flight journey
-
విమాన రంగం ఆశావహం
భారత మార్కెట్లో ఏవియేషన్ రంగ వృద్ధికి గణనీయంగా అవకాశాలు ఉన్నాయని ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) డైరెక్టర్ జనరల్ విల్లీ వాల్ష్ తెలిపారు. దేశీ విమానయాన సంస్థలు పెద్ద ఎత్తున ఎయిర్‌క్రాఫ్ట్‌లకు ఆర్డర్లు ఇస్తున్న నేపథ్యంలో పైలట్ కావాలనుకునే ఔత్సాహికులు భారత్ వైపు చూడొచ్చని ఆయన సూచించారు.ఎయిర్ కనెక్టివిటీని పెంచుకోవడం ద్వారా ఆర్థిక పురోగతి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని గుర్తించిన భారత్.. విమానాశ్రయాల మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంపై ఇన్వెస్ట్ చేస్తోందని వాల్ష్ చెప్పారు. మరోవైపు, దేశీయంగా ఎయిర్పోర్ట్ చార్జీలపై స్పందిస్తూ.. పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుండటం సానుకూలాంశమని ఆయన వివరించారు. పరిశ్రమపై చార్జీల ప్రభావాన్ని గుర్తెరిగిన నియంత్రణ సంస్థ .. విమానయాన సంస్థలు, పరిశ్రమ అభిప్రాయాలు కూడా తెలుసుకోవడంపై సానుకూలంగా వ్యవహరిస్తోందని వాల్ష్ చెప్పారు.ఇదీ చదవండి: రూ.5 కోట్ల వాచ్‌తో జుకర్‌బర్గ్.. ప్రత్యేకతలివే..ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య 16.4–17 కోట్లకు చేరుకోవచ్చని కొన్ని సంస్థలు అంచనా వేస్తున్నాయి. 2023–24తో పోలిస్తే ప్రయాణికుల సంఖ్య 7–10 శాతం పెరిగే అవకాశం ఉందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా ఇటీవల నివేదిక విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో దేశీయంగా 7.93 కోట్ల మంది విమానాల్లో రాకపోకలు సాగించినట్లు తెలిపింది. 2023–24 ఏప్రిల్–సెప్టెంబర్‌తో పోలిస్తే 5.3 శాతం వార్షిక వృద్ధి నమోదైంది. -
60 విమానాలు రద్దు చేసిన ఎయిరిండియా! కారణం ఏంటంటే..
టాటా యాజమాన్యంలోని ఎయిరిండియా సంస్థ కొన్ని రూట్లలో తన సర్వీసులను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. మొత్తం 60 సర్వీసులను రద్దు చేస్తున్నట్లు చెప్పింది. నిర్వహణ సమస్యల కారణంగా ఎయిర్‌క్రాఫ్ట్‌లు అందుబాటులో లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొంది. ఈ నిర్ణయాన్ని నవంబర్ నుంచి డిసెంబర్ మధ్య అమలు చేయబోతున్నట్లు స్పష్టం చేసింది.ఎయిరిండియా తాజా ప్రకటన వల్ల యూఎస్ సర్వీసులపై ప్రభావం పడనుందని అధికారులు తెలిపారు. ఎయిర్‌క్రాఫ్ట్‌ల నిర్వహణ, సప్లై చెయిన్ పరిమితుల వల్ల కొన్ని విమానాలను రద్దు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు ఇతర ప్రత్యామ్నాయాలు చూపుతున్నామని వివరించారు. ఈమేరకు ప్యాసింజర్లకు సమాచారం అందించామని చెప్పారు.వైడ్ బాడీ విమానాలు లేవు..‘ఎయిరిండియా నవంబర్ 15 నుంచి డిసెంబర్ 31 మధ్య శాన్ ఫ్రాన్సిస్కో, వాషింగ్టన్, చికాగో, న్యూయార్క్ వంటి నగరాలకు నడిపే 60 విమానాలను రద్దు చేసింది. ఈ రూట్లలో నడపడానికి తగినన్ని వైడ్ బాడీ విమానాలు అందుబాటులో లేవు. దాంతోపాటు కొన్ని నిర్వహణ కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నాం. ప్రయాణికులు అసౌకర్యానికి క్షమాపణలు కోరుతున్నాం’ అని ఒక సీనియర్ అధికారి చెప్పారు.ఇదీ చదవండి: టపాసులా పేలుతున్న బంగారం ధర!ఈ ప్రాంతాల నుంచి యూఎస్‌కు విమానాలుఎయిరిండియా దిల్లీ-వాషింగ్టన్ మధ్య ఐదు విమానాలను నడుపుతుండగా, దిల్లీ నుంచి న్యూయార్క్, ముంబై నుంచి న్యూయార్క్ వరకు వారానికి ఏడు విమానాలు నడుపుతోంది. దిల్లీ, ముంబై, బెంగళూరు నుంచి నేరుగా ఫ్రాన్సిస్కోకు విమానాలున్నాయి. దిల్లీ నుంచి చికాగో మార్గంలో ప్రతి వారం ఏడు విమానాలను నడుపుతోంది. -
అదిరిపోయే ఆఫర్.. విమానం ఎక్కేయండి చవగ్గా!
పండుగల సీజన్ సమీపిస్తున్న తరుణంలో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించింది. ఎయిర్‌లైన్ 'ఫ్లాష్ సేల్' ఆఫర్ల కింద కేవలం రూ. 1606 ప్రారంభ ధరతో విమాన టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు.దీని ద్వారా ప్రయాణికులు దేశంలోని ప్రధాన నగరాల మధ్య తక్కువ ధరలో ప్రయాణించే అవకాశం ఉంది. గౌహతి-అగర్తలా, కొచ్చి-బెంగళూరు, చెన్నై-బెంగళూరు, విజయవాడ-హైదరాబాద్ వంటి ప్రముఖ మార్గాలలో ఈ ఆఫర్ అందుబాటులో ఉంది.ఫ్లాష్ సేల్ కింద బుకింగ్ 27 అక్టోబర్ 2024 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ప్రయాణ తేదీలు నవంబర్ 1 నుండి డిసెంబర్ 10 వరకు ఉంటాయి. కొత్త గమ్యస్థానంలో పండుగను ఆస్వాదించాలనుకునే ప్రయాణీకులకు ఇది గొప్ప అవకాశం.ఇతర ఆఫర్లుఫ్లాష్ సేల్‌తో పాటు ఎయిర్‌లైన్ ఎక్స్‌ప్రెస్ లైట్ ఆఫర్‌ను కూడా ప్రకటించింది. దీనిలో విమాన టిక్కెట్లను బుకింగ్ చేయడానికి ప్రారంభ ధర కేవలం రూ.1456. దీని కింద ప్రయాణికులకు అందనంగా జీరో కన్వీనెన్స్ ఫీజు ప్రయోజనం కూడా ఉంటుంది. అంతేకాకుండా ఎక్స్‌ప్రెస్ లైట్ అదనపు 3 కిలోల క్యాబిన్ సామాను ఉచిత ప్రీ-బుకింగ్, చెక్-ఇన్ బ్యాగేజీ ధరలపై తగ్గింపు వంటి ప్రయోజనాలు కూడా ఉన్నాయి.ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించే లాయల్టీ సభ్యులు 50% తగ్గింపు రుసుముతోనే బిజినెస్ సీట్లకు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. 'గౌర్మెట్' హాట్ మీల్స్, సీట్లపై 25% తగ్గింపు, ఎక్స్‌ప్రెస్ ఎహెడ్ ప్రాధాన్యతా సేవలను కూడా పొందవచ్చు. అలాగే విద్యార్థులు, సీనియర్ సిటిజన్లు, వైద్యులు, నర్సులు, సాయుధ దళాల సిబ్బంది ఎయిర్‌లైన్ వెబ్సైట్లో ప్రత్యేక తగ్గింపుతో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. -
వారంలో 100కుపైగా బెదిరింపులు.. ‘నో-ఫ్లై లిస్ట్‌లో చేరుస్తాం’
విమానాల్లో బాంబు ఉందంటు తప్పుడు సమాచారం అందించి పట్టుబడిన వారిని ‘నో ఫ్లై లిస్ట్’లో పెడతామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం దీన్ని గుర్తించలేని నేరం(నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్)గా పరిగణిస్తుందన్నారు. గత వారం రోజులుగా పలు విమానాల్లో దాదాపు 100కుపైగా బాంబు బెదిరింపులు రావడంతో ప్రభుత్వం ఈ చర్యలను తీవ్రంగా పరిగణించింది.ఈ సందర్భంగా మంత్రి స్పందిస్తూ..‘బాంబు బెదిరింపు చర్యల వల్ల విమాన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దేశీయ, అంతర్జాతీయ ఎయిర్‌క్రాఫ్ట్ రాకపోకలు తాత్కాలికంగా కొన్నిచోట్ల నిలిపేశారు. మరికొన్ని ప్రాంతాల్లో చాలా ఆలస్యంగా నడిచాయి. విమానాశ్రయ భద్రతా సిబ్బంది తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు. ఈ పరిణామాలకు కారణమవుతున్న వారిపట్ల ప్రభుత్వం తీవ్ర చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉంది. వీరిని ‘నో ఫ్లైలిస్ట్’(ఎలాంటి కమర్షియల్ విమానాల్లో ప్రయాణించకుండా నిరోధించడం)లో చేరుస్తాం. ఈ నేరాన్ని గుర్తించలేని నేరం(నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్-క్రిమినల్ కేసు)గా పరిగణిస్తాం’ అని చెప్పారు.సమాచారం అందిన వెంటనే ఏం చేస్తారంటే..బాంబు బెదిరింపు సమాచారం అందిన వెంటనే విమానాశ్రయంలోని బాంబు బెదిరింపు అంచనా కమిటీ (బీటీఏసీ) అత్యవసర సమావేశం అవుతుంది. బీటీఏసీలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్), బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్), సంబంధిత విమానయాన సంస్థ, విమానాశ్రయ నిర్వాహకులు సభ్యులుగా ఉంటారు. విమానంలో బాంబు ఉందని అందిన సమాచారం మేరకు ఈ కమిటీ ముప్పును ‘నిర్దిష్ట’, ‘నాన్-స్పెసిఫిక్(అస్పష్టమైన)’ అనే రెండు విధాలుగా వర్గీకరిస్తుంది. నిర్దిష్ట ముప్పులో ఫ్లైట్ నంబర్, తేదీ, బయలుదేరే సమయం, ఎయిర్‌పోర్ట్‌కు రావాల్సిన సమయం..వంటి నిర్దిష్ట సమాచారంతో బెదిరింపులు వస్తాయి. దాంతో కమిటీ వెంటనే సదరు పైలట్లను ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)ని సంప్రదించమని కోరతారు. తదుపరి చర్యల కోసం గ్రౌండ్ సిబ్బందితో మాట్లాడి చర్యలు తీసుకుంటారు. ఇదీ చదవండి: అమ్మో ఏఐ.. ఉద్యోగాలు ఊడుతున్నాయ్!నాన్-స్పెసిఫిక్ థ్రెట్ విషయంలో ఎయిర్‌లైన్, ఫ్లైట్ నంబర్, తేదీ, షెడ్యూల్ సమయం స్పష్టంగా తెలియజేయరు. టేకాఫ్ అయిన కాసేపటికే బెదిరింపు వస్తే తిరిగి విమానం బయలుదేరిన ఎయిర్‌పోర్ట్‌కు రమ్మని పైలట్‌కు చెబుతారు. లేదా అప్పటికే చాలా దూరం ప్రయాణం చేస్తే దగ్గర్లోని ఎయిర్‌పోర్ట్‌లో జనావాసం ఎక్కువగా లేని బే(విమానాలు నిలిసే ప్రదేశం)కు రప్పిస్తారు. వెంటనే ప్యాసింజర్లను వేరేచోటుకు మారుస్తారు. బ్యాగేజీ, కార్గో, క్యాటరింగ్ మెటీరియల్ స్కాన్ చేస్తూ షిఫ్ట్ చేస్తారు. బాంబు స్వ్కాడ్, స్కానర్ల సాయంతో విమానాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తారు. అనుమానాస్పదంగా ఏమీ కనిపించకుంటే విమానాన్ని తిరిగి ఆపరేట్ చేస్తారు. ఏదైనా అనుమానాస్పద వస్తువులుంటే మాత్రం భద్రతా సిబ్బంది, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్లు అందుకు అనుగుణంగా చర్యలు చేపడుతారు. -
ఎక్కేద్దాం... ఎగిరిపోదాం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య సరికొత్త రికార్డులు నమోదు చేస్తోంది. అక్టోబర్ 14న వివిధ నగరాల నుంచి 4,84,263 మంది విమానాల్లో ప్రయాణం సాగించారు. ఈ ఏడాది ఏప్రిల్ 22న నమోదైన 4,71,751 రికార్డుతో పోలిస్తే 2.6 శాతం ప్రయాణికులు అధికంగా ప్రయాణించడం విశేషం.నవరాత్రి, దసరా, దుర్గా పూజ ముగిసిన తర్వాత తొలి పనిదినం కావడంతో ప్యాసింజర్ల సంఖ్య గణనీయంగా నమోదైంది. అక్టోబర్ 14న మొత్తం 6,435 విమాన సర్వీసులు ప్రయాణికులకు సేవలు అందించాయి. భారత్‌లో దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య దూసుకుపోతుండడంతో విమానయాన సంస్థల మధ్య పోటీ వేడి మీద ఉంది. ఈ ఏడాది ఆగస్ట్‌తో పోలిస్తే సెప్టెంబర్‌లో ఇండిగో మార్కెట్ వాటా 60 బేసిస్ పాయింట్లు, ఎయిర్ ఇండియా 40 బేసిస్ పాయింట్లు పెరిగింది. స్పైస్‌జెట్ 30 బేసిస్ పాయింట్లు, ఆకాశ ఎయిర్ 10 బేసిస్ పాయింట్లు క్షీణించాయి. సెప్టెంబర్‌లో ఇలా.. ఈ ఏడాది సెప్టెంబర్‌లో 1.30 కోట్ల మంది దేశీయంగా విమాన ప్రయాణం సాగించారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రకారం 2023 సెప్టెంబర్‌తో పోలిస్తే గత నెలలో ప్యాసింజర్ల సంఖ్య 6.4 శాతం దూసుకెళ్లింది. వాస్తవానికి నాలుగు నెలలుగా దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్యలో క్షీణత నమోదవుతోంది. 2024 మే నెలలో 1.38 కోట్ల మంది రాకపోకలు సాగించారు. ప్యాసింజర్ల సంఖ్య జూన్ నుంచి వరుసగా 1.32 కోట్లు, 1.29 కోట్లు, 1.31 కోట్లుగా ఉంది. రద్దు అయిన విమాన సర్వీసుల సంఖ్య 0.85 శాతం ఉంది. మే నెలలో ఇది 1.7 శాతంగా నమోదైంది.ఫ్లైబిగ్ ఎయిర్ అత్యధికంగా 17.97 శాతం క్యాన్సలేషన్ రేటుతో మొదట నిలుస్తోంది. 4.74 శాతం వాటాతో అలయన్స్ ఎయిర్, 4.12 శాతం వాటాతో స్పైస్‌జెట్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. క్యాన్సలేషన్ రేటు అతి తక్కువగా ఎయిర్ ఇండియా 0.13 శాతం, ఏఐఎక్స్ కనెక్ట్ 0.27, ఇండిగో 0.62, విస్తారా 0.88 శాతం నమోదైంది. విమానాల రద్దు ప్రభావం గత నెలలో 48,222 మంది ప్రయాణికులపై పడింది. పరిహారం, సౌకర్యాలకు విమానయాన సంస్థలు రూ.88.14 లక్షలు ఖర్చు చేశాయి. సర్వీసులు ఆలస్యం కావడంతో 2,16,484 మందికి అసౌకర్యం కలిగింది. నష్టపరిహారంగా విమానయాన సంస్థలు రూ.2.41 కోట్లు చెల్లించాయి. గత నెలలో మొత్తం 765 ఫిర్యాదులు అందాయి. 10,000 మంది ప్రయాణికులకు ఫిర్యాదుల శాతం 0.59 ఉంది. మార్కెట్ లీడర్‌గా ఇండిగో.. సమయానికి విమాన సర్వీసులు అందించడంలో దేశంలో తొలి స్థానంలో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ నిలిచింది. ఇండిగో, విస్తారా, ఎయిర్ ఇండియా ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇండిగో మార్కెట్ వాటా ఏకంగా 63 శాతానికి ఎగసింది. సెప్టెంబర్ నెలలో ఈ సంస్థ 82.12 లక్షల మందికి సేవలు అందించింది. రెండవ స్థానంలో ఉన్న ఎయిర్ ఇండియా 15 శాతం వాటాతో 19.69 లక్షల మందిని గమ్య స్థానాలకు చేర్చింది.13.08 లక్షల మంది ప్రయాణికులతో విస్తారా 10 శాతం, ఏఐఎక్స్ కనెక్ట్ 5.35 లక్షల మంది ప్రయాణికులతో 4.1 శాతం వాటా సొంతం చేసుకుంది. 2022 ఫిబ్రవరిలో 10.7 శాతం మార్కెట్ వాటా కైవసం చేసుకున్న స్పైస్‌జెట్ గత నెలలో 2 శాతం వాటాకు పరిమితమైంది. సెప్టెంబర్‌లో ఈ సంస్థ 2,61,000 మందికి సేవలు అందించింది. ఆక్యుపెన్సీ రేషియో స్పైస్‌జెట్ 80.4 శాతం, విస్తారా 90.9, ఇండిగో 82.6, ఎయిర్ ఇండియా 80.1, ఏఐఎక్స్ కనెక్ట్ 81.6 శాతం నమోదైంది. -
భారత హాకీ స్టార్‌కు చేదు అనుభవం!
భారత హాకీ స్టార్, పద్మశ్రీ అవార్డు గ్రహీత రాణి రాంపాల్‌కు ఇటీవల విమాన ప్రయాణంలో చేదు అనుభవం ఎదురైంది. ఇందుకు సంబంధించిన వివరాలను ఆమె తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. అదికాస్తా వైరల్‌గా మారింది. ఎయిరిండియా విమానంలో కెనడా నుంచి భారతదేశానికి తిరిగి వచ్చేపుడు ఈ సంఘటన చోటుచేసుకున్నట్లు ఆమె తెలిపింది.వివరాల్లోకి వెళితే..రాణి రాంపాల్ ఇటీవల ఎయిరిండియా విమానంలో కెనడా నుంచి ఇండియా తిరిగి వచ్చారు. ఢిల్లీలో ఎయిర్‌క్రాఫ్ట్ ల్యాండ్ అయ్యాక తన లగేజీ తీసుకుందామని వెళ్లేసరికి ఆమెకు వింత అనుభవం ఎదురైంది. తన లగేజీ బ్యాగ్ పగిలి ఉండడం గమనించారు. దాంతో తీవ్ర అసహనానికి గురయ్యారు. ఎయిరిండియా పట్ల నిరాశ వ్యక్తం చేశారు. ఆమె ఎయిర్‌లైన్‌కు వ్యతిరేకంగా తన ఆందోళనను తెలియజేస్తూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పోస్ట్ పంచుకున్నారు.Thank you Air India for this wonderful surprise. This is how your staff treat our bags. On my way back from Canada to India this afternoon after landing in Delhi I found my bag broken.@airindia pic.twitter.com/xoBHBs0xBG— Rani Rampal (@imranirampal) October 5, 2024‘ఎయిర్ ఇండియా, మీరిచ్చిన అద్భుతమైన సర్వీసుకు ధన్యవాదాలు. మీ సిబ్బంది మా లగేజీని ఇలా భద్రపరుస్తున్నారు. ఇటీవల కెనడా నుంచి భారతదేశానికి తిరిగి వస్తుండగా, ఢిల్లీలో దిగిన తర్వాత నా బ్యాగ్ ఈ స్థితిలో కనిపించింది’ అని పోస్ట్ చేశారు. అదికాస్తా ఇతర సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఎయిరిండియా వెంటనే స్పందించింది. ‘ప్రియమైన రాంపాల్, మీకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు కోరుతున్నాం. దయచేసి మీ టిక్కెట్ వివరాలు, బ్యాగ్ ట్యాగ్ నంబర్, ఫిర్యాదు నంబర్/డీబీఆర్ కాపీని పంపించండి. వెంటనే దీనిపై చర్యలు తీసుకుంటాం’ అని ఎయిరిండియా తెలిపింది.ఇదీ చదవండి: పేరుకు స్మాల్ క్యాప్.. ఆ సంస్థల్లో పెట్టుబడెందుకు?ఎయిర్‌లైన్ కంపెనీలు టికెట్ ధరలు పెంచడం, తక్కువ ధరలకే సర్వీసులు అందిస్తున్నామని ప్రకటనలు చేయడంపై ఉన్న శ్రద్ధ ఆ సర్వీసులు అందించడంలో లేదని పలువులు అభిప్రాయపడుతున్నారు. ఏ కంపెనీ అయినా కస్టమర్లకు సరైన సర్వీసు అందించకపోతే దానికి ఆదరణ తగ్గుతుంది. ఫలితంగా కంపెనీకి కస్టమర్లు తగ్గి రెవెన్యూ దెబ్బతింటుంది. కంపెనీలకు అతీతంగా విమానయాన సంస్థలు స్పందించి కస్టమర్లకు మెరుగైన సర్వీసులు అందించాలని పలువురు కోరుతున్నారు. -
కస్టమర్లకు సకల సౌకర్యాలు!
ఎయిరిండియా తన ఎయిర్‌క్రాఫ్ట్‌లను అప్‌గ్రేడ్ చేయాలని యోచిస్తోంది. యూఎస్, యూరప్‌లు వంటి కీలక అంతర్జాతీయ మార్గాల్లో ప్రయాణించే ప్యాసింజర్లకు మెరుగైన సదుపాయాలు కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా కొత్తగా ఏ350 విమానాల్లో ఫస్ట్-క్లాస్ క్యాబిన్లను ప్రవేశపెట్టాలని సంస్థ భావిస్తోంది. ఈమేరకు సంస్థ చీఫ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఆఫీసర్ రాజేష్డోగ్రా వివరాలు వెల్లడించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘ఎమిరేట్స్, ఖతార్ ఎయిర్వేస్ వంటి మిడిల్ ఈస్ట్ కంపెనీలు ప్రీమియం కస్టమర్లను ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. అందుకు బదులుగా ఎయిరిండియా సర్వీసులవైపు మొగ్గు చూపేలా ప్రీమియం కస్టమర్లకు సకల సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించాం. రానున్న రోజుల్లో సంస్థ తన ఎయిర్‌క్రాఫ్ట్‌లను అప్‌గ్రేడ్ చేయాలని భావిస్తోంది. ముందుగా యూఎస్, యూరప్ వంటి ప్రాంతాలకు వెళ్లే సర్వీసులను అప్‌గ్రేడ్ చేయబోతున్నాం. కొత్తగా ఏ350 విమానాల్లో ఫస్ట్ క్లాస్ సర్వీసులు అందించాలని ప్రణాళికలు సిద్ధం చేశాం. ఏ320 నారో బాడీ ఎయిర్‌క్రాఫ్ట్‌లో క్యాబిన్‌ను విస్తరించే ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. దాంతోపాటు 2025 చివరి నాటికి ఢిల్లీ, ముంబయి, దుబాయ్, లండన్, న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కోలకు ప్రయాణించే కస్టమర్ల కోసం ప్రత్యేక లాంజ్ సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశాం’ అని తెలిపారు.ఇదీ చదవండి: వెహికిల్‌పై కేసుల వివరాలు క్షణాల్లో.. -
రెండేళ్లలో 9000 మంది నియామకం
ఎయిరిండియా కార్యకలాపాలు విస్తరిస్తున్న క్రమంలో భారీగా ఉద్యోగులను చేర్చుకుంటున్నట్లు సంస్థ సీఈఓ క్యాంప్‌బెల్ విల్సన్ తెలిపారు. గడిచిన రెండేళ్లలో మొత్తం 9000 మందిని నియమించుకున్నామని చెప్పారు. అందులో క్రూ సిబ్బంది 5000 మంది ఉన్నారని పేర్కొన్నారు.ఈ సందర్భంగా విల్సన్ మాట్లాడుతూ..‘2023 ఆర్థిక సంవత్సరంలో 24 శాతంగా ఉన్న సంస్థ దేశీయ మార్కెట్ వాటా 2024లో 27 శాతానికి పెరిగింది. అదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్ వాటా 21 శాతం నుంచి 24 శాతానికి చేరుకుంది. భవిష్యత్తులో ఎయిర్‌క్రాఫ్ట్ సంస్థ కార్యకలాపాలు పెరగనున్నాయి. గడిచిన రెండేళ్లలో 9000 మందిని నియమించకున్నాం. అందులో 5000 వేలమంది క్రూ సిబ్బంది ఉన్నారు. సిబ్బంది సగటు వయసు 54 సంవత్సరాల నుంచి 35 ఏళ్లకు తగ్గింది. సంస్థ ఐదేళ్ల ప్రణాళిక కోసం ప్రారంభించిన ‘విహాన్.ఏఐ’ రెండేళ్లు పూర్తి చేసుకుంది. దీనివల్ల గత ఆర్థిక సంవత్సరంలో నిర్వహణ ఆదాయం 25 శాతం మెరుగుపడింది. నష్టం 50 శాతానికి పైగా తగ్గింది’ అని చెప్పారు.ఇదీ చదవండి: యాపిల్ బ్యాటరీ బుల్లెట్‌ప్రూఫ్!‘67 నేరోబాడీ కలిగిన ఎయిర్‌క్రాఫ్ట్‌ల క్యాబిన్‌ను అప్‌గ్రేడ్ చేస్తున్నాం. 2025 మధ్యకాలం నాటికి సంస్థకు చెందిన ఇరుకైన బాడీ కలిగిన విమానాలను విశాలంగా మారుస్తాం. అందుకోసం ప్రతినెల మూడు నుంచి నాలుగు ఎయిర్‌క్రాఫ్ట్‌లను ఎంచుకోబుతున్నాం’ అని పేర్కొన్నారు. వినియోగదార్లలో విశ్వాసం పెంచేందుకు, కచ్చితమైన సమయపాలనపైనా దృష్టి సారించేందుకు 2022లో ఎయిరిండియా ‘విహాన్.ఏఐ’ను ఆవిష్కరించింది. చట్టపరమైన చిక్కులను తొలగించడంపై ఇది దృష్టి సారించింది. టేకాఫ్ దశలో భాగంగా పలు చర్యలను తీసుకుంటోంది. దీనిసాయంతో టాటా గ్రూప్ ఎయిర్ఫ్లీట్ నెట్‌వర్క్‌లో మార్పులు చేపడుతోంది. -
భారత్‌లో సర్వీసులు పెంచనున్న ఎయిర్‌లైన్స్
మలేషియా ఎయిర్‌లైన్స్ కీలక మార్కెట్‌గా భావించే భారత్‌లో తన కార్యకలాపాలు విస్తరించాలని యోచిస్తోంది. దేశంలో ప్రస్తుతం తొమ్మిది నగరాలకు ఈ ఎయిర్‌లైన్ సర్వీసులు నడుపుతోంది. సమీప భవిష్యత్తులో వీటి ఫ్రీక్వెన్సీ(సర్వీసుల సంఖ్య)ను పెంచబోతున్నట్లు మలేషియా ఎయిర్‌లైన్స్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ ఇజం ఇస్మాయిల్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘సంస్థకు భారత మార్కెట్ చాలా కీలకం. ప్రస్తుతం దేశంలో తిరువనంతపురం, అహ్మదాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, అమృత్సర్, చెన్నై, హైదరాబాద్, కొచ్చి వంటి తొమ్మిది నగరాలకు సర్వీసులు నడుపుతున్నాం. అందులో తిరువనంతపురం, అహ్మదాబాద్‌లకు సర్వీసు ఫ్రీక్వెన్సీలను పెంచాలని నిర్ణయించాం. కొత్తగా పెంచే ఫ్రీక్వెన్సీతో ఆ నగరాలకు వారానికి నాలుగు సర్వీసులు రాకపోకలు సాగిస్తాయి. ప్రస్తుతం మలేషియా ఎయిర్‌లైన్స్ దేశంలో వారానికి 71 విమానాలను నడుపుతోంది. ఆగస్టులో అమృత్‌సర్‌కు ఫ్రీక్వెన్సీ పెంచాం. 2025లో దేశంలో ఇతర నగరాలకు సర్వీసులు నడపాలనే అంశంపై చర్చలు సాగుతున్నాయి’ అని చెప్పారు.ఇదీ చదవండి: నాలుగేళ్లుగా ఉన్న ఆంక్షలు ఎత్తివేత!విమాన ప్రయాణాన్ని ప్రోత్సహించేలా కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 2016లో ఉడాన్(ఉడే దేశ్కా అమ్ నాగరిక్) పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద దేశీయ విమాన కంపెనీలకు ప్రత్యేకంగా కొన్ని ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. టైర్ 2, 3 నగరాల్లో ప్రజలు విమాన ప్రయాణాలు చేసేలా ప్రభుత్వం మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తోంది. దాంతో విదేశీ కంపెనీలు కూడా భారత్‌తో తమ సేవలు విస్తరించాలని యోచిస్తున్నాయి. -
ఆకాశవీధిలో రోజూ 4.3 లక్షల మంది
భారతీయ విమానయాన సంస్థలు ఆగస్టు నెలలో 1.31 కోట్ల మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చినట్లు గణాంకాలు వెల్లడయ్యాయి. అంటే రోజూ దాదాపు 4.3 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. 2023 ఆగస్టులో విమాన ప్రయాణికుల సంఖ్య 1.24 కోట్లుగా ఉంది. గతేడాదితో పోలిస్తే వీరి సంఖ్య ఈసారి 5.7 శాతం పెరిగింది. జులైలో నమోదైన 1.29 కోట్లమంది ప్రయాణికులతో పోలిస్తే ఇది ఎక్కువే. ఈమేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నివేదిక విడుదల చేసింది.డీజీసీఏ నివేదికలోని వివరాల ప్రకారం..గత నెలలో విమానాల ఆలస్యం కారణంగా 1,79,744 మంది ప్రయాణికులు ప్రభావితం చెందారు. వీరికి పరిహారంగా విమానయాన కంపెనీలు సుమారు రూ.2.44 కోట్లు వెచ్చించాయి. విమానాల రద్దు కారణంగా 38,599 మంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. వీరికి రూ.1.14 కోట్లు నష్టపరిహారం ఇచ్చారు. ఆగస్టులో మొత్తం 728 మంది ప్రయాణికులకు వివిధ కారణాల వల్ల బోర్డింగ్ సదుపాయాన్ని అందించలేదు. దాంతో రూ.77.96 లక్షలు పరిహారం చెల్లించారు.2024 జనవరి-ఆగస్టులో దేశీయ విమానయాన సంస్థల్లో 10.5 కోట్లమంది ప్రయాణించారు. అంతకుముందు సంవత్సరం ఇదే కాలంలో ఈ సంఖ్య 10.06 కోట్లుగా ఉంది. గతేడాదితో పోలిస్తే 4.82 శాతం వార్షిక వృద్ధి నమోదైంది. సమయపాలన పరంగా ఆగస్టులో ఆకాసా ఎయిర్ 71.2 శాతం కచ్చితత్వంతో విమానాలు నడిపి మొదటిస్థానంలో నిలిచింది. తర్వాత స్థానంలో విస్తారా (68.6 శాతం), ఏఐఎక్స్ కనెక్ట్ (66.8 శాతం), ఇండిగో, ఎయిర్ ఇండియా(66 శాతం), అలయన్స్ ఎయిర్(55.3 శాతం), స్పైస్‌జెట్ (31 శాతం) నిలిచాయి. బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్, ముంబై విమానాశ్రయాల నిర్వహణ ఆధారంగా ఆన్‌టైమ్ ఫర్ఫార్మెన్స్ (ఓటీపీ)ను లెక్కించారు.జూన్‌తో పోలిస్తే జులైలో 3.1 శాతం పెరిగిన మార్కెట్ వాటా ఆగస్టులో 2.3 శాతానికి పడిపోయింది. గతనెలలో ఇండిగో 62.4 శాతం, ఎయిర్ ఇండియా 14.7 శాతం, విస్తారా 10.3 శాతం, ఏఐఎక్స్ కనెక్ట్ 4.5 శాతం, ఆకాసా ఎయిర్ 4.4 శాతం, అలయన్స్ ఎయిర్ 0.9 శాతం మార్కెట్ వాటా నమోదు చేశాయి.ఇదీ చదవండి: ఉల్లి ఎగుమతులపై నిషేధం ఎత్తివేతవిమాన ప్రయాణాలు చేసేందుకు వీలుగా ప్రభుత్వం టైర్ 2, 3 నగరాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తుంది. దాంతో విమాన ప్రయాణికులు పెరుగుతున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. దాంతోపాటు విమానయాన కంపెనీల మధ్య పోటీ ఏర్పడి టికెట్ ధరలో రాయితీలు, ఆఫర్లు ప్రకటిస్తుండడంతో ప్యాసింజర్ల సంఖ్య పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. రానున్న రోజుల్లో వీరి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. -
విమానం దారి మళ్లింపు.. కారణం..
ముంబై నుంచి ఫుకెట్ వెళ్లాల్సిన విమానాన్ని దారి మళ్లించినట్లు ఇండిగో శుక్రవారం తెలిపింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఎయిర్‌క్రాఫ్ట్‌ను మలేషియాలోని పెనాంగ్‌కు మళ్లించినట్లు స్పష్టం చేసింది. విమాన మళ్లింపు వార్తను పలువురు ప్రయాణికులు సోషల్ మీడియాలో పంచుకోవడంతో అదికాస్తా వైరల్‌గా మారింది.‘ఫుకెట్‌లో ప్రతికూల వాతావరణ పరిస్థితులున్నాయని సమాచారం అందింది. దాంతో ప్రతిస్పందనగా ముంబై నుంచి ఫుకెట్‌కు వెళుతున్న ఫ్లైట్ నం 6E 1701 ఎయిర్‌క్రాఫ్ట్‌ను మార్గమధ్యలో దారి మళ్లించాం. ప్రతికూల వాతావరణానికి సంబంధించిన సమాచారం అందిన వెంటనే సమీప విమానాశ్రయమైన మలేషియాలోని పెనాంగ్‌లో దించాం. ఈమేరకు ప్రయాణికులకు సమాచారం అందించాం’ అని ఇండిగో ఒక ప్రకటనలో తెలిపింది. ఫుకెట్‌లోని వాతావరణ పరిస్థితిని సమీక్షించి తిరిగి ప్రయాణానికి ఏర్పాటు చేస్తున్నట్లు ప్రతినిధులు తెలిపారు.ఇదీ చదవండి: ‘అన్నీ అవాస్తవాలే’ఫుకెట్‌లో 27 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో ఆకాశం మేఘావృతమై ఉందని కొన్ని సంస్థల నివేదికల ద్వారా తెలిసింది. పశ్చిమం నుంచి గంటకు 15 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. ప్రతికూల వాతారణ పరిస్థితులు ఉన్నప్పుడు ముందస్తు సమాచారంతో విమానాలను దారి మళ్లించడం సర్వ సాధారణం. ప్రయాణికుల కుటుంబ సభ్యులు ఎలాంటి ఆందోళనలు చెందకూడదని సంస్థ ప్రతినిధులు తెలిపారు. -
రూ.932కే విమాన టికెట్
టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ‘ఫ్లాష్ సేల్’ని ప్రారంభించింది. రూ.932కే విమాన టికెట్ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ప్రకటించింది. ఈ ధర కొన్ని ప్రత్యేక రూట్లలో మాత్రమే వర్తిస్తుందని చెప్పింది. సెప్టెంబర్ 16, 2024లోపు బుక్ చేసుకున్న వారికే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని, మార్చి 31, 2025 వరకు చేసే ప్రయాణాలకు ఇది వర్తిస్తుందని తెలిపింది.రూ.932తో ప్రారంభమయ్యే బేస్ ఛార్జీలతో పాటు, వివిధ మార్గాల్లో రూ.1,088 నుంచి టికెట్లను విక్రయిస్తోంది. తక్కువ ధరకు ఆఫర్ చేసే రూట్లలో ఢిల్లీ-గ్వాలియర్, గౌహతి-అగర్తలా, బెంగళూరు-చెన్నై, కొచ్చి-బెంగళూరు తదితరాలు ఉన్నాయి. airindiaexpress.com ద్వారా తమ టిక్కెట్లను బుక్ చేసుకునే కస్టమర్లు ప్రత్యేక రాయితీ కలిగిన ‘ఎక్స్‌క్లూజివ్ ఎక్స్‌ప్రెస్ లైట్’ ఛార్జీలను పొందవచ్చని పేర్కొంది. ఉచితంగా 3 కిలోల కేబిన్ బ్యాగేజీని ముందస్తుగా బుక్ చేసుకోవచ్చని చెప్పింది.ఇదీ చదవండి: రుణాలు పీక్... డిపాజిట్లు వీక్చెక్-ఇన్ బ్యాగేజీ ధరలను దేశీయ విమానాల్లో 15 కిలోలకు రూ.1000, అంతర్జాతీయ విమానాల్లో 20 కిలోలకు రూ.1300గా నిర్ణయించారు. విద్యార్థులు, సీనియర్ సిటిజన్లు, వైద్యులు, నర్సులు, సాయుధ దళాల సభ్యులకు సంస్థ ప్రత్యేక తగ్గింపు ధరలు అందిస్తుంది. ఇదిలాఉండగా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ తన విమానాల సంఖ్యను పెంచబోతున్నట్లు గతంలో పేర్కొంది. ప్రతి నెలా దాదాపు నాలుగు కొత్త విమానాలను ప్రారంభిస్తామని తెలిపింది. ఏయిర్ ఏషియాతో విలీన ప్రక్రియ ప్రారంభించిన అక్టోబర్ 2023 నుంచి ఇప్పటివరకు 30కి పైగా కొత్త ఎయిర్‌క్రాఫ్ట్‌లను ప్రవేశపెట్టింది. -
డబ్బుతో విమానం ఎక్కుతున్నారా.. ఈ రూల్స్ తెలుసా?
Airport Rules: ప్రస్తుతం విమాన ప్రయాణం సర్వ సాధారణంగా మారిపోయింది. విదేశాలకు, దూర ప్రాంతాలకు ప్రయాణించాలంటే విమానాల్లో వెళ్లడానికే చాలా మంది ఇష్టపడతారు. గమ్యాన్ని తక్కువ సమయంలో చేరుకోవడం, ఫ్లైట్ ఫేర్లు తక్కువగా ఉండటం వంటి కారణాలతో విమానాల్లో ప్రయాణించే వారి సంఖ్య ఇటీవల పెరుగుతూ వస్తోంది.అయితే విమానంలో ప్రయాణించడానికి లగేజీకి సంబంధించిన పరిమితులు ఉంటాయని చాలా మందికి తెలిసే ఉంటుంది. కానీ ప్రయాణికులు తమ వెంట ఎంత నగదు తీసుకువెళ్లవచ్చు అనే దానిపైనా పరిమితులు ఉన్నాయని మీకు తెలుసా? దేశం వెలుపల, విదేశాలలో నగదు విత్‌డ్రా చేసుకునే సదుపాయం అందుబాటులో ఉన్నప్పటికీ, తమ సౌలభ్యం కోసం నగదును తమ వెంట తీసుకెళ్లేందుకు ఇష్టపడే వారు చాలా మందే ఉన్నారు.ఎంత తీసుకెళ్లొచ్చు?నగదును తీసుకెళ్లేందుకు సంబంధించిన నిబంధనలు దేశీయ విమానాలకు, అంతర్జాతీయ విమానాలకు వేరువేరుగా ఉంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం.. దేశీయ విమానాల్లో గరిష్టంగా రూ. 2 లక్షల నగదును తీసుకెళ్లవచ్చు. కానీ మీరు విదేశీ పర్యటనకు వెళుతున్నట్లయితే ఈ నిబంధన వర్తించదు.ఇక మీరు నేపాల్, భూటాన్ మినహా మరే ఇతర దేశానికి వెళుతున్నా 3000 డాలర్ల వరకు విదేశీ కరెన్సీని తీసుకెళ్లవచ్చు. దీని కంటే ఎక్కువ నగదును తీసుకెళ్లాలనుకుంటే స్టోర్ వ్యాల్యూ, ప్రయాణ తనిఖీలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.లగేజీ బరువు ఎంత ఉండాలి?విమానంలో మీ హ్యాండ్‌బ్యాగ్‌లో 7 నుండి 14 కిలోల బరువును తీసుకెళ్లవచ్చు. మీరు చెక్-ఇన్ కౌంటర్ వద్ద ఇచ్చే చెక్-ఇన్ బ్యాగేజీ బరువు 20 నుండి 30 కిలోల వరకు ఉంటుంది. అంతర్జాతీయ విమానాలకు కూడా ఇదే నిబంధనలు వర్తిస్తాయి.ఏవి తీసుకెళ్లకూడదు?విమాన ప్రయాణంలో మీరు కొన్ని వస్తువులను తీసుకెళ్లకూడదు. క్లోరిన్, యాసిడ్, బ్లీచ్ మొదలైన రసాయనాలను అస్సలు తీసుకెళ్లలేరు. ఇక మద్యం విషయానికి వస్తే దేశీయ విమానాల్లో మీ చెక్-ఇన్ బ్యాగ్‌లో ఆల్కహాల్ తీసుకెళ్లవచ్చు. కానీ అది 5 లీటర్లకు మించకూడదు. -
కొండలు, లోయ ప్రాంతాల్లో సులువుగా నడిపేలా కొత్త టెక్నాలజీ
ఎత్తైన కొండలు, లోయ ప్రాంతాల్లోని ఎయిర్‌పోర్ట్‌ల్లో విమానాలను దించడం, టేకాఫ్ చేయడం సవాలుతో కూడుకున్న విషయం. ఈ సమస్యను అధిగమించేలా ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ప్రకటించింది. నేపాల్ రాజధాని కాఠ్మాండూ లోయ చుట్టూ ఉన్న ప్రతికూల భౌగోళిక పరిస్థితులకు ధీటుగా విమానాన్ని నడిపేందుకు వీలుగా ఆర్ఎన్పీ ఏఆర్ టెక్నాలజీని వినియోగించింది.రిక్వైర్డ్ నేవిగేషన్ ఫర్‌ఫెర్మాన్స్ విత్ ఆథరైజేషన్ రిక్వయిర్డ్(ఆర్ఎన్పీ ఏఆర్)గా పిలువబడే ఈ టెక్నాలజీని విమానంలో వాడడం వల్ల ఎత్తు పల్లాలు వంటి ఎలాంటి భౌగోళిక పరిస్థితుల్లోనైనా విమానాన్ని నడపవచ్చని ఇండిగో తెలిపింది. ఎత్తైన ప్రాంతంపై ఉన్న కాఠ్మాండూ త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (కేటీఎం) లాంటి విమానాశ్రయాల కోసం ప్రత్యేకంగా ఈ సాంకేతికతను తయారు చేసినట్లు పేర్కొంది. ఇటీవల ఇండిగో ఏ320 ఎయిర్‌క్రాఫ్ట్‌లో ఈ ఆర్ఎన్పీ ఏఆర్ సాంకేతికను ఉపయోగించినట్లు పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) స్పష్టం చేసింది.ఇదీ చదవండి: ‘డిస్కౌంట్ ధరకు హెల్మెట్’‘ఎత్తైన ప్రదేశంలోని ఉన్న కాఠ్మాండూ త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (కేటీఎం) విమానాశ్రయం చుట్టూ హిమాలయాలు ఉన్నాయి. దాంతో ఎయిర్‌క్రాఫ్ట్‌ను దించడం, టేకాఫ్ చేయడం సవాలుగా మారుతుంది. ఆర్ఎన్పీ ఏఆర్ విధానం ద్వారా విమాన మార్గాన్ని ముందుగానే గుర్తించి అందుకు తగినట్లుగా పైలట్లు స్పందించే అవకాశం ఉంది. దాంతో ప్రమాదాలు తగ్గుతాయి. కొత్త సాంకేతికతతో ఎత్తు పల్లాల ప్రాంతాల్లో విమానాలను నడపడం సులువవుతుంది. అయితే ఈ టెక్నాలజీ వినియోగించాలంటే పైలట్లకు ప్రత్యేకంగా శిక్షణ అవసరం’ అని ఇండిగో తెలిపింది. -
ఆకాసాలో భారీ పెట్టుబడులకు చర్చలు
ప్రముఖ ఎయిర్‌లైన్ సంస్థ ఆకాసా ఎయిర్‌లో ప్రేమ్‌జీ ఇన్వెస్ట్, క్లేపాండ్ క్యాపిటల్ వాటాను కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లు కథనాలు వెలువడ్డాయి. రెండు సంస్థలు కలిపి రూ.1,049 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు.భారత్‌లో విమానయాన ప్రయాణికులు పెరుగుతున్నారు. దాంతో చాలా కంపెనీలు దేశీయ రూట్లలో విమానాల సంఖ్యను పెంచుతున్నాయి. రానున్న రోజుల్లో టైర్1, 2, 3 సిటీల్లోని ప్రజలు విమానాల్లో ప్రయాణించేందుకు ఆసక్తి చూపుతారని అంచనా వేస్తున్నాయి. దాంతో ఆయా ప్రాంతాల్లో ప్రయాణాలకు అనువైన మౌలికవసతులను అభివృద్ధి చేస్తున్నాయి. దీన్ని గమనించిన కొన్ని సంస్థలు విమానయాన కంపెనీల్లో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఇందులో భాగంగానే రూ.2,938 కోట్లు విలువైన ఆకాసా ఎయిర్‌లో తాజాగా అజీమ్ ప్రేమ్‌జీ కుటుంబం కన్సార్టియంగా ఉన్న ప్రేమ్‌జీ ఇన్వెస్ట్, మణిపాల్ గ్రూప్‌కు చెందిన రంజన్‌పాయ్ ఆధ్వర్యంలోని క్లేపాండ్ క్యాపిటల్ పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్నాయి. ఫలితంగా ఆకాసా ఎయిర్‌తో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది.ఇదీ చదవండి: ప్రైవేట్ బ్యాంకుల్లో తగ్గుతున్న ‘అట్రిషన్’ఇదిలాఉండగా, ఇప్పటికే ఆ కంపెనీలో రాకేష్జున్జున్వాలా కుటుంబానికి గరిష్ఠంగా రూ.293 కోట్ల వాటా ఉంది. ఇప్పుడు ప్రేమ్‌జీ ఇన్వెస్ట్, క్లేపాండ్ క్యాపిటల్ కలిపి దాదాపు రూ.1,049 కోట్లు ఇన్వెస్ట్ చేసేందుకు చర్చలు జరుపుతున్నారు. ఇదే జరిగితే ఆకాసాలో మేజర్ వాటాదారులుగా ప్రేమ్‌జీ ఇన్వెస్ట్, క్లేపాండ్ క్యాపిటల్ వ్యవహరిస్తాయి. ఆకాసాలో ప్రస్తుతం 24 ఎయిర్‌క్రాఫ్ట్‌లున్నాయి. 202 విమానాలను ఆర్డర్ చేశారు. 27 నగరాలకు ప్రయాణికులను చేరవేస్తున్నారు. -
‘ఫ్రీడమ్’ ఆఫర్.. బస్ టికెట్ ధరతో ఫ్లైట్ జర్నీ
తక్కువ ధరకు విమాన ప్రయాణం చేయాలనుకుంటున్నారా? అది కూడా బస్ టికెట్ ధరకే. ఈ సూపర్ ఆఫర్‌ను టాటా గ్రూప్ ఎయిర్‌లైన్ కంపెనీ 'విస్తారా' తీసుకొచ్చింది. ఈ ఆఫర్లో టికెట్లను బుక్ చేసుకుంటే రూ.1,578లకే ఎంచక్కా ఫ్లైట్ ఎక్కేయచ్చు.ఈ ఆఫర్లో టికెట్లను బుక్ చేసుకోవడం ద్వారా నవరాత్రి, దసరా వరకు ప్రయాణించవచ్చు. అయితే దీని కోసం ఆగస్టు 15లోగా టికెట్లు బుక్ చేసుకోవాలి. టాటా గ్రూప్‌కు చెందిన ఎయిర్‌లైన్ విస్తారా స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫ్రీడమ్ సేల్‌ను ప్రారంభించింది. ఈ ఆఫర్లో అక్టోబర్ 31 నుంచి ఆగస్టు 15 వరకు చౌకగా విమాన టికెట్లను బుక్ చేసుకోవచ్చు.ఈ మార్గంలో రూ.1578విస్తారా సేల్‌లో బాగ్డోగ్రా నుంచి డిబ్రూగఢ్‌కు ప్రయాణించడానికి ఎకానమీ క్లాస్‌లో ఒకవైపు దేశీయ ఛార్జీ రూ.1,578 నుంచి ప్రారంభమవుతుంది. అదే సమయంలో ముంబై నుంచి అహ్మదాబాద్‌కి ప్రీమియం ఎకానమీ క్లాస్ ప్రారంభ ధర రూ.2,678. ఇక ముంబై నుంచి అహ్మదాబాద్‌కి బిజినెస్ క్లాస్ ధర రూ.9,978 నుంచి ప్రారంభమవుతుంది. ఢిల్లీ నుంచి ఖాట్మండుకు అంతర్జాతీయ విమానానికి ఎకానమీ క్లాస్ ధర రూ.11,978 నుంచి ప్రారంభమవుతుంది. అదే ప్రీమియం ఎకానమీ విభాగంలో ఢిల్లీ నుంచి ఖాట్మండుకు ప్రారంభ ధర రూ.13,978. -
హైదరాబాద్ నుంచి ఇండిగో కొత్త సర్వీసులు
హైదరాబాద్-అహ్మదాబాద్ మధ్య విమానయాన సంస్థ ఇండిగో కొత్త, అదనపు సర్వీసులు నడుపుతామని ప్రకటించింది. హైదరాబాద్-హిరాసర్ మధ్య నూతన డెయిలీ సర్వీసును సెప్టెంబర్ 16 నుంచి ప్రారంభిస్తున్నట్లు చెప్పింది.సెప్టెంబర్ ఒకటి నుంచి హైదరాబాద్-ఉదయ్‌పూర్ మధ్య వారంలో నాలుగు ఫ్లైట్స్, సెప్టెంబర్ మూడు నుంచి హైదరాబాద్-జోద్పూర్ మధ్య వారంలో మూడు సర్వీసులు తిరిగి మొదలు అవుతాయని చెప్పింది. కొత్త రూట్ల చేరికతో భాగ్యనగరి నుంచి 69 నగరాలకు ప్రతివారం డైరెక్ట్ ఫ్లైట్స్ సంఖ్య 1,220కి చేరనుంది. ఇక అహ్మదాబాద్ నుంచి అమృత్సర్, భువనేశ్వర్‌కు అదనపు ఫ్లైట్స్‌ను నడుపుతామని ఇండిగో పేర్కొంది.ఇదీ చదవండి: ధరలు తగ్గించిన ఏకైన దేశం ఇండియాప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా విమాన ప్రయాణీకుల రద్దీ 40.7-41.8 కోట్లకు చేరుతుందని కొన్ని నివేదికలు అంచనా వేస్తున్నాయి. అదే సమయంలో విమాన సంస్థల ఆదాయాలు 15-17 శాతం పెరుగుతాయని చెబుతున్నాయి. దాంతో కంపెనీలు తమ సర్వీసులు పెంచుతున్నాయి. మెట్రో నగరాలతోపాటు టైర్1, 2 సిటీలకు కూడా తమ సర్వీసులను పొడిగిస్తున్నాయి. దేశీయంగా నడిపే విమానాల సంఖ్యను పెంచుతున్నాయి. -
వెండి తెరపై విదేశీ అందాలు.. ఎయిర్‌లైన్ వినూత్న ప్రచారం
దేశవ్యాప్తంగా అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య పెంచేందుకు సినిమా థియేటర్లలో ‘సినిమాటిక్ ఇన్-ఫ్లైట్’ పేరుతో ప్రచారాన్ని ప్రారంభిస్తున్నట్లు ఎయిరేషియా ప్రకటించింది. భారత్‌లోని 16 నగరాల నుంచి మలేషియా, థాయ్‌ల్యాండ్‌ల మీదుగా 130 గమ్యస్థానాలకు ఎయిరేషియా విమానాలు నడుపుతోంది. తన నెట్‌వర్క్‌లోని పర్యాటక స్థలాలను వివరిస్తూ ప్రచారాన్ని సాగిస్తామని కంపెనీ తెలిపింది. దానివల్ల భారత్‌లో తమ ప్రయాణికుల సంఖ్యను పెంచుకునే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.ఈ సందర్భంగా కంపెనీ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ పాల్ కరోల్ మాట్లాడుతూ..‘దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన సినిమా థియేటర్లలో ‘‘సినిమాటిక్ ఇన్-ఫ్లైట్’’ ద్వారా కంపెనీ నెట్‌వర్క్‌లోని పర్యాటక స్థలాలను ప్రదర్శిస్తాం. దానివల్ల భారత్‌లో కంపెనీకి ప్రయాణికులు పెరిగే అవకాశం ఉంది. ఇందుకోసం క్యూబ్ సినిమాస్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నాం. వచ్చే ఆరు నెలల్లో దేశంలోని 12 ప్రధాన నగరాల్లో 130 థియేటర్ల ద్వారా ఎయిరేషియా గమ్యస్థానాల గురించి వివరిస్తాం. భారతీయులు ఎక్కువ ప్రయాణించే ఆసియా, ఆస్ట్రేలియాల్లో పర్యాటక స్థలాలను సందర్శించేందుకు ఈ కార్యక్రమం అవకాశం కల్పిస్తుంది’ అన్నారు.ఇదీ చదవండి: ఒక వ్యక్తికి రూ.2 లక్షలే అప్పు ఇవ్వాలి: ఎంఫిన్ప్రస్తుతం ఎయిరేషియా భారత్ నుంచి మలేషియా, థాయ్‌లాండ్‌లకు 22 డైరెక్ట్ సర్వీసులను నడుపుతోంది. త్వరలో మరో నాలుగు మార్గాలను ప్రారంభించాలని యోచిస్తోంది. ఇందుకోసం గౌహతి, కోజికోడ్, లఖ్‌నవూ, కౌలాలంపూర్‌లను ఎంచుకుంది. రాబోయే కొన్ని వారాల్లో తిరుచిరాపల్లి నుంచి నేరుగా బ్యాంకాక్‌కు విమాన సర్వీసు ప్రారంభిస్తామని ఇప్పటికే ప్రకటించింది. -
‘థ్యాంక్యూ సర్’ అన్నందుకు విమానం నుంచి దించారు!
ఎవరైనా మిమ్మల్ని సర్..అనబోయి పొరపాటును మేడమ్ అన్నారంటే.. ఏం చేస్తారు? సర్లే.. ఏదో కంగారులో అని ఉంటారని అసలు ఆ విషయాన్నే పట్టించుకోరు కదా. కానీ ఇటీవల యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో మహిళా సిబ్బందిని పొరపాటున ‘సర్’ అన్నందుకు ఏకంగా విమానంలో నుంచే దించేశారు. దాంతో సదరు ప్రయాణికురాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.టెక్సాస్‌కు చెందిన జెన్నా లాంగోరియా తన కుమారుడు(16 నెలలు), తల్లితో కలిసి అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో నుంచి ఆస్టిన్ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. విమానం ఎక్కే సమయంలో సిబ్బంది బోర్డింగ్ పాస్‌ను అందించారు. దాంతో మహిళా అటెండెంట్‌ను పొరపాటుగా పురుషునిగా భావించి ‘థాంక్యూ సర్’ అని తెలిపింది. వెంటనే ఆ అటెండెంట్ ఆగ్రహానికి గురైంది. జెన్నా తల్లిని, బిడ్డను లోనికి వెళ్లకుండా ఆపేసింది. అదే సమయంలో జెన్నా మరో మేల్ అటెండెంట్ సాయం కోరింది. తన తల్లి, కుమారుడిని గేట్ వద్ద మరో మేల్ అటెండెంట్ ఆపేశారని ఫిర్యాదు చేసింది. దాంతో ఆ సిబ్బంది.. మీరు ఫిర్యాదు చేయాలనుకున్న అటెండెంట్ ‘ఆయన’ కాదు ‘ఆమె’ అని బదులిచ్చారు. తన తప్పును తెలుసుకుని ఆ మహిళా సిబ్బందికి క్షమాపణలు చేప్పేందుకు ప్రయత్నించినా వినలేదు. అంతటితో ఆగకుండా విమానం నుంచి దింపేశారని సోషల్ మీడియా ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.My 16-month old & I were denied entry on a @united flight back to Austin bc I used the wrong pronoun for the attendant. We have no luggage, nothing. we’re stranded in San Francisco. What are my rights? @elonmusk @jchilders98 pic.twitter.com/2b1rC14wg4— The Period Guru ® (@JennaLongoria) June 26, 2024 -
విమాన ప్రయాణం నాలుగు గంటలు ఆలస్యం..కారణం..
దిల్లీ నుంచి బాగ్డోగ్రాకు వెళ్లాల్సిన ఇండిగో విమానం వాతావరణంలోని వేడిగాలుల వల్ల దాదాపు నాలుగు గంటలు ఆలస్యంగా బయలుదేరింది. దిల్లీలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల విమానప్రయాణాల్లో అంతరాయం ఏర్పడుతోందని ఎయిర్పోర్ట్ వర్గాలు తెలిపాయి.ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..సోమవారం మధ్యాహ్నం 2:10 గంటలకు దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురి సమీపంలో ఉన్న బాగ్డోగ్రాకు వెళ్లాల్సిన ఇండిగో విమానం సాయంత్రం 6:15గంటలకు బయలుదేరింది. దిల్లీలో వేడిగాలుల తీవ్రత పెరుగుతోంది. సోమవారం 45డిగ్రీల ఉష్ణోగ్రతతో గాలులు వీయడం వల్ల ప్రయాణంలో అంతరాయం ఏర్పడింది.ఈ సందర్భంగా ఇండిగో ప్రతినిధి మాట్లాడుతూ..‘అధిక ఉష్ణోగ్రతల వల్ల దిల్లీ నుంచి బాగ్డోగ్రాకు వెళ్లే ఇండిగో విమానం 6E 2521 ప్రయాణం ఆలస్యమైంది. ఇండిగో అన్నింటికంటే ప్రయాణికుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. వేడిగాలులతో కొన్నిసార్లు ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. దాంతో ఆలస్యం అనివార్యమైంది. సంస్థ నిత్యం ప్రయాణికులకు సమాచారం అందిస్తుంది. ప్రయాణికులకు జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం’ అని చెప్పారు.హీట్ వేవ్స్ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యూఎంఓ) ప్రకారం..వరుసగా ఐదు లేదా అంతకంటే ఎక్కువ రోజులపాటు సగటు ఉష్ణోగ్రత కంటే గరిష్ఠ ఉష్ణోగ్రత ఐదు డిగ్రీలు అధికంగా నమోదైతే దాన్ని హీట్‌వేవ్‌గా పరిగణిస్తారు. ప్రభావిత ప్రాంతం గరిష్ట ఉష్ణోగ్రత రెండు రోజుల పాటు వరుసగా 45 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటే అది వేడి గాలులుగా మారే ప్రమాదముందని డబ్ల్యూఎంఓ తెలిపింది. ఈ హీట్‌వేవ్‌ను ‘నిశ్శబ్ద విపత్తు’ అని కూడా పిలుస్తారు. భారత్‌లో హీట్‌వేవ్స్ సాధారణంగా మార్చి-జూన్ మధ్య, అరుదైన సందర్భాల్లో జులైలోనూ సంభవిస్తాయి. ఇటీవల దిల్లీలోని నరేలాతోపాటు ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో అత్యధికంగా 47.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు దిల్లీలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. -
ఏడుగంటలు ఆలస్యం అయిన ఎయిర్ఇండియా ఎక్స్‌ప్రెస్.. కారణం..
కేరళలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా దుబాయ్ నుంచి కాలికట్ విమానాశ్రయానికి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాన్ని శనివారం కొచ్చికి మళ్లించారు. 173 మంది ప్రయాణికులున్న ఈ విమానం తెల్లవారుజామున 2.47 గంటలకు కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది.ఎయిర్పోర్ట్ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం..నైరుతిరుతుపవనాల కారణంగా కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం తెల్లవారుజామున కురిసిన వర్షాలకు విమాన ప్రయాణాల్లో అంతరాయం ఏర్పడింది. దుబాయ్ నుంచి కాలికట్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం శనివారం తెల్లవారుజామున 2.47 సమయంలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల కొచ్చిలో దిగింది. దాదాపు ఏడు గంటల తర్వాత ఉదయం 9.30 గంటలకు తిరిగి కాలికట్ విమానాశ్రయానికి బయలుదేరింది.ఇదిలా ఉండగా, ఆగస్టు నుంచి ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్-కోల్‌కతాకు రోజువారీ విమానాలు నడపనున్నట్లు ఎయిర్ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రకటించింది. సంస్థ విడుదల చేసిన ప్రకటన ప్రకారం..దిల్లీ క్యాపిటల్ రీజియన్ నుంచి తక్కువ దూరంలో ఉన్న ఘజియాబాద్ హిండన్ విమానాశ్రయం నుంచి కోల్‌కతా వరకు రోజువారీ విమాన సర్వీసులను ప్రారంభించనున్నారు. ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం నుంచి ఈ సర్వీసులు మొదలవుతాయి.ఇదీ చదవండి: నిమిషంలో మొబైల్..10 నిమిషాల్లో ఎలక్ట్రిక్ కారు ఫుల్‌ఛార్జ్..!ఖాట్మండు, ఢాకాలను కూడా ఎయిర్ఇండియా ఎక్స్‌ప్రెస్ తన నెట్‌వర్క్‌లో చేర్చుకోనున్నట్లు ఇటీవల న్యూదిల్లీలో జరిగిన కాపా ఇండియన్ ఏవియేషన్ సమ్మిట్‌లో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అలోక్ సింగ్ పేర్కొన్నారు. ఈ విమానాల వివరాలను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. -
ప్రయాణికులు పెరుగుతున్నా విమాన సంస్థలకు నష్టాలే: కాపా ఇండియా
విమానయాన కంపెనీలకు ఈ ఆర్థిక సంవత్సరంలో నష్టాలు తప్పవని కాపా ఇండియా(సెంటర్ ఫర్ ఏవియేషన్ పార్ట్ ఆఫ్ ది ఏవియేషన్) అంచనావేసింది. విమాన ప్రయాణీకుల రద్దీ పెరుగుతున్నప్పటికీ కంపెనీ ఖర్చులు అధికమవుతుండడంతో 2024-25 ఆర్థిక సంవత్సరంలో సంస్థలు నష్టాలబాటపట్టే అవకాశం ఉన్నట్లు తెలిపింది.కాపా తెలిపిన వివరాల ప్రకారం..2024-25 ఆర్థిక సంవత్సరంలో దేశీయ ప్రయాణీకుల రద్దీ 15.4 కోట్ల నుంచి 16.1 కోట్లకు పెరుగుతుంది. ఇండియా నుంచి విదేశాలకు వెళ్లేవారి సంఖ్య 7.5కోట్ల నుంచి 7.8 కోట్లకు పెరుగనుంది. విమాన కంపెనీల ఆదాయానికి మించి ఖర్చులు పెరిగి నష్టాలు అధికమవుతాయి. ఫలితంగా ఈ ఆర్థిక సంవత్సరంలో సంస్థలకు 400-600 మిలియన్ డాలర్ల(రూ.4వేలకోట్లు) నష్టాలు రావొచ్చు. ఈ ఏడాది ఇప్పటివరకు ఒక ప్రయాణికుడు కిలోమీటరు ప్రయాణించడానికి చెల్లించే సగటు మొత్తం దాదాపు 1 శాతమే పెరిగింది. అయితే ఏడాది పూర్తయ్యేనాటికి కంపెనీల ఖర్చులు మాత్రం 3.8 శాతం పెరుగుతాయని అంచనా.ఇదీ చదవండి: టీవీ ఛానళ్ల సబ్స్క్రిప్షన్ రేట్లు పెంపు.. ఎంతంటే..‘ప్రపంచంలోనే భారత విమానయాన మార్కెట్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. దేశీయ ప్రయాణాలకు సంబంధించి ఇండిగో సంస్థ 60% మార్కెట్ వాటాను కలిగి ఉంది. టాటాగ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిర్ ఇండియా, విస్తారా కలిపి దాదాపు 30 శాతం వాటాను కలిగి ఉన్నాయి. మిగతావాటాను అకాసా ఎయిర్, స్పైస్‌జెట్ వంటి సంస్థలు చేజిక్కించుకున్నాయి’ అని కాపా ఇండియా తెలిపింది. -
200 వైడ్‌బాడీ జెట్లు కొనుగోలు చేయనున్న ప్రముఖ సంస్థ
మిడిల్ ఈస్ట్ ఎయిర్ క్యారియర్ ఖతార్ ఎయిర్వేస్ దాదాపు 200 విమానాలను కొనుగోలు చేయాలని యోచిస్తోంది. అందులో భాగంగా ఎయిర్‌బస్ ఏ350ఎస్, బోయింగ్ 777ఎక్స్ మోడళ్లను ఆర్డర్ చేయాలని చూస్తున్నట్లు బ్లూమ్‌బర్గ్ నివేదిక ద్వారా తెలిసింది.జులై నెల చివరినాటికి బ్రిటన్‌లో జరగబోయే ‘ఫార్న్‌బరో ఎయిర్ షో’లో విమానాల కొనుగోలుకు సంబంధించి తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉందని నివేదిక తెలిపింది. బ్లూమ్‌బర్గ్ తెలిపిన వివరాల ప్రకారం..ఖతార్ ఎయిర్వేస్ దాదాపు 200 విమానాలను కొనుగోలు చేయాలనుకుంటుంది. వైడ్‌బాడీ జెట్లుగా పేరున్న ఎయిర్‌బస్ ఏ350, బోయింగ్ 777ఎక్స్ మోడళ్లను ఆర్డర్ చేయాలని చూస్తుంది. దీనిపై ‘ఫార్న్‌బరో ఎయిర్ షో’ నిర్ణయం వెలువడనుంది. ఇంధనాన్ని సమర్థంగా వినియోగించుకునే వైడ్‌బాడీ జెట్లపై విమానకంపెనీలు ఆసక్తిగా ఉన్నాయి. నిర్వహణ ఖర్చులను తగ్గించడానికి, పెరుగుతున్న అంతర్జాతీయ ప్రయాణ డిమాండ్‌ను తీర్చడానికి సంస్థ వీటిని కొనుగోలు చేయనుంది.ఇదీ చదవండి: తగ్గిన చమురు ధరలు.. ఒపెక్‌ప్లస్ కూటమి ప్రభావంఈ డీల్ వివరాలకోసం ఎయిర్‌బస్‌ను సంప్రదించినపుడు విమానాల అవసరాల గురించి కస్టమర్లతో నిరంతరం చర్చలు జరుపుతున్నామని తెలిపింది. అయితే ఈ డీల్‌కు సంబంధించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ఖతార్ ఎయిర్వేస్ తన కార్యకలాపాలను విస్తరించడానికి 100 నుంచి 150 వైడ్‌బాడీ జెట్లను ఆర్డర్ చేయనుందని బ్లూమ్‌బర్గ్ మార్చిలోనే నివేదించింది. బోయింగ్, ఎయిర్‌బస్‌లతో ముందస్తు చర్చలు జరుపుతోందని గతంలో తెలిపింది. -
ఈ విమానం ఇంకోసారి ఎక్కితే.. ఎయిరిండిపై ప్రయాణికుడు ఆగ్రహం
ఎయిరిండియా విమానంలో సౌకర్యాలపై ఓ ప్రయాణికుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతేకాదు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది. అకల్ ధింగ్రా న్యూయార్క్ నుండి ఢిల్లీకి ఎయిర్ ఇండియాలో విమానంలో ప్రయాణించారు. ప్రయాణంలో తాను ఆహారం, చైర్లు ఇతర సదుపాయాలపై అసౌకర్యానికి గురయ్యాడు. మరో నెలలో ఢిల్లీ నుంచి న్యూయార్క్‌కు వెళుతున్నానని, పొరపాటున కూడా ఎయిరిండియా విమానం ఎక్కబోనంటూ ఆ వీడియోలో తెలిపాడు.అకల్ ధింగ్రా వీడియోలో స్లైడింగ్ టేబుల్ సరిగా పనిచేయకపోవడం, దెబ్బతిన్న హెడ్‌ఫోన్ జాక్ వంటి అనేక సమస్యల్ని ఎత్తి చూపాడు. విమానంలో అందించిన ఆహారం కూడా నాణ్యతగా లేదని కూడా చెప్పాడు. చివరగా.. ‘న్యూయార్క్ నుండి ఢిల్లీకి నా ఎయిర్ ఇండియా విమానం విపత్తు!’ అని వీడియో క్యాప్షన్‌లో జతచేశాడు. ఆ వీడియోపై నెటిజన్లు ఎయిరిండియా విమాన ప్రయాణంలో తమకు చేదు అనుభవాలున్నాయంటూ కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Akul Dhingra (@akuldhingra) -
ఆకాశవీధిలో 41.8 కోట్లమంది.. ఇక్రా నివేదిక
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా విమాన ప్రయాణీకుల రద్దీ 40.7-41.8 కోట్లకు చేరుతుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. అదే సమయంలో విమాన సంస్థల ఆదాయాలు 15-17 శాతం పెరుగుతాయని చెప్పింది. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) అధీనంలోని విమానాశ్రయాలతో పాటు దిల్లీ, హైదరాబాద్, కోచి అంతర్జాతీయ విమానాశ్రయాలను నమూనాగా తీసుకుని ఇక్రా ఈ నివేదిక విడుదల చేసింది.ఇక్రా నివేదిక ప్రకారం..కరోనా కంటే ముందు నమోదైన విమాన ప్రయాణాలతో పోలిస్తే 10 శాతం అధికంగా ఫ్లైట్‌జర్నీ చేస్తున్నారు. మార్చి 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 37.6 కోట్ల మంది విమానాల్లో ప్రయాణించారు. విమానాల రద్దీ ఏటా 8-11 శాతం పెరుగుతోంది. 2023 క్యాలెండర్ ఏడాదిలో అంతర్జాతీయ ప్రయాణికుల రద్దీలో భారత్ వాటా 4.2 శాతంగా ఉంది. 2019లోని 3.8 శాతంతో పోలిస్తే అధికం. 2023లో గ్లోబల్‌గా ప్రయాణికుల రద్దీ 96 శాతం పుంజుకుంది. అదే భారత్‌లో మాత్రం 106 శాతం రికవరీ అయింది. దేశీయంగా కొత్త మార్గాలు, విమానాశ్రయాల సంఖ్య పెరగడంతో ఇది సాధ్యపడినట్లు ఇక్రా తెలిపింది.ఇదీ చదవండి: పెరగనున్న వస్తు ఎగుమతులు.. ఎంతంటే..ఇక్రా కార్పొరేట్ రేటింగ్స్ వైస్ ప్రెసిడెంట్ వినయ్ కుమార్ మాట్లాడుతూ..‘విరామం కోసం, వృత్తి వ్యాపార అవసరాల రీత్యా ప్రయాణాలు అధికంగా చేస్తున్నారు. కొత్త గమ్యస్థానాలకు విమాన సర్వీసులు ప్రారంభం కావడమూ కలిసొస్తోంది’ అన్నారు.