Ola
-
దీపావళి వీడియో కాదు.. సర్వీస్ స్టేషన్ ఫుటేజ్ చూపండి: కునాల్ కమ్రా
ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్.. కంపెనీలో జరిగిన దీపావళి వేడుకలకు సంబంధించిన ఒక వీడియోను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియోపైన స్పందించిన కునాల్ కమ్రా.. ఓలా సర్వీస్ స్టేషన్ ఫుటేజీని షేర్ చేయమని భవిష్ అగర్వాల్‌ను కోరారు. ఇది ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.సేల్స్ తరువాత నాణ్యమైన సర్వీస్ అందించడం లేదనే సమస్యతో ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్‌తో రగడ మొదలైంది. అప్పటి నుంచి ఓలా కస్టమర్లు లేవనెత్తే అనేక సమస్యలను కునాల్ హైలైట్ చేస్తూ వస్తున్నారు.నెలకు 80,000 కస్టమర్ ఫిర్యాదులను కంపెనీ ఎందుకు పరిష్కరించడం లేదనికునాల్ కమ్రా.. ఓలా సీఈఓను అడిగారు. దీనిపై స్పందించిన భవిష్ అగర్వాల్, ఓలా పరువు తీసేందుకు కమ్రా డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు. అంతే కాకుండా భవిష్ అగర్వాల్ కూడా కమ్రాను ఒక సర్వీస్ సెంటర్లో ఒక రోజు పని చేయాలని కోరారు.ఇదీ చదవండి: ఓలా సీఈఓ జాబ్ ఆఫర్.. ఓకే అన్న కమెడియన్!ఇటీవల ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్.. కమెడియన్ కునాల్ కమ్రాకు జాబ్ ఆఫర్ చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. దీనికి కమ్రా అంగీకరిస్తూ కొన్ని షరతులను కూడా వెల్లడించారు. కాగా ఇప్పుడు మళ్ళీ భవిష్ అగర్వాల్ చేసిన పోస్టుకు.. కామెంట్ చేశారు. దీనిపైనా నెటిజన్లు కూడా తమదైన రీతిలో స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.Service station ka footage dikhao… https://t.co/Zmp1Yzoh3i— Kunal Kamra (@kunalkamra88) October 31, 2024 -
ఓలా సీఈఓ జాబ్ ఆఫర్.. ఓకే అన్న కమెడియన్!
ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్ కమెడియన్ కునాల్ కమ్రాకు జాబ్ ఆఫర్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ ఆఫర్‌ను అంగీకరించాలంటే తనకు కొన్ని షరతులు ఉన్నాయని కునాల్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఇటీవల ఓలా ఎలక్ట్రిక్ సర్వీసు సెంటర్ వద్ద పోగైన వాహనాల ఫొటోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడంతో కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్, కునాల్ కమ్రాల మధ్య మాటల యుద్ధం సాగింది.ప్రభుత్వ విభాగమైన సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) ఓలా ఎలక్ట్రిక్ సంస్థకు గతంలో షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. నేషనల్ కన్జూమర్ హెల్ప్‌లైన్‌కు ఈ కంపెనీ స్కూటర్లకు సంబంధించి పది వేలకుపైగా ఫిర్యాదులు వచ్చినట్లు సీసీపీఏ తెలిపింది. సర్వీసు లోపాలు, నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య పద్ధతులను అనుసరించడం, వినియోగదారు హక్కుల ఉల్లంఘన వంటి చర్యలకు పాల్పడుతుందని సంస్థపై ఆరోపణలు వచ్చాయి. ఇయితే ఈ ఫిర్యాదుల్లో 99.1 శాతం సమస్యలను పరిష్కరించిందని కంపెనీ ఇటీవల పేర్కొంది.ఇదీ చదవండి: సైబర్ దొంగ.. ఏఐకూ బెంగ!ఈ పరిణామాల నేపథ్యంలో ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్ కునాల్ కమ్రాకు జాబ్ ఆఫర్ చేశారు. దానిపై కునాల్ ఎక్స్ వేదికగా కొన్ని డిమాండ్లను లేవనెత్తారు. వాటిని తీరిస్తే తాను జాబ్‌లో చేరుతానని చెప్పారు. ‘ఓలాతో కలిసి పనిచేయడానికి కంపెనీ సీఈఓ ఆఫర్‌ను అంగీకరించడం తప్ప నాకు వేరే మార్గం లేదు. నన్ను కంపెనీ విషయాలకు సంబంధించి వేలసార్లు ట్యాగ్ చేశారు. నేను ఓలా ఉద్యోగిగానే భావిస్తున్నాను. కంపెనీ ఆఫర్‌ను స్వీకరించాలంటే కొన్ని డిమాండ్లను తీర్చాలి.ఓలా సర్వీస్ సెంటర్లలో స్కూటర్ ఇచ్చిన కస్టమర్లకు ఏడు రోజుల్లో సర్వీస్ అందేలా కంపెనీ చర్య తీసుకోవాలి.ఏడు రోజులు దాటినా మరమ్మతులు పూర్తి కాకపోతే వేరే స్కూటర్‌ను తాత్కాలికంగా వినియోగదారులకు అందించాలి.స్కూటర్ రిపేర్ పూర్తయ్యే వరకు రోజువారీ రవాణా ఖర్చుల కింద రూ.500 ఇవ్వాలి.కొత్త ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు రెండు బీమాలు అందించాలి. వాహనానికి ఒకటి, సర్వీస్‌లకు మరొకటి. కస్టమర్లకు సర్వీస్ ఇన్సూరెన్స్ ఉచితంగా అందించాలి’ అని కునాల్ అన్నారు. -
99.1 శాతం ఫిర్యాదుల పరిష్కారం
ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ కస్టమర్ల నుంచి వచ్చిన 10,644 ఫిర్యాదుల్లో 99.1 శాతం పరిష్కరించినట్లు తెలిపింది. సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) ఇటీవల ఓలా ఎలక్ట్రిక్ సంస్థకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. నేషనల్ కన్జూమర్ హెల్ప్‌లైన్‌కు ఈ కంపెనీ స్కూటర్లకు సంబంధించి పది వేలకుపైగా ఫిర్యాదులు వచ్చినట్లు సీసీపీఏ గతంలో తెలిపింది. సర్వీసు లోపాలు, నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య పద్ధతులను అనుసరించడం, వినియోగదారు హక్కుల ఉల్లంఘన వంటి చర్యలకు పాల్పడుతుందని సంస్థపై ఆరోపణలు వచ్చాయి.ఈ కంపెనీ స్కూటర్లకు సంబంధించి నేషనల్ కన్జూమర్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేసిన వివిధ సమస్యలు, అంశాలపై లేవనెత్తిన ఆందోళనలను పరిష్కరించడానికి సీసీపీఏ 15 రోజులు గడువు ఇచ్చింది. ఈ నేపథ్యంలో మొత్తం అందిన 10,644 ఫిర్యాదుల్లో 99.1 శాతం సమస్యలను పరిష్కరించినట్లు తాజాగా కంపెనీ పేర్కొంది. ఏ కంపెనీ అయినా కస్టమర్లకు సరైన సర్వీసు అందించకపోతే దానికి ఆదరణ తగ్గుతుంది. ఫలితంగా కంపెనీకి కస్టమర్లు తగ్గి రెవెన్యూ దెబ్బతింటుంది. కంపెనీలకు అతీతంగా ప్రతి సంస్థ స్పందించి కస్టమర్లకు మెరుగైన సర్వీసులు అందించాలని పలువురు కోరుతున్నారు.ఇదీ చదవండి: గూగుల్ 15 జీబీ స్టోరేజ్ నిండిందా? ఇలా చేయండి..కంపెనీ సర్వీసుకు సంబంధించి ఇటీవల కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్, కమెడియన్ కునాల్ కమ్రా మధ్య సామాజిక మాధ్యమాలు వేదికగా వివాదం నెలకొంది. కంపెనీ సర్వీసు సరిగా లేదని పేర్కొంటూ సర్వీస్ సెంటర్ ముందు పోగైన ఓలా ఎలక్ట్రిక్ వాహనాల ఫొటోను కమ్రా తన ఎక్స్ ఖాతాలో షేర్ చేయడంతో వివాదం మొదలైంది. దీనిపై భవిష్ స్పందించిన తీరుపై నెటిజన్ల నుంచి కొంత వ్యతిరేకత వచ్చింది. అదే సమయంలో నేషనల్ కన్జూమర్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదులు రావడంపై సీసీపీఏ ఓలాకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. -
ఓలా ఇకపై అలా అంటే కుదరదు..? రిఫండ్ ఇవ్వాల్సిందే..!
-
దూసుకెళ్లే టాప్10 ఎలక్ట్రిక్ బైక్‌లు
ప్రస్తుతం దేశమంతా పండుగ సీజన్ నడుస్తోంది. ఈ ఉత్తేజకరమైన సమయంలో మీరు బైక్ కొనాలనుకుంటున్నారా? అది కూడా మంచి రేంజ్, స్పీడ్ ఇచ్చే ఎలక్ట్రిక్ బైక్‌ల చూస్తున్నారా? అయితే మీ కోసమే రయ్‌మంటూ దూసుకెళ్లే టాప్10 లేటెస్ట్ ఎలక్ట్రిక్ బైక్‌ల సమాచారాన్ని ఇక్కడ ఇస్తున్నాం.రివోల్ట్ ఆర్వీ400 బీఆర్జెడ్రివోల్ట్ ఆర్వీ400 బీఆర్జెడ్ (Revolt RV400 BRZ) భారతదేశపు మొట్టమొదటి ఏఐ ఎనేబుల్డ్ ఎలక్ట్రిక్ బైక్‌గా ప్రసిద్ధి చెందింది. అధిక పనితీరు, సొగసైన డిజైన్, ఉత్తమ ఫీచర్లను కలిగి ఉంది. రివోల్ట్ ఆర్వీ400 బీఆర్జెడ్ లాంచ్‌తో కంపెనీ ఇటీవలే ఆర్వీ400ని అప్డేట్ చేసింది. దీని రేంజ్ 150 కిలోమీటర్లు. టాప్ స్పీడ్ గంటకు 45 కిలోమీటర్లు. ప్రారంభ ధర రూ.1.09 లక్షలు.ఓలా రోడ్‌స్టర్ ప్రో ఓలా ఎలక్ట్రిక్ ఇటీవలే ఓలా రోడ్‌స్టర్ సిరీస్ విడుదలతో ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ మార్కెట్లోకి ప్రవేశించింది. ఇది అత్యుత్తమ రేంజ్, పనితీరు, ఫీచర్లను అందిస్తుంది. విడుదల చేసిన మోడళ్లలో టాప్-ఎండ్ వేరియంట్, ఓలా రోడ్‌స్టర్ ప్రో (Ola Roadster Pro). దీని ప్రారంభ ధర రూ.1,99,999. అత్యధిక రేంజ్ 579 కిలో మీటర్లు. టాప్ స్పీడ్ 194 కిలో మీటర్లు.రివోల్ట్ ఆర్వీ1, ఆర్వీ1+ఇటీవల రివోల్ట్ మోటార్స్ సరికొత్త ఎలక్ట్రిక్ కమ్యూటర్ మోటార్‌సైకిల్స్ రివోల్ట్ ఆర్వీ1, ఆర్వీ1+ (Revolt RV1 and RV1+)లను విడుదల చేసింది. ఆర్వీ1, ఆర్వీ1 ప్లస్ ఇప్పుడు దేశ మొట్టమొదటి కమ్యూటర్ మోటార్‌సైకిళ్లుగా నిలిచాయి. బేస్ మోడల్ ధర రూ. 84,990, ప్లస్ వెర్షన్ రూ. 99,990 (ఎక్స్-షోరూమ్). టాప్ రేంజ్ 160 కిలో మీటర్లు.ఒబెన్ రోర్బెంగళూరుకు చెందిన స్టార్టప్ ఒబెన్ ఎలక్ట్రిక్ తయారు చేసిన మొదటి ఎలక్ట్రిక్ బైక్ ఒబెన్ రోర్ (Oben Rorr). ఇది ఒక పెర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ బైక్. స్టైలిష్ నియో-క్లాస్ డిజైన్ లుక్స్‌తో ఉన్న ఈ బైక్ ప్రతి రైడర్‌ను ఆకట్టుకుంటుంది. దీని రేంజ్ 187 కిలో మీటర్లు. టాప్ స్పీడ్ 100 కిలో మీటర్లు. ధర రూ.1,49,999.అల్ట్రావయోలెట్ ఎఫ్77 మాక్ 2 ఎలక్ట్రిక్ బైక్‌లలో అల్ట్రావయోలెట్ అత్యంత ఇష్టమైన పేర్లలో ఒకటి. బెంగుళూరుకు చెందిన ఈ సంస్థ ప్రత్యేకమైన డిజైన్, శక్తివంతమైన పనితీరు, ఉత్తమ ఫీచర్లతో ఎలక్ట్రిక్ బైక్‌లను ఉత్పత్తి చేస్తుంది. అల్ట్రావయోలెట్ ఎఫ్77 మాక్ 2 (Ultraviolette F77 Mach 2) దాని ఎఫ్77 ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్ అప్‌గ్రేడ్ వెర్షన్‌గా విడుదలైంది. దీని రేంజ్ 323 కి.మీ. కాగా టాప్ స్పీడ్ 155 కి.మీ. ప్రారంభ ధర రూ.2,99,000.కొమాకి రేంజర్ ఎక్స్పీకొమాకి రేంజర్ పోర్ట్‌ఫోలియోలో రెండు ఎలక్ట్రిక్ బైక్‌లు ఉన్నాయి. అవి రేంజర్, ఎం16. రేంజర్‌ను భారతదేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ క్రూయిజర్‌గా చెప్తారు. ఇది భారీ, దృఢమైన చక్రాలు, అద్భుతమైన క్రోమ్ ఎక్స్టీరియర్స్, ప్రీమియం పెయింట్ ఫినిషింగ్‌ను కలిగి ఉంది. కొమాకి రేంజర్ ఎక్స్పీ (Komaki Ranger XP) రేంజ్ 250 కిలో మీటర్లు కాగా స్పీడ్ 70-80 కిలో మీటర్లు. ఇక దీని ధర రూ.1,84,300.మ్యాటర్ ఏరామ్యాటర్ ఎనర్జీ కంపెనీ గత ఏడాది తన మొదటి ఎలక్ట్రిక్ బైక్ మ్యాటర్ ఏరా (Matter Aera)ను విడుదల చేసింది. ఇది సింపుల్ యూజర్ ఇంటర్ఫేస్తో స్పష్టమైన, వినూత్న సాంకేతికతను మిళితం చేస్తూ బోల్డ్, స్ఫుటమైన డిజైన్‌తో వస్తుంది. ఈ బైక్ రేంజ్ 125 కి.మీ.కాగా ధర రూ.1,73,999 నుంచి ప్రారంభమవుతుంది.టోర్క్ క్రాటోస్-ఆర్ అర్బన్పుణెకి చెందిన ఎలక్ట్రిక్ బైక్‌మేకర్ టోర్క్ మోటార్స్ కొత్త క్రాటోస్-ఆర్ మోడల్ ( Tork Kratos R Urban)ను విడుదల చేసింది. ఈ సరికొత్త మోడల్‌ను రోజువారీ ప్రయాణాల కోసం, అర్బన్ రైడర్లకు సౌకర్యంగా రూపొందించారు. దీని ధర రూ.1.67 లక్షలు. ఇది 105 కిలో మీటర్ల టాప్ స్పీడ్, 120 కిలో మీటర్ల వరకూ రేంజ్‌ను అందిస్తుంది.ఒకాయ ఫెర్రాటో డిస్రప్టర్ఒకాయ ఈవీ ఈ ఏడాది మార్చిలో తన కొత్త ప్రీమియం అనుబంధ బ్రాండ్ ఫెర్రాటోను ప్రారంభించింది. ఇదే క్రమంలో ఫెర్రాటో బ్రాండ్ కింద డిస్రప్టర్ (Okaya Ferrato Disruptor)పేరుతో మొదటి మోడల్‌ను పరిచయం చేసింది.ఫెర్రాటో డిస్రప్టర్ ఆధునిక, ఫెయిర్డ్ స్పోర్ట్స్ బైక్ డిజైన్‌ను కలిగి ఉంది. ఈ బైక్ టాప్ స్పీడ్ 95 కి.మీ. కాగా 129 కిలో మీటర్ల రేంజ్‌ను ఇస్తుంది. ధర రూ.1,59,999.ఓర్క్సా మాంటిస్ఓర్క్సా ఎనర్జీస్ గత సంవత్సరం మాంటిస్ (Orxa Mantis) ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను భారతదేశంలో విడుదల చేసింది. ప్రీమియం ధర కలిగిన మాంటిస్, పదునైన ట్విన్-పాడ్ LED హెడ్‌ల్యాంప్‌లు, స్ట్రైకింగ్ ట్యాంక్ కౌల్, విలక్షణమైన కట్లు,క్రీజ్‌లతో ఆకట్టుకుంటోంది. దీని ధర రూ.3.6 లక్షలు. 221 కి.మీ.రేంజ్‌ను, 135 కి.మీ టాప్ స్పీడ్‌ను అందిస్తుంది. -
హర్ష్ గోయెంకా ఓలా స్కూటర్‌ను ఎలా వాడుతారో తెలుసా..?
