
సిడ్నీ: న్యూజిలాండ్ మాజీ ఆల్‌రౌండర్ క్రిస్ కెయిన్స్ కోలుకుంటున్నాడు. ఆరోటిక్ డిసెక్షన్‌తో బాధపడుతున్న కెయిన్స్ ప్రస్తుతం సిడ్నీలోని సెయింట్ విన్సెంట్ హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నాడు. కొద్ది రోజుల నుంచి ఆక్సిజన్ సపోర్ట్‌పై ఉన్న కెయిన్స్ ప్రస్తుతం కోలుకుంటున్నట్లు కుటుంబసభ్యలు పేర్కొన్నారు. ప్రస్తుతం కెయిన్స్‌కు వెంటిలేటర్‌ను తొలగించామని.. త్వరలోనే రూంకు తరలిస్తామని వైద్యులు తెలిపారు.
కాగా 51 ఏళ్ల క్రిస్ కెయిన్స్ అంతర్జాతీయ క్రికెట్‌లో 1989 నుంచి 2006 వరకు న్యూజిలాండ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. తన 17 ఏళ్ల కెరీర్‌లో కెయిన్స్ కివీస్ తరపున 62 టెస్టుల్లో 3320 పరుగులు.. 218 వికెట్లు , 215 వన్డేల్లో 4950 పరుగులు.. 201 వికెట్లు పడగొట్టాడు. టెస్టు, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మంచి ఆల్‌రౌండర్‌గా పేరు పొందిన కెయిన్స్ ఎక్కువగా ఆరు, ఏడు స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగేవాడు.
చదవండి: Chris Cairns: వెంటిలేటర్‌పై న్యూజిలాండ్ మాజీ ఆల్‌రౌండర్