అదిరిపోయే ఆఫర్‌.. విమానం ఎక్కేయండి చవగ్గా! | Air India Express flight ticket sale under 1606 festive season offer | Sakshi
Sakshi News home page

అదిరిపోయే ఆఫర్‌.. విమానం ఎక్కేయండి చవగ్గా!

Published Wed, Oct 23 2024 4:59 PM | Last Updated on Wed, Oct 23 2024 7:00 PM

Air India Express flight ticket sale under 1606 festive season offer

పండుగల సీజన్‌ సమీపిస్తున్న తరుణంలో ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించింది. ఎయిర్‌లైన్ 'ఫ్లాష్ సేల్' ఆఫర్ల కింద కేవలం రూ. 1606 ప్రారంభ ధరతో విమాన టిక్కెట్‌లను బుక్ చేసుకోవచ్చు.

దీని ద్వారా ప్రయాణికులు దేశంలోని ప్రధాన నగరాల మధ్య తక్కువ ధరలో ప్రయాణించే అవకాశం ఉంది. గౌహతి-అగర్తలా, కొచ్చి-బెంగళూరు, చెన్నై-బెంగళూరు, విజయవాడ-హైదరాబాద్ వంటి ప్రముఖ మార్గాలలో ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంది.

ఫ్లాష్ సేల్ కింద బుకింగ్ 27 అక్టోబర్ 2024 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ప్రయాణ తేదీలు నవంబర్ 1 నుండి డిసెంబర్ 10 వరకు ఉంటాయి. కొత్త గమ్యస్థానంలో పండుగను ఆస్వాదించాలనుకునే ప్రయాణీకులకు ఇది గొప్ప అవకాశం.

ఇతర ఆఫర్లు
ఫ్లాష్ సేల్‌తో పాటు ఎయిర్‌లైన్ ఎక్స్‌ప్రెస్ లైట్ ఆఫర్‌ను కూడా ప్రకటించింది.  దీనిలో విమాన టిక్కెట్‌లను బుకింగ్ చేయడానికి ప్రారంభ ధర కేవలం రూ.1456. దీని కింద ప్రయాణికులకు అందనంగా జీరో కన్వీనెన్స్‌ ఫీజు ప్రయోజనం కూడా ఉంటుంది. అంతేకాకుండా ఎక్స్‌ప్రెస్ లైట్ అదనపు 3 కిలోల క్యాబిన్ సామాను ఉచిత ప్రీ-బుకింగ్, చెక్-ఇన్ బ్యాగేజీ ధరలపై తగ్గింపు వంటి ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించే లాయల్టీ సభ్యులు 50% తగ్గింపు రుసుముతోనే బిజినెస్‌ సీట్లకు అప్‌గ్రేడ్‌ చేసుకోవచ్చు. 'గౌర్మెట్' హాట్ మీల్స్, సీట్లపై 25% తగ్గింపు, ఎక్స్‌ప్రెస్ ఎహెడ్ ప్రాధాన్యతా సేవలను కూడా పొందవచ్చు. అలాగే విద్యార్థులు, సీనియర్ సిటిజన్లు, వైద్యులు, నర్సులు, సాయుధ దళాల సిబ్బంది ఎయిర్‌లైన్ వెబ్‌సైట్‌లో ప్రత్యేక తగ్గింపుతో టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement