Physical Assault
-
ది మానిప్యులేటివ్ పార్టనర్
ప్రచారం పిచ్చో... డబ్బులు సంపాదించుకోవచ్చు అన్న ఆశనో తెలియదు కానీ.. ఈ మధ్యకాలంలో చాలామందికి రీల్స్ పిచ్చి పట్టుకుంది. కొన్నిసార్లు ఇది కాస్తా శ్రుతిమించి పోయి వ్యవసనంగానూ మారిపోతోంది. ఆఖరుకు ఇది దాంపత్య జీవితంలోనూ చిచ్చు పెట్టే స్థితికి చేరుకుంది. అయితే కర్ణాటకలోని ఉడుపికి సమీపంలోని కార్కడలో ఈ రీల్స్ పిచ్చి కాస్తా ఓ నిండుప్రాణం పోయేందుకు కారణమైంది. పోలీసులు చెప్పిన దాని ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి...బీదర్‌లోని దోణగాపురకు చెందిన జయశ్రీ (31)కి రీల్స్ అంటే తెగ పిచ్చి. ఈమెకు కార్కడ సమీపంలోని గుండ్మిలో నివసించే కిరణ్ ఉపాధ్య (44)తో పెళ్లి అయ్యింది. కొంత కాలం సంసారం బాగానే నడిచింది కానీ.. జయశ్రీ నిత్యం రీల్స్ చేస్తూండటం కిరణ్‌కు ఏ మాత్రం నచ్చలేదు. అంతేకాదు... జయశ్రీ ఆన్లైన్ షాపింగ్ వ్యసనం విషయంలోనూ భార్య భర్తలిద్దరి మధ్య తరచూ గొడవలు అవుతూండేవి. తనకు పెద్ద ఇల్లు కావాలని... లగ్జరీ కారు.. నగదు కావాలని... గుడులలో వంటలకు సాయంగా పనిచేస్తున్న భర్త కిరణ్‌ను వేధించేది. ఇది కాస్తా వారిద్దరి మధ్య వివాదం మరింత ముదిరేందుకు కారణమైంది. ఇలాగే కొన్ని రోజుల క్రితం ఇద్దరి మధ్య రీల్స్ విషయమై వాదులాట మొదలైంది. ఈ క్రమంలోనే కిరణ్ కొడవలితో దాడి చేయడంతో జయశ్రీ మరణించింది. ఆ తరువాత బంధు మిత్రులకు ఫోన్ చేసి జయశ్రీ మొదటి అంతస్తులోంచి కిందకు పడిపోయిందని... స్పందన లేదని చెప్పాడు. వారి సలహాతో ఆంబులెన్స్‌కు ఫోన్ చేశాడు కూడా. అయితే జయశ్రీ ఆసుపత్రికి చేరే సమయానికి ప్రాణాలతో లేదని డాక్టర్లు ప్రకటించారు. అయితే... ఆసుపత్రి నుంచి తిరిగి వచ్చిన తరువాత కిరణ్ ప్రవర్తన తేడాగా ఉండటాన్ని చుట్టుపక్కల వాళ్లు గమనించారు. ఇంట్లో రక్తపు మరకల్ని తొలగించే ప్రయత్నం చేశాడు. అనుమానం కొద్దీ ఇరుగు పొరుగు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారు కిరణ్‌ను అరెస్ట్ చేసి విచారణ చేయడంతో అసలు విషయం బయటపడింది. కిరణ్ ముందస్తు ప్రణాళికతోనే జయశ్రీని హత్య చేశాడని, గత గురువారమే మార్కెట్లో కొత్త కొడవలిని కొనుగోలు చేశాడని స్థానికులు చెబుతున్నారు. రజని హైదరాబాద్ లోని ఒక కార్పొరేట్ హాస్పిటల్లో డాక్టర్థగా పనిచేస్తోంది. గత కొద్దికాలంగా ఆమెకు అంతా గందరగోళంగా అనిపిస్తోంది. తాను చేస్తున్నది రైటా, తప్పా అనే సందేహం తరచూ వేధిస్తోంది. ఆమె ఆత్మవిశ్వాసం బాగా దెబ్బతింది. నిరంతరం ఒత్తిడి, ఆందోళన ఫీలవుతోంది. ఎవరితోనూ మాట్లాడాలనిపించడం లేదు. ఒంటరితనం, భయం, నిస్సహాయత. దాంతో పేషంట్లను ట్రీట్ చేయడంలో కూడా నిర్ణయాలు తీసుకోలేకపోతోంది. చిన్న చిన్న విషయాలకు కూడా సారీ చెప్తోంది. నిద్ర పట్టడంలేదు. తలనొప్పి, కడుపు నొప్పి, ఇతర శారీరక సమస్యలు. డాక్టర్ కాబట్టి తనకు తానే వైద్యం చేసుకుంది. కానీ తగ్గడంలేదు. దాంతో ఇది శారీరకం కాదని, మానసికమని అర్థమై కౌన్సెలింగ్ కోసం వచ్చింది. తన సమస్య చెప్పింది. ఆమె బ్యాక్ గ్రౌండ్ గురించి చెప్పమని అడిగాను.అపనమ్మకం...రజనికి పెళ్లయి ఐదేళ్లయ్యింది. తన కొలీగ్ డాక్టర్ ఆనంద్ ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. రజని కొంచెం కలుపుగోలు మనిషి. అది ఆనంద్ కు నచ్చదు. ‘‘నీ పని నువ్వు చూసుకోక అందరితో అలా మాట్లాడతావెందుకు?’’ అని అడిగేవాడు. తరచూ రజనిపై కోప్పడేవాడు. ‘‘అందరితో బాగా నవ్వుతూ మాట్లాడతావ్. నాతో మాట్లాడాలంటే మాత్రం మొహం ముడుచుకుంటావ్. నీకంటికి నేను చేతకాని వాడిలా కనిపిస్తున్నా’’ అని దెప్పేవాడు. ‘‘అలాంటిదేం లేదు’’ అని చెప్పినా వినేవాడు కాదు. ‘‘యు ఆర్ నాట్ రైట్. నీకేదో సైకలాజికల్ ప్రాబ్లమ్ ఉన్నట్టుంది, ఒకసారి సైకియాట్రిస్ట్ ను కలువు’’ అని తరచూ అనేవాడు. కొన్నాళ్లకు రజని కూడా తన మానసిక స్థితి గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. ‘‘నిజంగానే నాకేమైనా మానసిక సమస్య ఉందేమో, లేదంటే ఆనంద్ ఎందుకలా అంటాడు’’ అని అనుకునేది.గ్యాస్ లైటింగ్... డాక్టర్ రజని చెప్పిందంతా విన్నాక ఆమె గ్యాస్ లైటింగ్ కు గురవుతుందని అర్థమైంది. గ్యాస్ గురించి అందరికీ తెలుసు. కానీ గ్యాస్ లైటింగ్ అంటే ఇంట్లో ఉన్న గ్యాస్ స్టవ్ ను వెలిగించేది కాదు. మాటలు, ప్రవర్తన ద్వారా మరోవ్యక్తి భావోద్వేగాలను కంట్రోల్ లో పెట్టుకోవడానికి కొందరు చేసే మేనిప్యులేషన్ ను ‘గ్యాస్ లైటింగ్’ అంటారు. ఇతరులపై ఆధిపత్యం చెలాయించాలనే కోరిక నుండి పుడుతుంది. తమ మాటే నెగ్గేలా, తమ దారికి అడ్డులేకుండా చేసుకోవడానికి అబద్ధాలు చెప్తారు, నిందలు వేస్తారు. తమ తప్పును కూడా భాగస్వామిపై తోసేసి తమ ప్రయోజనాలను కాపాడుకుంటారు. తనపై తనకు నమ్మకం కోల్పోయేలా చేస్తారు, చివరకు భాగస్వామి ఎమోషన్స్ పై కంట్రోల్ సాధిస్తారు. ముఖ్యంగా నార్సిసిస్టిక్ పర్సనాలిటీ, యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్స్ ఉన్నవారిలో ఈ ప్రవర్తన ఎక్కువగా కనిపిస్తుంది. డాక్టర్ ఆనంద్ అందులో మాస్టర్స్ డిగ్రీ సాధించాడని అర్థమైంది. కానీ తాను గ్యాస్ లైటింగ్ కు గురవుతున్న విషయాన్ని రజని గుర్తించలేకపోతోంది. అదే ఈ సమస్యలో ఉండే అసలు సమస్య. తనను మేనిప్యులేట్ చేస్తున్నారనే విషయం బాధితులకు తెలియదు, అసలా దిశగా ఆలోచించలేరు. ఎవరైనా చెప్పినా నమ్మరు.థెరపీతో పరిష్కారం... అందుకే మొదట రజనికి కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ద్వారా తన ఆలోచనల్లోని లోపాలు గుర్తించేలా, వాటిని సవాల్ చేసేలా చేశాను. ఆ తర్వాత గ్యాస్ లైటింగ్ గురించి, గ్యాస్ లైటర్ వాడే స్ట్రాటజీస్ గురించి వివరించాను. ఆనంద్ అలాగే చేస్తాడని చెప్పింది. తాను గ్యాస్ లైటింగ్ కు గురవుతున్నానని అర్థం చేసుకుంది. ఆ తర్వాత తన భద్రతకు సంబంధించిన ప్రణాళికను రూపొందించాను. తన బలాలు, సానుకూల లక్షణాలను గుర్తించి ఆత్మగౌరవంతో ప్రవర్తించేందుకు ఎక్సర్ సైజ్ లు నేర్పించాను. గ్యాస్ లైటింగ్ ను ఎలా ఎదుర్కోవాలో, ఒత్తిడిని, ఆందోళనను ఎలా మేనేజ్ చేసుకోవాలో వివరించాను. స్నేహితులు, కుటుంబ సభ్యుల మద్దతు తీసుకోమని ప్రోత్సహించాను. క్రమేపీ రజని తన కెరీర్ పై దృష్టి పెట్టింది. ఆనంద్ మాటలను పట్టించుకోవడం మానేసింది. రజని ఇంతకు ముందులా లేదన్న విషయం అర్థం చేసుకున్న ఆనంద్ కూడా తన ప్రవర్తను మార్చుకున్నాడు. మూడు నెలల్లో సమస్య పరిష్కారమైంది.గ్యాస్ లైటర్లు తరచూ వాడే వాక్యాలు⇒నువ్వు ప్రతిదానికీ ఓవర్ రియాక్ట్ అవుతున్నావ్. ⇒అందుకే నీకెవ్వరూ ఫ్రెండ్స్ లేరు. ⇒నీకోసమే అలా చేశాను. ⇒నీకోసం అంత చేస్తే నన్నే అనుమానిస్తావా?⇒నేను నీకు చెప్పాను, గుర్తులేదా? ⇒అలా ఏం జరగలేదు, నువ్వే ఊహించుకుంటున్నావ్. ⇒ నీపట్ల నాకెప్పుడూ నెగెటివ్ ఒపీనియన్ లేదు. నువ్వే నన్ను నెగెటివ్ గా చూస్తున్నావ్.వాళ్ల మాటలు నమ్మొద్దు⇒గ్యాస్ లైటర్లతో వాదనలకు దూరంగా ఉండాలి. లేదంటే మీ మాటలే మీపై ప్రయోగిస్తారు. ⇒గ్యాస్ లైటర్లు చెప్పేదొకటి, చేసేదొకటి కాబట్టి వాళ్లు చెప్పేదానిపై కాకుండా చేసే పనులపై దృష్టి పెట్టాలి. ⇒‘‘నీకు పిచ్చి’’ అని మిమ్మల్ని మీరే అనుమానించుకునేలా చేసేవారి మాటలు పట్టించుకోకూడదు. ⇒‘‘నేను చెప్పాను, నీకే గుర్తులేదు’’ అనే మాటలు నమ్మకూడదు. మీకెంత వరకూ గుర్తుందే అదే నిజమని గుర్తించాలి. ⇒గ్యాస్ లైటర్లు ముందుగా మీ కుటుంబ సభ్యులను, స్నేహితులను బుట్టలో వేసుకుంటారు. కాబట్టి గ్యాస్ లైటర్ కు మద్దతుగా వాళ్లు చెప్పే మాటలు పట్టించుకోకూడదు. ⇒గ్యాస్ లైటర్ తో ఉండే బంధం కన్నా మీరు సురక్షితంగా ఉండటం ముఖ్యమని గుర్తించాలి. ⇒మీ భద్రతకు ప్రమాదమని భావిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ బంధం నుంచి బయటకు వచ్చేయాలి.సైకాలజిస్ట్ విశేష్8019 000066www.psyvisesh.com -
అత్యాచారానికి ముందు ప్లాట్‌ఫారంపై ఐదుగురిని..
క్రైమ్: దేశ వాణిజ్య రాజధానిలో కాలేజీ యువతిపై చోటు చేసుకున్న అత్యాచార ఘటనలో మరో విషయం వెలుగు చూసింది. ముంబై లోకల్ ట్రైన్లో 20 ఏళ్ల కాలేజీ స్టూడెంట్‌పై లైంగిక దాడికి తెగబడిన 40 ఏళ్ల నవాజూ కరీం షేక్.. ఆ అఘాయిత్యానికి ముందు ప్లాట్‌ఫాంపైనా ఐదుగురిని వేధించాడు కూడా. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. దాడి జరిగిన అదే రోజు ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్‌లోని ప్లాట్‌ఫాం నెంబర్ 1 పైనా ఐదుగురిని వేధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఎరుపు రంగు టీషర్ట్‌లో కరీం.. ఐదుగురు మహిళా ప్రయాణికుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ ఫుటేజీల్లో నమోదు అయ్యాయి. వాళ్లను చూస్తూ అసభ్యంగా సైగలు చేయడంతో పాటు వాళ్లను తాకేందుకు సైతం ప్రయత్నించాడు. అయితే ఈ ఘటనలకు సంబంధించి ఎవరూ ఫిర్యాదులు మాత్రం చేయలేదు. బుధవారం నాడు కాలేజీ నుంచి ఇంటికి వెళ్తున్న క్రమంలో లోకల్ ట్రైన్లో ఒంటరిగా ఉన్న యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు నవాజూ కరీం. అంతకు ముందు ఆమె ఎక్కడికి వెళ్లినా అతను ఫాలో అయినట్లు పోలీసులు గుర్తించారు. అత్యాచారం అనంతరం బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. రైల్వే పోలీసుల సాయంతో ఆ రాత్రే నిందితుడు కరీంను అరెస్ట్ చేశారు. ఇదీ చదవండి: ఎంగేజ్మెంట్ అయిన ఆనందం ఆవిరి -
మత్తు మందు ఇచ్చి మృగవాంఛ తీర్చుకున్నాడు
NRI Crime News: మాయ మాటలు చెప్పి స్నేహం చేశాడు. అబద్దాలతో ఆకట్టుకున్నాడు. డ్రగ్స్ ఇచ్చి అచేతన స్థితిలోకి తీసుకెళ్లి.. మరీ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ మృగచేష్టలను తన ఫోన్లో బంధించి ఆనందం పొందాడు. ఒకరు కాదు.. ఐదుగురిపై అలా చేశాడు. రాజకీయ నేపథ్యం ఉన్న కారణంగా నేరాల నుంచి బయటపడొచ్చని భావించాడు. కానీ, ఆ కామాంధుడి పాపం పండింది. ఆస్ట్రేలియాలో భారత కమ్యూనిటీకి ప్రముఖుడు బాలేష్ ధన్కడ్ను.. సిడ్నీ డౌనింగ్ సెంటర్ కోర్టు సోమవారం అత్యాచార కేసుల్లో దోషిగా తేల్చింది. ఐదుగురు కొరియన్ యువతులను మభ్య పెట్టి, వాళ్లను మత్తుమందు ఇచ్చి మరీ అత్యాచారం చేశాడని నిర్ధారించింది. రాజకీయ బలం ఉన్న మానవ మృగంగా కోర్టు.. సిడ్నీ చరిత్రలోనే నీచమైన రేపిస్ట్‌గా అక్కడి మీడియా బాలేష్‌ను అభివర్ణించడం గమనార్హం. 👉బాలేష్ ధన్కడ్(43) ఓ డేటా ఎక్స్పర్ట్. అతనికి వ్యతిరేకంగా 39 అభియోగాలు నమోదు అయ్యాయి. యువతులతో స్నేహం నటించి.. వాళ్లకు ఇంటికి, హోటల్స్‌కు తీసుకెళ్లి డ్రగ్స్ ఇచ్చి ఆపై అకృత్యాలకు పాల్పడే వాడు. లైంగిక దాడుల్ని తన ఫోన్‌తో పాటు అలారం క్లాక్‌లో దాచిన సీక్రెట్ కెమెరాలోనూ బంధించినట్లు తెలుస్తోంది. 👉జడ్జి మైకేల్ కింగ్ బెయిల్‌కు నిరాకరించడంతో బాలేష్ కోర్టులోనే కన్నీటి పర్యంతం అయ్యాడు. అక్కడే అతని భార్య సైతం కన్నీళ్లు పెట్టుకుంది. బాలేష్ మళ్లీ మే నెలలో కోర్టు ముందు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ ఏడాదిలోనే అతని శిక్షలు ఖరారు అవుతాయి కూడా. 👉ఇదిలా ఉంటే బాలేష్.. బీజేపీ మాజీ సభ్యుడు. ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ ది బీజేపీకి గతంలో చీఫ్‌గా పని చేశాడు. ప్రధాని మోదీని సైతం కలిసిన పలు ఫొటోలు వైరల్ అయ్యాయి కూడా. 👉తన వైవాహిక జీవితం అస్తవ్యస్తం కావడంతోనే తాను అబద్ధాలతో యువతులను ఆకట్టుకున్నానని బాలేష్ అంటున్నాడు. అంతేకాదు.. కోర్టు, లాయర్ ఫీజుల కోసం ఆస్తులను అమ్ముకున్నట్లు వెల్లడించాడు. 👉2018లోనే బాలేష్ ధన్కడ్ కీచక పర్వం వెలుగు చూసింది. ఇతర మహిళలతో సన్నిహితంగా ఉన్న డజనుకుపైగా వీడియోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతని మృగచేష్టలతో కూడిన ఆ వీడియోల్ని చూసి జ్యూరీ సైతం ఉలిక్కిపడింది. -
అది అత్యాచారం కిందకు రాదు.. ఒరిస్సా హైకోర్టు కీలక తీర్పు..
భువనేశ్వర్: ఒరిస్సా హైకోర్టు సోమవారం కీలక తీర్పు వెలువరించింది. అత్యాచారం కేసులో నిందితుడికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పరస్పర అంగీకారంతో శృంగారంలో పాల్గొంటే అది అత్యాచారం కిందకు రాదని స్పష్టం చేసింది. ఏంటీ కేసు..? నిమపారకు చెందిన ఓ మహిళ ఓ వ్యక్తితో ప్రేమలో పడింది. అతను ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. భువనేశ్వర్ తీసుకెళ్లి ఆమెతో కొన్ని రోజులు సహజీవనం చేశాడు. ఉన్నట్టుండి ఒకరోజు ఆమెను వదిలి పారిపోయాడు. దీంతో మహిళ అతడిపై కేసు పెట్టింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని, అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపించింది. దీంతో పోలీసులు అతడ్ని అరెస్టు చేశారు. నిందితుడు జిల్లా కోర్టులో బెయిల్‌కు దరఖాస్తు చేసుకుంటే న్యాయస్థానం నిరాకరించింది. అయితే అతడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. వాదనలు విన్న న్యాయస్థానం నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది. పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చినప్పటికీ ఇద్దరు పరస్పర అంగీకారంతోనే సహజీవనం చేసిందున దీన్ని అత్యాచారంగా పరిగణించలేమని న్యాయస్థానం చెప్పింది. నిందితుడికి షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. అలాగే మహిళను బెదిరించవద్దని అతన్ని ఆదేశించింది. కేసు విచారణకు సహకరించాలని స్పష్టం చేసింది. చదవండి: విమానంలో మందుబాబుల హల్చల్.. ఎయిర్‌హోస్టస్‌తో అసభ్యకరంగా.. -
వరంగల్‌లో అమానుషం.. అన్నా అని పిలిచినా వదల్లేదు..
ఖిలా వరంగల్: తెలిసీ తెలియని వయసు.. దగ్గరలోనే ఇల్లు.. ఆ బాలికకు మాయమాటలు చెప్పిన ఇద్దరు అన్నదమ్ములు శారీరకంగా లొంగదీసుకున్నారు. పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన గురువారం వరంగల్‌లో వెలుగులోకి వచి్చంది. పోలీసుల కథనం ప్రకారం.. బతుకుదెరువు కోసం ఇద్దరు కుమార్తెలతో కలసి దంపతులు వరంగల్‌కు వలస వచ్చారు. వెంకట్రామ జంక్షన్ సమీప కాలనీలోని బంధువుల ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. వారి పెద్ద కుమార్తె పదో తరగతి, చిన్న కుమార్తె 8వ తరగతి చదువుతున్నారు. కాగా, దయానంద్ కాలనీకి చెందిన ఓ పాత ఫరి్నచర్ షాపు యాజమాని ఎండీ ఆయూబ్ అలీకి అజ్మత్ అలీ(26), అక్బర్ అలీ(22) అనే కుమారులు ఉన్నారు. వీరిద్దరూ పదో తరగతి చదివే బాలికపై కన్నేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ బాలికతో వీరికి పరిచయం ఏర్పడింది. బాలిక ఇద్దరినీ అన్నా అంటూ పిలిచేది. దీంతో వారి మధ్య చనువు ఏర్పడింది. కానీ అన్నదమ్ములు ఆ బాలికకు మాయమాటలు చెప్పి, ఒంటరిగా ఉన్నది చూసి ఇంట్లోకి రప్పించుకుని ఒకరికి తెలియకుండా మరొకరు అత్యాచారానికి పాల్పడ్డారు. ఇలా ఆరునెలలుగా బాలికపై పలుమార్లు వేర్వేరుగా లైంగికదాడికి పాల్పడ్డారు. బాలిక ఇన్‌స్టాగ్రామ్‌కు వారు అసభ్యకరమైన మెసేజ్‌లు పోస్ట్ చేయడంతో ఇటీవల విషయం తండ్రికి తెలిసింది. తల్లిదండ్రులు కుమార్తెను నిలదీయడంతో అన్నదమ్ములు అత్యాచారానికి పాల్పడినట్లు చెప్పింది. బాలిక తల్లి బుధవారం రాత్రి మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్‌లో ఎండీ అజ్మత్ అలీ, అక్బర్ అలీపై ఫిర్యాదు చేసింది. నిందితులిద్దరిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ ముస్క శ్రీనివాస్ తెలిపారు. నిందితులిద్దరినీ పోలీసులు బుధవారం రాత్రే అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. దీనిపై ఇన్స్పెక్టర్ను వివరణ కోరగా నిందితులు పరారీలోనే ఉన్నారని తెలిపారు. బాలికపై ఇద్దరు యువకులు లైంగికదాడికి పాల్పడిన ఘటనను నిరసిస్తూ గురువారం బంధువులు, స్థానికులు ఆందోళనకు దిగారు. నిందితుల ఇంటిపై దాడి చేసి కిటికీ అద్దాలు, ఆవరణలోని ద్విచక్రవాహనాలను ధ్వంసం చేశారు. అనంతరం బీజేపీ ఆధ్వర్యంలో వెంకట్రామ జంక్షన్ నర్సంపేట రోడ్డుపై ధర్నా నిర్వహించారు. కాగా, వరంగల్ ఏసీపీ కల్కోట్లు గిరికుమార్ బాలికను, ఆమె తల్లిదండ్రులను పరామర్శించారు. -
కర్ణాటక మఠాధిపతి లైంగిక వేధింపుల కేసులో కీలక మలుపు
బెంగళూరు: కర్ణాటకలో సంచలనం సృష్టించిన మఠాధిపతి శివమూర్తి మూరుగ లైంగిక వేధింపుల కేసు కీలక మలుపు తిరిగింది. అత్యాచార ఆరోపణల నేపథ్యంలో బాధిత బాలికలకు వైద్య పరీక్షలు నిర్వహించగా వారిపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని తేలింది. టీనేజ్ బాలికలకు చిత్రదుర్గ జిల్లా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన నివేదిక తాజాగా బయటకొచ్చింది. ఇందులో బాలికలపై అత్యాచారం జరిగినట్లు కనిపించలేదని.. వారి జననాంగాల్లో ఎలాంటి గాయాలు గుర్తించలేదని వెల్లడైంది. కాగా 2019 నుంచి 2022 వరకు మురుగ మఠం పీఠాధిపతి డాక్టర్ శివమూర్తి మురుగ శరణారావు స్వామిజీ తమను లైంగిక వేధింపులకు గురిచేసినట్లు ఆయన ఆశ్రమంలో చదువుకుంటున్న ఇద్దరు బాలికలు ఆరోపించిన విషయం తెలిసిందే. బాలికల ఫిర్యాదు మేరకు మైసూరు పోలీసు స్టేషన్లో ఆగష్టు 26న శివమూర్తిపై పోక్సో కేసు నమోదైంది. తరువాత కేసును చిత్రదుర్గ గ్రామీణ పోలీస్ స్టేసన్‌కు బదిలీ చేశారు. రాష్ట్రంలో మఠాధిపతికి వ్యతిరేకంగా తీవ్ర దుమారం రేగడంతో పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి చిత్రదుర్గ జిల్లా జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. కేసు నమోదు చేసిన రెండు రోజులకు బాలికలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. చిత్రదుర్గలోని ఆశ్రమంలో తమపై పదేపదే లైంగిక వేధింపులకు పాల్పడినట్లు వెల్లడించిన మైనర్ బాలికల స్టేట్మెంట్కు విరుద్ధంగా మెడికల్ రిపోర్టులో వెల్లడైంది. తాజాగా ఆ నివేదికను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు(ఎఫ్ఎస్ఎల్) పంపించారు. అయితే ఫైనల్ రిపోర్ట్ ఎఫ్ఎస్ఎల్ నివేదికపై ఆధారపడి ఉండనున్నట్లు వైద్య పరీక్షల నివేదికలో పేర్కొన్నారు. అయితే అక్టోబర్‌లో మరో నలుగురు బాలికలు శివమూర్తిపై ఇవే ఆరోపణలు చేశారు. కానీ వారి వైద్య పరీక్షల నివేదికలు ఇంకా రావాల్సి ఉంది. చదవండి: : డాక్టర్ నిర్వాకం..ప్రసవ వేదనతో వచ్చిన మహిళ కడుపులో టవల్ ఉంచేసి.. -
సూపర్ మార్కెట్లో టీమిండియా క్రికెటర్ గొడవ
టీమిండియా మహిళా క్రికెటర్ రాజేశ్వరి గైక్వాడ్ తన చర్యలతో వార్తల్లో నిలిచింది. ఒక సూపర్ మార్కెట్లో సిబ్బందితో గొడవపడింది. తన స్నేహితులతో కలిసి సూపర్ మార్కెట్‌కు వచ్చిన ఆమె ఏదో విషయమై సిబ్బందితో వాగ్వాదానికి దిగింది. కాసేపటికే ఆ గొడవ పెద్దదిగా మారింది. ఎంతలా అంటే రాజేశ్వరి గైక్వాడ్ కోపంతో ఊగిపోతూ వారిపై దాడి చేసే వరకు వెళ్లింది. కర్నాటకలోని బీజాపూర్‌లో ఈ ఘటన జరిగింది. గొడవ చేసిన తర్వాత రాజేశ్వరి గైక్వాడ్ అక్కడి నుంచి వెళ్లిపోయినప్పటికి తర్వాత ఆమె సన్నిహితులు వచ్చి సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. ఈ గొడవకు సంబంధించిందంతా అక్కడి సీసీటీవీ ఫుటేజీల్లో రికార్డయింది.దీంతో సూపర్ మార్కెట్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయాలని భావించారు. అయితే ఆ తర్వాత రాజేశ్వరితోపాటు సూపర్ మార్కెట్ సిబ్బంది సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకున్నారు. ఈ గొడవకు సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని స్థానిక పోలీసులు వెల్లడించారు. 2014లో ఇండియా తరఫున శ్రీలంకతో మ్యాచ్ ద్వారా రాజేశ్వరి గైక్వాడ్ అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసింది. 2017లో వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ చేరిన ఇండియన్ టీమ్‌లో రాజేశ్వరి సభ్యురాలు. అదే వరల్డ్‌కప్‌లో తన అత్యుత్తమ ప్రదర్శన కూడా చేసింది. మహిళల క్రికెట్ వరల్డ్‌కప్ చరిత్రలో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో ఇండియా తరఫున అత్యుత్తమ గణాంకాలు (5/15) నమోదు చేసింది. -
రేప్ బాధితురాళ్లపై అలాంటి పరీక్షా? ఆపేయండి!
న్యూఢిల్లీ: బాధితురాళ్లపై లైంగిక దాడి/అత్యాచార నిర్ధారణ పేరిట దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘టూ ఫింగర్ టెస్ట్’ విధానాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పుబట్టింది. అంతేకాదు.. తక్షణమే ఈ విధానం నిలిచిపోయేలా చూడాలంటూ కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ హిమా కోహ్లి నేతృత్వంలోని ధర్మాసనం.. ఓ అత్యాచార కేసు విచారణ సందర్భంగా కీలక ఆదేశాలు జారీ చేసింది. అత్యాచార నిర్ధారణ పరీక్షగా పేరొందిన టూ ఫింగర్ టెస్ట్ విధానాన్ని సుప్రీం కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ఈ విధానానికి ఎలాంటి శాస్త్రీయత లేదని, పైగా మహిళలను మళ్లీ గాయపర్చడంతో పాటు.. వాళ్ల మానసిక స్థితిపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపెడుతుందని ధర్మాసనం అభిప్రాయపడింది. ఇక నుంచి బాధితురాలి మీద ‘టూ ఫింగర్ టెస్ట్’ గనుక నిర్వహిస్తే.. దుష్ప్రవర్తన కిందకు వస్తుందని, అలాంటి పరీక్షలను నిర్వహించే వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది. "కేవలం లైంగికంగా చురుకుగా ఉన్నందువల్లే ఆమె అత్యాచారానికి గురైందని నిర్ధారించడం హేయనీయమని.. అది నమ్మశక్యం కాదని.. అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ మేరకు కేంద్రంతో పాటు అన్ని రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల పాఠ్యాంశాలను సమీక్షించాలని, స్టడీ మెటీరియల్స్ నుంచి ‘టూ ఫింగర్ టెస్ట్’ విధానాన్ని తొలగించాలని ఆదేశించింది. మరోవైపు.. ఆరోగ్య శాఖను ఈ విధానానికి ముగింపు పలికే విధంగా హెల్త్ వర్కర్స్కు ప్రత్యామ్నాయ పద్ధతుల మీద వర్క్‌షాపులతో అవగాహన కల్పించాలని కోరింది. ఇదిలా ఉంటే 2013లోనూ సుప్రీం కోర్టు టూ ఫింగర్ టెస్ట్‌ను తప్పుబట్టింది. ఇది మహిళల గౌరవం, గోప్యతలను దెబ్బ తీస్తుందని పేర్కొంది. -
పట్టపగలే యూపీలో దారుణం.. షాకింగ్ వీడియో
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లో రోజురోజుకూ మహిళలపై దాడులు, హింసాత్మక ఘటనలు పెరిగిపోతున్నాయి. రెండు క్రితమే యూపీలో కొందరు వ్యక్తులు ఓ మహిళకు మద్యం తాగించి సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన మరువకముందే మరో దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మతిస్థిమితం సరిగాలేని ఓ యువతి పట్ల కొందరు వ్యక్తులు అనుచితంగా ప్రవర్తించారు. ఈ ఘటనపై మీరట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దౌరాలా పోలీస్ స్టేషన్ పరిధిలో సెప్టెంబర్ 19వ తేదీన కొందరు వ్యక్తులు పట్టపగలే ఓ యువతిని దారుణంగా కొట్టారు. ఇద్దరు వ్యక్తులు.. ఆమె కాళ్లు, చేతులను పట్టుకుని ఈడ్చుకెళ్లారు. అనంతరం, వారు ఆమెపై దాడి చేశారు. ఈ క్రమంలోనే బాధితురాలు సహాయం కోసం వేడుకుంది. తనను వదిలేయాలని గట్టిగా అరుస్తూ కేకలు వేసింది. ఈ ఘటన సందర్భంగా చుట్టుపక్కలు చాలా మంది ఉన్నప్పటికీ ఆమెను ఎవరూ కాపాడలేదు. ఆమెపై దాడిని కొందరు మొబైల్ ఫోన్లలో రికార్డు చేశారు. తాజాగా ఈ వీడియో పోలీసులకు చేరింది. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం బాధితురాలికి బరేలీలోని ఆసుప్రతిలో వైద్య చికిత్సలు అందిస్తున్నామని అన్నారు. ఇదిలా ఉండగా.. రెండు రోజుల క్రితమే యూపీలోని బదోస్ రాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన మహిళపై సామూహిక లైంగిక దాడి జరిగింది. బాధితురాలికి తెలిసిన వ్యక్తి ఆమెను.. తన భర్త పిలుస్తున్నాడని చెప్పి ఆమెను గ్రామ శివారులోని చెరువు వద్దకు తీసుకువెళ్లాడు.అప్పటికే అక్కడ మరో ముగ్గురు యువకులు ఉన్నారు. వారంతా తనకు తెలిసిన వారే కావడంతో మాట్లాడింది. అనంతరం, నిందితులు ఆమెతో బలవంతంగా మద్యం తాగించారు. ఆ తరువాత వరుసగా ఆమె మీద అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని బెదిరించారు. దీంతో, కొన్ని రోజులు మౌనంగా బాధను దిగమింగిన మహిళ.. చివరకు ధైర్యం చేసి భర్తకు జరిగిన విషయం చెప్పింది. అనంతరం, వారు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారు. మిగతా ముగ్గురి కోసం గాలిస్తున్నారు. మరోవైపు.. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) తాజా డేటా ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లో 2022 జనవరి నుండి ఆగస్టు వరకు మహిళలపై నేరాలకు సంబంధించి మొత్తం 56,083 కేసులను నమోదు చేసింది, ప్రతి లక్ష జనాభాకు 50.5 నేరాల రేటుగా నమోదైంది. మహిళలపై నేరాలకు సంబంధించి దాదాపు 31,000 ఫిర్యాదులు గత ఏడాది జాతీయ మహిళా కమిషన్ (NCW)కి అందాయి. యూపీలో 2020తో పోలిస్తే 2021లో మహిళలపై నేరాల ఫిర్యాదులు 30 శాతం పెరిగాయి. -
అత్యాచార పర్వం.. ఎమర్జెన్సీ విధింపు
పాకిస్థాన్ పంజాబ్ ప్రావిన్స్‌లో అత్యవసర పరిస్థితి విధించారు. మహిళలపై చిన్నారులపై అఘాయిత్య ఘటనలు పెరిగిపోతుండడంతో అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మహిళలకు, పిల్లలకు భద్రతగా కూడా పోలీసులు వెళ్తుండడం కనిపిస్తోంది అక్కడ. సమాజంలో ఇలాంటి(అఘాయిత్యాలు) ఘటనలను తమ ప్రభుత్వం తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంటుందని పంజాబ్ హోం మంత్రి అట్టా తరార్ ప్రకటించారు. పంజాబ్‌లో ప్రతిరోజూ నాలుగు నుండి ఐదు అత్యాచార కేసులు నమోదవుతున్నాయి. లైంగిక వేధింపులను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలను పరిశీలిస్తోంది. ఇందులో భాగంగానే అత్యవసర పరిస్థితి అని పేర్కొన్నారాయన. మేధావులు, ఉపాధ్యాయులు, మహిళా సంఘాలు, న్యాయ నిపుణులు.. ఈ అంశంపై ప్రభుత్వంతో చర్చించేందుకు ముందుకు రావాలని పిలుపు ఇచ్చింది ప్రభుత్వం. అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లలను రక్షించుకోవడం మీద దృష్టి సారించాలని పేర్కొంటోంది. కరోనా టైం నుంచి పాక్‌లో మహిళల మీద, పిల్లల మీద అఘాయిత్యాలు విపరీతంగా పెరిగిపోయాయి. -
మనిషే కాదు వీడు.. వింటే వెన్నులో వణుకుపుట్టడం ఖాయం
Sakinaka Case: వావీవరుసలు లేని మానవ మృగం.. ఒంటరి మహిళపై అఘాయిత్యానికి తెగపడింది. అంతటితో ఆగలేదు.. పైశాచికత్వం ప్రదర్శించింది. వదిలేయమని బాధితురాలు బతిమాలినా వినలేదు. ఫలితం.. ప్రాణం కోసం పోరాడి కన్నుమూసింది. సంచలనం సృష్టించిన సాకినక ‘నిర్భయ’ కేసులో దోషికి మరణ శిక్ష ఖరారైంది. బాధిత కుటుంబం, న్యాయం కోసం తొమ్మిది నెలలపాటు పోరాడిన వాళ్ల ముఖాల్లో సంతోషం వెల్లివిరిసింది. మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన.. సాకినక(ముంబై, అంధేరీ) అత్యాచారం, హత్య కేసులో దోషి మోహన్ కథ్వారు చౌహాన్ .. దిన్దోషి కోర్టు గురువారం మరణ శిక్ష ఖరారు చేసింది. ఇది అత్యంత అరుదైన కేసుగా అభివర్ణించిన అదనపు సెషన్స్ జడ్జి హెస్.సి.షిండే.. ఇలాంటి సంఘటనల్లో దోషిపై కనికరం చూపాల్సిన అవసరం ఎంతమాత్రం లేదని తేల్చిచెప్పింది. స్వయానా నిందితుడి తండ్రే.. తన కొడుకును ఛీదరించుకున్నాడని, ఉరి తీయాలంటూ వ్యాఖ్యానించాడని, పైగా తన సోదరుడి కూతురిని అత్యాచారం చేస్తానని బెదిరించడం.. అతని స్వభావానికి అద్దం పడుతోందని, ఇంతకన్నా అతనికి మరణ శిక్ష విధించడానికి కారణాలు అక్కర్లదేని ఆయన అన్నారు. ‘‘ఇదొక భయానకం. బాధితురాలితో చౌహాన్ రాక్షసంగా ప్రవర్తించాడు. వీడు మనిషి కాదు.. కిరాతకుడు. అత్యాచారానికి పాల్పడ్డ తీరును తలచుకొంటేనే వెన్నులో వణుకు పుడుతోంది. ఇది అత్యంత అరుదైన కేసు కిందికి వస్తుంది’’ అని పేర్కొన్నారు. మరణ శిక్ష విధిస్తేనే సమాజంలోకి సరైన సందేశం వెళ్తుందన్నారు. మరణ శిక్షతో పాటు 32 వేల రూపాయల జరిమానా విధించారు జడ్జి. ఘోరంగా.. మోహన్ కథ్వారు చౌహాన్ (45).. యూపీకి చెందిన వ్యక్తి. అతని ప్రవర్తన సరిగా లేకపోవడంతో ఇంట్లోంచి గెంటేశారు. దీంతో భార్యాపిల్లలతో సహా ముంబై వచ్చి.. కూలీ పనులు చేసుకుంటున్నాడు. 2021 సెప్టెంబర్ 10న ముంబైలో నిలిపి ఉంచిన టెంపోలో.. 34 ఏళ్ల మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై పదునైన వస్తువులతో ఆమె జనానాంగాలను గాయపరిచాడు. ఈ ఘోరంతో తీవ్రంగా గాయపడిన బాధితురాలు.. చికిత్స పొందుతూ కన్నుమూసింది. మరో నిర్భయ ఘటనగా ఇది సంచలనం సృష్టించింది. బాధితురాలు దళితురాలు కావడంతో ఈ కేసు.. ప్రముఖంగా చర్చల్లో నిలిచింది. దీంతో ఈ కేసు విచారణ కోసం ప్రత్యేక చొవర చూపించారు సీఎం ఉద్దవ్ థాక్రే. ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత పోలీసులకు పట్టుబడ్డాడు మోహన్ చౌహాన్. ఈ కేసులో చౌహాన్ తరపున వాదించేందుకు లాయర్లు ముందుకు రాలేదు. దీంతో ప్రభుత్వమే.. న్యాయవాదిని ఏర్పాటు చేసింది. అడ్వొకేట్ కల్పన వాస్కర్.. చౌహాన్ తరపున వాదనలు వినిపించారు. అతని ఆర్థిక స్థితి, భార్య అనారోగ్యం దృష్టిలో ఉంచుకుని శిక్షను ఖరారు చేయాలని విజ్ఞప్తి చేశారు. కానీ, కోర్టు ఆమె వాదనను తోసిపుచ్చింది. ఇదిలా ఉంటే.. వాదనల సమయంలోనూ చౌహాన్ పదే పదే జోక్యం చేసుకోవడం న్యాయమూర్తిని చిరాకు తెప్పించింది. తాను అమాయకుడినని, మద్యం మత్తులో అలా జరిగిపోయిందని, పోలీసులు ఈ కేసులో పోలీసులు గోల్మాల్ చేశారంటూ మాట్లాడాడు. దీంతో జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీసీ ఫుటేజీ మీద ఏం స్పందిస్తావ్ అంటూ నిలదీశారు. పైగా సొంత అన్న కూతురిపైనే అఘాయిత్యం చేస్తానని మోహన్ బెదిరించడాన్ని ప్రస్తావించారు. మహిళలపట్ల ఏమాత్రం గౌరవం లేని మృగంగా అభివర్ణించింది చౌహాన్‌ను న్యాయస్థానం. -
Digital Rape: డిజిటల్ రేప్ కింద వృద్ధుడి అరెస్ట్
నోయిడా: తన కూతురికి చదువు చెప్పిస్తాడేమో అనే ఉద్దేశంతో అతని దగ్గరికి పంపిస్తే.. ఆ వృద్ధుడు మాత్రం లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఒకటి కాదు రెండు కాదు.. అలా ఏడేళ్లపాటు అసాధారణ రీతిలో సాగింది ఆ వ్యవహారం. చివరికి బాధితురాలు ధైర్యం చేయడంతో ఈ వేధింపుల పర్వం వెలుగు చూసింది. నిందితుడి మౌరైస్ రైడర్ వయసు 81 ఏళ్లు. వృత్తి రిత్యా పెయింటింగ్ ఆర్టిస్ట్, టీచర్ కూడా. హిమాచల్ ప్రదేశ్‌లో అతనికొ ఒక ఆఫీస్ ఉంది. ఏడేళ్ల కిందట అతని దగ్గర పని చేసే ఓ వ్యక్తి.. తన కూతురిని ఆ వృద్ధుడి దగ్గరకు సాయంగా పంపించాడు. బదులుగా ఆమెకు చదువు చెప్పిస్తానని హామీ ఇచ్చాడు ఆ వృద్ధుడు. అయితే ఆనాటి నుంచి వృద్ధుడు ఆమెను లైంగికంగా వేధిస్తూ వస్తున్నాడు. తండ్రికి చెబితే ఆ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తానని బెదిరిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో ఆమె భరిస్తూ వచ్చింది. చివరికి.. ఆ వృద్ధుడి ఆగడాలు తట్టుకోలేక ఆ టీనేజర్ ధైర్యం తెచ్చుకుంది. గత నెల రోజులుగా మౌరైస్ బాగోతాలను రికార్డు చేస్తూ వచ్చింది. అందులో చాలావరకు ఆడియో ఫైల్స్ ఉన్నాయి. చివరకు వాటిని ఓ మహిళకు అప్పగించి, ఆమె సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేయించింది. దీంతో గౌతమ్ బుద్ధ నగర్ పోలీసులు(నోయిడా, యూపీ).. ఆదివారం డిజిటల్ రేప్ నేరం కింద మౌరైస్‌ను అరెస్ట్ చేశారు. డిజిటల్ రేప్ అంటే.. చాలామంది ఆన్లైన్ సంబంధిత నేరం అనుకుంటారు. కానీ, డిజిటల్ రేప్ మర్మాంగం కాకుండా ఏదేని వస్తువు, ఆయుధాలను, చేతి వేళ్లను ఉపయోగించి అసహజరీతిలో లైంగిక దాడులకు పాల్పడడం. ఇంగ్లీష్ డిక్షనరీలో డిజిటల్ అనే పదానికి అర్థంతో ఈ నేరానికి ఆ పేరొచ్చింది. గతంలో ఇది అత్యాచారం కిందకు వచ్చేది కాదు. కానీ, 2012 నిర్భయ ఘటన తర్వాత డిజిటల్ రేప్‌ను అమలులోకి తీసుకొచ్చారు. డిజిటల్ రేప్ కింద.. ఒక వ్యక్తికి కనీసం ఐదేళ్లు, గరిష్టంగా పదేళ్లు.. ఒక్కోసారి జీవిత ఖైదు విధిస్తారు. ఈ తరహా ఘటనల్లో 70 శాతం దగ్గరి వాళ్ల వల్లనే జరుగుతున్నాయి. కాబట్టే.. చాలా చాలా తక్కువ కేసులు నమోదు అవుతున్నాయి. చదవండి: పెదాలపై ముద్దు పెట్టుకోవడం అసహజ నేరం కాదు -
ఆడవాళ్లెవరూ అలా మాట్లాడరు: దీదీపై కుష్భూ ఫైర్
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ హన్స్‌ఖలీ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ అఘాయిత్యానికి పాల్పడింది అధికార టీఎంసీ నేత కొడుకే కారణమంటూ ఆరోపణలు వస్తుండగా.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు మరింత కోపాన్ని తెప్పిస్తున్నాయి. ఈ తరుణంలో.. ఐదుగురు సభ్యులతో కూడిన బీజేపీ నిజనిర్ధారణ కమిటీ ఇవాళ(శుక్రవారం) హన్స్‌ఖలీలో పర్యటించింది. బాధిత కుటుంబాన్ని పర్యటించి.. పూర్తి వివరాలను సేకరించింది. చేసిన వ్యాఖ్యలకు సీఎం మమతా బెనర్జీ క్షమాపణ చెప్పాలని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది ఆ కమిటీ డిమాండ్ చేసింది. ఇక ఈ కమిటీలో సభ్యురాలైన బీజేపీ నాయకురాలు, సినీ నటి ఖుష్బూ మాట్లాడుతూ... ఈ హత్యాచారాన్ని పక్కదోవ పట్టించేందుకు మమతా బెనర్జీ దారుణమైన వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. ఆమె అత్యాచారానికి గురయిందా? లేదంటే ప్రేమ వ్యవహారం కారణమా? అనే విషయం ఆమె కుటుంబసభ్యులకు తెలుసు. ఒకవేళ వారు ప్రేమలో ఉంటే వారిని నేనెలా ఆపగలను?... సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు మరోవైపు ఒక మహిళ అయివుండి కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు కుష్భూ. ఆడవాళ్లెవరూ అలా మాట్లాడరని, ఆమె మీద నమ్మకంతో అధికారం ఇచ్చిన ప్రజలను చిన్నచూపు చూస్తున్నారంటూ మండిపడ్డారు. ఇద్దరు బిడ్డల తల్లిగా బాధిత కుటుంబం ఆవేదనను, బాధను తాను అర్థం చేసుకోగలనని, మమతా బెనర్జీ చేసిన ప్రకటన పూర్తిగా క్రూరంగా ఉందని, వెంటనే ఆమె క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు కుష్భూ. Mamata Banerjee should show the spine and courage to come out and apologise for the remark she made: BJP's @khushsundar.#NadiaRapeCase #HanskhaliRapecase #WestBengal #ReporterDiary (@RittickMondal) pic.twitter.com/BpKhhSpBbR — IndiaToday (@IndiaToday) April 15, 2022 ఇదిలా ఉండగా.. బెంగాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందని, కాబట్టి రాష్ట్రపతి పాలన పెట్టాలని తాము కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నామని కుష్భూ అన్నారు. మరోవైపు ఈ ఘటనకు టీఎంసీ నేత కుమారుడే కారణమని భాదితురాలి కుటుంబం అంటోంది. -
వికారాబాద్ హత్యాచారం కేసు.. మద్యం మత్తులోనే!
సాక్షి, వికారాబాద్: వికారాబాద్ విద్యార్థిని కేసులో పురోగతి కనిపిస్తోంది. పదో తరగతి విద్యార్థినిపై ఆమె స్నేహితుడే హత్యాచారానికి పాల్పడినట్లు దాదాపుగా నిర్ధారణ అయ్యింది. ప్రధాన నిందితుడు మహేందర్ అలియాస్ నాని నేరం ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. తాగిన మైకంలో లైంగిక వాంఛ తీర్చమని సదరు విద్యార్థినిని నిందితుడు బలవంత పెట్టాడు. అయితే ఆమె ఒప్పుకోకపోవడంతో తెల్లవారు ఝామున కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లిన బాధితురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం తలను చెట్టుకు బాది.. ఊపిరి ఆడకుండా చేసి చంపినట్లు పోలీసులు ఒక అంచనాకి వచ్చారు. కీలక ఆధారాలతో పోలీసులు నేడు మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. వికారాబాద్ పూడూర్ మండలం అంగడి చిట్టంపల్లిలో సోమవారం ఉదయం 16 ఏళ్ల విద్యార్థిని అత్యాచారం, హత్య కేసు సంచలన సృష్టించింది. పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఇంటి నుంచి 500 మీటర్ల నిర్మానుష్య ప్రాంతంలో విగతజీవిగా పడి ఉంది. నిర్మానుష్య ప్రాంతంలో బాలిక దుస్తులు చెల్లా చెదురుగా పడి ఉండటంతో అత్యాచారం చేసి హత్య చేసినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఈ కేసులో ఆరుగురిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో బాధితురాలి తల్లి పొంతనలేని సమాధానాలు చెప్తుండడంతో.. ఆమెను కూడా ప్రశ్నించారు. నిందితుడు ఒక్కడేనా? లేదా జరిగింది సామూహిక హత్యాచారమా? అన్నది ఇవాళ్టి పోలీసుల ప్రెస్ మీట్లో వెల్లడయ్యే అవకాశం ఉంది. -
వికారాబాద్ పూడూర్ హత్యాచారం కేసులో ట్విస్ట్
సాక్షి, వికారాబాద్: వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం అంగడి చిట్టంపల్లి గ్రామంలో పదో తరగతి చదివే అమ్మాయి హత్యాచారం కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని పోలీసులు స్పష్టం చేశారు. కేవలం ఆరుగురు అనుమానితులను మాత్రమే అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. సోమవారం ఉదయం కాలకృత్యాలకు వెళ్లిన అమ్మాయిపై అత్యాచారం, ఆపై హత్యకు పాల్పడ్డారు దుండగులు. ఈ ఘటన సంచలనం సృష్టించగా.. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటనకు సంబంధించి ఆమె స్నేహితుడిపైనే కుటుంబ సభ్యులు తొలుత అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే ఈ కేసులో విద్యార్థిని ప్రియుడు నోరు మెదపడం లేదంటూ, అలాగే తల్లి పాత్రపై అనుమానాలంటూ కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. మంగళవారం ఈ ఘటనకు సంబంధించిన వివరాలను వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి మీడియాకు వెల్లడించారు. ఆరుగురిని కేవలం అనుమానంతోనే విచారిస్తున్నామని ఎస్పీ తెలిపారు. అయితే విచారణలో బాధితురాలి తల్లి పొంతనలేని సమాధానాలు చెప్తుండడంతో.. ఆమెను కూడా ప్రశ్నిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అంతేకానీ.. ఈ కేసులో ఇంతవరకు ఎవరిని కూడా అధికారికంగా ఇప్పటిదాకా అరెస్ట్ చేయలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇవాళ సాయంత్రానికి ‘టెక్నికల్ ఎవిడెన్స్’ లభ్యమయ్యే అవకాశం ఉందని ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. సంబంధిత వార్త: వికారాబాద్‌లో విద్యార్థినిపై అత్యాచారం, ఆపై హత్య -
Marital Rape: కూతురి ముందే అసహజ శృంగారం.. భర్తకు చెంపపెట్టు
బెంగళూరు: వైవాహిక జీవితంలో బలవంతపు శృంగారాన్ని.. నేరంగా పరిగణించాలంటూ తీవ్ర స్థాయిలో చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఓ కేసుకు సంబంధించి కర్ణాటక హైకోర్టు ఇవాళ(బుధవారం) కీలక ఆదేశాలు ఇచ్చింది. వివాహం జరిగినప్పటి నుంచి తనని భర్త ఒక సెక్స్ బానిసగానే చూస్తున్నాడని, మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నాడని, చివరికి కూతురి ముందే అదీ అసహజ శృంగారానికి బలవంతం చేస్తున్నాడంటూ కోర్టుకెక్కింది ఓ బాధితురాలు. ఈ క్రమంలో ఆమె అత్యాచార ఆరోపణల కింద కోర్టును ఆశ్రయించింది. అయితే ఐపీసీ సెక్షన్ 375 కింద నమోదు అయిన కేసును కొట్టేయాలంటూ సదరు భర్త కోర్టులో అభ్యర్థన దాఖలు చేయగా.. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగప్రసన్న కీలక వ్యాఖ్యలు చేస్తూ సదరు భర్త అభ్యర్థనను తోసిపుచ్చారు. భార్యపై భర్త చేసే లైంగిక వేధింపులు ఆమె మానసిక స్థితిపై తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. భర్తల ఇలాంటి చేష్టలు.. భార్యల ఆత్మకు మాయని మచ్చను మిగులుస్తాయి. అనాదిగా.. భర్తలు తమ భార్యలకు తామే పాలకులని భావిస్తున్నారు. భార్యల శరీరం, మనస్సు, ఆత్మను అన్నింటిని అణచివేయాలనే ఆలోచన బలంగా నాటుకుపోయిందని జస్టిస్ నాగప్రసన్న వ్యాఖ్యానించారు. వివాహం అనేది మనిషిలోని మృగాన్ని బయటకు రప్పించి.. భార్యలను శారీరకంగా హింసించేందుకు దొరికిన లైసెన్స్ కాదంటూ వ్యాఖ్యానించారాయన. కాబట్టి, భార్యతో బలవంతపు శృంగారం చేస్తూ.. ఆమెనొక సెక్స్ బానిసగా చూస్తున్న మీకు(భర్తకు) ఈ కేసు నుంచి విముక్తి ఇవ్వడం కుదరదు అంటూ పిటిషన్‌ను ఏకసభ్య ధర్మాసనం తోసిపుచ్చింది. అత్యాచారమే అవుతుంది భార్యపై భర్త చేసే లైంగిక దాడిని.. అత్యాచారంగా పరిగణించేందుకు నిర్దిష్టమైన చట్టం లేకపోవచ్చు. అయితే మినహాయింపులనేవి కొన్ని ఏళ్ల కిందటివని న్యాయమూర్తి ప్రస్తావించారు. పీనల్ కోడ్ చట్టాలు, అందులో సెక్షన్లు ఎప్పటివో. మధ్యయుగ చట్టంలో.. భర్తలు తమ భార్యలపై తమ అధికారాన్ని ఉపయోగించుకునే ఒప్పందంలో భాగంగా ఆ చట్టాలు పుట్టుకొచ్చాయి. కానీ, స్వాతంత్ర్యం వచ్చాక మనం రాజ్యాంగాన్ని పాటిస్తున్నాం. అందులో సమానత్వం అనేది ఒకటి ఉంది. నా దృష్టిలో.. మనిషంటే మనిషి. చట్టం అంటే చట్టం. అత్యాచారం అంటే అత్యాచారం, అది స్త్రీ అయిన భార్యపై పురుషుడైన భర్త చేసినా సరే అని పేర్కొన్నారు న్యాయమూర్తి. నేరంగా గుర్తించకపోయినా.. వైవాహిక జీవితంలో బలవంతపు శృంగారాన్ని.. అత్యాచారంగా, తీవ్ర నేరంగా పరిగణించడం గురించి మేం చర్చించ దల్చుకోలేదు. ఎందుకంటే అది చట్టసభలకు సంబంధించిన అంశం. కేవలం భార్యపై అఘాయిత్యానికి పాల్పడుతున్న భర్త విషయంలో మాత్రమే మేం ఈ ఆదేశాలు ఇస్తున్నాం అని ప్రత్యేకంగా ప్రస్తావించారు హైకోర్టు న్యాయమూర్తి. ఈ సమాజంలో భర్త అయినా ఇంకెవరైనా అత్యాచార ఆరోపణలకు అతీతులేం కారని, అలా చేస్తే.. చట్టం ముందు అసమానత్వం ప్రదర్శించడమే కాకుండా.. రాజ్యాంగాన్ని అవమానించినట్లు అవుతుందని బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘రాజ్యాంగానికి అంతా సమానమే. నేరం ఎవరు చేసినా నేరమే!. అత్యాచార సెక్షన్‌కూ మినహాయింపు ఉండద’ని అన్నారు. చాలా దేశాలు మారిటల్ రేప్‌ను గుర్తిస్తున్నాయని ఈ సందర్భంగా జస్టిస్ నాగప్రసన్న ప్రత్యేకంగా ప్రస్తావించారు. -
పైశాచిక ఘటన.. కాలిన గాయాలతో యువతి దుర్మరణం
సాక్షి, నారాయణపేట: నారాయణపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కాలిన గాయాలతో ఆస్పత్రిలో చేరిన దివ్యాంగ యువతి(21) చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపగా.. యువతి మృతికి కారణమైన నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. శుక్రవారం మద్దూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి వెనుక బాధితురాలిపై వెంకట్రాములు అనే యువకుడు కిరోసిన్ పోసి నిప్పటించాడు. తీవ్రంగా గాయపడ్డ యువతిని గమనించిన స్థానికులు హుటాహుటిన మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శనివారం ఆమె కన్నుమూసింది. బాధితురాలిది మద్దూరు మండలంలోని తిమ్మారెడ్డిపల్లి గ్రామం కాగా, వెంకట్రాములుది కోయిల్ కొండ మండలం ఇంజమూరు గ్రామంగా తెలుస్తోంది. వీళ్లిద్దరి కుటుంబాలు హైదరాబాద్‌లో వలస కూలీలుగా ఉన్నాయి. నిందితుడు ఉప్పర్‌పల్లిలో చిన్న చిన్న పనులు చేస్తున్నాడు. బాధిత యువతి రాజేంద్రనగర్‌లోని పిన్ని ఇంట్లో ఉంటూ దివ్యాంగుడైన సోదరుడిని చూసుకుంటోంది. అయితే ప్రేమిస్తున్నానని నమ్మబలికి.. ఫిబ్రవరి 13న ఆ దివ్యాంగ యువతిని, యువకుడు అపహరించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు కూడా నమోదు అయ్యింది. అయితే లైంగిక దాడికి పాల్పడి.. ఆపై ఆమెను కాల్చి చంపాలని ప్రియుడి ప్రయత్నించి ఉంటాడని పోలీసులు ఒక అంచనాకి వచ్చారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుడిని వీలైనంత త్వరగా పట్టుకుంటామని కోస్గీ సర్కిల్ ఎస్సై జనార్ధన్ గౌడ్ వెల్లడించారు. -
Metaverse: కనీవినీ ఎరుగని రీతిలో సామూహిక అత్యాచారం
ప్రపంచంలో ఏదో ఒక మూల.. ప్రతీ నిమిషానికి మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఒంటరి మహిళలు మృగాల చేతిలో చితికిపోతున్నారు. కానీ, ఇప్పుడు చెప్పుకోబోయే ఘటన.. బహుశా ఇది వరకు విని, చదివి ఉండరు. వాస్తవిక ప్రపంచంలోనే కాదు.. వర్చువల్ ప్రపంచంలోనూ ఆడవాళ్ల భద్రతపై అనుమానాల్ని పెంచే ఘటన ఇది. పైగా అవి మరింత ఘోరంగా.. ఆందోళనకరంగా ఉంటాయనే విషయాన్ని రుజువు చేసింది ఇది. బ్రిటన్‌కు చెందిన ఓ మహిళ(43).. ఫేస్బుక్ మెటావర్స్ ‘హోరిజోన్ వెన్యూస్’పై సంచలన ఆరోపణలకు దిగింది. ఆ వేదికపై తాను గ్యాంగ్‌రేప్‌నకు గురయ్యానని ఆమె ఫిర్యాదు చేసింది. వర్చువల్ వరల్డ్‌లోకి జాయిన్ అయిన నిమిషానికే.. తనను ముగ్గురు-నలుగురు (మేల్ అవతార్స్) చుట్టుముట్టి బలాత్కారం చేశారని, ఆపై ఆ అఘాయిత్యాన్ని ఫొటోలు సైతం తీశారని ఆమె వాపోయింది. ఆర్తనాదాలు. అరణ్యరోదనే! అఘాయిత్యం జరుగుతున్న టైంలో తను గట్టిగట్టిగా అరిచినా.. స్పందన కరువైందని ఆమె వాపోయింది. ఆ సమయంలో చాలామంది లాగిన్‌లో ఉన్నారు. కానీ, నా అరుపులను ఎవరూ పట్టించుకోలేదు. పైగా నా అవతార్ మీద ఘాతుకానికి పాల్పడ్డ మగ అవతార్లు మృగాళ్లా ప్రవర్తించాయి. దుర్భాషలాడాయి.. నాపై దాడి చేశాయి. దుస్తులు చించేశాయి. ఏం జరుగుతుందో అర్థం కావడానికే నాకు కొన్ని నిమిషాలు పట్టింది. ఆ భయంకరమైన అనుభవంతో వెంటనే వర్చువల్ రియాలిటీ హెడ్సెట్ తీసేసి, లాగౌట్ అయ్యానని ఆమె పేర్కొంది. ఇక ఘటనపై తన అనుభవాన్ని ఓ బ్లాగ్‌లో పంచుకున్న బాధితురాలు. వర్చువల్ ఘటనను అనవసరంగా సీన్ చేస్తోందని కొందరు అంటున్నారు. కానీ, వాస్తవాల నుంచి వర్చువల్ అనుభవాలు వేరు చేయలేవని ఆమె అంటోంది. అందుకే వర్చువల్ ప్రపంచంలోనూ అనుభవాలకు 'వాస్తవికత' ఉంటుందని పేర్కొంది. వర్చువల్ రియాలిటీలో ఎక్కువ మంది ఉన్నప్పుడు.. అక్కడ వాస్తవికతకు ఆస్కారం ఉంటుందని గుర్తుంచుకోవాలని, తనకు ఎదురైన అనుభవం వర్చువల్ ప్రపంచంలోనూ మరెవరికీ ఎదురు కాకూడదని ఆమె అంటోంది. ఇదిలా ఉంటే ఈ ఘటనపై స్పందించని ఫేస్బుక్ మెటావర్స్.. భద్రత విషయంలో మార్పులు చేస్తున్నట్లు ఆ మధ్య ఒక ప్రకటనతోనే సరిపెట్టింది. సంబంధిత వార్త: పక్కన లేకున్నా.. ‘నన్ను బలవంతంగా వాటేసుకుని’!! -
భారత్‌పై విషం చిమ్మే నజీర్.. ఎట్టకేలకు పాపం పండింది
భారత్‌పై, ప్రభుత్వ విధానాలపై వీలు చేసుకుని మరీ విషం చిమ్ముతూ.. పాక్ అండతో కశ్మీర్ ప్రచారకర్తగా తనను తాను ప్రచారం చేసుకున్నాడు లార్డ్ నజీర్ అహ్మద్(64). అయితే లైంగిక దాడుల పర్వంలో ఎట్టకేలకు ఈ చీడపురుగు పాపం పండింది. మైనర్లపై లైంగిక వేధింపుల కేసులో జైలు శిక్ష పడింది. బ్రిటిష్-పాక్ సంతతికి చెందిన రాజకీయ నేత లార్డ్ నజీర్ అహ్మద్‌కు పిల్లలపై లైంగిక వేధింపుల కేసులో ఐదున్నరేళ్ల శిక్ష ఖరారైంది. ఈ మేరకు శుక్రవారం షెఫీల్డ్ క్రౌన్ కోర్టు నజీర్‌ను దోషిగా నిర్ధారించి.. శిక్ష ఖరారు చేసింది. 70వ దశకంలో ఇద్దరు మైనర్లపై నజీర్ అహ్మద్ లైంగిక వేధింపులపై పాల్పడ్డాడనే ఆరోపణలు ఉన్నాయి. 1971 నుంచి 1974 మధ్య ఈ వేధింపుల పర్వం సాగినట్లు సమాచారం. వేధింపులతో పాటు అత్యాచార యత్నానికి పాల్పడ్డాడన్నది ప్రధాన ఆరోపణ. ఇదిలా ఉంటే.. నాలుగు దశాబ్దాలుగా బాధిత కుటుంబాల పోరాటం, మీటూ ఉద్యమం ప్రభావంతో 2019 మార్చిలో ఈ ఆరోపణలకు సంబంధించి నజీర్పై నేరారోపణలు నమోదు అయ్యాయి. కశ్మీర్‌ను ఉద్ధరిస్తానంటూ.. నజీర్ అహ్మద్ పీఓకేలో జన్మించాడు. అయితే రోథర్హమ్(యూకే)కు తండ్రి వలస వెళ్లడంతో.. నజీర్ అక్కడే పెరిగి, వ్యాపారాలతో రాణించాడు. 1998లో టోనీబ్లేయర్ ప్రధాని సారథ్యంలో నజీర్ హౌజ్ ఆఫ్ ది లార్డ్స్‌గా పని చేశాడు. 2013లో లేబర్ పార్టీకి రాజీనామా చేసి.. లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో 2020లో హౌజ్ ఆఫ్ లార్డ్స్‌కు రాజీనామా చేశాడు. ఇతగాడి వేధింపులు నిజమేనని హౌజ్ కమిటీ ఒకటి నిర్ధారణ కూడా చేసింది. ఖలీస్థానీ గ్రూపుతో మంచి సంబంధాలు కలిగి ఉన్న నజీర్.. వీలుచిక్కినప్పుడల్లా భారత్‌పై విషం చిమ్ముతుంటాడు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తోనూ అతనికి సత్సంబంధాలు ఉన్నాయి. ఈ ఇద్దరూ కలిసినప్పుడల్లా.. నజీర్ భారత్ మీద విమర్శలు చేయడం పరిపాటిగా మారింది. ఒకానొక దశలో ప్రధాని మోదీపైనా వివాదాస్పద ప్రకటన ఇచ్చాడు నజీర్. కశ్మీర్ క్రూసేడర్ అంటూ తనకు తాను ప్రగల్భాలు పలికే నజీర్.. పీవోకే ప్రాంతాన్ని ఉద్దరిస్తానంటూ ఫండింగ్ చేయడం ప్రారంభించాడు. సంస్కరణల పేరుతో కశ్మీర్ మహిళలను బలవంతంగా లోబర్చుకున్నట్లు నజీర్ మీద ఆరోపణలు ఉన్నాయి. ఈ తరుణంలో లండన్‌లో ఉండే కశ్మీర్ కమ్యూనిటీ మీటూ తరహా ఉద్యమంతో నజీర్ పీఠాన్ని కదిలించారు కూడా. నజీర్పై జైలు శిక్ష పడడంపై కమ్యూనిటీ హర్షం వ్యక్తం చేస్తోంది. చదవండి: అడుగు పెట్టకముందే ఇమ్రాన్ ఖాన్‌కు షాకిచ్చిన చైనా -
లైంగిక ఆరోపణలకు రివెంజ్!.. నటి అరెస్ట్‌తో ఉలిక్కిపాటు
రంగుల ప్రపంచంలో వివాదాలు-విమర్శల్లో చిక్కుకునే సెలబ్రిటీల పరిస్థితి ఎలా ఉంటోందో చెప్పే ఘటన ఇది. అగ్ర కథానాయిక పోరీ మోనీ(28) అరెస్ట్ బంగ్లాదేశ్‌లో సంచలనం సృష్టించింది. పెద్ద ఎత్తున్న మాదక ద్రవ్యాలు కలిగి ఉందన్న ఆరోపణలపై బంగ్లాదేశ్ యాంటీ-టెర్రర్ స్క్వాడ్ ‘రాబ్’(Rapid Action Battalion) బుధవారం రాత్రి ఆమెను అరెస్ట్ చేసింది. అయితే ఓ ప్రముఖ వ్యాపారవేత్తపై లైంగిక-హత్యారోపణలు చేసిన కొద్దిరోజులకే ఆమె అరెస్ట్ కావడంతో.. ఆమె ఫ్యాన్స్ బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాను న్యాయం కోసం నిలదీస్తున్నారు. అరెస్ట్ ఇలా.. బుధవారం సాయంత్రం ఢాకా బనానీలో ఉన్న ఆమె ఇంటికి చేరుకున్న రాబ్ టీం.. సుమారు నాలుగు గంటపాటు సోదాలు నిర్వహించింది. ఆపై రాత్రి తొమ్మిది గంటల టైంలో ఆమెను హెడ్ క్వార్టర్స్‌కు తరలించి ప్రశ్నించింది. ఆ వెంటనే ఆమె అరెస్ట్‌ను ధృవీకరిస్తూ రాబ్ వింగ్ డైరెక్టర్ కమాండర్ ఖాందకేర్ మోయిన్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆమె ఇంట్లో పెద్ద ఎత్తున్న మత్తు, మాదక ద్రవ్యాలు, ఫారిన్ లిక్కర్ బాటిళ్లు ఆమె ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు రాబ్ వెల్లడించింది. ఈ మేరకు గురువారం ఉదయం ఆమెను కోర్టులో ప్రవేశపెట్టగా.. నాలుగు రోజుల రిమాండ్ విధించింది న్యాయస్థానం. ప్రతీకారంగానే.. పోరీ మోనీ అసలు పేరు షామ్‌సున్నాహర్. సైడ్ కిక్ వేషాల నుంచి స్టార్ హీరోయిన్గా ఎదిగింది. జూన్ 8న ప్రముఖ వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు నజీర్ ఉద్దీన్ మహమ్మూద్ మీద లైంగిక ఆరోపణలు చేసింది. బోట్ క్లబ్ వద్ద నజీర్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపించింది. ఒక స్టార్ హీరోయిన్ లైంగిక ఆరోపణలు చేయడం సినీ పరిశ్రమను కుదిపేయగా.. హైలెవల్ పరిచయాలతో కేసు నమోదు కాకుండా తప్పించుకున్నాడు నిందితుడు. ఈ తరుణంలో ఆమెకు నటులు, నెటిజన్స్ నుంచి మద్ధతు దక్కింది. తనకు న్యాయం చేయాలంటూ బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు ఆమె ఫేస్బుక్ ద్వారా విజ్ఞప్తి చేసింది. దీంతో ఎట్టకేలకు నిందితుడు నజీర్‌ను, ముగ్గురు మహిళల్ని, నజీర్ సహచరుడైన డ్రగ్ డీలర్ తుహిన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉల్టా కేసు నజీర్ అరెస్ట్ అయిన వారం తర్వాత గుల్షన్ ఆల్ కమ్యూనిటీ క్లబ్ వాళ్లు పోరీ మోనీపై ఉల్టా ఓ కేసు దాఖలు చేశారు(నజీర్ ఈ క్లబ్‌కు డైరెక్టర్ కూడా). డ్రగ్స్ మత్తులో జూన్ 7న ఆమె క్లబ్‌పై దాడి చేసిందని క్లబ్ అధ్యక్షుడు అలంగిరి ఇక్బాల్ ప్రెస్ మీట్ పెట్టి మరీ వివరించాడు. ఈ నేపథ్యంలో ఆమెపై నార్కొటిక్ చట్టం ప్రకారం కేసు నమోదుకాగా.. ఆపై బెయిల్ దొరికింది. ఆ వెంటనే నజీర్, అతని అనుచరులు బెయిల్ మీద జైలు నుంచి విడుదలయ్యారు. చంపేస్తారన్న కాసేపటికే.. బుధవారం మధ్యాహ్నాం పోరి మోనీ ఫేస్బుక్ లైవ్‌లోకి వచ్చింది. తనను చంపాలని ప్రయత్నిస్తున్నారని, గేట్‌ను ధ్వంసం చేశారని, సాయం కోరినా పోలీసులు స్పందించడం లేదంటూ ఆమె లైవ్‌లో వ్యాఖ్యలు చేసింది. పోలీసుల వంకతో వచ్చి కూడా తనను చంపేస్తారని భయంగా ఉందంటూ ఆమె ఆందోళన చెందింది. ఆ కాసేపటికే ఇంటికి చేరుకున్న Rapid Action Battalion.. ఆమెను అరెస్ట్ చేయడం కొసమెరుపు. ఇక పోరీ మోనీతో పాటు ఓ సినిమా ప్రొడ్యూసర్-అతని ఇద్దరు అనుచరుల మీద కూడా నార్కొటిక్ కేసు నమోదు అయ్యింది. -
ఢిల్లీ హత్యాచార ఘటన: రాహుల్ చేష్టలపై సీరియస్
Delhi Dalit Minor Case: ఢిల్లీ మైనర్ హత్యాచార ఘటన దేశంలో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బుధవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించడం పరస్పర రాజకీయ విమర్శలకు దారితీసింది. ఈ తరుణంలో బాధితురాలి తల్లిదండ్రుల ఫొటోల్ని తన ట్విటర్లో రాహుల్ పోస్ట్ చేయడంపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్(NCPCR) సీరియస్ అయ్యింది. శ్మశాన వాటికలో మంచి నీళ్ల కోసం వెళ్లిన బాలికపై అక్కడున్న కొందరు హత్యాచారానికి పాల్పడ్డారని, ఆపై తల్లిదండ్రుల సమ్మతి లేకుండా అంత్యక్రియలు నిర్వహించారన్న కేసు తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ఈ తరుణంలో తొమ్మిదేళ్ల దళిత మైనర్ బాధితురాలి తల్లిదండ్రులను పరామర్శించిన అనంతరం రాహుల్ గాంధీ తన ట్విటర్లో ఫొటో పోస్ట్ చేశాడు. అయితే జువెనైల్ జస్టిస్-పోక్సో చట్టాల ప్రకారం.. అలా ఫొటోల్ని, వివరాల్ని బయటపెట్టడానికి వీల్లేదు. తద్వారా బాధితురాలి ఐడెంటిటీ బయటపడే అవకాశం ఉంది. ఇది చట్ట విరుద్ధం కూడా. ఈ నేపథ్యంలోనే బాలల కమిషన్ స్పందించింది. రాహుల్ పోస్ట్‌పై మూడు రోజుల్లో చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులకు, ట్విటర్‌కు ఎన్సీపీసీఆర్ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ట్విటర్ రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీసర్‌కు సదరు ట్వీట్‌ను తొలగించాలంటూ ఓ లేఖ కూడా రాసింది. ఇక రాహుల్ చర్యలపై జువెనైల్ జస్టిస్ యాక్ట్, పోక్సో యాక్ట్, ఐపీసీ సెక్షన్ల చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. ఢిల్లీ డీసీపీ(నైరుతి విభాగం)కి మరో ప్రత్యేక లేఖలో కేసుకు సంబంధించి పూర్తి వివరాలను తమ ముందు ఉంచాలని 48 గంటల డెడ్‌టైన్ విధించింది ఎన్సీపీసీఆర్. ఇక ‘ఓటేసే ముందు నిర్భను గుర్తు తెచ్చుకోండి’ అంటూ గతంలో మోదీ చేసిన ప్రచారాన్ని తెర మీదకు తెచ్చిన కాంగ్రెస్.. తీవ్ర స్థాయిలో బీజేపీపై విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ కాంగ్రెస్‌పై కౌంటర్ దాడులు చేస్తోంది. -
కుటుంబ తగాదాలు.. అత్తా మరదలుపై దాష్టీకం
కుటుంబ తగాదాలతో సొంత మరదల్ని పీక కోసి చంపిన ఓ యువకుడు.. ఆపై అత్తపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఒడిశా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఈ కేసు. ఈ భయానక ఘటన వివరాల్లోకి వెళ్తే.. కియోంజ్హర్: ఒడిషా వ్యాప్తంగా ఓ కేసు సంచలనంగా మారింది. కుటుంబ తగాదాలు శ్రుతి మించడంతో ఓ యువకుడు దారుణానికి తెగబడ్డాడు. మరదలిని హత్య చేసి.. ఆపై అత్తపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కియోంజ్హర్ జిల్లా కిరిబురు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిందితుడు రూప్‌సింగ్‌కు, బంధువులైన బాధితురాలి కుటుంబంతో చాలాకాలంగా గొడవలు నడుస్తున్నాయి. ఈ తరుణంలో అడవిలో పుట్టగొడుగులు, కర్ర ఏరుకునేందుకు ఆ తల్లీకూతుళ్లు వెళ్లారు. అయితే వాళ్లను అనుసరించిన నిందితుడు.. అక్కడ వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా గొడ్డలితో మరదలి గొంతును కోశాడు. దీంతో ఆ యువతి అక్కడికక్కడే చనిపోయింది. అంతటితో ఆగకుండా ఆ యువతి తల్లిని చెట్టుకు కట్టేసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై యువతి శవాన్ని మోసుకుంటూ వెళ్లి పక్కనే ఉన్న 200 అడుగుల లోయలో పడేశాడు. ఇదే అదనుగా భావించిన యువతి తల్లి.. అక్కడి నుంచి తప్పించుకుని దగ్గర్లో ఉన్న జార్ఖండ్ అవుట్‌పోస్ట్ పోలీసులను ఆశ్రయించింది. వెంటనే బొలానీ పోలీసులకు వాళ్లు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న బార్బిల్ సబ్ డివిజినల్ ఆఫీసర్ ఘటనాస్థలానికి చేరుకుని లోయ నుంచి యువతి మృతదేహాన్ని వెలికి తీశారు. బాధితురాలి తల్లిని పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి పంపి.. రూప్ సింగ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, ఈ దారుణ ఘటనలో నిందితుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలతో చుట్టుపక్కల గ్రామాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక ఈ కేసు మీడియాలో హైలైట్ కావడంతో.. దర్యాప్తు వేగవంతం చేయాలని సీఎం నవీన్ పట్నాయక్ పోలీస్ శాఖను ఆదేశించారు. -
దారుణం: ఇంటికి నిప్పు.. అత్యాచార బాధితురాలు మృతి
జైపూర్: రాజస్థాన్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ ఆత్యాచార బాధిత మహిళ ఇంటిని గుర్తుతెలియని వ్యక్తులు కిరోసిన్‌తో తగలబెట్టారు. బుధవారం జరిగిన ఈ ఘటనలో ఆమె తీవ్రంగా కాలిపోయింది. దీంతో ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమన్‌గర్ జిల్లాలోని గోలువాలా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధిత మహిళ ఇంటికి గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు వచ్చి బయట నుంచి ఆమెను పేరుతో పిలిచారు. దీంతో ఆమె ఇంటి తలపు తీయగా కిరోసిన్ పోసి వెంటనే నిప్పుపెట్టి పారిపోయారు. ఇంటిలో ఒక్కసారిగా తీవ్రంగా మంటలు ఎగసిపడ్డాయి. మంటల్లో చిక్కుకున్న ఆ మహిళ శరీరం సగం కంటే ఎక్కువగా కాలిపోయింది. స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా కాలిన గాయాలతో ఉన్న ఆమె శనివారం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై మహిళ అమ్మమ్మ తన మనమరాలిపై ఆత్యాచారం చేసిన నిందితుడే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి మృతిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మృతి చెందిన అత్యాచార బాధిత మహిళ కుటుంబ సభ్యులకు రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ రూ.5 లక్షల ఎక్సగ్రేషియా ప్రకటించినట్ల సీఎం కార్యాలయం ప్రకటించింది. చదవండి: సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన టాలీవుడ్ దర్శకుడు -
28 రోజులు మృత్యువుతో పోరాడి..
ఖమ్మం క్రైం: కామాంధుడి చేతిలో అత్యాచారయత్నానికి గురైన ఓ బాలిక 28 రోజుల పాటు మృత్యువుతో పోరాడి గురువారం కన్నుమూసింది. ఖమ్మం రూరల్ మండలం పల్లెగూడేనికి చెందిన ఓ వ్యక్తి తన కూతురును (13) ముస్తఫానగర్ పార్శిబంధంలోని అల్లం సుబ్బారావు ఇంట్లో పనిమనిషిగా కుదిర్చాడు. గత నెల 18న రాత్రి బాలిక పని ముగించుకుని నిద్రిస్తుండగా, సుబ్బారావు కుమారుడు మారయ్య అత్యాచారానికి యత్నించాడు. విషయం బయట పడుతుందని భావించి.. ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. మంటల ధాటికి ఆమె కేకలు వేయడంతో పైన నిద్రిస్తున్న నిందితుడి తండ్రి సుబ్బారావు కిందకు చేరుకుని మంటలను ఆర్పివేశాడు. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని ముందుగా ఖమ్మం, అనంతరం హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి, మెరుగైన వైద్యం కోసం బంజారాహిల్స్‌లోని రెయిన్బో ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ గురువారం ఆమె తుదిశ్వాస విడిచింది. శుక్రవారం బాలిక మృతదేహాన్ని ఖమ్మం తీసుకురానున్నారు. -
కోర్టు గదిలో మహిళపై అత్యాచారం
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. రూస్ అవెన్యూ కోర్టు కాంప్లెక్స్‌లోని గదిలో 38 ఏళ్ల మహిళపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. సోమవారం మధ్యాహ్నం పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసిన బాధిత మహిళ.. తనపై అత్యాచారం జరిగినట్టుగా తెలిపారు. దీంతో వెంటనే కోర్టు గదికి చేరుకున్న పోలీసులు ఆమె వాంగ్మూలం తీసుకున్నారు. అలాగే ఘటన స్థలంలో ఉన్న నిందితుడిని అరెస్ట్ చేశారు. బాధిత మహిళ నుంచి సమాచారం వచ్చిన వెంటనే తాము వేగంగా స్పందించి ఘటన స్థలానికి చేరుకున్నట్టు ఓ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. నిందితుడిని రాజేంద్ర సింగ్‌గా గుర్తించామని చెప్పారు. అతనిపై సెక్షన్ 376 కింద కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు. బాధిత మహిళను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించామని.. ఆ ఫలితాలు వచ్చాక నిందితుడిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. లేబర్ కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులో సాయం చేస్తానని నమ్మించి నిందితుడు తనపై అత్యాచారానికి పాల్పడినట్టుగా బాధిత మహిళ ఆరోపించారు. నిందితుడు కోర్టులో పనిచేసే సిబ్బందిలో ఒకరని కూడా చెప్పారు. అయితే బాధితురాలు, నిందితుడు ఒకరిఒకరు ముందే తెలుసునని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. నిందితుడు బాధితురాలు భర్తకు కూడా స్నేహితుడేనని పోలీసులు గుర్తించారు. (చదవండి : దుబాయ్‌లో భారతీయ దంపతుల హత్య) -
దుర్మార్గులు దొరికారు
సాక్షి, మండపేట: పట్టణంలో సంచలనం సృష్టించిన దళిత విద్యార్థినిపై లైంగికదాడి ఘటనలో నిందితులను పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. పట్టణంలోని బైపాస్‌రోడ్డులో నిందితులు ఉన్నట్టు అందిన సమాచారం మేరకు దాడి చేసి వారిని అరెస్టు చేసినట్టు రామచంద్రపురం డీఎస్పీ రాజగోపాలరెడ్డి తెలిపారు. సంఘటన వివరాలను శుక్రవారం పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు. మండపేటలోని ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ చదువుకుంటున్న విద్యార్థిని ఈనెల 3వ తేదీన కళాశాలకు వెళ్లి సాయంత్రం స్నేహితుడి మోటారు సైకిల్‌పై ఇంటికి బయలుదేరింది. మార్గమధ్యలో బైపాస్ రోడ్డులోని సంఘం కాలనీ జంక్షన్ వద్దకు వచ్చేసరికి ఇద్దరు వ్యక్తులు బండిని ఆపి పోలీసులమంటూ రికార్డులు చూపాలని అడిగారు. అందులో ఒక వ్యక్తి యువతి స్నేహితుడిని పక్కకు తీసుకువెళ్లగా మరో వ్యక్తి మరో ఇద్దరికి ఫోన్ చేసి రప్పించాడు. ముగ్గురు కలిసి విద్యార్థినిని పక్కనే పంట పొలాల్లోకి తీసుకువెళ్లి సామూహికంగా లైంగికదాడికి పాల్పడినట్డు డీఎస్పీ రాజగోపాలరెడ్డి తెలిపారు. స్పృహ కోల్పోయిన ఆమె కొద్దిసేపటి తర్వాత తేరుకుని స్నేహితుల సాయంతో ఇంటికి చేరుకుంది. భయపడి జరిగిన సంఘటనను ఇంట్లో చెప్పలేకపోయింది. మరుసటి రోజు జరిగిన అన్యాయం గురించి తన సోదరుడితో చెప్పి అతడి సాయంతో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. చదవండి: సామూహిక అత్యాచారం బాధితురాలి ఫిర్యాదు మేరకు పట్టణ సీఐ ఎ.నాగమురళి నిర్భయ, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయగా రాజగోపాలరెడ్డి దర్యాప్తు చేపట్టారు. లైంగికదాడికి పాల్పడిన నలుగురు నిందితులు బైపాస్ రోడ్డులో ఉన్నట్టు గురువారం సాయంత్రం సమాచారం అందడంతో సీఐ నాగమురళీ, ఎస్సై రాజేష్‌కుమార్ దాడిచేసి మధ్యవర్తుల సమక్షంలో వారిని అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు జరుగుతున్నందున నిందితులను మీడియా ముందుకు తీసుకురాలేమని, అలాగే వారి పేర్లను ఇంకా వెల్లడించలేమని డీఎస్పీ రాజగోపాలరెడ్డి తెలిపారు. యువతిపై అత్యాచారానికి పాల్పడిన సంఘటన స్థలం ప్రాధేయపడినా విడిచిపెట్టలేదు పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం పట్టణానికి చెందిన వల్లూరి మురళీకృష్ణ, సుంకర వెంకన్న, మొలకల వీరబాబు, చామంతి మధులు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు సమాచారం. తొలుత ప్రధాన నిందితుడు వల్లూరి మురళీకృష్ణ విద్యార్థినిపై ఘాతుకానికి ఒడిగట్టగా, ఆ తర్వాత సుంకర వెంకన్న లైంగికదాడికి పాల్పడ్డాడు. ములకల వీరబాబు సంఘటన స్థలంలోనే ఉండి యువతి కాళ్లను గట్టిగా పట్టుకుని వారికి సహకరించాడు. వదిలిపెట్టమని విద్యార్థిని ఎంత ప్రాధేయపడినా పట్టించుకోకుండా అత్యంత పాశవికంగా వారు లైంగికదాడికి పాల్పడ్డారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నట్టు సమాచారం. రాత్రి ఎనిమిది గంటల సమయం కావడం, రోడ్డు నుంచి పొలాల్లోకి దూరంగా తీసుకువెళ్లిపోవడంతో ఆమె కేకలు వేసినా ఫలితం లేకపోయింది. విడిపించుకునే ప్రయత్నం చేసినా ఆమెపై దాడిచేయడంతో పాటు పరుష పదజాలంతో దూషిస్తూ కాళ్లు కదలకుండా తొక్కిపెట్టి అత్యంత పాశవికంగా దారుణానికి పాల్పడ్డారు. స్పృహలేకుండా పడి ఉన్న ఆమెను అక్కడే వదిలిపెట్టి పరారయ్యారు. ఫోన్ రింగవుతున్నా తీయలేని నిస్సత్తువలో పాక్కుంటూ ఫోన్ తీసుకుని స్నేహితులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటన స్థలానికి చేరుకుని ఆమెను ఇంటికి చేర్చే సరికి రాత్రి 9 గంటలైంది. జరిగిన దారుణం గురించి ఆ సమయంలో అనారోగ్యంతో బాధపడుతున్న తల్లికి చెప్ప లేక, సోదరుడికి చెప్పే ధైర్యం చేయలేక తీవ్ర క్షోభను అనుభవించింది. ఆత్మహత్య చేసుకోవాలని భావించింది. ధైర్యం తెచ్చుకుని మరుసటి రోజు సోదరుడికి చెప్పి అతడి సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలికి పూర్తి న్యాయం చేస్తాం డిప్యూటీ సీఎం బోస్ కాకినాడ సిటీ: సభ్యసమాజం తలదించుకునేలా మండపేటలో దళిత యువతిపై జరిగిన లైంగికదాడి ఘటనను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వ పరంగా ఆమెకు పూర్తి న్యాయం జరిగేలా కృషి చేస్తానని డిప్యూటీ సీఎం, రెవెన్యూ, స్టాంప్స్ రిజిస్ట్రేషన్‌శాఖ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ అన్నారు. కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని శుక్రవారం రాత్రి పార్టీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి రెడ్డి రాజుబాబు తదితరులతో కలసి ఆయన పరామర్శించారు. ∙బాధితురాలిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధైర్యపడవద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని ఆమెకు భరోసానిచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమన్నారు. ఎఫ్ఐఆర్ కాపీని చూశానని, నిర్భయ చట్టం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద పోలీసులు కేసులు నమోదు చేశారన్నారు. విశాఖపట్నంలో ఉన్న తన దృష్టికి రామచంద్రపురం డీఎస్పీ రాజగోపాలరెడ్డి సంఘటన వివరాలను తీసుకురాగా నిందితులు ఎంతటి వారైనా, ఎటువంటి ఒత్తిళ్లు వచ్చిన తలొగ్గకుండా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారన్నారు. బాధితురాలికి నష్టపరిహారం అందించడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు కృషి చేస్తానని డిప్యూటీ సీఎం బోస్ స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీ నాయకులు కర్రి జయశ్రీ, కొవ్వాడ అప్పన్నబాబు, అడ్డూరి వీరబాబు తదితరులు పాల్గొన్నారు. -
కామాంధుడి ‘మత్తు’ ‘దిశ’ యాప్‌తో చిత్తు
సాక్షి, కైకలూరు: రోజూ ఇంటికొచ్చి చిన్నారిని పాఠశాలకు తీసుకెళ్లే ఆటోడ్రైవర్ నమ్మకంగా నటిస్తూ ఆ ఇంటి ఇల్లాలిపై అఘాయిత్యానికి ప్రయత్నించాడు. బాధితురాలు సమయస్ఫూర్తితో ‘దిశ’ యాప్‌ను ఆశ్రయించడంతో ఆపద నుంచి సురక్షితంగా బయటపడింది. కాల్ సెంటర్‌కు ఫిర్యాదు అందిన 8 నిమిషాల వ్యవధిలోనే పోలీసులు అక్కడకు చేరుకుని బాధితురాలిని రక్షించారు. కామాంధుడిని కటకటాల్లోకి గెంటేశారు. బస్సులో ఓ మహిళా అధికారిణిపై వేధింపులకు పాల్పడ్డ ఏయూ ప్రొఫెసర్ బసవయ్యను గత నెలలో దిశ యాప్ ద్వారా అదుపులోకి తీసుకోవడం తెలిసిందే. కూల్‌డ్రింక్‌లో మత్తు మాత్రలు కలిపి.. పందిరిపల్లిగూడెం గ్రామానికి చెందిన భార్యభర్తలు హాస్టల్లో ఔట్సోర్సింగ్ వర్కర్లుగా పని చేస్తున్నారు. వీరికి ఓ పాప ఉంది. ఇదే గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ వడ్లమన్నాడ పెద్దిరాజు(21) రోజూ పాపను ఆటోలో స్కూల్‌కి తీసుకు వెళ్తుంటాడు. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఒంటరిగా ఉన్న పాప తల్లి వద్దకు వచ్చి కూల్‌డ్రింక్‌లో నిద్రమాత్రలు కలిపి తాగాలని బలవంతపెట్టాడు. దిశ యాప్ ద్వారా.. ఆటోడ్రైవర్ ప్రవర్తనపై అనుమానం వచ్చిన ఆమె 3.19 నిమిషాలకు దిశ యాప్ ద్వారా ఫిర్యాదు చేశారు. దిశ కాల్ సెంటర్ నుంచి సమాచారం అందుకున్న స్థానిక సీఐ వైవీవీఎల్.నాయుడు, రూరల్ ఎస్ఐ పి.రామకృష్ణ అప్రమత్తమయ్యారు. ఘటనా స్థలానికి సమీపంలోని పెద్దింట్లమ్మ జాతరలో విధులు నిర్వహిస్తున్న మహిళా హోంగార్డ్ వరలక్ష్మీ కుమారి, కానిస్టేబుళ్లు కిషోర్, నాగగణేష్ ఎనిమిది నిమిషాల వ్యవధిలోనే అక్కడకు చేరుకున్నారు. బాధిత మహిళకు ధైర్యం చెప్పారు. ఇది గమనించి పరారైన నిందితుడిని పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. మేజిస్ట్రేటు ఎదుట హాజరుపర్చగా ఈనెల 19 వరకు రిమాండ్ విధించినట్లు చెప్పారు. -
సామూహిక అత్యాచారం
మండపేట: స్నేహితులైన కాలేజీ విద్యార్థిని, విద్యార్థి ఒక చోట ఉండటాన్ని గమనించిన ముగ్గురు దుండగులు యువకుడిపై దాడిచేసి అనంతరం యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా మండపేటలో జరిగింది. బాధిత యువతి బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదీ జరిగింది.. మండపేట సమీప గ్రామానికి చెందిన దళిత యువతి పట్టణంలోని ఓ కళాశాలలో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతోంది. మంగళవారం కళాశాలకు చివరి రోజు కావడంతో స్నేహితులతో వీడ్కోలు వేడుకలు జరిగాయి. తర్వాత స్నేహితుడితో కలిసి బైపాస్ రోడ్డు సమీపంలోని పశువుల మకాం వద్ద మాట్లాడుతోంది. మకాం యజమాని వీరిపై కన్నేశాడు. తన స్నేహితుడైన కోడిపెంట వ్యాపారిని అక్కడికి పిలిచాడు. అతడి పాలేరుగా పనిచేసే మరో స్నేహితునికీ విషయం చెప్పాడు. ఇద్దరూ మరో యువకుడితో కలిసి మోటారు సైకిల్‌పై అక్కడికి వచ్చారు. నలుగురూ కలిసి యువతి స్నేహితుడిపై దాడిచేశారు. సెల్‌ఫోన్ లాక్కున్నారు. అనంతరం ఆమె స్నేహితున్ని ఓ యువకుడు మోటారు సైకిల్‌పై ఎక్కించుకుని సినిమా రోడ్డులోని పాన్‌షాప్ వద్దకు తీసుకువెళ్లాడు. అక్కడ తన ఫోన్‌కు రీచార్జ్ చేయించుకుని వెళ్లిపోయాడు. మిగిలిన ముగ్గురు నిందితులూ యువతిపై అత్యాచారానికి పాల్పడి వెళ్లిపోయారు. మకాం యజమాని ఐదు పదుల వయస్సు దాటిన వ్యక్తి కాగా, మిగిలిన ఇద్దరూ 40 ఏళ్ల వారు. నిందితులు పట్టుబడ్డారిలా.. పాన్ షాపు వద్ద ఉన్న బాధిత విద్యార్థి స్నేహితులకు సమాచారమిచ్చాడు. స్నేహితులతో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నాడు. అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న యువతిని ఇంటికి చేర్చారు. పాన్‌షాప్ వద్ద రీచార్జ్ చేయించిన నంబర్ ఆధారంగా నిందితుల్లో ఒకడైన యువకుడిని గుర్తించారు. యువతి స్నేహితులు, బంధువులు గొల్లపుంతలోని అతని ఇంటికి వెళ్లి దేహశుద్ధి చేశారు. మిగిలిన ముగ్గురి పేర్లు అతను బయటపెట్టగా సంఘం కాలనీలోని ఇద్దరు నిందితుల ఇంటికి చేరుకుని వారినీ చితకబాదారు. ఈలోగా స్థానికులు 100 ఫోన్ చేయడంతో పోలీసులు వచ్చారు. ఈలోగా నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. -
జై శ్రీరాం అనాలంటూ క్యాబ్ డ్రైవర్‌పై దాడి
ముంబై : జై శ్రీరాం అని నినదించాలంటూ ఓ ముస్లిం క్యాబ్ డ్రైవర్‌పై ముగ్గురు వ్యక్తులు దాడికి పాల్పడిన ఘటన థానేలో జరిగింది. మద్యం సేవించిన ముగ్గురు వ్యక్తులు థానేలోని దివా ప్రాంతంలో క్యాబ్ డ్రైవర్ ఫైజల్ ఉస్మాన్ ఖాన్‌ను అటకాయించి జై శ్రీరాం అనాలని బెదిరించారు. జై శ్రీరాం అనకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని భౌతిక దాడికి పాల్పడ్డారు. రోడ్డు మధ్యలో కారును ఎందుకు ఆపావంటూ బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు తనపై దౌర్జన్యానికి దిగారని డ్రైవర్ చెప్పారు. తాను ముస్లింనని గ్రహించిన వారు కారు నుంచి తనను బయటకు లాగి కొట్టారని వెల్లడించారు. జైశ్రీరాం అంటేనే తనను విడిచిపెడతామని బెదిరించారని తెలిపారు. క్యాబ్‌లో కూర్చున్న ప్రయాణీకుల్లో ఒకరు పోలీసులకు ఫోన్ చేయగా, డ్రైవర్ మొబైల్ ఫోన్‌ను లాక్కున్న దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. బాధితుడు పోలీసులను ఆశ్రయించి నిందితులు వాడిన బైక్ రిజిస్ర్టేషన్ నెంబర్‌ను ఫిర్యాదులో పేర్కొన్నారు. వాహనాన్ని ట్రేస్ చేసి నిందితులను జైదీప్ ముండే, మంగేష్ ముండే, అనిల్ సూర్యవంశీగా గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. -
ఆర్మీ జవాన్ కీచక చర్య
సాక్షి, హైదరాబాద్ : ఒంటరిగా ఉన్న జంటపై దాడిచేసి, యువతిపై అత్యాచార యత్నం చేసిన ఆర్మి జవాన్‌ను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఈ నెల 23న తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని అమ్మూగూడాలో ఇంటర్ చదువుతున్న ఓ యువతి మరో వ్యక్తితో ఉన్నప్పుడు బ్రిజేష్ కుమార్ అనే జవాన్ యువతిపై అత్యాచారయత్నం చేశాడు. అడ్డువచ్చిన ఆ యువకుడిని చితబాదాడు. ఈ మేరకు కేసు విచారించిన పోలీసులు నిందుతుడని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని మీడియా ముందు ప్రవేశపెట్టిన సీపీ అంజన్ కుమార్ మాట్లాడుతూ.. బ్రిజేష్ కుమార్ అనే ఆర్మీ జవాన్ అత్యాచారయత్నం చేసినట్లు ఆధారాలు లభించడంతో అతన్ని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. గత ఏడాది డిసెంబర్లో కూడా ఇలాంటి సంఘటనే జరిగిందని.. దానిపై మరింతగా విచారించిస్తే ఆ కేసుతో కూడా ఇతనికి సంబంధం ఉన్నట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. గతంలో బ్రిజేష్ ఎక్కడెక్కడ పని చేశాడో, అతనికి నేర చరిత్ర ఏమైన ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు అంజన్ కుమార్ మీడియాకు తెలిపారు. -
వారిని తక్షణమే ఉరితీయాలి..
సాక్షి, న్యూఢిల్లీ : నిర్భయ దోషులకు ఉరి శిక్షను సమరిస్థూ సర్వోన్నత న్యాయస్ధానం వెలువరించిన తీర్పుపై నిర్భయ తల్లి ఆశాదేవి స్పందించారు. 2012 నిర్భయ సామూహిక లైంగిక దాడి, హత్య కేసుకు సంబంధించి దోషులకు ఉరిశిక్షను సుప్రీం కోర్టు సమర్ధించడాన్ని ఆమె స్వాగతించారు. ‘మా పోరాటం ఇక్కడితో ఆగదు..న్యాయం జరగడంలో జాప్యం చోటుచేసుకుంది..న్యాయ ప్రక్రియలో జాప్యం సమాజంలో ఇతర కుమార్తెలపై ప్రభావం చూపుతున్న’దని ఆమె పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థను పటిష్టం చేయాలని తాను కోరుతున్నానని, దోషులకు ఉరిశిక్ష విధించి నిర్భయకు న్యాయం చేయడంతో పాటు ఇతర బాలికలు, మహిళలకు భరోసా కల్పించాలని కోరారు. ఈ రోజు సుప్రీం కోర్టు తీసుకున్న నిర్ణయం న్యాయవ్యవస్థపై తిరిగి విశ్వాసం నెలకొనేలా ఉందని స్వాగతించారు. ‘ నేరస్థులు చిన్నారులు కాదు..వారు ఇలాంటి నేరానికి పాల్పడటం దురదృష్టకరం..ఏమైనా సర్వోన్నత న్యాయస్ధానం వెలువరించిన తీర్పు న్యాయవ్యవస్థపై విశ్వాసాన్ని నిలిపిఉంచడంతో పాటు న్యాయం పొందుతామనే నమ్మకాన్ని పాదుకొల్పింద’ని ఆశాదేవి అన్నారు. మరణ శిక్షను సత్వరమే అమలుచేసి దోషులను ఉరితీయాలని నిర్భయ తండ్రి బద్రినాథ్ సింగ్ కోరారు. రివ్యూ పిటిషన్‌ను కొట్టివేస్తారని తనకు తెలుసని..అయితే తర్వాత ఏమిటని ఆయన ప్రశ్నించారు. న్యాయప్రక్రియలో చాలా జాప్యం చోటుచేసుకున్నదని, సమాజంలో మహిళలపై లైంగిక దాడులు పెచ్చుమీరుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి వీలైనంత త్వరలో ఉరిశిక్షను అమలు చేస్తే అంత మేలు చేకూరుతుందని వ్యాఖ్యానించారు. కాగా సుప్రీం తీర్పును స్వాగతిస్తూ ఇది విజయం సాధించిన క్షణమని నిర్భయ కుటుంబ న్యాయవాది రోహన్ మహజన్ అభివర్ణించారు. శిక్ష అమలు ప్రక్రియను వేగవంతం చేయాలని తామిప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. -
‘అత్యాచారాలను శ్రీరాముడు కూడా ఆపలేడు’
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తర ప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే సురేందర్ సింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలపై జరిగే అత్యాచారాలను శ్రీ రాముడు కూడా ఆపలేడని, అది చాలా సహజం’ అని పేర్కొన్నారు. రోహానియా నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన సురేందర్ శనివారం ఓ సమావేశంలో మాట్లాడుతూ.. ‘మహిళలపై జరిగే అత్యాచారాలను రాముడు కూడా నివారించలేడు. ప్రతి ఒక్కరు మహిళలను తమ కుటుంబ సభ్యులుగా, అక్కచెల్లెలుగా భావించాలి. అందరూ బాధ్యతగా వ్యవహరిస్తేనే అఘాయిత్యాలను నివారించగలం’ అంటూ వ్యాఖ్యానించారు. సురేందర్ సింగ్ గతంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పలుమార్లు వార్తల్లో నిలిచారు. ప్రభుత్వ అధికారుల కంటే ప్రాస్టిట్యూట్లు (వేశ్యలు) నయమని గతంలో ఓ కార్యాక్రమంలో వ్యాఖ్యానించారు. ప్రభుత్వ అధికారులు డబ్బులు తీసుకుంటున్నారు కానీ, పనిచేయడం లేదని, వేశ్యలు డబ్బులు తీసుకున్నా డ్యాన్స్‌లు చేసి మనకు సంతోషం కలిగిస్తారన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు మొబైల్ ఫోన్స్ ఇవ్వడం వల్లనే యువత అత్యాచారాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ కేసులో నిందితుడిగా ఉన్న మరో బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్‌కు సురేందర్ సింగ్ మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే. Main daawe ke saath keh sakta hoon ki Bhagwan Ram bhi aa jaenge to bhi ye ghatna pe niyantran kar pana sambhav nahi hai. Ye samaj ka svabhavik pradooshan hai, jisse koi bhi vanchit rehne wala nahi hai: Surendra Singh, BJP MLA on incidents of rape pic.twitter.com/dgjA7QoCtz — ANI UP (@ANINewsUP) July 7, 2018 -
కానిస్టేబుల్ కూతురిని రేప్ చేసిన డీసీపీ
ఔరంగాబాద్: మహిళకు రక్షణ కరువైన దేశంలో రక్షకభటుడే కీచకుడిగా మారిన వ్యవహారం ఇంకాస్త ఆందోళన కలిగిస్తున్నది. తన వద్ద పనిచేస్తోన్న కానిస్టేబుల్ కూతురికి మంచి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికిన డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(డీసీపీ).. ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడటమేకాక వేధింపులతో నరకం చూపించాడు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ ఎండీసీ పోలీస్ స్టేషన్లో ఈ మేరకు కేసు నమోదైంది. దర్యాప్తు అధికారి డీసీపీ వినాయక్ ధక్నే తెలిపిన వివరాలివి... తీవ్రంగా హింసించాడు: ఔరంగాబాద్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తోన్న మహిళకు 23 ఏళ్ల కూతురుంది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తన కూతురికి ఏదైనా మంచి ఉద్యోగం చూసిపెట్టమని డీసీపీ రాహుల్ శ్రీరామ్‌ను అభ్యర్థించిందా మహిళా కానిస్టేబుల్. ఆ సాకుతో యువతిని ఇంటికి పిలిపించుకున్న ఆ డీసీపీ తన పాడుబుద్ధిని ప్రదర్శించాడు. అంతటితో ఊరుకోకుండా నెలల తరబడి ఆమెను లైంగికంగా, మానసికంగా వేధింపులకు గురిచేశాడు. అతని హింస తారాస్థాయికి చేరడంతో బాధితురాలు కొద్దిగా ధైర్యం తెచ్చుకుని జరిగిన విషయాన్ని తన తల్లికి చెప్పింది. ఇద్దరూ కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి డీసీపీ రాహుల్‌పై ఫిర్యాదు చేశారు. పోలీస్ శాఖలో కలకలం.. సెలవులో డీసీపీ: మహిళా కానిస్టేబుల్ కూతురిపైనే ఉన్నతాధికారి అకృత్యానికి పాల్పడటం మహారాష్ట్ర పోలీసు శాఖలో సంచలనం రేపింది. ఈ ఉదంతంపై ఉన్నతాధికారులు వేగంగా స్పందించారు. ‘‘బాధితురాలి ఫిర్యాదుమేరకు ప్రాధమిక దర్యాప్తు అనంతరం డీసీపీ రాహుల్ శ్రీరామ్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేశాం. ప్రస్తుతం అతను సెలవుపై వెళ్లిపోయాడు. మరిన్ని సాక్ష్యాధారాలు సేకరించి, చార్జిషీటు దాఖలు చేస్తాం’’ అని దర్యాప్తు అధికారి వినాయక్ మీడియాకు తెలిపారు. ఈ వార్తకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సిఉంది. -
వివాహితపై సామూహిక అత్యాచారం
కల్వకుర్తి : పట్టణంలో ఓ వివాహితపై జరిగిన సామూహిక అత్యాచారం ఘటన కలకలం రేపింది. ఇటీవల నియోజకవర్గంలో జరుగుతున్న వరుస నేరాలు ప్రజలను కలవర పెడుతున్నాయి. ఓ సంఘటన మరువక ముందే మరోటి చోటుచేసుకోవడం పోలీసులకు సవాల్‌గా మారింది. పూర్తి వివరాలిలా.. పట్టణంలోని ఇందిరానగర్ కాలనీలో నివాసముంటున్న ఓ వివాహిత సోమవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ఆర్టీసీ బస్టాండ్ పక్కనే ఉన్న ప్రభుత్వ పాఠశాల రహదారి వెంబడి నడుచుకుంటూ వెళ్తోంది. ఆ సమయంలో అక్కడే ఉన్న జిలానీ, సల్మాన్ ఖాన్, ఆబేద్ ఖాన్, మన్సూర్ ఆమెను పిలిచి పక్కనే ఉన్న ప్రభుత్వ పాఠశాలలోకి తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టారు. వివాహిత గట్టిగా అరవడంతో అటుగా వెళ్తున్న కొందరు యువకులు వచ్చేసరికి పారిపోయారు. ఆమె ఏడుస్తూ వచ్చి విషయాన్ని అక్కడున్న వారికి వివరించింది. వెంటనే ఆ యువకులు 100 నంబర్‌కు డయల్ చేసి సమాచారం అందించగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని బాధితురాలిని ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. ఇలా చిక్కారు వివాహితను అత్యాచారం చేసి పారిపోయిన యువకులను పోలీసులు రెండు గంటల్లోపే పట్టుకున్నారు. నిందితుల అన్వేషణలో భాగంగా సంఘటన జరిగిన ప్రాంతంలో పోలీసులు విచారణ చేస్తుండగా అక్కడ ద్విచక్రవాహనాలు పార్క్‌చేసి ఉన్నాయి. వాటి నంబర్ల ఆధారంగా పోలీసులు నిందితులను పట్టుకున్నారు. అత్యాచారం జరిగిన ప్రదేశంలో సిగిరెట్లు, అగ్గిపెట్టె, లైసెన్స్ ఇతర వస్తువులు కూడా లభించాయి. ఎస్పీ, కలెక్టర్ విచారణ అత్యాచారం జరిగిన విషయాన్ని తెలుసుకున్న కలెక్టరు శ్రీధర్, ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్ మంగళవా రం ఉదయం కల్వకుర్తికి వచ్చారు. ముందుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి నిందితులు, బాధితురాలి తో మాట్లాడారు. అనంతరం అత్యాచారం జరిగిన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. డీ ఎస్పీ ఎల్సీ నాయక్, ఇన్చార్జ్ సీఐ గిరికుమా ర్, ఎస్ఐ రవి పూర్తి వివరాలు ఎస్పీకి వివరించారు. కఠినంగా శిక్షిస్తాం : డీఎస్పీ కల్వకుర్తి: అత్యాచారానికి ఒడిగట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ ఎల్‌సీనాయక్ అన్నారు. మంగళవారం కల్వకుర్తి సర్కిల్ కార్యాలయంలో సోమవారం పట్టణంలో జరి గిన అత్యాచార వివరాలను విలేకరులకు వెల్లడించారు. పట్టణానికి చెందిన నలుగురు యువకులు మహిళను అడ్డగించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపారు. స్థానికులు గమనించి అక్కడికి వెళ్లగా జేపీనగర్ వైపు పారిపోతుండగా పట్టుకున్నా మని చెప్పారు. నేరం జరిగిన 24 గంటల్లోపే నిందితులను పట్టుకున్నామని తెలిపారు. అనంతరం నిందితులను రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో కల్వకుర్తి ఇన్చార్జి సీఐ గిరికుమార్, ఎస్ఐలు రవి, బాలకృష్ణ పాల్గొన్నారు. బాధితురాలికి అండగా ఉంటాం కల్వకుర్తి టౌన్: అత్యాచారం జరిగిన బాధితురాలికి ప్రభుత్వం అండగా ఉంటుందని కలెక్టరు శ్రీధర్ అన్నారు. మంగళవారం పట్టణంలో ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్‌తో కలిసి ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడారు. పోలీసులు చాకచక్యంగా నిందితులను పట్టుకున్నారని, వారిని చట్టపరంగా శిక్షిస్తామన్నారు. ఈ సంఘటనలు పునరావృతం కాకుండా జిల్లాలో పోలీసుల గస్తీ పెంచుతామని, శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగనివ్వమని స్పష్టం చేశారు. నిఘా కట్టుదిట్టం ప్రతి పట్టణంలో సీసీ కెమెరాల ద్వారా నిఘా వ్యవస్థను కట్టుదిట్టం చేశామని ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్ అన్నారు. చట్ట విరుద్ధ పనులు ఎవరు చేసినా వదిలిపెట్టమని హెచ్చరించారు. అనంతరం వెంటనే స్పందించి నిందితులను పట్టుకున్న పోలీసులను ఆయన అభినందించారు. బస్టాండ్ సమీపంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు దగ్గరలో మద్యం దుకాణాలు ఉన్నాయని, అక్కడ తాగేవారితో ప్రజలకు, విద్యార్థులకు, గ్రంథాలయానికి వచ్చే పాఠకులకు ఇబ్బందులు కలుగుతున్నాయని తెలిపారు. సమావేశంలో కల్వకుర్తి ఆర్డీఓ రాజేష్ కుమార్, డీఎస్పీ ఎల్సీ నాయక్, కల్వకుర్తి ఇన్చార్జి సీఐ గిరికుమార్, ఎస్ఐలు రవి, బాలకృష్ణ, రామ్మూర్తి తదితరులు ఉన్నారు. -
నిందితులను శిక్షించాలి
ఎదులాపురం(ఆదిలాబాద్) : బాలికపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని పలు యువజన సంఘాలు డిమాండ్ చేశాయి. మంగళవారం రాత్రి పలు సంఘాలు జిల్లా కేంద్రం ఆదిలాబాద్‌లోని తెలంగాణ చౌక్ నుంచి అమరవీరుల స్తూపం వరకు కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు మాట్లాడుతూ మహిళా చట్టాల అమలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి విఫలమయ్యాయని అన్నారు. మొన్న జమ్మూకశ్మీర్.. నేడు సోన్‌లో.. మహిళలపై ప్రతి రోజు ఎక్కడో ఒక చోట ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయని అన్నారు. ప్రభుత్వాల్లో మచ్చుకైనా మార్పు కనిపించడం లేదని విమర్శించారు. నిర్మల్ జిల్లా సోన్‌లో బాలికపై అత్యాచారానికి పాల్ప డిన డోకల ప్రవీణ్, మరో నిందితుడిని కఠి నంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాం టి సంఘటనలు పునరావృతం కాకుండా చట్టాలను పటిష్టం చేయాలని అన్నారు. తెలంగాణ యువజన సంఘాల సమితి జిల్లా అధ్యక్షుడు బాల శంకర్ కృష్ణ, ఊరే గణేశ్, మానవసేవా మాధవ సేవా సంఘం సభ్యురాలు శశిశకళ, బెస్ట్‌ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, తెలంగాణ జన సమితి జిల్లా నాయకులు సామల ప్రశాంత్, మాల సంక్షేమ నాయకులు పతి హర ప్రభాకర్, పీడీఎస్‌యూ జిల్లా నాయకురాలు కళావతి, తెలంగాణ ప్రజా వైద్యారోగ్య సంఘం నాయకులు బండారి కృష్ణ, టీఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండారు సతీశ్, కౌన్సిలర్లు దోని జ్యోతి, శైలేందర్, సత్యనారాయణ, వెంకటరమణ పాల్గొన్నారు. -
బాధితురాలు..నిందితుడికి పోలీస్ స్టేషన్లో వివాహం
బరంపురం : గంజాం జిల్లాలోని బల్లిగుడ ప్రాంగణంలో ఓ మహిళా హోమ్‌గార్డుపై జవాన్ అత్యాచారానికి పాల్పడిన సంఘటనలో బాధి త మహిళకు నిందితుడితో పోలీసులు సోమవారం వివాహం జరిపిం చారు. వివరాలిలా ఉన్నాయి. కొందమాల్ జిల్లా బల్లిగుడ పోలీస్‌స్టేషన్‌లో హోమ్‌గార్డుగా విధులు నిర్వహిస్తున్న మహిళపై..జవాన్ తరిణి మహేంద్ర అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ సంఘటనపై బాధిత మహిళా హోమ్‌గార్డు సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేసిన పోలీసులు బాధితురాలితో నిందితుడు తరిణి మహేంద్రకు రాజీ కుదిర్చి సోమవారం జి.ఉదయగిరి పోలీస్‌స్టేషన్‌లో ఇద్దరికీ సంప్రదాయబద్ధంగా వివాహం జరిపించారు. -
రేప్ ఎలా చేశారో చెప్పు...
మైనర్ బాలికపై జరిగిన అకృత్యాన్ని రాజకీయం చేద్దామనుకున్న నేతలు అడ్డంగా బుక్కైపోయారు. బిహార్‌లో సంచలనం సృష్టించిన గయ తల్లికూతుళ్ల సామూహిక అత్యాచారం కేసులో కొందరు వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. రేప్ ఎలా జరిగిందో? చెప్పాలంటూ బాధితురాలిని ఇబ్బందులకు గురి చేయటంతో వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పట్నా: గయ జిల్లా సోనిదిహ్ గ్రామం సమీపంలో బుధవార రాత్రి ఓ వైద్యుడ్ని చితకబాది చెట్టుకు కట్టేసి, తుపాకీతో బెదిరించి అతని భార్య(35), కూతుళ్ల(15) 20 మంది గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. ఆపై రంగంలోకి దిగిన పోలీసులు గ్రామస్తుల సాయంతో మరుసటి రోజు ఉదయం(గురువారం) కల్లా నిందితులందరినీ అరెస్ట్ చేశారు. ఈ ఘటన బిహార్‌తోపాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ కేసులో బాధితురాలైన మైనర్ బాలికను శుక్రవారం వైద్య పరీక్షల నిమిత్తం తీసుకెళ్లారు. ఆ సమయంలో పోలీసుల వాహనాన్ని అడ్డుకున్న కొందరు ఆమెను బలవంతంగా కిందకి దించి పరామర్శించారు. ‘నీపై రేప్ ఎలా జరిగింది?.. ఎంత మంది అఘాయిత్యానికి పాల్పడ్డారు. మీ అమ్మ ఆ సమయంలో ఏం చేస్తోంది?... అంటూ ఇలా ప్రశ్నలు గుప్పించారు. అంతటితో ఆగకుండా ఆ బాలిక ఇష్టం లేకుండానే సెల్ఫీలు, వీడియోలు తీసుకున్నారు. అడొచ్చిన పోలీస్ సిబ్బందిని నెట్టేసి మరీ అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆర్జేడీ నేతలపై కేసులు.. తొలుత ఆ వీడియోలు, ఫోటోలు ఆర్జేడీ నేతల ట్విటర్ అకౌంట్లలో, పార్టీ అధికారిక పేజీల్లో చక్కర్లు కొట్టాయి. ఆపై స్థానిక మీడియా ఛానెళ్లలో కూడా హల్ చల్ చేయటంతో పోలీసులు ఆర్జేడీ నేతలపై కేసు నమోదు చేశారు. ఆర్జేడీ జాతీయ కార్యదర్శి మెహతా, బెలగంజ్ ఎమ్మెల్యే సురేంద్ర ప్రసాద్ యాదవ్, మహిళా విభాగం ప్రెసిడెంట్ అభ్‌లతా, జిల్లా అధ్యక్షుడు ముర్షిద్ అలమ్, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు సరస్వతి దేవీ.. తదితరుల పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చారు. పోలీసుల విధులకు విఘాతం కలిగించారన్న అభియోగాలను కూడా వారిపై నమోదు చేసినట్లు డీఐజీ ప్రకటించారు. తేజస్వి గుస్సా... అయితే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తమ పార్టీ నేతలపై కేసులు నమోదు చేయించిందని ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ చెబుతున్నారు. ఘటనపై నిజనిర్దారణ కమిటీ నియమించినట్లు, దానికి స్వయంగా తానే నేతృత్వం వహిస్తున్నట్లు తేజస్వి తెలిపారు. ఆరోపణలు రుజువైతే అందరిపై చర్యలుంటాయని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు మెహతా కూడా తమపై వస్తున్న ఆరోపణలను ఖండించారు. ‘అత్యాచారం జరిగిన 24 గంటల్లోపు బాధితులకు వైద్య పరీక్షలకు పంపాలి. కానీ, ఆలస్యంగా పోలీసులు ఆమెను తీసుకెళ్లటంతో అనుమానం వచ్చి అడ్డుకున్నాం. ఆమెతో మాట్లాడుతున్న సమయంలో మీడియా అక్కడికి వచ్చింది. అందుకే బాధితురాలు మాపై అసహనం ప్రదర్శించింది. అంతేతప్ప మేమేం ఆమెను ఇబ్బంది పెట్టలేదు’ అని మెహతా మీడియాకు తెలిపారు. బాధితురాలి మాట్లలో.. నేను బతిమాలుతున్న నన్ను బలవంతంగా వాహనం నుంచి దించేశారు. నన్ను ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేశారు. చాలా ఇబ్బందిగా అనిపించింది. అరిచేశా... ఆ మృగాళ్లకు ఉరి శిక్ష పడేదాక నా ముఖం ప్రపంచానికి చూపించకూడదనుకున్నా. కానీ, నేతల అత్యుత్సాహం నా ఉనికిని ప్రపంచానికి తెలియజేసింది. -
బాలిక కుటుంబాన్ని ఆదుకుంటాం
వజ్రపుకొత్తూరు శ్రీకాకుళం : మండలంలోని బెండి గ్రామంలో ఈ నెల 5న జరిగిన అత్యాచార ఘటనకు సంబంధించి బాధిత బాలిక కుటుంబాన్ని ఆదుకుంటామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కొయ్యాన శ్రీవాణి తెలిపారు. బెండి గ్రామంలో సోమవారం ఆమె బాలిక తల్లి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా బాలిక ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. బాలిక తల్లిదండ్రుల మధ్య విభేదాలు, ఇతర సామాజిక అంశాల్లో గొడవలు జరుగుతున్నందున తక్షణమే బాలిక తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి.. భార్యభర్తలు ఒకే చోట ఉండేలా చర్యలు తీసుకోవాలని శ్రీకాకుళం డీఎస్పీని సూచించారు. మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని బాలిక తండ్రి తరఫు కుటుంబసభ్యులకు హెచ్చరించారు. శ్రీకాకుళంలో భార్యభర్తలకు కౌన్సెలింగ్ ఇచ్చిన తర్వాత బాలిక తల్లికి మానసిక నిపుణుడితో పరీక్షలు నిర్వహించి.. మందులు ఉచితంగా అందించాలని శ్రీకాకుళం మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీని ఆదేశించారు. బాలిక తాతయ్య, తల్లితో మాట్లాడారు. ఎలాంటి ఆర్థికసాయం కావాలన్నా ఫోన్ చేయాలని సూచించారు. ప్రభుత్వం తరఫున సాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా చైల్డ్ ప్రొటక్షన్ ఆఫీసర్ కేవీ రమణ, కాశీబుగ్గ ఐసీడీఎస్ ఏసీడీపీఓ ఎస్.అరుణ, ఇన్చార్జి సూపర్వైజర్ అరుణ, తదితరులు ఉన్నారు. -
మగాళ్ల కోసం ఓ కమిషనా?!
ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్మన్ ‘పురుష కమిషన్’ కూడా ఉండా లని వాక్రుచ్చారు. దాంతో మహిళలే కాదు పురుష ప్రపంచం కూడా నివ్వెరపోయింది. ఎవరో కొద్దిమంది 498ఎ ముద్దా యిలు, 498ఎ బూచితో ఎన్ఆర్ఐ నిధులు పొందే ‘బాధితుల’ సంఘాలు మినహాయింపు అనుకోండి. ఈ అద్భుతమైన ఆలోచన, ఆమె దగ్గరికి వస్తున్న వారికి ఆమె కౌన్సెలింగ్ ఇస్తున్న సందర్భంలో ఆమె చైర్మన్‌గా ‘కేసు’ తెలుసుకోవడం మానేసి కౌన్సి లింగ్‌లు నిర్వహిస్తున్న సందర్భంలో వచ్చిందన్న మాట. 40 శాతం భార్యల తప్పు ఉన్నట్లు ఆమెకు తెలిసిందట. ఈ శాతం అంశంలో ఆమె అనుభవాల నయినా ఒక పద్ధతి ప్రకారం నమోదు చేసి విశ్లేషించి చెప్పలేదు. ఇటువంటి అరుదైన అధ్యయనాలతో మహిళా సంఘాల కళ్లు తెరిపించడానికి, లెక్కలు విడుదల చేయండి అంటే అబ్బే అలా చేయకూడదు. వాళ్ల పేర్లు బయటపెట్టకూడదన్నారు. అసలు 40 శాతం స్త్రీలు.. పురుషుల్ని బాధ పెట్టేంత సాధికారత పొందినట్లయితే ఇక మహిళా కమిషన్ అవసరం ఏముంది? 60 శాతం పురుషులు హింసిస్తున్నారట. సగం వాళ్లు సగం వీళ్లు హింసిస్తూ సాగే పవిత్ర కుటుంబ వ్యవస్థ ప్రపంచానికి ఆద ర్శంగా ఉంటుంది. అసలు కుటుంబం అంటే ఏమిటి? గృహ హింస ఏ ఆధిపత్య సంబంధాల వలన వస్తుంది? వాటిని ఆర్థిక వ్యవస్థ– (వనరుల్లేక స్త్రీలు ఆధారపడే స్థితి) ఎందుకు కొనసాగిస్తుంది? వంటì మౌలిక అవగాహన కూడా లేని వ్యక్తుల్ని కమి షన్లలో నియమించడమే అసలు దారుణం. ఆంధ్రప్రదేశ్‌లో భర్తల్ని చంపిన భార్యలకు చెందిన రెండు మూడు ఘటనలు, తెలంగాణలో జరి గిన ఐదు ఘటనలు.. ఇంకా దేశంలో అత్యంత అరు దుగా జరిగే ఇటువంటి ఘటనలు మీడియాలో చాలా సమయం పొందుతున్నాయి. ఒక నల్ల బానిస తెల్ల వాడిని చంపితే ఇటువంటి ఆగ్రహమే ప్రకటిత మయ్యేది ఒకప్పుడు. ఒక శూద్రుడు బ్రాహ్మడిని తన్నితే ఇలాగే కూసాలు కదిలిపోయేవి. ఒక స్త్రీ భర్తను కాదంటే ఇలాగే ఆవేశాలు పెల్లుబికేవి. 498ఎని నీరుకార్చడం ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరో ధక చట్టం బుట్టదాఖలు చేయటం ఇపుడు ఎదురు దాడి చేస్తున్న ఆధిపత్య వర్గాల వ్యూహంలో భాగమే. వ్యక్తిగతంగా నేరం చేసినవాళ్లని ఎవరినయినా చట్టప్రకారం సత్వరంగా న్యాయ విచారణ పూర్తిచేసి శిక్షించాలి. దీనికి ఆడ, మగా తేడా లేదు. అట్లాగే నేర ప్రవృత్తి స్త్రీలకు ఉండదు అనడం స్త్రీలను దేవతలుగా కీర్తిస్తూ బానిసలుగా మార్చిన సంస్కృతి తాలూకూ భావజాలమే. ఆమె మనిషి. మనిషికుండే మంచి చెడు లక్షణాలు ఆమెక్కూడా ఉంటాయనడం వాస్త వం. మహిళా కమిషన్ ఏర్పాటు జరిగింది మహిళలు ఏం చేసినా రక్షించడానికి కాదు. కుటుంబ వ్యవస్థకు కాపలా వేయడానికి కూడా కాదు. ప్రపంచ వ్యాప్తంగా 40 శాతం స్త్రీలు గృహ హింసకు గురవుతున్న విషయం నమోదు కాదు. కుటుంబ పరువు, ఆర్థికంగా ఆధారపడటం, పిల్లలకు వేరే భరోసా లేకపోవడంతో హింసను వీళ్లు మౌనంగా భరిస్తుంటారు. అలా భరించడమే ఉత్తమ ఇల్లాలి లక్షణమని సమాజం, మతం ఊదరగొట్టి స్త్రీల నరనరాల్లో దీన్ని నింపేశారు. కానీ ఇపుడు కాస్త చదువుకుని, ఉద్యోగాలు చేస్తూ ప్రపంచం తెలు సుకుని నేనూ మనిషినే అని తిరగబడితే అది మగా డిపై హింసగా మారిపోతోంది. ‘అత్తమామల్ని చూడ రంట. ఆడపడుచులకి సేవలు చేయరంట. ఎంత దారుణం’ అని సదరు చైర్మన్ వాపోతున్నది. అలా అయితే భార్య తల్లిదండ్రుల్ని చూసే బాధ్యత భర్తకు ఉందా? ఇద్దరూ సమానం అయినపుడు ఇరువైపులా తల్లిదండ్రులపట్లా సమానంగా బాధ్యత వహించాలి కదా. అట్లా కాకుండా తనపై పెత్తనం చేసే వారికి సేవలు చేయకపోవడం దారుణం అంటున్నామంటే కుటుంబం ‘మగాడిది’ అని అంగీకరించడమే. భర్త తాలూకు అధికారంతో తనపై నిరంతర నిఘా వేసి తప్పులుబట్టి సేవల్ని కూడా గుర్తించక పోవడం తమ హక్కుగా భావించే వారితో కలిసి ఉండాలని ఎవరికి ఉంటుంది? వారి జీవిత భాగస్వాములను వారికి బలవంతంగా సేవలు చేయమనడం సరికాదు. ‘మగాడి’ ఇంటికి వచ్చి ఇంటి పేరు (కొన్నిసార్లు స్వంత పేరు కూడా) మార్చుకుని, అత్తింటి మనిషిగా స్త్రీలను తయారు చేసే క్రమమే హింస. ఓ మనిషిగా గుర్తింపుని (కన్యాదానంతో) కోల్పోయే క్రమం. సామాజిక కట్టుబాట్లతో మొదలయ్యే హింస. స్త్రీలపై హింస నానాటికీ పెరుగుతుండటం అంటే ఆధిపత్యం, అసమానత పెరుగుతున్నదనే అర్థం. చదువురాని స్త్రీలు కూడా తమ అనుభవాల నుంచి∙దీనిని చక్కగా అర్థం చేసుకోగలరు. ఆధిపత్యాన్ని సమర్థించేవారు దీన్ని అర్థం చేసుకోవడానికి నిరాకరిస్తారు. పీడితులకు న్యాయం చేయాల్సిన పద విలో ఉన్న వారికి పీడిత వర్గ పక్షపాతం లేకుంటే వారికి అన్యాయం జరుగుతుంది. స్త్రీలకు చట్టపరమైన హక్కులు కల్పిస్తున్నాయా లేదా పర్యవేక్షించడానికి ఒక స్వతంత్ర సంస్థగా ఏర్ప రచినవే కమిషన్లు. వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వాలు అన్నింటిపైనా నిఘా ఉంచడం. వాటిని ప్రశ్నించడం, పనిచేసేలా ముల్లుగర్రతో పొడవటం. చట్టాల లోపాలను ఎత్తిచూపడం వీటి పని. వివాహేతర సంబంధాలలో పురుషుడికే స్వేచ్ఛ ఉంది. స్త్రీకే లేదు. స్త్రీ వివాహం వద్దని చెబితే గౌరవ హత్యలు జరుగుతాయి. విడాకులు కావాలంటే.. వెలి వేస్తారు. చుట్టూ వాతావరణం నేరం చేసినా తప్పిం చుకోవచ్చనే భరోసా కల్పిస్తుంది. భర్తను చంపే బదులు వదిలివేయవచ్చు కదా అని దీర్ఘాలు తీస్తు న్నారు కొందరు. రెండేళ్లలో 87 శాతం పెరిగిన వర కట్న హత్యలకు కారకులైన భర్తలక్కూడా అదే చెప్పి చూడండి. గృహ హింసకు కారణం అయిన వారికి ఈ నీతిబోధ చేయండి.స్త్రీలు ఇట్లా చేసినవి జరిగిన నేరాల్లో 0.0000 శాతం కూడా లేవు. దానికే ఇంత గగ్గోలు అంటే మనది ఎంత మగాధిపత్య సమాజమో, ఎంత మగ మీడియానో, స్త్రీలు అణగి ఉండాలనే భావజాలం మనలో ఎంత పేరుకుపోయిందో అర్థమౌతుంది. సమాజంలో గల అసమానతకు తద్వారా స్త్రీలపై హింసకు కుటుంబంలోని ఆధిపత్య సంబంధాలకూ, హింసకూ గల సంబంధాన్ని దాని చారిత్రక క్రమాన్ని అందరూ అధ్యయనం చేయక పోవచ్చు. కానీ కాస్త ఇంగిత జ్ఞానం, వాస్తవాల పట్ల గౌరవం ఉండాలి. కమిషన్ చైర్మన్‌గా ఉన్నప్పుడు తాను మాట్లా డిన మాట మహిళల ప్రయోజనాలకు గొడ్డలి వేటుగా మారుతుందనీ, స్త్రీలను హింసించేవారంతా ఈ తప్పుడు వాదనను భుజానేసుకుంటారనే సోయి కూడా లేనివారికి రాజ్యాంగ పదవి ఉండాలా? అర్హ తలేమీ లేకుండా ఒక రాజ్యాంగ పదవిలో వ్యక్తుల్ని నియమిస్తే ఏమవుతుందో ప్రభుత్వాలకు ఇప్పుడ యినా అర్థమైందో లేదో.. వారికి అర్థం కాకుంటే ఇటువంటి భావాలున్న వారినీ, అనర్హులనూ పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేయాలి. దేవి వ్యాసకర్త సాంస్కృతిక కార్యకర్త -
కామాంధుడి చేతిలో 6 గంటలు నరకం
సాక్షి, న్యూఢిల్లీ: పదుల సంఖ్యలో లైంగిక వేధింపుల కేసులు. జైలుకు వెళ్లటం.. బెయిల్‌పై రావటం... మళ్లీ అదే తరహా నేరాలకు పాల్పడటం ఆ కామాంధుడికి అలవాటుగా మారిపోయింది. ఈ క్రమంలో ఒంటరిగా ఉంటున్న ఓ యువతిపై ఆ కిరాతకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆరు గంటలపాటు మృగ చేష్టలతో ఆమెకు నరకాన్ని చూపించాడు. దేశ రాజధానిలో జరిగిన ఈ దారుణ ఘటన వివరాల్లోకి వెళ్తే... వసంత్ కుంజ్‌లోని రంగ్‌పూరి పహారిలో ఓ యువతి(27) ఒంటరిగా నివసిస్తోంది. మే 29వ తేదీన రాత్రి 10 గంటల సమయంలో ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగొచ్చింది. తాళం తీస్తున్న సమయంలో వెనకాల నుంచి వచ్చి ఓ వ్యక్తి అమాంతం ఆమెను ఇంట్లోకి ఈడ్చుకెళ్లాడు. మంచానికి కట్టేసి ఆమెతో బలవంతగా మందు తాగించి, ఆపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అలా ఆరు గంటలపాటు అతని వికృత క్రీడలు కొనసాగాయి. చివరకు ఉదయం నాలుగు గంటల సమయంలో ఆమె ఫోన్ తీసుకుని అక్కడి నుంచి పారిపోయాడు. స్నేహితురాలి సాయంతో వసంత్ కుంజ్ పోలీసులకు యువతి ఫిర్యాదు చేసింది. అయితే ఆమె చెప్పిన ఆనవాళ్లతో పోలీసులు ఓ వ్యక్తి ఫోటోను చూపించారు. ఫోటోలో ఉన్నదే నిందితుడిగా ఆమె అతన్ని గుర్తించటంతో గాలింపు చేపట్టారు. చివరకు నిందితుడైన సందీప్ చౌహాన్‌ను జూన్1న పోలీసులు అరెస్ట్ చేశారు. సందీప్ నేర చరిత్ర... పశ్చిమ్ విహార్‌కు చెందిన 38 ఏళ్ల సందీప్ వివాహితుడు. ఓ పాప కూడా ఉంది. గతంలో తైక్వాండో ట్రైనర్‌గా పని చేసేవాడు. ఏడాదిన్నర క్రితం ఓ యువతిని లైంగికంగా వేధించిన కేసులో మొదటిసారి అరెస్ట్ అయ్యాడు. దాంతో ఉద్యోగం ఊడింది. అప్పటి నుంచి తప్పుడు మార్గంలోనే ప్రయాణిస్తూ వస్తున్నాడు. కంటికి కనిపించిన మహిళలతో అసభ్యంగా ప్రవర్తించటం, వారి వెంటపడి వేధింపులకు గురిచేయటం, దాడి చేసి వాళ్ల దగ్గరి నుంచి గొలుసులు, ఫోన్లు దొంగతనం చేయటం... అలవర్చుకున్నాడు. ఈ క్రమంలో చాలాసార్లు జైలుకు వెళ్లి, బెయిల్‌పై బయటికొచ్చేవాడు. ఇప్పటిదాకా అతనిపై 30 కేసుల దాకా నమోదయినట్లు తెలుస్తోంది. ‘సందీప్ దాడి చేసిన మహిళలెవరూ అతనికి తెలీదు. అప్పటికప్పుడే వారిని లక్ష్యంగా చేసుకుని వారిపై దాడికి పాల్పడుతుంటాడు. కానీ, అత్యాచారం కేసులో అరెస్ట్ కావటం మాత్రం ఇదే తొలిసారి’ అని వసంత్ కుంజ్ ఎస్సై చెబుతున్నారు. ఇదిలా ఉంటే రెండు నెలల క్రితం తాను ఉండే ప్రాంతంలోనే ఓ మహిళ ఇంటి ముందు సందీప్ వికృత చేష్టలకు పాల్పడిన నేరంలో జైలుపాలయ్యాడు. బెయిల్‌పై బయటకు వచ్చిన కొద్ది రోజులకే ఇలా అత్యాచారం కేసులో ఇప్పుడు మళ్లీ ఊచలు లెక్కిస్తున్నాడు. పోలీసులేం చేస్తున్నారు?.. కాగా, ఈ ఘటనపై పలు మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వరుసగా నేరాలకు పాల్పడుతున్న వ్యక్తిని కఠినంగా శిక్షించకపోవటం, సమాజంలో తిరుగుతున్న అతనిపై నిఘా వేయకపోవటం ముమ్మాటికీ పోలీసుల నిర్లక్ష్యమేనని విమర్శిస్తున్నారు. శనివారం ఓ ఎన్జీవో ఆధ్వర్యంలో మహిళలు, విద్యార్థినులు పట్టణంలో ర్యాలీ నిర్వహించి, సందీప్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. -
వీన్స్టన్కు 25 ఏళ్ల శిక్ష..!
న్యూయార్క్ : లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న హాలీవుడ్ నిర్మాత హార్వీ వీన్‌స్టీన్ అరెస్టైన విషయం తెలిసిందే. ఒక మహిళపై అత్యాచారానికి పాల్పడటంతో పాటు, మరో మహిళపై లైంగిక దాడికి యత్నించినట్లు కేసులు నమోదైన నేపథ్యంలో.. బుధవారం మన్హటన్ క్రిమినల్ కోర్టుకు వీన్‌స్టీన్ హాజరయ్యారు. ఆయన తరపు న్యాయవాది బ్రెఫ్మాన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘కేసుకు సంబంధించిన పూర్తి సమాచారం తన క్లైంట్ వద్ద లేదని.. తమకు సాక్ష్యాధారాలు సేకరించుకునేందుకు సమయం సరిపోనందున తమకు గడువు ఇవ్వాలని కోరామన్నారు. తన క్లైంట్‌పై నిరాధార ఆరోపణలు చేశారని, అందుకు తగిన ఆధారాలు కోర్టుకు సమర్పిస్తామని బ్రెఫ్మాన్ తెలిపారు. త్వరలోనే వీన్‌స్టీన్ ఈ నేరారోపణల నుంచి బయటికి వస్తారని.. నిరాధారమైన ఇటువంటి కేసులు ఎక్కువ కాలం నిలవవని ఆయన వ్యాఖ్యానించారు. వీన్‌స్టీన్ తనపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ ఆరోపించిన తర్వాత కూడా ఆ మహిళ ఆయనతో 10 ఏళ్ల పాటు రిలేషన్షిప్లో ఉన్నారని, ఇప్పుడు కూడా ఆ బంధం కొనసాగుతోందంటూ అసంబద్ధ వ్యాఖ్యలు చేశారు. అయితే ‘తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న ముద్దాయి.. తనపై మోపబడిన అభియోగాలకు జవాబుదారీగా ఉండాల్సిన అవసరం ఉందని’ మన్హటన్ డిస్ట్రిక్ట్ అటార్నీ సైరస్ వాన్స్ వ్యాఖ్యానించారు. కాగా, వీన్‌స్టీన్ దోషిగా తేలితే 25 ఏళ్ల శిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
మహిళలపై జరుగుతున్నదాడులను అరికట్టాలి
ఖమ్మంమయూరిసెంటర్ : సభ్య సమాజం సిగ్గుపడే విధంగా చిన్నారులపై, బాలికలపై, మహిళలపై లైంగికదాడులు, హత్యలు జరుగుతున్నాయని, వాటిని నివారించే చర్యలు చేపట్టడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు జి.లలిత అన్నారు. బుధవారం స్థానిక రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన పీఓడబ్ల్యూ, పీవైఎల్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో లలిత మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దళితులపై, మైనార్టీలపై దాడులు పెరిగాయన్నారు. మహిళలకు రక్షణ కరువైందని, బీజేపీ నాయకులే దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అశ్లీల సాహిత్యాన్ని పెంచిపోషిస్తున్న వారికి ప్రభుత్వాలు మద్దతుగా నిలుస్తున్నాయని, మహిళలపై దాడులు ఒక ప్రాంతానికి, ఒక రాష్ట్రానికి పరిమితం కాలేదని పేర్కొన్నారు. మహిళలపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఈ నెల 25వ తేదీన పీఓడబ్ల్యూ, పీవైఎల్ ఆధ్వర్యంలో ఖమ్మంలో సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సదస్సులో మేధావులు, ప్రజా సంఘాలు, స్వచ్చంద సంస్థల బాధ్యులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో పీవైఎల్, పీఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శులు కె.శ్రీనివాస్, సీహెచ్ శిరోమణి, నాయకులు ఝాన్సీ, మంగతాయి, ఎం.జగన్ తదితరులు పాల్గొన్నారు. -
అత్యాచారాల్లో.. మొదటిస్థానంలో గంజాం జిల్లా
బరంపురం : మహిళలపై అత్యాచారాల కేసుల్లో రాష్ట్రంలో గంజాం జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని ఇటీవల ఒక సర్వేలో తేలిందని రాష్ట్ర బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు జయంతి పోడియారి ఆరోపించారు. స్థానిక రామలింగేశ్వర్ ట్యాంక్ రోడ్లో గల భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో బీజేపీ మహిళా సురక్షా యాత్ర సభ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు జయంతి పోడియారి మాట్లాడుతూ రాష్టాంలో బీజేడీ ప్రభుత్వం మహిళల హక్కులను కాల రాస్తోందని మండిపడ్డారు. ఇందుకు స్వయా న ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రతినిధ్యం వహిస్తున్న గంజాం జిల్లా ఉదాహరణగా నిలుస్తోందని విమర్శించారు. జిల్లాలో ప్రతి రోజూ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యల్లో రాష్ట్రంలో మొదటి స్థానంలో గంజాం జిల్లా నిలిచిందని ఆవేదన వెలిబుచ్చారు. భారత రాజ్యాంగం కల్పించిన మహిళల హక్కుల కోసం అందరం కలిసికట్టుగా పోరాటం సాగించాలని ఇందుకు అందరూ కృషి చేయాలని కోరారు. బహిరంగ సభలో బీజేపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు సుభాషిణి పట్నాయక్, బీఎంసీ కార్పొరేటర్ నమి తా పాఢి, మాజీ మంత్రి సురమా పాఢి తదితర వందలాది మంది మహిళలు పాల్గొన్నారు. -
బోటింగ్ రంగంలోనూ మాఫియా..
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా జరుగుతున్న బోటు ప్రమాదాలు విచారకరం...వీటిని అరికట్టడంలో ప్రభుత్వం వైపల్యం చెందిందని...బోటింగ్ రంగంలో కూడా మాఫియా ఉందని సీపీఐ కేంద్ర కమిటీ కార్యదర్శి నారాయణ విమర్శించారు. ఈ ఘటనపై సీనియర్ ఐఏఎస్ అధికారితో కమిటీ వేసి విచారణ జరిపించాలని, అంతేకాక బాధిత కుంటుంబాలకు రూ.10 లక్షల చొప్పున నష్ట పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండు చేశారు. ఈ సందర్భంగా నారాయణ బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న బోటు ప్రమదాలు, అత్యాచార సంఘటనలపై ఆందోళన వ్యక్తం చేశారు. అత్యాచారాల పోటీ పెడితే ఆంధ్రప్రదేశ్ ప్రధమ స్థానంలో నిలుస్తుందన్నారు. అత్యాచారాల నిరోధానికి కేంద్ర ప్రభుత్వం జీవోలు జారీ చేస్తుంది...కానీ జమ్ము కాశ్మీర్లో జరిగిన ‘కథువా అత్యాచార’ ఘటనలో స్వయంగా ఆ పార్టీకి చెందిన ఉప ముఖ్యమంత్రే నిందితుడుగా ఉన్నాడని తెలిపారు. బీజేపీ కర్ణాటకలో గెలిచిన తర్వాత ఇక తమకు దక్షిణాదిలో కూడా తిరుగులేదని భావిస్తుందని, కానీ కర్ణాటకలో బీజేపీ నైతికంగా ఓడిపోయిందని విమర్శించారు. అంతేకాక కర్ణాటక గవర్నర్ ముఖ్యమంత్రి అభ్యర్థిని నిర్ణయించకుండా వాయిదా వేయడం విచారకరమని, గవర్నర్లు పాలకపక్షానికి మేలు చేసే విధంగా ప్రవర్తిస్తున్నరని అన్నారు. వెంటనే గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తమ వద్ద ఉన్న నల్ల ధనాన్ని తెల్లగా మార్చుకోవడం కోసమే బీజేపీ నోట్ల రద్దును తీసుకువచ్చిందని, కేంద్రం ప్రభుత్వం తీసుకునే ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాడ్డానికి సీపీఐ పార్టీ సిద్దమవుతుందని తెలిపారు. ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కేంద్రం 75 శాతం విభజన హమీలను నెరవేర్చిందన్న కన్నా లక్ష్మీనారాయణ వాఖ్యలను ఖండిస్తూ, అధ్యక్షుడు కాకముందే ఇన్ని అసత్యాలు ప్రచారం చేస్తున్నారు, ఇక ఇప్పుడు అధ్యక్షడు అయ్యారు...ఇంకా ఎన్ని అబద్దాలు ప్రచారం చేస్తారో అని విమర్శించారు. కన్నా ప్రచారం చేసే అసత్యాలు చూసే బీజేపీ పార్టీ ఆయనకు అధ్యక్ష పదవి ఇచ్చి ఉంటుందన్నారు. కాగా ప్రముఖ సీపీఐ నాయకుడు చండ్ర రాజేశ్వర్‌రావు భవన నిర్మాణానికి గాను అమరావతిలో 3 ఎకరాల భూమిని కేటాయించినందుకు గాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడుకు నారాయణ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. -
రాత్రి పాతగుంటూరులో ఉద్రిక్తత
-
వైరల్ వీడియోపై పోలీసుల దర్యాప్తు
పట్నా : మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడటమే కాకుండా.. అందుకు సంబంధించిన వీడియోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు మృగాళ్లు. తాజాగా కొందరు యువకుల ముందే ఓ మహిళపై వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతే కాకుండా ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. గత వారం నుంచి ఈ వీడియో వైరల్‌గా మారింది. అయితే బిహార్ పోలీసులు దీన్ని సీరియస్‌గా తీసుకున్నారు. అందులోని సంభాషణల ఆధారంగా ఆ ఘటన బిహార్‌లోని మగధ ప్రాంతంలో జరిగి ఉంటుందని భావిస్తున్నారు. గయా పోలీస్ స్టేషన్లో ఈ ఘటనపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీనిపై గయా ఎస్పీ రాజీవ్ మిశ్రా మాట్లాడుతూ.. ‘నేరం ఎక్కడ జరిగింది, బాధితురాలు ఎవరన్నది తెలియలేదు. కానీ డీఐజీ ఆదేశాలతో ఆదివారం కేసు నమోదు చేశాం. మగధ ప్రాంతంలోని అన్ని జిల్లాలకు ఈ కేసుకు సంబంధించిన వివరాలు అందించడం జరిగింది.. పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతుంది. ఒక వేళ ఈ నేరం వేరే జిల్లాలో జరిగినట్లు తెలిస్తే ఈ ఎఫ్ఐఆర్ను అక్కడి పోలీస్ స్టేషన్‌కు తరలిస్తాం’ అని తెలిపారు. ఇటీవల గయా సమీపంలోని జెహానాబాద్‌లో ఓ బాలికపై వేధింపులకు పాల్పడిన వీడియో కూడా వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన పోలీసులు ఆ ఘటనతో సంబంధం ఉన్న 13 మందిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అదే తరహలో ఈ కేసులో నిందితులను పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. -
అన్యాయం.. బాధితురాలినే శిక్షించారు
జైపూర్ : బాధితులకు న్యాయం చేయాల్సింది పోయి తిరిగి వారికే శిక్ష విధించిన సంఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. రాజస్థాన్ చిత్తోర్‌ఘడ్‌కు చెందిన ఓ యువతికి అదే గ్రామానికి చెందిన యువకుడు మత్తు మందు ఇచ్చి ఆమెను అసభ్యకర రీతిలో వీడియో తీసాడు. అనంతరం ఆ వీడియోలను బయటపెడతానంటూ బెదిరించి ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ సంఘటన గురించి బాధుతురాలు ఆమె తల్లిదండ్రులకు చెప్పడంతో వారు నిందితునిపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు వాపసు తీసుకోవాలని బాధితురాలిని పంచాయతీ పెద్దలు వత్తిడి చేశారు. ఆమె నిరాకరించడంతో బాధితురాలి కుటుంబాన్ని ఊరు నుంచి బహిష్కరించారు. బాధితురాలి కుటుంబంతో ఎవరూ మాట్లడవద్దని, వారికి ఎటువంటి సహాయం చేయవద్దని కనీసం తిండి గింజలు కూడా ఇవ్వద్దని ఆదేశించారు. అంతేకాక పంచాయతీ తీర్పును పాటించనందుకు గాను బాధితురాలి కుటుంబానికి 11 వేల రూపాయల జరిమాన విధించారు. పంచాయతీ జారీ చేసిన ‘దిక్తిత్’ గురించి పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలి కుటుంబం తమకు రక్షణ కల్పించాల్సిందిగా విన్నవించుకుంది. ఈ విషయంలో బాధితులకు రక్షణ కల్పించి, గ్రామస్తుల మీద కేసు నమోదు చేయాల్సిందిగా ఎస్పీని ఆదేశించినట్లు రాజస్థాన్ మహిళా కమిషన్ అధ్యక్షురాలు సుమన్ శర్మ తెలిపారు. -
అబ్బాయిల ఆలోచన దృక్పథం మారాలి
సాక్షి, న్యూఢిల్లీ : చిన్నారులపై జరుగుతున్న అత్యాచార ఘటనలపై రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పసివారిపై అత్యాచారాలకు పాల్పడటం చాలా సున్నితమైన వ్యవహారమని పేర్కొన్నారు. ప్రతి 10 అత్యాచారాల్లో 7 వరకు బాధితురాలికి తెలిసివారో, ఇంట్లోవారో, బంధువులే చేస్తున్నారన్నారు. చట్టాలు మాత్రమే ఈ ఘటనలను ఆపలేవని అన్నారు. దేశంలో జరుగుతున్న అత్యాచార ఘటనలపై కొందరు అభ్యంతరకరంగా అమ్మాయి దుస్తులపై వ్యాఖ్యానిస్తున్నారని, ఇది సరైన ధోరణి కాదని హెచ్చరించారు. అమ్మాయి డ్రెస్సింగే అత్యాచార ఘటనలకు కారణమైతే, మరి వృద్ధులపై ఎందుకు అత్యాచారం జరుగుతున్నాయని ప్రశ్నించారు. పూర్తిస్థాయి రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్‌ను ఫిక్కీ మహిళా విభాగం సోమవారం సన్మానించింది. ఈ సందర్భంగా లింగ హోదా సమానత్వంపై నివేదికను ఆమె విడుదల చేశారు. అనంతరం సీతారామన్ మాట్లాడుతూ.. మొదట అబ్బాయిల ఆలోచన దృక్పథం మారాలని, అమ్మాయి ఇంటి నుంచి బయటికి వెళ్లినప్పుడు జాగ్రత్తలు చెబుతుంటారు అలా కాకుండా.. మన ప్రధాని అన్నట్టు అబ్బాయిలు బయటికి వెళ్లినప్పుడు ఎలా జాగ్రత్తగా ఉండాలో చెప్పాలని సూచించారు. వ్యాపార రంగంలోనూ, మార్కెటింగ్ రంగంలోనూ మహిళలు దూసుకెళ్తున్నారని, ముద్ర బ్యాంకు ఇచ్చే రుణాల్లో 50 శాతం మహిళలకే వెళ్తున్నాయని చెప్పారు. పంచాయతీయ రాజ్ సవరణ తెచ్చాక మహిళల ప్రాతినిధ్యం పెరిగిందని, ఇక రక్షణ రంగంలోనూ మహిళలకు సమానవకాశాల కోసం కృషి చేస్తున్నామని నిర్మలా సీతారామన్ తెలిపారు. -
రేప్ కేసు.. గుంజీలు తియ్యమంటే తగలబెట్టేశాడు
రాంచీ: జార్ఖండ్‌లో దారుణం చోటు చేసుకుంది. అత్యాచారానికి గురైన ఓ యువతి(18)కి నిప్పటించిన ఘటన కలకలం రేపింది. పంచాయితీ పెద్దల తీర్పును జీర్ణించుకోలేని నిందితుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలతో యువతి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఛాత్రా జిల్లా రాజకెందువా గ్రామంలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... తల్లిదండ్రులు బంధువుల వివాహానికి వెళ్లగా యువతి(18) ఇంట్లో యువతి ఒంటరిగా ఉంది. అది గమనించిన నలుగురు యువకులు గురువారం రాత్రి ఆమెపై గ్యాంగ్ రేప్‌కి పాల్పడ్డారు. మరుసటి ఉదయం విషయం తెలిసిన యువతి తండ్రి పంచాయితీలో ఫిర్యాదు చేశారు. ప్రధాన నిందితుడికి 30 వేల రూపాయల జరిమానా.. వంద గుంజీలు తీయాలని పంచాయితీ పెద్దలు హేయమైన తీర్పు ఇచ్చారు. దీంతో యువకుడు ఆగ్రహంతో యువతి ఇంటిపై దాడికి పాల్పడ్డాడు. ఆమె తల్లిదండ్రులను చితక్కొట్టి ఆపై యువతికి నిప్పటించాడు. ఘటన తర్వాత యువకుడు పారిపోగా.. కాలిన గాయాలతో యువతి ఆస్పత్రిలో చేరింది. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. యువతి బంధువుల మేరకు ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యువతికి ప్రధాన నిందితుడికి పాత పరిచయాలు ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని స్థానిక ఎస్సై వెల్లడించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని.. పరారీలో ఉన్న నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఆయన చెప్పారు. -
ఆంద్రప్రదేశ్ ఎక్కడికెళ్తోంది?
-
పోలీస్ స్టేషన్లోనే మహిళపై అత్యాచారం
గౌహతి : అసోంలోని ఓ పోలీసు స్టేషన్లో దారుణం చోటు చేసుకుంది. రక్షించాల్సిన రక్షక భటుడే ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. రామ్డియా పీఎస్‌లో విధులు నిర్వహిస్తున్న బినోద్ కుమార్ దాస్ ఈ కేసులో నిందితుడిగా ఉన్నాడు. దీంతో అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్టు పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉందన్నారు. దీనిపై లోతైన విచారణ చేపట్టినట్టు తెలిపారు. ఈ ఘటనను అస్సాం మాజీ సీఎం తరుణ్ గగోయ్ తీవ్రంగా ఖండించారు. నిందితుడిగా ఉన్న పోలీసును కఠినంగా శిక్షించాలని కోరారు. పోలీసు నియామాకాలు జరిగేటప్పుడు అభ్యర్థులకు మానసిక పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రజలను కాపాడాల్సిన పోలీసులే ఇలాంటి చర్యలకు పాల్పడటం క్షమించరానిదని ఆయన వ్యాఖ్యానించారు. -
కఠిన శిక్షలు అమలు చేయండి
-
కొత్త నియోజకవర్గం
ఈ ప్రభుత్వం చట్టమయితే చేసింది కానీ– ఏదీ? దమ్ముంటే ఒక్క కుర్రాడిని ఉరి తీయమనండి. రాజీవ్ గాంధీని మారణ హోమం చేసిన నేరస్థురాలికి 22 సంవత్సరాల తర్వాత కూడా విమోచన లేదు. మా నమశ్శివాయని ఈ కాలమ్ పాతికేళ్లుగా చదువుతున్నవారయితే గానీ ఎరగరు. కొంచెం ముక్కుమీద గుద్దినట్టు మాట్లాడేమనిషి. మనిషి కాస్త ఖండితంగా చెప్తాడు. ఎదుటివాడు ఏమనుకుంటాడో ఆలోచించడు. ఇప్పుడు ఇది చూడండి. ముందు మనదేశంలో రేపుల కథల నమూనాలు చూద్దాం. ఇది ఒక పత్రిక మొదటి పేజీ కథ. బీహార్ జహానాబాద్‌లో కేవలం నలుగురు యువకులు ఒకమ్మాయిపై అత్యాచారం చేశారు. ఇందులో మరో నలుగురయిదుగురు యువకులు కూడా చేయి కలిపారని ఈ వీరులు చెప్పారు. శ్రీనగర్ కథువా జిల్లాలో 8 ఏళ్ల అమ్మాయిని కొందరు అత్యాచారం చేసి చంపేశారు. ఒడిశా కేంద్రపానికా పోలీసు స్టేషన్ పరిధిలో ఒక సొంత మేనమామ నాలుగేళ్ల అమ్మాయిని అత్యాచారం చేశాడు. ఉత్తరప్రదేశ్ కనుజ్ ప్రధాన్ జిల్లాలో ఇద్దరు ప్రబుద్ధులు ఒక అమ్మాయిని రేప్ చేస్తుండగా మరో ఇద్దరు శృంగార పురుషులు వీడియో తీసి నలుగురికీ పంచారట. ఒడిశా లోని జగన్నాథపూర్‌లో కేవలం 6 ఏళ్ల ఆడపిల్ల అత్యాచారానికి గురై 8 రోజులు ప్రాణాల కోసం పోరాడి చచ్చిపోయింది. జమ్ములో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు 24 ఏళ్ల స్త్రీపై అత్యాచారం జరిపి, వీడియో తీసి, ఈ విషయాన్ని బయటపెడితే వీడియోను అందరికీ పంచుతామని హెచ్చరించారట. అన్నిటికన్నా విడ్డూరం– ఇలా రేప్ చేసిన నేరస్తుల్ని శిక్షించే చట్టాన్ని రాష్ట్రపతి అమలు జరిపే ’రోజున’ కేవలం 110 రేప్‌లు మాత్రమే జరిగాయట. ఉత్తరప్రదేశ్ ఇందులో మళ్లీ అగ్రస్థానం. మన నెల్లూరులో చెన్నూరు గ్రామంలో ఓ ఆరేళ్ల అమ్మాయిపై ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ మైనర్ కుర్రాడు అత్యాచారం చేశాడట. బీహార్‌లోని ఉన్నావ్‌లో ఓ 9 ఏళ్ల అమ్మాయిని ముజాఫర్పూర్లో అయిదుగురు అత్యాచారం చేశారు. ఒడిశాలో నయాఘర్ జిల్లాలో దేవరాజ బారిక్ అనే వ్యక్తి ఒక మహిళపై రెండు నెలలుగా అత్యాచారం సల్పుతుండగా ఆ అవమానం భరించలేక ఆమె నిన్న ఆత్మహత్య చేసుకుంది. ఇలాంటి కేసులు 11,12,628 ఉన్నాయని నిన్న సుప్రీం కోర్టు ప్రకటించింది. వీటిలో మళ్లీ అగ్రస్థానం ఉత్తరప్రదేశ్–30,883 కేసులు. తర్వాతి స్థానం చెప్పి ముగిస్తాను: మహారాష్ట్రలో 16,099 కేసులు. ఇంత చెప్పాక వీరినందరినీ ఉరి తీయడం సబబు కాదంటాడు మా నమశ్శివాయ. ఈ ప్రభుత్వం చట్టమయితే చేసింది కానీ– ఏదీ? దమ్ముంటే ఒక్క కుర్రాడిని ఉరి తీయమనండి. రాజీవ్ గాంధీని మారణ హోమం చేసిన నేరస్థురాలికి 22 సంవత్సరాల తర్వాతే విమోచన లేదు. మనకి మానవ హక్కుల చట్టాలున్నాయి. మానవతావాదులున్నారు. మతాలున్నాయి. రైళ్లు తగులబెట్టే కులాలున్నాయి. రైళ్లని ఆపే ప్రాంతాలున్నాయి. జాతులున్నాయి. వర్గాలున్నాయి. చిట్టచివరిగా పార్టీలున్నా యి. నిన్న జైలు శిక్షపడితేనేంగాక – ఆసారాం బాపూలున్నారు. వీరందరూ ఊరుకుంటారా? చచ్చిపోయిన ఆ రేళ్ల బిడ్డ మరణం కంటే చావవలసిన 15 ఏళ్ల కుర్రాడి భ విష్యత్తుని గురించి జెండాలు పట్టుకుని బయలుదేరరా? దేశం పేరు ఇప్పుడు గుర్తులేదు గానీ– ఆ దేశంలో ఒకడు బజారులో పరిగెత్తుతున్నాడు. పోలీసులు వెంట తరుముతున్నారు. ఆ కుర్రాడు కిందపడ్డాడు. కదులుతున్న అతని తలమీద తుపాకీ ఉంచి కాల్చాడు పోలీసు. కుర్రాడు చచ్చిపోయాడు. ఎందుకయినా మంచిదని మరొకసారి కాల్చాడు. బజారులో వందలాది మంది ఆ దృశ్యాన్ని చూస్తున్నారు. మరి కనిపించని వెనుకవారి మాట? ఆ దృశ్యాన్ని ఒక క్రేన్‌కి కట్టి ఊరేగించారు. భయంకరం. అక్కడ మానవ హక్కుల సంఘం లేదా? మానవ సంఘాలు లేవా? మతప్రముఖులు లేరా? ఒక్కటి మాత్రం ఆ తర్వాత లేదు. రేప్. ఈ దేశంలో ఒక కుర్రాడిని ఉరితీయమనండి. పేపర్లు విరగబడతాయి. ఇంకా మన అభిమాన హీరో సల్మాన్ ఖాన్ నల్లజింక కేసే 20 ఏళ్లుగా నడుస్తోంది. ఇంకా దానికి దిక్కులేదు. మరి రాష్ట్రపతి గారి చట్టం ప్రకారం–ఒక అత్యాచారానికి నలుగురిని వేసుకున్నా 4 లక్షల ఓట్లు వృ«థా. కనుక వీరిని ఒక వర్గంగా గుర్తించి ’రేప్‌లS నియోజకవర్గం’ అనో ఇంకా దమ్ముంటే ’రేపటి నియోజకవర్గం’ అనో గుర్తించాలంటాడు మా నమశ్శివాయ. అందువల్ల మనకి కొందరయినా మంత్రులు మిగులుతారు, మత గురువులు మిగులుతారు. స్థానిక నాయకులు మిగులుతారు. జైళ్లు ఖాళీ అవుతాయి. దేశం ’రేపుయుతం’గా ఉంటుంది. మరి ఈ నియోజకవర్గం ఏ పార్టీని సమర్థించాలా అన్నది అప్పుడే కొందరి మనసుల్లో కదిలిన మీమాంస. అయ్యా, ముందు అత్యాచారాలు విరివిగా జరగనివ్వండి. 2019 దగ్గర పడనివ్వండి. రేపు సంగతి తర్వాత చూద్దాం. ఏమయినా మా నమశ్శివాయ గట్టి పిండం. గొల్లపూడి మారుతీరావు -
త్వరలోనే మంచిరోజులు వస్తాయ్: ఆసారాం
జోధ్‌పూర్: మైనర్ బాలికపై రేప్ కేసులో జీవితఖైదు శిక్షపడి జో«ద్‌పూర్ జైలులో ఉన్న వివాదాస్పద గురువు ఆసారాం బాపు ఓ శిష్యుడితో ఫోన్లో మాట్లాడిన ఆడియో క్లిప్ ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. 15 నిమిషాల నిడివి ఉన్న ఆ క్లిప్‌లో ఆసారాం మాట్లాడుతూ.. ‘జైలులో నేనుండేది తాత్కాలికమే. త్వరలోనే మంచి రోజులు వస్తాయి. మనం చట్టాలు, వ్యవస్థను గౌరవించాలి’ అని చెప్పాడు. తన ఆశ్రమాన్ని స్వాధీనం చేసుకునేందుకు కొందరు కుట్ర పన్నుతున్నారని ఆసారాం ఆరోపించాడు. ఈ ఆడియో క్లిప్‌పై జోధ్‌పూర్ సెంట్రల్ జైలు డీఐజీ విక్రమ్ స్పందించారు. ప్రతి ఖైదీకి నెలకు ఇద్దరు వ్యక్తులతో 80 నిమిషాల పాటు ఫోన్లో మాట్లాడే అవకాశం ఇస్తామన్నారు. శుక్రవారం ఆసారాం సబర్మతీలోని ఓ శిష్యుడితో మాట్లాడినట్లు చెప్పారు. -
త్వరలో మంచిరోజులొస్తాయి: ఆసారాం
జైపూర్: అత్యాచార కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న 77 ఏళ్ల ఆసారాం బాపు ఆడియో సంభాషణ క్లిప్ ఒకటి వైరల్ అవుతోంది. ‘త్వరలో మంచి రోజులు వస్తాయి’ అని ఆసారాం అవతలి వ్యక్తికి చెప్పటం ఉంది. సుమారు 15 నిమిషాల నిడివి ఉన్న ఆ టేపు ప్రస్తుతం వాట్సాప్‌లో చక్కర్లు కొడుతోంది. దీంతో జోధ్‌పూర్ సెంట్రల్ జైల్ సిబ్బందిపై విమర్శలు మొదలయ్యాయి. అత్యాచార కేసు : ఆసారాం దోషి ‘వ్యవస్థ పట్ల మనం గౌరవంతో నడుచుకోవాలి. నన్ను చూసేందుకు జైలుకు ఎవరూ రావొద్దు. శాంతి భద్రతలకు భంగం కలిగించేలా వ్యవహరించకండి. కింది కోర్టులు తప్పు చేస్తే పైకోర్టులు ఆ తప్పులను సరిదిద్దుతాయి. త్వరలో మంచి రోజులు వస్తాయన్న నమ్మకం ఉంది. ఆశ్రమంలో కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారన్న సమాచారం నాకు అందింది. ఆ విషయంలో శ్రద్ధ వహించండి. నా సంగతి తర్వాత.. ముందు శిల్పి-శరత్ చంద్రల బెయిల్ కోసం ప్రయత్నించండి. గురువుగా నా భక్తుల విషయంలో శ్రద్ధ చూపటం నా కర్తవ్యం’ అంటూ ఆసారాం ఆ వ్యక్తితో చెప్పటం ఉంది. అవతలి వ్యక్తి మాత్రం మౌనంగా ఆ మాటలన్ని విన్నాడు. ఈ క్లిప్ బయటకు ఎలా వచ్చిందో తెలీదుగానీ వైరల్ అవుతోంది. నిబంధనల ప్రకారమే ఫోన్ చేశారు... ఈ ఆడియో క్లిప్‌పై జైళ్ల డీఐజీ విక్రమ్ సింగ్ స్పందించారు. శిక్ష ఖరారైన రెండు రోజుల తర్వాత.. అంటే శుక్రవారం ఈ ఫోన్ సంభాషణ జరిగినట్లు ఆయన వెల్లడించారు. ‘సాధారణంగా ఖైదీలకు ఒక నెలలో.. రెండు ఫోన్ నంబర్లకు సుమారు 80 నిమిషాలపాటు మాట్లాడుకునేందుకు అనుమతి ఉంటుంది. దానిని అనుసరించే సబర్మతి ఆశ్రమంలోని సాధక్తో శుక్రవారం సాయంత్రం ఆసారాం మాట్లాడారు. బహుశా ఆ ఆడియో క్లిప్ లీక్ అయ్యి ఉంటుంది’ అని విక్రమ్ సింగ్ తెలిపారు. అయితే ఆ క్లిప్ ఎలా బయటకు పొక్కి ఉంటుందన్న విషయంపై దర్యాప్తుకు ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు. ఆశ్రమంతో నాకు సంబధం లేదు... గత కొంత కాలంగా ఆసారాం కూతురు భారతి మీడియా కంటపడకుండా తిరుగుతున్నారు. ఆసారాం అత్యాచారం చేశాడంటూ మరో మహిళ దాఖలు చేసిన కేసులో భారతితోపాటు ఆసారాం భార్య లక్ష్మీ నిందితులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ కేసు కోసం శుక్రవారం భారతి గాంధీనగర్ కోర్టుకు హాజరయ్యారు. ఈసందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ... ‘ఆశ్రమంలో జరిగే ప్రతీ వ్యవహారంలో నా హస్తం ఉందని కొందరు ఆరోపిస్తున్నారు. కానీ, 17 ఏళ్ల నుంచి ఆశ్రమానికి నేను దూరంగా ఉంటున్నా. ఈ విషయాన్ని ఆశ్రమ నిర్వాహకులను అడిగినా చెబుతారు. నా తండ్రి చేసిన అకృత్యాలకు నాకు సంబంధం లేదు’ అని ఆమె వివరణ ఇచ్చారు. ఆసారాం కూతురు భారతి(పాత చిత్రం) -
కథువా ఘటనలో రాజకీయ కోణం
దేశంలో గతంలో మహిళలపై అత్యాచారాలు, దళితులపై హత్యాయత్నాలు జరిగాయి కానీ ఒక పథకం ప్రకారం, నిర్దిష్ట రాజకీయ లక్ష్యం కోసం, భయోత్పాత వాతావరణాన్ని కల్పించటం కోసం జరగటం ఇటీవలే చూస్తున్నాం. గతంలో సామాజిక అవలక్షణాల్లో భాగంగా ఇటువంటి దురాగతాలు జరిగేవి. కేంద్రంలో అధికారానికి వచ్చిన కొత్తలో మోదీ హరియాణాలో జరిగిన ఒక ర్యాలీలో ఆడపిల్లలను బతికించండి, చదివించండి అన్న పథకానికి శ్రీకారం చుట్టారు. అప్పటికే హరియాణా ఖాప్ పంచాయత్ పేరుతో మహిళలపై సాగించే అకృత్యాలకు కేంద్రంగా మారిన సమయంలో ఆడపిల్ల లను రక్షించే కార్యక్రమ ప్రారంభానికి హరి యాణాను కేంద్రంగా చేసుకోవటం ద్వారా ప్రజల దృష్టినాకర్షించింది బీజేపీ. కానీ ఈ కొత్త మురిపెం ఎంతో కాలం నిలవలేదు. రానురానూ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళలకు కనీస భద్రత కూడా కరువవుతూ వచ్చింది. కథువా బాలిక ఉదంతం ప్రాధమిక హక్కులను సైతం స్వమతం అన్యమతం అని చీల్చి అమలు జరిపేబీజేపీ పరిపాలనా తీరుకు నిదర్శనంగా నిలిచిపోతుంది. జమ్ము కశ్మీర్ నేడు జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే కథువా బాలిక అత్యాచార సంఘటనకు కేంద్రమైంది. ప్రపంచ దేశాల ముందు భారతదేశం సిగ్గుతో తలొంచుకునేలా జరిగిన కథువా బాలిక బలాత్కారం, హత్య నుండి దేశం ఇంకా కోలుకోలేదు. మరింత హేయమైన చర్య ఏమిటంటే ఈ బలాత్కారానికి, హత్యకు స్థానిక దేవాలయాన్ని కేంద్రంగా చేసుకోవటం.. చివరకు ఈ హేయమైన ఘటనకు కారణమైన వారిని చట్టం శిక్షించాలని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి కార్యాలయం కూడా డిమాండ్ చేసే పరిస్థితి వచ్చింది. దేశంలో గతంలో మహిళలపై అత్యాచారాలు, దళితులపై హత్యాయత్నాలు జరిగాయి కానీ ఒక పథకం ప్రకారం, నిర్దిష్ట రాజకీయ లక్ష్యం కోసం, భయోత్పాత వాతావరణాన్ని కల్పించటం కోసం జరగటం గత మూడు నాలుగేళ్లల్లోనే చూస్తున్నాము. గతంలో సామాజిక అవలక్షణాల్లో భాగంగా ఇటువంటి దురాగతాలు అడపాదడపా జరిగేవి. కానీ ఇప్పుడు ఒక పథకం ప్రకారం జరుగుతున్నాయి. గతంలో అటువంటి దురాగతాలకు పాల్పడిన వ్యక్తులను సమాజం చీదరించుకునేది. సాధ్యమైతే వెలివేసేది. లేదా చట్టం పరిధిలో శిక్షించేది. అటువంటి ఆగంతకులు రాజకీయ పార్టీలకు చెందిన వారైతే ప్రజల నుండి ఎక్కడ దూరమవుతామో అనే వెరపుతో బహిష్కరించేవి. కానీ ఇప్పుడు జరుగుతుంది దీనికి భిన్నం. మంత్రులు, ప్రజలెన్నుకున్న ప్రజా ప్రతినిధులు, చట్టాన్ని కాపాడాల్సిన న్యాయవాదులు మొత్తంగా రేపిస్టులకు అండగా నిలుస్తున్నారు. కథువా సంఘటనలో దోషులైన వారికి అండగా నిలవటానికి ఏకంగా సంకీర్ణ ప్రభుత్వం నుండి బయటకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఎందువల్ల?ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ఆరెస్సెస్ అవగాహనలో, విస్తరణ వ్యూహంలో, ప్రజలను నిట్టనిలువునా చీల్చటంలో మహిళలపై అత్యాచారం కూడా ఒక సాధనంగా ఎలా మారిందో తెలుసుకోవాలి. కథువా సమీప గ్రామాల్లో సంచార తెగలకు చెందిన ముస్లింలు నివశిస్తున్నారు. వీరిని ఆ ప్రాంతం నుండి శాశ్వతంగా పారదోలటానికి, ఈ గ్రామాలన్నీ ఆక్రమించుకోవటానికి అభం శుభం తెలీని పాప తేలికైన లక్ష్యంగా మారిందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఖలేజా సినిమా కథకు కథువా ఘటన వెనకున్న లక్ష్యానికి మధ్య తేడా లేదు. ‘భారతదేశ చరిత్రలో ఆరు మహత్తర అధ్యాయాలు’ అన్న సావర్కార్ రచనను చూస్తే ఒక విషయం తేటతెల్లమవుతుంది. ముస్లిం రాజులు ఆ రోజుల్లో హిందూ మహిళల మానప్రాణాలు తీశారు. ‘‘హిందువులు పూర్తి స్థాయి అధికారాన్ని సంపాదిస్తే ముస్లిం మహిళలకు కూడా అదే శాస్తి జరుగుతుందని వారికి అర్థం అవ్వాలి. అప్పుడు కానీ హిందు మహిళల జోలికి రాకుండా ఉండరు’’ అని అందులో ఆయన వివరిస్తారు. ఆరెస్సెస్ కార్యకర్తలు సావర్కార్ మాట జవదాటరన్న విషయం తెలిసిందే. కథువా అఘాయిత్యాన్ని ఈ కోణంలో చూస్తే తప్ప దేశంలో ముస్లింలపై పెరుగుతున్న దాడులు, అత్యాచారాలు, చీకటి జీవితాల్లోకి నెట్టడం వంటి పరిణామాల లక్ష్యం ఏమిటో అర్థం కాదు. అంతేకాదు. హిందూ రాజులు నాటి నుంచీ ఇటువంటి వ్యూహాన్ని అనుసరించి ఉంటే ముస్లింలు హిందూ మహిళలవైపు కన్నెల్తైనా చూసేవారు కాదు అని కూడా నిర్ధారణకొచ్చాడు. ముస్లిం మహిళల పట్ల ఏ రకమైన సౌభ్రాతృత్వాన్నయినా సరే ప్రదర్శించాలని ప్రయత్నించి వారిపై అత్యాచారాలకు పాల్పడకుండా వదిలేస్తే అది ఇస్లాం మతం స్వీకరిం చినంత పాపం అని కూడా హెచ్చరిస్తాడు సావర్కార్. లవ్ జీహాద్ అసలు లక్ష్యం ఏమిటో ఈ వాక్యాలు చదివితే అర్థమవుతుంది. సావర్కారే ఆరాధ్యదేవుడుగా మారిన ఆరెస్సెస్ కార్యకర్తల చేతుల్లో గుజరాత్లో, ముజఫర్‌నగర్‌లో ఎంత మంది మహిళలు మాన ప్రాణాలు కోల్పోయారో తేల్చేందుకు కేంద్రం సాహసిస్తుందా? సావర్కార్‌ను, ఆయన ఆలోచనలను, వాటిని ఆచరించేవారిని ఈ దేశం నుండి బహిష్కరించకుండా, వారికి చట్టబద్ధత కల్పించే రాజ్యాధికారం నుండి దూరం చేయకుండా దేశంలో హిందూయేతర మహిళల మానప్రాణాల భద్రతకు హామీ ఇవ్వటం సాధ్యం కాదు. వేరుకు పుట్టిన చెదలు కొమ్మలు నరికితే పోదు. వేళ్లతో సహా చెట్టును పీకేస్తేనే పోతుంది. కొండూరి వీరయ్య వ్యాసకర్త ఆర్థికరంగ నిపుణులు ‘ 98717 94037 -
ఆసారాంకు బతికే హక్కు లేదు; నటి
సాక్షి, ముంబై: అత్యాచార కేసులో ఆసారాం బాపుకు జీవితఖైదు శిక్షపై బాలీవుడ్ నటి రాఖీ సావంత్ హర్షం వ్యక్తం చేశారు. అయితే మైనర్లపై అఘాయిత్యాలకు పాల్పడే వారిని ప్రాణాలతో ఉంచటం సరైందని కాదని ఆమె అంటున్నారు. అసారాం లాంటి వారికి ఉరిశిక్షే సరైందన్న అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. 2013లో 16 ఏళ్ల బాలికపై ఆసారాం అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. నేరం రుజువు కావటంతో ఈ ఏప్రిల్ 25న కోర్టు ఆసారాంకు జీవిత ఖైదు విధించింది. దీనిపై రాఖీ సావంత్ స్పందిస్తూ... ‘ఆసారాంకు శిక్ష పడ్డందుకు నాకు సంతోషంగా ఉంది. రేపిస్టులకు ఇదొక హెచ్చరిక. అయితే అతనికి ఉరి శిక్ష ఎందుకు వేయలేదు? బాధితురాలు మైనర్. పైగా మైనర్లపై అఘాయిత్యాలకు పాల్పడేవారికి కఠిన శిక్షలు విధించాలని ప్రభుత్వం అంటోంది. ఆ లెక్కన్న ఆసారాంకు కూడా మరణ శిక్ష వేయటమే సబబు. మైనర్లను చిదిమేసే రాక్షసులను వదలకూడదు’ అని రాఖీ సావంత్ వ్యాఖ్యానించారు. పోక్సో చట్టం సవరణ ద్వారా కేంద్రం తాజాగా జారీ చేసిన ఆర్డినెన్స్ ప్రకారం.. 12 ఏళ్లలోపు చిన్నారులపై అత్యాచారానికి పాల్పడిన వారికి మరణశిక్ష విధిస్తారు. 12 నుంచి 16 ఏళ్ల లోపు అమ్మాయిలపై లైంగిక దాడి చేస్తే జీవిత ఖైదు, లేదా కనీసం 20ఏళ్ల జైలు శిక్ష విధించేలా చట్టంలో మార్పులు చేయనున్నారు. దీంతో పాటు చిన్నారులపై లైంగిక నేరాలకు సంబంధించిన కేసులు విచారణ త్వరితగతిన పూర్తి చేసేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఈ ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోద ముద్ర కూడా వేశారు. -
ఆసారాంకు జీవిత ఖైదు: కారణం ఇదే
జోధ్‌పూర్ : సంచలనం సృష్టించిన 16 ఏళ్ల బాలికపై అత్యాచారం కేసులో వివాదాస్పద స్వామీజీ ఆసారాం(77)కు జోధ్‌పూర్ ప్రత్యేక ఎస్సీ, ఎస్టీ కోర్టు యావజ్జీవ కారాగార శిక్షతో పాటుగా రూ. లక్ష జరిమానాను విధించిన సంగతి తెలిసింది. జోధ్‌పూర్ సెంట్రల్ జైల్లో ఏర్పాటుచేసిన తాత్కాలిక కోర్టులో న్యాయమూర్తి మధుసూదన్ శర్మ ఈ తీర్పు వెలువరించారు. కాగా ఆసారం బాధితురాలు స్వామీజీ తనను లొంగిపోమ్మని ఆదేశించాడని అందుకు తగ్గట్టుగానే సీనియర్ అధికారులు అతడికి పాదాభివందనం చేసి వత్తాసు పలికారని తెలిపింది. ప్రత్యేక న్యాయస్థానంలో బాధాతురాలు చెప్పిన కొన్ని వ్యాక్యలను కోర్టు పరిగణలోకి తీసుకుని ఆసారాంకు జీవిత ఖైదు శిక్ష విధించింది. కోర్టులో బాధితురాలు.. ఆసారాం తనను సీఏ చదవాలని ఎందుకు అనుకుంటున్నావు? ఎంత పెద్ద అధికారి అయినా నా ముందు మోకరిల్లాల్సిందే...కాబట్టి నువ్వు సీఏ బదులు బీఈడీ చదువు. అప్పుడు నిన్నుతొలుత నా గురుకులంలో ఉపాధ్యాయురాలిగా నియమించి అనంతరం నిన్ను గురుకులానికి ప్రధానోపాధ్యాయురాలిని చేస్తానని చెప్పి తనను మభ్యపెట్టే ప్రయత్నం చేసినట్లు తెలిపింది. కోర్టు ఈ వ్యాక్యలను పరిగణలోకి తీసుకుని ఆసారాంకు జీవిత ఖైదు విధించింది. బాధితురాలు ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ నివాసి. ఆమె మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారలో ఆసారాం నెలకొల్పన ఆశ్రమంలో ఉండి చదువుకుంటుంది. 2013 సంవత్సరం ఆగస్టులో బాధితురాలికి దెయ్యం పట్టిందని, దాన్ని వదిలించాల్సిందిగా బాలిక తల్లిదండ్రులు ఆమెను ఆసారాం వద్దకు తీసుకువచ్చారు. ఆ సమయంలో ఆసారాం బాధితురాలితో మాట్లాడుతూ భవిష్యత్తు ప్రణాళికలు ఏంటని ఆమెను అడిగాడు. దానికి సమాధానంగా బాలిక సీఏ చదివి గొప్ప ఆఫీసర్ కావాలనుకుంటున్నాని చెప్పగా ఆసారాం సీఏ చదవడం ఎందుకు? ఎంత పెద్ద అధికారి అయినా నా కాళ్ల మీద పడి నమస్కరిస్తాడు. అందుకే నువ్వు సీఏ బదులు బీఈడీ చదువు. అప్పుడు నిన్ను గురుకులానికి ప్రధానోపాధ్యాయురాలిని చేస్తానని చెప్పాడని బాలిక తెలిపింది. అనంతరం ఆమెకు నయం చేసే నెపంతో ఆమెను ఒంటరిగా తన గదికి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయం గురించి బయట ఎవరికి చెప్పవద్దని బెదిరించాడు. కానీ బాధితురాలు జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు ఆసారాం మీద ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఈ కేసును జోధ్‌పూర్‌కు బదిలీ చేశారు. బాలికతో ఆసారాం ప్రవర్తించిన తీరు సిగ్గుచేటని.. తనపై భక్తులు పెట్టుకున్న నమ్మకాన్ని ఆయన ఒమ్ము చేశారని తీర్పు సందర్భంగా ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి మధుసూదన్ శర్మ వ్యాఖ్యానించారు. -
లౌకిక విలువలకు భంగం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: అభివృద్ధి ముసుగు తగిలించుకున్న ప్రధాని నరేంద్రమోదీ దేశాన్ని మతతత్వం వైపు నడిపిస్తూ లౌకిక విలువలకు భంగం కలిగిస్తున్నారని ఢిల్లీ జేఎన్‌యూ బీఏఎస్‌వో నేత ఉమర్ ఖలీద్ అన్నారు. ప్రగతిశీల యువజన సంఘం(పీవైఎల్) రాష్ట్ర 7వ మహాసభల సందర్భంగా వేలాది మంది యువకుల తో బుధవారం నగరంలోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ కళాశాల నుంచి పెవిలియన్ గ్రౌండ్ వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం పీవైఎల్ రాష్ట్ర అధ్యక్షుడు హన్మేష్ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. మహిళలపై, చిన్నారులపై జరుగుతు న్న దాడులను సమర్థిస్తూ బీజేపీ నేతలు ర్యాలీ లు తీయడం దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు. యూపీలో యోగి ప్రభుత్వ పాలనలో 11ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగిందని, దేశ వ్యాప్తంగా నేరస్తులను శిక్షించాలని ఆందోళన చేసిన తర్వాత అక్కడి ప్రభుత్వం నేరస్తులను అరెస్ట్ చేసినట్లు చేసి వదిలేసిందని అన్నారు. అమిత్‌షాకు వ్యతిరేకంగా తీర్పు చెప్పినందుకే న్యాయమూర్తి లోయాను హత్య చేశారని ఆరోపించారు. బంగారు తెలంగాణ అని జపం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. న్యూడెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు మాట్లాడుతూ నిరంకుశంగా పాలిస్తున్న కేసీఆర్, మోదీ ప్రభుత్వాలను గద్దె దించే వరకు పోరాటాలు సాగుతాయని పేర్కొన్నారు. -
ఆసారాంకు జీవిత ఖైదు
జోధ్‌పూర్: 16 ఏళ్ల బాలికపై అత్యాచారం కేసులో వివాదాస్పద స్వామీజీ ఆసారాం (77)కు జోధ్‌పూర్ ప్రత్యేక ఎస్సీ, ఎస్టీ కోర్టు యావజ్జీవ కారాగార శిక్షను విధించింది. దీంతోపాటుగా రూ. లక్ష జరిమానాను విధించింది. జోధ్‌పూర్ సెంట్రల్ జైల్లో ఏర్పాటుచేసిన తాత్కాలిక కోర్టులో న్యాయమూర్తి మధుసూదన్ శర్మ ఈ తీర్పు వెలువరించారు. ఆసారాంకు జీవిత ఖైదు, ఆయన అనుచరులు శరత్, శిల్పిలకు 20 ఏళ్ల జైలు శిక్ష విధించి.. మరో ఇద్దరిని నిర్దోషులుగా విడుదల చేశారు. 2013 నాటి ఈ కేసులో చార్జిషీటు దాఖలైనప్పటి నుంచి దాదాపు ఐదేళ్లుగా ఆసారాం జోధ్‌పూర్ జైల్లో అండర్ ట్రయల్ ఖైదీగా ఉంటున్న సంగతి తెలిసిందే. చనిపోయేంతవరకు ఆయన జైల్లో ఉండాల్సిందేనని తీర్పు వెలువడిన అనంతరం పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోకర్ రామ్ బిష్ణోయ్ వెల్లడించారు. రాజస్తాన్ హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగానే ప్రత్యేక కోర్టు ఈ తీర్పును వెలువరించింది. కాగా, ఈ తీర్పుతో తమకు న్యాయం జరిగిందని ఈ కేసు వేసిన బాలిక కుటుంబం పేర్కొంది. తీర్పు తర్వాత ఆసారాం ఉద్వేగానికి గురయ్యారు. కాగా, ఆసారాంకు బెయిల్ కోసం ఆయన న్యాయవాదులు గురువారం రాజస్తాన్ హైకోర్టులో పిటిషన్ వేయనున్నారు. ఆసారాం తీరు సిగ్గుచేటు బాలికతో ఆసారాం ప్రవర్తించిన తీరు సిగ్గుచేటని.. తనపై భక్తులు పెట్టుకున్న నమ్మకాన్ని ఆయన వమ్ము చేశారని తీర్పు సందర్భంగా ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి మధుసూదన్ శర్మ వ్యాఖ్యానించారు. ‘ఆసారాంకు దేశ విదేశాల్లో లక్షల మంది భక్తులున్నారు. ఆయన పేరుతో 400 ఆశ్రమాలున్నాయి. బాధితురాలి కుటుంబం ఆసారాంను విశ్వసించింది. షాజహాన్పూర్లో ఆశ్రమ నిర్మాణంలో బాధితురాలి తండ్రి కీలకంగా వ్యవహరించారు. అలాంటిది.. సిగ్గుచేటు చర్య ద్వారా తనపై భక్తులు పెట్టుకున్న నమ్మకాన్ని ఆసారాం వమ్ముచేశారు. జపం చేద్దామని తన గదికి పిలిచి లైంగిక వేధింపులకు దిగారు’ అంటూ 453 పేజీల తీర్పులో జడ్జి పేర్కొన్నారు. ‘దేవుడిగా తనను నమ్మిన బాలిక విశ్వాసానికి ఆసారాం ద్రోహం చేశారు. వదిలిపెట్టమని పదే విజ్ఞప్తి చేసినా కనికరించకుండా అత్యాచారం చేశారు. ఇలాంటి వ్యక్తిపై జాలి చూపించటం, బాధిత బాలికకు న్యాయం చేయకపోవటం మొత్తం వ్యవస్థకే చేటు. ప్రజల్లో వ్యవస్థపై నమ్మకం పోయేలా చేస్తుంది’ అని ఆయన తీర్పులో వెల్లడించారు. దేశంలో పేదలు కూడా న్యాయాన్ని అందుకోగలరని ఈ తీర్పు మరోసారి వెల్లడించిందని ఈ కేసు విచారణను పర్యవేక్షించిన ఐపీఎస్ అధికారి అజయ్‌పాల్ లాంబా అన్నారు. ‘చివరకు నిజమే గెలిచింది. భారత న్యాయచరిత్రలోనే ఇదో గొప్ప తీర్పుగా నిలుస్తుంది’ అని పేర్కొన్నారు. భద్రత కట్టుదిట్టం డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ కేసు తీర్పు సమయంలో తలెత్తిన విధ్వంసం నేపథ్యంలో.. ఆసారాం ఆశ్రమంతోపాటుగా చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. జోధ్‌పూర్ కోర్టు, సెంట్రల్ జైలు పరిసరాల్లో నిషేధాజ్ఞలు అమల్లోకి తీసుకొచ్చారు. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు రాజస్తాన్‌తోపాటు, ఆసారాం భక్తులు భారీగా ఉన్న గుజరాత్, హరియాణా, మధ్యప్రదేశ్‌లలోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని రాజస్తాన్ పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. న్యాయం జరిగింది: బాలిక తండ్రి ఆసారాం బాపుకు శిక్ష పడటంపై.. బాధిత బాలిక తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. తమ కూతురికి సరైన న్యాయం జరిగిందని బాలిక తండ్రి ఉద్వేగంగా పేర్కొన్నారు. ‘కోర్టు ఇచ్చిన తీర్పుతో సంతోషంగా ఉన్నాం. ప్రభుత్వం, కోర్టులు మాతోనే ఉన్నాయన్న నమ్మకం కుదిరింది. మేం భయపడాల్సిన పనిలేదు. నేను చనిపోయినా బాధలేదు. నా కూతురికి న్యాయం జరిగింది’ అని నాటి మైనర్ బాలిక తండ్రి పేర్కొన్నారు. ‘నా కూతురు ధైర్యవంతురాలు. ఆమె ధైర్యం కారణంగానే తప్పుడు పనులుచేస్తున్న ఈ దొంగబాబాకు శిక్షపడేలా చేయగలిగాం. నాలుగేళ్లుగా మా కుటుంబం ఇంటినుంచి బయటకు రాలేదు. మా బంధువులను బెదిరించారు. ఆసారాం ఇక జైలు నుంచి బయటకు రారు. ఈ పోటీలో మేమే గెలిచాం’ అని ఆయనన్నారు. సర్వత్రా హర్షం జోధ్‌పూర్ తీర్పును రాజకీయ నాయకులు, హక్కుల కార్యకర్తలు స్వాగతించారు. ‘గురువంటే అందరినీ కాపాడాలి. కానీ వారిపై లైంగిక దాడులకు పాల్పడటం కాదు. ఉన్నత స్థానంలో ఉండి నమ్మిన వారిపైనే నేరాలకు పాల్పడిన ఆసారాంకు ఇది సరైన శిక్ష. బాలలపై నేరాలను తగ్గించేందుకు కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ పురోగమన చర్యే అవుతుంది’ అని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ స్తుతి కేకర్ పేర్కొన్నారు. ‘ఇలాంటి బాధితులందరి విజయమిది. ఆసారాంలాగా క్రూరమైన లైంగిక నేరాలకు పాల్పడే వారంతా.. చట్టం నుంచి తప్పించుకోలేరనే సందేశాన్నిచ్చిన తీర్పు ఇది. బాధితురాలు, ఆమె తండ్రి ధైర్యాన్ని ప్రశంసించకుండా ఉండలేం’ అని బాధితురాలి తరపు న్యాయవాది ఉత్సవ్ బైన్స్ పేర్కొన్నారు. ఆసారాం సాధు వేశంలో ఉన్న రాక్షసుడని.. జోధ్‌పూర్ కోర్టు ద్వారా బాధితురాలికి సరైన న్యాయం జరిగిందని నిర్భయ (ఢిల్లీ హత్యాచార ఘటన బాధితురాలు) తాత తెలిపారు. రేపిస్టు అనొద్దు: వంజారా ఆసారాం చేసింది తప్పే అయినా ఆయన్ను రేపిస్టు అనటం సరికాదని.. గుజరాత్ మాజీ పోలీసు ఉన్నతాధికారి వంజారా అభిప్రాయపడ్డారు. బాధితురాలు తన ఎఫ్ఐఆర్లోనూ ఆసారాం తనపై అత్యాచారం చేసినట్లు పేర్కొనలేదని.. అసభ్యంగా ప్రవర్తించాడని మాత్రమే పేర్కొందన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన మెడికల్ పరీక్షల్లోనూ ఈ విషయం వెల్లడైందని వంజారా గుర్తుచేశారు. రేప్ చేయకపోయినా.. ఆడపిల్లలతో అసభ్యంగా ప్రవర్తించటమూ నేరమేనన్నారు. అసలు కేసేంటి? ఆగస్టు 15, 2013 నాటి 16 ఏళ్ల అమ్మాయిపై రేప్ కేసులో సెప్టెంబర్ 1న ఇండోర్‌లో ఆసారాంను పోలీసులు అరెస్టు చేశారు. పోక్సో చట్టంలోని సెక్షన్ 8, భారతీయ శిక్షాస్మృతిలోని 342, 376, 354(ఏ), 506, 509/34, జువెనైల్ జస్టిస్ చట్టంలోని సెక్షన్లు 23,26 కింద కేసు నమోదు చేశారు. కేసు మొదట జోధ్‌పూర్ జిల్లా కోర్టులో విచారించినప్పటికీ.. ఆ తర్వాత 2016, డిసెంబర్16న ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టుకు మార్చారు. ఈ మధ్యలో ఆయన 12సార్లు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ వివిధ కోర్టులు తిరస్కరించాయి. ఏప్రిల్ 7నే వాదనలు పూర్తవగా.. న్యాయస్థానం తుది తీర్పును ఏప్రిల్ 25కు రిజర్వ్ చేసింది. 1997 నుంచి 2006 మధ్య అహ్మదాబాద్, సూరత్ ఆశ్రమాల్లో చదువుకున్న సమయంలో ఆసారాంతోపాటు ఆయన కుమారుడు నారాయణ్ సాయి తమపై అత్యాచారానికి పాల్పడ్డారని సూరత్‌కు చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఫిర్యాదు చేశారు. బెయిల్ ఇవ్వాలంటూ న్యాయమూర్తులను, విచారణకు వచ్చిన పోలీసులను కూడా బెదిరించడంతో ఆసారాంకు బెయిల్ ఇచ్చేందుకు కోర్టులు నిరాకరించాయి. గుడిసె నుంచి రూ.10,000 కోట్లకు.. అహ్మదాబాద్: జోధ్‌పూర్ కోర్టు యావజ్జీవ శిక్ష విధించిన ఆసారాం బాపు ప్రయాణం సబర్మతి నదీ తీరాన ఓ చిన్న గుడిసె నుంచి ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా 400 ఆశ్రమాలు, రెండు కోట్ల మంది అనుచరులు ఉన్న ఆసారాం సంపద కూడా రూ.10,000 కోట్లకు పైమాటే. ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న సింధ్ ప్రావిన్సులోని బెరానీ గ్రామంలో 1941, ఏప్రిల్ 17న ఆసారాం జన్మించాడు. అసలు పేరు అసుమల్ తౌమల్ హర్పలాని. 1947లో దేశ విభజన తర్వాత ఆసారాం కుటుంబం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు వలసవచ్చింది. అక్కడే ఓ పాఠశాలలో ఆయన నాలుగో తరగతి వరకూ చదువుకున్నాడు. కొద్దికాలానికే తండ్రి చనిపోవడంతో కుటుంబ పోషణ కోసం గుర్రపు బగ్గీలు నడపటం, సైకిళ్లు రిపేర్ చేయడంతో పాటు టీ, మద్యం అమ్మడం వంటి పనులు చేశాడు. చివరికి పెళ్లికి 8 రోజుల ముందు 15 ఏళ్ల ప్రాయంలో ఇల్లు వదిలి పారిపోయాడు. బెహరూచ్లోని ఆధ్యాత్మిక గురువు లీలాషా బాపు వద్ద శిష్యుడిగా చేరాడు. లీలాషా బాపునే ఆయన పేరును ఆసారాంగా మార్చారు. అనంతరం గుజరాత్‌లోని మొతెరాలో సబర్మతి నదీతీరాన ‘మోక్ష కుటీర్’ పేరుతో చిన్న గుడిసెలో ఆశ్రమాన్ని ఆసారాం ప్రారంభించాడు. కాలక్రమేణా ఆశ్రమాల కోసం ఆసారాంకు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు విరివిగా భూములిచ్చాయి. అయితే ఆసారాం తమ భూమిని కబ్జా చేశారని పలువురు ప్రజలు కోర్టుల్ని ఆశ్రయించారు. కేవలం ఆశ్రమాలే కాకుండా ఆయుర్వేద మందులు, ఆధ్యాత్మిక పుస్తకాల అమ్మకాలతో ఆసారాం భారీగా ఆదాయాన్ని గడించాడు. ఆసారాంకు భార్య లక్ష్మీ దేవి, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆయన కుమారుడు నారాయణ సాయి ఓ రేప్ కేసులో ప్రస్తుతం జైలులో ఉన్నాడు. గుజరాత్‌లోని మొతెరా ఆశ్రమం సమీపంలో 2008లో దీపేశ్, అభిషేక్ అనే పిల్లలు విగతజీవులై కన్పించడంతో ఆసారాంకు కష్టాలు ప్రారంభమయ్యాయి. వీరిద్దరినీ బలిచ్చారని వారి కుటుంబసభ్యులు ఆరోపించడంతో సీఐడీ పోలీసులు ఏడుగురు ఆసారాం అనుచరుల్ని అరెస్ట్ చేశారు. 2013లో ఓ మైనర్ బాలిక తనపై ఆసారాం అత్యాచారం చేశారని ఫిర్యాదు చేయడంతో ఆయన ప్రతిష్ట మసకబారింది. ఈ ఘటన జరిగిన వెనువెంటనే సూరత్‌కు చెందిన అక్కాచెల్లెళ్లు తమపై కూడా ఆసారాం, ఆయన కుమారుడు సాయి అత్యాచారం చేశారని బయటికొచ్చారు. తర్వాత ఆశ్రమాలపై దాడిచేసిన పోలీసులకు వేలాది ఎకరాల భూముల డాక్యుమెంట్లు, భారీ సంఖ్యలో షేర్ల పత్రాలు లభ్యమయ్యాయి. అహ్మదాబాద్‌లోని ఆసారాం ఆశ్రమం ఆసారాంతో మోదీ ఆసారాం దోషిగా తేలడంతో ప్రధాని మోదీ గతంలో ఆసారాంతో కలసి ఉన్న ఫొటోలు, వీడియోలను పలువురు నెటిజన్లతోపాటు కాంగ్రెస్ పార్టీ కూడా ట్వీటర్లో పోస్ట్ చేసింది. ‘నీ స్నేహితులను బట్టి నీ వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చు’ అనే అర్థం వచ్చేలా ఉన్న క్యాప్షన్‌ను ఓ ఫొటోకు కాంగ్రెస్ పెట్టింది. ఆ తర్వాత స్త్రీలపై గతంలో అసభ్యకర వ్యాఖ్యలు చేసిన అనేకమంది బీజేపీ నేతల పేర్లతో ఓ జాబితాను కూడా కాంగ్రెస్ పోస్ట్ చేసింది. కొందరు మరో ఫొటోతో కాంగ్రెస్‌కు కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ నేత దిగ్విజయ సింగ్ గతంలో మధ్యప్రదేశ్ సీఎంగా ఉండగా ఆసారాంకు దండం పెడుతున్న ఫొటోలను పోస్ట్ చేశారు. -
పైపూతలే పరిష్కారమా?
కొత్త కోణం అత్యాచారాలు కేవలం వ్యక్తుల చేష్టలు మాత్రమే కావు. ఆ దుర్మార్గాలకు సమాజం నిండా ఆవరించి ఉన్న అహంకారం, పెత్తనం, ఆధిపత్యంలాంటి భావాలు అటువంటి వాటిని పెంచి పోషిస్తున్న సంస్థలు బాధ్యులు. రేపిస్టులకు శిక్షలూ, బాధిత కుటుంబాలకు న్యాయం అనే రెండూ సరైన డిమాండ్లే. కానీ అవే సమస్యకు సంపూర్ణ పరిష్కారం కావు. అత్యాచారాలకు వ్యక్తులు మాత్రమే కారణం కాదనీ, వాటిని ప్రేరేపిస్తున్న భావజాలానిదీ, రాజకీయాలదే ప్రధాన బాధ్యత అని గ్రహించినప్పుడు వ్యవస్థపైనే మనం యుద్ధం ప్రకటించగలుగుతాం. అప్పుడెప్పుడో 2012లో ఢిల్లీలో నిర్భయ మీద జరిగిన ఘటనపై దేశ వ్యాప్తంగా ఉద్యమాలు వెల్లువెత్తాయి. భవిష్యత్తుపై ఆశలు రేకెత్తించాయి. ఓ చట్టం తేవడంతోనో, లేదా వాళ్ళని ఉరితీయాలని కోరడంతోనో ఆగ్రహం చల్లారిపోతోంది. నిజానికి మనం ఏం కోరుకుంటున్నాం. తప్పు చేసిన వారికి శిక్ష పడాలనా? తప్పులు జరగకుండా ఉండాలనా? మనమంతా కోరుకునేది తప్పులు జరగకుండా ఉండడమే అయితే అసలు తప్పుకి కారణాలేమిటో వెతకాలి. దాని మూలాలను విశ్లేషించాలి. ఈ దేశంలో స్త్రీలపైనా, ప్రధానంగా పాపం పుణ్యం ఎరుగని పసిబిడ్డలపైనా జరుగుతున్న హింస, అత్యాచా రాలూ, హత్యలూ మానవత్వం మిగిలివున్న మనసులను, మనుషులనూ కలవరపెడుతున్నాయి. ఘటనలు జరిగినప్పుడు వెల్లువెత్తుతోన్న ఆగ్రహం, ఉద్యమాలు ఆ తరువాత చప్పున చల్లారిపోతున్నాయి. మళ్ళీ ఏదైనా ఘటన జరిగినప్పుడే మన గొంతు వినిపించేది. మనలో ఆందోళన కనిపించేది. మన లోని ఆగ్రహావేశాలు ఉద్యమరూపం దాల్చేదీ. ఈ నిరసనలన్నీ కూడా వ్యక్తుల దగ్గరే ఆగిపోతున్నాయి. వాళ్ల శిక్షలవరకే పరిమితమౌతున్నాయి. అంతగా అయితే బా«ధిత కుటుంబాలకు న్యాయం జరగాలన్న డిమాండ్ వరకూ కొన సాగుతున్నాయి. ఇవి రెండూ న్యాయమైన డిమాండ్లే, సరైనవే. కానీ అవే సమ స్యకి సంపూర్ణ పరిష్కారం కావు. భవిష్యత్‌లో జరగబోయే అఘాయిత్యాలకు యీ డిమాండ్లే విముక్తి పలకలేవు. అత్యాచారం వ్యక్తిగతం కాదు నిజానికి అత్యాచారాలకూ, హత్యలకూ పాల్పడుతున్న వారు వ్యక్తులు గానే కనిపించినప్పటికీ, కొన్ని వ్యవస్థలకీ, రాజకీయాలకీ ముడివడి వున్న విష యమిది. అందుకే ఆయా రాజకీయాలూ, ఆ భావజాలం కొన్నిసార్లు బహి రంగంగానే నిందితులకు అండగా నిలుస్తుంటాయి. ఈ దేశంలో చిన్నా పెద్దా తేడా లేకుండా వయసుతో నిమిత్తం లేకుండా అత్యాచారాలు జరగడానికీ, పసిబిడ్డలని కూడా చూడకుండా అత్యంత క్రూరంగా హత్యలకు సైతం ఒడి గట్టడానికీ, మతం, ప్రాంతం, భాష, పితృస్వామ్య భావజాలం కారణాలని పదే పదే రుజువవుతూ వస్తున్నది. జమ్మూలోని కథువా గ్రామంలో ఎనిమిదేళ్ల పసిపాపను ఒక ప్రార్థనా మందిరంలో బంధించి, కొన్ని రోజులపాటు పసికూనపై అత్యాచారం చేసి చివరకు అతిక్రూరంగా చంపేసిన దారుణం దేశంలో ప్రకంపనలు సృష్టిం చింది. ప్రపంచం మొత్తాన్ని కలవరపరిచింది. కానీ గతంలో ఎప్పుడూ లేన ట్టుగా ఈ దారుణాన్ని బహిరంగంగా నిస్సిగ్గుగా సమర్థించడం దేశంలో మారుతున్న సామాజిక, రాజకీయ పరిస్థితులకు ప్రత్యక్ష ఉదాహరణ. ఆ పసి పాపను∙అత్యాచారం చేసి, హత్య చేసిన వారి సామాజిక వర్గం నేతలు, చివ రకు బీజేపీ మంత్రులు, నాయకులు కూడా నిందితులను బహిరంగంగా సమ ర్థించారు. పైగా వారికి మద్దతుగా జెండాలు పట్టుకొని వీరావేశంతో వీ«ధుల్లో కెక్కారు. ఇట్లా ప్రవర్తించడం వెనుక మతపరమైన, రాజకీయపరమైన కారణా లున్నాయనేది నమ్మక తప్పని వాస్తవం. ఘాతుకానికి బలైన ఎనిమిదేళ్ల చిన్నారి ఆసిఫాను, మహమ్మద్ యూసుఫ్, ఆయన భార్య నసీమా బీబీ రెండేళ్ల వయస్సులో దత్తతకు తీసు కున్నారు. మహమ్మద్ యూసుఫ్ గొర్రెలను, మేకలను మేపుతూ బతుకుతు న్నాడు. పదేళ్ల నుంచి తువా జిల్లా రసనగ్రామంలో స్థిరపడ్డాడు. అయితే జమ్మూలో హిందువులదే మెజారిటీ. మహమ్మద్ యూసఫ్ లాంటి వాళ్ళు ఇక్కడ స్థిరపడితే, శ్రీనగర్లాగా జమ్మూలో కూడా ముస్లింల సంఖ్య పెరుగు తుందనే అనుమానం ఇక్కడి హిందువులలో ఉన్నది. అందుకుగాను మేకలు, గొర్రెలు మేపుకొని బతికే వారిలో భయాందోళనలు సృష్టించడానికి ఇటువంటి ఘాతుకానికి పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. కామవాంఛ కాదు. నిజానికి ఒక సామూహిక విద్వేషం ఈ ఘాతుకానికి పురికొల్పింది. అలాగే ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ ఘటన. పద్దెనిమిదేళ్ల దళిత యువతి ఉద్యోగం అడగడానికి స్థానిక ఎమ్మెల్యే కుల్దీప్ సెనేగర్ ఇంటికి వెళితే, అతను తనపై అత్యాచారం చేసినట్టు పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. కానీ పోలీసులు పట్టించుకోలేదు. మెజిస్ట్రేట్ ముందు ఆ విషయం చెప్ప కుండా పోలీసులు అడ్డుకున్న వాస్తవాన్ని కూడా ఆ యువతి బయటపెట్టింది. చివరకు న్యాయం చేయాలని అడగడానికి పోలీస్ స్టేషన్‌కు వెళ్ళిన ఆమె తండ్రిని ఎమ్మెల్యే సోదరుడు మరికొంత మంది తీవ్రంగా కొట్టి గాయపరిస్తే ఆయన ఆసుపత్రిలోనే మరణించారు. అత్యాచారానికి గురైన ఆ యువతి ముఖ్యమంత్రి ఇంటి ముందర ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో పోలీ సుల్లో కదలిక వచ్చింది, దీంతో కేసు విచారణకు ఆదేశించారు. అనేక నిరస నలు, దేశవ్యాప్తంగా దళితుల ఆందోళనల వల్ల ఎమ్మెల్యేను అరెస్టు చేశారు. అత్యాచారానికి పాల్పడిన వాళ్ళు ఆధిపత్య కులానికి చెందినవారు కాబట్టే ఇటు పోలీసులూ, అటు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోయారు. కుల, మతాధిపత్యమే ప్రధాన భూమిక మహారాష్ట్రలోని భండార జిల్లాలో జరిగిన ఖైర్లాంజి ఘటన కూడా అదే కోవ లోకి వస్తుంది. ఇక్కడ కూడా దళితులపైనే అఘాయిత్యం జరిగింది. ఆ గ్రామంలోని భయ్యాలాల్ బూత్ మాంగే కుటుంబాన్ని ఆ ఊరి పెత్తందార్లు నిర్మూలించారు. డోమబిమ్తే భార్య సురేఖ బూత్ మాంగే, కూతురు ప్రియాం కలపై సామూహిక అత్యాచారం జరిపి చంపేశారు. భయ్యాలాల్ తన భూమిని ఊరు పెత్తందారులు ఆక్రమించుకోవడాన్ని వ్యతిరేకించినందుకు అహం దెబ్బతిని అత్యంత దారుణంగా ఆ కుటుంబాన్ని చంపేశారు. ఇక్కడ కూడా కులాధిపత్యం వల్లే అత్యాచారం జరిగిందనేది వాస్తవం. యుద్ధంలో కూడా స్త్రీల శరీరాలపైనే శత్రువు ప్రథమ దాడి. అనేక యుద్ధాల్లో శత్రువు చేతికి చిక్కిన స్త్రీలను చెరచకుండా వదిలిపెట్టిన దాఖ లాలుండవు. చివరకు శ్రీలంక తమిళులపై అక్కడి సైన్యం పాల్పడిన అకృ త్యాలు మనం చూశాం. మగాళ్ళనైతే అతి క్రూరంగా చంపేయడం, ఆడవా ళ్ళంటేనే పురుషుడి ప్రతాపం చూపించుకొనే ఒక అవకాశంగా మారుతున్న స్థితి. నిజానికి అది భౌతిక వాంఛ కాదు. ప్రతీకారేచ్ఛ. ఆ వ్యక్తుల్ని పట్టుకొని చంపినా తీరని ప్రతీకారం వారి స్త్రీలపై అత్యాచారాలకు పాల్పడడంతో కసి తీరుతుంది. విశాఖ జిల్లా వాకపల్లిలో ఆగస్టు 20, 2007న గ్రేహౌండ్స్ పోలీ సులు పదకొండుమంది ఆదివాసీ మహిళలపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసులు కేసు నమోదు చేశారు. 2007న జరిగిన ఘటనపై ఇంకా విచారణ పూర్తికాలేదు. దోషులపై చర్యలు తీసుకున్నదీ లేదు. ఈ ఉదంతం కూడా ప్రతీకారంతో జరిగిందే తప్ప మరొకటి కాదు. నక్సలైట్ల కోసం గాలింపు జరుపుతున్న సమయంలో పోలీసులు ఈ దారుణానికి ఒడి గట్టారు.. నక్సలైట్లకు ఎటువంటి సాయం అందకుండా చేయడంలో భాగంగా ఈ ఘటన జరిగింది. గతంలో కూడా నైజాంకు వ్యతిరేకంగా జరిగిన సాయుధ పోరాట సమయంలో సైతం ఎంతో మంది మహిళలపై సైన్యమే సామూహిక అత్యాచారాలకు పాల్పడినట్టు అనేక నివేదికలున్నాయి. ఈ అత్యాచారాలు కేవలం పగ, ప్రతీకారంతో జరుగుతున్నవే. కఠిన శిక్షలే సమస్యకు పరిష్కారమా? ఇటీవల ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్లాంటిచోట్ల ఈశాన్య రాష్ట్రాల అమ్మాయిలపైన జరి గిన సామూహిక అత్యాచారాలే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. నవంబర్ 24, 2010న ఢిల్లీ ఔటర్ రింగ్‌రోడ్డు దగ్గర ఈశాన్య రాష్ట్రాలకు చెందిన అమ్మాయిని కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మే 8, 2005న రోడ్డు పక్కన నడచివెళ్తుండగా మిజోరాంకు చెందిన ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన అమ్మాయిని అపహరించి, కారులోనే అతిక్రూరంగా సామూహిక అత్యాచారం చేసారు. బెంగుళూరులో కూడా ఈశాన్య రాష్ట్రాలకు చెందిన విద్యార్థులపై దాడులు జరిగాయి. సిక్కింకు చెందిన 22 ఏళ్ళ యువతిపై ఢిల్లీ నుంచి గుర్గావ్ వెళ్తుండగా కారులో అత్యాచారం జరిపి ఢిల్లీలో పడేశారు. ఈశాన్య రాష్ట్రాల విద్యార్థులపై విద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా నేటికీ ప్రచారం జరుగుతున్నది. రెచ్చగొడుతోన్న విద్వేషం ఫలితమే ఇటువంటి ఘటనలు. గత డెబ్భై ఏళ్ల భారత స్వాతంత్య్ర చరిత్రలో మహిళల రక్షణ కోసం అనేక చట్టాలు వచ్చాయి. 2012 నిర్భయ చట్టం అందులో చాలా కఠినమైనది. తాజాగా కేంద్రం జారీచేసిన ఆర్డినెన్స్ మరింత శక్తివంతమైందని చెబుతు న్నారు. పన్నెండేళ్ళలోపు అమ్మాయిలపై అత్యాచారం జరిపిన వారికి మరణ దండన విధించేలా చట్టాలలో సవరణలు చేశారు. మరణశిక్ష ఇవ్వాళ భార త్లో కొత్తేమీకాదు. హత్యానేరాల్లో దానిని అమలు చేస్తున్నారు. కానీ హత్యలు ఏమేరకు తగ్గాయనేది ఆలోచించాలి. మరణశిక్షని చూసి మారిన వాళ్లెందరు? ప్రతి సంవత్సరం హత్యలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. మరణ శిక్షలు లేని దేశంలో ఇంతకన్నా ఎక్కువగా హత్యలు జరుగుతున్నదీ లేదు. ఒకరకంగా చెప్పాలంటే ఈ రకమైన శిక్షలు వేస్తామని చట్టాలు చేయడం అసలు విషయాలపైన దృష్టిపోకుండా చూడటానికే. నిజానికి మన దేశంలో ఉన్న సామాజిక, సాంస్కృతిక పరిస్థితులను, ఆలోచనలను మార్చకుండా ఏ చట్టాలూ ఫలితాలను ఇవ్వవు. రాజకీయంగా విమర్శల నుంచి బయటపడేందుకు ప్రభుత్వాలు చేస్తున్న విన్యాసాలు మాత్రమే ఇవి. కులాలు, మతాలు, ప్రాంతాలు, భాషలు, రాజకీయ సిద్ధాం తాల విద్వేషాలను రెచ్చగొడుతున్న మనమే చట్టాలను పరిష్కారంగా చూపు తున్నాం. అందుకే ఈ దేశానికి కావాల్సింది శిక్షలు వేసే చట్టాలు మాత్రమే కాదు, మానవీయ భావాలను పెంచగలిగే శిక్షణ. తాము ఎక్కువ కులం మిగతావాళ్లు మాకన్నా తక్కువ, వాళ్లను ఏం చేసినా ఎవ్వరూ ఏమీ అనరనే అహంకారం, తాము మెజారిటీ ఇతరులు మైనారిటీలు అనే ఆధిపత్య భావన, తాము మగవాళ్లం ఆడవాళ్ల మీద మాకు సర్వాధికారాలూ ఉన్నాయనే ధోరణి అన్నిరకాల క్రూరత్వాలకు కారణం. అందుకే అత్యాచారాలు కేవలం వ్యక్తుల చేష్టలు మాత్రమే కావు. ఆ దుర్మార్గా లకు సమాజం నిండా ఆవరించి ఉన్న అహంకారం, పెత్తనం, ఆధిపత్యం లాంటి భావాలు అటువంటి వాటిని పెంచి పోషిస్తున్న సంస్థలు బాధ్యులు. ఇది గ్రహించినప్పుడే అత్యాచారాలకు వ్యక్తులే కారణం కాదనీ, వాటిని ప్రేరే పిస్తున్న భావజాలానిదీ, రాజకీయాలదే ప్రధాన బాధ్యత అని గ్రహించగలు గుతాం. అది అర్థం చేసుకుంటే అత్యాచారాలకు కారణమైన భావజాలాన్ని పెంచి పోషించే వ్యవస్థపైనే మన యుద్ధం ప్రకటించగలుగుతాం. - మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ 97055 66213 -
‘ఆశ’గా ఎదురుచూసి.. కంగుతిన్నారు!
జోధ్‌పూర్: తాము నమ్మిన భగవత్స్వరూపం కడిగిన ముత్యంలా తిరిగొస్తుందని ఆశగా ఎదరుచూసిన భక్తులు కంగుతిన్నారు. బాలికపై అత్యాచారం కేసులో ప్రముఖ ఆథ్యాత్మిక గురువు ఆశారాం బాపు దోషిగా తేలడంతో ఆయన అభిమానులు కన్నీటిపర్యంతమవుతున్నారు. తమ గురువు నిర్దోషిగా విడుదలవుతారని దండలు కూడా తీసుకొచ్చిన అభిమానులు కోర్టు తీర్పుతో షాక్‌కు గురయ్యారు. ఉత్తరభారతంలోని పలు రాష్ట్రాల్లో బుధవారం ఉదయం కనిపించిన దృశ్యాలివి! ఆథ్యాత్మిక గురువుగా ఒక వెలుగు వెలిగిన ఆశారాం.. దేశవ్యాప్తంగా 400కుపైగా ఆశ్రమాలు స్థాపించారు. 2013లో సహారన్‌పూర్‌లోని తన ఆశ్రమంలోనే ఆయన మైనర్ బాలికలపై అత్యాచారానికి పాల్పడినట్లు కేసు నమోదయింది. సుదీర్ఘ విచారణ అనంతరం ఆశారాం దోషే అంటూ జోధ్‌పూర్ ఎస్సీ, ఎస్టీ ట్రయల్ కోర్టు తీర్పు చెప్పింది. బాపుతో పాటు కేసులోని ఐదుగురు నిందితుల్లో ఇద్దరు మాత్రం నిర్దోషులుగా బయటపడ్డారు. బాపూజీ నిర్దోషిగా బయటికొస్తారని దండలతో వచ్చి జోధ్‌పూర్ జైలు వద్ద హడావిడి చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తీర్పు నేపథ్యంలో ఆశారాం అనుచరులు విధ్వంసానికి పాల్పడే అవకాశాలున్న దరిమిలా రాజస్తాన్, గుజరాత్, మధ్యప్రదేశ్‌లలోని కీలక పట్టణాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. న్యాయం దక్కింది: బాధితురాలి తండ్రి ‘‘ఆశారాం దోషిగా తేలడంతో మాకు న్యాయం దక్కింది. ఈ కేసులో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన సాక్షుల కుటుంబాలకు కూడా న్యాయం జరగాలని కోరుతున్నాను. దోషికి కఠిన శిక్ష పడుతుందని భావిస్తున్నా. సుదీర్ఘంగా సాగిన న్యాయ పోరాటంలో మాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’’ తీర్పుపై అప్పీలు! అత్యాచారం కేసులో ఆశారాంను దోషిగా తేల్చిన జోధ్‌పూర్ ఎస్సీ, ఎస్టీ కోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్లే యోచనలో ఉన్నట్లు ఆశారాం ఆశ్రమ అధికార ప్రతినిధి నీలమ్ దుబే మీడియాకు చెప్పారు. తీర్పు కాపీని క్షుణ్నంగా చదివి, నిపుణులతో చర్చించిన మీదట తుది నిర్ణయం తీసుకుంటామని ఆమె చెప్పారు. దొంగ బాబాలకు చెంపపెట్టు: కాంగ్రెస్ ‘నిజమైన సాధువులకు, దొంగ బాబాలకు మధ్య తేడాలను ప్రజలు పసిగట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ తీర్పు ఖచ్చితంగా చాలా మార్పులకు దారితీస్తుంది. ముఖ్యంగా బాబాలు, సాధువుల పట్ల అంతర్జాతీయంగా నెలకొన్న అభిప్రాయాల్లో మార్పు వస్తుంది’’ అని కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్ అన్నారు. -
ఉరి వల్ల రేప్‌లు ఆగుతాయా?
న్యూఢిల్లీ: బాలికలపై అత్యాచారానికి పాల్పడే కీచకులకు మరణదండన విధించేలా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్(పోక్సో చట్టంలో సవరణ)పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవున్నాయి. పలు రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు కేంద్ర నిర్ణయాన్ని బాహాటంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘ఉరిశిక్షలు వేస్తే అత్యాచారాలు ఆగుతాయా? ఆర్డినెన్స్ జారీ చేయడానికి ముందు కేంద్రం శాస్త్రీయ అధ్యయనం చేసిందా? అత్యాచారానికి, హత్యకు శిక్ష ఒకటే అయినప్పుడు.. రేప్ చేసిన నిందితుడు బాధితురాలిని బతకనిస్తాడా?’’ అని జస్టిస్ గీతా మిట్టల్, జస్టిస్ హరిశంకర్‌లతో కూడిన ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘అత్యాచార ఉదంతాలకు సంబంధించి గతంలో చేసిన ఐపీసీ చట్టసవరణ దుర్వినియోగం అవుతోందం’టూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. నిర్భయ చట్టం తర్వాత ఏంజరిగింది?: కథువాలో ఎనిమిదేళ్ల చిన్నారిపై అకృత్యం, ఉన్నావ్‌లో మైనర్ బాలికపై అత్యాచారం, బాధితురాలి తండ్రి హత్య ఘటనలపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబికిన దరిమిలా కేంద్రం పోక్సో చట్టానికి సవరణలు చేసింది. 12 ఏళ్లలోపు బాలికలపై అత్యాచారం జరిపితే ఖచ్చితంగా మరణశిక్ష విధించాలన్నది ఆ సవరణ ఉద్దేశం. కాగా, గతంలో నిర్భయ ఉదంతం తర్వాత కూడా ఇదే మాదిరిగా కఠిన చట్టాలను రూపొందించడం, వాటి వల్ల నేరాలు అదుపులోకి రానివిషయాన్ని సామాజిక, న్యాయ నిపుణులు గుర్తుచేస్తున్నారు. నిర్భయ చట్టం తర్వాత లైంగిక నేరాలు అదుపులోకొస్తాయని జాతి యావత్తూ విశ్వసించినా, వాస్తవంలో అందుకు విరుద్ధంగా జరిగింది. 2016 నాటి జాతీయ క్రైం రికార్డుల బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదిక ప్రకారం మహిళలపై అత్యాచారాలు, ఇతర లైంగిక నేరాలు అంతక్రితం కంటే 2.9 శాతం పెరిగాయి. బాలికలపై లైంగిక నేరాలు సైతం గణనీయంగా పెరిగినట్టు ఆ నివేదిక తెల్పింది. 2015తో పోలిస్తే 2016లో ఈ తరహా నేరాలు 82 శాతం ఎక్కువయ్యాయని వివరించింది. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడుల్లో ఈ కేసులు అత్యధికంగా జరిగాయని పేర్కొంది. మెట్రో నగరాల్లో ఈ బెడద ఎక్కువని తెలిపింది. మరోపక్క పోక్సో కేసుల విచారణకు ప్రత్యేక న్యాయస్థానాలున్నా అవి నత్తనడకన సాగుతున్నాయని తేల్చింది. పోర్న్ సైట్లను నిషేధించండి: బీజేపీ మంత్రి దేశంలో లైంగికనేరాల పెరుగుదలకు పోర్న్ వెబ్సైట్లే ప్రధాన కారణమని మధ్యప్రదేశ్ హోం మంత్రి భూపేంద్ర సింగ్ అన్నారు. యువతపై అశ్లీల సైట్ల ప్రభావం అధికంగా ఉందని, కాబట్టి వెంటనే వాటిపై పూర్తిస్థాయిలో నిషేధం విధించాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖరాశారు. (చదవండి: కఠిన చట్టాలే పరిష్కారమా?) -
బాలికపై అత్యాచారం కేసులో పదేళ్ల జైలు శిక్ష
రాజమహేంద్రవరం క్రైం : మైనర్‌పై అత్యాచారం కేసులో పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. చింతూరు ఎస్సై శ్రీనివాస కుమార్ కథనం ప్రకారం.. 2015 నవంబర్ 28న చింతూరుకు చెందిన తిలపురెడ్డి సాయి మణికంఠ, చింతూరు జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. అదే కాలేజీలో చదువుతున్న బాలికను కాలేజీ వెనుకకు తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. బాలికను వివాహం చేసుకోమంటే కులం తక్కువ అని నిరాకరించాడు. ఈ సంఘటన పై అప్పటి చింతూరు ఎస్సై గజేంద్ర కుమార్ కేసు నమోదు చేశారు. అప్పటి డీఎస్పీ సుంకర మురళీ మోహన్ దర్యాప్తు చేసి కేసును రాజమహేంద్రవరం ఒకటో అదనపు జిల్లా సెషన్ కోర్టులో విచారణ నిమిత్తం పంపారు. కేసును విచారణ చేసిన ఒకటో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి కిషోర్ కుమార్ తీర్పు ఇస్తూ నిందితుడిపై నేరం రుజువు కావడంతో పదేళ్ల జైలుశిక్షతోపాటురూ.వెయ్యిజరిమానావిధిస్తూ తీర్పు ఇచ్చారు. -
మానవత్వానికే మచ్చలాంటి ఘటన..
అహ్మదాబాద్ : మానవత్వానికే మచ్చలాంటి ఘటన గుజరాత్లో చోటుచేసుకుంది. అశ్లీలతకు అలవాటు పడిపోయిన ఓ యువకుడు కన్నతల్లినే చెరపట్టాడు. దిగ్భ్రాంతికి గురి చేసే అ ఘటన గుజరాత్‌లోని బనసకాంత జిల్లా పలన్‌పూర్ నగరంలో చోటు చేసుకుంది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. పఠాన్ టౌన్లో రాకేశ్(22) కుటుంబం నివసిస్తోంది. రాకేశ్ తండ్రి తాపీ మేస్త్రీ. పనుల నిమిత్తం వేర్వేరు ప్రాంతాలకు తిరుగుతుంటాడు. సోదరుడు అహ్మదాబాద్‌లో స్థిరపడగా కాగా, రాకేశ్.. తన తల్లి, సోదరి(20)లతో స్థానికంగా జల్ చౌక్‌లో ఉంటున్నాడు. ఇదిలా ఉండగా గత కొంతకాలంగా రాకేశ్ పోర్న్‌కు బానిసయ్యాడు. గత గురువారం రాత్రి మంచి నీళ్ల వంకతో తల్లి గదిలోకి వెళ్లిన యువకుడు.. ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో ఆమె అరుస్తూ అతన్ని ప్రతిఘటించింది. అయితే వారిద్దరి మధ్య గతంలో తరచూ గొడవలు చోటు చేసుకోవటంతో.. కూతురు, చుట్టు పక్కల వాళ్లు ఆ అరుపులను పెద్దగా పట్టించుకోలేదు. చివరకు ఈ దారుణాన్ని భర్తకు వివరించిన మహిళ.. కుటుంబ సభ్యుల సాయంతో పోలీసులను ఆశ్రయించింది. ‘ రాకేశ్ ఒక్కోసారి తమ ముందే బూతు వీడియోలు చూసేవాడని.. కోరిక తీర్చమంటూ వేధించేవాడని’ ఆ తల్లికూతుళ్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శనివారం నిందితుడిని అరెస్ట్ చేసి.. అతని ఫోన్, ల్యాప్ ట్యాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. దారుణానికి తెగబడే ముందు వరకు యువకుడు అశ్లీల వీడియోలు చూసినట్లు విచారణలో తేలింది. ఐపీసీ సెక్షన్లు 376, 507 ప్రకారం రాకేశ్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టిన పఠాన్ టౌన్ పోలీసులు -
ఉరే సరి...
మొన్న కథువా... నిన్న ఉన్నవ్... నేడు ఇండోర్... ఇలా భారతావనిలో పసిమొగ్గలపై కూడా మృగాళ్లు లైంగిక దాడులకు తెగబడడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడేవారికి మరణశిక్ష విధిస్తూ కేంద్రప్రభుత్వం ఆలస్యంగానైనా సరే అత్యవసర ఆర్డినెన్స్ తీసుకురావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. 16 ఏళ్ల లోపు బాలికలపై లైంగిక దాడులకు పాల్పడితే 20 ఏళ్ల జైలు శిక్ష లేదా మరణించే వరకు జైలు శిక్ష విధిస్తారు. మహిళలపై లైంగిక దాడులకు పాల్పడితే 10 ఏళ్ల జైలు లేదా జీవిత ఖైదు ఖాయం. అత్యాచార కేసుల విచారణకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ఏర్పాటు కారణంగా బాధిత కుటుంబాలకు సత్వర న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు. పెదవాల్తేరు(విశాఖతూర్పు) : లైంగిక నేరాలకు సంబంధించిన వివరాలు సేకరించడమే కాకుండా నిందితులపై నిఘా ఉంచడంలో ప్రపంచంలో భారతదేశం 9వ దేశంగా నిలిచింది. ఇప్పటికే ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా, బ్రిటన్, ఐర్లాండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ట్రినిడాడ్టొబాగో దేశాలు ఈ విధంగా నిఘా ఉంచుతున్నాయి. లైంగిక నేరగాళ్ల వివరాలు అమెరికాలో బహిరంగంగానే అందుబాటులో ఉంచడం విశేషం. మిగిలిన దేశాలలో న్యాయ, విచారణ సంస్థలకు ఈ వివరాలు అందుబాటులో ఉంచారు. విశాఖలోనూ పలు సంఘటనలు విశాఖ జిల్లాలో కూడా బాలికలు, మహిళలపై లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఏటా పదుల సంఖ్యలో బాలికలు అదృశ్యమవుతున్న కేసులు నమోదవుతూనే ఉండడం కలవరపరుస్తోంది. కళాశాలలు, బస్టాప్‌ల వద్ద ఈవ్‌టీజింగ్ సరేసరి. గడప దాటే మహిళలకు రానురానూ భద్రత లేకుండా పోతోందని మహిళాసంఘాలు గగ్గోలు పెడుతున్నాయి. మతిస్థిమితం లేని మహిళలపై కూడా అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రేమ పేరుతో బాలికలపై యాసిడ్దాడులు కూడా గతంలో జరిగాయి. ఫాస్ట్‌ట్రాక్ కోర్టులతో సత్వర న్యాయం ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని ఎన్నాళ్లనుంచో కోరుతున్నాం. ఇప్పటికైనా కేంద్రప్రభుత్వం ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడంతో బాధిత కుటుంబాలకు న్యాయం జరుగుతుంది. చిన్నారులపై సైతం లైంగిక దాడులు జరగడం దారుణం. ఇటువంటి నిందితులకు ఉరి శిక్షే సరైనది. – గొండు సీతారాం, అధ్యక్షుడు, ఏపీ చైల్డ్‌రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం,విశాఖపట్నం. మృగాళ్లకు ఉరే సరైన శిక్ష కేంద్రప్రభుత్వం ఆర్డినెన్స్ అభినందనీయం. చిన్నపిల్లలపై సైతం లైంగిక దాడులకు పాల్పడడం సభ్యసమాజంలో ఉన్నామా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం విచారణ పేరుతో కాలయాపన జరుగుతోంది. ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ద్వారా సత్వరమే శిక్షలు విధించడం ద్వారా నేరాలు గణనీయంగా తగ్గుముఖం పడతాయి. – బి.శకుంతల, పిల్లల హక్కుల కార్యకర్త, సీతమ్మధార. కేంద్ర ఆర్డినెన్స్‌తో మంచి మార్పు కేంద్రప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ చాలాబాగుంది. నిందితులకు ఉరిశిక్ష విధించడం సరైన శిక్ష. అప్పుడే సమాజంలో మంచి మార్పు వస్తుంది. చిన్న పిల్లలపై క్రూరంగా వ్యవహరించడం అవివేకం. ఈ నేపథ్యంలో ఇటువంటి ఆర్డినెన్స్ తీసుకురావడం అభినందనీయం. ఆర్డినెన్స్ అమలులో భాగంగా బాధిత కుటుంబాలకు న్యాయంపై తమ సంస్థ పర్యవేక్షణ ఉంటుంది. అత్యాచార బాధితులకు ప్రస్తుతం కేజీహెచ్‌లో ఒన్‌స్టాప్ క్రైసిస్ సెంటర్ ద్వారా సేవలు అందిస్తున్నాం. – జి.చిన్మయిదేవి, ప్రాజెక్టు డైరెక్టర్, జిల్లా మహిళా–శిశు అభివృద్ధి సంస్థ, విశాఖపట్నం. ఆర్డినెన్స్ యథాతథంగా అమలు చేయాలి దేశంలో నిర్భయ చట్టం వచ్చిన తరువాత కూడా లైంగిక నేరాలు తగ్గలేదు. ఈ నేపథ్యంలో కేంద్రప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ మంచిదే. అయితే ఈ ఆర్డినెన్స్‌ను యథాతథంగా అమలు చేస్తేనే బాధితులకు న్యాయం జరుగుతుంది. కొన్ని దేశాలలో లైంగిక నేరాలకు కఠిన శిక్షలు అమలు చేస్తున్నారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ద్వారా నిందితులకు త్వరితగతిన శిక్ష విధించాలి. – కె.పద్మ, కార్యదర్శి, మహిళా చేతన, విశాఖపట్నం -
పోక్సో చట్టసవరణకు కేబినెట్ ఆమోదముద్ర
-
చిన్నారులపై రేప్‌కు మరణశిక్షే
న్యూఢిల్లీ: చిన్నారులపై వరుసగా జరుగుతున్న అత్యాచారాలపై దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తడంతో.. కఠిన శిక్షల అమలుకు కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు నడుం బిగించింది. కఠువా, సూరత్‌ల్లో మైనర్ బాలికలపై అత్యాచారం, హత్య.. ఉన్నావ్‌లో బాలికపై అత్యాచార ఘటనల నేపథ్యంలో 12 ఏళ్ల లోపు వయస్సున్న బాలికలపై అత్యాచారాలకు ఒడిగట్టే వారికి మరణశిక్ష విధించేలా అత్యవసరంగా ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. ప్రధాని మోదీ అధ్యక్షతన శనివారం జరిగిన కేబినెట్ భేటీలో క్రిమినల్ చట్టాల్లో సవరణలు చేస్తూ రూపొందించిన ఈ ఆర్డినెన్స్‌కు ఓకేచెప్పారు. అత్యాచార కేసుల విచారణకు కొత్తగా ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్ని ఏర్పాటు చేయడంతో పాటు కేసుల దర్యాప్తు కోసం అన్ని పోలీసు స్టేషన్లు, ఆస్పత్రులకు ప్రత్యేక ఫోరెన్సిక్ కిట్లను ఇవ్వనున్నారు. రాష్ట్రపతి సంతకంతో ఈ ఆర్డినెన్స్ తక్షణం అమల్లోకిరా నుంది. ఆర్డినెన్స్‌లోని సవరణల్ని బిల్లు రూపంలో ఆమోదం కోసం వర్షాకాల సమావేశాల్లో పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. గరిష్టంగా మరణించేంత వరకూజైలు లేదా మరణశిక్ష తాజా ఆర్డినెన్స్ ప్రకారం 12 ఏళ్లు, 16 ఏళ్ల లోపు బాలికలపై అత్యాచారానికి పాల్పడేవారికి అత్యంత కఠిన శిక్షలు అమలు చేస్తారు. 12 ఏళ్ల లోపు బాలికలపై అత్యాచారానికి పాల్పడే వారికి గరిష్టంగా మరణశిక్షను ఖరారు చేశారు. 12 ఏళ్ల లోపు బాలికపై అత్యాచారానికి పాల్పడితే కనిష్ట శిక్ష 20 ఏళ్లు కాగా గరిష్టంగా దానిని యావజ్జీవంగా(మరణించే వరకూ జైలుశిక్ష అనుభవించడం) పొడిగించడం లేదా మరణశిక్ష అమలు చేయవచ్చు. 12ఏళ్లలోపు బాలికను గ్యాంగ్‌రేప్ చేస్తే మరణించేంతవరకూ జైలుశిక్ష లేదా మరణశిక్ష విధిస్తారు. 16 ఏళ్ల లోపు బాలికను రేప్ చేసే వారికి ప్రస్తుతం విధిస్తున్న 10 ఏళ్ల కనిష్ట శిక్షను 20 ఏళ్లకు పెంచారు. శిక్షను గరిష్టంగా యావజ్జీవ కారాగారంగా (మరణించే వరకూ జైలుశిక్ష అనుభవించడం) పొడిగించవచ్చు. 16 ఏళ్ల లోపు బాలికను గ్యాంగ్‌రేప్ చేస్తే యావజ్జీవ శిక్ష(మరణించే వరకూ జైలుశిక్ష అనుభవించడం) విధిస్తారు. మహిళను రేప్చేస్తే కనిష్ట శిక్షను పదేళ్లకు పెంచారు. గరిష్టంగా జీవిత ఖైదు వేస్తారు. ఆర్డినెన్స్‌ను రాష్ట్రపతి కోవింద్ ఆమోదించగానే భారతీయ శిక్షా స్మృతి(ఐపీసీ), ద ఎవిడెన్స్ యాక్ట్, ద కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసిజర్(సీఆర్పీసీ), లైంగిక నేరాల నుంచి చిన్నారులకు రక్షణ(పోక్సో) చట్టాల్లో చేసిన సవరణలు అమల్లోకి వస్తాయి. కఠిన శిక్షల కోసం ఆర్డినెన్స్‌లో పలు నిబంధనలు రేప్ కేసుల్లో కఠిన శిక్షల కోసం న్యాయవ్యవస్థ అధికారాల్ని విస్తృతం చేస్తూ ఈ ఆర్డినెన్స్‌లో అనేక చర్యల్ని కేబినెట్ రూపొందించింది. విచారణ వ్యవస్థల్ని బలోపేతం చేయడం, రాష్ట్రాలు, హైకోర్టుల అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకుంటూ ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ఏర్పాట్లు మొదలైనవి అందులో ఉన్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 524 ఫాస్ట్‌ట్రాక్ కోర్టులుండగా అందులో అత్యధికంగా యూపీలో 183, మహారాష్ట్రలో 100, తమిళనాడులో 39, ఏపీలో 39, తెలంగాణలో 34 ఉన్నాయి. దేశంలో న్యాయ వ్యవస్థను బలోపేతం చేసేందుకు 1800 ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని 14 వ ఆర్థిక సంఘం గతంలో సూచించింది. కేసుల దర్యాప్తు కోసం సుశిక్షితులైన సిబ్బంది కొత్తగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ పదవుల్ని ఏర్పాటు చేయడంతో పాటు అత్యాచార కేసుల కోసం దీర్ఘకాలంలో అన్ని పోలీసు స్టేషన్లు, ఆస్పత్రులకు అధునాతన ఫోరెన్సిక్ కిట్లను అందచేస్తారు. నిర్దేశిత గడువులోగా దర్యాప్తును పూర్తి చేసేలా సుశిక్షితులైన అంకిత భావంతో పనిచేసేవారిని ఈ కేసుల కోసం ప్రత్యేకంగా నియమిస్తారు. రేప్ కేసుల కోసమే ప్రతీ రాష్ట్రంలో ప్రత్యేకంగా ప్రత్యేక ఫోరెన్సిక్ ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తారని కేంద్ర ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఈ చర్యలన్నీ యుద్ధ ప్రాతిపదికన మూడు నెలల్లోపు ప్రారంభంకానున్న ప్రాజెక్టులో భాగమని వెల్లడించారు. ‘నిర్భయ’ తర్వాత అమల్లోకి కఠినశిక్షలు అత్యాచారం కారణంగా మహిళ చనిపోయినా లేదా జీవచ్ఛవంగా మారిన సందర్భాల్లో దోషులకు మరణ శిక్ష విధించేలా 2012 నాటి నిర్భయ ఘటన తర్వాత ప్రభు త్వం చట్టం తెచ్చింది. 12 ఏళ్లలోపు వయస్సున్న చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడేవారికి మరణ శిక్షను విధించే ప్రతిపాదనను చురుగ్గా పరిశీలిస్తున్నామని శుక్రవారం కేంద్రం సుప్రీంకోర్టుకు కూడా తెలిపింది. ఆ 8 దేశాల సరసన భారత్ లైంగిక నేరగాళ్లకు సంబంధించిన వారి వివరాలను సేకరించి తర్వాత వారిపై ఓ కన్నేసి ఉంచే 8 దేశాల జాబితాలో భారత్ చేరనుంది. అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ట్రినిడాడ్ టొబాగో దేశాలు ప్రస్తుతం లైంగిక నేరగాళ్ల కదలికలపై నిఘా పెడుతున్నాయి. వీటిలో లైంగిక నేరగాళ్ల వివరాలు అమెరికాలో బహిరంగంగానే అందుబాటులో ఉండగా మిగిలిన దేశాల్లో న్యాయ, విచారణ సంస్థలకు మాత్రమే ఆ వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. మంత్రివర్గం నిర్ణయంతో ఇకపై భారత్‌లోనూ లైంగిక నేరగాళ్లపై నిఘా పెట్టనున్నారు. అయితే ఇది లైంగిక నేరగాళ్లపై సామాజికంగా చెడు ముద్ర వేస్తుందనీ, పునరావాసం అనే ప్రక్రియకు అర్థం లేకుండా పోతుందని పలువురు వ్యతిరేకిస్తున్నారు. నాలుగు నెలల చిన్నారిని చిదిమేశాడు ఇండోర్: కఠువా, ఉన్నావ్ దారుణ ఘటనల్ని మర్చిపోకముందే మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఓ మృగాడు రెచ్చిపోయాడు. తల్లిదండ్రులతో నిద్రపోతున్న నాలుగు నెలల పసిపాపను ఎత్తుకెళ్లిన నీచుడు.. ఆమెపై అత్యాచారం చేసి ఎత్తైన భవనం పైనుంచి విసిరేశాడు. దీంతో ఆ బాలిక ప్రాణాలు కోల్పోయింది. ఈ దారుణానికి సంబంధించి సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు ప్రధాన నిందితుడు, బాధితురాలి తల్లి బంధువైన నవీన్ గాడ్గే(24)ను అరెస్ట్ చేశారు. ఈ విషయమై ఇండోర్ డీఐజీ హెచ్‌సీ మిశ్రా మాట్లాడుతూ.. ‘కొద్దిరోజుల క్రితమే నవీన్ భార్య అతని నుంచి విడిపోయింది. దీంతో రజ్వాడా ప్రాంతంలో ఉంటున్న బాధితురాలి తల్లి వద్దకు నిందితుడు గురువారం వెళ్లాడు. తన భార్యను కాపురానికి రావాల్సిందిగా ఒప్పించాలని తన బంధువైన బాలిక తల్లిని కోరాడు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య వాగ్వాదం జరగడంతో నవీన్ వెళ్లిపోయాడు. తిరిగి శుక్రవారం తెల్లవారుజామున 4.45 గంటలకు అక్కడికి చేరుకున్న నిందితుడు.. రోడ్డుపక్కనే తల్లిదండ్రులతో నిద్రపోతున్న బాలికను భుజాలపై ఎత్తుకుని 50 మీటర్ల దూరంలో ఉన్న ఓ వాణిజ్య భవనం బేస్మెంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం చిన్నారిని అదే భవనం పైనుంచి విసిరేయడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. శుక్రవారం సాయంత్రం బాలిక మృతదేహాన్ని గుర్తించాం’ అని తెలిపారు. కాగా, చిన్నారిపై అత్యాచారం చేసి హత్యచేశారనీ, ఆమె మర్మాంగాలతో పాటు తలపై గాయాలయ్యాయని పోస్ట్‌మార్టం నిర్వహించిన ఎంవై ఆస్పత్రి వైద్యులు స్పష్టం చేశారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదును స్వీకరించడంలో అలసత్వం వహించిన అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ త్రిలోక్ సింగ్‌ను సస్పెండ్ చేసినట్లు మిశ్రా పేర్కొన్నారు. కేసుల పురోగతిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ లైంగిక నేరాలకు పాల్పడే వారి సమగ్ర సమాచారం, వ్యక్తిగత వివరాల్ని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో భద్రపరుస్తుంది. కేసుల పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకోవడంతో పాటు పర్యవేక్షణ, దర్యాప్తు కోసం ఆ వివరాల్ని క్రమం తప్పకుండా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో పంచుకుంటారు. అలాగే లైంగిక నేరాలకు పాల్పడిన వారి గత ప్రవర్తనను పోలీసుల ద్వారా నిర్ధారించుకుంటారు. బాధితురాలికి సాయం అందించేందుకు ప్రస్తుతం అమల్లోకి ఉన్న ‘వన్ స్టాప్ సెంటర్ల’ను దేశంలోని అన్ని జిల్లాలకు విస్తరిస్తారు. ‘అత్యాచార ఘటనల్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు కేబినెట్ ఆమోదించిన ఆర్డినెన్స్ ఉత్తమ మార్గం. దీనిని బిల్లుగా మార్చేందుకు పార్లమెంటు వర్షాకాల సమావేశాల(జూలై) వరకూ వేచి ఉండాలి’ అని కేంద్ర న్యాయ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. మోదీజీ మౌనమేల? కఠువా, ఉన్నావ్ అత్యాచార ఘటనలపై ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 600 మంది విద్యావేత్తలు, స్కాలర్స్ ప్రధాని నరేంద్ర మోదీకి బహిరంగ లేఖ రాశారు. ఈ దారుణ నేరాలకు ఒడిగట్టిన వారిని సంబంధిత రాష్ట్రాలు రక్షించేందుకు ప్రయత్నించారని ఆరోపిస్తూ ఆగ్రహం వెలిబుచ్చారు. ఈ అకృత్యాలపై స్పందించకుండా చాలా రోజులు మౌనం వహించారంటూ ప్రధాని మోదీని వారు తప్పుపట్టారు. లేఖ రాసిన వారిలో న్యూయార్క్ వర్సిటీ, హార్వర్డ్ వర్సిటీ, కొలంబియా వర్సిటీల విద్యావేత్తలు ఉన్నారు. తీర్పుపై అప్పీళ్లను ఆరు నెల్లలోపు పరిష్కరించాలి వేగవంతమైన దర్యాప్తు, విచారణ కోసం ఆర్డినెన్స్‌లో ప్రమాణాల్ని పొందుపరిచారు. అన్ని రేప్ కేసుల్లో దర్యాప్తును తప్పనిసరిగా రెండు నెలల్లోగా పూర్తి చేయాలి. అలాగే రేప్ కేసుల్లో కోర్టు విచారణ రెండు నెలల్లో ముగించాలి. దోషిగా శిక్ష ఎదుర్కొనే వ్యక్తి అప్పీళ్లను ఆరునెల్లలోపు పరిష్కరించాలి. 16 ఏళ్ల లోపు బాలికపై అత్యాచారం, సామూహిక అత్యాచారం పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి ఎలాంటి ముందస్తు బెయిల్ ఇవ్వరు. 16 ఏళ్ల లోపు బాలికపై అత్యాచారం కేసులో బెయిల్ దరఖాస్తును నిర్ణయించే ముందు.. పబ్లిక్ ప్రాసిక్యూటర్, బాధితురాలి తరఫు ప్రతినిధికి కోర్టు 15 రోజుల నోటీసు ఇవ్వాలి. -
బాల్యాన్ని చిదిమేస్తున్నారు..
దేశంలో పసికూనలపై అఘాయిత్యాలకు కశ్మీర్‌లోని కతువా ఘటన ప్రత్యక్ష ఉదాహరణ. జమ్మూకాశ్మీర్‌లోని కతువాలో ఎనిమిదేళ్ళ పసికూనపై జరిగిన అత్యాచారం కానీ, గుజరాత్‌లు తీవ్రమైన గాయాలతో బయటపడ్డ తొమ్మిదేళ్ళ చిన్నారి అత్యాచారం కేసు సహా ఉత్తర ప్రదేశ్, ఒరిస్సాల్లో ఈ మధ్యే వెలుగులోకి వచ్చిన ఇద్దరు చిన్నారుల అత్యాచారం కేసుల నేపథ్యంలో ఇటీవలి కాలంలో మైనర్ బాలికలపై అత్యాచారం కేసులను పరిశీలిస్తే మన దేశంలో మైనర్ బాలికలపై అత్యాచారాలు 500 శాతం పెరిగినట్టు తేలింది. గత పదేళ్ళలో మైనర్ బాలికల మీద అత్యాచారాలు 500 శాతం పెరిగినట్టు చైల్డ్ రైట్స్ అండ్ యు (సిఆర్‌వై) నిర్వహించిన తాజా పరిశోధన తేల్చింది. సిఆర్‌వై సంస్థ నిర్వహించిన ఈ సర్వేలో మన దేశంలో 2006లో 18,967 మంది మైనర్ బాలికలు అత్యాచారాల బారిన పడితే 2016కి వచ్చేసరికి అంటే కేవలం పదేళ్ళలో 106,958 మంది మైనర్ బాలికలపై అత్యాచారాలు జరిగినట్టు తేలింది. ఇందులో 50 శాతానికిపైగా నేరాలు కేవలం ఐదు రాష్ట్రాల్లో నమోదైనవే. ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఢిల్లీ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లోనే చిన్నారులపై 50 శాతం అత్యాచార కేసులు నమోదైనట్టు క్రై(సిఆర్‌వై) చిల్డ్రన్ రైట్స్ అండ్ యు అనే సంస్థ వెల్లడించింది. చిన్నారులపై అత్యాచారాల్లో ఉత్తర ప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉండడం ఆ రాష్ట్రంలో చిన్నారులకున్న రక్షణని ప్రశ్నార్థకంగా మార్చింది. మైనర్ బాలికలపై అత్యాచారాలు జరిగినట్టు నమోదైన కేసుల్లో 15 శాతం ఉత్తరప్రదేశ్‌లోనూ, మహారాష్ట్రలో 14 శాతం, మధ్యప్రదేశ్‌లో 13శాతం జరిగినట్టు నేర పరిశోధనా గణాంకాలు వెల్లడించాయి. 2016 నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో గణాంకాల ప్రకారం 2015తో పోలిస్తే మన దేశంలో చిన్నారులపై నేరాల సంఖ్య 14 శాతం పెరిగింది. అదేవిధంగా దేశంలో 2016 ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ అఫెన్స్(పోక్సో) యాక్ట్ ప్రకారం పరిశీలిస్తే చిన్నారులపై జరుగుతోన్న నేరాల్లో మూడొంతులు లైంగిక పరమైనవే. ఈ గణాంకాల ప్రకారం మన దేశంలో ప్రతి 15 నిముషాలకు ఒక పసికూన లైంగిక నేరాల బారిన పడుతోంది. గత ఐదేళ్లలోనే చిన్నారులపై లైంగిక నేరాలు 300 శాతం పెరగడం ప్రమాదం తీవ్రతని ప్రతిబింబిస్తోంది. -
ఇలాంటివి గతంలోనూ జరిగాయి; హేమామాలిని
మధుర : నటి, బీజేపీ ఎంపీ హేమామాలిని సంచలన వ్యాఖ్యలు చేశారు. అత్యాచార ఘటనలకు విస్తృతమైన పబ్లిసిటీ లభిస్తోందన్న ఆమె.. గతంలో వాటిని ఎవరూ పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు. శనివారం ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడిన హేమా మాలిని ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ప్రస్తుతం మహిళలపై, మైనర్లపై జరుగుతున్న అఘాత్యాలు బోలెడంత పబ్లిసిటీని తెచ్చిపెడుతున్నాయి. నిజానికి గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. కానీ, వాటి గురించి మీడియా కనీసం ప్రస్తావించ లేదు. ప్రజలు కూడా వాటిని పెద్దగా పట్టించుకునేవారు కాదు’ అని ఆమె వ్యాఖ్యానించారు. అయితే కాసేపటికే ఆమె దిద్దు బాటు చర్యలకు దిగారు. ‘ఇలాంటి ఘటనలు బాధాకరం. మళ్లీ జరగకూడదనే కోరుకుంటున్నా. అవి దేశంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఇతర దేశాల దృష్టిలో మన ప్రతిష్టకు భంగం కలిగిస్తాయి’ అని ఆమె తెలిపారు. హేమా మాలిని వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. ఇలాంటి సమయంలో ఆమె ఆ వ్యాఖ్యలు ఎలా చేయగలిగారని? ఆమె వ్యాఖ్యలు సిగ్గు చేటని.. పలువురు మండిపడుతున్నారు. కాగా, ప్రస్తుతం కథువా, ఉన్నావో, సూరత్‌లో జరిగిన మైనర్లపై దాష్టీకాలు చర్చనీయాంశంగా మారింది తెలిసిందే. మరోపక్క జమ్ము కశ్మీర్ విద్యాశాఖ మంత్రి కథువా ఘటనపై స్పందిస్తూ.. పిల్లలను స్కూళ్లకు పంపించకపోవటం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయంటూ వ్యాఖ్యలు చేయటం విమర్శలకు దారితీసింది. -
పసిగుడ్డుపై మానవ మృగం హత్యాచారం
సాక్షి,ఇండోర్: మైనర్ బాలికలు, చిన్నారులు, చివరికి పసిగుడ్డులపై జరుగుతున్న క్రూర అకృత్యాలు హృదయాలను పిండేస్తున్నాయి. దేశంలో ఏదో ఒక మూల చోటుచేసుకుంటున్న అఘాయిత్యాల తీరు, హత్యలు ప్రతీ మనిషినీ ఆందోళనలో పడేవేస్తోంది. రోజుకో హత్యాచార ఘటన కలవరం పుట్టిస్తోంది. గత కొన్నిరోజులుగా కథువా, ఉన్నావ్, సూరత్, చత్తీస్ఘడ్..ఇలా ఈ జాబితా పెరుగుతూ పోవడం నిజంగా అవమానకరం. తాజాగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఓ పసికందు కామాంధుడి అకృత్యానికి మౌన సాక్ష్యంగా మిగిలింది. 6నెలల చిన్నారిపై హత్యాచారానికి పాల్పడ్డాడో మానవ మృగం. శుక్రవారం మధ్యాహ్నం ఒక సెల్లార్లో రక్తపు మడుగులో పడివున్న శిశువు మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని సునీల్ భీల్(21) గా గుర్తించారు. పాప శరీరంలోని ప్రయివేటు భాగాల్లోనూ, తలపైన గాయాలను గుర్తించినట్టు పోలీసులు చెప్పారు. బాధితురాలు తల్లిదండ్రులు రాజ్వాడాలో బెలూన్లు అమ్ముకుని జీవిస్తారనీ, నిందితుడు కుటుంబానికి పరిచయస్తుడేనని పోలీసు అధికారి మిశ్రా వెల్లడించారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామనీ, దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. దేశవ్యాప్తంగా చిన్నారులపై జరుగుతున్న అకృత్యాలపై స్వర్వత్రా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. -
చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడితే మరణశిక్షే
-
అత్యాచార బాధితులకు న్యాయం జరిగేదెప్పుడు ?
నిర్భయ వంటి కఠిన చట్టాలు తీసుకువచ్చినా, అత్యాచార కేసుల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసినా రోజు రోజుకి ఈ పెండింగ్ కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. అత్యాచార బాధితులకు న్యాయం ఎండమావిగానే మిగిలిపోతోంది. కథువా, ఉన్నావ్ అత్యాచార కేసులతో దేశవ్యాప్తంగా మహిళలు దోషులకు కఠిన శిక్షలు విధించాలని, సత్వర న్యాయం జరిగేలా చూడాలని గళమెత్తుతున్నా పట్టించుకునే వారే లేరు. 2012 నిర్భయ ఘటనతో యావత్ భారతదేశం చలించిపోయింది. యువతీ యువకులు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి మరో ఆడపిల్లకి ఇంత దుర్భర స్థితి రాకూడదని, అత్యాచారం కేసుల్లో కఠిన శిక్షలు విధించాలంటూ డిమాండ్ చేయడంతో కేంద్ర ప్రభుత్వం కొన్ని కిరాతకమైన కేసుల్లో ఉరిశిక్ష కూడా విధించేలా నిర్భయ చట్టాన్ని తీసుకువచ్చింది. కేసుల విచారణను కూడా త్వరితగతిని పూర్తి చేసి బాధితులకు న్యాయం చేస్తామని హామీలు ఇచ్చింది. కానీ వాస్తవ పరిస్థితులు చూస్తే ఈ కేసుల్లో ఎలాంటి పురోగతి లేదు. దీంతో ఎన్ని చట్టాలు వచ్చినా తమను ఏం చేయలేవన్న ధీమా రేపిస్టుల్లో పెరిగిందనే అభిప్రాయం ఏర్పడుతోంది. 2012 నిర్భయ కేసు తర్వాత దేశంలో అత్యాచార కేసులు 60 శాతం పెరిగితే, చిన్నారులపై రేప్ కేసులు 40 శాతం పెరిగాయి. అయితే 25శాతం కేసుల్లో మాత్రమే అరెస్టులు జరిగాయి. జాతీయ నేర గణాంకాల సంస్థ నివేదిక ప్రకారం 2016 చివరి నాటికి లక్షా 33 వేల అత్యాచార కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 2012 నాటికి లక్ష కేసులు పెండింగ్‌లో ఉంటే అప్పట్నుంచి పెండింగ్ కేసుల సంఖ్య ప్రతీ ఏడాది 85 శాతం పెరుగుతూ వస్తోంది. 2012, 16 మధ్య నమోదైన వాటిలో మూడో వంతు కేసులు పోలీసు స్టేషన్ పరిధిలోనే నీరు కారిపోతున్నాయి. ఉన్నావ్ వంటి కేసుల్లో ప్రజల నుంచి తీవ్ర నిరసన, ఒత్తిడి రావడం వల్లే కేసు నమోదైంది తప్పితే ఎంత ఘాతుకం జరిగినా పోలీసుల్లో కాస్త కూడా చలనం కనిపించడం లేదు. అత్యాచార కేసులపై రాజకీయ ప్రభావం ఉండడంతో వాటి అతీ గతీ ఎవరికీ పట్టడం లేదు. కేవలం అత్యాచార కేసుల పరిశీలన కోసం దేశవ్యాప్తంగా 20 లక్షల మంది పోలీసు అధికారుల నియామకానికి కేంద్రం అనుమతినిచ్చింది. అయినా ఆ పోస్టుల్లో నాలుగో వంతు ఖాళీగానే ఉండడంతో చాలా కేసులు కోర్టు వరకూ కూడా చేరడం లేదు. ఇప్పటివరకు ఉన్న పెండింగ్ కేసుల విచారణకు కనీసం 20 ఏళ్లు పడుతుందని ఒక స్వచ్ఛంద సంస్థ అధ్యయనంలో తేలిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కేసుల విచారణ ఇంత నత్తనడకన సాగుతూ ఉంటే ఎన్ని రకాలు చట్టాలు తీసుకువచ్చి ప్రయోజనమేముందనే అభిప్రాయం వ్యక్తం సర్వత్రా అవుతోంది. -
స్నేహితులతో కలిసి కుమార్తెపై ఘాతుకం
సాక్షి, సీతాపూర్ (యూపీ) : మహిళలపై లైంగిక దాడుల పరంపర కొనసాగుతూనే ఉంది. యూపీలోని సీతాపూర్‌లో కన్నతండ్రే తన 35 ఏళ్ల కుమార్తెపై మరో ఇద్దరు స్నేహితులతో కలిసి లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈనెల 15న కమ్లాపూర్ ప్రాంతంలో ఈ దారుణం చోటుచేసుకుందని..ఆ మరుసటి రోజే బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారని అదనపు ఎస్పీ మార్తాండ్ ప్రకాష్ సింగ్ తెలిపారు. నిందితుల్లో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారని, బాధితురాలి తండ్రి, మరో నిందితుడి కోసం గాలిస్తున్నామని చెప్పారు. బాధిత మహిళకు పెళ్లయి 20 సంవత్సరాలైందని, ఆమెకు ఓ కుమారుడు ఉన్నాడని తెలిపారు. బాధితురాలు భర్త నుంచి వేరుపడి తల్లితండ్రుల వద్ద నివసిస్తోంది. ఈనెల 15న బాధితురాలి తండ్రి తన కుమార్తెను కమ్లాపూర్లో ఓ ప్రదర్శనకు తీసుకువెళ్లి అక్కడి నుంచి స్నేహితుడు మీరజ్ ఇంటికి తీసుకెళ్లి గదిలో నిర్భందించారు. అక్కడే తన తండ్రి మరో ఇద్దరితో కలిసి తనపై లైంగికదాడికి పాల్పడ్డారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ఆసిఫా కుటుంబానికి న్యాయం చేయాలి
హత్నూర(సంగారెడ్డి): జమ్ముకాశ్మీర్‌లో ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని వైఎస్ఆర్సీపీ ఉమ్మడి మెదక్ జిల్లా విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు టి.నరేష్ డిమాండ్ చేశారు. బుధవారం మండల కేంద్రమైన హత్నూరలో మాట్లాడుతూ... సభ్య సమాజం సిగ్గుపడేలా ముక్కు పచ్చలారని చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గు చేటన్నారు. రోజురోజుకు అత్యాచారాలు పెరుగుతుండటం దారుణమన్నారు. ఇలాంటి సమయాల్లో ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించి దుండగులకు ఉరిశిక్ష వేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆయనతో పాటు వైఎస్ఆర్సీపీ విద్యార్థి నాయకులు రాజు, అనిల్, ప్రకాశ్, నవీన్, శంకర్ తదితరులు ఉన్నారు. -
అత్యాచారాలపై రాజకీయాలు చేయడం తగదు
-
అంతా కట్టుకథ!
విజయనగరం టౌన్ : దివ్యాంగురాలిపై సామూహిక లైంగిక దాడి ఘటన కట్టుకథగా తేలింది. పూసపాటిరేగ మండలానికి చెందిన దివ్యాంగురాలిని నెల్లిమర్ల మండలం సారిపల్లికి వెళ్లే నిర్జన ప్రదేశంలో ఆటోడ్రైవర్ మరొక ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడి చేసినట్టు బాధితురాలు ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులకు దర్యాప్తులో అదంతా దివ్యాంగురాలు అల్లిన కట్టుకథేనని తేలింది. ఈ మేరకు ఎస్పీ జి.పాలరాజు జిల్లా పోలీసు కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో దీనికి సంబంధించిన వివరాలను మంగళవారం వెల్లడించారు. దివ్యాంగురాలి లైంగిక దాడి కేసుకు సంబంధించి జిల్లాలోని ముగ్గురు డీఎస్పీల ఆధ్వర్యంలో నాలుగు బృందాలను ఏర్పాటు చేసి, ఒక్కో బృందానికి భౌతిక ఆధారాలు, సాంకేతిక ఆధారాలు సేకరించాలని, కుటుంబ నేపథ్యం, శాస్త్ర, సాంకేతిక ఆధారాలు సేకరించాల్సిందిగా ఆదేశించారు. బాధితురాలి కథనం ప్రకారం ఆమె ఆటో ఎక్కిన ప్రాంతాలను, సంఘటనా స్థలంగా చెప్పబడిన సారిపల్లిలోని నిర్జన ప్రదేశాన్ని సందర్శించారు. ఆమెపై ఎటువంటి లైంగిక దాడి జరగలేదని నిర్ధారణ అయిన తర్వాత బాధితురాలి స్టేట్మెంట్ను మహిళా, శిశు సంక్షేమ అధికారుల సమక్షంలో నమోదు చేశారు. బాధితురాలు పట్టణంలో ఎక్కువ సమయం గడిపి ఇంటికి ఆలస్యంగా చేరడంతో కుటుంబ సభ్యులు తనను తిడతారని భావించి, పొంతన లేని విషయాలను చెప్పినట్టు నిర్ధారణ జరిగిందని ఎస్పీ వివరించారు. కేసు దర్యాప్తు చేయడంలో బాధితురాలి కుటుంబ సభ్యులు, విజిలెన్స్ మోనటరింగ్ సభ్యులు, మీడియా సభ్యులు, దళిత నాయకులు, పోలీస్ శాఖకు సహకరించారన్నారు. కేసు మిస్టరీని చేధించడంలో తీవ్రం గా శ్రమించిన డీఎస్పీలు టి.సౌమ్యలత, టి.త్రినాథరావు, ఎవి.రమణ, రూరల్ సీఐ దాసరి లక్ష్మణరావు, స్పెషల్ బ్రాంచ్ సీఐ జి.రామకృష్ణ, ఎస్ఐలు రామకృష్ణ, ఉపేంద్ర, నారాయణరావు, ఇతర పోలీస్ అధికారులను ఎస్పీ అభినందించారు. పోలీసుల విచారణలో వెలుగు చూసిన అంశాలు సంఘటనా స్థలానికి ఆటో వెళ్లే అవకాశం లేదు. నెల్లిమర్లకు వెళ్లే అన్ని మార్గాల్లో సీసీ పుటేజీలలో ఎటువంటి ఆధారాలు లభించలేదు. సంఘటన జరిగిన సమయాల ప్రకారం చూస్తే అవే సమయాల్లో బాధితురాలు పూర్తిగా విజయనగరం పట్టణంలోనే ఉన్నట్టుగా ఆమె ఫోన్ టవర్స్ రావడం. బాధితురాలు ఇచ్చిన స్టేట్మెంట్కు, వాస్తవ సంఘటనకు పొంతన లేకుండాపోవడం. బాధితురాలు ఫోన్, బ్యాగ్‌ను ఆటోలో విడిచిపెట్టినట్టుగా ముందుగా తెలిపినప్పటికీ, సదరు వస్తువులు ఆమె ఇంట్లోనే పోలీసు విచారణలో లభ్యం కావడంతో బాధితురాలు వాస్తవాలను అంగీకరించక తప్పలేదు. వైద్యులు బాధితురాలికి నిర్వహించిన పరీక్షలలో ఆమె శరీరంపై బాహ్యంగాగానీ, లోపలగానీ ఎటువంటి గాయాలు లేనట్టు ధృవీకరించారు. -
రేప్ చేస్తామని బెదిరిస్తున్నారు: ర్యాపిడ్ రష్మీ
బెంగళూరు : తనకు సోషల్ మీడియాలో బెదిరింపులు వస్తున్నాయని, కొందరు తనను ఉద్దేశించి కించపరిచే వ్యాఖ్యలు చేయడమే కాదు.. తనను రేప్ చేస్తామని కూడా బెదిరిస్తున్నారని కర్ణాటకకు చెందిన ప్రముఖ రేడియో జాకీ (ఆర్జే) ర్యాపిడ్ రష్మీ మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సైబర్ క్రైమ్ పోలీసులతోపాటు రాష్ట్ర మహిళా కమిషన్‌ను కూడా ఆమె ఆశ్రయించింది. రేడియో షోలో భాగంగా ఇటీవల విడుదలైన కన్నడ సినిమా ‘రాజారథ’ దర్శకుడు అనూప్ భండారీ, అతని సోదరుడు, సినిమా హీరో నిరూప్ భండారీ, హీరోయిన్ అవంతిక షెట్టీలతో రష్మీ ఫోన్లో మాట్లాడింది. ఈ సందర్భంగా సినిమా చూడని వారిని ఏం చేస్తారని అడుగగా, ‘వాళ్లు అంతా చెత్తా’అని అనూప్ పేర్కొనగా, హీరో, హీరోయిన్లు వాళ్లు లోఫర్లు అంటూ ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఆర్జే ర్యాపిడ్ రష్మీపై ట్రోలర్స్ విరుచుకుపడుతున్నారు. ‘నాదీ కర్ణాటక రాష్ట్రమే. 11 ఏళ్లుగా కన్నడ రేడియో రంగంలో పనిచేస్తున్నా. ఎన్నడూ కన్నడిగులపై, కర్ణాటకపై అనుచిత వ్యాఖ్యలు చేయలేదు. కొందరు కించపరిచే కామెంట్లు చేయడం ద్వారా నా ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తున్నారు. నన్ను దూషిస్తూ సందేశాలు పెడుతున్నారు. రేప్ చేస్తామని కొందరు బెదిరిస్తూ మెసేజ్‌లు పెట్టారు’ అని రష్మీ ఫిర్యాదులో పేర్కొన్నారు. సోషల్ మీడియాలో తనను కించపరిచిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరారు. ఆమె పలు టీవీ షోలు చేశారు. పలు కన్నడ చిత్రాల్లో నటించారు. -
అగని మరణాలు
-
ఉన్నావ్ అత్యాచార కేసులో గందరగోళం
లక్నో : ఉన్నావ్ అత్యాచార కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. బాధితురాలు మైనర్ కాదు.. మేజర్ అంటూ గతంలో వైద్యులు ఇచ్చిన నివేదికలో ఉండటంతో గందరగోళం మొదలైంది. యువతి వయసు 17గా భావించి బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్‌పై పోక్సో(ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్) చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే జూన్ 2017లో వెలువరించిన ప్రాథమిక వైద్య నివేదికలో మాత్రం ఆమె వయసు 19 సంవత్సరాలుగా పేర్కొన్నారు. అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చాక జూన్ 22, 2017న ఉన్నావ్ పోలీసులు ఆమెను ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అక్కడ రేడియాలజిస్ట్ ఎస్ జోహ్రీ బాధితురాలు మేజర్ అని చెబుతూ నివేదికను సమర్పించాడు. ఆపై బాలిక కిడ్నాప్-అత్యాచారం ఆరోపణలతో ముగ్గురు నిందితులను ఆ సమయంలో పోలీసులు అరెస్ట్ చేయగా.. వారిపై పోక్సో చట్టాన్ని మాత్రం వర్తింప చేయలేదు. తర్వాత బాలికను మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టగా.. ప్రాణభయంతో ఆమె తన వాంగ్మూలంలో సెంగర్ పేరును ప్రస్తావించలేదు. తర్వాత ఏప్రిల్ 12, 2018లో ఆమె రెండో ఎఫ్ఐఆర్లో సెంగర్ పేరును ఆమె ప్రస్తావించగా.. పోలీసులు పోక్సో చట్టం ప్రకారం ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు. ప్రాథమిక వైద్య పరీక్షలో నివేదికలో మాత్రం ఆమె వయసు 19 ఏళ్లుగా ఉండటం సీబీఐ గమనించింది. దీంతో ఈ గందరగోళం నుంచి బయటపడేందుకు మళ్లీ వైద్య పరీక్షలు నిర్వహించాలని సీబీఐ నిర్ణయించింది. శనివారం బాధితురాలిని లక్నో ప్రభుత్వాసుపత్రికి తరలించి పరీక్షలను నిర్వహించగా.. ఆ నివేదిక ఆధారంగా కేసు దర్యాప్తు ముందుకు సాగుతుందని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ ఆమె మైనర్ కాదని తేలితే.. సెక్షన్లను మార్చి దర్యాప్తు కొనసాగిస్తామని వారంటున్నారు. అయితే యువతి తల్లి మాత్రం బాలిక 2002లో జన్మించిందని వాదిస్తుండగా.. స్కూల్ సర్టిఫికెట్లలో కూడా ఆమె పుట్టిన తేదీ 2002గానే ఉంది.