cardiac arrest
-
గుండెపోటుతో ప్రముఖ పారిశ్రామికవేత్త మృతి
ఎపిగామియా సహ వ్యవస్థాపకుడు 'రోహన్ మిర్చందానీ' (Rohan Mirchandani) డిసెంబర్ 21 రాత్రి గుండెపోటుతో మరణించారు. ఈ విషయాన్ని ఎపిగామియా మాతృ సంస్థ డ్రమ్స్ ఫుడ్ ఇంటర్నేషనల్ ధృవీకరించింది.అకస్మాత్తుగా గుండెపోటుకు గురైన తన ప్రియతమ వ్యవస్థాపకుడు రోహన్ మిర్చందానీ అకాల మరణం చెందారని డ్రమ్స్ ఫుడ్ ఇంటర్నేషనల్ ధృవీకరిస్తూ.. తీవ్ర విచారం వ్యక్తం చేసింది. రోహన్ లేకపోయినప్పటికీ.. ఆయన విలువలు మాకు మార్గదర్శకంగా కొనసాగుతాయి. అయన కలలను నిజం చేయడానికి, సంస్థను అభివృద్ధి చేయడానికి మేము కలిసి పని చేస్తామని కంపెనీ ఓ అధికారిక ప్రకటనలో తెలిపింది.అంకుర్ గోయెల్ (సీఓఓ & వ్యవస్థాపక సభ్యుడు), ఉదయ్ థాక్కర్ (కో-ఫౌండర్ & డైరెక్టర్) నేతృత్వంలో కంపెనీ రోజువారీ కార్యకలాపాలను కొనసాగిస్తుంది. ఇందులో రోహన్ కుటుంబం కూడా ఉంటుంది. రోహన్ మా గురువు, స్నేహితుడు.. నాయకుడు. అతని విజన్‌ని ముందుకు తీసుకెళ్లడానికి మేము కట్టుబడి ఉన్నామని అంకుర్ గోయెల్ & ఉదయ్ థాక్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. -
పెను విషాదం.. గుండెపోటుతో క్రికెటర్ మృతి.. వీడియో
క్రికెట్ మైదానంలో పెను విషాదం చోటు చేసుకుంది. కార్డియాక్ అరెస్ట్ కారణంగా యువ ఆటగాడు మృతి చెందాడు. పూణేలోని ఛత్రపతి సంభాజి నగర్లో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉండే ఓ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా.. ఇమ్రాన్ పటేల్ అనే ఆటగాడు కార్డియాక్ అరెస్ట్ కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. ఈ మ్యాచ్‌లో ఓపెనింగ్ బ్యాటర్‌గా బరిలోకి దిగిన ఇమ్రాన్ పటేల్.. కొన్ని ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన అనంతరం ఛాతీ నొప్పి వస్తుందని అంపైర్లకు చెప్పాడు. పెవిలియన్‌కు వెళ్లే క్రమంలో ఇమ్రాన్ కుప్పకూలిపోయాడు. A young man, Imran Sikandar Patel, died of a #heartattack while playing cricket in the Chhatrapati Sambhaji Nagar district of Maharashtra.https://t.co/aCciWMuz8Y pic.twitter.com/pwybSRKSsa— Dee (@DeeEternalOpt) November 28, 2024హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్దారించారు. ఇమ్రాన్‌కు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని.. పైపెచ్చు ఎప్పుడూ ఫిట్‌గా ఉండేవాడని తోటి క్రికెటర్లు చెప్పారు. ఇమ్రాన్‌కు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. చిన్న కూతురు నాలుగు నెలల పసి గుడ్డు. ఇమ్రాన్ అంత్యక్రియలకు జనం తండోపతండాలుగా వచ్చారు. బ్యాటింగ్ ఆల్‌రౌండర్ అయిన ఇమ్రాన్ పటేల్‌కు ఓ క్రికెట్ టీమ్ ఉంది. జీవనోపాధి కోసం అతను రియల్ ఎస్టేట్ వ్యాపారం మరియు జ్యూస్ షాప్ నడిపే వాడు. ఇమ్రాన్ మృతి స్థానికంగా విషాద ఛాయలు నింపింది. అచ్చం ఇమ్రాన్లాగే రెండు నెలల క్రితం ఇదే పూణేలో మరో స్థానిక క్రికెటర్ కూడా మృతి చెందాడు. హబీబ్ షేక్ అనే క్రికెటర్ మ్యాచ్ ఆడుతూ ప్రాణాలు కోల్పోయాడు.సెప్డెంబర్ 7న ఈ ఘటన జరిగింది. మృతుడు షుగర్ పేషంట్ అని తెలిసింది. -
ఐదేళ్ల చిన్నారికి కార్డియాక్ అరెస్టు..20 సెకన్ల పాటు..!
యూఎస్‌లోని ఐదేళ్ల చిన్నారి కార్డియాక్ అరెస్టు గురై కుప్పకూలింది. దాదాపు 20 సెకన్లపాటు గుండె ఆగిపోయింది. అయితే ఆ బాలుడి బతుకుతాడో లేదో అన్న తీవ్ర ఉత్కంఠ రేగింది. ఈక్రమంలో అతడిని వైద్య పరీక్షల నిమిత్తం మూడు వేర్వేరు ఆస్పత్రలు తరలించారు. అయితే ఆ బాలుడి అదృష్టవశాత్తు మృత్యుంజయుడై బయటపటడి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.ఈ ఉత్కంఠభరితమైన ఘటన యూఎస్‌లోని థీమ్ పార్క్ వాల్డ్ డిస్నీ వరల్డ్‌లో చోటు చేసుకుంది. ఐదేళ్ల ఎర్నెస్టో టాగ్లే అనే చిన్నారి రోలర్‌కోస్టర్‌ను రైడ్ చేస్తుండగా అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. అతని వెనుక కూర్చొన్న ఆమెకు అతడి పల్స్‌లో ఏదో తేడా ఉన్నట్లు గమనించింది. వెంటనే ఛాతీపై తట్టడం వంటి సీఆర్పీ పనులు చేసింది అతడి తల్లి క్రిస్టీనా. ఆ రోలర్ కోస్టర్ రైడ్ ముగిసిన వెంటనే తన కొడుకుని హుటాహుటినా ఆస్పత్రికి తరలించింది. ఆమె వెంట ఒక నర్సు, ఈఎంటీ మెషిన్ని వెంటబెట్టుకుని వెళ్లింది. ఆ సమయంలో ఎర్నెస్టో దాదాపు 20 సెకన్ల పాటు శ్వాస పీలచ్చుకోవడం లేదు అంటే.. గుండె ఆగిపోయింది. దీంతో వాళ్లు గుండె మళ్లీ సక్రమంగా కొట్టుకునేలా ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేటర్(ఈఎంటీ)ను అందించి హెలికాప్టర్ ద్వారా ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి ఆ బాలుడిని మూడు వేర్వేరు ఆస్పత్రులకు తరలించి వివిధ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో అతడు కాటెకోలమినెర్జిక్ పాలీమార్ఫిక్ వెంట్రిక్యులర్ టాచీకార్డియా (సీపీవీటీ)తో బాధపడుతున్నట్లు నిర్థారణ అయ్యింది. ఇది అరుదైన గుండె పరిస్థితి. దీని కారణంగా సదరు రోగికి తీవ్రమైన ఉత్సాహం లేదా కార్యకలాపాల సమయంలో అకస్మాత్తుగా గుండె ఆగిపోవడం లేదా లయ తప్పడం జరుగుతుంటుంది. ప్రాణాంతకమైన ఈ అరిథ్మియాలో వచ్చే ఆకస్మిక కార్డియాక్ అరెస్టుని నివారించేలా ఒక పరికరాన్ని అతడి ఛాతీలో ఉంచారు. అయితే అన్ని నిమిషాలపాటు శ్వాస ఆగిపోయిన టైంలో అతడి గుండె, మెదడు దెబ్బతినకుండా వైద్యులు రక్షించడం విశేషం. ఈ భయానక ఘటన నుంచి తన కొడుకు ఓ యోధుడిలా తిరిగొచ్చడాని ఇన్స్టాగ్రామ్ వేదికగా ఈ విషయాన్ని పంచుకుంది. అంతేగాదు తన కుమారుడిని కాపాడేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. "ఆ చిన్నారి శక్తి అజేయం, భయానక పరిస్థితిని నుంచి బయటపడ్డ అద్భుత వ్యక్తి". అని నెటిజన్లు ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు.(చదవండి: ఒత్తిడికి గురైతే ఆస్తమా అటాక్ అవుతుందా..? రెండింటికి సంబంధం ఏంటీ..?) -
19 ఏళ్లకే గుండెపోటు? ఐపీఎస్ అధికారి కుమార్తె అనుమానాస్పద మరణం
ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో శనివారం రాత్రి 19 ఏళ్ల విద్యార్థిని తన హాస్టల్ గదిలో శవమై కనిపించింది. రామ్ మనోహర్ లోహియా నేషనల్ లా యూనివర్సిటీలో విద్యార్థిని అనికా రస్తోగి అపస్మారక స్థితిలో గుర్తించి ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆలస్యం జరిగిపోయింది. దీంతో అనికా కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది. మరోవైపు ఆమె గుండెపోటుతో మరణించినట్టు ఆసుపత్రి వైద్యులు ప్రకటించారని పోలీసులు తెలిపారు. దీంతో అనికా హఠాన్మరణంపై గుండెపోటు టీనేజర్ల పాలిట శాపంగా మారుతోందా? చదువుల ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నారా? అసలేమైంది లాంటి అనేక సందేహాలు వెల్లువెత్తాయి.మృతురాలు మహారాష్ట్ర కేడర్‌కు చెందిన 1998 బ్యాచ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) అధికారి సంజయ్ రస్తోగి కుమార్తె. ప్రస్తుతం ఈయన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA)లో ఇన్స్పెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్నారు. అనికా బీఏ ఎల్ఎల్బీ మూడో సంవత్సరం చదువుతోంది. శనివారం రాత్రి ఆమె హాస్టల్ రూమ్‌లోని అపస్మారక స్థితిలో పడి ఉండగా సిబ్బంది గుర్తించారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. ఆమె శరీరంపై ఎలాంటి గాయాలు లేవని, హాస్టల్ గదికి లోపలి నుంచి తాళం వేసి ఉందని, లోపల అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదని పోలీసులు ప్రకటించారు. బాధితురాలి కుటుంబ సభ్యులు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని కూడా తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామనీ, పోస్టుమార్టం నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని ఆషియానా పోలీసులు తెలిపారు. -
గుండెపోటుతో డిగ్రీ విద్యార్థిని మృతి
ఉత్తరప్రదేశ్ లక్నోలో విషాదం చోటు చేసుకుంది. గుండె పోటుతో 19 ఏళ్ల విద్యార్థిని మరణించింది. అనికా రస్తోగి రామ్ మనోహర్ లోహియా నేషనల్ లా యూనివర్సిటీ విద్యార్థిని. హాస్టల్లో ఉండి చదువుతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి హాస్టల్ రూమ్‌లో గుండెపోటుతో మరణించారు. ఆదివారం ఉదయం హాస్టల్ రూంలో నిద్రిస్తున్న అనికాతో మాట్లాడేందుకు ఆమె స్నేహితురాలు వెళ్లింది. అయితే ఆపస్మారక స్థితిలో ఉండడం గమనించింది. హుటాహుటీనా ఆస్పత్రికి తరలించింది. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు ఆమె అప్పటికే మృతి చెందినట్లు పోటీసులు ప్రకటించారు.మూడవ సంవత్సరం బీఏ ఎల్ఎల్బీ చదువుతున్న రస్తోగి తండ్రి మహారాష్ట్ర కేడర్‌కు చెందిన 1998 ఐపీఎస్ అధికారి సంజయ్ రస్తోగి. ప్రస్తుతం ఢిల్లీలోని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ)లో ఇన్స్పెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్నారు. కుమార్తె మరణించినట్లు సంజయ్ రస్తోగికి పోలీసులు సమాచారం అందించారు. -
గోల్డ్ మెడల్ గెలిచిన బాక్సర్.. హెడ్‌కోచ్‌కు గుండె పోటు
ప్యారిస్ ఒలింపిక్స్‌లో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. ఉజ్బెకిస్థాన్ బాక్సింగ్ జట్టు ప్రధాన కోచ్ తుల్కిన్ కిలిచెవ్ గుండె పోటుకు గురయ్యాడు. అయితే సకాలంలో స్పందించిన బ్రిటన్ బాక్సింగ్ వైద్య బృందం తుల్కిన్ ప్రాణాలను కాపాడారు. అతడు ప్రస్తుతం ప్యారిస్‌లోని ఓ అస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తుల్కిన్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఒలింపిక్స్ ప్రతినిథులు తెలిపారు.అసలేం జరిగిందంటే?ప్యారిస్ వేదికగా జరుగుతున్న ఈ విశ్వక్రీడల్లో ఉజ్బెకిస్థాన్ బాక్సర్ హసన్‌బాయ్ దుస్మాటోవ్ బంగారు పతకం సాధించాడు. దీంతో కోచ్ తుల్కిన్ కిలిచెవ్ బాక్సర్తో కలిసి చేసుకున్నాడు. ఈ సందర్భంగా తుల్కిన్ ఒక్కసారిగా గుండెపోటుకు గురై కిందపడిపోయాడు.అయితే వెంటనే అక్కడే బ్రిటన్ బాక్సింగ్ వైద్యుడు హర్జ్ సింగ్, ఫిజియో రాబీ లిల్లీస్ అతడికి సీపీఆర్ చేశారు. సీపీఆర్, డీఫిబ్రిలేటర్‌తో షాక్ ట్రీట్మెంట్ ఇచ్యి కిలిచెవ్ ప్రాణాలను రక్షించారు. అనంతరం అతడికి అస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో హర్జ్ సింగ్, రాబీ లిల్లీస్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. కాగా ఒలింపిక్స్ క్రీడలు నేటితో ముగియనున్నాయి. -
బ్యాడ్మింటన్ కోర్టులో పెను విషాదం.. కార్డియాక్ అరెస్ట్‌తో యువ షట్లర్ మృతి
బ్యాడ్మింటన్ కోర్టులో పెను విషాదం చోటు చేసుకుంది. కార్డియాక్ అరెస్ట్ కారణంగా యువ షట్లర్ కోర్టులోనే ప్రాణాలు వదిలాడు. ఇండొనేషియాలో జరుగుతున్న ఆసియా జూనియర్ ఛాంపియన్షిప్ టోర్నీలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళితే.. చైనాకు చెందిన 17 ఏళ్ల ఝాంగ్ జిఝి ఆసియా జూనియర్ ఛాంపియన్షిప్ టోర్నీలో భాగంగా జపాన్‌కు చెందిన కజుమా కవానోతో తలపడ్డాడు. మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతుండగా.. ఝాంగ్ జిఝి ఒక్కసారిగా కుప్పకులిపోయాడు.పక్కనే ఉన్న సిబ్బంది ఝాంగ్ జిఝిను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఝాంగ్ జిఝిను అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు నిర్దారించారు. ఈ విషయం తెలిసి ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. इंडोनेशिया में एक टूर्नामेंट के दौरान कोर्ट पर गिर जाने के बाद 17 वर्षीय चीनी बैडमिंटन खिलाड़ी झांग झिजी की हृदयाघात से मौत हो गई।#ZhangZhijie #CardiacArrest pic.twitter.com/UoEx2ypjGf— Naval Kant Sinha | नवल कान्त सिन्हा (@navalkant) July 2, 2024 -
ఉన్నట్టుండి రూ. 33 కోట్ల జాక్‌పాట్ : గుండె ఆగినంత పనైందట!
సింగపూర్‌లో జరిగిన ఒక సంఘటన పుట్టెడు దుఃఖాన్నయినా తట్టుకునే గుండె పట్టరాని ఆనందాన్ని భరించ లేదా? అనే ప్రశ్నను లేవనెత్తింది. ఎపుడూ నష్టాలను మూటగట్టుకునే వ్యక్తికి ఊహించని అదృష్టం వరించడంతో ఉక్కిరిబిక్కిరయ్యి గుండె ఆగిపోయినంత పనైన ఘటన తాజాగా వెలుగు చూసింది.వివరాలను పరిశీలిస్తే.. సింగపూర్‌లోని మారినా బే సాండ్స్ క్యాసినోలో ఒక వ్యక్తి జాక్‌పాట్ కొట్టాడు. లాస్ వెగాస్‌కు చెందిన గేమింగ్ అండ్ రిసార్ట్ కంపెనీ నిర్వహిస్తున్న ఐకానిక్ క్యాసినోలో ఏకంగా 33 కోట్ల రూపాయలు (4 బిలియన్ డాలర్లు) గెలుచుకున్నాడు. అయితే ఎపుడూ నష్టపోయే అతడు ముందుగా ఆ విషయాన్ని నమ్మలేదు. కలో మాయో తెలియని సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయ్యాడు. ఆ ఆనదంలోనే గుండెపోటు రావడంతో కుప్పకూలి పోయాడు. ఆ ఆనందంలోనే గుండెపోటుతో కుప్పకూలిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ షాక్‌తోనే అతను చనిపోయినట్టు ఎక్స్‌లో పేర్కొన్నారు.🚨 A man won $4 million at Marina Bay Sands Casino in Singapore but tragically suffered a fatal cardiac arrest from the excitement.How f”cked up is that to win millions and didn’t even get the chance to enjoy it and die on the spot. Didn’t get a chance to set up a trust or… pic.twitter.com/UdNxNfbJZH— J Wise (@JWiseKingRa) June 24, 2024అయితే శివుడు ఆజ్ఞలేనిదే చీమ అయినా కుట్టదన్నట్టు ఆ వ్యక్తి సజీవంగానే ఉన్నాడని తాజా సమాచారం ద్వారా తెలుస్తోంది. క్యాసినో నిర్వాహకులు అతనికి తక్షణ వైద్య సహాయం అందించారని, దీంతో అతను కోలుకుంటున్నాడని కాసినో. ఆర్గ్ తెలిపినట్టుగా కమెంట్ సెక్షన్లో చూడవచ్చు. -
TN: పురుగుల మందు తాగిన ఎంపీ కన్నుమూత
చెన్నై: లోక్‌సభ ఎన్నికల కోసం ఆ సిట్టింగ్ ఎంపీకి సీటు దక్కలేదు. దీంతో మనస్తాపం చెందిన ఆయన పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. అయితే సకాలంలో స్పందించి ఆస్పత్రికి తరలించారు ఆయన కుటుంబ సభ్యులు. అయినా మృత్యువు ఆయన్ని వదల్లేదు. ఈ ఉదయం గుండెపోటుతో ఆయన ఆస్పత్రిలోనే కన్నుమూశారు. మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కజగం (ఎండీఎంకే) పార్టీ ఎంపీ గణేశమూర్తి గురువారం ఉదయం 5.05 గంటలకు మృతి చెందారు. కార్డియాక్ అరెస్ట్ కారణంగా మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. మార్చి 24వ తేదీన గణేశమూర్తి ఆత్మహత్య ప్రయత్నం చేయగా.. ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించారు. #UPDATE | MDMK MP from Erode, Ganesamoorthy passed away at 5:05 am today due to cardiac arrest. He was hospitalised on March 24 after allegedly attempting suicide. #TamilNadu https://t.co/tGQAZoRuD2 — ANI (@ANI) March 28, 2024 డీఎంకే పార్టీతో పొత్తులో భాగంగా ఈసారి ఈరోడ్ పార్లమెంట్ ఎంపీ టికెట్ కేటాయించక పోవడంతో మనస్తాపం చెందారాయన. పరుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్న ఆయన్ను కుటుంబ సభ్యులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షల అనంతరం ఆయన్ను ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉంచారు. తర్వాత మెరుగైన చికిత్స కోసం కోయంబత్తూరులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న సమయంలో ఆయన గురువారం ఉదయం కార్డియాక్ అరెస్ట్‌కు గురై మృతి చెందారు. 2019లోక్‌సభ ఎన్నికల్లో ఈరోడ్ పార్లమెంట్ స్థానం నుంచి గణేశమూర్తి డీఎంకే టికెట్‌పై గెలుపొందారు. ఆయన మృతి వార్త తెలియగానే అనుచరులు స్థానికంగా బంద్‌కు పిలుపు ఇచ్చారు. రాజకీయ నేపథ్యం: 1947 జూన్‌లో జన్మించిన గణేశమూర్తి.. 1993 నుంచి ఎండీఎంకే పార్టీలోనే ఉన్నారు. ఆయన 1998లో తొలిసారి పళని పార్లమెంట్ స్థానం నుంచి గెలుపొందారు. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో ఈరోడ్ నుంచి ఎంపీగా విజయం సాధించారు. 2019లో లోక్‌సభ ఎన్నికల సమయంలో డీఎంకే కూటమిలో భాగంగా ఎండీఎంకేకు ఈరోడ్ స్థానం దక్కింది. దీంతో ఇక్కడ దాదాపు 2 లక్షల భారీ మేజార్టీతో గెలుపొందారు. -
డ్యాన్స్ చేస్తే గుండెపోటు వస్తుందా? ఎందుకిలా పిట్టల్లా రాలిపోతున్నారు!
ఏదైనా వేడుక, జాతర, పెళ్లిళ్లలో జరిగే బారత్‌లోనూ అంతా జోషఫుల్గా డ్యాన్సులు వేస్తూ సెలబ్రేట్ చేసుకుంటారు. ఇది సర్వసాధారణం. కానీ ఇలా చేయడమే శాపంగా మారి చివరికి ఆ వేడుక/పెళ్లి కాస్త విషాదంగా ముగుస్తుంది. ఇటీవల కాలంలో అందుకు సంబంధించిన పలు ఘటనలు ఎక్కువయ్యాయి కూడా. అసలు ఇలాంటి వేడుకల్లో ఆనందంగా డ్యాన్స్‌లు చేసి..చిన్నా, పెద్దా పిట్టల్లా రాలిపోతున్నారు. బతికించుకునే ఛాన్స్ కూడా దొరకడం లేదు. చెప్పాలంటే డీజేలాంటి మ్యూజిక్‌లు పెట్టుకుని ఎంజాయ్ చేద్దామంటేనే భయం వేస్తోంది. అసలెందుకు ఈ పరిస్థితి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని డ్యాన్స్‌లు చేయాలి?. ఎంత మేర మ్యూజిక్ వింటే బెటర్ తదితరాల గురించి సవివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం!. ఎన్ని ఘటనలు జరిగాయంటే.. ఇంతవరకు ఇలాంటి విషాదకర ఘటనుల గతేడాది నుంచి వరుసగా చోటు చేసుకున్నాయి. గతేడాది అక్టోబర్‌లో గుజరాత్లో గార్భా డ్యాన్స్ చేస్తూ ఏకంగా 10 మంది చనిపోయారు. అది మరువక ముందే అదే ఏడాది తెలంగాణలో 19 ఏళ్ల యువకుడు తన బంధువు పెళ్లిలో డ్యాన్య్ చేస్తూ కుప్పకూలి చనిపోయాడు. అలాగే గతేడాది మార్చి4న బిహార్‌లో సీతామర్హి నివాసి 22 ఏళ్ల సురేంద్ర కుమార్ వేదికపై దండలు మార్చుకుని నవ వధువుతో కూర్చొని ఉండగా.. ఆకస్మాత్తుగా కుప్పకూలి చనిపోయాడు. బాధితుడు చనిపోవడానకి ముందు డీజే సౌండ్ అసౌకర్యంగా ఉందని చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం అదేలాంటి విషాద ఘటన తెలంగాణ రాష్ట్రంలోని ఓదెల మండలం కొలనూర్‌లో చోటు చేసుకుంది. రావు విజయ్‌కుమార్(33) అనే యువకుడు ఆనందంగా డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో చనిపోయాడు. ఇలా చనిపోయినవారంతే యువకులు. చాలా చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయారు. ఇలా ఎందుకు జరుగుతోందంటే..? ఏదైన ఉత్సవం, పెళ్లి వేడుకలో జనాల కోలాహలం ఎక్కువగా ఉంటుంది. దీనికి తగ్గట్టు డీజే మ్యూజిక్ లాంటివి పెద్దగానే పెడతారు. ఆ చుట్టూ ఉన్న జనాలు, ఆ మ్యూజిక్‌కి, ఉత్సాహం వచ్చి.. చిన్నా, పెద్దా, కాలు కదిపి చిందులు వేసేందుక రెడీ అయిపోతారు. దీంతో అక్కడుండే వాళ్లు మరింత ఉత్సాహంతో సౌండ్ పెంచేస్తుంటారు. ఇక డ్యాన్స్ చేసేవాళ్లు చుట్టూ ఉన్నజనం ఎంకరైజ్మెంట్, ఈలలను చూసి మరింతగా డ్యాన్స్ చేస్తుంటారు. దీంతో శరీరం అలసటకు గురై గుండెపై ఒత్తిడి పెరిగిపోతుంటుంది. ఇదేం పట్టించుకోకుండా ఆయా వ్యక్తులు శక్తికి మించి డ్యాన్స్‌లు చేసి కుప్పకూలి చనిపోవడం జరిగిపోతుంది. ఆ తర్వాత వైద్యులు గుండెపోటు లేదా గుండె ఆగిపోవడంతో చనిపోయారని ధృవీకరిస్తున్నారు. డ్యాన్స్ వల్ల వస్తుందా అంటే..? శరీరం బాగా అలిసిపోయేలా డ్యాన్స్ చేస్తే గుండెపోటు రావడం జరుగుతుందని చెబుతున్నారు వైద్యులు. ఎందుకంటే..? అప్పటికే శరీరంలో గుండెకు రక్తం సరఫరా అయ్యే నాళాల్లో అడ్డంకులు ఉంటాయి. ఎప్పుడైతే ఇలా అలసిపోతారు ఆ రక్త సరఫరా వేగం ఎక్కువ అవుతుంది. అది కాస్త గుండెపై ఒత్తిడి ఏర్పడి ఆగిపోవడం లేదా ఆకస్మికంగా రక్తం గడ్డకట్టి గుండె పోటు వచ్చి కుప్పకూలిపోవడం జరుగుతుంది. అందువల్ల శరీర సామర్థ్యానికి మించి డ్యాన్స్‌లు వంటివి చేయకపోవడమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు మ్యూజిక్ వల్ల కూడా వస్తుందా..? భారీ శబ్దాలు వల్ల హార్ట్ ఎటాక్ వస్తుందా?. చెవి నుంచి వెళ్లే శబ్ద తరంగాలు గుండెను ప్రభావితం చేస్తాయా? అంటే ఔననే! చెబుతున్నారు వైద్యులు. భారీ శబ్దాలు మనిషిపై తీవ్రమైన ప్రభావం చూపిస్తాయని పరిశోధకులు యూరోపియన్ హార్ట్ జర్నల్‌లో వెల్లడించారు. పెద్ద పెద్ద శబ్దాల వద్ద గుండె వేగంలో పెరుగుతున్న మార్పులను గుర్తించామని అన్నారు. ఈ బిగ్గర శబ్దాల కారణంగా వ్యక్తుల్లో గుండె దడ, స్ట్రోక్‌లు వచ్చే అవకాశాలు గట్టిగానే ఉన్నాయని పేర్కొన్నారు. మానవ చెవికి 60 డెసిబుల్స్ వరకు సాధారణమని వైద్యులు చెబుతున్నారు. నిజానికి ఆహ్లాదకరమైన వాయిస్ లేదా శబ్దాన్ని వినగానే కేవలం చెవితోనే వినం. హృదయంతో ఆస్వాదిస్తాం. ఇది తెలియకుండానే జరుగుతుంది. సంగీతంతో కొన్ని జబ్బులు నయం చేయడం అనే పురాతన వైద్యం ఇందులోనిదే. భయోత్సాహమైన సౌండ్లతో సాగే మ్యూజిక్ తరంగాలు కారణంగా మన శరీరంలో ఒక రకమైన ఆందోళనకు గురవ్వుతుంది. అది నేరుగా మన గుండెపైనే ప్రభావం చూపిస్తుంది. ఏవిధంగా మంచి సంగీతం హృదయాన్ని హత్తుకుని గుండె పదిలంగా ఉండేలా చేస్తుందో.. అదే మ్యూజిక్ మోతాదుకు మించితే గుండెకి డేంజరే అని అరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. (చదవండి: గుండె ‘లయ’ తప్పితే..ముప్పే! ఈ లక్షణాలు గమనించండి!) -
గంట ఆగిన గుండె... మళ్లీ కొట్టుకుంది!
ఆ వ్యక్తి గుండె కొట్టుకోవడం అపేసింది.. ఇంకేముంది చనిపోయాడని అనుకున్నారందరూ. ఎలక్ట్రిక్ షాకిస్తే (డిఫిబ్రిలేషన్) గుండె మళ్లీ కొట్టుకుంటుందేమో అని ఆశించారు. వైద్యుల సాయంతో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 17 షాకులిచ్చారు. అయినా... ఫలితం లేకపోయింది. ఇక లాభం లేదనుకున్న వైద్యులు.. అంతా అయిపోయిందని బంధువులకు చెప్పాలని అనుకుంటున్న సమయంలో జరిగిందో అద్భుతం! పదిహేడు వరుస షాకులకూ స్పందించని ఆ గుండె మళ్లీ లబ్ డబ్ అనడం ప్రారంభించింది! ఏమా అద్భుతం.. ఎక్కడ జరిగింది? కారణాలేమిటో తెలిశాయా? ఇవేనా మీ అనుమానాలు. తీర్చుకోవాలంటే చదివేయండి మరి!!! గత ఏడాది జూన్‌లో యూకేలో జరిగిందీ ఘటన. ముప్ఫై ఒక్క ఏళ్ల పిన్న వయసులో బెన్ విల్సన్ రెండుసార్లు కార్డియాక్ అరెస్ట్ అంటే గుండె పనిచేయకుండా ఉండే పరిస్థితిని అనుభవించాడు. మొదటిసారి గుండె కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు వైద్యులు అతడిని రక్షించేందుకు ప్రయత్నించారు. వరుసగా 11 షాకులిచ్చారు. ఇందుకు దాదాపు 40 నిమిషాల సమయం పట్టింది. హమ్మయ్యా బతికిపోయాడులే అనుకునేంతలోపే... విల్సన్‌కు రెండోసారి కార్డియాక్ అరెస్ట్ అయ్యింది. వైద్యులు మళ్లీ డీఫిబ్రిలేటర్‌తో షాకులివ్వడం మొదలుపెట్టారు. పదంటే పది నిమిషాల్లో ఏకంగా ఆరు షాకులిచ్చారు. అప్పటిగానీ విల్సన్ గుండె సాధారణ స్థితికి రాలేదు.!! అంతేనా.. విల్సన్‌కు బాగైందా? అంటే అక్కడే ఇంకో ట్విస్టు ఉంది. పదిహేడు షాకులు తిన్న గుండె బాగా బలహీనంగా ఉండింది. పైగా గుండె పనిచేస్తోంది కానీ... మెదడుకు రక్తప్రసరణ జరగడం లేదు. పోనీ చికిత్స చేద్దామా అంటే తట్టుకునేంత శక్తి గుండెకు ఉందో లేదో తెలియని పరిస్థితి. ఈ దశలో వైద్యులు ఇంకో కీలక నిర్ణయం తీసుకున్నారు. విల్సన్‌ను కోమాలోనే ఉంచేద్దామని తీర్మానించారు. కోమాలోనే మెదడుకు ఆక్సిజన్ సక్రమంగా అందేలా చేశారు. ఇలా ఐదు వారాలపాటు చికిత్స అందించిన తరువాత కానీ విల్సన్ మామూలు మనిషి కాలేకపోయాడు. ఆ తర్వాత నెమ్మమదిగా నడవడం, మాట్లాడే సామర్థ్యాన్ని తిరిగి పొందాడు. ప్రస్తుతం అతను కొద్దిపాటి జ్ఞాపకశక్తి సమస్యలను తప్పించి చాలావరకు అతని ఆరోగ్యం మెరుగుపడింది. ఈ మేరకు అతడి భార్య రెబెక్కా హోమ్స్ మాట్లాడుతూ .. ఆ సమయంలో తాను విల్సన్ పక్కనే ఉండిపోయానని, "డ్రీమ్ ఎ లిటిల్ డ్రీమ్ ఆఫ్ మి" అనే మా పాటను పాడుతూ ఉన్నానని నాటి విషాదకర ఘటనను గుర్తు చేసుకుంది. తన దిండుపై తాను ఉపయోగించే స్ప్రేని కొట్టి..అతడు తన కోసం కొన్న టెడ్డీని అతడి పక్కనే ఉంచి వెనక్కి వచ్చేయి విల్సన్ అంటూ అతడివైపే చూస్తూ ఉండిపోయానని చెప్పుకొచ్చింది. తన ప్రేమే అతడిని ఈ విపత్కర పరిస్థితి నుంచి ప్రాణాలతో బయటపడేలా చేపిందని ఆనందంగా చెబుతోంది. అతను తనను ఎంతగానో ప్రేమించేవాడిని, ఈ కష్టకాలంలో అతడి పక్కనే ఉండి ఆ ప్రేమనంత తాను తిరిగి అతడికి అందించానని ఉద్వేగంగా చెప్పింది రెబెక్కా. ఏదీఏమైన ఈ ఘటన మెడికల్ మిరాకిల్ అని చెప్పొచ్చు. (చదవండి: ప్రపంచంలో అత్యధికంగా ఇష్టపడే మాంసం ఏదో తెలుసా! భారత్‌లో ఏది ఇష్టపడతారంటే..) -
మైదానంలో విషాదం.. గుండెపోటుతో క్రికెటర్ మృతి
క్రికెట్ మైదానంలో విషాదం నెలకొంది. గుండెపోటు కారణంగా హోయ్‌సలా (32) అనే పేరుగల కర్ణాటక క్రికెటర్ మృతి చెందాడు. బెంగళూరులోని ఆర్ఎస్ఐ మైదానంలో జరుగుతున్న ఏజిస్ సౌత్ జోన్ టోర్నీలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. తమిళనాడుతో ఇవాళ (ఫిబ్రవరి 23) మ్యాచ్ జరుగుతుండగా హోయ్‌సలా మైదానంలోనే కుప్పకూలాడు. హుటాహుటిన సమీపంలోని బౌరింగ్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ప్రాణాలు వదిలినట్లు వైద్యులు తెలిపారు. బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన హోయ్‌సలా అండర్ 25 విభాగంలో కర్ణాటక జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. విధ్వంసర బ్యాటర్‌గా పేరున్న ఈ మిడిలార్డర్ బ్యాటర్.. కర్ణాటక ప్రీమియర్ లీగ్‌లోనూ ఆడాడు. క్రికెటర్లు మైదానంలో ఆటగాళ్లు ఇలా మృతి చెందడం ఇది తొలిసారి కాదు. గతంలో అంతర్జాతీయ క్రికెటర్లు ఇయాన్ ఫాలీ, వసీం రజా, ఎడ్వర్డ్ కాక్స్, అండీ డకెట్, రేమండ్ వాన్ స్కూర్ హార్ట్ అటాక్ కారణంగా మైదానంలోనే ప్రాణాలు వదిలారు. రామన్ లాంబా, ఫిల్ హ్యూస్ లాంటి క్రికెటర్లు బంతి బలంగా తాకడంతో మృతి చెందారు. -
ప్యాంక్రియాటిక్ కేన్సర్ వల్ల గుండె ఆగిపోతుందా?
ప్రముఖ బాలీవుడ్ టీవీ నటుడు రితురాజ్ సింగ్ 59 ఏళ్ల వయసులో కార్డియాక్ అరెస్టుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన గత కొంతకాలం ప్యాంక్రియాటిక్ (క్లోమ గ్రంధి క్యాన్సర్) వ్యాధితో బాధపడుతున్నారు. ఇటీవలే ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయ్యి ఇంటికి కూడా వెళ్లారు. ఏమైందో ఏమో గత రాత్రి అకస్మాత్తుగా కార్షియాక్ అరెస్టుకు గురై చనిపోయారు. దీంతో ఒక్కసారిగా బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అస్సలు ఈ ప్యాక్రియాటిక్ క్యాన్సర్ గుండె లయలపై ప్రభావం చూపిస్తుందా?. అది ప్రాణాంతకమా? ఇక్కడ ప్యాంక్రియాస్ అనగా క్లోమ గ్రంధి. ఇది శరీరంలో అతి ముఖ్యమైన అవయవం. ఎందుకంటే శరీరంలోని గ్లూకోజ్‌ని ప్రాసెస్ చేయడానికి అవసరమైన ఇన్సులిన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్యాంక్రియాస్ అనేది కాలేయం కింద, పిత్తాశయం, కడుపు, ప్రేగులకు దగ్గరగా ఉండే ఆకు ఆకారంలో ఉండే అవయవం. ఆహారం జీర్ణం చేయడానికి ముఖ్యమైన ఎంజైమ్‌ని ఉత్పత్తి చేస్తుంది. అందువల్ల దీనిలో ఏదైనా సమస్య వస్తే పలు రకాల ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ప్యాంక్రియాటిక్ రుగ్మతలు అంటే.. జీర్ణక్రియ, రక్తంలో చక్కెర నియంత్రణలో సమస్యలను కలిగిస్తాయి. ఇది సర్వసాధారణ రుగ్మత అధిక ఆల్కహాల్ తీసుకోవడం లేదా పిత్తాశయ రాళ్లు వంటి కారణాల వల్ల క్లోమగ్రంధిలో సమస్య తలెత్తి కడపు నొప్పి, వికారం, వాంతులకు దారితీస్తుంది. తీవ్రమైన రుగ్మత కాలేయ క్యాన్సర్. దీని కారణంగా కామెర్లు, అతిగా బరువు తగ్గడం తదితర సమస్యలు వస్తాయి. ప్యాంక్రియాటిక్ రుగ్మత లక్షణాలు.. పొత్తి కడుపు నొప్పి నిరంతరం తీవ్రమైన కడుపు నొప్పి, తరచుగా వెనుకకు ప్రసరించడం. ప్యాంక్రియాటిక్ రుగ్మతల లక్షణం. ఈ నొప్పి తీవ్రతలో మారవచ్చు మరియు తినడం లేదా పడుకున్న తర్వాత తీవ్రమవుతుంది. ప్యాంక్రియాటైటిస్ లేదా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వంటి పరిస్థితుల వల్ల చుట్టుపక్కల కణజాలంపై వాపు, అడ్డుపడటం లేదా ఒత్తిడి కారణంగా ఇది సంభవిస్తుంది. వికారం, వాంతులు ప్యాంక్రియాటిక్ రుగ్మతలు జీర్ణక్రియలో ఆటంకాలు కలిగిచడంతో వికారం, వాంతులు వంటి వాటికి దారితీస్తుంది. ఈ లక్షణాలు తరచుగా పొత్తికడుపు నొప్పితో పాటుగా ఉంటాయి. ఇవి కొవ్వు లేదా పెద్దగా భోజనం తినడం ద్వారా వస్తుంది. కామెర్లు చర్మం, కళ్ళు పసుపు రంగులోకి మారడాన్ని కామెర్లు అని పిలుస్తారు. అది కాస్త ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ లేదా పిత్త వాహిక అవరోధం వంటి కాలేయ రుగ్మతలకు దారితీయొచ్చు. ముఖ్యంగా పిత్తాశయం నుంచి ప్రేగులలోకి పిత్త ప్రవాహాన్ని అడ్డుకోవడం వల్ల రక్తప్రవాహంలో బిలిరుబిన్ అధికంగా ఏర్పడటంతో కామెర్లు రావడం జరుగుతుంది. అనూహ్యంగా బరువు తగ్గడం అనూహ్యంగా బరువు తగ్గడం అనేది ప్యాంక్రియాటిక్ రుగ్మతకు సంబంధించిన సాధారణ లక్షణం. ముఖ్యంగా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌లో ఆకలి లేకపోవడం, పోషకాలు శోషించుకోలేకపోవడం, తగిన జీవక్రియలు లేకపోవడం తదితర లక్షణాలు తలెత్తుతాయి. ప్రేగు కదలికల్లో మార్పులు ప్యాంక్రియాటిక్ రుగ్మతలు విరేచనాలు, జిడ్డుగల లేదా జిడ్డుగల మలం లేదా లేత-రంగు మలం వంటి ప్రేగు కదలికలలో మార్పులకు దారితీయవచ్చు. సరైన జీర్ణక్రియకు అవసరమైన ప్యాంక్రియాటిక్ ఎంజైమ్‌ల ఉత్పత్తి తగినంతగా లేకపోవడం వల్ల ఈ మార్పులు సంభవించవచ్చు. మధుమేహం దీర్ఘకాలిక ప్యాంక్రియాటైటిస్ లేదా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వంటి కొన్ని ప్యాంక్రియాటిక్ రుగ్మతలు ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే ప్యాంక్రియాస్ సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయి. ఇది డయాబెటిస్ మెల్లిటస్కు దారితీస్తుంది. జీర్ణ సమస్యలు ప్యాంక్రియాటిక్ రుగ్మతలు ఉన్న వ్యక్తులు ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం, తక్కువ మొత్తంలో ఆహారం తీసుకున్న తర్వాత కూడా కడుపు నిండిన అనుభూతి వంటి జీర్ణ సమస్యలతో బాధపడతారు. క్లోమ గ్రంధి రుగ్మతలు కార్డియాక్ అరెస్ట్‌కు ఎలా దారితీస్తాయంటే.. ప్యాంక్రియాటైటిస్ లేదా క్లోమ గ్రంధి క్యాన్సర్ వంటి క్లోమ సంబంధిత రుగ్మతలు కార్డియాక్ అరెస్ట్‌కు కారణమయ్యే అవకాశం ఉంది. ప్యాంక్రియాస్ వాపు లేదా క్యాన్సర్ బారిన పడినప్పుడు, అది గుండెతో సహా సమీపంలోని అవయవాలకు తీవ్రమైన మంట, హాని కలిగించే పదార్థాలను విడుదల చేస్తుంది. ఈ వాపు శరీరంలో రకరకాల సమస్యలను ప్రేరేపిస్తుంది. ముఖ్యంగా గుండె పనితీరుకు కీలకమైన పొటాషియం, కాల్షియం వంటి ఎలక్ట్రోలైట్లలో అసమతుల్యతకు దారితీస్తుంది. అలాగే, ప్యాంక్రియాటిక్ రుగ్మతలు శరీరంపై గణనీయమైన నొప్పి, ఒత్తిడిని కలిగిస్తాయి. ఇది హృదయ స్పందన రేటు, రక్తపోటు పెరుగుదలకు దారితీస్తుంది.క్రిటికల్ పరిస్థితుల్లో అది కాస్త గుండెపై ఈ ఒత్తిడి ఏర్పడి ఎలక్ట్రోలైట్ అసమతుల్యత ఏర్పడి తత్ఫలితంగా గుండె ఆగిపోవడానికి దారితీస్తుంది. ఇక్కడ గుండె అకస్మాత్తుగా కొట్టుకోవడం ఆగిపోతుంది. (చదవండి: నటుడు శరత్‌బాబు ఉసురు తీసింది ఆ వ్యాధే!) -
పాపులర్ బాడీ బిల్డర్ కార్డియాక్ అరెస్ట్‌తో కన్నుమూత
పాపులర్ బాడీ బిల్డర్, ప్రముఖ వైద్యుడు రోడాల్ఫో డువార్టే రిబీరో డాస్ శాంటోస్ (33) కార్డియాక్ అరెస్ట్‌తో మరణించారు. బ్రెజిల్కుచెందిన ఈయన సోషల్ మీడియాలో బాగా పాపులర్. అయితే అనాబాలిక్ స్టెరాయిడ్స్ వాడకం వల్ల అతను మరణించాడనే వార్తలు సోషల్‌మీడియలో గుప్పుమన్నాయి. అయితే ఈ వార్తలను రొడాల్ప్ స్పోర్ట్స్ మెడిసిన్ అడ్ ఫార్మకాలజీ క్లినిక్ ఖండించింది. కాలేయంలో ట్యూమర్,రక్తస్రావం కారణంగా సావో పాలోలో రోడాల్ఫో నవంబర్ 19న ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో గుండెపోటుతో మరణించినట్లు CNN బ్రసిల్ నివేదించింది. ఆదివారం (నవంబర్, 19) ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించాడని , కాలేయంలోని అడెనోమా ఫలితంగా రక్తస్రావం కారణంగా ఆయన గుండె ఆగిపోయిందని తెలిపింది. తన రోజువారీ జీవితంలోని ఫోటోలతోపాటు, జిమ్‌లో వర్కౌట్ చేస్తున్న వీడియోలు ఫోటోలను షేర్ చేస్తూ ఉండేవాడు. ఇలాగే ఇటీవల నిశ్చితార్థం చేసుకున్న కాబోయే భార్య కరోలిన్ సాంచెస్‌తో వీడియోలను కూడా ఎక్కువగా పోస్ట్ చేసేవాడు. తన రోగులు, ఇతర అథ్లెట్లు, బాడీ బిల్డర్ల అద్భుతమైన ఫలితాలను కూడా చూపించేవారు. ఇన్స్టాగ్రామ్ స్టార్‌కు 10,000 మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. View this post on Instagram A post shared by Caroline Sanches (@carolinessanches) సావో పాలోకు దక్షిణాన మోమాలో ఉన్న ఈయన క్లినిక్ ఉంది. సాంచెస్ అక్కడ పోషకాహార నిపుణురాలుగా పనిచేస్తున్నారు. కాబోయే భర్త ఆకస్మిక మరణం తరువాత సాంచెస్ అతను గిటార్ వాయిస్తూ ‘మన మధ్య ఉన్న ప్రేమ, సాన్నిహిత్యం’ అంటూ పాడుతున్న వీడియోను ఎప్పటి ఎప్పటికీ శాశ్వతం అంటూ పోస్ట్ చేశారు.కాగా డాక్టర్ శాంటోస్ ఫెడరల్ యూనివర్శిటీ ఆఫ్ సావో పాలో నుండి స్పోర్ట్స్ మెడిసిన్ మరియు ఎక్సర్సైజ్ ఫిజియాలజీలో డిగ్రీలు పొందారు. View this post on Instagram A post shared by Rodolfo Duarte (@rodolfo.drsantos) -
గుండెపోటుతో ఎయిర్ ఇండియా పైలట్ మృతి.. 100 రోజుల్లో మూడో ఘటన
న్యూఢిల్లీ: ఈ మద్య కాలంలో చాలా మంది గుండెపోటుతో ఉన్నచోటే కుప్పకూలిపోతున్నారు. వయసుతో సంబంధం లేకుండా ఎంతో ఆరోగ్యంగా ఉండే యువకులు సైతం సడెన్ హార్ట్ఎటాక్తో మృత్యుతపడటం ఆందోళన కలిగిస్తుంది. తాజాగా ఓ యువ పైలట్ గుండెపోటుతో ప్రాణాలు విడిచిన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. ఎయిర్ ఇండియాకు చెందిన 37 ఏళ్ల పైలట్ హిమ్మనీల్ కుమార్ ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలోని టెర్మినల్ 3లోని ఎయిర్ ఇండియా ఆపరేషన్స్ విభాగంలో శిక్షణ పొందుతున్నాడు. గురువారం ఉదయం 11 గంటల సమయంలో ఉన్నట్టుండి ఛాతిలో నొప్పితో కుప్పకూలిపోయాడు. గమనించిన సహోద్యోగులు సీపీఆర్ చేశారు. అనంతరం ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. పైలట్ మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా, సీనియర్ కమాండర్ పైలట్ అయిన హిమ్మనీల్ కుమార్, పెద్దవైన బోయింగ్ 777 ఎయిర్‌క్రాఫ్ట్‌లను ఆపరేట్ చేసేందుకు అక్టోబర్ 3 నుంచి శిక్షణ పొందుతున్నట్లు ఎయిర్ ఇండియా అధికారి తెలిపారు. ఆగస్టు 23న జరిగిన వైద్య పరీక్షల్లో ఆరోగ్యపరంగా ఫిట్‌గా ఉన్నట్లు తేలిందని చెప్పారు. అయితే ఊహించని విధంగా ఆయన మరణించడంపై ఎయిర్ ఇండియా సంస్థ దిగ్భ్రాంతి వ్యక్తం చేసిందన్నారు. ఆయన కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని వెల్లడించారు. ఇదిలా ఉండగా యువ పైలట్ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవడం ఇదే మొదటిసారి కాదు. గత మూడు నెలలో ముగ్గురు పైలట్లు మృతువాతపడ్డారు. గత ఆగస్టులో ఇండిగో ఎయిర్‌లైన్‌కి చెందిన పైలట్ పూణేకు విమానం టేకాఫ్ అయ్యే ముందు నాగ్‌పూర్ ఎయిర్పోర్ట్ బోర్డింగ్ గేట్ వద్ద కుప్పకూలిపోయాడు. అతడికి ప్రథమ చికిత్స చేసి ఆస్పత్రికి తరలించినా ప్రాణాపాయం నుంచి బయటపడలేకపోయారు. ఈ సంఘటనకు ఒక రోజు ముందు, ఖతార్ ఎయిర్వేస్లో పనిచేస్తున్న స్పైస్‌జెట్ కెప్టెన్ ఢిల్లీ నుంచి దోహాకు వెళ్తుండగా విమానంలోనే మరణించాడు. చదవండి: సిద్దరామయ్య కుమారుడిపై మాజీ సీఎం సంచలన ఆరోపణలు.. -
ఏకంగా 27 నిమిషాల పాటు గుండె ఆగిపోయింది! ఆల్మోస్ట్ డెడ్ కానీ..
మృత్యువు ఒడిలోకి వెళ్లి కూడా బతికి వస్తే వాట్ ఏ మిరాకిల్ అనుకుంటాం. మన కళ్లను మనమే నమ్మలేని కఠిన నిజం గందరగోళానికి గురి చేసేలా మన కళ్లముందు మెదిలాడుతుంది. ఆ క్షణం మన ఆనందానికి అవధులుండవు. అలాంటి ఓ అద్భుత ఘటన యూఎస్‌లో చోటు చేసుకుంది. యూఎస్‌లోని టీనా అనే ఓ మహిళ కార్డియాక్ అరెస్టుకు గురై ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దాదాపు 27 నిమిషాల పాటు గుండె ఆగిపోయింది. ఓ వైపు శరీరం నీలం రంగులోకి మారిపోతుంది కూడా. ఇంతలో ఆమె భర్త ఆమెను బతికించేలా చేస్తున్న సీపీఆర్ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. అంబులైన్స్ని పిలిపించి ఆమెను హుటాహుటినా ఆస్పత్రికి తరలించే యత్నం చేశాడు. అంతేగాదు ఆస్పత్రికి వెళ్లే మార్గంలో సైతం ఆమెను బతికించేలా ఆక్సిజజన్ అందించి గుండె పనిచేశాల చేసే ప్రథమ చికిత్సల్లో వేటికి ఆమె స్పందించలేదు. చివరికి ఆస్పత్రిలో వైద్యుల సైతం ఆమె చనిపోయిందని డిసైడ్ అయ్యారు. ఆల్మోస్ట్ ఓ శవం మాదిరి నిర్జీవంగా పడి ఉంది టీనా. దీంతో వైద్యులు చివరి ప్రయత్నంగా డీఫిబ్రిలేటర్‌తో షాక్ ఇద్దాం అని డిసైడ్ అయ్యి ఇస్తే..ఏదో నిద్రలో మెల్కోన్నట్లు కళ్లు తెరించింది. ఆ హఠాత్పరిణామానికి వైద్యులు సైతం సభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. అసలు చలనం లేకుండా శవంలా పడి ఉంది. స్పదించదని తెలిసే జస్ట్ అలా కరెంట్ షాక్ ఇచ్చామని చెబుతున్నారు వైద్యులు. ఐతే కళ్లు తెరిచి చూసింది గానీ ఏం మాట్లాడలేకపోయింది. ఈ తంతంగమంతా చూస్తున్న ఆమె సభ్యులు కూడా విస్తుపోయారు. నిజంగా ఆమె బతికిందా దెయ్యమా? అన్నంత టెన్షన్‌గా చూశారు ఆమెను. ఆమె ఏం మాట్లాడలేదని వైద్యుల కుటుంబంసభ్యులకు చెప్పడంతో అంతా సైలెంట్‌గా ఉన్నారు. ఆమెకు ఒక పుస్తకం, పెన్ను ఇచ్చి నీకు ఏం జరిగిందో లేక గుర్తున్నది అందులో రాయమని సూచించారు. చనిపోయి బతికావని తెలుసా అని వైద్యులు అడగగా..ఔను! ఒక్కసారిగా చలనం లేకుండా పడి ఉన్నట్లు అనిపించిందని ఎంత ప్రయత్రించినా మేల్కొలేకపోతున్నట్లు తెలిసిందని చెప్పడంతో అంతా ఆశ్చర్యపోయారు. నిజానికి ఇలా జరిగినప్పుడు ఆక్సిజన్ బ్రెయిన్‌కి అందక మెదడులో బ్లీడింగ్ అయ్యి చనిపోవడం జరుగుతుంది. అందువల్ల బతకదని తేల్చి చెప్పాం అన్నారు. ఆమె బతికినా బ్రెయిన్‌కి సంబంధించిన కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న ఉద్దేశ్యంతో పరీక్షలు చేసినా వాటి తాలుకా గాయాలు ఏం కనిపించకపోవడం వైద్యులను మరింత ఆశ్చర్యపరిచింది. దీంతో ఆమెను మరో నాలుగు రోజులు పూర్తి అబ్జర్వేషన్లో ఉంచి డిశ్చార్జ్ చేశారు వైద్యులు. (చదవండి: ఆక్టోపస్ రెసిపీ తిని వ్యక్తి మృతి!) -
ఒకేరోజు ఏకంగా ఆరుసార్లు గుండె ఆగిపోవడమా..! పాపం ఆ వ్యక్తి..
సాధారణంగా గుండెపోటు వస్తేనే మనుషులు గిలగిల లాడిపోతారు. అలాంటిది ఒకేరోజు ఆరుసార్లు గుండె ఆగిపోతే ఆ మనిషి ఉంటాడా? అని డౌటు వస్తుంది కదా!. ఒకవేళ బతికినా పూర్తిస్థాయిలో కోలుకుంటాడా అన్నది అనుమానమే. అచ్చం అలానే భారత సంతతి విద్యార్థి కార్డియాక్ అరెస్ట్‌కి గురయ్యాడు. అయితే అతను ఏమయ్యాడు? బతికాడా? అనే కదా!. నిజానికి ఇలా ఆరుసార్లు గుండె ఆగిపోవడం జరుగుతుందా? ఎందుకిలా? తదితరాల గురించే ఈ కథనం. యూకేలోని 21 ఏళ్ల భారత సంతతి అమెరికన్ విద్యార్థి అతుల్ రావు ఒకే రోజు ఆరుసార్లు గుండె ఆకస్మాత్తుగా ఆగిపోయింది. దీంతో అతను ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అతడి స్నేహితులు సమీపంలోని ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు అంబులెన్స్‌ని పిలిపించారు. ఇంతలో సెక్యూరిటీ గార్డు అతని ఛాతీకి కంప్రెషన్ ఇచ్చేలా సీపీఆర్ చేశాడు. ప్రయోజనం లేకపోయింది. ఆస్పత్రిలో చేరేటప్పటికీ తీవ్ర అస్వస్థతతో ఉన్నాడు. ఎక్స్ట్రాకార్పోరియల్ మెమ్బ్రేన్ ఆక్సిజనేషన్(ఈసీఎంవో)కి యాక్సిస్ చేశారు. గుండె, ఊపిరితిత్తుల పనిని పూర్తిగా భర్తీ చేసేలా లైఫ్ సపోర్ట్ సిస్టమ్‌ని అమర్చారు వైద్యులు. ఇంతలో క్లాట్ బస్టింగ్ డ్రగ్స్ పనిచేయం ప్రారంభించాయి. దీంతో అతను లైఫ్ సపోర్ట్ మెషీన్లు, ఈసీఎంఓ తదితరాలు లేకుండానే పూర్తి స్థాయిలో కోలుకున్నాడు. అతుల్ ఇప్పుడు యూఎస్‌కి తిరిగి వెళ్లాడు. పూర్తిగా కోలుకున్నాడు కూడా. స్టూడెంట్ అతుల్ రావు ఎదుర్కొన్న ఈ పరిస్థితిని వైద్యపరిభాషలో పల్మనరీ ఎంబోలిజం అంటారు పల్మనరీ ఎంబోలిజం అంటే.. నిపుణుల అభిప్రాయం ప్రకారం..పల్మోనరీ ఎంబోలిజం చాలా సందర్భాల్లో కాలులోని లోతైన సిరల్లో రక్తం గడ్డకట్టడం మొదలై ఊపిరితిత్తులకు వెళ్తుంది. అరుదుగా శరీరంలోని వేరే ఏదైనా భాగంలోని సిరల్లో రక్తం గడ్డకట్టడం జరుగుతుంది. ఫలితంగా ఊపిరితిత్తులకు రక్తప్రవాహాన్ని పరిమితం చేసి, ఆక్సిజన్ స్థాయిలను తగ్గిస్తుంది. ఫలితంగా పల్మనరీ ధమనుల్లో రక్తపోటు పెరిగిపోతుంది. దీన్నే పల్మనరీ ఎంబోలిజం అంటారు. ఈ పల్మోనరీ ఎంబోలిజంలో గుండె లేదా ఊపిరితిత్తులకి రక్తప్రవాహం ఆగిపోయి పనితీరుకి ఆటకం ఏర్పడుతుంది. ఫలితంగా గుండె లేదా ఊపిరితిత్తులు ఆకస్మికంగా వైఫల్యం చెంది మరణానికి దారితీస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత సాధారణంగా ఉన్న గుండె, రక్తనాళాల వ్యాధులకు సంబంధించిన వాటిల్లో ఇదొకటి. లక్షణాలు శ్వాస ఆడకపోవడం మరియు ఛాతీ నొప్పులు కాలక్రమేణా పెరుగుతాయని నిపుణులు అంటున్నారు. అలాగే, చాలా మంది రోగులు శ్లేష్మంతో దగ్గినా. విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు కూడా శ్వాస ఆడకపోవడం ఛాతీ, చేయి, భుజం, మెడ లేదా దవడలో పదునైన నొప్పి దగ్గు పాలిపోయిన చర్మం వేగవంతమైన హృదయ స్పందన విపరీతమైన చెమట ఆత్రుత మూర్ఛపోవడం లేదా స్ప్రుహతప్పిపోవడం గురక ఎవరికి ప్రమాదం అంటే.. కాలులో రక్తం గడ్డకట్టిన వారు కూర్చొని పనిచేసేవారు సిరకు గాయం లేదా గాయం కలిగిన వారు చాలా కాలం పాటు గర్భనిరోధక మాత్రలు తీసుకోవడం లేదా హార్మోన్ పునఃస్థాపన చికిత్స చేయించుకోవడం పొగ స్ట్రోక్ వంటి గుండె జబ్బుల చరిత్రను కలిగి ఉండటం అధిక బరువు లేదా ఊబకాయంతో ఉన్నారు (చదవండి: అరుదైన అలెర్జీ..! సాక్షాత్తు వైద్యురాలే ఐనా..) -
ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ కమెడియన్ మృతి!
సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు సతీందర్ కుమార్ ఖోస్లా(80) మరణించారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారు. ఆయన ఉప్కార్, రోటీ కప్డా ఔర్ మకాన్, క్రాంతి లాంటి చిత్రాల్లో నటించారు. బాలీవుడ్లో బీర్బల్‌గా ఆయన పేరు తెచ్చుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఈ విషయాన్ని అతని స్నేహితుడు జుగ్ను మీడియాకు తెలిపారు. బుధవారం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సన్నిహితులు వెల్లడించారు. ఈ విషయం తెలుసకున్న సినీ, టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (CINTAA) సోషల్ మీడియాలో సంతాపం ప్రకటించింది. ఖోస్లా ముఖ్యంగా హాస్య పాత్రలకు పేరు సంపాదించుకున్నారు. 'షోలే' చిత్రంలోనూ కీలక పాత్రలో కనిపించారు. షోలేలో ఖైదీగా అతని పాత్ర చాలా మంది దృష్టిని ఆకర్షించింది. అతను నసీబ్, యారానా, హమ్ హై రహీ ప్యార్ కే, అంజామ్ వంటి చిత్రాలలో కూడా నటించారు. CINTAA expresses its condolences on the demise of Birbal (Member since 1981) .#condolence #condolencias #restinpeace #rip #birbal #condolencemessage #heartfelt #cintaa pic.twitter.com/bTXH0LArRp — CINTAA_Official (@CintaaOfficial) September 12, 2023 -
వాల్వ్‌లు బ్లాక్ కావడం వల్ల గుండెపోటు వస్తుందా? రాకుండా ఏం చేయాలి?
ఇటీవలి కాలంలో చిన్న వయసులోనే గుండెపోటు మరణాలు ఎక్కువగా వింటున్నాం. వయసుతో సంబంధం లేకుండా చిన్న వయసులోనే హార్ట్ఎటాక్కు గురవుతున్నారు.అప్పటి వరకు నవ్వుతూ, సరదాగా ఉంటున్న వ్యక్తులు ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు. ఈమధ్య కాలంలో ఇలాంటి సంఘటనలు సర్వసాధారణంగా మారిపోయాయి. ఎందుకు ఇలా జరుగుతుంది? గుండెపోటు ముప్పు నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డా. నడిమింటి నవీన్ మాటల్లోనే.. మన శరీరంలో అన్ని అవయవాలకు రక్తాన్ని పంపు చేసే అవయవం గుండె. అలాంటి గుండెకు కూడా రక్తం అవసరం అవుతుంది.మరి ఈ గుండె గోడలకు "హృదయ ధమనులు" అనే అతి ముఖ్యమైన రక్త నాళాలు ఆమ్లజని సహిత రక్తాన్ని సరఫరా చేస్తాయి. మనం తినే ఆహారంలో అధిక క్రొవ్వు పదార్థాలు ఉన్నట్లైతే ఈ కొవ్వు హృదయ ధమనుల్లో క్రమ క్రమంగా పేరుకు పోయి ఒకానొక దశలో గుండె గోడలకు రక్త సరఫరా పాక్షికంగానో, పూర్తిగానో ఆగిపోయినప్పుడు గుండెపోటు వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో అదృష్టం కొద్దీ బతికితే వైద్యులు హృదయ ధమనులు గుండా రక్తం సాఫీగా ప్రవహించడానికి అవసరమైతే స్టెంట్ వేయడం లేదా రక్తం పలుచబడే ట్యాబ్లెట్స్ వాడమని చెబుతారు. వాల్వ్‌లు బ్లాక్ కావడం వల్ల వచ్చే గుండెపోటు చాలా అరుదుగా జరుగుతుంది. చాలామంది గుండెపోటు రావడానికి కారణం వాల్వ్‌లు బ్లాక్ కావడమే అనుకుంటారు. కానీ హార్ట్ఎటాక్ రావడానికి ప్రధాన కారణం కవాటాలు పనిచేయకపోవడం(వాల్వ్‌లు బ్లాక్ కావడం)కాదు. గుండెపోటు రావడానికి కారణం వృత్తి, వ్యాపారాల్లో భరించలేని టెన్షన్లు, సరైన పోషకాహారం తీసుకోకపోవడం చిన్నతనం నుంచే అలవాటుపడిన జంక్‌ఫుడ్‌లు వదలలేకపోవడం కాలానికి తగినట్లుగా పిరియాడికల్ టెస్టులు చేయించుకొని శరీరంలో వస్తున్న అనారోగ్య సంకేతాలను ముందే తెలుసుకొని తగిన చికత్సలు తీసుకోకపోవడం శక్తికి మించి జిమ్, ఎక్సర్సైజులు వంటివి చేయడం గుండెపోటు రాకుండా ఏం చేయాలి? క్రొవ్వు పదార్ధాలు అతిగా తినకుండా శరీరానికి అవసరమైన మేరకు తినడం ప్రతి ఉదయం నలభై నుండి అరవై నిమిషాలు నడక వ్యాయామము చేయడం. ఒత్తిడి లేని జీవన శైలి పాటించడం ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా చూసుకోవడం -డా. నవీన్ నడిమింటి, ప్రముఖ ఆయుర్వేద నిపుణులు -
సినీ ఇండస్ట్రీలో విషాదం.. హార్ట్ ఎటాక్‌తో బుల్లితెర నటుడు మృతి!
ఇటీవల గుండెపోటు మరణాలు తరచుగా సంభివిస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ ఎటాక్ చేస్తోంది. హార్ట్ ఎటాక్‌తో సంభవిస్తున్న మరణాలు ప్రతి ఒక్కరినీ కలవరపెడుతున్నాయి. తాజాగా హిందీ, తమిళ బుల్లితెర నటుడు పవన్ హార్ట్ ఎటాక్‌తో మరణించారు. అతని వయస్సు ప్రస్తుతం 25 ఏళ్లే. చిన్న వయసులోనే కార్డియాక్ అరెస్ట్‌తో కన్నుమూయడంతో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. (ఇది చదవండి: యోగి ఆదిత్యనాథ్‌ను కలవనున్న రజనీకాంత్.. ఎందుకంటే?) పవన్ సొంత ఊరు కర్ణాటక మాండ్యా జిల్లాలోని హరిహరపుర గ్రామానికి చెందినవారు కాగా.. సరస్వతి, నాగరాజు ఆయన తల్లిదండ్రులు. యాక్టింగ్ నిమిత్తం కొంతకాలంగా పవన్ ముంబయిలోనే ఉంటున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటు రావటంతో ఆస్పత్రికి తరలించగా మృతి చెందారు. శుక్రవారం ఆయన మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. కాగా.. పవన్ హిందీ, తమిళ భాషల్లో రాణిస్తున్నారు. ఇప్పటికే చాలా హిందీ, తమిళ టీవీ సీరియళ్లలో నటించారు. ఈ విషయం తెలుసుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అతని మృతి పట్ల మాండ్యా ఎమ్మెల్యే హెచ్‌టీ మంజు, మాజీ ఎమ్మెల్యే కేబీ చంద్రశేఖర్ విచారం వ్యక్తం చేశారు. (ఇది చదవండి: 1990లో చిరంజీవికి ఇదే పరిస్థితి వస్తే ఆయన్ను నిలబెట్టిన సినిమా ఇదే) నటుడి భార్య కన్నుమూత ఇటీవలే కన్నడ ప్రముఖ నటుడు విజయ్ రాఘవేంద్ర భార్య స్పందన.. థాయ్‌ల్యాండ్ వెకేషన్లో ఉండగా గుండెపోటు రావడంతో హఠాత్తుగా కన్నుమూసింది. కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ 2021లో గుండె పోటుతోనే మృతి చెందారు. ఆయన మృతి యావత్ సినీ ప్రపంచాన్ని, అభిమానులను శోకసంద్రంలో ముంచేసింది. చిన్న వయసులోనే గుండెపోటు రావడం ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. -
కరీంనగర్: సంబురంగా చిందులేస్తూ కుప్పకూలి..
సాక్షి, కరీంనగర్: వయసుతో సంబంధం లేకుండా హఠాన్మరణాలు సంభవిస్తున్న రోజులవి. పైగా గుండె సంబంధిత సమస్యలే అందుకు కారణం అవుతుండడం మరీ ఘోరం. తాజాగా జిల్లాలోనూ ఓ స్కూల్ స్టూడెంట్ గుండె ఆగి కన్నుమూసింది. అదీ సంబురంగా చిందులేస్తున్న సమయంలోనే.. గంగాధర మండలంలోని ప్రభుత్వ మోడల్ స్కూల్లో ఫ్రెషర్స్ డే ఈవెంట్ జరిగింది. ఆ హుషారులో డాన్స్ చేస్తూ కుప్పకూలింది ఓ విద్యార్థి. ఊపిరి తీసుకోవడంలో అవస్థలు పడింది. దీంతో ఆమెకు సీపీఆర్ చేసి మరీ ఆస్పత్రికి తరలించారు పాఠశాల సిబ్బంది. అయితే మార్గం మధ్యలోనే ఆమె కన్నుమూసినట్లు వైద్యులు వెల్లడించారు. మృతురాలిని వెంకటాయపల్లికి చెందిన ప్రదీప్తిగా గుర్తించారు.అయితే ఆమెకు గుండెలో రంధ్రం ఉందని వైద్యులు చెప్పడంతో అంతా షాక్ తిన్నారు. ప్రదీప్తి మరణంతో ఆమె సొంతూరు వెంకటాయపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇదీ చదవండి: లవర్‌ను రప్పించి మరీ యువతి ఘాతుకం -
మహిళల్లో గుండెపోటు రిస్క్ పెరిగింది.. కోవిడ్ కారణమా?
పెరిగిన గుండెపోటు ముప్పు ఇటీవలి రోజుల్లో చిన్న వయసులోనే మహిళలు కూడా గుండెపోటుకు గురవడం 8 శాతం పెరిగిందని ప్రముఖ గుండె వైద్య నిపుణుడు డాక్టర్ సీఏ మంజునాథ్ తెలిపారు. సోమవారం నటి స్పందన మృతిపై డాక్టర్ మంజునాథ్ మాట్లాడుతూ ఇటీవల జీవనశైలి, ఆహార పద్ధతులు మారాయని, దీంతో పాటు మానసిక శారీరక ఒత్తిడులు కూడా గుండెపోటుకు కారణమన్నారు. 40 ఏళ్లలోపు వారికి కూడా గుండెజబ్బులు ► ఒక అధ్యయనం ప్రకారం 40 ఏళ్ల లోపు వయసు వారికి గుండెపోటు రావడం 35 శాతం పెరిగింది. ►గతంలో మహిళల్లో గుండెపోటు కేసులు తక్కువగా ఉండేవి, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ► 40 ఏళ్లులోపు మహిళల్లో గుండెపోటు కేసులు 8 శాతం పెరగడం ఆందోళనకరం. ► దేశంలో యువత, మధ్య వయసువారిలో గుండెపోటు వచ్చే ముప్పు 28 శాతం పెరిగింది. ► ఈ కేసుల్లోనూ కార్డియాక్ అరెస్ట్ (గుండె స్తంభించడం) 90 శాతం ఉంది. ► కోవిడ్ మహమ్మారి తరువాత 3 నుంచి 5 శాతం గుండెపోటు కేసులు పెరిగాయి, ప్రతి ఒక్కరూ తరచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. - ప్రముఖ వైద్యుడు మంజునాథ్ -
తెగిన లిఫ్ట్ వైర్, 8వ ఫ్లోర్ నుంచి ఒక్కసారిగా పడిపోవడంతో..
నోయిడా: ప్రమాదం ఎప్పుడు ఎటువైపు నుంచి ముంచుకొస్తుందో చెప్పలేము. ఊహించని ప్రమాదాలతో రెప్పపాటులో ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. తాజాగా అలాంటి ఘటన చోటుచేసుకుంది. ఓ బిల్డింగ్‌లోని లిఫ్ట్ ఒక్కసారిగి కిందకు జారడంతో గుండెపోటుకు గురై ఓ మహిళా ప్రాణాలు కోల్పోయింది. ఉత్తర ప్రదేశ్‌లోని నోయిడాలో గురువారం ఈ ఘోరం వెలుగుచూసింది. నోయిడాలోని సెక్టార్ 137లో పరాస్ టియెర్రా సొసైటీలోని ఓ అపార్ట్మెంట్లోని లిఫ్ట్‌లోకి 73 ఏళ్ల వృద్ధురాలు వెళ్లింది. ఈ క్రమంలో లిఫ్ట్ వైర్ ఒక్కసారిగా తెగిపోవడంతో 8 ఫ్లోర్లు కిందకు జారిపడింది. అయితే లిఫ్ట్ గ్రౌండ్‌ను ఢీకొట్టకుండా మధ్య అంతస్తుల్లో చిక్కుకుపోయింది. ఊహించని పరిణామంతో లిఫ్ట్‌లో ఒంటరిగా ఉన్న మహిళ స్పృహతప్పి పడిపోయింది. కాసేపటికి గమనించిన సిబ్బంది మహిళను ఫెలిక్స్ ఆసుపత్రిలో చేర్చగా.. చికిత్స పొందుతూ గంటకే మృతిచెందింది. అయితే మహిళ తల వెనక, మోచేతి వద్ద గాయాలున్నట్లు వైద్యులు తెలిపారు. లిఫ్ట్ పడిపోవడం వల్ల ఆమెకు ఈ గాయాలైనట్లు పేర్కొన్నారు. మహిళను ఆసుపత్రికి తీసుకొచ్చినప్పుడు పల్స్ లేదని ఆకస్మిక ఘటనతో ఆమెకు గుండెపోటు వచ్చినట్లు తెలుస్తోందని వైద్యులు వెల్లడించారు. మరోవైపు అపార్ట్‌మెంట్‌కు చెందిన వందలాది మంది సొసైటీ కాంప్లెక్స్ బయటకు వచ్చి జరిగిన ఘోరానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. వృద్ధురాలి మృతికి యజమాన్యం నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. చదవండి: ఎట్టకేలకు సీఎం ‘కుర్చీ’లో కూర్చున్న అజిత్ పవార్ -
ఆకస్మిక గుండెపోటు మరణాలపై సంచలన విషయాలు వెల్లడించిన కేంద్రం
ఢిల్లీ: కోవిడ్ తర్వాత పెరిగిన గుండెపోటు కేసులపై కేంద్రం కీలక విషయాలు వెల్లడించింది. యువతలో గుండె ఆగిపోవడం వల్ల ఆకస్మిక మరణాలు నమోదయ్యాయని, కారణాన్ని నిర్ధారించడానికి తగిన ఆధారాలు అందుబాటులో లేవని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్సూక్ మాండవీయ పార్లమెంటులో శుక్రవారం తెలిపారు. కోవిడ్ మహమ్మారి తర్వాత పెరుగుతున్న కార్డియాక్ అరెస్ట్ కేసులకు సంబంధించి వాస్తవాలను తెలుసుకోవడానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ మూడు వేర్వేరు అధ్యయనాలను నిర్వహిస్తోందని ఒక ప్రశ్నకు సమాధానంగా మంత్రి తెలిపారు. ఇండియాలోని 18 నుంచి 45 సంవత్సరాల వయస్సు గల పెద్దవారిలో ఆకస్మిక మరణాలకు సంబంధించిన కారకాలపై అధ్యయనం దాదాపు 40 ఆసుపత్రులు, పరిశోధన కేంద్రాలలో కొనసాగుతోందన్న ఆయన.. భారత్‌లో 2022లో 18 నుంచి 45 సంవత్సరాల వయస్సు గల జనాభాలో గుండెపోటు సంఘటనలపై కొవిడ్ వ్యాక్సిన్ ప్రభావాన్ని గుర్తించడానికి దాదాపు 30 కొవిడ్ క్లినికల్ రిజిస్ట్రీ ఆసుపత్రులలో మరో మల్టీసెంట్రిక్ హాస్పిటల్ అధ్యయనం జరుగుతోందన్నారు. చదవండి: మణిపూర్ అంశంపై తెరమీదకు రూల్ నెం.176 Vs 267.. అసలేంటివి? కార్డియోవాస్కులర్ వ్యాధి ఎన్పీ-ఎన్సీడీలో అంతర్భాగమని, ఇందులో మౌలిక సదుపాయాలను బలోపేతం, మానవ వనరుల అభివృద్ధి, ఆరోగ్య ప్రమోషన్, ఆయుష్మాన్ భారత్ హెల్త్ వెల్నెస్ సెంటర్ కింద 30 ఏళ్లు, అంత కంటే ఎక్కువ వయస్సు గల ప్రజల్లో జనాభా ఆధారిత స్క్రీనింగ్, ముందస్తు రోగ నిర్ధారణ, నిర్వహణ, తగిన స్థాయి ఆరోగ్య సంరక్షణ సదుపాయానికి రెఫరల్ ఉన్నాయని ఆరోగ్య మంత్రి పేర్కొన్నారు. చదవండి: గుజరాత్ హైకోర్టు నుంచి చిత్రవిచిత్రాలు చూస్తున్నాం! ఎన్పీ-ఎన్సీడీ కింద 724 జిల్లా నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ క్లినిక్‌లు, 210 డిస్ట్రిక్ట్ కార్డియాక్ కేర్ యూనిట్లు, 326 డిస్ట్రిక్ట్ డే కేర్ సెంటర్లు, 6,110 కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ క్లినిక్‌లు ఏర్పాటు చేశామన్నారు. కార్డియోవాస్కులర్ వ్యాధి రోగులు మెడికల్ కాలేజీలు, ఎయిమ్స్ వంటి కేంద్రీయ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఆసుపత్రులతో సహా హెల్త్‌కేర్ డెలివరీ సిస్టమ్‌లోని వివిధ ఆరోగ్య సదుపాయాలలో చికిత్స పొందుతున్నారని మన్సూక్ మాండవీయ వివరించారు. -
హార్ట్ ఎటాక్, హార్ట్ అరెస్ట్ తేడా ఇదే!
-
అతని గొంతు లేకుండా నా సభల్లేవ్: కేసీఆర్ ఆవేదన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ గాయకుడు, ప్రజా కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పోరేషన్ చైర్మన్ సాయిచంద్ ఆకస్మిక మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. చిన్నతనంలోనే అద్భుతమైన ప్రతిభను సొంతం చేసుకున్న బిడ్డ సాయిచంద్ అని, మరింత ఉన్నతస్థాయికి ఎదిగే దశలో అకాల మరణం ఎంతో బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. సాయిచంద్ హఠాన్మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపాన్ని ప్రకటించారు. సాయిచంద్ మరణంతో తెలంగాణ సమాజం ఒక గొప్ప గాయకున్ని.. కళాకారున్ని కోల్పోయింది. రాష్ట్ర సాధనలో సాగిన సాంస్కృతిక ఉద్యమంలో సాయిచంద్ పాత్ర అజరామరంగా నిలుస్తుంది అని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ కాలంలో సాయిచంద్ పాడిన పాటలను.. చేసిన సాంస్కృతిక ఉద్యమాన్ని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా మననం చేసుకుంటున్నట్లు తెలిపారాయన. సాయిచంద్ లేకుండా.. అతని గొంతులేకుండా తన సభలు సాగేవి కావని ఆవేదన వ్యక్తం చేశారాయన. ఉద్యమ కాలం నుంచి నేటి వరకు తన ఆట పాటలను నిరంతరాయం కొనసాగిస్తూనే నున్నాడని గుర్తు చేసుకున్నారు. తన ఆట పాటతో ప్రజలలో నాడు ఉద్యమ స్పూర్తిని.. నేడు అభివృద్ధి చైతన్యాన్ని రగిలించిన తెలంగాణ బిడ్డని కోల్పోవడం తీరని లోటని అన్నారు. శోకతప్త హృదయులైన సాయిచంద్ కుటుంబ సభ్యులు ఈ తీవ్ర విషాదాన్ని తట్టుకునే శక్తినివ్వాలని భగవంతున్ని ప్రార్థిస్తూ.. వారి కుటుంబానికి తాము అండగా ఉంటామన్నారు. హరీష్ రావు కంటతడి సాయిచంద్ హఠాన్మరణం వార్తతో గచ్చిబౌలి కేర్ ఆస్పత్రికి తరలి వెళ్లారు పలువురు నేతలు. వాళ్లలో మంత్రి హరీష్ రావు కూడా ఉన్నారు. సాయిచంద్ మృతదేహాన్ని చూసి ఆయన కంటతడి పెట్టుకున్నారు. చిన్నవయసులో కన్నుమూయడం బాధాకరమంటూ ఆవేదన వ్యక్తం చేశారాయన. ఆస్పత్రిలో ఫార్మాలిటీస్ పూర్తికావడంతో గుర్రంగూడలోని సాయిచంద్ నివాసానికి భౌతికకాయాన్ని తరలించారు. ► సాయిచంద్ మృతిపట్ల పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, భువనగిరి ఎంపీ రేవంత్ రెడ్డి సంతాపం తెలియజేశారు. సాయి చంద్ పేరు శాశ్వతంగా ఉండిపోతుంది సాయిచంద్ మృతిపట్ల కల్వకుంట్ల తారకరామారావు విచారం వ్యక్తం చేశారు. సాయి చంద్ మరణం తనని దిగ్భ్రాంతికి గురిచేసిందని.. యువకుడైన సాయిచంద్ అకాల మరణం చెందడం బాధాకరమని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి తెలంగాణ సమాజానికి ముఖ్యంగా భారత రాష్ట్ర సమితి పార్టీకి తన గొంతుక ద్వారా ఎనలేని సేవలు చేసిన సాయిచంద్ మరణం తీరని లోటు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా సాంస్కృతిక రంగంలో పాట ఉన్నన్ని రోజులు సాయిచంద్ పేరు శాశ్వతంగా నిలిచిపోతుందన్నారు. సాయిచంద్ ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. Saddened by the loss of a rare talent and a gifted Singer, Sri #SaiChand garu. His mesmerizing voice graced the Telangana moment, stirring souls with countless inspirational songs. Leaving an indelible mark on our hearts, his legacy will forever be cherished. Our heartfelt… pic.twitter.com/nTJzfLIAeS — Santosh Kumar J (@SantoshKumarBRS) June 29, 2023 తెలంగాణ ఉద్యమ గొంతు మూగబోయిందంటే ఇప్పటికి నమ్మశక్యంగా లేదు.. ఇకముందు ఏ సభలోనూ నీ గొంతు ఉండదు ఇక ఆగిపోయిందంటే ఊహించడానికి కూడా కష్టంగా ఉంది.. నీ గురించి ఎంత చెప్పినా ఎంత మాట్లాడినా తక్కువే అన్నా.... ఉద్యమ గొంతుక నీకు జోహార్లు 🙏🙏🙏🙏 Miss u Anna ఓం శాంతి#SaiChand pic.twitter.com/28fuOF9I5K — Srinivas Nelli BRS (@SrinivasNBRS) June 29, 2023 -
తెలంగాణ కళాకారుడు సాయిచంద్ హఠాన్మరణం
సాక్షి, హైదరాబాద్: ఉద్యమ పాట ఊపిరి వదిలింది. తెలంగాణ కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్(39) హఠాన్మరణం చెందారు. గత అర్ధరాత్రి గుండెపోటుకి గురైన ఆయన్ని ఆస్పత్రులకు తరలించగా.. చివరకు ఆయన కన్నుమూసినట్లు తెలుస్తోంది. నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లిలోని కారుకొండ ఫామ్‌హౌజ్‌కు నిన్న ఆయన తన కుటుంబ సభ్యులతో వెళ్లారు. అయితే.. అర్ధరాత్రి ఆయన అస్వస్థతకు గురికాగా.. స్థానికంగా ఓ ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. అక్కడ పరిస్థితి విషమించడంతో.. గచ్చిబౌలి కేర్ ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. అయితే.. అప్పటికే ఆలస్యం అయ్యిందని.. సాయిచంద్ మృతిచెందినట్లుగా వైద్యులు ప్రకటించారు. వనపర్తి జిల్లా అమరచింత సాయిచంద్ స్వస్థలం. విద్యార్థి దశ నుంచే గాయకుడిగా మంచి పేరుంది ఆయనకు. ఉద్యమ సమయంలో తన పాటలతో స్ఫూర్తిని రగిల్చారు ఆయన. జానపద పాటలతో సాగే పలు టీవీషోలలోనూ ఆయన సందడి చేశారు. ఉద్యమ కళాకారుడి గుర్తింపు పొందిన సాయిచంద్‌ను రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ పదవితో గౌరవించింది తెలంగాణ సర్కార్. తాజాగా అమరవీరుల జ్యోతి ప్రారంభోత్సవ కార్యక్రమంలోనూ ఆయన కనిపించారు. చిన్నవయసులోనే సాయిచంద్ హఠాన్మరణం చెందడం దిగ్భ్రాంతికి గురి చేసిందంటూ పలువురు కళాకారులు, ఉద్యమకారులు, నేతలు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నారు. గతంలో ఆయనకు గుండెపోటు ఏమీ రాలేదని.. అనారోగ్య సమస్యలేవీ లేదని.. అర్ధరాత్రి భోజనం దాకా కూడా బాగానే ఉన్నారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇదీ చదవండి: కేసీఆర్‌కు రాజకీయ గురువు ఈయనే! -
వీడిన మిస్టరీ.. వార్న్ ఆకస్మిక మరణానికి కారణం అదేనా!
ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్ షేన్ వార్న్ గతేడాది మరణించిన సంగతి తెలిసిందే. ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ స్పిన్ బౌలర్లలో ఒకడిగా పేరుగాంచిన షేన్ వార్న్ గతేడాది థాయ్‌లాండ్ వెకేషన్లో ఉన్నప్పుడు విల్లాలోనే గుండెపోటుతో చనిపోయాడు. అతని మరణం అప్పట్లో మిస్టరీగా ఉండిపోయింది. పోస్టుమార్టం రిపోర్టు పరిశీలించిన వైద్యులు వార్న్ గుండెపోటు వల్ల మరణించాడని ద్రువీకరించారు. ఇక వార్న్ మరణం వెనుక ఉన్న మిస్టరీ తాజాగా వీడినట్లు తెలుస్తోంది. వార్న్ మరణానికి కారణం గుండెపోటు అయినప్పటికి పరోక్షంగా కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకోవడమేనని భారత సంతతికి చెందిన డాక్టర్ ఆసీమ్ మల్హోత్రా తాజాగా మంగళవారం పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన లండన్‌లో ఒక ప్రముఖ ఆసుపత్రిలో కార్డియాలజిస్ట్‌గా పని చేస్తున్నారు. డాక్టర్ ఆసీమ్ మల్హోత్రాతో పాటు ఆస్ట్రేలియా మెడికల్ ప్రొఫెషనల్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ క్రిస్ నిల్ షేన్ వార్న్ మరణం వెనుక ఉన్న కారణంపై రీసెర్చీ చేశారు. ఈ నేపథ్యంలోనే కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ''వార్న్ మరణించడానికి తొమ్మిది నెలల ముందు కోవిడ్ వ్యాక్సిన్ అయిన పీ-ఫైజర్(PFizer mRNA) వ్యాక్సిన్‌ను రెండు డోసులు తీసుకున్నాడు. అయితే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వార్న్ తన ఆరోగ్యంపై సరైన దృష్టి పెట్టకపోగా.. మోతాదుకు మించి ఆల్కహాల్ తీసుకోవడంతో పాటు స్మోకింగ్ చేసినట్లు తేలింది. దీనివల్ల వ్యాక్సిన్ ప్రభావం మందగించింది. అందువల్ల గుండెల్లో రక్తనాళాలు మూసుకుపోయాయి. దీనివల్లే అతను కార్డియాక్ అరెస్టుకు గురయ్యి చనిపోయాడు. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందు కూడా ఆల్కహాల్, స్మోకింగ్ ఎక్కువగా ఉండడం వల్ల అతని బాడీలో బయోమెకానిజమ్ సరిగ్గా లేదు. ఇది కూడా వార్న్ మరణానికి ఒక కారణం అని చెప్పొచ్చు. అయితే కోవిడ్-19 వ్యాక్సిన్ నిబంధనలు సరిగ్గా పాటించి ఉంటే మాత్రం వార్న్ చనిపోయే అవకాశాలు తక్కువగా ఉండేవని'' అభిప్రాయపడ్డారు. కాగా టెస్ట్ క్రికెట్లో తనదైన ముద్ర వేసిన ఈ స్పిన్ మాంత్రికుడు 145 టెస్టుల్లో 708 వికెట్లు.. 194 వన్డేల్లో 293 వికెట్లు.. ఓవరాల్‌గా వెయ్యి వికెట్లు తీసిన ఘనత వార్న్ సొంతం. చదవండి: #ShaneWarne: షేన్ వార్న్ బయోపిక్.. శృంగార సన్నివేశం చేస్తూ ఆస్పత్రిపాలు -
పాపం.. బతికిందని సంతోషించేలోపే గుండె ఆగింది
ఒంట్లో ఓపికలేకున్నా.. బలానంతా కూడదీసుకుని, తానింకా బతికే ఉన్నానని శవపేటిక మూతను తట్టిమరీ కొన ఊపిరితో బయటపడిన బామ్మ ఉదంతం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించింది. అయితే.. బతికిందని సంతోషించేలోపే.. అదీ వారంలోపే ఆమె ఉదంతం విషాదాంతం అయ్యింది. ఈక్వెడార్ బామ్మ బెల్లా మోంటోయా(76) కార్డియాక్ అరెస్ట్‌తో కన్నుమూసినట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ అధికారికంగా ప్రకటించింది. ఆస్పత్రిలో ఉన్నంత సేపు ఆమె ఆరోగ్యం గురించి ఆరా తీస్తూనే ఉన్నామని, వారం తర్వాత(జూన్ 16న) ఆమె మృతి చెందినట్లు ఆరోగ్యశాఖ తన ప్రకటనలో పేర్కొంది. ఇక తల్లి మృతిపై గిల్బర్ట్ బార్బెరా స్పందిస్తూ.. తన తల్లి శాశ్వత నిద్రలోకి జారుకున్నట్లు ప్రకటించాడు. చనిపోయిందనుకుని భావించి జూన్ 9వ తేదీన శవపేటికలో ఉంచి సమాధి చేయబోతుండగా.. శవపేటికను బాది ఆమె ప్రాణాలతో బయపడి అందరినీ ఆశ్చర్యపర్చింది. సుమారు ఐదు గంటలపాటు ఆ బామ్మ శవపేటికలోనే ఉండిపోయింది. శ్వాస అందకపోవడంతో ఇబ్బంది పడిన ఆమెను అప్పటికప్పుడే ఆంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. catalepsy(కండరాలు బిగుసుకుపోవడం) వల్ల ఆమె స్పృహ కోల్పోయి కదల్లేని స్థితిలో అచేతనంగా ఉండిపోయిందని, అలా ఆమె మరణించిందని కుటుంబ సభ్యులు భావించి ఉంటారని ఆ టైంలో వైద్య నిపుణులు పేర్కొన్నారు. అప్పటి నుంచి ఆమె ఐసీయూలో చికిత్స పొందుతూ.. వారం తర్వాత గుండెపోటు రావడంతో కన్నుమూసిందామె. ఏ స్మశానవాటికలో ఆమె బతికిందని సంతోషించారామె.. అదే చోట ఆమెను మళ్లీ ఇప్పుడు సమాధి చేశారు. Video Credits: Associated Press ఇదీ చదవండి: రక్తం కారుతున్నా లెక్క చేయకుండా.. -
కాంతార 'భూత కోల' చేస్తూ.. కుప్పకూలిన కళాకారుడు.. వీడియో వైరల్..
బెంగళూరు: కర్ణాటక ప్రాచీన నృత కళారూపం భూత కోల. ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన కాంతారా సినిమాతో ఈ నృత్య వేడుక మరింత పాపులరైంది. అయితే భూత కోల చేస్తూ ఓ కళాకారుడు ఒక్కసారిగా కుప్పకూలిన ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. గ్రామస్థుల ముందు ప్రదర్శన చేస్తున్న అతడు సడన్‌గా కిందపడిపోయాడు. అక్కడున్నవారు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. దీంతో మృతుని గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దక్షిణ కన్నడ జిల్లా కదాబా తాలూకా ఎడమంగల గ్రామానికి చెందిన ఈ భూత కోల కళాకారుడి పేరు కాంతు అజిల. వయసు 59 ఏళ్లు. చాలా సంవత్సరాలుగా నృత్య కళతో జనాల్ని అలరిస్తున్న ఇతనికి దైవ నర్తకుడిగా మంచి గుర్తింపు ఉంది. అయితే కాంతు ఒక్కసారిగా కుప్పకూలిపోవడానికి గల కారణాలు మాత్రం తెలియలేదు. గ్రామస్థులు మాత్రం గుండెపోటు వల్లే అతను మరణించి ఉంటాడని భావిస్తున్నారు. కాంతు నృత్య ప్రదర్శన చేసే సమయంలో గ్రామస్థుడు ఒకరు మొబైల్లో వీడియో తీశారు. దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అయింది. ఈ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. -
లాంగ్ కోవిడ్ వల్లే ఆకస్మిక మరణాలు.. వ్యాక్సిన్లే కారణమా? డాక్టర్ల క్లారిటీ
లబ్బీపేట (విజయవాడ తూర్పు): ఆరోగ్యంగా ఉన్నవాళ్లు కూడా ఆకస్మికంగా కుప్పకూలి మరణిస్తున్న ఘటనల్ని ఇటీవల చూస్తున్నాం. అలా కుప్పకూలి మరణించిన వారి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. ఈ మరణాలకు కోవిడ్ వ్యాక్సినే కారణమని.. కొన్నిరకాల మందులు వాడటం వల్లే మరణాలు సంభవిస్తున్నాయనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. ఆ ప్రచారం నిజం కాదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ఆకస్మిక మరణాలకు కారణాలను కార్డియాలజీ నిపుణులు వివరిస్తున్నారు. కోవిడ్ తర్వాత పెరిగిన గుండె సమస్యలు కోవిడ్ తర్వాత ప్రజల్లో గుండె జబ్బులు బాగా పెరిగినట్టు వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా లాంగ్ కోవిడ్ ప్రాబ్లమ్స్ (పోస్ట్ కోవిడ్ కండిషన్) ఎదుర్కొన్న వారిలో గుండె జబ్బులు రెండు రెట్లు అధికమని వైద్యులు చెబుతున్నారు. అలాంటి వారిలోనే కార్డియాక్ అరెస్ట్‌లు జరుగుతున్నట్టు వెల్లడిస్తున్నారు. ఆకస్మిక మరణాలతోపాటు, కొందరు పీఓటీఎస్ (పాచ్యురల్ టాచీకార్డియా సిండ్రోమ్) ఇబ్బందులకు గురవుతున్నారు. అంటే ఉన్న పొజిషన్ నుంచి మారినా, కూర్చుని, పడుకుని లేచినా గుండె దడగా ఉండటం జరుగుతుందని (కూర్చుని లేచిన తర్వాత లేదా పడుకున్న తర్వాత గుండె కొట్టుకునే రేటు చాలా త్వరగా పెరగటం) చెబుతున్నారు. ఇవీ కారణాలు ♦ రక్తనాళాల్లో పూడికల వల్ల గుండెపోట్లు వస్తున్నాయి. ♦ గుండె కండరాలు ఉబ్బడం (మయో కార్డిటైస్) వల్ల కూడా మరణాలు సంభవిస్తున్నాయి. ♦ గుండె అకస్మాత్తుగా ఆగిపోవడం (కార్డియాక్ అరెస్ట్–అర్రిటమియా) కూడా కారణం. ♦ పల్మనరీ ఎంబోలిజం (గుండె నుంచి ఊపిరితిత్తులకు వచ్చే రక్తనాళాల్లో పూడికలు) కూడా దీనికి కారణమవుతోంది. ముందుగా గుర్తించడం కష్టమే కోవిడ్ తర్వాత కొందరిలో హార్మోన్ల సమతుల్యత లోపించిన కారణంగా రక్తంలో గడ్డలు ఏర్పడుతున్నాయి. ఇలాంటి వారిలో డీ–డైమర్ వంటి పరీక్ష చేసినప్పుడు రక్తం చాలా సాధారణంగా ఉన్నా.. మరుసటి రోజుకే గడ్డలు ఏర్పడి పల్మనరీ ఎంబోలిజమ్తో అకస్మాత్తుగా మరణించే అవకాశాలు కూడా ఉన్నట్టు వైద్య నిపుణులు చెబుతున్నారు. కార్డియాక్ అరెస్ట్, పల్మనరీ ఎంబోలిజంను ముందుగా గుర్తించడం కష్టమేనని పేర్కొంటున్నారు. రక్తంలో నీటి శాతం తగ్గినా రక్తం చిక్కబడి గడ్డలు ఏర్పడే అవకాశం కూడా ఉంది. అపోహలెన్నో.. ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కారణమని.. ఫలానా వ్యాక్సిన్ వేసుకున్న వారికి గుండెపోటు వస్తోందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని వైద్యులు కొట్టిపారేస్తున్నారు. కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ అత్యుత్తమ మార్గమని గుర్తించి అందరికీ వేయడం జరిగిందంటున్నారు. పాశ్చాత్య దేశాల్లో వేసిన ఎంఆర్ఎన్ఏ (ప్రైజర్, మోడెర్నా) వంటి వ్యాక్సిన్లలో దుష్పలితాలను గుర్తించారని, అవి మన దేశంలో వేయలేదని స్పష్టం చేస్తున్నారు. ముందు జాగ్రత్తలే మేలు ♦ గుండెను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మేలని వైద్యులు చెపుతున్నారు. ♦ శ్రమతో కూడిన జీవన విధానాన్ని అలవర్చుకోవడం ♦ జీవన శైలిని మార్చుకోవడం ♦ స్వచ్ఛమైన ఆహారం తీసుకోవడం ♦ రెగ్యులర్‌గా వ్యాయామం చేయడం ♦నీరు ఎక్కువగా తీసుకోవడం ద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని చెబుతున్నారు. లాంగ్ కోవిడ్ ప్రాబ్లమ్స్‌తోనే.. కోవిడ్ తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్ పెరిగాయి. లాంగ్ కోవిడ్ ప్రాబ్లమ్స్ (పోస్టు కోవిడ్ కమిషన్) ఉన్న వారిలో గుండె జబ్బులు వచ్చే అవకాశం రెండు రెట్లు అధికం. ఆకస్మిక మరణాలకు పల్మనరీ ఎంబోలిజం, కార్డియాక్ అరెస్ట్‌లు కారణంగా ఉంటున్నాయి. కోవిడ్ తర్వాత హార్మోన్లలో సమతుల్యత లోపించిన కారణంగా రక్తంలో గడ్డలు ఏర్పడుతున్నాయి. రక్తంలో నీటిశాతం తగ్గినా రక్తం చిక్కబడి గడ్డలు ఏర్పడతాయి. అలాంటి వారు ఆకస్మికంగా మరణించే అవకాశం ఉంది. జీవనశైలి మార్చుకోవడం, ఆహార నియమాలు పాటించడం, రెగ్యులర్ వ్యాయామం చేయడం ద్వారా గుండె జబ్బులను అధిగమించవచ్చు. – బి.విజయ్ చైతన్య, కార్డియాలజిస్ట్, విజయవాడ -
సీపీఆర్‌పై అవగాహన అవసరం
పంజగుట్ట: మన దేశంలో ప్రతి నిమిషానికి 112 కార్డియాక్ అరెస్టులు సంభవిస్తున్నాయని ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ తెలంగాణ చైర్మన్, మాజీ ఐఏఎస్ అధికారి అజయ్ మిశ్రా ఆందోళన వ్యక్తం చేశారు. ఇందులో 80 శాతం బహిరంగ ప్రదేశాల్లోనే జరుగుతున్నాయని, సీపీఆర్‌పై ప్రజలకు అవగాహన లేకపోవడంతో ఎంతోమంది మృత్యువాత పడుతున్నారన్నారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో రెడ్‌క్రాస్ సొసైటీ, ప్రెస్‌క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సంయుక్తంగా సీపీఆర్‌పై ఎన్సీసీ విద్యార్థులకు, జర్నలిస్టులకు అవగాహన, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ నెలలో రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 33 జిల్లాల్లో నిర్వహించనున్న సీపీఆర్ అవగాహన, శిక్షణ కార్యక్రమాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అజయ్ మిశ్రా మాట్లాడుతూ.. రెడ్‌క్రాస్ మాదిరిగా మరిన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి సీపీఆర్‌పై అవగాహన కల్పించాలని కోరారు. నిమ్స్ ఎమర్జెన్సీ విభాగాధిపతి డాక్టర్ అశిమా శర్మ మాట్లాడుతూ.. సీపీఆర్ చేసే సమయంలో స్కిల్స్ ఎంతో ముఖ్యమని, బ్రీతింగ్, నాడి చూడాలని, భుజం తట్టి స్పందిస్తున్నారో లేదో చూడాలన్నారు. సీపీఆర్ చేస్తూనే అంబులెన్స్‌కు ఫోన్ చేయాలని సూచించారు. ఈ మేరకు నిమ్స్‌లో పారామెడికల్ సిబ్బందికి శిక్షణ ఇచ్చామన్నారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్ సీపీఆర్ రాష్ట్ర కో ఆర్డినేటర్ డాక్టర్ బి.విజయ్‌భాస్కర్, ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు వేణుగోపాల్ నాయుడు, ప్రధాన కార్యదర్శి ఆర్.రవికాంత్ రెడ్డి, కె.మదన్మోహన్రావు, రమణ పాల్గొన్నారు. -
పల్నాడు జిల్లా పసుమర్రులో 17 ఏళ్ల ఫిరోజ్ గుండెపోటుతో మృతి
-
విషాదం: కబడ్డీ ఆడుతూ కుప్పకూలిన 19 ఏళ్ల యువకుడు, చూస్తుండగానే...
సాక్షి, అనంతపురం: నిర్దిష్ట కారణాలేంటో తెలియదుగానీ ఈమధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా గుండెపోట్లు కలవరపెడుతున్నాయి. ముఖ్యంగా నిండా పాతికేళ్లు కూడా లేని యువత హార్ట్ అటాక్‌తో చూస్తుండగానే ప్రాణాలు విడుస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఈ నెల 1న అనంతపురం జిల్లాలో 19 ఏళ్ల తనూజ నాయక్ అనే యువకుడు కబడ్డీ ఆడుతూ కుప్పకూలిపోయాడు. అతన్ని బెంగళూరులోని ఎమ్మెస్ రామయ్య ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచాడని వైద్యులు తెలిపారు. ఆరోగ్యంగా ఉండే తమ బిడ్డకు గుండెపోటు ఏంటని ఆ తల్లిదండ్రులు స్థాణువయ్యారు. దేవుడు తమకు అన్యాయం చేశాడని, ఆడుతూ పాడుతూ తిరిగే తమ కుమారుడికి ఇంత చిన్న వయసులో ఈ ప్రాణాలు తీసే రోగమేంటని కన్నీరుమున్నీరయ్యారు. మృతుడు తనూజ నాయక్ది మడకశిర మండలం అచ్చంపల్లి తండా. అనంతపురం పట్టణంలోని పీవీకేకే కాలేజీలో బీఫార్మసీ ఫస్టియర్ చదువుతున్నాడు. కాగా, కబడ్డీ ఆడుతూ తనూజ నాయక్ కుప్పకూలిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (చదవండి: జనం మధ్యకు పులి కూనలు..24 గంటలు గడిచిన తల్లి జాడ లేదు!) 17 ఏళ్లకే ప్రాణాంతక ‘పోటు’ పల్నాడు జిల్లా పసుమర్రులో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. 17 ఏళ్ల ఫిరోజ్‌కు సోమవారం అర్ధరాత్రి గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు హుటాహుటిన అతడిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు. -
పెళ్లి రిసెప్షన్లో డ్యాన్స్ చేస్తూ.. గుండె ఆగి..
కుభీర్: మహారాష్ట్ర నుంచి వచ్చిన ఓ యువకుడు పెళ్లి రిసెప్షన్లో డ్యాన్స్ చేస్తున్నాడు.. బంధువులంతా చప్పట్లు కొడుతూ, ఈలలు వేస్తూ ఉత్సాహపరుస్తున్నారు. కానీ ఆ యువకుడు డ్యాన్స్ చేస్తూనే ఉన్నట్టుండి కుప్పకూలి పోయాడు. గుండెపోటుతో కన్నుమూశాడు. నిర్మల్ జిల్లా కుభీర్ మండలం పార్డి(కె) గ్రామంలో శనివారం రాత్రి జరిగిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. సరదాగా డ్యాన్స్ చేస్తూ..: పార్డి(కె) గ్రామానికి చెందిన నాయుడు రాజుకు భైంసా మండలం కామోల్ గ్రామానికి చెందిన యువతితో శుక్రవారం వివాహం జరిగింది. శని వారం సాయంత్రం పెళ్లికొడుకు నాయుడు రాజు ఇంటి వద్ద రిసెప్షన్ ఏర్పాటు చేశారు. నాయుడురాజు బంధువు, మహారాష్ట్రకు చెందిన తమ్మళ్ల ముత్యం (18) కూడా దీనికి హాజరయ్యాడు. రిసెప్షన్ కార్యక్రమం పూర్తికాగా.. బంధువులు సినిమా పాటలు పెట్టుకుని డ్యాన్స్ చేస్తున్నారు. ముత్యం కూడా డ్యాన్స్ చేయడం ప్రారంభించాడు. కాసేప టికి డ్యాన్స్ చేస్తూనే కుప్పకూలిపోయాడు. అతడు తిరిగి లేవకపోవడంతో బంధువులు వెంటనే భైంసాలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ముత్యం గుండెపోటుతో మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహాన్ని ఆదివారం మహారాష్ట్రలోని స్వగ్రామానికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. -
జిమ్‌లో గుండెపోటు.. కానిస్టేబుల్ మృతి
కంటోన్మెంట్: జిమ్‌లో వ్యాయామం చేస్తూ ఓ కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన మారేడుపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు సికింద్రాబాద్ గ్యాస్మండీ ప్రాంతానికి చెందిన యంజాల విశాల్ (30) ఆసిఫ్ నగర్లోనే పోలీసు స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఇతను రెగ్యులర్‌గా మారేడుపల్లిలోని హెచ్2ఓ జిమ్‌లో కసరత్తు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే గురువారం సాయంత్రం 7.00 గంటల సమయంలో జిమ్‌కు వెళ్లాడు. వార్మప్ చేస్తున్న క్రమంలోనే జిమ్‌లోనే కుప్పకూలిపోయాడు. జిమ్ నిర్వాహకులు 108కు సమాచారం అందించి, ఆంబులెన్స్‌లో యశోదా ఆసుపత్రికి తరలించారు. అయితే విశాల్ అప్పటికే మృతి చెందినట్లుగా డాక్టర్లు ధ్రువీకరించారు. విశాల్ కసరత్తు చేస్తూ జిమ్‌లో కుప్పకూలిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
Healthy Heart: మీ గుండె ఆగిపోకూడదనుకుంటే..
గుండె.. ఉండేది మనిషి గుప్పెడంత. కానీ, నిలువెత్తు మనిషి ప్రాణం దాని మీదే ఆధారపడి ఉంటుంది. అయితే మారుతున్న లైఫ్‌స్టైల్.. ఆహారపు అలవాట్లు మనిషిని నిలబెట్టే ఆ బలాన్ని.. బలహీనపరుస్తోంది. అందుకే గుండె సమస్యలతోపాటు కార్డియాక్ అరెస్ట్ సమస్యలతో.. వయసుతో సంబంధం లేకుండా ఉన్నచోటే కుప్పకూలిపోతున్నారు. అప్పటికప్పుడే ప్రాణం విడుస్తున్నారు. మీడియా.. సోషల్ మీడియా వల్ల ప్రతీ ఒక్కరికీ అలాంటి ఘటనలు నిత్యం కనిపిస్తున్నాయి. ఇవేవీ లేకుండా ఆగిపోయే గుండె మీది కాకూదదనుకుంటే.. దానికి బలం అవసరం. మరి ఆ బలం ఎలా అందించాలో వైద్య నిపుణుల సూచనల మేరకు ఈ కథనం. హార్ట్ స్ట్రోక్, కార్డియాక్ అరెస్ట్.. ఈ రెండూ వేర్వేరు. గుండె పోటు.. ఉబకాయం, ఆహారపు అలవాట్లు, జీవనశైలి, ఇతర అనారోగ్య సమస్యల మీద ఆధారపడి ఉంటుంది. గుండె రక్తనాళాలు అకస్మాత్తుగా మూసుకుపోడం, రక్తం గడ్డలు ఏర్పడటం వల్ల గుండె పోటు వస్తుంది. ఇక సడెన్ కార్డియాక్ అరెస్ట్ అనేది గుండె కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు ఎదురయ్యే స్థితి. దీనికి వయసుతో సంబంధం ఉండదు. పైగా దీనిని అంచనా వేయడమూ కష్టం. అందుకే.. ఈ పరిస్థితులను ఎదుర్కొగలిగే గుండె ఉంటే.. సమస్యనేది ఉత్పన్నం కాదు కదా!. ► కాబట్టి, గుండె ఆరోగ్యంగా ఉంటే.. ప్రాణాల మీదకు రాదు. ఆ ఆరోగ్యం కోసం గుండెకూ ఎక్సర్సైజులు అవసరం!. అయితే మనిషి జీవితం ఇప్పుడు యాంత్రికమైపోయింది. దానికి తగ్గట్లే శారీరక శ్రమకు దూరమైపోతున్నాం. కాబట్టి.. రోజులో కాసేపైనా అలసిపోవడం అవసరం అంటున్నారు వైద్యులు. ముఖ్యంగా.. వాహనాలు, లిఫ్ట్‌లు వచ్చిన తరువాత శారీరక శ్రమ బాగా తగ్గిపోయింది. అందుకే వీలుచిక్కినప్పుడల్లా నడవడం, మెట్లు ఎక్కడం లాంటి వాటి ద్వారా గుండెను పదిలంగా చూసుకోవచ్చు. ఇక.. అధిక బరువు అనే ప్రధాన సమస్య, గుండె ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. దానివల్ల గుండె కొట్టుకోవడానికి మరింత కష్టపడాల్సి వస్తుంది. కనుక ఆహార, వ్యాయామంతో బరువు పెరగకుండా చూసుకోవాలి. ► అనారోగ్యమే కాదు.. అలసట, ఒత్తిడిల వల్ల కూడా గుండె పనితీరు దెబ్బతింటోంది. కాబట్టి, మనసుకు విశ్రాంతి అవసరం. అది ప్రశాంతతతోనే లభిస్తుంది కూడా. ఈరోజుల్లో ఒత్తిడి.. దాని నుంచి ఏర్పడే ఆందోళన, ఉద్వేగం లాంటివి ప్రతీ ఒక్కరికీ సాధారణం అయ్యాయి. ప్రశాంతత అనేది మనసుకు రిలీఫ్ ఇస్తుంది. అందుకోసం రోజుకు కనీసం 20 నిమిషాల పాటు ధ్యానం చేస్తే.. ఉపశమనం కలగొచ్చు. నవ్వడం వలన రక్తనాళాలు విప్పారి, రక్తపోటు తగ్గుతుంది. అందువలన సమయం దొరికినప్పుడల్లా జోక్స్ చదవండి. నవ్వు తెప్పించే కంటెంట్‌వైపు మళ్లండి. ఇక కార్టిజోల్ వంటి హార్మోన్స్ గుండె ఆరోగ్యం దెబ్బతినేలా చేస్తాయి. అందువలన వ్యాయామం చేసి ఇలాంటి హార్మోన్స్ స్థాయిలు ఉద్ధృతం కాకుండా చేసుకోవచ్చు. ► నిద్రలేమి కారణంగా కూడా రక్తపోటు ప్రమాదం ఉంది. ఇది గుండె జబ్బుకు దారితీస్తుంది. కనుక రాత్రివేళ నిద్ర.. అదీ 7-8 గంటలు హాయిగా నిద్రపోతే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ► ఫలానా వాటికి ఫలానాది ఓ గుండెకాయ.. అని అనేక సందర్భాల్లో వర్ణిస్తాం. మరి అంతటి ముఖ్యమైన అవయవానికి సరైన ఆహారం అందాల్సిందే కదా!. గుండెకు మంచి ఆహారం అవసరం. అదీ వైద్యనిపుణులను, నిపుణులైన డైటీషియన్లను సంప్రదించి తీసుకోవడం ఇంకా ఉత్తమం. ► గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలనేది వైద్యులు మొదటి మాట. రెండో మాటగా.. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలంటారు. అలాగే.. ఈరోజుల్లో మూడో మాటగా మాంసాహారం ఎక్కువగా తీసుకునేవాళ్లు.. దానిని తగ్గించి తీసుకోవడం మంచిదని చెప్తున్నారు. ► మనం రెగ్యులర్‌గా తీసుకునే ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్లు ఉంటాయి. అవి గుండె ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తాయి. కొవ్వులు తక్కువగా ఉండే వేరుశెనగ, బాదం, పిస్తా.. వంటి నట్స్‌ను రోజూ తీసుకునే ఆహారంలో భాగం చేసుకోవాలి. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. ► అవిసె గింజలు, ఆలీవ్ ఆయిల్, అవకాడో,చియా గింజలు, గుమ్మడి విత్తనాలు, బాదంపప్పు, కోడిగుడ్డు, వాల్నట్స్, బ్రొకోలి, కొత్తిమీర, పిస్తా వంటి వాటిలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. బ్రెడ్ తదితర మైదా ఉత్పత్తులకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలంటారు. ► తక్కువ ఉప్పు, ట్రాన్స్ ఫ్యాట్ తక్కువ ఉండే వాటితో ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు ఏమీ ఉండవని వైద్యులు అంటున్నారు. అతిగా వేపుళ్లు, మసాలాలు-కారం దట్టించిన ఫుడ్ కూడా అస్సలు మంచిది కాదు. ► మితంగా తింటే ఏదైనా ఆరోగ్యమే. ఇష్టమొచ్చింది తింటే అధిక చెడు కొలెస్ట్రాల్, అధిక బరువుకు దారితీస్తుంది. గుండెకే కాదు.. ఇతర అవయవాలనూ ప్రభావితం చేసి ఇతరత్ర జబ్బులు పలకరించే ప్రమాదం ఉంటుంది. ► ఆల్కహాల్ తీసుకోవడం వల్ల గుండె కొట్టుకునే తీరు ప్రభావితమవుతుంది. అంటే గతితప్పుతుంది. కార్డియో మయోపతి అంటే గుండె రక్తాన్ని పంప్ చేసే సామర్థ్యం తగ్గడం. ఆల్కహాల్ తీసుకున్న సమయంలో ట్ల్యాబ్లెట్లు వేసుకోకూడదు. ► స్మోకింగ్ చేసేవారికి గుండెజబ్బు వచ్చే అవకాశం 70% ఎక్కువ. మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి స్మోకింగ్‌కు దూరంగా ఉండటం మంచిది. ► అట్రియల్ ఫిబ్రిల్లేషన్ (గుండె అతి వేగంగా కొట్టుకోవడం) రిస్క్ ను పెంచుతుంది. దీనికి నిద్ర తగ్గితే మరింత ముప్పు ఎదురవుతుంది. నిద్ర తగ్గి, గుండె అతి వేగంగా కొట్టుకుంటే అతి హార్ట్ ఫెయిల్యూర్ లేదా స్ట్రోక్ కు దారితీయవచ్చు. ► మంచి గాఢ నిద్ర, సరిపడా ఉండేలా చూసుకుంటే రోగ నిరోధక శక్తి పునరుజ్జీవం అవుతుంది. అలాగే, గుండె ఆరోగ్యం కూడా పటిష్టమవుతుంది. అర్ధరాత్రి తర్వాత కూడా మేల్కొని ఉంటే అది అనారోగ్య సమస్యలకు దగ్గరి దారి అవుతుంది. ఇది ఇప్పటి యువతరం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య కూడా. సెల్ఫోన్లు, ఇతర అలవాట్లతో చేజేతులారా ఆరోగ్యాన్ని దెబ్బతీసుకుంటున్నారు. ► గుండె సమస్యల్ని గుర్తించడం చాలా కష్టం. రెగ్యులర్ చెకప్‌ల ద్వారానే సమస్యలను నిర్ధారించుకోవచ్చు. అయితే కొన్ని సంకేతాలు మాత్రం రాబోయే ముప్పును అంచనా వేయొచ్చని చెప్తున్నారు వైద్య నిపుణులు. కడుపులో తీవ్రమైన నొప్పి. పొత్తి కడుపు ఉబ్బినట్లుగా అనిపించడం. కడుపులో గ్యాస్ పెరిగినట్లు అసిడిటీగా అనిపించడం, గొంతులో ఏదో ఇరుక్కున్నట్లు అనిపించడం, పుల్లటి తేన్పులు.. ఛాతీలో నొప్పి.. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలి. వైద్యులు దగ్గరికి వెళ్లాలి. ఆలస్యం చేయకపోవడం ఉత్తమం. కార్డియాక్ అరెస్ట్‌ను అంచనా వేయడం వీలుకాని పని. అందుకే.. గుండెను బలంగా ఉంచుకోవడం మరీ ముఖ్యం. ఇంటి వైద్యం-సొంత వైద్యం కాదు.. గుండెను కాపాడుకోవాలంటే ఆస్పత్రులకు, వైద్యుల వద్దకు వెళ్లాల్సిందే!. Sitting in some position Chewing ginger garlic dhaniya Mirch Coughing sneezing laughing None of these will help in heart attack Reach a hospital with Cardiac facilities as soon as possible to get appropriate treatment in #Heartattack to save life https://t.co/3Aa6cT0cCS pic.twitter.com/ELjEyAW6ne — Dr Deepak Krishnamurthy (@DrDeepakKrishn1) February 24, 2023 -
యువతలో ఆకస్మిక గుండెపోటుకు కారణం ఏంటి?
-
Hyderabad: ఆకస్మిక గుండెపోటుతో ఇద్దరు మృతి.. డాక్టర్లు ఏమంటున్నారంటే!
గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాళాల్లో హఠాత్తుగా అడ్డంకులు ఏర్పడటాన్ని గుండెపోటు అంటారు. మరి గుండెకు రక్తం, ఆక్సిజన్ సరిగా అందకపోతే అది పంపింగ్ చేయలేదు. ఎంత ఎక్కువసేపు అడ్డంకి ఏర్పడితే గుండెకు అంత నష్టం ఏర్పడుతుంది. పురుషుల్లో ఇలాంటి గుండెపోటు 65 ఏళ్లకు.. మహిళల్లో 70 ఏళ్లకు వస్తాయనేది పాత లెక్క. కానీ ఇటీవల ఆ వయసు క్రమంగా తగ్గిపోతుంది. వయసుతో సంబంధం లేకుండా.. గుండెపోటు ముప్పు అందరిని చుట్టుముడుతోంది. ముఖ్యంగా యువత, చిన్నారుల్లో సడెన్ హార్ఠ్ ఎటాక్ కేసులు ఎక్కువగా అవుతున్నాయి. మొన్నటికి మొన్న హైదరాబాద్‌లో రబ్బాని అనే వ్యక్తి పెళ్లి వేడుకలో సంతోషంగా పాల్గొని.. వరుడి పాదాలకు పసుపు రాస్తుండగా గుండెపోటుతో క్షణాల వ్యవధిలో ప్రాణాలు విడిచిన విషయం తెలిసిందే. తాజాగా బోయినపల్లిలో జిమ్‌లో కసరత్తులు చేస్తూ 24 ఏళ్ల యువ కానిస్టేబుల్ విశాల్ ఉన్నట్టుండి కుప్పకూలాడు.. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించడగా.. అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. అయితే యువకుల్లో గుండెపోటుకు సంబంధించిన లక్షణాలు కనిపించకపోవడం అతిపెద్ద సమస్య. చాలాసార్లు నిశబ్ధంగా విరుచుకుపడి.. ప్రాణాల మీదకు తెస్తుంది. ఇలా వరుసగా జరుగుతున్నసైలెంట్ గుండెపోటు మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సడెన్ హార్ట్ ఎటాక్‌పై ప్రముఖ కార్డియాలజిస్ట్ చాణక్య కిషోర్ సాక్షితో మాట్లాడారు. యువతలో ఆకస్మిక గుండెపోటుకు కారణాలు ఏంటి.. దీన్ని ముందుగా గుర్తించగలమా?. ఎలాంటి జాగ్రత్తలతో గుండెపోటును నివారించవచ్చు.. అనే అంశాలపై ఆయన చెప్పిన వివరాలు డాక్టర్ మాటల్లోనే... -
తారకరత్న తాజా హెల్త్ బులెటిన్.. వైద్యులు ఏమన్నారంటే?
సినీనటుడు నందమూరి తారక రత్న ఆరోగ్య పరిస్థితిపై బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రి యాజమాన్యం తాజా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. అయితే ఆయన పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదని వైద్యులు తెలిపారు. ఆయనకు వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్నట్లు బులెటిన్‌లో పేర్కొన్నారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు బులెటిన్‌లో వైద్యులు వెల్లడించారు. కొన్ని మీడియాల్లో ఆయనకు ఎక్మోపై చికిత్స అందించినట్లు వచ్చిన కథనాలపై వైద్యులు క్లారిటీ ఇచ్చారు. ఆయనకు ఇప్పటి వరకు ఎక్మోపై ఎలాంటి చికిత్స అందించలేదని వైద్యులు తెలిపారు. ఆయన ఆరోగ్యం పరిస్థితిపై ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులకు వివరాలు అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. -
ఆదిలాబాద్: కుప్పకూలిన పెళ్లి కొడుకు.. కన్నుమూత!
సాక్షి, ఆదిలాబాద్: మరి కొన్ని గంటల్లో ఆ ఇంట పెళ్లి బాజాలు మోగాల్సి ఉంది. కానీ, విధి ఆ యువకుడి జీవితంతో ఆడుకుంది. కాళ్లకు రాసిన పారాణి ఆరిపోక ముందే అర్ధాంతంరంగా అతని జీవితం ముగిసిపోయింది. రెండు వైపులా కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. ఉట్నూరుకి చెందిన సత్యనారాయణకు(34), జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన ఓ యువతితో ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ నెల 27న అతని వివాహం జరగాల్సి ఉంది. ఆ ఇంటికి పెద్ద కొడుకు కావడంతో పెళ్లి వేడుకలు ఘనంగా చేయాలని భావించారు. సత్యనారాయణే.. తన పెళ్లి పనులు తానే దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి దాకా పనులు చేస్తూ.. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు స్థానికంగా ఓ ఆస్పత్రికి తరలించారు. ఆపై అక్కడి నుంచి ఆదిలాబాద్ రిమ్స్‌కు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ గురువారం ఉదయం అతను కన్నుమూసినట్లు తెలుస్తోంది. కార్డియాక్ అరెస్ట్‌తోనే సత్యనారాయణ కన్నుమూసినట్లు వైద్యులు ధృవీకరించారు. ఎంతో ఆరోగ్యంగా ఉండే సత్యనారాయణ.. అదీ వివాహనికి కొద్ది గంటల ముందే కన్నుమూయడంతో ఆ ఊరు ఊరంతా విషాదంలో కూరుకుపోయింది. -
Cardiac Arrest: నిద్రలో ఉలిక్కిపాటు.. చిన్నారి గుండె ఆగింది!
చిన్నాపెద్దా తేడా లేదు. ఎలాంటి అనారోగ్యమూ ఉన్నట్లు కనిపించదు. కానీ, ఉన్నట్లుండి గుండె ఆగిపోయి ప్రాణాలు పోతున్నాయి. నిత్యం దేశంలో ఏదో ఒక మూల ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఉన్నట్లుండి కుప్పకూలి మరణిస్తున్నారని వినడం పరిపాటిగా మారింది. దీనికి కారణాలపై రకరకాల చర్చలు జరుగుతున్నా.. సకాలంలో సమస్యను(చిన్నదైనా సరే) గుర్తించకపోవడమే అసలైన కారణమని అంటున్నారు వైద్య నిపుణులు. తాజాగా.. కర్ణాటకలో పన్నెండేళ్ల చిన్నారి కార్డియాక్ అరెస్ట్‌తో కన్నుమూశాడు. కుశాల్‌నగర్‌లో కూడుమంగళూరు గ్రామంలో ఆదివారం వేకువ ఝామున ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. నిద్రలోనే ఉలిక్కిపడి లేచి విలవిలలాడిన చిన్నారి.. ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలోనే కన్నుమూశాడు. బాధితుడిని కొప్పాలో ఓ ప్రైవేట్ స్కూల్లో ఆరో తరగతి చదువుతున్న కీర్తన్‌గా గుర్తించారు. శనివారం సాయంత్రం ఆడుకుని ఇంటికి వచ్చిన చిన్నారి.. భోజనం చేసి పడుకున్నాడు. అయితే.. నిద్రలో ఉలిక్కిపడి లేచి ఏడ్వడం మొదలుపెట్టాడు. ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే మార్గం మధ్యలోనే ఆ చిన్నారి కన్నుమూశాడు. కీర్తన్ తండ్రి మంజాచారీ.. కొడుకు చదివే స్కూల్లోనే వ్యాన్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. పన్నెండేళ్లకే ఆ చిన్నారికి నూరేళ్లు నిండడంతో స్థానికంగా విషాదం అలుముకుంది. Cardiac Arrest: ఇలా చేస్తే ప్రాణాలను కాపాడుకోవచ్చు.. -
నా జీవితంలో మర్చిపోలేని భయానక ఘటన అది..!
