క్రికెట్ మైదానంలో విషాదం నెలకొంది. గుండెపోటు కారణంగా హోయ్‌సలా (32) అనే పేరుగల కర్ణాటక క్రికెటర్ మృతి చెందాడు. బెంగళూరులోని ఆర్‌ఎస్‌ఐ మైదానంలో జరుగుతున్న ఏజిస్ సౌత్ జోన్ టోర్నీలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.
తమిళనాడుతో ఇవాళ (ఫిబ్రవరి 23) మ్యాచ్ జరుగుతుండగా హోయ్‌సలా మైదానంలోనే కుప్పకూలాడు. హుటాహుటిన సమీపంలోని బౌరింగ్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ప్రాణాలు వదిలినట్లు వైద్యులు తెలిపారు.
బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన హోయ్‌సలా అండర్ 25 విభాగంలో కర్ణాటక జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. విధ్వంసర బ్యాటర్‌గా పేరున్న ఈ మిడిలార్డర్ బ్యాటర్.. కర్ణాటక ప్రీమియర్ లీగ్‌లోనూ ఆడాడు.
క్రికెటర్లు మైదానంలో ఆటగాళ్లు ఇలా మృతి చెందడం ఇది తొలిసారి కాదు. గతంలో అంతర్జాతీయ క్రికెటర్లు ఇయాన్ ఫాలీ, వసీం రజా, ఎడ్వర్డ్ కాక్స్, అండీ డకెట్, రేమండ్ వాన్ స్కూర్ హార్ట్ అటాక్ కారణంగా మైదానంలోనే ప్రాణాలు వదిలారు. రామన్ లాంబా, ఫిల్ హ్యూస్ లాంటి క్రికెటర్లు బంతి బలంగా తాకడంతో మృతి చెందారు.
Comments
Please login to add a commentAdd a comment