match fixing
-
బంగ్లాదేశ్ క్రికెటర్‌పై ఐదేళ్ల నిషేధం
దుబాయ్: ఇన్నాళ్లు పురుష క్రికెటర్లకే పరిమితమైన ‘మ్యాచ్ ఫిక్సింగ్’ (Match Fixing) జాడ్యం ఇప్పుడు మహిళా క్రికెట్‌కు అంటుకున్నట్లుంది. ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు తేలడంతో బంగ్లాదేశ్ మాజీ క్రికెటర్ షోహెలీ అక్తర్‌పై (Shohely Akhter) అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ఐదేళ్ల నిషేధం విధించింది. దీంతో అవినీతి, ఫిక్సింగ్ ఆరోపణలతో నిషేధానికి గురైన తొలి మహిళా క్రికెటర్‌గా 36 ఏళ్ల షోహెలీ నిలిచింది. 2023లో జరిగిన మహిళల టి20 ప్రపంచకప్ సందర్భంగా బంగ్లాదేశ్, ఆ్రస్టేలియాల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ చేసేందుకు ఆమె ప్రయత్నించింది. నిజానికి 2022లోనే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఆమె ఆ వరల్డ్‌కప్‌లో లేకపోయినా... టోర్నీ ఆడుతున్న బంగ్లాదేశ్ క్రికెటర్‌ను సంప్రదించి ఫిక్స్ చేయాల్సిందిగా కోరింది. తను చెప్పినట్లు ఆ బంగ్లా క్రికెటర్ హిట్ వికెట్ అయితే 2 మిలియన్ల టాకాలు (బంగ్లా కరెన్సీ) ఇస్తానని ఆశచూపింది. సదరు బంగ్లా క్రికెటర్... షోహెలీ ప్రతిపాదనను తిరస్కరించడంతో పాటు వెంటనే ఈ విషయాన్ని ఐసీసీ అవినీతి నిరోధక విభాగం (ఏసీయూ) దృష్టికి తీసుకెళ్లింది. దీనిపై లోతుగా దర్యాప్తు చేపట్టిన ఏసీయూ షోహెలీ మ్యాచ్ ఫిక్సింగ్‌కు ప్రయత్నించినట్లు తేల్చింది. ఐసీసీలోని ఐదు ఆర్టికల్స్‌ను ఆమె అతిక్రమించిందని దీంతో నిషేధాన్ని విధించామని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. -
'పాక్ జట్టులో మ్యాచ్ ఫిక్సర్లు లేరు.. అందరి లక్ష్యం ఒక్కటే'
టీ20 వరల్డ్‌కప్-2024లో ఘోర పరాభావం తర్వాత పాకిస్తాన్ తొలి సిరీస్‌కు సిద్దమైంది. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో పాకిస్తాన్ తలపడనుంది. ఈ రెడ్ బాల్ సిరీస్ కోసం పాక్ జట్టు ఇప్పటికే తమ ప్రాక్టీస్‌ను ఆరంభించింది.లహోర్‌లోని హైఫెర్మామెన్స్ సెంటర్లో తీవ్రంగా శ్రమిస్తోంది. అయితే తాజాగా ప్రీ-సిరీస్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గోన్న పాకిస్తాన్ టెస్టు కెప్టెన్ షాన్ మసూద్‌కు ఊహించని ప్రశ్న ఎదురైంది. ఒలింపిక్స్‌లో పాకిస్తాన్‌కు చారిత్రత్మక గోల్డ్‌మెడల్ అందించిన అర్షద్ జావెద్‌పై మీ అభిప్రాయమేంటని ఓ సీనియర్ జర్నలిస్టు ప్రశ్నించాడు.అదే విధంగా మ్యాచ్ ఫిక్సింగ్ వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాల ద్వారా దేశ కీర్తి ప్రతిష్టలు దెబ్బతింటున్నాయి కదా అని సదరు జర్నలిస్టు మరో ప్రశ్నను సంధించాడు."ప్రస్తుత పాకిస్తాన్ క్రికెట్ సెటప్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ అనే పదానికి తావులేదు. జట్టులోని ప్రతీ ఒక్కరూ పాకిస్తాన్‌కు విజయాలు అందించేందుకు తమవంతు కృషి చేస్తున్నారు. ఏ క్రికెటర్ కూడా తమ దేశ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా వ్యవహరించారని నేను అనుకుంటున్నాను. టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత మేము తొలి సిరీస్ ఆడుతున్నాం. ఈ సిరీస్‌లో గెలిచేందుకు మేము శర్వశక్తులా ప్రయత్నిస్తాము. అయితే ఆటలో గెలుపు, ఓటములు సహజం. మేము ఓడిన ప్రతీసారి చాలా నిరాశచెందుతాం. ఇక అర్షద్ నదీమ్ ఒక నేషనల్ హీరో. నదీమ్‌ను స్పూర్తిగా తీసుకుని ముందుకు సాగుతామని" విలేకరుల సమావేశంలో మసూద్ పేర్కొన్నాడు.బంగ్లాదేశ్ టెస్టులకు పాకిస్థాన్ టెస్టు జట్టుషాన్ మసూద్ (కెప్టెన్), సౌద్ షకీల్ (వైస్ కెప్టెన్), అమీర్ జమాల్ (ఫిట్‌నెస్‌కు లోబడి), అబ్దుల్లా షఫీక్, అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజం, కమ్రాన్ గులామ్, ఖుర్రం షాజాద్, మీర్ హమ్జా, మహ్మద్ అలీ, మహ్మద్ హురైరా, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), నసీమ్ షా, సైమ్ అయూబ్, సల్మాన్ అలీ అఘా, సర్ఫరాజ్ అహ్మద్ (వికెట్ కీపర్), షాహీన్ షా అఫ్రిది. -
మ్యాచ్ ఫిక్సింగ్: అఫ్గన్ క్రికెటర్‌పై ఐదేళ్ల నిషేధం
టాపార్డర్ బ్యాటర్ ఇహ్సనుల్లా జనత్‌పై ఐదేళ్ల నిషేధం విధిస్తున్నట్లు అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డందుకు గానూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఐదు సంవత్సరాల పాటు అతడిని అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు దూరంగా ఉండాలని ఆదేశించినట్లు పేర్కొంది.కాగా 2017లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఇహ్సనుల్లా జనత్.. అఫ్గన్ తరఫున ఇప్పటి వరకు మూడు టెస్టులు, 16 వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ ఆడాడు. 26 ఏళ్ల ఈ టాపార్డర్ బ్యాటర్.. టెస్టుల్లో 110, వన్డేల్లో 307, టీ20లో 20 పరుగులు సాధించాడు. ఎంత వేగంగా జాతీయ జట్టులోకి వచ్చాడో అంతే వేగంగా దూరమయ్యాడు కూడా!ఈ క్రమంలో 2022లో చివరి అంతర్జాతీయ మ్యాచ్(టీ20) ఆడిన ఇహ్సనుల్లా.. ఇటీవల కాబూల్ ప్రీమియర్ లీగ్‌లో భాగయ్యాడు. 2024 సీజన్లో షంషాద్ ఈగల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన అతడు.. నాలుగు ఇన్నింగ్స్ ఆడి 72 పరుగులు చేశాడు. అయితే, అతడు ఫిక్సింగ్ పాల్పడ్డాడన్న ఆరోపణలు రాగా.. క్రికెట్ బోర్డు విచారణ చేపట్టింది.ఈ క్రమంలో ఇహ్సనుల్లా జనత్ దోషిగా తేలాడు. తన తప్పును అంగీకరించాడు. ఈ క్రమంలో ఐసీసీ అవినీతి నిరోధక నియమావళిలోని 2.1.1 నిబంధనను ఉల్లంఘించిన కారణంగా అతడిపై ఐదేళ్ల నిషేధం విధిస్తున్నట్లు అఫ్గన్ బోర్డు తెలిపింది. మ్యాచ్ ఫలితాలు, మ్యాచ్ సాగే తీరును ప్రభావితం చేసే చర్యలకు పాల్పడ్డందుకు వేటు వేసినట్లు పేర్కొంది.కాగా అఫ్గనిస్తాన్ మాజీ కెప్టెన్ నవ్రోజ్ మంగల్ తమ్ముడే ఇహ్సనుల్లా. అఫ్గన్ జట్టుకు వన్డే హోదా వచ్చినపుడు నవ్రోజ్ సారథిగా ఉన్నాడు. అతడి కెప్టెన్సీలోనే టీ20 ప్రపంచకప్-2010 ఎడిషన్‌కు అఫ్గనిస్తాన్ జట్టు అర్హత సాధించింది. -
మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం.. ఇద్దరు భారతీయుల పాస్ పోర్టులు సీజ్
లెజెండ్స్ క్రికెట్ లీగ్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం రేపింది. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు కింద ఇద్దరు భారతీయులను శ్రీలంక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యోని పటేల్, పీ ఆకాష్ అనే ఇద్దరు ఇద్దరు ఇండియన్స్ లెజెండ్స్ క్రికెట్ లీగ్‌లో అనాధికర మ్యాచ్‌లను ఫిక్స్ చేసేందుకు ప్రయత్నించినట్లు శ్రీలంక పోలీసులు గుర్తించారు. మార్చి 8న, మార్చి 19న కెండీలోని పల్లెకెలే స్టేడియంలో జరిగిన మ్యాచులను ఫిక్స్ చేయడానికి ప్రయత్నించినట్లు ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం ఈ ఇద్దరు భారతీయులు బెయిల్ మీద బయటికి వచ్చారు. అయితే ఈ కేసు విచారణ ముగిసేవరకూ దేశం వదిలి వెళ్లకుండా వారి పాస్‌పోర్ట్‌లను సీజ్ చేయాలని శ్రీలంక కోర్టు ఆదేశించింది.ఇక లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2024 టోర్నీ ఫైనల్లో రాజస్తాన్ కింగ్స్, న్యూయార్క్ సూపర్ స్ట్రైయికర్స్ జట్లు తలపడ్డాయి. రాజస్తాన్ కింగ్స్ జట్టు ఛాంపియన్స్‌గా నిలిచింది. ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరిలో ఒకడైన పటేల్, లెజెండ్స్ క్రికెట్ ట్రోఫీ 2024 ఆడిన క్యాండీ కాంప్ ఆర్మీ టీమ్‌కి యజమాని కావడం గమనార్హం. కాగా ఈ ఇద్దరూ మ్యాచ్ ఫిక్సింగ్ చేసేందుకు ప్రయత్నించినట్టుగా న్యూజిలండ్ మాజీ క్రికెటర్ నీల్ బ్రూమ్, శ్రీలంక ఛీప్ సెలక్టర్ ఉపుల్ తరంగ.. క్రీడా శాఖ మంత్రిత్వ శాఖ స్పెషల్ ఇగ్వెస్టిగేషన్ యూనిట్‌కి ఫిర్యాదు చేశారు. -
విండీస్ క్రికెటర్‌కు బిగ్ షాకిచ్చిన ఐసీసీ.... ఐదేళ్ల పాటు నిషేధం
వెస్టిండీస్ వికెట్ కీపర్ బ్యాటర్ డెవాన్ థామస్ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) బిగ్ షాకిచ్చింది. మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినందుకు థామస్‌పై ఐసీసీ ఐదేళ్ల పాటు నిషేధం విధించింది. శ్రీలంక క్రికెట్ (SLC), ఎమిరేట్స్ క్రికెట్ బోర్డ్ (ECB), కరీబియన్ ప్రీమియర్ లీగ్ (CPL) అవినీతి నిరోధక నిబంధనలను థామస్ ఉల్లంఘించడంతో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. థామస్ కూడా తన నేరాన్ని అంగీకరించినట్లు ఐసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. లంక ప్రీమియిర్ లీగ్ 2021లో ఫిక్సింగ్ పాల్పడ్డాడన్న అభియోగాల నేపథ్యంలో గతేడాది థామస్‌పై ఐసీసీ తాత్కాలికంగా సస్సెన్షన్ వేటు వేసింది. అదే విధంగా యూఏఈ, కరీబియన్ లీగ్‌లో బుకీలు కలిసినట్లు అతడిపై ఆరోపణలు వచ్చాయి. అయితే ఇప్పుడు నేరం రుజువు కావడంతో ఐదేళ్ల పాటు ఎటువంటి క్రికెట్ ఆడకుండా అతడిపై ఐసీసీ బ్యాన్ విధించింది. ఇక విండీస్ తరఫున డెవాన్ ఒక టెస్ట్, 21 వన్డేలు, 12 టీ20లు ఆడాడు. ఇందులో మొత్తంగా 320 పరుగులు, 36 క్యాచ్‌లు, 4 రనౌట్లు, 8 స్టంపింగ్‌లు చేశాడు. టెస్ట్‌ల్లో, వన్డేల్లో బౌలింగ్ సైతం చేసిన థామస్.. ఫార్మాట్‌కు 2 చొప్పున 4 వికెట్లు పడగొట్టాడు. -
ప్రమాదంలో ప్రజాస్వామ్యం
సాక్షి, న్యూఢిల్లీ: మోదీ పాలనలో దేశంలో రాజ్యాంగ, ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ నాశనమవుతున్నాయని విపక్ష ఇండియా కూటమి ఆరోపించింది. దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకుని విపక్షాలను, నేతలను వేధిస్తున్నారని మండిపడింది. ఢిల్లీ సీఎం, ఆప్ సారథి అరవింద్ కేజ్రీవాల్, జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ అరెస్టును తీవ్రంగా ఖండించింది. వారికి అండగా నిలుస్తామని ప్రకటించింది. నియంతృత్వ పాలనను తరిమికొట్టి దేశాన్ని కాపాడుకుందామంటూ పిలుపునిచ్చింది. ఆదివారం ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్ కూటమి మహా ర్యాలీ నిర్వహించింది. ‘తానాషాహీ హటావో, లోక్తంత్ర్ బచావో (నియంతృత్వాన్ని రూపుమాపాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి)’ పేరుతో జరిగిన ఈ ర్యాలీ విపక్షాల బల ప్రదర్శనకు వేదికగా మారింది. ఇండియా కూటమిలోని 28 పారీ్టల నేతలు ఇందులో పాల్గొన్నారు. లోక్‌సభ ఎన్నికలను మోదీ నియంతృత్వానికి, ప్రజాస్వామ్యానికి మధ్య జరుగుతున్న పోరుగా అభివరి్ణంచారు. దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పి ఎన్నికల్లో విపక్షాలను నిర్వీర్యం చేసేందుకు అధికార బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఈ ప్రయత్నాలను అడ్డుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, అగ్ర నేతలు సోనియాగాం«దీ, రాహుల్‌గాం«దీ, ప్రియాంక గాం«దీ, పంజాబ్ సీఎం, ఆప్ నేత భగవంత్‌మాన్ సింగ్, అఖిలేష్ యాదవ్ (సమాజ్‌వాదీ), డెరిక్ ఒబ్రియాన్ (టీఎంసీ), తిరుచ్చి శివ (డీఎంకే), తేజస్వీ యాదవ్ (ఆర్జేడీ), శరద్ పవార్ (ఎన్సీపీ–పవార్), ఉద్దవ్ ఠాక్రే (శివసేన–యూబీటీ), ఫరూక్ అబ్దుల్లా (ఎన్సీ), మెహబూబా ముఫ్తీ (పీడీపీ), సీతారాం ఏచూరి (సీపీఎం), డి.రాజా (సీపీఐ) తదితరులు వీరిలో ఉన్నారు. కేజ్రీవాల్ సతీమణి సునీత, హేమంత్ సోరెన్ సతీమణి కల్పన వేదికపై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో వారిద్దరూ రాజకీయాల్లోకి రావచ్చనే చర్చ ఊపందుకుంది. వారితో సోనియా వేదికపై చేతిలో చేయి కలిపి మాట్లాడారు. తన పక్కనే కూచోబెట్టుకున్నారు. విపక్షాలన్నీ ఒక్కటై బీజేపీని ఓడించాలని స్టాలిన్, ఫరూక్ అబ్దుల్లా పిలుపునిచ్చారు. స్టాలిన్ తరఫున ఆయన సందేశాన్ని డీఎంకే నేత తిరుచ్చి శివ చదివి విని్పంచారు. ప్రజాస్వామ్య పరిరక్షణే లక్ష్యంగా పోరాడదామని శరద్ పవార్ అన్నారు. దేశం పెను సంక్షోభంలో ఉందని డి.రాజా అన్నారు. ఈ ర్యాలీతో రాజకీయాల్లో కొత్త శక్తి పుట్టిందని ఏచూరి అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే బీజేపీకి వ్యతిరేకంగా ఓటేయాలని అఖిలేశ్ పిలుపునిచ్చారు. తృణమూల్ విపక్ష ఇండియా కూటమిలోనే ఉందని ఓబ్రియాన్ చెప్పారు. కూటమి డిమాండ్లు... కేంద్ర దర్యాప్తు సంస్థల దురి్వనియోగం, విపక్ష నేతల అరెస్టులు, ఎన్నికల బాండ్ల పేరుతో బలవంతపు వసూళ్లు, విపక్షాలే లక్ష్యంగా ఆదాయ పన్ను నోటీసులు, నిత్యావసరాల ధరల పెరుగుదల, పెరుగుతున్న నిరోద్యగం, రైతులకు అన్యాయం వంటి ఏడు అంశాలపై కూటమి డిమాండ్లను ప్రియాంక చదివి ప్రస్తావించారు. విపక్షాలపై దర్యాప్తు సంస్థల చర్యలను నిలిపేయాలని కోరారు. బీజేపీ ఎన్నికల బాండ్ల క్విడ్ ప్రో కో వ్యవహారంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిట్ వేయాలని డిమాండ్ చేశారు. ఆరెస్సెస్, బీజేపీ విషతుల్యం ‘‘ఆరెస్సెస్, బీజేపీ విషం వంటివి. పొరపాటున కూడా వాటిని రుచి చూడొద్దు. ఇప్పటికే దేశాన్ని ఎంతో నాశనం చేసిన విచి్ఛన్న శక్తులవి. మరింత సర్వనాశనం చేయకుండా చూడాల్సిన బాధ్యత విపక్షాలదే. పరస్పరం కుమ్ములాడుకోకుండా ఏకమైతేనే బీజేపీని ఓడించడం సాధ్యం. ప్రజాస్వామ్యం, నియంతృత్వాల్లో ఏది కొనసాగాలో నిర్ణయించే కీలక ఎన్నికలివి. ప్రజాస్వామ్యంపై మోదీకి నమ్మకం లేదు. అధికార వ్యవస్థలను విపక్షాలపైకి ఉసిగొల్పి బెదిరిస్తున్నారు. ప్రభుత్వాలను పడదోస్తున్నారు. హేమంత్ సోరెన్‌ను బీజేపీలో చేరనందుకే అరెస్టు చేయించారు. తనకు లొంగడం లేదనే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌నూ జైలుపాలు చేశారు. కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశారు. ఇలా ప్రతిపక్షాలకు బీజేపీతో సమానంగా ఎన్నికల్లో తలపడే అవకాశం లేకుండా చేస్తున్నారు. రూ.14 లక్షల నగదు డిపాజిట్లకు సంబంధించి కాంగ్రెస్‌కు ఏకంగా రూ.135 కోట్ల జరిమానా విధించారు. రూ.42 కోట్ల నగదు డిపాజిట్లు అందుకున్న బీజేపీకి అదే సూత్రం ప్రకారం రూ.4,600 కోట్ల జరిమానా విధించాలి’’ – కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేజ్రీవాల్ సింహం: సునీత ‘‘కేజ్రీవాల్ సింహం. ఆయనను ఎక్కువ రోజులు జైల్లో పెట్టలేరు. దేశ ప్రజలంతా ఆయన వెంట ఉన్నారు’’ అని ఆయన భార్య సునీత అన్నారు. మోదీ ప్రభుత్వంపై ఆమె విరుచుకుపడ్డారు. ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ పంపిన సందేశాన్ని చదివి వినిపించారు. లోక్‌సభ ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ ఆరు గ్యారంటీలను ప్రకటించారు. మా రక్తంలోనే పోరాటం: కల్పన రాజ్యాంగ హక్కులన్నింటినీ మోదీ సర్కారు కాలరాస్తోందని జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ భార్య కల్పన మండిపడ్డారు. ‘‘అధికారాన్ని పూర్తిగా గుప్పెట్లో పెట్టుకున్నామని కొన్ని పార్టీలు అపోహ పడుతున్నాయి. కానీ నిజమైన అధికారం ప్రజలదే. మేం గిరిజనులం. త్యాగం, పోరాటం మా రక్తంలోనే ఉన్నాయి. మా సుదీర్ఘ చరిత్రను తలచుకుని గర్వపడతాం’’ అన్నారు. నిర్ణాయక ఎన్నికలివి... ‘‘అంపైర్లపై ఒత్తిడి పెట్టి, కెపె్టన్‌ను, ఆటగాళ్లను కొనేస్తే మ్యాచ్ గెలిచినట్టే. క్రికెట్లో దీన్ని మ్యాచ్ ఫిక్సింగ్ అంటారు. లోక్‌సభ ఎన్నికల వేళ అంపైర్లను (కేంద్ర ఎన్నికల కమిషనర్లను) ఎంపిక చేసిందెవరు? మ్యాచ్ మొదలైనా కాకముందే ఇద్దరు ఆటగాళ్లను (సీఎంలను) అరెస్టు చేయించిందెవరు? ఇవ్నీ చేసింది ఒక్కే ఒక్క శక్తి. ప్రధాని మోదీ! ముగ్గురు నలుగురు బిలియనీర్ల సాయంతో కలిసి ఇలాంటి చర్యలకు పాల్పడటం ద్వారా లోక్‌సభ ఎన్నికలను మ్యాచ్ ఫిక్సింగ్ చేసేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలను దేశమంతా గమనిస్తోంది. మ్యాచ్ ఫిక్సింగ్, ఈవీఎంల సాయంతోనే 400 సీట్లు నెగ్గుతామని బీజేపీ ధీమాగా అంటోంది. అదే జరిగితే దేశమే సర్వనాశనమవుతుంది. దేశ గుండె చప్పుడైన రాజ్యాంగం కనుమరుగవుతుంది. తద్వారా దేశాన్ని ముక్కలు చేయడమే బీజేపీ లక్ష్యం. మ్యాచ్‌ఫిక్సింగ్, ఈవీఎంలు, మీడియాను బెదిరించడం, కొనేయడం జరగకుంటే బీజేపీకి 180 సీట్లు కూడా రావు. కానీ ఇవేం ఎన్నికలు? విపక్షాలను నిరీ్వర్యం చేసి నెగ్గజూస్తున్నారు. ప్రచార వేళ అతి పెద్ద విపక్షమైన కాంగ్రెస్ ఖాతాలను స్తంభింపజేశారు. ఈడీ, ఐటీ, సీబీఐ బెదిరింపులు, బల ప్రయోగాలతో దేశాన్ని పాలించలేరు. కానీ దేశం గొంతును అణచలేరు. ప్రజల గళాన్ని అణచే శక్తి ప్రపంచంలోనే లేదు. మోదీ అసమర్థ పాలనలో దేశంలో నిరుద్యోగం 40 ఏళ్లలో గరిష్ట స్థాయికి చేరింది. దేశ సంపదంతా ఒక్క శాతం సంపన్నుల చేతిలో పోగుపడింది. ఈ నిరంకుశత్వాన్ని పారదోలేందుకు, రాజ్యాంగాన్ని కాపాడేందుకు జరుగుతున్న ఎన్నికలివి’’ – కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ అహంకారానికి అంతం తప్పదు ‘‘సత్యం కోసం చేసిన యుద్ధంలో రామునికి అధికారం లేదు, వన రుల్లేవు. అయినా అవన్నీ ఉన్న రావణుడిపై గెలిచాడు. అధికారం శాశ్వతం కాదని, అహంకారం వీడాలని రాముని జీవి తం నేర్పుతోంది. రాముని భక్తులమని ప్రకటించుకునే వారికి ఇది చెప్పాలనుకుంటు న్నా. అహంకారం అణగక తప్పదు’’ – కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా -
బంగ్లాదేశ్ క్రికెటర్‌పై ఫిక్సింగ్ ఆరోపణలు..
దుబాయ్: మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై బంగ్లాదేశ్ క్రికెటర్ నాసిర్ హుస్సేన్ సహా ఎనిమిది మందిపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అవినీతి వ్యతిరేక విభాగం అభియోగాలు నమోదు చేసింది. 2020–21 సీజన్ అబుదాబి టి10 లీగ్‌లో ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు వీరిపై ప్రధాన ఆరోపణ. ఈ ఎనిమిది మందీ ‘పుణే డెవిల్స్’ జట్టుతో సంబంధం ఉన్న వారే. టీమ్ సహయజమానులైన కృషన్ కుమార్ చౌదరి, పరాగ్ సంఘ్వీ, అసిస్టెంట్ కోచ్ సన్నీ ధిల్లాన్ భారతీయులు కాగా, మిగతావారు విదేశీ యులు. నాటి లీగ్‌లో డెవిల్స్ ఆరు మ్యాచ్‌లలో ఒక టే గెలిచింది. నాసిర్ హుస్సేన్ బంగ్లా తరఫున 19 టెస్టులు, 65 వన్డేలు, 31 టి20 మ్యాచ్‌లు ఆడాడు. -
లంక మాజీ క్రికెటర్ సేనానాయకే అరెస్ట్
కొలంబో: మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై శ్రీలంక మాజీ క్రికెటర్ సచిత్ర సేనానాయకేను క్రీడా అవినీతి దర్యాప్తు సంస్థ అరెస్ట్ చేసింది. 2020లో జరిగిన లంక ప్రీమియర్ లీగ్‌లో ఆటగాళ్లను సంప్రదించి మ్యాచ్‌లను ఫిక్స్ చేసేందుకు ప్రయత్నించాడనేది అతనిపై ప్రధాన ఆరోపణ. ఇదే ఆరోపణలపై అతడు దేశం విడిచి వెళ్లరాదంటూ మూడు వారాల క్రితమే కోర్టు ఆదేశించింది. సెపె్టంబర్ 15 వరకు సేనానాయకే పోలీసులలో అదుపులో ఉంటాడు. అతనిపై క్రిమినల్ కేసు కూడా నమోదు కానుంది. 38 ఏళ్ల సేనానాయకే ఆఫ్ స్పిన్నర్‌గా 2012–2016 మధ్య శ్రీలంకకు ఒక టెస్టు, 49 వన్డేలు, 24 టి20ల్లో ప్రాతినిధ్యం వహించి మొత్తం 78 వికెట్లు పడగొట్టాడు. 2014లో టి20 వరల్డ్ కప్ నెగ్గిన లంక జట్టులో అతను సభ్యుడు. 2013 ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు తరఫున ఎనిమిది మ్యాచ్‌లు ఆడి తొమ్మిది వికెట్లు తీశాడు. -
మ్యాచ్ ఫిక్సింగ్ వివాదం.. శ్రీలంక వరల్డ్‌కప్ విన్నర్ అరెస్టు!
శ్రీలంక మాజీ క్రికెటర్ సుచిత్ర సేనానాయకే మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో అరెస్టు అయ్యాడు. ఆ దేశపు క్రీడా మంత్రిత్వ శాఖలోని ప్రత్యేక దర్యాప్తు విభాగం ముందు సేనానాయకే బుధవారం లోంగిపోయాడు. అతడిని త్వరలోనే కొలంబో చీఫ్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరచనున్నట్లు తెలుస్తోంది. కాగా శ్రీలంక క్రికెట్ చరిత్రలోనే మ్యాచ్ ఫిక్సింగ్ సంబంధించి న్యాయ విచారణకు హాజరకానున్న మొదటి క్రికెటర్ సేనానాయకే కావడం గమనార్హం. లంక ప్రీమియర్ లీగ్‌లో మ్యాచ్ ఫిక్సింగ్.. సేనానాయకే లంక ప్రీమియర్ లీగ్ 2020 మ్యాచ్‌ల్లో మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. మ్యాచ్ ఫిక్సింగ్‌కు సంబంధించి ఇద్దరు ఆటగాళ్లను సేనానాయకే టెలిఫోన్లో సంప్రదించినట్లు పలు రిపోర్టులు వెల్లడించాయి. దీంతో అతడు విదేశాలకు వెళ్లకుండా మూడు నెలల పాటు ట్రావెల్‌బ్యాన్ కొలంబోలోని స్ధానికి కోర్టు విధించింది. కోర్టు ఉత్తర్వులను అటార్నీ జనరల్ డిపార్ట్మెంట్ పొందింది. అటార్నీ జనరల్ ఆదేశాల మెరకు క్రీడా మంత్రిత్వ శాఖ ప్రత్యేక దర్యాప్తు విభాగం సేనానాయక్పై నేరారోపణలు మోపింది. ఈ క్రమంలో సేనానాయకేనే ప్రత్యేక దర్యాప్తు విభాగం ముందు లొంగిపోయాడు. ఇక 28 ఏళ్ల సేనానాయకే శ్రీలంక తరపున 49 వన్డేలు, 24 టీ20ల్లో ప్రాతినిథ్యం వహించాడు. 2016 టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకున్న జట్టులో సేనానాయకే భాగంగా ఉన్నాడు. చదవండి: Rohit Sharma: సిగ్గుపడాలి రోహిత్! నువ్వు చేసిన చెత్త పని ఏంటో తెలుస్తోందా? నెటిజన్స్ ఫైర్ -
IPL 2023 QF 1: సీఎస్కే-గుజరాత్ మ్యాచ్‌పై అనుమానాలు.. ఫిక్స్ అయ్యిందా..?
చెన్నై సూపర్ కింగ్స్-గుజరాత్ టైటాన్స్ మధ్య నిన్న (మే 23) జరిగిన క్వాలిఫయర్ 1 మ్యాచ్‌పై కొందరు నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో గుజరాత్ ఉద్దేశపూర్వకంగానే ఓడిందని వారు ఆరోపిస్తున్నారు. ఇందుకు పలు విషయాలను ఉదాహరణగా చూపిస్తున్నారు. బౌలర్లు ఈ సీజన్లో ఎన్నడూ లేనంత ఉదాసీనంగా వ్యవహరించారని, వికెట్లు తీసి పరుగులు నియంత్రించినప్పటికీ అది వారి స్థాయి కాదని విమర్శలు గుప్పిస్తున్నారు. కష్టసాధ్యంకాని లక్ష్య ఛేదనలో (173) బ్యాటర్లు ఉద్దేశపూర్వకంగా వికెట్లు పారేసుకున్నారని, అంపైర్లు కరెక్ట్‌గా లేకపోయినా కెప్టెన్ నుంచి ఎటువంటి స్పందన లేదని అంటున్నారు. తెవాతియా, మిల్లర్ నిర్లక్ష్యమైన షాట్లు ఆడి వికెట్లు పారేసుకోవడాన్ని, ఫీల్డర్ మార్చడాన్ని గమనించినా హార్ధిక్ అటువైపే షాట్ ఆడి ఔట్ కావడాన్ని ఇందుకు ఉదహరిస్తున్నారు. అనుమానాస్పదంగా ఉన్న విజయ్ శంకర్ క్యాచ్‌ను పూర్తిగా పరిశీలించకుండానే థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించడం, రీప్లేలో బంతి నేలకు తాకినట్లు కనిపిస్తున్నా ఎవరూ పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తుందని చర్చించుకుంటున్నారు. పతిరణ విషయంలోనూ (16వ ఓవర్) అంపైర్లు ధోనికి తలొగ్గారని, రూల్స్ వ్యతిరేకమైనా వారు పతిరణను బౌలింగ్ చేయనిచ్చారని ఆరోపిస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా గుజరాత్ ఆలౌట్ కావడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. వీరి ఆరోపణలు, అనుమానాలను పక్కకు పెడితే.. నిన్నటి మ్యాచ్‌లో గుజరాత్‌ను ఓడించడంతో సీఎస్కే 10వ సారి ఐపీఎల్ ఫైనల్‌కు చేరింది. సీఎస్కే ఆటగాళ్లు సమష్టిగా రాణించి గుజరాత్‌ను 15 పరుగుల తేడాతో ఓడించారు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రుతురాజ్ గైక్వాడ్ (44 బంతుల్లో 60; 7 ఫోర్లు, 1 సిక్స్), డెవాన్ కాన్వే (34 బంతుల్లో 40; 4 ఫోర్లు) రాణించారు. అనంతరం గుజరాత్ 20 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌటైంది. గుజరాత్ ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ (38 బంతుల్లో 42; 4 ఫోర్లు, 1 సిక్స్) మినహా ఎవరూ రాణించలేదు. చదవండి: CSK VS GT: ధోని తొండాట.. మ్యాచ్ 4 నిమిషాలు ఆలస్యం -
ఐపీఎల్ లో ఫిక్సింగ్ జరిగిందా? అందుకే టాప్ టీమ్స్ అలా
-
క్రికెట్లో 13 మ్యాచ్‌లు ఫిక్సింగ్.. టీమిండియా సేఫ్!
అంతర్జాతీయ క్రీడా సంస్థ స్పోర్ట్‌రాడార్ 2022 ఏడాదిలో అవినీతి, మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిన మ్యాచ్‌ల వివరాలను వెల్లడించింది. ఈ నివేదికలో 13 క్రికెట్ మ్యాచ్‌ల్లో అవినీతి, మ్యాచ్ ఫిక్సింగ్ జరిగినట్లు ఆరోపించడం ఆసక్తి కలిగించింది. స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేసే స్పోర్ట్‌రాడార్‌కు చెందిన నిపుణులు రెగ్యులర్ బెట్టింగ్, మ్యాచ్ ఫిక్సింగ్, అవినీతి కార్యకలపాలపై తమ పరిశోధన నిర్వహించారు. దీనికి సంబంధించి 28 పేజీలతో ఒక రిపోర్ట్‌ను విడుదల చేసింది. 2022 ఏడాది క్యాలెండర్లో మొత్తంగా 1212 మ్యాచ్‌లపై వివిధ కోణాల్లో అనుమానాలున్నాయని పేర్కొంది. ఇందులో 92 దేశాలకు చెందిన 12 ఆటలు ఉన్నాయి. అత్యధికంగా ఫుట్‌బాల్ నుంచి 775 మ్యాచ్‌లు అవినీతి లేదా ఫిక్సింగ్ రూపంలో ఉన్నాయి. ఆ తర్వాత రెండో స్థానంలో బాస్కెట్‌బాల్ గేమ్ ఉంది. ఈ బాస్కెట్‌బాల్ నుంచి 220 మ్యాచ్‌లు ఉన్నాయి. ఆ తర్వాత 75 అనుమానాస్పద మ్యాచ్‌లతో టెన్నిస్ మూడో స్థానంలో ఉంది. ఇక క్రికెట్లో 13 మ్యాచ్‌లపై అనుమానాలు ఉన్నట్లు తెలిపిన స్పోర్ట్‌రాడార్ ఆరోస్థానం కేటాయించింది. క్రికెట్లో 13 మ్యాచ్‌లు ఫిక్సింగ్ లేదా అవినీతి జరగడం ఇదే తొలిసారి అని తెలిపింది. ఇదే విషయమై పీటీఐ స్పోర్ట్ రాడార్‌ను ఒక ప్రశ్న వేసింది. ఈ ఫిక్సింగ్ జరిగింది అంతర్జాతీయ క్రికెట్ లేక టి20 లీగ్‌ల్లోనా అని పీటీఐ ప్రశ్నించింది. దీనికి స్పోర్ట్‌రాడార్ స్పందిస్తూ ఫిక్సింగ్‌గా అనుమానిస్తున్న 13 మ్యాచ్‌లు టీమిండియాకు కానీ.. ఐపీఎల్‌కు కానీ సంబంధం లేదని తెలిపింది. ఇదే స్పోర్ట్ రాడార్ సంస్థ 2020లో ఐపీఎల్ మ్యాచ్‌ల సందర్భంగా బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్లో పనిచేసింది. బెట్టింగ్‌లో జరుగుతున్న అక్రమాలపై తమ పరిశోధన చేసి బీసీసీకి నివేధిక అందించింది. Sportradar Integrity Services finds number of suspicious matches in 2022 increased 34%, as further application of AI enhances bet monitoring capabilities. Read our Annual 2022 Integrity Report ➡️ https://t.co/4SflpVlGUI pic.twitter.com/kRSDW93K3p — Sportradar (@Sportradar) March 23, 2023 చదవండి: ఇంగ్లండ్ బౌలర్ చరిత్ర.. డబ్ల్యూపీఎల్‌లో తొలి హ్యాట్రిక్ -
135 మ్యాచ్‌ల్లో ఫిక్సింగ్.. ఆటగాడిపై జీవితకాల నిషేధం
మొరాకోకు చెందిన టెన్నిస్ ఆటగాడికి అంతర్జాతీయ టెన్నిస్ ఇంటిగ్రీటీ ఏజెన్సీ(ITIA) షాక్ ఇచ్చింది. రికార్డు స్థాయిలో 135 మ్యాచ్‌ల్లో ఫిక్సింగ్ నేరాలకు పాల్పడినట్లు రుజువు కావడంతో జీవితకాల నిషేధం విధిస్తున్నట్లు ఐటీఐఏ గురువారం పేర్కొంది. బెల్జియంలోని ఐటీఐఏతో కలిసి లా ఎన్ఫోర్స్మెంట్ పరిశోధనల తర్వాత ఇద్దరు అల్జీరియన్ ఆటగాళ్లతో రచిడి మ్యాచ్ ఫిక్సింగ్ చేసినట్లు సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. ఇకపై యూనెస్ రచిడి కోచింగ్ లేదా క్రీడల పాలక సంస్థలు అనుమతించిన ఏ టెన్నిస్ ఈవెంట్లో పాల్గొనకుండా నిషేధం విధించినట్లు తెలిపింది. కెరీర్లో అత్యధిక డబుల్స్ ర్యాంకింగ్స్‌లో 473వ ర్యాంక్‌కు చేరుకున్న యూనెస్ రచిడికి 34 వేల డాలర్ల జరిమానా కూడా విధించినట్లు ఐటీఐఏ వివరించింది. చదవండి: ఎన్నాళ్లకు దర్శనం.. ఇంత అందంగా ఎవరు తిప్పలేరు -
ఫిక్సింగ్ బారిన క్రికెటర్.. రెండేళ్ల నిషేధం
పాకిస్తాన్ క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కొత్తేం కాదు. ఫిక్సింగ్ కలంకం ఏదో ఒక రూపంలో ఆ జట్టును చుట్టుముడుతునే వచ్చింది.గతంలో మహ్మద్ ఆసిఫ్, మహ్మద్ ఆమిర్, సల్మాన్ భట్ ఫిక్సింగ్‌కు పాల్పడి నిషేధానికి గురయ్యారు. తాజాగా మరోసారి ఫిక్సింగ్ కలకలం రేపింది. లెప్టార్మ్ స్పిన్నర్, ఫస్ట్‌క్లాస్ క్రికెటర్ ఆసిఫ్ అఫ్రిది మ్యాచ్ ఫిక్సింగ్ పాల్పడినట్లు రుజువు కావడంతో పీసీఈబీ రెండేళ్ల నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. నిషేధం వెంటనే అమల్లోకి వస్తుందని పీసీబీ పేర్కొంది. 2022 ఏడాది సెప్టెంబర్‌లో ఆసిఫ్ అఫ్రిది కాశ్మీర్ ప్రీమియర్ లీగ్‌లో పాల్గొన్నాడు.అక్కడ రావల్కోట్ హాక్స్ జట్టు తరపున ఆడుతున్నప్పుడు మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. తమ విచారణలో ఫిక్సింగ్ ఆరోపణలు నిజమని తేలడంతో అతనిపై నిషేధం విధించింది.'' ఆర్టికల్ 2.4.10ని ఉల్లంఘించిన కారణంగా ఆసిఫ్ ఆఫ్రిదిపై రెండేళ్ల అనర్హత, దీంతో పాటు ఆర్టికల్ 2.4.4ను ఉల్లంఘించినందుకు ఆరు నెలల నిషేధం విధించాం. ఈ రెండు ఏకకాలంలో అమలు చేయబడుతాయి. 2024 సెప్టెంబర్ 12 వరకు ఈ నిషేధం అమల్లో ఉండనుంది.'' అని పీబీసీ పేర్కొంది. లెఫ్ట్ ఆర్మ్ బౌలర్‌గా పేరు పొందిన ఆసిఫ్ అఫ్రిది 35 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 118 వికెట్లు తీశాడు. లిస్ట్-ఏ క్రికెట్లో 59 వికెట్లు తీశాడు. ఇక ఫస్ట్‌క్లాస్ టి20ల్లో 63 వికెట్లు తీశాడు. పీఎస్ఎల్లో ముల్తాన్ సుల్తాన్స్ తరపున ఆడిన ఆసిఫ్ అఫ్రిది దేశవాళీ క్రికెట్లో ఖైబర్ పఖ్తున్ఖ్వా తరపున ప్రాతినిధ్యం వహించాడు. చదవండి: ఆసీస్‌తో సవాల్‌కు సిద్దం; బ్యాటింగ్‌లో ఏ స్థానమైనా ఓకే -
'టీమిండియాతో మ్యాచ్ ఫిక్సింగ్ చేశారు.. ఐపీఎల్ కోసమే'
ఆసియాకప్-2022లో భాగంగా ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన అఖరి సూపర్-4 మ్యాచ్‌లో టీమిండియా దుమ్మురేపింది. దుబాయ్ వేదికగా గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఆఫ్గాన్‌పై 101 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అద్భుతమైన సెంచరీ సాధించాడు. దీంతో తన 71 సెంచరీ కోసం కోహ్లి మూడేళ్ల నిరీక్షణకు తెరపడింది. అదే విధంగా ఇది కోహ్లి తొలి అంతర్జాతీయ టీ20 సెంచరీ కావడం విశేషం. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 212 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్గాన్.. భువనేశ్వర్ కుమార్ ఐదు వికెట్లతో విజృంభించిడంతో 111 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. Very well paid by india today vs Afghanistan#wellpaidindia #matchfixed #indvsafg #fixing pic.twitter.com/h63LMn8Ayb — Muzach 🫡 (@MuazSaqib) September 8, 2022 కాగా అంతకుముందు సూపర్-4 మ్యాచ్‌లో పాకిస్తాన్‌కు ఆఫ్గానిస్తాన్ చుక్కలు చూపించిన విషయం తెలిసిందే. అఖరి వరకు ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్‌లో అనూహ్యంగా ఒక్క వికెట్ తేడాతో ఆఫ్గాన్ పరాజయం పాలైంది. అయితే పాక్‌పై అదరగొట్టిన ఆఫ్గానిస్తాన్ భారత్‌పై మాత్రం అన్ని విధాలుగా విఫలమైంది. Wooo wapsi ka ticket ka pesa nai thay isi lia match fix karna para..#INDvsAFG pic.twitter.com/1gyimoWSx1 — نور ٹویٹس🇵🇰 (@sheiknoor31) September 9, 2022 ఈ మ్యాచ్‌లో ఆఫ్గానిస్తాన్ ఫీల్డింగ్‌లో కూడా చేతులెత్తేసింది. విరాట్ కోహ్లి, పంత్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌లను ఫీల్డర్లు జారవిడిచారు. 28 పరుగుల వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న కోహ్లి ఏకంగా 122 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. Wooo wapsi ka ticket ka pesa nai thay isi lia match fix karna para..#INDvsAFG pic.twitter.com/1gyimoWSx1 — نور ٹویٹس🇵🇰 (@sheiknoor31) September 9, 2022 ఈ క్రమంలో పాక్ అభిమానులు మ్యాచ్ ఫిక్స్ అయిందంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కేవలం ఐపీఎల్ కోసమే ఆఫ్గానిస్తాన్ ఆటగాళ్లు అమ్ముడు పోయారంటూ ట్విట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ట్విటర్లో # ఫిక్సింగ్ అనే కీవర్డ్ ట్రెండింగ్ అవుతోంది. This afghan skipper should keep his head down in shame. For IPL contracts they sell their team .Amount of catches dropped by afghan shows how money is important. #Fixing — amaan (@amaan15203715) September 9, 2022 చదవండి: Asia Cup 2022: కింగ్ కోహ్లి అద్భుతమైన సెంచరీ.. పాక్ ఆటగాళ్ల ప్రశంసల జల్లు! -
మంచి చాన్స్ మిస్ చేశాడనుకుంటున్నారా.. కథ వేరే ఉంది
ఫుట్‌బాల్‌లో పెనాల్టీ కిక్ అంటే అదృష్టం కింద పరిగణిస్తారు. ఎందుకంటే పెనాల్టీ కిక్ సమయంలో ప్రత్యర్థి జట్టు నుంచి గోల్ కీపర్ మినహా మరే ఆటగాడు గోల్‌పోస్ట్ ముంగిట ఉండడు. ఈ అవకాశం వచ్చిన జట్టు పెనాల్టీ కిక్‌ను సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నిస్తాయి. కానీ పెనాల్టీ కిక్‌ను సమర్థంగా ఉపయోగించుకోలేని ఆటగాళ్లు కొందరుంటారు. అదే కావాలని మిస్ చేయడం ఎప్పుడైనా చూశారా. అయితే ఇది చదవండి. విషయంలోకి వెళితే.. నైజీరియా వేదికగా ఓగున్ స్టేట్ ఎఫ్ఏ కప్‌లో భాగంగా ఫైనల్ మ్యాచ్ రోమియో స్టార్స్, ఇజేబూ యునైటెడ్ మధ్య జరిగింది. మ్యాచ్ డ్రాగా ముగియడంతో షూటౌట్ అనివార్యమైంది. షూటౌట్ ఆడేందుకు వచ్చిన ప్లేయర్ వచ్చాడు. గోల్‌పోస్ట్ వైపు కొట్టాల్సిన బంతిని సరిగ్గా వ్యతిరేక దిశలో కిక్ చేశాడు. అంతే చూస్తున్న మనకు షాకింగ్‌గా ఉండొచ్చు.. కానీ వాళ్లకు కాదు. ఎందుకంటే మ్యాచ్ ముందే ఫిక్స్ అయింది కాబట్టి. ఆ తర్వాతి వీడియోతో ఒక క్లారిటీ వచ్చింది. తరువాత షూటౌట్ చేయడానికి వచ్చిన ప్లేయర్ ఈసారి నేరుగా బంతిని గోల్‌పోస్ట్‌లోకి తరలించగా.. గోల్ కీపర్ మాత్రం అసలేం పట్టనట్లు చూస్తూ ఉండిపోయాడు. దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు మ్యాచ్ ఫిక్సింగ్ అని. ఈ వీడియో చూసిన నెటిజన్లు వినూత్న కామెంట్లతో రెచ్చిపోయారు. I do not know what to say! 🤣🤣pic.twitter.com/YSkFJZ2bDU — Figen (@TheFigen) July 22, 2022 If this isn’t Match Fixing, then I don’t know what it is. Why is Nigerian football like this? Why don’t we ever want progress?? This is Ogun State FA Cup final between Remo Stars and Ijebu United 💔💔 pic.twitter.com/Mef2oU2gd1 — Ibukun Aluko (@IbkSports) July 14, 2022 -
'ఊహించిందే జరిగింది.. మ్యాచ్ ఫిక్సింగ్ గట్రా.. ఏమి లేవుగా?!'
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో మ్యాచ్ ఫిక్సింగ్ కొత్తేం కాదు. 2013 ఐపీఎల్ సీజన్ మధ్యలోనే మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం రేపింది. రాజస్తాన్ రాయల్స్‌కు చెందిన ఆటగాళ్లు సహా ఫ్రాంచైజీలకు చెందిన ఓనర్లు సహా పలువురు వ్యక్తులు అరెస్టవడం సంచలనం కలిగించింది. ఈ ఉదంతం ఐపీఎల్ చరిత్రలో మాయని మచ్చగా మిగిలింది. ఒక రకంగా ఐపీఎల్ ఫిక్సింగ్ అని చాలా మంది క్రికెట్ ఫ్యాన్స్‌లో నాటుకుపోయేలా చేసింది. ఎంత ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చినప్పటికి ఐపీఎల్‌కున్న క్రేజ్ 15 ఏళ్లలో ఇసుమంతైనా తగ్గలేదు. PC: IPL Twitter తాజాగా ఐపీఎల్ 2022 సీజన్లో గుజరాత్ టైటాన్స్ చాంపియన్స్‌గా నిలిచింది. ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి అరంగేట్రం సీజన్లో టైటిల్ కొట్టి గుజరాత్ టైటాన్స్ చరిత్ర సృష్టించింది. అయితే మరోసారి మ్యాచ్ ఫిక్సింగ్ అనే అంశం తెరమీదకు వచ్చింది. ఐపీఎల్ 15వ సీజన్ ఆరంభం నుంచి అందరూ ఊహించినట్లుగానే హార్దిక్ సేన కప్ కొట్టడంపై సోషల్ మీడియాలో కొన్ని ట్రోల్స్, మీమ్స్ వైరల్‌గా మారాయి. గుజరాత్ టైటాన్స్ నిజాయితీగా కప్ కొట్టుంటే సమస్య లేదు గానీ.. ఒకవేళ ఫిక్సింగ్ గట్రా ఏమైనా ఉంటే మాత్రం చర్చించాల్సిన విషయమే అని క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. PC: IPL Twitter సోషల్ మీడియాలో ఈ ట్రోల్స్ రావడం వెనుక ఒక కారణం ఉంది. గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ.. బీసీసీఐ సెక్రటరీ జై షా దగ్గరి వ్యక్తులకు చెందింది అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక జై షా.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు కూడా కావడం.. తొలిసారి ఒక ఫ్రాంచైజీ తరపున ఐపీఎల్లో బరిలోకి దిగడంతో మరింత ప్రాముఖ్యత సంతరించుకుంది. అంతేకాదు ప్రధాని మోదీ, అమిత్ షాల సొంత రాష్ట్రమైన గుజరాత్ పేరుతో ఒక ఫ్రాంచైజీ బరిలోకి దిగుతుందంటే మాములుగా ఉండదు. ఎలాగైనా ఆ జట్టే కప్ కొట్టాలని ముందుగానే నిర్ణయించినట్లు వార్తలు వినిపించాయి. అందుకే లీగ్‌లో విజయాలతో అప్రతిహాతంగా దూసుకెళ్లిన గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్స్, ఫైనల్లోనూ అదే దూకుడు కనబరిచింది. ఇంకో విషయమేంటంటే.. ఫైనల్‌కు హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా వచ్చారు. దేశాన్ని పరిపాలిస్తున్న ఒక పార్టీ నుంచి ముఖ్యమైన వ్యక్తి వేలాది మంది భద్రత మధ్య ఫైనల్ మ్యాచ్ చూసేందుకు రావడం కూడా ఫిక్సింగ్ అనే పదం వినిపించడానికి కారణం అయింది. ఇక దీనికి సంబంధించిన ట్రోల్స్, మీమ్స్‌పై ఒక లుక్కేయండి. మ్యాచ్ ఫిక్సింగ్ అనే పదం పక్కనబెడితే.. గుజరాత్ టైటాన్స్ మాత్రం సూపర్ అని చెప్పొచ్చు. సీజన్ ఆరంభం నుంచి స్పష్టమైన ఆధిక్యం చూపించిన గుజరాత్.. అరంగేట్రం సీజన్లోనే టైటిల్‌ను కొల్లగొట్టి చరిత్ర సృష్టించింది. లీగ్ ప్రారంభం నుంచి కర్త, కర్మ, క్రియ పాత్ర పోషించిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కీలకమైన ఫైనల్లో తానెంత గొప్ప ఆల్‌రౌండర్ అనేది మరోసారి రుచి చూపించాడు.అటు కెప్టెన్‌గా రాణించడంతో పాటు.. ముందు బౌలింగ్‌లో మూడు కీలక వికెట్లు, బ్యాటింగ్‌లో 34 పరుగులు చేసిన పాండ్యా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. చదవండి: గుజరాత్ టైటాన్స్ విజయంలో అజ్ఞాతవ్యక్తి; మాటల్లేవు.. అంతా చేతల్లోనే 'అవమానాలు తట్టుకుని నా భర్త విజయం సాధించాడు.. అందుకే' 𝗖. 𝗛. 𝗔. 𝗠. 𝗣. 𝗜. 𝗢. 𝗡. 𝗦! 🏆 🙌 That moment when the @gujarat_titans captain @hardikpandya7 received the IPL trophy from the hands of Mr. @SGanguly99, President, BCCI and Mr. @JayShah, Honorary Secretary, BCCI. 👏 👏#TATAIPL | #GTvRR pic.twitter.com/QKmqRcemlY — IndianPremierLeague (@IPL) May 29, 2022 #fixing Post fixing scenes pic.twitter.com/atznnAVrKk — Vishnu K B (@Vishnukb8055) May 29, 2022 Game Changer Of The Match !! 🤣😂#ipl #iplfinal #gujarattitans #IPL2022Final #IPL2022 #fixing #GT #Congratulation pic.twitter.com/XDAGFuhXTd — Omkar Balekar (@MrOmkarBalekar) May 29, 2022 Next election in Gujarat#fixing pic.twitter.com/blbt96Yudr — imran baig (@imranba41465365) May 29, 2022 Hardik pandya doesn't look that excited..looks like he knew the result before the game #fixing — Deeraj (@deerajpnrao) May 29, 2022 most boring IPL final EVER. Congratulations GT #IPLFinal #IPL2022Final pic.twitter.com/2g3dkrSyRs — AkshayKTRS (@AkshayKtrs) May 29, 2022 -
చెన్నైలో ఇంగ్లండ్‌తో తొలిటెస్టుపై ఫిక్సింగ్ అనుమానాలు?
గతేడాది ఇంగ్లండ్ జట్టు ఫిబ్రవరిలో టీమిండియా పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ పర్యటనలో ఇంగ్లండ్ టీమిండియాతో నాలుగు టెస్టులు, ఐదు టి20, మూడు వన్డేలు ఆడింది. కాగా చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా ఇంగ్లండ్, టీమిండియా మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరిగింది. అనూహ్యంగా టీమిండియా తొలి టెస్టులో ఓడిపోయింది. ఏ జట్టైనా స్వదేశంలో సిరీస్ ఆడుతుందంటే పిచ్ తమకు అనుకూలంగా ఉండేలా చూసుకుంటుంది. కానీ తొలి టెస్టు మాత్రం అందుకు భిన్నంగా జరిగింది. తొలి టెస్టులో ఇంగ్లండ్ చేతిలో 227 పరుగుల తేడాతో టీమిండియా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. కెప్టెన్ జో రూట్ 218 పరుగులు చేయడంతో తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 578 పరుగుల భారీ స్కోరు చేసి ఆలౌట్ అయ్యింది. డొమినిక్ సిబ్లీ 87, బెన్ స్టోక్స్ 82 పరుగులు చేసి రాణించారు. ఆ తర్వాత టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 337 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా బౌలర్లు చెలరేగడంతో ఇంగ్లండ్ 178 పరుగులకే ఆలౌట్ కావడంతో .. భారత్ ముందు 433 పరుగుల టార్గెట్ ఉంది. కానీ టీమిండియా తమ వికెట్లు కాపాడుకోలేక 192 పరుగులకి ఆలౌట్ అయి మ్యాచ్ ఓడిపోయింది. కాగా ఈ మ్యాచ్‌పై.. పిచ్ తయారు చేసిన క్యురేటర్‌పై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. మ్యాచ్ ఫలితం తర్వాత చెపాక్ స్టేడియం పిచ్ క్యూరేటర్‌ని ఆ పదవి నుంచి తొలగించిన బీసీసీఐ కొత్త క్యూరేటర్‌ని నియమించిన సంగతి తెలిసిందే. తాజాగా చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్టు ఫిక్సింగ్ ఏమైనా జరిగిందా అని సమాచారం. ముఖ్యంగా పిచ్ క్యూరేటర్ వైఖరిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి తొలి టెస్టు ఆరంభానికి ముందు బీసీసీఐ టీమ్ మేనేజ్మెంట్, పిచ్ క్యూరేటర్‌ని కలిసి పిచ్ ఎలా తయారుచేయాలో సూచనలు, ఆదేశాలు ఇచ్చారు...మ్యాచ్‌కి ముందు రోజు సాయంత్రం అప్పటి హెడ్ కోచ్ రవిశాస్త్రి, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ కలిసి చెపాక్‌లోని చిదంబరం స్టేడియానికి వెళ్లారు...క్యూరేటర్‌కి, గ్రౌండ్‌మెన్‌కి పిచ్ ఎలా తయారుచేయాలో సూచించారు. పిచ్ ఎలా ఉందో అలా వదిలేయాలని నీళ్లు కొట్టడం కానీ, రోలర్ వాడడం కానీ చేయకూడదని తెలిపారు...అయితే మ్యాచ్ ఆరంభానికి ముందు పిచ్‌కి నీళ్లు కొట్టిన క్యూరేటర్, రోలర్ కూడా వాడారు. దీంతో పిచ్ బ్యాటింగ్‌కి అనుకూలంగా మారి, మొదటి రెండు రోజులు బౌలర్లకు ఏ మాత్రం సహకరించలేదు...బీసీసీఐ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా క్యూరేటర్... పిచ్‌పై నీళ్లు కొట్టి, రోలర్ ఎందుకు వాడాడు? కావాలని టీమిండియాకి విరుద్ధంగా రిజల్ట్ రావాలని ఈ విధంగా చేశాడా?లేక మ్యాచ్ ఫిక్సింగ్‌కి పాల్పడ్డాడా? అనేది తేల్చేందుకు బీసీసీఐ విచారణ జరపాలని బోర్డు పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం. కాగా మళ్లీ చెన్నై వేదికగా జరిగిన రెండో టెస్టులో మాత్రం టీమిండియా విజయం సాధించింది. రవిచంద్రన్ అశ్విన్ 8 వికెట్లు తీయగా, టెస్టు ఆరంగ్రేటం చేసిన అక్షర్ పటేల్ 7 వికెట్లు తీసి అదరగొట్టాడు. దీంతో భారత జట్టు 317 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత మూడు, నాలుగు టెస్టులు వరుసగా గెలిచిన టీమిండియా 3-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. చదవండి: Shane Warne- Ricky Ponting: వార్న్‌ను తలచుకుని ఒక్కసారిగా ఏడ్చేసిన రికీ పాంటింగ్ WTC Points Table: శ్రీలంకను చిత్తు చేసిన రోహిత్ సేన.. ఎన్నో స్థానంలో ఉందంటే -
ఓ ప్రముఖ భారత వ్యాపారవేత్త మ్యాచ్ ఫిక్సింగ్ చేయమని బెదిరించాడు..
జింబాబ్వే తరఫున అత్యధిక శతకాలు(17) బాదిన క్రికెటర్‌గా రికార్డుల్లో నిలిచిన ఆ దేశ మాజీ కెప్టెన్ బ్రెండన్ టేలర్, మ్యాచ్ ఫిక్సింగ్‌కు సంబంధించి సంచలన విషయాలను వెల్లడించాడు. 2019లో ఓ భారత వ్యాపారవేత్త, తనను మ్యాచ్ ఫిక్సింగ్ చేయమని బెదిరించాడని, అందుకు అతను 15000 అమెరికన్ డాలర్లు ఆఫర్ చేశాడని ట్విటర్ వేదికగా ఆరోపణలు చేశాడు. నాటి ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా తాను ఆ వ్యక్తి నుంచి కొంత నగదు కూడా తీసుకున్నట్లు అంగీకరించాడు. To my family, friends and supporters. Here is my full statement. Thank you! pic.twitter.com/sVCckD4PMV — Brendan Taylor (@BrendanTaylor86) January 24, 2022 గతేడాది సెప్టెంబర్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన టేలర్.. 2019లో ఓ ప్రముఖ భారత వ్యాపారవేత్త ఆహ్వానం మేరకు భారత్‌కు వచ్చానని, ఆ సందర్భంగా ఓ పార్టీలో కొందరు నాకు కొకైన్ ఆఫర్ చేశారని, తాను కొకైన్ సేవిస్తుండగా వీడియోలు తీసి బెదిరించడం మొదలుపెట్టారని, ఈ క్రమంలోనే మ్యాచ్ ఫిక్సింగ్ కూడా చేయమన్నారని సంచలన స్టేట్మెంట్ను విడుదల చేశాడు. ఆ వ్యాపారవేత్త జింబాబ్వేలో టీ20 లీగ్‌ను లాంచ్ చేస్తామని తనను సంప్రదించాడని, అప్పటికే తమ దేశ క్రికెట్ బోర్డు నుంచి ఆరు నెలలుగా జీతాలు లేవని, తన ఆర్ధిక అవసరాలను ఆసరాగా తీసుకుని సదరు వ్యక్తి తనను ప్రలోభ పెట్టాడని, తాను అంగీకరించకపోయే సరికి బ్లాక్ మెయిలింగ్‌కు దిగాడని స్టేట్మెంట్ ఇచ్చాడు. గత రెండేళ్లుగా ఈ భారాన్ని మోయలేక మానసికంగా, శారీరకంగా కృంగిపోయానని, అందుకే ఈ స్టేట్మెంట్ను విడుదల చేస్తున్నాని పేర్కొన్నాడు. జింబాబ్వే తరఫున 34 టెస్ట్‌లు, 205 వన్డేలు, 45 టీ20లు ఆడిన టేలర్.. టెస్ట్‌ల్లో 6 సెంచరీలు, వన్డేల్లో 11 సెంచరీలు సహా దాదాపు పది వేల పరుగులు చేశాడు. 35 ఏళ్ల ఈ ఆల్‌రౌండర్.. 2014 ఐపీఎల్ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడాడు. కాగా, తనను ఫిక్సింగ్ చేయమన్న ఆ వ్యాపారవేత్త ఎవరనే విషయాన్ని మాత్రం టేలర్ వెల్లడించలేదు. చదవండి: ICC Awards 2021: వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ ఎవరంటే..! -
పాక్ మాజీ కెప్టెన్ ఫిక్సింగ్ చేయమన్నాడు.. షేన్ వార్న్ సంచలన వ్యాఖ్యలు
Shane Warne: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ మరోసారి వార్తల్లో నిలిచాడు. 1994 పాక్ పర్యటన సందర్భంగా నాటి పాక్ కెప్టెన్ సలీం మాలిక్ తనకు లంచం(2, 76,000 అమెరికన్ డాలర్లు) ఆఫర్ చేశాడని సంచలన వ్యాఖ్యలు చేశాడు. సామర్ధ్యం మేరకు ఆడకూడదని, తనతో పాటు మరో ఆసీస్ ఆటగాడు టిమ్ మేకు వార్నింగ్ కూడా ఇచ్చాడని బాంబు పేల్చాడు. త్వరలో అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానున్న తన డాక్యుమెంటరీ "షేన్" కోసం ఇచ్చిన ఇంటర్వూలో ఈ సంచలన ఆరోపణలు చేశాడు. నాటి పాక్ పర్యటనలో భాగంగా కరాచీ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో సామర్ధ్యం మేరకు బౌలింగ్ చేయకూడదని, వికెట్లు తీసే ప్రయత్నం చేయకుండా వైడ్ బంతులు విసరాలని తనతో పాటు టిమ్ మేకు సలీం మాలిక్ ప్రలోభాలతో కూడిన వార్నింగ్ ఇచ్చాడని వార్న్ పేర్కొన్నాడు. ఆ మ్యాచ్‌లో పాక్ ఓటమి అంచుల్లో ఉండిందని, అదే జరిగితే ఆ దేశ ఆటగాళ్ల ఇళ్లపై అభిమానులు దాడి చేస్తారని మాలిక్ తనకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడని వార్న్ తెలిపాడు. సదరు విషయాన్ని తాను, మే.. నాటి ఆసీస్ కెప్టెన్ మార్క్ టేలర్ దృష్టికి తీసుకెళ్లామని పేర్కొన్నాడు. వార్న్ చేసిన ఈ వ్యాఖ్యలతో పాక్ క్రికెట్లో ప్రకంపనలు మొదలయ్యాయి. వివాదాలకు కేంద్ర బిందువు అయిన వార్న్ ఆరోపణల్లో ఎంత మేరకు నిజం ఉందో వేచి చూడాలి. కాగా, వార్న్.. 2003 ప్రపంచకప్‌కు ముందు డోపింగ్ పరీక్షలో పట్టుబడి ఏడాది నిషేధానికి గురైన సంగతి తెలిసిందే. చదవండి: ఎగిరెగిరిపడకండి.. ఇంకో మ్యాచ్ ఉంది.. సఫారీలకు బుమ్రా స్ట్రాంగ్ వార్నింగ్ -
కోచ్ కావాలనే ఓడిపోమన్నాడు.. మనికా బాత్రాపై చర్యలు!
Manika Batra: టోక్యో ఒలింపిక్స్ అర్హత పోటీల్లో తనను కావాలనే ఓడిపోమన్నాడంటూ భారత కోచ్ సౌమ్యదీప్ రాయ్‌పై ‘మ్యాచ్ ఫిక్సింగ్’ ఆరోపణలు చేసిన టీటీ ప్లేయర్ మనికా బాత్రా చిక్కులో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనూహ్యంగా ఈ వివాదంపై దృష్టి పెట్టిన అంతర్జాతీయ టీటీ సమాఖ్య (ఐటీటీఎఫ్) విచారణ జరుపుతోంది. ఇప్పటికే దీనిపై సమావేశం నిర్వహించిన ఐటీటీఎఫ్, మనికాపై చర్యలు తీసుకోవచ్చు. చదవండి: T20 World Cup 2021: టాస్ గెలిస్తేనే విజయం.. శ్రీలంక లాంటి జట్లకు నష్టం: జయవర్ధనే -
పంజాబ్ ఆటగాడిపై మ్యాచ్ ఫిక్సింగ్ అనుమానం.. బీసీసీఐ సీరియస్
-
పంజాబ్ ఆటగాడిపై మ్యాచ్ ఫిక్సింగ్ అనుమానం.. బీసీసీఐ సీరియస్
Deepak Hooda In Match Fixing Scanner: ఐపీఎల్-2021 సెకెండ్ ఫేస్‌లో భాగంగా నిన్న(సెప్టెంబర్ 21) పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో రాజస్థాన్ రాయల్స్ 2 పరగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌కు కొద్ది గంటల ముందు పంజాబ్ కింగ్స్ ఆటగాడు దీపక్ హూడా తన ఇన్‌స్టా ఖాతాలో చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో హూడా తన ఇన్‌స్టాలో ఓ పోస్ట్ చేశాడు. అందులో అతను పంజాబ్ కింగ్స్ తుది జట్టులో ఆడుతున్నట్లు స్పష్టం చేశాడు. బీసీసీఐ నిబంధనల ప్రకారం ఏదైనా జట్టు తుది వివరాలు టాస్ వేసే సమయంలో కెప్టెన్ రిఫరీకి అందిస్తాడు. జట్టులో రెగ్యులర్ ఆటగాళ్లైనా సరే తుది జట్టు వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ టాస్కు ముందు బహిర్గతం చేయకూడదు. ఈ నేపథ్యంలో ఈ పంజాబ్ కింగ్స్ ఆల్‌రౌండర్ తుది జట్టు వివరాలను బయటపెట్టడంపై బీసీసీఐ సీరియస్‌గా ఉంది. నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా అనుమానాస్పద ప్రవర్తన కారణంగా అతన్ని యాంటీ కరప్షన్ యూనిట్ (ఏసీయూ) నిఘా పరిధిలోకి తీసుకువచ్చింది. జట్టు, పిచ్ సంబంధిత వివరాలను బహిర్గతం చేయడం బీసీసీఐ నిబంధనల ఉల్లంఘన కిందికి వస్తుందని, అన్నీ తెలిసి కూడా దీపక్ హూడా తుది జట్టు వివరాలను సోషల్ మీడియాలో వెల్లడించడం నేరమని ఏసీయూ పేర్కొంది. రంజీ జట్టు కెప్టెన్‌గా, గతంలో పలు ఐపీఎల్ జట్లకు ప్రాతినిధ్యం వహించిన ఆటగాడిగా ఎంతో అనుభవమున్న హూడా ఇలా చేయడం అందరినీ ఆశ్చర్యపరిచిందని, ఈ పోస్ట్‌ను అతను అనుకోకుండా పెట్టాడా లేదా బుకీలకు ఏదైనా హింట్ ఇద్దామని చేశాడా అన్న కోణంలో ఆరా తీస్తున్నామని ఏసీయూ పేర్కొంది. ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్‌లో పంజాబ్ జట్టు ఆఖరి ఓవర్లో 4 పరుగులు చేయాల్సి దశలో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఓటమి పాలైంది. ఆఖర్లో బ్యాటింగ్‌కు వచ్చిన దీపక్ హూడా డకౌట్‌గా వెనుదిరిగాడు. చదవండి: క్రికెట్ రూల్స్‌లో కీలక మార్పు చేసిన ఎంసీసీ -
వింబుల్డన్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం
లండన్: వింబుల్డన్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందన్న అనుమానాలు కలకలం రేపుతున్నాయి. ఒక సింగిల్స్ మ్యాచ్, మరో డబుల్స్ మ్యాచ్‌పై ఫిక్సింగ్ ఆరోపణలు ఉన్నాయి. ఈ రెండు మ్యాచ్‌ల్లో పెద్ద ఎత్తున బెట్టింగ్ జరిగినట్లు గుర్తించిన ఇంటర్నేషనల్ టెన్నిస్ ఇంటెగ్రిటీ ఏజెన్సీ (ఐటీఐఏ) విచారణ జరుపుతోంది. విషయంలోకి వస్తే.. మెన్స్ డబుల్స్ ఫస్ట్ రౌండ్ మ్యాచ్ అనుమానాస్పద లిస్ట్‌లో ఉంది. లైవ్ బెట్స్ చాలా ఎక్కువగా ఉన్న సమయంలో ఈ మ్యాచ్ ఫేవరెట్ జోడీ ఓడిపోయినట్లు పలు బెట్టింగ్ సంస్థలు ఫిర్యాదు చేశాయి. ఈ జోడీ తొలి సెట్ గెలిచి తర్వాతి రెండు సెట్లను ఓడిపోయింది. ఇక మరొకటి జర్మన్ ప్లేయర్ ఆడిన ఫస్ట్ రౌండ్ సింగిల్స్ మ్యాచ్. అయితే ఆ ప్లేయర్ ప్రత్యర్థిపై ఈ మ్యాచ్‌లో అనుమానాలు ఉన్నాయి. సెకండ్ సెట్ తర్వాత పరిస్థితిపై ఐదు అంకెలలో బెట్టింగ్ నడిచినట్లు తేలింది. ఈ మ్యాచ్‌లో సర్వీస్ గేమ్స్ సంఖ్యపై కూడా ప్రత్యేక బెట్స్ నడిచాయి. దీంతోపాటు ఈ ఏడాది ఏప్రిల్, జూన్ మధ్య మొత్తం 11 మ్యాచ్‌లపై ఫిక్సింగ్ ఫిర్యాదులను ఐటీఐఏ అందుకుంది. -
ఫ్రెంచ్ ఓపెన్‌లో మ్యాచ్ ఫిక్సింగ్.. రష్యా ప్లేయర్ అరెస్టు
పారిస్: గతేడాది ఫ్రెంచ్ ఓపెన్‌లో మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రష్యా క్రీడాకారిణి యానా సిజికోవాను శుక్రవారం ఫ్రెంచ్ పోలీసులు అరెస్టు చేశారు. 2020 ఫ్రెంచ్ ఓపెన్ మహిళల డబుల్స్ తొలి రౌండ్ పోటీల్లో(సెప్టెంబర్ 30) సిజికోవా.. తన అమెరికన్ పార్ట్నర్ మాడిసన్ బ్రెంగ్లీలో కలిసి ఉద్దేశపూర్వకంగా మ్యాచ్ ఓడినట్లు ఆరోపణలు ఎదుర్కొంది. ఈ మ్యాచ్‌లో సిజాకోవా జోడీ.. రొమేనియా జంట ఆండ్రియా మీటు, పాట్రిసియా మారియా చేతిలో 6-7, 4-6 తేడాతో ఓటమిపాలైంది. రెండో సెట్ అయిదో పాయింట్ వద్ద సిజికోవా మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై గతేడాది అక్టోబర్‌లో విచారణ ప్రారంభించిన పోలీసులు, తాజాగా ఆమెపై ఆరోపణలు రుజువు కావడంతో అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్‌లో కూడా సిజికోవా తొలి రౌండ్లోనే ఓటమిపాలైంది. నిన్న (గురువారం) సాయంత్రం జరిగిన మ్యాచ్‌లో రష్యా భామ ఎకాటరీనా అలెక్సాండ్రోవాతో తొలిసారి జతకట్టిన సిజికోవా.. 1-6, 1-6తో ఆస్ట్రేలియా జోడీ స్టార్మ్ సాండర్స్, అజ్లా టామ్లజనోవిక్ చేతిలో పరాజయం పాలైంది. ప్రస్తుతం డబుల్స్ ర్యాంకింగ్స్‌లో 101 స్థానంలో కొనసాగుతున్న సిజికోవా.. ఈ ఏడాది ఇప్పటికే ఏడుగురు పార్ట్నర్లను మార్చి వరుస పరాజయాలను మూటకట్టుకుంది. చదవండి: ఆట కోసం ఆస్తులమ్ముకున్నాడు.. దేశాన్ని కూడా వీడాడు -
Nuwan Zoysa: మ్యాచ్ ఫిక్సింగ్.. మాజీ క్రికెటర్‌పై ఆరేళ్ల నిషేధం
దుబాయ్: శ్రీలంక మాజీ క్రికెటర్ నువాన్ జోయ్సాపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిషేధం విధించింది. మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో దోషిగా తేలడంతో ఆరేళ్లపాటు క్రికెట్ ఆడకుండా నిషేధిస్తూ ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఐసీసీ అవినీతి నిరోధక విభాగం నువాన్ జోయ్సా తప్పు చేసినట్లు నిర్ధారించింది. ఏడాదిన్నర కాలం నుంచి అతడిపై ఆరోపణలు ఉన్నాయి. టీ10 లీగ్‌లో చేసిన ఫిక్సింగ్ ఆరోపణలకుగానూ జోయ్సాపై నిషేధం విధించినట్లు తెలిపింది. శ్రీలంక తరపున1997-2007 మధ్య అంతర్జాతీయ క్రికెట్ ఆడిన జోయ్సా 30 టెస్టుల్లో 64 వికెట్లు.. 95 వన్డేల్లో 108 వికెట్లు తీశాడు కాగా జోయ్సాపై విధించిన ఆరేళ్ల నిషేధం 31 అక్టోబర్ 2018 నుంచి అమల్లోకి రానుంది. ఈ మేరకు ఐసీసీ యాంటీ కరప్షన్ ట్రిబ్యునల్ ప్రకటన చేసింది. ఆర్టికల్ 2.1.1 నిబందన ప్రకారం.. ఎవరైనా ఫిక్సింగ్ చేయడానికి యత్నించడం, ఇతరులను ఫిక్సింగ్ చేసేందుకు ప్రోత్సహించడం, మ్యాచ్ ఫలితాలు మార్చేందుకు యత్నించడం... ఆర్టికల్ 2.1.4 ప్రకారం, ఇతరులకు సూచనలు చేయడం, తప్పిదాలు చేసేందుకు ప్రోత్సహించడం, నేరుగా ఫిక్సింగ్‌కు పాల్పడటం, మ్యాచ్ ఫలితాలు మార్చివేసేందుకు యత్నించడం లాంటి యత్నాలు ఆర్టికల్ 2.1 కిందకి వస్తాయి. కాగా జోయ్సా ఐపీఎల్లో డెక్కన్ చార్జర్స్‌కు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. చదవండి: యూఏఈ క్రికెటర్‌పై ఐసీసీ ఐదేళ్ల నిషేధం -
మ్యాచ్ ఫిక్సింగ్.. ఎనిమిదేళ్ల నిషేధం
దుబాయ్: మ్యాచ్ ఫిక్సర్లపై అంతర్జాతీయ క్రికెట్ మండలి కొరడా ఝుళిపించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) మాజీ కెప్టెన్ మొహమ్మద్ నవీద్, అతని సహచరుడు షైమన్ అన్వర్‌లపై ఎనిమిదేళ్ల నిషేధం విధించింది. వీరిద్దరు 2019లో జరిగిన టి20 ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు తేలింది. ఆరోపణలు రావడంతో అదే ఏడాది ఇద్దరినీ తాత్కాలికంగా సస్పెండ్ చేసిన ఐసీసీ... తదుపరి అవినీతి నిరోధక శాఖ విచారణ అనంతరం తుది నిర్ణయం వెలువరిచింది. ఫిక్సింగ్‌కు పాల్పడిన వీరిద్దరు విచారణకు కూడా సహకరించకపోవడంతో ఐసీసీ ఈ చర్య తీసుకుంది. చదవండి: అతడు ఎన్నిసార్లు విఫలమైనా ఛాన్స్.. కానీ పాపం ‘రాననుకున్నారా! రాలేననుకున్నారా!!’ -
పాక్ క్రికెటర్ ఉమర్ అక్మల్‌కు ఊరట
కరాచీ: పాకిస్తాన్ సీనియర్ ఆటగాడు ఉమర్ అక్మల్‌కు ఊరట లభించింది. పీసీబీ అతనిపై విధించిన బ్యాన్‌ను కోర్ట్ ఆప్ ఆర్బిర్టేషన్ ఫర్ స్పోర్ట్స్(సీఏఎస్) 12 నెలలకు తగ్గించడంతో పాటు రూ. 42 లక్షల జరిమానా విధించింది. అయితే పీసీబీ యాంటీ కరప్షన్ కోడ్ నిర్వహించే రీహాబిటేషన్ సెషన్లో పాల్గొన్న తర్వాతే ఉమర్ అక్మల్‌ను క్రికెట్ ఆడేందుకు అనుమతి ఇస్తామని పీసీబీ తెలిపింది. తాజాగా విధించిన 12 నెలల నిషేధం ఉమర్ అక్మల్ ఇప్పటికే పూర్తి చేసి ఉండడంతో త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టనున్నాడు. కాగా ఉమర్ అక్మల్ 2019 అక్టోబర్‌లో పాక్ తరపున చివరి వన్డే ఆడాడు. ఇప్పటివరకు పాక్ తరపున అక్మల్ 121 వన్డేల్లో 3194 పరుగులు, 84 టీ20ల్లో 1690 పరుగులు సాధించాడు. అక్మల్ ప్రస్తుతం 30ఏళ్ల వయసులో ఉన్న అక్మల్ తిరిగి జట్టులో స్థానం సంపాదిస్తే మరో 5నుంచి 6ఏళ్ల పాటు ఆడే అవకాశం ఉంది. 2019లో పాకిస్తాన్ సూపర్ లీగ్ సందర్భంగా బుకీల గురించి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కు తెలపకపోవడంతో పాటు, పీసీబీ అవినీతి నిరోధక చట్టాన్ని ఉల్లంఘించినందుకు గానూ అక్మల్‌పై ఏప్రిల్‌లో మూడేళ్ల సస్పెన్షన్ విధించారు. తన తప్పును అంగీకరించిన అక్మల్ తనను క్షమించాలంటూ జూలై 2020లో సీఏఎస్కు అప్పీల్ చేయగా.. అప్పట్లో కోర్టు 18 నెలలకు కుదించింది. తాజాగా అక్మల్ అభ్యర్థనను మరోసారి పరిగణలోకి తీసుకొన్న సీఏఎస్ నిషేధాన్ని 12 నెలలకు తగ్గించడంతో పాటు జరిమానా విధించింది. చదవండి: పాస్‌పోర్టు గల్లంతు: కీలక టోర్నికి కెప్టెన్ దూరం? స్వదేశం.. విదేశం.. రెండింట్లో కోహ్లినే టాప్ -
ఆధారాల్లేవ్
కొలంబో: ఒక రాజకీయ నాయకుడి ఆరోపణలను ప్రామాణికంగా తీసుకొని మ్యాచ్ ఫిక్సింగ్పై విచారణ పేరుతో తమ దిగ్గజ క్రీడాకారులను అవమానిస్తున్నారంటూ దేశంలో తీవ్ర విమర్శలు రావడంతో శ్రీలంక ప్రభుత్వం వెనక్కి తగ్గింది. 2011 వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో లంక పరాజయంపై ఇప్పటి వరకు జరిపిన దర్యాప్తును నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఆరోపణలకు సంబంధించి ఎలాంటి కనీస ఆధారాలు లేవని, ఇకపై ఎలాంటి విచారణ ఉండబోదని లంక పోలీసులు స్పష్టం చేశారు. మాజీ కెప్టెన్లు కుమార సంగక్కర, మహేలా జయవర్ధనేల వాంగ్మూలాలు తీసుకున్న తర్వాత ఇక సందేహించేందుకు ఎలాంటి అవకాశం కనిపించలేదని వారు వెల్లడించారు. భారత్ గెలిచిన నాటి ఫైనల్‌ను కొందరు ఫిక్స్ చేశారంటూ అప్పటి క్రీడా మంత్రి మహిదానంద అలుత్గమగే ఆరోపించారు. ఆ వెంటనే ప్రభుత్వం దీనిపై విచారించమంటూ స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ డివిజన్‌ను ఆదేశించింది. ‘మహిదానంద చేసిన 14 ఆరోపణల్లో ఒక్కదానికీ కనీస ఆధారం లేదు. మున్ముందు ఆటగాళ్లను ప్రశ్నించాల్సిన అవసరమూ రాదు. మా అంతర్గత చర్చల తర్వాత విచారణను ముగించాలని నిర్ణయించుకున్నాం. మా నివేదికను కేంద్ర క్రీడా శాఖ కార్యదర్శికి పంపిస్తాం’ అని దర్యాప్తు అధికారి జగత్ ఫొన్సెకా స్పష్టం చేశారు. నాటి చీఫ్ సెలక్టర్ అరవింద డిసిల్వాతో పాటు కెప్టెన్ సంగక్కర, సీనియర్ బ్యాట్స్‌మన్ జయవర్ధనే, ఓపెనర్ తరంగలను పోలీసులు విచారించారు. ఫైనల్ మ్యాచ్ చివరి నిమిషంలో తుది జట్టులో నలుగురు ఆటగాళ్లను మార్చడంపై సందేహాలున్నాయని మహిదానంద ఆరోపించారు. ‘దీనిపై కూడా స్పష్టమైన వివరణ లభించింది. కాబట్టి జట్టులోని మిగతా ఆటగాళ్లను విచారించడం కూడా అనవసరమని భావించాం’ అని ఫొన్సెకా చెప్పారు. ఫైనల్ జరిగిన తొమ్మిదేళ్ల తర్వాత ఇలా వ్యవహరించడంపై తొలి రోజునుంచే పలువురు క్రికెట్ అభిమానులు దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శించారు. మాకూ అనుమానాల్లేవు... 2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఫలితంపై తమకు ఎలాంటి సందేహాలు లేవని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అవినీతి నిరోధక విభాగం (ఏసీయూ) కూడా స్పష్టం చేసింది. మ్యాచ్ జరిగిన తీరును అనుమానించాల్సిన అవసరమే లేదని ఐసీసీ ఏసీయూ జనరల్ మేనేజర్ అలెక్స్ మార్షల్ చెప్పారు. ‘ఈ మ్యాచ్ గురించి ఇటీవల వచ్చిన ఆరోపణలపై మేం కూడా దృష్టి పెట్టాం. కొత్తగా విచారణ జరిపేందుకు కావాల్సిన అంశాలు కూడా ఏమీ లేవు’ అని ఆయన పేర్కొన్నారు. -
2011 ఫిక్సింగ్ : దర్యాప్తు నిలిపివేసిన శ్రీలంక
కొలంబొ : భారత్, శ్రీలంక మధ్య జరిగిన 2011 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ ఫిక్స్ అయిందంటూ శ్రీలంక మాజీ క్రీడల మంత్రి మహిందనంద అలత్గమగే సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఫొన్సెక నేతృత్వంలోని బృందం శ్రీలంక ఆటగాళ్లను విచారిస్తోంది. తాజాగా మ్యాచ్ ఫిక్స్ అయిందంటూ వచ్చిన ఆరోపణలకు తగిన ఆధారాలు లభించకపోవడంతో దర్యాప్తును నిలిపివేస్తున్నట్లు శ్రీలంక క్రీడాశాఖ తెలిపింది.(‘సరైన టైమ్‌లో కెప్టెన్‌గా తీసేశారు’) కాగా ఈ కేసులో ఇప్పటికే మ్యాచ్ ఫిక్స్ అయిందంటూ ఆరోపణలు చేసిన మహిదానందతో పాటు అప్పటి కెప్టెన్ కుమార సంగక్కరతో పాటు మాజీ ఆటగాళ్లు మహేళ జయవర్దెనేతో పాటు అప్పటి సెలక్షన్ కమిటీ ఛైర్మన్, మాజీ ఆటగాడు అరవింద డిసిల్వాలను విచారించింది. విచారణలో భాగంగా వారు చెప్పిన విషయాలను పరిగణలోకి తీసుకున్నామని.. వారి సమాధానాలతో తాము సంతృప్తి చెందినట్లు ఫొన్సెక నేతృత్వంలోని స్పెషల్ ఇన్వస్టిగేషన్ టీమ్ పేర్కొంది. ఈ కేసుకు సంబంధించిన విచారణను ప్రస్తుతానికి నిలిపివేస్తున్నాం అంటూ శ్రీలంక క్రీడాశాఖ తెలిపింది.( నేడు విచారణకు సంగక్కర ) కాగా 2011 మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతంపై అప్పటి కెప్టెన్ కుమార సంగక్కరను దర్యాప్తు విభాగం సుమారు 10 గంటల పాటు విచారించింది. ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్‌లో రెండు సార్లు టాస్ వేయడంపై గల కారణాలపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. విచారణ తర్వాత మీడియాతో మాట్లాడిన సంగక్కర.. నిజనిజాలు త్వరలోనే వెలుగు చూస్తాయని చెప్పి వెళ్లిపోయాడు. అనంతరం లంక మాజీ క్రికెటర్, మాజీ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అరవింద డిసిల్వాను అధికారులు ఆరు గంటల పాటు విచారించారు. ప్రపంచకప్ 2011 ఫైనల్ సమయంలో మ్యాచ్ ఫిక్సింగ్ సంబంధించిన వివరాలపై కూపీ లాగారు. మంగళవారం సమన్లు జారీ చేసిన పోలీసులు ఆయన స్టేట్మెంట్ను రికార్డు చేశారు. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ కౌన్సిల్ సైతం స్వతంత్ర విచారణ జరిపించాలని డిసిల్వా డిమాండ్ చేశారు. అవసరమైతే విచారణ కోసం భారత్‌కు వస్తానని పేర్కొన్నారు. ఫిక్సింగ్ ఆరోపణల్లో భాగంగా శ్రీలంక బ్యాటింగ్ లెజెండ్ మహేలా జయవర్ధనే విచారణకు హాజరయ్యాడు. అందుకోసం కొలంబోలోని సుగతదాసా స్టేడియంలోని క్రీడా మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు విభాగానికి జయవర్ధనే హజరయ్యాడు. జయవర్దెనే చెప్పిన విషయాలను దర్యాప్తు బృందం రికార్డు చేసుకుంది. ఆ మ్యాచ్‌లో జయవర్దెనే శతకం సాధించిన సంగతి తెలిసిందే. (2011 ఫైనల్ ఫిక్సింగ్? దర్యాప్తు వేగవంతం) కాగా నాటి ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 274/6 స్కోరు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్.. స్టార్ బ్యాట్స్‌మెన్ సెహ్వాగ్ (0), సచిన్ (18)ల వికెట్లను త్వరగా కోల్పోయింది. ఆ క్లిష్ట స్థితిలో గౌతమ్ గంభీర్(97) అద్భుత పోరాటానికి.. ధోనీ ధనాధన్ ఇన్నింగ్స్ తోడవడంతో ఆరు వికెట్లతో టీమిండియా విజయం సాధించి 28 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై రెండో ప్రపంచకప్‌ను సాధించింది. -
2011 ఫైనల్ ఫిక్సింగ్? దర్యాప్తు వేగవంతం
కొలంబో : వన్డే ప్రపంచకప్-2011 ఫైనల్లో భారత్‌కు శ్రీలంక అమ్ముడుపోయిందని సంచలన ఆరోపణలు చేసిన ఆ దేశ మాజీ మంత్రి మహిదానంద అలుత్‌గమగేను పోలీసులు విచారించారు. భారత్, శ్రీలంక మధ్య జరిగిన 2011 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ ఫిక్స్ అయిందంటూ మాజీ మహిదానంద సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఆరోపణలపై శ్రీలంక ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దీనిపై దర్యాప్తు వేగవంతం చేసిన అధికారులు గురువారం మహిదానందను విచారించారు. (2011 ఫైనల్ ఫిక్సయింది!) ‘భారత్, శ్రీలంక మధ్య జరిగిన ప్రపంచకప్-2011 ఫైనల్ మ్యాచ్ ఫిక్సయిందని నేను అనుమానం వ్యక్తం చేశాను. నా అనుమానంపై విచారణ చేయాల్సిందిగా పోలీసులను కోరాను. అంతేకాకుండా ఫైనల్ మ్యాచ్ ఫిక్సయిందని అక్టోబర్ 30, 2011న ఐసీసీకి ఫిర్యాదు చేసిన కాపీని కూడా ఇచ్చాను’ అని మహిదానంద పేర్కొన్నారు. ఇక ఈ మాజీ మంత్రి ఆరోపణలను లంక మాజీ ఆటగాళ్లు ఇదివరకే ఖండించిన విషయం తెలిసందే. సర్కస్ మొదలైందని మహేల జయవర్దనే పేర్కొనగా.. ‘ప్రపంచకప్ ఫైనల్‌ను ఫిక్స్ చేయడం అంత చిన్న విషయమేమీ కాదు. మ్యాచ్ ఆడిన తుది జట్టులో భాగం కాని వ్యక్తి అలా ఎలా చేయగలడో మాకైతే తెలీదు. 9 ఏళ్ల తర్వాత ఇప్పుడైనా మాకు జ్ఞానోదయం కలిగించండి’ అంటూ కుమార సంగక్కర వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. (ఆమెతో వీలైతే కాఫీ.. కుదిరితే డేట్) -
ఫిక్సింగ్ ఆరోపణలపై బీసీసీఐ విచారణ జరపాలి
కొలంబో: 2011 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్ ఫిక్స్ అయ్యిందంటూ శ్రీలంక మాజీ క్రీడల మంత్రి మహిందనంద అలుత్గమగే చేసిన ఆరోపణలపై ఆ దేశ మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. ఇప్పటికే శ్రీలంక మాజీ క్రికెటర్లు కుమార సంగక్కరా, మహేళ జయవర్ధనే ఆ ఆరోపణల్ని తీవ్రంగా ఖండించగా, తాజాగా వారి జాబితాలో మరో లంక మాజీ క్రికెటర్ అరవింద డిసిల్వా చేరాడు. అవి ఎటువంటి ఆధారాలు లేని తప్పుడు ఆరోపణలంటూ ధ్వజమెత్తిన డిసిల్వా.. వాటిని ప్రజలు నమ్మవద్దని పేర్కొన్నాడు. అదే సమయంలో ‘ఫిక్సింగ్’ ఆరోపణలపై భారత ప్రభుత్వం, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)లు నిష్పాక్షిక విచారణ జరపాలని డిమాండ్ చేశాడు. ‘ఇవి చాలా సీరియస్ ఆరోపణలు. చాలామంది ప్రజల్ని ప్రభావితం చేస్తాయి. ఇది కేవలం క్రికెటర్లు, సెలక్టర్లు, టీమ్ మేనేజ్మెంట్ కోసం మాత్రమే కాదు. క్రికెట్ గేమ్‌లో మరింత పారదర్శకత తీసుకురావడం కోసం పూర్తిస్థాయి విచారణ చేయాల్సి ఉంది. ఆ మ్యాచ్‌లో భారత గెలవడానికి అన్ని అర్హతలు ఉన్నాయి. మేము మా ప్రపంచ కప్ విజయాన్ని ఎంతో ఆదరించినట్లే, సచిన్ టెండూల్కర్ వంటి ఆటగాళ్ళు 2011 వరల్డ్‌కప్ విజయాన్ని జీవితాంతం ఆ క్షణాలను ఎంతో ఆస్వాదిస్తారు. భారత్‌లోని కోట్లాది మంది క్రికెట్ అభిమానుల అభిరుచి, ఆసక్తి నాకు తెలుసు. ఈ ఆరోపణలపై భారత ప్రభుత్వం, బీసీసీఐ నిష్పాక్షిక విచారణ జరిపి నిజాలను వెలికి తీయండి. విచారణ పూర్తయ్యే వరకూ ప్రజలు లేని పోని అపోహల్ని నమ్మవద్దు. విచారణ పూర్తయితే అన్ని బయటకొస్తాయి’ అని 1996 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో సెంచరీ సాధించి లంక టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన డిసిల్వా పేర్కొన్నాడు. కొన్ని రోజుల క్రితం స్థానిక టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహిందనంద మాట్లాడుతూ ‘మీకు నేనో విషయం చెప్పాలనుకుంటున్నా. 2011 ప్రపంచకప్ అమ్ముడుపోయింది. ఈ విషయాన్ని నేను క్రీడల మంత్రిగా ఉన్నప్పుడే చెప్పాను. (వాళ్లెందుకు అంతగా స్పందిస్తున్నారు?) ఫైనల్ మ్యాచ్ మేం గెలవాల్సింది. అయితే ఇది తెలియజేయడం నా బాధ్యతని చెబుతున్నా... ఆ మ్యాచ్ ఫిక్సయింది. ఇది వాస్తవం’ అని సరికొత్త వివాదానికి తెరలేపాడు. దాంతో ఆ మ్యాచ్‌లో సభ్యులైన జయవర్ధనే, సంగక్కరాలకు చిర్రెత్తుకొచ్చింది. ‘ఎన్నికలకు ముందు ఈ తరహా సర్కస్‌లు మొదలు కావడం కొత్త కాదు.. మళ్లీ సర్కస్ చేస్తున్నారు’ అని జయవర్ధనే విమర్శించగా, ప్రపంచకప్ ఫైనల్‌ను ఫిక్స్ చేయడం అంత చిన్న విషయమేమీ కాదు. మ్యాచ్ ఆడిన తుది జట్టులో భాగం కాని వ్యక్తి అలా ఎలా చేయగలడో మాకైతే తెలీదు. 9 ఏళ్ల తర్వాత ఇప్పుడైనా మాకు జ్ఞానోదయం కలిగించండి’ అంటూ మాజీ కెప్టెన్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. దీనిపై ఇప్పటికే శ్రీలంక ప్రభుత్వం విచారణ ప్రారంభించగా, భారత ప్రభుత్వం, బీసీసీఐ కూడా విచారణ జరపాలని డిసిల్వా సూచించాడు. (2011 ఫైనల్ ఫిక్సయింది!) -
వాళ్లెందుకు అంతగా స్పందిస్తున్నారు?
కొలంబో: భారత్, శ్రీలంక మధ్య జరిగిన 2011 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ ఫిక్స్ అయిందంటూ ఆరోపించిన లంక మాజీ మంత్రి మహిదానంద అలుత్గమగే తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని మరోసారి స్పష్టం చేశారు. ఆరోపణల్లో తాను ఏ క్రికెటర్ గురించీ ప్రత్యేకంగా ప్రస్తావించలేదని... కుమార సంగక్కర, మహేల జయవర్ధనే ఎందుకు అతిగా స్పందిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ‘సర్కస్ మొదలైందని మహేల చెబుతున్నాడు. ఈ విషయంలో వారిద్దరు ఎందుకు ఇంత అతిగా స్పందిస్తున్నారో నాకర్థం కావడం లేదు. పైగా నేను ఏ ఆటగాడి పేరు తీసుకోలేదు. మ్యాచ్ ఫిక్సింగ్ గురించి గతంలోనూ అర్జున రణతుంగ కూడా బహిరంగంగానే మాట్లాడారు. ఇదేమీ మొదటిసారి కాదు’ అని మహిదానంద వ్యాఖ్యానించారు. మరోవైపు తాజా వివాదంపై జయవర్ధనే మళ్లీ స్పందించాడు. ‘ప్రపంచకప్ ఫైనల్‌ను ఫిక్స్ చేయడం అంత చిన్న విషయమేమీ కాదు. మ్యాచ్ ఆడిన తుది జట్టులో భాగం కాని వ్యక్తి అలా ఎలా చేయగలడో మాకైతే తెలీదు. 9 ఏళ్ల తర్వాత ఇప్పుడైనా మాకు జ్ఞానోదయం కలిగించండి’ అంటూ మాజీ కెప్టెన్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. ఈ ఆరోపణలపై శ్రీలంక ప్రభుత్వం విచారణ చేపడుతున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. -
2011 ఫైనల్ ఫిక్సయింది!
కొలంబో: శ్రీలంక మాజీ క్రీడల మంత్రి మహిందనంద అలుత్గమగే 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌పై ఆరోపణలు గుప్పించారు. భారత్, శ్రీలంకల మధ్య జరిగిన టైటిల్ పోరు ఫిక్సయిందన్నారు. దీనిపై అప్పటి లంక సారథి కుమార సంగక్కర, మహేల జయవర్ధనే తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆరోపణలపై ఆధారాలు చూపాలని వారు డిమాండ్ చేశారు. స్థానిక టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహిందనంద మాట్లాడుతూ ‘మీకు నేనో విషయం చెప్పాలనుకుంటున్నా. 2011 ప్రపంచకప్ అమ్ముడుపోయింది. ఈ విషయాన్ని నేను క్రీడల మంత్రిగా ఉన్నప్పుడే చెప్పాను. 2011 లేదంటే 2012 ఏడాదో సరిగ్గా గుర్తుకు రావడం లేదు కానీ... ఫైనల్ మ్యాచ్ మేం గెలవాల్సింది. అయితే ఇది తెలియజేయడం నా బాధ్యతని చెబుతున్నా... ఆ మ్యాచ్ ఫిక్సయింది. ప్రజలు దీనిపై కలత చెందారని తెలుసు. దీనిపై ఏ చర్చకైనా నేను సిద్ధం’ అని అన్నారు. అయితే ఈ ఫిక్సింగ్‌లో లంక ఆటగాళ్లెవరూ పాల్గొనలేదని, కొన్ని వర్గాలు ఇందులో భాగమయ్యాయని చెప్పుకొచ్చారు. అప్పట్లో ఆయన క్రీడల మంత్రిగా పనిచేశారు. మాజీ మంత్రి ఆరోపణలపై జయవర్ధనే ట్విట్టర్లో స్పందించాడు. ‘ఎన్నికలొస్తే చాలు... ఇలాంటి సర్కస్ చేష్టలకు కొదవుండదు. మరి ఫిక్సర్ల పేర్లు, ఆధారాలు చూపాలిగా’ అని చురకలంటించాడు. ఆ ఫైనల్లో అతను సెంచరీ సాధించాడు. అప్పటి సారథి సంగక్కర సాక్ష్యాధారాలు చూపాలని డిమాండ్ చేశాడు. ‘మాజీ మంత్రి వద్ద ఉన్న ఆధారాలను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి, అవినీతి నిరోధక విభాగానికి సమర్పిస్తే విచారణ చేపట్టేందుకు వీలవుతుంది’ అని అన్నాడు. -
ముగ్గురు క్రికెటర్లపై ఫిక్సింగ్ ఆరోపణలు
కొలంబో: శ్రీలంకకు చెందిన ముగ్గురు క్రికెటర్లు మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గతంలో ముగ్గురు లంక క్రికెటర్లు ఫిక్సింగ్ పాల్పడినట్లు ఆరోపణలు రాగా, దానిపై అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) విచారణ చేపట్టింది. ఈ విషయాన్ని శ్రీలంక క్రీడామంత్రి డుల్లాస్ అలహుపెరుమా వెల్లడించారు. కాగా, ఆ క్రికెటర్లు ఎవరు అనే విషయాన్ని మాత్రం మంత్రి స్పష్టం చేయలేదు. తమ దేశ క్రికెట్లో ఈ తరహా ఆరోపణలు రావడం నిజంగా బాధకరమని డుల్లాస్ తెలిపారు. ‘ మా గౌరవ క్రీడామంత్రి ఏదైతో చెప్పారో దాన్ని మేము విశ్వసిస్తున్నాం. మా దేశానికి చెందిన ముగ్గురు క్రికెటర్లపై ఐసీసీ మ్యాచ్ ఫిక్సింగ్ విచారణ చేపట్టనుందనే విషయాన్ని మంత్రి ద్వారా తెలుసుకున్నాం. వారు ప్రస్తుతం జట్టులో ఉన్న క్రికెటర్లు కాదు’ అని శ్రీలంక క్రికెట్ బోర్డు(ఎస్ఎల్సీ) ఓ ప్రకటనలో తెలిపింది. (ఇంత ఆటవికమా: రోహిత్ శర్మ) ఇదిలా ఉంచితే, గతవారం డ్రగ్ కేసులో ఇరుక్కున్న షెహన్ మధుశంకాను శ్రీలంక పోలీసులు అరెస్ట్ చేయడంతో మరో కొత్త తలనొప్పి శ్రీలంక క్రికెట్ బోర్డుకు ఎదురైంది. ఈ ఘటనపై కూడా మంత్రి స్పందించారు. ‘ ఇది చాలా బాధాకరం. ఆ క్రికెటర్‌పై మేము చాలా ఆశలు పెట్టుకున్నాం. ఈ పరిస్థితుల్లో డ్రగ్ కేసులో దొరకడం నిజంగా బాధిస్తోంది’ అని డుల్లాస్ తెలిపారు. డ్రగ్ కేసులో ఇరుక్కున్నందున షెహన్ కాంట్రాక్ట్ రద్దయ్యింది.(యువీకి సరికొత్త తలనొప్పి) -
భారత క్రికెటర్లతో టచ్‌లో ఉన్నా: శ్రీశాంత్
న్యూఢిల్లీ: వివాదాస్పద పేసర్ శ్రీశాంత్ తన రీఎంట్రీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. ఈ ఏడాది సెప్టెంబర్‌తో అతనిపై ఉన్న ఏడేళ్ల నిషేధం తొలగిపోవడంతో పునరాగమనం కోసం చూస్తున్నాడు. ఈ క్రమంలోనే పలువురు భారత క్రికెటర్లతో టచ్‌లో ఉన్నట్లు శ్రీశాంత్ తాజాగా వెల్లడించాడు. ఐపీఎల్లో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో శ్రీశాంత్‌పై జీవితకాల నిషేధం విధించింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ). రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారన్న అభియోగాలపై శ్రీశాంత్ నిషేధం విధించారు. అయితే దీనిపై కోర్టులకెళ్లి సుదీర్ఘ పోరాటం చేసి పలుమార్లు తన జీవిత కాల నిషేధంపై అనుకూలంగా తీర్పులు తెచ్చుకున్నా బీసీసీఐకి అవకాశం ఇవ్వలేదు. అలానే అతనిపై ఉన్న జీవితకాల నిషేధాన్ని కొనసాగిస్తూ వచ్చింది. కాగా, గతేడాది శ్రీశాంత్‌పై విధించిన జీవితకాల నిషేధాన్ని ఏడేళ్లకు తగ్గిస్తూ బోర్డు అంబుడ్స్‌మన్ డీకే జైన్ ఆదేశాలిచ్చారు. దాంతో అతనిపై ఏడేళ్ల నిషేధ కాలం ఈ సెప్టెంబర్‌తో పూర్తి కానుంది. దీనిలో భాగంగా మాట్లాడిన శ్రీశాంత్.. ‘ పలువుర భారత క్రికెటర్లు నాతో టచ్‌లో ఉన్నారు. (ఆసీస్‌కు నంబర్‌వన్ ర్యాంక్ ఎలా ఇచ్చారు?) చాలా మంది క్రికెటర్లు నాతో మాట్లాడటానికి ఇష్టపడటం లేదు. కానీ వీరూ(సెహ్వాగ్) భాయ్, లక్ష్మణ్ భాయ్ నాతో మాట్లాడుతూనే ఉన్నారు. ముగ్గురు నుంచి-నలుగురు ప్లేయర్లు నాతో మాట్లాడున్నారు. వీరిలో సచిన్ టెండూల్కర్, గౌతం గంభీర్ కూడా ఉన్నారు. ఇటీవలే గంభీర్‌ను కలిశాను. మొన్నా మధ్య హర్భజన్ సింగ్(భజ్జీ)ని ఎయిర్‌పోర్ట్‌లో కలిశాను. ఆ సమయంలో భజ్జీకి ఒక విషయం చెప్పా. నేను తిరిగి క్రికెట్ ఆడినప్పుడు భజ్జీ స్పోర్ట్స్ కంపెనీ తయారు చేసిన బ్యాట్‌ను వాడతానని చెప్పాను. ఇంకా నాలో ఆశ చావలేదు. మళ్లీ భారత్‌కు ఆడతాననే ఆశ ఉంది. నా తొలి టార్గెట్ కేరళ జట్టులో ఆడటం. ఏదొక రోజు మెన్ ఇన్ బ్లూలో నన్ను నేను చూసుకుంటా’ అని శ్రీశాంత్ తెలిపాడు.2013 ఐపీఎల్ సందర్భంగా రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారన్న అభియోగాలపై శ్రీశాంత్, అజిత్ చండీలా, అంకిత్ చవాన్లపై బోర్డు క్రమశిక్షణ కమిటీ జీవిత కాలం నిషేధం విధించింది. అయితే, గతేడాది మార్చి 15న సుప్రీంకోర్టు దానిని పక్కన పెట్టింది. ఈ కేసు గత ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు బెంచ్ ముందుకు వెళ్లింది. జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ కేఎం జోసెఫ్‌లతో కూడిన బెంచ్... డీకే జైన్‌ను బీసీసీఐ అంబుడ్స్‌మన్‌గా నియమించింది.(టీమిండియా ఫీల్డింగ్ మాతోనే పోయింది!) దీనిలో భాగంగానే శ్రీశాంత్‌పై నిషేధాన్ని జైన్ ఏడేళ్లకు పరిమితం చేశారు. శ్రీశాంత్ 36 ఏళ్ల వయసుకు రావడం, అది ఒక పేసర్ కెరీర్ ముగింపు దశ కావడమే తన నిర్ణయానికి కారణమని ఉత్తర్వుల్లో జైన్ పేర్కొన్నారు. స్పాట్ ఫిక్సింగ్‌ను ప్రోత్సహించిన రీత్యా శ్రీశాంత్‌పై విధించిన నిషేధాన్ని బోర్డు గతంలో కోర్టు ఎదుట గట్టిగా సమర్థించుకుంది. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో తన రెండో ఓవర్లో 14 పరుగులు ఇచ్చేలా శ్రీశాంత్ ఫిక్సింగ్‌కు ఒప్పుకొన్నాడని, రూ.10 లక్షలు కూడా తీసుకున్నాడని బోర్డు న్యాయవాది పరాగ్ త్రిపాఠి కోర్టుకు టెలిఫోన్ సంభాషణల రికార్డును అందజేశారు. అయితే, ఇందుకు బలమైన ఆధారాలేమీ లేవంటూ క్రికెటర్ తరఫు న్యాయవాది ఖండించారు. శ్రీశాంత్ భారత్‌కు 27 టెస్టులు, 53 వన్డేలు, 10 టి20ల్లో ప్రాతినిధ్యం వహించాడు. 2007 టి20, 2011 వన్డే ప్రపంచ కప్‌లు గెలిచిన జట్టులో అతడు సభ్యుడు. -
మ్యాచ్ ఫిక్సింగ్ ఉచ్చులో మరో క్రికెటర్
కాబూల్: మ్యాచ్ ఫిక్సింగ్ ఉచ్చులో మరో క్రికెటర్ చిక్కుకున్నాడు. అఫ్గానిస్తాన్ వికెట్ కీపర్ షఫీఖుల్లా షఫాక్‌పై ఆరేళ్ల నిషేధం పడింది. రెండు లీగ్‌ల్లో మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు రుజువుకావడంతో అతనిపై నిషేధం విధిస్తున్నట్లు అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు(ఏసీబీ) వెల్లడించింది. 2018లో ఆరంభమైన అఫ్గాన్ ప్రీమియర్ లీగ్‌తో పాటు 2019లో బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో కూడా ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడు. దీనిపై అఫ్గాన్ క్రికెట్ బోర్డు అవినీతి నిరోధక విభాగం విచారణ చేపట్టగా తాను తప్పు చేసినట్లు అంగీకరించాడు. ఆటగాళ్ల ప్రవర్తన నియమావళిలోని నిబంధన 2.1.1ను అతను ఉల్లంఘించినట్లు తేల్చిన బోర్డు చర్యలు తీసుకుంది. ఫిక్సింగ్‌కు పాల్పడటం లేదా ఫిక్సింగ్ కార్యకలాపాల్లో పాల్గొనడం తదితర అంశాలపై తనను దోషిగా తేల్చింది. అలాగే నిబంధన 2.1.3ని కూడా షఫాక్ కూడా అతిక్రమించినట్లు ఏసీబీ తేల్చింది. (‘ఎల్బీల్లో ఆ నిబంధనకు చరమగీతం పాడాలి’) ఈ నిబంధన ప్రకారం మ్యాచ్ ఫిక్సింగ్ కోసం వివిధ రకాలుగా ప్రయత్నించడంతోపాటు బుకీలు తనను సంప్రదించిన విషయాన్ని ఉద్దేశ పూర్వకంగా దాచిపెట్టడం తదితర అభియోగాలు షఫాక్‌పై నమోదయ్యాయి. ఈ క్రమంలోనే అతనిపై విచారణ చేపట్టగా అవినీతికి పాల్పడినట్లు అంగీకరించాడు. దాంతో అతనిపై ఆరేళ్ల నిషేధాన్ని విధిస్తూ ఏసీబీ నిర్ణయ తీసుకుంది. అయితే 2009లో అధికారిక అంతర్జాతీయ వన్డే హోదా పొందిన తర్వాత అఫ్గానిస్తాన్ నుంచి ఫిక్సింగ్‌కు పాల్పడిన తొలి క్రికెటర్‌గా షఫాక్ నిలిచాడు. ఓవరాల్‌గా జాతీయజట్టు తరపున 24 వన్డేలు, 46 టీ20లను ఆడాడు. చివరిసారిగా బంగ్లాదేశ్‌తో తను ఆడాడు .గతేడాది సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 30 ఏళ్ల షషాక్ అఫ్గాన్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఇప్పుడు దోషిగా తేలి ఆరేళ్ల నిషేధం ఎదుర్కోవాల్సి రావడంతో షఫాక్కు ఇక క్రికెట్ సంబంధిత వ్యవహారాలకు దూరం కానున్నాడు. దాంతో అతని కెరీర్ ముగిసినట్లే. హార్డ్ హిట్టర్‌గా పేరు.. అఫ్గాన్‌కు వన్డే హోదా పొందిన క్రమంలోనే అతను జాతీయ జట్టు తరఫున అరంగేట్రం చేశాడు. అఫ్గాన్ క్రికెట్లో హార్డ్ హిట్టర్‌గా పేరుగాంచిన షఫాక్.. ఆ జట్టు సాధించిన పలు విజయాల్లో భాగమయ్యాడు. ప్రధానంగా ప్రపంచ దృష్టిని అఫ్గాన్ క్రికెట్ వైపు మళ్లించడంలో షఫాక్ కీలక పాత్ర పోషించాడనే చెప్పాలి. రషీద్ ఖాన్, మహ్మద్ నబీ తరహాలోనే షఫాక్ కూడా అఫ్గాన్ క్రికెట్‌కు వన్నె తెచ్చాడు. అంతర్జాతీయ రికార్డులేమీ సాధించకపోయినా దేశవాళీ మ్యాచ్‌ల్లో మాత్రం షఫాక్ విధ్వంసకర ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. 2017లో స్థానిక పారాగాన్ నంగర్హార్ చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా జరిగిన టోర్నమెంట్లో షఫాఖ్ ఆకాశామే హద్దుగా రెచ్చిపోయాడు. కేవలం 71 బంతుల్లోనే 21 సిక్సర్లు, 16 ఫోర్లతో ఏకంగా 214 పరుగులు చేశాడు. ఇక ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు 200 కావడం విశేషం. (మానసిక స్థయిర్యమే నా బలం: కోహ్లి) -
'అక్రమ్ అలా చేసుంటే అప్పుడే చంపేవాడిని'
లాహోర్ : తరచూ ఏదో ఒక వివాదంలో ఉండే పాకిస్తాన్ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్ మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ తనను మ్యాచ్ ఫిక్సింగ్ చేయాలని ఒత్తిడి తెచ్చి ఉంటే అతన్ని కచ్చితంగా చంపేసివాడినంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ జట్టులో కొంతమంది ఆటగాళ్లు ఇలాగే మ్యాచ్ ఫిక్సింగ్‌లకు పాల్పడి తమ కెరీర్‌ను నాశనం చేసుకున్నారని, దీంతో పాక్ క్రికెట్ మసకబారిదంటూ గతేడాది ఇదే సమయంలో అక్తర్ సంచలనమైన వ్యాఖ్యలు చేశాడు. ('ఆ మ్యాచ్‌లో మియాందాద్ వాడిన బ్యాట్ నాదే') తాజాగా అక్తర్ మరోసారి ఆ విషయాన్ని గుర్తుచేస్తూ..' వసీం అక్రమ్ ఒకవేళ నన్ను మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడాలని ఒత్తిడి తెచ్చి ఉంటే కచ్చితంగా అతన్ని నాశనం చేయడమో లేదా చంపేయాడానికి సిద్దపడేవాన్ని. కానీ అక్రమ్ అలాంటి ప్రతిపాధనతో నా ముందుకు ఎప్పుడు రాలేదు. మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుందామంటూ నా దగ్గరకు బూకీలు వచ్చిన ప్రతీసారి వారిని వెనక్కి పంపించాను.నేను పాకిస్తాన్‌ను ఎప్పుడూ మోసం చేయకూడదని భావించా. 21 మంది ఆడే ఆటలో ఎంతమంది మ్యాచ్ ఫిక్సర్లు ఉన్నారనేది ఎవరు చెప్పలేరు. అంతేగాక తాను అక్రమ్‌తో కలిసి 1990వ దశకంలో ఆడాను. అతను ఎప్పుడు తప్పుడు దారిని ఏంచుకోలేదు. తన అద్బుతమైన బౌలింగ్‌తో కష్టాల్లో ఉన్న పాక్ జట్టును ఎన్నోసార్లు గెలిపించాడు. (నా తమ్ముడు అప్పుడు.. ఇప్పుడు ఏం మారలేదు) అక్రమ్‌తో కలిసి ఎనిమిది సంవత్సరాలు ఆడిన విషయం నాకు బాగా గుర్తుంది. టాప్ ఆర్డర్ పని తాను చూసుకుంటానని.. నువ్వు టెయిలెండర్లను ఔట్ చేసే బాధ్యత నీదేనంటూ అక్రమ్ నాతో చెప్పేవాడు. బహుశా అందుకేనేమో క్రికెట్ ఆడే సమయంలో నాకు అక్రమ్‌ను గౌరవించాలని అనిపించలేదు. నన్ను బౌలింగ్ విషయంలో మాత్రం ఎప్పుడూ మెచ్చుకుంటాడని, బౌలింగ్‌లో వైవిధ్యం చూపించేలా ఎప్పుడూ ప్రోత్సహించేవాడు. ఆటకు దూరమైన తర్వాత నేను అక్రమ్‌ను పర్సనల్‌గా కలిసి నా ప్రవర్తనను క్షమించమని కోరానంటూ' చెప్పుకొచ్చాడు.షోయబ్ అక్తర్ పాక్ తరపున 46 టెస్టుల్లో 176 వికెట్లు, 163 వన్డేల్లో 247 వికెట్లు పడగొట్టాడు. -
టచ్‌లోకి వస్తారు.. వల వేస్తారు..!
న్యూఢిల్లీ: కరోనా వైరస్ విజృంభణ కారణంగా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా స్పోర్ట్స్ ఈవెంట్స్ అన్నీ రద్దయ్యాయి. దాంతో క్రీడాకారులంతా ఇంట్లోనే ఉంటూ సోషల్ మీడియాలో కాలక్షేపం చేస్తున్నారు. అయితే ఇలా సోషల్ మీడియాలో కాలక్షేపం చేసే క్రమంలో ఫిక్సర్లతో జాగ్రత్తగా ఉండాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) హెచ్చరిస్తోంది. ప్రస్తుతం క్రికెట్ ఈవెంట్లు ఏమీ లేవని ఏ విషయాన్ని లైట్‌గా తీసుకోవద్దని ముందుగా క్రికెటర్లను హెచ్చరించింది. ఫిక్సర్లకు ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్ ఈవెంట్లు, వాటి ఫలితాలే కాదని, లాంగ్ షెడ్యూల్ మ్యాచ్‌లపై కూడా ఫిక్సింగ్ చేయడానికి ఈ లాక్డౌన్ వినియోగించే అవకాశాలు లేకపోలేదంటూ విన్నవించింది. ఈ మేరకు ఐసీసీ యాంటీ కరప్షన్ యూనిట్ చీఫ్ అలెక్స్ మార్షల్ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘ కరోనా వైరస్‌తో క్రీడా ఈవెంట్లు తాత్కాలికంగా ఆగిపోయాయి. అటు అంతర్జాతీయ మ్యాచ్‌లు, ఇటు దేశవాళీ మ్యాచ్‌లు అనే తేడా లేకుండా అంతా లాక్డౌన్లోకి వెళ్లిపోయాయి. ఈ సమయాన్ని ఫిక్సర్లు క్యాష్ చేసుకునే అవకాశం ఉంది. (‘అతని బౌలింగ్ అంటే ఎంతో ఇష్టం’) ఇటువంటి సందర్భాల్లో వారు చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఫిక్సింగ్‌లో బాగా పేరుగాంచిన కొంతమంది ప్రస్తుత సమయాన్ని వినియోగించుకుంటారు. మన క్రికెటర్లు ఎవరైతే సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉంటారో వారితో టచ్‌లోకి వస్తారు.. మాటా-మంతీ కలిపి వల వేస్తారు. మీతో పరిచయాల్ని పెంచుకోవడానికి యత్నిస్తారు. ఆపై ఫిక్సింగ్‌కు చేయడానికి ప్రేరేపిస్తారు. ఈ విషయాన్ని అన్ని క్రికెట్ బోర్డులకు విషయాన్ని చెరవేసి అప్రమత్తంగా కావాలని కోరాం’ అని అలెక్స్ మార్షల్ తెలిపారు. -
బడా బుకీ జతిన్ అరెస్ట్
కర్ణాటక, బనశంకరి: సంచలనాల కర్ణాటక ప్రీమియర్ లీగ్ (కేపీఎల్)లో మ్యాచ్ ఫిక్సింగ్, బెట్టింగ్, నటీమణుల ప్రమేయం తదితరాల కేసు విచారణను తీవ్రతరం చేసిన బెంగళూరు సీసీబీ అంతర్జాతీయ బుకీ జతిన్‌ను సోమవారం అరెస్ట్ చేసింది. కొన్నినెలలుగా నెదర్లాండ్స్‌లో తలదాచుకున్న ఢిల్లీకి చెందిన ఇతని కోసం రెడ్ కార్నర్ నోటీస్‌ను జారీచేశారు. అంతలోగా జతిన్ కోర్టులో ముందస్తు జామీను తీసుకున్నాడు. కేపీఎల్ ఫిక్సింగ్‌లో సూత్రధారిగా పేరున్న జతిన్ కెంపేగౌడ విమానాశ్రయానికి వస్తున్నాడనే పక్కా సమాచారం అందింది. దీని ఆధారంగా సోమవారం కెంపేగౌడ విమానాశ్రయంలో నెదర్లాండ్స్ నుంచి విమానంలో దిగగానే సీసీబీ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించినట్లు సీసీబీ ఉన్నతాధికారి సందీప్ పాటిల్ తెలిపారు. జతిన్ కేపీఎల్తో పాటు పలు క్రికెట్ మ్యాచ్ బెట్టింగుల్లో పాల్పంచుకున్నట్లు తేలిందని, దీనిపై కూపీ లాగుతున్నట్లు చెప్పారు. కేపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్‌కు సంబంధించి జతిన్ కీలక సమాచారం అందించాడని, ఇప్పటి వరకు అరెస్టైన వారితో సంబంధాలు ఉన్నట్లు వెల్లడైందని చెప్పారు. డీసీపీ కుల్దీప్కుమార్ జైన్ నేతృత్వంలో జతిన్‌ను విచారిస్తున్నామని, కోర్టు అనుమతి తీసుకుని తదుపరి చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కేపీఎల్ బాగోతం కీలక మలుపు తిరిగే అవకాశముంది. -
కర్ణాటక లీగ్‌లో స్పాట్ ఫిక్సింగ్!
సాక్షి, బెంగళూరు: గత కొంత కాలంగా ఫిక్సింగ్‌కు కేంద్రంగా మారిందని భావిస్తున్న కర్ణాటక ప్రీమియర్ లీగ్ (కేపీఎల్)లో మరో కొత్త వివాదం బయటకు వచ్చింది. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో ఇద్దరు కర్ణాటక క్రికెటర్లను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వీరిలో ఒకరు చిదంబరం మురళీధరన్ (సీఎం) గౌతమ్ కాగా, మరొకరు అబ్రార్ కాజీగా వెల్లడైంది. ఈ ఏడాది జరిగిన కేపీఎల్ ఫైనల్లోనే వీరిద్దరు స్పాట్ ఫిక్సింగ్ చేసినట్లు పోలీసులు ప్రకటించారు. హుబ్లీ టైగర్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి జట్టు బెళ్లారి టస్కర్స్‌కు గౌతమ్ కెప్టెన్ కాగా... కాజీ సభ్యుడు. చివరకు ఈ మ్యాచ్‌లో టస్కర్స్ 8 పరుగులతో ఓడింది. నెమ్మదిగా బ్యాటింగ్ చేసేందుకు వీరిద్దరు రూ. 20 లక్షలు తీసుకున్నారు. బెంగళూరు బ్లాస్టర్స్‌తో జరిగిన మరో మ్యాచ్‌లో కూడా గౌతమ్, కాజీ ఫిక్సింగ్ పాల్పడినట్లు తేలింది. గౌతమ్ ఘనమైన రికార్డు ఫిక్సింగ్‌కు పాల్పడి అరెస్టయిన క్రికెటర్లలో సీఎం గౌతమ్‌కు ఆటగాడిగా మంచి గుర్తింపు ఉంది. 33 ఏళ్ల వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ గౌతమ్ 11 ఏళ్ల కెరీర్లో 94 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. 41.36 సగటుతో అతను 4716 పరుగులు చేశాడు. 9 సీజన్ల పాటు కర్ణాటకకు ఆడిన అతను ఆ జట్టు 2013–15 మధ్య వరుసగా రెండు సార్లు రంజీ ట్రోఫీ విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. సుదీర్ఘ కాలం వైస్‌కెప్టెన్‌గా ఉన్న గౌతమ్... వినయ్ కుమార్ గైర్హాజరులో జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. అతను నాయకత్వం వహించిన టీమ్‌లో ఉతప్ప, కేఎల్ రాహుల్, మయాంక్, మనీశ్ పాండేలాంటి ఆటగాళ్లు ఉన్నారు. ఇండియా ‘ఎ’ తరఫున కూడా ఆడిన గౌతమ్... ఐపీఎల్లో ఆర్సీబీ, ముంబై, ఢిల్లీ ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ ఏడాది గోవా జట్టుకు మారగా, ఇప్పుడు అతని కాంట్రాక్ట్ రద్దయింది. కర్ణాటక తరఫున 17 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అబ్రార్‌కు గౌతమ్‌తో సాన్నిహిత్యం ఉంది. ఐపీఎల్లో ఆర్సీబీ తరఫున ఒకే ఒక మ్యాచ్ ఆడాడు. -
నా చుట్టూ మ్యాచ్ ఫిక్సర్లే: అక్తర్
కరాచీ: తాను అంతర్జాతీయ క్రికెట్ ఆడిన సమయంలో పలువురు పాకిస్తాన్ క్రికెటర్లు ఫిక్సింగ్‌కు పాల్పడిన విషయంపై ఆ దేశ మాజీ పేసర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ ఎట్టకేలకు మౌనం వీడాడు. తన చుట్టూ ఫిక్సర్లు ఉన్న విషయం తనకు తెలియకుండానే మ్యాచ్‌లు ఆడిన విషయాన్ని అక్తర్ గుర్తు చేసుకున్నాడు. తానెప్పుడూ ఫిక్సింగ్‌కు పాల్పడక పోయినా, ఫిక్సింగ్‌తో పాకిస్తాన్ క్రికెట్‌ను మోసం చేయకపోయినా, మ్యాచ్ ఫిక్సర్స్‌తో క్రికెట్ ఆడటం మాత్రం తనను తీవ్రంగా కలిచి వేసిందన్నాడు. మహ్మద్ అమిర్, అసిఫ్, సల్మాన్ భట్లు స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడి నిషేధానికి గురి కావడం తన కెరీర్లో ఒక చేదు జ్ఞాపకం అని పేర్కొన్నాడు. ఎవరైనా ప్రత్యర్థి జట్టుతో తలపడటాన్ని చూస్తాం.. కానీ చుట్టూ మన జట్టులోనే మ్యాచ్ ఫిక్సర్లే ఉన్నప్పుడు వారితో కూడా పోరాడాల్సి వచ్చిందా అనే విషయం తలుచుకుంటే బాధగా ఉందన్నాడు. ‘ నేను ఎప్పుడూ ఒకటే నమ్ముతా.. ఫిక్సింగ్ చేసి పాకిస్తాన్ క్రికెట్‌ను ఎప్పుడూ మోసం చేయలేదు. నా కెరీర్లోనే మ్యాచ్ ఫిక్సింగ్ అనేది లేదు. కానీ నా చుట్టూ మ్యాచ్ ఫిక్సర్లే ఉన్నారు. నేను మొత్తం 22 మందికి వ్యతిరేకంగా క్రికెట్ ఆడా. అసలు మ్యాచ్ ఫిక్సర్ ఎవరు అనేది ఎలా తెలుస్తుంది. మ్యాచ్ ఫిక్సింగ్ పాల్పడ్డ అసిఫ్ మొత్తం మ్యాచ్‌లన్నీ బుకీలు ఫిక్సింగ్ చేసినట్లు నాకు చెప్పాడు. పాకిస్తాన్ తరఫున ఫిక్సింగ్ పాల్పడి నిషేధాన్ని కూడా ఎదుర్కొని మళ్లీ పాకిస్తాన్ జట్టు తరఫున రీ ఎంట్రీ ఇచ్చిన అమిర్ తలుచుకుంటే నాకు కోపం వస్తుంది. ఆమిర్ నన్ను చాలా గాయపరిచాడు. అమిర్, అసిఫ్‌లు ఎందుకు ఫిక్సింగ్ చేసారో నేను అర్ధం చేసుకోగలను. అమిర్, ఆసిఫ్‌లు ఫిక్సింగ్ చేశారనే అభియోగాలు విన్న మరక్షణం నేను చాలా నిరూత్సాహానికి గురయ్యా. వారి టాలెంట్ వృథా అయిపోందనుకున్నా. ఇద్దరు టాప్ బౌలర్లు ఇలా చేయడం బాధించింది. కొద్దిపాటి డబ్బుకు ఆశపడి ఇలా చేయడం జీర్ణించుకోలేకపోయాను’ అని అక్తర్ పేర్కొన్నాడు. కొన్ని రోజుల క్రితం బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకిబుల్‌పై ఐసీసీ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. తనను బుకీలు సంప్రదించినా ఆ విషయాన్ని దాటి పెట్టడంతో షకిబుల్‌పై రెండేళ్లపాటు నిషేధం విధించారు. ఈ నేపథ్యంలో తమ క్రికెటర్ల స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారం గురించి అక్తర్ ఆవేదన వ్యక్తం చేశాడు. 2011లో అక్తర్ తన ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్‌ను ఆడాడు. ఆ సమయంలోనే పాకిస్తాన్ క్రికెట్‌ను మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం ఒక్కసారిగా షాక్‌కు గురి చేసింది. -
‘క్రికెట్లోనూ అంతే.. వీటిని ఆపడం చాలా కష్టం’
న్యూఢిల్లీ: క్రికెట్ నుంచి మ్యాచ్ ఫిక్సింగ్‌ను పూర్తిగా తొలగించడం సాధ్యం కాదని భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డారు. అత్యాశకు ఎలాంటి మందు ఉండదని ఆయన అన్నారు. ‘ఎంతటి పెద్ద చదువులు చదివినా, సరైన మార్గనిర్దేశం ఉన్నా సరే చాలా మందిలో సహజంగానే అత్యాశ ఉంటుంది. ఉన్నత స్థాయి కుటుంబాల్లోనూ ఎక్కడో ఒక చోట నేరస్తులు కనిపిస్తారు. అలాంటి వారిని ఎవరూ మార్చలేరు. క్రికెట్లోనూ అంతే. వీటిని ఆపడం చాలా కష్టం’ అని మాజీ కెప్టెన్ వ్యాఖ్యానించారు. తమిళనాడు ప్రీమియర్ లీగ్(టీఎన్‌పీఎల్), కర్ణాటక ప్రీమియర్ లీగ్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఇప్పుడు దానిపై విచారణ జరుగుతుంది. దీనిలో భాగంగా స్పందించిన గావస్కర్.. కచ్చితంగా ప్రతీ మనిషికి అత్యాశ ఉంటుందని, ఆ క్రమంలోనే మ్యాచ్ ఫిక్సింగ్‌లు జరుగుతాయన్నాడు. ఇక్కడ ధనిక, పేద అనే తేడా ఉండదన్నాడు. ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన క్రికెటర్‌కు ఎక్కువ మొత్తంలో ఆశ చూపెడితే అది అతన్ని తప్పు చేసేందుకు ప్రేరేపిస్తుందన్నాడు. దాంతో ఫిక్సింగ్ అనే మహమ్మారిని పూర్తిగా నివారించడం సాధ్యం కాదని పేర్కొన్నాడు. -
టీఎన్‌పీఎల్‌లో ఫిక్సింగ్!
న్యూఢిల్లీ: మూడేళ్లలో అత్యంత విజయవంతమైన క్రికెట్ టోరీ్నగా పేరు తెచ్చుకున్న తమిళనాడు ప్రీమియర్ లీగ్ (టీఎన్‌పీఎల్)లో మ్యాచ్ ఫిక్సింగ్ వివాదం అలజడి రేపింది. బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం (ఏసీయూ) విచారణలో ఈ విషయం బయటపడినట్లు సమాచారం. కొందరు ఫస్ట్ క్లాస్ క్రికెటర్లతో పాటు ఇద్దరు కోచ్‌లు కూడా ఫిక్సింగ్‌లో భాగంగా ఉన్నారని తెలుస్తోంది. 2016లో ప్రారంభమైన టీఎన్‌పీఎల్‌ను ఎనిమిది ఫ్రాంచైజీ జట్లతో నిర్వహిస్తున్నారు. ప్రస్తుతానికి ఎవరి పేర్లూ బయటపడకపోయినా... ఒక జట్టు విషయంలో మాత్రం సందేహాలున్నాయి. ‘టీఎన్‌పీఎల్‌లో ఆ జట్టు చివరి మూడు స్థానాల్లో ఒకటిగా నిలిచింది. ఆ జట్టు యాజమాన్యం నిర్వహణా శైలి, వారి ఆటగాళ్లు, కోచ్‌ల ఎంపిక కూడా అనుమానాస్పదంగా ఉన్నాయి’ అని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ముఖ్యంగా ఒక కోచ్ పాత్ర గురించి బోర్డు ప్రత్యేకంగా విచారిస్తోంది. ‘గతంలో ఐపీఎల్లో చెడ్డ పేరు తెచ్చుకున్న ఫ్రాంచైజీతో కూడా ఆ కోచ్ కలిసి పని చేశాడు. ఆ తర్వాత ఒక రంజీ టీమ్‌కు కూడా కోచ్‌గా వ్యవహరించాడు. కనీసం ఫస్ట్‌క్లాస్ క్రికెట్ కూడా ఆడని అతను ఐపీఎల్ సహాయక సిబ్బందిలో ఎలా అవకాశం దక్కించుకున్నాడో, టీఎన్‌పీఎల్‌తో ఎలా జత కలిశాడో కూడా కూడా ఆశ్చర్యకరం’ అని ఆయన చెప్పారు. మరో వైపు ఈ వివాదంలో అంతర్జాతీయ క్రికెటర్లు ఎవరూ లేరని ఏసీయూ చీఫ్ అజిత్ సింగ్ స్పష్టం చేశారు. ఒక భారత క్రికెటర్ ఉన్నాడంటూ తమకు కొన్ని వాట్సప్ మెసేజ్‌లు వచ్చాయంటూ కొందరు ఆటగాళ్లు తమ విచారణలో వెల్లడించారని... ఆయా సందేశాలను తాము పరిశీలిస్తున్నట్లు ఆయన వివరించారు. మహిళల క్రికెట్లోనూ.. భారత మహిళల క్రికెట్ జట్టు సభ్యురాలు ఒకరిని కూడా మ్యాచ్ ఫిక్సింగ్‌లోకి దించేందుకు బుకీలు ప్రయతి్నంచినట్లు తెలిసింది. ఈ ఏడాది ఆరంభంలో స్వదేశంలో ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ముందు బెంగళూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే సదరు క్రికెటర్ వెంటనే బీసీసీఐ ఏసీయూకు సమాచారం అందించింది. దీనికి సంబంధించి సోమవారం బెంగళూరులో ఇద్దరు వ్యక్తులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వీరిలో జితేంద్ర కొఠారి ముందుగా తనను తాను స్పోర్ట్స్ మేనేజర్‌గా చెప్పుకొని మహిళా క్రికెటర్లతో పరిచయం పెంచుకున్నాడు. ఆ తర్వాత తన మిత్రుడంటూ రాకేశ్ బాఫ్నా అనే వ్యక్తిని ముందుకు తీసుకొచ్చాడు. ఫిక్సింగ్ చేయాలంటూ మహిళా క్రికెటర్ ముందు ఇదే బాఫ్నా ప్రతిపాదన తీసుకొచ్చాడని పోలీసులు వెల్లడించారు. వీరిద్దరిపై నాలుగు వేర్వేరు సెక్షన్ల కింద కేసు నమోదైంది. అయితే ఈ భారత మహిళా క్రికెటర్ ఎవరనేది బయటకు రాలేదు. -
శ్రీశాంత్‌పై నిషేధం కుదింపు
న్యూఢిల్లీ: వివాదాస్పద పేసర్ శంతకుమరన్ శ్రీశాంత్‌కు ఊరట. ఈ కేరళ క్రికెటర్‌పై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) గతంలో విధించిన జీవితకాల నిషేధాన్ని ఏడేళ్లకు తగ్గిస్తూ బోర్డు అంబుడ్స్‌మన్ డీకే జైన్ ఆదేశాలిచ్చారు. 2013 ఐపీఎల్ సందర్భంగా రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారన్న అభియోగాలపై శ్రీశాంత్, అజిత్ చండీలా, అంకిత్ చవాన్లపై బోర్డు క్రమశిక్షణ కమిటీ జీవిత కాలం నిషేధం విధించింది. అయితే, ఈ ఏడాది మార్చి 15న సుప్రీంకోర్టు దానిని పక్కన పెట్టింది. ఈ కేసు గత ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు బెంచ్ ముందుకు వెళ్లింది. జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ కేఎం జోసెఫ్‌లతో కూడిన బెంచ్... మూడు నెలల్లో డీకే జైన్ సమీక్ష చేపడతారని పేర్కొంది. తాజాగా ఆగస్టు 7న జారీ చేసిన ఆదేశాల్లో జైన్... శ్రీశాంత్‌పై నిషేధాన్ని ఏడేళ్లకు పరిమితం చేశారు. వచ్చే ఏడాది ఆగస్టుతో ఆ వ్యవధి ముగియనుంది. శ్రీశాంత్ 36 ఏళ్ల వయసుకు రావడం, అది ఒక పేసర్ కెరీర్ ముగింపు దశ కావడమే తన నిర్ణయానికి కారణమని ఉత్తర్వుల్లో జైన్ పేర్కొన్నారు. స్పాట్ ఫిక్సింగ్‌ను ప్రోత్సహించిన రీత్యా శ్రీశాంత్‌పై విధించిన నిషేధాన్ని బోర్డు గతంలో కోర్టు ఎదుట గట్టిగా సమర్థించుకుంది. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో తన రెండో ఓవర్లో 14 పరుగులు ఇచ్చేలా శ్రీశాంత్ ఫిక్సింగ్‌కు ఒప్పుకొన్నాడని, రూ.10 లక్షలు కూడా తీసుకున్నాడని బోర్డు న్యాయవాది పరాగ్ త్రిపాఠి కోర్టుకు టెలిఫోన్ సంభాషణల రికార్డును అందజేశారు. అయితే, ఇందుకు బలమైన ఆధారాలేమీ లేవంటూ క్రికెటర్ తరఫు న్యాయవాది ఖండించారు. శ్రీశాంత్ భారత్‌కు 27 టెస్టులు, 53 వన్డేలు, 10 టి20ల్లో ప్రాతినిధ్యం వహించాడు. 2007 టి20, 2011 వన్డే ప్రపంచ కప్‌లు గెలిచిన జట్టులో అతడు సభ్యుడు. -
ఇంటర్‌పోల్‌తో చేతులు కలిపిన ఐసీసీ
దుబాయ్: గత కొంతకాలంగా క్రికెట్‌ను ఫిక్సింగ్ భూతం పట్టిపీడిస్తున్న విషయం తెలిసిందే. దీన్ని నిరోధించడానికి అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ఎన్ని రకాల చర్యలు తీసుకుం టున్నప్పటికీ పూర్తిస్థాయిలో సఫలం కావడం లేదు. దీంతో ఐసీసీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఫిక్స్ంగ్ను తరిమికొట్టేందుకు ఇంటర్ పోల్‌తో కలసి పనిచేయనుంది. ఈ మేరకు గత వారం ఫ్రాన్స్‌లోని లియోన్‌లో ఉన్న ఇంటర్‌పోల్ అధికారులతో ఐసీసీ అవినీతి నిరోధక విభాగం జనరల్ మేనేజర్ అలెక్స్ మార్షల్ సమావేశమై చర్చించినట్లు ఐసీసీ ఓ లేఖలో వెల్లడించింది. ‘ప్రపంచ వ్యాప్తంగా నేరాల నియంత్రణకు కృషి చేసే సంస్థ ఇంటర్‌పోల్. దీనికి 194 దేశాలతో అనుబంధం ఉంది. అలాంటి సంస్థతో కలసి పనిచేయాలని ఐసీసీ నిర్ణయించింది. దీనివల్ల క్రికెట్ వ్యవహారాల్లో అవినీతి, ఫిక్స్ంగ్ జాఢ్యాలను పూర్తిగా నియంత్రించేందుకు వీలవుతుంది’అని ఆ లేఖలో పేర్కొంది. కాగా, దీనిపై ఇంటర్‌పోల్ క్రిమినల్ నెట్వర్క్ యూనిట్ అసిస్టెంట్ డైరెక్టర్ జోస్ డి గ్రేసియా మాట్లాడుతూ క్రికెట్లో అవినీతి, ఫిక్సింగ్ వ్యవహారాల నియంత్రణకు ఐసీసీతో కలసి పనిచేయనున్నం దుకు సంతోషం వ్యక్తం చేశారు. -
జయసూర్యపై రెండేళ్ల నిషేధం
దుబాయ్: మ్యాచ్ ఫిక్సింగ్ కేసుల్లో సహాయ నిరాకరణ, దర్యాప్తును అడ్డు కునేలా వ్యవహరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీలంక మాజీ కెప్టెన్ సనత్ జయసూర్యపై అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) కఠిన చర్యలు తీసుకుంది. రెండేళ్ల పాటు అన్ని ఫార్మాట్లకు సంబంధించిన క్రికెట్ వ్యవహారాల్లో జయసూర్య పాల్గొనకూడదంటూ నిషేధం విధించింది. శ్రీలంక జాతీయ జట్టుకు సెలెక్టర్‌గానూ పనిచేసిన జయసూర్య హయాంలో ఆ దేశ క్రికెట్ బోర్డులో విపరీతమైన అవినీతి చోటు చేసుకుందని, అలాగే జట్టులోని కొందరు ఆటగాళ్లు ఫిక్సింగ్‌కు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై దర్యాప్తునకు ఐసీసీ ఏర్పాటుచేసిన అవినీతి నిరోధక విభాగం(ఏసీయూ) ముందు హాజరుకాకపోవడంతో ఆర్టికల్ 2.4.6, ఆర్టికల్ 2.4.7ల ప్రకారం జయసూర్యపై రెండేళ్ల నిషేధం పడింది. -
న్యాయం చేయండి: శ్రీశాంత్ భార్య
న్యూఢిల్లీ: తన భర్తకు న్యాయం చేయాలంటూ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)కి లేఖ రాశారు టీమిండియా వెటరన్ పేసర్ శ్రీశాంత్ భార్య భువనేశ్వరి. 2013 ఐపీఎల్లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడంటూ శ్రీశాంత్‌పై బోర్డు జీవితకాల నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే తన భర్తపై వచ్చినవన్నీ నిరాధార ఆరోపణలేనని, అతడు స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడలేదని భువనేశ్వరి బీసీసీఐకి రాసిన బహిరంగ లేఖలో పేర్కొన్నారు. తప్పుడు ఆరోపణల కారణంగా తన భర్త జీవితం నాశనమైందని ఆమె అందులో పేర్కొన్నారు. తనకు న్యాయం చేయాలని పేర్కొన్నారు. అన్యాయమనేది ఎక్కడైనా ముప్పును తెచ్చిపెడుతుందని లేఖ ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. కొన్నిసార్లు తప్పుచేయని తన భర్తని చూస్తే గుండె బద్ధలైనట్లు ఉంటుందని పేర్కొన్నారు. 2015లో ఢిల్లీ కోర్టు శ్రీశాంత్‌పై ఉన్న స్పాట్‌ఫిక్సింగ్ ఆరోపణలను కొట్టేసినప్పటికీ, బోర్డు మాత్రం నిషేధం ఎత్తేయడానికి అంగీకరించలేదు.తనపై విధించిన జీవితకాల నిషేధాన్ని సవాల్ చేస్తూ శ్రీశాంత్ సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. శ్రీశాంత్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన చీప్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎమ్ కన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల నేతృత్వంలోని బెంచ్ శ్రీశాంత్‌పై జీవితకాలం నిషేధం విధించడంపై నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలని బీసీసీఐకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. 2013 ఐపీఎల్ సీజన్లో శ్రీశాంత్‌తోపాటు ఇద్దరు రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు అజిత్ చండీలా, అంకిత్ చవాన్‌లను స్పాట్‌ఫిక్సింగ్ కేసులో ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బోర్డు శ్రీశాంత్‌పై నిషేధం విధించింది. అయితే 2015 జూలైలో అతడిపై ఉన్న అభియోగాలను కొట్టివేస్తూ పటియాలా హౌస్ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. దీంతో ఆ తర్వాత స్థానిక టోర్నీల్లో ఆడేందుకు శ్రీశాంత్ ప్రయత్నించినప్పటికీ, బీసీసీఐ మాత్రం తాము విధించిన నిషేధాన్ని కొనసాగిస్తూ వస్తోంది. దీంతో అతను కేరళ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ క్రమంలో కేరళ హైకోర్టులో అతడికి ఊరట లభించింది. కేరళ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుని బీసీసీఐ సవాల్ చేసింది. శ్రీశాంత్‌కు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాలు ఉన్నాయని అందుకే తాము నిషేధం విధించామని పేర్కొంటూ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో కేరళ హైకోర్టు మళ్లీ నిషేధాన్ని పునరుద్ధరిస్తూ అక్టోబరు 17న నిర్ణయం తీసుకుంది. దీంతో అతడు చేసేదేమీ లేక సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. -
కాంగ్రెస్-టీఆర్ఎస్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్
-
ఫిక్సింగ్ కలకలం.. ఇద్దరిపై నిషేధం
కొలంబో : ‘ఆల్ జజీరా’ స్టింగ్ ఆపరేషన్‌లో ఫిక్సింగ్ పాల్పడినట్లు ఒప్పుకున్న పిచ్ క్యూరేటర్, గ్రౌండ్స్‌మన్‌పై వేటు వేస్తున్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటించింది. నవంబర్‌లో ఇంగ్లండ్‌తో గాలే వేదికగా జరిగే టెస్టు మ్యాచ్ ఫలితం ప్రభావితమయ్యేలా ఫిచ్‌ను సిద్దం చేస్తామని ఈ ఇద్దరు తెలిపినట్లు స్టింగ్ ఆపరేషన్‌లో వెల్లడైంది. ఈ ఘటనతో శ్రీలంక క్రికెట్ బోర్డు ముగ్గురు సభ్యులతో కూడిన ప్యానెల్‌ను ఏర్పాటు చేసి దర్యాప్తుకు ఆదేశించింది. అంతేగాకుండా స్థానిక పోలీసులకు సైతం ఫిర్యాదు చేసింది. ఈ స్టింగ్ ఆపరేషన్‌తో ఉలిక్కిపడ్డ అంతర్జాతీయ క్రికెట్ మండలి సైతం దర్యాప్తు చేపడుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించిన జర్నలిస్ట్ డేవిడ్ హారిసన్‌తో కొలంబో ఆటగాడు తరిందు మెండీస్, గాలె పిచ్ క్యూరేటర్ తరంగ ఇండికాలు ఫలితాన్ని ప్రభావం చేసేలా పిచ్‌ను సిద్దం చేస్తామని ఒప్పుకున్నారు. గతంలో జరిగిన శ్రీలంక–ఆసీస్, భారత్–లంక టెస్టుల్లో సైతం పిచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు కూడా వెల్లడించారు. ఇక ఈ వివాదంలో ముంబైకి చెందిన ఫస్ట్‌క్లాస్ క్రికెటర్ రాబిన్ మోరిస్ హస్తం ఉన్నప్పటికీ టీమిండియా క్రికెటర్ల పేర్లు మాత్రం లేవు. చదవండి: మూడు టెస్టులు ఫిక్స్! -
మూడు టెస్టులు ఫిక్స్!
న్యూఢిల్లీ: మళ్లీ ఫిక్సింగ్ భూతం బుసలు కొట్టింది. గత రెండేళ్లుగా భారత్ ఆడిన మూడు టెస్టులు ఫిక్స్ అయినట్లు ఖతర్‌కు చెందిన అల్ జజీరా టీవీ చానెల్ చేసిన స్టింగ్ ఆపరేషన్‌లో వెల్లడవడంతో క్రికెట్ ప్రపంచం ఉలిక్కి పడింది. ఇదంతా కూడా దావూద్ (డి) గ్యాంగ్ కనుసన్నల్లో జరిగినట్లు ఈ చానెల్ నిర్వహించిన శూల శోధనలో వెల్లడైంది. ఇందులో ముంబైకి చెందిన ఫస్ట్‌క్లాస్ క్రికెటర్ రాబిన్ మోరిస్ హస్తం ఉన్నప్పటికీ టీమిండియా క్రికెటర్ల ప్రమేయం లేకపోవడం ఊరట. ఈ స్టింగ్ ఆపరేషన్ వీడియోలో భారత క్రికెటర్ల పేర్లు మాత్రం లేవు. జర్నలిస్ట్ డేవిడ్ హారిసన్ ఈ ఆపరేషన్‌ను ముంబై, యూఏఈ, శ్రీలంకల్లో నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియో డాక్యుమెంటరీ ఆదివారం ‘హిందుస్తాన్ టైమ్స్’ వెబ్సైట్లో ప్రసారమైంది. మొత్తం మ్యాచ్, ఇన్నింగ్స్ కాకుండా కొన్ని ఓవర్లు, సెషన్లు మాత్రమే ఫిక్సయ్యాయి. అంటే మ్యాచ్‌లు జరిగిన ఐదు రోజుల్లో ఏదో ఓ రోజు పది ఓవర్లో, 20 ఓవర్లో ఫిక్స్ అయ్యాయి. చెన్నై (2016)లో భారత్–ఇంగ్లండ్ టెస్టు, గతేడాది రాంచీలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు, గాలే (శ్రీలంక)లో శ్రీలంకతో ఆడిన టెస్టు మ్యాచ్‌లు బుకీలు, ఫిక్సర్ల బారిన పడినట్లు ఆ డాక్యుమెంటరీలో వెల్లడైంది. ఇందులో ఇద్దరు ఆస్ట్రేలియన్, ముగ్గురు ఇంగ్లండ్ క్రికెటర్ల పాత్ర ఉన్నట్లు ఆ వీడియోలో ఉంది. అయితే సదరు ఆటగాళ్ల పేర్లను ‘బీప్’సౌండ్‌తో వినపడకుండా కవర్ చేశారు. పాకిస్తాన్, శ్రీలంక ఆటగాళ్ల పేర్లు మాత్రం వినిపించాయి. హసన్ రజా (పాక్ తరఫున టెస్టు ఆడిన అతిపిన్న క్రికెటర్), దిల్హార లోకుహెత్తిగె, జీవంత కులతుంగ, తరిందు మెండీస్ (శ్రీలంక)లు ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు తెలిసింది. వీరితో పాటు గాలే పిచ్ క్యురేటర్ తరంగ ఇండిక పేరు వినిపించింది. ఆయన గాలేలో జరిగిన శ్రీలంక–ఆసీస్, భారత్–లంక టెస్టుల్లో పిచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారు. శూల శోధన వీడియోలో డి–గ్యాంగ్‌కు చెందిన అనీల్ మునవర్ మాట్లాడుతూ ‘ప్రతీ స్క్రిప్టు నాదే. నేనిచ్చిందే జరుగుతుంది... జరిగి తీరుతుంది’ అని జర్నలిస్ట్‌కు వెల్లడించారు. ఫిక్సింగ్‌కు పాల్పడిన ఆటగాళ్లకు రూ. 2 కోట్లు నుంచి 6 కోట్ల వరకు ఇస్తామన్నారు. గాలే క్యురేటర్‌కు రూ. 25 లక్షలిచ్చామని ఇది ఆయన (క్యురేటర్) ఎనిమిదేళ్ల జీతంతో సమానమని చెప్పారు. భారత మాజీ దేశవాళీ ఆటగాడు రాబిన్ మోరిస్ మాట్లాడుతూ ‘నా చేతిలో 30 మంది ఆటగాళ్లున్నారు. వాళ్లంతా నేనేది చెబితే అదే చేస్తారు’ అని అన్నాడు. అతని వ్యాపార భాగస్వామి గౌరవ్ రాజ్‌కుమార్ ‘మాకు గేమ్ వినోదంతో పనిలేదు. ఆట గురించి పట్టించుకోం. మాకు కావాల్సింది డబ్బే! దాని కోసమే ఇదంతా చేస్తున్నాం’ అని చెప్పాడు. ఐసీసీ పూర్తిస్థాయి విచారణ... ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించామని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వెల్లడించింది. ఇందులో ఆరోపణలెదుర్కొంటున్న ఆటగాళ్ల దేశాలతో మాట్లాడి పూర్తిస్థాయి విచారణ జరుపుతామని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) మాత్రం... ముందు సాక్ష్యాలు కావాలని, విశ్వసనీయ రుజువులందాకే తమ ఆటగాళ్ల ప్రమేయంపై విచారణ చేపడుతామని తెలిపింది. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) చీఫ్ ఎగ్జిక్యూటీవ్ టామ్ హారిసన్ మాట్లాడుతూ భారత్‌తో జరిగిన టెస్టులో మాకెలాంటి సందేహాలు లేవని, ఆటగాళ్లను అనుమానించాల్సిన అవసరం లేదని అన్నారు. ఐసీసీ దర్యాప్తు తర్వాతే... ఐసీసీ దర్యాప్తు జరిగేదాకా వేచి చూస్తామని, ఆ తర్వాతే తమ బోర్డు పరిధిలో విచారణ నిర్వహిస్తామని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఇందులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముంబై ఆటగాడు రాబిన్ మోరిస్‌కు బోర్డు నుంచి రూ. 22,500 పెన్షన్ చెల్లిస్తున్నామని, దోషిగా తేలితే దాన్ని నిలిపివేస్తామని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. -
ఫిక్సింగ్ చేయమని అడిగినందుకు...
హరారే: మ్యాచ్ ఫిక్సింగ్‌లో క్రికెటర్‌ను భాగం చేసేందుకు ప్రయత్నించిన జింబాబ్వే క్రికెట్ అసోసియేషన్ అధికారి ఒకరిపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తీవ్ర చర్య తీసుకుంది. జింబాబ్వేలోని హరారే మెట్రోపాలిటన్ క్రికెట్ అసోసియేషన్ కోశాధికారి, మార్కెటింగ్ డైరెక్టర్ రాజన్ నాయర్‌పై 20 ఏళ్ల నిషేధం విధించింది. గత అక్టోబర్‌లో జింబాబ్వే కెప్టెన్ గ్రేమ్ క్రెమర్‌ను కలిసిన నాయర్... ఫిక్సింగ్ చేస్తే 30 వేల డాలర్లు (దాదాపు రూ. 20 లక్షలు) ఇస్తానని ఆఫర్ చేశాడు. అయితే దీనికి స్పందించని క్రెమర్ వెంటనే ఐసీసీకి సమాచారం అందజేశాడు. 16 జనవరి, 2018 నుంచి 15 జనవరి, 2038 వరకు రాజన్‌పై నిషేధం అమల్లో ఉంటుంది. రాజన్ చేసిన పని తీవ్రతను బట్టే అతనికి పెద్ద శిక్ష వేసినట్లు ఐసీసీ అవినీతి నిరోధక యూనిట్ జనరల్ మేనేజర్ అలెక్స్ మార్షల్ తెలిపారు. -
అదొక మానసిక క్షోభ: షమీ
డెహ్రాడూన్: తనను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) కాంట్రాక్ట్ నుంచి తప్పించిన క్షణంలో తీవ్ర మానసిక క్షోభకు గురయ్యానని పేసర్ మహ్మద్ షమీ తాజాగా పేర్కొన్నాడు. తాను మ్యాచ్ ఫిక్సింగ్ చేశానంటూ భార్య హసీన్ జహాన్ చేసిన ఆరోపణలు చాలా ఎక్కువగా బాధించాయన్నాడు. మ్యాచ్ ఫిక్సింగ్, ఇతర మహిళలతో సంబంధాలు, హత్యాయత్నానికి పాల్పడ్డాడంటూ షమి భార్య జహాన్ సంచనల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో అప్పుడు బీసీసీఐ షమికి కాంట్రాక్టులో స్థానం కల్పించలేదు. అయితే దర్యాప్తు తర్వాత షమి ఎలాంటి మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడలేదని తేలడంతో బీసీసీఐ ‘బి’ గ్రేడ్ కాంట్రాక్టులో చోటు కల్పించారు. మ్యాచ్ ఫిక్సింగ్ పాల్పడినట్లు వచ్చిన ఆరోపణల్లో నిజం లేకపోవడం, బీసీసీఐ కాంట్రాక్టు దక్కడం, ఐపీఎల్లో ఆడటంపై షమి తాజాగా సంతోషం వ్యక్తం చేశాడు. 'ఇది పూర్తిగా కుటుంబానికి సంబంధించిన సమస్య. నాకు వ్యతిరేకంగా వచ్చిన వార్తల్లో ఏ మాత్రం నిజం లేదు. గత 10-15 రోజులుగా ఎంతో మానసిక క్షోభకు గురయ్యా. ఈ రోజులన్ని ఎంతో కఠినంగా గడిచాయి. వీలైనంత త్వరగా మిగతా వాటి నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నా' అని షమీ తెలిపాడు. -
ప్రశ్నలతో షమీ భార్య ఉక్కిరి బిక్కిరి
సాక్షి, స్పోర్ట్స్ : టీమిండియా పేసర్ షమీపై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చేసి పెను కలకలమే రేపింది అతని భార్య హసిన్ జహాన్. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు నియమించిన సీవోఏ కమిటీ ఆదేశాలానుసారం రంగంలోకి దిగిన బీసీసీఐ అవినీతి నిరోధక విభాగ అధికారులు.. హసిన్‌ను ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసేశారు. శనివారం సాయంత్రం కోల్‌కతా లాల్‌బజార్‌లోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు చేరుకున్న నలుగురు అధికారులు సుదీర్ఘంగా ఆమెను ప్రశ్నించారు. అంతకు ముందు ఆమె చేసిన ఆరోపణలపై ఆమెకు విచారణకు హాజరుకావాలని సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇక విచారణలో ఆమె చేసిన ప్రధాన ఆరోపణలు.. ఆమె ఆ విషయాలు ఎలా తెలుసన్న కోణంలోనే మూడు గంటలపాటు ప్రశ్నలు గుప్పించినట్లు సమాచారం. వాటిలో చాలా వరకు ఆమె తడబడటం, మౌనంగా ఉండటంతో మరోసారి ఆమెను ప్రశ్నించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పాకిస్థాన్‌కు చెందిన అలిషబా అనే యువతి నుంచి డబ్బులు తీసుకుని షమీ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని. దీని వెనుక ఇంగ్లాండ్‌కు చెందిన వ్యాపారవేత్త మహమ్మద్ భాయ్ ఉన్నాడంటూ జహాన్ ఆరోపించారు. ఇక ప్రస్తుత దర్యాప్తు అనంతరం అధికారులు ఇచ్చే రిపోర్ట్‌పైనే షమీ క్రికెట్ భవిష్యత్తు ఆధారపడి ఉంది. అయితే హసీన్ తనపై చేసిన ఆరోపణలు నిజమని తేలితే తనను ఉరి తీయాలంటూ షమీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనకేం పాపం తెలీదని.. ఈ వ్యవహారంలో తనకు సాయం చేయాలని బీసీసీఐని షమీ వేడుకున్నాడు. సోదరుడితో షమీ రేప్ చేయించబోయాడు -
నా భర్త మ్యాచ్ ఫిక్సర్!
కోల్‌కతా: తన భర్తకు పలువురు అమ్మాయిలతో అక్రమ సంబంధాలున్నాయంటూ తీవ్ర ఆరోపణలు చేసిన టీమిండియా పేసర్ మహ్మద్ షమి భార్య హసీన్ జహాన్..గురువారం మరో బాంబు పేల్చింది. తన భర్త ఒక మ్యాచ్ ఫిక్సర్ అని వెల్లడించారు. పలు మ్యాచ్‌ల్లో షమీ ఫిక్సింగ్ పాల్పడ్డాడని జహార్ ఆరోపించింది. 'షమి నాతోపాటు దేశాన్నీ మోసగించగలడు. దుబాయ్‌లో అలీ సబా అనే పాకిస్థాన్ అమ్మాయి నుంచి డబ్బు తీసుకున్నాడు. అందుకు నా వద్ద ఆధారాలున్నాయి. ఇంగ్లండ్‌కు చెందిన మహ్మద్ భాయ్ సూచన మేరకు అతడు ఆ సొమ్ము స్వీకరించాడు. మ్యాచ్ ఫిక్సింగ్‌లో భాగంగానే ఆ డబ్బు తీసుకున్నాడు. ఒకవేళ కాకపోతే ఆ డబ్బు ఎందుకు తీసుకున్నాడో షమి వెల్లడించాలి. మహ్మద్ భాయ్ ఎవరో షమీ చెప్పాలి. అతనితో షమీకి ఏమిటి సంబంధం. భాయ్ అనే వ్యక్తి ఏమి చేస్తాడో ప్రపంచానికి చెప్పు' అని జహాన్ డిమాండ్ చేసింది. గతనెల దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా జట్టు సభ్యులంతా భారత్ వచ్చేయగా షమి దుబాయ్‌లో ఆగిన విషయాన్ని జహాన్ ఈ సందర్బంగా వెల్లడించారు. ఆ క్రమంలోనే ఎయిర్‌పోర్ట్‌లో పాక్‌కు చెందిన మహిళను కలుసుకున్నాడుని, ఫిబ్రవరి 18న ఆమెతో కలిసి అతడు ఓ హోటల్లో చెక్ ఇన్ అయినట్లు తెలిపింది. వీటిపై తాను నిలదీస్తే ఏం చేసుకుంటావో చేసుకో అని బెదిరింపులకు పాల్పడ్డాడని జహాన్ పేర్కొన్నారు. -
'నన్ను మ్యాచ్ ఫిక్స్ చేయమన్నారు'
కౌలాలాంపూర్ : ఇప్పటివరకూ పలు క్రీడలకే పరిమితమైన మ్యాచ్ ఫిక్సింగ్ ఇప్పుడు బ్యాడ్మింటన్ కూడా సోకినట్లు కనబడుతోంది. తాజాగా బ్యాడ్మింటన్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం మొదలైంది. గతంలో ఒక మ్యాచ్‌ను ఫిక్స్ చేయాల్సిందిగా బుకీలు సంప్రదించిన విషయాన్ని మలేసియా స్టార్ షట్లర్ లీ చోంగ్ వి వెల్లడించాడు. అయితే దానిని తాను తిరస్కరించినట్లు పేర్కొన్నాడు. దీనిలో భాగంగా ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు సహచర క్రీడాకారులను చూసి తలదించుకోవాల్సిన పరిస్థితి దాపురించిందని లీ ఆవేదన వ్యక్తం చేశాడు. దేశ గౌరవమే తనకు ముఖ్యమని చెప్పాడు. ఫిక్సింగ్ ఆరోపణలపై ఇద్దరు మలేసియా ప్లేయర్లను బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) ఈ నెల చివర్లో విచారించనుంది. -
వైరల్ : కావాలనే ఔట్ అయ్యారు!
సాక్షి, స్పోర్ట్స్: దుబాయ్‌లో జరిగిన అజ్మన్ ఆల్ స్టార్స్ లీగ్‌పై సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చజరుగుతోంది. ఈ లీగ్‌లోని ఓ మ్యాచ్‌కు సంబంధించిన కొన్ని వీడియోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే బ్యాట్స్మన్లు కావాలని అవుటవ్వడం, ఇన్నింగ్స్‌లో ఏకంగా ఐదు స్టంపౌట్లు, మూడు రనౌట్లు కావడం భిన్న వాదనలకు దారి తీసింది. దీంతో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) రంగంలోకి దిగింది. ఈ మ్యాచ్‌పై పూర్తి దర్యాప్తు చేపట్టాలని ఐసీసీ యాంటీ కరప్షన్ టీమ్‌ను ఆదేశించింది. గత 23 నుంచి 25 మధ్య దుబాయ్‌లో అజ్మన్ ఓవల్ మైదానంలో ఈ టీ20 లీగ్ నిర్వహించారు. లీగ్‌లో భాగంగా దుబాయ్ స్టార్స్-షార్జా వారియర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దుబాయ్ స్టార్స్ 136 పరుగులు చేసింది. 137 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వారియర్స్ ఆటగాళ్లు వరుసగా వికెట్లు సమర్పించుకొని 46కే ఆలౌట్ అయ్యారు. మ్యాచ్ అనంతరం ఈ వీడియోపై సోషల్ మీడియాలో దుమారం రేగింది. వారియర్స్ ఆటగాళ్లు ఫిక్సింగ్ పాల్పడ్డారని నెటిజన్లు ఆరోపించారు. ఈ వీడియో చూస్తే అందరికి అలానే అనిపిస్తుంది. వారియర్స్ ఆటగాళ్లు ఏమాత్రం బాధ్యత లేకుండా వికెట్లు పారేసుకోవడం అనుమానం కలిగిస్తోంది. -
వైరల్ : కావాలనే ఔట్ అయ్యారు!
-
ఐపీఎల్లో మళ్లీ మ్యాచ్ ఫిక్సింగ్?
► ఇద్దరు గుజరాత్ ఆటగాళ్ల పాత్ర ? ► ముగ్గురిని అరెస్టు చేసిన కాన్పూర్ పోలీసులు ► రూ.41 లక్షలు స్వాధీనం న్యూఢిల్లీ: ఐపీఎల్ దేశంలో అత్యంత ఆదరణ ఉన్న ఆట. ప్రపంచ దేశాల ఆటగాళ్లు ఒకచొట చేరి ఆడే ఆట. ఇది ప్రపంచంలో క్రికెట్ ప్రేమికులకు అసలైన వినోదాన్ని అందిస్తనటంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే ఈ ఐపీల్‌కు ఓ మచ్చ ఉంది. అది మ్యాచ్ ఫిక్సింగ్. 2013లో రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్, ఆటగాళ్లు ఆరోపణలు ఎదర్కున్న సంగతి తెలిసిందే. దీంతో రెండు జట్లు ఐపీఎల్ నుంచి తప్పించారు. అయితే తాజాగా మరో ఫిక్సింగ్ ఉదంతం వెలుగుచూసింది. ఐపీఎల్‌పై ఫిక్సింగ్ , చాపకింద నీరులా విస్తరిస్తోంది. తాజాగా ఫిక్సింగ్ ఆరోపణలతో ముగ్గురు వ్యక్తులను కాన్పూర్ పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో ఇద్దరు గుజరాత్ లయన్స్ ఆటగాళ్ల పాత్ర ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. దీనికి సంబంధించి బీసీసీఐ, ఐపీఎల్ అవినీతి నిరోధక శాఖకు గురువారం సమాచారం అందించిన సమాచారంతో రమేష్ నయన్ షా, రమేష్ కుమార్, వికాష్ కుమార్ అనే ముగ్గురిని అరెస్టు చేశారు. ఉత్తర ప్రదేశ్ క్రైం బ్రాంచ్ పోలీసుల సహకారంతో ఐపీఎల్ అవినీతి నిరోధక శాఖ వీరిని అరెస్టు చేసింది. వీరి వద్ద పోలీసులు నుంచి రూ.41 నగదు స్వాధీనం చేసుకున్నారు. రమేష్‌కుమార్ గ్రీన్ పార్క్ స్టేడియంలో హోర్డింగుల కాంట్రాక్టర్. ఇతడు క్రికెట్ బెట్టింగులు పెట్టే అజ్మీర్‌కు చెందిన బంటి పేరుమీద గుజరాత్, ఢిల్లీ ఆటగాళ్లు ఉండే హోటల్లో రూమ్ బుక్ చేసుకొని ఆటగాళ్లతో కలిసినట్లు పోలీసులు భావిస్తునారు. ప్రస్తుతం బంటి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. సీనియర్ పోలీసు అధికారి మాట్లాడుతూ ఇద్దరు గుజరాత్ ఆటగాళ్ల మీద నిఘా ఉందని, వారితో రమేష్ నయన్ షా తరచుగా వారితో కాంటాక్టులో ఉన్నట్లు భావిస్తున్నామని తెలిపారు. అయితే ఇంకా ఇది నిర్ధారణ కాలేదన్నారు. -
ఆ టెస్టు మ్యాచ్ ఫిక్సయ్యింది!
న్యూఢిల్లీ: దాదాపు ఏడాదిన్నర క్రితం మాంచెస్టర్ లో టీమిండియా- ఇంగ్లండ్ ల మధ్య జరిగిన నాల్గో టెస్టు మ్యాచ్ ఫిక్సయ్యిందనే ఆరోపణలు ఇప్పుడు కలకలం సృష్టిస్తున్నాయి. ఆ మ్యాచ్ లో ఫిక్సింగ్ జరిగిందంటూ ఆనాటి టీమిండియా క్రికెట్ మేనేజర్, ఇప్పటి డిల్లీ, ఢిల్లీ జిల్లా అసోసియేషన్ సెక్రటరీ సునీల్ దేవ్ వెల్లడించిన విషయం ఆదివారం హిందీ డైలీ సన్ స్టార్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో బయటపడింది. ఆ మ్యాచ్ లో బౌలింగ్ కు పరిస్థితులు అనుకూలంగా ఉంండగా టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం మొత్తం జట్టును ఆశ్చర్యానికి గురి చేయగా, ఆ తరువాత భారత్ ఇన్నింగ్స్ 54 పరుగుల తేడాతో ఓటమి పాలుకావడంతో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందనడానికి మరింతబలాన్నిచ్చిందని తెలిపాడు. తొలిరోజు బౌలింగ్ కు వందశాతం కచ్చితంగా అనుకూలిస్తుందని తెలిసినా, ధోని బ్యాటింగ్ తీసుకోవడం అందర్నీ డైలమాలో పాడేసిందన్నాడు. అంతకుముందు జరిగిన బోర్డు సమావేశంలో కూడా టాస్ గెలిస్తే తొలుత ఫీల్డింగ్ తీసుకోవాలని అనుకున్నట్లు సునీల్ దేవ్ తెలిపాడు. ఈ విషయాల్ని వీడియో రూపంలో బయటకు రావడంతో ఆ వార్త ఇప్పడు పెద్ద దుమారాన్ని రేపుతోంది. ఇదిలా ఉండగా, ఆ ఆరోపణల్ని సునీల్ దేవ్ ఖండిస్తున్నాడు. ఆ వీడియోకి తనకు ఎటువంటి సంబంధలేదని పేర్కొన్నాడు. తనపై ఆరోపణలు చేసిన ఆ హిందీ డైలీపై చర్యలు తీసుకోవడానికి సన్నద్ధమవుతున్నట్లు పేర్కొన్నాడు. 2014లో టీమిండియా-ఇంగ్లండ్‌ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ జరిగిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ ను ఇంగ్లండ్ 3-1తేడాతో గెలుచుకుంది. -
'చంద్రబాబు, కేసీఆర్ మ్యాచ్ ఫిక్సింగ్'
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, చంద్రశేఖర్ రావులు మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ ఆదివారం విమర్శించారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును జైలుకు పంపిస్తానన్న కేసీఆర్ ఇప్పుడు ఆ కేసు ఊసెత్తడం లేదనీ, అలాగే ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌ను జైలుకు పంపుతానన్న చంద్రబాబు కూడా ఇదే మౌనాన్ని పాటిస్తున్నారన్నారు. ఇద్దరి మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందనడానికి ఇదే నిదర్శనమన్నారు. తనవద్ద ఉన్న మున్సిపల్ శాఖను కేటీఆర్‌కు ఇస్తానన్న కేసీఆర్.. ఆ శాఖను తాను సమర్ధవంతంగా నిర్వహించలేకపోయానని ఒప్పుకున్నట్లేనా షబ్బీర్ అలీ ప్రశ్నించారు. -
టెన్నిస్‌లో ఫిక్సింగ్ కలకలం
లండన్: ఎన్నోసార్లు ప్రపంచ క్రికెట్‌ను కుదిపేసిన మ్యాచ్ ఫిక్సింగ్ జాఢ్యం టెన్నిస్కూ పాకింది. గత దశాబ్దకాలంగా ప్రపంచ టాప్-50 టెన్నిస్ క్రీడాకారుల్లో 16 మందికి ఫిక్సింగ్‌లో పాత్ర ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. వీరిలో గ్రాండ్ స్లామ్ విజేతలు కూడా ఉన్నారు. ప్రపంచ టెన్నిస్‌లో అత్యున్నత స్థాయిలో అవినీతి జరుగుతోందని, దీనికి సంబంధించిన రహస్య ఫైళ్లు తమ దగ్గర ఉన్నాయని బీబీసీ, బజ్‌ఫీడ్ న్యూస్ వెల్లడించాయి. 2016 సీజన్లో తొలి గ్రాండ్ స్లామ్ ఆస్ట్రేలియా ఓపెన్ ఆరంభంకానున్న తరుణంలో ఫిక్సింగ్ ఆరోపణలు రావడం కలకలం సృష్టిస్తోంది. 2007లో ఏటీపీ ఏర్పాటు చేసిన విచారణ బృందం నివేదికలోని వివరాలు తమ దగ్గర ఉన్నాయని బీబీసీ, బజ్‌ఫీడ్ వెల్లడించాయి. రష్యా, ఇటలీలలో బెట్టింగ్ ముఠాలున్నాయని, కోట్లాది రూపాయల బెట్టింగ్ జరిగిందని, కొన్ని మ్యాచ్‌లను ఫిక్సింగ్ చేసినట్టుగా భావిస్తున్నట్టు తెలిపాయి. 2008లో 28 క్రీడాకారుల ప్రమేయంపై విచారణ జరిగినట్టు బీబీసీ పేర్కొంది. 2009లో కొత్త అవినీతి వ్యతిరేక కోడ్‌ను ప్రవేశపెట్టాక, అంతకుముందు ఆరోపణలు వచ్చిన వారిపై చర్యలు తీసుకోలేదని వెల్లడించింది. గ్యాంబ్లర్లు మేజర్ టోర్నమెంట్లలో ఆటగాళ్లను లక్ష్యంగా చేసుకునేవాళ్లని, వారు బస చేసిన హోటళ్లలో సంప్రదించేవారని, ఫిక్సింగ్ చేయడానికి లక్షలాది రూపాయలను ఆఫర్ చేసేవారని బజ్‌ఫీడ్ వెల్లడించింది. కాగా అవినీతిని అరికట్టడంలో ఎలాంటి అలసత్వం చూపలేదని టెన్నిస్ అధికారులు బెబుతున్నారు. ఇలాంటి విషయాలను తేలిగ్గా తీసుకోలేదని ఏటీపీ చీఫ్ క్రిస్ కెర్మొడె చెప్పారు. కాగా ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న క్రీడాకారుల పేర్లను బీబీసీ, బజ్‌ఫీడ్ బయటపెట్టలేదు. -
ఒక్కో ఐపీఎల్ మ్యాచ్.. రూ.10 వేల కోట్ల బెట్టింగ్
ముంబయి: ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌లోని నలుగురు ఆటగాళ్లకు ఫిక్సింగ్‌తో సంబంధాలు ఉన్నాయని ఆయన ట్విట్టర్లో ఆరోపించారు. ఫిక్సింగ్ కుంభకోణంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లు ఉన్నారని మోడీ వ్యాఖ్యానించారు. ఐపీఎల్ లో ఒక్కో మ్యాచ్‌కు రూ.10వేల కోట్ల వరకూ బెట్టింగ్ జరుగుతోందని ఆయన ట్వీట్ చేశారు. కాగా ఐపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్ పై విచారణకు గతంలో సుప్రీం కోర్టు ముద్గల్ కమిటీని నియమించిన విషయం తెలిసిందే. -
టెన్నిస్కూ పాకిన మ్యాచ్ ఫిక్సింగ్ భూతం
టెన్నిస్‌లో కూడా మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారం మొదలైంది. ఇటలీ క్రీడాకారుడు డానియెల్ బ్రాసిలి ఈ విషయాన్ని విచారణలో పాక్షికంగా అంగీకరించాడు. దీంతో మరికొంతమంది టెన్నిస్ క్రీడాకారులను పోలీసులు విచారించే అవకాశం ఉంది. టెన్నిస్ మ్యాచ్‌లలో కొన్ని అమ్ముడుపోయాయంటూ కొన్ని వారాల క్రితం ఇటాలియన్ మీడియాలో కథనాలు గుప్పుమన్నాయి. దాంతో బ్రాసిలితో పాటు అప్పుడప్పుడు అతడితో కలిసి డబుల్స్ ఆడిని పోటిటో స్టారేస్ను పోలీసులు విచారించారు. ముందుగా వారి మధ్య సాగిన ఇంటర్నెట్ సంభాషణలను చూసిన తర్వాత ఈ విచారణ సాగింది. కేవలం వారు అడిగినవే కాక.. ఇంకా చాలా మ్యాచ్‌లకు సంబంధించి ఇలా మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారం సాగిందని పోలీసు విచారణ తర్వాత బ్రాసిలి చెప్పాడు. గతంలో డేవిస్ కప్‌లో ఇటలీ తరఫున డబుల్స్ ఆడిన బ్రాసిలి, స్టారేస్తో పాటు మరో ఐదుగురు క్రీడాకారులపై కూడా అక్రమంగా బెట్టింగ్ కట్టారన్న ఆరోపణలు వచ్చాయి. దాంతో వారందరినీ నిషేధించారు. -
ఫిక్సింగ్ వల్లే బాక్సింగ్‌లో ఓటమి?