ఒక వ్యక్తి ఫ్లైట్ జర్నీలో ఉండగా గుండె పోటుకి గురయ్యాడు. దీంతో భారత సంతతికి చెందిన వ్యక్తి ఐదుగంటలు శ్రమించి అతన్ని కాపాడేందుకు ప్రయత్నించాడు. విమానంలో తగిన వైద్య పరికరాలు లేకపోయినప్పటికీ.. ఆయన్ను రక్షించేందుకు విశ్వ ప్రయత్నం చేయడంతో...సదరు పేషెంట్ కన్నీళ్లు పెట్టుకుంటూ భావోద్వేగానికి గురయ్యాడు. ఈ ఘటన లండన్ నుంచి భారత్‌కి వెళ్లే విమానంలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...బర్మింగ్‌హామ్‌లో కన్సల్టెంట్ హెపటాలజిస్ట్ , భార సంతతి డాక్టర్ విశ్వరాజ్ వేమల సుమారు 10 గంటల పాటు ఫ్లైట్ జర్నీలో ఉండగా.. ఒక అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో 43 ఏళ్ల వ్యక్తి రెండు సార్లు తీవ్ర గుండెపోటుకి గురయ్యాడు. దీంతో విమాన సిబ్బంది ఈ విషయం గురిచి డాక్టర్ విశ్యరాజ్ తెలియజేశారు. ఈ మేరకు విశ్వరాజ్ అతన్నిరక్షించేందుకు విమానంలో పరిమిత పరిధిలోనే ఉన్న వైద్య సామాగ్రితో అతని ప్రాణం కాపాడేందుకు శతవిధాల యత్నించారు. వాస్తవానికి ఆయన లండన్‌లో ఉన్న తన తల్లిని తిరిగి భారత్‌లోని తమ స్వస్థలం బెంగళూరుకి తీసుకువెళ్తుండగా.. ఈ ఘటన జరిగింది. విమాన సిబ్బంది ఒక వ్యక్తికి గుండె పోటు వచ్చిందంటూ తన వద్దకు పరిగెత్తుకు వచ్చినట్లు విశ్వారాజ్ తెలిపారు. విమానంలో ఉన్న పరిమిత పరిధిలో అందుబాటులో ఉన్న ఎమర్జెన్సీ కిట్ సాయంతో అతన్ని కాపాడేందుకు ప్రయత్నించినట్లు చెప్పారు. ఐతే అతను స్ప్రుహలోకి రావడానికి సుమారు గంట సమయం పట్టిందని, తనతో మాట్లాడుతుండగానే మరోసారి గుండెపోటుకి గురైనట్లు తెలిపాడు. దీంతో విమానంలో ఉన్న మిగతా ప్రయాణికులు, విమాన సిబ్బంది అందరిలో ఆ వ్యక్తి గురించే ఒకటే టెన్షన్ మొదలైంది. అందరం అతను ఐదుగంటల వరకు ప్రాణాలతో ఉండేలా ప్రయత్నించాం. ఆ ప్రయాణికుడు విషయమై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో పైలెట్ ముంబైలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు.తామంతా ముంబైలో దిగుతుండగా అందరిలోనే అతను బతకే ఉండాలంటూ ఒకటే ఆందోళన చెందినట్లు తెలిపారు. ఎట్టకేలకు ముంబైలో దిగినప్పుడూ.. ఆ ప్రయాణికుడు సదరు డాక్టర్ విశ్వారాజ్తో మాట్లాడటమే కాకుండా కన్నీటితో కృతజ్ఞతలు తెలిపాడు. అదీగాక ముంబైలోని ఎయిర్పోర్ట్ అత్యవసర సిబ్బంది అతన్ని సురక్షితంగా కాపాడటమే గాక అతను కూడా పూర్తి స్థాయిలో కోలుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు డాక్టర్ విశ్వరాజ్ వేముల తన జీవితాంతం ఈ ఘటన మర్చిపోలేనంటూ..ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. (చదవండి: ఘోర ప్రమాదం..ఏకంగా నెత్తిమీద ఉన్న చర్మంతో సహా ఊడి..) -
చప్పుడు విందాం.. చటుక్కున మేల్కొందాం! లేదంటే క్షణాల్లో ప్రాణాల మీదకు
చంద్రమౌళిరెడ్డి. వయస్సు 28 సంవత్సరాలు. ఉన్నత విద్యను అభ్యసించి, ఉద్యోగంలో స్థిరపడి పెళ్లికి సిద్ధమవుతున్న వేళ కార్డియాక్ అరెస్టుతో జీవితం అర్ధాంతరంగా ముగిసింది. టీటీడీ ఈఓ ధర్మారెడ్డి కుమారుడైన చంద్రమౌళి మృతి ఆ కుటుంబంలో విషాదం నింపింది. ఇలాంటి ఘటనలు తరచుగా చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. .. ఏది గుండెనొప్పి, ఏది కార్డియాక్ అరెస్టు.. కరోనా నేపథ్యంలోనే ఎందుకు ఇలా జరుగుతోంది. వ్యాక్సిన్ వేసుకోవడమే ఇందుకు కారణమా? ఎంతో చురుకుగా వ్యాయామం చేస్తున్నా.. రోజువారీ ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటున్నా.. ఆహార నియమాలు పాటిస్తున్నా.. రేపటి మీద నమ్మకం కలగని పరిస్థితి. కొత్త వేరియంట్లతో సరికొత్త భయం ఉదయిస్తోంది. జిల్లా డెస్క్,కర్నూలు: కరోనా కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తుమ్మినా.. దగ్గినా.. ఒంట్లో వేడి చేసినా.. మూలం కరోనాతో ముడిపడుతోంది. రోజుకో వార్త.. పూటకో ప్రచారం.. కరోనా రూపం మార్చుకోవడం ఏమో కానీ.. మనిషి ఆరోగ్యం మాత్రం దినదిన గండం అవుతోంది. చైనా మొదలుకొని.. మారుమూల పల్లె వరకు ఇప్పుడు ఇదే చర్చ. అసలేమవుతోంది.. ప్రపంచంలో ఏం జరుగుతోంది.. ఇలాంటి ఆలోచనలతో గుండె వేగం పెరుగుతోంది. ఊపిరి ఉక్కిరిబిక్కిరి అవుతోంది. తాజాగా కార్డియాక్ అరెస్టు కొత్త ప్రశ్నలను తీసుకొస్తోంది. యువతను గందరగోళంలోకి నెడుతోంది. ఈ నేపథ్యంలో గుండెవ్యాధుల నిపుణుల సలహాలు, సూచనలతో ‘సాక్షి’ ప్రత్యేక కథనం. పెద్దాసుపత్రితో గుండె పదిలం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని కార్డియాలజి విభాగంలో 10 ఐసీయూ, 20 జనరల్ వార్డు పడకలు ఉన్నాయి. 2008లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఈ విభాగానికి కేథలాబ్ యూనిట్, హార్టింగ్ మిషన్ మంజూరు చేశారు. ప్రస్తుతం ఒక ప్రొఫెసర్, నలుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు సేవలందిస్తున్నారు. ఈసీజీ, 2డి ఎకో పరీక్షలతో పాటు టీఎంటీ, యాంజియోగ్రామ్ పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి స్టెంట్స్ సైతం ఇక్కడే వేస్తున్నారు. ఇక కార్డియోథొరాసిక్ సర్జరీ విభాగంలో ఒక ప్రొఫెసర్, ఒక అసోసియేట్ ప్రొఫెసర్, ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లు పనిచేస్తున్నారు. ఈ విభాగం దాదాపు రూ.5 కోట్లతో ఆధునీకరించి 2016 జులైలో పునః ప్రారంభించారు. అత్యాధునిక మాడులర్ ఆపరేషన్ థియేటర్, పది పడకలున్న ఐసీయూ విభాగం కార్పొరేట్ స్థాయిలో సేవలందిస్తోంది. ఇప్పటివరకు అన్ని రకాల గుండె, ఊపిరితిత్తుల శస్త్ర చికిత్సలు 600 దాకా నిర్వహించారు. తరచుగా గుండె పరీక్షలు ► 25 నుంచి 30 ఏళ్లలోపు వారు గుండెపోటు బారినపడటానికి ప్రధాన కారణం ధూమపానం, స్థూలకాయం. ► కుటుంబంలో ఎవరికైనా హార్ట్ ఎటాక్ వచ్చి ఉన్నా, తక్కువ వయస్సులో షుగర్ వచ్చినా గుండెపోటుకు గురయ్యే అవకాశాలు అధికం. ► కోవిడ్‌కు గురైన వారిలో గుండెపోటు కేసులు కాస్త ఎక్కువగానే ఉంటున్నాయి. ► కరోనా సమయంలో తీవ్ర అనారోగ్యంతో బాధపడిన వాళ్లు గుండె పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి. ► రక్తనాళాల్లో ఏవైనా సమస్యలుంటే అవసరమైన చికిత్స తీసుకుంటే గుండెపోటుకు గురికాకుండా చూసుకోవచ్చు. కార్డియాక్ అరెస్టు అంటే.. కార్డియాక్ అరెస్ట్ ఆకస్మికంగా వస్తుంది. శరీరంలో ఎలాంటి ముందస్తు లక్షణాలు కనిపించవు. సాధారణంగా గుండెలో ఏర్పడే అలజడితో పాటు అప్పటికే శరీరంలో ఉన్న ఇతర అనారోగ్య కారణాలు ఇందుకు తోడు కావడం. గుండె కొట్టుకోవడంలో సమతుల్యం దెబ్బతినడం, రక్తాన్ని పంప్ చేసే సామర్థ్యంపై ప్రభావం చూపుతుంది. ఈ కారణంగా మెదడు, గుండె, శరీరంలోని ఇతర భాగాలకు రక్త ప్రసరణ నిలిచిపోతుంది. ఫలితంగా కొద్ది క్షణాల్లోనే రోగి అపస్మారక స్థితికి చేరుకుంటారు. ఎలాంటి వయస్సులోనైనా.. యువకుల్లోనే కాదు ఎవరిలోనైనా సడన్‌గా కార్డియాక్ అరెస్టు రావచ్చు. కరోనా వచ్చిన వారిలోనే కార్డియాక్ అరెస్టు అధికంగా ఉంటుందనే ప్రచారం అవాస్తవం. కార్డియాక్ అరెస్టుకు, గుండెపోటుకు సంబంధం లేదు. వీటిని ముందుగా గుర్తించడం కొద్దిగా కష్టం. ఈసీజీ, ఎకో పరీక్షల్లో కనిపించవు. ఎంఆర్ఐ, పెట్సా్కన్ చేసి నిర్ధారించవచ్చు. జిమ్ చేస్తున్న సమయంలో, తీవ్రమైన భావోద్వేగాలు, మానసిక ఆందోళన కారణంగా కరోనరి ధమనులు మూసుకుపోతాయి. దీనివల్ల సడన్‌గా గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. 40 ఏళ్లలోపు వారే అధికం గుండె జబ్బు బారిన పడుతున్న వారిలో అధిక శాతం 40 ఏళ్లలోపు వారే ఉంటున్నారు. వంశపారంపర్యం, జన్యులోపాలు, మేనరికపు వివాహం వంటి కారణాలతో పుట్టుకతోనే గుండెజబ్బులతో జన్మించే పిల్లలూ ఇటీవల అధికమయ్యారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని కార్డియాలజి విభాగంలో వారానికి రెండు రోజులు ఓపీ ఉంటుంది. ప్రతి ఓపీ రోజున రోగుల సంఖ్య 250 నుంచి 300 ఉంటోంది. నెలకు ఇన్‌పేషంట్లుగా 400 మంది దాకా చికిత్స పొందుతున్నారు. నగరంలోని పలు ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ రోజుకు 20 మందికి పైగా రోగులు గుండెపోటు చికిత్స పొందుతున్నారు. 40 ఏళ్లలోపు వారే అధికం గుండె జబ్బు బారిన పడుతున్న వారిలో అధిక శాతం 40 ఏళ్లలోపు వారే ఉంటున్నారు. వంశపారంపర్యం, జన్యులోపాలు, మేనరికపు వివాహం వంటి కారణాలతో పుట్టుకతోనే గుండెజబ్బులతో జన్మించే పిల్లలూ ఇటీవల అధికమయ్యారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని కార్డియాలజి విభాగంలో వారానికి రెండు రోజులు ఓపీ ఉంటుంది. ప్రతి ఓపీ రోజున రోగుల సంఖ్య 250 నుంచి 300 ఉంటోంది. నెలకు ఇన్‌పేషంట్లుగా 400 మంది దాకా చికిత్స పొందుతున్నారు. నగరంలోని పలు ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ రోజుకు 20 మందికి పైగా రోగులు గుండెపోటు చికిత్స పొందుతున్నారు. ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి వ్యాయామం దినచర్యలో భాగం కావాలి. పనిలో శారీరక శ్రమ తప్పనిసరి. సైకిల్ తొక్కడంతో పాటు వాకింగ్ చేయాలి. గుండె జబ్బులకు ప్రధాన కారణాల్లో స్థూలకాయం ఒకటి. కొవ్వు శాతం అధికంగా ఉండే ఫాస్ట్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. పండ్లు, తాజా కూరగాయలకు భోజనంలో చోటు కల్పిస్తే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. యోగా చేయడం ద్వారా రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించుకోవచ్చు. ఒత్తిడి, ఆందోళనలను దరి చేయనీయకపోవడం ఉత్తమం. వ్యాక్సిన్ గుండెపై ప్రభావం చూపుతుందా? కరోనా వైరస్ నేరుగా గుండె కండరాన్ని దెబ్బతీస్తుంది. దీనివల్ల రక్తం గడ్డకట్టేతత్వం ఎక్కువ అవుతుంది. దీంతో పాటు ఊపిరితిత్తుల్లో, ఇతర అవయవాల్లో ఎక్కడైనా రక్తం గడ్డకట్టవచ్చు. కాళ్లలో కొన్నిసార్లు రక్తం గడ్డకట్టి అది ఊపిరితిత్తుల్లో ఎక్కడైనా చేరవచ్చు. దీనివల్ల రక్తనాళాల్లో బ్లాకులు ఏర్పడి హార్ట్ ఎటాక్‌కు దారితీస్తుంది. ఊపిరితిత్తులు దెబ్బతిన్నç³్పుడు కూడా గుండెపై ప్రభావం చూపుతుంది. కోవిడ్ వ్యాక్సిన్‌కు, గుండెపోటుకు సంబంధం లేదు. హార్ట్ ఎటాక్ లక్షణాలు ఉదయం వేళల్లో ఎడమ దవడ కింది భాగంలో నొప్పి ప్రారంభమై పెరుగుతూ, తగ్గుతూ ఉంటుంది. ఆ తర్వాత నొప్పి క్రమేపీ ఛాతీ వైపునకు, అక్కడి నుంచి ఎడమ భుజం, చేతి వేళ్ల వైపునకు వస్తుంది. కార్డియాక్ అరెస్టు లక్షణాలు గుండె పనితీరులో ఆకస్మిక తేడాతో స్పృహ కోల్పోవడం లేదా శ్వాసను కోల్పోవడం జరుగుతుంది. గుండెకు రక్తప్రసరణ ఆగిపోవడం, ఆ వెంటనే ఇతర అవయవాలకు రక్తప్రసరణ నిలిచిపోతుంది. గుండె చప్పుడు ఆధారంగా చికిత్స హార్ట్ ఎటాక్‌తో ఆసుపత్రికి వచ్చిన రోగి గుండెచప్పుడును పరీక్షించి చికిత్స ప్రారంభిస్తాం. ముందుగా ధమనులలో అడ్డంకులు కరగడానికి, నొప్పి ఉపశమనానికి మందులు ఇస్తాం. అధిక రక్తపోటు ఉన్నట్లయితే అందుకు తగిన చికిత్స చేస్తాం. రక్తనాళాలలోని అడ్డంకులు, గుండె జబ్బు పరిధి, నొప్పి తీవ్రత, రోగి వయస్సు మీద ఆధారపడి అప్పటికప్పుడు నిర్ణయం ఉంటుంది. కరోనరీ యాంజియోప్లాస్టీ, బెలూన్ ఉపయోగించి రక్తనాళాలను విస్తరింపజేయడం లేదా కరోనరీ బైపాస్ సర్జరీ చేస్తాం. – డాక్టర్ ఎ.వసంతకుమార్, సీనియర్ కార్డియాలజిస్టు, కర్నూలు -
షాకింగ్..12 ఏళ్లకే గుండెపోటు..స్కూల్ బస్సులోనే కుప్పకూలిన విద్యార్థి..
భోపాల్: వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు అందరికీ వస్తోంది. తాజాగా మధ్యప్రదేశ్ భిండ్‌లో 12 ఏళ్ల బాలుడు గుండెపోటుతో(కార్డియాక్ అరెస్ట్) ప్రాణాలు కోల్పోయాడు. ఇంత చిన్న వయసులో ఈ కారణంగా చనిపోయిన ఘటన రాష్ట్రంలో ఇదే తొలిసారి అని వైద్యులు వెల్లడించారు. ఓ స్కూల్లో నాలుగో తరగతి చదువుతున్న ఈ బాలుడి పేరు మనీష్ జాతవ్. గురువారం మధ్యాహ్నం సోదరుడితో కలిసి పాఠశాలలోనే భోజనం చేశాడు. అనంతరం 2:00 గంటలకు స్కూల్ బస్ ఎక్కాడు. క్షణాల్లోనే ఉన్నట్టుండి కుప్పకూలి పడిపోయాడు. విద్యార్థిని గమనించిన బస్ డ్రైవర్ స్కూల్ యాజమాన్యాన్ని వెంటనే అప్రమత్తం చేశాడు.స్పృహకోల్పోయిన అతడ్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ప్రాణాలు కాపాడేందుకు సీపీఆర్ చేసినా ఫలితం లేకపోయింది. బాలుడు అప్పటికే చనిపోయాడని వాళ్లు ప్రకటించారు. ఇంత చిన్న వయసులో గుండెపోటు రావడం చాలా అరుదు అని వైద్యులు తెలిపారు. కానీ కోవిడ్ తర్వాత ఇలాంటి ఘటనలు పెరిగాయని చెప్పారు. తమ బిడ్డకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని బాలుడి తల్లిదండ్రులు తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేందుకు నిరాకరించారు. చదవండి: షాకింగ్.. నాలుగు కాళ్లతో జన్మించిన శిశువు.. ఫొటో వైరల్.. -
Aindrila Sharma: యువనటి ఆండ్రిలా శర్మ మృతి.. వైద్యులు చెప్తున్నదేంటి?
విధి వెక్కిరింతకు నేలరాలిన నవ్వుల పువ్వులెన్నో. కష్టాలెన్నింటినో దాటి బతుకుపోరులో బలవంతులుగా మిగిలినా.. ఉసురు తీసే ఉపద్రవాలు మరెన్నో. కళ్లముందే కళకళలాడుతూ కనిపించి.. కనురెప్పపాటులో కానరాకుండా పోతున్న జీవితాలెన్నెన్నో. లయతప్పిన జీవన విధానమో.. శ్రుతిమించిన వ్యాయామ వ్యవహారమో.. తరాలనుంచి సంక్రమించిన పెనుముప్పో! బతుకులైతే మిన్నుముట్టిమన్నులో కలిసిపోతున్నయ్! బెంగాలీ యువనటి ఆండ్రిలా శర్మ ‘ఆఖరి’పోరులో అలసిపోయిన సంగతి చెప్తున్నదేంటి... 24 ఏళ్ల ఆండ్రిలా శర్మ గుండెపోటుకు గురై ఆదివారం కన్నుమూసింది. రెండుసార్లు ప్రాణాంతక క్యాన్సర్ బారి నుంచి ప్రాణాలతో బయటపడ్డ ఆమె ఉన్నట్టుండి నవంబర్ 1న తీవ్ర అస్వస్థతకు లోనైంది. ఆస్పత్రికి తరలించగా ఆండ్రియా బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైందని తెలిసింది. అప్పటినుంచి ఆమెకు వెంటిలేటర్‌పైనే వైద్యులు చికిత్స అందించారు. బ్రెయిన్ సర్జరీ చేశారు. అయితే, కోలుకుంటోందన్న తరుణంలో ఆండ్రియాకు పలుమార్లు గుండెపోటు వచ్చింది. దీంతో ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించి చివరకు ప్రాణాలు కోల్పోయింది. చిన్న వయసులోనే తీవ్రమైన గుండెపోట్లు యావత్ ప్రపంచాన్నిఆందోళనకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా మనదేశంలో ఈ ముప్పు అధికంగా ఉందని పలు మెడికల్ సర్వేలు చెప్పడం గమనించదగ్గది. (చదవండి: హు కిల్డ్ శ్రద్ధా వాకర్.. సినిమాగా రానున్న సంచలన హత్య కేసు) కారణాలేంటి? ఎందుకిలా? చిన్న వయసులోనే హృద్రోగ సమస్యలు రావడానికి వంశపారంపర్యం.. లేక జీవన విధానం కారణమని వైద్య నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా భారత్‌లో ఇటువంటి విషాదాలు మామూలైపోయాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ చరిత్రలో హృద్రోగ సమస్యలు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. ఆరోగ్యాన్ని దెబ్బతీసే అలవాట్లకు దూరంగా ఉండాలని, జీవన శైలి మార్చుకోవాలని సూచిస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా ఎవరికైనా గుండె సమస్యలు ఉత్పన్నం కావచ్చని అంటున్నారు. గుండెకు ఆక్సిజన్, రక్త సరఫరాలో ఆటంకం తలెత్తితే సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. చక్కని ఆహారం, సరిపడా నిద్ర, ఒత్తిడి తగ్గించుకోవడం, వ్యాయామ గుండెజబ్బుల రిస్కును తగ్గిస్తాయని పేర్కొంటున్నారు. యువతకు గుండెపోటు సమస్యలపై పలు రిపోర్టులు ఏం చెప్తున్నాయంటే.. 1. నియంత్రణలేని జిమ్ పద్ధతులు పాటించడం. 2. మితిమీరిన జిమ్ సప్లిమెంట్స్ (ప్రోటీన్ పౌడర్, స్టెరాయిడ్స్) తీసుకోవడం. 3. సులభపద్ధతుల్లో వర్కౌట్స్ చేయపోవడం.. శరీరాకృతి కోసమంటూ మొండిగా కఠిన విధానాలు అవలంభించడం. 4. హెల్త్ చెకప్స్ రెగ్యులర్‌గా చేయించుకోకపోవడం. శరీరంలో కొవ్వు నిష్పత్తి ఏమేరకు ఉంది, బీపీ నియంత్రణలోనే ఉందా? అని తెలుసుకోవడం అత్యావశ్యకం. 5. గుండె ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవడం. సాచురేటెడ్ కొవ్వులు పరిమితికి మించి తీసుకోవడం. (చదవండి: గుండెపోటుతో ప్రముఖ నటి మృతి) -
మరో విషాదం.. ప్రముఖ నటి మృతి
ప్రముఖ బాలీవుడ్ నటి తబస్సుమ్ గోవిల్ గుండెపోటుతో కన్నుమూశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు ఆమె కుమారుడు హోషాంగ్ గోవిల్ వెల్లడించారు. ఆమె మరణంతో వారి కుటుంబంలో విషాదంలో మునిగిపోయింది. పది రోజుల క్రితం ఓ ప్రదర్శన కోసం షూట్లో పాల్గొన్నట్లు ఆమె కుమారుడు తెలిపారు. వచ్చే వారం మళ్లీ ఆమె షూట్ పాల్గొనాల్సి ఉందని.. కానీ అంతలోనే ఇలా అకస్మాత్తుగా జరిగిందని విచారం వ్యక్తం చేశారు. (చదవండి: సీనియర్ నటుడు సుమన్‌కు అరుదైన పురస్కారం) ముంబైలో జన్మించిన తబస్సుమ్ గోవిల్ బాలీవుడ్లో బేబీ తబస్సుమ్గా పేరు సంపాదించింది. ఆమె చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన సినీ కెరీర్‌ను ప్రారంభించింది. 1972 నుంచి 1993 వరకు దాదాపు 21 ఏళ్లపాటు ప్రముఖ దూరదర్శన్ తొలి సెలబ్రిటీ టాక్ షో 'ఫూల్ ఖిలే హై గుల్షన్ గుల్షన్'ను కూడా హోస్ట్‌గా వ్యవహరించింది. సోమవారం సాయంత్రం ముంబైలోని శాంతాక్రూజ్ ప్రాంతంలో ఆమె కోసం ప్రార్థన నిర్వహించనున్నట్లు మనవరాలు తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. -
అయ్యో.. అత్యుత్సాహం ఎంత పని చేసింది?
వైరల్: మన దేశంలో బారాత్‌లు, వివాహ వేడుకలు, ఇతర ఫంక్షన్లలో మందు-చిందులు తప్పనిసరిగా మారాయి. అయితే.. ఒక్కోసారి ఆ వేడుకల్లో చేసే అతిచేష్టలు విపరీతాలకు దారి తీస్తున్నాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి విపరీతంగా వైరల్ అవుతోంది. మరో హఠాన్మరణం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన మరదలి పెళ్లికి హాజరైన ఓ వ్యక్తి(42).. సంతోషంగా చిందులేస్తూ గడిపాడు. అయితే.. ఆయన డ్యాన్స్ అక్కడి వాళ్లను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో చప్పట్లతో ఆయన్ని మరింత ప్రొత్సహించారు. దీంతో రెచ్చిపోయి అలాగే చాలాసేపు డ్యాన్స్‌లోనే ఉండిపోయారు ఆయన. ఈ క్రమంలో.. తీవ్రంగా అలసిపోయి ఆ వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఆయనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని, సడన్ కార్డియాక్ అరెస్ట్‌తోనే ఆ వ్యక్తి కన్నుమూసినట్లు వైద్యులు తెలిపారు. రాజస్థాన్ పాలిలో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. साली की शादी में डांस करते वक्त 42 साल के व्यक्ति की मौत| pic.twitter.com/ujOulHI6EY — Priya singh (@priyarajputlive) November 13, 2022 -
మూడు సార్లు గుండె ఆగినా.. ప్రాణాలు నిలిపారు
సాక్షి, కర్నూలు (హాస్పిటల్): తెలంగాణ రాష్ట్రం గద్వాలకు చెందిన వరుణ్ అనే 8 ఏళ్ల బాలుడికి ఇన్ఫెక్షన్ కారణంగా మూడు సార్లు గుండె ఆగిపోయింది. ఇలాంటి స్థితిలో వైద్యులు.. బాలుడికి సీపీఆర్ చేసుకుంటూ మెరుగైన వైద్యం అందించడంతో తిరిగి ప్రాణం పోసుకున్నాడు. వివరాలను బుధవారం కర్నూలులోని మెడికవర్ హాస్పిటల్ పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ డాక్టర్ మురార్జీ వివరించారు. వరుణ్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో తల్లిదండ్రులు మెడికవర్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆ సమయానికి అతనికి కార్డియాక్ అరెస్ట్ రావడంతో ఎంతో శ్రమించి వైద్యులు అతని గుండెను పునఃప్రారంభింపజేశారు. పరీక్షలు నిర్వహించిన అనంతరం.. బాబుకు ఇన్ఫెక్షన్ సోకడంతో గుండె సామర్థ్యం మందగించిందని తెలుసుకున్నారు. వైద్యం చేసే సమయంలోనే బాలుడి గుండె మూడు సార్లు ఆగిపోయింది. ఆ సమయంలో మెదడుకు రక్త సరఫరాలో ఇబ్బంది తలెత్తి పక్షవాతం వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. మెరుగైన వైద్యం కారణంగా పక్షవాతం రాలేదు. పిల్లల గుండెకు ఇన్షెక్షన్ సోకి గుండె పనితీరు మందగించడం చాలా అరుదుగా జరుగుతుందని, దీనిని వైద్య పరిభాషలో మయోకార్డియారెస్ట్ అంటారని డాక్టర్ మురార్జీ తెలిపారు. మయోకార్డియాటీస్ ఉన్నప్పుడు తక్కువ మంది పిల్లలకు తీవ్రమైన గుండె సమస్యలు తలెత్తుతాయని, వారికి ఇంట్రావీనస్ ఆయనోట్రోఫిక్ సపోర్ట్, మెకానికల్ వెంటిలేషన్‌తో ఇంటెన్సివ్ కేర్ థెరపీ అవసరం ఉంటుందని డాక్టర్ మురార్జీ వివరించారు. చదవండి: (బతికుండగా పదిమందికి పట్టెడన్నం.. చనిపోతూ ఐదుగురికి ప్రాణదానం) -
షాకింగ్.. ఆ కరోనా టీకాలు తీసుకున్న వారికి గుండెపోటు ముప్పు!
వాషింగ్టన్: కరోనా ఎంఆర్ఎన్ఏ టీకాలకు తీసుకుంటే 18-39 ఏళ్ల వయసు వారికి గుండెపోటు వచ్చే ముప్పు ఎక్కువ ఉందని అమెరికా ఫ్లోరిడా సర్జన్ జనరల్ డా.జోసెఫ్ లడాపో వెల్లడించారు. ఫ్లోరిడా ఆరోగ్య శాఖ స్వయం నియంత్రిత కేసులపై(సెల్ఫ్ కంట్రోల్డ్ కేసెస్ సిరీస్) పరిశోధనలు జరిపిన అనంతరం ఈ నిర్ధారణకు వచ్చినట్లు ఆయన చెప్పారు. టీకాల భద్రతను పరీక్షించేందుకు ఈ సాంకేతికతనే ఉపయోగించడం గమనార్హం. ఎంఆర్ఎన్ఏ కరోనా టీకా తీసుకున్న 28 రోజుల తర్వాత 18-39ఏళ్ల యువకుల్లో గుండెపోటు, ఇతర హృదయ సమస్యల కారణంగా మరణం సంభవించే ముప్పు 84శాతం ఉంటుందని ఈ విశ్లేషణలో తేలింది. అగ్ర దేశాలన్నీ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లనే పంపిణీ చేసిన నేపథ్యంలో ఈ పరిశోధన ఆందోళన కల్గిస్తోంది. అయితే ఎంఆర్ఎన్ఏ సాంకేతిక ఉపయోగించని ఇతర కరోనా టీకాల వల్ల ఈ ముప్పు లేదని పరిశోధన స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఎంఆర్ఎన్ఏ టీకాలు తీసుకునే వారు జాగ్రత్తగా ఉండాలని డా.జోసెఫ్ సూచించారు. ముఖ్యంగా మ్యోకార్డిటిస్, పెరికార్డిటిస్ వంటి సమస్యలు ఉన్నవారు ఈ వ్యాక్సిన్ల పట్ల అప్రమత్తతో ఉండాలని చెప్పారు. ఏ ఔషధాన్నైనా, వ్యాక్సిన్‌నైనా అభివృద్ధి చేసేటప్పుడు వాటి భద్రత, సమర్థతపై పరిశోధనలు అత్యంత కీలకమని డా.జోసెఫ్ పేర్కొన్నారు. కరోనా టీకాల వచ్చినప్పుడు ఎన్నో ఆందోళనలు వ్యక్తమయ్యాయని, కానీ వాటి పట్ల అప్రమత్తంగా వ్యవహరించలేదన్నారు. ఇప్పుడు నిర్వహించిన కీలక అధ్యయనం తర్వాతైనా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అయితే భారత్‌లో ఎంఆర్ఎన్ఏ సాంకేతికత ఉపయోగించిన టీకాలు వినియోగంలో లేవు. సంప్రదాయ పద్ధతిలో అభివృద్ధి చేసిన కరోనా టీకాలకే ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. చదవండి: పారేద్దామనుకున్న టికెట్‌కు 1.6 కోట్లొచ్చాయి -
విషాదం నింపిన మారథాన్.. ట్రాక్‌పైనే కుప్పకూలిన అథ్లెట్
గత ఆదివారం నిర్వహించిన లండన్ మారథాన్ 2022లో విషాదం నెలకొంది. మారథాన్‌లో పాల్గొన్న 36 ఏళ్ల అథ్లెట్ ట్రాక్‌పైనే కుప్పకూలాడు. ఆంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించగా అథ్లెట్ మరణించినట్లు వైద్యులు ద్రువీకరించారు. అయితే చనిపోయిన అథ్లెట్ కుటుంబసభ్యుల వినతి మేరకు నిర్వాహకులు పేరును వెల్లడించలేదు. అయితే అథ్లెట్ మాత్రం సౌత్-ఈస్ట్ ఇంగ్లండ్‌కు చెందినవాడని పేర్కొన్నారు. మరో మూడు మైళ్లు చేరుకుంటే అతని రేసు పూర్తయ్యేది.. కానీ విధి మరోలా తలిచింది అంటూ మారథాన్ నిర్వాహకులు తమ బాధను వ్యక్తం చేశారు. ''లండన్ మారథాన్‌లో పాల్గొన్న ప్రతి అథ్లెట్ ఇవాళ మరణించిన తమ సహచర అథ్లెట్‌కు నివాళి అర్పిస్తున్నారు. అతని కుటుంబసభ్యుల వినతి మేరకు ఈ విషయాన్ని మీడియాకు దూరంగా ఉంచాలని భావించాం. అతని కుటుంబసభ్యులకు ఇవే మా ప్రగాడ సానభుతి.''అంటూ పేర్కొంది. ఇక అథ్లెట్ మరణంపై తుది రిపోర్టు రావాల్సి ఉందని నిర్వహాకులు పేర్కొన్నారు. ఇక ప్రతీ ఏడాది లాగే ఈసారి కూడా లండన్ మారథాన్ 2022 ఘనంగా జరిగింది. దాదాపు 40వేల మంది ఈ మారథాన్‌లో పాల్గొన్నట్లు సమాచారం. 26.2 మైళ్ల దూరంలో భాగంగా సౌత్ లండన్‌లోని గ్రీన్విచ్ నుంచి మాల్ వరకు ఈ మారథాన్ జరిగింది. పురుషుల విభాగంలో కెన్యాకు చెందిన అమోస్ కిప్రుటో విజయం సాధించాడు. కిప్రుటో రెండు గంటల నాలుగు నిమిషాల 39 సెకన్లలో మారథాన్‌ను పూర్తి చేసి తొలి స్థానంలో నిలిచాడు. ఇక మహిళల విభాగంలో ఇథియోపియాకు చెందిన యెహువాలా మారథాన్‌ను 2 గంటల 17 నిమిషాల 25 సెకన్లలో పూర్తిచేసి విజేతగా నిలిచింది. చదవండి: 'చదువును చంపకండి'.. రషీద్ ఖాన్ ఎమోషనల్ ట్వీట్ -
Suzlon Energy: ‘సుజ్లాన్’ తులసి తంతి తుది శ్వాస
న్యూఢిల్లీ: పవన విద్యుత్ రంగ దిగ్గజం సుజ్లాన్ ఎనర్జీ వ్యవస్థాపకుడు, విండ్ మ్యాన్‌గా పేరొందిన తులసి తంతి (64) కన్నుమూశారు. ఆయన శనివారం గుండెపోటుతో మరణించినట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు కంపెనీ తెలిపింది. తులసి తంతికి భార్య (గీత), ఇద్దరు సంతానం (కుమారుడు ప్రణవ్, కుమార్తె నిధి) ఉన్నారు. ఆయన మరణంపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్ సంతాపం వ్యక్తం చేశారు. ‘దేశ ఆర్థిక పురోగతికి తోడ్పడిన దిగ్గజాల్లో తులసి తంతి ఒకరు. ఆయన అకాల మరణంపై కుటుంబసభ్యులకు నా సంతాపం తెలియజేస్తున్నాను’ అని మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్లో ప్రధాని ట్వీట్ చేశారు. విలేకరుల సమావేశంలో పాల్గొని అహ్మదాబాద్ నుంచి పుణెకు వస్తుండగా ఛాతీలో నొప్పి రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లాలంటూ కారు డ్రైవరుకు తులసి తంతి సూచించారు. అయితే, ఆస్పత్రిలో చికిత్స పొందేలోగానే ఆయన కన్నుమూశారు. పవన విద్యుత్‌లో దిగ్గజం.. తులసి తంతి 1958లో రాజ్‌కోట్‌లో జన్మించారు. గుజరాత్ యూనివర్సిటీలో బీకామ్ చదివారు. 1995లో సుజ్లాన్ ఎనర్జీ ఏర్పాటుతో పవన విద్యుత్ రంగంలోకి ప్రవేశించారు. ఈ రంగంలో ప్రవేశించడానికి ముందు ఆయనకు టెక్స్టైల్ వ్యాపారం ఉండేది. దాన్ని 2001లో విక్రయించారు. అటు పైన 2003లో అమెరికన్ సంస్థ డాన్మర్ అండ్ అసోసియేట్స్ నుంచి 24 టర్బైన్లకు సుజ్లాన్‌కు భారీ ఆర్డరు దక్కింది. ఆ తర్వాత కంపెనీ వేగంగా విస్తరించడంలో తులసి తంతి కీలక పాత్ర పోషించారు. 2006 నుంచి బెల్జియంకు చెందిన టర్బైన్ విడిభాగాల తయారీ సంస్థ జెడ్ఎఫ్ విండ్ పవర్ యాంట్‌వెర్పెన్‌కు చైర్మన్‌గా వ్యవహరించారు. అలాగే ఇండియన్ విండ్ టర్బైన్ తయారీదారుల సమాఖ్యకు ప్రెసిడెంట్‌గా కూడా ఉన్నారు. కష్టకాలంలో కంపెనీ.. సుజ్లాన్ ఎనర్జీ ఆర్థిక సమస్యల్లో ఉన్న తరుణంలో తంతి అకాల మరణం ప్రాధాన్యం సంతరించుకుంది. 2005లో స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్ట్ అయిన తర్వాత శరవేగంగా కార్యకలాపాలు విస్తరించిన సుజ్లాన్ ఎనర్జీ ఒక దశలో రూ. 65,474 కోట్ల మార్కెట్ వేల్యుయేషన్ దక్కించుకుంది. కంపెనీలో మెజారిటీ వాటాలున్న తంతి సంపద విలువ దాదాపు రూ. 43,537 కోట్లకు పెరిగింది. అయితే, ఆ తర్వాత అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం తలెత్తడం, ఆ తర్వాత పరిణామాలతో పవన విద్యుత్ రంగం కుదేలైంది. దీనికి టర్బైన్లలో లోపాల ఫిర్యాదులు మొదలైనవి కూడా తోడు కావడంతో సుజ్లాన్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. కంపెనీ విలువ రూ. 8,536 కోట్లకు పడిపోయింది. భారీగా రుణాలు పేరుకుపోయాయి. వాటిని తీర్చేందుకు వర్కింగ్ క్యాపిటల్, ఇతరత్రా అవసరాల కోసం నిధులను సమకూర్చుకునేందుకు సుజ్లాన్ అక్టోబర్ 11న రూ. 1,200 కోట్ల రైట్స్ ఇష్యూకు రానుంది. ఈ తరుణంలో తంతి హఠాన్మరణంతో తలెత్తబోయే పరిణామాలపై ఆసక్తి నెలకొంది. అయితే, అనుభవజ్ఞులైన బోర్డు డైరెక్టర్లు, సీనియర్ మేనేజ్మెంట్ సారథ్యంలో తంతి ఆకాంక్షలను నెరవేరుస్తామని సుజ్లాన్ ఎనర్జీ పేర్కొంది. -
క్రికెట్లో విషాదం.. అంపైర్ అసద్ రౌఫ్ హఠాన్మరణం
క్రికెట్లో విషాదం నెలకొంది. ఐసీసీ మాజీ అంపైర్ పాకిస్తాన్‌కు చెందిన అసద్ రౌఫ్(66) గుండెపోటుతో కన్నుమూశారు. 66 ఏళ్ల అసద్ రౌఫ్ అంతర్జాతీయ క్రికెట్లో 170కి పైగా మ్యాచ్‌లకు అంపైరింగ్ నిర్వహించారు. ఇందులో 64 టెస్టులు( 49 టెస్టులు ఆన్‌ఫీల్డ్ అంపైర్‌గా.. 15 మ్యాచ్‌లు టీవీ అంపైర్‌గా), 139 వన్డేలు, 28 టి20 మ్యాచ్‌లు ఉన్నాయి. పాకిస్తాన్ నుంచి అలీమ్ దార్ తర్వాత విజయవంతమైన అంపైర్‌గా పేరు తెచ్చుకున్న అసద్ రౌఫ్ ఐపీఎల్ మ్యాచ్‌లకు కూడా అంపైర్‌గా పనిచేశాడు. అయితే 2013 ఐపీఎల్ సీజన్లో స్పాట్ ఫిక్సింగ్ ఉదంతం అసద్ రౌఫ్ మెడకు చుట్టుకుంది. అసద్ రౌఫ్ ఫిక్సింగ్‌కి పాల్పడినట్లు ఆరోపణలు వినిపించాయి. బుకీల నుంచి అసద్ రౌఫ్ ఖరీదైన బహుమతుల్ని స్వీకరించి.. ఫిక్సింగ్‌కి పాల్పడినట్లు ఆరోపణలు రాగానే బీసీసీఐ అతడ్ని పక్కన పెట్టి విచారణకి ఆదేశించింది. సుదీర్ఘ విచారణ తర్వాత దోషిగా తేలడంతో 2016లో బీసీసీఐ అతనిపై ఐదేళ్ల నిషేధం విధించింది. నిషేధం ముగిసినప్పటికి అంపైర్‌గా రీఎంట్రీ ఇచ్చేందుకు అసద్ రౌఫ్ ఇష్టపడలేదు. బీసీసీఐ ఇచ్చిన షాక్‌కు అంపైరింగ్ వదిలేసిన అసద్ రౌఫ్ లాహోర్‌లోనే ఒక బట్టల షాపు నిర్వహించడం అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: గంగూలీ, జై షాలకు జై -
ఆపరేషన్ కోసం తీసుకొస్తే.. మత్తు మందే మింగేసింది
సాక్షి, వరంగల్: చేయి విరిగిన ఎనిమిదేళ్ల బాలుడిని ఆపరేషన్ కోసం తీసుకొస్తే ప్రాణం పోయింది. అధిక మోతాదులో అనస్తీషియా ఇవ్వడంతో చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటన వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో మంగళవారం జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా లింగానాయక్ తండాకు చెందిన భూక్యా విహాన్(8)కు కుడిచేయి విరిగింది. 4న ఎంజీఎం ఆస్పత్రి ఆర్థో వార్డులో అడ్మిట్ చేశారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆపరేషన్ చేసేందుకు మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో థియేటర్లోకి తీసుకెళ్లారు. అనస్తీషియా ఇవ్వాల్సిన డోస్ కన్నా ఎక్కువ మోతాదులో ఇవ్వడంతో కార్డియాక్ అరెస్టయింది. ఉదయం 10 గంటలకు ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లిన వైద్యులు మధ్యాహ్నం 2 గంటల తర్వాత కూడా బయటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది బయట వైద్యులను అడిగారు. అనస్తీషియా ఇచ్చి ఆపరేషన్‌కు సిద్ధం చేస్తున్న సమయంలో గుండెపోటు వచ్చిందని, ఆర్ఐసీయూలో వెంటిలేటర్ ద్వారా చికిత్స అందిస్తున్నామని తెలిపారు. మరికొద్దిసేపటికి బాబు మృతి చెందినట్లు ప్రకటించారు. దీంతో విహాన్ తల్లిదండ్రులు రోదిస్తూ ఆందోళనకు దిగారు. చదవండి: ప్రాణం తీసిన ప్రేమ పంచాయతీ ప్రత్యక్ష పోస్టుమార్టం: విహాన్ మృతదేహానికి సాయంత్రం 6 గంటల తర్వాత ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. బాలుడు ఎలా మృతిచెందాడో నిర్ధారణ కావడానికి వీడియో చిత్రీకరణ మధ్య ఫోరెన్సిక్ వైద్యుల సమక్షంలో పోస్టుమార్టం పూర్తి చేశారు. రాత్రి 7 గంటలకు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా, విహాన్ మృతి ఘటన వివరాలను వైద్యారోగ్యశాఖ మంత్రి కార్యాలయ సిబ్బంది.. ఎంజీఎం సూపరింటెండెంట్‌కు ఫోన్ చేసి అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై కమిటీ వేసి విచారణ చేయాలని ఆదేశించినట్లు తెలిసింది. విచారణ చేసి చర్యలు తీసుకుంటాం.. విహాన్ మృతి ఘటనపై విచారణకు అదేశించామని, దీనికోసం ద్విసభ్య కమిటీ వేసినట్లు ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. కమిటీ త్వరలో ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుందని పేర్కొన్నారు. -
హార్ట్ ఎటాక్ సమయంలో గుండె కండరం చచ్చుబడిపోతుంది.. కానీ ఈ ప్రొటిన్ వల్ల
మనకు ఏదైనా గాయం కాగానే... శరీరం తనను తాను రిపేరు చేసుకునే తీరు అద్భుతం. ప్రతివారి జీవితంలో ఏదో ఓ సందర్భంలో గాయం కాగానే... (అది మరీ పెద్దది కాకపోతే) కొద్దిరోజుల్లోనే దాని ఆనవాలు కూడా తెలియకుండా పోతుంది. భారీ హార్ట్ ఎటాక్ సమయంలో గుండె కండరం చచ్చుబడిపోవడం... అవే కండరాలు మళ్లీ పునరుజ్జీవం పొందకపోవడం వల్లనే చాలామందిలో మరణం సంభవిస్తుంది. కానీ చాలా తక్కువగా లేదా ఓ మోస్తరుగా వచ్చిన హార్ట్ అటాక్‌లోనూ... శరీరం తనను తాను రిపేరు చేసుకునే ప్రక్రియ సాగుతుంది. ఇదెలా జరుగుతుందో తెలుసుకోడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఇదెలా జరుగుతుందో తెలుసుకుంటే... స్వాభావికంగా జరిగే ఇదే ప్రక్రియను... వైద్య చికిత్సగా ఇవ్వడం ద్వారా గుండెను రిపేరు చేసుకోగలమన్నది శాస్త్రవేత్తల భావన. తమ పరిశోధనల ద్వారా అదెలా జరుగుతుందో... రిపేరుకు కారణమయ్యే ప్రోటీన్ ఏమిటో తెలుసుకున్నారు. దాని గురించి తెలిపేదే ఈ కథనం. మన దేహంలో ఏదైనా భాగం గాయపడగానే... వెంటనే మన వ్యాధి నిరోధక వ్యవస్థ స్పందిస్తుంది. ‘లింఫాటిక్ సిస్టమ్’ అనే వ్యవస్థ ఇందుకు తోడ్పడుతుంది. ఇది మన వ్యాధినిరోధక వ్యవస్థలో ఒక కీలక అంశం. దేహంలో అన్నిచోట్ల కండరాలకు రిపేరు జరిగినట్లే... దెబ్బతిన్న గుండె కండరాన్నీ రిపేరు చేయడానికి పూనుకుంటుందీ వ్యవస్థ. రిపేరు ప్రక్రియలో ఏం జరుగుతుంది...? ఎలా జరుగుతుంది? ఏదైనా భాగంలో దెబ్బతగలగానే లింఫాటిక్ సిస్టమ్ ద్వారా ‘మ్యాక్రోఫేజెస్’ అనే కణాలు ఎక్కువ స్థాయిలో విడుదల అవుతాయి. నిజానికి అవి మన వ్యాధినిరోధక వ్యవస్థలో భాగంగా... అవి తెల్లరక్తకణాలపై ఉండే అనుబంధ కణాలే. ‘మ్యాక్రో’ అంటే పెద్దవి... ‘ఫేజెస్’ అంటే హరించేవి అని అర్థం. పేరుకు తగ్గట్లుగానే అవి హానికరమైన కణాలనూ/అంశాలనూ, బ్యాక్టీరియాను, అతి సూక్ష్మమైన హానికారక క్రిములను తినేయడం/హరించడం చేస్తాయి. అలాగే మన రోజువారీ జీవక్రియల్లో భాగంగా మనలో ప్రతిరోజూ 200 నుంచి 1000 వరకు క్యాన్సర్ కణాలూ వెలువడుతుంటాయి. వాటిని కూడా ఈ మ్యాక్రోఫేజెస్ పూర్తిగా హరించేస్తాయి. (మన వ్యాధినిరోధక శక్తి తగినంత లేని సందర్భాలోనూ, లేదా అక్కడ పుట్టిన మొత్తం క్యాన్సర్ కణాలను ఈ మ్యాక్రోఫేజెస్ పూర్తిగా హరించలేని సందర్భాల్లోనే క్యాన్సర్ వస్తుందన్నమాట). హానిచేసే కణాలను మాత్రమేగాకుండా... ఏదైనా దెబ్బతగిలినప్పుడు ఇన్ఫ్లమేషన్ (మంట, వాపు) కలిగించే కారకాలనూ, దెబ్బతిన్న తర్వాత శిథిలమైపోయి పోగుబడ్డ కణాల గుట్టలనూ ఇవి నిర్మూలిస్తాయి. ఇన్ఫెక్షన్ కలిగించే వాటినీ తొలగిస్తాయి. అంతేకాదు... బయటి పదార్థాలనూ (ఫారిన్బాడీస్నూ) ఎదుర్కొంటాయి. ఇలా ఏదైనా దెబ్బ తగిలిన వెంటనే... ఇవి పెద్దసంఖ్యలో పుట్టి... ఇలా క్లీన్ చేసే ప్రక్రియను ‘ఫ్యాగోసైటోసిస్’ అని అంటారు. మ్యాక్రోఫేజెస్ ఏం చేస్తాయి? ఇంతటి కీలకమైన భూమిక నిర్వహించే ఈ ‘మ్యాక్రోఫేజెస్’ ఎలా ఈ పని చేస్తాయన్నది శాస్త్రవేత్తలు ఇటీవలి తమ అధ్యయనాల్లో తెలుసుకున్నారు. ‘నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీ ఆఫ్ ఇలినాయీ’కి చెందిన ప్రముఖ పాథాలజిస్ట్ ఎడ్వర్డ్ థోర్ప్ ఈ ప్రక్రియ ఎలా జరుగుతుందో వివరించారు. ‘‘గుండెపోటు రాగానే ఇమ్యూన్ సెల్స్... సరిగ్గా చెప్పాలంటే ‘మ్యాక్రోఫేజెస్’ గుండెకండరం దెబ్బతిన్న చోటికి వెంటనే చేరుకుంటాయి. అక్కడ దెబ్బతిన్న కండరాలనూ, చచ్చుబడ్డ కణజాలాన్నీ (డెడ్ టిష్యూను) తినేయడం ప్రారంభిస్తాయి. ఇందుకోసం ఈ మ్యాక్రోఫేజెస్ ‘వీఈజీఎఫ్–సీ’ అనే ప్రోటీన్‌ను తయారు చేసి వెలువరిస్తాయి. ‘వాస్క్యులార్ ఎండోథీలియల్ గ్రోత్ ఫ్యాక్టర్–సి’ అనే మాటకు సంక్షిప్తరూపమే ఈ ‘వీఈజీఎఫ్–సీ’. ‘డాక్టర్ జకిల్ అండ్ మిస్టర్ హైడ్’ నవలోలాగా... ఈ మ్యాక్రోఫేజెస్ ఇక్కడ రెండు పనులు ఒకేసారి చేస్తుంటాయి. మంచి మ్యాక్రోఫేజెస్... ‘వీఈజీఎఫ్–సి’ని ఉత్పత్తి చేస్తుంటాయి. కానీ అదే సమయంలో కొన్ని చెడు మ్యాక్రోఫేజెస్ ఇన్ఫ్లమేటరీ (మంట, వాపు) కలిగించే ప్రక్రియను వేగవంతం చేస్తాయి. ఇవి... అప్పటికే దెబ్బతిన్న గుండె కండరానికీ, ఆ పొరుగున ఉన్న కణజాలాలకు మరింత హాని చేసే అవకాశం ఉంది. ఇలా జరిగే సమయంలో అక్కడ దెబ్బతిని, నశించుకుపోయాక లేదా చచ్చుబడిపోయాక పోగుబడ్డ మృతకణజాలం అంతా తొలగిపోవాల్సిన అవసరం ఉంటుంది. ఇలా ఆ మృతకణజాలమంతా పూర్తిగా తొలగిపోయి, పరిశుభ్రమైపోయే ప్రక్రియను ‘ఎఫరోసైటోసిస్’ అంటారు. ఈ ప్రక్రియలోనే ‘మ్యాక్రోఫేజెస్’ కీలక భూమిక పోషిస్తాయి. ఈ ప్రక్రియ ‘వీఈజీఎఫ్–సీ’ ప్రోటీన్‌తో ఎలా జరుగుతుందనే అంశాన్ని ల్యాబ్‌లో ఎలుకల సహాయంతో మేము కనుగొన్నాం’’ అంటున్నారు ఎడ్వర్డ్ థోర్ప్. ఈ అంశాల ఆధారంగా గుండెకు మేలు జరిగేదెలాగంటే...? ఇప్పటివరకు జరిగిన పరిశోధన ఆధారంగా... ఈ మ్యాక్రోఫేజెస్నూ, ‘వీఈజీఎఫ్–సీ’ ప్రోటీన్నూ ఉత్పత్తి అయ్యేలా చేస్తారు. వాటి సహాయంతో హార్ట్ ఎటాక్‌లో దెబ్బతిన్న గుండె కండరాల రిపేరు వేగంగా జరిగేలా చేయాలన్నది ఇప్పుడు పరిశోధకుల ముందున్న లక్ష్యం. అంతేకాదు... గుండెపోటు వచ్చినప్పుడు అక్కడ జరిగే జీవక్రియల (బయొలాజికల్) తీనుతెన్నులేమిటో తెలుసుకుని, దానికి విరుగుడుగా ‘ఎఫరోసైటోసిస్’ ద్వారా గుండెకండరాన్ని వేగంగా కోలుకునేలా చేయాలని కూడా పరిశోధకులు సంకల్పిస్తున్నారు. చదవండి👉🏾Hypertension: పక్షవాతం, బ్రెయిన్ స్ట్రోక్, గుండె సమస్యలు.. అందుకే ‘టెన్షన్’ వద్దు! ఇవి తినండి! చదవండి👉🏾Health Tips: రాత్రిపూట అన్నం తినొచ్చా? తినకూడదా? ఒకవేళ తింటే ఏమవుతుంది? -
గుండెను గాబరా పెట్టకండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 2020లో అత్యధిక మరణాలు రక్త ప్రసరణ వ్యవస్థకు సంబంధించిన సమస్యల వల్లే చోటుచేసుకున్నాయి. ఆ తర్వాత స్థానంలో కరోనా వైరస్ సంబంధిత మరణాలు ఉన్నట్టు వెల్లడైంది. రిజిస్ట్రార్ జనరల్, సైన్సెస్ కమిషనర్ ఇటీవల ‘రిపోర్ట్ ఆన్ మెడికల్ సర్టిఫికేషన్ ఆఫ్ కాజ్ ఆఫ్ డెత్స్ 2020’ నివేదికను వెల్లడించింది. అందులో పేర్కొన్న ప్రకారం 2020లో రాష్ట్రంలో 4,55,000 మరణాలు నమోదయ్యాయి. వీటిలో 22.3 శాతం అంటే 1,01,353 మరణాలను వైద్యులు ధ్రువీకరించారు. వైద్యులు ధ్రువీకరించిన మరణాల్లో 60.6 శాతం మరణాలు ప్రసరణ వ్యవస్థకు సంబంధించిన హార్ట్ఎటాక్, కార్డియాక్ అరెస్ట్, కరోనరీ ఆర్టరీ, కార్డియోమయోపతి (గుండె కండరాల వ్యాధి), అరిథ్మియా సహా పలు రకాల జబ్బుల కారణంగా సంభవించాయి. ఈ వ్యాధుల కారణంగా 61,395 మరణాలు నమోదు కాగా మృతుల్లో అత్యధికంగా పురుషులే ఉన్నారు. మృతుల్లో పురుషులు 39,677 మంది కాగా.. మహిళలు 21,718 మంది ఉన్నారు. రెండో స్థానంలో కరోనా సంబంధిత సమస్యల కారణంగా 12 శాతం, మూడో స్థానంలో శ్వాసకోశ వ్యాధులతో 7.2 శాతం మరణాలు చోటు చేసుకున్నాయి. కరోనా సంబంధిత మరణాల్లో 9,751 మందిలో వైరస్ నిర్ధారణ అవగా, 2,442 మందిలో వైరస్ నిర్ధారణ కాలేదు. అదేవిధంగా శ్వాసకోశ వ్యాధులతో 7,328 మరణాలు సంభవించగా.. ఇందులో న్యూమోనియాతో 4,085 మరణాలు నమోదయ్యాయి. క్రమంగా పెరుగుతున్న ధ్రువీకరణ మరణాలు రాష్ట్రంలో మరణాల రిజిస్ట్రేషన్, వైద్యుల ధ్రువీకరణ శాతం క్రమంగా పెరుగుతోంది. 2019లో రాష్ట్రంలో 4,01,472 మరణాలు రిజిస్టర్ కాగా.. ఇందులో కేవలం 12.9 శాతం మరణాలను మాత్రమే వైద్యులు ధ్రువీకరించారు. 2020 సంవత్సరానికి వైద్యుల ధ్రువీకరణ 22.3 శాతానికి పెరిగింది. ఒత్తిడికి గురవ్వకూడదు పిల్లల నుంచి పెద్దల వరకూ ప్రతి ఒక్కరు ప్రస్తుతం తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. దీనికి తోడు మారుతున్న జీవన శైలి, ఆహార అలవాట్లు, ధూమపానం, మద్యపానం వంటి వ్యసనాలు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. తీవ్రమైన ఒత్తిడి, జీవన శైలి కారణంగా రక్తప్రసరణ, నాడీ వ్యవస్థలో సమస్యలు తలెత్తుతున్నాయి. దీనివల్ల గుండెకు, గుండె నుంచి ఇతర అవయవాలకు వెళ్లే రక్తప్రవాహంలో ఇబ్బందులు ఏర్పడి దీర్ఘకాలిక గుండె జబ్బుల బారినపడటంతో పాటు కార్డియోమయోపతి, బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్, ఇతర సమస్యలు తలెత్తుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఒత్తిడిని జయించడానికి ప్రయత్నించాలి. తీసుకునే ఆహారం, జీవన శైలిని మార్చుకోవాలి. – డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి, గుండె, ఊపిరితిత్తుల శస్త్ర చికిత్స నిపుణులు, కర్నూలు జీజీహెచ్ వ్యాయామం చేయాలి ఏరోబిక్స్, యోగా, ఇతర వ్యాయామాలను జీవన శైలిలో ఓ భాగంగా చేసుకోవాలి. జంక్ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి. తద్వారా మధుమేహం, రక్తపోటు, ఊబకాయం వంటి అసాంక్రమిక జబ్బుల బారినపడకుండా ఉండవచ్చు. ప్రస్తుతం యువతలో మధుమేహం, రక్తపోటు బయటపడుతున్నాయి. ఈ దృష్ట్యా ప్రతి ఒక్కరు వ్యాయామం చేయాలి. రోజుకు అరగంట మించకుండా వాకింగ్, జాగింగ్, యోగా, ఇతర వ్యాయామాలు చేయాలి. ఆహార నియమాలు పాటించాలి. స్వీయ రోగ నిరోధకత పెంచుకోవడంపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలి. కరోనా వచ్చి తగ్గినప్పటికీ ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడంతోపాటు, ఇతర నియమాలు పాటిస్తే ఊపిరితిత్తులు, గుండె, ఇతర వ్యాధుల బారినపడకుండా ఉండగలరు. – డాక్టర్ రాంబాబు, విమ్స్ డైరెక్టర్ -
Veerappan: వీరప్పన్ సోదరుడి కన్నుమూత
చెన్నై: గంధపుచెక్కల స్మగ్లర్ వీరప్పన్ పెద్దన్న మత్తయ్యన్(75) కన్నుమూశాడు. గుండెపోటుతో సేలం(తమిళనాడు) ప్రభుత్వ ఆస్పత్రిలో బుధవారం ఉదయం మృతి చెందినట్లు సమాచారం. మత్తయ్యన్.. ఓ హత్య కేసులో సేలం సెంట్రల్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. మే 1న తీవ్ర గుండెపోటు రావడంతో పోలీసులు, మోహన్ కుమారమంగళం మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఇవాళ ఉదయం కన్నుమూసినట్లు తెలుస్తోంది. 1987లో ఫారెస్ట్ రేంజర్ చిదంబరంను హత్య చేసిన కేసులో.. ఈరోడ్ జిల్లా బంగ్లాపూడుర్ పోలీసులు మత్తయ్యన్‌ను అరెస్ట్ చేశారు. ఈ కేసులో జీవిత ఖైదు పడగా.. 34 ఏళ్ల నుంచి జైలులోనే ఉన్నాడు. ఈయన్ని విడుదల చేయాలంటూ పలు పిటిషన్లు సైతం తెర మీదకు వచ్చాయి. -
గుప్పెడు గుండెను తడితే.. ఆపదలో రక్షణ
సాక్షి, అమరావతి: ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కలిగిన వ్యక్తులు సైతం గుండెపోటు (హార్ట్ ఎటాక్), గుండె స్తంభించిపోవడం (కార్డియాక్ అరెస్ట్) వంటి సమస్యలకు గురై మరణించటం చూస్తుంటాం. ఇలాంటి సందర్భాల్లో కుటుంబ సభ్యులు లేదా చుట్టుపక్కల వారు అవగాహనతో మెలిగి.. సీపీఆర్ చేస్తే ప్రాణాపాయ పరిస్థితులను అధిగమించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. సీపీఆర్ ఇలా.. గుండెపోటుకు గురైన లేదా అకస్మాత్తుగా కుప్పకూలి గుండె ఆగిపోయిన (కార్డియాక్ అరెస్ట్ అయిన) వ్యక్తికి కార్డియో పల్మనరీ రిససిటేషన్ (సీపీఆర్) చేయడం ద్వారా గుండెను మళ్లీ స్పందించేలా చేయవచ్చు. వ్యక్తి స్పృహ తప్పి పడిపోయిన 3–4 నిమిషాల్లో సీపీఆర్ చేయడం వల్ల ప్రాణాపాయం నుంచి బయటపడటానికి 60నుంచి 70 శాతం అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. సీపీఆర్ ప్రక్రియలో భాగంగా గుండెమీద చేతులతో లయబద్ధంగా వెంటవెంటనే తగినంత ఒత్తిడితో నొక్కాలి. తద్వారా గుండె కండరాలన్నిటినీ ఉత్తేజితం చేసి మెదడుకు అవసరమైన రక్తం మళ్లీ అందేలా చేయవచ్చు. ఓ వైపు సీపీఆర్ చేస్తూనే 108కు ఫోన్‌చేసి అంబులెన్స్‌ను రప్పించి ప్రాథమిక చికిత్స అందిస్తూ ఆస్పత్రికి తరలిస్తే బాధితులు బతకడానికి అవకాశాలు ఉంటాయి. ఏఈడీ అందుబాటులో ఉంచుకోవాలి విదేశాల్లో జిమ్‌లు, పెద్దపెద్ద రెస్టారెంట్లు, హోటళ్లు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో ‘ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేటర్’ (ఏఈడీ) అనే చిన్నపాటి పరికరాలు అందబాటులో ఉంటాయి. వీటిద్వారా గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్, ఇతర గుండె సమస్యలకు గురైన వ్యక్తులకు ఏఈడీ ద్వారా షాక్ ఇస్తారు. ఇలా చేస్తే వెంటనే గుండెపోటు, కార్డియాక్ అరెస్టు నుంచి కోలుకునే అవకాశం 60నుంచి 65 శాతం ఉంటుంది. మన దగ్గర కూడా ఈ పరికరాలను అందుబాటులో ఉంచితే చాలామందిని రక్షించడానికి వీలవుతుంది. కార్డియాక్ అరెస్ట్ లక్షణాలు తల తిరగటం, అలసటగా అనిపించడం, గుండెల్లో దడ, ఛాతినొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, స్పృహ కోల్పోవడం. వైద్య పరీక్షలు చేయించుకోవాలి 40 ఏళ్ల వయసు దాటిన ప్రతి ఒక్కరు బీపీ, షుగర్ వంటి పరీక్షలతో పాటు కొలెస్ట్రాల్, గుండె పనితీరుకు సంబంధించిన పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి. కుటుంబంలో పూర్వీకులు ఎక్కువగా గుండెపోటుతో మరణించిన దాఖలాలు ఉంటే అలాంటి వారు జాగ్రత్త పడాలి. రెండేళ్లకు ఒకసారి ఈసీజీ, ఎకో, ట్రెడ్మిల్ లేదా స్ట్రెస్ టెస్ట్‌లు చేయిచుకోవాలి. – డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి, గుండె, ఊపిరితిత్తుల వ్యాధి నిపుణుడు, కర్నూలు జీజీహెచ్ -
Cardiac Arrest: ఇలా చేస్తే ప్రాణాలను కాపాడుకోవచ్చు..
సాక్షి, అమరావతి: ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కలిగిన వ్యక్తులు సైతం గుండెపోటు, గుండె స్తంభించిపోవడం (కార్డియాక్ అరెస్ట్) వంటి సమస్యలకు గురై మరణించటం చూస్తుంటాం. నిత్యం వ్యాయామం చేస్తూ.. పౌష్టికాహారం తీసుకుంటూ ఫిట్నెస్తో ఉండేవారు సైతం గుండె సమస్యల బారిన పడుతుంటారు. ఇలాంటి సందర్భాల్లో కుటుంబ సభ్యులు లేదా చుట్టుపక్కల వారు అవగాహనతో మెలిగి.. సీపీఆర్ చేస్తే ప్రాణాపాయ పరిస్థితులను అధిగమించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఏఈడీ అందుబాటులో ఉంచుకోవాలి విదేశాల్లో జిమ్‌లు, పెద్దపెద్ద రెస్టారెంట్లు, హోటళ్లు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో ‘ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేటర్’ (ఏఈడీ) అనే చిన్నపాటి పరికరాలు అందబాటులో ఉంటాయి. వీటిద్వారా గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్, ఇతర గుండె సమస్యలకు గురైన వ్యక్తులకు ఏఈడీ ద్వారా షాక్ ఇస్తారు. ఇలా చేస్తే వెంటనే గుండెపోటు, కార్డియాక్ అరెస్టు నుంచి కోలుకునే అవకాశం 60 నుంచి 65 శాతం ఉంటుంది. మన దగ్గర కూడా ఈ పరికరాలను అందుబాటులో ఉంచితే చాలామందిని రక్షించడానికి వీలవుతుంది. కార్డియాక్ అరెస్ట్ లక్షణాలు తల తిరగటం, అలసటగా అనిపించడం, గుండెల్లో దడ, ఛాతీనొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, స్పృహ కోల్పోవడం. సీపీఆర్ ఇలా.. గుండెపోటుకు గురైన లేదా అకస్మాత్తుగా కుప్పకూలి గుండె ఆగిపోయిన (కార్డియాక్ అరెస్ట్ అయిన) వ్యక్తికి కార్డియో పల్మనరీ రిససిటేషన్ (సీపీఆర్) చేయడం ద్వారా గుండెను మళ్లీ స్పందించేలా చేయవచ్చు. వ్యక్తి స్పృహ తప్పి పడిపోయిన 3–4 నిమిషాల్లో సీపీఆర్ చేయడం వల్ల ప్రాణాపాయం నుంచి బయటపడటానికి 60 నుంచి 70% అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. సీపీఆర్ ప్రక్రియలో భాగంగా గుండెమీద చేతులతో లయబద్ధంగా వెంటవెంటనే తగినంత ఒత్తిడితో నొక్కాలి. తద్వారా గుండె కండరాలన్నిటినీ ఉత్తేజితం చేసి మెదడుకు అవసరమైన రక్తం మళ్లీ అందేలా చేయవచ్చు. ఓ వైపు సీపీఆర్ చేస్తూనే 108కుఫోన్చేసి అంబులెన్స్‌ను రప్పించి ప్రాథమికచికిత్స అందిస్తూ ఆస్పత్రికి తరలిస్తే బాధితులు బతకడానికి అవకాశాలు ఉంటాయి. వైద్య పరీక్షలు చేయించుకోవాలి.. 40 ఏళ్ల వయసు దాటిన ప్రతి ఒక్కరు బీపీ, షుగర్ వంటి పరీక్షలతో పాటు కొలెస్ట్రాల్, గుండె పనితీరుకు సంబంధించిన పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి. కుటుంబంలో పూర్వీకులు ఎక్కువగా గుండెపోటుతో మరణించిన దాఖలాలు ఉంటే అలాంటి వారు జాగ్రత్త పడాలి. రెండేళ్లకు ఒకసారి ఈసీజీ, ఎకో, ట్రెడ్మిల్ లేదా స్ట్రెస్ టెస్ట్‌లు చేయిచుకోవాలి. కఠిన వ్యాయామాలు చేసే వారికి గుండె రక్తనాళపు గోడల్లో చీలిక ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇది గుండెపోటు లాంటి ప్రమాదానికి దారితీయవచ్చు. దీన్నే డిఫెక్షన్ అంటారు. కొవ్వు కణాలతో ఏర్పడిన ‘ప్లాక్’పైన పగుళ్లు ఏర్పడటం వల్ల రక్తం గడ్డకట్టి, అది రక్తప్రవాహానికి అడ్డంకిగా మారి గుండెపోటుకు కారణం కావచ్చు. ప్రొటీన్–సి, ప్రొటీన్–ఎస్, యాంటీ థ్రాంబిన్–3 తగ్గటం వంటి లోపాలున్న వారిలో ఈ తత్వం ఉంటుంది. అలాగే హోమోసిస్టిన్ అనే జీవరసాయనం రక్తంలో ఎక్కువగా ఉన్న వారిలోనూ క్లాట్ ఏర్పడే గుణం ఎక్కువ. – డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి, గుండె, ఊపిరితిత్తుల వ్యాధి నిపుణుడు, కర్నూలు జీజీహెచ్ కఠిన వ్యాయామాలు వద్దు.. కొన్ని సందర్భాల్లో గుండె లయ తప్పడం వల్ల జఠరిక రక్త ప్రరసరణ క్రమం తప్పుతుంది. ఒక్కోసారి రక్త ప్రసరణ పూర్తిగా ఆగిపోతుంది. ఇది ఆకస్మిక గుండె మరణానికి దారితీస్తుంది. సాధారణంగా వెంట్రిక్యులర్ ఫైబ్రిలేషన్ కారణంగానే కార్డియాక్ అరెస్ట్ సంభవిస్తుంది. ఎగువ గదుల్లో (కర్ణిక)ని అరిథ్మియా వల్ల కూడా గుండె కొట్టుకోవడం ఒక్కోసారి ఆగిపోతుంది. సినోట్రియల్ నోడ్ సరైన విద్యుత్ ప్రేరణలను పంపనప్పుడు కర్ణికల్లో దడ ప్రారంభమవుతుంది. ఫలితంగా జఠరికలు శరీరానికి సమర్థవంతంగా రక్తాన్ని పంపవు. 40 సంవత్సరాలు పైబడిన వారెవరైనా సరే కఠిన వ్యాయామాలకు దూరంగా ఉండాలి. ఈ వయసులో ఉన్న వారు జిమ్‌కు వెళ్లి వ్యాయామాలు మొదలు పెట్టే ముందు వైద్య పరీక్షలు చేయించుకోవాలి. లేదంటే కఠిన వ్యాయామాలు చేసినప్పుడు అప్పటికే లోపల ఉన్న సమస్యలు జఠిలమై కార్డియాక్ అరెస్ట్ కావడానికి ఆస్కారం ఉంటుంది. – డాక్టర్ చైతన్య, గుండె వైద్య నిపుణులు విజయవాడ -
మొదటిసారే తీవ్రమైన గుండెపోటు.. మరణానికి దారితీసే పరిస్థితి, ఎందుకిలా?
గుండెపోటు వచ్చినప్పుడు కొందరిలో మూడు సార్లు వస్తుందని కొందరిలో ఓ అభిప్రాయం ఉంది. కానీ మరికొందరు మాత్రం మొదటిసారి స్ట్రోక్కే చనిపోతుంటారు. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకుందాం. అన్ని కండరాల్లాగే గుండె కండరానికీ రక్తాన్ని సరఫరా చేసే ప్రధాన రక్తనాళాలు ఉంటాయి. వాటి ద్వారానే గుండెకు అందాల్సిన ఆక్సిజన్, పోషకాలు అందుతుంటాయి. ఒకవేళ కొవ్వు పేరుకోవడం వంటి కారణాలతో రక్తనాళాలు ఆ పూడుకుపోతే గుండె కండరం చచ్చుబడిపోవడం మొదలవుతుంది. ఇదే ‘గుండెపోటు’ రూపంలో కనిపిస్తుంది. ఇలాంటి సమయాల్లో ఎంత వేగంగా గుండెకు అందాల్సిన రక్తాన్ని మళ్లీ పునరుద్ధరించగలిగితే అంతగా గుండెపోటు ప్రభావాన్ని తగ్గించవచ్చు. గుండెపోటుకు గురైన వ్యక్తిని వీలైనంత త్వరగా హాస్పిటల్‌కు తీసుకురావాలంటూ వైద్యులు చెప్పేది ఇందుకే. అయితే కొందరిలో గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ప్రధాన రక్తనాళాలన్నీ పూడుకుపోయి... హాస్పిటల్‌కు చేరేలోపే గుండె కండరం పూర్తిగా చచ్చుబడిపోతే.... గుండెకే కాదు... గుండెనుంచి మన దేహంలోని ఏ అవయవానికీ రక్తం సరఫరా కాదు. పైగా రక్తనాళాలు పూడుకుపోవడం క్రమంగా జరుగుతున్న కొద్దీ... రక్తసరఫరా సాఫీగా కొనసాగేందుకు పక్కనుంచి రక్తనాళాలు వృద్ధి చెందుతుంటాయి. (చదవండి: ఇకపై నిర్ణయించేది మేమే!) వాటినే కొల్లేటరల్స్ అంటారు. కానీ మొదటిసారే పూర్తిగా పూడుకుపోయిన పరిస్థితి ఉన్నప్పుడు కొల్లేటరల్స్ కూడా వృద్ధిచెందవు కాబట్టి గుండెకు రక్తం అందించేందుకు పక్కనాళాలూ ఉండవు. ఇలాంటి సమయాల్లోనే మొదటిసారే గుండెపోటు తీవ్రంగా వచ్చిందచి చెబుతుంటారు. రోగి మరణానికి దారితీసే ప్రమాదకరమైన స్థితి ఇది. అందుకే ముందునుంచీ జాగ్రత్తలు తీసుకుంటూ పూడిక ఉన్నప్పుడు స్టెంట్ వేయించడం, రక్తాన్ని పలుచబార్చే మందులు వాడటం, అన్ని ప్రధాన రక్తనాళాలూ పూడుకుపోయినప్పుడు అవసరాన్ని బట్టి గుండె శస్త్రచికిత్స చేయించడం వంటివి అవసరమవుతాయి. (చదవండి: మీరు బాగా అరుస్తున్నారా? అయితే, అరవండి ఇంకా అరవండి.. కానీ ఓ కండిషన్) -
What An Idea: గుండె పోటుకి గురైన వృద్ధుడిన కాపాడిన డ్రోన్! ఎలాగంటే..
A drone saved the life of a 71-year-old man: మనం సాంకేతిక టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందిందంటే మానవుడిని చంద్రునిపై పాదం మోపేలా చేయగలిగింది. సాంకేతిక సాయంతో ఎన్నో విపత్తుల నుంచి బయటపడగలిగాం. ఇప్పుడు మరి కాస్త ముందడుగు వేసి గుండెపోటుతోనే లేక మరేదైన విపత్కర పరిస్థితిలో ఉన్న మనిషికి డ్రోన్ సాయంతో సేవలందించి కాపాడుకోవచ్చు అంటుంది స్వీడన్‌కి చెందిన ప్రముఖ డ్రోన్ కంపెనీ. అసలు విషయంలోకెళ్లితే....కార్డియాక్ అరెస్ట్‌తో బాధపడుతున్న 71 ఏళ్ల వ్యక్తి ప్రాణాలను రక్షించడంలో అత్యధునిక టెక్నాలజీతో ఆవిష్కరించిన డ్రోన్ సహాయపడింది. స్వీడన్‌లోని ట్రోల్హట్టన్లో తన ఇంటి బయట మంచు కురుస్తున్నప్పుడు ఒక వ్యక్తి గుండెపోటుకు గురైయ్యాడు. అయితే అప్పుడే డాక్టర్ ముస్తఫా అలీ స్థానిక ఆస్పత్రిలో పనిచేసే నిమిత్తం కారులో డ్రైవింగ్ చేసుకుంటూ అటుగా వస్తున్నాడు. సరిగ్గా ఆసమయానికి ఒక వృద్ధుడి గుండె నొప్పితో కుప్పకూలిపోవడం చూశాడు. (చదవండి: షాకింగ్ వీడియో: విధులకు గైర్హాజరు అవ్వడంతో నర్సు పై దాడి) దీంతో అలీ వెంటనే అతనికి సహాయం చేసే నిమిత్తం అతని వద్దకు వెళ్లాడు. అంతేకాదు వెంటనే స్థానిక అంబులెన్స్‌కి సమాచారం ఇచ్చాడు. అయితే ఆ వృద్ధుడికి పల్స్ లేకపోవడంతో సీఆర్పీ (కార్డియోపల్మోనరీ రిససిటేషన్) చేయడం ప్రారంభించాడు. అయితే ఇంతలో అతనికి పై నుంచి ఏదో శబ్దం చేసుకుంటూ వస్తుంది ఏంటో అని పైకి చూశాడు. ఒక డ్రోన్ డీఫిబ్రిలేషన్(గుండె కొట్టుకునేలా చేసే విద్యుత్ పరికరం) తీసుకువచ్చి అతని ముంగిట పడేసింది. ఈ మేరకు అలీ ఆ వృద్ధుడికి డీఫిబ్రిలేషన్తో ప్రథమ చికిత్స అందించాడు. ఆ తర్వాత అంబులెన్స్ రావడంతో ఆ వృద్ధుడిని ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు ఆ వృద్ధుడు మాట్లాడుతూ.."ఇది చాలా విప్లవాత్మక సాంకేతికత. సమయానికి డీఫిబ్రిలేషన్ని డ్రోన్ తీసుకురావడంతోనే తాను ప్రాణాలతో సురక్షితంగా ఉన్నాను" అని అన్నాడు. ఈ క్రమంలో ఎవర్డ్రోన్ కంపెనీ డ్రోన్ చాలా తక్కువ వ్యవధిలోనే డీఫిబ్రిలేషన్ తీసుకువెళ్లిందని పేర్కొంది. (చదవండి: చిప్స్ ప్యాకెట్లతో నులి వెచ్చటి దుప్పట్లు!) -
చలి కాలంలో గుండెపోటు అవకాశాలు ఎక్కువ
గుంటూరు: చలికాలంలో గుండెపోటు ఎక్కువగా వస్తుందని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కార్డియాలజిస్ట్ డాక్టర్ బి. నాగరాజు సూచించారు. గుంటూరువారి తోట గౌడీయ మఠం పక్కనున్న అమ్మాజీ– పావని మెమోరియల్ హాస్పిటల్లో సోమవారం ఉచిత గుండెజబ్బుల వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ నాగరాజు మాట్లాడుతూ గుండెజబ్బులకు కారణమయ్యే ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలని తెలిపారు. ఆధునిక జీవనశైలి వల్ల పెరుగుతున్న గుండెజబ్బులపై అవగాహన కల్పించి ప్రజల్లో భయాలను తొలగించేందుకు వైద్యశిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు హాస్పిటల్ ఎండీ డాక్టర్ నరేంద్ర వెంకటరమణ తెలిపారు. -
అతిగా నిద్రపోతున్నారా? స్ట్రోక్ ఆ తర్వాత కార్డియక్ అరెస్ట్.. ఇంకా..
రోజుకు 8 గంటల కంటే ఎక్కువ సమయం నిద్రపోయేవారిలో స్ట్రోక్ వచ్చే అవకాశం ఎక్కువని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. 6-8 గంటలు నిద్రపోయే వారితో పోల్చితే వీరిలో ఈ సమస్య ఎక్కువట. స్ట్రోక్‌కు గురైన వారు ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ బారినపడి అకాల మరణాలకు గురౌతారని అధ్యయనాలు వెల్లడించాయి. Effects & Health Risks of Oversleeping in Telugu: అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ మెడికల్ జర్నల్ ప్రచురించిన నివేదిక ప్రకారం.. సగటున 62 ఏళ్ల వయస్సున్న దాదాపు 32,000 మందిపై జరిపిన అధ్యయనాల్లో స్ట్రోక్ రిస్క్ గురించి పరిశోధకులు వివరించారు. మెదడులో రక్త ప్రసరణకు అంతరాయం కలిగితే మెదడు కణజాలాలు దెబ్బతింటాయి. ఫలితంగా స్ట్రోక్ వస్తుంది. రాత్రి పూట ఎనిమిది గంటల కంటే తక్కువ నిద్రపోయే వారితో పోలిస్తే, తొమ్మిది గంటలు లేదా అంతకంటే ఎక్కువ సమయం నిద్రపోయే వ్యక్తులకు స్ట్రోక్ ముప్పు 23% ఎక్కువని ఈ అధ్యయనం తెల్పుతోంది. ఐతే అతి తక్కువగా నిద్రపోతే వారిలో స్ట్రోక్ ప్రమాదం 82% ఎక్కువని ఈ నివేదిక తెల్పుతోంది. చదవండి: కోమాలోకి వెళ్లి సొంత భాష మర్చిపోయి.. కొత్త భాష మాట్లాడుతోంది!! మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. అధిక నిద్ర స్ట్రోక్‌కు దారితీస్తుందని పరిశోధకులు చెబుతున్నప్పటికీ, స్ట్రోక్ వచ్చినవారిలో తరచుగా నిద్రలేమి సమస్యలు తలెత్తుతాయని అధ్యయనాలు తెల్పాయి. అంతేకాకుండా జ్ఞాపక శక్తి తగ్గడం, విచారంగా ఉండటం వంటి రుగ్మతలు తలెత్తుతాయట. ఫోర్టిస్ హాస్పిటల్ షాలిమార్ బాగ్ న్యూరాలజీ డైరెక్టర్ డాక్టర్ జైదీప్ బన్సాల్ ఏమంటున్నారంటే.. అధిక నిద్రకు, స్ట్రోక్ సంభవించడానికి మధ్య సంబంధం ఏ విధంగా ఉంటుందో స్పష్టంగా తెలియరాలేదు. ఐతే ఎక్కువగా నిద్రించేవారిలో కొలెస్ట్రాల్ స్థాయిలు, బరువు పెరుగుతున్నాయని.. ఈ రెండూ కారణాల వల్లే స్ట్రోక్ ప్రమాదం వస్తుందని వివరించారు. చాలా మంది ఆరోగ్య నిపుణులు చెప్పేదేంటంటే.. ఆరోగ్యకరమైన ఆహారం, జీవనశైలిలో కొద్దిపాటి మార్పులు చేసుకుంటే 80% వరకు స్ట్రోక్ ప్రమాదాలను నివారించవచ్చని సూచిస్తున్నారు. నిశ్చల జీవనశైలికి బదులు వ్యాయామాలు చేయడం, జంక్ ఫుడ్, ధూమపానం, అధిక మద్యపానాలకు దూరంగా ఉండటం, తరచూ రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను పర్యవేక్షించుకోవడం వంటివి అలవర్చుకోవాలని చెబుతున్నారు. చదవండి: 120 కేజీల బరువున్న బాలికతో రోజుకు 3 వేల స్కిప్పింగ్‌లు.. చివరికి.. -
శరీరం పైభాగం నుంచి ఎడమ చేతి కింది వరకు నొప్పిగా అనిపిస్తుందా..!
తిరుపతి సాక్షి : భారత దేశంలో గుండె పోటు బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇటీవల కాలంలో చాల మంది ప్రముఖులు అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించడం చూస్తున్నాం. గత వారం కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ (46) వ్యాయామం చేస్తుండగా గుండెపోటుతో మరణించడం తెలిసిందే. ప్రఖ్యాత క్రికెట్ ఆటగాళ్లు సౌరవ్ గంగూలి, బ్రియన్ లారా వంటి ఆటగాళ్లు కూడా మధ్య వయస్సులో గుండె పోటుకు గురి అయ్యారు. ఇలా క్రమం తప్పకుండా వ్యాయామం చేసినా గుండె పోటు నుండి తప్పించుకోలేకపోతున్నారు. శారీరక శ్రమ లేకపోవడం, మానసిక ఆందోళన, ఒత్తిడి, మన ఆధునిక ఆహారపు అలవాట్లు, ధూమపానం, మధ్యపానం, ఘగర్, బీపీ, స్థూల కాయం ఉన్న వారిలో ఈ జబ్బు అధికంగా వచ్చే అవకాశం ఉంది. వ్యాయామం కానీ,అతి డైటింగ్ ,నిద్ర పోవడం వంటి కార్యకలాపాలను పరిమితంగా చేయాలి లేదా ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల జరిపిన ఓ పరిశోధనలో హ్తె ప్రొటీన్ డైట్ ఇచ్చిన ఎలుకల్లో గుండెపోటు అధికంగా వచ్చినట్లు తేలింది. వైద్య నిపుణులు, వైద్యుల అభిప్రాయం ప్రకారం చికిత్సతోపాటు జీవనశైలిని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మెజారిటీ గుండెపోటు మరణాలు సమయానికి ఆస్పత్రికి చేరుకోకపోవడం వల్లనే జరుగుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గుండెపోటు వచ్చిన మొదటి గంటలోనే పేషెంట్‌ను ఆస్పత్రికి తీసుకెళ్తే ప్రాణాలతో బయట పడే ఛాన్స్ ఉందని అభిప్రాయపడుతున్నారు. చాలా కేసులలో బాధితులకు ఛాతిలో నొప్పి వచ్చిన కొన్ని గంటల తర్వాత ఆస్పత్రిలో చేరుతున్నారని.. అయితే అప్పటికే జరుగాల్సిన నష్టం జరుగుతుందని అంటున్నారు. ఎవరికైనా గుండెపోటు వచ్చిన గంటసేపటి వరకు కూడా శరీరానికి రక్తసరఫరా జరుగుతుందని.. ఇందులో మొదటి గంట తర్వాతనే రక్త ప్రసరణ ఆగిపోతుందని వైద్యులు అంటున్నారు. అందుకే గుండెపోటు వచ్చిన మొదటి గంటను గోల్డెన్ అవర్ లేదా గోల్డెన్ టైమ్ అని అంటారని తెలిపారు. ప్రతి ఒక్కరు ఈ గంట సమయంలోగా ఆసుపత్రిలో చేరాలని సూచిస్తున్నారు. హృదయ స్పందనలో ఏం జరుగుతుంది గుండె కొట్టుకోవడంలో కొంత సమస్య మొదలవుతుంది. ఇలాంటి సమయంలో వెంటనే చికిత్స చేస్తే పల్స్ తిరిగి మొదలవుతుంది. ఇలా వెంటనే చికిత్స అందించడం వల్ల రోగి జీవితాన్ని కాపాడవచ్చు. ఈ పనిని ఇంజెక్షన్ ద్వారా లేదా యాంజియోప్లాస్టీ ద్వారా చేస్తారు. అటువంటి పరిస్థితిలో కార్డియాలజిస్ట్ బాధితుడిని మరణం నుండి రక్షించగలరు. చాలా మంది రోగులు గుండెపోటు వచ్చిన మొదటి గంటలోనే మరణిస్తారు. గుండెపోటులో 50 శాతం మొదటి గంటలోనే సంభవిస్తాయి. అందువల్ల, మొదటి గంటలో దానిని గుర్తించడం.. చికిత్స చేయడం చాలా ముఖ్యం. ఇలాంటి లక్షణాలను గుర్తించడం.. వెంటనే ఈ రోగిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లడం చాలా ముఖ్యం. ప్రాథమిక చికిత్స ఎలా ఉండాలి గుండెపోటు వస్తే ఎలాంటి చికిత్స తీసుకోవాలి? అనే ప్రశ్న అందరినీ వేధిస్తోంది. గుండెపోటు వచ్చిన వెంటనే మొదట ఆస్పిరిన్ మాత్రను అందించాలి. ప్రారంభ చికిత్స సమయంలో ఇంజెక్షన్ సుమారు 1 నుంచి 60–70 శాతం వరకు సక్సెస్ ఉంటుంది. యాంజియోప్లాస్టీ 90% కంటే ఎక్కువ విజయవంతమైంది. ఒత్తిడిని నియంత్రించుకోవాలి.. గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన కారణం ఒత్తిడి. మన దానిని జయించినట్లయితే చాలా వరకు హదయ సంబంధిత వ్యాధుల నుంచి బయటపడవచ్చు. ఒత్తిడి తగ్గించుకోవడానికి ఒక్కొక్కరు ఒక్కో చిట్కా పాటిస్తుంటారు. కొందరు అంకెలను 1 నుండి 100 వరకు లెక్క పెట్టుకుంటే..తిరిగి 100 నుండి 1 వరకు లెక్కపెట్టి మనస్సుసై ఏకాగ్రత కోసం ప్రయత్నిస్తుంటారు. ఇంకొందరు శ్వాస నిశ్వాసలపై ఏకాగ్రత పెడుతుంటారు. మరి కొందరు తమకు ఇష్టమైన పాటలు వినడమో.. లేక పుస్తకాలు చదవడమో చేస్తారు. ఇలా చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభించి ఒత్తిడి దూరం అవుతుంది. ఒత్తిడి అధికంగా ఉన్న వారిలో గుండె కొట్టుకునే వేగం ఎక్కువగా ఉంటుందని పరిశోధనలలో తేలింది. గుండె పోటుకు ముందు కనిపించే లక్షణాలు.. ►షుగర్, బీపీ వ్యాధిగ్రస్తులకు ఉన్నట్టుండి ఛాతీ భాగం, మెడ భాగంలో నొప్పులు వచ్చి చెమటలు పడుతుంటాయి. ►శరీరం పై భాగం నుంచి ఎడమ చేతి కింది వరకు నొప్పిగా అనిపిస్తే తప్పకుండా గుండె నొప్పి రాబోతుందని గుర్తించాలి. ►గుండె భారంగా.. అసౌకర్యంగా అనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలి. ►మత్తు లేదా మగతగా ఉన్నా, చెమటలు ఎక్కువగా పడుతున్నా గుండె నొప్పికి సూచనగా అనుమానించాలి. ►తీవ్రమైన అలసట, ఒళ్లు నొప్పులు వస్తున్నా నిర్లక్ష్యం చేయకూడదు. ►కొందరికి దవడలు, గొంతు నొప్పులు కూడా గుండె నొప్పికి సంకేతాలు. ►వికారం, ఆహారం జీర్ణం కాకపోవడం, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు కూడా గుండెనొప్పికి దారితీస్తాయి. కాబట్టి.. జాగ్రత్తగా ఉండాలి. ►గుండె సమస్యలుంటే.. తప్పకుండా హార్ట్ బీట్‌ను చెక్ చేసుకోవాలి. అసాధారణంగా గుండె కొట్టుకున్నట్లు అనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలి. ►గుండె నొప్పికి ముందు శ్వాస తీసుకోవడం కష్టంగా అనిపిస్తుంది. గాలి పీల్చుకోలేక ఇబ్బంది పడతారు. ఈ లక్షణం కనిపిస్తే తప్పకుండా అప్రమత్తం కావాలి. ►రక్త సరఫరా తగ్గినట్లయితే గుండెల్లో మంటగా ఉంటుంది. ఈ లక్షణం కనిపిస్తే వెంటే వైద్యుడిని సంప్రదించాలి. ►తరచుగా జలుపు, జ్వరం, దగ్గు వస్తున్నా.. అవి ఎంతకీ తగ్గకపోయినా అనుమానించాలి. ఈ లక్షణాలు కూడా గుండె నొప్పికి సూచనలే. -
పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలు
సాక్షి, బెంగళూరు: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఆకస్మిక మరణం యావత్ సినీ ప్రపంచాన్ని దిగ్భ్రాంతిలో ముంచేసింది. శుక్రవారం తీవ్ర గుండెపోటుతో కన్నుమూసిన అప్పూ పార్ధివ దేహాన్ని దర్శించుకున్న పలువురు బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులు కన్నీటి నివాళులర్పిస్తున్నారు. ముఖ్యంగా కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కీలక విషయాన్ని ప్రకటించారు. కర్ణాటక పర్యాటకానికి సంబంధించిన వెబ్‌సైట్‌ను,యాప్‌ను విడుదల చేయమని కోరుతూ గురువారం పునీత్ తనను కలిసారని తెలిపారు. నవంబరు ఒకటిన ఈ యాప్‌ను లాంచ్ చేయాల్సి ఉందని కానీ దురదృష్టవశాత్తూ ఆయన మన మధ్య లేకుండా పోయారంటూ వ్యాఖ్యానించారు. ఇది చాలా షాకింగ్‌గా ఉంది. ఆయన మరణం తమతోపాటు, సినీ రంగానికి, ముఖ్యంగా యువతకు తీరని లోటని సీఎం పేర్కొన్నారు. పునీత్ కుమార్తె అమెరికా నుంచి ఢిల్లీ చేరుకుని శనివారం సాయంత్రం 7 గంటలకు బెంగళూరుకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో తమ సంప్రదాయం ప్రకారం సూర్యాస్తమయం తర్వాత అంత్యక్రియలు నిర్వహించరని సీఎం పేర్కొన్నారు. అంతేకాదు అభిమానుల తాకిడిని దృష్టిలో పెట్టుకుని రాజ్‌కుమార్ అంత్యక్రియలను ఆదివారం నిర్వహిస్త్నుట్లు ఆయన ప్రకటించారు. (Puneeth Rajkumar: ఏం పాపం చేశాడు దేవుడా! శోకసంద్రంలో అభిమానులు) కాగా శుక్రవారం తమిళనాడులోని గాజనూరులో పునీత్ రాజ్‌కుమార్ పర్యటించాల్సి ఉంది. దీంతో ఆయన అభిమానులు పునీత్‌కు ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్న తరుణంలో అప్పూ ఇక లేడన్న వార్త వారిని శోకసంద్రంలో ముంచేసింది. మరోవైపు పునీత్ భౌతిక కాయాన్ని బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో ఉంచి కడసారి దర్శించు కునేందుకు వీలుగా కర్ణాటక ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. దీంతో పునీత్‌కు తుది నివాళులర్పించేందుకు అభిమాన జనం వేలాదిగా తరలివచ్చారు. చిరంజీవి, ఎన్టీఆర్, బాలకృష్ణ, రానా దగ్గుబాటి, నరేశ్, శివబాలాజీ, ప్రభుదేవా తదితర సినీ ప్రముఖులు పునీత్ కుమార్‌కు నివాళులర్పించారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. (Puneeth Rajkumar: పునీత్, అశ్విని రేవంత్ లవ్ స్టోరీ..వైరల్) On Thursday, he (#PuneethRajkumar) had asked me to release a website regarding Karnataka tourism. I would have launched his app on Nov 1 but he's not between us. It is so shocking. State, cinema, and youths will miss him: Karnataka CM Basavaraj Bommai pic.twitter.com/TfLOCrT4Am — ANI (@ANI) October 30, 2021 Karnataka CM Basavaraj Bommai announces postponement of actor Puneeth Rajkumar’s funeral to Sunday, 31 October. Postponement taking into consideration the sentiment of fans who are still flocking in to pay homage. @TheQuint pic.twitter.com/eSKpHu5xEU — Nikhila Henry (@NikhilaHenry) October 30, 2021 -
అందుకే కార్డియాక్ అరెస్ట్ సంభవిస్తుందట..! ఇలా చేస్తే ప్రాణాలు నిలుపుకోవచ్చు..
గుండె కొట్టుకోవడం అకస్మాత్తుగా ఆగిపోవడాన్నికార్డియాక్ అరెస్ట్ అంటారు. నిజానికి ఇది ఒక రకంగా ప్రాణాంతకమైన గుండె సంబంధిత వ్యాధిగా చెప్పవచ్చు. అమెరికాలో సగానికిపైగా జనాభా దీని భారీన పడుతున్నట్టు అధ్యయనాలు వెల్లడించాయి. ఐతే దీని బారిన పడ్డవెంటనే చికిత్స అందిస్తే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. కార్డియాక్ అరెస్ట్ లక్షణాలు, ఎవరెవరు దీని బారినపడతారో, చికిత్స ఏవిధంగా తీసుకోవాలో తెలుసుకుందాం.. కార్డియాక్ అరెస్ట్‌కు కారణాలు ►వెంట్రిక్యులర్ ఫైబ్రిలేషన్ గుండెలో నాలుగు గదులు ఉంటాయి. దిగువ రెండు గదులను జఠరికలు, పై రెండు గదులను కర్ణికలు అంటారు. కొన్ని సందర్భాల్లో గుండె లయ తప్పడం వల్ల జఠరిక రక్తప్రరసరణ క్రమం తప్పుతుంది. ఒక్కోసారి రక్తప్రసరణ పూర్తిగా ఆగిపోతుంది కూడా. ఇది ఆకస్మిక గుండె మరణానికి దారితీస్తుంది. సాధారణంగా వెంట్రిక్యులర్ ఫైబ్రిలేషన్ కారణంగానే కార్డియాక్ అరెస్ట్ సంభవిస్తుంది. ►కర్ణిక దడ ఎగువ గదుల్లో (కర్ణిక)ని అరిథ్మియా వల్ల కూడా గుండె కొట్టుకోవడం ఒక్కోసారి ఆగిపోతుంది. సినోట్రియల్ నోడ్ సరైన విద్యుత్ ప్రేరణలను పంపనప్పుడు కర్ణికల్లో దడ ప్రారంభమవుతుంది. ఫలితంగా జఠరికలు శరీరానికి సమర్ధవంతంగా రక్తాన్ని పంపవు. కార్డియాక్ అరెస్ట్ ప్రమాదం ఎవరికి ఉంది? ►కరోనరీ హార్ట్ డిసీజ్‌తో బాధపడే వారిలో ఈ సమస్య సాధారణంగా తలెత్తుతుంది. ►గుండె పరిమాణం పెద్దదిగా ఉన్నవారిలోకూడా హఠాత్తుగా గుండె ఆగిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ►పుట్టుకతోనే గుండె జబ్బులు ఉన్న పిల్లల్లో కూడా ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ సంభవించవచ్చు. ►గుండె విద్యుత్ వ్యవస్థతో సమస్యలు తలెత్తినా ఆకస్మిక మరణం సంభవిస్తుంది. ఈ కింది కారణాల వల్ల కూడా సంభవించవచ్చు.. ►ధూమపానం ►ఒకేచోట కూర్చుని పనిచేసే జీవనశైలి ►అధిక రక్త పోటు ►ఊబకాయం ►వంశపారంపర్య గుండె జబ్బులు ►45 కంటే ఎక్కువ వయస్సున్న పురుషులకు, 55 కంటే ఎక్కువ వయసున్న మహిళలకు ►పొటాషియం/మెగ్నీషియం స్థాయిలు తక్కువ ఉన్నవారిలో కార్డియాక్ అరెస్ట్ లక్షణాలు ►తలతిరుగుతుంది ►అలసటగా అనిపించడం ►వాంతి ►గుండెల్లో దడ ►ఛాతి నొప్పి ►శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ►స్పృహ కోల్పోవడం ఈ లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స అందిస్తే ప్రాణం నిలుపవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వైద్యులు ఎలక్ట్రో కార్డియోగ్రామ్ అనే పరీక్ష చేసి, సత్వర చికిత్స అందించడం ద్వారా శరీరానికి రక్తం ప్రసరించేలా ప్రేరేపిస్తారు. ఫలితంగా కార్డియాక్ అరెస్ట్ నుంచి బయటపడవచ్చు. చదవండి: మత్స్యకారులకు దొరికిన గోల్డ్ ఐలాండ్.. లక్షల కోట్ల సంపద.. -
కసరత్తు ఎక్కువైనా ప్రమాదమేనా..!
బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ శుక్లా హఠాన్మరణం కుటుంబ సభ్యులతో పాటు ఆయన అభిమానులకు తీరని విషాదాన్ని మిగిల్చింది. ఇక్కడ దిగ్భ్రాంతి కలిగించే అంశం ఏంటంటే.. 40 ఏళ్ల వయసులో సిద్థార్థ్ గుండె పోటుతో మరణించడం కలవరపెడుతుంది. సాధారణంగా శారీరక శ్రమ లేకపోతే గుండెపోటు సమస్య తలెత్తుందని వైద్యులు చెబుతారు. అలాంటిది ఫిట్నెస్ ఫ్రీక్ అయిన సిద్థార్థ్ గుండెపోటుతో చనిపోవడం ఏంటనే ప్రశ్న అందరి మదిలో మెదులుతుంది. దీనికి నిపుణులు చెప్పే సమాధానం ఏంటంటే అతిగా వ్యాయామం చేయడం. అవును. అతిగా వ్యాయాయం చేయడం వల్లనే సిద్ధార్థ్ గుండెపోటు బారిన పడ్డాడు అంటున్నారు వైద్యులు. సాధారణంగా ప్రతి మనిషికి 30-45 నిమిషాల వ్యాయామం చాలు. కానీ సినీ ఇండస్ట్రీలో ఉన్న వారు గంటల తరబడి జిమ్‌కే పరిమితం అవుతారు. సిద్ధార్థ్ కూడా రోజు 3 గంటల పాటు వ్యాయామాలు చేసేవాడు. ఇంత అతి వ్యాయామం వద్దని డాక్టర్లు గతంలోనే సిద్ధార్థ్‌కు సూచించినప్పటికి అతడు వైద్యుల మాట వినలేదు. చివరకు ప్రాణాలు కోల్పోయాడు. (చదవండి: డాక్టర్లు హెచ్చరించినా సిద్ధార్థ్ శుక్లా పట్టించుకోలేదా?) అమెరికా నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ నివేదిక ప్రకారం అతిగా వ్యాయామం చేయడం వల్ల సడెన్ కార్డియాక్ అరెస్ట్, సడెన్ కార్డియాక్ డెత్ వచ్చే అవకాశం పెరుగుతుంది వ్యాయామం చేసే సమయం మధ్యస్థంగా ఉండటం వల్ల ఫిట్‌గా ఉండటమే కాక మానసికంగా ఆరోగ్యంగా ఉంటామని సూచించింది. ఈ క్రమంలో అతిగా వ్యాయామాలు చేసే వారు దీన్ని దృష్టిలో పెట్టుకుంటే మంచిదంటున్నారు నిపుణులు. అలానే వ్యాయామం ఫిట్నెస్ యాప్‌ల మీద, సొంత నిర్ణయాల మీద ఆధారపడి కాకుండా.. నిపుణుల పర్యవేక్షణలో చేయడం మంచిదని సూచిస్తున్నారు. -
Chris Cairns: కోలుకుంటున్న మాజీ క్రికెటర్ క్రిస్ కెయిన్స్
సిడ్నీ: న్యూజిలాండ్ మాజీ ఆల్‌రౌండర్ క్రిస్ కెయిన్స్ కోలుకుంటున్నాడు. ఆరోటిక్ డిసెక్షన్‌తో బాధపడుతున్న కెయిన్స్ ప్రస్తుతం సిడ్నీలోని సెయింట్ విన్సెంట్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నాడు. కొద్ది రోజుల నుంచి ఆక్సిజన్ సపోర్ట్‌పై ఉన్న కెయిన్స్ ప్రస్తుతం కోలుకుంటున్నట్లు కుటుంబసభ్యలు పేర్కొన్నారు. ప్రస్తుతం కెయిన్స్‌కు వెంటిలేటర్‌ను తొలగించామని.. త్వరలోనే రూంకు తరలిస్తామని వైద్యులు తెలిపారు. కాగా 51 ఏళ్ల క్రిస్ కెయిన్స్ అంతర్జాతీయ క్రికెట్లో 1989 నుంచి 2006 వరకు న్యూజిలాండ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. తన 17 ఏళ్ల కెరీర్లో కెయిన్స్ కివీస్ తరపున 62 టెస్టుల్లో 3320 పరుగులు.. 218 వికెట్లు , 215 వన్డేల్లో 4950 పరుగులు.. 201 వికెట్లు పడగొట్టాడు. టెస్టు, పరిమిత ఓవర్ల క్రికెట్లో మంచి ఆల్‌రౌండర్‌గా పేరు పొందిన కెయిన్స్ ఎక్కువగా ఆరు, ఏడు స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగేవాడు. చదవండి: Chris Cairns: వెంటిలేటర్‌పై న్యూజిలాండ్ మాజీ ఆల్‌రౌండర్ -
ఒక్కసారిగా పేలిన బ్లూటూత్ హెడ్‌ఫోన్.. ఆగిన గుండె
జైపూర్: వైర్లెస్ బ్లూటూత్ హెడ్‌ఫోన్ ఒక్కసారిగా పేలి ఆ శబ్ధానికి ఓ బాలుడు గుండె ఆగిపోయింది. ఆ పేలుడుతో బాలుడు మృతి చెందిన సంఘటన కలకలం సృష్టించింది. గుండెపోటుతో బాలుడు మృతి చెందడం దేశంలోనే మొదటిగా వైద్యులు పేర్కొంటున్నారు. ఈ సంఘటన రాజస్థాన్‌లోని జైపూర్ జిల్లా చౌము మండలం ఉదయ్‌పుర గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రాకేశ్ శుక్రవారం ఒకరితో బ్లూటూత్ హెడ్‌ఫోన్ వేసుకుని ఫోన్ మాట్లాడుతున్నాడు. ఈ సమయంలో అకస్మాత్తుగా బ్లూటూత్ పేలిపోయింది. క్షణకాలంలో జరిగిన ఘటనతో బాలుడి గుండె ఆగిపోయి ((కార్డియాక్ అరెస్ట్) అపస్మారక స్థితిలో పడిపోయాడు. వెంటనే కుటుంబసభ్యులు సిద్ధివినాయక ఆస్పత్రికి తరలించారు. బ్లూటూత్ పేలడంతో చెవులకు గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు డాక్టర్ ఎన్ఎన్ రుండ్లా తెలిపారు. ‘గుండెపోటుతో బాలుడు మృతి చెందడం బహుశా దేశంలో ఇదే మొదటి కేసు అయ్యింటుంది’ అని వైద్యులు రుండ్లా వివరించారు. అయితే ఇలాంటి ఘటనే రెండు నెలల కిందట ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో జరిగింది. జూన్ నెలలో 38 ఏళ్ల ప్రభుత్వ ఉద్యోగి బ్లూటూత్ పేలి మృతి చెందాడు. బ్లూటూత్ పరికరం పేలుడుతో ఇప్పటివరకు ఇద్దరు మృతి చెందడం కలకలం రేపుతోంది. ఆ పేలిన బ్లూటూత్ పరికరం ఏ కంపెనీదో? ఎందుకు పేలుతుందో అనే వివరాలు తెలియడం లేదు. అకస్మాత్తుగా వీటి పేలుళ్లు జరుగుతుండడంతో ప్రజలు బ్లూటూత్ వినియోగించేందుకు భయపడుతున్నారు. -
సెమీస్ హీరో యశపాల్ శర్మ కన్నుమూత
-
భారత మాజీ క్రికెటర్ యశ్పాల్ శర్మ కన్నుమూత
ఢిల్లీ: భారత క్రికెట్ ప్రస్థానాన్ని మలుపు తిప్పిన 1983 వరల్డ్ కప్ విజయంలో తనదైన భూమిక పోషించిన మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ యశ్పాల్ శర్మ మంగళవారం హఠాన్మరణం చెందారు. ఆయన వయసు 67 సంవత్సరాలు. మార్నింగ్ వాక్ నుంచి తిరిగొచ్చిన అనంతరం యశ్పాల్ తీవ్ర గుండె నొప్పితో కుప్పకూలినట్లు సన్నిహితులు వెల్లడించారు. ఆయనకు భార్యతోపాటు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. 1978లో భారత్ తరఫున తొలి మ్యాచ్ ఆడిన యశ్పాల్ 1985లో చివరిసారి జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. ఆయన ఫస్ట్‌క్లాస్ కెరీర్ రెండు దశాబ్దాల పాటు సాగింది. యశ్పాల్ 37 టెస్టుల్లో 33.45 సగటుతో 1,606 పరుగులు చేశారు. ఇందులో 2 సెంచరీలు, 9 అర్ధసెంచరీలు ఉన్నాయి. 42 వన్డేల్లో 28.48 సగటుతో 4 అర్ధసెంచరీలు సహా 883 పరుగులు సాధించారు. తన 40 వన్డే ఇన్నింగ్స్‌లలో ఆయన ఒక్కసారి కూడా డకౌట్ కాకపోవడం విశేషం. కోచ్‌గా... సెలక్టర్‌గా... ఆటగాడిగా రిటైర్ అయిన తర్వాత కోచ్‌గా, కామెంటేటర్‌గా, క్రికెట్ పరిపాలకుడిగా ఆయన ప్రస్థానం కొనసాగింది. దేశవాళీ క్రికెట్లో యశ్పాల్ అంపైర్‌గా, మ్యాచ్ రిఫరీగా కూడా పని చేశారు. యశ్పాల్ రెండు పర్యాయాలు సెలక్టర్‌గా వ్యవహరించారు. 2004 నుంచి 2005 మధ్య కాలంలో పని చేసినప్పుడు ధోనిని ఆటగాడిగా ఎంపిక చేసిన బృందంలో ఉన్న ఆయన... 2008 నుంచి 2011 వరకు సెలక్టర్‌గా ఉన్నారు. ధోని సారథ్యంలో వన్డే ప్రపంచ కప్ గెలిచిన జట్టును ఎంపిక చేసిన కమిటీలోనూ యశ్పాల్ సభ్యుడు కావడం విశేషం. కపిల్ కన్నీళ్లపర్యంతం... మాజీ సహచరుడు యశ్పాల్ మరణవార్త విన్న వెంటనే 1983 వరల్డ్‌కప్ టీమ్ సభ్యులంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. నాటి విజయాన్ని గుర్తు చేసుకుంటూ ఇటీవల జూన్ 25న నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో వీరంతా కలుసుకున్నారు. యశ్పాల్ కూడా ఇందులో పాల్గొన్నారు. యశ్పాల్ మృతి గురించి విన్న కపిల్‌దేవ్ కన్నీళ్లపర్యంతమయ్యారు. స్పందన కోరగా ‘నాకు మాటలు రావడం లేదు’ అని జవాబి చ్చారు. ‘మా సహచరుల్లో అత్యంత ఫిట్‌గా, క్రమశిక్షణతో ఉండే వ్యక్తి యశ్పాల్. ఇలా జరగడం బాధాకరం’ అని వెంగ్‌సర్కార్ వ్యాఖ్యా నించగా... తమ ‘83’ కుటుంబంలో ఒకరిని కోల్పోయామని బల్వీందర్ సంధూ అన్నారు. పరిమిత ‘యశస్సు’ మార్షల్, హోల్డింగ్, రాబర్ట్స్, గార్నర్... ఇలాంటి భీకర పేస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ 1983 ప్రపంచకప్ లీగ్ మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై యశ్పాల్ 89 పరుగులు చేశాడు. ఈ ప్రదర్శన భారత్‌ను గెలిపించగా, విండీస్‌కు వరల్డ్ కప్ చరిత్రలోనే అది తొలి ఓటమి. కపిల్, గావస్కర్, వెంగ్‌సర్కార్, శ్రీకాంత్, అమర్నాథ్వంటి సహచరులతో పోలిస్తే యశ్‌పాల్‌కు వరల్డ్ కప్ విజయం ద్వారా తగినంత గుర్తింపు రాలేదనేది వాస్తవం. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్లో అతను చేసిన 61 పరుగులు ఇన్నింగ్స్ అద్భుతం. ఈ మ్యాచ్ టీవీలో ప్రత్యక్ష ప్రసారం కావడంతో నాటి అభిమానులు దీనిని ఎప్పటికీ మరచిపోలేరు. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్ బాబ్ విల్లీస్ బంతిని స్క్వేర్ లెగ్ మీదుగా సిక్సర్‌గా మలచిన తీరు అద్భుతం. అంతర్జాతీయ కెరీర్ గణాంకాలు, సగటు చూస్తే అతను ఒక సాధారణ ఆటగాడిగానే కనిపించవచ్చుగానీ యశ్పాల్లాంటి ఆటగాళ్ల ప్రత్యే కతను కొలిచేందుకు అలాంటి ప్రమాణాలు పనికి రావు. భారత క్రికెట్‌పై తనదైన ముద్ర వేసిన విశిష్ట ఆటగాడిగా యశ్పాల్ ఎప్పటికీ నిలిచిపోతారు. యశ్పాల్ శర్మ కెరీర్లో ముఖ్య విషయాలు: ►1954 ఆగస్టు 11న పంజాబ్‌లోని లుధియానాలో జననం ►1978 అక్టోబర్ 13న పాకిస్తాన్‌తో వన్డే ద్వారా అరంగేట్రం.. మరుసటి ఏడాది 1979లో డిసెంబర్ 2న ఇంగ్లండ్‌తో మ్యాచ్ ద్వారా టెస్టు క్రికెట్లో ఎంట్రీ ►1970,80ల కాలంలో భారత మిడిలార్డర్ క్రికెట్లో ముఖ్యపాత్ర ►1980-81లో అడిలైడ్ వేదికగా ఆసీస్‌తో జరిగిన రెండో టెస్టులో 47, 147 పరుగులతో రాణింపు ►యశ్పాల్ శర్మ ఒక టెస్టు మ్యాచ్‌లో రోజు మొత్తం ఆడి గుండప్ప విశ్వనాథ్‌తో కలిసి 316 పరుగుల రికార్డు భాగస్వామ్యం నమోదు. ► విండీస్ దిగ్గజం మాల్కమ్ మార్షల్ వేసిన బంతి యశ్పాల్ శర్మ తలకు బలంగా తగలడంతో 1985లోనే అర్థంతరంగా ఆటకు వీడ్కోలు Very Very Sad News to Share…World Cup Winner @cricyashpal Sh Yashpal Sharma ji had a major Cardiac Arrest in the morning today…Rest In Peace Champion player @indiatvnews — Samip Rajguru (@samiprajguru) July 13, 2021 -
నా రాజీ.. గుండె బద్ధలవుతోంది: మందిర భావోద్వేగం
ముంబై: బాలీవుడ్ నటి మందిరా బేడి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తన భర్త రాజ్ కౌశల్‌ను గుర్తుచేసుకుని ఉద్వేగపూరిత ట్వీట్ చేశారు. రాజ్ కౌశల్‌తో కలిసి చిరునవ్వులు చిందిస్తున్న పాత ఫొటోను పంచుకున్న ఆమె... ‘‘నా రాజీ.. నీ ఆత్మకు శాంతి చేకూరుగాక. నా హృదయం ముక్కలైంది’’ అని ఎమోషనల్ అయ్యారు. కాగా సినీ దర్శకుడు రాజ్ కౌశల్(49) జూన్ 30న గుండెపోటుతో మరణించిన విషయం విదితమే. ఈ క్రమంలో మందిరానే స్వయంగా భర్త అంత్యక్రియలు నిర్వహించారు. నిప్పు కుండ చేతబట్టి తానే అంతిమ సంస్కారాలు చేసి తనలోని సగ భాగానికి తుది వీడ్కోలు పలికారు. ఈ క్రమంలో కొంతమంది నెటిజన్లు ఆమెపై విద్వేషపు విషం చిమ్మారు. కొడుకు ఉండగా, మందిర ఇలా ఎందుకు చేసిందంటూ విమర్శలు గుప్పించారు. అయితే, పలువురు సినీ ప్రముఖులు, సోషల్ మీడియా యూజర్లు మాత్రం మందిరకు మద్దతుగా నిలబడి ట్రోల్స్‌ను తిప్పికొట్టారు. ఇక మందిర- రాజ్ కౌశల్‌ది ప్రేమ వివాహం. 1999లో వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలో సుదీర్ఘ నిరీక్షణ అనంతరం 2011లో కొడుకు వీర్ వారి జీవితాల్లోకి కొత్త సంతోషాలు తీసుకొచ్చాడు. అనంతరం ఈ జంట తార అనే బాలికను దత్తత తీసుకున్నారు కూడా. మందిర యాంకర్‌గా, నటిగా రాణిస్తుండగా, మై బ్రదర్ నిఖిల్, ప్యార్ మే కభీ కభీ వంటి సినిమాలు డైరెక్ట్ చేసిన రాజ్ కౌశల్.. సుమారు 800కు పైగా యాడ్స్‌ను ప్రొడ్యూస్ చేశారు. -
కరోనాతో ప్రముఖ జర్నలిస్టు కన్నుమూత: అమిత్‌షా సంతాపం
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి మరో సీనియర్ జర్నలిస్టును బలితీసుకుంది. ఆజ్ తక్ సీనియర్ జర్నలిస్ట్, న్యూస్ యాంకర్ రోహిత్ సర్దానాకు ఇటీవల కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా గురువారం మెట్రో ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతున్న సమయంలో శుక్రవారం తీవ్ర గుండెపోటు రావడంతో కన్నుమూశారు. సర్దానా అకాలమరణంపై పలువురు జర్నలిస్టు పెద్దలు, ఇతర రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ముఖ్యంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, మరో కేంద్రమంత్రి కిరణ్ రిజుజు రోహిత్ మరణంపై విచారం వ్యక్తం చేశారు. ఇంకా ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష సిసోడియా, కాంగ్రెస్ నేత రణదీప్ సింగ్ సుర్జేవాలా రోహిత్ మరణం షాక్‌కు గురిచేసిందంటూ ట్వీట్ చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. కరోనా మహమ్మారి తన సన్నిహితుడిని బలి తీసుకుంటుదని ఊహించలేదంటూ జీ న్యూస్‌కు చెందిన సుధీర్ చౌదరి సంతాపం తెలిపారు. రోహిత్ మరణం జర్నలిస్టు లోకానికి తీరని నష్టమని మరో సీనియర్ జర్నలిస్ట్ భూపేంద్ర చౌబే వ్యాఖ్యానించారు. స్వయంగా ఆయన కోవిడ్‌తో బాధ పడుతున్నప్పటికీ ఇతరులకు సహాయం చేయడంలో ఏ మాత్రం వెనుకాడలేదని తోటి జర్నలిస్టులు గుర్తు చేసుకున్నారు. కాగా 2000 జీ న్యూస్‌తో కరియర్‌ను ఆరంభించిన సర్దానా ఆ తరువాత సర్దానా 2017లో ఆజ్ తక్లో చేరారు. జీ న్యూస్‌లో 'తాల్ తోక్ కే' , ఆజ్ తక్లో "దంగల్" అనే చర్చా కార్యక్రమాలతో ఆయన బాగా పాపులర్ అయ్యారు. 2018 లో గణేష్ విద్యార్తి పురస్కార్ అవార్డు గెల్చుకున్నారు. టీవీ న్యూస్ జర్నలిజంలో అత్యంత ప్రజాదరణ పొందిన వారిలో రోహిత్ ఒకరు. (రెమిడెసివర్ కొరత: కేంద్రం కీలక నిర్ణయం) अब से थोड़ी पहले @capt_ivane का फ़ोन आया।उसने जो कहा सुनकर मेरे हाथ काँपने लगे।हमारे मित्र और सहयोगी रोहित सरदाना की मृत्यु की ख़बर थी।ये वाइरस हमारे इतने क़रीब से किसी को उठा ले जाएगा ये कल्पना नहीं की थी।इसके लिए मैं तैयार नहीं था।ये भगवान की नाइंसाफ़ी है.. ॐ शान्ति — Sudhir Chaudhary (@sudhirchaudhary) April 30, 2021 Pained to learn about Shri Rohit Sardana ji’s untimely demise. In him, the nation has lost a brave journalist who always stood up for unbiased and fair reporting. May God give his family the strength to bear this tragic loss. My deepest condolences to his family and followers. — Amit Shah (@AmitShah) April 30, 2021 More terrible news friends. Well known Tv news anchor Rohit Sardana has passed away. Had a heart attack this morning. Deep condolences to his family. RIP — Rajdeep Sardesai (@sardesairajdeep) April 30, 2021 -
మారుతి మాజీ ఎండీ కన్నుమూత: ఇండస్ట్రీ దిగ్భ్రాంతి
సాక్షి,ముంబై: ఆటోమోటివ్ సేల్స్ అండ్ సర్వీస్ కంపెనీ కార్నోషన్ వ్యవస్థాపకుడు, మారుతి సుజుకి మాజీ మేనేజింగ్ డైరెక్టర్ జగదీష్ ఖత్తర్ (78) కన్నుమూశారు. గుండెపోటు కారణంగా సోమవారం ఉదయం ఆయన తుది శ్వాస విడిచారు. 1993-2007 కాలంలోఖత్తర్ మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఖత్తర్ పనిచేశారు. తరువాత 1999లో తొలుత ప్రభుత్వ నామినీగా, అనంతరం మే 2002 లో సుజుకి మోటార్ కార్పొరేషన్ నామినీ ఎండీ గా పనిచేశారు.ఖత్తర్ ఆటోమొబైల్ రంగంలో స్వతంత్ర మల్టీ-బ్రాండ్ పాన్ ఇండియా సేల్స్ అండ్ సర్వీస్ నెట్‌వర్క్‌ను కార్నేషన్ ఆటోను 2008 లో ప్రారంభించారు. దీనికి ముందు దాదాపు 37 సంవత్సరాల పాటు ఐఎఎస్ అధికారిగా పనిచేశారు. ఖత్తర్ మరణ వార్తను మారుతి సుజుకి చైర్మన్ ఆర్.సి.భార్గవ ధృవీకరించారు. ఆయన హఠాన్మరణంవ్యక్తిగతంగా తనకు తీరని నష్టమని వ్యాఖ్యానించారురు. ఖత్తర్ అకాలమరణంటో ఆటో పరిశ్రమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. చదవండి: కోవిడ్ సంక్షోభం: సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల సాయం ప్రపంచంలో ఎనిమిదో అద్భుతం.. కాంపౌండింగ్ -
విషాదం: మాజీ క్రికెటర్ అశ్విన్ యాదవ్ ఇకలేరు
సాక్షి, హైదరాబాద్: ఒక వైపు ఐపీఎల్ సంబరం జరుగుతుండగా హైదరాబాద్ రంజీ జట్టులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రంజీ జట్టు మాజీ క్రికెటర్, ఫాస్ట్ బౌలర్ అశ్విన్ యాదవ్(33) శనివారం గుండెపోటుతో కన్ను మూశారు. అశ్విన్ అకాలమరణంపై పలువురు క్రికెట్ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేశారు. అశ్విన్‌కు భార్య, ముగ్గురు కుమారులున్నారు. అశ్విన్ యాదవ్ మరణ వార్త తనను దిగ్భ్రాంతి గురి చేసిందని భారత ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ ట్వీట్ చేశారు. సరదాగా ఉండే అశ్విన్ ఇక లేడంటే నమ్మలేకపోతున్నానంటూ మాజీ రంజీ ఆఫ్ స్పిన్నర్, విశాల్ శర్మ సంతాపం తెలిపారు. అశ్విన్ టీమ్ మ్యాన్ అని ఎపుడు జట్టు విజయం కోసం ఆరాటపడేవాడని గుర్తు చేసుకున్నారు. స్థానిక మ్యాచ్‌లలో ఎస్‌బిహెచ్ తరఫున అశ్విన్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన హైదరాబాద్ మాజీ ఓపెనర్ డేనియల్ మనోహర్ మాట్లాడుతూ అశ్విన్ ఇంత చిన్న వయసులో మనకి దూరంకావడం విచారకరమన్నారు. ఫాస్ట్ బౌలర్‌గా టీమ్‌కు అండగా ఉండేవాడు. ఫిట్‌నెస్‌కు ప్రాణమిచ్చే అశ్విన్‌కు గుండెపోటు రావడం షాకింగ్ ఉందన్నారు. అశ్విన్ తన ఆటతో ఎపుడూ ఆకట్టుకునేవాడని, చిన్న వయస్సు నుండే వికెట్లు తీసే సామర్ధ్యం కలిగి ఉన్నాడని ఆండ్రూస్ స్కూల్ కోచ్‌గా పనిచేసిన నోయెల్ కార్ సంతాపం తెలిపారు. 2002లో సౌత్ జోన్ ఛాంపియన్‌షిప్‌లో రాష్ట్ర అండర్ -14 జట్టుకు 25 వికెట్లతో అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాడు నిలిచాడంటూ నివాళులర్పించారు. కాగా కరియర్లో 14 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అశ్విన్ యాదవ్ 34 వికెట్లు పడగొట్టాడు. రంజీ ట్రోఫీలో 2007 లో మొహాలిలో పంజాబ్‌తో రంజీ ట్రోఫీకి అరంగేట్రం చేశాడు. 2008-09 సీజన్లో ఉప్పల్ స్టేడియంలో ఢిల్లీపై 52 పరుగులకు 6 వికెట్లు తీశాడు. యాదవ్ చివరి సారిగా 2009లో ముంబైతో తన రంజీ మ్యాచ్ ఆడాడు. రెండు టీ 20 మ్యాచ్‌లు కూడా ఆడాడు. Devastated to hear the news of #Ashwinyadav passing away. A Very jovial and fun loving guy, team man to the core, punched way above his skills as a fast bowler. I pray to God for strength to his family. #gonetooearly #OmShanti You will be missed. pic.twitter.com/0gIuOKZr6L — R SRIDHAR (@coach_rsridhar) April 24, 2021 -
ప్రముఖ హాస్యనటుడికి గుండెపోటు, పరిస్థితి విషమం
సాక్షి, చెన్నై: ప్రముఖ తమిళ హాస్య నటుడు వివేక్ (59) తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. ఆయనకు తీవ్ర ఛాతీ నొప్పి రావడంతో ఆయనను శుక్రవారం ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. కార్డియాక్ అరెస్ట్‌తో బాధపడుతున్న వివేక్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు ధృవీకరించాయి. కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్న మరుసటి రోజే వివేక్ తీవ్ర అనారోగ్యానికి గురి కావడం కలకలం రేపింది. అయితే వ్యాక్సిన్‌కు, గుండెపోటుకు సంబంధం ఉందా అనే దానిపై ఎలాంటి స్పష్టత లేదు. ప్రస్తుతం ఎక్మో ట్రీట్మెంట్ అందిస్తున్న ప్రైవేట్ ఆసుపత్రి వైద్యుల బృందం ఆయన ఆరోగ్యాన్ని నిశితంగా పర్యవేక్షిస్తోంది కాగా చెన్నై ఓమందూరు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో వివేక్ గురువారం కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ సందర్భంగా వైద్యులు, సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. టీకా మాత్రమే మన ప్రాణాలను కాపాడుతుందంటూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. -
‘బిడ్డా... లే నాన్న... నువ్వు తప్ప మాకు దిక్కెవరే..’
అనంతపురం విద్య: ఒక్కగానొక్క కొడుకు.. తల్లిదండ్రులు ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నారు. కూలి పనులతో పొట్ట పోసుకుంటున్నా.. ఏనాడూ తమ బిడ్డకు తక్కువ చేయలేదు. తమ కష్టం బిడ్డకు రాకూడదనుకున్నారు. ఈ క్రమంలోనే తమ స్థాయికి మించి ఉన్నత విద్యాబద్ధులు చెప్పించసాగారు. మరో ఏడాదిలో ఇంజినీరింగ్ పూర్తి చేసుకుని జీవితంలో స్థిరపడతాడనుకుంటున్న తరుణంలో విధి వక్రీకరించింది. తల్లిదండ్రుల ఆశలు అడియాసలయ్యాయి. రెండు రోజుల క్రితం తమతో కలిసి ఎంతో ఉత్సాహంగా గడిపిన బిడ్డ కంటికి కానరాని లోకాలకు వెళ్లిపోయాడనే విషయం తెలియగానే ఈ నిరుపేద దంపతుల గుండె చెరువైంది. ‘అమ్మా.. ఇంకొక్క సంవత్సరం.. ఇంజినీరింగ్ పూర్తవుతుంది. తర్వాత ఉద్యోగం చేసి మీ ఇబ్బందులన్నీ తీరుస్తా..’ అన్న కుమారుడి చివరి మాటలు చెవుల్లో మారుమోగుతుండగా.. ‘బిడ్డా... లే నాన్న... నీవు తప్ప మాకు దిక్కెవరే.. ఉద్యోగం చేస్తానంటివి కదయ్యా... లే అయ్యా.. మా కంటి ముందు నీవుంటే చాలయ్యా’ అన్న తల్లిదండ్రులు రోదనలు విన్న విద్యార్థి లోకం కన్నీటి పర్యంతమైంది. ఏం జరిగిందంటే.. అనంతపురం రూరల్ మండలం నరసనాయకుంట గ్రామానికి చెందిన మల్లికార్జున, సత్యమ్మ దంపతులు. వీరి ఒక్కగానొక్క కుమారుడు బి.అబ్రçహాం. కూలి పనులతో కుటుంబాన్ని పోషించుకుంటూ వస్తున్న మల్లికార్జున దంపతులు... ఈ కష్టాలు తమ బిడ్డకు రాకూడదని భావించారు. ఈ క్రమంలోనే తమ శక్తికి మించి విద్యాబుద్ధులు చెప్పిస్తూ వచ్చారు. ప్రస్తుతం అబ్రçహాం... ఎస్కేయూ క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ (ఈసీఈ) మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఉగాది పండుగకు ఊరికి వెళ్లి తల్లిదండ్రులతో సంతోషంగా గడిపి బుధవారం రాత్రి తిరిగి వర్సిటీకి అబ్రహాం చేరుకున్నాడు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ఈసీఈ మూడో సంవత్సరం చదువుతున్న బి. అబ్రహాం (20) గురువారం ఉదయం జిమ్‌లో వర్క్అవుట్ ముగించుకుని హాస్టల్‌కు చేరుకున్నాడు. టిఫెన్ చేసిన తర్వాత ఛాతిలో నొప్పిగా ఉందంటూ ఎస్కేయూ హెల్త్ సెంటర్‌కు వెళ్లాడు. అక్కడ ఈసీజీ తీస్తుండగానే భరించలేని నొప్పితో విలవిల్లాడుతూ కన్నుమూశాడు. తీవ్రమైన గుండెపోటుతో అతను మరణించినట్లు హెల్త్ సెంటర్ వైద్యులు ప్రాథమికంగా ధ్రువీకరించారు. విషయం తెలుసుకున్న నిరుపేద తల్లిదండ్రులు ఆగమేఘాలపై హెల్త్ సెంటర్ వద్దకు చేరుకుని బోరున విలపించారు. తమ బిడ్డ జ్ఞాపకాలను, అతని చివరి మాటలను గుర్తు చేసుకుంటూ వారు రోదించిన తీరు పలువురిని కన్నీరు పెట్టించింది. చదవండి: చిన్నారి వైద్యం కోసం వెళ్తూ.. -
ఆ దర్శకుని కుటుంబంలో మరో తీరని విషాదం
సాక్షి, చెన్నై: తమిళ దర్శకుడు జననాథన్ కుటుంబంలో మరో విషాదం నెలకొంది. జననాథన్ సోదరి లక్ష్మి గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. జాతీయ అవార్డు గ్రహీత ఎస్పీ జననాథన్ (మార్చి ,14న) అకాల మరణంతో షాక్‌లో ఉన్న వారి కుటుంబం మరింత విషాదంలో కూరుకుపోయింది. (ప్రముఖ దర్శకుడు కన్నుమూత) లక్ష్మి హఠాన్మరణంపై మూవీ ఇండస్ట్రీ పెద్దలు, అభిమానులు సంతాపాన్ని వెలిబుచ్చారు. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే ఆ కుటుంబంలో ఇద్దరు మరణించడం విచారకరమని, ఆమె ఆత్మకు శాంతి కలగాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నామన్నారు. కాగా 'లాభం' పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న జననాథన్ తీవ్ర అనారోగ్యానికి గురై అకాల మరణం చెందడం సినీ పరిశ్రమను విషాదంలో ముంచేసిన సంగతి తెలిసిందే. -
విషాదం: కోతుల భయంతో గుండె ఆగింది
సాక్షి, ధర్మపురి: కోతులు దాడి చేస్తాయేమోనన్న భయంతో ఓ మహిళ గుండె ఆగి మరణించింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన బట్టపల్లి మోహన్ ఉపాధి కోసం నాలుగేళ్ల క్రితం కుటుంబంతో ధర్మారానికి వచ్చాడు. ఇక్కడే ఉంటూ వడ్రంగి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మోహన్ కూతురు రేవతి (34)కి వివాహం అయినప్పటికీ ధర్మారంలో తండ్రి వద్దనే ఉంటోంది. ఉదయం ఇంటి నుంచి రేవతి బయటకు వస్తున్న సమయంలో గుంపుగా వచి్చన కోతులు పెద్దగా అరుస్తూ ఇంట్లోకి వచ్చేందుకు ప్రయత్నించాయి. వాటిని చూసిన రేవతి భయంతో అక్కడే కుప్పకూలింది. కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందింది. గుండెపోటుతోనే మరణించిందని వైద్యులు తెలిపారు. కాగా, రేవతికి ముగ్గురు పిల్లలున్నారు. చదవండి: కొత్త ట్విస్ట్: యువతికి షాకిచ్చిన జొమాటో డెలివరీ బాయ్ -
అధిక బరువు: మృత్యుమార్గంలో పయనించడమే
వాషింగ్టన్: ఒక వ్యక్తి ఉండాల్సిన దాని కంటే అధికంగా బరువు పెరుగుతుంటే అది మృత్యుమార్గంలో ప్రయణించడమేనని యూఎస్‌కు చెందిన ‘ప్లాస్’ మెడికల్ జర్నల్ పేర్కొంటోంది. దాదాపు ఇరవై వేర్వేరు అధ్యయనాల్లో సుమారు పదివేలమంది స్థూలకాయం ఉన్నవారితో పాటు మూడు లక్షలమందికి పైగా సాధారణ బరువున్న వారిపై నిర్వహించిన అధ్యయనాల్లో ఇది తేలింది. మామూలు బరువున్నవారితో పోలిస్తే స్థూలకాయులలో మరణాల రేటు 2.5 రెట్లు అధికమని ఆ జర్నల్‌లో పేర్కొన్నారు. ఒకవేళ నేరుగా బరువే మరణాలకు కారణం కాకపోయినా, లావెక్కుతున్న కొద్దీ వచ్చే గుండెజబ్బులు, క్యాన్సర్లు, పక్షవాతం, డయాబెటిస్, కిడ్నీ జబ్బులు, కాలేయ సమస్యలు మృత్యువుకు దారితీయవచ్చని పరిశోధకులు పేర్కొంటున్నారు. అందుకే ఎక్కువకాలం ఆరోగ్యంగా జీవించాలనుకుంటే బరువు తప్పక తగ్గదని వారు హెచ్చరిస్తున్నారు. చదవండి: కూల్‌డ్రింక్స్ తాగితే.. శరీరం చల్లబడుతుందా?