బాలికపై సామూహిక అత్యాచారం | Girl raped ... | Sakshi
Sakshi News home page

బాలికపై సామూహిక అత్యాచారం

Published Sun, Apr 2 2017 5:24 PM | Last Updated on Sat, Jul 28 2018 8:40 PM

బాలికపై సామూహిక అత్యాచారం - Sakshi

బాలికపై సామూహిక అత్యాచారం

నిరంతర సామూహిక అత్యాచారం.. ఏడు నెలల గర్భవతి
 
బొమ్మనహళ్లి:  అభం శుభం తెలియని మైనర్ బాలికను సామూహికంగా నిరంతర అత్యాచారం చేసి, ఏడు నెలల గర్భవతిని చేసిన సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. మంగళూరులోని ధర్మస్థల దళిత వాడలో నివాసముంటున్న ఒక దళిత కుటుంబానికి చెందిన బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. వివరాల మేరకు తల్లి మానసిక అస్వస్థరాలు కావడంతో ఆమెకు తోడుగా బాలిక ఉంటుంది. 
 
బాలికకు  అక్క, చెల్లి, ఉన్నారు. అక్క మరో ఊరిలో ఉంటుండగా, చెల్లీ హస్టల్లో చదవుకుంటుంది. తలి మానసిక ఆస్వస్థరాలు కావడం వలన తాను తల్లికి అండగా ఉంటుంది. బాలికను అదే గ్రామానికి చెందిన కొంత మంది వ్యక్తులు అదే అదునుగా చేసుకుని బాలికపై నిరంతర సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలికకు ఆరోగ్యం బాలేకపోవడంతో మంగళూరు ఆస్పత్రికి చికిత్స కోసం వెళ్లడంతో వైద్యులు ఆమె ఏడు నెలల గర్భవతని తెలిపారు. బాలిక  ఇంటి సమిపంలోఉన్న యువకుడు బాలికతో స్నేహంగా ఉంటు బాలికను లోబరుచుకొని పెళ్ళి కూడ చేసుకుంటానని నమ్మించి బాలిక పైన అత్యాచారం చేశాడు.  
 
తన స్నేహితులతో కలిసి మైనర్‌ బాలిక పైన అత్యాచారం చేయడంతో బాలిక ప్రస్తుతం ఏడు నెలల గర్బవతి.  వైద్యులు  ధర్మస్థల పోలిసులకు సమాచారం ఇచ్చారు. సంఘటణ స్థలానికి వచ్చిన పోలిసులు బాలిక నుంచి వివరాలను సేకరించి అనంతరం పోక్సొ చట్టం కింద కేసు నమోదు చేసుకోని బాలిక పైన అత్యాచారం చేసిన వారిలో కొంత మందిని అదుపులోకి తీసుకోని విచారణ చేస్తున్నారు. మరి కొంత మంది ఈ విషయం ఎక్కడ బయటపడుతుందో అని ఇప్పటికే ఊరు విడిచి పరారైనారు. బాలిక విషయం తెలుసుకున్న బంట్వాళ డీఎస్‌పీ రవీశ్‌ సీఆర్‌ నేతృత్వంలో బెళ్తంగడి సీఐ నాగేష్‌కద్రి, ధర్మస్థల సీఐ నేతృత్వంలో కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ముగ్గురుని అరెస్ట్‌ చేసినట్లు ఈ సామూహిక అత్యాచారం కేసులో మరి కొంత మంది ఉన్నారని వారి కోసం గాలిస్తున్నట్లు పోలిసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement