![Indian Origin Doctor Saves Passanger Life After Twice Cardiac Arrest - Sakshi](/styles/webp/s3/article_images/2023/01/6/doctor.jpg.webp?itok=XDjAPe1v)
ఒక వ్యక్తి ఫ్లైట్ జర్నీలో ఉండగా గుండె పోటుకి గురయ్యాడు. దీంతో భారత సంతతికి చెందిన వ్యక్తి ఐదుగంటలు శ్రమించి అతన్ని కాపాడేందుకు ప్రయత్నించాడు. విమానంలో తగిన వైద్య పరికరాలు లేకపోయినప్పటికీ.. ఆయన్ను రక్షించేందుకు విశ్వ ప్రయత్నం చేయడంతో...సదరు పేషెంట్ కన్నీళ్లు పెట్టుకుంటూ భావోద్వేగానికి గురయ్యాడు. ఈ ఘటన లండన్ నుంచి భారత్‌కి వెళ్లే విమానంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకెళ్తే...బర్మింగ్‌హామ్‌లో కన్సల్టెంట్ హెపటాలజిస్ట్ , భార సంతతి డాక్టర్ విశ్వరాజ్ వేమల సుమారు 10 గంటల పాటు ఫ్లైట్ జర్నీలో ఉండగా.. ఒక అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో 43 ఏళ్ల వ్యక్తి రెండు సార్లు తీవ్ర గుండెపోటుకి గురయ్యాడు. దీంతో విమాన సిబ్బంది ఈ విషయం గురిచి డాక్టర్ విశ్యరాజ్ తెలియజేశారు. ఈ మేరకు విశ్వరాజ్ అతన్నిరక్షించేందుకు విమానంలో పరిమిత పరిధిలోనే ఉన్న వైద్య సామాగ్రితో అతని ప్రాణం కాపాడేందుకు శతవిధాల యత్నించారు.
వాస్తవానికి ఆయన లండన్‌లో ఉన్న తన తల్లిని తిరిగి భారత్‌లోని తమ స్వస్థలం బెంగళూరుకి తీసుకువెళ్తుండగా.. ఈ ఘటన జరిగింది. విమాన సిబ్బంది ఒక వ్యక్తికి గుండె పోటు వచ్చిందంటూ తన వద్దకు పరిగెత్తుకు వచ్చినట్లు విశ్వారాజ్ తెలిపారు. విమానంలో ఉన్న పరిమిత పరిధిలో అందుబాటులో ఉన్న ఎమర్జెన్సీ కిట్ సాయంతో అతన్ని కాపాడేందుకు ప్రయత్నించినట్లు చెప్పారు. ఐతే అతను స్ప్రుహలోకి రావడానికి సుమారు గంట సమయం పట్టిందని, తనతో మాట్లాడుతుండగానే మరోసారి గుండెపోటుకి గురైనట్లు తెలిపాడు.
దీంతో విమానంలో ఉన్న మిగతా ప్రయాణికులు, విమాన సిబ్బంది అందరిలో ఆ వ్యక్తి గురించే ఒకటే టెన్షన్ మొదలైంది. అందరం అతను ఐదుగంటల వరకు ప్రాణాలతో ఉండేలా ప్రయత్నించాం. ఆ ప్రయాణికుడు విషయమై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో పైలెట్ ముంబైలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు.తామంతా ముంబైలో దిగుతుండగా అందరిలోనే అతను బతకే ఉండాలంటూ ఒకటే ఆందోళన చెందినట్లు తెలిపారు.
ఎట్టకేలకు ముంబైలో దిగినప్పుడూ.. ఆ ప్రయాణికుడు సదరు డాక్టర్ విశ్వారాజ్‌తో మాట్లాడటమే కాకుండా కన్నీటితో కృతజ్ఞతలు తెలిపాడు. అదీగాక ముంబైలోని ఎయిర్‌పోర్ట్ అత్యవసర సిబ్బంది అతన్ని సురక్షితంగా కాపాడటమే గాక అతను కూడా పూర్తి స్థాయిలో కోలుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు డాక్టర్ విశ్వరాజ్ వేముల తన జీవితాంతం ఈ ఘటన మర్చిపోలేనంటూ..ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.
(చదవండి: ఘోర ప్రమాదం..ఏకంగా నెత్తిమీద ఉన్న చర్మంతో సహా ఊడి..)
Comments
Please login to add a commentAdd a comment