Kunal Kamra
-
దీపావళి వీడియో కాదు.. సర్వీస్ స్టేషన్ ఫుటేజ్ చూపండి: కునాల్ కమ్రా
ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్.. కంపెనీలో జరిగిన దీపావళి వేడుకలకు సంబంధించిన ఒక వీడియోను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియోపైన స్పందించిన కునాల్ కమ్రా.. ఓలా సర్వీస్ స్టేషన్ ఫుటేజీని షేర్ చేయమని భవిష్ అగర్వాల్‌ను కోరారు. ఇది ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.సేల్స్ తరువాత నాణ్యమైన సర్వీస్ అందించడం లేదనే సమస్యతో ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్‌తో రగడ మొదలైంది. అప్పటి నుంచి ఓలా కస్టమర్లు లేవనెత్తే అనేక సమస్యలను కునాల్ హైలైట్ చేస్తూ వస్తున్నారు.నెలకు 80,000 కస్టమర్ ఫిర్యాదులను కంపెనీ ఎందుకు పరిష్కరించడం లేదనికునాల్ కమ్రా.. ఓలా సీఈఓను అడిగారు. దీనిపై స్పందించిన భవిష్ అగర్వాల్, ఓలా పరువు తీసేందుకు కమ్రా డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు. అంతే కాకుండా భవిష్ అగర్వాల్ కూడా కమ్రాను ఒక సర్వీస్ సెంటర్లో ఒక రోజు పని చేయాలని కోరారు.ఇదీ చదవండి: ఓలా సీఈఓ జాబ్ ఆఫర్.. ఓకే అన్న కమెడియన్!ఇటీవల ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్.. కమెడియన్ కునాల్ కమ్రాకు జాబ్ ఆఫర్ చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. దీనికి కమ్రా అంగీకరిస్తూ కొన్ని షరతులను కూడా వెల్లడించారు. కాగా ఇప్పుడు మళ్ళీ భవిష్ అగర్వాల్ చేసిన పోస్టుకు.. కామెంట్ చేశారు. దీనిపైనా నెటిజన్లు కూడా తమదైన రీతిలో స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.Service station ka footage dikhao… https://t.co/Zmp1Yzoh3i— Kunal Kamra (@kunalkamra88) October 31, 2024 -
ఓలా సీఈఓ జాబ్ ఆఫర్.. ఓకే అన్న కమెడియన్!
ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్ కమెడియన్ కునాల్ కమ్రాకు జాబ్ ఆఫర్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ ఆఫర్‌ను అంగీకరించాలంటే తనకు కొన్ని షరతులు ఉన్నాయని కునాల్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఇటీవల ఓలా ఎలక్ట్రిక్ సర్వీసు సెంటర్ వద్ద పోగైన వాహనాల ఫొటోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడంతో కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్, కునాల్ కమ్రాల మధ్య మాటల యుద్ధం సాగింది.ప్రభుత్వ విభాగమైన సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) ఓలా ఎలక్ట్రిక్ సంస్థకు గతంలో షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. నేషనల్ కన్జూమర్ హెల్ప్‌లైన్‌కు ఈ కంపెనీ స్కూటర్లకు సంబంధించి పది వేలకుపైగా ఫిర్యాదులు వచ్చినట్లు సీసీపీఏ తెలిపింది. సర్వీసు లోపాలు, నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య పద్ధతులను అనుసరించడం, వినియోగదారు హక్కుల ఉల్లంఘన వంటి చర్యలకు పాల్పడుతుందని సంస్థపై ఆరోపణలు వచ్చాయి. ఇయితే ఈ ఫిర్యాదుల్లో 99.1 శాతం సమస్యలను పరిష్కరించిందని కంపెనీ ఇటీవల పేర్కొంది.ఇదీ చదవండి: సైబర్ దొంగ.. ఏఐకూ బెంగ!ఈ పరిణామాల నేపథ్యంలో ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్ కునాల్ కమ్రాకు జాబ్ ఆఫర్ చేశారు. దానిపై కునాల్ ఎక్స్ వేదికగా కొన్ని డిమాండ్లను లేవనెత్తారు. వాటిని తీరిస్తే తాను జాబ్‌లో చేరుతానని చెప్పారు. ‘ఓలాతో కలిసి పనిచేయడానికి కంపెనీ సీఈఓ ఆఫర్‌ను అంగీకరించడం తప్ప నాకు వేరే మార్గం లేదు. నన్ను కంపెనీ విషయాలకు సంబంధించి వేలసార్లు ట్యాగ్ చేశారు. నేను ఓలా ఉద్యోగిగానే భావిస్తున్నాను. కంపెనీ ఆఫర్‌ను స్వీకరించాలంటే కొన్ని డిమాండ్లను తీర్చాలి.ఓలా సర్వీస్ సెంటర్లలో స్కూటర్ ఇచ్చిన కస్టమర్లకు ఏడు రోజుల్లో సర్వీస్ అందేలా కంపెనీ చర్య తీసుకోవాలి.ఏడు రోజులు దాటినా మరమ్మతులు పూర్తి కాకపోతే వేరే స్కూటర్‌ను తాత్కాలికంగా వినియోగదారులకు అందించాలి.స్కూటర్ రిపేర్ పూర్తయ్యే వరకు రోజువారీ రవాణా ఖర్చుల కింద రూ.500 ఇవ్వాలి.కొత్త ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు రెండు బీమాలు అందించాలి. వాహనానికి ఒకటి, సర్వీస్‌లకు మరొకటి. కస్టమర్లకు సర్వీస్ ఇన్సూరెన్స్ ఉచితంగా అందించాలి’ అని కునాల్ అన్నారు. -
హర్ష్ గోయెంకా ఓలా స్కూటర్‌ను ఎలా వాడుతారో తెలుసా..?
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ వినియోగంపై ఆర్పీజీ గ్రూప్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా వ్యాఖ్యలు చేశారు. ఈమేరకు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేస్తూ ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్‌ను అందులో ట్యాగ్ చేశారు. ఇటీవల కమెడియన్ కునాల్ కమ్రా, భవిష్ అగర్వాల్ మధ్య ఆన్లైన్ వేదికగా జరిగిన మాటల యుద్ధంతో ఈ ఓలా వ్యవహారం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హాట్‌టాపిక్‌గా నిలిచింది.హర్ష్ గోయెంకా తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఓలా ఎలక్ట్రిక్‌పై స్పందిస్తూ ‘తక్కువ దూరంలోని గమ్యాలు చేరాలంటే నేను ఓలా స్కూటర్ వినియోగిస్తాను. ఒక ‘కమ్రా’(ఇంటి గది) నుంచి మరో ఇంటి గదికి వెళ్లాలనుకుంటే ఓలా స్కూటర్ వాడుతాను’ అన్నారు. తన ట్విట్లో కునాల్ కమ్రా పేరుతో అర్థం వచ్చేలా ప్రస్తావించారు.If I have to travel close distances, I mean from one ‘kamra’ to another, I use my Ola @bhash pic.twitter.com/wujahVCzR1— Harsh Goenka (@hvgoenka) October 8, 2024ఇటీవల ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్, కమెడియన్ కునాల్ కమ్రా మధ్య మాటల యుద్ధం సాగింది. సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు కామెంట్లు, ప్రతికామెంట్లతో మాటల దాడి చేసుకున్నారు. ఓలా ఎలక్ట్రిక్ సర్వీస్ సెంటర్ ముందు పోగైన వాహనాల ఫొటోను షేర్ చేస్తూ కమ్రా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ పెట్టడంతో వాగ్వాదం ప్రారంభమైంది. కస్టమర్ల ఇబ్బందులను తెలియజేస్తూ కమ్రా పెట్టిన పోస్టుకు ‘ఇది పెయిడ్ పోస్టు’ అని అగర్వాల్ బదులివ్వడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందించారు.ఇదీ చదవండి: అనుకున్నదే జరిగింది.. వడ్డీలో మార్పు లేదుఓలా ఎలక్ట్రిక్ సంస్థకు సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) ఇటీవల షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. నేషనల్ కన్జూమర్ హెల్ప్‌లైన్‌కు ఈ కంపెనీ స్కూటర్లకు సంబంధించి 10,000కు పైగా ఫిర్యాదులు వచ్చినట్లు సీసీపీఏ తెలిపింది. సర్వీసు లోపాలు, నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య పద్ధతులను అనుసరించడం, వినియోగదారు హక్కుల ఉల్లంఘన వంటి చర్యలకు పాల్పడుతుందని సంస్థపై ఆరోపణలు వస్తున్నాయి. ఈ కంపెనీ స్కూటర్లకు సంబంధించి నేషనల్ కన్జూమర్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేసిన వివిధ సమస్యలు, అంశాలపై లేవనెత్తిన ఆందోళనలను పరిష్కరించడానికి సీసీపీఏ 15 రోజుల గడువు ఇచ్చింది. -
ఓలాకు మరో దెబ్బ! షోకాజ్ నోటీసు జారీ
ఓలా ఎలక్ట్రిక్ సంస్థకు సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసింది. నేషనల్ కన్జూమర్ హెల్ప్‌లైన్‌కు ఈ కంపెనీ స్కూటర్లకు సంబంధించి 10,000కు పైగా ఫిర్యాదులు వచ్చినట్లు సీసీపీఏ తెలిపింది. సర్వీసు లోపాలు, నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య పద్ధతులను అనుసరించడం, వినియోగదారు హక్కుల ఉల్లంఘన వంటి చర్యలకు పాల్పడుతుందని సంస్థపై ఆరోపణలు వస్తున్నాయి.ఈ కంపెనీ స్కూటర్లకు సంబంధించి నేషనల్ కన్జూమర్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేసిన వివిధ సమస్యలు, అంశాలపై లేవనెత్తిన ఆందోళనలను పరిష్కరించడానికి సీసీపీఏ 15 రోజుల గడువు ఇచ్చింది. ఏ కంపెనీ అయినా కస్టమర్లకు సరైన సర్వీసు అందించకపోతే దానికి ఆదరణ తగ్గుతుంది. ఫలితంగా కంపెనీకి కస్టమర్లు తగ్గి రెవెన్యూ దెబ్బతింటుంది. కంపెనీలకు అతీతంగా ప్రతి సంస్థ స్పందించి కస్టమర్లకు మెరుగైన సర్వీసులు అందించాలని పలువురు కోరుతున్నారు.🚨🚨 Sources to CNBC-TV18 ⬇️⚡Central Consumer Protection Authority (CCPA) issues showcause notice to @OlaElectric for class action⚡ Ola Electric given 15 days to respond to CCPA showcause notice on service issues and more⚡ #OlaElectric faces more than 10,000 complaints… pic.twitter.com/fNbdBLsQQq— CNBC-TV18 (@CNBCTV18News) October 7, 2024ఇదీ చదవండి: పేరుకుపోతున్న వాహన నిల్వలుఇటీవల ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్, కమెడియన్ కునాల్ కమ్రా మధ్య మాటల యుద్ధం సాగింది. సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు కామెంట్లు, ప్రతికామెంట్లతో మాటల దాడి చేసుకున్నారు. ఓలా ఎలక్ట్రిక్ సర్వీస్ సెంటర్ ముందు పోగైన వాహనాల ఫొటోను షేర్ చేస్తూ కమ్రా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ పెట్టడంతో వాగ్వాదం ప్రారంభమైంది. కస్టమర్ల ఇబ్బందులను తెలియజేస్తూ కమ్రా పెట్టిన పోస్టుకు ‘ఇది పెయిడ్ పోస్టు’ అని అగర్వాల్ బదులివ్వడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. -
అంత బలుపు వద్దు.. ఓలా సీఈవోపై నెటిజన్ల ఫైర్!
ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్ మాట తీరుపై నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆన్లైన్ వేదికగా కమెడియన్ కునాల్ కమ్రాపై భవిష్ అగర్వాల్ చేస్తున్న వ్యాఖ్యలు అహంకారపూరితంగా ఉన్నాయంటూ సోషల్ మీడియా యూజర్లు విరుచుకుపడుతున్నారు.భవిష్ అగర్వాల్, కమెడియన్ కునాల్ కమ్రా మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. షోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు కామెంట్లు ప్రతికామెంట్లతో మాటల దాడి చేసుకుంటున్నారు. ఓలా కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ల సర్వీస్ సెంటర్ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేయడంతో ఈ వాగ్వాదం ప్రారంభమైంది. ఓలా సర్వీస్ సెంటర్లో పెద్ద సంఖ్యలో ఈవీ స్కూటర్లున్న ఫొటోను కమ్రా షేర్ చేస్తూ కామెంట్ పెట్టడంతో వివాదం మొదలైంది.ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కస్టమర్ల ఇబ్బందులను తెలియజేస్తూ కునాల్ కమ్రా పెట్టిన పోస్టులకు ‘ఇది పెయిడ్ పోస్టు’.. ‘నువ్వు సంపాదించలేనంత డబ్బు ఇస్తా’.. అంటూ తలపొగరుగా ఓలా సీఈవో భవిష్ అగర్వాల్ స్పందించిన తీరు.. ప్రయోగించిన పదాలపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇదీ చదవండి: సీఈవో అయినా డెలివరీ బాయ్‌గా వెళ్తే అంతే..అగర్వాల్ వర్సెస్ కమ్రా మాటల యుద్ధం వ్యవహారంలో చాలా మంది ఓలా కస్టమర్లతోపాటు నెటిజన్లు సైతం కమ్రాకు మద్దతుగా నిలుస్తున్నారు. భవిష్ మాట తీరుపై చీవాట్లు పెడుతున్నారు. ఓలా సర్వీస్ ఎంత చెత్తగా ఉందో చెప్పేందుకు మంచి కమెడియనే కావాల్సిన అవసరం లేదంటూ ఒక యూజర్ స్పందించారు. ఈ అహంకారం నిర్లక్ష్య ధోరణి నుంచి వచ్చిందని, దీనికి బుద్ధి చెప్పాలని మరో యూజర్ కామెంట్ చేశారు. ‘ఎంత అహంకారివి నువ్వు. సంపదను చాటుకోవడం మానేయండి. అంతా పోగొట్టుకుని రోడ్లపైకి వచ్చిన ఇలాంటి అహంకార సీఈవోలు ఎందరో ఉన్నారు. మీ విఫలమైన ఉత్పత్తులు, సేవల నమూనాను పరిష్కరించడంపై దృష్టి పెట్టండి’ అంటూ ఒక నెటిజన్ ఘాటుగా రాసుకొచ్చారు.ఈ అంశంలో ఓలా రూపొందించిన ఏఐ ఫ్లాట్‌ఫామ్ కృత్రిమ్ కూడా భవిష్ అగర్వాల్‌నే తప్పుపట్టింది. భవిష్ అగర్వాల్, కునాల్ కమ్రా మధ్య మాటల యుద్ధంపై ఓ జర్నలిస్ట్ ఓలా కృత్రిమ్ ఏఐ స్పందనను కోరారు. అది అందించిన స్పందనను ‘ఎక్స్’లో షేర్ చేశారు. కమ్రా లేవనెత్తిన ఆందోళనపై భవిష్ స్పందించిన తీరు హుందాగా లేదంటూ బదులిచ్చింది. ఆందోళనలను గుర్తించి పరిస్థితి పట్ల సానుభూతి చూపాలని అగర్వాల్‌కు కృత్రిమ్ సలహా ఇచ్చింది. I asked OLA bro's AI for PR advice on the developing situation with @kunalkamra88.It clearly does not like the response OLA bro gave. 😆 pic.twitter.com/bX6FifrThO— meghnad (Nerds ka Parivaar) (@Memeghnad) October 6, 2024 -
ఓలా సీఈఓ, కమెడియన్ మధ్య మాటల యుద్ధం
ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్, కమెడియన్ కునాల్ కమ్రా మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఆన్లైన్ వేదికగా ఒకరిపై ఒకరు తీవ్రంగా స్పందించారు. ఓలా కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ల సర్వీస్ సెంటర్ పరిస్థితిపై కమ్రా ఆందోళన వ్యక్తం చేయడంతో ఈ వాగ్వాదం ప్రారంభమైంది. ఓలా సర్వీస్ సెంటర్లో పెద్ద సంఖ్యలో ఈవీ స్కూటర్లున్న ఫొటోను కమ్రా షేర్ చేస్తూ కామెంట్ పెట్టడంతో వివాదం మొదలైంది.ఓలా సర్వీస్ సెంటర్ ముందు పోగైన ఎలక్ట్రిక్ వాహనాలను సూచించే ఫొటో షేర్ చేస్తూ కమ్రా తన ఎక్స్ ఖాతాలో ‘భారతీయ వినియోగదారులు సమస్యలపై మాట్లాడలేరని అనుకుంటున్నారా? వారికి ఇలాంటి సమస్యా? రోజువారీ వేతన కార్మికులు ద్విచక్ర వాహనాలు వాడుతూ జీవనాధారం పొందుతున్నారు’ అని ఆయన తన పోస్ట్‌లో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని ట్యాగ్ చేస్తూ ‘భారతీయులు ఈవీలను ఎలా ఉపయోగిస్తారు?’ అని తెలిపారు. ‘పరిస్థితి ఇంత అధ్వాన్నంగా ఉన్నా సంస్థ నాయకుడి నుంచి ఎలాంటి సమాధానం లేదు’ అని మరోపోస్ట్ పెట్టారు.Since you care so much @kunalkamra88, come and help us out! I’ll even pay more than you earned for this paid tweet or from your failed comedy career.Or else sit quiet and let us focus on fixing the issues for the real customers. We’re expanding service network fast and backlogs… https://t.co/ZQ4nmqjx5q— Bhavish Aggarwal (@bhash) October 6, 2024ఈ వ్యవహారంపై ఓలా సీఈవో భవిష్ అగర్వాల్ ఘాటుగా స్పందించారు. కమ్రా పెట్టిన పోస్ట్‌లు ‘పెయిడ్ పోస్ట్’లు అని వ్యాఖ్యానించారు. ఈమేరకు భవిష్ కమ్రా విమర్శలకు ప్రతిస్పందనగా పోస్ట్ చేశారు. ‘మీరు ఈవీల వ్యవహారంపై చాలా శ్రద్ధ వహిస్తారు కాబట్టి, వచ్చి మాకు సాయం చేయండి! ఈ ‘పెయిట్ ట్వీట్’లు, విఫలమైన మీ కామెడీ కెరీర్ ద్వారా ఎంత సంపాదిస్తారో అంతకంటే ఎక్కువగానే మీకు డబ్బు ఇస్తాను. ఇవేవీ కాదంటే నిశ్శబ్దంగా ఉండండి. మేము కస్టమర్ల సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెడుతున్నాం. సర్వీస్ నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరిస్తున్నాం. బ్యాక్‌లాగ్‌లు త్వరలో క్లియర్ చేస్తాం’ అని స్పందించారు.Instead can you give a total refund to anyone who wants to return their OLA EV & who’s purchased it in the last 4 months? I don’t need your money people not being able to get to their workplace need your accountability.Show your customers that you truly care? https://t.co/tI2dwZT2n2— Kunal Kamra (@kunalkamra88) October 6, 2024కమ్రా భవిష్ ట్వీట్‌పై తిరిగి స్పందించారు. ‘పెయిడ్ ట్వీట్ చేసినట్లు, నేను ఏదైనా ప్రైవేట్ కంపెనీ నుంచి ఈ వ్యవహారానికి సంబంధించి డబ్బు పొందినట్లు మీరు రుజువు చేస్తే నా అన్ని సోషల్ మీడియా అకౌంట్లను వెంటనే తొలగించి, మీరన్నట్లు ఎప్పటికీ నిశ్శబ్దంగా కూర్చుంటాను’ అని చెప్పారు. దీనికి అగర్వాల్ బదులిస్తూ ‘నేను అన్న మాటలతో బాధపడ్డారా? సర్వీస్ సెంటర్‌కు రండి. మాకు చాలా పని ఉంది. మీ ఫ్లాప్ షోల కంటే నేను బాగా డబ్బులిస్తాను. మీ వ్యాఖ్యలపై నిజంగా మీరెంత శ్రద్ధ వహిస్తున్నారో మీ అభిమానులకు తెలియాలి’ అని అన్నారు.ఇదీ చదవండి: రతన్‌టాటా ప్రేమ విఫలం.. పెళ్లికి దూరందీనిపై కమ్రా బదులిస్తూ ‘కస్టమర్ల ఈవీను తిరిగి ఇవ్వాలనుకునే వారికి, గత నాలుగు నెలల్లో ఈవీను కొనుగోలు చేసిన వారికి డబ్బు వాపసు చేస్తారా? మీ డబ్బు నాకు అవసరం లేదు. మీ ఈవీ వాడుతున్న కస్టమర్లు సరైన సేవలందక తమ కార్యాలయాలకు చేరుకోవడం లేదు. దీనికి సమాధానం చెప్పండి. మీరు నిజంగా శ్రద్ధ వహిస్తున్నట్లు మీ కస్టమర్లకు తెలియాలి కదా?’ అని అన్నారు. దీనిపై భవిష్ స్పందిస్తూ ‘మా కస్టమర్లకు అందే సర్వీసు జాప్యం జరిగితే వారికి తగినన్ని ప్రోగ్రామ్‌లు ఉన్నాయి. మీరు నిజంగా సమస్యపై స్పందించాలంటే కేవలం కుర్చీలో కూర్చొని విమర్శలు చేయడం కాదు. సమస్య ఎక్కడుందో తెలుసుకోండి. దీనిపై వెనక్కి తగ్గకండి’ అని పోస్ట్ చేశారు.We have enough programs for our customers if they face service delays. If you were a genuine one, you would have known.Again, don’t try and back out of this. Come and do some real work rather than armchair criticism. https://t.co/HFFKgsl7d9— Bhavish Aggarwal (@bhash) October 6, 2024 -
‘ఫ్యాక్ట్ చెక్ యూనిట్’ నోటిఫికేషన్‌పై సుప్రీం స్టే
ఢిల్లీ: కేంద్రం విడుదల చేసిన ‘ఫ్యాక్ట్ చెక్’ నోటిఫికేషన్‌పై సుప్రీం కోర్టు స్టే విధించింది. ఇది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు సంబంధించిన అంశమని అభిప్రాయపడింది. ఫేక్ న్యూస్‌ను అడ్డుకునేందుకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఆధ్వర్యంలో ‘ఫ్యాక్ట్ చెక్ (నిజనిర్ధారణ)’ యూనిట్‌కు సంబంధించి కేంద్ర ఐటీ శాఖ బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసిన తెలిసిందే. కాగా కేంద్ర ఐటీ శాఖ ఫ్యాక్ట్ చెక్ యూనిట్‌ను నోటిఫై చేయగా.. ఇది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు విఘాతం కలిగించడమేనని ‘ద ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ’ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ఫ్యాక్ట్ చెక్ విభాగాన్ని నోటిఫై చేయకుండా ఆదేశాలివ్వాలంటూ ‘ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా’ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే గురువారం దీనిపై సుప్రీం కోర్టు విచారణ జరిపి.. ఫ్యాక్ట్ చెక్ యూనిట్ నోటిఫికేషన్‌పై స్టే విదిస్తున్నట్లు పేర్కొంది. ఆన్లైన్ కంటెంట్‌లో ఫేక్, తప్పుడు సమాచారాన్ని గుర్తించేందుకు ఫ్యాక్ట్ చెక్ యూనిట్‌ను తీసుకువస్తామని కేంద్రం గతేడాది ఏప్రిల్‌లో పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే దీనికోసం ఐటీ రూల్స్-2021కి కూడా కేంద్రం సవరణలు చేసింది. ఈ కొత్త నిబంధనలు ఏకపక్షంగా, రాజ్యంగ విరుద్ధంగా ఉన్నాయిని పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. మరోవైపు.. స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా, ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ముంబై హైకోర్టును ఆశ్రయించారు. ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఏర్పాటుపై మధ్యంత స్టే ఇవ్వడానికి ముంబై హైకోర్టు నిరాకరించింది. ముంబై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ జరిపిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయముర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం మార్చి 11 ముంబై హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కనపెట్టింది. అయితే బాంబే హైకోర్టు ముందుకు వచ్చిన ప్రశ్నలను పరిశీలించాల్సి అవసంరం ఉందని సుప్రీం కోర్టు తెలిపింది. ఇక.. అంతవరకు మార్చి 20 (బుధవారం) కేంద్రం జారీ చేసిన నోటిఫికేష్‌పై స్టే విధిస్తున్నామని సుప్రీంకోర్టు పేర్కొంది. -
జడేజా గొప్ప ఆల్‌రౌండర్.. కచ్చితంగా ఆ పార్టీలోనే చేరతాడు
న్యూఢిల్లీ: టీమిండియా ఆటగాడు రవీంద్ర జడేజా ప్రపంచంలోనే గొప్ప ఆల్‌రౌండర్ అని కితాబిచ్చారు స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన వ్యంగ్యంగా ఈ కమెంట్ చేశారు. అంతేకాదు క్రికెట్ నుంచి తప్పుకున్నాక జడేజా.. ఆమ్ ఆద్మీ పార్టీలో చేరతారని జోస్యం కూడా చెప్పారు. కచ్చితంగా జరిగేది ఇదే.. ‘నిజంగా ప్రపంచంలోనే గొప్ప ఆల్ రౌండర్! భార్య రివాబా బీజేపీ టిక్కెట్‌పై పోటీకి దిగారు. సోదరి నయనాబా కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేస్తున్నారు. నేను కచ్చితంగా చెప్పగలను రిటైర్మెంట్ తర్వాత రవీంద్ర జడేజా ఆప్‌లో చేరతార’ని కునాల్ కమ్రా ట్వీట్ చేశారు. ట్విటర్లో చురుగ్గా ఉండే కునాల్ తరచుగా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ఉంటారు. (క్లిక్ చేయండి: జడేజా కుటుంబంలో ‘ఫ్యామిలీ పాలిటిక్స్’) పంత్‌కు పంచ్ ఇటీవల కాలంలో ఫామ్ కోల్పోయి వరుసగా విఫలమవుతున్న టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్‌పై ట్విటర్లో తనదైన శైలిలో స్పందించారు కునాల్ కమ్రా. ‘రిషబ్ పంత్.. భారత్ జోడో యాత్రలో చేరి భారతదేశానికి సానుకూలంగా సహకరించాలని నేను అభ్యర్థిస్తున్నా’ అంటూ ట్వీట్ చేశారు. మాజీ ఆటగాడు, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ గురించి ట్వీట్ చేస్తూ.. ‘ఒక వ్యక్తికి అన్ని క్రెడిట్లు దక్కకూడదని, అది జట్టు సమిష్టి కృషి అని 10 ఏళ్లుగా చెబుతూ వచ్చిన గౌతమ్ గంభీర్.. తర్వాత బీజేపీలో చేరాడ’ని పేర్కొన్నారు. ట్విటర్లో బర్త్ డే విషెస్ చెప్పండి! భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కూడా కునాల్ వదిలిపెట్టలేదు. బీసీసీఐ తీరుపై ట్విటర్ సెటైర్ సంధించారు. ‘ఎవరైనా బీజేపీయేతర రాష్ట్రానికి చెందిన వారైతే, వారు ప్రతి కేంద్ర కేబినెట్ మంత్రికి ట్విటర్లో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాలి. తద్వారా మీ ప్రతిభను బీసీసీఐ స్పష్టంగా చూడగలద’ని ట్వీట్ చేశారు. (క్లిక్ చేయండి: వీడియోలు, గేమింగ్, సోషల్‌మీడియా) -
మార్ఫింగ్ వీడియోతో కమెడియన్‌కు బిగుస్తున్న ఉచ్చు
ఢిల్లీ: ప్రముఖ కమెడియన్ కునాల్ కమ్రా మరోసారి వివాదంలో నిలిచాడు. యూరప్ దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ.. తొలుత జర్మనీలో పర్యటించిన విషయం తెలిసిందే. బెర్లిన్‌లో ప్రవాస భారతీయులతో ముఖాముఖి జరిపిన వేళ.. ఓ చిన్నారి దేశ భక్తి గేయం అలరించగా.. మోదీ కూడా హుషారుగా ఆ చిన్నారితో గొంతు కలిపారు. హే జన్మభూమి భారత్ అంటూ ఆ చిన్నారి వీడియో వైరల్ కాగా.. దానిని ‘మెహెన్గయి దాయన్ ఖాయే జాట్ హై’ అంటూ మరో ఆడియో క్లిప్‌తో మార్ఫింగ్ చేశారు ఎవరో. ఈ వీడియో కమెడియన్ కునాల్ కమ్రా తన ట్విటర్లో పోస్ట్ చేశాడు. అయితే ఆ పోస్ట్ చూసిన.. ఆ చిన్నారి తండ్రి తీవ్రంగా స్పందించాడు. #WATCH PM Narendra Modi in all praises for a young Indian-origin boy as he sings a patriotic song on his arrival in Berlin, Germany pic.twitter.com/uNHNM8KEKm — ANI (@ANI) May 2, 2022 చెత్త అంటూ కునాల్‌ను తిట్టిపోశాడు ఆ చిన్నారి తండ్రి గణేష్ పోల్. ఏడేళ్ల తన కొడుకు మాతృదేశం కోసం పాట పాడానని, అంత చిన్న వయసులో ఉన్నా చెత్త వెధవ అయిన నీ కంటే తన దేశాన్ని ప్రేమిస్తున్నాడంటూ ఆయనొక ట్వీట్ చేశాడు. అంతేకాదు చిన్నపిల్లలతో కామెడీ ఏంటంటూ మండిపడ్డాడు. He is my 7 year old son, who wanted to sing this song for his beloved Motherland . Though he is still very young but certainly he loves his country more than you Mr. Kamra or Kachra watever u are Keep the poor boy out of your filthy politics & try to work on your poor jokes https://t.co/ECnBFSIWkI — GANESH POL (@polganesh) May 4, 2022 అయితే ఈ జోక్ అతని కొడుకు మీద వేసింది కాదంటూ కునాల్ కమ్రా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఇదిలా ఉండగా.. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (ఎన్సీపీసీఆర్) ఈ విషయమై కునాల్ మీద చర్యలకు సిద్ధమైంది. ట్వీట్ డిలీట్ చేయించడంతో పాటు కునాల్ మీద చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులను గురువారం ఆదేశించింది. అయితే విమర్శలు తారాస్థాయికి చేరడంతో ఆ వీడియోను డిలీట్ చేశాడు కునాల్ కమ్రా. చదవండి: ‘రాజద్రోహం’పై విస్తృత ధర్మాసనం అనవసరం -
బీటౌన్‌లో కరోనా ప్రకంపనలు..
సాక్షి, ముంబై: దేశవ్యాప్తంగా రెండో దశలో ఉధృతంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్ బాలీవుడ్‌ను వణికిస్తోంది. ఇప్పటికే బీటౌన్ సెలబ్రిటీలు పలువురికి కోవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. తాజాగా హస్యనటుడు కునాల్ కమ్రా (32)కు కరోనాకు సోకింది. తనతోపాటు తన కుటుంబానికి కూడా కరోనా వచ్చిందని మంగళవారం ట్వీట్ చేశారు. తాను హోం ఐసోలేషన్‌గా ఉన్నానన్నారు. అయితే పేరెంట్స్ ఆసుపత్రిలో చేరారని తెలిపారు. దీంతో ఇటీవలి కాలంలో తమతో సన్నిహితంగా మెలిగినవారు అప్రమత్తంగా కావాలని సూచించారు. ఈమేరకు అందరికి సమాచారం ఇచ్చానన్నారు. సెకండ్ వేవ్‌ను నిర్లక్ష్యం చేయొద్దు, దీన్ని సీరియస్‌గా తీసుకొని చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా కునాల్ ట్వీట్ చేశారు. (11 రోజుల్లో కరోనా తీవ్ర రూపం) My parents are Covid positive & they’re in a hospital near by. I’m Covid positive quarantined at home. I’ve spoken to everyone who I was in contact with. Me and my family will be fine soon. Please take the second wave very seriously & be super careful ✌🏽✌🏽✌🏽 — Kunal Kamra (@kunalkamra88) April 6, 2021 -
సుప్రీంపై వ్యంగ్యాస్త్రాలు.. కోర్టుకు కమెడియన్
ముంబై: రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఆర్నబ్ గోస్వామికి బెయిల్ మంజూరు చేసి సుప్రీం కోర్టుపై పోలిటికల్ కామెంటర్, ప్రముఖ ముంబై కమెడియన్ కునాల్ కమ్రా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దేశ సర్వోన్నత న్నాయస్థానంపై వ్యంగ్యాస్త్రాలు సంధించి చట్టపరమైన చర్యలు ఎదుర్కొంటున్నాడు. అయినప్పటికీ కమ్రా తన వ్యాఖ్యాలను వెనకకు తీసుకోబోనని, క్షమాపణలు చేప్పేది లేదంటూ ట్విటర్ వేదికగా స్పష్టం చేశాడు. శుక్రవారం కుమ్రా ట్వీట్ చేస్తూ ‘న్యాయవాదులు లేరు, క్షమాపణలు లేవు, జరిమాన లేదు’ అని చేతులు జోడించి ఉన్న ఎమోజీలను జత చేశాడు. (చదవండి: అర్నాబ్ గోస్వామికి ఊరట) దీంతో అత్యున్నత న్యాయస్థానంపై అతడు చేసిన వ్యాఖ్యలకు న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎనిమిది మంది న్యాయవాదులు కమ్రాను కోర్టులో హాజరుపరచడానికి అతడిపై కోర్టు ధిక్కారణ కేసుకు అనుమితివ్వాల్సిందిగా అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్‌ను కోరారు. ఆయన వారికి అనుమతి ఇస్తూ సుప్రీంకోర్టుపై అనుచిత వ్యాఖ్యలు చేసి కమ్రా తన హద్దులు దాటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సుప్రీంకోర్టుపై దాడి చేయడం అన్యాయమని, ధైర్యమైన శిక్షకు దారి తీస్తుందని ప్రజలు అర్థం చేసుకోవలసిన సమయం ఇది’ అంటూ కమ్రాను కోర్టుకు తీసుకెళ్లడానికి అనుమతిస్తూ ఈ లేఖను అందించారు. (చదవండి: కమ్రా ట్వీట్లు కోర్టు ధిక్కారమే: ఏజీ) -
కమ్రా ట్వీట్లు కోర్టు ధిక్కారమే: ఏజీ
న్యూఢిల్లీ: కమేడియన్ కునాల్ కమ్రా సుప్రీంకోర్టుని విమర్శిస్తూ చేసిన ట్వీట్లు కోర్టుని అవహేళన చేయడమేనని, అతనిపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవడానికి అనుమతిస్తున్నట్లు అటార్నీ జనరల్(ఏజీ) వేణుగోపాల్ తెలిపారు. సుప్రీంకోర్టుని, న్యాయమూర్తులను ప్రజలు ధైర్యంగా, బహిరంగంగా విమర్శించవచ్చునని, అయితే వాక్ స్వాతంత్య్రం అనేది చట్టానికి లోబడి ఉంటుందని కెకె.వేణుగోపాల్ అన్నారు.సుప్రీంకోర్టుని కాషాయరంగుతో, దానిపై త్రివర్ణపతాకం జెండా స్థానంలో బీజేపీ జెండాని చూపిస్తూ కమ్రా ట్వీట్ చేశారని, ఇది సుప్రీంకోర్టు ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉందని, అతనిపై చర్యలకు అనుమతినివ్వాలని ముగ్గురు లాయర్లు కోరారు. అర్నబ్‌కి సుప్రీం బెయిలు మంజూరు చేయడంపై కమ్రా ఈ ట్వీట్ చేశారు. -
వైరల్: విస్టారా, ఇండిగోలపై కామెడియన్ కామెంట్
దేశ వ్యాప్తంగా అమలవుతున్న లాక్‌డౌన్‌పై విస్టారా, ఇండిగో, గోఎయిర్, స్పెస్‌జెట్ భారతీయ ఎయిర్‌లైన్స్ సంస్థలు సోషల్ మీడియాలో సరదాగా చర్చించిన సంభాషణ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ క్రమంలో స్టాండ్ అప్ ఇండియన్ కమెడియన్ కునాల్ కమ్రా విస్టారా ఎయిర్‌లైన్‌పై చేసిన ట్వీట్ ప్రస్తుతం ట్విటర్లో ట్రేండింగ్‌గా మారింది. ‘‘హే @airvistara నేను విన్నాను లాక్డౌన్ కారణంగా నిన్ను ఎత్తుకు ఎగరకుండా నిలిపివేశారంట కదా. ఎక్కడికి ఎగరకుండా పార్కింగ్‌లోనే జాగ్రత్తగా ఉండు. అలాగే ఇండిగో, స్పెస్‌జెట్, గోఎయిర్‌లు కూడా.. స్టేపార్కింగ్.. స్టేసేఫ్. ఇప్పటు మీకు అర్థం అవుతుంది నా బాధ’ అంటూ ఫన్నీగా ట్వీట్ చేశాడు. ఆయన సరదాగా చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం నెజన్లు తెగ ఆకట్టుకుంటోంది. (ప్రముఖ కమెడియన్‌పై ప్రయాణ నిషేధం) Now you know how I feel... https://t.co/oZcXqUIEeh — Kunal Kamra (@kunalkamra88) April 10, 2020 కాగా మార్చిలో విస్టారాతో పాటు ఇండిగో ఎయిర్ లైన్ అధికారుల లాక్డౌన్ అమలును అనుసరిస్తూ.. ఆయన ప్రయాణాన్ని నిషేధించినట్లు గతంలో ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ‘‘ఏప్రిల్ 27వరకూ ఎయిర్ విస్టారాతో పాటు మరో నాలుగు విమానా ఎయిర్‌లైన్ సంస్థలు నా ప్రయాణాన్ని నిషేధించాయి. అంతేగాక అధికారుల ఆదేశాల మేరకు ఎవరూ కూడా ప్రయాణించడాకి వీలు లేదని చెప్పారు’’ అంటూ కునాల్ ట్విటర్లో పేర్కొన్నాడు. కాగా ప్రపంచ వ్యాప్తంగా కోరలు చాస్తున్న కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని రకాల వ్యాపార రంగాలు మూతపడ్డాయి. అంతేగాక జాతీయ, అంతర్జాతీయ ప్రయాణాలపై కూడా ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ క్రమంలో విమానా సేవలు కూడా నిలిచిపోయాయి. (కరోనా: ప్రతి ఆరుగురిలో ఒకరి ఉద్యోగం ఫట్) -
ప్రముఖ కమెడియన్‌పై ప్రయాణ నిషేధం
ముంబై: ప్రముఖ కమెడియన్ కునాల్ కమ్రాపై విమానయాన సంస్థ విస్తారా నిషేధం విధించింది. ఏప్రిల్ 27 వరకు కునాల్ తమ విమానాల్లో ప్రయాణించేందుకు వీల్లేదని పేర్కొంది. ఈ ఏడాది జనవరి 28న ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో ఓ ప్రైవేటు చానల్‌కు చెందిన న్యూస్ యాంకర్‌పై కునాల్ వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డాడు. దీంతో కునాల్‌పై ఇండిగో సంస్థ ఆరు నెలల నిషేధం విధించింది. తర్వాత దానిని మూడు నెలలకు కుదించింది. ఆరోపణల విషయంపై విచారణ చేపట్టేందుకు అంతర్గత కమిటీని నియమించింది. కమిటీ విచారణలో కునాల్ ఆరోపణలు చేసిన విషయం వాస్తవమేనని తేలడంతో మూడు నెలల నిషేధం విధించినట్లు ఎయిర్‌లైన్ సంస్థ అధికారి ఒకరు వెల్లడించారు. ఇండిగో నిషేధం విధించిన తర్వాత ఎయిరిండియా, గోఎయిర్, స్పైస్ జెట్ సంస్థలు కూడా కునాల్‌పై నిషేధాజ్ఞలు విధించాయి. విస్తారా నిషేధంపై కునాల్ కమ్రా ట్విటర్ స్పందించారు. ఈ నిర్ణయం తనకు ఆశ్చర్యం కలిగించలేదని, తాను క్షమాపణ చెప్పబోనని స్పష్టం చేశారు. విస్తారా విధించిన ప్రయాణ నిషేధంతో ఇబ్బందులు పడబోనని పేర్కొన్నారు. (చదవండి: కామ్రాను అనుమతించేది లేదు)