strangulate
-
భార్యను చంపి శవంతో స్కూటీపై 10 కి.మీ
గాంధీనగర్: గుజరాత్ రాజ్‌కోట్‌లో ఆదివారం దారుణం చోటు చేసుకుంది. తాళి కట్టిన భార్యను ఓ వ్యక్తి కిరాతకంగా హత్య చేసి.. పట్టపగలు అందరూ చూస్తుండగా మృతదేహాన్ని స్కూటీ మీద వేసుకుని తీసుకెళ్లాడు. ఇది గమనించిన స్థానికులు అతగాడిని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన రాజ్‌కోట్ పలితాన సమీపంలోని ఓ గ్రామంలో చోటు చేసుకుంది. వెరవాల్ గ్రామం సింధ్ క్యాంప్ కాలనీకి చెందిన హేమ్నాని, నైనా దంపతులకు గత ఏడాది వివాహం అయింది. హేమ్నాని స్థానిక ఎల్పీజీ డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య ఆదివారం చిన్న గొడవ మొదలయ్యింది. దాంతో హేమ్నాని ఆగ్రహంతో భార్య గొంతు పిసికి చంపేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని స్కూటీ మీద వేసుకుని రోహిషాల గ్రామం వైపు వెళ్లసాగాడు. స్టీరింగ్, ఫూట్ రెస్ట్‌కి మధ్య నైనా మృతదేహాన్ని ఉంచాడు. దాంతో ఆమె కాళ్లు నేల మీద ఉన్నాయి. ఇదేం పట్టించుకోకుండా అలానే ఓ 10 కిలోమీటర్ల దూరం లాక్కెళ్లాడు. (చదవండి: సూసైడ్‌లో నోట్లో షాకింగ్ విషయం) ఇది గమనించిన స్థానికులు షాక్‌కు గురయ్యారు. స్కూటీని ఆపాల్సిందిగా అరిచారు. కానీ హేమ్నాని ఇదే పట్టించుకోకుండా అలానే ముందుకు వెళ్లాడు. దాంతో స్థానికులు తమ వాహనాల మీద అతడి వెనకే వెళ్లి.. పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ సందర్భంగా పాలితాన ఎస్సై మాట్లాడుతూ.. ‘దర్యాప్తులో నిందితుడు తన భార్య శవాన్ని పాలితాన తాలూకాలోని రోహిషాల గ్రామం చివర ఉన్న అటవి ప్రాంతంలో పడేయాలని భావించినట్లు తెలిపాడు. ఇక తన భార్యను హత్య చేయడానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. ఇరువురు కుటుంబ సభ్యులను విచారిస్తే.. హత్య చేయడానికి గల కారణాలు తెలుస్తాయి’ అన్నారు. -
ఆ తల్లి నిర్దోషి: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: జన్మనిచ్చిన కొన్ని గంటల్లోనే బిడ్డకు ఊపిరి ఆడకుండా చేసి చంపేసిందన్న ఆరోపణల నుంచి సుప్రీంకోర్టు ఓ తల్లికి విముక్తి కల్పించింది. కడుపున పుట్టిన బిడ్డను ఏ తల్లి చంపజాలదని, ఇది పూర్తిగా అసహజమైందని వ్యాఖ్యానిస్తూ ఆ తల్లిని నిర్దోషిగా విడుదల చేసింది. నిందితురాలు 2007 ఆగస్టు 24న ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో బాలికకు జన్మనిచ్చింది. జన్మనిచ్చిన కొద్దిసేపటికే బిడ్డ చనిపోవడంతో తల్లిపై కేసు నమోదైంది. 2009 ఆమెకు ట్రయల్ కోర్టు జీవితఖైదు వేసింది. ఆమె హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టు సైతం అదే శిక్షను సమర్ధించింది. దీంతో ఆమె సర్వోన్నత న్యాయస్థానం తలపుతట్టింది. జస్టిస్ ఎం.ఎం.శాంతనూ గౌండర్, జస్టిస్ ఆర్. సుభాష్ రెడ్డిల బెంచ్ ఈ కేసును విచారించింది. సాక్ష్యాలన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే ఆ తల్లే బిడ్డను చంపిందనేందుకు ఆధారాలు లేవంటూ తల్లిని నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పుచెప్పింది. -
గర్ల్‌ఫ్రెండ్‌ని ఇంటికి పిలిచి..
సాక్షి. ముంబయి : తెలియని వారితో జాగ్రత్తగా ఉండకపోతే ఒక్కోసారి చావును కొని తెచ్చుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా అమ్మాయిలు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండకపోతే మరీ ప్రమాదం. దీన్నే రుజువు చేసేలా ఇప్పుడు మహారాష్ట్రలోని పాలగఢ్లో ఓ నేరం వెలుగులోకి వచ్చింది. ఫేస్బుక్ ద్వారా పరిచయమైన ఓ యువకుడు తన లైంగిక వాంఛను తీర్చాలని ఓ అమ్మాయిపై ఒత్తిడి తెచ్చాడు. అందుకు ఆ అమ్మాయి నిరాకరించడంతో చంపేశాడు. వివరాల్లోకి వెళితే.. హరిదాస్ యెర్గోడ్ అనే 21 ఏళ్ల యువకుడు ఫేస్బుక్ ద్వారా వాషి ప్రాంతానికి చెందిన అనిత (పేరు మార్చాం) అనే అమ్మాయిని పరిచయం చేసుకున్నాడు. గత ఏడాదిగా వీరిద్దరి మధ్య ఆన్లైన్లో సాన్నిహిత్యం పెరిగింది. అర్ధరాత్రి వరకు పోన్లో మాట్లాడుకునే వారు. హత్య ఘటనకంటే ముందు ఒకసారి మాత్రమే వీరిద్దరు కలుసుకున్నారు. హత్య జరిగే రోజున అనితను నిందితుడు హరిదాస్ నలసోపర అనే తన గ్రామానికి రావాలని కోరాడు. అనిత ఉదయం పదిగంటల ప్రాంతంలో అతడి గ్రామానికి చేరుకుంది. కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత తన లైంగిక వాంఛను తీర్చాలని హరిదాస్ అడిగాడు. అందుకు అనిత నిరాకరించడంతో కొద్ది సేపు ఒత్తిడి చేసిన అతడు తన షూలేస్‌ను అనిత మెడకు చుట్టి ఊపిరాడకుండా చేసి చంపి మెట్లపై పడేశాడు. ఆమె మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
అత్తను చంపి.. కట్టు కథలు చెప్పి..
న్యూఢిల్లీ: పోలీసులను, దర్యాప్తును పక్కదోవపట్టించే ప్రయత్నం చేశాడు ఓ యువకుడు. తన అత్తను గొంతు నులిమి చంపి అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా కట్టుకథలు, పిట్ట కథలు చెప్పాడు. శవపరీక్ష నివేదిక వచ్చిన తర్వాత మరోసారి అతడిని పిలిచి ప్రశ్నించిన పోలీసులు అతడు సమాధానం చెప్పిన తీరును అనుమానించి అసలు విషయం రాబట్టారు. అతడే ఆమెను చంపినట్లు అతడి నోటితోనే ఒప్పించారు. పూర్తి వివారాల్లోకి వెళితే.. ఉత్తర ఢిల్లీలోని అమన్ విహార్ ప్రాంతంలోగల శివారులో ఓ నివాసం ఉంది. అక్కడ చింటూ అనే యువకుడు అత్తయ్య, మామయ్యతో కలసి ఉంటున్నాడు. ఇటీవల బిహార్ నుంచి వాళ్లింటికి వచ్చాడు. మామయ్య ఆఫీస్ కు వెళ్లింది చూసి ఆమెను లైంగికంగా వేధించేందుకు ప్రయత్నించాడు. దానిని ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతోపాటు మామయ్యకు చెప్తానని, చుట్టుపక్కల వారికి తెలియజేస్తానని చెప్పడంతో బెదిరిపోయిన చింటూ ఆమె గొంతు నులిమి చంపాడు. అనంతరం తెలివిగా తానే పోలీసులకు ఫోన్ చేసి తాము బయట ఆడుకుంటుంటే అత్తయ్య మెట్లపై నుంచి కిందపడి పోయిందని, వచ్చి చూసేవరకు స్పృహ కోల్పోయి కనిపించిందని కట్టుకథలు చెప్పాడు. చివరకు అతడి ఎత్తులు పోలీసుల ముందు చిత్తయ్యాయి. అరెస్టు చేసి కోర్టుకు తరలించగా నేరాన్ని అంగీకరించాడు. -
కన్హయ్య కుమార్ పై హత్యాయత్నం
ముంబై: జెట్ ఎయిర్ వేస్ విమానంలో తనపై హత్యాయత్నం జరిగిందని ఢిల్లీ జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్ వెల్లడించారు. తన గొంతు నులిమేందుకు దుండుగుడు ప్రయత్నించాడని అతడు ఆరోపించాడు. ముంబై-పుణే విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో విమానం దిగిపోవాలని తమపై సిబ్బంది ఒత్తిడి చేశారని కన్హయ్య కుమార్ తెలిపాడు. తనపై హత్యాయత్నం చేసిన వ్యక్తిపై జెట్ ఎయిర్ వేస్ ఎటువంటి చర్య తీసుకోకపోవడం తనకు ఆశ్చర్యం కలిగించిందని చెప్పాడు. కన్హయ్యపై దాడికి యత్నించిన సహ ప్రయాణికుడిని మనాస్ జ్యోతి డేకాగా గుర్తించినట్టు సీఐఎస్ఎఫ్ వెల్లడించింది. అయితే ప్రయాణికులు, సిబ్బంది భద్రతకు తాము అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని జెట్ ఎయిర్ వేస్ తెలిపింది. భద్రతా కారణాలతో కొంతమంది ప్రయాణికులను ముంబై ఎయిర్ పోర్టులో దించేశామని వెల్లడించింది.