
ముంబై: నగరంలోని హబిటాట్ స్టూడియోను శివసేనకు చెందిన కార్యకర్తలు ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండించిన స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా(Kunal Kamra).. తాజాగా ఓ వీడియోను రిలీజ్ చేశారు. తన స్టూడియోను శివసేన సేనకు చెందిన కొంతమంది ఎలా ధ్వంసం చేశారో చూపిస్తూ తన యూట్యూబ్ చానల్ లో వీడియోను పోస్ట్ చేశారు. చర్యకు ప్రతి చర్య ఉంటుందని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండే వ్యాఖ్యానించిన తర్వాత కునాల్ కమ్రా.. ఈ వీడియోను ప్రజల్లోకి తీసుకొచ్చాడు.
కునాల్ కమ్రాకు షోలు చేసే ముంబైలోని హాబిటాట్ స్టూడియోను కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఆదివారం రాత్రి ఒక వర్గానికి చెందిన వ్యక్తులు భారీ సంఖ్యలో వచ్చి స్టూడియోపై విరుచుకుపడ్డారు.మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేపై కమ్రా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో జరిగిన పరిణామాల నేపధ్యంలో శివసేన కార్యకర్తలు స్టూడియోపై దాడిచేయడం, ఆ తరువాత ముందస్తు నోటీసు లేకుండా ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కూల్చివేతలకు పాల్పడింది. ఇదిలా ఉండగా, షిండేపై చేసిన వ్యాఖ్యలపై శివసేన ఎమ్మెల్యే ముర్జి పటేల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కునాల్ కమ్రాపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment