగళూరులను అనుసంధానిస్తూ త్వరలో ఎక్స్‌ప్రెస్‌వేను నిర్మిస్తున్నట్లు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ(Ministry of Road Transport and Highways) ప్రకటించింది. ఈ నగరాలను హసన్ ప్రాంతం మీదుగా అనుసంధానిస్తామని తెలిపింది.ఈ ఎక్స్‌ప్రెస్‌వే ఈ రెండు నగరాల ప్రజలకు మరింత సౌకర్యాన్ని అందించడమే కాకుండా, ఆర్థిక కార్యకలాపాలకు కూడా ఊతమిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణంతో ఈ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం ఏడు నుండి ఎనిమిది గంటలు వరకూ తగ్గే అవకాశం ఉందని, ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును భారత జాతీయ రహదారుల అథారిటీ (ఎన్హెచ్ఏఐ), కర్ణాటక ప్రజా పనుల శాఖ(Karnataka Public Works Department) సంయుక్తంగా చేపట్టనున్నాయని తెలిపింది.ఈ ఎక్స్‌ప్రెస్‌వే ప్రధాన లక్ష్యం బెంగళూరు వెలుపలి ప్రాంతాలలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడం. ఈ ఎక్స్‌ప్రెస్ వే 335 కి.మీ. దూరం ఉంటుంది, నాలుగు నుండి ఆరు లేన్లుగా దీనిని నిర్మించనున్నారు. ఈ బెంగళూరు-మంగళూరు ఎక్స్‌ప్రెస్‌వే(Bengaluru-Mangalore Expressway) నిర్మాణం 2028లో ప్రారంభం కానుంది . ఇది రాష్ట్ర రవాణా రంగానికి గేమ్ ఛేంజర్‌గా మారనుందని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య ప్రయాణానికి చాలా సమయం పడుతోంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ మార్గంలో ప్రయాణించాలంటే పలు ఇబ్బందులు ఎదువుతుంటాయ. ఇటీవల కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ మాట్లాడుతూ బెంగళూరు ట్రాఫిక్ రద్దీ సమస్యను రాబోయే రెండు,మూడు ఏళ్లలోపు పరిష్కరించడం అసాధ్యమని వ్యాఖ్యానించారు.ఇది కూడా చదవండి: Delhi: రేఖా గుప్తా జీతమెంత? కేజ్రీవాల్ పింఛనెంత? -
మంగళూరు బ్యాంకులో దోపిడీ.. ఉద్యోగులను గన్‌తో బెదిరించి..
మంగళూరు: కర్ణాటక(Karnataka)లో వరుస దోపిడీలు హడలెత్తిస్తున్నాయి. బీదర్ ఘటన మరవకముందే మరో చోరీ జరిగింది. మంగళూరు(Mangalore)లోని ఉల్లాల్ కేసీ రోడ్డులో కో-ఆపరేటివ్ బ్యాంకు(Co-operative Bank)లో ఉద్యోగులను గన్‌తో బెదిరించి ట్రెజరీలోని నగదు, బంగారాన్ని దొంగలు దోచుకెళ్లారు. రూ.15 కోట్ల నగదు, 5 లక్షల విలువైన నగలతో పరారయ్యారు. బ్యాంక్ లంచ్టైంలో దోపిడీ జరిగింది. ఐదుగురు దొంగలు చోరీకి పాల్పడ్డారన్న ఉద్యోగులు.. బీహార్ గ్యాంగ్ పనిగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దుండగులు.. ఫియట్ కార్లో వచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.కాగా, నిన్న(గురువారం) బీదర్‌లో పట్టపగలే దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఏటీఎంకు డబ్బులు తరలిస్తున్న వాహనంపై దోపిడీ దొంగలు దాడి చేశారు. బైక్‌పై వచ్చిన దుండగులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు సెక్యూరిటీ గార్డులు మృతి చెందారు. దాడి అనంతరం డబ్బు పెట్టెతో దుండగులు అక్కడి నుంచి ఉడాయించారు. అందులో సుమారు రూ.93 లక్షల నగదు ఉన్నట్లు సమాచారం. మరోవైపు దాడి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిని అక్కడికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు.ఇదీ చదవండి: అఫ్జల్‌గంజ్ టూ ట్యాంక్‌బండ్ అలర్ట్.. బీదర్ ముఠా ఎక్కడ?ఇక దొంగలు తెలంగాణ వైపు తమ బైక్‌ను మళ్లించినట్లు బీదర్ పోలీసులు నిర్ధారించుకున్నారు. దీంతో పోలీసులు బీదర్ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో అఫ్జల్‌గంజ్ వద్ద దొంగలకు బీదర్ పోలీసులు కనిపించారు. దొంగల ముఠా.. తప్పించుకునేందుకు అఫ్జల్‌గంజ్‌లో ఉన్న ఓ ట్రావెల్స్ కార్యాలయంలోకి ప్రవేశించారు. పోలీసులపై కాల్పులు జరుపుతుండగా.. అక్కడే ఉన్న ట్రావెల్స్ కార్యాలయం మేనేజర్‌కు బుల్లెట్లు తగిలాయి. దీంతో అతనికి తీవ్ర రక్తస్రావం జరిగింది. అప్రమత్తమైన హైదరాబాద్ పోలీసులు కూడా బీదర్ పోలీసులతో పాటు దొంగల ముఠాను పట్టుకునేందుకు యత్నిస్తున్నారు. -
ప్రముఖ ఆలయంలో అతియా శెట్టి- కేఎల్ రాహుల్.. వీడియో వైరల్!
బాలీవుడ్ భామ అతియా శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కూతురిగా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. 2015లో హీరో మూవీతో అరంగేట్రం చేసింది ముద్దుగుమ్మ. ఆ తర్వాత ముబాకరన్, నవాబ్జాదే, మోతీచూర్ చక్నాచూర్ చిత్రాల్లో మెరిసింది. అయితే కొన్నేళ్లపాటు టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్‌తో డేటింగ్ కొనసాగించిన భామ.. గతేడాది వివాహాబంధంలోకి అడుగుపెట్టింది.తాజాగా ఈ జంట కర్ణాటకలోని ఓ ఆలయాన్ని సందర్శించారు. మంగళూరులోని కుట్టారు కొరగజ్జ ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీరితో పాటు అతియా సోదరుడు అహన్ శెట్టి కూడా ఉన్నారు. అంతేకాకుండా ఇటీవల బాలీవుడ్ నటి కత్రినాకైఫ్ సైతం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కాగా.. అతియా శెట్టి తండ్రి సునీల్ శెట్టికి కర్ణాటకలోని తులునాడు మూలాలు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. అంతకుముందే మంగళూరులోని శ్రీ దుర్గా పరమేశ్వరి అమ్మవారి ఆలయాన్ని కూడా దర్శించుకున్నారు. కాగా.. ఇటీవల ముంబైలో జరిగిన అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వివాహానికి కత్రినా, అథియా, అహన్ శెట్టి, కేఎల్ రాహుల్ హాజరయ్యారు. View this post on Instagram A post shared by Mangalore Meri Jaan (@mangaloremerijaanofficial)VIDEO | Indian cricketer KL Rahul (@klrahul) offers prayers at Bappanadu Sri Durga Parameshwari Temple in Karnataka's Mangaluru. (Source: Third Party) pic.twitter.com/zKer47NiQ2— Press Trust of India (@PTI_News) July 14, 2024 -
వెకేషన్లో 'విశ్వంభర' బ్యూటీ.. తెగ ముద్దొచ్చేస్తుంది! (ఫొటోలు)
-
CWC 2023: టాక్సీ డ్రైవర్ మాట విన్నందుకు ఇలా: సౌతాఫ్రికా లెజెండ్
సౌతాఫ్రికా దిగ్గజ క్రికెటర్ జాంటీ రోడ్స్ గత కొన్ని రోజులుగా భారత్‌లో పర్యటిస్తున్నాడు. ఢిల్లీ, గోవా అంటూ దేశమంతా చక్కర్లు కొడుతున్నాడు. ఈ క్రమంలో బెంగళూరుకు పయనమైన జాంటీ రోడ్స్‌కు టాక్సీ డ్రైవర్ మూలంగా కర్ణాటక వంటల రుచులు చవిచూసే అవకాశం లభించింది. అది కూడా రోడ్‌సైడ్ ఫుడ్! అయితే, జాంటీ రోడ్స్ ఆహార పదార్థాలను టేస్ట్ చేయడానికి మాత్రమే పరిమితమైపోలేదు. అవెంతో రుచిగా ఉన్నాయని.. తనకు ఈ అవకాశం కల్పించిన సదరు డ్రైవర్‌కు ధన్యవాదాలు కూడా చెప్పాడు. ట్రాఫిక్ చికాకు నుంచి తప్పించుకునే క్రమంలో తనకు ఇంత టేస్టీ ఫుడ్ పరిచయం చేసినందుకు అతడిపై ప్రశంసలు కురిపించాడు. ఈ మేరకు..‘‘బెంగళూరు ఎయిర్‌పోర్టు దగ్గర టాక్సీ డ్రైవర్ నాకో సలహా ఇచ్చాడు. ఎలాగూ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి.. మార్గమధ్యంలో రోడ్డు పక్కన తనకు ఇష్టమైన రెస్టారెంట్లో కాసేపు ఆగుదామని నాకు చెప్పాడు. నాకు తన ఆలోచన నచ్చి అలాగే అన్నాను. అద్భుతమైన రుచి గల మంగళూరు బన్‌తో మొదలుపెట్టి.. మైసూర్ మసాలా దోశ, మసాలా ఛాయ్‌తో ముగించాను’’ అంటూ ఐలవ్ ఇండియా అనే హ్యాష్ ట్యాగ్‌ను జతచేశాడు. అక్కడితో జాంటీ రోడ్స్ ఆగిపోలేదు.. తనకు ఇంతటి రుచికరమైన వంటకాలు అందించిన రెస్టారెంట్ సిబ్బందితో ఫొటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ మేరకు మంగళవారం జాంటీ రోడ్స్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో.. ‘‘క్రికెటర్లు అంటేనే లగ్జరీ లైఫ్.. ఫైవ్‌స్టార్ హోటళ్లలో బస.. లావిష్ రెస్టారెంట్లలో ఫుడ్.. అబ్బో వాళ్ల లైఫ్‌స్టైలే వేరు.. కానీ జాంటీ రోడ్స్ మాత్రం మిగతా క్రికెటర్లకు భిన్నం.. రోడ్‌సైడ్ ఫుడ్ టేస్ట్ చేయడంతో పాటు.. వాళ్ల సేవలకు తగిన మర్యాద ఇచ్చాడు. ముఖ్యంగా భారత్ మీద తన ప్రేమను చాటుకున్న విధానం అద్భుతం.. అందుకే నువ్వు లెజెండ్’’ అంటూ అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా ఐసీసీ వన్డే వరల్డ్‌కప్-2023 ట్రోఫీ టూర్ నుంచి జాంటీ రోడ్స్ ఇండియాలోనే ఉన్నాడు. ఇందులో భాగంగా వందే భారత్ రైళ్లోనూ ప్రయాణం చేశాడు. సౌతాఫ్రికా తరఫున 1992లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన జాంటీ రోడ్స్.. దిగ్గజ ఫీల్డర్‌గా పేరుగాంచాడు. 2003లో తన చివరి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడిన ఈ ప్రొటిస్ బ్యాటర్.. తన కెరీర్లో 52 టెస్టులు, 245 వన్డేలు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో వరుసగా.. 2532, 5935 పరుగులు సాధించాడు. When taxi driver at Bengaluru airport suggested to stop at his favourite restaurant for a roadside bite, because according to him: "traffic will be standing!" Grateful I took his advice. Excellent #mangalorebun and #Mysoremasaldosa, finished off with #masalachai #loveIndia pic.twitter.com/tH3KjykLUI — Jonty Rhodes (@JontyRhodes8) November 21, 2023 -
"కృష్ణ భక్తి" ఎంతపనైనా చేస్తుంది అంటే ఇదే కదా..ఏకంగా 88..
"గోకులాష్టమి" లేదా "కృష్ణాష్టమి" ఈ నెల సెప్టెంబర్ 7న పలెల్లోనూ, నగరాల్లోనూ కనుల పండుగగా జరిగింది. ఆయా ప్రాంతాల సంప్రదాయాన్ని అనుసరించి వేడుకగా చేసుకున్నారు ఈపండుగను. ఒక్కొక్కరూ ఒక్కో రీతిలో కృష్ణుడిపై తమ భక్తిని చాటుకున్నారు. జ్ఞానానికి ప్రతీకగా, జీవుల కష్టాల నుంచి బయటపడేలా చేసే భగవద్గీత వంటి మహోన్నత గ్రంథాన్ని అందిచిని గురువుగా.. "కృష్ణం వందే జగద్గురుం" అని మారుమ్రోగిపోయేలా కృష్ణుడి పుట్టిన రోజుని వేడుకగా చేసుకున్నారు. చిన్ని కృష్ణా, వెన్నదొంగ, కన్నయ్య, రావయ్య మా ఇంటికి రమ్మంటూ రంగవల్లులతో కృష్ణుని పాదాలను వేసి మరీ ఆహ్వానిస్తూ బంధువార సపరిమేతంగా ఈ పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు ప్రజలు. అలాగే కృష్ణుడు జన్మస్థలమైన గుజరాత్లో మరింత వీనుల విందుగా జరిగింది. తగ్గేదేలే అన్నట్లుగా భక్తులు ఈ పండుగను నూతనోత్సహంతో చేసుకోవడమే గాక తమ చిన్నారులను కన్నయ్యలుగా మార్చి సంబరపడ్డారు. ఇలా ఒక్కొక్కరూ ఒక్కో పంథాలో తమదైన రీతిలో ఈ వేడుకను చేసుకుంటే..మంగళూరుకి చెందిన ఓ మహిళ అందరూ ఆశ్చర్యచకితుల్ని చేసేలా పండుగను సెలబ్రేట్ చేసుకుంది. కృష్ణ భక్తి అంటే ఏంటో..దానికున్న శక్తి ఏంటో చాటి చెప్పింది. మంగళూరుకి చెందిన ఓ మహిళ కృష్ణుడు జన్మ తిథి అష్టమి కలిసి వచ్చేలా 88 రకాల పిండి వంటలను నైవేద్యంగా పెట్టి ఔరా! అనిపించింది. కృష్ణుడుపై ఉన్న అపారమైన భక్తి ఎంతటి సాహసానికైనా లేదా ఎంతటి అనితరసాధ్యమైన పనికి అయినా పురికొల్పి చేయగలిగే శక్తిని ఇస్తుంది అని చెప్పడానికి ఆమె ఓ ఉదాహరణ. అందుకు సంబంధించని ఫోటోని ఓ కార్డియాలజిస్ట్ వైద్యుడు కామత్ నెట్టింట షేర్ చేశారు. ఆ మహిళ తన పేషెంట్ అని, ఆమెకు కృష్ణుడిపై ఉన్న భక్తి తేటతెల్లమయ్యేలా ఎంతలా శ్రమ ఓర్చి మరీ ఆ కన్నయ్యకు ఇలా విందు ఏర్పాటు చేసింది. కృష్ణునికి నివేధించే ఛపన్ భోగ్లో ఉండే వంటకాలకు మించి చేసిందని ప్రశంసించారు. ఆమెను చూసినా, ఆమె కృష్ణ భక్తిని చూసినా తనకు చాలా గర్వంగా అనిపిస్తుందన్నారు. ఆమె గతేడాది కృష్ణాష్టమి రోజున తాను చేసిన పిండి వంటల రికార్డును ఆమే బ్రేక్ చేసిందని ట్విట్టర్లో రాసుకొచ్చారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కెర్లు కొడుతోంది. మీరు ఓ లుక్కేయండి. Proud of her and her devotion to lord Krishna. She is my patient. She has again broken her previous record. 88 dishes were prepared last night for Gokulashtami. #janamashtami pic.twitter.com/SDoh3JKTvM — Dr P Kamath (@cardio73) September 7, 2023 (చదవండి: అత్యంత ఖరీదైన కాఫీ..తయారీ విధానం తెలిస్తే..షాకవ్వడం ఖాయం!) -
100 కేజీల డ్రగ్స్ చాక్లెట్లు స్వాధీనం
యశవంతపుర(బెంగళూరు): మంగళూరు నగర డ్రగ్స్ నిఘా విభాగం పోలీసులు 100 కేజీల డ్రగ్స్ పూతగల చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. పాండేశ్వర పోలీసులు మంగళూరు లో కార్స్ట్రీట్, ఫళ్నీర్లో రెండుచోట్ల దాడులు చేసి మత్తు పదార్థాలు పూతపూసిన చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. మనోహర్ శేఠ్, చెచ్చన్ సోంకర్ అనేవారిని అరెస్ట్ చేసినట్లు నగర పోలీసు కమిషనర్ కులదీప్ కుమార్ జైన్ తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి డ్రగ్స్ తెచ్చి అమ్ముతున్నట్లు వివరించారు. మరో ఘటనలో.. తండ్రిని హతమార్చిన కూతురు దొడ్డబళ్లాపురం: మానసిక అస్వస్థురాలైన కుమార్తె.. కన్నతండ్రిని హత్య చేసిన సంఘటన చెన్నపట్టణ తాలూకా నాయిదొళె గ్రామంలో చోటుచేసుకుంది. పుష్ప అనే వివాహిత తండ్రి హుచ్చీరయ్య (68)ను పారతో కొట్టి హత్య చేసింది. మానసిక ఆరోగ్యం బాగా లేకపోవడంతో పుష్ప గత కొంత కాలంగా భర్తను వదిలి పుట్టింట్లో ఉంటోంది. వైద్యం చేయించుకోక మరింత ముదిరింది. రోజూ తండ్రితో గొడవ పడేది. బుధవారం రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరిగ్గా, ఇంట్లోని పార తీసుకుని ఇష్టానుసారంగా బాదడంతో వృద్ధుడు ప్రాణాలొదిలాడు. చెన్నపట్టణ గ్రామీణ పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పుష్ప పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. -
ప్లీజ్ ఇలా మాత్రం డ్రైవింగ్ చేయకండి.. స్పాట్లోనే మృతి
మంగళూరు: అతివేగం ఎంత ప్రమాదకరమో ఇప్పటికే పలు సందర్భాల్లో చూసి ఉంటాం. హైస్పీడ్ కారణంగా ఎందరో ప్రాణాలు సైతం కోల్పోయారు. ఇక, రోడ్డు ప్రమాదాలపై పోలీసులు ఎంతగా ప్రచారం, అవగాహాన కల్పిస్తున్న కొందరు పెడచెవిన పెడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు స్పాట్లోనే మృతిచెందాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. కర్నాటక రాష్ట్రం మంగళూరులో ఘోర ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళ్తున్న నిషాత్(21) హైస్పీడ్‌లో అదుపుతప్పి డివైడర్ మధ్యలో ఉన్న కరెంట్ పోల్‌ను ఢీకొట్టాడు. ఈ క్రమంలో బైక్ మీదున్న యువకుడు గాల్లోకి ఎగిరిపడ్డాడు. ఈ ప్రమాదంలో స్పాట్లోనే నిషాంత్ చనిపోయాడు. ఈ ప్రమాద దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యాక్సిడెంట్ జరిగిన తీరు చూసి అంతా షాక్ అవుతున్నారు. ఇదిలా ఉండగా.. యువకుడు గాల్లోకి ఎగరడం చూస్తే.. బైక్ ను ఎంత వేగంగా నడుపుతున్నాడో అర్థమవుతుంది. ఇక, మృతుడిని ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థిగా పోలీసులు గుర్తించారు. అడయార్ సహ్యాద్రి ఇంజినీరింగ్ కాలేజీ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. Horrible accident caught on #CCTV in #Mangalore : A 21year old student from Kerala Muhammad Nishath (21) died on the spot when his bike skidded and hit a pole. The impact was such that he received multiple injuries on the head and died on the spot. pic.twitter.com/G6ztKFRlqz — Siddhant Anand (@JournoSiddhant) July 19, 2023 ఇది కూడా చదవండి: మణిపూర్ ఘటన:. ప్రధాన నిందితుడి ఇంటి తగలబెట్టి.. కుటుంబాన్ని బహిష్కరించిన గ్రామస్తులు -
గెయిల్ చేతికి జేబీఎఫ్ కెమ్
న్యూఢిల్లీ: దివాలా చట్ట ప్రకారం జేబీఎఫ్ పెట్రోకెమికల్స్‌ను యుటిలిటీ రంగ పీఎస్‌యూ గెయిల్ ఇండియా చేజిక్కించుకుంది. ఇందుకు వీలుగా ప్రైవేట్ రంగ సాల్వెంట్ కంపెనీ జేబీఎఫ్లో రూ. 2,101 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. తద్వారా ఈ జూన్ 1 నుంచి సొంత అనుబంధ సంస్థగా మార్చుకుంది. జేబీఎఫ్‌ను కొనుగోలు చేసేందుకు మార్చిలో దివా లా చట్ట సంబంధ కోర్టు గెయిల్‌ను అనుమతించిన సంగతి తెలిసిందే. రుణ పరిష్కార ప్రణాళిక ప్రకా రం జేబీఎఫ్కు ఈక్విటీ రూపేణా రూ. 625 కోట్లు, రుణాలుగా రూ. 1,476 కోట్లు అందించినట్లు గెయిల్ స్టాక్ ఎక్సే్ఛంజీలకు తాజాగా వెల్లడించింది. కాగా.. జేబీఎఫ్ కొనుగోలుకి ఇతర పీఎస్ యూ దిగ్గజాలు ఐవోసీ, ఓఎన్‌జీసీలతో పోటీపడి గెయిల్ బిడ్ చేసింది. రూ. 5,628 కోట్ల బకాయిల రికవరీకిగాను ఐడీబీఐ బ్యాంక్ దివాలా ప్రక్రియను చేపట్టింది. కంపెనీ బ్యాక్‌గ్రౌండ్ జేబీఎఫ్ పెట్రోకెమికల్స్ 2008లో ఏర్పాటైంది. మంగళూరు సెజ్‌లో 1.25 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో ప్యూరిఫైడ్ టెరిప్తాలిక్ యాసిడ్(పీటీఏ) ప్లాంటును నెలకొల్పేందుకు కంపెనీకి ఐడీబీఐసహా ఇతర బ్యాంకులు రుణాలందించాయి. బీపీ సాంకేతిక మద్దతుతోపాటు 60.38 కోట్ల డాలర్ల రుణాలను మంజూరు చేశాయి. అంతేకాకుండా ము డిసరుకుగా నెలకు 50,000 టన్నుల పారాగ్జిలీన్ను సరఫరా చేసేందుకు ప్రభుత్వ రంగ కెమికల్ సంస్థ ఓఎంపీఎల్ సైతం అంగీకరించింది. ప్రధానంగా జేబీఎఫ్ ఇండస్ట్రీస్ పాలియస్టర్ ప్లాంట్లకు అవసరమైన ముడిసరుకును రూపొందించేందుకు ఈ సంస్థ ఏర్పాటైంది. 2017లో కార్యకలాపాలు ప్రారంభించిన సంస్థ రుణ చెల్లింపుల్లో విఫలంకావడంతో అదే ఏడాది మూతపడింది. వెరసి కార్పొరేట్ దివా లా ప్రక్రియకు లోనైంది. కాగా.. గెయిల్ యూపీలో ని పటాలో వార్షికంగా 8,10,000 టన్నుల సా మర్థ్యంతో పెట్రోకెమికల్ ప్లాంటును కలిగి ఉంది. వ చ్చే ఏడాదికల్లా మహారాష్ట్రలోని ఉసార్‌లో ప్రొ పేన్ డీహైడ్రోజనేషన్ ప్లాంటును నిర్మించే లక్ష్యంతో ఉంది. తద్వారా ఏడాదికి 5,00,000 టన్నుల పాలీప్రొపిలీన్‌ను రూపొందించాలని ప్రణాళికలు వేసింది. ఈ వార్తల నేపథ్యంలో గెయిల్ షేరు ఎన్ఎస్ఈలో 0.6 శాతం నీరసించి రూ. 105 వద్ద ముగిసింది. -
మంగళూరు లో ఆటో రిక్షా బ్లాస్ట్ విజువల్స్
-
ఓడిన కోకిల.. ఆమె గొంతు కూడా అచ్చు లతా గొంతులాగే..
విజేతల గాథలు లోకానికి తెలుస్తాయి. విజేతలు కాలేకపోయిన వారి కథ తెర వెనుక ఉండిపోతుంది. సుమన్ కల్యాణ్‌పూర్‌ను ‘పేదవాళ్ల లతా మంగేష్కర్’ అనేవారు. ఆమె అచ్చు లతా లాగే పాడేది. లతతో సరిసాటి అనేవారు అభిమానులు. ‘నా నా కర్తే ప్యార్ తుమ్హీసే కర్ బైఠే’ ‘ఆజ్ కల్ తెరె మేరె ప్యార్ కే చర్చే హర్ జబాన్ పర్’... ఎన్నో పాటలు. ఆమెను ఇండస్ట్రీ దగా చేసింది. ఆమె మాత్రం హుందాగా తనకు వచ్చిన పాటే పాడింది. ఈ సున్నితమైన గాయని జీవితాన్ని ఒక తలుచుకోవాల్సిన రోజు ఇది. ‘ఆమె అంత బాగా పాడేది. మరిఎందుకు ఎక్కువ పాటలు పాడలేదు?’ అని సుమన్ కల్యాణ్‌పూర్ గురించి అభిమానులు నేటికీ అనుకుంటారు. ఎందుకు పాడలేదు? ఎందుకు ఉద్యోగంలో రాణించలేదు? ఎందుకు ఫలానా రంగంలో పైకి ఎదగలేదు? అనంటే ఆ రంగానికి సంబంధించిన ఆట సరిగా ఆడకపోవడమే కారణం. ఆడేంత మొరటుదనం లేకపోవడమే కారణం. మనం గెలవాలంటే మనం ప్రయత్నించి గెలవడం ఒక మార్గం. ప్రత్యర్థులను లేకుండా చేసి గెలవడం ఒక మార్గం. పైకి ఎదగాలంటే సినిమా పరిశ్రమలో ఇవన్నీ చేయాలి. సుమన్ కల్యాణ్‌పూర్ కేవలం పాడగలిగేదే తప్ప ఇన్ని రాజకీయాలు చేసేది కాదు. అందుకే ఆమె తక్కువ పాడింది. కాని పాడిన ప్రతిదీ ఎంత తీయగా పాడింది? గుర్తుందా నౌషాద్ సంగీతంలో ముఖేశ్‌తో పాడిన ఈ డ్యూయెట్– మేరా ప్యార్ భీ తూహై ఏ బహార్ భీ తూహై తూహీ నజరోంమే జానే తమన్నా తూహీ నజారోమే... (సాథీ) సుమన్ కల్యాణ్‌పూర్‌ది మంగళూరు. తండ్రి బ్యాంక్ ఉద్యోగి కావడంతో ముంబై వచ్చి స్థిరపడింది. చిన్న వయసులోనే పెళ్లయ్యింది. భర్త రామానంద్ కల్యాణ్‌పూర్ ఆమెను పాడనిచ్చాడు కాని ప్రతి రికార్డింగ్‌కూ తోడు వచ్చేవాడు. లతా గొంతును చూసి ఇన్‌స్పయిర్ అయ్యింది సుమన్. కాని విశేషం ఏమిటంటే ఆమె గొంతు కూడా అచ్చు లతా గొంతులాగే ఉండేది. కొన్ని పాటలు వింటే లతా ఎక్కువ మార్దవం గా పాడుతోందా సుమన్ ఎక్కువ మార్దవంగా పాడుతోందా అర్థమయ్యేది కాదు. కొన్ని రికార్డు లు రేడియోలో ప్లే చేస్తూ ఒకరి పేరు మరొకరి పేరుగా చెప్పేంతగా కన్ఫ్యూజన్ ఉండేది. ‘బ్రహ్మచారి’ లో రఫీతో ఈ డ్యూయెట్ లతా పాడింది అనుకుంటారు. కాని సుమన్ పాడింది. ఆజ్ కల్ తెరె ప్యార్ కే చర్చే హర్ జబాన్ పర్ తుజ్ కో మాలూమ్ హై ఔర్ సబ్కో ఖబర్ హోగయి... సుమన్ కల్యాణ్‌పూర్‌ను చాలా మంది నిర్మాతలు ఇష్టపడేవారు. దానికి కారణం ఆమె ‘పూర్‌మేన్స్ లతా’ కావడమే. అంటే లతా 10 వేలు తీసుకుంటే అలాగే పాడే సుమన్ మూడు నాలుగు వేలకు పాట పూర్తి చేసేది. ‘బాత్ ఏక్ రాత్ కీ’లో హేమంత్ కుమార్‌తో ఆమె ఎంత అందమైన పాట పాడింది. నా తుమ్ హమే జానో నా హమ్ తుమే జానే మగర్ లగ్తా హై కుచ్ ఐసా మేరా హమ్దమ్ మిల్ గయా... కాని లతా మంగేష్కర్, ఆశా భోంస్లే... వీరిద్దరికీ ఉండే శక్తి ముందు ఇతర గాయనులు ఒదిగి ఉండక తప్పేది కాదు. సంగీత దర్శకులు కూడా వీరిద్దరిని కాదని సుమన్‌కు పాట ఇవ్వాలంటే జంకే వారు. నిర్మాతలు భయపడేవారు. లతా మార్కెట్ సినిమాకు ప్లస్ అయ్యేది. దానిని వదులుకోలేక సుమన్‌ను వదులుకున్నారు. అయితే ఒక సందర్భం వచ్చింది. సినిమా పాటల రాయల్టీ ఆ పాటలు రిలీజయ్యి ఎన్నాళ్లయినా గాయనీ గాయకులకు ఇవ్వాల్సిందే అని లతా వాదనకు దిగింది. రఫీ ఆమెతో విభేదించాడు. పాటకు ఒకసారి డబ్బు తీసుకున్నాక ఆ తర్వాత దాని గురించి ఆలోచించకూడదు అని అతని వాదన. ‘అయితే నీతో నేను పాడను’ అని రఫీతో పాటడం మానేసింది లత. రఫీ అప్పుడు సుమన్ కల్యాణ్‌పూర్‌తో బోలెడన్ని డ్యూయెట్లు పాడాడు. అన్నీ హిట్. ‘జబ్ జబ్ ఫూల్ ఖిలే’లో ఈ పాట– నా నా కర్తే ప్యార్ తుమ్హీసే కర్ బైఠే కర్నా థా ఇన్కార్ మగర్ ఇక్రార్ తుమ్హీసే కర్ బైఠే... ఖయ్యాం కూడా సుమన్, రఫీలతో మంచి డ్యూయెట్లు పాడించాడు. ‘మొహబ్బద్ ఇస్కో కెహతే హై’లో ‘ఠెహరియే హోష్ మే ఆలూం’ పాట మధురాతి మధురం. ‘రాజ్‌కుమార్’లో సుమన్–రఫీల డ్యూయెట్ ‘తుమ్ నే పుకారా ఔర్ హమ్ చలే ఆయే’ పెద్ద హిట్. కాని ఆ తర్వాత తిరిగి లతా, రఫీల మధ్య సంధి కుదరడంతో సుమన్‌కు పాటలు పోయాయి. సుమన్ పెద్దగా ఎవరినీ కలవదు. నేటికీ ఆమె ముంబైలో జీవిస్తోంది కాని చూసిన వారు తక్కువ. మాట్లాడినవారూ తక్కువే. ఎన్నో గొప్ప పాటలు పాడాల్సిన ఆమె కొద్ది తేనె చుక్కలు చిలకరించి మాయమైంది. ఆమె పాటకు పూల కానుక. షరాబీ షరాబీ ఏ సావన్ కా మౌసమ్ ఖుదాకీ కసమ్ ఖూబ్ సూరత్ న హోతా అగర్ ఇస్ మే రంగే మొహబ్బత్ న హోతా (నూర్జహాన్). మొహమ్మద్ రఫీతో సుమన్ కల్యాణ్‌పూర్ -
పెళ్లి వేడుకలో వింత వేషధారణ
మంగళూరు: పెళ్లి వేడుకలో హిందువుల మనోభావాలను దెబ్బతీశారనే ఆరోపణలపై మంగళూరుకు చెందిన ఓ ముస్లిం పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు బంధువులపై కేసు నమోదైంది. బంట్వాల్ తాలూకా కొల్నాడు గ్రామంలో సాలెతూర్కు చెందిన అజీజ్ ఇంట్లో గురువారం రాత్రి జరిగిన వివాహ వేడుకకు బాషిత్ అనే వ్యక్తి హాజరయ్యాడు. ఈ సందర్భంగా తులునాడు ప్రాంతంలో హిందువులు ఎక్కువగా ఆరాధించే కొరగజ్జా అనే దేవుడి మాదిరిగా బాషిత్ తదితరులు దుస్తులు వేసుకుని, ఆ దేవుడిని అవమానించేలా డ్యాన్స్ చేశారు. ఈ వీడియోను అతడి స్నేహితులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. దీనిపై బంట్వాల్ తాలూకా విట్లపడ్నూర్ గ్రామానికి చెందిన చేతన్ ఫిర్యాదు మేరకు పెళ్లికొడుకు, పెళ్లి కూతురు బంధువులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
అవమానం నుంచి పుట్టిన ఆలోచన.. నేడు పద్మశ్రీ