ఆసియా క్రీడల్లో కొత్త వివాదం మొదలైంది. ఇంచియాన్‌లో జరుగుతున్న 17వ ఆసియా క్రీడల్లో భారత బాక్సర్ సరితాదేవి సెమీ ఫైనల్స్‌లో అద్భుతంగా పోరాడినా.. ఆమెను ఓడిపోయినట్లు ప్రకటించారని, దీని వెనుక మ్యాచ్ ఫిక్సింగ్ ఉందని ఆమె భర్త ఆరోపిస్తున్నారు. ఈ బౌట్లో తాను పూర్తి ఆధిపత్యం కనబర్చినా, చివరకు జడ్జిలు మాత్రం దక్షిణ కొరియాకు చెందిన జీనా పార్క్ గెలిచినట్లు ప్రకటించడంతో సరితాదేవి కూడా ఆగ్రహానికి గురైంది. ఇది చాలా అనాగరికమైన నిర్ణయమని సరిత భర్త తోయిబా సింగ్ అన్నారు. ఇలాగే తమకు కూడా అన్యాయం జరిగిందంటూ మంగోలియా జట్టు ఫిర్యాదు చేసిన తర్వాత భారత జట్టుకూడా ఫిర్యాదుచేసింది. అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య దక్షిణ కొరియా ఆధిపత్యంలో ఉంటుంది. అందుకే ఇలా జరిగిందని అంటున్నారు. ఇక మన బాక్సింగ్ సంఘాల విషయంలో అవినీతి ఆరోపణలు రావడంతో చివరకు కొత్తగా బాక్సింగ్ ఇండియా అనే సంస్థను అమెచ్యూర్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ ఫెడరేషన్ ఏర్పాటుచేయించింది. సరితాదేవి బౌట్‌ను సమీక్షించాలంటూ ఆమె భర్తతో పాటు టీమ్ కోచ్ సాగర్ ధైయ్యా కూడా ఫిర్యాదుచేశారు. ఇందుకోసం 500 డాలర్ల ప్రొటెస్ట్ ఫీజు కూడా కట్టారు. బాక్సింగ్‌లో భారత్‌కు తాము అనేక పతకాలు తెస్తున్నామని, అయినా జట్టు యాజమాన్యం మాత్రం నిరసన విషయంలో తమకు అండగా ఉండట్లేదని సరితాదేవి వాపోయింది. ఈశాన్య ప్రాంతాలకు చెందినవాళ్లు భారతీయులు కారా అని ఆమె నిలదీసింది. సరితకు జరిగిన అన్యాయం విషయంలో మేరీ కోమ్ కూడా నిరసన వ్యక్తం చేసింది. ప్రత్యర్థి కొరియా బాక్సర్ కావడం వల్లే సరిత ఓడిపోయినట్లు ప్రకటించారని, ఇది చాలా దారుణమని మేరీకోమ్ వ్యాఖ్యానించింది. -
దయనీయ స్థితిలో డాషింగ్ క్రికెటర్!
వెల్లింగ్టన్: ఒకప్పుడు తన ఆల్ రౌండ్ ప్రతిభతో బౌలర్లకు సింహస్వప్నంగా, బ్యాట్స్ మెన్లను బెంబేలెత్తించిన న్యూజిలాండ్ క్రికెటర్ క్రిస్ కెయిర్న్స్ ప్రస్తుత పరిస్థితి దయనీయంగా మారింది. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో కెయిర్న్స్ బ్రిటన్ ప్రభుత్వ పర్యవేక్షణలో న్యాయవిచారణను ఎదుర్కొంటున్నారు. గతంలో తన మూడవ భార్య మెల్ క్లోజర్ కు ప్రపోజ్ చేయడానికి 3.2 క్యారెట్ల డైమండ్ ను కొనుగోలు చేసిన కెయిర్న్.. కుటుంబ పోషణ భారంగా మారడంతో తప్పని పరిస్థితిలో న్యూజిలాండ్ దేశంలోని అక్లాండ్ లో ట్రక్కులను నడపడమే కాకుండా, బస్ షెల్టర్లు క్లీన్ చేయడానికి సిద్దపడ్డారు. బస్ షెల్టర్లు క్లీన్ చేసి గంటకు 17 డాలర్లను సంపాదిస్తున్నాడు. సొంత ఇల్లు లేదు.. ఇంటి అద్దె చెల్లించాలి. బిల్లులు చెల్లించాలి. కుటంబ ఆర్ధిక అవసరాలను తీర్చాల్సి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కెయిర్న్ కు మరోదారి దొరకలేదు అని క్లోజర్ ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబాన్ని కష్టాల్లోంచి గట్టెక్కించడానికి అనేక విధాలుగా ప్రయత్నిస్తున్నాడని, అందులో భాగంగా బస్ షెల్టర్లు క్లీన్ చేయడానికి కూడా సిద్దపడ్డారని సహచర క్రికెటర్ డియాన్ నాష్ మీడియాతో అన్నారు. ఫిక్సింగ్ ఆరోపణలతో తన స్నేహితుడు బలయ్యాడని, ఫిక్సింగ్ అరోపణల నుంచి నిజాయితీగా బయటపడుతారని.. కెయిర్న్ కు తన మద్దతు ఉంటుందని నాష్ అన్నాడు. -
అజయ్ శర్మకు క్లీన్చిట్
మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలను కొట్టివేసిన జిల్లా కోర్టు న్యూఢిల్లీ: దాదాపు 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ఢిల్లీ మాజీ కెప్టెన్ అజయ్ శర్మకు మ్యాచ్ ఫిక్సింగ్ కేసు నుంచి ఉపశమనం లభించింది. అతనిపై వచ్చిన ఫిక్సింగ్ ఆరోపణలను జిల్లా కోర్టు కొట్టివేసింది. కోర్టు తీర్పు సంతృప్తినిచ్చిందని చెప్పిన శర్మ ఇక నుంచి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తానన్నాడు. ‘గత 14 ఏళ్లు నా జీవితంలో ఓ కఠిన దశ. నేను ఎలాంటి తప్పు చేయలేదని కోర్టు నమ్మింది. నాకు ఎవరిపై కోపం లేదు. ఫస్ట్ క్లాస్ కెరీర్ అర్ధంతరంగా ముగిసినందుకు బాధపడడం లేదు. గతాన్ని మరచి ముందుకు సాగాలని కోరుకుంటున్నా. రంజీ, ఇతర దేశవాళీ టోర్నీల్లో నా కుమారుడు మన్నన్ శర్మ ఆడుతుంటే చూడాలని ఉంది. ఢిల్లీ క్రికెట్‌కు అవసరమైన సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నా’ అని 50 ఏళ్ల శర్మ పేర్కొన్నాడు. ఫిక్సింగ్ కేసు నుంచి బయటపడినందున బోర్డు నుంచి రావాల్సిన బకాయిలను బీసీసీఐ చెల్లిస్తే బాగుంటుందన్నాడు. 2000వ సంవత్సరంలో మ్యాచ్‌ఫిక్సింగ్ ఆరోపణల కారణంగా అజయ్శర్మపై బీసీసీఐ జీవితకాల నిషేధం విధించింది. -
ఐసీఎల్తోనే మొదలు!
ఫిక్సింగ్ గుట్టు విప్పిన విన్సెంట్ వెల్లింగ్టన్: మ్యాచ్ ఫిక్సింగ్‌తో జీవిత కాల నిషేధానికి గురైన న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ లూ విన్సెంట్ తాను ఫిక్సింగ్ ఉచ్చులో ఎలా పడ్డాడనే దానిపై తొలి సారి పెదవి విప్పాడు. ప్రస్తుతం మనుగడలో లేని ఇండియన్ క్రికెట్ లీగ్ (ఐసీఎల్)తోనే ఇది మొదలైందని చెప్పాడు. ‘ఐసీఎల్ కోసం ఇండియా వెళ్లాక ఒక వ్యక్తి తనను తాను స్పోర్ట్స్ మేనేజర్‌గా పరిచయం చేసుకొని తన కిట్ వాడకం గురించి డీల్ చేద్దామని పిలిచాడు. అతని రూమ్‌కు వెళితే ఒక అమ్మాయి కూర్చొని ఉంది. ఆమె ఆటగాళ్లకు ఎర వేసే ‘హనీ ట్రాప్’ అని నాకు అర్థమైంది. నేను స్పందించకపోవడంతో డాలర్ల కట్టలు నా ముందుంచాడు’ అని విన్సెంట్ వివరించాడు. అయితే ఈ ఘటన గురించి తాను ‘హీరో’గా అభిమానించే మరో ఆటగాడికి చెప్పేందుకు వెళ్లానని, కానీ ఆయన కూడా ప్రోత్సహించడంతో కాదనలేకపోయానని... ఆ తర్వాతా ఫిక్సింగ్‌ను కొనసాగించానని వెల్లడించాడు. -
నా పేరు విన్సెంట్...నేనో మోసగాడిని
లండన్/వెల్లింగ్టన్: న్యూజిలాండ్ మాజీ బ్యాట్స్‌మన్ లూ విన్సెంట్‌పై క్రికెట్ నుంచి జీవితకాల నిషేధం పడింది. మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడి క్రికెట్‌ను మోసం చేశానని ఈ ఆటగాడు బహిరంగంగా అంగీకరించడంతో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ), చాంపియన్స్ లీగ్ టి20 (సీఎల్‌టి20) ఈ నిర్ణయం తీసుకున్నాయి. కౌంటీ మ్యాచ్‌లతో పాటు 2012లో జరిగిన చాంపియన్స్ లీగ్‌లో ఆక్లాండ్ ఏసెస్ తరఫున ఆడుతూ ఫిక్స్ చేసినట్టు విన్సెంట్ అంగీకరించాడు. ‘నాపేరు లూ విన్సెంట్. నేను క్రికెట్‌ను మోసం చేశాను. ప్రొఫెషనల్ క్రీడాకారుడిగా నా స్థానాన్ని అనేక సార్లు దుర్వినియోగం చేశాను. మ్యాచ్‌లను ఫిక్స్ చేసేందుకు పలుమార్లు డబ్బులు తీసుకున్నాను. నేను నా దేశాన్నే కాకుండా, క్రికెట్‌ను, సన్నిహితులను మోసం చేశాను. ఈ విషయంలో తలదించుకుంటున్నాను. నా దేశ ప్రజలకు, ప్రపంచానికి, క్రికెట్ అభిమానులకు, కోచ్‌లకు, ఆటగాళ్లకు క్షమాపణలు చెబుతున్నాను’ అంటూ 35 ఏళ్ల విన్సెంట్ ఓ ప్రకటన విడుదల చేశాడు. క్రికెట్ కెరీర్లో విన్సెంట్ 23 టెస్టుల్లో 1332 పరుగులు చేయగా ఇందులో 3 సెంచరీలు, ఓ డబుల్ సెంచరీ ఉంది. 102 వన్డేల్లో 2413 పరుగులు చేశాడు. తొమ్మిది టి20లు ఆడాడు. ైనె ట్రైడర్స్తో మ్యాచ్‌లో ఫిక్సింగ్ దక్షిణాఫ్రికాలో 2012లో జరిగిన చాంపియన్స్ లీగ్ టి20లో ఆక్లాండ్ ఏసెస్ తరఫున విన్సెంట్ బరిలోకి దిగి రెండు మ్యాచ్‌ల్లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడు. అక్టోబర్ 15న కేప్‌టౌన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్ వీటిలో ఒకటి. హాంప్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ స్పాట్ ఫిక్సింగ్ చేశాడు. ఇక కౌంటీ క్రికెట్లో విన్సెంట్ మీద మొత్తం 18 ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఉనికిలో లేని ఇండియన్ క్రి కెట్ లీగ్ (ఐసీఎల్)తో పాటు బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లోనూ విన్సెంట్ ఫిక్సింగ్ చేశాడు. -
ఫ్లెమింగ్, వెటోరి సాక్ష్యమిచ్చారు!
క్రిస్ కెయిన్స్ ఆగ్రహం వెల్లింగ్టన్: మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ క్రిస్ కెయిన్స్ తన పూర్వ సహచరులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. స్టీఫెన్ ఫ్లెమింగ్, డానియెల్ వెటోరిలు ఐసీసీలో తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారని కెయిన్స్ వెల్లడి చేశాడు. తనను ఇరికించడంలో కైల్ మిల్స్, లూ విన్సెంట్, మెకల్లమ్‌ల పాత్ర కూడా ఉందని అతను అన్నాడు. ఇటీవల లండన్‌లో ఫిక్సింగ్‌కు సంబంధించి ఐసీసీ అవినీతి వ్యతిరేక విభాగం, ఈసీబీ, లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు సంయుక్తంగా కెయిన్స్‌ను విచారించారు. స్వస్థలం చేరుకున్న అనంతరం కెయిన్స్ మరో సారి తాను నిర్దోషినేనని స్పష్టం చేశా డు. ‘నన్ను పోలీసులు అరెస్టేమీ చేయలేదు. నా నిజాయితీ నిరూపించుకునేందుకు 40 వేల కిలో మీటర్లు ప్రయాణించి వారికి అన్ని విధాలా సహకరించాను. నాపై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారం. నేను ఎలాంటి తప్పూ చేయలేదు’ అని కెయిన్స్ వివరణ ఇచ్చాడు. -
ఉమర్ అక్మల్‌ను సంప్రదించిన బుకీ
కరాచీ: పాకిస్థాన్ క్రికెట్లో మరోసారి ఫిక్సింగ్ వివాదం తెర పైకి వచ్చింది. 2012లో పాక్ జట్టు యూఏఈ పర్యటనలో ఉన్నప్పుడు ఉమర్ అక్మల్‌ను మ్యాచ్‌లను ఫిక్స్ చేయాల్సిందిగా ఓ బుకీ సంప్రదించాడు. అయితే ఈ విషయాన్ని వెంటనే ఉమర్ జట్టు సెక్యూరిటీ మేనేజర్‌కు తెలియపర్చాడు. ‘భారత్‌కు చెందిన నంబర్ నుంచి ఉమర్ అక్మల్‌కు రెగ్యులర్‌గా ఓ కాల్ వచ్చేది. ఫిక్సింగ్ రాకెట్లోకి ప్రవేశిస్తే ఊహించనంత డబ్బు ఇస్తానని మూడు సార్లు ఆ బుకీ ప్రలోభపెట్టాడు. అయితే ఈ గుర్తుతెలియని వ్యక్తి గురించి అక్మల్ వెంటనే పాకిస్థాన్ టీమ్ సెక్యూరిటీ మేనేజర్‌కు తెలిపాడు. వారు ఈ అంశాన్ని ఐసీసీ ఏసీఎస్‌యూ ముందుంచారు. నిజాయితీగా విషయాన్ని వ్యక్తపరిచినందుకు అందరూ అక్మల్‌ను అభినందించారు’ అని బోర్డు అధికారి ఒకరు తెలిపారు. ఆ పర్యటనలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను పాక్ 3-0తో గెలుచుకుంది. -
బయటకు రావడం షాక్: మెకల్లమ్
క్రైస్ట్‌చర్చ్: మ్యాచ్ ఫిక్సింగ్ విచారణలో భాగంగా ఐసీసీ ఏసీఎస్యూకి తానిచ్చిన వాంగ్మూలం మీడియాకు లీక్ కావడంపై న్యూజిలాండ్ స్టార్ బ్యాట్స్‌మన్ బ్రెండన్ మెకల్లమ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. తన భార్య మూడో సంతానానికి జన్మనివ్వనున్న కారణంగా మెకల్లమ్ ఐపీఎల్ నుంచి స్వదేశానికి వచ్చాడు. ‘ముందుగా నేనో విషయం స్పష్టం చేయదలుచుకున్నాను. ఇప్పటిదాకా ఏ క్రికెట్ మ్యాచ్‌నూ నేను ఫిక్స్ చేయలేదు. ఈ ఆటలో నెలకొన్న అవినీతిపై పోరాడేందుకు వంద శాతం సిద్ధంగా ఉన్నాను. నమ్మకంతోనే ఐసీసీకి నేను వాంగ్మూలం ఇచ్చాను. అయితే మీడియాలో ఇదంతా రావడం షాక్‌కు గురిచేసింది. అయితే మున్ముందు కూడా ఐసీసీకి ఈ విషయంలో సహకారం అందిస్తాను’ అని మెకల్లమ్ వివరించాడు. లూ విన్సెంట్‌పై ఈసీబీ అభియోగాలు లండన్: మూడేళ్ల క్రితం కౌంటీ మ్యాచ్‌ను ఫిక్స్ చేసినందుకు న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ లూ విన్సెంట్, అతడి ససెక్స్ సహచరుడు ఆరిఫ్‌లపై ఇంగ్లండ్ బోర్డు చర్యలకు సిద్ధమవుతోంది. 15కు పైగా కౌంటీ మ్యాచ్‌లను వీరిద్దరు ఫిక్స్ చేశారని అభియోగాలు ఉన్నాయి. -
మెకల్లమ్ వాంగ్మూలం ఎలా లీకైంది?
విచారణ చేపట్టిన ఐసీసీ దుబాయ్: న్యూజిలాండ్ స్టార్ బ్యాట్స్‌మన్ బ్రెండన్ మెకల్లమ్ అవినీతి నిరోధక యూనిట్ (ఏసీఎస్‌యూ) ముందు ఇచ్చిన వాంగ్మూలం మీడియాకు లీక్ కావడంపై ఐసీసీ విచారణ చేపట్టింది. అయితే ఈ అంశంలో మెకల్లమ్‌పై ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయలేదు. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో కివీస్ బ్యాట్స్‌మన్ ఈ వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. ‘వాంగ్మూలం అంశం చాలా సీరియస్ విషయం. తక్షణ విచారణ జరిపేందుకు అందుబాటులో ఉన్న అన్ని వనరులను ఉపయోగించుకుంటాం. ఇంత రహస్య అంశం మీడియాకు ఎలా చేరిందో కనిపెడతాం. ఏదేమైనా అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న వారిలో భరోసా నింపాల్సిన అవసరం ఉంది. ఏసీఎస్యూపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టేందుకు ప్రయత్నిస్తాం. తద్వారా ఆట సమగ్రతను కాపాడతాం’ అని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రిచర్డ్సన్ వ్యాఖ్యానించారు. వాంగ్మూలం లీక్ విషయంలో మెకల్లమ్‌పై ఎలాంటి విచారణ జరపబోమని చెప్పిన ఆయన మరో క్రికెటర్ లూ విన్సెంట్‌పై వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు. క్రికెట్‌ను క్లీన్‌గా ఉంచేందుకు ఏసీఎస్‌యూ అద్భుతంగా పని చేస్తోందన్నారు. ఐసీసీకి చెందిన ప్రాంతాల్లో స్థానిక చట్టాలు, దర్యాప్తు సంస్థలతో కలిసి పని చేయడానికి అవసరమైన లింక్‌లను ఏసీఎస్‌యూ అభివృద్ధి చేసుకుందని వెల్లడించారు. అవసరమైనప్పుడు ప్రభుత్వేతర సంస్థలు, న్యాయస్థానాలను కూడా ఉపయోగించుకుంటామని తెలిపారు. ఏదేమైనా అవినీతిపై పోరాటం కొనసాగిస్తామని సీఈఓ స్పష్టం చేశారు. -
బుకీలతో ఫిక్సయ్యాడు.. ఐసీసీకి బుక్కయ్యాడు!
-
ఇలా కలసిపోతున్నారు!
ఉద్ధృతంగా వీస్తున్న వైఎస్సార్సీపీ ప్రభంజనం.. టీడీపీ దుష్ర్పచారాన్ని నమ్మని జనం.. గ్రామస్థాయిలో ఎదురవుతున్న చేదు అనుభవాలు.. జిల్లాలో సైకిల్ గాలి తీసేస్తున్నాయి. మరోవైపు.. పేరుకు జాతీయ పార్టీ. రాష్ట్ర విభజనతో గల్లీ పార్టీ కన్నా హీనంగా మారిన పరిస్థితి. పేరుకు అన్ని చోట్లా అభ్యర్థులు రంగంలో ఉన్నా ఒక్కరన్నా గెలిచే పరిస్థితి లేదన్నది కాంగ్రెస్‌కు మొదటే అవగతమైంది. మరెలా.. ప్రధాన ప్రత్యర్థి అయిన వైఎస్ఆర్సీపీని వేర్వేరుగా ఢీకొనలేమన్న నిర్ణయానికి వచ్చిన ఈ రెండు పార్టీలు శత్రువుకి శత్రువు మిత్రుడన్న సూత్రాన్ని అందిపుచ్చుకున్నాయి. ఉమ్మడి ప్రత్యర్థి అయిన వైఎస్ఆర్సీపీని ఢీకొనేందుకు కుమ్మక్కు రాజకీయానికి తెర తీశాయి. ప్రధానంగా టీడీపీ ఏకంగా కాంగ్రెస్ అభ్యర్థులనే బుట్టలో వేసుకునేందుకు మంత్రాంగం నెరుపుతోంది. చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం’ అనే రీతిలో కాంగ్రెస్ అభ్యర్థులూ సరేనంటున్నారు. ఒక జాతీయ పార్టీ.. మూడు దశాబ్దాల చరిత్ర ఉన్న మరో ప్రాంతీయ పార్టీ కలిసి కొత్త పార్టీ అయిన వైఎస్ఆర్సీపీని ఎదుర్కోలేక ఎలా కుమ్మక్కవుతున్నారో చూద్దాం రండి.. - సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం నరసన్నపేటలో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ విజయం నల్లేరుపై నడకేనని.. మెజార్టీ ఎంతన్నదే లెక్క తేలాల్సి ఉందన్న విషయాన్ని టీడీపీ, కాంగ్రెస్‌లు గుర్తించాయి. దాంతో ఇక లాభం లేదని ఆ రెండు పార్టీలు నియోజకవర్గస్థాయి నుంచి గ్రామస్థాయి వరకు ఒక్కటవుతున్నాయి. ఇందులో భాగంగానే టీడీపీ ఎంపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్ నాయుడు నరసన్నపేట కాంగ్రెస్ అభ్యర్థి డోల జగన్మోహన్రావు ఇటీవల మంతనాలు సాగించినట్లు తెలుస్తోంది. వారి మధ్య కుదిరిన ఒప్పందం మేరకు డోల జగనే టీడీపీకి ఓటేయాలని కాంగ్రెస్ శ్రేణులకు సంకేతాలు పంపుతున్నారు. ఇప్పటికే పోలాకి మండలంలో కాంగ్రెస్ కార్యకర్తలను ఆ దిశగా సంసిద్ధం చేశారు. ఒకటి రెండ్రోజుల్లో మిగిలిన మండలాలకూ ఈ సందేశాన్ని అందించనున్నారు. పాతపట్నంలో ఎదురీదుతున్న మాజీమంత్రి శత్రుచర్ల విజయరామరాజు కూడా కమ్మక్కు కుట్రనే నమ్ముకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి కలమట వెంకటరమణ ఘన విజయం దాదాపు ఖాయమని తేలడంలో టీడీపీలో గుబులు పట్టుకుంది. సామాజికవర్గ సమీకరణలు కూడా వైఎస్సార్ కాంగ్రెస్‌కు చాలా అనుకూలంగా ఉండటంతో ఏం చేయాలేని స్థితిలో పడిపోయింది. దాంతో దింపుడు కళ్లెం ఆశతో కాంగ్రెస్ అభ్యర్థి పాలవలస కరుణాకర్‌తో మంతనాలు సాగిస్తోంది. టీడీపీ ఎంపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్నాయుడు కూడా ఆయనకు మంచి ప్యాకేజీ ఆఫర్ చేసి లోపాయికారీ చర్చలు కొనసాగిస్తున్నారు. డీల్ కుదిరితే టీడీపీకి ఓటేయాలని కరుణాకరే కాంగ్రెస్ కార్యకర్తలకు చెప్పాలన్నది ఒప్పందం. బొడ్డేపల్లి ప్రాపకం కోసం కూన పాట్లు ఆమదాలవలస అంటేనే తమ్మినేని, బొడ్డేపల్లి కుటుంబాల రాజకీయ క్షేత్రం. కానీ ఈసారి కాంగ్రెస్ అభ్యర్థి బొడ్డేపల్లి సత్యవతి ముందే కాడి వదిలేస్తున్నట్లు తెలుస్తోంది. పోరాడితే పోలింగ్ వరకు గట్టిగా నిలబడాలి. అదంతా వ్యయప్రయాసలతో కూడుకున్నది.. పైగా గెలిచే అవకాశాలు లేనప్పుడు చేతి చమురు ఎందుకు వదల్చుకోవాలని ఆమె భావిస్తున్నారు. దీన్ని గుర్తించిన కూన రవి ఆమెతో మంతనాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. కూనకు సహకరించేందుకు సత్యవతి సూత్రప్రాయంగా అంగీకరించారని తెలుస్తోంది. ఈ పరిణామాలపై కాంగ్రెస్ కార్యకర్తలు భగ్గుమంటున్నారు. కాంగ్రెస్ తుడుచుకుపెట్టుకుపోయినా కేవలం బొడ్డేపల్లి కుటుంబంపై ఉన్న అభిమానంతో తాము పార్టీలో కొనసాగుతుంటే సత్యవతి ఇలా కుమ్మక్కు కావడమేమిటని ప్రశ్నిస్తున్నారు. పాలకొండలో ఒక్కటైన ‘నిమ్మక’ - ఎంపీ ఓట్లు కిశోర్‌కు గురుదక్షిణ!? గురుభక్తి కేంద్ర బిందువుగా పాలకొండలో కాంగ్రెస్ టీడీపీతో జట్టు కట్టింది. తాను గెలవనని నిర్ధారించుకున్న కాంగ్రెస్ అభ్యర్థి నిమ్మక సుగ్రీవులు.. కనీసం తన రాజకీయ గురువు కేంద్రమంత్రి కిశోర్‌చంద్రదేవ్‌కు మేలు చేయాలని భావించారు. అందుకే టీడీపీతో తెరచాటు ఒప్పందానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే ఓట్లను టీడీపీ అభ్యర్థి నిమ్మక జయరాజ్‌కు వేయించేందుకు.. ప్రతిగా ఎంపీ ఓట్లను కాంగ్రెస్ అభ్యర్థి కిశోర్ చంద్రదేవ్‌కు వేయాలన్నది ఒప్పందమని సమాచారం. ఈ ఒప్పందంతో పాలకొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రచారాన్ని దాదాపుగా నిలిపివేసింది. తూతూ మంత్రంగా చేస్తున్న ప్రచారంలో కూడా ప్రధానంగా ఎంపీ ఓటు గురించే అభ్యర్థిస్తుండటం గమనార్హం. టీడీపీ అభ్యర్థి నిమ్మక జయకృష్ణ కూడా ఎంపీ ఓట్ల విషయంలో కిశోర్‌కు అనుకూలంగా మాట్లాడుతున్నారు. అంతేగానీ టీడీపీ ఎంపీ అభ్యర్థి గుమ్మడి సంధ్యారాణికి ఓటేయాలని ప్రస్తావించడమే లేదు. టీడీపీ వైపు తిరిగిన ‘వంకా’ పలాస నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి వంకా నాగేశ్వరరావు ప్రచారం ఇష్టం లేని కాపురంలా సాగుతోంది. దీన్ని గుర్తించిన టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు రామ్మోహన్, శివాజీ ఆయనతో జరిపిన లోపాయికారీ సంప్రదింపులు ఫలించినట్లు తెలుస్తోంది. దాంతో టీడీపీకి సహకరించాలని నాగేశ్వరరావు తన వర్గీయులకు చెబుతున్నట్లు సమాచారం. కాంగ్రెస్ తరఫున ప్రచారానికి కేంద్రమంత్రి చిరంజీవి నియోజకవర్గానికి వస్తే తన సామాజికవర్గం అత్యధికంగా ఉన్న వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవులో ఆయనతో ప్రచారం చేయించకపోవడమే ఇందుకు నిదర్శనం. దీంతో వంకా నాగేశ్వరరావు టీడీపీ బుట్టలో పడ్డారని కాంగ్రెస్ కార్యకర్తలే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. బెందాళంతో జట్టుకట్టిన లల్లూ ఇచ్ఛాపురం కాంగ్రెస్ అభ్యర్థి నరేష్ కుమార్ అగర్వాల్(లల్లూ) టీడీపీ అభ్యర్థి బెందాళం అశోక్‌తో జత కట్టారు. ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహారం సాగిస్తున్నారు. టీడీపీ ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ గాలానికి ఆయన చిక్కినట్లు సమాచారం. తాను ఎలాగూ గెలిచే అవకాశం లేనందున తనకు అంతో ఇంతో పట్టున్న కంచిలి, కవిటి మండలాల్లో టీడీపీతో అంటకాగుతున్నారు. ఆ రెండు మండలాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు టీడీపీ శిబిరంలో కనిపిస్తున్నారు. మసకబారిన ‘కిరణం’ ఎచ్చెర్లలో కాంగ్రెస్ ఆశా కిరణం పోలింగ్‌కు ముందే మసకబారిపోయిది. ఎన్నికల సమరం తన వల్ల కాదని కాంగ్రెస్ అభ్యర్థి రవి కిరణ్ గ్రహించారు. దాంతో ఆయన కుటుంబంతో ఉన్న పాత స్నేహాన్ని తిరగదోడుతూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కళా వెంకట్రావు రంగంలోకి దిగారు. ఈ ప్రయత్నం ఫలించినట్లే కనిపిస్తోంది. అందుకే రవికిరణ్ దాదాపుగా అస్త్ర సన్యాసం చేసి ఎక్కువగా ఇంటికే పరిమితమవుతున్నారు. -
టీడీపీతో సంకరం!
