ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్ కమెడియన్ కునాల్ కమ్రాకు జాబ్ ఆఫర్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ ఆఫర్‌ను అంగీకరించాలంటే తనకు కొన్ని షరతులు ఉన్నాయని కునాల్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఇటీవల ఓలా ఎలక్ట్రిక్ సర్వీసు సెంటర్ వద్ద పోగైన వాహనాల ఫొటోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడంతో కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్, కునాల్ కమ్రాల మధ్య మాటల యుద్ధం సాగింది.
ప్రభుత్వ విభాగమైన సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) ఓలా ఎలక్ట్రిక్ సంస్థకు గతంలో షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. నేషనల్ కన్జూమర్ హెల్ప్‌లైన్‌కు ఈ కంపెనీ స్కూటర్లకు సంబంధించి పది వేలకుపైగా ఫిర్యాదులు వచ్చినట్లు సీసీపీఏ తెలిపింది. సర్వీసు లోపాలు, నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య పద్ధతులను అనుసరించడం, వినియోగదారు హక్కుల ఉల్లంఘన వంటి చర్యలకు పాల్పడుతుందని సంస్థపై ఆరోపణలు వచ్చాయి. ఇయితే ఈ ఫిర్యాదుల్లో 99.1 శాతం సమస్యలను పరిష్కరించిందని కంపెనీ ఇటీవల పేర్కొంది.
ఇదీ చదవండి: సైబర్ దొంగ.. ఏఐకూ బెంగ!
ఈ పరిణామాల నేపథ్యంలో ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్ కునాల్ కమ్రాకు జాబ్ ఆఫర్ చేశారు. దానిపై కునాల్ ఎక్స్ వేదికగా కొన్ని డిమాండ్‌లను లేవనెత్తారు. వాటిని తీరిస్తే తాను జాబ్‌లో చేరుతానని చెప్పారు. ‘ఓలాతో కలిసి పనిచేయడానికి కంపెనీ సీఈఓ ఆఫర్‌ను అంగీకరించడం తప్ప నాకు వేరే మార్గం లేదు. నన్ను కంపెనీ విషయాలకు సంబంధించి వేలసార్లు ట్యాగ్ చేశారు. నేను ఓలా ఉద్యోగిగానే భావిస్తున్నాను. కంపెనీ ఆఫర్‌ను స్వీకరించాలంటే కొన్ని డిమాండ్‌లను తీర్చాలి.
ఓలా సర్వీస్ సెంటర్లలో స్కూటర్ ఇచ్చిన కస్టమర్లకు ఏడు రోజుల్లో సర్వీస్ అందేలా కంపెనీ చర్య తీసుకోవాలి.
ఏడు రోజులు దాటినా మరమ్మతులు పూర్తి కాకపోతే వేరే స్కూటర్‌ను తాత్కాలికంగా వినియోగదారులకు అందించాలి.
స్కూటర్ రిపేర్ పూర్తయ్యే వరకు రోజువారీ రవాణా ఖర్చుల కింద రూ.500 ఇవ్వాలి.
కొత్త ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు రెండు బీమాలు అందించాలి. వాహనానికి ఒకటి, సర్వీస్‌లకు మరొకటి. కస్టమర్లకు సర్వీస్ ఇన్సూరెన్స్ ఉచితంగా అందించాలి’ అని కునాల్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment