పండగ సీజన్ వస్తుందంటేనే చాలా కంపెనీలు ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. అందులో భాగంగా ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ స్కూటర్ తయారీ కంపెనీ ఓలా ఆఫర్ వెల్లడించింది. సంస్థ తయారు చేసిన ఎస్1 బేసిక్ మోడల్‌ను రూ.50 వేల నుంచి అందిస్తున్నట్లు కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. అదికాస్తా వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఈ మోడల్ ధర సుమారు రూ.80 వేలు వరకు ఉంది.
ఎలక్ట్రిక్ వాహనాల్లో ప్రధానంగా బ్యాటరీకే ఎక్కువగా ఖర్చు అవుతుంది. చాలా కంపెనీలు బ్యాటరీతోపాటు టెక్నాలజీను అందిస్తున్నాయి. దాంతో వాహనాల తయారీ వ్యయం పెరుగుతోంది. ఈ పండగ సీజన్‌లో ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేయాలనుకునే వారికి ఓలా ప్రకటన కొంత ఆకర్షణీయంగా కనిపించే అవకాశం ఉంది. అయితే వినియోగదారులు తమ అవసరాలు, వాహనంలోని సౌకర్యాలు, మన్నిక, ఇప్పటికే ఆ వాహనాన్ని ఎవరైనా వాడుతుంటే తమ అభిప్రాయం..వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. మార్కెట్‌లో చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను అందిస్తున్నాయి. వాటిలో కస్టమర్ల అవసరాలు, ఆర్థిక వ్యయాన్ని పరిగణించి సౌకర్యంగా ఉండే వాహనాన్ని కొనుగోలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రధానంగా ఆఫర్లకు మొగ్గు చూపకుండా వాహనం నాణ్యతకు పెద్దపేట వేయాలని చెబుతున్నారు.
ఇదీ చదవండి: రోజూ 50 కోట్ల లావాదేవీలు..!
Comments
Please login to add a commentAdd a comment