సాక్షి, వెబ్‌డెస్క్: ఆపదలో ఉన్న వారికి.. సాయం కోరే వారికి చేయూతనివ్వడానికి మన దగ్గర ఎనలేని సంపద ఉండాల్సిన పని లేదు. తోటి వారి కష్టాన్ని చూసి స్పందించే హృదయం.. చేయూత ఇవ్వాలనే ఆలోచన ఉంటే చాలు. ఈ కోవకు చెందిన వ్యక్తే కర్ణాటకకు చెందిన హరేకల హజబ్బ. పళ్లు అమ్ముకుని జీవనం సాగించే హజబ్బ తన ఊరి పిల్లల పాలిట దైవం అయ్యాడు. రెక్కడాతే కాని డొక్కాడని స్థితిలో ఉన్న హజబ్బ.. తన ఊరి పిల్లల కోసం ఏకంగా పాఠశాల నిర్మించాడు. 1-10వ తరగతి వరకు ఇక్కడ ఉచితంగా చదువుకోవచ్చు. హజబ్బ సేవా గుణాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మశ్రీతో సత్కరించింది. ఆయన సేవా గుణం ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది. ఆ వివరాలు.. హజబ్బ జీవితాన్ని మార్చిన సంఘటన.. మంగుళూరుకు చెందిన హరేకల హజబ్బ స్థానికంగా ఉన్న సెంట్రల్ మార్కెట్లో కమలాలు అమ్ముతూ జీవనం సాగిస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో ఓ రోజు ఫారిన్ దంపతులు హజబ్బ దగ్గరకు వచ్చి.. కిలో కమలాలు ఎంత అని ఇంగ్లీష్‌లో అడిగారు. హజబ్బకు కన్నడ, మాతృభాష అరబ్బీ తప్ప మరో భాష రాదు. అందుకే ఆ ఫారిన్ దంపతులు అడిగిన ప్రశ్నకు అతను సమాధానం చెప్పలేకపోయాడు. ఆ దంపతులు హజబ్బను చూసి ఎగతాళిగా నవ్వుకుంటూ వెళ్లిపోయారు. (చదవండి: పద్మశ్రీకి ఎంపికైనా పింఛను కరువే) తన పరిస్థితి మరేవరికి రాకూడదని.. జరిగిన అవమానం హజబ్బను చాలా కుంగదీసింది. ఇంగ్లీష్ రాకపోవడం వల్లే తాను ఇలా అవమానాలు పొందాల్సి వచ్చిందని భావించాడు. తన గ్రామంలోని పిల్లలు ఎవరు ఇలాంటి పరిస్థితి ఎదుర్కొకుండా ఉండాలంటే.. వారికి ఇంగ్లీష్ తప్పనిసరిగా రావాలని భావించాడు. కానీ తన గ్రామంలో మంచి స్కూల్ లేకపోవడం.. మదర్సాలో అరబ్బీ తప్ప మరో భాష నేర్పకపోవడం హజబ్బను కలవరపరిచింది. రూ.5000తో ముందడుగు.. ఈ క్రమంలో హజబ్బ తానే స్వయంగా ఓ పాఠశాలను ప్రారంభించాలిన నిర్ణయించుకున్నాడు. అయితే అది అనుకున్నంత సులభంగా జరగలేదు. ఎన్నో అవమానాలు.. అడ్డంకులు ఎదురుకున్నాడు. వాటన్నింటిని దాటుకుని.. 1999, జూన్‌లో తన కలని నిజం చేసుకున్నాడు. అప్పటి వరకు తాను పొదుపు చేసుకున్న ఐదువేల రూపాయలతో సొంతంగా కొంత భూమి కొనుగోలు చేసి.. పాఠశాల నిర్మాణం ప్రారంభించాడు. (చదవండి: ‘ఆడపిల్లని, చెట్టుని కాపాడుకుంటే చాలు') ప్రభుత్వం, దాతల సాయంతో అలా 2001 జూన్ నాటికి 8 తరగతి గదులు, రెండు మరుగుదొడ్లతో స్కూలు నిర్మాణం పూర్తయింది. అయితే పాఠశాల నిర్మించాలనే అతని కల నెరవేరింది. ఆ తర్వాత హైస్కూలు స్థాపించాలని నిర్ణయించుకున్నాడు హజబ్బ. పదేళ్లు కష్టపడి దాన్ని కూడా సాకారం చేసుకున్నాడు. 2012 నాటికి ప్రాథమిక పాఠశాల పక్కనే ఉన్నత తరగతి విద్యార్థుల కోసం మరో బిల్డింగ్ నిర్మించాడు. ప్రస్తుతం తన గ్రామంలో ప్రీ యూనివర్శిటీ కళాశాలను ప్రారంభించాలని ఆశిస్తున్నాడు. సాయం చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాడు. అవార్డుల డబ్బులన్ని స్కూల్ అభివృద్ధి కోసమే.. హజబ్బ సేవా నిరతని గుర్తించి ఇప్పటికే పలు సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వం అనేక అవార్డులతో సత్కరింnebr. ఇక అవార్డులతో పాటు లభించే మొత్తాన్ని పాఠశాల అభివృద్ధి కోసమే వినియోగించాడు. ఈ క్రమంలో ఓ సారి అవార్డుతో పాటు వచ్చిన 5 లక్షల రూపాయలను స్కూల్ కోసం కేటాయించాడు. ఇక భవిష్యత్తులో వచ్చే మొత్తాన్ని కూడా పాఠశాల అభివృద్ధికే వినియోగిస్తానంటున్న హజబ్బకు సొంత ఇళ్లు లేదు. కానీ తన గురించి ఆలోచించకుడా.. పిల్లల భవిష్యత్తు గురించి ఇంతలా ఆరాటపడుతున్న హజబ్బను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు నెటిజనులు. చదవండి: పద్మ అవార్డుల ప్రదానోత్సవం -
Oscar Fernandes: రాజ్యసభ సభ్యుడు ఆస్కార్ ఫెర్నాండేజ్ మృతి
సాక్షి, బెంగళూరు: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు ఆస్కార్ ఫెర్నాండేజ్ కన్నుమూశారు. ఆస్కార్ ఫెర్నాండేజ్ గత జూలై చివరలో మెదడులో రక్తం గడ్డకట్టడంతో మంగళూరు ఆసుపత్రిలో చేరి ఆపరేషన్ చేయించుకున్నారు. అప్పటి నుంచి ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. ఫెర్నాండేస్ మృతిపై సదరు ఆస్పత్రి యాజమాన్యం ఒక ప్రకటన విడుదల చేసింది. మరోవైపు ఫెర్నాండేజ్ మృతి పట్ల కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలు ట్విటర్ వేదికగా సంతాపం ప్రకటించారు. Anguished by the passing away of Rajya Sabha MP and senior Congress leader, Shri Oscar Fernandes. Condolences to his family, friends and supporters. Om Shanti! — Rajnath Singh (@rajnathsingh) September 13, 2021 ఫెర్నాండెజ్ 1941 మార్చి 27న జన్మించారు. ఆయన తండ్రి రోక్ ఫెర్నాండెజ్ ఒక విద్యావేత్త., రోక్ ఫెర్నాండెజ్ మణిపాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి మొదటి అధ్యక్షుడిగా పనిచేశారు. ఆస్కార్ ఫెర్నాండేజ్ తల్లి లియోనిస్సా ఫెర్నాండెజ్ భారతదేశంలో మొదటి మహిళా మేజిస్ట్రేట్. కాగా ఫెర్నాండేజ్ 1975-76లో ఉడిపి మున్సిపల్ కౌన్సిలర్‌గా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అదే ఉడిపి నుంచి 1980లో మొదటిసారిగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. మొత్తం అయిదుసార్లు (1980, 1984, 1989, 1991, 1996) ఆయన ఉడిపి నుంచి ప్రాతినిధ్యం వహించారు. My heartfelt condolences to the family and friends of Shri Oscar Fernandes Ji. It is a personal loss for me. He was a guide and mentor to many of us in the Congress Party. He will be missed and fondly remembered for his contributions. pic.twitter.com/NZVD592GSJ — Rahul Gandhi (@RahulGandhi) September 13, 2021 ఫెర్నాండెజ్ 1984-85లో ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీకి పార్లమెంటరీ సెక్రటరీగా పనిచేశారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి అంత్యంత విశ్వసనీయ వ్యక్తిగా ఉన్నారు. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా పనిచేసిన యూపీఏ 1 హయాంలో ఆయన కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. 2004 నుంచి 2009 వరకు కేంద్ర మంత్రిగా విధులు నిర్వర్తించారు. విదేశాంగ వ్యవహారాలు, యూత్ అండ్ స్పోర్ట్స్, గణాంకాలు వాటి అమలు ప్రోగ్రాం, లేబర్ అండ్ ఎంప్లాయిమెంట్ శాఖల బాధ్యతలు చూశారు. అయితే 1999 లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత ఫెర్నాండెజ్ రాజ్యసభకు నామినేట్ అయ్యారు. 2004లో కూడా మరోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. చదవండి: కాంగ్రెస్‌కు ఊహించని షాక్: హాట్‌హాట్‌గా ఉత్తరాఖండ్ రాజకీయం -
హీరో, హీరోయిన్లాంటి భార్యాభర్తలు పోలీసులకు వీడియో పంపి
బెంగళూరు: కరోనా సోకిన అనంతరం బ్లాక్ ఫంగస్ సోకి ఇబ్బందులు ఎదుర్కొంటారనే వార్తలు రావడంతో భయాందోళన చెందిన ఓ జంట బలవన్మరణానికి పాల్పడ్డారు. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి ప్రాణాపాయం ఉందనే వార్తలు టీవీలు, పత్రికల్లో వచ్చిన వాటిని చూసి భయపడిన ఆ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. తమ అంత్యక్రియల కోసం రూ.లక్ష నగదు దాచి ఉంచిన విషయాన్ని చెప్పి మరీ వారు తమ ప్రాణాలను తీసుకున్నారు. ఈ విషాద సంఘటన కర్ణాటకలోని మంగళూరులో జరిగింది. రమేశ్ (40), గుణ సువర్ణ (35) భార్యాభర్తలు. వీరిద్దరూ మంగళూరులోని ఓ అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు. అయితే ఇటీవల అనారోగ్యానికి గురవడంతో కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. అయితే కరోనా సోకిన వారికి బ్లాక్ ఫంగస్ సోకుతుందని వార్తలు వచ్చాయి. ఆ ఫంగస్ ప్రభావం మధుమేహం ఉన్న వారికి తీవ్ర ప్రభావం ఉంటుందని వచ్చిన వాటిని చూసి ఆందోళనకు గురయ్యారు. ఎందుకంటే గుణ సువర్ణకు మధుమేహం ఉంది. తమకు కూడా బ్లాక్ ఫంగస్ సోకితే చికిత్సకు భారీ మొత్తం ఖర్చయితే తాము భరించలేమని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆత్మహత్యకు వీరు వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు కారణాలను వివరించారు. ఆ వీడియోను మంగళూరు పోలీస్ కమిషనర్ శశికుమార్‌కు పంపించారు. పంపించిన వెంటనే ఇది చూసిన కమిషనర్ వారిని ఆత్మహత్య చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. వారు ఎక్కడుంటారో తెలుసుకునేందుకు తీవ్రంగా శ్రమించారు. స్థానిక మీడియాలో కూడా ఇది వివరించి వారిని కాపాడేందుకు ప్రయత్నించారు. చివరకు వారి ఆచూకీ కనుగొనేలోపు ఆ దంపతులు ఆత్మహత్య చేసుకుని తమ నివాసంలో విగతజీవులుగా పడి ఉన్నారు. చనిపోయిన తర్వాత తమ అంత్యక్రియల కోసం రూ.లక్ష నగదు దాచిన విషయం పోలీసులకు వీడియోలో చెప్పారు. అంతేకాదు తమ దహన సంస్కారాలు సంప్రదాయం ప్రకారం చేయించాలని, దీనికి పోలీస్ కమిషనర్ శశికుమార్, శరణ్ పంప్‌వెల్, సత్యజిత్ సురత్కల్ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తమ ఇంట్లోని వస్తువులు పేదలకు పంచాలని ఆ దంపతులు వీడియోలో చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. అయితే వీరికి పిల్లలు లేరు. సంతాన లేమితో కూడా ఆత్మహత్యకు పాల్పడినట్లు కూడా పోలీసులు భావిస్తున్నారు. చదవండి: ‘బుల్లెట్టు బండి’ పాటకు వధువు సూపర్ డ్యాన్స్.. ముగ్ధుడైన భర్త చదవండి: నీరజ్ చోప్రాకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు -
మరో మూడు నగరాల్లో బజాజ్ చేతక్ బుకింగ్స్ ఓపెన్
బజాజ్ ఆటో తన చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను మరిన్ని నగరాల్లోకి వేగంగా తీసుకొనిరావడానికి ప్లాన్ చేసింది. మైసూరు, మంగళూరు, ఔరంగాబాద్ వంటి కొత్త నగరాల్లో చేతక్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ జూలై 22న ప్రారంభిస్తుంది. ఈ నగరాలకు చెందిన ఆసక్తి గల వినియోగదారులు ₹2,000 చెల్లించి ఈ స్కూటర్ బుక్ చేసుకోవచ్చు. గత వారమే నాగ్ పూర్ లో కొత్తగా ఎలక్ట్రిక్ స్కూటర్ చేతక్ తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. 2021 ఏప్రిల్ లో బజాజ్ చెన్నై, హైదరాబాద్ నగరాలకు చేతక్ తీసుకొనివస్తున్నట్లు ప్రకటించింది. పూణేకు చెందిన ఆటోమేకర్ వచ్చే ఏడాది నాటికి 22 భారతీయ నగరాల్లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అందుబాటులో ఉంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ టీవీఎస్ ఐక్యూబ్, అథర్ 450ఎక్స్ వంటి ఎలక్ట్రిక్ స్కూటర్లతో పోటీ పడుతుంది. ఇది 3.8 కిలోవాట్ మోటార్ ద్వారా పనిచేస్తుంది. దీనిలో 3కేడబ్ల్యుఐపీ 67 లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంది. ఈ స్కూటర్ గంటకు 70 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. ఇందులో స్పోర్ట్ మోడ్, ఎకో మోడ్ అనే రెండు మోడ్స్ ఉన్నాయి. 5 ఆంపియర్ పవర్ సాకెట్ ద్వారా స్కూటర్ ని ఇంటి వద్ద ఛార్జ్ చేయవచ్చు. ఫుల్ ఎల్ఈడీ లైటింగ్, బ్లూటూత్ బేస్డ్ ఇన్ స్ట్రుమెంట్ కన్సోల్, ఇల్యూమినేటెడ్ స్విచ్ గేర్, స్మార్ట్ ఫోన్ యాప్ ఫీచర్స్ ఉన్నాయి. బజాజ్ చేతక్ ఈ-స్కూటర్ అర్బన్, ప్రీమియం అనే రెండు వేరియెంట్లలో లభిస్తుంది. అర్బన్ ధర ₹1.42 లక్షలు కాగా, ప్రీమియం రిటైల్స్ ₹1.44 లక్షలు(ఎక్స్ షోరూమ్, పూణే). -
డ్రంక్ అండ్ డ్రైవ్... పడవ పల్టీ
బనశంకరి: రోడ్లపై వాహనదారులు మద్యం తాగి నడపడం తెలిసిందే. సముద్రంలో కూడా జాలర్లు మందు కొట్టి నడపడంతో పడవ పల్టీ కొట్టింది. ఈ సంఘటన కర్ణాటకలో మంగళూరు ఉళ్లాల కూడీ తీరంలో చోటుచేసుకుంది. ఉల్లాల అష్రాఫ్ అనే వ్యక్తికి చెందిన పడవ ఆదివారం వేకువజామున చేపల రేవు నుంచి అరేబియా సముద్రంలోకి వేటకు బయల్దేరింది. ఈ బోట్లో 10 మంది తమిళనాడుకు చెందిన మత్య్సకారులు ఉన్నారు. డ్రైవరుతో పాటు ఐదుగురు మద్యం తాగారు. డ్రైవర్ మత్తులో మరో వ్యక్తికి డ్రైవింగ్ అప్పగించాడు. ఈ గందరగోళంలో బోటు సముద్రం ఒడ్డుకు దూసుకొచ్చి రాళ్ల మధ్యలో ఒరిగిపోయింది. జాలర్లకు బయటకు వచ్చే మార్గం లేకపోగా, స్థానికులు ఉదయం గమనించి కాపాడారు. ఉళ్లాల పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. (చదవండి: 74 ఏళ్ల తర్వాత భారత్‌కి వస్తున్న చిరుత) -
వెధవ రూల్.. మాస్క్ కోసం మాల్లో వైద్యుడి లొల్లి
-
ఇదొక చెత్త రూల్: మాస్క్ కోసం మాల్లో వైద్యుడి లొల్లి
బెంగళూరు: కరోనా సోకకుండా ప్రాథమికంగా ధరించాల్సింది మాస్క్. కానీ ఇది ధరించడంలో కొందరు నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో మాస్క్ ధరించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వాలు హెచ్చరిస్తూనే ఉన్నాయి. అయితే మాస్క్ కొన్ని చోట్ల వివాదానికి దారి తీస్తోంది. తాజాగా ఒక మాల్లో మాస్క్ కోసం పెద్ద గొడవే జరిగింది. ఈ ఘటనలో వైద్యుడిపై కేసు నమోదైంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కర్ణాటకలోని మంగళూరులో ఓ మాల్‌కు వైద్యుడు వెళ్లాడు. అయితే మాస్క్ పెట్టుకోకుండా బిల్ చేయించేందుకు వస్తువులు తీసుకొచ్చారు. ఆయన మాస్క్ ధరించకపోవడాన్ని గమనించిన మాల్ సిబ్బంది అతడిని ప్రశ్నించారు. మాస్క్ ధరించాలని సూచించారు. దీంతో ఆ వైద్యుడు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ గొడవ చూసి మేనేజర్ రాగా అతడితో కూడా వైద్యుడు గొడవ పడ్డాడు. తీవ్ర వాగ్వాదం జరిగింది. చివరకు ఆయన మాస్క్ ధరించకుండానే షాపింగ్ పూర్తి చేసుకుని బయటపడ్డాడు. మాస్క్ తప్పనిసరి అనే నిబంధనను ఆ వైద్యుడు ‘వెధవ రూల్ (ఫూలిష్ రూల్)’ అని మండిపడ్డాడు. ఈ ఘటనపై మాల్ మేనేజర్ ఫిర్యాదు మేరకు ఆ వైద్యుడిపై కేసు నమోదు చేసినట్లు మంగళూరు పోలీస్ కమిషనర్ ఎన్.శశికుమార్ తెలిపారు. అయితే ఈ ఘటన మే 18వ తేదీన జరగ్గా తాజాగా బహిర్గతమైంది. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజీ వీడియో వైరల్‌గా మారింది. వాగ్వాదం చేసిన వైద్యుడు ఇప్పటికే కరోనా బారిన పడి కోలుకున్నాడని ఆ గొడవలో చెప్పాడు. కరోనా బారినపడిన మీరే మాస్క్ ధరించకుంటే ఎలా అని మాల్ సిబ్బందితో పాటు సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. చదవండి: ఫ్రంట్‌లైన్ వారియర్స్‌పై ‘ఫంగస్’ దాడి చదవండి: లాక్డౌన్ నిబంధనలు గాలికి -
తౌక్టే తుపాను: 9 మందిని కాపాడిన కోస్ట్‌గార్డ్
బనశంకరి: తౌక్టే తుపాను వల్ల కన్నడనాట తీరప్రాంత జిల్లాలు అతలాకుతలమయ్యాయి. పెనుగాలులు, అలల తాకిడికి మంగళూరు వద్ద అరేబియా సముద్రంలో చిన్న చేపల పడవ మునిగిపోయింది. స్థానికులు ముగ్గురిని కాపాడగా, ఇద్దరు చనిపోయారు. మరో ముగ్గురు గల్లంతయ్యారు. తుపాన్ ప్రభావంతో ఈ నెల 20 తేదీ వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. కావేరినది నీటిమట్టం గణనీయంగా పెరిగింది. దక్షిణ కన్నడ జిల్లాలో 108 ఇళ్లు దెబ్బతిన్నాయి. 380 మందిని సహాయక కేంద్రాలకు తరలించారు. ఇళ్లు కూలి, విద్యుత్ ప్రమాదాలతో ఆరుగురు దాకా మరణించారు. సురక్షితం అరేబియా సముద్రంలో చిక్కుకున్న 9 మందిని 40 గంటల అనంతరం సురక్షితంగా కాపాడారు. మంగళూరు నుంచి 13 నాటికల్ మైళ్ల దూరంలో రాతిబండల మధ్య కోరమండల్ అనే టగ్‌బోట్‌లో 9 మంది మంగళూరు రిఫైనరీ కాంట్రాక్టు ఉద్యోగులు శనివారం నుంచి చిక్కుకున్నారు. తుపాను వల్ల ముందుకు వెళ్లలేకపోయారు. రక్షించాలని వీడియో కాల్ ద్వారా విజ్ఞప్తి చేయడంతో సోమవారం కోస్టుగార్డు సిబ్బంది నౌకలు, ఒక హెలికాప్టర్‌తో చేరుకుని అందరినీ సురక్షితంగా కాపాడారు. ఐదుమందిని హెలికాప్టర్ ద్వారా మంగళూరుకు తీసుకొచ్చారు. తుపాను మృతులకు పరిహారం తుపాన్‌తో ఇళ్లు కూలిపోయినవారికి రూ.5 లక్షలు, బోట్ ప్రమాదంలో మృతిచెందిన కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని రెవెన్యూ మంత్రి ఆర్.అశోక్ తెలిపారు. ఓ మోస్తరు ఇంటి మరమ్మతుల కోసం రూ. లక్ష చొప్పున అందిస్తామన్నారు. తుపాను వల్ల రాష్ట్రంలో 6 మంది మృతిచెందగా 22 జిల్లాల్లో 121 పల్లెల్లో 333 ఇళ్లు దెబ్బతిన్నాయి. 30 హెక్టార్లలో పంటలు నాశనమైయ్యాయని 57 కిలోమీటర్లు రోడ్లు దెబ్బతిన్నాయని రాష్ట్ర ప్రకృతి విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. -
గుడ్ ఐడియా.. మాస్కులు వాడి పడేస్తే మొలకెత్తుతాయి
కర్ణాటక: కరోనా వైరస్ రాకతో ప్రజల జీవన విధానంలో చాలా మార్పులే చోటు చేసుకున్నాయి. సామాజిక దూరం, శానిటైజర్లు, మాస్క్‌ల వాడకం.. ఇలా ఇవన్నీ దాదాపు ఏడాదిన్నరకు పైగా మనుషుల జీవితంలో భాగమయ్యాయి. ఈ క్రమంలో కరోనా కేసులతో పాటు మాస్క్‌ల వాడకం కూడా పెరుగుతోంది. అయితే మార్కెట్లో దొరుకుతున్న మాస్క్‌లు కేవలం ఒక్కసారి మాత్రమే వినియోగించి వదిలేయడం, పర్యావరణ హితం కాకపోవడం వల్ల వ్యర్థాలు కూడా అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి. దీనికి అడ్డుకట్ట వేసే దిశగా ఓ వ్యక్తి వినూత్నంగా ఆలోచించి పర్యావరణ హితమైన మాస్క్‌ను తయారు చేశాడు. ప్రస్తుతం కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది కాబట్టి ఇప్పట్లో మాస్క్‌ల వాడకం ఆపలేం కనుక పర్యావరణ హితమైన మాస్క్‌లతో కర్ణాటక లోని మంగళూరుకు చెందిన నితిన్ వాస్ మన ముందుకు వచ్చాడు. ఒక దళసరి పేపర్ మధ్యలో టమాటా, తులసి, దోసకాయ, క్యాప్సికం వంటి విత్తనాలను పెట్టి మాస్క్‌లు రూపొందించాడు. వీటిని వాడేసిన తర్వాత నేల మీద పడేస్తే…అందులోని విత్తనాలు మొలకెత్తుతాయి. నితిన్ వాస్కు వచ్చిన ఈ అద్భుత ఐడియాకు మంగళూరులోని పేపర్ సీడ్ అనే సంస్థ సాయం అందించింది. అతని ఆలోచనలకు అనుగుణంగా పేపర్ సీడ్ మాస్కులు తయారు చేస్తోంది. ఇవి ఒక్కసారి వాడి పడేయాల్సిన మాస్క్లని, పేపర్‌తో రూపొందించినవి కాబట్టి… ఒకసారే వినియోగించాలని చెప్పింది. ప్రస్తుతానికి ఇలాంటివి ప్రయోగాత్మకంగా 400 మాస్క్‌లు తయారు చేశామని, ఇవి విజయవంతమైతే.. ఇలాంటివి మరిన్ని తయారుచేస్తామని సంస్థ ప్రతినిధులు ప్రకటించారు. ( చదవండి: నిజామాబాద్‌లో దారుణం.. మున్సిపల్ సిబ్బందిపై దాడి! ) -
అందుకే హనీమూన్ రద్దు చేసుకున్నారు!
సాధారణంగా ప్రతి ఒక్కరి జీవితంలో వివాహం అనేది ఓ మధుర జ్ఞాపకం. రెండు మనసులను ఒక్కటి చేసే వేడుక. ఇరు కుటుంబాల కలయిక. భార్యాభర్తలు ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకుని సమన్వయంతో ముందుకు సాగితేనే ఆ బంధానికి విలువ ఉంటుంది. కర్ణాటకకు చెందిన నవ దంపతులు అనుదీప్ హెగ్డే, మినుషా కాంచన్ ఆ కోవకు చెందినవారే. పెళ్లి తర్వాత కచ్చితంగా హనీమూన్ వెళ్లాల్సిందేనని ఆమె పట్టుబట్టలేదు. భార్య కోరలేదు కదా అని అతడు అడగకుండా ఉండనూ లేదు. వీలు కుదుర్చుకుని ఇద్దరికీ నచ్చిన ప్రదేశానికి వెళ్లి ఏకాంతంగా సమయం గడపాలనుకున్నారు. అయితే అంతకంటే ముందు తమకు అత్యంత సమీపంలో ఉన్న సోమేశ్వర్ బీచ్‌ను సందర్శించారు. అక్కడికి వెళ్లిన తర్వాత హనీమూన్‌కు వెళ్లాలన్న ఆలోచనను పక్కకు పెట్టేశారు. సరదాగా గడపడం కంటే ప్రకృతిని కాపాడుకోవడమే వారికి ప్రథమ ప్రాధాన్యంగా తోచింది. వెంటనే రంగంలోకి దిగారు. తమతో పాటు నలుగురి మద్దతు కూడగట్టుకుని బీచ్ ప్రాంగణంలో పోగైన చెత్తను ఏరిపారేసే బృహత్కార్యం తలకెత్తుకున్నారు. 10 రోజుల పాటు శ్రమించి సుమారు 800 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలు, పనికిరాని వస్తువులను అక్కడి నుంచి తరలించారు. ఇందుకు సంబంధించిన వివరాలు, ఫొటోలను అనుదీప్ ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ‘మీరిలాగే కలకాలం వర్ధిల్లాలి’ అంటూ నెటిజన్లు కొత్తజంటపై అభినందనల అక్షింతలు జల్లుతున్నారు.(చదవండి: తల్లిదండ్రులైన ఆకాశ్ దంపతులు ) పోస్ట్ వెడ్డింగ్ చాలెంజ్ ‘‘ మా ఇద్దరి కల ఇది. పోస్ట్ వెడ్డింగ్ చాలెంజ్, పది రోజుల అవిశ్రాంత శ్రమ తర్వాత బైందూరులోని సోమేశ్వర్ బీచ్‌లోని చెత్తాచెదారాన్ని తొలగించాం. ఇప్పుడు ఇదొక మహోద్యమంగా మారింది. అంతా కలిసి 8 క్వింటాళ్లకు పైగానే చెత్తను ఏరివేశాం. మాకొక మంచి అనుభవం ఇది. మానవత్వం ఇంకా బతికే ఉందనే నా నమ్మకాన్ని నిజం చేసింది. మేమంతా మిమ్మల్ని కోరుతున్నది ఒక్కటే. ఇలాంటి కార్యక్రమాల పట్ల అవగాహన కల్పించండి. కలిసి పనిచేస్తే ఇంకెంతో మార్పును తీసుకురాగలం’’ అని అనుదీప్ విజ్ఞప్తి చేశాడు. అదే విధంగా... ‘‘నేను, నాలో సగభాగమైన నా భార్య మినుషా ఈ ప్రయాణాన్ని కొనసాగించాలనుకుంటున్నాం. ఎంతో మంది మాతో చేతులు కలిపి బీచ్‌ను శుభ్రం చేసేందుకు వచ్చిన తీరు అత్యద్భుతం. మా లక్ష్యాన్ని చేరుకునే దిశగా సాయం అందించిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు’’ అని తమకు సహకరించిన వారి పట్ల కృతజ్ఞతా భావం చాటుకున్నాడు. ఈ అనుదీప్- మినుషా స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(చదవండి: ఆన్లైన్లో పెళ్లికి 2 వేల మంది అతిధులు) View this post on Instagram A post shared by Anudeep Hegde (@travel_nirvana) -
డ్రగ్స్‌తో బాలీవుడ్ డ్యాన్సర్ పట్టివేత
యశవంతపుర: మత్తు పదార్థాలను తరలిస్తున్న బాలీవుడ్‌కు చెందిన నటుడు కిశోర్ శెట్టిని మంగళూరులో సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. బాలీవుడ్లో ఎబీసీడీ అనే సినిమాలో నటించిన కిశోక్శెట్టి ఒక డ్యాన్సర్. బాలీవుడ్లో సంచలనం రేకెత్తించిన సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మృతి, డ్రగ్స్ లింక్‌పై ముమ్మర దర్యాప్తు నేపథ్యంలో కిశోర్‌శెట్టి పోలసులకు చిక్కాడు. కిశోర్ మిత్రుడు ప్రతీక్‌శెట్టిని బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. మరోవైపు డ్రగ్స్ కేసులో అరెస్టయిన నటి రాగిణి ద్వివేది బెయిల్ పిటిషన్ విచారణ సోమవారానికి వాయిదాపడింది. -
చూస్తుండగానే పైనుంచి దూసుకెళ్లిన కారు!
-
చూస్తుండగానే పైనుంచి దూసుకెళ్లిన కారు!
సాక్షి, బెంగుళూరు: కర్ణాటకలోని మంగుళూరులో ఓ మహిళ మృత్యు ముఖంలోకి వెళ్లి ప్రాణాలతో బయటపడింది. కాద్రి కంబ్లా జంక్షన్ గుండా స్కూటర్ వెళ్తున్న వాణిశ్రీ అనే మహిళను ఓ కారు అడ్డుగా వచ్చి ఢీకొట్టింది. దాంతో ఆమె ఎగిరి కారు బానెట్‌పై పడి.. అక్కడి నుంచి కింద పడింది. అయినా కూడా ఆ సోయితప్పిన కారు డ్రైవర్ అదేమీ గమనించలేదు. కారుని అలానే ముందుకు పోనిచ్చాడు. దాంతో కారు ఆమె మీదుగా వెళ్లింది. అయితే, రోడ్డు పక్కనే ఉన్న స్థానికులు వెంటనే అప్రమత్తమై కారును అడ్డుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. డ్రైవర్ కారు నిలపడంతో స్థానికులు వెంటనే కారుని అమాంతం పెకెత్తి మహిళను బయటకు తీశారు. ఆస్పత్రికి తరలించారు. వాణిశ్రీకి ఎలాంటి అపాయం లేదని, చిన్న గాయాలే తగిలాయని వైద్యులు చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. కారు డ్రైవర్ నిర్లక్ష్యంపై కామెంట్ల వర్షం కురుస్తోంది. -
నోరూరించే పీతల కూర..
-
నోరూరించే పీతల కూర.. ‘దీదీ’కి సాయం!
మనసుంటే మార్గం ఉంటుందనే నానుడిని మరోసారి రుజువు చేశాడు బెంగళూరుకు చెందిన అంకిత్ వెంగులేర్కర్. తమ ఇంట్లో పనిచేసే‘సరోజ్ దీదీ’ చేతివంటకు గుర్తింపు తీసుకువచ్చి ఆమెకు మరో ఆదాయ మార్గాన్ని చూపాడు. ‘అక్క’వంటపనిలో నిమగ్నమైతే.. ఆ వంటకాలను అమ్మిపెట్టే బాధ్యతను తలకెత్తుకుని పెద్ద మనసు చాటుకుంటున్నాడు. లాక్డౌన్ కారణంగా మాయమైన చిరునవ్వులను తిరిగి తీసుకువచ్చి ఆ మాతృమూర్తి ముఖాన్ని వికసింపజేస్తున్నాడు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ ‘అక్కాతమ్ముళ్ల’పై ట్విటర్ ఇండియా, పేటీఎం సహా ప్రముఖ చెఫ్ వికాస్ ఖన్నా వంటి సెలబ్రిటీలు ప్రశంసలు కురిపిస్తున్నారు.(శారదకు జాబ్ లెటర్: సోనూసూద్) వివరాలు.. సరోజ్(47) అనే మహిళ గతంలో తన భర్తతో కలిసి మంగమమ్మనపాళ్యలో చిన్నపాటి హోటల్ నడిపేవారు. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే కొన్నాళ్ల క్రితం భర్త మరణించడంతో ఒంటరైపోయిన సరోజ్.. కుటుంబ పోషణ కోసం పనిమనిషి అవతారమెత్తింది. అలా అంకిత్ ఇంట్లోనూ పనికి కుదిరింది. ‘సరోజ్ దీదీ’అంటూ ఆమెను ఆప్యాయంగా పిలిచే అంకిత్‌కు.. ఆ అక్క చేతి వంట ఎంతగానో నచ్చింది. ఈ క్రమంలో.. హోం-డెలివరీ ఫుడ్ బిజినెస్ పెట్టాలనుకుంటున్నాననే తన ఆలోచనను అతడితో పంచుకుంది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన అంకిత్.. సోషల్ మీడియా ద్వారా సరోజ్ వంటకాలను నెటిజన్లను పరిచయం చేశాడు. ఏడాది కాలంగా తమ ఇంట్లో పనిచేస్తున్న సరోజ్ దీదీ ఎంతో రుచికరంగా వండుతుందని, పరిశుభ్రత పాటిస్తారని చెప్పుకొచ్చాడు. ఆమె వంట చేస్తున్న వీడియోలు, నోరూరించే వంటకాల ఫొటోలను షేర్ చేశాడు. (మా ప్రాణాలు తీస్తారేంట్రా నాయనా) ‘‘ బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఔట్ సమీపంలో నివసించే వాళ్లు రుచికరమైన భోజనం తినాలని భావిస్తే సరోజ్ దీదీని సంప్రదించండి. ఆమెకు అదనపు ఆదాయం సమకూరుతుంది. దయచేసి ఆమెకు అండగా నిలవండి’’అని అభ్యర్థించాడు. మంగళూరు పీతల కూర చేయడంలో సరోజ్ దీదీ దిట్ట అని, తన ట్వీట్‌కు స్పందించడం గొప్ప విషయమని, 10 ఆర్డర్లు వచ్చాయని, దీదీ ఎంతో సంతోషంగా ఉందంటూ ధన్యవాదాలు తెలిపాడు. ఈ నేపథ్యంలో అంకిత్ చొరవతో సరోజ్ జీవితంలో ఆనందం వెల్లివెరిసిందని, గొప్ప పనిచేశావంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు. Saroj Didi's been cooking and cleaning at my Bangalore home for almost a year now. Extremely reliable. We bond over food and cats. She's been wanting to start a home-cooked food business for a few weeks now. We started today. She's extremely talented and experienced in cooking. pic.twitter.com/jEoRRofjQ3 — Gadgetwala (@ankitv) July 24, 2020 -
పదేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు..
సాక్షి, న్యూఢిల్లీ : పది సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే రోజు మంగళూరు ఏయిర్‌పోర్టులో ఓ విమాన ప్రమాదం చోటుచేసుకుంది. దుబాయ్నుంచి ఇండియాకు వచ్చిన ఏయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్ వన్ఎక్స్ 812 ఎయిర్‌పోర్టులో దిగుతూ ఒక్కసారిగా కుప్పకూలింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో మొత్తం 166 మంది ఉండగా.. 158 మంది మృత్యువాత పడ్డారు. విమానంలో నుంచి కిందకు దూకి ఓ ఎనిమిది మంది ప్రాణాలు కాపాడుకున్నారు. విమానం రెండుగా బద్ధలవటానికి ముందే వారు కిందకు దూకటం మంచిదైంది. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారంతా భారతీయులు కావటం గమనార్హం. ( విమాన ప్రమాదం: ఆయనొక్కరే అదృష్టవంతుడు?) పాకిస్తాన్ విమాన ప్రమాద దృశ్యాలు విమాన ప్రమాదంలో మరణించిన వారికి గుర్తుగా మంగళూరులోని పనబారం పోర్టులో ఓ మెమోరియల్‌ను నిర్మించారు. ఈ ఉదయం మృతులకు నివాళులు అర్పించే కార్యక్రమం కూడా జరిగింది. నివాళుల కార్యక్రమం ముగిసిన కొన్ని గంటల్లోనే పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ ప్రమాదానికి గురైంది. దాదాపు 100 మంది ప్రయాణికులతో వెళుతున్న ఎయిర్ బస్ 320 కరాచీ ఏయిర్పోర్టు వద్ద కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఎవ్వరూ ప్రాణాలతో బయటపడలేదని తెలుస్తోంది. ( కుప్పకూలిన విమానం : 100 మంది..) -
యువతి సాహసం: ప్రాణాలను పణంగా పెట్టి
-
యువతి సాహసం: ప్రాణాలను పణంగా పెట్టి
మంగళూరు: తోటి మనిషి ఆపదలో ఉన్నాడంటే ముందుకొచ్చి సాయం చేసేవాళ్లు అరుదుగా ఉంటారు. మరి మూగజీవాలకు ఆపద వస్తే.. ఇదిగో నేనున్నాంటూ వాటిని రక్షించేందుకు పూనుకుందో మహిళ. తన ప్రాణాలను పణంగా పెట్టి మరీ బావిలో పడ్డ కుక్కను రక్షించి అందరిచేత శభాష్ అనిపించుకుంటోంది. మంగళూరు ప్రాంతంలో ఓ కుక్క ఆకస్మాత్తుగా బావిలో పడింది. దాని కేకలు విన్న స్థానికులు అయ్యో పాపం అంటున్నారే తప్పితే దాన్ని ఎలా రక్షించాలో తెలియక చూస్తూ ఉండిపోయారు. ఇంతలో ఓ మహిళ తన నడుముకు తాడు కట్టుకుని ఎంతో లోతుగా ఉన్న బావిలోకి దిగింది. కుక్కకు కట్టడానికి పైనున్న వాళ్లు ఓ తాడును విసిరేయగా ఆమె దాన్ని చేతబుచ్చుకుని శునకానికి కట్టింది. దీంతో బావి వెలుపల ఉన్నవాళ్లు ఆ తాడును పైకి లాగడంతో శునకం సునాయాసంగా పైకి వెళ్లింది. | ముందుగా ఏం జరుగుతుందో అర్థం కాని ఆ కుక్క బయటకు రాగానే తనదారివైపు పరుగందుకుంది. అయితే దాన్ని రక్షించిన మహిళకు మాత్రం పైకి రావడం అంత సులువు కాలేదు. కాస్త కష్టపడుతూనే మరింత జాగ్రత్తగా బావి పైకి చేరుకుంది. ఇక ఈ సాహస వీడియోను ఓ యువతి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. నాకు మాత్రం తనే హీరో అంటూ క్యాప్షన్ జోడించింది. ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. ప్రజలు జంతువుల పట్ల మరింత సున్నితంగా మెలుగుతారని ఆశిద్దాం. తద్వారానైనా జంతు వధ, కౄరత్వం లేని ప్రపంచం ఆవిష్కృతమవుతుంది.’ అని ఓ నెటిజన్ భావోద్వేగంగా కామెంట్ చేశాడు. అయితే ఆ సాహస మహిళ పేరు రజనీ శెట్టిగా ఓ నెటిజన్ పేర్కొన్నాడు. -
మట్టి నీడ
‘‘మాది ఎప్పుడో మా తాత కట్టించిన పాత ఇల్లు. మట్టి గోడలు, మంగుళూరు పెంకుతో పై కప్పు కట్టించాడాయన. మాలాంటి సామాన్యులకు అప్పట్లో అందుబాటులో ఉన్న టెక్నాలజీ అంతవరకే మరి. మా అబ్బాయి ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్. యుఎస్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. వాడికి పెళ్లి సంబంధాలు చూస్తున్నాం. పెళ్లి కంటే ముందు ఈ ఇంటిని పడగొట్టి మోడరన్‌గా మంచి ఇల్లు కట్టాలి. బడ్జెట్ ఎంతయినా ఫర్వాలేదు. సిటీలో మంచి ఆర్కిటెక్ట్ పేరు చెప్పు..’’ అని పేరున్న ఆర్కిటెక్ట్ కోసం శోధించే వాళ్లు చాలా మందే ఉంటారు. అద్దంలా మెరిసిపోయే ఇంటి కోసం రకరకాల డిజైన్లతో మ్యాగజైన్లు కూడా ఉంటాయి. ఇక మహారాష్ట్రకు చెందిన ఆర్కిటెక్ట్ అనుజ్ఞ నూతన్ ధ్యానేశ్వర్ అయితే.. ఇళ్ల నిర్మాణం కోసం బురద మట్టి, మంగుళూరు ఎర్ర పెంకులను ముడిసరుకుగా మార్చుకున్నారు. ఆమె రూపొందిస్తున్న ఎకో ఫ్రెండ్లీ హౌస్ డిజైన్లు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. పుణెకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అన్విత్, నేహా పాఠక్ దంపతులు ఇప్పుడు అనుజ్ఞ డిజైన్ చేసిచ్చిన మడ్‌హౌస్‌లో గృహ ప్రవేశం చేయడానికి సిద్ధమవుతున్నారు.! ‘‘మేము రెండంతస్థుల మట్టి ఇంటిని కట్టించుకుంటున్నాం. మా కొత్త ఇంటిని చూడడానికి మా స్నేహితులు, బంధువులు వస్తున్నారు. ఆ వచ్చిన వాళ్లలో చాలామంది మమ్మల్ని పిచ్చివాళ్లను చూసినట్లు చూస్తున్నారు. నిజానికి మట్టి ఇల్లు ఎండాకాలం బయటి ఉష్ణోగ్రత కంటే 13–14 డిగ్రీల తక్కువగా ఉంటుంది. అలాగే శీతాకాలం చలి నుంచి వెచ్చదనాన్నిస్తుంది. పుణెలో చాలామంది వారాంతపు సెలవులను గడపడానికి నగర శివార్లలో ఇలాంటి ఇళ్లు కట్టించుకుంటున్నారు. మేము నగరంలోనే కట్టించుకుంటున్నాం’’ అంటున్నారు నేహ. సహజ జీవనం ‘‘మట్టి ఇంటి నిర్మాణంలో వీలయినంత ఎక్కువగా ప్రకృతి సిద్ధమైన సహజ వస్తువులను ఉపయోగిస్తాం. ఆ మెటీరియల్ నుంచి వాటి సహజమైన వాసనే విడుదలవుతుంది. అవేవీ శ్వాసకోశ వ్యాధులకు కారణం కావు, పైగా మోడరన్ లైఫ్‌లో ఎదురయ్యే బ్రీతింగ్ సమస్యలను కూడా దూరం గా ఉంచుతుంది. సిమెంట్ ఇళ్ల నిర్మాణంతో పోలిస్తే ఈ ఇళ్ల నిర్మాణ వ్యయం కూడా తక్కువే. సిమెంట్ భవనం నిలిచినంత కాలం నిలిచి ఉండేటట్లు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం’’ అంటున్నారు అనుజ్ఞ. -
పూజారీ... నేను బాగున్నా ఏడవకు
సాక్షి, బెంగళూరు: కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జనార్ధన్ పూజారి భోరున విలపించారు. మంగళూరులో చర్చి, దేవాలయంలో ఆయన నిన్న కన్నీళ్లు పెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఆస్కార్ ఫెర్నాండేజ్ ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్నారంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆయన త్వరగా కోలుకోవాలంటూ మొదట గోకర్ణనాథేశ్వర స్వామి ఆలయంలో జనార్థన పూజారి పూజలు చేసి విలపించారు. తర్వాత రోసారియో చర్చికి వెళ్లి ప్రార్థన చేస్తుండగా అక్కడకు ఆస్కార్‌ఫెర్నాండేజ్ వచ్చారు. ఈ సందర్భంగా పూజారిని గట్టిగా హత్తుకుని, తనకు ఏమీ కాలేదని ఆరోగ్యంగా ఉన్నానని తెలిపారు. ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారంటూ ఫెర్నాండేజ్ చెప్పారు. అయితే ఈ తతంగం అంతా అక్కడున్నవారిని ఆశ్చర్యపరిచింది. -
ఓట్ ఫర్ గుడ్
మేఘాదాస్ జొమాటోలో పని చేస్తారు. ఫుడ్ డెలివరీ ఎగ్జిక్యూటివ్ ఆమె. కస్టమర్లకు ఫుడ్‌ని డెలివరీ చెయ్యడం కోసం రోజంతా మంగళూరు రోడ్లపై తన వాహనాన్ని పరుగులెత్తిస్తుంటారు. ఫుడ్ఆర్డర్ని టైమ్‌కి అందించకపోతే తన కంపెనీకి పేరు పోతుంది. అదీ ఆమె తొందర. అయితే ఆమె తొందరకు, ఆమె నడిపే స్కూటీ వేగానికి మంగళూరు రోడ్లపై గతుకులు, గోతులు అడ్డుపడుతూ ఉంటాయి. అవి మాత్రమే కాదు, చీకటి పడ్డాక ఆమె డ్యూటీ మరింత కఠినతరం అవుతుంది. కస్టమర్ చిరునామా కోసం బండిని ఆపి ఎవర్నైనా అడగవలసి వచ్చినప్పుడు అదేమంత సురక్షితమైన పనిలా ఆమెకు అనిపించదు. ఆమెను అదోలా చూస్తారు. అడిగిన చిరునామా కాకుండా.. అభ్యంతరకరమైన చిరునామాల గురించి చెప్పడం మొదలుపెడతారు. ఈ స్వీయానుభవాలతో మేఘాదాస్కు రెండు విషయాలు స్పష్టం అయ్యాయి. ఒకటి మంగళూరు రోడ్లు బాగోలేవు. ఇంకొకటి మంగళూరు రోడ్లపై మహిళలకు భద్రత లేదు. ఎలా ఈ సమస్యను పరిష్కరించడం? తనొక్కరి వల్ల అయ్యే పని కాదు. పదిమందిని కలుపుకుని ఉద్యమించడానికి లీడర్ కాదు తను. ఫుడ్ డెలివరీ చెయ్యాలి. ఇంటికింత సంపాదించుకుని వెళ్లాలి. మరెలా! అప్పుడు పడింది.. మంగళూరు సిటీ కార్పొరేషన్ ఎన్నికల నోటిఫికేషన్. తనూ ఎన్నికల్లో నిలబడితే! నిలబడి గెలిస్తే! తను అనుకున్నది చెయ్యొచ్చు.చేయించడానికి తన అధికారంతో ఒత్తిడి తేవచ్చు! ఆమె ఆలోచన నచ్చి కాంగ్రెస్ పార్టీ ఆమెకు టికెట్ ఇచ్చింది. ప్రస్తుతం ఆ ఎన్నికల ప్రచారంలో ఉన్నారు మేఘాదాస్. ‘‘28వ వార్డుకు పోటీ చేస్తున్నాను. దేవుడి దయ వల్ల అదృష్టం బాగుండి గెలిస్తే నేననుకున్నది చేసి తీరుతాను’’ అంటున్నారు మేఘ. ఫుడ్ డెలివరీ కోసం అనువు కాని దారుల్లో కాలంతో పాటు పరుగులు తీసిన మేఘ.. మంగళూరు సిటీని దారిలోకి తెచ్చేందు ఒక్క క్షణమైనా విశ్రమించకుండా పని చేస్తారనే అనిపిస్తోంది. బెస్ట్ ఆఫ్ లక్ మేఘా. -
సాహోరే బామ్మలు.. మీ డాన్స్ సూపరు!
మనిషి జీవితంలో అత్యంత మధురమైన దశ బాల్యం. చిన్ననాటి సంగతులు గుర్తుకు వస్తే ఎంత పెద్దవారైనా పిల్లలైపోతారు. బడిలో చదువులు, చిన్ననాటి అల్లర్లు ఏనాటికి మర్చిపోలేము. అందుకే కాబోలు ఈ బామ్మలు కూడా తమ బాల్యమిత్రులను చూడగానే హుషారుగా నృత్యాలు చేశారు. చిన్ననాటి సంగతులను తలుచుకుని ఎంతో మురిసిపోయారు. కర్ణాటకలోని మంగళూరులో ఇటీవల జరిగిన పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో కొంత మంది బామ్మలు ఉత్సాహంగా గడిపిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. స్కూల్ రోజులను గుర్తుచేసుకుని వారంతా చిన్నపిల్లల్లా మారిపోయారు. ఆనాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ సరదాగా గడిపారు. 70 ఏళ్లు పైబడిన వయసులోనూ పాటలకు ఉత్సాహంగా డాన్సులు చేసి ఔరా అనిపించారు. ఈ వీడియోను నాంది ఫౌండేషన్, అరకు కాఫీ సీఈవో మనోజ్ కుమార్ ట్విటర్లో షేర్ చేశారు. ఆడుతూ పాడుతూ ఆనందంగా గడిపిన బామ్మలను చూసిన వారంతా వారిని అభినందిస్తూ కామెంట్లు పెడుతున్నారు. 70 ఏళ్ల వయసు వచ్చాక తాము కూడా ఇలాగే గడుపుతామని కొంతమంది అంటే.. తమ చిన్ననాటి స్నేహితులను కలిసినప్పుడు ఇలాగే సరదాగా ఉంటామని మరికొందరు వెల్లడించారు. మనిషి జీవితంలో సంతోషానికి సాటి ఏదీ లేదని చాలా మంది వ్యాఖ్యానించారు. (చదవండి: వీళ్లు పిల్లలు కాదు పిడుగులే..!) -
సిటీ సెంటర్‌మాల్‌లో అగ్ని ప్రమాదం
బెంగళూరు : కర్ణాటకలోని మంగళూరులో ఉన్న సిటీ సెంటర్ మాల్లో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు ఎగిసి పడడంతో షాపింగ్ కాంప్లెక్స్‌లో ఉన్న జనం భయంతో పరుగులు పెట్టారు. ఈ భవనంలో నాలుగవ అంతస్థులో ఉన్న ఫూడ్ షాప్‌లో మంటలు అంటుకోవడంతో కాంప్లెక్స్ నిండా దట్టమైన పొగలు వ్యాపించాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది. సంఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు అదుపుచేశాయి. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు క్లియరెన్స్, అగ్నిమాపక శాఖనుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ లేకుండానే సంవత్సరాల తరబడి ఈ మల్టీపెక్స్ భవనంలో వ్యాపారాలు నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. 2010లో ఆవిష్కరించిన ఈ భవనానికి అవసరమైన అనుమతులు లేవనియాక్టవిస్టు విద్యా దినకర్ ఆరోపించారు. ఈ ఆరోపణలపై స్పందించిన ఫైర్విభాగం అధికారి శివశంకర విచారణ చేస్తున్నామని తెలిపారు. -
వెరైటీ ప్రచారం : పేరు ఆమెది.. ఫోటో అతనిది
బెంగళూరు : మహిళా సాధికారత గురించి పెద్ద పెద్ద లెక్చర్లు ఇచ్చే నాయకులు మహిళలు రాజకీయాల్లోకి వస్తామంటే మాత్రం పెద్దగా సంతోషించరు. దేశ జనభాలో సగం ఉన్న మహిళలు.. రాజకీయాల్లో మాత్రం కనీసం ఒక శాతం కూడా లేకపోవడం గమనార్హం. ప్రస్తుతం దేశంలోని మహిళా రాజకీయ ప్రతినిధులు ఎందరంటే వేళ్ల మీద లెక్కించి చెప్పగల్గే పరిస్థితి. ఒకవేళ మహిళలు రాజకీయాల్లోకి వచ్చినా పెత్తనం చెలాయించేది మాత్రం వారి కుటుంబంలోని పురుషులు. కేవలం పేరు మోసిన కుటుంబాల నుంచి వచ్చిన ఆడవారు మాత్రమే తమ రాజకీయ హోదాని సరిగ్గా వినియోగించుకోగల్గుతున్నారు. ఇది మన దేశమంతటా సర్వసాధణంగా కనిపించే దృశ్యం. కానీ కర్ణాటకలోని ఓ రాజకీయ పార్టీ మాత్రం ఏకంగా ప్రచారం నుంచే మహిళా అభ్యర్థులు స్థానంలో వారి కుటుంబాల్లోని మగవారి ఫోటోలను ముద్రించి ప్రచారం చేస్తున్నారు. ఈ సంఘటన మంగళూరు ఉల్లాల్‌లో చోటు చేసుకుంది. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ‘సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా’(ఎస్డీపీఐ) తన పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులు వివారాలతో కూడిన పాంప్లేట్ రూపొందించింది. అయితే ఆ పాంప్లేట్లలో మహిళలకు కేటాయించిన వార్డుల్లో వారి పేర్ల పక్కన ఖాళీ ఫోటో వచ్చే చోట ఖాళీగా వదిలి, ఆ పక్కనే సదరు మహిళా అభ్యర్థుల కుటుంబాలకు చెందిన మగవారి ఫోటోలను ముద్రించారు. అయితే ఇక్కడ ఆసక్తికర అంశం ఏంటంటే ఎస్డీపీఐ పార్టీ ‘మహిళా సాధికారత’ తన సిద్ధాంతంగా ప్రచారం చేసుకోంటోంది. అటువంటి పార్టీ మహిళా అభ్యర్థుల స్థానంలో వారి ఫోటోలను ప్రచురించకపోగా.. వారి కుటుంబానికి చెందిన మగవారి ఫోటోలను ముద్రించి విమర్శల పాలవుతోంది. ట్విటర్లో పోస్టు చేసిన ఈ పాంప్లేట్కు నెటిజన్లు వారిదైన శైలిలో కామెంట్ చేస్తున్నారు. ‘ఇదేనా మీరు ప్రచారం చేసిన మహిళా సాధికారత’, ‘మహిళా సాధికారతకు అసలు సిసలు నిదర్శనం ఇదే’ అంటూ కామెంట్ చేస్తోన్నారు. ఈ విషయం గురించి ఎస్డీపీఐ పార్టీ నాయకుడు ఒకరు మాట్లాడుతూ.. అభ్యర్థుల ఫోటోలు ముద్రించాలనే నిబంధనేం లేదు. ఓటర్లకు వారి అభ్యర్థుల గురించి తెలుసన్నారు. సమయానికి మహిళా అభ్యర్థుల ఫోటోలు లభించకపోవడంతో.. వారి కుటుంబానికి చెందిన పురుషుల ఫోటోలు ముద్రించాం అని తెలిపారు. -
కర్ణాటకలో నిపా వైరస్..?
సాక్షి, బెంగుళూరు: కేరళను వణికిస్తున్న నిపా వైరస్ కర్ణాటకలోకి ప్రవేశించిందనే అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మెదడు పనితీరుపై ప్రభావం చూపి ప్రాణాలు తోడేసే ఈ వైరస్ బారిన పడి ఇప్పటికే కేరళలో పది మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా కేరళలో నిపా వైరస్ బాధితులను పరామర్శించి వచ్చిన మంగుళూరుకు చెందిన ఇద్దరు వ్యక్తులు జ్వరం బారిన పడ్డారని కర్ణాటక ఆరోగ్య శాఖ ప్రధానాధికారి బుధవారం తెలిపారు. వారికి నిపా వైరస్ సోకొచ్చనే కారణంగా ప్రత్యేక వైద్య సదుపాయాలు అందిస్తున్నామని వెల్లడించారు. మంగుళూరు ఆరోగ్య సేవల పర్యవేక్షకుడు బీవీ రాజేష్ మాట్లాడుతూ.. ‘కేరళలో నిపా వైరస్ బాధితులను పరామర్శించి వచ్చిన 20 ఏళ్ల యువకుడు, 75 ఏళ్ల వృద్ధుడికి ఈ వైరస్ సోకిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వ్యాధి నిర్ధారణ కోసం వారి రక్త నమూనాలను మణిపాల్ రీసెర్చి సెంటర్‌కు పంపామ’ని తెలిపారు. రక్త పరీక్షల నివేదిక గురువారం రానుందనీ, పూర్తి వివరాలు రేపు వెల్లడిస్తామన్నారు. నిపా వైరస్ కారణంగా కోజికోడ్, మలప్పురం జిలాల్లో 10 మంది మరణించారనీ, మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారని కేరళ ఆరోగ్య మంత్రి కేకే శైలజ తెలిపారు. వైరస్ వ్యాప్తికి సంబంధించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్‌కు సమాచారమిచ్చామని ఆమె తెలిపారు. కాగా, ఈ వైరస్ బాధితులకు చికిత్సనందిస్తూ లినీ అనే నర్సు సోమవారం మృతి చెందిన సంగతి తెలిసిందే. -
సంచలన కేసు.. షాకింగ్ తీర్పు
సాక్షి, బెంగళూరు : సంచలనం సృష్టించిన మంగళూరు పబ్ కేసులో నిందితులను కోర్టు వదిలేసి అందరిని షాక్‌కు గురిచేసింది. సరైన ఆధారాలు నిందితులకు వ్యతిరేకంగా సమర్పించలేకపోయారని, ప్రత్యక్ష సాక్షులమంటూ కోర్టుకు వచ్చిన వారు సైతం స్పష్టమైన వివరాలు వెల్లడించలేపోయారంటూ కోర్టు వారిని విడిచిపెట్టిన సందర్భంగా తెలిపింది. 2009లో జనవరిలో యూట్యూబ్‌లో వచ్చిన ఓ వీడియో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. మంగళూరులోని పబ్‌లో చోటుచేసుకున్న అభ్యంతరకర దాడుల దృశ్యాలే ఆ వీడియో. నైతిక విలువలు కోల్పోయి, విలువలకు తిలోదకాలు ఇచ్చి సంస్కృతిని దెబ్బకొడుతున్నారనే కారణంతో శ్రీ రామ్ సేన అనే ఓ వర్గం మంగళూరులోని 'ఆమ్నేసియా-దిలాంజ్' అనే పబ్‌లోకి చొరబడి అందులోని యువతి యువకులపై దాడులు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు యువతులపై దాడులకు పాల్పడిన అస్పష్టమైన దృశ్యాలు బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో రామ్ సేన చీఫ్ ప్రమోద్ ముథాలిక్‌తోపాటు మొత్తం 30మందిపై కేసులు పెట్టి అరెస్టు చేశారు. అయితే, ఆ దాడికి సంబంధించిన స్పష్టమైన ఫొటోలు, వీడియోలు, ఇతర ఆధారాలు ప్రభుత్వంగానీ, పోలీసులుగానీ సమర్పించలేదని కోర్టు వారిని నిర్దోషులుగా ప్రకటించింది. ఈ తీర్పు పలువురిని విస్మయానికి గురిచేసింది. అయితే, కోర్టుకు స్పష్టమైన ఆధారాలే ముఖ్యం అని, భావోద్వేగాల ఆధారంగా, అభిప్రాయాల ద్వారా తీర్పులు చెప్పలేమని తెలిపింది. తమకు సమర్పించిన వీడియోల్లో కేవలం నీడలు మాత్రమే కనిపించాయని, వీరే స్పష్టం అనడానికి ఆధారాలు లేవని తెలిపింది. -
‘మేమేం రేప్‌లు, మర్డర్లు చేయలేదు’
సాక్షి, మంగళూరు : దాదాపు 9 ఏళ్ల వాదనల తర్వాత మంగళూర్ పబ్ దాడి కేసులో నిందితులను కోర్టు నిర్దోషులుగా తేల్చింది. సరైన సాక్ష్యాలు లేనందున వారిని విడుదల చేస్తున్నట్లు సోమవారం జేఎంఎఫ్‌సీ కోర్టు తీర్పు వెలువరించింది. దీంతో శ్రీ రామ్ సేన అధినేత ప్రమోద్ ముథాలిక్, కార్యకర్తలకు ఉపశమనం కలిగింది. తీర్పు అనంతరం బయటకు వచ్చిన ప్రమోద్ మీడియాతో మాట్లాడుతూ.. ఇది చాలా చిన్న విషయమని తెలిపారు. ‘మేమేం రేప్‌లు, మర్డర్లు చేయలేదు. ఇది చాలా చిన్న విషయం. అనవసరంగా కొందరు భూతద్దంలో పెట్టి ప్రపంచానికి చూపాలనుకున్నారు. జమ్ము కశ్మీర్ పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయంటూ అసందర్భ ప్రేలాపనలు చేశారు. పెద్ద పెద్ద నేరాలు చేస్తున్న వాళ్లే బయట స్వేచ్ఛగా తిరుగుతున్నారు. మేం ఏ తప్పు చెయ్యలేదు. చివరకు ధర్మం గెలిచింది’ అంటూ ప్రమోద్ వ్యాఖ్యానించారు. కాగా, మహిళలని కూడా చూడకుండా పబ్ నుంచి బయటకు లాకొచ్చి మరీ నిర్దాక్షిణ్యంగా దాడి చేశారన్నది వీరందరిపై నమోదైన ప్రధాన ఆరోపణ. ఈ వ్యవహారంలో ప్రమోద్‌తోపాటు 30 మంది శ్రీ రామ్ సేన కార్యకర్తలపై కేసు నమోదు అయ్యింది. తొమిదేళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత ఇప్పుడు వారందరినీ నిర్దోషులుగా కోర్టు తేల్చింది. ఈ వ్యవహారంలో తనపై తప్పుడు ఆరోపణలు చేసిన కాంగ్రెస్ పార్టీపై పరువు నష్టం దావా వేయనున్నట్లు ముథాలిక్ తెలిపారు. మంగళూర్ పబ్ దాడి కేసు... 2009, జనవరి 24వ తేదీన మంగళూర్‌లోని అమ్నేషియా పబ్‌లో పార్టీ చేసుకుంటున్న యువతపై శ్రీ రామ్ సేన కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. భారతీయ సంస్కృతిని, సాంప్రదాయాలను పక్కదోవ పట్టిస్తూ పాశ్చాత్య సంస్కృతిని అవలంభిస్తున్నారంటూ వారిపై దాడికి పాల్పడ్డారు. పబ్‌లో ఉన్న వాళ్లందరినీ బయటకు లాక్కొచ్చి మరీ తరిమి కొట్టారు. అయితే మహిళలను కూడా జుట్టు పట్టుకుని విసిరేస్తూ దాడులు చేయటం.. ఆ వీడియోలు వైరల్ కావటంతో దేశ్యాప్తంగా ఘటన చర్చనీయాంశంగా మారింది. జాతీయ మహిళా కమిషన్ జోక్యంతో కేసు దాఖలు కాగా.. శ్రీ రామ్ సేన అధినేత ప్రమోద్ ముథాలిక్, ఆయన అనుచరుల మీద కేసు నమోదు అయ్యింది. 30 మందిలో 25 మంది నిందితులుగా కోర్టు విచారణను ఎదుర్కోగా.. ముగ్గురు విదేశాలకు పారిపోయారు. మరో ఇద్దరు కేసు దర్యాప్తు కొనసాగుతుండగానే ప్రాణాలు విడిచారు. -
మసీదుకు స్థలమిచ్చిన ఆలయాధికారి
సాక్షి, మంగళూరు : దేశంలో మతసామరస్యం ఇంకా ఉందని కర్ణాటకలోని ఒక ఆలయాధికారి నిరూపించారు. మతాలు, ప్రార్థనలు వేరయినా.. భగవంతుడు ఒక్కడే అని ఆయన తన చేతుల ద్వారా నిరూపించారు. మసీదు స్థలం సరిపోక ముస్లిం సోదరులు కొంత కాలంగా అవస్థలు పడుతున్నారు. వారి ఇబ్బందిని గమనించిన శ్రీ విష్ణుమూర్తి ఆలయ కమిటీ అధ్యక్షుడు తన సొంత స్థలాన్ని మసీదుకు దానం చేసి తన పెద్ద మనసును చాటుకున్నారు. ఈ ఘటన కర్ణాకటలోని దక్షిణ కన్నడ జిల్లాలోని కెయ్యూర్ గ్రామ పంచాయితీ పరిధిలోని ఒలముండు గ్రామంలో జరిగింది. ఒలమండు గ్రామంలోని మసీదు చిన్నది కావడంతో ముస్లింలు ప్రార్థన చేసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. మసీదు విస్తరణలో భాగంగా ముస్లిం మత పెద్దలు.. మసీదుకు ఆనుకుని ఉన్న మోహన్ రాయ్ స్థలాన్ని ఇవ్వమని కోరారు. ముస్లిం మత పెద్దల కోరికను విన్న మోహన్ తన 12 సెంట్ల స్థలాన్ని మసీదుకోసం ఉచితంగా ఇచ్చారు. మసీదుకు స్థలాన్ని దానం చేసిన మోహన్ రాయ్‌పై ముస్లిం మత పెద్దలు ఉమర్ ముస్లియార్, కేఆర్ హుస్సేన్ తదితరులు ప్రశంసలు కురిపించారు. -
నాసా పరిశోధన: మంగళూర్‌కే ముంపు
-
నాసా సంచలనం.. మునిగేది మన నగరమే!
వాషింగ్టన్ : గ్లోబల్ వార్మింగ్ మూలంగా ధ్రువాలలోని మంచు ఫలకాలు కరిగిపోయి తీర ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నాసా పరిశోధనలో తేలిన సంచలన విషయం ఏంటంటే... ఆ ప్రభావం ఎక్కువగా చూపించబోయేది మన నగరంపైనేనంటా. గ్రెడియంట్ ఫింగర్‌ప్రింట్ మ్యాపింగ్(జీఎఫ్ఎం) పేరిట ఈ మధ్యే నాసా ఓ కొత్త పరికరాన్ని కనిపెట్టింది. దాని ద్వారా ఏయే ప్రాంతాల్లో ముంపు ప్రభావం ఎక్కువగా ఉండబోతుందని అంచనా వేస్తోంది. గ్రీన్లాండ్, అంటార్కిటికాలో మంచు శిలలు కరిగిపోతే న్యూయార్క్, లండన్, ముంబై లాంటి మహానగరాల వాటిల్లే ముప్పు కంటే మంగళూర్‌కే ముంపు తీవ్రత ఎక్కువగా పొంచి ఉందంట. సుమారు 293 పోర్టు పట్ణణాలను పరిశోధించిన నాసా ఈ నివేదికను విడుదల చేసింది. గ్రీన్ లాండ్ ఉత్తరాది, తూర్పు వైపున ఉన్న మంచుపొరలు కరిగిపోయి న్యూయార్క్ పట్టణానికి ఏర్పడే ప్రమాదం కన్నా... మంగళూరుకు ఏర్పడే ముప్పు ఎక్కువగా ఉందని తేలింది. వీటితోపాటు కరాచీ, చిట్టాగాంగ్, కొలంబో పట్టణాలకు కూడా మునిగిపోయే ప్రమాదం ఉందని నాసా హెచ్చరిస్తోంది. -
అపురూప జంట
సాక్షి, బొమ్మనహళ్లి (మంగళూరు): ఎవరికి ఎవరితో ముడిపడి ఉంటుందో, ఎవరితో రుణానుబంధమో ఎవ్వరూ చెప్పలేరు. ప్రతి ఒక్కరికి జోడీ ముందే కుదిర్చే ఉంటుందని పెద్దలు అంటూ ఉంటారు. అలాంటిదే ఈ చూడచక్కని జంట కథ. కాఫీ నగరంగా పేరు పొందిన చిక్కమగళూరు జిల్లాలో అరుదైన పెళ్లి జరిగింది. అక్కడికి సమీపంలోని కళసాపురం అనే గ్రామంలో పునీత్ (24), లావణ్య (22) అనే జంట ఆదివారం మూడుముళ్లు, ఏడడుగులతో ఒక్కటైంది. ఇందులో విశేషమేముంది? అనుకోకండి. వీరిద్దరూ మరుగుజ్జులే కాబట్టి ఈ పెళ్లి ప్రత్యేకమే. వధువు, వరుడు ఇద్దరి ఎత్తు కేవలం మూడు అడుగులు మాత్రమే. ఇలా కుదిరింది పునీత్‌ది కళసాపురం కాగా, ఆమెది అయ్యనహళ్లి. రెండు మూడేళ్లుగా పునీత్, లావణ్య కన్నవారు వీరికి తగిన జోడీ కోసం గాలిస్తున్నారు. కానీ ఇద్దరికీ సరిపోయేవారు ఎక్కడా దొరకలేదు. ఇంతలో ఒక పెళ్లిలో పునీత్ తల్లిదండ్రులు లావణ్యను చూసి, ఆమె తల్లిదండ్రులతో మాట్లాడారు. ఇద్దరిదీ ఒకటే ఎత్తు కావడంతో ఇరు కుటుంబాల పెద్దలు వీరి పెళ్లికి నిశ్చయించారు. ఆదివారం ఘనంగా ఈ ప్రత్యేక జంట వివాహోత్సవం జరిగింది. బంధువులు, గ్రామస్తులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. నవ దంపతులు పెళ్లిలో చాలా సంతోషంగా కనిపించారు. ఈడు జోడు సరిగ్గా కుదిరింది అని అతిథులు కొత్త జంటను ఆశీర్వదించారు. -
ముఖ్యమంత్రికి మహిళా మేయర్ పంచ్ : వైరల్ వీడియో
సాక్షి, బెంగళూరు : ఆమె.. కరాటేలో బ్లాక్ బెల్ట్ హోల్డర్, మాజీ చాంపియన్ కూడా! ఆయన.. ‘ఎంటర్ ది డ్రాగెన్’ లాంటి సినిమాల్లో తప్ప కరాటే ఎరుగరు. కానీ వాళ్లిద్దరూ కలబడ్డారు. పరస్పరం పంచ్‌లు ఇచ్చుకున్నారు. ప్రస్తుతం వైరల్ అయిన ఆ వీడియోలోని ఆమె.. మంగళూరు మేయర్ కవితా సనిల్ కాగా, ఆయన.. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. పంచ్ పడుద్ది : శనివారం మంగళూరులోని నెహ్రూ మైదానంలో ‘ఇండియన్ కరాటే చాంపియన్‌షిప్-2017’ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి సీఎం సిద్దూ, మంగళూరు మేయర్ కవిత ముఖ్య అతిథులుగా హాయజర్యారు. పోటీల ప్రారంభసూచికగా సీఎం, మేయర్లు సరదాగా తలపడ్డారు. ఈ దృశ్యం అక్కడున్నవారిని ఆకట్టుకుంది. ఆ సినిమా చూసి తెల్సుకున్నా : కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం ద్వారా మహిళలకు ఆత్మస్థైర్యం పెరుగుతుందన్న సీఎం.. తనకు మాత్రం కరాటే రాదని, బ్రూస్ లీ ‘ఎంటర్ ది డ్రాగన్’ సినిమా చూసి కొద్దిగా తెల్సుకున్నానని సీఎం చెప్పుకొచ్చారు. మేయర్‌కు సీఎం పంచ్ వీడియో -
ముఖ్యమంత్రికి మహిళా మేయర్ పంచ్
-
అర్ధరాత్రి మంగళూరులో దారుణం..
ఉల్లాల్: మంగళూరులో మంగళవారం దారుణం జరిగింది. అర్ధరాత్రి నడుచుకుంటూ వెళుతున్న ఇద్దరు భారతీయ జనతాపార్టీకి చెందిన మైనారిటీ కార్యకర్తలపై దుండుగులు కత్తులతో హత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో జుబిర్ అనే కార్యకర్త తీవ్ర గాయాలతో మృతి చెందారు. ఈ ఘటనలోనే తీవ్రంగా గాయపడ్డ మరో కార్యకర్త ఇలియాజ్ ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. తమ పార్టీకి చెందిన మైనారిటీ కార్యకర్తలపై దాడిని బీజేపీ తీవ్రంగా ఖండించింది. స్థానిక ఎమ్మెల్యే ప్రొద్బలంతోనే దుండగులు ఇటువంటి దారుణానికి ఒడిగట్టారని బీజేపీ మైనారిటీ నేత రహీం ఊచిల్ అన్నారు. జుబిర్, ఇలియాజ్‌లు ఇద్దరూ.. బీజేపీ మైనారిటీ విభాగంలో పదేళ్లుగా పనిచేస్తున్నారని ఆయన చెప్పారు. ఈ హత్య, దాడిని మేం రాజకీయం చేయదల్చుకోలేదు.. అయితే బాధితులకు న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నానని అన్నారు. ఈ దాడి పూర్తిగా వ్యక్తిగత కక్ష్యలతోనే జరిగిందని పోలీసు అధికారి తెలిపారు. -
మంగళూరు వద్ద బస్సు బోల్తా,ముగ్గురు మృతి
-
నాన్నకు ప్రేమతో...
► మంగళూరుకు నటి ఐశ్వర్య రాయ్ రాక ► నేత్రావతి సంగమంలో తండ్రి చితాభస్మం లీనం మంగళూరు: మాజీ విశ్వసుందరి, ప్రసిద్ధ సినీ తార ఐశ్వర్య రాయ్ శనివారం మంగళూరు సమీపంలో ఉన్న పుత్తూరుకు వచ్చారు. ఆమె తండ్రి కృష్ణరాజ్ రాయ్ మార్చి 17న ముంబైలో మరణించారు. ఆయన చితాభస్మాన్ని తీసుకుని తల్లి వృందా, కూతురు ఆరాధ్య, సోదరుడు ఆదిత్యతో కలిసి వచ్చారు. నేత్రావతి- కుమారధార సంగమంలో తమిళనాడు సంప్రదాయరీతిలో అస్తికలు కలిపి పిండప్రదానం చేశారు. అంతకు ముందు వారు ఉప్పినగుండి సమీపంలో ఉన్న సహస్ర లింగేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమాల్లో ఐశ్వర్య భర్త అభిషేక్ బచ్చన్ ఎక్కడా కనిపించలేదు. ఐశ్వర్య కుటుంబం స్వస్థలం మంగళూరు అన్నది తెలిసిందే. తండ్రి జ్ఞాపకాలతో ఐశ్వర్య ఆద్యంతం దిగులుగా కనిపించింది. నటీమణి రాక సందర్భంగా ఎయిర్‌పోర్టు, ఆలయాల వద్ద అభిమానుల రద్దీ నెలకొంది. పోలీసులు గట్టి బందోబస్తు కల్పించాల్సి వచ్చింది. -
బాలికపై సామూహిక అత్యాచారం
నిరంతర సామూహిక అత్యాచారం.. ఏడు నెలల గర్భవతి బొమ్మనహళ్లి: అభం శుభం తెలియని మైనర్ బాలికను సామూహికంగా నిరంతర అత్యాచారం చేసి, ఏడు నెలల గర్భవతిని చేసిన సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. మంగళూరులోని ధర్మస్థల దళిత వాడలో నివాసముంటున్న ఒక దళిత కుటుంబానికి చెందిన బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. వివరాల మేరకు తల్లి మానసిక అస్వస్థరాలు కావడంతో ఆమెకు తోడుగా బాలిక ఉంటుంది. బాలికకు అక్క, చెల్లి, ఉన్నారు. అక్క మరో ఊరిలో ఉంటుండగా, చెల్లీ హస్టల్లో చదవుకుంటుంది. తలి మానసిక ఆస్వస్థరాలు కావడం వలన తాను తల్లికి అండగా ఉంటుంది. బాలికను అదే గ్రామానికి చెందిన కొంత మంది వ్యక్తులు అదే అదునుగా చేసుకుని బాలికపై నిరంతర సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలికకు ఆరోగ్యం బాలేకపోవడంతో మంగళూరు ఆస్పత్రికి చికిత్స కోసం వెళ్లడంతో వైద్యులు ఆమె ఏడు నెలల గర్భవతని తెలిపారు. బాలిక ఇంటి సమిపంలోఉన్న యువకుడు బాలికతో స్నేహంగా ఉంటు బాలికను లోబరుచుకొని పెళ్ళి కూడ చేసుకుంటానని నమ్మించి బాలిక పైన అత్యాచారం చేశాడు. తన స్నేహితులతో కలిసి మైనర్ బాలిక పైన అత్యాచారం చేయడంతో బాలిక ప్రస్తుతం ఏడు నెలల గర్బవతి. వైద్యులు ధర్మస్థల పోలిసులకు సమాచారం ఇచ్చారు. సంఘటణ స్థలానికి వచ్చిన పోలిసులు బాలిక నుంచి వివరాలను సేకరించి అనంతరం పోక్సొ చట్టం కింద కేసు నమోదు చేసుకోని బాలిక పైన అత్యాచారం చేసిన వారిలో కొంత మందిని అదుపులోకి తీసుకోని విచారణ చేస్తున్నారు. మరి కొంత మంది ఈ విషయం ఎక్కడ బయటపడుతుందో అని ఇప్పటికే ఊరు విడిచి పరారైనారు. బాలిక విషయం తెలుసుకున్న బంట్వాళ డీఎస్పీ రవీశ్ సీఆర్ నేతృత్వంలో బెళ్తంగడి సీఐ నాగేష్కద్రి, ధర్మస్థల సీఐ నేతృత్వంలో కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ముగ్గురుని అరెస్ట్ చేసినట్లు ఈ సామూహిక అత్యాచారం కేసులో మరి కొంత మంది ఉన్నారని వారి కోసం గాలిస్తున్నట్లు పోలిసులు తెలిపారు. -
ఇద్దరు అబ్బాయిలకు పెళ్లి చేశారు
మంగుళూరు: వర్షాలు కురవడం లేదని.. వరుణ దేవుడి కరుణ కోసం ఇద్దరు అబ్బాయిలకు పెళ్లి చేశారు. ఈ ఘటన మంగుళూరుకు చేరువలోని మహదేశ్వర హిల్స్‌లో చోటు చేసుకుంది. మహాశివరాత్రి పర్వదన సందర్భంగా మహదేశ్వర హిల్స్ గ్రామంలో ఈ పెళ్లి జరిగింది. ఇద్దరు అబ్బాయిల్లో ఒకరిని అమ్మాయిలా అలంకరించి ఆచారాల ప్రకారం వివాహం జరిపించారు గ్రామస్ధులు. వివాహంపై మాట్లాడిన కొందరు గ్రామ పెద్దలు అలా చేయడం వల్ల వర్షాలు బాగా కురుస్తాయని తమ నమ్మకమని చెప్పారు. పెళ్లి కోసం గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి కొంత మొత్తం ఇచ్చినట్లు వెల్లడించారు. ఇద్దరు అబ్బాయిలు వివాహం చేసుకోవడం వల్ల వారికి ఉన్న సమస్యలు కూడా తగ్గుతాయని తమ నమ్మకమని చెప్పారు. వర్షాల కోసం కప్పలకు, గాడిదలకు కూడా పెళ్లిళ్లు చేసిన సంఘటనలు చాలానే ఉన్నాయి. బెంగుళూరు పరిసర ప్రాంతాల్లో గ్రామాల్లో ఇలాంటి ఆచారాలు సర్వసాధారణంగా మారాయి. -
ప్రజల వద్దకే మలేరియా డిటెక్షన్ యూనిట్!
మలేరియాను నిర్మూలించడంలో మంగళూరు అధికారులు మరో అడుగు ముందుకేశారు. కర్నాటక ప్రాంతంలో గుర్తించిన మొత్తం 7800 మలేరియా కేసుల్లో మంగుళూరులోనే 4000 వరకూ ఉండటంతో అప్రమత్తమయ్యారు. ప్రజా వైద్య సౌకర్యాలను మెరుగు పరిచే దిశగా మొబైల్ మలేరియా డిటెక్షన్ యూనిట్ ను ప్రారంభించారు. కర్నాటక మంగుళూరు నగరంలో మలేరియా నివారణ, నియంత్రణ దిశగా చర్యలు ప్రారంభించారు. కర్నాటక ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మొదటిసారి మొబైల్ మలేరియా గుర్తింపు యూనిట్ ను ప్రారంభించింది. ఆరుగురు నిపుణుల బృదంతోపాటు, విశ్లేషణా పరికరాలు, మందులతో కూడిన వాహనాన్ని అత్యధికంగా మలేరియా కేసులు నమోదవుతున్న మంగళూరు నగరంలో మార్చి 19న ప్రారంభించింది. ఇందులో భాగంగా వైద్య కార్మికులు ఉచిత పరీక్ష, చికిత్స అందించడంతో పాటు... విశ్లేషణా కిట్ సహాయంతో నిమిషాల్లో ఫలితాలను అందిస్తారు. ముందుగా రక్త నమూనాలను సేకరించి కిట్ ద్వారా పరిశీలిస్తారు. ఫలితం ప్రతికూలంగా చూపితే.. రక్త నమూనాలను మరింత విశ్లేషణ జరిపేందుకు మలేరియా టెస్టింగ్ సెంటర్ కు పంపిస్తారు. ఫలితాలు సానుకూలంగా చూపితే రోగులకు వెంటనే మందులను అందిస్తారు. రక్త పరీక్షలతోపాటు, మందులుకూడ ఉచితంగానే ఇస్తారు. ప్రజలు ఒక్క ఫోన్ కాల్ చేసి, అడ్రస్ ఇస్తే చాలు అరగంటలోపు మొబైల్ యూనిట్ వారింటిముందుండేట్టుగా ఈ ప్రత్యేక సౌకర్యాన్ని కల్పించారు. ఈ సౌకర్యం వినియోగించుకొనేందుకు ఓ హాట్ లైన్ నెంబర్ (9448556872) ను ప్రవేశ పెట్టారు. మలేరియా పరీక్షలు నిర్వహించిన ప్రతి వ్యక్తి వివరాలను ఈ మొబైల్ యూనిట్ రిజిస్టర్ చేస్తుంది. మలేరియా వ్యాప్తి నిరోధించడంలో భాగంగా ఆ వివరాలను మంగళూరు సిటీ కార్పొరేషన్ కు అప్పగిస్తుంది. గతేడాది అక్టోబర్ లో స్థాపించిన మలేరియా కంట్రోల్ సాఫ్ట్ వేర్ సిస్టమ్ ద్వారా ఆ వివరాలను అప్ లోడ్ చేస్తారు. నగరంలోని మలేరియా కేసుల వివరాలను తెలిపేందుకు, ముందు జాగ్రత్త చర్యలు తీసుకునేందుకు ఈ సాఫ్ట్ వేర్ మ్యాపింగ్ టూల్ గా ఉపయోగపడుతుంది. నగరంలో ఏర్పాటు చేసిన ప్రతి చికిత్సా కేంద్రానికి అనుబంధంగా ఈ మొబైల్ యూనిట్.. సేవలు అందిస్తుందని జిల్లా డిసీజ్ కంట్రోల్ ఆఫీసర్ అరుణ్ కుమార్ ఎస్ బి. తెలిపారు. -
బాత్రూమ్లో దాక్కున్న ఖైదీ!
మంగళూరు జైలును పరిశీలించిన కమల్‌పంత్ బెంగళూరు: మంగళూరులోని కారాగారంలో సోమవారం ఉదయం కొంతమంది ఖైదీల మధ్య ఘర్షణ జరిగిన అనంతరం కనిపించకుండా పోయిన ఖైదీ ఒకరు మంగళవారం ఉదయం జైలులోని ఓ బాత్రూమ్లో కనిపించాడు. వివరాలు....దొంగతనం చేసిన కేసులో బషీర్ అహ్మద్ అనే వ్యక్తి మంగళూరు కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. మంగళూరులోని కారాగారంలో సోమవారం ఉదయం ఖైదీల మధ్య జరిగిన ఘర్షణ సమయంలో మడూరు యూసఫ్ హత్యను, అక్కడి వాతావరణాన్ని చూసి భయపడిపోయిన బషీర్ అహ్మద్ జైలులోని ఓ బాత్రూమ్లోకి వెళ్లి దాక్కున్నాడు. ఘర్షణ అనంతరం జైలులోని ఖైదీల గదులను పరిశీలించిన జైలు సిబ్బంది బషీర్ అహ్మద్ కనిపించక పోవడంతో అతను తప్పించుకొని వెళ్లి ఉండవచ్చని భావించారు. ఇదే విషయాన్ని అధికారులకు కూడా తెలియజేశారు. కాగా, మంగళవారం ఉదయం జైళ్ల శాఖ ఏడీజీపీ కమల్‌పంత్ మంగళూరులోని కారాగారాన్ని పరిశీలిస్తున్న సమయంలో బషీర్ అహ్మద్ జైలులోని ఓ బాత్రూమ్లో ఉండిపోయిన విషయాన్ని గుర్తించారు. జైలులో జరిగిన ఘర్షణను చూసి భయపడి బషీర్ అహ్మద్ బాత్రూమ్లో దాక్కున్నాడని అధికారులు చెబుతున్నారు. కాగా, మంగళూరులోని కారాగారాన్ని పరిశీలించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. మంగళూరు కారాగారంలో జరిగిన ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామని, ఈ ఘటనపై శాఖాపరమైన విచారణకు ఇప్పటికే ఆదేశించామని చెప్పారు. ఇదే సందర్భంలో మంగళూరు నగర పోలీసులు సైతం ఈ విషయమై విచారణ చేపట్టారని, రెండు నివేదికలను పరిశీలించిన అనంతరం ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. శాఖాపరమైన విచారణాధికారిగా మైసూరు సెంట్రల్ జైలు సూపరింటిండెంట్ ఆనందరెడ్డిని నియమించినట్లు కమల్‌పంత్ వెల్లడించారు. సిబ్బంది నిర్లక్ష్యమే ఘటనకు కారణమని తెలిస్తే మంగళూరు జైలు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
మంగళూరు హత్య కేసులో ఎనిమిదిమంది అరెస్టు
మంగళూరు: కర్ణాటకలోని మంగళూరులో జరిగిన ఓ బజరంగ్ దళ్ కార్యకర్త హత్యకు సంబంధించి ఎనిమిదిమందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ హత్యకు సంబంధించి మరికొంతమందిని అదుపులోకి తీసుకోవాల్సి ఉందన్నారు. కేసు విచారణ ప్రారంభమైందని, దోషులకు శిక్షపడే వరకు వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. మంగళూరులో గోమాంసం మార్కెట్లను మూసివేయించే కార్యక్రమంలో భయరంగ్ దళ్ కార్యకర్త అయిన ప్రశాంత్ పూజారీ చాలా కీలకపాత్ర పోషించేవాడు. గోహత్యను నిషేధించేందుకు ప్రజల్లో అవగాహన తీసుకొచ్చే కార్యక్రమాల రూపకల్పనలో కూడా అతడు మేటి. ఇలా అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న ప్రశాంత్‌పై ఒకేసారి ఆరుగురు ముస్లిం వ్యక్తులు ఈ నెల(అక్టోబర్) 9న మూడ్‌బిద్రి వద్ద దాడి చేసి ఉరి తీసి హత్య చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం ఎనిమిదిమందిని పోలీసులు అరెస్టు చేశారు. -
గురురూప రాక్షసుడు..
-
వేద పాఠశాలలో టీచర్ కిరాతకం
-
యువతితో మాట్లాడాడని స్తంభానికి కట్టేసి..
మంగళూరు: సహచర ఉద్యోగినితో మాట్లాడాడనే కారణంతో ఓ ముస్లిం వ్యక్తిని చితకబాదిన ఘటన కర్ణాటకలోని మంగళూరులో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి మొత్తం 13మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో కొంతమంది భజరంగ్ దళ్ కార్యకర్తలు ఉన్నారు. పోలీసుల వివరాల ప్రకారం 29 ఏళ్ల ముస్లిం వ్యక్తి ఓ హిందూ యువతితో కారులో ఉండగా ఒక్కసారిగా ఓ గుంపు అతడిపై దాడి చేసింది. బట్టలూడదీసి కొట్టడమే కాకుండా వీధుల వెంట పరుగెత్తించారు. అనంతరం ఓ విద్యుత్ స్తంభానికి కట్టేసి దాదాపు గంట సేపు పిడిగుద్దులు గుప్పించారు. దీనికి సంబంధించిన ఫొటోలు స్థానిక టీవీ చానెల్లలో, వాట్సాప్‌లో హల్ చల్ రేపడంతో పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. అయితే, బాధితుడు మాత్రం తాను.. ఆ యువతి ఒక మాల్ లో పనిచేస్తున్నామని, ఆమె లోన్ కట్టేందుకు డబ్బులు అవసరం ఉన్నాయని అడగడంతో ఇచ్చేందుకు ఏటీఎం వద్దకు కారులో వెళ్లానని ఇంతలోనే వారు వచ్చి దాడి చేశారని తెలిపాడు. ఈ విషయంలో ఆ అమ్మాయి జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించినా ఆమెను కూడా తిట్టారని, ఆమె మాటలు పట్టించుకోలేదని వివరించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
మంగళూరులో కొనసాగుతున్న ఉద్రిక్తత
బెంగళూరు: ఇరు వర్గాల మధ్య ఏర్పడిన వైషమ్యాలతో మంగళూరులో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో సోమవారం నగరంలోని ఓ వర్గం వారిని బంధించాలని.. మరో వర్గం వారు రోడ్డుకెక్కడంతో వారిని నియంత్రించేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. నియంత్రణ కోల్పోయిన ఓ పోలీసు అధికారి ఓ వర్గ పీఠాధిపతిపై చేయి చేసుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు ఆందోళన కారులను చెదరగొట్టి నగరంలో 144 సెక్షన్‌ను విధించారు. -
బజ్పే విమానాశ్రయంలో పేలుడు పదార్థాల కలకలం
సాక్షి, బెంగళూరు : మంగళూరులోని బజ్పే అంతర్జాతీయ విమానాశ్రయంలో పేలుడు పదార్థాలు కలకలం సృష్టించాయి. దుబాయ్‌కు వెళుతున్న ఓ వ్యక్తి లగేజీలో అనుమానిత ద్రావకాన్ని భద్రతా సిబ్బంది గుర్తించింది. వివరాల్లోకి వెళితే... పేలుడు పదార్థాలతో దుబాయ్‌కు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న ఓ వ్యక్తిని మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయ భద్రతా సిబ్బంది గుర్తించి అదుపులోకి తీసుకుంది. వివరాల్లోకి వెళితే... అబ్దుల్ ఖాదర్ అనే వ్యక్తి దుబాయ్‌కు వెళ్లేందుకని శనివారం రాత్రి 11.30 గంటలకు మంగళూరు విమానాశ్రయానికి చేరుకున్నాడు. ఆ సమయంలో అతని లగేజీలో రసాయనిక ద్రావణం, బ్యాటరీ, వైర్లు ఉన్నట్లు భద్రతా సిబ్బంది గుర్తించింది. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న మంగళూరు పోలీస్ కమిషనర్ హితేంద్ర, డీసీపీ జగదీష్ విమానాశ్రయాన్ని చేరుకుని నిందితుడిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పాస్‌పోర్టులోని వివరాల ప్రకారం అతనిది కేరళ అని నిర్ధారించారు. మంగళూరు నుంచి దుబాయ్‌కు అక్కడి నుంచి సిరియా వెళ్లడానికి అబ్దుల్ ఖాదర్ ఏర్పాట్లు చేసుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెలుగు చూసింది. కేసు విచారణకు గాను బెంగళూరు నుంచి ప్రత్యేక బృందం మంగళూరుకు చేరుకుంది. దుబాయ్‌లో గ్రాఫిక్ డిజైనర్‌గా పనిచేస్తున్న తాను ఇటీవల స్వగ్రామానికి వచ్చినట్లు విచారణ అధికారుల ఎదుట అబ్దుల్ ఖాదర్ అంగీకరించాడు. శనివారం దుబాయ్‌కు బయలుదేరానని, ఆ సమయంలో తన ఇంటి పక్కనే ఉన్న వారు ఓ గిఫ్ట్ ప్యాక్‌ను దుబాయ్‌లోని తమ సంబంధీకులకు ఇవ్వాలని కోరుతూ ఇచ్చారని వివరించాడు. గిఫ్ట్ ప్యాక్‌ను అధికారులు పరిశీలించారు. అందులో హైడ్రోజన్ పెరాక్సైడ్, ఫెయిల్యూర్ అయిన బ్యాటరీ ఉన్నట్లు నిర్ధారణకు వచ్చి అబ్దుల్ ఖాదర్‌ను విడిచి పెట్టారు. -
సమస్యలు పరిష్కరించే వారికే ఓటు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ఎలాంటి సమస్యనైనా పరిష్కరించేగలిగే నాయకునే ఎన్నుకోవాలని మాజీ రాష్ర్టపతి అబ్దుల్ కలాం పిలుపునిచ్చారు. అలాంటి నాయకుని హృదయం మంచితనంతో నిండి ఉండాలని కూడా అన్నారు. ఓటర్ల చైతన్యంపై దక్షిణ కన్నడ జిల్లా యంత్రాంగం మంగళూరులోని టీఎంఏ పాయ్ కన్వెన్షన్ హాలులో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన ‘యువతతో ముఖాముఖి’ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. చెన్నైలో తాను చదువుతున్నప్పుడు 60 ఏళ్ల కిందట 1954లో తొలిసారిగా తాను మంగళూరుకు వచ్చానని, అప్పట్లో తాను కలసిన మహాబలేశ్వర భట్ మంచి మిత్రుడయ్యారని గుర్తు చేసుకున్నారు. దేశంలోనే మంగళూరు శుభ్రమైన, అందమైన నగరం అని కొనియాడారు. విజయానికి నాలుగు దశలుంటాయని, విజేత వాటికి సంబంధించిన లక్షణాలను కలిగి ఉండాలని ఉద్బోధించారు. ‘20 ఏళ్ల వయసు రావడానికి ముందే ప్రతి ఒక్కరూ ఉన్నతమైన ఆశయం కలిగి ఉండాలి. ఆశయం ఒక్కటే సరిపోదు. రెండోది.. పుస్తక పఠ నం ద్వారా జ్ఞానాన్ని సముపార్జించుకోవాలి. మూడోది...బాగా కష్టపడాలి. నాలుగోది..లక్ష్య సాధనకు స్థిరంగా పని చేస్తూ పోవాలి’ అని వివరించారు. ఏ సమస్య గురించైనా భయపడకూడదని, సమస్యే మనల్ని చూసి భయపడాలని అన్నారు. ఏ సమస్యకూ భయపడని లక్షణం నాయకునికి ఉండాలని సూచిం చారు. ప్రతి సమస్యనూ అతను ఓడిస్తూ పోవాలన్నారు. ఆలాంటి నాయకులే మనకు కావాలి. అలాంటి వారినే ఎన్నుకోవాలి అని పిలుపునిచ్చారు. ‘మీరో నిర్ణయం తీసుకోవాలి. దేశం కోసం మం చి నాయకుని ఎన్నుకుని ఓటు వేయాలి. విద్య అనేది ఎగరడానికి రెక్కలనిస్తుందనేదే మీకు నా సందేశం. జ్ఞానం కూడా మిమ్మల్ని మంచి డాక్టరు లేదా ఆర్కిటెక్ట్ లేదా టీచరును చేస్తుంది. మంచి రాజకీయ నాయకుడిని కూడా చేయగలదు’ అని వివరించారు. పెద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరైనందుకు ఆయ న విద్యార్థులను అభినందించారు. ఓటు హక్కును విధిగా వినియోగించుకోవాలని కొత్త ఓటర్లకు విజ్ఞప్తి చేస్తూ గంట పాటు సాగిన తన ప్రసంగాన్ని ఆయన ముగించారు. -
సీరియల్ సైనైడ్ కిల్లర్‌కు మరణశిక్ష
సైనైడ్ ఉపయోగించి వరుసపెట్టి హత్యలు చేస్తున్న ఓ హంతకుడికి మూడు హత్య కేసుల్లో కోర్టు మరణశిక్ష విధించింది. సైనైడ్ కిల్లర్ అని పేరున్న మోహన్ కుమార్‌పై నేరం గత మంగళవారం నిరూపితమైంది. నాలుగో అదనపు డిస్ట్రిక్ట్, సెషన్స్ కోర్టు శనివారం శిక్ష విధించింది. లీలావతి, అనిత, సునంద అనే ముగ్గురు మహిళలను చంపిన కేసులు అతడిపై రుజువయ్యాయని, అందుకే అతడికి మరణ శిక్ష విధిస్తున్నామని జడ్జి బీకే నాయక్ తెలిపారు. ఇది అత్యంత అరుదైన కేసని, ఈ నేరానికి మరణశిక్ష కంటే తక్కువ శిక్ష విధించడానికి అవకాశమే లేదని నాయక్ అన్నారు. అయితే.. ఏ కేసులోనూ పోస్టుమార్టం నివేదికలో సైనైడ్ వాడినట్లు రాలేదని మోహన్ కుమార్ వాదించాడు. 2009 అక్టోబర్ 21న అతడిని అరెస్టు చేయగా, ఫాస్ట్ ట్రాక్ కోర్టులో 2011 నవంబర్ నెలలో విచారణ ప్రారంభమైంది. తర్వాత నాలుగో అదనపు డిస్ట్రిక్ట్, సెషన్స్ కోర్టుకు కేసు బదిలీ అయ్యింది. -
మంగళూరులో హంగామా
షర్ట్ లేకుండా ఏ సినిమాలోనూ కనిపించని మహేష్‌బాబు... ‘1’ సినిమా కోసం ఏకంగా సిక్స్ ప్యాక్ చేసేశారు. ఇక్కడున్న మహేష్ స్టిల్ చూడండి... సిక్స్‌ప్యాక్ సూచా యగా కనిపిస్తోంది. సాధారణంగా సిక్స్ ప్యాక్ చేస్తే... ఫేస్‌లో బ్యూటీ పోతుందంటారు. చాలామంది హీరోల విషయంలో అది జరిగింది కూడా. కానీ మహేష్ విషయంలో మాత్రం అలా జరగలేదు. ఏ మాత్రం గ్లామర్ చెడ కుండా... ఎప్పటిలాగే మిల్కీబోయ్లా ఉన్నారు ప్రిన్స్. ఏడాదిన్నర నుంచి ఈ సినిమా కోసమే అహర్నిశలూ శ్రమిస్తున్నారాయన. దీన్ని బట్టి... ‘1’ సినిమాపై మహేష్ ఎన్ని ఆశలు పెట్టుకున్నారో అర్థం చేసుకోవచ్చు. దాన్ని దృష్టిలో పెట్టుకొనే.. ప్రతిష్టాత్మకంగా సుకుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కథానాయకుడి పాత్రలను భిన్నంగా మలిచే సుకుమార్ ఈ సినిమాలో కూడా మహేష్ పాత్రను చాలా కొత్తగా డిజైన్ చేసినట్లు తెలిసింది. ఇందులోని మహేష్ పాత్ర ప్రవర్తించే తీరు ఊహలకు అతీతంగా ఉంటుందట. మహేష్ కెరీర్లో ఇప్పటివరకూ చేయని పాత్రను ఇందులో చేస్తున్నట్లు వినికిడి. కథ, కథనాల విషయంలో హాలీవుడ్ సినిమాను తలపించేలా ఈ సినిమా ఉండనుందని సమాచారం. లండన్‌లో ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను తెరకెక్కించారు సుకుమార్. ఈ నెల 25 నుంచి మంగళూరులోని డాక్‌యార్డ్, బీచ్ ప్రాంతాల్లో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. సినిమాకే హైలైట్‌గా నిలిచేలా ఈ సన్నివేశాలను తెరకెక్కించనున్నారట. ఎట్టిపరిస్థితుల్లో నవంబర్ చివరికల్లా ఈ చిత్రాన్ని పూర్తి చేయాలని నిర్మాతలు రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనిల్ సుంకర కృతనిశ్చయంతో ఉన్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను డిసెంబర్ రెండో వారంలో విడుదల చేసి, సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. మహేష్ తనయుడు గౌతమ్‌కృష్ణ బాలనటునిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో కీర్తి సనన్ కథానాయిక. నాజర్, సయాజీ షిండే, కెల్లీ డోర్జీ, విక్రమ్ సింగ్, ప్రదీప్ రావత్, పోసాని కృష్ణమురళి, శ్రీనివాసరెడ్డి తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ఆర్.రత్నవేలు, కూర్పు: కార్తీక శ్రీనివాస్, నిర్మాణం: 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్. -
మంగళూరులో మూలాలు
దిల్సుఖ్నగర్ పేలుళ్లపై కీలక ఆధారాలు సంపాదించిన ఎన్ఐఏ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని దిల్‌సుఖ్‌నగర్‌లో జంట పేలుళ్లకు పాల్పడిన ఉగ్రవాదులు కర్ణాటకలోని మంగళూరులో ఆశ్రయం పొందినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) విచారణలో బయటపడింది. ఆ పేలుళ్లకు ముందు అక్తర్ అలియాస్ తబ్రేజ్ మరో ఉగ్రవాది వకాస్ అలియాస్ అహ్మద్ మంగళూరు నుంచి పలుమార్లు హైదరాబాద్‌కు వచ్చివెళ్లినట్లు తేలింది. వారు ఆశ్రయం పొందిన మంగళూరు పట్టణం జఫర్ హైట్స్‌లోని ఫ్లాటును ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. తమ కస్టడీలో ఉన్న తబ్రేజ్‌ను ఆ ఫ్లాట్‌కు తీసుకువెళ్లి సోదాలు చేశారు. ఆ ఫ్లాటులో బాంబుల్లో టైమర్లుగా ఉపయోగించే 50 డిజిటల్ వాచీలు, కొన్ని సెల్ఫోన్లు, ఎలక్ట్రిక్ డిటోనేటర్లు, కొంత అమ్మోనియం నైట్రేట్, మండే స్వభావం కలిగిన ఆయిల్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఫిబ్రవరి 21న జరిగిన దిల్సుఖ్నగర్ పేలుళ్ల అనంతరం మంగళూరుకు వెళ్లిన తబ్రేజ్, వకాస్ మార్చి నెల వరకు కూడా అదే ఫ్లాట్‌లో ఉన్నట్లు విచారణలో బయటపడింది. ఆ తరువాతే దేశం వదిలివెళ్లినట్లు పోలీసుల విచారణలో తబ్రేజ్ వెల్లడించినట్లు సమాచారం. కోణార్క్ థియేటర్ సమీపంలోని టిఫిన్ సెంటర్ వద్ద తబ్రేజ్ సైకిల్ బాంబు పెట్టాడు. మరో ఉగ్రవాది వకాస్ ఆయనకు సహాయంగా ఆ ప్రాంతానికి వచ్చినట్లు పోలీసులు ఇప్పటికే గుర్తించారు. వెంకటాద్రి థియేటర్ ఎదురుగా ఉన్న బస్టాప్‌లో యాసిన్ భత్కల్ బాంబు పెట్టగా.. అతనికి సహాయంగా తహసీన్ అక్తర్ అలియాస్ హసన్ ఉన్నట్లు విచారణలో తేలింది. కర్ణాటకలో యాసిన్ భత్కల్ను గుర్తించే అవకాశం ఎక్కువగా ఉండటంతో అతను మాత్రం హైదరాబాద్‌లోనే ఆశ్రయం పొంది నట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. యాసిన్ భత్కల్, హసన్ హైదరాబాద్‌లోనే మకాం వేసి పేలుళ్లకు అవసరమైన బాంబులను తయారుచేసినట్లు గుర్తించారు. దిల్సుఖ్నగర్ పేలుళ్లకు వారం ముందు నుంచే నగరంలో మకాం వేసిన భత్కల్, హసన్ పేలుళ్లు జరిగిన మరుసటి రోజు ఇక్కడి నుంచి వెళ్లినట్లు బయటపడింది. అయితే, యాసిన్భత్కల్ ఎక్కడ ఆశ్ర యం పొందాడు? పేలుళ్లకు ఉపయోగించిన సైకిళ్లను ఎక్కడి నుంచి సేకరించాడు? స్థానికంగా సహకరించిన మాడ్యూల్ ఏమిటి? అనే అంశాలను ఎన్ఐఏ అధికారులు శోధిస్తున్నారు. దేశవ్యాప్తంగా వంద పేలుళ్లకు కుట్ర! కరాచీ ఆపరేషన్ పేరుతో దేశవ్యాప్తంగా వంద భారీ పేలుళ్లు జరిపేందుకు కుట్ర పన్నినట్లు ఎన్ఐఏ విచారణలో యాసిన్ భత్కల్ వెల్లడించినట్లు సమాచారం. పాకిస్థాన్ సహకారంతో 2008 నుంచి ఇప్పటివరకు 44 పేలుళ్లకు పాల్పడ్డామని, మిగతా పేలుళ్లు కూడా ఎక్కడెక్కడ జరపాలనేదానిపై ఒక ప్రణాళిక రూపొందించుకున్నామని చెప్పినట్లు తెలిసింది. ఆ పేలుళ్ల కోసం పేలుడు పదార్థాలను కూడా సమీకరించామని భత్కల్ చెప్పాడు. దిల్సుఖ్నగర్ పేలుళ్ల తర్వాత మరిన్ని పేలుళ్ల కోసం మంగళూరులోని అపార్ట్మెంట్లో పేలుడు పదార్థాలను సమకూర్చుకున్నట్లు వెల్లడించాడు. అయితే, హైదరాబాద్ సహా పలు పట్టణాల్లో వరుస పేలుళ్లకు కుట్ర చేసిన విషయాలన్నీ యాసిన్ భత్కల్ నుంచి ఒక్కొక్కటిగా దర్యాప్తు అధికారులు రాబడుతున్నారు.