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ వినియోగంపై ఆర్పీజీ గ్రూప్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా వ్యాఖ్యలు చేశారు. ఈమేరకు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేస్తూ ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్‌ను అందులో ట్యాగ్ చేశారు. ఇటీవల కమెడియన్ కునాల్ కమ్రా, భవిష్ అగర్వాల్ మధ్య ఆన్లైన్ వేదికగా జరిగిన మాటల యుద్ధంతో ఈ ఓలా వ్యవహారం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హాట్‌టాపిక్‌గా నిలిచింది.హర్ష్ గోయెంకా తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఓలా ఎలక్ట్రిక్‌పై స్పందిస్తూ ‘తక్కువ దూరంలోని గమ్యాలు చేరాలంటే నేను ఓలా స్కూటర్ వినియోగిస్తాను. ఒక ‘కమ్రా’(ఇంటి గది) నుంచి మరో ఇంటి గదికి వెళ్లాలనుకుంటే ఓలా స్కూటర్ వాడుతాను’ అన్నారు. తన ట్విట్లో కునాల్ కమ్రా పేరుతో అర్థం వచ్చేలా ప్రస్తావించారు.If I have to travel close distances, I mean from one ‘kamra’ to another, I use my Ola @bhash pic.twitter.com/wujahVCzR1— Harsh Goenka (@hvgoenka) October 8, 2024ఇటీవల ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్, కమెడియన్ కునాల్ కమ్రా మధ్య మాటల యుద్ధం సాగింది. సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు కామెంట్లు, ప్రతికామెంట్లతో మాటల దాడి చేసుకున్నారు. ఓలా ఎలక్ట్రిక్ సర్వీస్ సెంటర్ ముందు పోగైన వాహనాల ఫొటోను షేర్ చేస్తూ కమ్రా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ పెట్టడంతో వాగ్వాదం ప్రారంభమైంది. కస్టమర్ల ఇబ్బందులను తెలియజేస్తూ కమ్రా పెట్టిన పోస్టుకు ‘ఇది పెయిడ్ పోస్టు’ అని అగర్వాల్ బదులివ్వడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందించారు.ఇదీ చదవండి: అనుకున్నదే జరిగింది.. వడ్డీలో మార్పు లేదుఓలా ఎలక్ట్రిక్ సంస్థకు సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) ఇటీవల షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. నేషనల్ కన్జూమర్ హెల్ప్‌లైన్‌కు ఈ కంపెనీ స్కూటర్లకు సంబంధించి 10,000కు పైగా ఫిర్యాదులు వచ్చినట్లు సీసీపీఏ తెలిపింది. సర్వీసు లోపాలు, నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య పద్ధతులను అనుసరించడం, వినియోగదారు హక్కుల ఉల్లంఘన వంటి చర్యలకు పాల్పడుతుందని సంస్థపై ఆరోపణలు వస్తున్నాయి. ఈ కంపెనీ స్కూటర్లకు సంబంధించి నేషనల్ కన్జూమర్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేసిన వివిధ సమస్యలు, అంశాలపై లేవనెత్తిన ఆందోళనలను పరిష్కరించడానికి సీసీపీఏ 15 రోజుల గడువు ఇచ్చింది. -
ఎన్నికల్లో సంస్థల సహకారం ఎంతున్నా అది తప్పనిసరి
ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, విక్రయాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఫేమ్ 1, ఫేమ్ 2 ద్వారా అందించిన రాయితీలు దేశంలోని మొత్తం ప్రజల సొమ్మని కేరళ కాంగ్రెస్ తెలిపింది. ఎన్నికల ప్రక్రియలో ప్రభుత్వానికి కంపెనీల సహకారం ఎంత ముఖ్యమైనా సరే..నాణ్యతా ప్రమాణాలు పట్టించుకోని సంస్థలు తప్పనిసరిగా జవాబుదారీగా ఉండాలని పేర్కొంది. ఇటీవల ఓలా వంటి ఎలక్ట్రిక్ వాహన కంపెనీలు అందిస్తున్న సేవలపై తీవ్ర విమర్శలొస్తున్నాయి. దాంతో కేరళ కాంగ్రెస్ స్పందించింది. ఈమేరకు తన ఎక్స్ ఖాతాలో కేంద్రమంత్రి నితిన్గడ్కరీను ట్యాగ్ చేస్తూ కొన్ని విషయాలు పంచుకుంది.‘ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా అందుకు అయ్యే ఖర్చు భారత ప్రజలందరిది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, విక్రయాల పెంపునకు ప్రభుత్వం ఫేమ్ 1, ఫేమ్ 2 పథకాల ద్వారా రాయితీలిచ్చింది. మే 2023 కంటే ముందు విక్రయించిన ఓలా ఎస్1 ప్రో మోడల్‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ట్యాక్స్‌తో సహా రూ.1.16 లక్షలు రాయితీ అందించాయి. ఒక స్కూటర్‌కు ఇది భారీ రాయితీ. వినియోగదారులు, వారి భద్రత, సర్వీసును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అందించిన రాయితీలు ఏమేరకు ప్రయోజనం కలిగించాయో ప్రభుత్వం తెలుసుకోవడం చాలాముఖ్యం’ అని తెలిపింది.ఇదీ చదవండి: కస్టమర్ల నుంచి 10 వేల ఫిర్యాదులు‘మన దేశాన్ని బ్రాండ్ ఇమేజ్ సమస్య వెంటాడుతోంది. చైనా చౌకైన, తక్కువ నాణ్యత కలిగిన ఉత్పత్తులు తయారీ చేస్తుందనే బ్రాండ్ ఇమేజ్ నుంచి బయటపడేందుకు చాలాకాలంగా ప్రయత్నిస్తోంది. కొన్ని భారతీయ కంపెనీలు ఎలాంటి రెగ్యులేటర్ పరిశీలన లేకుండా కస్టమర్ భద్రతను విస్మరించి తక్కువ నాణ్యత గల ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి. దాంతో దేశంలోని ఇతర బ్రాండ్లపై ప్రభావం పడుతోంది. అందువల్ల ఇతర దేశాలకు ఎగుమతి అవుతున్న నాణ్యమైన వాహనాలను ఉత్పత్తి చేయడం సవాలుగా మారుతోంది. ఫలితంలో ‘చైనా బ్రాండ్’ ఇమేజ్‌నే మూటగట్టుకునే ప్రమాదముంది. కాబట్టి వాహనాల తయారీ, సర్వీసు అందించడంలో ప్రభుత్వం రెగ్యులేటర్‌గా ఉండాలని కోరుతున్నాం. ఎన్నికల ప్రక్రియలో ప్రభుత్వానికి కంపెనీల సహకారం ఎంత ముఖ్యమైనదైనా సరే..నాణ్యతా ప్రమాణాలు పట్టించుకోని సంస్థలు తప్పనిసరిగా జవాబుదారీగా ఉండాలి’ అని కేరళ కాంగ్రెస్ పేర్కొంది.Dear @nitin_gadkari,The reported quality issues with @OlaElectric or any other Electric Vehicle company for that matter is not between the company and their customers. It concerns each and every tax payer of this country.We've been giving huge subsidies to these companies… pic.twitter.com/rbCbkTHOhL— Congress Kerala (@INCKerala) October 7, 2024ఇటీవల ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్, కమెడియన్ కునాల్ కమ్రా మధ్య మాటల యుద్ధం సాగింది. సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు కామెంట్లు, ప్రతికామెంట్లతో మాటల దాడి చేసుకున్నారు. ఓలా ఎలక్ట్రిక్ సర్వీస్ సెంటర్ ముందు పోగైన వాహనాల ఫొటోను షేర్ చేస్తూ కమ్రా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ పెట్టడంతో వాగ్వాదం ప్రారంభమైంది. కస్టమర్ల ఇబ్బందులను తెలియజేస్తూ కమ్రా పెట్టిన పోస్టుకు ‘ఇది పెయిడ్ పోస్టు’ అని అగర్వాల్ బదులివ్వడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. -
ఓలాకు మరో దెబ్బ! షోకాజ్ నోటీసు జారీ
ఓలా ఎలక్ట్రిక్ సంస్థకు సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసింది. నేషనల్ కన్జూమర్ హెల్ప్‌లైన్‌కు ఈ కంపెనీ స్కూటర్లకు సంబంధించి 10,000కు పైగా ఫిర్యాదులు వచ్చినట్లు సీసీపీఏ తెలిపింది. సర్వీసు లోపాలు, నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య పద్ధతులను అనుసరించడం, వినియోగదారు హక్కుల ఉల్లంఘన వంటి చర్యలకు పాల్పడుతుందని సంస్థపై ఆరోపణలు వస్తున్నాయి.ఈ కంపెనీ స్కూటర్లకు సంబంధించి నేషనల్ కన్జూమర్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేసిన వివిధ సమస్యలు, అంశాలపై లేవనెత్తిన ఆందోళనలను పరిష్కరించడానికి సీసీపీఏ 15 రోజుల గడువు ఇచ్చింది. ఏ కంపెనీ అయినా కస్టమర్లకు సరైన సర్వీసు అందించకపోతే దానికి ఆదరణ తగ్గుతుంది. ఫలితంగా కంపెనీకి కస్టమర్లు తగ్గి రెవెన్యూ దెబ్బతింటుంది. కంపెనీలకు అతీతంగా ప్రతి సంస్థ స్పందించి కస్టమర్లకు మెరుగైన సర్వీసులు అందించాలని పలువురు కోరుతున్నారు.🚨🚨 Sources to CNBC-TV18 ⬇️⚡Central Consumer Protection Authority (CCPA) issues showcause notice to @OlaElectric for class action⚡ Ola Electric given 15 days to respond to CCPA showcause notice on service issues and more⚡ #OlaElectric faces more than 10,000 complaints… pic.twitter.com/fNbdBLsQQq— CNBC-TV18 (@CNBCTV18News) October 7, 2024ఇదీ చదవండి: పేరుకుపోతున్న వాహన నిల్వలుఇటీవల ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్, కమెడియన్ కునాల్ కమ్రా మధ్య మాటల యుద్ధం సాగింది. సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు కామెంట్లు, ప్రతికామెంట్లతో మాటల దాడి చేసుకున్నారు. ఓలా ఎలక్ట్రిక్ సర్వీస్ సెంటర్ ముందు పోగైన వాహనాల ఫొటోను షేర్ చేస్తూ కమ్రా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ పెట్టడంతో వాగ్వాదం ప్రారంభమైంది. కస్టమర్ల ఇబ్బందులను తెలియజేస్తూ కమ్రా పెట్టిన పోస్టుకు ‘ఇది పెయిడ్ పోస్టు’ అని అగర్వాల్ బదులివ్వడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. -
అంత బలుపు వద్దు.. ఓలా సీఈవోపై నెటిజన్ల ఫైర్!
ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్ మాట తీరుపై నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆన్లైన్ వేదికగా కమెడియన్ కునాల్ కమ్రాపై భవిష్ అగర్వాల్ చేస్తున్న వ్యాఖ్యలు అహంకారపూరితంగా ఉన్నాయంటూ సోషల్ మీడియా యూజర్లు విరుచుకుపడుతున్నారు.భవిష్ అగర్వాల్, కమెడియన్ కునాల్ కమ్రా మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. షోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు కామెంట్లు ప్రతికామెంట్లతో మాటల దాడి చేసుకుంటున్నారు. ఓలా కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ల సర్వీస్ సెంటర్ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేయడంతో ఈ వాగ్వాదం ప్రారంభమైంది. ఓలా సర్వీస్ సెంటర్లో పెద్ద సంఖ్యలో ఈవీ స్కూటర్లున్న ఫొటోను కమ్రా షేర్ చేస్తూ కామెంట్ పెట్టడంతో వివాదం మొదలైంది.ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కస్టమర్ల ఇబ్బందులను తెలియజేస్తూ కునాల్ కమ్రా పెట్టిన పోస్టులకు ‘ఇది పెయిడ్ పోస్టు’.. ‘నువ్వు సంపాదించలేనంత డబ్బు ఇస్తా’.. అంటూ తలపొగరుగా ఓలా సీఈవో భవిష్ అగర్వాల్ స్పందించిన తీరు.. ప్రయోగించిన పదాలపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇదీ చదవండి: సీఈవో అయినా డెలివరీ బాయ్‌గా వెళ్తే అంతే..అగర్వాల్ వర్సెస్ కమ్రా మాటల యుద్ధం వ్యవహారంలో చాలా మంది ఓలా కస్టమర్లతోపాటు నెటిజన్లు సైతం కమ్రాకు మద్దతుగా నిలుస్తున్నారు. భవిష్ మాట తీరుపై చీవాట్లు పెడుతున్నారు. ఓలా సర్వీస్ ఎంత చెత్తగా ఉందో చెప్పేందుకు మంచి కమెడియనే కావాల్సిన అవసరం లేదంటూ ఒక యూజర్ స్పందించారు. ఈ అహంకారం నిర్లక్ష్య ధోరణి నుంచి వచ్చిందని, దీనికి బుద్ధి చెప్పాలని మరో యూజర్ కామెంట్ చేశారు. ‘ఎంత అహంకారివి నువ్వు. సంపదను చాటుకోవడం మానేయండి. అంతా పోగొట్టుకుని రోడ్లపైకి వచ్చిన ఇలాంటి అహంకార సీఈవోలు ఎందరో ఉన్నారు. మీ విఫలమైన ఉత్పత్తులు, సేవల నమూనాను పరిష్కరించడంపై దృష్టి పెట్టండి’ అంటూ ఒక నెటిజన్ ఘాటుగా రాసుకొచ్చారు.ఈ అంశంలో ఓలా రూపొందించిన ఏఐ ఫ్లాట్‌ఫామ్ కృత్రిమ్ కూడా భవిష్ అగర్వాల్‌నే తప్పుపట్టింది. భవిష్ అగర్వాల్, కునాల్ కమ్రా మధ్య మాటల యుద్ధంపై ఓ జర్నలిస్ట్ ఓలా కృత్రిమ్ ఏఐ స్పందనను కోరారు. అది అందించిన స్పందనను ‘ఎక్స్’లో షేర్ చేశారు. కమ్రా లేవనెత్తిన ఆందోళనపై భవిష్ స్పందించిన తీరు హుందాగా లేదంటూ బదులిచ్చింది. ఆందోళనలను గుర్తించి పరిస్థితి పట్ల సానుభూతి చూపాలని అగర్వాల్‌కు కృత్రిమ్ సలహా ఇచ్చింది. I asked OLA bro's AI for PR advice on the developing situation with @kunalkamra88.It clearly does not like the response OLA bro gave. 😆 pic.twitter.com/bX6FifrThO— meghnad (Nerds ka Parivaar) (@Memeghnad) October 6, 2024 -
భారీగా తగ్గిన ఎలక్ట్రిక్ స్కూటర్ ధర.. ఎంతంటే.?
పండగ సీజన్ వస్తుందంటేనే చాలా కంపెనీలు ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. అందులో భాగంగా ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ స్కూటర్ తయారీ కంపెనీ ఓలా ఆఫర్ వెల్లడించింది. సంస్థ తయారు చేసిన ఎస్1 బేసిక్ మోడల్‌ను రూ.50 వేల నుంచి అందిస్తున్నట్లు కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. అదికాస్తా వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఈ మోడల్ ధర సుమారు రూ.80 వేలు వరకు ఉంది.ఎలక్ట్రిక్ వాహనాల్లో ప్రధానంగా బ్యాటరీకే ఎక్కువగా ఖర్చు అవుతుంది. చాలా కంపెనీలు బ్యాటరీతోపాటు టెక్నాలజీను అందిస్తున్నాయి. దాంతో వాహనాల తయారీ వ్యయం పెరుగుతోంది. ఈ పండగ సీజన్లో ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేయాలనుకునే వారికి ఓలా ప్రకటన కొంత ఆకర్షణీయంగా కనిపించే అవకాశం ఉంది. అయితే వినియోగదారులు తమ అవసరాలు, వాహనంలోని సౌకర్యాలు, మన్నిక, ఇప్పటికే ఆ వాహనాన్ని ఎవరైనా వాడుతుంటే తమ అభిప్రాయం..వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. మార్కెట్లో చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను అందిస్తున్నాయి. వాటిలో కస్టమర్ల అవసరాలు, ఆర్థిక వ్యయాన్ని పరిగణించి సౌకర్యంగా ఉండే వాహనాన్ని కొనుగోలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రధానంగా ఆఫర్లకు మొగ్గు చూపకుండా వాహనం నాణ్యతకు పెద్దపేట వేయాలని చెబుతున్నారు.ఇదీ చదవండి: రోజూ 50 కోట్ల లావాదేవీలు..! -
షో రూమ్ కే నిప్పు పెట్టిన యువకుడు
-
స్కూటర్ రిపేర్‌లో జాప్యం.. ఓలా షోరూమ్‌ను తగలబెట్టిన యువకుడు
బెంగళూరు: తన టూవీలర్ రిపేర్ చేయలేదని ఓ యువకుడు ఏకంగా ఓలా షోరూమ్‌నే తగలబెట్టాడు. ఈ ప్రమాదంలో పలు వాహనాలు, కంప్యూటర్లు దగ్ధమయ్యాయి. లక్షల్లో నష్టం వాటిల్లింది. కర్ణాటక కలబుర్గిలో ఈ ఘటన చోటుచేసుకుంది. మహమ్మద్ నదీమ్ అనే వ్యక్తి ఆగష్టు 28న ఓలా షోరూమ్‌లో రూ. 1.4 లక్షలు ఖర్చు చేసి ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేశాడు. అయితే కొన్న రెండు రోజుల్లోనే స్కూటర్ బ్యాటరీ, సౌండ సిస్టమ్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. బండి ఊకే ఆగిపోవడం జరిగింది.ఈ విషయంపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా, ఓలా షోరూమ్‌కు వెళ్లినా అధికారులు సరిగా పట్టించుకోలేదు. తన టూవిలర్‌ను సరైన సమాయానికి రిపేర్ చేయలేదు. దీంతో కస్టమర్ సపోర్టు ఎగ్జిక్యూటివ్‌తో వాగ్వాదానికి దిగాడు. సిబ్బంది నిర్లక్ష్యంతో విసుగు చెందిన నదీమ్.. పెట్రోల్ పోసి కంపెనీ షోరూమ్‌కు నిప్పంటించాడు.షోరూమ్ మొత్తం మంటలు వ్యాపించడంతో ఆరు స్కూటర్లు, కంప్యూటర్లు ధ్వంసమయ్యాయి. అయితే అదృష్టవశాత్తు ఆ సమయంలో షోరూమ్ మూసివేయడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. షాప్‌కు రూ.8.5 లక్షల నష్టం వాటిలినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు నదీమ్‌ను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.Mohammad Nadeem, 26, set fire to the Ola scooter showroom on disagreement with showroom management in Kalaburagi, Karnataka.Every day a new crime by Abduls.pic.twitter.com/JLFiPg31hp— Sunanda Roy 👑 (@SaffronSunanda) September 11, 2024 -
యువతిపై ఓలా డ్రైవర్ దాడి, స్పందించిన ఓలా: వీడియో వైరల్
బెంగళూరులో ఓలా ఆటో డ్రైవర్ ఒక యువతిపై అనుచితంగా ప్రవర్తించి, దుర్బాషలాడి, దాడిచేసిన ఘటన కలకలం రేపింది. బుధవారం జరిగినఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చర్చనీయాంశంగా మారింది. బాధిత యువతి ఎక్స్‌లో షేర్ చేసిన వివరాల ప్రకారం తన స్నేహితురాలితో కలిసి బెంగళూరు సిటీలో ఓలా ఆటో రైడ్‌ను బుక్ చేసుకున్నారు. తొందరగా వెళ్లాలనే ఉద్దేశంలో ఇద్దరూ ఓలా రైడ్ కోసం ప్రయత్నించగా ఇద్దరివీ బుక్ అయ్యాయి. ఇదే వివాదానికి దారి తీసింది. ముందుగా వచ్చిన ఆటోలో యువతులిద్దరూ ఎక్కి కూర్చున్నారు. ఇంతలో 15 నిమిషాలు ఆలస్యం చూపించిన రెండో ఆటోను రద్దు చేసింది. కానీ అక్కడికి చేరుకున్న రెండో ఆటోవాలా తన రైడ్ ఎందుకు క్యాన్సిల్ చేశారంటూ వాదనకు దిగాడు. అంతేకాదు పెట్రోల్ ఊరికే వస్తుందా, అంటూ రెచ్చిపోయాడు. అంతటితో ఆగలేదు దుర్భాషలాడుతూ ఆమెపై దాడికి దిగాడు ఆటో డ్రైవర్. దీంతో నన్ను చెంపపై ఎందుకు కొట్టావ్ అంటూ ఆమె గట్టిగా నిలదీసింది. అప్పటిదాకా చోద్యం చూస్తూ కూర్చున్న మిగిలిన డ్రైవర్లు, జోక్యం చేసుకుని అతగాడిని పక్కకు తీసుకెళ్లారు.Yesterday I faced severe harassment and was physically assaulted by your auto driver in Bangalore after a simple ride cancellation. Despite reporting, your customer support has been unresponsive. Immediate action is needed! @Olacabs @ola_supports @BlrCityPolice pic.twitter.com/iTkXFKDMS7— Niti (@nihihiti) September 4, 2024కాగా బాధిత యువతి నితి తన నిరాశను వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేసింది. ఓలా కస్టమర్ సపోర్ట్ ఫిర్యాదు చేసినా, ఆటోమేటెడ్ ప్రత్యుత్తరాలు మాత్రమే అందాయి తప్ప, అంతకుమించి ఎలాంటి స్పందన లేదని ట్వీట్ చేసింది. తన స్నేహితురాలు క్లాస్ మిస్ కాకుండా చూసుకోవడానికి రెండు ఆటోలను బుక్ చేసుకోవడం మాత్రమే తమ తప్పు అని, రైడ్ రద్దుపై వివాదాలు సర్వసాధారణమైనప్పటికీ, డ్రైవర్ బెదిరింపులు, అమానుష ప్రవర్తన హద్దు మీరిందంటూ ఆగ్రహం చేసింది. అయితే దీనిపై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు.ఓలా స్పందనఈ వీడియో వైరల్ కావడంతో ఈ ఘటనపై ఓలా స్పందించింది. డ్రైవర్ చర్యలను ఖండిస్తోంది. నిందితుడైన డ్రైవర్‌పై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. అటువంటి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించి తమ ప్రయాణీకుల భద్రతకు భరోసాకు కట్టుబడి ఉన్నామని పేర్కొంది. -
మ్యాప్‌మైఇండియా ఆరోపణల్లో విశ్వసనీయత లేదు..
న్యూఢిల్లీ: మ్యాప్‌లను కాపీ చేశారంటూ మ్యాప్‌మైఇండియా తమపై చేస్తున్న ఆరోపణల్లో విశ్వసనీయత లేదని ఓలా సహ–వ్యవస్థాపకుడు భవీష్ అగర్వాల్ వ్యాఖ్యానించారు. ఓలా ఎలక్ట్రిక్ లిస్టింగ్‌ను అడ్డం పెట్టుకుని లబ్ధి పొందేందుకే ఆ కంపెనీ తమపై మ్యాప్‌ల కాపీయింగ్ ఆరోపణలు చేసిందని ఆయన పేర్కొన్నారు. తాము లీగల్ నోటీసు పంపినా మ్యాప్‌మైఇండియా నుంచి ఎటువంటి సమాధానం రాలేదని అగర్వాల్ పేర్కొన్నారు. సొంతంగా దేశీ నావిగేషన్ మ్యాప్ తయారు చేశామంటూ ఓలా మాతృసంస్థ ఏఎన్ఐ టెక్నాలజీస్ ప్రకటించడం ఓ గిమ్మిక్కు అంటూ మ్యాప్‌మైఇండియా ఆరోపించడం వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. ఓలా ఎలక్ట్రిక్ ఐపీవో సంబంధ ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేయడానికి మూడు రోజుల ముందు జూలై 23న మ్యాప్‌మైఇండియా ఆ సంస్థకు నోటీసులు పంపింది. ఓలా ఎలక్ట్రిక్ ఆగస్టు 9న లిస్టయింది. ఈ నేపథ్యంలోనే అగర్వాల్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తాము చాలాకాలంగా రైడ్ షేరింగ్ వ్యాపారంలో ఉన్నందున తమ దగ్గర మ్యాపింగ్‌కి సంబంధించిన డేటా..టెక్నాలజీ బోలెడంత ఉందని, ఒక సంస్థను కూడా కొనుగోలు చేశామని అగర్వాల్ తెలిపారు. బహుశా మ్యాప్‌మైఇండియా కస్టమర్లు ఓలా మ్యాప్స్ వైపు మళ్లుతున్నారేమోనని, ఇది సమస్యగా మారడం వల్లే ఆ కంపెనీ తమపై ఆరోపణలు చేస్తోందని అగర్వాల్ పేర్కొన్నారు. -
ఓలా నుంచి తొలి ఎలక్ట్రిక్ బైక్
ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ రోడ్‌స్టర్ అనే పేరుతో తమ తొలి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్ల శ్రేణిని ప్రకటించింది. రోడ్‌స్టర్ ప్రో , రోడ్‌స్టర్, రోడ్‌స్టర్ ఎక్స్ అనే మూడు వేరియంట్లను గురువారం తమ వార్షిక ఈవెంట్ “సంకల్ప్” సందర్భంగా లాంచ్ చేసింది. వీటి ధరలు రూ. 74,999 నుంచి రూ. 2,49,999 మధ్య ఉండనున్నాయి. మూడు మోడల్స్‌కు రిజిస్ట్రేషన్స్ కూడా ప్రారంభమయ్యాయి.చౌకైన రోడ్‌స్టర్ ఎక్స్, రోడ్‌స్టర్ మోడల్‌లు 2.5 KwH నుంచి 6 Kwh బ్యాటరీ బ్యాక్‌లతో వస్తాయి. 2025 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో వీటి డెలివరీలు ప్రారంభమవుతాయి. అలాగే ప్రీమియం రోడ్‌స్టర్ ప్రో 8 KwH, 16 KwH వేరియంట్లలో 2025 నవంబర్ నాటికి అందుబాటులో ఉంటుందని ఓలా వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ తెలిపారు.ఓలా రోడ్‌స్టర్ ఎక్స్రోడ్స్టర్ ఎక్స్ 11 kW గరిష్ట మోటార్ అవుట్‌పుట్‌ను కలిగి ఉంది. 3 బ్యాటరీ ప్యాక్ ఎంపికలు- 2.5 kWh, 3.5 kWh, 4.5 kWh ఉన్నాయి. వీటిలో టాప్ వేరియంట్ 124 కి.మీ గరిష్ట వేగం, 200 కి.మీ. రేంజ్‌ని అందిస్తుంది. కాంబి బ్రేకింగ్ సిస్టమ్ (CBS) తోపాటు 4.3-అంగుళాల ఎల్సీడీ డిస్ప్లే, ఓలా మ్యాప్స్ నావిగేషన్ వంటి అనేక రకాల డిజిటల్ టెక్ ఫీచర్లను అందిస్తుంది. ఓలా ఎలక్ట్రిక్ యాప్ కనెక్టివిటీతో వస్తుంది. 2.5 kWh వేరియంట్ ధర రూ. 74,999, 3.5 kWh రూ. 84,999, 4.5 kWh మోడల్ ధర రూ. 99,999.ఓలా రోడ్స్టర్రోడ్స్టర్ 13 kW మోటారుతో ఆధారితమైనది. ఇందులో 3.5 kWh, 4.5 kWh, 6 kWh బ్యాటరీ వేరియంట్లు ఉన్నాయి. టాప్ వేరియంట్ గరిష్టంగా 126 కి.మీ గరిష్ట వేగం, 248 కి.మీ. రేంజ్‌ని అందిస్తుంది. 6.8-అంగుళాల టీఎఫ్టీ టచ్‌స్క్రీన్, ప్రాక్సిమిటీ అన్‌లాక్, క్రూయిజ్ కంట్రోల్, పార్టీ మోడ్, ట్యాంపర్ అలర్ట్ వంటి స్మార్ట్ ఫీచర్లతో పాటు కృత్రిమ్ అసిస్టెంట్, స్మార్ట్‌వాచ్ యాప్, రోడ్ వంటి ఏఐ- పవర్డ్ ఫీచర్లతో వస్తుంది. మోటార్‌సైకిల్ ముందు, వెనుక వైపున డిస్క్ బ్రేక్‌లు, ఏబీఎస్ బ్రేకింగ్ సిస్టమ్ ఉన్నాయి. 3.5 kWh మోడల్ ధర రూ. 1,04,999, 4.5 kWh రూ.1,19,999, 6 kWh ధర రూ.1,39,999.ఓలా రోడ్‌స్టర్ ప్రోఈ శ్రేణి మోటర్ సైకిళ్లు 52 kW గరిష్ట పవర్ అవుట్‌పుట్, 105 Nm టార్క్‌తో కూడిన మోటారుతో వస్తాయి. 16 kWh వేరియంట్ 194 kmph గరిష్ట వేగాన్ని అందుకుంటుంది. 579 కిమీ రేంజ్‌ను ఇస్తుంది. ఇది సెగ్మెంట్లో అత్యంత వేగవంతమైనది మాత్రమే కాకుండా అత్యంత సమర్థవంతమైన మోటార్‌సైకిల్‌గా కూడా నిలిచింది. రోడ్‌స్టర్ ప్రోలో 10-అంగుళాల TFT టచ్‌స్క్రీన్, USD (అప్‌సైడ్ డౌన్) ఫోర్క్‌లు, ముందు, వెనుక డిస్క్ బ్రేక్‌లకు ఏబీఎస్ సిస్టమ్ ఇచ్చారు. ఇందులో 8 kWh వేరియంట్ ధర రూ. 1,99,999, 16 kWh వేరియంట్ ధరను రూ. 2,49,999 లుగా కంపెనీ పేర్కొంది. -
సోమనాథ్ ఆలయంలో ఓలా సీఈఓ పూజలు (ఫోటోలు)
-
‘ఓలా మా డేటా కాపీ చేసింది’
స్వదేశీ డిజిటల్ మ్యాపింగ్ సేవల సంస్థ మ్యాప్ మై ఇండియా తన డేటాను ఓలా ఎలక్ట్రిక్ కాపీ చేసిందని ఆరోపించింది. ఓలా మ్యాప్స్‌లో సంస్థ తయారుచేసిన మ్యాప్ డేటాను వాడుతున్నట్లు మ్యాప్ మై ఇండియా చెప్పింది. గతంలో ఇరు కంపెనీలు చేసుకున్న ఒప్పందాన్ని ఓలా ఎలక్ట్రిక్ ఉల్లంఘించిందని తెలియజేస్తూ కోర్టును ఆశ్రయించింది.ఓలా ఎలక్ట్రిక్ బైక్‌లో మ్యాపింగ్ సేవలందించేందుకు రెండు కంపెనీలు గతంలో ఒప్పందం చేసుకున్నాయి. అయితే మ్యాప్ మై ఇండియా మాతృ సంస్థ సీఈ ఇన్ఫో సిస్టమ్స్ ద్వారా ‘కో-మింగ్లింగ్’, రివర్స్ ఇంజినీరింగ్, ఏపీఐ(అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్), ఎస్డీకే(సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్)లోని కీలక మ్యాప్ డేటా వివరాలను ఒప్పందానికి విరుద్ధంగా ఓలా కంపెనీ కాపీ చేసినట్లు ఆరోపణల్లో తెలిపింది. ఓలా ఒప్పంద నియమాలను ఉల్లంఘించినందుకు కోర్టులో దావా వేసినట్లు మ్యాప్ మై ఇండియా పేర్కొంది. ఈమేరకు మ్యాప్ మై ఇండియా సీఈ ఇన్ఫో సిస్టమ్స్ ద్వారా ఓలాకు నోటీసులు పంపించింది.ఈ వ్యవహారంపై ఓలా స్పందిస్తూ..మ్యాప్ మై ఇండియా చేసిన ఆరోపణనలను తీవ్రంగా ఖండించింది. సీఈ ఇన్ఫో సిస్టమ్స్ చేసిన వాదనలను తోసిపుచ్చింది. ఈ ఆరోపణలు దురుద్దేశపూరితమైనవని, తప్పుదోవ పట్టించేవని తెలిపింది. ఓలా ఎలక్ట్రిక్ వ్యాపార పద్ధతుల సమగ్రతకు కట్టుబడి ఉందని పేర్కొంది. మ్యాప్ మై ఇండియా పంపిన నోటీసుకు త్వరలో తగిన విధంగా స్పందిస్తామని చెప్పింది.ఇదీ చదవండి: రూ.1,799కే 4జీ ఫోన్!ఇదిలాఉండగా, జులై మొదటివారంలో ఓలా ప్లాట్‌పామ్‌లో గూగుల్ మ్యాప్స్‌ను వినియోగించబోమని ఓలా ఎలక్ట్రిక్ తెలిపింది. ఇందుకు ప్రత్యామ్నాయంగా ప్రత్యేక సొంత లొకేషన్ ఇంటెలిజెన్స్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ప్రకటించింది. గూగుల్ మ్యాప్స్‌తో ఒప్పందం రద్దు చేసుకోవడం వల్ల కంపెనీకి ఏటా రూ.100 కోట్లు ఆదా అవుతాయని పేర్కొంది. గ్లోబల్ మ్యాపింగ్ లీడర్ గూగుల్ భారతదేశంలోని కస్టమర్ల కోసం గూగుల్ మ్యాప్స్ ధరలను 70 శాతం తగ్గించడం గమనార్హం. -
టెకీలూ.. ఆఫీసులకు కుర్తా వేసుకురండి
టెకీలు, ఐటీ ఉద్యోగులు ఆఫీసులకు ఎలాంటి దస్తులు వేసుకుని వస్తారు..? చక్కగా సూటు బూటు వేసుకుని వస్తారు. కానీ కుర్తాలు వేసుకుని రావాలని చెబుతున్నారు ఓలా వ్యవస్థాపకుడు, సీఈవో భవిష్ అగర్వాల్.ఏఎన్ఐకి చెందిన స్మితా ప్రకాష్‌తో జరిగిన ఒక ఇంటర్వ్యూలో భవిష్ అగర్వాల్ మాట్లాడుతూ.. భారతీయులందరూ పాశ్చాత్య దుస్తులకు స్వస్తి పలికి కుర్తాలను ధరించాలని సూచించారు.“మనం కుర్తాలో మరింత సౌకర్యవంతంగా ఉండవచ్చు. ఇది ప్రత్యేకంగా భారతీయమైనది. నా దృష్టిలో, కుర్తా చాలా సొగసైన డ్రెస్. భారతీయులందరూ, ముఖ్యంగా యువ సాంకేతిక నిపుణులు కుర్తాలను ధరించాలని నేను అనుకుంటున్నాను” అని అగర్వాల్ అన్నారు.జూలై 8న షేర్ చేసిన ఈ పాడ్‌కాస్ట్ కొద్ది సమయంలోనే ట్రాక్‌ని పొందింది. చాలా మంది అగర్వాల్ భావాలతో ఏకీభవించడంతో కామెంట్ సెక్షన్ సానుకూల స్పందనలతో నిండిపోయింది. -
గూగుల్ మ్యాప్స్‌తో ఒప్పందం రద్దు.. రూ.100 కోట్లు ఆదా!
ప్రముఖ ఆన్లైన్ క్యాబ్ సర్వీస్ సంస్థ ఓలా గూగుల్ మ్యాప్స్ నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించింది. ఇకపై ఓలా క్యాబ్స్ ప్లాట్‌పామ్‌లో గూగుల్ మ్యాప్స్‌ను వినియోగించబోమని తెలిపింది. ఇందుకు ప్రత్యామ్నాయంగా ప్రత్యేక లొకేషన్ ఇంటెలిజెన్స్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పింది. గూగుల్ మ్యాప్స్‌తో ఒప్పందం రద్దు చేసుకోవడం వల్ల కంపెనీకి ఏటా రూ.100 కోట్లు ఆదా అవుతాయని సంస్థ సహ వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘ఓలా క్యాబ్ సర్వీస్‌ల్లో గూగుల్ మ్యాప్స్‌ను రద్దు చేస్తున్నాం. ఇందుకు ప్రత్యామ్నాయంగా ప్రత్యేక లొకేషన్ ఇంటెలిజెన్స్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చాం. గూగుల్‌తో ఒప్పందం రద్దు చేసుకోవడం వల్ల కంపెనీకు ఏటా రూ.100 కోట్లు ఆదా అవుతుంది. కొత్త సర్వీసులు అందుబాటులోకి రావాలంటే వినియోగదారులు తమ ఓలా యాప్‌ను అప్డేట్ చేసుకోవాలి. ఓలా లొకేషన్ ఇంటెలిజెన్స్‌లో స్ట్రీట్ వ్యూ, ఇండోర్ చిత్రాలు, డ్రోన్ మ్యాప్‌లు, 3డీ మ్యాప్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి’ అని చెప్పారు.ఓలా క్లౌడ్ సర్వీస్‌లను గతంలో మైక్రోసాఫ్ట్ అజూర్ నిర్వహించేది. కానీ ఇటీవల ఆ సంస్థతో కార్యకలాపాలు నిలిపేస్తున్నట్లు ఓలా ప్రకటించింది. అజూర్ స్థానంలో ‘క్రుత్రిమ్ ఏఐ క్లౌడ్’ సేవలు వినియోగించుకుంటున్నామని కంపెనీ తెలిపింది. ఈ క్రుత్రిమ్ ఏఐ మ్యాపింగ్ సొల్యూషన్స్‌ను కూడా అందిస్తుందని పేర్కొంది. త్వరలో ఈ క్లౌడ్‌లో మరిన్ని ప్రోడక్ట్ అప్డేట్లు వస్తాయని చెప్పింది.ఇదీ చదవండి: సంగీత్‌లో అదిరిపోయే స్టెప్పులేసిన అంబానీ కుటుంబంఅక్టోబర్ 2021లో ఓలా పుణెకు చెందిన జియోసాక్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సంస్థ ‘జియోస్పేషియల్’ సేవలను అందిస్తోంది. గూగుల్ మ్యాప్స్ స్థానంలో ఓలా క్యాబ్స్ జియోసాక్ సేవలు వినియోగించుకుంటుంది. దాంతో కంపెనీకు ఏటా రూ.100 కోట్లు ఆదా అవుతుంది. -
‘ఓలా అలా కాదు’.. మహిళా నియామకాలపై భవిష్ అగర్వాల్
ఫాక్స్‌కాన్ నియామక పద్ధతులపై వచ్చిన వార్తలపై ఓలా వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ భవీష్ అగర్వాల్ స్పందించారు. తమ కొత్త కర్మాగారాల్లో వివాహితలతో సహా మహిళల నియామకం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. వివాహితలను నియమించుకోవడంపై ఓలాకు ఎటువంటి వ్యతిరేక విధానం లేదని అగర్వాల్ పేర్కొన్నారు.ఇటీవల ఓ మీడియా సమావేశంలో భవిష్ అగర్వాల్ మాట్లాడుతూ.. 'మహిళలు ఎక్కువ క్రమశిక్షణ, నైపుణ్యంతో ఉంటారు. మేము మా కర్మాగారాలలో మహిళా శ్రామిక శక్తిని నియమించడం కొనసాగిస్తాం. పెళ్లైన మహిళలను నియమించుకోకూడదనే ఫాక్స్‌కాన్ లాంటి విధానాలు మా దగ్గర లేవు’ అన్నారు.భారత్‌లో మహిళా శ్రామిక శక్తి తక్కువగా ఉందని, దీనిని పరిష్కరించడానికి తమ వంతు కృషి చేస్తున్నామని భవిష్ అగర్వాల్ పేర్కొన్నారు. ప్రస్తుతం జూనియర్ స్థాయి ఉద్యోగాల్లో మహిళలను ఎక్కువగా నియమించుకుంటున్నామని, సీనియర్ మేనేజ్మెంట్ స్థాయిలో కూడా మరింత మంది మహిళలను నియమించేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు.కాగా మహిళా శ్రామిక శక్తిని పెంపొందించడంపై ఓలా ఎలక్ట్రిక్ గతంలోనే తమ వైఖరిని ప్రకటించింది. "ఈ రోజు, ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీని పూర్తిగా మహిళలే నడుపుతారని ప్రకటించడానికి నేను గర్విస్తున్నాను. ఈ వారం మేము మొదటి బ్యాచ్ ను స్వాగతించాం. పూర్తి సామర్థ్యంతో, ఫ్యూచర్ ఫ్యాక్టరీ 10,000 మందికి పైగా మహిళలకు ఉపాధి కల్పిస్తుంది, ఇది మహిళలకు మాత్రమే పనిచేసే ప్రపంచంలోనే అతిపెద్ద కర్మాగారం, ఏకైక మహిళా ఆటోమోటివ్ తయారీ కేంద్రంగా మారుతుంది'' అని బ్లాగ్ పోస్ట్‌లో భవిష్ అగర్వాల్ పేర్కొన్నారు.యాపిల్ ఉత్పత్తుల అతిపెద్ద సరఫరాదారు అయిన ఫాక్స్‌కాన్ భారత్‌లోని తన ఐఫోన్ కర్మాగారంలో వివాహిత మహిళలను ఉద్యోగాలకు తిరస్కరిస్తున్నట్లు ఇటీవలి పరిశోధనాత్మక నివేదిక బహిర్గతం చేసింది. తమిళనాడులోని శ్రీపెరంబుదూరులో ఉన్న ప్రధాన ఐఫోన్ అసెంబ్లింగ్ ఫ్యాక్టరీలో వివాహిత మహిళలను ఉద్యోగావకాశాల నుంచి తప్పించారని నివేదిక ఆరోపించింది. -
అజ్యూర్‌కు ఓలా గుడ్‌బై.. మైక్రోసాఫ్ట్‌కు 100 కోట్ల నష్టం?
