గర్ల్‌ఫ్రెండ్‌ని ఇంటికి పిలిచి.. | Facebook Friend Strangles Girl To Death | Sakshi
Sakshi News home page

గర్ల్‌ఫ్రెండ్‌ని ఇంటికి పిలిచి దారుణం

Feb 19 2018 3:17 PM | Updated on Oct 8 2018 5:45 PM

Facebook Friend Strangles Girl To Death - Sakshi

ఫేస్‌బుక్‌ ఫ్రెండ్‌ని హత్య చేసిన హరిదాస్‌, అరెస్టు చేసిన పోలీసు అధికారి

సాక్షి. ముంబయి : తెలియని వారితో జాగ్రత్తగా ఉండకపోతే ఒక్కోసారి చావును కొని తెచ్చుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా అమ్మాయిలు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండకపోతే మరీ ప్రమాదం. దీన్నే రుజువు చేసేలా ఇప్పుడు మహారాష్ట్రలోని పాలగఢ్‌లో ఓ నేరం వెలుగులోకి వచ్చింది. ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమైన ఓ యువకుడు తన లైంగిక వాంఛను తీర్చాలని ఓ అమ్మాయిపై ఒత్తిడి తెచ్చాడు. అందుకు ఆ అమ్మాయి నిరాకరించడంతో చంపేశాడు. వివరాల్లోకి వెళితే..  హరిదాస్‌ యెర్‌గోడ్‌ అనే 21 ఏళ్ల యువకుడు ఫేస్‌బుక్‌ ద్వారా వాషి ప్రాంతానికి చెందిన అనిత (పేరు మార్చాం) అనే అమ్మాయిని పరిచయం చేసుకున్నాడు.

గత ఏడాదిగా వీరిద్దరి మధ్య ఆన్‌లైన్‌లో సాన్నిహిత్యం పెరిగింది. అర్ధరాత్రి వరకు పోన్‌లో మాట్లాడుకునే వారు. హత్య ఘటనకంటే ముందు ఒకసారి మాత్రమే వీరిద్దరు కలుసుకున్నారు. హత్య జరిగే రోజున అనితను నిందితుడు హరిదాస్‌ నలసోపర అనే తన గ్రామానికి రావాలని కోరాడు. అనిత ఉదయం పదిగంటల ప్రాంతంలో అతడి గ్రామానికి చేరుకుంది. కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత తన లైంగిక వాంఛను తీర్చాలని హరిదాస్‌ అడిగాడు. అందుకు అనిత నిరాకరించడంతో కొద్ది సేపు ఒత్తిడి చేసిన అతడు తన షూలేస్‌ను అనిత మెడకు చుట్టి ఊపిరాడకుండా చేసి చంపి మెట్లపై పడేశాడు. ఆమె మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement