festive offers
-
పెట్రోల్, డీజిల్‌పై రూ.5 తగ్గింపు!
వాహనదారులకు శుభవార్త. పెట్రోల్, డీజిల్‌పై రూ.5 వరకు తగ్గిస్తున్నట్లు ప్రైవేటురంగ ఇంధన రిటెయిలింగ్ సంస్థ నయారా ఎనర్జీ ప్రకటించింది. అయితే అందుకు కనీసం రూ.1000 వరకు పెట్రోల్ లేదా డీజిల్ నింపుకోవాల్సి ఉంటుంది. పండగ సీజన్లో నయారా ఎనర్జీ ‘సబ్ కీ జీత్ గ్యారంటీడ్ 2024’ పేరుతో ఈ ఆఫర్‌ను ప్రారంభించింది.ఈ ఆఫర్ జనవరి 31, 2025 వరకు కొనసాగుతుందని కంపెనీ తెలిపింది. ఈ తగ్గింపును పొందాలంటే కస్టమర్లు డిజిటల్ పేమెంట్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా ఇంధన కొనుగోళ్లు చేయాల్సి ఉంటుంది. ఈ ఆఫర్‌తో పెట్రోల్, డీజిల్‌పై వినియోగదారులకు డబ్బు ఆదా అవ్వడంతోపాటు డిజిటల్ చెల్లింపులను కూడా ప్రోత్సహించేందుకు దోహదపడుతుందని కంపెనీ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ మాధుర్ తనేజా వెల్లడించారు.ఇదీ చదవండి: దిగుమతులపై ఆందోళన అక్కర్లేదునయారా ఎనర్జీ రష్యాకు చెందిన రాస్‌నెఫ్ట్, కెసని ఎంటర్ప్రైజెస్ యాజమాన్యంలో నడుస్తోంది. ఇది ఒక ప్రైవేట్ ఆయిల్ రిఫైనింగ్ అండ్ మార్కెటింగ్ కంపెనీ. నయారా ఎనర్జీ గుజరాత్‌లోని వడినార్‌లో రెండో అతిపెద్ద సింగిల్ సైట్ రిఫైనరీని నిర్వహిస్తోంది. ఇది దేశంలో 6,600 రిటైల్ ఫ్యూయల్ అవుట్లెట్లను కలిగి ఉంది. హైదరాబాద్‌లోనూ చాలాచోట్ల ఈ కంపెనీ బంక్‌లున్నాయి. -
క్రెడిట్ కార్డులపై దీపావళి ఆఫర్లు
దేశీయ కన్స్యూమర్ క్రెడిట్ మార్కెట్‌ప్లేస్ పైసాబజార్ పలు క్రెడిట్ కార్డ్‌లపై ప్రత్యేక పండుగ ఆఫర్లను వెల్లడించింది. పైసాబజార్ ద్వారా కొత్త క్రెడిట్ కార్డ్‌లను తీసుకునేవారికి గిఫ్ట్ కార్డ్‌లను అందిస్తోంది.నిర్దిష్ట అమెరికన్ ఎక్స్‌ప్రెస్, హెచ్ఎస్బీసీ కార్డ్‌ల కోసం దరఖాస్తు చేసుకున్న కస్టమర్లు రూ.1,500 విలువైన అమెజాన్ గిఫ్ట్ కార్డ్‌ని అందుకుంటారు. హచ్ఎస్బీసీ వీసా ప్లాటినం క్రెడిట్ కార్డ్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ ప్లాటినం ట్రావెల్ క్రెడిట్ కార్డ్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ మెంబర్షిప్ రివార్డ్స్ క్రెడిట్ కార్డ్, హెచ్ఎస్బీసీ లైవ్+ క్రెడిట్ కార్డ్ వంటివి వాటిలో ఉన్నాయి.హెచ్డీఎఫ్సీ బిజినెస్ రెగాలియా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డైనర్స్ క్లబ్ బ్లాక్ మెటల్ ఎడిషన్ క్రెడిట్ కార్డ్, మర్రియోట్ బన్వాయ్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, హెచ్డీఎఫ్సీ రెగాలియా గోల్డ్ క్రెడిట్ కార్డ్, అట్లాస్ క్రెడిట్ కార్డ్, యాక్సిస్ బ్యాంక్ మాగ్నస్ క్రెడిట్ కార్డ్ వంటివాటిపై పైసాబజార్ అదనంగా రూ. 1,000 అమెజాన్ గిఫ్ట్ కార్డ్‌ను అందిస్తోంది.అమెజాన్‌లో వివిధ రకాల కొనుగోళ్ల కోసం ఉపయోగించగల ఈ వోచర్లను క్రెడిట్ కార్డ్‌లు యాక్టివేట్ అయినప్పుడు అందుకోవచ్చు.పైసాబజార్ ప్రకారం.. ఈ ఆఫర్లు పండుగ సీజన్లో కొద్దికాలం మాత్రమే అందుబాటులో ఉంటాయి. పైసాబజార్ ప్రస్తుతం పదికిపైగా బ్యాంకులతో భాగస్వామ్యం ద్వారా 60కిపైగా క్రెడిట్ కార్డులను అందిస్తోంది. -
అదిరిపోయే ఆఫర్.. విమానం ఎక్కేయండి చవగ్గా!
పండుగల సీజన్ సమీపిస్తున్న తరుణంలో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించింది. ఎయిర్‌లైన్ 'ఫ్లాష్ సేల్' ఆఫర్ల కింద కేవలం రూ. 1606 ప్రారంభ ధరతో విమాన టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు.దీని ద్వారా ప్రయాణికులు దేశంలోని ప్రధాన నగరాల మధ్య తక్కువ ధరలో ప్రయాణించే అవకాశం ఉంది. గౌహతి-అగర్తలా, కొచ్చి-బెంగళూరు, చెన్నై-బెంగళూరు, విజయవాడ-హైదరాబాద్ వంటి ప్రముఖ మార్గాలలో ఈ ఆఫర్ అందుబాటులో ఉంది.ఫ్లాష్ సేల్ కింద బుకింగ్ 27 అక్టోబర్ 2024 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ప్రయాణ తేదీలు నవంబర్ 1 నుండి డిసెంబర్ 10 వరకు ఉంటాయి. కొత్త గమ్యస్థానంలో పండుగను ఆస్వాదించాలనుకునే ప్రయాణీకులకు ఇది గొప్ప అవకాశం.ఇతర ఆఫర్లుఫ్లాష్ సేల్‌తో పాటు ఎయిర్‌లైన్ ఎక్స్‌ప్రెస్ లైట్ ఆఫర్‌ను కూడా ప్రకటించింది. దీనిలో విమాన టిక్కెట్లను బుకింగ్ చేయడానికి ప్రారంభ ధర కేవలం రూ.1456. దీని కింద ప్రయాణికులకు అందనంగా జీరో కన్వీనెన్స్ ఫీజు ప్రయోజనం కూడా ఉంటుంది. అంతేకాకుండా ఎక్స్‌ప్రెస్ లైట్ అదనపు 3 కిలోల క్యాబిన్ సామాను ఉచిత ప్రీ-బుకింగ్, చెక్-ఇన్ బ్యాగేజీ ధరలపై తగ్గింపు వంటి ప్రయోజనాలు కూడా ఉన్నాయి.ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించే లాయల్టీ సభ్యులు 50% తగ్గింపు రుసుముతోనే బిజినెస్ సీట్లకు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. 'గౌర్మెట్' హాట్ మీల్స్, సీట్లపై 25% తగ్గింపు, ఎక్స్‌ప్రెస్ ఎహెడ్ ప్రాధాన్యతా సేవలను కూడా పొందవచ్చు. అలాగే విద్యార్థులు, సీనియర్ సిటిజన్లు, వైద్యులు, నర్సులు, సాయుధ దళాల సిబ్బంది ఎయిర్‌లైన్ వెబ్సైట్లో ప్రత్యేక తగ్గింపుతో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. -
భారీగా తగ్గిన ఎలక్ట్రిక్ స్కూటర్ ధర.. ఎంతంటే.?
పండగ సీజన్ వస్తుందంటేనే చాలా కంపెనీలు ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. అందులో భాగంగా ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ స్కూటర్ తయారీ కంపెనీ ఓలా ఆఫర్ వెల్లడించింది. సంస్థ తయారు చేసిన ఎస్1 బేసిక్ మోడల్‌ను రూ.50 వేల నుంచి అందిస్తున్నట్లు కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. అదికాస్తా వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఈ మోడల్ ధర సుమారు రూ.80 వేలు వరకు ఉంది.ఎలక్ట్రిక్ వాహనాల్లో ప్రధానంగా బ్యాటరీకే ఎక్కువగా ఖర్చు అవుతుంది. చాలా కంపెనీలు బ్యాటరీతోపాటు టెక్నాలజీను అందిస్తున్నాయి. దాంతో వాహనాల తయారీ వ్యయం పెరుగుతోంది. ఈ పండగ సీజన్లో ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేయాలనుకునే వారికి ఓలా ప్రకటన కొంత ఆకర్షణీయంగా కనిపించే అవకాశం ఉంది. అయితే వినియోగదారులు తమ అవసరాలు, వాహనంలోని సౌకర్యాలు, మన్నిక, ఇప్పటికే ఆ వాహనాన్ని ఎవరైనా వాడుతుంటే తమ అభిప్రాయం..వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. మార్కెట్లో చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను అందిస్తున్నాయి. వాటిలో కస్టమర్ల అవసరాలు, ఆర్థిక వ్యయాన్ని పరిగణించి సౌకర్యంగా ఉండే వాహనాన్ని కొనుగోలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రధానంగా ఆఫర్లకు మొగ్గు చూపకుండా వాహనం నాణ్యతకు పెద్దపేట వేయాలని చెబుతున్నారు.ఇదీ చదవండి: రోజూ 50 కోట్ల లావాదేవీలు..! -
పావుశాతం వరకు పెరిగిన అమ్మకాలు
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజ సంస్థలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఇండియా అమ్మకాలు గతేడాదితో పోలిస్తే ఈసారి 20-25 శాతం పెరిగాయి. వినియోగదారులను ఆకర్షించేందుకు ఇప్పటికే సంస్థలు వివిధ పేర్లతో ఫెస్టివల్ సేల్స్‌ను ప్రారంభించాయి. ఇందులో విభిన్న వస్తువులపై ఆఫర్లు ప్రకటిస్తున్నట్లు చెప్పాయి. దాంతో 27న(26న ప్రైమ్ వినియోగదారులకు వర్తించాయి.) మొదలైన అమ్మకాలు గతేడాది ఇదే సీజీన్లోని మొదటి మూడు రోజులతో పోలిస్తే ఈ సారి 20-25 శాతం వృద్ధి చెందినట్లు డాటమ్ ఇంటెలిజెన్స్ సంస్థ నివేదించింది.సంస్థ తెలిపిన వివరాల ప్రకారం..సెప్టెంబర్ 26(ఫ్లిప్‌కార్ట్ ప్లస్, అమెజాన్ ప్రైమ్ కస్టమర్లకు ఒకరోజు ముందుగానే ఆఫర్లు వర్తించాయి)-28 రోజుల్లో ఆన్లైన్ రిటైలర్ల అమ్మకాలు గత సంవత్సరంతో పోల్చితే దాదాపు 26% పెరిగాయి. సుమారు రూ.26,500 కోట్లు (3.2 బిలియన్ డాలర్లు) మేర వ్యాపారం జరిగినట్లు అంచనా. ఈ పండగ సీజన్ పూర్తయ్యే సమయానికి రూ.లక్ష కోట్లు (12 బిలియన్ డాలర్లు) స్థూల విక్రయాలు జరిగే అవకాశం ఉంది. ఇది గతేడాదితో పోలిస్తే 23% వృద్ధిని సూచిస్తుంది. ఆన్లైన్ రిటైల్ అమ్మకాల్లో ప్రధానంగా మొబైల్, ఎలక్ట్రానిక్స్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఇంటీరియర్ వస్తువులు, ఫ్యాషన్, గ్రోసరీ, బ్యూటీ, పర్సనల్ కేర్ వస్తువులు కొనేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపుతున్నారు.ఇదీ చదవండి: ఒక్కరోజులోనే రూ.నాలుగు లక్షల కోట్లు ఆవిరి!కంపెనీలు ఇలాంటి ఫెస్టివ్ సీజన్లో ఆఫర్లు తీసుకురావడం సహజం. కానీ కొనాలనుకునే వస్తువుపై ఏదోఒక ఆఫర్ ఉందని కొంటున్నామా? లేదా నిజంగా ఆ వస్తువు అవసరమై కొంటున్నామా..అనేది చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. కంపెనీలు ఆఫర్ల ట్రాప్‌లో పడి విచ్చలవిడిగా షాపింగ్ చేసి అప్పులపాలు కాకూడదని సూచిస్తున్నారు. ప్రధానంగా చాలామంది క్రెడిట్‌కార్డులు వాడుతూ, ఈఎంఐ ఎంచుకుంటూ వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇప్పటికే మీకు ఇతర ఈఎంఐలు ఉంటే మాత్రం జాగ్రత్తపడాలని చెబుతున్నారు. నెలవారీ సంపాదనలో కేవలం 20-25 శాతం మాత్రమే ఈఎంఐలకు కేటాయించాలంటున్నారు. లేదంటే ఆర్థిక పరిస్థితిని సమీక్షించుకోవాల్సి ఉంటుందన్నారు. -
ఇదే మంచి తరుణం.. ప్రీమియం బైక్‌లపై భారీ డిస్కౌంట్లు
పండుగ సీజన్లో మంచి ప్రీమియం బండి కొనాలనుకుంటున్నవారికి ఇదే మంచి సమయం. జావా యెజ్డీ మోటార్‌సైకిల్స్ తమ బైక్‌లపై పలు ఆఫర్లను ప్రకటించింది. జావా/యెజ్డీ బండిని ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ నుండి బుక్ చేసుకుంటే వివిధ బ్యాంకులు అందించే డిస్కౌంట్లతో పాటు రూ.22,500 వరకు ఆదా చేసుకోవచ్చు.ఫ్లిప్‌కార్ట్‌లో జావా/యెజ్డీ బైక్‌లపై ఎలాంటి ఆఫర్లు ఉన్నాయంటే.. ఉదాహరణకు హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు రూ.8,500 తగ్గింపును పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు రూ. 12,500 నుండి రూ.22,500 వరకు స్ట్రెయిట్ అప్ డిస్కౌంట్‌తోపాటు రూ.10,000 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.జావా యెజ్డీ మోటార్‌సైకిళ్లపై కంపెనీ ప్రాంతాలవారీగానూ ఆఫర్లను అందిస్తోంది. దేశంలోని దక్షిణ, మధ్య, పశ్చిమ ప్రాంతాల్లోని కస్టమర్లు రూ.19,000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు. ఇందులో రూ. 10,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ , నాలుగు సంవత్సరాల లేబర్-ఫ్రీ పీరియాడిక్ సర్వీస్, నాలుగేళ్లు లేదా 50,000 కి.మీ వారంటీ ఉన్నాయి.తూర్పు ప్రాంత కస్టమర్లకు రూ.14,000 విలువైన ప్రయోజనాలను అందిస్తోంది. రూ.10,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌తో పాటు రూ.1,500 విలువైన రోడ్ సైడ్ అసిస్టెన్స్, రూ.2,500 విలువైన యాక్సెసరీలను పొందవచ్చు. ఇక ఉత్తర భారతదేశంలోని కస్టమర్లకు రూ.10,000 ఎక్స్చేంజ్ బోనస్ లభిస్తుంది. దీంతోపాటు సులభమైన ఫైనాన్స్ ఆఫర్లు కూడా అందిస్తున్నారు. కొత్త యెజ్డీ అడ్వెంచర్‌ని కొనుగోలు చేసేవారు రూ.16,000 విలువైన ట్రయల్ ప్యాక్ యాక్సెసరీస్ ప్యాకేజీని ఉచితంగా అందుకోవచ్చు. -
దీపావళి ఆఫర్స్.. ఇప్పుడు కొంటే మంచి బెనిఫిట్స్!
భారతదేశంలో పండుగ సీజన్ మొదలైపోయింది. కంపెనీలు తమ ఉత్పత్తులను ఎక్కువ సంఖ్యలో విక్రయించడానికి మంచి ఆఫర్స్ లేదా డిస్కౌంట్స్ అందిస్తాయి. ఈ సమయం కోసం ఎదురు చూసే చాలామంది కస్టమర్లు కొత్త వాహనాలను కొనుగోలు చేయడానికి ఎగబడుతుంటారు. మహీంద్రా, సిట్రోయెన్, స్కోడా కంపెనీలు ఇప్పటికే ఆఫర్స్ ప్రకటించేసాయి. తాజాగా ఇప్పుడు ఈ జాబితాలోకి మరి కొన్ని సంస్థలు చేరాయి. ఈ ఫెస్టివల్ సీజన్లో హ్యుందాయ్, మారుతి సుజుకి, హోండా వంటి కార్ డీలర్లు తమ లైనప్‌లో కొన్ని ఎంపిక చేసిన కార్ల మీద ఆకర్షణీయమైన తగ్గింపులు, ప్రయోజనాలను అందిస్తున్నారు. ఇందులో క్యాష్ డిస్కౌంట్స్, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, కార్పొరేట్ ఆఫర్లు ఉన్నాయి. ఇదీ చదవండి: పండుగ సీజన్లో గొప్ప ఆఫర్స్ - కార్లు కొనటానికి ఇదే మంచి సమయం ఏ కారుపై ఎంత వరకు బెనిఫిట్ హ్యుందాయ్ వెర్నా - రూ. 30,000 మారుతి సుజుకి డిజైర్ - రూ. 40,000 హోండా అమేజ్ - రూ. 70,000 స్కోడా స్లావియా - రూ. 75,000 ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ - రూ. 80,000 హోండా సిటీ - రూ. రూ. 90,000 Note: పండుగ సీజన్లో వాహన తయారీ సంస్థలు అందిస్తున్న డిస్కౌంట్లు ఒక నగరం నుంచి మరో నగరానికి మారుతూ.. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఖచ్చితమైన డిస్కౌంట్ వివరాలు తెలుసుకోవడానికి తప్పకుండా సమీపంలోని కంపెనీ అధికారిక డీలర్‌ను సంప్రదించి తెలుసుకోవాలి. -
ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ యూజర్లకు బంపరాఫర్!
న్యూఢిల్లీ: పండుగ సీజన్ సందర్భంగా క్రెడిట్ కార్డ్‌ల సంస్థ ఎస్బీఐ కార్డ్ తమ కస్టమర్ల కోసం ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటించింది. కన్జూమర్ డ్యూరబుల్స్, మొబైల్స్, ల్యాప్‌టాప్‌లు, ఫ్యాషన్, ఫర్నిచర్లాంటి ఉత్పత్తుల కొనుగోలుకు సంబంధించి ఈఎంఐ, క్యాష్‌బ్యాక్ మొదలైనవి అందిస్తున్నట్లు తెలిపింది. 2,700 పైచిలుకు నగరాల్లోని కస్టమర్లు 27.5 శాతం వరకు క్యాష్‌బ్యాక్, ఇన్స్టంట్ డిస్కౌంట్ వంటివి పొందవచ్చని సంస్థ ఎండీ అభిజిత్ చక్రవర్తి తెలిపారు. ఇందుకోసం ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, మింత్రా, రిలయన్స్ రిటైల్ గ్రూప్ మొదలైన ఆన్లైన్ సంస్థలతో కూడా జట్టు కట్టినట్లు తెలిపారు. అలాగే ఎల్జీ, సోనీ, ఒప్పో, వివో వంటి ప్రముఖ బ్రాండ్స్‌పై ఈఎంఐ ఆధారిత ఆఫర్లు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇవి నవంబర్ 15 వరకు ఉంటాయి. -
బ్యాంక్ డిపాజిట్లపై పండుగ ఆఫర్లు
న్యూఢిల్లీ: పండుగల సందర్భంగా బ్యాంక్‌లు రుణాలపై ప్రాసెసింగ్ చార్జీల రద్దు వంటి ఆఫర్లు ఇవ్వడం సాధారణంగా చూస్తుంటాం. కానీ, ఈ విడత బ్యాంక్‌లు డిపాజిట్లపై ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. మధ్య స్థాయి బ్యాంక్‌లు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లు సేవింగ్స్ డిపాజిట్లపై ప్రత్యేక రేట్లను ఆఫర్ చేస్తున్నాయి. మరిన్ని డిపాజిట్లను ఆకర్షించేందుకు అవి ఈ మార్గాన్ని ఎంచుకున్నట్టున్నాయి. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లు అయితే డిపాజిట్లపై ఏకంగా 9.50 శాతం వరకు వడ్డీని ఇస్తున్నాయి. రిటైల్ డిపాజిట్లలో పెద్దగా వృద్ధి లేకపోవడంతో, తమ డిపాజిట్ బేస్‌ను పెంచుకునేందుకు ఇటీవలి కాలంలో బ్యాంక్‌లు ప్రధానంగా బల్క్ డిపాజిట్లపై ఎక్కువగా ఆధారపడుతున్న పరిస్థితి నెలకొంది. అందుకే, బల్క్ డిపాజిట్ల కంటే రిటైల్ డిపాజిట్లకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా ఇటీవలే నాలుగు రకాల సేవింగ్స్ ఖాతాలను ప్రకటించింది. రూ.2 కోట్లలోపు రిటైల్ టర్మ్ డిపాజిట్లపై రేట్లను 0.50 శాతం వరకు పెంచింది. వివిధ కాలావధితో కూడిన బల్క్ డిపాజిట్లపై రేట్లను ఒక శాతం మేర పెంచింది. యస్ బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్, డీసీబీ బ్యాంక్ అయితే సేవింగ్స్ ఖాతా డిపాజిట్లపై ఏకంగా 7–8 శాతం రేటును ఆఫర్ చేస్తున్నాయి. సాధారణంగా ఏడాది టర్మ్ డిపాజిట్లపైనే ప్రస్తుతం ఈ రేటు లభిస్తుండడం గమనార్హం. కొన్ని బ్యాంకుల్లో 1–3 ఏళ్ల టర్మ్ డిపాజిట్ రేట్లు ఇంతకంటే తక్కువే ఉండడాన్ని గమనించొచ్చు. పండుగల సీజన్లో కస్టమర్లను ఆకర్షించేందుకు అధిక రేట్లతో ప్రత్యేక పథకాలను కూడా బ్యాంక్‌లు ప్రకటిస్తున్నాయి. ‘‘టర్మ్ డిపాజిట్ల కంటే సేవింగ్స్ రేట్లు అధికంగా ఉన్నాయి. ఇది చాలా అసహజంగా కనిపిస్తోంది. ఇది కేవలం మార్కెటింగ్ ఎత్తుగడే’’అని మాక్వేర్ రీసెర్చ్ పేర్కొంది. కాసా వృద్ధి కోసం పాట్లు బ్యాంకులకు కరెంట్ సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్లు (కాసా) చాలా కీలకం. సేవింగ్స్ ఖాతాల్లోని డిపాజిట్లపై సాధారణంగా 3–4 శాతం మించి బ్యాంక్‌లు రేట్లను ఆఫర్ చేయవు. కరెంట్ ఖాతాల్లోని డిపాజిట్లపై అసలు వడ్డీని ఆఫర్ చేయవు. దీంతో కాసా డిపాజిట్లపై బ్యాంకులకు అయ్యే వ్యయాలు చాలా తక్కువ. అందుకే బ్యాంక్‌లు కాసా డిపాజిట్ల వృద్ధిని ప్రాధాన్యంగా చూస్తుంటాయి. ఇటీవలి కాలంలో కాసా డిపాజిట్లలో పెద్దగా వృద్ధి లేకపోవడంతో, రుణాల వృద్ధిని కాపాడుకునేందుకు అవి నిధుల కోసం అవి సేవింగ్స్ డిపాజిట్లపై అధిక రేట్లను ఆఫర్ చేస్తున్నట్టుందని మాక్వేర్ రీసెర్చ్ తెలిపింది. మొత్తం డిపాజిట్ల వృద్ధిలో సేవింగ్స్ డిపాజిట్ల వృద్ధి 6–7 శాతం తక్కువగా ఉండడాన్ని ప్రస్తావించింది. దేశంలోని టాప్–6 బ్యాంక్‌లు మొత్తం సేవింగ్స్ డిపాజిట్లలో 55 శాతం వాటా కలిగి ఉన్నాయి. క్యూ1లో టర్మ్ డిపాజిట్లు ఇతర అన్ని విభాగాలతో పోలిస్తే అధికంగా 17.4 శాతం వద్ధి చెందినట్టు కేర్ రేటింగ్స్ నివేదిక తెలియజేస్తోంది. అదే సేవింగ్స్ డిపాజిట్లలో వృద్ధి కేవలం 4.9 శాతంగానే ఉంది. -
ఫెస్టివ్ బొనాంజా: కస్టమర్లకు బంపర్ ఆఫర్లు, ఐఫోన్ 15పై స్పెషల్ ఆఫర్
దేశీయ రెండో అతిపెద్ద బ్యాంక్ ఐసీఐసీఐ తన కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. పండుగ సీజన్ ప్రారంభంలో తన కస్టమర్లకు అద్భుతమైన ఆఫర్లు, తగ్గింపులు రూ. 26 వేల వరకు క్యాష్‌బ్యాక్‌తో ‘ఫెస్టివ్ బొనాంజా’ను ప్రారంభించినట్లు ప్రకటించింది. లేటెస్ట్ యాపిల్ ఐఫోన్ 15 పై ప్రత్యేక ఆఫర్ కూడా అందిస్తోంది. అంతేకాదు గృహ రుణాలు, వాహన రుణాలు ద్విచక్ర వాహన రుణాలపై త్వరలోనే గుడ్ న్యూస్‌ను అందించనున్నట్టు తెలిపింది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్‌లు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, రూపే క్రెడిట్ కార్డ్‌ల ద్వారా UPI , కార్డ్‌లెస్ EMI కొనుగోళ్లపై భారీ ప్రయోజనాలను పొందవచ్చు. నో-కాస్ట్ EMI సదుపాయం కూడా కస్టమర్లకు కూడా అందుబాటులో ఉంటాయి. ప్రధానంగా ఐఫోన్ 15పై నో-కాస్ట్ EMI ప్రత్యేక ఆఫర్ అందిస్తోంది. (రికార్డ్ సేల్స్: మోదీ పిలుపు, ఖాదీ గెలుపు) కస్టమర్లకు అద్భుతమైన ఆఫర్లను అందించే లక్ష్యంతో ప్రముఖ బ్రాండ్లు, ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లతో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేష్ ఝా తెలిపారు. ముఖ్యంగా బిగ్ బిలియన్ డేస్ సేల్ (అక్టోబర్ 8 - అక్టోబర్ 15 వరకు), మింత్రా బిగ్ ఫ్యాషన్ ఫెస్టివల్ (అక్టోబర్ 6 -అక్టోబర్ 19 వరకు), అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ కోసం ఫ్లిప్‌కార్ట్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు వెల్లడించారు. అలాగే గృహ, బైక్, ఫోర్‌వీలర్ వాహన రుణాలపై ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తామని కూడా తెలిపారు. (కళ్లద్దాల్నే నమ్ముకున్నాడు: కట్ చేస్తే..వేల కోట్ల వ్యాపారం, లగ్జరీ లైఫ్!) దీని ప్రకారం యాపిల్ ఐఫోన్ 15తోపాటు,ఎలక్ట్రానిక్స్, మొబైల్, ఫ్యాషన్, జ్యువెలరీ, ఫర్నిచర్, ట్రావెల్, ఫుడ్, ఇతర కేటగిరీలపై ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. మేక్మైట్రిప్, టాటా న్యూ, వన్‌ప్లస్, హెచ్‌పి, మైక్రోసాఫ్ట్, క్రోమా, రిలయన్స్ డిజిటల్, ఎల్జి, సోనీ, శాంసంగ్, తనిష్క్, తాజ్, స్విగ్గీ, జొమాటో వంటి ప్రధాన బ్రాండ్స్‌తో డీల్ కనుగుణంగా ఆఫర్లు పొందవచ్చు. కాగా ICICI బ్యాంక్ లిమిటెడ్‌కు జూన్ 30, 2023 నాటికి బ్యాంక్ మొత్తం ఆస్తులు రూ.16,47,000 కోట్లుగా ఉన్నాయి. -
ఎస్బీఐ గుడ్‌న్యూస్, హోంలోన్ ఆఫ్ర్ పొడిగింపు, ఇక కార్ లోన్లపై..!
SBI Festive Offer: దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది.పండుగ సీజన్లో కార్ లోన్ తీసుకునే కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. కొత్తగా కారు కనాలనుకునే కస్టమర్ల లోన్లపై తాజా ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేసింది. ఈ ఆఫర్ 2024, జనవరి 31 వరకు అందుబాటులో ఉంటుంది. హోమ్లోన్లపై రాయితీ పొడిగింపు అంతేకాదు హోమ్లోన్లపై అందిస్తున్న రాయితీని పొడిగించింది. గరిష్టంగా 65 బేసిస్ పాయింట్ల (bps) తగ్గింపును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇపుడు ఆఫర్నురానున్న ఫెస్టివ్ సీజన్ నేపథ్యంలో పొడిగించింది. డిసెంబరు 2023 దాకా తగ్గింపు వడ్డీరేట్లు వర్తిస్తాయిని బ్యాంకు వెల్లడించింది. (ఈ బ్యాంకు కస్టమర్లకు సర్ప్రైజ్: పండగ బొనాంజా) సంవత్సరానికి ఆటో రుణంపై బ్యాంకు MCLR రేటు 8.55 శాతం. గ్రీన్ కార్ లోన్ (ఎలక్ట్రిక్ వెహికల్) 9.65 శాతం నుండి 9.35 శాతం వడ్డీ వసూలు చేస్తుంది. కస్టమరల క్రెడిట్ స్కోర్లు , విభిన్న కాలవ్యవధుల ప్రకారం వివిధ కార్ లోన్ రేట్లు నిర్ధారిస్తుంది. అతి తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు అందిస్తున్నామని బ్యాంకు పేర్కొంది. కారు లోన్ కోసం గరిష్ట కాలవ్యవధి 7 సంవత్సరాలు. కారు ఆన్-రోడ్ ధరమొత్తంలో 90 శాతం వరకు రుణం ఇవ్వవచ్చు.ఈ లోన్ ద్వారా కొత్త ప్యాసింజర్ కారు, మల్టీ యుటిలిటీ వెహికల్ , SUVని కొనుగోలు చేయవచ్చు. కస్టమర్ ప్రీపేమెంట్ చేయాలనుకుంటే, ఎలాంటి ముందస్తు చెల్లింపు ఛార్జీ తీసుకోబడదు. అలాగే ఏడాది తరువాత త కస్టమర్‌పై ఎలాంటి ఫోర్క్లోజర్ ఛార్జీ ఉండదు. కారు రుణాలపై పరిమిత కాల వ్యవధిలో అందిస్తున్న ప్రాసెసింగ్ ఫీజు ఆఫర్ పొందాలంటే కొన్ని పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. (డెల్టా కార్ప్ కథ కంచికేనా? జియా మోడీ మేజిక్ చేస్తారా? అసలెవరీ మోడీ?) అవసరమైన పత్రాలు 6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్, రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు, రెసిడెన్షియల్ ప్రూఫ్, ఫారం 16, ఐడీ కార్డు (పాన్ ఓటర్ ఐడి, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్) లాంటివి ఇవ్వవచ్చు. ప్రీ-అప్రూవ్డ్ కార్ లోన్ ఎలా పొందాలి? ప్రీ-అప్రూవ్డ్ కార్ లోన్ తీసుకోవడానికి, బ్యాంకు యాప్ యోనోకులాగిన్ అవ్వాలి. ప్రీ-అప్రూవ్డ్ కార్ లోన్ బ్యానర్‌పై క్లిక్ చేసి, అక్కడ మీ వివరాలను ధృవీకరించడంతోపాటు, కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. ఆ తర్వాత ఇన్-ప్రిన్సిపల్ అప్రూవల్ లెటర్ వస్తుంది దీన్ని సంబంధిత బ్యాంకు శాఖలో సమర్పించాలి. Make your festive season more joyful by driving home your dream car with amazing Car Loan deals!#SBI #CarLoan #FestiveOffers pic.twitter.com/MEAmMEAZJx — State Bank of India (@TheOfficialSBI) September 23, 2023 -
ఎస్బీఐ ఫెస్టివ్ ఆఫర్స్: ఎస్ఎంఈలకు తీపి కబురు
దేశంలోని అతిపెద్ద రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. పండుగ సీజన్ షురూ అయిన నేపథ్యంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎస్ఎంఈ) కోసం వరుస పండుగ ఆఫర్లను ప్రారంభించాలని యోచిస్తోంది. కొన్ని లాభదాయకమైన హోమ్ లోన్ డిస్కౌంట్లతో పాటు ఎస్ఎంఈల కోసం కొలేటరల్-ఫ్రీ లోన్స్ అందించాలని ఎస్బీఐ నిర్ణయించింది. ముఖ్యంగా ఈ పండుగ సీజన్లో SMEల కోసం ఎస్బీఐ యోనో యాప్ ద్వారా రుణాలను అందిస్తున్నట్టు బ్యాంకు తెలిపింది. (ఎస్బీఐ మాజీ చైర్మన్ రజనీష్ సంపాదన ఎంతో తెలిస్తే!) ఎస్బీఐ ఎండీ అలోక్ కుమార్ చౌదరి జీ బిజినెస్‌కు అందించిన వివరాల ప్రకారం ఎస్ఎంఈల కోసం కొలేటరల్-ఫీ లోన్( ఎలాంటి తనఖా) అందించేందు ప్లాన్ చేస్తోంది. దీని ద్వారా చిన్న, మధ్య తరహా వ్యాపారులు డిజిటల్‌గా క్రెడిట్ సౌకర్యాలను పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వ వివిధ పథకాలను కస్టమర్లకు విస్తరించే లక్ష్యంలో భాగంగా ఇది డిజిటల్ సేవల ద్వారా వినియోగదారులకు అనుకూలమైన సేవలతో నిమగ్నమవ్వడానికి కూడా సహాయపడుతుందని భావిస్తోంది.అలాగే ‘అండర్‌రైటింగ్’ ప్రక్రియ లేదా రుణదాత ఒకరి ఆదాయం, ఆస్తులు, అప్పు, ఆస్తి వివరాలను ధ్రువీకరించే ప్రక్రియ మరింత ఈజీ చేస్తుంది. అంతేకాదు ఎస్ఎంఈలకు ఈ పండుగ సీజన్లో ఎస్బీఐ యోనో యాప్‌లో తమ ఉత్పత్తులను ప్రదర్శించే అవకాశాన్నికల్పిస్తోంది. బ్యాంక్ తన ఎస్ఎంఈ రుణగ్రహీతలను ఇతర ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ లాగా యోనో యాప్‌లో తమ ఉత్పత్తుల లిస్టింగ్‌కు అనుమతిస్తుందని, ఈ ఆఫర్లు కస్టమర్లకు నచ్చతాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇతర ఆఫర్లపై కూడా మాట్లాడిన ఆయన ఎంపిక చేసిన కస్టమర్లకు తమ గృహ రుణాలపై 65 బేసిస్ పాయింట్ల (బీపీఎస్) వరకు రాయితీలను కూడా అందిస్తోంది. ఈ డిస్కౌంట్ డిసెంబర్ 31, 2023 వరకు కొనసాగుతుందన్నారు. -
ఫెస్టివ్ సీజన్: మారుతి కార్లపై భారీ తగ్గింపు
ఫెస్టివ్ సీజన్ సందర్బంగా దేశీయ కార్ల దిగ్గజం మారుతి సుజుకి తన కార్లపై భారీ తగ్గింపును ప్రకటించింది. సెప్టెంబర్ 2023లో మారుతీ సుజుకి కార్ లవర్స్ కోసం భారీ డిస్కౌంట్లు ప్రకటించింది.మారుతి పాపులర్ మోడల్స్ ఆల్టో కే10, S-ప్రెస్సో, వ్యాగన్ఆర్, ఈకో, సెలెరియో, స్విఫ్ట్, డిజైర్, బ్రెజ్జా, ఎర్టిగా వంటి పాపులర్ మోడల్స్ దాదాపు 60వేల దాకా తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది ఆగస్టులో మంత్లీ సేల్స్ పరంగా టాప్ పొజిషన్లో నిలిచిన మారుతి, పండుగ సీజన్లో సేల్స్ మరింత పెంచుకోవడంపై ఫోకస్ చేసింది. ఈ నెలలో మారుతి సుజుకి మోడల్స్‌పై అందుబాటులో ఉన్న ఆఫర్లు ఇప్పుడు చూద్దాం. (జీ20 సమ్మిట్: మెగా రైల్వే అండ్ షిప్పింగ్ ప్రాజెక్ట్‌పై ఉత్కంఠ) మారుతి సుజుకి స్విఫ్ట్ ఐకానిక్ కారు కొనుగోలుపై రూ.60,000 వరకు ప్రయోజనాలు లభ్యం. ఇందులో రూ.35,000 క్యాష్ డిస్కౌంట్, రూ.20,000 ఎక్స్ఛేంజ్ బోనస్ ఉన్నాయి. అదనంగా సెలక్టెడ్ ట్రిమ్‌లపై రూ.5,000 కార్పొరేట్ డిస్కౌంట్ లభిస్తుంది. (బంగారం ధర దిగింది: కిలో వెండి ధర ఎలా ఉందంటే?) మారుతి సుజుకి డిజైర్: రూ.10,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌తో అందుబాటులో ఉంది. కానీ ఎలాంటి నగదు ప్రయోజనాన్ని అందించలేదు. అలాగే ఎక్స్ఛేంజ్ బోనస్ పెట్రోల్ ట్రిమ్‌లకు మాత్రమే అనేది గమనించాలి. ( సెలెరియో: కారుపై రూ.20,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌తో పాటు రూ.40,000 క్యాష్ డిస్కౌంట్, రూ.4,000 కార్పొరేట్ బెనిఫిట్‌ను అందిస్తోంది.