chris cairns
-
క్యాన్సర్ బారిన పడిన మాజీ క్రికెటర్.. పెద్ద షాక్ అంటూ పోస్ట్
chris cairns: న్యూజిలాండ్ మాజీ ఆల్‌రౌండర్ క్రిస్ కెయిర్న్స్ మరో చేదు వార్తను పంచుకున్నాడు. తాను క్యాన్సర్ బారిన పడినట్లు తెలిపాడు. ఈ మేరకు.. ‘‘నాకు పేగు క్యాన్సర్ ఉందని వైద్యులు చెప్పారు. సాధారణ చెకప్‌నకు వెళ్లిన నాకు నిజంగా ఇదొక పెద్ద షాక్. ఈ విషయం గురించి సర్జన్లు, స్పెషలిస్టులతో మరోసారి చర్చించాను. మరో పోరాటానికి సిద్ధం కావాల్సి ఉంది’’ అని ఇన్స్టాగ్రామ్ పోస్టులో రాసుకొచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న ఫాలోవర్లు.. ‘‘అయ్యో.. నీకే ఎందుకిలా జరుగుతోంది కెయిర్న్స్’’ అంటూ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. కాగా గతేడాది ఆగస్టులో కెయిర్న్స్‌కు గుండెపోటు వచ్చింది. ఈ క్రమంలో శస్త్ర చికిత్స నిర్వహించిన సమయంలో పక్షవాతానికి గురయ్యాడు. వెన్నెముక కూడా బాగా దెబ్బతింది. ఈ క్రమంలో చాలా రోజుల పాటు వెంటిలేటర్‌పై చికిత్స అందించిన అనంతరం కెయిర్న్స్ కోలుకున్నాడు. ఇక కివీస్ మాజీ టెస్టు ఆటగాడు లాన్స్ కెయిర్న్స్ కుమారుడైన క్రిస్ కెయిర్న్స్ న్యూజిలాండ్ తరఫున 62 టెస్టులు, 215 వన్డేలు ఆడాడు. 1989- 2006 వరకు కివీస్‌కు ప్రాతినిథ్యం వహించాడు. చదవండి: U19 WC Aus Vs Afg: ఆఖరి వరకు ఉత్కంఠ.. అదరగొట్టిన భారత సంతతి కుర్రాడు.. ఆసీస్‌దే విజయం View this post on Instagram A post shared by Chris Cairns (@chriscairns2021) -
నేస్తమా త్వరగా కోలుకో..: సచిన్
ముంబై: న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, దిగ్గజ ఆల్‌రౌండర్ క్రిస్ కెయిన్స్ పక్షవాతం బారినపడ్డ సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాలో గుండెకు ఎమర్జెన్సీ సర్జరీ చేసేటప్పుడు వెన్నెముకలో స్ట్రోక్ రావడంతో రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి. ప్రస్తుతం అతనికి రీహాబిలిటేషన్ ప్రక్రియ నిర్వహించేందుకు ఆస్ట్రేలియాలోనే మరో ఆసుపత్రికి తరలించి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా క్రిస్ కెయిన్స్ త్వరగా కోలుకోవాలంటూ బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. '' గెట్ వెల్ సూన్ క్రిస్ కెయిన్స్.. నేస్తమా త్వరగా కోలుకో.. నీ ఆరోగ్యం తొందరగా బాగవ్వాలని దేవుడిని మనస్పూర్తిగా కోరుకుంటున్నా.'' అంటూ ట్వీట్ చేశాడు. కాగా 51 ఏళ్ల క్రిస్ కెయిన్స్ అంతర్జాతీయ క్రికెట్లో 1989 నుంచి 2006 వరకు న్యూజిలాండ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. తన 17 ఏళ్ల కెరీర్లో కెయిన్స్ కివీస్ తరపున 62 టెస్టుల్లో 3320 పరుగులు.. 218 వికెట్లు , 215 వన్డేల్లో 4950 పరుగులు.. 201 వికెట్లు పడగొట్టాడు. టెస్టు, పరిమిత ఓవర్ల క్రికెట్లో మంచి ఆల్‌రౌండర్‌గా పేరు పొందిన కెయిన్స్ ఎక్కువగా ఆరు, ఏడు స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగేవాడు. చదవండి: Chris Cairns: ఎమర్జెన్సీ సర్జరీ చేస్తుండగా దిగ్గజ ఆల్‌రౌండర్‌కు పక్షవాతం Concerned to know about Chris Cairns. Hoping & praying. 🙏🏻 Get well soon mate, the entire cricketing fraternity wishes for your wellbeing. — Sachin Tendulkar (@sachin_rt) August 27, 2021 -
ఎమర్జెన్సీ సర్జరీ చేస్తుండగా పక్షవాతం బారిన పడ్డ దిగ్గజ ఆల్‌రౌండర్
సిడ్నీ: న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, దిగ్గజ ఆల్‌రౌండర్ క్రిస్ కెయిన్స్ పక్షవాతం బారినపడ్డాడు. అస్ట్రేలియాలో గుండెకు ఎమర్జెన్సీ సర్జరీ చేసేటప్పుడు వెన్నెముకలో స్ట్రోక్ రావడంతో రెండు కాళ్లు చచ్చుపడిపోయాయని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం అతనికి రీహాబిలిటేషన్ ప్రక్రియ నిర్వహించేందుకు ఆస్ట్రేలియాలోనే మరో ఆసుపత్రికి తరలించినట్లు వారు తెలిపారు. కెయిన్స్.. గత కొంతకాలంగా ఆరోటిక్ డిసెక్షన్ అనే గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. కాగా, 51 ఏళ్ల క్రిస్ కెయిన్స్ అంతర్జాతీయ క్రికెట్లో 1989 నుంచి 2006 వరకు న్యూజిలాండ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. తన 17 ఏళ్ల కెరీర్లో కెయిన్స్ కివీస్ తరపున 62 టెస్టుల్లో 3320 పరుగులు.. 218 వికెట్లు , 215 వన్డేల్లో 4950 పరుగులు.. 201 వికెట్లు పడగొట్టాడు. కెయిన్స్ తన జమానాలో మేటి ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందాడు. చదవండి: అఫ్గాన్లను చంపడం ఆపండి ప్లీజ్.. రషీద్ ఖాన్ ఉద్వేగం -
Chris Cairns: కోలుకుంటున్న మాజీ క్రికెటర్ క్రిస్ కెయిన్స్
సిడ్నీ: న్యూజిలాండ్ మాజీ ఆల్‌రౌండర్ క్రిస్ కెయిన్స్ కోలుకుంటున్నాడు. ఆరోటిక్ డిసెక్షన్‌తో బాధపడుతున్న కెయిన్స్ ప్రస్తుతం సిడ్నీలోని సెయింట్ విన్సెంట్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నాడు. కొద్ది రోజుల నుంచి ఆక్సిజన్ సపోర్ట్‌పై ఉన్న కెయిన్స్ ప్రస్తుతం కోలుకుంటున్నట్లు కుటుంబసభ్యలు పేర్కొన్నారు. ప్రస్తుతం కెయిన్స్‌కు వెంటిలేటర్‌ను తొలగించామని.. త్వరలోనే రూంకు తరలిస్తామని వైద్యులు తెలిపారు. కాగా 51 ఏళ్ల క్రిస్ కెయిన్స్ అంతర్జాతీయ క్రికెట్లో 1989 నుంచి 2006 వరకు న్యూజిలాండ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. తన 17 ఏళ్ల కెరీర్లో కెయిన్స్ కివీస్ తరపున 62 టెస్టుల్లో 3320 పరుగులు.. 218 వికెట్లు , 215 వన్డేల్లో 4950 పరుగులు.. 201 వికెట్లు పడగొట్టాడు. టెస్టు, పరిమిత ఓవర్ల క్రికెట్లో మంచి ఆల్‌రౌండర్‌గా పేరు పొందిన కెయిన్స్ ఎక్కువగా ఆరు, ఏడు స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగేవాడు. చదవండి: Chris Cairns: వెంటిలేటర్‌పై న్యూజిలాండ్ మాజీ ఆల్‌రౌండర్ -
న్యూజిలాండ్ మాజీ ఆల్‌రౌండర్‌కు అస్వస్థత.. వెంటిలేటర్‌పై చికిత్స
సిడ్నీ: న్యూజిలాండ్ మాజీ ఆల్‌రౌండర్ క్రిస్ కెయిన్స్ ఆరోగ్య పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉంది. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న కెయిన్స్ ప్రస్తుతం ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నాడు. గుండె లోపల నీరు చేరడంతో తీవ్ర అస్వస్థతకు గురి కాగా.. అతని కుటుంబసభ్యులు రెండురోజుల క్రితం సిడ్నీలోని ఒక ప్రముఖ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అతన్ని పరిశీలించి ఆపరేషన్లు నిర్వహించినా ఫలితం లేకపోవడంతో ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. కాగా 51 ఏళ్ల క్రిస్ కెయిన్స్ అంతర్జాతీయ క్రికెట్లో 1989 నుంచి 2006 వరకు న్యూజిలాండ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. తన 17 ఏళ్ల కెరీర్లో కెయిన్స్ కివీస్ తరపున 62 టెస్టుల్లో 3320 పరుగులు.. 218 వికెట్లు , 215 వన్డేల్లో 4950 పరుగులు.. 201 వికెట్లు పడగొట్టాడు. టెస్టు, పరిమిత ఓవర్ల క్రికెట్లో మంచి ఆల్‌రౌండర్‌గా పేరు పొందిన కెయిన్స్ ఎక్కువగా ఆరు, ఏడు స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగేవాడు. -
ఆ రచ్చను మరచిపోలేను: మెకల్లమ్
వెల్లింగ్టన్:గతంలో తన సహచర ఆటగాడు క్రిస్ కెయిన్స్ చేసిన మ్యాచ్ ఫిక్సింగ్ రచ్చను ఎప్పటికీ మరచిపోలేనని న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ పేర్కొన్నాడు. అతనిపై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చిన అనంతరం తనపై కూడా బురదజల్లే ప్రయత్నం జరిగిందని మెకల్లమ్ అన్నాడు. తన ప్రతిష్టకు భంగం కలగడానికి అతను ప్రవర్తించిన తీరే కారణమన్నాడు. ఆ ఘటనను తాను ఎప్పటికీ మరచిపోలేనన్నాడు. ' కెయిన్స్ కేసులో నేను కూడా సాక్షం ఇచ్చాను. నన్ను కూడా కొంతమంది బుకీలు కలిశారంటూ అప్పుడు ఆరోపణలు వచ్చాయి. దానికి కెయిన్స్ ప్రధాన కారణం. నాకు క్షమాగుణం ఎక్కువ. నా జీవితంలో చాలా వివాదాలు చూసినా వాటిని ఏటినీ మనసులో పెట్టుకోలేదు. అయితే ఆనాటి ఫిక్సింగ్ ఆరోపణల ఘటన మాత్రం ఎప్పటికీ మరచిపోలేను. నేను ఎప్పుడూ ఫిక్సింగ్ అనే చాపలో ఇరుక్కోవాలని అనుకోలేదు' అని మెకల్లమ్ పేర్కొన్నాడు. 2008లో కెయిన్స్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే గతేడాది అతన్ని నిర్దోషిగా ప్రకటిస్తూ లండన్‌లోని సైత్‌వార్క్ క్రౌన్ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. దాదాపు రెండేళ్ల పాటు కోర్టులు చుట్టూ తిరిగిన అతను ఎట్టకేలకు నిర్దోషిగా బయటపడ్డాడు. ఆ సమయంలో మెకల్లమ్, రికీ పాంటింగ్‌లు కోర్టులో సాక్ష్యం ఇవ్వాల్సి వచ్చింది. -
ఐసీసీపై మెకల్లమ్ ధ్వజం!
లార్డ్స్: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) అవినీతి నిరోధక శాఖపై న్యూజిలాండ్ దిగ్గజ ఆటగాడు బ్రెండన్ మెకల్లమ్ మండిపడ్డాడు. క్రికెట్లో అవినీతికి పాల్పడిన కొంతమంది ఆటగాళ్లకు వరల్డ్ క్రికెట్ గవర్నింగ్ బాడీ జీవిత కాలం నిషేధం విధిస్తున్నా, మరికొంతమందిని ప్రత్యేకం ఫిక్సింగ్ చేయమని ప్రోత్సహిస్తున్నట్లు ఉందని విమర్శించాడు. సోమవారం ఎంసీసీ నిర్వహించిన స్పిరిట్ ఆఫ్ క్రికెట్ కార్యక్రమానికి హాజరైన మెకల్లమ్.. తాను గతంలో సహచర ఆటగాడు క్రిస్ కెయిన్స్పై చేసిన ఫిక్సింగ్ ఆరోపణలకు కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నాడు. ప్రస్తుతం ఉన్న ఐసీసీ అవినీతి నిరోధక శాఖలో లోపాల కారణంగానే కొంతమంది ఫిక్సింగ్ నుంచి తప్పించుకుంటున్నారని ఆరోపించాడు. తన తోటి ఆటగాడైన లూ విన్సెంట్‌కు జీవిత కాలం నిషేధం విధించిన సంగతిని ఈ సందర్భంగా మెకల్లమ్ ప్రశ్నించాడు. విన్సెంట్ లాంటి వారిపై నిషేధం విధించి, కొంతమందిని కాపాడటమా అవినీతి నిరోధక శాఖ విధి అని నిలదీశాడు. ఇక భవిష్యత్తులో్నైనా అవినీతి నిరోధక శాఖ పారదర్శకంగా ఉండాలని మెకల్లమ్ సూచించాడు. అప్పుడే క్రికెట్ లో పూర్తిస్థాయిలో అవినీతిని అరికట్టే అవకాశం ఉందని మెకల్లమ్ పేర్కొన్నాడు. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో రెండేళ్లుగా కోర్టుల చుట్టూ తిరిగిన న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ క్రిస్ కెయిన్స్‌కు గతేడాది ఊరట లభించిన సంగతి తెలిసిందే. అతణ్ని నిర్దోషిగా తేలుస్తూ లండన్‌లోని సైత్‌వార్క్ క్రౌన్ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.ఇండియన్ క్రికెట్ లీగ్ (ఐసీఎల్)లో కెయిన్స్ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు వెలుగుచూశాయి. -
క్లినర్‌గా మారిన క్రిస్ కెయిన్స్
-
దయనీయ స్థితిలో డాషింగ్ క్రికెటర్!
వెల్లింగ్టన్: ఒకప్పుడు తన ఆల్ రౌండ్ ప్రతిభతో బౌలర్లకు సింహస్వప్నంగా, బ్యాట్స్ మెన్లను బెంబేలెత్తించిన న్యూజిలాండ్ క్రికెటర్ క్రిస్ కెయిర్న్స్ ప్రస్తుత పరిస్థితి దయనీయంగా మారింది. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో కెయిర్న్స్ బ్రిటన్ ప్రభుత్వ పర్యవేక్షణలో న్యాయవిచారణను ఎదుర్కొంటున్నారు. గతంలో తన మూడవ భార్య మెల్ క్లోజర్ కు ప్రపోజ్ చేయడానికి 3.2 క్యారెట్ల డైమండ్ ను కొనుగోలు చేసిన కెయిర్న్.. కుటుంబ పోషణ భారంగా మారడంతో తప్పని పరిస్థితిలో న్యూజిలాండ్ దేశంలోని అక్లాండ్ లో ట్రక్కులను నడపడమే కాకుండా, బస్ షెల్టర్లు క్లీన్ చేయడానికి సిద్దపడ్డారు. బస్ షెల్టర్లు క్లీన్ చేసి గంటకు 17 డాలర్లను సంపాదిస్తున్నాడు. సొంత ఇల్లు లేదు.. ఇంటి అద్దె చెల్లించాలి. బిల్లులు చెల్లించాలి. కుటంబ ఆర్ధిక అవసరాలను తీర్చాల్సి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కెయిర్న్ కు మరోదారి దొరకలేదు అని క్లోజర్ ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబాన్ని కష్టాల్లోంచి గట్టెక్కించడానికి అనేక విధాలుగా ప్రయత్నిస్తున్నాడని, అందులో భాగంగా బస్ షెల్టర్లు క్లీన్ చేయడానికి కూడా సిద్దపడ్డారని సహచర క్రికెటర్ డియాన్ నాష్ మీడియాతో అన్నారు. ఫిక్సింగ్ ఆరోపణలతో తన స్నేహితుడు బలయ్యాడని, ఫిక్సింగ్ అరోపణల నుంచి నిజాయితీగా బయటపడుతారని.. కెయిర్న్ కు తన మద్దతు ఉంటుందని నాష్ అన్నాడు. -
అబద్ధపు సాక్ష్యాలతో ఇరికిస్తున్నారు!
వెల్టింగ్టన్: మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ క్రిస్ కెయిన్స్ మరోసారి తాను ఏ తప్పూ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే తనను ఈ కేసులో ఇరికించేందుకు తప్పుడు ఆధారాలు సృష్టిస్తున్నారని ఏకరువు పెట్టాడు. ఈ ఫిక్సింగ్ కేసుకు సంబంధించి మెట్రోపాలిటన్ పోలీసులు తనపై నిరాధరమైన సాక్ష్యాలను సృష్టించడానికి యత్నిస్తున్నారడన్నాడు. ఇప్పటికే ఐసీసీ విచారణ ఎదుర్కొంటున్న కెయిన్స్.. తనపై వచ్చిన ఫిక్సింగ్ ఆరోపణలను కొట్టిపారేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులను బహిరంగ కోర్టులో కలవడానికి కనీసం ఒక అవకాశం వస్తే తాను సచ్ఛీలుడిగా ప్రపంచం ముందు నిరూపించుకోవడానికి ఆస్కారం ఉంటుందన్నారు. ఈ నెల 25 వ తేదీన కేసుకు సంబంధించిన అభియోగ పత్రాలను పోలీసులు కోర్టు ముందుంచనున్నారు. 2010లో ఫిక్సింగ్ ఆరోపణలపై అతనికి లండన్ హైకోర్టులో ఊరట లభించనప్పటికీ.. ఐపీఎల్ సృష్టికర్త లలిత్ మోడీపై కేసు దాఖలైంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) మ్యాచ్ లతో పాటు అంతకుముందే అతను స్వదేశీ మ్యాచ్ లను ఫిక్సింగ్ చేసినట్లు ఓ వైబ్ సైట్ కథనాలు వెలుగుచూశాయి. ఈ ఘటనకు సంబంంధించి అప్పట్లో క్రిస్ కెయిన్స్ తన పూర్వ సహచరులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. స్టీఫెన్ ఫ్లెమింగ్, డానియెల్ వెటోరిలు ఐసీసీలో తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారని కెయిన్స్ వెల్లడి చేశాడు. తనను ఇరికించడంలో కైల్ మిల్స్, లూ విన్సెంట్, మెకల్లమ్‌ల పాత్ర కూడా ఉందని అతను అన్నాడు. -
ఫ్లెమింగ్, వెటోరి సాక్ష్యమిచ్చారు!
క్రిస్ కెయిన్స్ ఆగ్రహం వెల్లింగ్టన్: మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ క్రిస్ కెయిన్స్ తన పూర్వ సహచరులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. స్టీఫెన్ ఫ్లెమింగ్, డానియెల్ వెటోరిలు ఐసీసీలో తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారని కెయిన్స్ వెల్లడి చేశాడు. తనను ఇరికించడంలో కైల్ మిల్స్, లూ విన్సెంట్, మెకల్లమ్‌ల పాత్ర కూడా ఉందని అతను అన్నాడు. ఇటీవల లండన్‌లో ఫిక్సింగ్‌కు సంబంధించి ఐసీసీ అవినీతి వ్యతిరేక విభాగం, ఈసీబీ, లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు సంయుక్తంగా కెయిన్స్‌ను విచారించారు. స్వస్థలం చేరుకున్న అనంతరం కెయిన్స్ మరో సారి తాను నిర్దోషినేనని స్పష్టం చేశా డు. ‘నన్ను పోలీసులు అరెస్టేమీ చేయలేదు. నా నిజాయితీ నిరూపించుకునేందుకు 40 వేల కిలో మీటర్లు ప్రయాణించి వారికి అన్ని విధాలా సహకరించాను. నాపై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారం. నేను ఎలాంటి తప్పూ చేయలేదు’ అని కెయిన్స్ వివరణ ఇచ్చాడు. -
ఆ ఆటగాడిని నేను కాదు
క్రిస్ కెయిన్స్ వెల్లింగ్టన్: న్యూజిలాండ్ స్టార్ బ్యాట్స్‌మన్ బ్రెండన్ మెకల్లమ్‌ను మ్యాచ్ ఫిక్స్ చేయాల్సిందిగా కోరిన మాజీ క్రికెటర్ ‘మిస్టర్ ఎక్స్’ ఎవరనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు ఫిక్సింగ్ చేసినట్టుగా అంగీకరించిన కివీస్ మాజీ బ్యాట్స్‌మన్ లూ విన్సెంట్ కూడా ఆ ఆటగాడే తనను కూడా కలిశాడని చెప్పాడు. అయితే అతడి పేరు ఇప్పటిదాకా బహిరంగంగా వెల్లడి కాలేదు.మరోవైపు ఆ మిస్టర్ ఎక్స్ ఆటగాడిని తాను కాదని కివీస్ దిగ్గజం క్రిస్ కెయిన్స్ స్పష్టం చేశాడు. ‘క్రికెట్లో అవినీతిపై ఐసీసీ ఏసీఎస్‌యూ విచారణ సాగిస్తుందన్న విషయం తెలిసిందే. ఈ ఆరోపణల్లో ఇతరుల చేత నా పేరు కూడా వినిపిస్తోంది. అలాగే ఆ ఎక్స్ ప్లేయర్ నేనేనా అని అడుగుతున్నారు. పరిమిత సమాచారం ఆధారంగా నాపై చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అబద్ధం. నేను మ్యాచ్ ఫిక్సర్‌ను కాదని ఇప్పటికే కోర్టులో నిరూపించుకున్నాను’ అని కెయిన్స్ తేల్చి చెప్పాడు. -
దమ్ముంటే సాక్ష్యాలు చూపండి: కెయిన్స్
ఆక్లాండ్: తనపై వచ్చిన మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలను న్యూజిలాండ్ మాజీ ఆల్‌రౌండర్ క్రిస్ కెయిన్స్ మరోమారు ఖండించాడు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్న వారు తమ దగ్గర ఉన్న సాక్ష్యాలను బయటపెట్టాలని డిమాండ్ చేశాడు. దిగ్గజ ఆటగాడు రిచర్డ్ హ్యాడ్లీతో కూడిన న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు కూడా వ్యతిరేక వైఖరి ప్రదర్శిస్తుందని ఆరోపించాడు. డారిల్ టఫీ, లూ విన్సెంట్‌తో పాటు కెయిన్స్పై ఐసీసీ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటిదాకా ఈ విషయంలో ఎవరూ సంప్రదించలేదని ఈ 43 ఏళ్ల మాజీ క్రికెటర్ స్పష్టం చేశాడు. ‘ఇదంతా నా కెరీర్‌పై, ప్రొఫెషనల్ అవకాశాలపై దారుణంగా ప్రభావం చూపుతోంది. ఈ ఆరోపణలు నాపై ఉన్నంతకాలం నేనే పనీ చేయలేను. ఈ అంశంలో న్యూజిలాండ్ క్రికెట్ కూడా సరిగా వ్యవహరించడం లేదు’ అని అన్నాడు. -
ఫిక్సింగ్ ఉచ్చులో కివీస్ మాజీలు!
వెల్లింగ్టన్: న్యూజిలాండ్ క్రికెట్లో ఫిక్సింగ్ కలకలం రేగింది. మాజీ ఆల్‌రౌండర్ క్రిస్ కెయిన్స్‌తో పాటు మరో ఇద్దరు ఆటగాళ్లను మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై ఐసీసీ విచారించిందని కివీస్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ప్రస్తుతం కివీస్, విండీస్ టెస్టు సందర్భంగా కామెంటరీ చేస్తున్న కెయిన్స్, మాజీ ఆటగాళ్లు టఫీ, లూ విన్సెంట్లపై ఫిక్సింగ్ ఆరోపణలున్నాయని, ఈ త్రయాన్ని ఐసీసీ విచారించిందని న్యూజిలాండ్ హెరాల్డ్ అనే పత్రిక పేర్కొంది. అయితే ఫిక్సింగ్‌లో ఈ ఆటగాళ్ల పాత్రను అటు ఐసీసీ ఇటు న్యూజిలాండ్ క్రికెట్ ధృవీకరించలేదు. కానీ తమ సభ్యదేశాలకు చెందిన దేశవాళీ అవినీతి నిరోధక యూనిట్స్‌తో కొంతకాలంగా ఫిక్సింగ్ వ్యవహారాలపై కలిసి పనిచేస్తున్నట్టు ఐసీసీ పేర్కొ ంది. విచారణ కొనసాగుతోందని, ఎవరిపైనా చర్యలు తీసుకోలేదని స్పష్టం చేసింది. వచ్చే ఏడాది భారత్‌లో కివీస్ పర్యటన! ముంబై: ప్రస్తుతం కొనసాగుతున్న దక్షిణాఫ్రికా పర్యటన ముగిశాక ధోని సేన వచ్చే జనవరి, ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌కు వెళ్లనున్న సంగతి తెలిసిందే. అయితే కివీస్ జట్టు కూడా వచ్చే ఏడాది చివర్లో భారత పర్యటనకు వచ్చే అవకాశం ఉంది.‘2014 అక్టోబర్, నవంబర్‌లో న్యూజిలాండ్ జట్టును భారత్‌లో పర్యటించేలా ప్రయత్నిస్తున్నాం’ అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.