జోగి..జోగి..రాసుకుంటే బూడిద రాలుతుంది తప్పా మరే విధమైన ప్రయోజనం ఉండదు. ఈ విషయం తెలిసినా డిపాజిట్లు పోకుండా పరువు నిలుపుకోడానికి కాంగ్రెస్, టీడీపీ నేతలు అనైతికంగా జతకడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఆ రెండు పార్టీల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఈ విషయం అర్థంకావడం తో చాలా మంది అభ్యర్థులు ప్రచారంపై కూడా పెద్దగా దృష్టిసారించ డం లేదు. అయితే ఆశ చావని పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సంకర రాజకీయాలకు తెరలేపారు. టీడీపీతో లోపాయికారీగా చేతులు కలిపారు. తమ ప్రయోజనాలు నెరవేరేందుకు సొంత పార్టీ అభ్యర్థులను బలిపశువులును చేసేందుకు ఆ రెండు పార్టీల నేతలు సిద్ధమయ్యారు. అయితే విషయం బయటకు పొక్కడంతో ప్రజలు ఈసడించుకుంటున్నారు. ఇటు చీపురుపల్లి, అటు విజయనగరం నియోజకవర్గాల్లో ఈ గూడుపుఠాణీ వ్యవహారంపై జోరుగా చర్చ సాగుతోంది. సాక్షి ప్రతినిధి, విజయనగరం : చీపురుపల్లి నియోజవర్గంలో కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఎదురీదుతున్నారు. గెలుపు అవకాశాలు ఏ కోశానా కనిపిం చడం లేదు. అదే నియోజకవర్గంలో టీడీపీ తరఫున పోటీచేస్తున్న కిమిడి మృణాళిని పరిస్థితి చెప్పనక్కరలేదు. సొంత పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అలాగే విజయనగరం నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేస్తున్న మీసాల గీత పరిస్థితి కూడా దీనికి ఏమీ తీసిపోదు. టీడీపీ శ్రేణులు ఆమెను తమ అభ్యర్థిగా గుర్తించడానికి కూడా ఇష్టపడడం లేదు. కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నయడ్ల రమణమూర్తి అసలు బరిలో ఉన్నారో? లేరో? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఈ రెండు పార్టీలలో నేతలు అనైతిక అవగాహనకు వచ్చినట్టు సమాచా రం. చీపురుపల్లిలో దూసుకుపోతున్న వైఎస్ఆర్ సీపీ ప్రభంజనాన్ని తట్టుకోలేని బొత్స సత్యనారాయణ ఎన్ని అడ్డదారులు తొక్కడానికైనా సిద్ధమవుతున్నా రు. చీపురుపల్లిలో తనను గెలిపిస్తే, విజయనగరం లో టీడీపీ గెలుపునకు సహకరిస్తానని సంకేతాలు పంపినట్టు సమాచారం. ఈ క్రమంలో చీపురుపల్లిలో టీడీపీ అభ్యర్థి కిమిడి మృణాళిని, విజయనగరంలో కాంగ్రెస్ అభ్యర్థి యడ్ల రమణమూర్తిలను బలిపశువులును చేసేందుకు సిద్ధమవుతున్నారు. విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గ రాజకీయాల గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇక్కడ కాంగ్రెస్‌లో మొదటి నుంచీ మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు నడుస్తున్నాయి. పార్టీలో బలమైన నాయకుడిగా ఉన్న కోలగట్ల వీరభద్రస్వామి ఎదగకూడదని 1989 ఎన్నికల దగ్గరి నుంచి ఓ వర్గం మ్యాచ్ ఫిక్సిం గ్ రాజకీయాలు చేస్తోంది. అందుకు తగ్గట్టుగానే వీరభద్రస్వామికి అప్పట్లో ప్రతికూల ఫలితాలొచ్చాయి. ఆయన గెలిస్తే తాము ఉనికిని కోల్పోవలసి వస్తుంద న్న భయంతో లోపాయికారీగా వ్యవహారాన్ని నడుపుతూ వచ్చారు. అందుకనే, ఎందరి మద్దతు ఉన్నా, ప్రజాదరణతో దూసుకుపోతున్నా కాంగ్రెస్‌లో ఉన్నంతకాలం మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాల మధ్య వీరభద్రస్వామికి ఇబ్బందేనన్న వాదన ఉంది. కాం గ్రెస్‌ను వీడి, బయటకు వచ్చిన తరువాతే ఆయన విజయం సాధించగలిగారు. తరువాత మళ్లీ కాంగ్రెస్ లో చేరారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌పై పెద్ద ఎత్తున వచ్చిన వ్యతిరేకత, అభిమానుల కోరిక మేరకు కోలగట్ల తాజాగా వైఎస్సార్సీపీలో చేరారు. చేరుడమే తరువాయి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ఆప్యాయంగా అక్కున చేర్చుకుంటున్నారు. దీంతో ఎన్నిక లు ఏకపక్షమయ్యే పరిస్థితి ఏర్పడింది. ప్రత్యర్థి పార్టీ లు ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతున్నాయి. పరువు కూడా నిలుపుకోలేని పరిస్థితిని ఎదుర్కొం టున్నాయి. ఇలాగైతే కష్టమన్న అభిప్రాయంతో కాం గ్రెస్ నాయకులు మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలకు దిగారు. టీడీపీతో చేతులు కలుపుతున్నారు. చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణను, విజయనగరంలో మీసాల గీతను గెలిపించాలని వారి ఎత్తుగడ. ముఖ్యంగా ఇటీవల చీపురుపల్లిలో టీడీపీ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేసి, ప్రలోభాలకు లొంగిపో యి వెనక్కి తగ్గిన త్రిమూర్తులు రాజు అనుచరులు కాంగ్రెస్ నేతలతో టచ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే జెండాలు మోసి, బ్యానర్లు కట్టి పగలూరాత్రి అనకుండా, మండుటెండలో సైతం పనిచేస్తున్న తమను వెర్రివారిని చేసి నేతులు చేసుకుంట్ను మ్యాచ్ ఫిక్సింగ్పై రెండు పార్టీల కార్యకర్తలు భగ్గుమంటున్నారు. భరించలేక ఆ రెండు పార్టీల నుంచి పెద్ద ఎత్తున వైఎస్సార్సీపీలోకి వచ్చేస్తున్నారు. ఇటీవల విజయనగరం, చీపురుపల్లిలలో జరిగిన వలసలే దీనికి ఉదాహరణ. ఇలాగైతే గెలవడం కాదు కదా, కనీసం ఉనికిలో లేకుండా పోయే ప్రమాదం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. -
మ్యాచ్ ఫిక్సింగ్: ఏడుగురు బ్రిటిష్ ఆటగాళ్ల అరెస్టు
మ్యాచ్ ఫిక్సింగ్ భూతం కేవలం క్రికెట్లోనే కాదు.. ఫుట్‌బాల్‌కు కూడా పాకేసింది. వాయవ్య ఇంగ్లండ్‌లోని ఫుట్‌బాల్ లీగ్ క్లబ్బులకు చెందిన ఏడుగురు ఆటగాళ్లను మ్యాచ్‌ఫిక్సింగ్ కుంభకోణంలో అరెస్టు చేశారు. వీళ్లంతా 18 నుంచి 30 సంవత్సరాలలోపు వాళ్లే. మరో ఆరుగురు ఆటగాళ్లను కూడా అనుమానం మీద డిసెంబర్ నెలలోనే అరెస్టుచేసినా, తర్వాత బెయిల్ మీద వారిని విడుదల చేశామని, ఇప్పుడు వాళ్లను కూడా మళ్లీ అరెస్టు చేశామని నేషనల్ క్రైం ఏజెన్సీ తెలిపింది. ద సన్ పత్రిక అందించిన ఆధారాలతో దర్యాప్తు ప్రారంభించామని, ఇది మరింత కొనసాగుతుందని ఎన్సీఏ వర్గాలు తెలిపాయి. మొత్తం 13 మంది ఆటగాళ్లను లంచాలు, మనీలాండరింగ్ నేరాల గురించి విచారిస్తున్నారు. ఫుట్‌బాల్ అసోసియేషన్‌కు కూడా ఈ దర్యాప్తు, అరెస్టుల గురించి ఎన్సీఏ వర్గాలు సమాచారం అందించాయి. -
ధోనీ గరం గరం..!
-
టార్గెట్!
టీడీపీ, కాంగ్రెస్‌లు సరికొత్త మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలకు తెరతీశాయి. గుండ, కిల్లి కుటుంబాలు సాగిస్తున్న ఈ రాజకీయ క్రీడలో కింజరాపు వికెట్టే టార్గెట్. ఇందుకు శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గమే మైదానం. కాంగ్రెస్‌లో కొనసాగుతున్న కొద్దిమంది నేతలతో ఈ మేరకు సంప్రదింపుల ప్రక్రియ వేగం పుంజుకుంది. ఒకవైపు సదరు నేతలు కాంగ్రెస్‌ను వీడకుండా కేంద్రమంత్రి బుజ్జగిస్తుంటే.. మరోవైపు గుండ కుటుంబ సభ్యులు మంతనాలు సాగిస్తున్నారు. ఈ రెండు వర్గాలదీ ఉభయతారక మంత్రమే. ఒక ఓటు ఇటు... ఇంకో ఓటు అటు.. అని ప్రతిపాదిస్తున్నారు. కింజరాపు రామ్మోహన్‌నాయుడుతో కలసి పని చేస్తున్నట్లు నటిస్తూనే గుండ కుటుంబం తన దారి తాను చూసుకుంటోంది. కృపారాణి కూడా అదే బాటలో శ్రీకాకుళంలో పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థితో నిమిత్తం లేకుండా ఓట్ల వేట సాగిస్తున్నారు. ఈ సరికొత్త క్రీడ శ్రీకాకుళం నియోజకవర్గ రాజకీయాన్ని రసవత్తరం చేస్తోంది. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: శ్రీకాకుళంలో పరస్పరం సహకరించకునే టీడీపీ, కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయ క్రీడలో తొలి అంకానికి గుండ కుటుంబం శ్రీకారం చుట్టింది. జిల్లా కేంద్రంలో కాంగ్రెస్‌లో మిగిలిన ఉన్న కొద్దిమంది నేతలకు కింజరాపు కుటుంబమంటే ఏమాత్రం పడదు. కానీ వారితో గుండ అప్పలసూర్యనారాయణ కుటుంబ సభ్యులు కొన్ని రోజులుగా మంతనాలు సాగిస్తుండటం విశేషం. గుజరాతిపేటలో కాంగ్రెస్ నేత దంతులూరి రమేష్‌బాబుతో కొన్ని రోజుల క్రితం టీడీపీ నేత గుండ లక్ష్మీదేవి సంప్రదింపులు జరిపారు. వాస్తవానికి రమేష్ బాబుపై గుండ కుటుంబం గత కొన్నేళ్లుగా తీవ్ర అవినీతి ఆరోపణలు చేస్తూ వచ్చింది. కానీ ఎన్నికల తరణంలో అవన్నీ వదిలేసి ఆయనతో జట్టు కట్టేందుకు సిద్ధపడింది. లక్ష్మీదేవి ఇటీవల ఆయన ఇంటికి వెళ్లి మరీ తమకు సహకరించాల్సిందిగా కోరారు. గుజరాతిపేటలో పదేళ్లుగా టీడీపీ బాధ్యతలు చూస్తున్న కీలక నేతలకు కూడా సమాచారమివ్వకుండా ఆమె రమేష్‌బాబుతో సంప్రదింపులు జరపడం గమనార్హం. తాము టీడీపీలోకి రాలేమని ఆయన చెప్పగా.. పార్టీలోకి రాకపోయినా పర్లేదు ఎన్నికల్లో సహకరించాలని లక్ష్మీదేవి కోరారు. ఎమ్మెల్యే ఓటు వరకు సహకరిస్తాంగానీ ఎంపీ ఓటు గురించి మాత్రం అడగవద్దని రమేష్‌బాబు కరాఖండీగా చెప్పేశారు. ఇందుకు గుండ కుటుంబం సమ్మతించినట్లు తెలుస్తోంది. అంటే ఎంపీ ఓటు వేయకపోయినా పర్లేదు... ఎమ్మెల్యే ఓటు తమకు వేస్తే చాలన్న రీతిలో వారు మంత్రాంగం నడుపుతున్నారన్న మాట. అదే విధంగా కాంగ్రెస్ పట్టణ శాఖ అధ్యక్షుడు సుంకరి కృష్ణ, తదితరులతో కూడా గుండ కుటుంబం మంతనాలు సాగిస్తోంది. సుంకరి కృష్ణను టీడీపీలోకి ఆహ్వానించారు. మున్సిపల్ చైర్మన్ పదవి హామీ ఇస్తే తప్ప తాను పార్టీలోకి రాలేనని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. పార్టీలోకి రాకపోయినా ఎన్నికల్లో తమకు సహకరిచాల్సిందిగా గుండ కుటుంబం కోరింది. సుంకరి కృష్ణ కూడా ఎమ్మెల్యే ఓటు వరకు సహకారం అందిస్తాం.. ఎంపీ ఓటు గురించి మాత్రం ప్రస్తావించవద్దని చెప్పేశారు. దానికి అభ్యంతర చెప్పకుండా గుండ కుటంబం ఓకే అన్నట్లు సమాచారం. అంటే.. ఎంపీ అభ్యర్థి రామ్మోహన్‌తో పని లేకుండా తమ ఓటు పదిలం చేసుకునే పనిలో పడిందన్న మాట. లక్ష్మీదేవి అడుగుజాడల్లో కృపారాణి ఇక మ్యాచ్ ఫిక్సింగ్ రెండో భాగాన్ని కేంద్రమంత్రి కృపారాణి తన భుజాన వేసుకున్నారు. ముందుగా కుదిరిన ఒప్పందం ప్రకారం గుండ లక్ష్మీదేవి బాటలోనే ఆమె సాగుతున్నారు. లక్ష్మీదేవి సంప్రదింపులు జరిపి వచ్చిన వెంటనే అదే నేతలతో కృపారాణి మంతనాలు సాగిస్తున్నారు. దంతులూరి రమేష్‌బాబుతో లక్ష్మీదేవి చర్చలు జరిపిన కొన్ని రోజులకే కృపారాణి ఆయనతో మంతనాలు సాగించి కాంగ్రెస్‌లోనే కొనసాగాలని కోరారు. ఎంపీ ఓటు తనకు వేయాలని.. ఎమ్మెల్యే ఓటు లక్ష్మీదేవికి వేయాలని ప్రతిపాదించారు. అంటే లక్ష్మీదేవి ఏ ఒప్పందానికి వచ్చారో.. అదే ఒప్పందానికి కృపారాణి సై అన్నారు. ఆ తర్వాత పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సుంకరి కృష్ణ నివాసానికి కూడా వెళ్లి ఎంపీ అభ్యర్థిగా తనకు మద్దతిస్తే చాలు.. ఎమ్మెల్యే అభ్యర్థిగా గుండ లక్ష్మీదేవికి సహకరించినా పర్లేదని చెప్పేశారు. శ్రీకాకుళం రూరల్, గార మండలాల్లోని పలువురు కాంగ్రెస్ నేతలతో కూడా లక్ష్మీదేవి, కృపారాణి ఇటువంటి ఒప్పందాలే కుదుర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు సమీపించేకొద్దీ ఈ పరస్పర సహకార ఉద్యమాన్ని మరింత పకడ్బందీగా నిర్వహించాలన్నది వారి ఉద్దేశంగా ఉంది. అటు గుండ కుటుంబం తమ పార్టీ ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ గెలుపు కోసం పట్టించుకోవడం లేదు.. ఇటు కృపారాణి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి గురించి ఏమాత్రం ఆలోచించడం లేదు. రసవత్తరంగా సాగుతున్న ఈ ఫిక్సింగ్ రాజకీయం పర్యవసనాలు ఎలా ఉంటాయో మరి! -
అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్, టీడీపీ మ్యాచ్‌ఫిక్సింగ్
అసెంబ్లీ సాక్షిగా మరోసారి బట్టబయలైన కాంగ్రెస్, టీడీపీ మ్యాచ్‌ఫిక్సింగ్ రాజకీయాలు సభలో టార్గెట్ వైఎస్సార్ సోనియాను టీడీపీ విమర్శిస్తే అభ్యంతరం తెలిపిన కాంగ్రెస్ వైఎస్‌పై విమర్శలు చేసినా మౌనం సభా సంప్రదాయాన్ని పట్టించుకోని వైనం తెలంగాణకు అనుకూలంగా బాబు ఇచ్చిన లేఖపై టీడీపీ దాటవేత వైఖరి సాక్షి, హైదరాబాద్: అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీ మ్యాచ్‌ఫిక్సింగ్ రాజకీయాలు శాసనసభ సాక్షిగా మరోసారి బట్టబయలయ్యాయి. సమైక్య తీర్మానం చేశాకే విభజన బిల్లుపై చర్చ చేపట్టాలని పట్టుబట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను శాసనసభ నుంచి సస్పెండ్ చేశాక తమ నాటకాన్ని రక్తి కట్టించాయి. విభజన అంశాన్ని పక్కనబెట్టి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి టార్గెట్‌గా పనిచేశాయి. బిల్లుపై టీడీపీ సభ్యుడు పల్లె రఘునాథరెడ్డి చర్చను కొనసాగిస్తూ... విభజనకు సోనియాగాంధీయే కారణమని ఆరోపించినప్పుడు కాంగ్రెస్ సీమాంధ్ర నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ అడ్డుపడ్డారు. ఏఐసీసీ నేతల పేర్లు చెప్పినప్పుడు కూడా కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో స్పందించారు. సభలో లేని వారి పేర్లను ప్రస్తావించడమే కాకుండా వారిపై విమర్శలు ఎలా చేస్తారని అభ్యంతరం వ్యక్తంచేశారు. దీంతో సభలో లేనివారిపై విమర్శలు చేయడం సభా సంప్రదాయం కాదని వాటిని రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు డిప్యూటీ స్పీకర్ ఒకటికి రెండుసార్లు ప్రకటించారు. ఆ తర్వాత రఘునాథరెడ్డి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు ప్రస్తావిస్తూ పదేపదే విమర్శలు చేసినప్పటికీ అధికారపక్షం నోరు విప్పలేదు. సభలో లేనివారిపై విమర్శలు చేయడం సరికాదన్న సభాసంప్రదాయాలేవీ ఆ సమయంలో వారికి గుర్తురాలేదు. వైఎస్‌పై విమర్శలే లక్ష్యంగా... తెలంగాణ కాంగ్రెస్ నేతలు 2000లో రూపొందించిన ఒక లేఖపై వైఎస్ సంతకం చేశారని, ఆ కారణంగానే తెలంగాణ ఏర్పడిందంటూ రఘునాథరెడ్డి ఆరోపణలు గుప్పించారు. కానీ పార్టీ అధినేత్రి సోనియావద్దకు వెళుతున్నామంటే తామిచ్చిన కాగితంపై ఆరోజుల్లో సీఎల్పీ నాయకుడిగా ఉన్న రాజశేఖరరెడ్డి సంతకం చేశారే తప్ప దానిలో ఉన్న అంశమేంటో ఆయనకు తెలియదని అప్పట్లో ఆ లేఖపై సంతకాలు చేయించిన చిన్నారెడ్డి, జీవన్‌రెడ్డి పలుసార్లు నిర్ద్వంద్వంగా ఖండించిన విషయాన్ని టీడీపీ, కాంగ్రెస్ నేతలెవరూ గుర్తుచేయలేదు. 2000 సంవత్సరంలో తెలంగాణ నేతల లేఖపై వైఎస్ సంతకం చేశారని ఇప్పుడు ఆరోపిస్తున్న నేతలు 2009లోఆయన హఠాన్మరణం వరకు ఈ ప్రస్తావన తీసుకురాకపోవడం, ఆయన చనిపోయాక మూడేళ్లవరకు కూడా ఎవరూ ప్రస్తావించకపోవడం గమనార్హం. తెలంగాణ ఏర్పాటులో ముడిపడి ఉన్న ఇతర ప్రాంతాల వారి సమస్యలను అధ్యయనం చేసి నివేదిక సమర్పించడానికి ఉభయ సభల సభ్యులతో ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి 2009 మార్చి నెలలో మంత్రి కె.రోశయ్య నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసిన సంగతీ వారికి గుర్తురాలేదు. ఈ కమిటీని ఏర్పాటు చేసినప్పుడు శాసనసభలో వైఎస్ మాట్లాడుతూ... ‘‘తెలంగాణ అంశంపై ఒక నిర్ణయం తీసుకునే ముందు దానితో సంబంధం ఉన్న వారు లేవనెత్తిన అభ్యంతరాలు, వారి ఆందోళనలకు పరిష్కారం కావాల్సి ఉంది. అందుకోసమే వాటన్నింటినీ చర్చించడానికి ఉభయ సభల సభ్యుల సంయుక్త కమిటీ ఏర్పాటు చేస్తున్నాం. ఆ కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన తర్వాత దాని ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటాం’’ అని స్పష్టంగా చెప్పినట్లు ఎవ్వరూ ప్రస్తావించలేదు. ఈ సంయుక్త కమిటీ కోసం టీడీపీ తరఫున పేర్లను సూచించాలని కోరితే దాటవేసిన చంద్రబాబు తీరును ఎవరూ తప్పుపట్టలేదు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 2008 లో తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో తెలంగాణకు అనుకూలంగా తీర్మానం ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి లేఖ పంపించింది. దానిపై పార్టీ మహానాడు కూడా ఏకగ్రీవంగా ఆమోదించింది. 2008 నుంచి గడిచిన ఐదేళ్లుగా అనేక సందర్భాల్లో చంద్రబాబు తెలంగాణకు కట్టుబడి ఉన్నామని చెబుతూ వచ్చారు. అయితే టీడీపీ సభ్యుడు పల్లె రఘునాధరెడ్డి ఆ విషయాన్ని తన ప్రసంగంలో ఎక్కడా ప్రస్తావించకుండా దాటవేశారు. తెలంగాణపై తొందరగా తేల్చాలని కోరుతూ చంద్రబాబు 2011లో ప్రధానమంత్రికి ప్రత్యేకంగా ఒక లేఖ రాసి విభజన అంశాన్ని ఆయనే గుర్తుచేసిన విషయాన్ని కూడా టీడీపీ, కాంగ్రెస్ సభ్యులు విస్మరించారు. ఇవన్నీ చూస్తుంటే సభలో చర్చ కాంగ్రెస్, టీడీపీ మ్యాచ్‌ఫిక్సింగ్‌లో భాగంగానే ఓ పథకం ప్రకారమే సాగుతోందని స్పష్టంగా తెలుస్తోంది. సోనియూకు ఇచ్చిన లేఖ గురించి వైఎస్‌కు తెలీదు: చిన్నారెడ్డి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతూ 2000లో తావుు సోనియూగాంధీనికి రాసిన లేఖ గురించి, అందులోని అంశాల గురించి ఆనాటి సీఎల్పీ నాయుకుడు వైఎస్ రాజశేఖరరెడ్డికి తెలియుదని ఏఐసీసీ కార్యద ర్శి జి.చిన్నారెడ్డి స్పష్టంచేశారు. ఆ లేఖను రాజశేఖరరెడ్డే తవుతో ఇప్పించినట్లు, దానిపై సంతకం కూడా చేసినట్లుగా తెలుగుదేశం నాయుకులు గురువారం శాసనసభలో పేర్కొనడం విచిత్రంగా ఉందన్నారు. ఆయన గురువారం ‘సాక్షి’తో వూట్లాడుతూ... తెలుగుదేశం ప్రభుత్వ హయూంలో తెలంగాణ ప్రాంతం తీవ్ర నిర్లక్ష్యానికి గురవ్వడంతో ప్రత్యేక రాష్ట్రాన్ని కాంక్షిస్తూ తెలంగాణకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరం సోనియూగాంధీకి లేఖ రాశావుని చెప్పారు. తవు ప్రాంత సవుస్యలపై వైఎస్‌తో చర్చించడమే తప్ప తెలంగాణ రాష్ట్రం కోరుతూ లేఖ రాస్తున్న విషయూన్ని ఆయనకు చెప్పలేదని స్పష్టంచేశారు. అసెంబ్లీలో టీడీపీ చెప్పిన అంశాలన్నీ అబద్ధమేనని ఆయన విమర్శించారు.