మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ క్రిస్ కెయిన్స్ తన పూర్వ సహచరులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
క్రిస్ కెయిన్స్ ఆగ్రహం
వెల్లింగ్టన్: మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ క్రిస్ కెయిన్స్ తన పూర్వ సహచరులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. స్టీఫెన్ ఫ్లెమింగ్, డానియెల్ వెటోరిలు ఐసీసీలో తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారని కెయిన్స్ వెల్లడి చేశాడు. తనను ఇరికించడంలో కైల్ మిల్స్, లూ విన్సెంట్, మెకల్లమ్‌ల పాత్ర కూడా ఉందని అతను అన్నాడు.
ఇటీవల లండన్‌లో ఫిక్సింగ్‌కు సంబంధించి ఐసీసీ అవినీతి వ్యతిరేక విభాగం, ఈసీబీ, లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు సంయుక్తంగా కెయిన్స్‌ను విచారించారు. స్వస్థలం చేరుకున్న అనంతరం కెయిన్స్ మరో సారి తాను నిర్దోషినేనని స్పష్టం చేశా డు. ‘నన్ను పోలీసులు అరెస్టేమీ చేయలేదు. నా నిజాయితీ నిరూపించుకునేందుకు 40 వేల కిలో మీటర్లు ప్రయాణించి వారికి అన్ని విధాలా సహకరించాను. నాపై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారం. నేను ఎలాంటి తప్పూ చేయలేదు’ అని కెయిన్స్ వివరణ ఇచ్చాడు.