ప్రముఖ దేశీయ క్యాబ్ సర్వీస్ దిగ్గజం ఓలా..మైక్రోసాఫ్ట్ మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సర్వీస్ అజ్యూర్‌కు స్వస్తి పలికిన విషయం తెలిసిందే. ఓలా తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా మైక్రోసాఫ్ట్ ఇండియాకు దాదాపూ రూ.100 కోట్ల మేర నష్టం వాటిల్లే అవకాశం ఉందనే అంచనాలు నెలకొన్నాయి.ఇటీవల ఓలా సీఈవో భవీష్ అగర్వాల్ మైక్రోసాఫ్ట్‌కు చెందిన లింక్డిన్ ఏఐలో బాట్లో తన గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు. భవీష్ అగర్వాల్ ఎవరు? అని సెర్చ్ చేశారు. దీనికి బాట్ అతడు/ ఆయన ఉండాల్సిన చోటు వారు/ వాళ్లు ఉండడం చూసి.. అనే సమాధానం ఇచ్చింది. అంతే ఈ సమాధానాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ భవిష్ లింక్డిన్లో ఓ పోస్ట్ పెట్టారు. తమ నిబంధనలకు విరుద్దం అంటూ ఆ పోస్ట్‌ను లింక్డిన్ డిలీట్ చేసింది. లింక్డిన్ పోస్ట్ తన పోస్ట్ డిలీట్ చేయడంతో లింక్డిన్ మాతృ సంస్థ మైక్రోసాఫ్ట్‌పై భవిష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే వారంలోగా మైక్రోసాఫ్ట్ అజ్యూర్ క్లౌట్ కంప్యూటింగ్ సేవలకు స్వస్తి పలకాలని తమ కంపెనీ నిర్ణయించినట్లు తెలిపారు. మైక్రోసాఫ్ట్ యాజమాన్యంలోని లింక్డిన్ తీరు కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఫలితంగా మైక్రోసాఫ్ట్ వందల కోట్లలో నష్టం వాటిల్లనుందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. -
‘నేనెవరో మీకు తెలియదు’..మైక్రోసాఫ్ట్‌కి షాకిచ్చిన భవిష్ అగర్వాల్
ప్రముఖ దేశీయ క్యాబ్ సర్వీస్ దిగ్గజం ఓలా.. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌కు షాకిచ్చింది. లింక్డిన్లో దొర్లిన తప్పిదం కారణంగా మాతృ సంస్థ మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సర్వీస్ అజ్యూర్‌కు గుడ్‌బై చెప్పింది. ఇకపై అజ్యూర్‌ను వినియోగించేది లేదని తేల్చి చెప్పింది. ప్రత్యామ్నాయంగా ఓలా గ్రూప్‌నకే చెందిన కృత్రిమ్ ఏఐ క్లౌడ్ సేవలను వినియోగించుకోనున్నట్లు కంపెనీ వ్యవస్థాపకుడు భవీశ్ అగర్వాల్ ప్రకటించారుఇటీవల భవీష్ అగర్వాల్ తన గురించి తాను తెలుసుకునేందుకు లింక్డిన్ ఏఐ బాట్లో భవీష్ అగర్వాల్ ఎవరు? అని సెర్చ్ చేశారు. దీనికి బాట్ అతడు/ ఆయన ఉండాల్సిన చోటు వారు/ వాళ్లు ఉండడం చూసి.. అనే సమాధానం ఇచ్చింది. ఈ సమాధానాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన భవీష్ పాశ్చాత్య విధానాల్ని గుడ్డిగా అనుసరిస్తే ఇలాగే ఉంటుందంటూ కామెంట్ చేశారు.ఆ కామెంట్లతో లింక్డిన్ తమ నిబంధనలకు విరుద్దంగా భవిష్ పోస్ట్ ఉందంటూ దానిని లింక్డిన్ డిలీట్ చేసింది. దీంతో లింక్డిన్ నిర్ణయాన్ని వ్యతిరేకించిన భవీష్.. మైక్రోసాఫ్ట్ అజ్యూర్‌కు గుడ్ బై చెప్పారు. లింక్డిన్ చర్యతో మైక్రోసాఫ్ట్ అజ్యూర్‌ను వినియోగించుకోబోమని స్పష్టం చేశారు. ఇటీవలే కృత్రిమ్ క్లౌడ్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఆ సేవల్ని వినియోగించుకుంటామని ఓలా సీఈఓ భవీష్ అగర్వాల్ ప్రకటించారు. -
చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
ప్రముఖ క్యాబ్ సర్వీస్ సంస్థ ఓలా క్యాబ్స్‌లో కీలక పరిణామం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. బాధ్యతలు చేపట్టిన మూడు నెలలకే ఆ సంస్థ సీఈఓ పదవికి హేమంత్ బక్షి రాజీనామా చేసినట్లు సమాచారం. దీంతో పాటు సంస్థ పునర్నిర్మాణంలో భాగంగా ఓలా క్యాబ్స్ దాదాపు 200 మంది ఉద్యోగుల్ని తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయిఐపీఓకి ఓలా ఓలా క్యాబ్స్ ఐపీఓ వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. ఇందుకోసం ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్‌తో ఓలా క్యాబ్స్ ఇటీవలే చర్చలు నిర్వహించింది. మరో రెండు మూడు నెలల్లో సెబీకి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఓలా ఎలక్ట్రిక్ ఇప్పటికే ఐపీఓ కోసం సెబీకి దరఖాస్తు చేసుకుంది.ఈ తరుణంలో సీఈఓ రాజీనామా, ఉద్యోగుల తొలగింపు అంశం ఓలా క్యాబ్స్ చర్చాంశనీయంగా మారింది. కాగా, ఓలా క్యాబ్స్ వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. -
అత్యంత చౌకగా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు
ఎలక్ట్రిక్ బైక్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకో శుభవార్త. ప్రముఖ ఎలక్ట్రిక్ బైక్ దిగ్గజం ఓలా కీలక ప్రకటన చేసింది. తన తక్కువ ధర ఎస్1 ఎక్స్ మోడల్ ధరల్ని మరింత తగ్గిస్తున్నట్లు తెలిపింది. గతంలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లను పెంచేందుకు కేంద్రం ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఎలక్ట్రిక్ బైక్‌లకు సబ్సిడీ ఇచ్చేది. ఆ తర్వాత ఆ సబ్సిడీపై కోత విధించింది. దీంతో అప్పటి వరకు ఊపందుకున్న ఈవీ కొనుగోళ్లు, అమ్మకాలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో తమ వాహనల అమ్మకాల్ని పెంచేందుకు ఓలా ఎలక్ట్రిక్ తన చౌకైన వేరియంట్ ధరను 12.5శాతం తగ్గించిందని,తద్వారా అమ్మకాలు పెంచుకోవచ్చని భావిస్తుంది. ఓలా దాని ఎస్1ఎక్స్ మోడల్ చౌకైన వేరియంట్ ధర రూ.79,999 నుండి రూ.69,999లకు తగ్గించిందని కంపెనీ మార్కెటింగ్ చీఫ్ అన్షుల్ ఖండేల్వాల్ తెలిపారు. ఇతర ఎస్1ఎక్స్ వేరియంట్ల ధరలు 5.6 శాతం, 9.1శాతం మధ్య తగ్గించినట్లు సమాచారం. ' ఓలా ఎస్1 ఎక్స్ (4కేడబ్ల్యూహెచ్) ఇప్పుడు దాని ధర రూ.1.09 లక్షల నుండి రూ.10,000 తగ్గి రూ.99,999 చేరింది. 3 డబ్ల్యూకేహెచ్ వేరియంట్ ధర రూ.84,999 కాగా.. 2కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో వచ్చే చవకైన వెర్షన్ రూ. 69,999 ప్రారంభ ధరకే అందుబాటులో ఉంది. -
విదేశాల్లో ఓలా క్యాబ్స్ షట్‌డౌన్.. కారణం ఏంటంటే?
ప్రముఖ దేశీయ రైడ్ షేరింగ్ దిగ్గజం ఓలా క్యాబ్స్ కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయంగా యూకే, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్‌లలో తన సేవల్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ చివరి నాటికి అంతర్జాతీయ ఓలా క్యాబ్స్ సేవలకు స్వస్తి పలకనుంది. ఓలా క్యాబ్స్ ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తన అంతర్జాతీయ యూజర్లకు నోటిఫికేషన్ పంపింది. సంస్థ 2018లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో తన సేవల్ని ప్రారంభించింది. అంతర్జాతీయ మార్కెట్‌కు ఓలా గుడ్‌బై కాగా, తమ దేశంలో ఓలా సేవలను మూసివేయడంపై ఆస్ట్రేలియన్ మీడియా గతంలోనే అనేక కథనాలు ప్రచురించింది. మీడియా సంస్థ ఆస్ట్రేలియన్ ఫైనాన్షియల్ రివ్యూ డ్రైవర్లకు ఓలా పంపిన ఇమెయిల్‌ను ఉదహరించింది. ఏప్రిల్ 12 నుండి అన్ని సంబంధిత లేబుల్‌లను తీసివేయమని, దాని పర్మిట్ల కింద బుకింగ్‌లు తీసుకోవడం ఆపివేయమని కోరింది. అదే తేదీ నుండి సంస్థ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు కస్టమర్లకు పంపిన ఇమెయిల్‌ను న్యూస్.కామ్.ఏయూ అనే మీడియా సంస్థ హైలెట్ చేసింది. కారణం ఇదేనా క్యాబ్ ఇంధన వాహనాల్ని ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చాలంటూ ఆయా దేశాల ప్రభుత్వాలు ఒత్తిడి చేస్తున్నాయి. క్యాబ్స్‌ను ఈవీలుగా మార్చాలంటే ఖర్చుతో కూడుకున్న పని. పెట్టుబడి కూడా భారీ మొత్తంలో పెట్టాలి. పైగా న్యూజిల్యాండ్, ఆస్ట్రేలియాల్లో విపరీతమైన పోటీ నెలకొంది. ఈ తరుణంలో ఓలా క్యాబ్స్ ఈ నిర్ణయం తీసుకుంది.భారత్‌లో విస్తరణకు మరింత అవకాశం ఉన్న నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్ నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నట్లు ఓలా ప్రతినిధులు చెబుతున్నారు.