అలాగే మారుతి సుజుకి ఆల్టో K10పై రూ.54,000 వరకు డిస్కౌంట్. ఇందులో బ్రాండ్ రూ.15,000 ఎక్స్చేంజ్ బోనస్‌తో కలిపి రూ.35,000 వరకు క్యాష్ బెనిఫిట్ లభ్యం. వ్యాగన్ఆర్: మారుతికి చెందిన మరో పాపులర్కారుపై రూ.20,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.35,000 వరకు క్యాష్ డిస్కౌంట్ అందిస్తుంది. అదనంగా రూ.4,000 కార్పొరేట్ బోనస్ డీల్ కూడా పొందవచ్చు. (ఉత్తరాఖండ్ వరదలు:పెద్ద మనసు చాటుకున్న అనంత్ అంబానీ) -
Ugadi 2023 బిగ్ ‘సి’: వినూత్నఫెస్టివ్ ఆఫర్లు
హైదరాబాద్: మొబైల్స్ రిటైల్ విక్రయ సంస్థ ‘బిగ్ సి’ ఉగాది పండుగ సందర్భంగా వినూత్న ఆఫర్లు ప్రకటించింది.మొబైల్స్, స్మార్ట్ టీవీలు, ల్యాప్‌టాప్‌ల కొనుగోలుపై ఆకర్షణీయ రాయితీలు అందిస్తున్నట్లు కంపెనీ సీఎండీ యం.బాలు చౌదరి తెలిపారు. స్మార్ట్ ఫోన్ల కొనుగోలుపై పదిశాతం వరకు క్యాష్ బ్యాక్‌తో పాటు ఎలాంటి వడ్డీ, డౌన్ పేమెంట్ లేకుండా సులభ ఈఎంఐలలో పొందొచ్చన్నారు. (March18th పసిడి ప్రియులకు షాక్: ఆల్‌టైం రికార్డు, ఇక కొన్నట్టే..?!) స్మార్ట్ టీవీల కొనుగోలుపై 1,500 వరకు క్యాష్ బ్యాక్ ఇస్తుందన్నారు. సులభ ఈఎంఐ పద్ధతిలో ల్యాప్టాప్స్ కొనే సౌకర్యం కూడా ఉందన్నారు. ‘‘ప్రతి కొనుగోలుపై కచ్చితమైన బహుమతి ఉంటుంది. మా రిటైల్ స్టోర్లలో ఆన్లైన్ కంటే తక్కువ ధరలకే ఉత్పత్తులు లభిస్తాయి. ప్రజలంతా ఈ ఆఫర్లను వినియోగించుకోవాలి’’ అని బాలు చౌదరి కోరారు. బ్రాండెడ్ ఉపకరణాలపై 51 శాతం తగ్గింపు, ఐఫోన్ కొనుగోలుపై రూ.5,000 తక్షణ తగ్గింపు, రూ.2000 విలువైన అడాప్టర్ ఉచితం వంటి ఇతర ఆఫర్లు కూడా ఉన్నాయి. క్యాష్ బ్యాక్ ఆఫర్లలో శాంసంగ్ మొబైల్‌పై రూ.పదివేలు, Vivoపై రూ.5,000, Oppo మొబైల్‌పై 10 శాతంతగ్గింపు లాంటివి ఉన్నాయి. (వాల్‌మార్ట్ భారీ పెట్టుబడులు: ఫోన్‌పే రూ. 1,650 కోట్ల సమీకరణ) -
జోయాలుక్కాస్‌లో దీపావళి క్యాష్‌బ్యాక్ ఆఫర్లు
హైదరాబాద్: ఆభరణాల సంస్థ జోయాలుక్కా స్ దీపావళి సందర్భంగా జ్యుయలరీ కొనుగోళ్లపై ప్రత్యేకమైన క్యాష్ బ్యాక్ ఆఫర్లను ప్రకటించింది. రూ.50,000 అంతకుపైబడిన వజ్రాలు, అన్‌కట్ వజ్రాలను కొనుగోలు చేసిన కస్టమర్లకు రూ.2,000 విలువైన గిఫ్ట్ వోచర్‌ను ఇవ్వనుంది. అలాగే రూ.50,000, అంతకు పైబడిన బంగారు ఆభరణాలు కొనుగోలు చేసిన వారికి రూ.1,000 విలువ గల గిఫ్ట్ వోచర్, రూ.10,000 విలువైన వెండి ఆభరణాలు కొనుగోలు చేసిన కస్టమర్లకు రూ.500 విలువైన గిఫ్ట్ వోచర్‌ను అందించనున్నట్లు తెలిపింది. అలాగే ఎస్బీఐ డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపులు జరిపిన వారికి 5 శాతం రాయితీ కూడా ఇస్తుంది. ఈ నెల 24 వరకు ఈ ఆఫర్ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని షోరూమ్‌లలో అందుబాటులో ఉంటుందని జోయాలుక్కాస్ తెలిపింది. -
ఫెస్టివ్ బొనాంజా: హోం లోన్లపై ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ ఆఫర్స్
ముంబై: ఇటీవల ఆర్బీఐ రెపో రేటును 1.9 శాతం మేర పెంచడంతో రుణాలపై వడ్డీ రేట్లు పెరిగిపోయాయి. అయినప్పటికీ పండుగల దృష్ట్యా ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ తక్కువ రేటుకే గృహ రుణాలను ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. ఎస్బీఐ పావు శాతం మేర గృహ రుణాలపై రేటు తగ్గింపును అందిస్తున్నట్టు ప్రకటించింది. 2023 జనవరి 31 వరకు తీసుకునే గృహ రుణాలపై 8.40 శాతం రేటు అమలవుతుందని తెలిపింది. (Jio True 5G: అతి త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో సేవలు) ప్రాసెసింగ్ ఫీజును ఎత్తివేస్తున్నట్టు తెలిపింది. టాపప్ లోన్లపైనా 0.15 శాతం తక్కువ రేటును ఆఫర్ చేస్తున్నట్టు పేర్కొంది. తన గృహ రుణాల విలువ రూ.6 లక్షల కోట్ల మార్క్‌ను దాటినట్టు వెల్లడించింది. పరిశ్రమలో ఈ మార్క్‌ను సాధించిన తొలి సంస్థగా పేర్కొంది. గృహ రుణాల్లో అతిపెద్ద ఎన్బీఎఫ్సీ అయిన హెచ్డీఎఫ్సీ సైతం 0.20% తక్కువగా, 8.40శాతం కే గృహ రుణాలను అందిస్తున్నట్టు ప్రకటించింది. పండుగ ఆఫర్ నవంబర్ 30 వరకు అందుబాటులో ఉంటుందని హెచ్డీఎఫ్సీ తన వెబ్సైట్లో పేర్కొంది. కనీసం 750 క్రెడిట్ స్కోర్ ఉన్న వారికి 8.40శాతం రేటు వర్తిస్తుందని తెలిపింది. జూన్ నాటికి గృహ రుణాల విలువ రూ.5.36 లక్షల కోట్లుగా ప్రకటించింది. (5జీ కన్జ్యూమర్ సేవల్లోకి రావడం లేదు) -
మారుతి బంపర్ ఆఫర్స్: అన్ని మోడల్స్‌పై ఫెస్టివ్ డిస్కౌంట్స్
సాక్షి, ముంబై: దేశీయ టాప్ వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి తన కస్టమర్ల కోసం భారీ ఫెస్టివ్ ఆఫర్లను అందిస్తోంది. సీఎన్జీ మోడల్ సహా, పలు కార్ల మోడళ్లపై సుమారు రూ. 56,000 వరకు తగ్గింపును అందిస్తోంది. అరేనా షోరూమ్‌లు ఈ (అక్టోబర్) నెలలో తగ్గింపు ధరలకు అందుబాటులో ఉంటాయి. ఇందులో కార్పొరేట్, క్యాస్, ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా మారుతీ సుజుకి ఆల్టో 800, స్విఫ్ట్ ,వ్యాగన్-ఆర్, సెలెరియో, డిజైర్ సహా పలు కార్లు ఇపుడు తగ్గింపు ధరల్లో లభ్యం. మారుతి సుజుకి డిజైర్ మారుతి సుజుకి ఏఎంటీ వెర్షన్లపై రూ. 52,000 దాకా తగ్గింపు అందిస్తోంది. ఇందులో రూ. 35,000 నగదు తగ్గింపు, రూ. 7,000 కార్పొరేట్ డిస్కౌంట్లు రూ. 10,000 ఎక్స్చేంజ్ బోనస్‌లు ఉన్నాయి. అలాగే మాన్యువల్ ట్రాన్స్మిషన్ మోడల్ కార్లపై రూ. 17,000 తగ్గింపు లభ్యం. మారుతీ సుజుకి S-ప్రెస్సో రూ. 35,000 నగదు తగ్గింపు. రూ. 6,000 కార్పొరేట్, రూ. 15,000 ఎక్స్చేంజ్ ప్రోత్సాహకాలున్నాయి. మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో S Presso హై-రైడింగ్ హ్యాచ్‌బ్యాక్‌కు మొత్తం తగ్గింపును రూ. 56,000కి తగ్గింపు లభిస్తుంది. అలాగే S ప్రెస్సో AMT మోడల్లకు మొత్తం రూ. 46వేలు డిస్కౌంట్ లభ్యం. మారుతీ సుజుకి స్విఫ్ట్ అక్టోబర్ నెలలో, మారుతి సుజుకి స్విఫ్ట్ యొక్క ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ (AMT) వెర్షన్లు రూ. 47,000 మొత్తం ప్రయోజనాలకు అర్హమైనవి, స్విఫ్ట్ యొక్క మాన్యువల్ ట్రాన్స్మిషన్ వేరియంట్లు రూ. 30,000 విలువైన మొత్తం ప్రయోజనాలకు అర్హులు. ఆల్టో 800కి మొత్తం రూ. 36,000 తగ్గింపు ఉంటుంది. మారుతి సుజుకి వ్యాగన్-ఆర్ మారుతి సుజుకి డ్యూయల్‌జెట్ టెక్నాలజీతో వచ్చిన రెండు ఎకనామిక్ పెట్రోల్ కార్ల (1.0 ,1.2 లీటర్లు) వ్యాగన్ ఆర్ కొనుగోలుదారులు మాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ మోడల్‌లలో రూ. 31,000 ఆదా చేయవచ్చు. అదనంగా, మారుతీ రూ. 15,000 ధర తగ్గింపును కూడా అందిస్తోంది. సీఎన్జీ బేస్ మోడల్, టాప్-టైర్ వేరియంట్‌పై రూ. 5000 తగ్గింపు. మారుతి సుజుకి ఆల్టో K10 కొత్తగా విడుదల చేసిన ఆల్టో కె10 బడ్జెట్ హ్యాచ్‌బ్యాక్ ఆటోమేటిక్ మరియు మాన్యువల్ వెర్షన్లపై రూ.39,500 తగ్గింపును అందిస్తోంది. ఇందులో రూ. 17,500 విలువైన రూ. 7,000 నగదు తగ్గింపు , రూ. 15,000 విలువైన ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ రివార్డు ఉన్నాయి. -
పండుగ విక్రయాలపై భారీ ఆశలు
న్యూఢిల్లీ: గృహోపకరణాలు, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ కంపెనీలు ఈ విడత పండుగల విక్రయాలపై మంచి సానుకూల అంచనాలతో ఉన్నాయి. దీపావళి వరకు కొనసాగే పండుగల కాలంలో విక్రయాలు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చినప్పుడు 35 శాతం మేర పెరుగుతాయని లెక్కలు వేసుకుంటున్నాయి. ప్రీమియం ఉత్పత్తులకు డిమాండ్ పెరగడాన్ని సానుకూలంగా చూస్తున్నాయి. అయితే, కొన్ని కంపెనీలు మాత్రం అప్రమత్త ధోరణితో ఉన్నాయి. ప్యానాసోనిక్, ఎల్జీ సోనీ, శామ్సంగ్, హయ్యర్, గోద్రేజ్ అప్లయన్సెస్, వోల్టాస్, థామ్సన్, బీఎస్‌హెచ్ హోమ్ అప్లయన్సెస్ క్రితం ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది విక్రయాలపై మంచి ఆశలే పెట్టుకున్నాయి. క్రితం ఏడాది విక్రయాలపై కరెనా రెండో విడత తదనంతర పరిణామాలు ప్రభావం చూపించడం గమనార్హం. కంపెనీల ఏడాది పాటు విక్రయాల్లో 35 శాతం వరకు ఓనమ్ నుంచి దీపావళి మధ్యే నమోదవుతుంటాయి. ఈ విడత పండుగల సీజన్లో రూ.75,000 కోట్ల విక్రయాలు నమోదు కావచ్చని పరిశ్రమ అంచనా వేస్తోంది. పథకాలు, ఆఫర్లు.. పండుగల సమయాల్లో విక్రయాలు పెంచుకునేందుకు అప్లయన్సెస్ కంపెనీలు మంచి ఆఫర్లతో ముందుకు వస్తున్నాయి. సాధారణ రోజులతో పోలిస్తే ఎక్కువ కాలం పాటు వారంటీ, సులభంగా చెల్లించే ఈఎంఐ పథకాలను ఆఫర్ చేస్తున్నాయి. చిన్న పట్టణాల నుంచి ఆరంభ స్థాయి మాస్ ఉత్పత్తుల విక్రయాల విషయంలో కంపెనీలు కొంత ఆందోళనతోఉన్నాయి. ఎందుకంటే ఇంకా చిన్న పట్టణాల్లో విచక్షణారహిత వినియోగం పుంజుకోలేదు. అలాగే, దేశవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో వర్షపాత లోటు నెలకొనడం, ఉత్పత్తుల ధరలను 7–8 శాతం మేర పెంచడం విక్రయాలపై ప్రభావం చూపుతుందా? అని కంపెనీలు సందేహంతో ఉన్నాయి. బెడిసి కొట్టదుగా..? ‘‘వర్షపాతం దేశవ్యాప్తంగా ఎలా నమోదైందన్నది వినియోగదారుల సెంటిమెంట్‌పై ప్రభావం చూపిస్తుంది. ప్రీమియం ఉత్పత్తుల విభాగం ఎప్పటి మాదిరే మంచి వృద్ధిని చూస్తోంది. కానీ, మాస్ (తక్కువ, మధ్య స్థాయి) ఉత్పత్తుల అమ్మకాలపైనే మాలో ఆందోళన ఉంది’’అని గోద్రేజ్ అప్లయన్సెస్ బిజినెస్ హెడ్ కమల్ నంది తెలిపారు. ఈ పండుగల సీజన్లో స్మార్ట్ ఏసీలు, పెద్ద సైజు తెరల టీవీలు, గృహోపరణాలు డబుల్ డిజిట్ విక్రయాలను నమోదు చేస్తాయని అంచనా వేస్తున్నట్టు ప్యానాసోనిక్ లైఫ్ సొల్యూషన్స్ ఇండియా చైర్మన్ మనీష్ శర్మ పేర్కొన్నారు. వినియోగదారులు నేడు తమ ఎంపికల విషయంలో స్పృహతో వ్యవహరిస్తున్నట్టు చెప్పారు. వినియోగ డిమాండ్ పుంజుకుంటుందని, పండుగల విక్రయాలు పెరుగుతాయని భావిస్తున్నట్టు కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయన్సెస్ తయారీదారుల సంఘం ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగంజ తెలిపారు. పండుగల విక్రయాలు ఇప్పటికే జోరుగా సాగుతున్నట్టు సోనీ ఇండియా ఎండీ సునీల్ నాయర్ వెల్లడించారు. ఎల్జీ ఇండియా పండుగల డిమాండ్‌కు అనుకూలంగా మలుచుకుని, విక్రయాలు పెంచుకునేందుకు కొన్ని కొత్త ఉత్పత్తులను విడుదల చేసింది. కరోనా ముందుకంటే అధిక విక్రయాలను నమోదు చేస్తామన్న నమ్మకాన్ని ఎల్జీ ఇండియా వైస్ ప్రెసిడెంట్ దీపక్ బన్సాల్ వ్యక్తం చేశారు. పండుగల విక్రయాలు ఓనమ్, వినాయక చవితి సందర్భంగా సానుకూలంగా ఉన్నట్టు శామ్సంగ్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మోహన్‌దీప్ సింగ్ తెలిపారు. 55 అంగుళాలు అంతకుమించి సైజు టీవీలు, 300కు పైగా లీటర్ల సామర్థ్యం ఉన్న రిఫ్రిజిరేటర్లు, 8కేజీలు, అంతకంటే పెద్ద వాషింగ్ మెషిన్లకు డిమాండ్ ఉన్నట్టు చెప్పారు. -
తొలిసారి ఓలా బంపర్ ఆఫర్: ఎస్1 ప్రొపై భారీ తగ్గింపు
న్యూఢిల్లీ : ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ తొలిసారి తన యూజర్లుకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. తన ఫ్లాగ్షిప్ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై డిస్కౌంట్లను అందిస్తోంది. అందులోనూ ఈ ఫెస్టివ్ సీజన్లో కసమర్లను ఆకట్టు కునేలా ఎస్ 1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను 10వేల వరకు తగ్గింపు ధరకు అందిస్తామని ప్రకటించింది. ఎస్1 ప్రో లాంచింగ్ ధర 1.40 లక్షల (ఎక్స్-షోరూమ్). తాజా ఆఫర్‌తో దీనిపై 10 వేల తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా, పండుగ విక్రయం కోసం కొనుగోలు విండో ఇప్పటికే ప్రత్యక్షంగా ఉంది. ఓలా ఎలక్ట్రిక్ తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ఈ పండుగ ఆఫర్‌ను ప్రకటించింది. ‘‘ఓలా పండుగ ఆఫర్‌ను ఉపయోగించు కోండి, ఎస్ 1 ప్రో 10,000 తగ్గింపుతో పండగ చేస్కోండి.. ఇతర ఫైనాన్స్ ఎంపికలు కూడా ఉన్నాయి. ఈ ఆఫర్ దసరా (అక్టోబర్ 05, 2022న) వరకు చెల్లుబాటులో ఉంటుంది’’ అని తెలిపింది. ప్రత్యేక ఆఫర్‌ను పొందేందుకు, వినియోగదారులు ఓలా అధికారిక వెబ్‌సైట్‌కి లాగిన్ అవ్వాలి. పండుగ ఆఫర్ ట్యాబ్‌ను క్లిక్ చేసిన తర్వాత, ఆసక్తి గల కస్టమర్లు ఎస్1 ప్రోని డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేసే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అలా వివరాలను నమోదు చేసిన తరువాత ఓలా ఎస్1 ప్రోను రూ. 1.30 లక్షలు (ఎక్స్-షోరూమ్)కు కొనుగోలు చేయవచ్చు. -
సెలెక్ట్ మొబైల్స్ దీపావళి ధమాకా ఆఫర్లు
హైదరాబాద్: ప్రముఖ మొబైల్ రిటైల్ చైన్ సెలెక్ట్ మొబైల్స్ దీపావళీ సందర్భంగా ధమాకా ఆఫర్లను ప్రకటించింది. 55 అంగుళాల నోకియా 4కే ఆండ్రాయిడ్ టీవీని రూ.32,999లకు, 43 ఇంచుల నోకియా 4కే ఆండ్రాయిడ్ టీవీని రూ.22,999లకే అందించనుంది. మొబైల్ కొనుగోలుపై రూ.10,000 వరకు క్యాష్ బ్యాక్‌ను పొంద వచ్చు.బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ, అమెజాన్, పేటీఎం కొనుగోలు ద్వారా రూ.3,500 వరకు క్యాష్ బ్యాక్ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, మహారాష్ట్రలోని 80కి పైగా సెలెక్ట్ స్టోర్లలో నవంబర్ ఒకటో తేది నుంచి 6తేది వరకు ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. ధమాకా ఆఫర్లను కస్టమర్లు వినియోగించుకోవాలని సీఎండీ వై.గురు తెలిపారు. -
బి న్యూలో దీపావళి ధమాకా ఆఫర్లు
హైదరాబాద్: ప్రముఖ మొబైల్ రిటైల్ సంస్థ బి న్యూ దీపావళి సందర్భంగా ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది. మొబైల్, టీవీలు, లాప్ ట్యాప్‌లను భారీ తగ్గింపు ధరలతో అందిస్తున్నట్లు కంపెనీ ఎండీ వై.డీ. బాలాజీ చౌదరీ తెలిపారు. ఎంపిక చేసుకున్న సాంసంగ్ మోడళ్లపై రూ.5000 నుంచి రూ.30 వేల వరకు, వన్ ప్లస్ మోడళ్లపై రూ. 1,000 నుంచి రూ.6,000 వరకు, ఎంఐ మోడళ్లపై రూ.3000, రియల్ మి మోడళ్లపై రూ.3999 వరకు తగ్గింపు ధరల్ని ఇస్తున్నట్లు సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి నిఖిలేష్ పేర్కొన్నారు. ఎంఐ టీవీలపై రూ. 5000 డిస్కౌంట్‌తో పాటు రెండేళ్ల వారంటీ ఉంటుందనన్నారు. హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్ క్రిడెట్, కార్డులపై లాప్టాప్లను కొనుగోలు చేస్తే రూ.5000 వరకూ క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంటుందన్నారు. కస్టమర్లు ఈ ఆ ఫర్లను వినియోగించుకోవాలని తెలిపారు. -
బిగ్‘సి’ దీపావళి పండుగ ఆఫర్లు
హైదరాబాద్: ప్రముఖ మొబైల్ రిటైలర్ బిగ్ ‘సి’ దీపావళి పండుగ సందర్భంగా కస్టమర్లకు బంపర్ ఆఫర్లను ప్రకటించింది. మొబైల్స్ కొనుగోళ్లపై 10 శాతం వరకు క్యాష్ బ్యాక్, వడ్డీ, డౌన్‌పేమెంట్ లేకుండా సులభ వాయిదాల పద్ధతిలో కొనుగోలు చేసే సౌకర్యాన్ని కల్పించింది. ప్రతి మొబైల్ కొనుగోలుపై కచ్చితమైన బహుమతిని అందించనుంది. ఐఫోన్ కొనుగోలుపై రూ.6,000, సామ్సంగ్ మొబైల్ కొనుగోలుపై రూ.10,000, ఎంఐ మొబైల్ కొనుగోలుపై రూ.3,000, ఒప్పో మొబైల్ కొనుగోలుపై రూ.4000 వరకు క్యాష్ బ్యాక్ ఇస్తుంది. వివో మొబైల్ కొనుగోలుపై 10% క్యాష్ బ్యాక్ ఆఫర్‌ను ప్రకటించింది. స్మార్ట్ టీవీలు కొనుగోలుపై రూ.3500 వరకు క్యాష్ బ్యాక్‌ను ఇస్తోంది. ఏటీఎం కార్డుపై ఒక్క రూపాయి చెల్లించి వాయిదాల పద్ధతిలో మొబైల్ కొనుగోలు చేసే సదుపాయాన్ని కల్పించింది. బిగ్ సి అందిస్తున్న ఈ దీపావళీ పండుగ ఆఫర్లను కస్టమర్లంతా వినియోగించుకోవాలని కంపెనీ సీ.ఎం.డీ బాలు చౌదరి తెలిపారు. -
Hyderabad Metro: 18 నుంచి మెట్రో సువర్ణ ఆఫర్
సాక్షి,హైదరాబాద్: దసరా, దీపావళి, సంక్రాంతి వరుస పండగల సందర్భంగా మెట్రోరైలు సంస్థ మళ్లీ 3 సువర్ణ ఆఫర్లను ప్రకటించింది. ఈ నెల 18 నుంచి అమలుకానున్న ఈ పథకంలో ప్రయాణికులు 20 ట్రిప్పులకు చెల్లించి 30 ట్రిప్పులు జర్నీ చేసే అవకాశం కల్పించినట్లు హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. ఎంజీబీఎస్–జేబీఎస్ (గ్రీన్‌లైన్) మార్గంలో కేవలం రూ.15 చెల్లించి ఒక చివరి నుంచి మరో చివరకు ప్రయాణించే అవకాశం కల్పించడం విశేషం. ఆఫర్లివే.. ట్రిప్‌పాస్ ఆఫర్: ఈ ఆఫర్లో ప్రయాణికులు ఎవరైనా 20 ట్రిప్పులకు చెల్లించి.. 30 ట్రిప్పులు జర్నీ చేసే అవకాశం ఉంది. 45 రోజుల పాటు ఈ ఆఫర్ వర్తిస్తుంది. మెట్రో స్మార్ట్‌కార్డు (పాత, కొత్త కార్డులున్నవారు)ప్రయాణికులకు ఈ ఆఫర్‌కు అర్హులు. అక్టోబరు 18 నుంచి జనవరి 15, 2022 వరకు ఈ ఆఫర్ అమల్లో ఉంటుంది. గ్రీన్‌లైన్ ఆఫర్: ఎంజీబీఎస్– జేబీఎస్–మెట్రో స్టేషన్ల మధ్య రాకపోకలు సాగించే వారు కేవలం రూ.15 చెల్లించి ఒక చివరి నుంచి మరో చివరకు ప్రయాణించే అవకాశం ఉంటుంది. స్మార్ట్‌కార్డులు, టిక్కెట్లు కొనుగోలు చేసి ప్రయాణించే వారికి సైతం ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ ఆఫర్ కూడా జనవరి 15, 2022 వరకు అమల్లో ఉంటుంది. నెలవారీగా లక్కీ డ్రా: మెట్రో ప్రయాణికులకు నెలవారీగా లక్కీడ్రా తీయనున్నారు. అక్టోబరు 2021 నుంచి ఏప్రిల్ 2022 వరకు ప్రతి నెలా డ్రా తీస్తారు. నెలలో 20 ట్రిప్పులు స్మార్ట్‌కార్డుల ద్వారా జర్నీ చేసినవారిని కార్డు నంబరు ఆధారంగా ఈ డ్రా తీస్తారు. అయిదుగురు విజేతలకు ప్రత్యేక బహుమతులు అందజేస్తారు. ఇందుకోసం ప్రతి ప్రయాణికుడూ తమ కాంటాక్ట్‌లెస్ స్మార్ట్‌కార్డును టి–సవారీ యాప్ లేదా మెట్రో స్టేషన్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇతర వివరాలకు మెట్రో స్టేషన్లలో సిబ్బందిని సంప్రదించాలని ఎండీ సూచించారు. -
రూ. 3000 ఖరీదైన చీర రూ.300 కే!!
సుమతి (పేరు మార్చడమైనది) ఆన్లైన్లో పండగ ఆఫర్ల కింద వచ్చిన అప్లికేషన్స్ చూస్తూ ఉంటే మంచి కలర్ కాంబినేషన్ ఉన్న పట్టు చీర కనపడింది. ‘మూడు వేల రూపాయల చీర, మూడు వందలకే’ అని ఉండటంతో క్లిక్ చేసింది. ఆ చీర బుక్ అవ్వాలంటే అందులో ఇచ్చిన అకౌంట్లో డబ్బులు జమ చేయడంతోపాటు వివరాలన్నీ పొందుపరిచిన ఒక ఫారాన్ని నింపాలి. డబ్బు కట్టడంతోపాటు వివరాలన్నీ ఇచ్చింది. కానీ, ఎన్ని రోజులైనా ఆ చీర మాత్రం రాలేదు. ‘మా లక్కీ స్కీమ్‌లో పాల్గొనండి, ఐ ఫోన్ గెల్చుకోండి’ అని ఉన్న అప్లికేషన్‌ను శేఖర్ (పేరు మార్చడమైనది) క్లిక్ చేశాడు. ఆ లక్కీ డిప్లో పాల్గొనాలంటే రెండు వేల రూపాయలు చెల్లించి, స్కీమ్‌లో చేరాలని ఉంది. తన వివరాలతో పాటు, రెండు వేల రూపాయలు ఆన్లైన్ ద్వారా చెల్లించి, ఆ స్కీమ్‌లో చేరాడు. కానీ, శేఖర్‌కి ఫోన్ రాలేదు. ఆ డబ్బులూ తిరిగి రాలేదు. సబ్‌స్క్రైబర్స్‌ని పెంచుకోవడానికి ఆఫర్లు లైక్స్, కామెంట్స్, సబ్స్క్రిప్షన్స్ పెంచుకోవడానికి కొందరు ‘ఉచితం లేదా డిస్కౌంట్’ అనే పదాలను ఎరగా వేస్తుంటారు. ‘50,000 రూపాయల ధర పలికే గడియారాన్ని 5,000కే అమ్ముతున్నాను’ అనే ఆఫర్లు వస్తుంటాయి. మల్టీలెవల్ మార్కెటింగ్ మోసం.. ‘ఆఫర్’ని ఎరగా వేసి వివరాలన్నీ సేకరించి, ఆ తర్వాత మోసానికి పాల్పడే వారుంటారు. వివరాలన్ని ‘డార్క్’వెబ్సైట్లలో పెడుతూ, మరో ఆన్లైన్ మోసాలకు ఉపయోగించడానికి ఆ డేటాను వాడుతుంటారు. ఒరిజినల్ అని చెప్పి, అమ్మడం ఇది మల్టీలెవల్ మార్కెటింగ్ మోసం. బ్రాండెడ్ వస్తువులా అనిపించే రెప్లికా ఐటమ్ చూపించి అసలైనదే అని చూపుతారు. మీతో పాటు మరికొంతమందిని తమ స్కీమ్‌లో చేర్చితే ‘50,000 రూపాయల వస్తువు 5000 కు సొంతం చేసుకోవచ్చు అనే ఆశను చూపెడతారు. నాణ్యతలేని వస్తువులతో ఎర రెప్లికా వస్తువుల్లోనూ గ్రేడ్స్ ఉంటాయి. అవి చూడటానికే బాగుంటాయి కానీ, ఏ మాత్రం పనిచేయవు. అలాంటి వస్తువులను చూపి, డబ్బులు రాబట్టి మోసం చేస్తారు. ఆఫర్ల వర్షం దసరా, దీపావళి, సంక్రాంతి వంటి ముఖ్యమైన పండగల సమయంలో జనాల బలహీనతను దృష్టిలో పెట్టుకొని, బంపర్ ఆఫర్, వీల్ తిప్పడం, స్క్రాచ్ కార్డ్‌లు.. వంటి వాటితో ఆన్లైన్ మోసానికి దిగుతుంటారు. ఈ షాపింగ్ మోసాలు ఢిల్లీ చుట్టుపక్కల నుంచి అధికంగా జరుగుతున్నట్టు తెలుస్తుంది. వీటిల్లో ఎక్కువగా ఫోన్లు, వాచీలు, చీరలు, డ్రెస్సుల విషయాల్లో జరుగుతుంటాయి. ఆన్లైన్ షాపింగ్ మోసానికి ముందే హెచ్చరికలు ► ఒక వస్తువులు లేదా సేవ నమ్మశక్యం కాని తక్కువ ధరతో ప్రచారం చేయబడుతుంది అంటే ఆలోచించాలి. మోసానికి ముందు ఇదొక హెచ్చరిక అనుకోవాలి. ► ఆన్లైన్ చెల్లింపులు కాకుండా వస్తువు ఇంటికి వద్దకు వచ్చాకే చెల్లింపు అనే ఎంపిక మంచిది. ► డిస్కౌంట్ ఆఫర్‌ని పొందడానికి తమ వోచర్ కోసం ముందే చెల్లించాలనే ఎంపికలు ఉంటాయి. అలాంటి వాటికి దూరంగా ఉండటం మంచిది. ► నకిలీ సోషల్ మీడియా ఆధారిత కథనాలు కొత్తగా అభివృద్ధి చెందుతున్నాయి. ఆన్ లైన్ లో చాలా తక్కువ ధరలకు ఉత్పత్తులను విక్రయిస్తున్నాయి, అనేది నిజం కాదు. ► విక్రేత విదేశాల్లో ఉన్నప్పుడు పే మనీ లేదా క్రెడిట్/ డెబిట్ కార్డ్ లావాదేవీ వంటి సురక్షిత చెల్లింపు సేవ ద్వారా చెల్లింపును అనుమతించరు. వారు మిమ్మల్ని ౖఖ్కీ ని చెప్పమని లేదా క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయాలని లేదా చెల్లింపులను స్వీకరించడానికి గూగుల్ ఫారమ్స్ లేదా చిన్న లింక్‌లను పూరించమని అడుగుతారు. ► కొత్తగా పుట్టుకు వచ్చిన వెబ్సైట్లలో నిర్ధారణకు రాకుండా కొనుగోళ్లు చేయకూడదు. వాటి తాలూకు ఫౌండర్స్ ఎవరనేది కూడా చూసుకోవాలి. బ్రాండ్ పేరుతో ఉన్న వెబ్‌సైట్స్ కూడా నకిలీ పేరుతో వస్తాయి. పండగల సమయాల్లో ఈ– తరహా మోసాలు ఎక్కువ. కాబట్టి, వాటి వాడుక, హెచ్టిటిపిఎస్, యుఆర్ఎల్ చెక్ చేసుకొని కొనాలి. షాపింగ్ మోసాల నుండి రక్షణ ► మీరు తీసుకోవాలనుకున్న వస్తువు ‘సమీక్ష (రివ్యూ)లు చదవండి. వాటి నాణ్యత, రిటర్న్ పాలసీల వంటివి ఉన్నాయేమో చూడండి. ► ఎప్పుడైనా (యాప్) అప్లికేషన్ అంతర్నిర్మిత సాధనాలతోనే కమ్యూనికేట్ చేయండి. అప్లికేషన్ వెలుపల కమ్యూనికేట్ చేయవద్దు. ► సురక్షిత నగదు చెల్లింపు కోసం https://URL చూడండి. ► అమ్మకం దారుకి మీ బ్యాంక్ OTP / PIN నంబర్లను ఏ రూపంలోనూ షేర్ చేయవద్దు. ► మీరు ఫోన్ మాట్లాడే సమయంలో చెల్లింపు లావాదేవులను ఎప్పుడూ చేయవద్దు. ► అమ్మకం దారు అందించిన ఏవైనా షార్ట్ లింక్‌లను క్లిక్ చేసి, వాటిని పూరించవద్దు. గూగుల్ లింక్ ద్వారా వచ్చిన ఫామ్‌లను పూరించవద్దు. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయవద్దు, మీరు స్కాన్ చేస్తుంటే మీ ఖాతా నుండి డబ్బు డెబిట్ అవుతుంది. అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
బిగ్ ‘సి’ దసరా పండుగ ఆఫర్లు
హైదరాబాద్: ప్రముఖ మొబైల్ రిటైలర్ బిగ్ ‘సి’ దసరా పండుగ సందర్భంగా కస్టమర్లకు బంపర్ ఆఫర్లను ప్రకటించింది. మొబైల్స్ కొనుగోళ్లపై 10 శాతం వరకు క్యాష్ బ్యాక్, వడ్డీ, డౌన్‌పేమెంట్ లేకుండా సులభ వాయిదాల పద్ధతిలో కొనుగోలు చేసే సౌకర్యాన్ని కల్పించింది. ప్రతి మొబైల్ కొనుగోలుపై కచ్చితమైన బహుమతిని అందించనుంది. ఆఫర్లు ఇలా స్మార్ట్ టీవీలు కొనుగోలుపై రూ.4500 వరకు క్యాష్ బ్యాక్‌ను ఇస్తో్ంది. ఏటీఎం కార్డుపై కేవలం ఒక్క రూపాయి చెల్లించి వాయిదాల పద్ధతిలో మొబైల్ ఫోన్ కొనుగోలు చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. స్మార్ట్ టీవీలు కొనుగోలుపై రూ.4500 వరకు క్యాష్ బ్యాక్‌ను ఇస్తో్ంది. ఐఫోన్ మొబైల్ కొనుగోలుపై రూ.6,000 వరకు క్యాష్ బ్యాక్, సామ్సంగ్ మొబైల్ కొనుగోలుపై రూ.10,000 వరకు క్యాష్ బ్యాక్, వన్‌ప్లస్ కొనుగోలుపై రూ.7,000 వరకు ఇన్స్టాంట్ డిస్కౌంట్, బ్యాక్, ఒప్పొ మొబైల్ కొనుగోలుపై రూ.4000 వరకు క్యాష్ బ్యాక్ సౌకర్యం కల్పిస్తోంది. ఈ సందర్భంగా కంపెనీ నూతన బ్రాండ్ అంబాసిడర్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు మాట్లాడుతూ.. బిగ్ సి అందిస్తున్న ఈ దసరా పండుగ ఆఫర్లను కస్టమర్లంతా వినియోగించుకోవాలని తెలిపారు